చాయ్ వాలా ప్రధాని అయ్యారు.. నేను సీఎం అవుతా! | If a tea-seller can head a country,I too can become CM: Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

చాయ్ వాలా ప్రధాని అయ్యారు.. నేను సీఎం అవుతా!

Published Wed, Oct 15 2014 2:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

చాయ్ వాలా ప్రధాని అయ్యారు.. నేను సీఎం అవుతా! - Sakshi

చాయ్ వాలా ప్రధాని అయ్యారు.. నేను సీఎం అవుతా!

ముంబై: ఓ చాయ్ వాలా దేశానికి ప్రధాని అయినపుడు.. మహారాష్ట్రకు నేను ముఖ్యమంత్రిని అవుతానని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో థాక్రేలు ఎన్నడూ ఎన్నికల్లో పాల్గోన్న దాఖలాలు లేవని, అయితే బాధ్యతలను నిర్వర్తించడంలో తాము ఎప్పుడు వెనుకంజ వేయలేదని ఉద్దవ్ అన్నారు. 
 
చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన ఓ కామన్ మ్యాన్ నరేంద్రమోడీ దేశానికి ప్రధాని అయ్యారని, నేను కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అధికార పత్రిక సామ్నా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. 
 
ఓట్ల కోసం ప్రచారాన్ని నిర్వహిస్తున్న కేంద్రమంత్రులు.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రను మరిచిపోతారని ఉద్దవ్ విమర్శించారు. అధికార దాహాంతోనే శివసేనతో పొత్తును విచ్చిన్నం చేశారని ఉద్దవ్ థాక్రే ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement