Saamana
-
వరుణ్ గాంధీపై శివసేన ప్రశంసలు.. మీరూ మెచ్చుకోండి!
ముంబై: అన్నదాతలకు అండగా నిలిచి సొంత పార్టీ ఆగ్రహానికి గురైన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై శివసేన పార్టీ ప్రశంసలు కురిపించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో రైతులకు దన్నుగా నిలిచిన ఆయనను అభినందించాలని ఉత్తరప్రదేశ్ రైతు సంఘాల నేతలకు సూచించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులతో పాటు 8 మంది ప్రాణాలు కోల్పోయినా బీజేపీ ఎంపీలు స్పందించకపోవడాన్ని శివసేన తప్పుబట్టింది. ‘శత్రుత్వాన్ని వ్యాప్తి చేయడానికి చేసే ప్రయత్నాలను మన దేశం ఎప్పటికీ సహించదు. వరుణ్ గాంధీ (మాజీ ప్రధాని) ఇందిరా గాంధీ మనవడు, సంజయ్ గాంధీ కుమారుడు. లఖీమ్‌పూర్ ఖేరిలో కిరాతక ఘటన చూసిన తర్వాత ఆయన రక్తం మరిగింది. ఈ దారుణోదంతంపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తపరిచారు’ అని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. రాజకీయంగా తనకు ఎదురయ్యే ఆటుపోట్ల గురించి పట్టించుకోకుండా రైతుల హత్యలను ఖండించి ధైర్యంగా నిలబడ్డారని ప్రశంసించింది. ‘వరుణ్ గాంధీని ప్రశంసిస్తూ రైతు నాయకులు తీర్మానం చేయాల’ని శివసేన సలహాయిచ్చింది. లఖీమ్‌పూర్ ఖేరిలో అన్నదాతలను అత్యంత కిరాతకంగా కారుతో గుద్ది చంపడాన్ని వరుణ్ గాంధీ అంతకుముందు తీవ్రంగా ఖండించారు. అధికార మదంతో పేద రైతులను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ‘హిందూ వర్సెస్ సిక్కు యుద్ధం’గా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయని, ఇది చాలా ప్రమాదకర పరిణామమని హెచ్చరించారు. (చదవండి: వరుణ్ గాంధీకి బీజేపీ ఝలక్.. ఎందుకంటే..?) కాగా, అక్టోబర్ 3న చోటుచేసుకున్న లఖీమ్‌పూర్ ఖేరి దారుణోదంతం కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా శనివారం పోలీసులు ఎదుట లొంగిపోగా.. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు అజయ్ మిశ్రా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చదవండి: ఆ సమయంలో ఆశిష్ ఎక్కడ ఉన్నారు? -
పీఓకే వ్యాఖ్యలు : త్వరలో ఫలితం చూస్తావు
ముంబై : ఇటీవల ముంబైపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహరాష్ట్ర అధికార పార్టీ శివసేన మరోసారి ఘాటుగా స్పందించింది. పార్టీ అధికార పత్రిక సామ్నా ద్వారా పరోక్షంగా శనివారం కంగనాపై మాటల యుద్దానికి దిగింది. ‘ముంబై పాకిస్తాన్ అక్రమిత కశ్మీర్(పీఓకే)’ కాదని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు త్వరలోనే దాని ఫలితాన్ని ఆనందిస్తారని వ్యంగ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా కంగనాకు శుభాకాంక్షలు(ముబారక్ హో) అంటూ వ్యాఖ్యానించింది. అదే విధంగా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై ఈ మధ్య వివాదాలకు అలవాటు పడిందని శివసేన పేర్కొంది. ఏ విధంగా అంటే.. మహాభారతంలో కౌరవులు ద్రౌపతి వస్ర్తాభరణ చేస్తుండగా పాండవులంతా తలవంచుకుంటారు... ప్రస్తుతం శివసేన కూడా అదే చేస్తుంది అని తెలిపింది. (చదవండి: విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన డీజీసీఏ) అయితే ముంబై జాతీయ సమగ్రతకు ప్రతీక అని అందరికి తెలిసినప్పటికీ వివాద మాఫీయా ఎప్పుడూ ముంబైని మాత్రమే విమర్శిస్తుంది తప్పా ఇతర రాష్ట్రాల రాజధానులను కాదంటూ సామ్నాలో శివసేన పేర్కొంది. ఛత్రపతి షాహు మహారాజ్, మహాత్మా జ్యోతిరావ్ పులే, భీమరావు అంబేద్కర్ జన్మించిన మహరాష్ట్ర ఒక దేశమని; మహారాష్ట్ర మరణిస్తే, దేశం నశించిపోతుందని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి పాండురంగ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శివసేన గుర్తు చేసింది. దురదృష్టవశాత్తు, సంయుక్త మహారాష్ట్ర ఉద్యమ నాయకుడు దివంగత ప్రబోధంకర్ ఠాక్రే ఇచ్చిన జ్ఞానోదయంతో కానీ భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అంబేద్కర్ ఆలోచనలతో సంబంధం లేని వారికి స్వాగతమివ్వడం బాధాకరమని.. విమనాశ్రయం నుంచి కంగనాకు వై కాటగిరి సెక్యూరిటితో స్వాగతం పలకడంపై అధికార పార్టీ ఆసహనం వ్యక్తం చేసింది. (చదవండి: కంగనా వివాదం : పవార్ కీలక వ్యాఖ్యలు) -
‘ప్రధాని వీడియోకాన్ఫరెన్స్ టైం వేస్ట్ వ్యవహారం’
ముంబై: కరోనా వైరస్‌కు మహారాష్ట్ర హట్‌స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో శివసేన ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ బీజేపీ ఆరోపిస్తుంది. ప్రతిపక్షం కావాలనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తుందని శివసేన మండిపడుతుంది. ఈ క్రమంలో పార్టీ అధకార పత్రిక సామ్నాలో బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌పై విమర్శల వర్షం కురిపించింది. రెండు రోజుల క్రితం పాటల్ కరోనా మహమ్మారి కట్టడి కోసం శివసేన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శించారు. కేరళ మోడల్‌ను అనుసరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాటిల్ వ్యాఖ్యలపై సామ్నా మండిపడింది.(పాపం పసివాళ్లు!) ‘పాటిల్ కేరళ మోడల్‌ను సరిగా అర్థం చేసుకోలేదనుకుంటాను. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా కట్టడి కోసం కేంద్రం సూచించే విధానాలను అమలు చేయరు. అంతేకాక ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం వల్ల కాలం వృధా తప్ప పెద్దగా ఫలితం ఉండదని ఆయన భావిస్తారు’ అని తెలిపింది. కరోనా కట్టడి కోసం కేరళ సొంత మార్గదర్శకాలను రూపొందించుకుందని.. అందువల్లే అక్కడ కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కరోనా కట్టడి కోసం ప్రతిపక్షాలు ఏవైనా సూచనలు చేయాలనుకుంటే.. ముఖ్యమంత్రితో చర్చిస్తే బాగుంటుందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించింది.(చిన్ని తండ్రీ నిన్ను చూడక...) -
రశ్మికి కీలక బాధ్యతలు..
