Uddhav Thackeray
-
నాడు శివసేన-బీజేపీకి అందుకే చెడింది: ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో థాక్రే కుటుంబానికి, బీజేపీకి మధ్య గల సంబంధంపై తరచూ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి. ఈ రెండు పార్టీల మధ్య బాల్ థాక్రే కాలంలో మొదలైన స్నేహం ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) రాకతో ముగిసింది. బీజేపీ తమను పట్టించుకోవడంలేదని ఉద్ధవ్ థాక్రే ఆరోపిస్తుండగా, దీనిపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా మహారాష్ట్ర బీజేపీ రథసారథి దేవేంద్ర ఫడ్నవీస్.. 2014లో శివసేన- బీజేపీల మధ్య ఏం జరిగిందో, ఆ రెండు పార్టీలకు ఎందుకు చెడిందో వెల్లడించారు.ముంబైలో జరిగిన సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రహస్యాన్ని వెల్లడించారు. ఎన్డీటీవీ తన కథనంలో తెలిపిన వివరాల ప్రకారం.. 2014 నాడు జరిగిన ఉదంతాన్ని వివరిస్తూ ఫడ్నవీస్ ఇలా అన్నారు ‘ఆ సమయంలో తాము శివసేనకు 147 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ముఖ్యమంత్రి, మాకు ఉప ముఖ్యమంత్రి ఉంటారని కూడా నిర్ణయించాం. అయితే ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు ఇవ్వాలని మొండికేయడంతో శివసేన, బీజేపీ మధ్య పొత్తు తెగిపోయింది’ అని అన్నారు.దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపిన వివరాల ప్రకారం ఉద్ధవ్ థాక్రే 151 సీట్లు కోరిన నేపధ్యంలో బీజేపీ నేతలు ఓం ప్రకాష్ మాథుర్, అమిత్ షా తదితరులు ప్రధాని మోదీ(Prime Minister Modi) నాయకత్వంలో ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఆ తరువాత 2014 నుండి 2024 వరకు మహారాష్ట్రలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వందకుపైగా సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలిచింది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానంపై ఉద్ధవ్ థాక్రే పార్టీ నుండి ఇంకా ఎటువంటి స్పందన వెలువడలేదు. ఒకప్పుడు ముంబైని ఏలిన థాక్రే కుటుంబం ప్రస్తుతం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనే మాట వినిపిస్తోంది. పార్టీ కార్యకర్తలలో కూడా పార్టీ భావజాలం విషయంలో గందరగోళం నెలకొందని అంటున్నారు.ఇది కూడా చదవండి: హెచ్-1బీ, ఎఫ్-1, గ్రీన్‌కార్డు వీసాదారులపై నిరంతర నిఘా -
నేనేమీ ఆ మాజీ సీఎం మాదిరి కాను: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేల మధ్య ‘వర్గపోరు’కు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇటీవల ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తనను తేలిగ్గా తీసుకోవద్దని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చిన విషయాన్ని మర్చిపోవద్దనే విషయాన్ని మరిచిపోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం ఎవరికి అర్థం కావాలో వారికి అర్ధమైతే బాగుంటుందనే కూడా ఏక్ నాథ్ షిండ్ చెప్పుకొచ్చారు. తాను సీఎం ఉండగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఫడ్నవీస్ ఆపేసారనే ఆరోపణల నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే కాస్త ఘాటుగా స్పందించారు.అయితే దీనికి ఫడ్నవీస్ ఇంచుమించు తెరదించినట్లే కనబుడుతున్నారు. తనకెందుకు వచ్చిన గొడవో ఏమిటో అనుకున్నారో కానీ శంకుస్థాపనుల, ఆరంభించిన ఏ ప్రాజెక్టును ఆపడం లేదన్నారు ఫడ్నవీస్. గవర్నర్ కు ధన్యవాదాలు తీర్మానంలో భాగంగా మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘ నేనేమీ మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కాను. తలపెట్టిన ప్రాజెక్టులను ఆపిన ఘనత ఉద్ధవ్ ది. నేను అటువంటి సీఎం ను కాను అన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. షిండే హయాంలో ఉండగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. అది మేమంతా(షిండే, అజిత్ పవార్) కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిపైనా ఉంది’ అంటూ పేర్కొన్నారు.మాపై ప్రజలు పెద్ద బాధ్యత ఉంచారుగతేడాది మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహాయుతి కూటమికి భారీ సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇచ్చారన్నారు. అందుచేతు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళతామని, భవిష్యత్ తరాలకు మంచి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు ఫడ్నవీస్. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు.. ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్ -
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యు.బి.టి.) రాయని డైరీ
శరద్ పవార్, నేను, నానా పటోలే ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా! 83 ఏళ్ల వయసులో కూడా ఆయన, మెలకువలోంచి కళ్లు తెరిచినట్లుగా... హఠాత్తుగా, ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం’’ అనే ప్రశ్న వేయగలిగారంటే అది ఆయనలోని తరగని రాజకీయ చైతన్యానికి ఒక స్పష్టమైన సంకేతమనే అనుకోవాలి. ఎక్కడ కూర్చొని ఉన్నామో చెప్పబోయాన్నేను. ‘‘ఉద్ధవ్జీ! మీరాగండి నేను చెబుతాను’’ అన్నారు నానా పటోలే!! విస్మయంగా ఆయన వైపు చూశాను. ‘‘సరే, మీరే చెప్పండి నానాజీ’’ అన్నాను. నానాజీ ఏం చెప్పినా – మేము కూర్చొని ఉన్నది ముంబై హెర్డియా మార్గ్‌లోని ఎన్సీపీ పార్టీ ఆఫీసు తప్ప మరొకటి అవటానికి లేదు. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నామంటే శరద్‌జీ... సరిగ్గా ఒక పరాజయ పీఠం మీద! అది కూడా ముగ్గురం సర్దుకుని కూర్చున్నాం...’’ అన్నారు నానాజీ!అంటే... ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్. ‘‘మీరేమంటున్నారు నానాజీ, కలిసి పోటీ చేయటం వల్ల మన మూడు పార్టీలు ఓడిపోయాయనేనా?’’ అన్నాను. ‘‘ఉద్ధవ్జీ... అక్కడ బీజేపీ కూటమిలో శివసేన ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ శివసేన ఉంది. అక్కడ బీజేపీ కూటమిలో ఎన్సీపీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ ఎన్సీపీ ఉంది. అయినప్పటికీ వాళ్లే ఎందుకు గెలిచారో తెలుసా?’’ అన్నారు నానాజీ. ‘‘కానీ నానాజీ, మనమిక్కడ కూర్చున్నది వాళ్లెందుకు గెలిచారు అని కాక, మనం ఎందుకు ఓడిపోయామో ఒకర్నుంచి ఒకరం తెలుసుకోటానికి కదా...’’ అన్నాను. ‘‘అదే అంటున్నాను ఉద్ధవ్జీ... వాళ్లెందుకు గెలిచారో తెలిస్తే, మనమెందుకు ఓడిపోయామో తెలుస్తుంది. పోనీ, మీరన్నట్లు మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకుంటే వాళ్లెందుకు గెలిచారో తెలుస్తుంది కానీ, వాళ్ల గెలుపుతో మనకు పనేమిటి? మన ఓటమి గురించి మనం ఆలోచించాలి కానీ...’’ అన్నారు నానాజీ!ఆలోచనలో పడ్డాన్నేను. గెలుపోటములు అన్నవి రెండు భిన్నమైన స్థితులా లేక, పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరిస్థితులా?‘‘సరే చెప్పండి నానాజీ! వాళ్లెందుకు గెలిచారని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాను. ‘‘గెలవకుండా ఎలా ఉంటారు ఉద్ధవ్జీ! ‘విడిపోతే దెబ్బతింటాం. కలిసుంటే భద్రంగా ఉంటాం’ అని కదా వాళ్ల నినాదం. అది పట్టేసింది మహారాష్ట్రా వాళ్లకు, మహారాష్ట్రలో ఉండే గుజరాతీలకు; ఇంకా... హిందువులకు, ముస్లిములకు! పైకే నినాదం. లోపల అది బెదిరింపు. ఓట్లు విడిపోతే పాట్లు తప్పవని...’’ అన్నారు నానాజీ. ‘‘అందుకే ఓడామా మనం?’’ అన్నాను. ‘‘కాదు’’ అన్నారు. ‘‘మరి?’’ అన్నాను. ‘‘శివసేన నుంచి శివసేన, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయి, ఒకదాన్ని ఒకటి ఓడించాయి. రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయి’’ అన్నారు నానాజీ... ‘మీతో కలిసి మేం దెబ్బతిన్నాం’ అనే అర్థంలో!!నేను మౌనంగా ఉండిపోయాను. నానాజీ కూడా కాసేపు మౌనం పాటించారు. ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా!అప్పుడు గానీ... ఆయన్ని పట్టించు కోకుండా మేమిద్దరమే చాలాసేపటిగా మాట్లాడుకుంటూ ఉన్నామన్న సంగతి మాకు స్పృహలోకి రాలేదు!‘ఎక్కడ కూర్చొని ఉన్నాం’ అనే తన ప్రశ్నకు, ‘‘పరాజయ పీఠం’’ మీద అన్న నానాజీ జవాబు ఆయన్ని సంతృప్తి పరిచే ఉండాలి. లేకుంటే – ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అనే కొనసాగింపు ప్రశ్న వేసి ఉండేవారు కాదు శరద్‌జీ. -
మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారట! కాకుంటే మళ్లీ ఈమీఎంతోనేనట!!
-
ఉద్ధవ్ రాక్షసుడు.. మహిళలను అవమానించారు: కంగన
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పలు విమర్శలు గుప్పించారు. మహిళలను అవమానించిన కారణంగానే ‘రాక్షసుడు’ ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే ఓటమిని తాను ముందే ఊహించినట్లు ఆమె తెలిపారు. స్త్రీలను గౌరవిస్తున్నారా? వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా? అనే దానిని అనుసరించే ఎవరు రాక్షసుడో.. ఎవరు మంచివారో గుర్తించగలమన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించిన దరిమిలా కంగనా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు.వారు తన ఇంటిని పడగొట్టారని, నానా దుర్భాషలాడారని అటువంటి చర్యలకు పరిణామాలు ఉంటాయని నమ్మానని కంగనా పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శిక్షకు అర్హుడని, ఈ ఓటమిని తాను ముందే ఊహించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన కంగనా ఆయనను అజేయునిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశ రక్షణకు నియమితుడైన నేత అని పేర్కొన్నారు.దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠమని కంగనా పేర్కొన్నారు. అభివృద్ధి, సుస్థిరత కోసం మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా ఆరోపిస్తూ, 2020, సెప్టెంబర్‌లో బీఎంసీ ఆమె ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసింది. తరువాత బాంబే హైకోర్టు బీఎంసీ ఆదేశాలను రద్దు చేసింది. కంగనా నష్టపరిహారానికి అర్హురాలిగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! -
‘సేనా’ధిపతి షిండే!
సాక్షి, నేషనల్ డెస్క్: అసలైన శివసేన ఎవరిదో తేలిపోయింది. మరాఠా పులి బాల్‌ఠాక్రే రాజకీయ వారసుడు ఎవరన్నదానిపై మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేశారు. శివ సైనికులు ఏక్నాథ్ శంభాజీ షిండేను తమ నాయకుడిగా గుర్తించారు. కుట్రదారుడిగా ప్రత్యర్థుల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న షిండే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తుఫాను సృష్టించారు. గర్జించిన బెబ్బులిలా అత్యంత బలమైన మరాఠా నాయకుడిగా అవతరించారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతిలో భాగమైన శివసేన(షిండే) 81 స్థానాల్లో పోటీ చేసింది. 57 సీట్లు సాధించింది. మహా వికాస్ అఘాడీలో భాగస్వామి అయిన శివసేన మరో చీలిక వర్గం శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 95 సీట్లలో పోటీ చేసి కేవలం 20 సీట్లలో గెలిచింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 15 సీట్లలో పోటీ చేసిన శివసేన(షిండే) 7 సీట్లు గెలుచుకుంది. 21 సీట్లలో పోటీ చేసిన శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 9 సీట్లు సొంతం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చక్కటి ఫలితాలు సాధించిన షిండే అసలైన శివసేన అధినేతగా తన స్థానం పదిలపర్చుకున్నారు. ఉపకరించిన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రిగా షిండే అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మహా యుతి విజయానికి దోహదపడ్డాయి. ప్రధానంగా లాడ్లీ బెహన్ యోజన విశేషమైన ప్రభావం చూపింది. ఈ పథకం కింద 2.5 కోట్ల మంది పేద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందజేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతిఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధులకు ఉచితంగా యాత్రలు, పేద విద్యారి్థనులకు ఉచితంగా వృత్తి విద్య వంటి హామీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. శివసేన వాస్తవానికి హిందుత్వ పారీ్టగా పుట్టుకొచి్చంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఆ పార్టీ అభిమానులకు నచ్చలేదు. షిండే వర్గం బీజేపీతో జట్టుకట్టడం హిందుత్వవాదులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కార్మిక ఉద్యమాలతో రాజకీయ ప్రస్థానం ఏక్నాథ్ షిండే 1964 ఫిబ్రవరి 9న సతారా జిల్లాలో జన్మించారు. మరాఠా సామాజికవర్గానికి చెందిన షిండే శివసేన వైపు ఆకర్షితులయ్యారు. తొలుత కారి్మక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బలమైన కారి్మక నాయకుడిగా గుర్తింపు పొందారు. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా మంత్రిగా సేవలందించారు. పలు కీలక శాఖలను నిర్వర్తించారు. 2022లో ఏక్నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి శివసేన నుంచి బయటకు వచ్చారు. శివసేన(షిండే) పారీ్టగా గుర్తింపు పొందారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 జూన్ 30న ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు షిండే రాజకీయ జీవితం అంతమవుతుందని అప్పట్లో విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, తాను ఎంచుకున్న దారే సరైనదేనని షిండే నిరూపించారు. -
ఉద్ధవ్‌కు ఎదురుదెబ్బ
ముంబై: హిందుత్వ ఫైర్‌బ్రాండ్ బాల్ ఠాక్రే కుమారుడైన ఉద్ధవ్ ఠాక్రే అదే హిందుత్వకు దూరమై, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మహారాష్ట్రలో సరిగ్గా ఐదేళ్ల క్రితం బీజేపీతో జట్టుకట్టి, ముఖ్యమంత్రి కూడా అయిన ఉద్ధవ్ ఇప్పుడు మళ్లీ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. మహా వికాసఅఘాడీ పేరిట చేసిన సెక్యులర్ ప్రయోగం ప్రయోజనం చేకూర్చలేదు. శివసేన సిద్ధాంతానికి సరిపడని కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)తో కలిసి కూటమి కట్టడం ఉద్ధవ్‌కు నష్టం చేకూర్చింది. కూటమి పొత్తులో భాగంగా 95 సీట్లలో పోటీకి దిగిన శివసేన(ఉద్ధవ్) 20 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఉద్ధవ్ రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సమాధానం చెప్పాల్సిందే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ బాల్ ఠాక్రే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ తొలుత సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నారు. సీనియర్ నేత నారాయణ రాణేతోపాటు వరుసకు సోదరుడయ్యే రాజ్ ఠాక్రే నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ తండ్రి అండతో నిలదొక్కుకున్నారు. బీజేపీతో దశబ్దాలుగా కొనసాగుతున్న పొత్తు శివసేనకు లాభించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి నెగ్గింది. ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రి పదవి వరించింది. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో ఉద్ధవ్ అందించిన సేవలు ప్రశంసలందుకున్నాయి. సీఎం అయిన కొన్నాళ్లకే ఉద్ధవ్‌పై సొంత పారీ్టలో అసంతృప్తి బయలుదేరింది. శివసేనలో ఒక వర్గం నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 2022 జూన్‌లో శివసేనను ఏక్నాథ్ షిండే చీల్చేశారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోయింది. మరోదారి లేక ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్)తో పొత్తు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు పనిచేయలేదు. అసలైన శివసేన తమదేనని ఏక్నాథ్ షిండే శనివారం ఫలితాల తర్వాత ప్రకటించారు. ఉద్ధవ్‌ఠాక్రే వయసు64 ఏళ్లు. పారీ్టలో అరకొరగా మిగిలిన నేతలను, కార్యకర్తలను ఆయన ముందుకు నడిపించగలరా? పార్టీని సజీవంగా ఉంచగలరా? అనేదానిపై చర్చ మొదలైంది. శివసేన పార్టీ, ఆ పార్టీ గుర్తు ఇప్పటికే ఏక్నాథ్ షిండే వర్గానికి దక్కాయి. వాటిని తిరిగి సాధించుకోవడం అనుకున్నంత సులభం కాదు. -
ఏదో మోసం జరిగింది: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో మోసం కచ్చితంగా జరిగిందని, ఇలాంటి ఫలితాలను తాము ఎంతమాత్రం ఊహించలేదని శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించానని, మహారాష్ట్ర ప్రజలు తనను కుటుంబ పెద్దగా భావించారని తెలిపారు. వారు తనకు ఇలాంటి ప్రతికూల తీర్పు ఇస్తారంటే నమ్మలేకుండా ఉన్నానని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినా మహాయుతి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని, దీని వెనుక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను మహా వికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఇంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు. -
ఉదయాన్నే బూత్‌లకు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ చిత్రాలు ఇవిగో
-
మహారాష్ట్ర ఎన్నికలు.. సీఎం షిండే బ్యాగ్ తనిఖీ చేసిన అధికారులు
ముంబై: మహరాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రతిపక్షాలకు చెందిన నేతల బ్యాగుల్ని మాత్రమే తనిఖీ చేస్తారని, అధికార పార్టీ నేతల బ్యాగులను పరిశీలించరంటూ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. అందుకు కౌంటర్‌గా బుధవారం ఎన్నికల అధికారులు మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బ్యాగులను చెక్ చేశారు.నవంబర్ 20న మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సీఏం ఏక్నాథ్ షిండే బుధవారం పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్‌కు తన హెలికాప్టర్‌తో వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు హెలికాప్టర్లో ఉన్న ఏక్నాథ్ షిండే వ్యక్తిగత స్కూట్కేసును పరిశీలించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న షిండే వ్యక్తి గత సిబ్బంది సూట్‌కేసులో దుస్తులు తప్ప ఏమిలేవని చెబుతుండగా.. మధ్యలో షిండే జోక్యం చేసుకుని వారి డ్యూటిని వారిని చేయనివ్వండి అంటూ ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చారు. దీంతో షిండే సూట్‌కేసును పరిశీలించగా అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్యాగును ఎన్నికల అధికారులు చెక్ చేశారు. హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.#WATCH | Maharashtra: CM Eknath Shinde’s bags were checked at Palghar Police ground helipad where he reached for the election campaign.(Source: Shiv Sena) pic.twitter.com/44CnWiTYzG— ANI (@ANI) November 13, 2024 ప్రతిపక్షాల నేతలకేనా ఈ నిబంధనలుకాగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం యవత్మాల్కు వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగ్‌ని తనిఖీ చేశారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు,బ్యాగులు మాత్రమే పరిశీలిస్తున్నారని, అధికార కూటమి నేతల విషయంలో నిబంధనలు అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతేకాదు, యావత్మాల్లో తన బ్యాగులను తనిఖీ చేసిన తర్వాత ఠాక్రే ఎన్నికల అధికారులను వారి పేరు, వారి పోస్టింగ్ గురించి అడిగారు. సదరు అధికారులు సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, హోం మంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీల బ్యాగ్‌లను తనిఖీ చేశారా అని ప్రశ్నించారు.అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నికల నిబంధనల మేరకు దేశంలోని అగ్ర రాజకీయ నేతలకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేరకే ఠాక్రే బ్యాగును పరిశీలించామన్నారు. #WATCH | #MaharashtraElections2024: Uddhav Thackeray’s Bags Checked By EC Officials Again; Video Surfaces#ShivSenaUBT #UddhavThackeray #Latur #Maharashtra pic.twitter.com/FxMVWufcxY— Free Press Journal (@fpjindia) November 12, 2024 -
టికెట్ నిరాకరణ.. సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం
మహారాష్ట్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఓవైపు నామినేషన్ వేసిన వారు ప్రచారాలతో విజయం కోసం హోరెత్తిస్తుండటంతో.. మరోవైపు టికెట్ దక్కని వారు నిరశలో కూరుకుపోయారు.ఈ క్రమంలో ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై కనిపించకుండాపోయారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. పాల్ఘర్ స్థానం నుంచి ఆయనకు బదులు మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.కాగా 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి చీలికవర్గమైన షిండేతో వెళ్లిన నేతల్లో శ్రీనివాస్ వంగా ఒకరు. ఎమ్మెల్యే అదృశ్యంతో సీఎం షిండే వంగా భార్యతో ఫోన్ మాట్లాడారు. అతను కనిపించకుండా పోయే ముందు.. వంగా మీడియాతో మాట్లాడుతూ.. షిండే కోసం దేవుడిలాంటి వ్యక్తిని (ఉద్ధవ్ ఠాక్రే) విడిచిపెట్టానని, ప్రస్తుతం తనకు తగిన శాస్తి జరిగిందని చెప్పారు.షిండేకు విధేయుడిగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ జాడ తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తనకు సీటు ప్రకటించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురైనట్లు శ్రీనివాస్ భార్య తెలిపారు. సోమవారం బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే.. మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే అదృశ్యమయ్యే ముందు తాను షిండే వర్గంలో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నానని, ఉద్దవ్ ఠాక్రేను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పోలీసులు ఆయనకోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
మన రెండు పార్టీలు ఏకం కావడం సంతోషం!
-
విదర్భ సీట్ల విషయంలో కుదరని సయోధ్య ..
-
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. గతంలో ఉద్ధవ్ ఠాక్రే యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాల్లో బ్లాకుల్ని తొలగించుకున్నారు. తాజాగా, మరోసారి సమస్య ఉత్పన్నం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారని , డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే మే 2016లో లీలావతి హాస్పిటల్లో యాంజియోగ్రఫీ ప్రక్రియ చేయించుకున్నారు. అంతకుముందు జూలై 20, 2012న గుండె ఎనిమిది స్టెంట్లను అమర్చారు. కాగా, శనివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీలో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై నిప్పులు చెరిగారు. నేటి ‘హైబ్రిడ్ బీజేపీ’ అంశంపై ఆర్ఎస్ఎస్ ఆలోచించాలని అన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2019లో బీజేపీ హిందుత్వ సంస్కరణపై నమ్మకం లేనందునే ఆ పార్టీతో విడిపోయానని, అయితే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాన్ని తాను ఎప్పటికీ వదులుకోలేదని థాకరే చెప్పారు. -
సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడెందుకు? ముందు ఎన్నికల్లో గెలుద్దాం
మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని, కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యుబిటి)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరు? అనేది సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించాలి. ఎన్నికల ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని శరద్ పవార్ తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అని తేల్చకుండా ఎన్నికల ప్రచారం, గెలుపుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదంటూ నాటి ఎమర్జెన్సీ (1977) సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాతనే ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రచారంలో పీఎం అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు కూడా అంతే.. సీఎం ఎవరు? అనేది ఆలోచించాల్సిన సందర్భం కాదు. కలిసి ఎన్నికల బరిలోకి దిగుదాం. ప్రజల మద్దతు లభించిన తర్వాత.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిందాం’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. డైలమాలో కాంగ్రెస్రానున్న ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి చేస్తుండగా..అదే సమయంలో, ఉద్ధవ్‌ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్ అఘాడీలోని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్‌పవార్, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది. ఆగస్ట్ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్ చేశారు. సింధుదుర్గ్‌లో శివాజీ మహారాజ్ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్ పవార్ పేర్కొన్నారు. -
ప్రధాని మోదీలో అహంకారాన్ని చూశారా? : ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహరాష్ట్రలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు విపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అయితే మోదీ క్షమాపణలపై మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.మోదీ క్షమాపణల్లో మీరు అహంకారాన్ని చూశారా? ప్రధాని ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుకా? లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నందుకా? అని ప్రశ్నలు కురిపించారు. శివాజీ మహారాజ్‌ను అవమానించిన శక్తులను ఓడించడానికి ఎంవీఏ క్యాడర్ కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఇక శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించిన సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మేం రాజకీయాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తుంది. మేం రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర కీర్తి కోసం పోరాడుతున్నాం. మహాయుతి ప్రభుత్వానికి గెట్ అవుట్ చెప్పడానికి మేము గేట్‌వే ఆఫ్ ఇండియాకు వచ్చాము’అని హెచ్చరించారు. -
మహా అసెంబ్లీ ఎన్నికలు.. సీఎం అభ్యర్థిపై ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరైనా సరే శివసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంవీయే భాగస్వామ్యాలైన కాంగ్రెస్, ఎన్సీపీ శరద్‌పవార్ ప్రకటించిన అభ్యర్ధికి భేషరతుగా మద్దతిస్తామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర అత్మగౌరవాన్ని కాపాడే పోరాటమని పేర్కొన్నారు.‘ఎంవీఏ కూటమిలో సీఎం అభ్యర్థిపై ఊహాగానాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ చవాన్ అయినా, శరద్ పవార్ అయినా సరే, కూటమిలోని నేతలందరూ తాము సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారో వారి పేర్లను ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి నిర్ణయానికి నేను పూర్తి మద్దతు ఇస్తాను’ అని తెలిపారు.అదే విధంగా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ప్రచారం ప్రారంభించాలని ఎంవీఏ భాగస్వాములను ఆయన కోరారు. 'ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే వారికే సీఎం పదవి దక్కుతుందనే నిబంధనను మేం పాటించాం. ఇంతకుముందు పొత్తుల్లో కూడా ఇదే ఫార్ములాను అనుసరించాం. కాబట్టి ముందుగా సీఎం ముఖాన్ని ప్రకటించాలని, ఆ తర్వాతే ప్రచారాన్ని ప్రారంభించగలమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రత్యర్థి శివసేన వర్గానికి పార్టీ గుర్తు వెళ్లిపోవడంపై స్పందిస్తూ.. వాల్లు నా'విల్లు-బాణం' గుర్తును దొంగిలించినప్పటికీ, నేను వారి వెన్నుముకకు నిప్పు పెట్టడానికి 'లైటింగ్ టార్చ్'ని గుర్తుగా ఎంచుకున్నాను’ అని చెప్పారు..కాగా 2022లో శివసేనను చీల్చుతూ ఏక్నాథ్ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే షిండే వర్గానికి అత్యధిక ఎమ్మెల్యేల బలం ఉండటంతో గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం 'శివసేన' పార్టీ పేరును, దాని విల్లు, బాణం గుర్తును కేటాయించింది. -
Maharashtra: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి
మహారాష్ట్రలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. థానేలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి జరిగింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలు విసిరారు. ఈ దాడికి పాల్పడిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం శుక్రవారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో రాజ్ ఠాక్రే ర్యాలీపై శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన వ్యక్తులు కిళ్లీలు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దరిమిలా మర్నాడు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు విసిరారు. దీంతో రాజ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఉద్ధవ్ కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వివరాల్లోకి వెళితే ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం శనివారం ఒక మీటింగ్ నిర్వహించింది. దీనిలో ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఎంఎస్ఎన్ కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై పేడ, టమోటాలు, గాజులు, కొబ్బరికాయలను విసిరారు.పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్సెస్ రాజ్ ఠాక్రే వివాదం మొదలయ్యిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. -
మహా కూటమిలో ‘ముఖ్య’ విభేదాలు
ముఖ్యమంత్రి అభ్యర్థి, సీట్ల పంపకం అంశాల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో విభేదాలు కనిపిస్తున్నాయి. రానున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వీటి మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, మొత్తం 288 స్థానాలకు గానూ తలా 95 స్థానాల్లో పోటీ చేయాలనేది! కానీ ఉద్ధవ్ పార్టీ 150 సీట్లలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఎంవీఏ ముఖ్యమంత్రి ముఖం ఉద్ధవ్ అని ఆయన గ్రూపు ప్రతినిధి వ్యాఖ్యానించడమూ, అలాంటి ముఖం ఏదీ లేదని శరద్ పవార్ అనడమూ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేను ముఖ్యమంత్రి ముఖంగా చెబుతూ పోస్టర్లు వెలియడమూ కూటమి మధ్య జరగనున్న ఘర్షణను సంకేతిస్తున్నాయి.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సభ్యులు సాధించిన అధిక ఓట్ల శాతం, మహారాష్ట్రలో ప్రతిపక్షాల చేతిలో తుపాకి గుండులా పనిచేసింది. అది వారికి ఎంత విశ్వాసాన్ని కలిగించిందంటే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం గురించి, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోటీ గురించి అనేక అంశాలపై పరస్పరం వివాదాలకు దిగుతూ కనిపిస్తున్నారు. ఎంఏవీ భాగస్వాములు ఇటీవల ముంబైలో మీడియా ముందు ఐక్యతా ముఖాన్ని ప్రదర్శించి ఉండవచ్చు; కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు ముంబై వంటి ముఖ్య నగరాల్లోని కీలక నియోజకవర్గాలపై కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు.‘ముఖ్యమంత్రి ముఖం’ ఎవరు?విధాన్ భవన్లో ఈ మంగళవారం కూటమిలో పగుళ్లు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఉద్ధవ్ ఠాకరేకు చెందిన శివసేన పార్టీ, ఆకస్మికంగా పార్టీ కార్యదర్శి మిలింద్ నార్వేకర్‌ను జూలై 12 నాటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయమని కోరింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం చూస్తే మహా వికాస్ అఘాడీకి కేవలం రెండు సీట్ల కోటా మాత్రమే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ కోటాలో ఒక సీటును ‘పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ)కి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, ఉద్ధవ్ 12వ తేదీన పోటీని అనివార్యం చేస్తూ తన సొంత అభ్యర్థి ఎంపికతో ముందుకు సాగారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజక వర్గంలో ఉద్ధవ్ తన పార్టీ పోటీ చేస్తుందని పట్టుబట్టారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మల్లయోధుడు చంద్రహర్ పాటిల్‌కు ఉద్ధవ్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు. కానీ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ మంచి ఆధిక్యతతో గెలుపొందారు.రాష్ట్రంలోని 150కి పైగా నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని ఉద్ధవ్ కోరినట్లు శివసేన–ఉద్ధవ్ గ్రూపు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో జరిగిన కూటమి సమావేశంలో మహావికాస్ అఘాడిలోని ముూడు భాగస్వాములు ఒక్కొక్కటీ 95 స్థానాల్లో పోటీ చేస్తాయని విస్తృత అవగాహన ఉన్నప్పటికీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు 150 నియోజకవర్గాల్లో ఎందుకు సర్వే చేస్తోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గత వారం శివసేన ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి పదవికి కూటమి తరపు అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వెంటనే, తమ కూటమిలో సీఎం అభ్యర్థిని ముందుగానే నిర్ణయించబోమని స్పష్టతనిచ్చారు. ‘‘మేము కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బలంతో ఎన్నికల్లో పోరాడతాం. మా అందరికీ ఉమ్మడి బాధ్యత ఉంది. ప్రస్తుతానికి సీఎం ముఖం అంటూ ఏమీ లేదు’’ అని శరద్ పవార్ పుణెలో మీడియాతో అన్నారు. ఈ ‘సీఎం ఫేస్’ విషయంపై భిన్నాభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే శరద్ పవార్ కూటమిలో విభేదాలు లేవని చెప్పడమే కాకుండా, ప్రతి విషయంపైనా కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం ఉందని అన్నారు.ఎవరు ఎక్కడ?అలాగే కాంగ్రెస్ పార్టీ, శివసేన– ఉద్ధవ్ ఠాకరే గ్రూపు మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లేదా ఎంఎంఆర్ లోని నియోజకవర్గాలకు సంబంధించినవి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలో తమ ఉనికిని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, ఉద్ధవ్ ఇప్పుడు తనకు గరిష్ఠంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ సీట్లు కావాలని పట్టుబట్టారు. ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న నార్త్ సెంట్రల్, నార్త్ వెస్ట్‌లలో తమ స్థావరాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, శివసేన–ఉద్ధవ్ గ్రూప్ కొంకణ్, థానే, మరాఠ్వాడా ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; కాంగ్రెస్ పార్టీ విదర్భ ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; ఇకపోతే, శరద్ పవార్ ఎన్సీపీ పశ్చిమ మహారాష్ట్రపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేకు చెందిన విదర్భ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అలాగే పశ్చిమ మహారాష్ట్రలోని పుణె, సాంగ్లీ జిల్లాల్లో కూడా పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణను మొదలుపెట్టింది.లోక్‌సభ ఎన్నికల సమయంలో సాంగ్లీలో ఏమి జరిగిందో పునరావృతం కాకుండా పశ్చిమ మహారాష్ట్రలో కచ్చితమైన సీట్ల పంపకం గురించి తమ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూపుతో తెర వెనుక కమ్యూనికేషన్ ను ప్రారంభించిందని శరద్ పవార్–ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలూ కెమెరా ముందు పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యలకు దూరంగా ఉన్నప్పటికీ, సీట్ల పంపకాల చర్చల కోసం కూర్చున్నప్పుడు కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉందని లోపలి వ్యక్తులు అంటున్నారు. కూటమి వర్గాల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన సాధారణ సూత్రం ఏమిటంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజారిటీని పొందినట్లయితే, అసెంబ్లీలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తుంది. విదర్భలో కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. కాబట్టి, ‘కాబోయే ముఖ్యమంత్రి ముఖం’ అనే సమస్య కూటమి భాగస్వాములలో కొన్ని చీలికలను, ఒత్తిడిని కలిగిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ చందావర్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
ముంబై: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) గెలుపు ఆరంభం మాత్రమేనని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ విజయయాత్ర రాష్ట్రంలో మరికొద్ది నెల ల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసా గుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 సీట్లకు గాను ఎంవీఏ పార్టీలు 30 సీట్లను గెల్చుకో వడం తెల్సిందే. ఉద్ధవ్ శనివారం ఎన్సీపీ (ఎస్పీ)చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అజేయమనే అపోహ ఎంత బూటకమైనదో లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు రుజువు చేశారని ఉద్ధవ్ అన్నారు. ఎన్డీఏ సర్కారుగా మారిన మోదీ సర్కారు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. -
20 రోజుల్లో ఉద్దవ్ బీజేపీలో చేరుతారు: మహారాష్ట్ర ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: అమరావతి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణా భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా శివసేన(ఉద్దవ్ వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్వం జరిగిన 20 రోజుల్లో ఉద్ధవ్ బీజేపీతో చేరుతారని జోస్యం చెప్పారు. జూన్ 20లోపు ఉద్ధవ్ వర్గం శివసేన ఎన్డీయే కూటమిలో చేరబోతుంని తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.భార్య నవనీత్ కౌర్‌తో ఎమ్మెల్యే రవి రానా‘నేను నమ్మకంగా చెప్పగలను. కేంద్రలో మోదీ మళ్లీ ప్రధాని అయిన 20 రోజుల్లో ఉద్దవ్ ఠాక్రే మోదీ ప్రభుత్వంలో కలుస్తారు. రాబోయే కాలం మోదీదే.. ఆ విషయం ఉద్దవ్‌కు కూడా తెలుసు. బాబాసాహెబ్ థాక్రే ఆలోచనలు ముందుకు తీసుకెళ్తేది మోదీనే. ఉద్దవ్ కోసం ప్రధాని మోదీ ఓ కిటికీ ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. ఈ విషయం మోదీనే స్వయంగా చెప్పారు కూడా. బీజేపీలో చేరేందుకు ఉద్ధవ్ ఈ ‘విండో’ను ఉపయోగించుకుంటారు’ అని పేర్కొన్నారు.గతంలోనూ శివసేన, ఎన్సీపీ నుంచి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వైదొలుగుతారని తాను ఖచ్చితంగా చెప్పానని, తరువాత అదే జరిగిందని అన్నారు. కాగా ఎన్సీపీ వ్యవస్థాపకుడు, శరద్ పవార్‌తోపాటు ఉద్దవ్ ఠాక్రేలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాని ఇటీవల మోదీ కోరారు. కాంగ్రెస్‌లో విలీనమై కనుమరుగవడం కంటే బీజేపీలో చేరడం మేలని అన్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యాయతను తాను ఎప్పటికీ మరచిపోలేనని మోదీ అన్నారు. -
మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే
శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్‌సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగటానికి ఒకరోజు ముందు మేనిఫెస్టోను 'వచన్ నామ' పేరుతో విడుదల చేశారు.శివసేన పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా దోపిడిని ఆపడం, ఉపాధి కల్పన, వ్యవసాయ రుణమాఫీ మొదలైనవాటిపైన ద్రుష్టి పెటుతోంది. రాష్ట్ర అభివృద్ధి ప్రధానం అంటూ ఉద్ధవ్ ఠాక్రే విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.ఉద్యోగాల కల్పన: రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని పేర్కొన్నారు. తప్పకుండా రాష్ట్రంలో కావలసిన ఉద్యోగాలను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లకుండా.. జిల్లా స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు.రైతుల సంక్షేమం: వ్యవసాయ రుణాలను మాఫీ చేయడమే కాకుండా, పంట భీమాకు సంబంధించిన షరతులను కూడా సవరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే మేనిఫెస్టోలో వెల్లడించారు. వ్యవసాయ పరికరాలు, విత్తనాల మీద GST లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫార్సు చేసిన కనీస మద్దతు ధర అమలు కూడా జరుగుతుందని ఆయన అన్నారు.పన్నుల వ్యవస్థ: పన్ను ఉగ్రవాదాన్ని తగ్గించడానికి, న్యాయపరమైన.. సమన పన్నుల వ్యవస్థను నిర్థారిస్తామని ఠాక్రే అన్నారు.పర్యావరణ పరిరక్షణ: మహారాష్ట్రలో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, పరిశ్రమలను మాత్రమే అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 26) రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని ప్రాంతాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 16,589 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.#WATCH | Former Maharashtra Chief Minister and Shiv Sena (UBT) chief Uddhav Thackeray releases the party manifesto named 'Vachan nama' for the Lok Sabha elections, in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/6dcQhs8X8N— ANI (@ANI) April 25, 2024 -
సేవ్ డెమోక్రసీ ర్యాలీలో 'ఉద్దవ్ ఠాక్రే' కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: 'కేజ్రీవాల్'ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి రాంలీలా మైదానంలో 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాకుండా మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన చీఫ్ 'ఉద్ధవ్ ఠాక్రే' కూడా పాల్గొన్నారు. సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో.. బీజేపీ 400 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక పార్టీ, ఒక వ్యక్తి సారథ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేము ఎన్నికల ప్రచారానికి రాలేదు.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వచ్చాము అన్నారు. ఒకప్పుడు అవినీతి చేసిన వాళ్లను బీజేపీ వాషింగ్ మెషిన్లో ఉతికి శుభ్రం చేసిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులతో నిండిన పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుంది? అని ఠాక్రే ప్రశ్నించారు. జైలులో ఉన్న ప్రతిపక్ష నాయకులు అరవింద్ కేజ్రీవాల్ & హేమంత్ సోరెన్ భార్యలకు మద్దతునిస్తూ.. వారి పోరాటానికి మద్దతుగా వారి సోదరుడు ఇక్కడ ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. दिल्ली के रामलीला मैदान में पक्षप्रमुख मा. श्री. उद्धवसाहेब ठाकरे ने INDIA गठबंधन महारैली को संबोधित किया। pic.twitter.com/RdfFXDVFnL — Office of Uddhav Thackeray (@OfficeofUT) March 31, 2024 -
మహారాష్ట్ర స్పీకర్‌కు బాంబే హైకోర్టు నోటీసులు
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాను పెట్టుకున్న పిటిషన్లను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కొట్టేయడాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం నేత, చీఫ్ విప్ భరత్ గోగావాలే బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలంటూ స్పీకర్, 14 మంది ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపింది. అసెంబ్లీ సచివాలయానికీ కోర్టు నోటీసులిచి్చంది. నోటీసులు అందుకున్న వారు తమ స్పందనను అఫిడవిట్ల రూపంలో సమరి్పంచాలని కోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో 8కి వాయిదావేసింది. -
‘మహా’ జనానిదే తుది తీర్పు
సుప్రీంకోర్టు తుది గడువు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికే పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికుల మద్దతుందనీ, అదే ‘నిజమైన శివసేన’ అనీ తేల్చారు. అలాగని ఉద్ధవ్ ఠాక్రే వెంటనున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకూ మన చట్టసభల్లో ఫిరాయింపులు, ఇతరేతర సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షాల ప్రయోజనాల పరిధిని మించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవటానికి సభాధ్యక్షులు సిద్ధపడరని తరచు రుజువవుతూనేవుంది. మహారాష్ట్ర కూడా దానికి మినహాయింపు కాదు. అందువల్లే రెండుగా చీలిన శివసేన వర్గాల్లో ఏది నిజమైందో, ఏది కాదో తేల్చడానికి స్పీకర్ నార్వేకర్‌కు ఏడాదిన్నర కాలం పట్టిందంటే ఆశ్చర్యం లేదు. జనవరి 10 తుది గడువని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పకపోయివుంటే మరెన్ని నెలలు పట్టేదో అనూహ్యం. లెక్కలు తేల్చడానికి శివసేనకు భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు లేరు. అయినా నార్వేకర్ గరిష్ట వ్యవధిని తీసుకుని తుది నిర్ణయం ప్రకటించారు. 2019లో ఆ పార్టీ నేతృత్వంలో ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహావికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పడిననాటికి శివసేన ఎమ్మెల్యేలు 55 మంది. 2022 జూన్ 21న 34 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభానాయకుడిగావున్న ఏక్నాథ్ షిండే నాయకత్వంలో తిరగబడటంతో పార్టీ నిలువునా చీలింది. వెంటనే ఉద్ధవ్ మేల్కొని షిండే స్థానంలో సభానాయకుడిగా అజయ్ చౌధరిని నియమించటంతోపాటు, విప్‌గా వున్న షిండే వర్గం నేతను తొలగించి, తన వర్గంలోని సునీల్ ప్రభును ప్రకటించారు. ఎన్ని చేసినా ప్రయోజనం లేదని గ్రహించాక జూన్ 29న ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతుండగా వెలువడిన నార్వేకర్ నిర్ణయం... ఈ చీలికను ప్రోత్సహించి షిండే సర్కారులో చేరిన బీజేపీకి సహజంగానే ఊరటనిచ్చే అంశం. భావోద్వేగాల ప్రభావం ఎక్కువుండే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడివుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి సానుభూతి వెల్లువెత్తేది. ఇప్పటికే ఉద్ధవ్ శివసేన పేరును, గుర్తును కూడా కోల్పోయారు. ఆ అంశంలో ఎన్నికల సంఘం షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సొంత మనిషిగా భావించిన షిండేయే బీజేపీ ప్రోద్బలంతో శివసేనలో చిచ్చు రగిల్చి ఉద్ధవ్‌కు అన్యాయం చేశారని జనం భావిస్తున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇది షిండే వర్గంతోపాటు బీజేపీని కూడా దెబ్బతీసేలా వున్నదని ఆ సర్వేల సారాంశం. అందుకే అనర్హత అంశం జోలికి వెళ్లకపోవటమే మంచిదని షిండే వర్గం భావించినట్టు కనబడుతోంది. అయితే ఉద్ధవ్ వర్గం మౌనంగా ఏమీవుండదు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయటంతోపాటు ప్రజాక్షేత్రంలోకెళ్తానని ఇప్పటికే ప్రకటించింది. కనుక ‘నిజమైన శివసేన’ షిండేదేనన్న స్పీకర్ నిర్ణయంపై అది కావలసినంత రచ్చ చేస్తుంది. అటు కొందరు ఎమ్మెల్యేలతో నిష్క్రమించిన అజిత్ పవార్ వర్గంపైనా ఇలాంటి పిటిషనే పెండింగ్‌లో వుంది. ఈనెల 31లోగా వెలువడే ఆ నిర్ణయం కూడా ప్రకంపనలు రేపడం ఖాయం. మన రాజ్యాంగం సభాధ్యక్షులకు ఎన్నో అధికారాలిచ్చింది. అనేక సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లోనేనని తేల్చిచెప్పాయి. కానీ తాము ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీల ప్రయోజనాల పరిధిని మించి స్పీకర్లు వ్యవహరించలేకపోతున్నారు. మహారాష్ట్ర విషయానికే వస్తే ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, స్పీకర్‌పై ఒత్తిడి తెస్తే తప్ప నిర్ణయం వెలువడలేదు. తమ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పీకర్లు చెబుతూ వుంటారు. వాటి ఆదేశాలను బేఖాతరు చేస్తుంటారు. అయితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినంతవరకూ అటువంటి స్వతంత్రతను అందరూ హర్షిస్తారు. అందుకు భిన్నంగాపోయి న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంటే అది స్పీకర్ల వ్యవస్థను బలహీనపరుస్తుంది. సాధారణంగా ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏర్పడేటపుడూ... ఆ ప్రభుత్వాలు అస్థిరతలో పడినప్పుడూ ప్రత్యర్థి పక్షాలు ఖరీదైన విలాసవంతమైన హోటళ్లలో శిబిరాలు నిర్వహించటం, అవసరాన్నిబట్టి విమానాల్లో వేరే రాష్ట్రాలకు ఎమ్మెల్యేలను తరలించటం తరచు మన దేశంలో కనబడుతూనేవుంటుంది. ఈ తంతుమన ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది కూడా. దానికితోడు సభాధ్యక్షులుగా వున్నవారు సైతం ఏదో ఒక వర్గం చేతిలో కీలుబొమ్మలై తటస్థతకు తూట్లుపొడిచి నిర్ణయాలు తీసుకోవటం లేదా నిర్ణయ ప్రకటనలో విపరీతమైన జాప్యం చేయటం తరచు కనబడుతుంది. భారీ మెజారిటీతో నెగ్గిన తెలుగుదేశం అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ సర్కారును ఆయనకు స్వయానా అల్లుడైన చంద్రబాబు నాయుడు 1995 ఆగస్టులో కూల్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు జరిగిన పరిణామాలను ఎవరూ మరిచిపోరు. అంతకుముందూ, ఆ తర్వాతా కూడా పదే పదే అలాంటి ఉదంతాలే దేశంలో పునరావృతమయ్యాయి. స్పీకర్ తాజా నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం న్యాయస్థానంలోనూ, వెలుపలా పోరాడుతుంది. ఇప్పటికైతే షిండే ప్రభుత్వం నిశ్చింతగా వుండొచ్చు. కానీ ఈ చీలికలపైనా, ప్రభుత్వాలను కూల్చటంపైనా జనం స్పందన ఎలావుండబోతున్నదో రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ఆ తర్వాతైనా రాజకీయ పక్షాలు పరిణతితో వ్యవహరించటం నేర్చుకుంటాయని ఆశించాలి. -
నేను కాలారామ్ దేవాలయంలో హారతి ఇస్తా: ఉద్ధవ్
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చాలా మంది నేతలకు ఆహ్వానం అందలేదు. వీరిలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే కూడా ఒకరు. తనకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఠాక్రే ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్దవ్ తన తల్లి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రామమందిర ఆలయం ప్రారంభోత్సవం రోజే తనతోపాటు తన పార్టీ నేతలు నాసిక్‌లోని కాలారామ్ ఆలయానికి వెళ్లి అక్కడ గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహించనున్నట్లు చెప్పారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన గర్వించదగ్గ విషయమని, ఆత్మగౌరవానికి సంబంధించినదని తెలిపారు. ఆ రోజు (జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సానే గురూజీ నిరసనలు చేసిన కాలారామ్ సదర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తాం’’ అని ఠాక్రే చెప్పారు. కాగా రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందని గతవారం ఉద్ధవ్ తెలిపిన విషయం తెలిసిందే. రాముడు కొలువై ఉన్న కాలారామ్ ఆలయం నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో ఉంది. నల్లరాతితో చెక్కిన రాముడి విగ్రహం ద్వారా ఆ ఆలయానికి ఆ పేరు వచ్చింది. రాముడు వనవాస సమయంలో భార్య సీత, సోదరుడులక్ష్మణుడితో పంచవటిలో ఉండేవారని భక్తులు విశ్వసిస్తారు. 1930లో దళితులను ఆలయంలోకి ప్రవేశించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కాలారామ్ ఆలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. . -
మళ్లీ గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయి
ముంబై: అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తయ్యే అవకాశమన్నందున ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉండగా రామాలయం ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరవుతారని వారు తిరిగి వెళ్లే సమయంలో గోద్రా తరహా అల్లర్లు జరిగే అవకాశముందని అన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే. అల్లర్లు జరుగుతాయి.. జల్గావ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఉద్ధవ్ ఠాక్రే వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న రామ మందిరం ప్రారంభోత్సవం గురించిన ప్రస్తావన చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భక్తులు బస్సుల్లోనూ, రైళ్లలోనూ లక్షల సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని వారు తిరిగి వెళ్లే సమయంలో వారిపై దాడులు జరుగుతాయని దుండగులు రాళ్లు రువ్వుతారని అన్నారు. గోద్రా అల్లర్ల తరహాలోనే హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశముంటుందని హెచ్చరించారు. VIDEO | "It is a possibility that the government could invite a large number of people for the Ram Temple inauguration in buses and trucks, and on their return journey, an incident similar to that in Godhra may occur," said Shiv Sena (UBT) leader Uddhav Thackeray earlier. STORY… pic.twitter.com/iEZocaMs9c — Press Trust of India (@PTI_News) September 11, 2023 గోద్రా తరహాలోనే.. 2022, ఫిబ్రవరిలో జరిగిన గోద్రా అల్లర్లు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టింఛాయా అందరికి తెలిసిందే. ఈ హింసాకాండలో 58 మంది మృతి చెందగా ఎందరో గాయాల పాలయ్యారు. గోద్రా రైల్వేస్టేషన్లో ఉన్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ కోచ్‌లకు నిప్పు పెట్టారు నిరసనకారులు. గోద్రా అల్లర్ల కేసులో గుజరాత్ హైకోర్టు మొత్తం 31 మందిని దోషులుగా నిర్ధారించగా 65 మందిని నిర్దోషులుగా ప్రకటించింది గుజరాత్ హైకోర్టు. గుజరాత్ హైకోర్టు నిర్ధారించిన తీర్పుపై సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మీ తండ్రి ఆత్మకు క్షోభ.. ఇదిలా ఉండగా ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. నిన్ను చూసి మీ తండ్రి ఆత్మ క్షోభిస్తుందని.. నా బిడ్డకు ఎమైంది? ఎవరి ఆశీస్సులతో నా బిడ్డ రాజకీయంగా ఎదిగాడని అనుకుంటారని.. మీరు చూస్తే ఇండియా కూటమిలో చేరి నానాయాగీ చేస్తున్నారన్నారు. రామ జన్మభూమిపై మీ తండ్రిగారి ఆశీస్సులు ఉంటాయని మీ కూటమికి ఆ శ్రీరామచంద్రుడు కొంతైనా జ్ఞానమివ్వమని ప్రార్ధించమని కోరారు. నోరు విప్పరేం.. ఇక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేను స్వార్ధపరుడని చెబుతూ తమిళనాడు నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాలా సాహెబ్ ఠాక్రే ఉండి ఉంటే మీ స్వార్ధాన్ని చూసి మనోవేదనకు గురయ్యేవారని వ్యాఖ్యానించారు. #WATCH | On Shiv Sena (UBT) chief Uddhav Thackeray's remarks on Ram Mandir, BJP MP Ravi Shankar Prasad says, "...All I would like to say is that this entire alliance, that is against PM Modi, can go to any limit for votes...I would like to pray to Lord Ram to give them some… https://t.co/Zme5rTQMI6 pic.twitter.com/54bCbNWkhm — ANI (@ANI) September 11, 2023 ఇది కూడా చదవండి: 'భారత్' 'ఇండియా' ఏ పేరైనా పర్వాలేదు -
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్..