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి రశ్మి ఠాక్రే కీలక బాధ్యతలు చేపట్టారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం. కాగా, ఉద్ధవ్ రాజకీయాల్లో రాణించడానికి రశ్మి పాత్ర కూడా ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. మహా అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు ఆదిత్య ఠాక్రేని గెలిపించుకోవడంలో ఉద్ధవ్ కంటే కూడా రశ్మినే కీలక పాత్రను పోషించారు. 1989 డిసెంబర్ 13న రశ్మి, ఉద్ధవ్‌ల పెళ్లి జరిగింది. బాల్ ఠాక్రే ఉన్నంతకాలం ఆయనకు, పార్టీకీ అండగా ఉన్నారు రశ్మి. బాల్ ఠాక్రే జబ్బన పడినప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చే శివసైనికులకు భోజనం పెట్టకుండా పంపించలేదు రశ్మి! ఠాక్రే వార్థక్యంలో శివసేనకు వారసుడెవరన్న ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్న అప్పటికి ఆరేళ్ల ముందరే తలెత్తింది. ఉద్ధవ్‌కి రాజకీయాలంటే ఆసక్తి లేదు. రాజ్‌కి రాజకీయాలు తప్ప వేరే ఆసక్తి లేదు. పెద్దయాన తల కూడా రాజ్ వైపే తిరిగింది. సరిగ్గా ఆ సమయంలో రశ్మి రంగంలోకి దిగారు. మామగారిని, భర్తను ఒప్పించి పార్టీ ఇల్లుదాటిపోకుండా చేయగలిగారు. మరోవైపు శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు. మహారాష్ట్రలో శివసేన వాయిస్ వినిపించాలనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఈ పత్రికను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. (పులి వెనుక పవర్) -
బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి
ముంబై: ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి (ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా షోలేలో ఫేమస్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను ఉటంకిస్తూ దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యంపై విమర్శలు గుప్పిస్తూ సోమవారం పార్టీ పత్రిక సామ్నాలో శివసేన సంపాదకీయం రాసింది. మాంద్యం మూలంగా దీపావళి రోజు కళకళలాడాల్సిన మార్కెట్లలో నెలకొన్న స్తబ్దతను మిత్రపక్షం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి చూపుతూ ఆ డైలాగ్‌ను శివసేన వాడుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాజకీయంగానూ మహారాష్ట్రలో ఒక రకమైన నిశ్శబ్దమే నెలకొని ఉండటమే ఇక్కడ విశేషం. రాష్ట్రంలో అధికారాన్ని సమంగా పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌కు బీజేపీ అంగీకరిస్తుందా?, బీజేపీ ఒత్తిడి తెస్తే ఆ డిమాండ్‌ను శివసేన వదిలేస్తుందా?’ తదితర ప్రశ్నలకు ప్రస్తుతం నిశ్శబ్దమే సమాధానంగా వస్తోంది. హరియాణాలో స్మూత్.. ‘మహా’ ఉత్కంఠ ఒకేసారి ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హరియాణాల్లో నిజానికి హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులో కొంత అస్థిరత, ఉత్కంఠ నెలకొనాల్సి ఉండగా.. అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సజావుగా సాగింది. ప్రాంతీయ పార్టీ జననాయక జనతా పార్టీ(జేజేపీ) మద్దతుతో బీజేపీ సీఎం ఖట్టర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తు షరతుల్లో భాగంగా జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు, ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీజేపీ– శివసేన కూటమికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత, ఉత్కంఠ కొనసాగుతున్నాయి. శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశించింది. అలా జరిగితే బీజేపీకి సమస్య ఉండకపోయేది. కానీ, అలా జరగలేదు. 288 స్థానాల అసెంబ్లీలో 2014లో కన్నా 17 స్థానాలు తక్కువగా 105 సీట్లకే బీజేపీ పరిమితమైంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం అనివార్యమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకున్న శివసేన పొత్తుకు ముందు అంగీకరించిన షరతులను తెరపైకి తీసుకువచ్చింది. 50 : 50 ఫార్ములాను అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడ్తున్న ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రేకు ప్రభుత్వంలో ‘సముచిత’ గౌరవం లభించాలన్నది సేన ఆలోచన. ముఖ్యమంత్రిత్వం తప్పితే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి కూడా శివసేన సుముఖంగా లేదని తెలుస్తోంది. సంకీర్ణ ధర్మం పాటించాలి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులు తమ డిమాండ్లు చెప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల ముందే.. పొత్తు చర్చల సమయంలోనే ఈ విషయమై ఒక అంగీకారానికి వచ్చాం’ అని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేస్తున్నారు. అధికార పంపిణీకి సంబంధించిన ఫార్మూలాను అమలు చేస్తామని ప్రభుత్వ ఏర్పాటుపై జరిపే చర్చలకు ముందే తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని సేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై బీజేపీ నుంచి స్పందన లేదు. కానీ, ముఖ్యమంత్రిగా బీజేపీ వ్యక్తే ఉంటారనే విషయంలో ఎలాంటి రాజీ లేదనే సంకేతాలు మాత్రం ఇస్తోంది. జూనియర్ పార్ట్నర్గా శివసేన సంకీర్ణ ధర్మం పాటించాలని, ప్రభుత్వంలో చేరి ఆదిత్య ఠాక్రే సీనియర్ అయిన సీఎం ఫడ్నవిస్ వద్ద పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. 