ముంబయి: శివసేన చీఫ్(యూబీటీ), మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో ఓ పాము అలజడి సృష్టించింది. ముంబయిలోని తూర్పు బాంధ్రా కాలానగర్‌లో ఉన్న థాక్రే ఇంట్లోకి ఆదివారం ఓ పాము దూరింది. విషయం గమనించి స్నేక్ క్యాచ్ర్కు ఫోన్ చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన స్నేక్ క్యాచర్ బృందాలు.. పామును పట్టుకున్నారు. కోబ్రా జాతికి చెందిన విషపూరిత పాముగా గుర్తించారు. मातोश्री में निकला सांप, पानी की टांकी के पीछे से सांप को किया गया रेस्क्यू । उद्धव ठाकरे ने किया सर्प मित्रो का शुक्रिया @IndiaTVHindi @indiatvnews pic.twitter.com/byAiNqS6yu — Namrata Dubey (@namrata_INDIATV) August 7, 2023 దాదాపు నాలుగు అడుగుల మేర పాము ఉందని చెప్పారు. పామును చూడటానికి ఉద్ధవ్ థాక్రే ఇంటి బయటకు వచ్చారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ బృందాలు.. దానిని సమీప అడవిలో వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో చీలిక తర్వాత మహా పాలిటిక్స్‌లో ‘పవార్’ పేరే జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను శివసేన నేత (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. బుధవారం ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. కాగా అజిత్ పవార్ బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరిన తర్వాత వీరిరువురు కలవడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గతంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి విదితమే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అజిత్ పనితీరు తెలుసు: ఉద్ధవ్ అజిత్‌తో భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు.. అజిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ధృతరాష్ట్రుడిలా గుడ్డిది కాదని, ఛత్రపతి శివాజీ మహారాజా నడియాడిన రాష్ట్రమని తెలిపారు. అజిత్ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో అజిత్‌తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పని తీరు తెలుసని చెప్పారు. చదవండి: మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం విపక్షాల భేటీ మరుసటి రోజే.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బెంగుళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల కీలక భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే అజిత్‌తో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అజిత్ పవార్ సైతం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని శరద్‌ను కోరారు. కాగా అజిత్ తన బాబాయిని 24 గంటల వ్యవధిలో రెండుసార్లు (ఆది, సోమవారం) కలిశారు. అజిత్ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారని, ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. చదవండి: షాకింగ్ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి.. VIDEO | Shiv Sena (UBT) leader Uddhav Thackeray meets Maharashtra Deputy CM Ajit Pawar in Mumbai. (Source: Third Party) pic.twitter.com/38w33jcPnv — Press Trust of India (@PTI_News) July 19, 2023 -
Sharad Pawar: ఆది నుంచి ఫిరాయింపులే!
1958 నాటి సంగతి; పూనా(ఇప్పుడు పుణె) సిటీ, ‘బృహన్ మహారాష్ట్ర కాలేజి ఆఫ్ కామర్స్’లో స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇరు ప్యానల్ అభ్యర్థులు చివరి రోజు రాత్రి తమ తమ విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు. ఓటమిని శంకించిన ఓ గ్రూప్ లీడర్ ఒక పథకం వేశాడు. ఆ రోజు మధ్య రాత్రి, ఆయన ఓ నలుగురు మిత్రులతో హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న కొందరు రైవల్ గ్రూప్ విద్యార్థులను నిద్ర లేపి తమ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా బతిమాలాడు. బదులుగా, తన టీం గెలిచిన వెంటనే కాలేజి యాజమాన్యంతో సంప్రదించి వారి సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడు. తెల్లవారే వరకు ఈ ప్రచారం నడిచింది. మరుసటి రోజు జరిగిన ఎన్నికల్లో ఆయన టీం గెలిచింది. ఆ టీమ్ లీడర్ మరెవరో కాదు– శరద్ చంద్ర గోవిందరావ్ పవార్. కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన శరద్ రావ్ నేరుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్త అయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎదిగి, తన 27వ ఏట (1967లో) ఎమ్మెల్యేగా ఎన్నికై వైబీ చవాన్ ఆశీస్సులతో మొదటిసారి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి (1972) కూడా అయ్యారు. 1977 లోక్ సభ ఎన్నికలలో జనతా పార్టీ ప్రభంజనంతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవటమే కాక, నిలువునా చీలి రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ (1978)గా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1978లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సాధించక పోవటంతో, రెండు కాంగ్రెస్ పార్టీలూ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వసంత్ దాదా పాటిల్ (రెడ్డి కాంగ్రెస్) ముఖ్య మంత్రి అయ్యారు. శరద్ పవార్ రెవెన్యూ మంత్రిగా ఆయన క్యాబినెట్లో చేరారు. కొన్ని రోజులకే, జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర శేఖర్ (మాజీ కాంగ్రెస్ యంగ్ టర్క్ లీడర్) స్నేహాన్ని ఆసరా చేసుకుని, యంగ్ పవార్ కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పార్టీని వీడి, ప్రతిపక్ష జనతా పార్టీ మద్దతుతో తన 38వ ఏట (జూలై, 1978) ముఖ్య మంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. తెల్లబోవటం కాకలు తీరిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల వంతైంది. ఇందిరా గాంధీ 1980లో కేంద్రంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శరద్ పవార్ సీఎం పదవి కోల్పోయారు. ఆ తర్వాత ‘కాంగ్రెస్ (సెక్యులర్)’ పేరుతో కొంత కాలం ప్రాంతీయ పార్టీ నడిపించారు పవార్ సాబ్. ఇందిరాజీ హత్య తరువాత రాజీవ్ గాంధీ పవార్‌ను, తన పార్టీ బలగంతో తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 1988 జూన్‌లో శరద్ పవార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 1991లో నాగపూర్ అసెంబ్లీ సమావేశాల్లో, శివసేన పార్టీ అంతర్గత కుమ్ములాటను గమనించి, ఆ పార్టీ ఓబీసీ నేత చగన్ భుజ్‌బల్, మరో 16 మంది శివ సేన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ తీర్థం ఇప్పించారు సీఎం పవార్. ఆయన పర్యవేక్షణలో అలా శివసేన నుండి మొదటిసారిగా ‘వలసలు’ ప్రారంభమయ్యాయి. ఇక పదేళ్ల అనంతరం (2001) కొంతమంది పార్టీ నాయకులను తీసుకొని కాంగ్రెస్‌కు మరోసారి తిలోదకాలు ఇచ్చి, ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ (ఎన్సీపీ)ని స్థాపించారు. 1989 నుండి మూడు దశాబ్దాల వరకు హిందూత్వ భావజాలం పులుముకున్న శివసేన – భారతీయ జనతాపార్టీలు ప్రతీ ఎన్నికలోనూ కలిసే పోటీ చేశాయి. 1995–2000 ఈ కూటమి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేసింది. ఇక 2019 ఎన్నికల్లో ఈ కూటమి 161 సీట్లు గెలవటంతో సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది, కాని అది కుదర్లేదు. కారణం, ముఖ్యమంత్రి పదవి తమకే చెందాలని 56 సీట్లు గెలుచుకున్న శివసేన మారాం చేయడమే. ఇంతలో ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, తన బాబాయి సీనియర్ పవార్‌ను కాదని భాజపాతో చేతులు కలిపారు. ఫలితంగా భాజపా నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం, అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పడింది. తనను విడిచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను పవార్ సాహెబ్ చాకచక్యంగా తిరిగి తన గూటిలోకి చేర్చుకోవటంతో అజిత్ పవార్ పాచిక పారలేదు. ఇక సంఖ్యా బలం కోల్పోయిన ఈ కొత్త ప్రభుత్వం, 60 గంటల్లోనే (26.11.2019న) పడిపోవటం విశేషం. ఆ తర్వాత శరద్ పవార్ రంగంలోకి దిగి, తనదైన శైలిలో చకచకా పావులు కదిలించారు. ‘మహా వికాస్ అఘాడి’ పేరుతో శివసేన (56), ఎన్సీపీ (54), కాంగ్రెస్ (44) కూటమిని ఏర్పాటు చేసి, శివసేన కోరిక మేరకే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా (28.11.2019) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో 105 స్థానాలు గెలిచిన భాజపా ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. దిగ్భ్రాంతికి గురైన భాజాపా తనతో శివసేనకు ఉన్న మూడు పదుల దోస్తీని తుంచిన శరద్ పవార్‌తో పాటు, శివసేన అధినాయకుడు ఉద్ధవ్కూ గుణపాఠం నేర్పాలని పకడ్బందీగా ప్లాన్ చేసింది. 45 ఏళ్ల క్రితం పవార్ రచించిన రాజకీయ స్క్రిప్ట్‌నే ఆదర్శంగా తీసుకొని 2022 జూన్‌లో ఏక్నాథ్ శిందేని ఉపయోగించి శివసేననూ, 2023 జూలైలో అజిత్ పవార్‌ను ఉపయోగించి ఎన్సీపీని... చీల్చి కొత్త ప్రభుత్వాల ఏర్పాటును దిగ్విజయంగా పూర్తి చేసి ‘టిట్ ఫర్ టాట్’ అంది భారతీయ జనతా పార్టీ. ఔను మరి, మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు (శివసేన, ఎన్సీపీ) సంస్థాపరంగా చెదిరి, కోలుకోలేని స్థితిలో, తెరచాప తెగిన నావలా మారాయి. చివరిగా, క్యాన్సర్ జబ్బుకు ‘షికార్’ అయినప్పటికీ, 83 ఏళ్ల సీనియర్ నేత శరద్ చంద్ర పవార్, ‘నా టైర్డ్ హు, నా రిటైర్డ్ హు’ అంటూ, ధీమాగా సానుభూతి కోసం (ఓటు బ్యాంకు), రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఇప్పుడు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టారు. తన ఫార్ములా తనకే బెడిసి కొట్టడంతో ఏర్పడ్డ (రాజకీయ) గాయం, మరో వైపు పార్టీ అనుయాయులు తననే పార్టీ అధ్యక్ష పదవి నుండి వెలివేయటంతో ఒంటరి పక్షి అయ్యారు. ఈ సంక్షోభం నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి మరి! (శరద్ పవార్ స్వీయచరిత్ర ‘ఆన్ మై టర్మ్స్’, వైభవ్ పురంధరే రాసిన ‘ది రైజ్ ఆఫ్ ది శివసేన’ ఆధారంగా) జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పి.ఎఫ్. కమిషనర్ ‘ 9819096949 -
మాకు మద్దతివ్వండి
ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు. సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
విపక్షాల ఐక్యతే ముఖ్యం
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాలను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రతరం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను గురువారం వేర్వేరుగా కలుసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రయోజనాల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను కూడా కాపాడడానికి కృషి చెయ్యాలని ఇరువురు నేతలకు చెప్పినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ముందు దేశ ప్రయోజనాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యం ఉందని నితీశ్ అన్నారు. అందరూ కలసికట్టుగా పోరాడితే బీజేపీపై విజయం సాధించవచ్చునని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
సరిదిద్దలేని మహా తప్పిదాలు
ఉత్కంఠగా ఎదురుచూసిన కోర్టు తీర్పు వచ్చింది. కానీ, న్యాయం మాత్రం ఇంకా జరగాల్సి ఉంది. శివసేన రెండు ముక్కలై వీధికెక్కిన వివాదంలో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా గురువారం ఇచ్చిన తీర్పు తర్వాత పరిస్థితి అదే. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ శిందే వర్గాల మధ్య శివసేనలో అంతర్గత కలహాలు చివరకు ప్రభుత్వ మార్పిడిగా పర్యవసించినప్పుడు మహారాష్ట్ర గవర్నర్, శాసనసభ స్పీకర్లు అత్యుత్సాహం చూపిన తీరును కోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. వారు చట్టప్రకారం నడుచుకోలేదని కుండబద్దలు కొట్టింది. కానీ, శివ సేనను వీడి, పార్టీని శిందే రెండు ముక్కలు చేసిన సందర్భంలో సభలో బలపరీక్షకు నిలవకుండానే రాజీనామా సమర్పించిన ఉద్ధవ్ సర్కార్‌ను పునరుద్ధరిస్తూ ఆదేశాలివ్వలేమనీ పేర్కొంది. జరిగింది తప్పేనని తీర్పు చెబుతూనే, పాత తప్పును ఇప్పుడు సరిదిద్దలేమని అశక్తత వ్యక్తం చేసింది. అంటే శిందే సర్కార్ కొనసాగేలా ఇప్పటికి ఊరట నిచ్చింది. అదే సమయంలో ఉద్ధవ్ రాజీనామా చేయకుండా, సభలో బలపరీ క్షకు దిగుంటే... ఆ బలపరీక్షే చట్టవిరుద్ధం గనక ఆయన సర్కారును పునరుద్ధరించే వీలుండేదని కోర్ట్ అభిప్రాయపడింది. అలా అప్పట్లో విప్‌ను ధిక్కరించిన శిందే అనర్హతకు తలుపు తెరిచే ఉంచింది. పార్టీ అంతర్గత విభేదాల లెక్క తేల్చేందుకు నాటి మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ శాసనసభలో బలపరీక్ష పెట్టాలని నిర్ణయించడం శుద్ధ తప్పు అనే మాట లోతైనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు రాజకీయ పార్టీల అంతర్గత విభేదాలతో పనేమిటి? ప్రభుత్వం మద్దతు కోల్పోయినట్టు తగిన సాక్ష్యాధారాలేమీ లేకుండానే, స్వయానా గవర్నరే బలపరీక్ష జరపా లని కోరడమంటే... చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని అనివార్యంగా మెజారిటీ కోల్పోయేలా చేసి, కూలి పోయేలా చూడడమే! అంటే, కారణాలేమైనా తన చర్యల ద్వారా ఒక నిర్ణీత ఫలితం వచ్చేలా చేయ డమే! ఉద్ధవ్ సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కార్ రాజీనామాకు ఇదే కారణమైంది. ఇది గవర్నర్లు చేయాల్సిన పనేనా? ఈ కేసులో వాదనల సందర్భంగా సుప్రీమ్ ప్రస్తావించిన ఈ అంశాలు ఆలోచించాల్సినవి. కావాల్సిన పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు ఢిల్లీ పెద్దలు గవర్నర్ల వ్యవస్థను వాడుకుంటున్న విషాదానికి ఇవన్నీ మహా చిహ్నాలు. మరోపక్క శిందే వర్గమే ‘అసలైన’ శివసేన అని గుర్తిస్తూ, దానికే పార్టీ చిహ్నమైన విల్లంబులను ఎన్నికల సంఘం కేటాయించడమూ తొందరపాటే. అలాగే, అసెంబ్లీ స్పీకర్ సైతం శిందే వర్గానికి అనుకూలంగా ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించే వరకు ఆ వర్గపు ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత ఫిర్యాదులను నానబెట్టడం మరో తప్పు. ఇలా గవర్నర్, స్పీకర్, ఎన్నికల సంఘం సహా అన్ని రాజ్యాంగ సంస్థలూ తప్పుదోవ పట్టిన తీరును సుప్రీమ్ తన తీర్పులో బలంగా ప్రస్తావించడం గమనార్హం. శివసేన కథలో తదుపరి ఘట్టం మరింత విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న వేళ ఇవన్నీ కూడా మళ్ళీ లెక్కలోకి రాక మానవు. అలాగే, విప్ జారీ అయినా సరే చీలిక ముసుగులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే తిప్పలు తప్పవనీ తేలిపోనుంది. వెరసి, తాజా తీర్పు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపడం ఖయం అనిపిస్తోంది. గతంలోకెళితే ఈ కథలో ఎన్నో మలుపులు. 2019 అక్టోబర్‌లో బీజేపీ–శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. మరిన్ని మంత్రి పదవులు, రెండున్నరేళ్ళ పాటు సీఎం పీఠం కట్టబెట్టాలని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన డిమాండ్ చేసింది. అలాంటి ఒప్పందమేదీ లేదని బీజేపీ అడ్డం తిరిగింది. దాంతో గెలిచిన పక్షం రోజులకే కూటమి విచ్ఛిన్నమైంది. కమలనాథుల సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సొచ్చింది. అప్పటి నుంచి మహారాష్ట్రలో కొత్త పొత్తులు, ప్రభుత్వాలు– సీఎంల మార్పులు, కాంగ్రెస్– ఎన్సీపీ– శివసేనల ‘ఎంవీఏ’ కూటమి ఆవిర్భావం... ఇలా అనేకం జరిగాయి. వాటిలో భాగమే 2022 జూన్‌లో ఏకంగా శివసేన వ్యవస్థాపకుడైన బాల్‌ఠాక్రే కుమారుడూ, అప్పటి మహారాష్ట్ర సీఎం అయిన ఉద్ధవ్‌పై శిందే తిరుగుబాటు. గవర్నర్ బలపరీక్ష నిర్ణయంతో ఉద్ధవ్ జూన్ 29న రాజీనామా చేశారు. ఆ మర్నాడే బీజేపీ అండతో శిందే సీఎం కుర్చీ ఎక్కారు. శిందే, ఆయనతో బయటకొచ్చి పార్టీ తమదేనన్న మరో 15 మంది అనర్హత కథ కొన్నాళ్ళుగా కోర్టులో నలుగుతోంది. తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి శిందే సర్కార్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ కోరుతుంటే, కోర్టు వ్యాఖ్యలెలా ఉన్నా తమను కొనసాగనివ్వడమే ప్రజాస్వామ్య విజయమని శిందే, ఫడ్నవీస్‌లు జబ్బలు చరుస్తున్నారు. విస్తృత ధర్మాసనంలో కథ ఏ కొత్త మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమను కాదని ప్రత్యర్థులతో కూటమి కట్టిన మునుపటి మిత్రపక్షం శివసేనను నిలువునా చీల్చడంలో బీజేపీ ఇప్పటికే సఫలమైంది. సొంతంగా చక్రం తిప్పేందుకు అదను కోసం చూస్తోంది. అది రుచించకున్నా, బీజేపీ దోస్తీ లేకుండా శిందే సేన మనుగడ కష్టం. మరోపక్క తన వెంట మిగిలిన కొద్దిమందీ చేజారిపోకుండా కాపాడుకోవడం ఉద్ధవ్ ముందున్న సవాలు. ఈ పరిస్థితుల్లో తాజా తీర్పు ఉద్ధవ్‌కు నైతికంగా బలమిచ్చింది. కోర్టు తీర్పుతో కుర్చీ దక్కకున్నా, గవర్నర్ అవాంఛనీయ పాత్రతో ప్రత్యర్థులు అధికారం చేజిక్కించుకున్న తీరును తప్పుబట్టడమే ఊరట. అనర్హతలపై స్పీకర్ సత్వరమే నిర్ణయించాలనీ కోర్ట్ చెప్పడం గమనార్హం. అందుకే, ముందే అన్నట్టు తీర్పు వచ్చినా, న్యాయం ఇంకా జరగాల్సి ఉంది. కోర్టు లోపల ఒక దశ పోరాటం ముగిసి ఉండవచ్చు. మరోదశ మిగిలివుంది. కోర్టు బయట కూడా ఉద్ధవ్ తదితరుల నైతిక పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుంది. సుప్రీమ్ వ్యాఖ్యలతోనైనా మన రాజ్యాంగ వ్యవస్థలు దిద్దలేని తప్పిదాలకు దూరంగా ఉంటాయా? -
ఆ సమయంలో ఏది సరైందో అదే చేశా! మహారాష్ట్ర మాజీ గవర్నర్
మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కేసులో సుప్రీంకోర్టు నాటి మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి గవర్నర్ 80 ఏళ్ల భగత్ సింగ్ కోష్యారీని మీడియా ప్రశ్నించగా..నన్ను శిక్షించిందని అనుకోవడం లేదని తెలివిగా సమాధానమిచ్చారు. కారణం తాను రాజీనామా చేశానని, మాజీ గవర్నర్‌కు శిక్ష విధిస్తారని తాను అనుకోవడం లేదంటూ కప్పిపుచ్చుకునే యత్నం చేశారు. ఒక వేళ శిక్ష విధిస్తే తాను అప్పీల్ చేసి ఉండేవాడినంటూ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు కోష్యారీ. ఐతే తాను ఆ సమయంలో ఏది సరైనదో అదే చేశానని అన్నారు. అయినా సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించడం జర్నలిస్టులు, లాయర్ల పని అని సెటైరికల్ సమాధానమిచ్చారు. పైగా సుప్పీంకోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టిన విషయానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా తప్పించుకునే థోరణితో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా, నాటి ఘటనలో ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు వచ్చేయడం కూడా సరికాదని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. పైగా గవర్నర్ అలా నిర్ణయించడం రాజ్యంగ విరుద్ధమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన జోక్యం కూడా రాజ్యాంగ సమ్మతం కాదని తేల్చి చెప్పింది. మాజీ సీఎం థాక్రే బలపరీక్షకు వెళ్లకుండానే రాజీనామా చేశారని అందువల్లే ప్రభుత్వాన్ని పునురుద్ధరించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కాగా, నాటి గవర్నర్ కోష్యారీ మాత్రం తన నిర్ణయం గురించి ఎటువంటి విచారం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. (చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం: సుప్రీం కోర్టు) -
థాక్రేకు ఫడ్నవీస్ కౌంటర్.. మీకు ఆ పదాలు సూట్ కావు అంటూ..
ముంబై: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్ర గవర్నర్ బలపరీక్ష నిర్ణయాన్ని తప్పు పట్టింది. చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదు. బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. పార్టీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం రాజ్యాంగ సమ్మతం కాదు. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష ఎదుర్కోలేదు. కాబట్టి స్టేటస్కోను పునరుద్ధరించడం సాధ్యం కాదు. తిరిగి ఆయనను సీఎంగా నియమించలేం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. ఉద్దవ్ థాక్రేకు పొలిటికల్ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఫడ్నవీస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే వర్గానికి నైతికత గురించి మాట్లాడే హక్కులేదు. వారు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, తర్వాత కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. నైతిక విలువలు వంటి పదాలు ఉద్ధవ్‌కు సరిపోవు. నేను ఆయన్ను ఓ విషయం అడగాలనుకుంటున్నా. సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసినప్పుడు ఆ విలువలను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. గతంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతకాలం తనతో ఉన్నవ్యక్తులు వెళ్లిపోవడంతో భయపడి రాజీనామా చేశారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఉద్దవ్ వర్గంపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కుట్రలు ఓడిపోయాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టబద్ధతపై ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది పూర్తిగా చట్టబద్ధమైంది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. ప్రభుత్వాన్ని పునరుద్దరించి ఉండేవాళ్లం -
సుప్రీం కోర్టులో స్వాగతించిన ఫడ్నవీస్
-
థాక్రే రాజీనామా చేయకపోయి ఉంటే.. : సుప్రీం కోర్టు
ఢిల్లీ: శివసేన కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నైతిక విజయంగా భావిస్తోంది థాక్రేకు చెందిన శివసేన వర్గం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమన్న రాజ్యాంగ ధర్మాసనం.. అసెంబ్లీలో జరిగే బలపరీక్షలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కిందటి ఏడాది శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభ పరిస్థితుల్లో.. బలనిరూపణ పరీక్షకు వెళ్లకుండానే ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఇవాళ్టి తీర్పులో ప్రధానంగా ప్రస్తావించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్. ఒకవేళ థాక్రే గనుక రాజీనామా చేసి ఉండకపోయి ఉంటే.. ఈ కోర్టు ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించి ఉండేదని స్పష్టం చేసింది. ► విప్‌ను నియమించాల్సింది రాజకీయ పార్టీ. అంతేగానీ శాసనసభా పక్షం కాదు. కాబట్టి, ఏక్నాథ్ షిండే క్యాంప్ నియమించిన విప్ చెల్లుబాటు కాదు. కాబట్టి, శివసేన విప్‌గా భరత్ గోగావాలేను నియమిస్తూ హౌజ్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సరికాదు. ► అలాగే.. ఒక పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను, లేదంటే పార్టీల మధ్య నెలకొన్న కలహాలను బలనిరూపణ పరీక్ష పరిష్కరించలేదు. ► ఆ సమయంలో ఉద్దవ్ థాక్రే పార్టీ మెజార్టీ కోల్పోయారనే అధికారిక సమాచారం నాటి గవర్నర్ వద్ద లేదు. అయినా ఆయన బలనిరూపణకు ఆదేశించారు. ఆయనది రాజకీయ జోక్యం.. తొందరపాటు నిర్ణయం. ఆ నిర్ణయం తప్పు కూడా అని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ► గవర్నర్ విచక్షణాధికారం అమలు చేయడం చట్టానికి అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు కానిస్టిట్యూషన్ బెంచ్ అభిప్రాయపడింది. ► అయితే.. బలపరీక్షకు వెళ్లకుండా ఉద్దవ్ థాకక్రే రాజీనామా చేసిన క్రమంలో.. బీజేపీ మద్దతు ద్వారా మెజార్టీ ఉందని ప్రకటించుకున్న షిండే వర్గాన్ని.. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం ద్వారా గవర్నర్ సరైన పనే చేశారని బెంచ్ అభిప్రాయపడింది. అలాగే.. బలనిరూపణకు ముందుకు వెళ్లలేని సీఎంను.. ఇవాళ తన ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించమని అడిగే హక్కు కూడా ఉండదు అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ► చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. మొత్తం 141 పేజీల తీర్పు కాపీని ఈ కేసు కోసం సిద్ధం చేసింది. ► ఈ సందర్భంగా 2018 నాబమ్ రెబియా కేసు(తన తొలగింపును కోరుతూ తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు స్పీకర్ అనర్హత ప్రక్రియను ప్రారంభించలేరని)ను ప్రస్తావించిన బెంచ్.. ఆ కేసులోనూ పలు అంశాలపై నిర్ణయాలు జరగలేదని, కాబట్టి విస్తృత ధర్మాసనానికి అంశాల్ని బదిలీ చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో.. శివసేన కేసులో ఇంకా తుది తీర్పు రాలేదనే భావించాలి. ► ఇక సుప్రీం కోర్టు తీర్పు తమ నైతిక విజయమని పేర్కొన్న ఉద్దవ్ థాక్రే.. ఇప్పుడున్న సీఎం, డిప్యూటీ సీఎంలకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన మాదిరే రాజీనామా చేయాలంటూ ఉద్దవ్ థాక్రే పిలుపు ఇచ్చారు. ► మరోవైపు సుప్రీం కోర్టు తమకు అనుకూలంగానే ఉందని షిండే వర్గం ప్రకటించుకుంది. మహారాష్ట్రలో ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగేందుకు వీలు కలిగిందని అభిప్రాయపడింది. -
ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగడానికి సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. ఉద్ధవ్ ఠాక్రేను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోకుండా∙ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. అప్పట్లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ వ్యవహరించిన తీరు సమర్థనీయంగా లేనప్పటికీ ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏక్నాథ్ షిండేను ఆదేశించలేమని పేర్కొంది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభం, తద్వారా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై దాఖలైన 8 పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం∙తీర్పు వెలువరించింది. ‘సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదు. ఆయన తన విచక్షాణాధికారాలను ఉపయోగించి తీరు చట్టబద్ధంగా లేదు. సభలో బల పరీక్ష ఎదుర్కోకుండా ఉద్ధవ్ రాజీనామా చేశారు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఉద్ధవ్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ మద్దతున్న షిండేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అది సమర్థనీయమే’ అని వెల్లడించింది. ఉద్ధవ్ వర్గంపై తిరుగుబాటు చేసి, షిండే పక్షాన చేరిన శివసేన ఎమ్మెల్యేలపై ఇప్పుడు అనర్హత వేటు వేయలేమని తెలియజేసింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న స్పీకర్‌కు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసు ఇచ్చే అధికారం ఉందా? అనేది తేల్చడానికి అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే. షిండే రాజీనామా చేయాలి: ఉద్ధవ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అప్పటి గవర్నర్ తీరును కోర్టు తప్పుపట్టిందని చెప్పారు. వారు(షిండే వర్గం ఎమ్మెల్యేలు) తమ పారీ్టని, తండ్రి బాల్ ఠాక్రే అందించిన వారసత్వానికి దగా చేశారని మండిపడ్డారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయడం చట్టప్రకారం పొరపాటే అయినప్పటికీ నైతిక విలువలను పాటిస్తూ పదవి నుంచి తప్పుకున్నానని వివరించారు. వెన్నుపోటుదారులతో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. చదవండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్‌కు భారీ ఊరట.. కేంద్రానికి షాక్ -
దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్
మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రధానోత్సవంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 11 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ ఘటనపై ఎవరూ సమగ్రంగా దర్యాప్తు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ముంబై ఖార్గర్లో జరిగిన అవార్డు వేడుకను సరిగా ప్లాన్ చేయలేదని విమర్శించారు. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రే, ఎన్సీపీ నాయకుడు అజిత పవార్ ఎంజీఎం కమోతేతో కలిసి ఆ కార్యక్రమంలో వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరణించిన కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులను భరిస్తుందని సీఎం షిండే ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు) -
ఔను! మేము అధికారం కోసమే కలిశాం!
ప్రధాని మోదీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీ డిగ్రీ వివాదంపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈ ప్రధాని మోదీని డిగ్రీ చూపించమని అడిగితే జరిమానా విధిస్తారేంటి? అని సెటైర్లు వేశారు. అయినా మా కాలేజిలోనే మోదీ చదువుకున్నాడని గర్వంగా ఫీలవుతూ ఏ కాలేజీ చెప్పేందుకు ముందుకు రావడకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శించారు. నిజానికి అసలు ప్రధాని చదువకున్నారా అంటూ అనుమానం లేవనెత్తారు. ముఖ్యమంత్రి కావలనే ఉద్దేశ్యంతోనే సైద్ధాంతికంగా భిన్నమైన నేషనలిస్ట్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపి చేస్తున్న ఆరోపణలకు థాకరే గట్టి బదులు ఇచ్చారు. ఔను మేము అధికారం కోసమే కలిశాం. కానీ దానిని కోల్పోయినప్పటికీ ఇంకా కలిసే ఉన్నాం, మరింత బలంగా ఉన్నాం అని థాకరే అన్నారు. అలాగే సేన నాయకుడు ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీతో కొత్త ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారో ప్రస్తావిస్తూ..అవకాశం కుదరినప్పుడల్లా బీజేపీ ప్రజలను లోబర్చుకుంటుందని, సరిగ్గా ఎన్నికల సమయంలో మరింతగా మాయమాటలతో మోసం చేస్తోందని ఆరోపించారు. కాగా, బీజేపీ తనను హిందూత్వాన్ని విడిచిపెట్టానని నిందలు వేస్తోంది. నేను హిందూత్వాన్ని విడిచిపెడుతున్నాను అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పగలారా?. రాజ్యంగంపై ప్రమాణం చేసేందుకు నేను సిద్దమే మీరు ధృవీకరించగలరా అని ప్రశ్నిస్తే..అదిగో రాజ్యంగాన్ని అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తూ..బీజేపీ వితండ వాదన చేస్తోందన్నారు. న్యాయవ్యవస్తను సైతం బీజేపీ నియంత్రించడానికి ప్రయత్నించింది కానీ అదృష్టవశాత్తు న్యాయవ్యవస్థ అందుకు అంగీకరించ లేదన్నారు. లేదంటే ఇజ్రాయెల్ మాదిరి పరిస్థితి మన దేశంలో కూడా తల్లెత్తేది అంటూ బీజేపీకి గట్టి కౌంటరిచ్చారు. (చదవండి: శ్రీ రామనవమి శోభా యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మెల్యేకి గాయాలు) -
సావర్కర్‌ను అవమానిస్తే.. దోస్తీ కటీఫ్!
ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే హెచ్చరికలు జారీ చేశారు. వినాయక్ దామోదర్ సావర్కర్(వీర సావర్కర్)ను అవమానిస్తే చూస్తూ ఊరుకోబోమని.. ఇది విపక్ష కూటమిలో విభేదాలకు దారి తీయొచ్చని సున్నితంగా రాహుల్‌ను మందలించారు. ఆదివారం మాలేగావ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తూ.. ‘‘వీరసావర్కర్ మా దేవుడు. ఆయన్ని అవమానించేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మా దేవుళ్లను అంటూంటే మేం చూస్తూ ఊరుకోవాలా?’’ అని థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్ 14 ఏళ్లపాటు అండమాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించారు. అది ఊహాకు కూడా అందనిది. అదొక త్యాగం. అలాంటి త్యాగాలను అవమానిస్తే ఊరుకోవాలా? అని రాహుల్ గాంధీని ఉద్దేశించి థాక్రే ప్రసంగించారు. అయితే.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ, రాహుల్ గాంధీని ఉద్దేశ్యపూర్వకంగా తన వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని, తద్వారా పోరాట సమయం వృథా అవుతోంది అని ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇదిలా ఇలాగే కొనసాగితే.. విపక్ష కూటమి ముక్కలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చివర్లో హెచ్చరించారు కూడా. తాజాగా అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ మీడియా ముందు మాట్లాడుతూ.. ‘క్షమాపణలు చెప్పేందుకు తానేం సావర్కర్‌ను కాదని, తాను గాంధీనని, గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పినట్లు చరిత్రలో లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే థాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019 కర్నాటక ఎన్నికల ర్యాలీ సందర్భంగా.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలు, పరువు నష్టం దావా.. చివరకు తాజాగా ఈ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది రాహుల్ గాంధీకి. ఆ వెంటనే ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. అయితే ఈ పరిణామాలపై మిత్రపక్షం శివసేన (యూబీటీ) రాహుల్‌కు మద్దతుగా నిలిచింది. రాహుల్‌పై బీజేపీ విమర్శలను స్వయంగా తిప్పికొట్టారు ఉద్దవ్ థాక్రే. ‘‘మోదీ భారతదేశం కాదు. మన స్వాతంత్ర్య సమరయోధులు ఇందుకోసమే ప్రాణాలర్పించారా? మోదీని ప్రశ్నించడం అంటే.. భారత్‌ను అవమానించడం ఏమాత్రం కాదు’’ అని థాక్రే వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికలపై కమల్ హాసన్ కామెంట్ -
.. బారాబర్ మోదీ పేరుతోనే ఓట్లు అడుగుతాం!