1989లో శివసేన బీజేపీల తరఫున బాల్ ఠాక్రే, ఎల్కే అద్వానీల మధ్య పొత్తు కుదిరినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చారు. అయితే, 2009 నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తూ వస్తోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన బీజేపీ, శివసేనలు వరుసగా 122, 63 సీట్లు గెల్చాయి. త్వరలో∙బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు సోమవారం స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని, విపక్ష కూటమి అయిన కాంగ్రెస్(44), ఎన్సీపీ(54)లు కలిసి సాధించిన సీట్ల కన్నా తాము ఎక్కువ సీట్లలోనే గెలిచామని ఆయన వివరించారు. బుధవారం బీజేపీ చీఫ్ అమిత్ ముంబై రానుండటంతో అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. రాముడు సత్యమే మాట్లాడేవాడు.. అధికారాన్ని సమంగా పంచుకోవాలనే విషయంలో అమిత్– ఉద్ధవ్‌ల మధ్య గతంలోనే ఒక అంగీకారానికి వచ్చిన విషయంపై నిజాలు మాట్లాడాలని సంజయ్‌రౌత్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ ఉంటుంది. రాముడు సత్యవాక్పరిపాలకుడు. ఇప్పుడు బీజేపీ కూడా 50:50 ఫార్ములాపై నిజాలు మాట్లాడాలి’ అని రౌత్ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను కలిసిన ఇరు పార్టీల నేతలు బీజేపీ నేత, సీఎం ఫడ్నవిస్, శివసేన నాయకుడు దివాకర్ రౌతె సోమవారం రాష్ట్ర గవర్నర్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. చర్చల వివరాలు వెల్లడి కాలేదు కానీ.. అవి మర్యాదపూర్వకమైనవేనని రాజ్‌భవన్ అధికారులు చెప్పారు. అక్టోబర్ 21న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు! ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలు మద్దతివ్వనున్నాయని ముంబై వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సమీకరణాలు నిజమైతే.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు.. మొత్తం 154 సీట్లతో 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ సులభంగానే లభిస్తుంది. శివసేన నుంచి ప్రతిపాదన వస్తే దానిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాసాహెబ్ వ్యాఖ్యానించారు. సామ్నాలో బీజేపీపై విమర్శలు సోమవారం శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం కూడా బీజేపీపై నిప్పులు చెరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే ఆర్థికమాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించింది. దీపావళి సమయంలో మార్కెట్లలో స్తబ్దత నెలకొనడంపై స్పందిస్తూ.. ‘ఇత్నా సన్నాటా క్యోం హై భాయి(ఇంత నిశ్శబ్దం ఎందుకు సోదరా?)’ అనే షోలే సినిమా డైలాగ్‌ను ఉటంకించింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందనే కథనాలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘అమ్మకాలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమలు మూత పడ్డాయి. ఉద్యోగాలు పోతున్నాయి. దీపావళి సమయంలోనే మార్కెట్లలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు, పలు విదేశీ కంపెనీలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై విపరీతంగా అమ్మకాలు జరిపి మన డబ్బుల్తో తమ ఖజానాలను నింపుకుంటున్నాయి’ అని పేర్కొంది. -
అక్కడ కూడా బీజేపీనే గెలుస్తుంది : శివసేన
ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమవేనని, శివసేన కూడా తమతోనే నడుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోన్న బీజేపీ ఆశలపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన నీళ్లు కుమ్మరించింది. రైతు సమస్యలు, రాఫెల్ వివాదం, ఈవీఎం లోపాలు సహా ఇటీవల బీజేపీ నేతలు చేస్తున్న ‘ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రకటన’లతో పాటు.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా విరుచుకుపడింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం దేశంలో వాడుతున్న ఈవీఎంలు, బీజేపీ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే లండన్, అమెరికాలో కూడా కమలం వికసించడం ఖాయమని శివసేన ఎద్దేవా చేసింది. గెలుపు పట్ల బీజేపీ నేతలకు అంత విశ్వాసం ఉంటే అయోధ్యలో రామమందిరం ఎందుకు నిర్మించలేకపోయారని అధికార పార్టీని నిలదీసింది. అంతేకాక ‘అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేద’ని ప్రశ్నించింది. అంతేకాక ‘ఇటీవల నిర్వహించిన ఓ ర్యాలీలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడు గెలిచిన 42 స్థానాలకంటే మరో సీటు ఎక్కువగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అది కూడా ఎన్సీపీ నేత శరద్ పవార్ కంచుకోట బారామతిలో గెలుస్తామని ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ముందు ఇలా ఆత్మ విశ్వాసం వ్యక్తం చేసినందుకు ఫడ్నవీస్‌ను మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి విశ్వాసం ఉంటే రానున్న ఎన్నికల్లో 548 లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలవొచ్చు’ అంటూ శివసేన వ్యంగ్యంగా రాసుకొచ్చింది. -
‘చరిత్ర గురించి అడిగితే భూగోళ శాస్త్రం గురించి చెప్తున్నారు’
ముంబై : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నగరాల పేర్లు మారుస్తూ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగే సంఘటనల గురించి ఆయనకు పెద్దగా పట్టదంటూ శివసేన పార్టీ విమర్శలు చేసింది. రాష్ట్రంలోని బులందషహర్ పట్టణంలో జరిగిన దాడులను ఉద్దేశిస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో.. ‘జవాన్లు, పోలీసులకు మతం ఉండదు. అలాగే, అధికారంలో ఉన్నవారు మతాలకతీతంగా తమ బాధ్యతలను నిర్వర్తించడంపై దృష్టి పెట్టాలి. యోగి పాలనలో అల్లర్లు చెలరేగుతున్నాయి. బులందషహర్ ఘటనలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకూ ఆ కుటుంబాన్ని పరామర్శించేంత తీరిక యోగికి చిక్కలేదు. ఎందుకంటే ఆయన నగరాల పేర్లు మార్చడంలోనే తీరిక లేకుండా ఉన్నారంటూ’ శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యోగి తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన మండిపడింది. ‘యోగి హైదరాబాద్ పేరు మారుస్తానని చెప్పుకొంటున్నారు.. కానీ, తన సొంత రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాత్రం ఆయన నోరువిప్పడం లేదు. యోగి ముందు చరిత్రకు సంబంధించిన ఓ ప్రశ్న ఉంది. కానీ, ఆయన భౌగోళిక అంశాలకు సమాధానాలు ఇస్తున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా ఎప్పుడు మారుస్తారు? అన్నది ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్న కాదు. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారన్నదే ప్రశ్న. ఇది చరిత్రకు సంబంధించిన ప్రశ్న’ అని శివసేన విమర్శించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ దుకాణం మూసేసిందని ఆ పార్టీ విమర్శించింది. ‘కేంద్ర మంత్రులందరూ తమ దుకాణాన్ని మూసేసి, ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ హామీలు ఇవ్వడంలో బిజీ అయిపోయారు’ అని ఎద్దేవా చేసింది. -
గోమాతకేనా రక్షణ.. మాతృమూర్తికి లేదా?
ముంబై : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై శివసేన మరోసారి నిప్పులు చెరిగింది. గోవుల సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న గుంపు దాడులు, మూక హత్యలు, మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే మహిళలకు ఏమాత్రం భద్రత లేని దేశంగా ఇండియా మారుతోందని, ఇది సిగ్గు చేటని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘గోమాతలను(ఆవులను) రక్షించుకోవడం మంచిదే కానీ మాత(మహిళ) సంగతేమిటి? ఇదేనా హిందుత్వం? ఇలాంటి వారు హిందువులే కాదు’ అని పార్టీ పత్రిక ‘సామ్నా’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మేము ప్రభుత్వంలో భాగస్వామ్యులమే. కానీ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. మేము భారతీయ జనతా(భారత ప్రజల)కు స్నేహితులం. అంతే కానీ ఏ పార్టీకి స్నేహితులం కాదు’ అని బీజేపీని ఉద్దేశించి అన్నారు. దేశంలో మహిళల కంటే ఆవులకే భద్రత ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. గో రక్షణ పేరిట గోవులను కాపాడేదానికంటే బీఫ్ ఎవరు తింటున్నారు, ఎవరు తినడం లేదు అనే దానిపైనే కొంత మంది దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఇదే హిందుత్వం అంటే నేను అంగీకరించను’ అని ఠాక్రే అన్నారు. దేశంలో మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు జాతీయ వాదులు,ఎవరు కాదో నిర్ణయించే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే జాతీయవాదులు కాదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం(యూపీఏ) చేసిన తప్పిదాలనే ఎన్డీయే ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. -
ఇకపై రాహుల్ ‘పప్పూ’ కాదు!