.. బారాబర్ మోదీ పేరుతోనే ఓట్లు అడుగుతాం! -
మేఘాలయలో బీజేపీ బిగ్ ప్లాన్.. ఉద్దవ్ థాక్రే సంచలన కామెంట్స్!
ముంబై: ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)కి బీజేపీతో సహ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక, అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో, మేఘాలయలో రాజకీయాలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఉద్దవ్ థాక్రే ఆదివారం.. మహారాష్ట్రలోని ఖేడ్ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నేను ముఖ్యమంత్రిని కావడం కోసం నేను ఎన్సీపీ, కాంగ్రెస్ బూట్లు నాకానని పుణెలో అమిత్ షా అన్నారు. ఇప్పుడు వాళ్లు మేఘాలయాలో ఏం చేస్తున్నారు? అంటూ విమర్శలు చేశారు. గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా?. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పటేల్.. ఆర్ఎస్ఎస్ను నిషేధించారని అన్నారు. కానీ, ఆయన పేరును కూడా బీజేపీ వాడుకుంటోంది. అదే విధంగా సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ థాక్రే పేర్లను కూడా వాళ్లు దొంగిలించారు. వాళ్లు శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని నేను సవాల్ చేస్తున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. శివసేన బాణం-విల్లు గుర్తుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తప్పు. మా నుంచి పార్టీ పేరు, గుర్తును లాగేసుకున్నారు. కానీ, శివసేనను నా నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
ఊహించని పరిణామం.. ఉద్దవ్‌తో కేజ్రీవాల్ భేటీ.. దేనికి సంకేతం!
ముంబై: మహారాష్ట్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధినేత ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. ముంబైలోని బాంద్రాలో ఉద్దవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ రౌత్‌లు కూడా పాల్గొన్నారు. కేజ్రీవాల్‌కు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే, భగవంత్‌మాన్ దగ్గరుండి స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ఆదిత్య ఠాక్రే ట్విటర్లో షేర్చేశారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి టీ తాగూందేరేమాతోశ్రీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఉద్దవ్ మాట్లాడుతూ.. దేశాన్ని బలోపేతం చేసే మార్గాలపై నేతలంతా చర్చించినట్లు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని నిర్ణయించున్నట్లు పేర్కొన్నారు. మూడేళ్లుగా ఉద్ధవ్‌ను కలవాలనుకుంటున్నా కోవిడ్ తదితర కారణాల వల్ల కలవలేకపోయానని కేజ్రీవాల్ చెప్పారు. శివసేన పార్టీ పేరును, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం లాక్కుందని విమర్శించారు. ఠాక్రేకు మద్దతిస్తూ.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఉద్ధవ్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఉద్ధవ్‌తో ఆప్ అధినేత సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి జోష్‌లో ఉన్న ఆప్.. బీఎంసీ ఎన్నికలపై సైతం దృష్టి పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ ఎన్నికల్లో ఆప్, ఉద్దవ్ శివసేన రెండూ కలిసి పోటీ చేసే అవకాశమూ లేకపోలేదు. అయితే ప్రస్తుతానికి దీనిపై స్పష్టత రాలేదు. ఇదే విషయంపై కేజ్రీవాలన్‌ను ప్రశ్నించగా.. ఎన్నికలు వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని అన్నారు. కాగా ఇటీవలే సీఎం ఏక్నాథ్ షిండే వర్గాన్నే అసలైన శివసేనగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ గుర్తు విల్లు బాణాన్ని సైతం షిండే వర్గానికే కేటాయించింది. ఇది జరిగిన వారం రోజుల్లోనే కేజ్రీవాల్, ఉద్దవ్‌ను కలవడం విశేషం. వీరి భేటీ బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. Thank you CM @ArvindKejriwal ji for accepting our humble invite for a cup of tea at Matoshri and coming along with CM @BhagwantMann ji and MPs Sanjay Singh ji and @raghav_chadha today. pic.twitter.com/HOhYAqfyul — Aaditya Thackeray (@AUThackeray) February 24, 2023 -
ప్రచారం చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు: శివసేన నాయకుడు
ముంబై: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన నాయకుడు సచిన్ భోంస్లేపై దాడి జరిగింది. ఈ ఘటన పూణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. భోంస్లే తెలిపిన వివరాల ప్రకారం..‘ఉప ఎన్నికల కోసం చించ్వాడ్ ప్రాంతంలో ఎన్సీపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నాం. అంతలో బీజేపీ కార్యకర్తలు నేరుగా వచ్చి మమ్మల్ని కొట్టారు. వారితో నాకు వ్యక్తిగత వాదనలు లేవు. గతంలో బీజేపీ అభ్యర్థి నాపై పోటి చేశారు. వీళ్లు ఆయన కార్యకర్తలే’ అని చెప్పారు. ఈ క్రమంలో భోంస్లే సహా ఎన్సీపీ కార్యకర్తలపై వారు దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో భోంస్లే చేతికి గాయం కాగా, ఎన్సీపీ కార్యకర్త గోరఖ్ పాశంకర్ కాలు విరిగిందని చెప్పారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపి సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్తా తిలక్ గత ఏడాది డిసెంబర్ 22న మరణించగా, చించ్వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ దీర్ఘకాలిక అనారోగ్యంతో జనవరి 3న కన్నుమూశారు. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఎన్సీపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపి నేత అజిత్ పవార్, శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే సహా అన్ని పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కస్బా పేట, చించ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. చదవండి అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం -
శివసేన వివాదం: షిండే వర్గానికి సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే(ప్రస్తుత మహరాష్ట్ర ముఖ్యమంత్రి) వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బుధవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. థాక్రే వర్గానికి ఊరట ఇవ్వలేదు దేశ అత్యున్నత న్యాయస్థానం. కానీ, థాక్రే వర్గ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలంటూ షిండే క్యాంప్‌కు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇక పార్టీ పేరు, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని థాక్రే వర్గం సుప్రీంను అభ్యర్థించగా.. అందుకు మాత్రం నిరాకరించింది సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. వాళ్లు(షిండే శిబిరం) ఈసీ వద్ద విజయం సాధించారు. ఈ తరుణంలో స్టే విధించలేమంటూ బెంచ్ స్పష్టం చేసింది. అలాగే.. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక.. చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు థాక్రే శిబిరానికి సూచించింది. శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ థాక్రే పేరుతో పార్టీ పేరును.. వెలుగుతున్న టార్చ్ సింబల్‌ను గుర్తుగా ఉపయోగించుకోవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా పిటిషనర్‌కు సూచించారు. ఆపై పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు. -
ఎన్నికల్లో నిలబడ్డా ఈ పార్టీలు కక్షగట్టి ఓడిస్తాయ్ సార్!
ఎన్నికల్లో నిలబడ్డా ఈ పార్టీలు కక్షగట్టి ఓడిస్తాయ్ సార్! -
ఇంతకూ శివసేన ఆస్తులు ఎవరివో!? లెక్క తేలుతుందో?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఆగర్భ శత్రువుల్లాంటి పాపార్టీ లతో జట్టుకట్టిన ఉద్ధవ్ ఠాక్రే, అందుకు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. అదను చూసి సొంత పార్టీ నేత ఏక్నాథ్ షిండే చేసిన తిరుగుబాటుతో అటు అధికారమూ కోల్పోయారు. షిండే వర్గానిదేనన్న సిసలైన శివసేన అన్న ఈసీ తాజా నిర్ణయంతో ఇటు తన తండ్రి స్థాపించి, వారసత్వంగా తనకప్పగించి వెళ్లిన పార్టీ కే పరాయి వాడిగా మిగిలిపోయారు! ఇప్పుడిక శివసేన కార్యాలయం, ఆస్తులు, నిధులు తదితరాలన్నీ కూడా షిండే వర్గం పరమవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది... – సాక్షి, నేషనల్ డెస్క్ శివసేన పేరు, పార్టీ గుర్తు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతాయన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఉద్ధవ్‌కు భారీ ఎదురుదెబ్బే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుమారునిగా ఆయనకు ఇంతటి దుస్థితి కొంతకాలం క్రితం ఎవరూ ఊహించనిదే! చివరి ప్రయత్నంగా ఈసీ తీర్పుపై ఉద్ధవ్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కోర్టు తీర్పుపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. కానీ ఈలోపు పార్టీని పూర్తిగా చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలకు షిండే వర్గం పదును పెడుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని సోమవారమే స్వాదీనం చేసుకుంది. తాజాగా పార్లమెంటులోని శివసేన కార్యాలయాన్ని కూడా షిండే వర్గానికే కేటాయిస్తున్నట్టు లోక్‌సభ సచివాలయం మంగళవారం పేర్కొంది. ఇదే ఊపులో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం, ముంబైతో పాటు మహారాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర ఆస్తులు, సొంత పత్రిక సామ్నాతో పాటు పార్టీ నిధులను కూడా సొంతం చేసుకుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ వర్గం అదీనంలో ఉన్న పార్టీ ఆస్తుల అప్పగింత కోరబోమని షిండే గతంలో చెప్పినా దానికిప్పుడు కట్టుబడబోరని పరిశీలకులు అంటున్నారు. ‘‘ఇలాంటి ఆస్తుల తాయిలాలకు లొంగినవారే 2019లో అధికార లాలసతో తప్పటడుగు వేశారు. ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఆగర్భ శత్రువులైన పార్టీలతో జట్టుకట్టారు. అందుకే ఆస్తులు, పార్టీ నిధులపై మాకెలాంటి ఆశా లేదు. కేవలం బాల్‌ఠాక్రే ఆదర్శాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా ఏకైక లక్ష్యం’’ అని అప్పట్లో షిండే పదేపదే చెప్పుకొచ్చారు. అయితే, ‘‘మా తిరుగుబాటులో న్యాయముందని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడమే మా నాయకుని వ్యాఖ్యల అంతరార్థం. అంతే తప్ప న్యాయంగా మాకు దక్కాల్సిన వాటిని వదులుకునే ప్రశ్నే లేదు’’ అని షిండే వర్గం కుండబద్దలు కొడుతోంది. శివసేనపై సర్వం సహా హక్కులు తమవేనని రుజువు చేసుకోవడం కోసమైనా భవనాలు, ఆస్తులు తదితరాలన్నింటినీ వీలైనంత త్వరగా తమపరం చేసుకోవడమే సరైందని ఆయన వర్గం గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ నిధుల మాటేమిటి? గ్రాంట్లు, విరాళాలు, చందాలు, పత్రిక విక్రయాలు తదితరాల రూపేణ శివసేనకు 2020–21లో రూ.13 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్టు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికను బట్టి తెలుస్తోంది. ఇవి తమకే చెందుతాయని షిండే వర్గం కోరవచ్చు. దీన్ని ఊహించే ఈ నిధులను ఉద్ధవ్ ఇప్పటికే వేరే ఖాతాలకు మళ్లించినట్టు చెబుతున్నారు. దీనిపైనా కీచులాట తప్పకపోవచ్చు. అనుబంధ సంఘాలు ఇక శివసేన అనుబంధ సంఘాలైన స్థానీయ లోకాధికార్ సమితి, భారతీయ కామ్‌గార్ సేన వంటివి సంఘాలు, విభాగాలుగానే పరిగణనలోకి వస్తాయే తప్ప పార్టీగా కాదు. కనుక వీటి యాజమాన్యం ఎవరిదన్నది కేంద్ర కారి్మక చట్టాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందని శివసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సేన ప్రాంతీయ కార్యాలయాలు శివసేనకు ఆయువుపట్లుగా భావించే పార్టీ ప్రాంతీయ కార్యాలయాలు (శాఖలు) ముంబై, పరిసర ప్రాంతాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా స్వా«దీనం చేసుకునే దిశగా షిండే వర్గం పావులు కదుపుతోంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు శాఖలను శివాయ్ సేవా ట్రస్ట్‌కు బదలాయించాలని ఉద్ధవ్ వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా, ముంబై వెలుపల ఉన్న శాఖలు చాలావరకు ఆయా శాఖా ప్రముఖ్‌లు (స్థానిక మండళ్లు), ట్రస్టుల పేరిటే ఉన్నాయని ఉద్ధవ్ వర్గం ఇప్పటికే గట్టిగా వాదిస్తోంది. అవి తమకే చెందాలని షిండే వర్గం గానీ, మరెవరు గానీ కోరడానికి అవకాశం లేదని ఉద్ధవ్ సేన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ చెబుతున్నారు. ఈ లెక్కన ప్రాంతీయ కార్యాలయాల విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య సంఘర్షణ తప్పేలా కన్పించడం లేదు. శివసేన భవన్ శివసేన ప్రధాన కార్యాలయం. ముంబైలో ఉంది. షిండే వర్గమే అధికారిక శివసేనగా రుజువైతే ఈ భవనం వారికే సొంతం కావాలి. కానీ అది శివసేన ట్రస్టు యాజమాన్యంలో ఉండటం అడ్డంకిగా మారేలా కని పిస్తోంది. పైగా దీని సారథి సుభాష్ దేశాయ్ ఠాక్రేల కుటుంబానికి విధేయుడు. అంతేగాక ఉద్ధవ్, దేశాయ్‌తో పాటు ట్రస్టీలుగా ఉన్న మిగతా నలుగురూ ఉద్ధవ్ అనుయాయులే! అంతమాత్రాన శివసేన భవన్ ఉద్ధవ్ వర్గం చెప్పుచేతుల్లోనే ఉంటుందని కూడా చెప్పలేని పరిస్థితి! ఎందుకంటే ట్రస్టు ఆస్తిగా ఉన్న భవనాన్ని దశాబ్దాల పాటుగా రాజకీయ పార్టీ కార్యాలయంగా వాడుకోవడం మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్టుల చట్టం నిబంధనలకు విరుద్ధం. అధికారంలో ఉన్న షిండే వర్గం ఈ కోణం నుంచి నరుక్కొస్తే భవన వివాదంపై పీటముడి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిపై ఓ న్యాయవాది ఇప్పటికే కోర్టుకెక్కారు కూడా. ఆ కేసులో ఉద్ధవ్ వర్గం వాదనలు విని పించాల్సి ఉంది. సామ్నా ఎవరికో? శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్థాపించిన సామ్నా అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లోనే గాక దేశవ్యాప్తంగా కూడా సంచలనమే. ముఖ్యంగా తీవ్ర పదజాలంతో బాల్ ఠాక్రే రాసే సంపాదకీయాలు, విమర్శనాత్మక కథనాలు, మరీ ముఖ్యంగా వ్యంగ్య కార్టూన్లు జాతీయ స్థాయిలో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారేవి. దానితో పాటు కార్టూన్ మేగజైన్ మార్మిక్ ను కూడా శివసేన వెలువరిస్తోంది. ఈ పత్రికలు, వాటి కార్యాలయాల యాజమాన్యం షిండే వర్గం చేతికి రావడం కష్టంగానే కని పిస్తోంది. ఎందుకంటే అవి కూడా పార్టీ అజమాయిషిలో కాకుండా ప్రబోధన్ ప్రకాశన్ అనే ట్రస్టు యాజమాన్యంలో కొనసాగుతున్నాయి. -
ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి: ఉద్ధవ్
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘శివసేన పేరు, విల్లు, బాణం గుర్తును మా వద్ద నుంచి దొంగిలించారు. కానీ, థాకరే పేరును మాత్రం దొంగిలించలేరు’ అని సోమవారం మీడియాతో అన్నారు. ఈసీ అంత హడావుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై తాము వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో బహుశా మంగళవారం విచారణకు రావొచ్చని అన్నారు. ‘‘ఎన్నికల సంఘం ఉత్తర్వులు తప్పు. సుప్రీంకోర్టే మా చివరి ఆశా కిరణం’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‘నేడు మాకు జరిగినట్లే రేపు మరొకరికి జరగొచ్చు. ఇలాగే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలూ ఉండవు’ అని హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల నేపథ్యంలో మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్, తదితర విపక్ష నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారన్నారు. సుప్రీం తలుపుతట్టిన ఉద్ధవ్ వర్గం షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ, విల్లు, బాణం ఎన్నికల గుర్తు కేటాయించడాన్ని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తిరస్కరించింది. ‘‘నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రండి’’ అని సీజేఐ సూచించారు. -
అమిత్ షాపై విమర్శ.. బీజేపీ కౌంటర్
ముంబై: ఎన్నికల సంఘం నిర్ణయంతో శివసేన పార్టీ పేరు, గుర్తు చేజారిపోయిన క్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తీవ్ర విమర్శలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి.. తీవ్ర విమర్శలు చేశారాయన. అలాగే.. మొగాంబో ఖుష్ హువా, అమిత్ షాపై థాక్రే చేసిన కామెంట్ రాజకీయ దుమారం రేపింది. మొగాంబో అనేది ఎయిటీస్‌లో(1987) వచ్చిన మిస్టర్ ఇండియా చిత్రంలోని విలన్ క్యారెక్టర్. శేఖర్‌కపూర్ డైరెక్షన్లో అనిల్‌కపూర్-శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రం.. క్లాసిక్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విలన్ మొగాంబో పాత్రను అమ్రిష్ పురి అత్యద్భుతంగా పండించారు. ఆ విలన్‌ను క్యారెక్టర్‌ను.. అమిత్ షాకు ఆపాదించడంతో బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. అమిత్ షా మొగాంబో అయితే.. ఉద్దవ్ థాక్రే మాత్రం మిస్టర్ ఇండియా హీరో రోల్ అంటూ సెటైర్లు వేశారు ముంబై బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ఖాల్కర్. ఉద్దవ్ థాక్రే బీజేపీ అధినాయకత్వాన్ని మొగాంబోతో పోలుస్తున్నారు. ఇలాంటి మూర్ఖపు కామెంట్ల నడుమ ఆయనకు అర్థంకాని విషయం ఒకటి ఉంది. ఆయన తనకు తెలియకుండానే మిస్టర్ ఇండియా(వాచీ పెట్టకుని మాయమైపోయే హీరో క్యారెక్టర్) లాగా మాయమైపోతున్నాడు. మహారాష్ట్ర రాజకీయాల నుంచి ఉద్దవ్ థాక్రే దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితికి చేరుకున్నారు. ఇక మీరు ఇంట్లోనే ఉండాల్సిన టైమొచ్చింది అని ఉద్దవ్ థాక్రేను ఉద్దేశించి అతుల్ సెటైర్లు సంధించారు. -
ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి: థాక్రే
ముంబై: శివసేన విషయంలో.. సుప్రీం కోర్టు తమకున్న చివరి ఆశాకిరణమని పేర్కొన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పేర్కొన్నారు. షిండే(ప్రస్తుత ముఖ్యమంత్రి) వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును ఎన్నికల సంఘం.. కేటాయించడం తెలిసిందే. ఈ పరిణామంపై ఇవాళ(సోమవారం) సుప్రీం కోర్టును ఆశ్రయించింది థాక్రే వర్గం. ఆపై ఉద్దేవ్ థాక్రే మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ పేరు, గుర్తు నేరుగా ఒక వర్గానికి కేటాయించిన సందర్భం గతంలో ఏనాడూ లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారాయన. ములాయం సింగ్ ఏనాడూ కోర్టుకు వెళ్లలేదు. అందుకే సమాజ్‌వాదీ పార్టీ నేరుగా అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్లింది. మరి అలాంటప్పుడు ఎన్నిక సంఘం ఎందుకు అంత ఆదరా బాదరాగా పార్టీ పేరును, గుర్తును షిండే వర్గానికి కేటాయించింది. అసలు ఎన్నికల సంఘానికి కేవలం గుర్తుల నియంత్రణ మాత్రమే ఉంటుందన్న విషయాన్ని గుర్తుచేశారాయన. అలాగే దేశంలో ఎన్నికల కమిషన్‌ను రద్దు చేయాలని, ఎన్నికల కమిషనర్లను ప్రజలే ఎన్నుకోవాలని ఉద్ధవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఇక ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎన్నికల సంఘం వేచి ఉండాల్సిందని థాక్రే పేర్కొన్నారు. ఇవాళ మీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు? నా దగ్గర ఏమీ లేకుండా పోయింది. ప్రతీది నా నుంచి దోచుకున్నారు. అయినా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని నేను అడగాలనుకుంటున్నాను. మరో వర్గం మా పార్టీ పేరు, గుర్తు తీసేసుకున్నప్పటికీ.. థాక్రే అనే మా పేరును మాత్రం లాక్కోలేరు. బాలాసాహెబ్ థాక్రే(బాల్ థాక్రే) కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. ఢిల్లీ సహాయంతో కూడా వాళ్లు దానిని పొందలేరు అని తీవ్ర అసంతృప్తిగా వ్యక్తం చేశారాయన. ప్రజాస్వామ్యిక సంస్థల సాయంతోనే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని థాక్రే ఆవేశపూరితంగా మాట్లాడారు. ఇవాళ బీజేపీ మనకు ఏదైతే చేసిందో.. ఎవరితోనైనా చేయగలదు. ఇది ఇలాగే కొనసాగితే.. 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు అనేవి కనిపించవు. నేనెప్పుడూ హిందుత్వాన్ని విడిచిపెట్టలేదు, హిందువులెవరైనా ఇప్పుడు మాట్లాడాలి అని పేర్కొన్నారాయన. -
శివసేనను షిండేకు ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టను ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోకుండానే ఈసీ నిర్ణయం తీసుకుందని, శివసేన మెజారిటీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను వీలనైంత త్వరగా విచారించాలని థాక్రే తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ అత్యున్నత స్థానాన్ని అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం మాత్రం ఈ పిటిషన్ ఇవాల్టి లిస్టింగ్‌లో లేదని మంగళవారం సరైన ప్రక్రియతో రావాలని సూచించింది. అయితే సీఎం ఏక్నాథ్ షిండే కూడా సుప్రీంకోర్టును ముందుగానే ఆశ్రయించారు. శివసేన గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని థాక్రే సవాల్ చేయవచ్చని, దీనిపై ఆదేశాలు ఇచ్చే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయన్ని తీసుకోవాలని కోరారు. చదవండి: శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్: సంజయ్ రౌత్ -
ఈసీ, మోదీపై ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..
ముంబై: మహారాష్ట్రలో మరోసారి రాజకీయం హీటెక్కింది. శివసేన అధికారిక విల్లు బాణం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం.. షిండే వర్గానికే ఇవ్వడంతో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ‘విల్లుబాణం’ను చోరీచేశారంటూ మహా సీఎం షిండేను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. వివరాల ప్రకారం.. ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద మద్దతుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. కొందరి పక్షాన మద్దతుగా నిలుస్తోంది. ఎన్నికల సంఘం ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా పనిచేస్తోంది. అయినా మనం చింతిచాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టండి రానున్న రోజులున్నీ మనవే. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో షిండే వర్గంపై నిప్పులు చెరిగారు. శివసేన గుర్తు విల్లు-బాణం’ను చోరీ చేశారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము దీన్ని మండే కాగడాతో ఎదుర్కొంటాము అని కామెంట్స్ చేశారు. ఇక, ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తున్న సందర్బంగా మద్దతుదారులు మాతోశ్రీ వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. ఏక్నాథ్ షిండే వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి కాగడా ఎన్నికల గుర్తుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఎన్నికల సంఘం.. ఈ గుర్తును కేటాయించింది. కాగా, పుణే జిల్లాలోని కస్బాపేట్, చించ్వాడ్ ఉప ఎన్నికల వరకు ఉద్ధవ్ వర్గానికి ఈ కాగడా గుర్తు ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 26వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు.. విల్లుబాణం గుర్తును తమకు కేటాయించడంపై సీఎం షిండే స్పందించారు. ఇది.. ప్రజాస్వామ్య విజయం అంటూ కామెంట్స్ చేశారు. ఉద్ధవ్ థాక్రే ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. -
షిండే వర్గమే సిసలైన శివసేన: ఈసీ
ముంబై: మహారాష్ట్ర రాజకీయంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే వర్గానికే సిసలైన శివసేన గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అంతేకాదు పార్టీ విల్లు బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్రలో ఎనిమిది నెలల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. బాల్ థాక్రే తనయుడు ఉద్దవ్ థాక్రేకు షాక్ ఇస్తూ.. శివసేన పార్టీ గుర్తింపును ఏక్నాథ్ షిండే(ప్రస్తుత మహారాష్ట్ర సీఎం) వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. మహా వికాస్ అఘాడి కూటమి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతరులు)ని వ్యతిరేకిస్తూ.. గత జూన్ నెలలో కొందరు ఎమ్మెల్యేలతో శివసేన నుంచి బయటకు వచ్చేశారు ఏక్నాథ్ షిండే. ఆపై బీజేపీ సాయంతో రెబల్స్‌ను పలు ప్రాంతాలకు తిప్పుతూ.. చివరకు బీజేపీ సాయంతోనే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా షిండే, డిప్యూటీగా బీజేపీ నేత.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ తరుణంలో థాక్రే వర్గం, షిండే వర్గం సిసలైన శివసేన గుర్తింపు కోసం న్యాయ పోరాటానికి దిగాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం.. శివసేనపార్టీ పేరును, పార్టీ గుర్తైన విల్లు బాణంను పక్కనపెట్టి మరీ ఇరు వర్గాలకు ప్రత్యేక పేర్లు, గుర్తులను కేటాయించాలి. అయితే ఈసీ నిర్ణయంపై థాక్రే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. కిందటి నెలలో.. ఇరు వర్గాలు సిసలైన శివసేన అంటూ తమ తమ వాదనలతో కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట రాతపూర్వక ప్రకటనలు సమర్పించారు. ఈ తరుణంలో పోలింగ్ విభాగం ఇవాళ షిండే వర్గానికి శివసేన పార్టీ గుర్తును, సింబల్‌ను కేటాయించి.. థాక్రే వర్గానికి భారీ షాక్ ఇచ్చింది. -
అవిశ్వాసం పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయాధికారం లేదంటూ సుప్రీం తీర్పు
-
‘మహారాష్ట్ర’ సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలికలు ఏర్పడిన అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు తన తీర్పుని రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులున్న ధర్మాసనం శివసేనలో చీలిక, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకి సంబంధించిన పిటిషన్‌ను గురువారం విచారించింది. ‘ ఠాక్రే, షిండే చీలికవర్గం తరఫు లాయర్ల వాదనలన్నింటినీ విన్నాం. 2016 నబమ్ రెబియా తీర్పుని పునఃపరిశీలించాలా? దానిని ఏడుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలా?’ అనే విషయంపై తీర్పు రిజర్వ్ చేస్తున్నాం అని తెలిపింది. ఏమిటీ నబమ్ రెబియా తీర్పు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కున్న అధికారాలపై అరుణాచల్ ప్రదేశ్‌లోని నబమ్ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు. అరుణాచల్ ప్రదేశ్‌లో అప్పట్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన సీఎం నబమ్ టుకీయేని గద్దె దించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో అసమ్మతి నాయకుడు కలిఖో ఫుల్ తిరుగుబాటు చేశారు. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్ రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. దీనిపై కాంగ్రెస్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఉండదని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పుని అనుసరించి సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ఊరట లభిస్తుంది. మహారాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, థాక్రే విధేయుడు నరహరి సీతారామ్ జిర్వాల్‌ను తొలగిస్తూ షిండే వర్గం ఇచ్చిన నోటీసు సభలో పెండింగ్‌లోనే ఉంది. చదవండి: ఆదివాసీల అభ్యున్నతికి ప్రాధాన్యం.. -
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పొత్తు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ(సోమవారం) కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఊహించని పొత్తుతో సంచలనానికి తెర తీసింది ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన. అంబేద్కర్ మనవడి పార్టీతో పొత్తు ద్వారా ముంబై స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ నేతృత్వంలోని ‘వంచిత్ బహుజన్ అగాధి’(VBA)తో పొత్తుకు థాక్రే రెడీ అయ్యారు. 2018లో ఆయన ఈ పార్టీని నెలకొల్పారు. ఈ తరుణంలో థాక్రే వర్గం, వీబీఐతో ముంబై మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొత్తు కోసం రెండు నెలలుగా ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అంతేకాదు నవంబర్‌లో బాల్ థాక్రే తండ్రి ప్రబోధంకర్ థాక్రే పేరు మీద ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించగా.. ఆ కార్యక్రమంలో థాక్రే-అంబేద్కర్లు ఒకే వేదికను పంచుకున్నారు. ‘‘ఇవాళ జనవరి 23. బాలాసాహెచ్ థాక్రే(బాల్ థాక్రే) జయంతి కూడా. రాష్ట్రంలో చాలామంది ఇదే కోరుకుంటున్నారు(పొత్తును ఉద్దేశించి..). ప్రకాశ్ అంబేద్కర్, నేను ఇవాళ జట్టుగా ముందుకు వెళ్లేందుకు కలిశాం అని ఉద్దవ్ థాక్రే ప్రకటించారు. మా తాత, ప్రకాశ్ అంబేద్కర్ తాత ఇద్దరూ సహచరులు. సామాజిక అంశాలపై కలిసి పోరాడారు. ఇప్పుడు వాళ్ల వారసులమైన మేం సమకాలీన అంశాలపై పోరాడేందుకు ఇక్కడ ఒక్కటయ్యాం అని థాక్రే పేర్కొన్నారు. ఇక ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కొత్తదనం మొదలైందని పేర్కొన్నారు. గెలుస్తామో లేదో అనేది ఓటర్ల చేతిలో ఉంది. కానీ, సామాజికాంశాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నవాళ్లకు సీట్లు ఇవ్వడం రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంటుంది. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి మేం ఇద్దరమే. కాంగ్రెస్ ఇంకా పొత్తుపై ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఎన్సీపీ శరద్ పవార్ పొత్తుపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం అని అంబేద్కర్ తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం చెదిరిపోయి.. శివసేనలోని ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు, ఆపై బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత మహారాష్ట్రలో జరుగుతున్న ప్రధాన ఎన్నిక బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే కావడం గమనార్హం. -
'ఆ విషయం తెలిస్తే రౌత్‌ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు'
ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ గురించి తనకు తెలిసిన రహస్యాలు చెబితే ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి.. రౌత్‌ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉద్ధవ్‌ను కలిసి రౌత్ తనతో చెప్పిన విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అప్పుడు రౌత్ నిజస్వరూపం ఆయనకు తెలుస్తుందన్నారు. 'నేను రాజ్యసభ సభ్యుడినయ్యాక.. సంజయ్ రౌత్ నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చునేవారు. ఉద్ధవ్, ఆయన భార్య రష్మి గురించి నాతో చెప్పేవారు. ఆ రహస్యాలు ఎంటో ఉద్ధవ్, రష్మికి చెబితే వారు రౌత్‌ను చెప్పుతో కొడతారు' అని నారయణ్ రాణె చెప్పారు. శివసేనను ఖతం చేసేందుకు రౌత్ సుపారీ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాణె. శివసేన స్థాపించిన 1969 నుంచి తాను పార్టీ కోసం పనిచేసినట్లు వివరించారు. సంజయ్ రౌత్ వల్లే శివసేన(ఉద్ధవ్) ఎమ్మెల్యేల సంఖ్య 56 నుంచి 12కు పతనమైందని విమర్శించారు. నారాయణ రాణె కేంద్రమంత్రి హోదాలో కాకుండా సాధారణ వ్యక్తిలా వచ్చి తనను కలవాలని రౌత్ శుక్రవారం సవాల్ చేశారు. ఆ మరునాడే రాణె తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, రౌత్ ఎక్కిడికి రమ్మంటే అక్కడకు వెళ్లి కలిసేందుకు సిద్దమని సవాల్‌ను స్వీకరించారు. చదవండి: మోదీ హయాంలో రెండు రకాల భారత్‌లు -
‘50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది మరిచారా?’