సాక్షి, ముంబై : కాంగ్రెస్ పార్టీకి కాబోయో అధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన మరోసారి ప్రశంసలు కురిపించింది. గుజరాత్ ఎన్నికలు తరువాత దేశమంతా రాహుల్ గాంధీని నాయకుడిగా గుర్తిస్తుందని శివసేన స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ గుజరాత్లో ఆలయాను దర్శించడం అనేది హిందుత్వ విజయంగా శివసేన పేర్కింది. రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించడాన్ని భారతీయ జనతాపార్టీ కూడా స్వాగతించాలని శివసేన తెలిపింది. నాలుగేళ్లుగా రాహుల్ గాంధీని పప్పూగా సంభోధిస్తూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు నేతగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో స్పష్టం చేసింది. గుజరాత్లో ఫలితం ఎలా వచ్చినా.. రాహుల్ గాంధీ మాత్రం నాయకుడిగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారని శివసేన స్పష్టం చేసింది. నాయకుడిగా తనను తాను నిరూపించుకున్న రాహుల్ గాంధీ ఇంకెంత మాత్రం పప్పూ కాదని సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన స్పష్టం చేసింది. -
21 వేల కోట్లు వృథా చేశారు: శివసేన
సాక్షి, ముంబై: నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక వెలువరించింది. మొత్తం పాత నోట్లలో 99 శాతం తిరిగి వచ్చేశాయని ఘనంగా చెప్పుకుంటుండగా, విపక్షాలు మాత్రం ఘోర వైఫల్యంగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం శివసేన వంతు రానే వచ్చింది. శివసేన అధికార పత్రిక సామ్న సంపాదకీయంలో డీమానిటైజేషన్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కథనం ప్రచురించింది. డిపాజిట్ కానీ 1 శాతం నల్లధనం కాదని, బహుశా బ్యాంకు క్యూలో నిలుచునే ఓపిక లేకనే సామాన్యులు ఆ డబ్బును వదిలేసి ఉంటారని తెలిపింది. నిజంగా నల్లధనం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ల మీద నోట్ బందీ(నోట్ల రద్దు) ఎలాంటి ప్రభావం చూపలేకపోయిందని పేర్కొంది. సుమారు 26,000 కోట్ల ధనం బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని, పైగా కొత్త నోట్ల ముద్రణ పేరిట మరో 21,000 కోట్లను అదనంగా వృథా చేశారని కేంద్రంపై విమర్శలు గుప్పించింది. కేవలం పేరు ప్రచారం కోసమే ఆ సొమ్మంతా పారబోసిందంటూ ఎద్దేవా చేసింది. సున్నితంగా పయనిస్తున్న భారత ఆర్థిక పురోగతిని నోట్ల రద్దు నిర్ణయం కుదేలు చేసిందని, ధరలు విపరీతంగా పెరిగాయని, వ్యాపారాలు దెబ్బతిన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త నోట్ల ద్వారా ఫేక్ కరెన్సీని అడ్డుకోవచ్చని మోదీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆ సంగతి ఏమోగానీ, సైనికుల మరణాలు మాత్రం పెరిగిపోయానని తెలిపింది. కొత్త నోటు విడుదలయిన నెలరోజులకే నకిలీ నోట్లు మార్కెట్ లోకి చెలామణి వచ్చాయని, తద్వారా మోదీ ప్రయత్నం విఫలమైందని వివరించింది. మధ్యతరగతి ప్రజలను మోదీ తీవ్రంగా కష్టపెట్టారని, బీజేపీ కూడా కొత్త నోట్ల ద్వారానే(ఓటర్లను ప్రలోభపెట్టి) వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోందంటూ పరోక్ష కామెంట్లతో కథనం ప్రచురించింది. -
సీఎం యోగిని చూసి నేర్చుకోండి!
ముంబై: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలని మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ కు శివసేన సూచించింది. ప్రజా సంక్షేమం కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడింది. తన పనితీరుతో విమర్శకుల నోటికి తాళం వేశారని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ప్రశంసించింది. రైతుల పంట రుణాల మాఫీలో మహారాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించింది. ‘రైతుల పంటరుణాలు మాఫీ చేస్తూ సీఎం యోగి తన మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పంట రుణాలు మాఫీ చేసేందుకు ఇక్కడి ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తోంది. యోగి మోడల్ అధ్యయనం తర్వాత మాఫీ చేస్తామని చెబుతోంది. మహారాష్ట్ర సర్కారుకు సీరియస్ నెస్ లేదు. సీఎం యోగిని చూసి ఇక్కడి పాలకులు నేర్చుకోవాల’ని ఫడ్నవీస్ కు శివసేన చురకలు అంటించింది. -
బాల్‌ఠాక్రే ఎప్పుడూ తన ఛాతిని చూపలేదు
ప్రధాని మోదీపై శివసేన వ్యంగ్యాస్త్రాలు ముంబై: దివంగత బాల్‌ఠాక్రే ఎన్నడూ తన ఛాతి కొలత గురించి ప్రస్తావించలేదని ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ మిత్రపక్షం శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఠాక్రే 91వ జయంతి సందర్భంగా శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో ప్రధానిపై విమర్శలు సంధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తన ‘56 అంగుళాల ఛాతి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బాల్‌ఠాక్రే ఈ విధంగా ఎన్నడూ వ్యాఖ్యానించకపోయినా పాకిస్తాన్ సహా ఇతర శత్రువులు ఆయన పేరు వింటే భయపడేవని పేర్కొంది. 2002లో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు అప్పటి బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని తొలగించాలని ప్రయత్నించినప్పుడు ఠాక్రే అడ్డుపడ్డారని గుర్తు చేసింది. ఆ సమయంలో మోదీకి బాలాసాహెబ్ మద్దతుగా నిలవడం చాలా ధైర్యమైన విషయమని పేర్కొంది. ఠాక్రేకు మోదీ నివాళి అర్పించినా శివసేన ఆయనపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. దీంతో రానున్న ముంబై నగర పాలక ఎన్నికల్లో బీజేపీతో శివసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
పెద్దనోట్ల రద్దుతో కేంద్రానికి అదొక్కటే లాభం
ముంబై: ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రయోగం నిజమైన నల్లధనాన్ని వెలికితీయడంలో విఫలమైందని విమర్శించింది. ఆకలి, నిరుద్యోగం, ఉగ్రవాదం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ప్రభుత్వానికి ఉపయోగపడిందని పేర్కొంది. పార్టీ పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీరును శివసేన తప్పుపట్టింది. పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా ప్రజలు ముఖ్యమైన జాతీయ సమస్యలను మరిచిపోయేలా చేయడంలో కేంద్రం విజయవంతమైందని ఆరోపించింది. పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు క్యూలలో ఒక్క కుబేరుడు కూడా నిలబడలేదని, దీన్నిబట్టి నిజమైన నల్లధనం బయటకు రాలేదని తెలుస్తోందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మద్దతుదారులు ఈ విషయాన్ని అంగీకరించాలని సూచించింది. ప్రధాని మోదీ సమక్షంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించడాన్ని సామ్నా పత్రికలో శివసేన తప్పుపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని శివసేన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతేగాక విపక్షాలతో కలసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసింది. -
మోదీపై శివసేన ఫైర్
ముంబై: శివసేన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. మోదీ పనితీరు గత కాంగ్రెస్ పాలన కంటే దారుణంగా ఉందని అందుకే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. మోదీ అంతర్జాతీయంగా పాకిస్థాన్ చర్యలను ఎండగట్టడంలో విఫలమయ్యారని ఆరోపించింది. కశ్మీర్ లో నిరంతరం పాకిస్థాన్ జెండా ఎగరడం, అనుకూల నినాదాలు వినిపిస్తుండటం పరిపాటిగా మారిందని పేర్కొంది. పఠాన్ కోట్ దాడి అనంతరం సరైన చర్యలు తీసుకోకపోవడమే యురీ ఘటనకు కారణమని స్పష్టం చేసింది. ఉగ్రదాడికి సాక్షాలను అంతర్జాతీయంగా చూపినా లాభం ఉండదని ఒసామా బిన్ లాడెన్ ను ఏరివేసేందుకు అమెరికా పాక్ లో చేసిన దాడిని గుర్తు చేసింది. భారత్ తన సైన్యాలను పాక్ పై ప్రయోగించాలని డిమాండ్ చేసింది. -
'అమెరికాను చెంపదెబ్బ కొట్టి రావాల్సింది'
ముంబై: అమెరికాలో చేదు అనుభవం ఎదుర్కొన్న బాలీవుడు అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సిందని శివసేన పేర్కొంది. దేశభక్తిని చూపించి స్వదేశానికి తిరిగి వచ్చుంటే అమెరికాను చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన అభిప్రాయపడింది. ఏడేళ్లలో షారూఖ్ ఖాన్ ను అమెరికా విమానాశ్రయాల్లో మూడుసార్లు నిర్బంధించారని తెలిపింది. లాస్ ఏంజెలెజ్ ఎయిర్ పోర్టులో షారూఖ్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శివసేన స్పందిస్తూ... అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో షారూఖ్ ను నిర్బంధించడం సాధారణ విషయంగా మారిందని, అవమానాలు ఎదురవుతున్నా అగ్రదేశానికి వెళ్లడం ఆయన మానలేదని ఆక్షేపించింది. 'ఈవిధంగా నన్ను అవమానిస్తే ఇక మీ దేశంలో అడుగు పెట్టను' అని షారూఖ్ స్వదేశానికి తిరిగి వచ్చేసివుంటే అమెరికా ముఖంపై చెంపదెబ్బ కొట్టినట్టుగా ఉండేదని శివసేన పేర్కొంది. ప్రతి ముస్లింను తీవ్రవాదిగా అమెరికా భావిస్తోందని విమర్శించింది. కశ్మీర్ యువత పెడదోవ పట్టకుండా దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని షారూఖ్ ఖాన్ కు శివసేన సూచించింది. -
‘దావూద్ కాదు, నాయక్ ను పట్టుకోండి’
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ వెంట పడడం మానేసి వివాదస్పద ఇస్లామిక్ స్కాలర్, టెలీ మత బోధకుడు జకీర్ నాయక్ ను అరెస్ట్ చేయాలని శివసేన డిమాండ్ చేసింది. ‘పాకిస్థాన్ నుంచి దావూద్ లేదా మెమన్ రప్పిస్తాం లాంటి ప్రకటనలు మానేయండి. జకీర్ నాయక్‌పై దృష్టి పెట్టండి. స్వదేశంలోనే నక్కిన శత్రువును అరెస్ట్ చేయండి. 26/11 దాడి కేసులో సజీవంగా పట్టుబడిన అజ్మల్ కసబ్ ను ఉంచిన జైలు గదిలో జకీర్ ను పడేయండ’ని కేంద్ర ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో వేర్పాటువాదులను రెచ్చగొట్టేలా జకీర్ నాయక్ ప్రసంగాలు, ప్రచారం ఉందని ‘సామ్నా’లో శివసేన పేర్కొంది. ముస్లిం యువతను హింసవైపు ప్రేరేపిస్తూ దేశంలో కొత్త తరహా అశాంతికి కారణమవుతున్నారని ఆరోపించింది. విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికితీసే చర్యలను వాయిదా వేసి, జకీర్ నాయక్ కు నిధులు సమకూరుస్తున్న వారిని పట్టుకోవాలని కేంద్రానికి శివసేన సూచింది. విదేశీ పర్యటన నుంచి తిరిగిరాగానే జకీర్ నాయక్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. -
యోగాతో ద్రవ్యోల్భణం,అవినీతి తగ్గుతుందా?
ముంబై: బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రధాన మంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. యోగా చేయడం వలన ద్రవ్యోల్భణం, అవినీతి తగ్గుతుందా అని మోదీని అధికారిక పత్రిక సామ్నాలో ప్రశ్నించింది. యోగా ద్వారా వ్యక్తిగత జీవితంలోని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునని దేశ సమస్యలు పరిష్కరించలేమని ప్రధానికి సూచించింది. ఈ విషయంలో స్పష్టత ఉంటే బాగుంటుందని తెలిపింది. ప్రపంచ దేశాలతో మోదీ యోగా చేయించారని ఇది అభినందించదగిన విషయమేనని, కానీ పాకిస్థాన్ కు శాశ్వత శవాసనం( యోగాలో విశ్రాంతి స్థితి) వేయించాలని అది ఆయుధాలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. నల్లధనం వెనక్కి తీసుకువచ్చే విషయంలో మోదీ తీరును శివసేన విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సేన,బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. -
ప్రధాని మోదీకి శివసేన చురక
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీపై మిత్రపక్షం శివసేన మరోసారి విరుచుకుపడింది. విదేశాల్లో దేశం పరువు తీయొద్దని ఆయనకు హితవు పలికింది. దేశంలోని అవినీతి గురించి అదేపనిగా ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ అవినీతి దేశమని పదేపదే ప్రస్తావించొద్దని, ఇలాంటి ప్రకటనలతో మున్ముందు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. 'భారత్ లో అవినీతి ఎలా పెరిగిపోయింది, అవినీతిని రూపుమాపేందుకు తాము చేపడుతున్న చర్యలు గురించి దోహలో బహిరంగంగా ప్రధాని మోదీ వివరించారు. ఆయన మాటలకు సభికులు హర్షధ్వానాలు చేశారు. విదేశీ గడ్డపై భారత్ ప్రటిష్ఠను మంటగలిపార'ని పార్టీ పత్రిక 'సామ్నా'లో శివసేన విమర్శించింది. అవినీతి పెరిగిపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించింది. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా అవినీతి ఎందుకు తగ్గలేదని శివసేన ప్రశ్నించింది. అవినీతి గురించి గొంతు చించుకోవడానికి యూరప్, అమెరికా వెళ్లాల్సిన పని లేదని చురక అంటించింది. మాటలు కట్టిపెట్టి అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. -
అలాంటి వారికి పౌరసత్వం రద్దు చేయాలి
ముంబై: 'భారత్ మాతాకి జై' అనను అని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. చట్టపరంగా ఆయనను తలదించుకునేలా చేయాలని శివసేన 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో పేర్కొంది. 'భారతమాతను ఒవైసీ అవమానించారు. ఆయనకు వ్యతిరేకంగా దేశంలోని ముస్లింలందరూ భారత్ మాతాకి జై అంటూ నినదించాలి. ఈ నినాదం చేయడానికి నిరాకరించేవారి పౌరసత్వం, ఓటు హక్కు రద్దు చేయాలి' అని శివసేన పేర్కొంది. వివాదాలకు కారణమైన ఒవైసీ స్వేచ్ఛగా మహారాష్ట్రలో తిరుగుతున్నా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. 'సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యేలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఇదే సమయంలో రాజద్రోహం వ్యాఖ్యలు చేసిన వారు(ఒవైసీ) స్వేచ్ఛగా తిరుగుతున్నార'ని శివసేన ధ్వజమెత్తింది. -
మీ కప్పు టీ వల్ల.. ఏడుగురు అమరులయ్యారు!
ముంబై: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్‌ను నమ్మవద్దని తాము గతంలోనే ప్రధాని మోదీని హెచ్చరించామని గుర్తుచేసింది. ఇప్పటికైనా మోదీ ప్రపంచాన్ని ఏకం చేసే పనిని మాని.. భారత్‌పై దృష్టి పెట్టాలని ఘాటుగా సూచించింది. మన సరిహద్దులు సురక్షితంగా లేవని తాజా ఉగ్రవాద దాడి స్పష్టం చేస్తున్నదని, దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో ఉన్నా సోషల్ మీడియాలో అమరులకు నివాళులర్పించడం మినహా జాతీయ స్థాయిలో ఎలాంటి పని జరుగడం లేదంటూ శివసేన తన అధికార పత్రిక 'సామ్నా'లో తీవ్రపదజాలంతో ధ్వజమెత్తింది. ' నవాజ్ షరీఫ్‌తో కప్పు చాయ్ పంచుకున్నందుకు ప్రతిఫలంగా ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. మన సరిహద్దులు సురక్షితంగా లేవని, మన అంతర్గత భద్రత విధ్వంసపూరితంగా ఉందని తాజా ఘటన రుజువు చేస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులతో భారత ఆత్మగౌరవాన్ని పాకిస్థాన్ తుత్తునియలు చేసింది' అని శివసేన మండిపడింది. గతవారం లాహోర్‌లో నవాజ్ షరీఫ్ ఇంటికి ప్రధాని మోదీ అతిథిగా వెళ్లినా.. పాకిస్థాన్ మరోసారి మనల్ని మోసం చేసిందని, పాకిస్థాన్ నిజంగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్‌ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేసింది. -
'జరిగిందేదో జరిగిపోయింది'
ముంబై: మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా జరిగిందేదో జరిగిపోయింది మళ్లీ చేతులు కలుపుదాం అంటూ బీజేపీకి శివసేన సంకేతాలు ఇచ్చింది. ముంబైకి సమీపంలోని కల్యాన్-దొంబివాలి (కేడీఎంసీ) మున్సిపాలిటీ ఎన్నికల్లో శివసేన అత్యధిక సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ మెజారిటీ మార్క్ కు ఆ పార్టీ దూరంగా ఉండిపోయింది. మరోవైపు బీజేపీ కూడా గణనీయంగా తన సీట్లను పెంచుకొని రెండోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా పరస్పరం చేసుకున్న ఆరోపణలను పక్కనబెట్టి.. మున్సిపాలిటీ చైర్ పర్సన్ పీఠం కోసం చేతులు కలుపాల్సిన అవసరముందని బీజేపీకి శివసేన సూచించింది. ' కేడీఎంసీ ఎన్నికల ప్రచారంలో (బీజేపీ-శివసేన) పరస్పరం ఎంతో బురద జల్లుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి అంగీకరించాల్సిన అవసరముంది. ఎన్నికల సమయంలో జరిగిందేదో జరిగిపోయింది. దానిని పక్కనబెట్టి ఇప్పుడు ముందుకెళ్లాల్సిన అవసరముంది' అని శివసేన పార్టీ అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో సూచించింది. 'కల్యాణ్, దొంబివాలి మున్సిపాలిటీ అభివృద్ధికి మేం కట్టుబడ్డాం. అయినా మాకు స్వల్పంగా మెజారిటీ తగ్గింది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా సాగాలని మేం భావిస్తున్నాం' అని 'సామ్నా' పేర్కొంది. -
ఇంద్రాణి తప్ప కీలక సమస్యలు పట్టవా?
ముంబై: షీనా బోరా హత్య కేసుకు మీడియా అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని శివసేన తప్పుబట్టింది. ముఖ్యఘట్టాలను విస్మరించి ఇటువంటి వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా భావించే మీడియా ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమని విమర్శించింది. 1965 యుద్ధం 50వ వార్షికోత్సవం, విదర్భ, మరాత్ వాడ ప్రాంత ప్రజల సమస్యలను విస్మరించి ఇంద్రాణి ముఖర్జియాకు సంబంధించిన వార్తలను కవర్ చేయడాన్ని దుయ్యబట్టింది. సైనికుల త్యాగాలను పట్టించుకోకుండా ఇంద్రాణికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియా వార్తలుగా మలుస్తోందని 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో చురకలు పెట్టింది. జైలులో ఇంద్రాణి ఏం తింటుంది, ఏం తాగుతుంది, ఆమె నిద్రపోతుందా, లేదా విషయాలు రిపోర్ట్ చేస్తోందని విమర్శించింది. కరువు పరిస్థితులు, సరిహద్దు వంటి కీలక సమస్యలను మీడియా పట్టించుకోవడం లేదని శివసేన ధ్వజమెత్తింది. -
కశ్మీర్ లో అమలు చేసే దమ్ముందా?
ముంబై: భూసేకరణ బిల్లుపై మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై శివసేన పార్టీ విరుచుకు పడింది. భూసేకరణ బిల్లును అమలు చేయడం జమ్మూకశ్మీర్ నుంచి ప్రారంభించాలని ఎన్డీఏ సర్కారుకు సవాల్ విసిరింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లును కశ్మీర్ లో అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించింది. అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోకుండా వారి భూములు లాక్కుకోవడానికి సిద్ధమవుతున్న ఎన్డీఏ సర్కారు... ఆర్టికల్ 370 కారణంగా కశ్మీర్ లో మాత్రం తోక ముడిచిందని శివసేన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. జైతాపూర్ న్యూక్లియర్ విద్యుత్ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న కేంద్ర ప్రభుత్వం ఈ సాహసాన్ని కశ్మీర్ లో చేయగలదా అని నిలదీసింది. జమ్మూకశ్మీర్ దేశంలో అంతర్భాగమైనప్పటికీ మనదేశ చట్టాలు అక్కడ అమలు కావడం లేదని శివసేన వాపోయింది. -
చాయ్ వాలా ప్రధాని అయ్యారు.. నేను సీఎం అవుతా!
ముంబై: ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని అయినపుడు.. మహారాష్ట్రకు నేను ముఖ్యమంత్రిని అవుతానని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో థాక్రేలు ఎన్నడూ ఎన్నికల్లో పాల్గోన్న దాఖలాలు లేవని, అయితే బాధ్యతలను నిర్వర్తించడంలో తాము ఎప్పుడు వెనుకంజ వేయలేదని ఉద్దవ్ అన్నారు. చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన ఓ కామన్ మ్యాన్ నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అయ్యారని, నేను కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అధికార పత్రిక సామ్నా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఓట్ల కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్న కేంద్రమంత్రులు.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రను మరిచిపోతారని ఉద్దవ్ విమర్శించారు. అధికార దాహాంతోనే శివసేనతో పొత్తును విచ్చిన్నం చేశారని ఉద్దవ్ థాక్రే ఆరోపించారు. -
'లవ్ జిహాద్' పేరిట అంతర్జాతీయ కుట్ర: శివసేన
ముంబై: హిందువుల సంస్కృతి దెబ్బతీసేందుకు 'లవ్ జిహాద్' పేరిట అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని శివసేన ఆరోపించింది. 'లవ్ జిహాద్' అడ్డుకోవడానికి పోరాటం సాగించాలని పిలుపునిచ్చిన బీజేపీ నేత స్వామి ఆదిత్యనాథ్ కు శివసేన మద్దతు తెలిపింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. హిందూ యువతులు అప్రమత్తంగా ఉండాలని తమ అధికార పత్రిక 'సామ్నా' ఎడిటోరియల్ లో శివసేన పేర్కొంది. 'లవ్ జిహాద్' పిలుపునిచ్చిన వారికి తగిన గుణపాఠం నేర్పాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జిహాద్ (పవిత్రయుద్ధం) పేరిట ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారని ఎడిటోరియల్ తెలిపారు. దేశ సమైక్యత దెబ్బతీసేందుకు లష్కరే ఏ తోయిబా, సిమీ, అల్ ఖైదా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సామ్నా హెచ్చరించింది. ప్రేమ పేరుతో హిందూ యువతను ముఖ్యంగా అమ్మాయిలనూ టార్గెట్ చేసుకుని మత మార్పిడి చేయాలనే లక్ష్యంతో 'లవ్ జిహాద్' పేరుతో ఓ పథకాన్ని ఉగ్రవాదసంస్థలు రచిస్తున్నాయి.