ముంబై: శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మీ ఇద్దరిని చూసి బీజేపీ భయపడదన్నారు. 32 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో శుక్రవారం మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. ‘కనీసం అతడి తండ్రిని చూసి కూడా ఇక్కడ ఎవరూ భయపడరు. మీ పార్టీ నుంచి అంతా చూస్తుండగానే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముంబయి అట్టుడుకుతుందని, కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు.’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ వేదికగా.. శ్రీ సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో అవకతవకలపై విచారణను నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: 'నన్నెవరు కొట్టలేదు.. అదో పెద్ద స్కామ్': నటి ఆవేదన -
కేంద్రం చేతిలోనే కేవోఎం సమస్యకు పరిష్కారం
నాగ్‌పూర్: దాదాపు అరవై ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న సరిహద్దు సమస్యకు పుల్‌స్టాప్ పడాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్దవ్ థాక్రే కోరుతున్నారు. కర్ణాటక ఆక్రమిత మహారాష్ట్ర(Karnataka Occupied Maharashtra)ను.. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం సరిహద్దు, భాషలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. మానవత్వానికి సంబంధించింది. మరాఠా మాట్లాడే ప్రజలు సరిహద్దు గ్రామాల్లో తరతరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ల దైనందిన జీవితం మరాఠీతో ముడిపడి ఉంది. సుప్రీం కోర్టులోనూ ఈ అంశం పెండింగ్‌లో ఉంది. అంతకంటేముందే కేంద్రం ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. కేంద్రం చేతుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం ఉంది అని అసెంబ్లీ సాక్షిగా ఉద్దవ్ థాక్రే కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాలకు సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన కేంద్రం ఈ విషయంలో ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఈ క్రమంలో.. కర్ణాటక ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం షిండే ఈ వ్యవహారంలో ఒక్క మాటైనా మాట్లాడాలని నిలదీశారు. బెలగావి మున్సిపల్ కార్పొరేషన్ మహారాష్ట్రలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఆమోదించినప్పుడు, కార్పొరేషన్‌పై చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా థాక్రే గుర్తు చేశారు. అదే విధంగా మహారాష్ట్రలోని కొన్ని గ్రామ పంచాయతీలు తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశాయి. ఈ గ్రామ పంచాయతీలపై చర్యలు తీసుకునే ధైర్యం షిండే ప్రభుత్వానికి లేదా? అని థాక్రే ప్రశ్నించారు. థాక్రే ప్రసంగించిన సమయంలో.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విజిటర్స్ హాల్ నుంచి వీక్షించడం గమనార్హం. ఈ సరిహద్దు సమస్య ఈనాటిది కాదు. భాషా పరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత(1957) నుంచి నడుస్తోంది. మరాఠీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉండడంతో.. మునుపటి బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెలగావి తమకే చెందుతుందని మహారాష్ట్ర వాదిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన 800 కంటే ఎక్కువ మరాఠీ మాట్లాడే గ్రామాలు తమకే సొంతమని అంటోంది. ఇక కర్ణాటక మాత్రం.. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా, 1967 మహాజన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతోంది. -
మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ
ముంబై: ఏక్నాథ్ షిండే– బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రపాలనను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ (మహా వికాస్ అఘాడీ–ఎంవీఏ) కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఛత్రపతి శివాజీ మహరాజ్, మహా త్మా ఫూలే వంటి మహనీయులను మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ అవమానించడాన్ని ఎంవీఏ కూటమి తీవ్రంగా తప్పబట్టింది. కోష్యారీని గవర్నర్ పదవి నుంచి వెంటనే తప్పించాలని కూటమి అగ్రనేతలు డిమాండ్చే శారు. ముంబైలోని బైకుల్లాలో ప్రారంభమైన ‘హల్లా బోల్’ నిరసన ర్యాలీ.. నాలుగు కిలో మీటర్లు కొనసాగి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ వద్దకు చేరుకున్నాక ఉద్ధవ్ ఠాక్రేసహా కూటమి నేతలు ర్యాలీ వేదికపై ప్రసంగించారు. ‘ గవర్నర్‌ను పదవి నుంచి వెంటనే తప్పించాలి. లేదంటే మీకు గుణపాఠం నేర్పిస్తాం’ అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరించారు. -
ఉద్ధవ్‌పై కేసు.. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని గురువారం బాంబే హైకోర్టుకు ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలంటూ బాంబే హైకోర్టులో మహిళా పబ్లిషర్ గౌరి బిధే వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. చదవండి: (కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు) -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల వివాదం... తగ్గేదేలే! అంటున్న శివసేన
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్ అన్నారు. ఇది కేవలం సావర్కర్ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్‌తో కొనసాగుతాం, రాహుల్ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు. అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ తనని ఫోన్లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్ రౌత్ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉన్న సావర్కర్ బ్రిటీష్ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్ లాల్ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు కూడా బ్రిటీష్పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్ అవమానించినట్లేనని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఏదీఏమైనా రాహుల్ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
శివాజీపై తీవ్ర వ్యాఖ్యలు.. సీఎం షిండే వర్గంలో చిచ్చుపెట్టిన గవర్నర్!
మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి. గవర్నర్ వ్యాఖ్యలను ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఆయన వర్గానికే చెందిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైక్వాడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కోష్యారీ గతంలో కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్.. ప్రపంచలోని మరే ఇతర వ్యక్తితోనూ పోల్చలేరని అన్నారు. మహారాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి, సీనియర్ నేతలకు ఇక్కడి చరిత్ర తెలిసినట్టు లేదని చురకలు అంటించారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. Shiv Sena MLA Sanjay Gaikwad of Chief Minister Eknath Shinde's faction on Monday demanded that Maharashtra Governor Bhagat Singh Koshyari be shifted out of the state for his recent remarks about Chhatrapati Shivaji Maharaj.https://t.co/bvMkSHjnQS — Economic Times (@EconomicTimes) November 21, 2022 ఇక, అంతకుముందు.. గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. గవర్నర్‌ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ వెంటనే రాజీనాయాలన్నారు. ఈ ఏడాది వ్యవధిలో గవర్నర్ కోష్యారీ నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. అయితే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. శివాజీ మహారాజ్ పాత విగ్రహం అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెనుదుమారం రేపాయి. -
ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్నాథ్ షిండ్‌పై విమర్శలు
ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్‌ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ భగత్ సింగ్ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా శివాజీ మహారాజ్ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్‌ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్‌ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్ వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్ చేసిన పనికి రాజ్‌భన్‌పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత..
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. శివసేన కార్యకర్తలు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్యాణ్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగానే ఈ కార్యాలయన్ని తొలగించినట్లు కల్యాణ్ డాంబివిల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఓ ఆటస్థలానికి కేటాయించిన స్థలంలో శివసేన కార్యాలయం ఉందని, అందుకే కూల్చివేశామని చెప్పారు. ఈ ఆఫీస్‌తో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. ఉద్ధవ్ శివసేన వర్గం మాత్రం రాజకీయ ప్రతీకారంతోనే తమ కార్యాలయాన్ని కూల్చివేశారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. గత 17 ఏళ్లుగా ఈ కార్యాలయం ఉందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు చెప్పడమేంటని ప్రశ్నించారు. చదవండి: సౌరాష్ట్ర ఎవరికి సై? -
రాహుల్ వ్యాఖ్యలపై రగడ.. మహా వికాస్ అగాడీకి బీటలు?
ముంబై: వీర సావర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శలు మహారాష్ట్రలో రాజకీయ కాక రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గురువారం సావర్కర్‌పై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఆయన బ్రిటిష్ వారికి భయపడి క్షమాభిక్ష కోరారని, గాంధీ, పటేల్, నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు ద్రోహం చేశారని ఆరోపణలు గుప్పించారు. వీటిపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అగాడీ నుంచి బయటికి వచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాహుల్ వ్యాఖ్యలను ఉద్ధవ్ ఠాక్రే వెంటనే ఖండించడం తెలిసిందే. మహారాష్ట్రులకు ఆరాధ్యుడైన సావర్కర్ వ్యతిరేక వ్యాఖ్యలను తాము సహించే ప్రసక్తే లేదని ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత అరవింద్ సావంత్ కుండబద్దలు కొట్టారు. ఇటీవలే రాహుల్‌తో కలిసి జోడో యాత్రలో నడిచిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తాజాగా అదే మాట చెప్పారు. రాహుల్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఉద్ధవ్ వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా శనివారం అభిప్రాయపడ్డారు. అవి అగాడీ కూటమి మనుగడపై ప్రభావం చూపుతాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ కాకను మరింత పెంచేలా సావర్కర్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే శనివారం మరిన్ని విమర్శలు గుప్పించారు! బ్రిటిష్ వారి నుంచి సావర్కర్ రూ.60 పెన్షన్ తీసుకున్నారంటూ మరోసారి వివాదాల తేనెతుట్టెను కదిపారు. రాహుల్ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు ముందుగా దీనికి బదులివ్వాలన్నారు. మరోవైపు ఉద్ధవ్‌కు సావర్కర్‌పై ఏ మాత్రం గౌరవమున్నా కాంగ్రెస్‌కు తక్షణం గుడ్‌బై చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దన్వే శనివారం డిమాండ్ చేశారు. ఆ ఉద్దేశముందో లేదో చెప్పాలని సవాలు చేశారు. -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్‌ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్‌రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు. సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్‌తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్‌ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది. చదవండి: 'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు -
Maharashtra: ఠాక్రే వర్గానికి మరో భారీ షాక్..
సాక్షి, ముంబై: విధాన్ పరిషత్‌లో ప్రతిపక్ష నేత అంబాదాస్ దానవేకు అత్యంత సన్నిహితుడు, ఉద్ధవ్ ఠాక్రేకు నమ్మకమైన కార్యకర్త విశ్వనాథ్ రాజ్‌పుత్ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంలో చేరారు. శిందే వర్గంలో చేరిన వారిలో ఔరంగాబాద్‌కు చెందిన విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్, ఉద్ధవ్ వర్గానికి చెందిన పలువురు సీనియర్ పదాధికారులు, కార్యకర్తలు ఉన్నారు. వీరందరికీ గురువారం ముంబైలో శిందే స్వాగతం పలికారు. కాగా విశ్వనాథ్ చేరికతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టిదెబ్బ తగిలినట్లైంది. త్వరలో ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కీలక కార్యకర్తగా పేరున్న విశ్వనాథ్ ఆకస్మాత్తుగా శిందే వర్గంలో చేరడం జీర్ణించుకోలేక పోతున్నారు. విశ్వనాథ్‌తోపాటు ఎమ్మెన్నెస్ విద్యార్ధి సేన మాజీ జిల్లా అధ్యక్షుడు అమోల్ ఖడ్సే, మరికొందరు ఉద్ధవ్ వర్గం కార్యకర్తలు శిందే వర్గంలో చేరారు. ఇదివరకే 50 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రేపై శిందే తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి శిందే అనేక మంది శివసేన పదాధికారులను, కార్యకర్తలను తమవైపు లాక్కోవడంలో సఫలీకృతమైతున్నారు. ఇప్పటికే వేలాది మంది ఉద్ధవ్ వర్గం కార్యకర్తలు శిందే వర్గంలో చేరారు. తాజాగా ఏకంగా ప్రతిపక్ష నేత అంబాదాస్ దానవేకు అతి సన్నిహితుడైన విశ్వనాథ్ శిందే వర్గంలో చేరడం చర్చనీయంశమైంది. కట్టర్ శివసైనికుడిగా ఉన్న విశ్వనాథ్ భార్య ప్రాజక్త రాజ్‌పుత్ మాజీ కార్పొరేటర్‌గా ఉన్నారు. 2010లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విల్లు–బాణం గుర్తుపై పోటీ చేసి విజయఢంకా మోగించారు. ప్రస్తుతం ఆమె పట్టణ మహిళా ఆఘాడిలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. వరుసగా ఒకరి తర్వాత మరొకరు శిందే వర్గంలో చేరడంతో ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. -
ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్ తీపి కబురు
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్‌పూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్‌పూర్‌లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్‌పూర్‌లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్‌పూర్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉద్ధవ్‌తో కలవం.. రాజ్ ఠాక్రే సత్సంబంధాలు ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. మూడునెలలుగా పెండింగ్‌లోనూ.. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. మహిళలకు దక్కని ప్రాధాన్యం అప్పట్లో ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి: మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్‌కు చెక్ పెట్టేందుకు పావులు) -
ఉద్ధవ్ థాక్రే వర్గానికి బిగ్ రిలీఫ్.. ఉపఎన్నికల్లో ఆమె పోటీకి లైన్ క్లియర్
ముంబై: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 3న జరగే అంధేరీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. థాక్రేవర్గం తరఫున పోటీ చేయనున్న రుతుజా లాట్కే రాజీనామాను బృహన్ముంబై పురపాలక కమిషనర్ శుక్రవారం ఉదయం 11గంటల్లోగా ఆమోదించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే ఆమోదించడానికి ఇంత సమయం ఎందుకుపట్టిందని, ఇది కోర్టుకు రావాల్సిన విషయం కూడా కాదని ముంబై పురపాలక కమిషనర్ ఇక్బాల్ చాహల్‌ను ఉన్నత న్యాయస్థానం మందలించింది. అంధేరీ ఎమ్మెల్యే రమేశ్ లాట్కే మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉద్దవ్ థాక్రే వర్గం తరఫున రమేశ్ లాట్కే సతీమణి రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. అయితే ఆమె బృహన్ ముంబై కార్పొరేషన్లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఉపఎన్నికకు నామినేషన్ వేయాలంటే ఆమె పదవికి రాజీనామా చేయాలి. సెప్టెంబర్ 2నే రాజీనామా సమర్పించినప్పటికీ దాన్ని కమిషనర్ ఆమోదించలేదు. నామినేషన్లకు శుక్రవారం(అక్టోబర్ 14) చివరి తేదీ కావడంతో రితిజా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కావాలనే రాజీనామా ఆమోదించడం లేదని కోర్టుకు తెలిపారు. షిండే ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రుతుజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం ఆమె నేరుగా వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలిశారు. చివరిరోజైన శుక్రవారం నామినేషన్ సమర్పించనున్నారు. అంధేరీ ఉపఎన్నికలో థాక్రేవర్గం అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుగా ఉన్నాయి. మరోవైపు షిండే వర్గం మద్దతుతో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెడుతోంది. చదవండి: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె! -
అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!
సాక్షి, ముంబై: తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. మొన్నటివరకు అసలైన శివసేన పార్టీ తమదేనంటూ, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తు తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం పోటీ పడ్డాయి. చివరకు ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం వినియోగించరాదని ఉద్ధవ్‌కు, శిందేను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ టికెట్టుపై పోటీ చేయించాలనే ప్రయత్నాలు శిందే చేస్తున్నారు. భర్త మృతి.. అభ్యర్థిగా భార్య ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లిన తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే అక్కడే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక, ఆరో తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. కాని మృతి చెందిన రమేశ్ లట్కే సతీమణి రుతుజా లట్కేకు తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్ధిత్వం ఇచ్చారు. సానుభూతి ఓట్లతో రుతుజా సునాయాసంగా గెలుస్తుందనే ధీమాతో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. రుతుజా గెలవడంవల్ల తమ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య యథాతధంగా ఉంటుంది. ఏక్నాథ్ శిందే ఎత్తుగడలు రమేశ్ లట్కే కుటుంబంతో ఏక్నాథ్ శిందేకు సంత్సంబంధాలున్నాయి. దీంతో రుతుజాకు తమ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం ఇవ్వాలని శిందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే శివసేన వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయి, తమ వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుందని శిందే భావిస్తున్నారు. ప్రస్తుతం శివసేన పార్టీ ఎవరిది..? విల్లు–బాణం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే సమయంలో ఎమ్మెల్యేల సంఖ్య ఏ వర్గానికి ఎక్కువ ఉందో ఆ వర్గానికి శివసేన పేరు, విల్లు–బాణం గుర్తు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో ఏక్నాథ్ శిందే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నలిగి పోతున్న బీఎంసీ కమిషనర్ కాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరపున రుతుజా లట్కే గురువారం భారీ బలప్రదర్శన చేస్తూ నామినేషన్ వేస్తారని ఇదివరకే పార్టీ వర్గాలు ప్రకటించాయి. రుతుజా లట్కేకు మహావికాస్ ఆఘాడి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ప్రకటించాయి. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమె బీఎంసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె బీఎంసీ కమిషనర్‌కు రాజీనామా సమర్పించారు. కానీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఫలితంగా గురువారం ఆమె నామినేషన్ వేయలేకపోయారు. దీంతో రాజీనామా ఆమోదించాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి, ఆమోదించవద్దని అటు ఏక్నాథ్ శిందే వర్గం నుంచి బీఎంసీ కమిషనర్‌పై ఒత్తిడి వస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్యలో బీఎంసీ కమిషనర్ నలిగి పోతున్నారు. నియమాలు ఏమంటున్నాయి.. బీఎంసీ 1989 నియమాల ప్రకారం స్వచ్చందంగా పదవీ విరమణ పొందేవారు మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. రాజీనామా చేసే వారు నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఒకవేళ నెల రోజుల ముందు నోటీసు ఇవ్వని పక్షంలో ఒక నెల వేతనం బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. కాని ఆమె ఈ నెల మూడో తేదీన నోటీసు ఇచ్చారు. నియమాల ప్రకారం రుతుజా లట్కే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వకపోవడంతో నెల రోజుల వేతనం రూ.67,590 నగదు బీఎంసీకి చెల్లించారు. సంబంధిత డిపార్టుమెంట్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కూడా పొందారు. అయినప్పటికీ బీఎంసీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఇటు ఉద్ధవ్ వర్గం, అటు శిందే వర్గం ఒత్తిళ్ల మధ్య బీఎంసీ కమిషనర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. రాజీనామ ఆమోదించే వరకు రుతుజాకు నామినేషన్ వేయడానికి వీలులేదు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బాంబే కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు రుతుజా రాజీనామాను ఆమోదించాలని ఉన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ నుంచి మూర్జీ పటేల్ ? ఇదిలాఉండగా బీజేపీ నుంచి మూర్జీ పటేల్ పేరును దాదాపు ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ వేయడానికి శుక్రవారం వరకు గడువుంది. ఆలోపు ఏదైన అద్భుతం జరగవచ్చు. గతంలో తనతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ తరఫున నామినేషన్ వేయించాలనే ప్రయత్నంలో శిందే ఉన్నారు. ఒకవేళ రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ దాఖలుచేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం లేపడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. దీంతో రుతుజా తుది నిర్ణయం తీసుకోవాలంటే ఆచి, తూచి ఆడుగేయాల్సి ఉంటుంది. ఒకవేళ శిందే ఒత్తిళ్లకు యపడి బీజేపీ తరఫున రుతుజా నామినేషన్ వేస్తే మూర్జీ పటేల్ పరిస్ధితి ఏంటనే అంశం తెరమీదకు రానుంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూర్జీ పటేల్‌కు అభ్యర్ధిత్వం ఇవ్వకపోవడంతో బీజేపీపై తిరుగుబాటుచేసి స్వతంత్రంగా బరిలో దిగారు. ఆ సమయంలో రమేశ్ లట్కే గెలుపొందగా మూర్జీ పటేల్ రెండో స్ధానంలో నిలిచారు. రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ వేస్తే ఇప్పుడు అదే పరిస్ధితి పునరావృతమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కొంత అయోమయ పరిస్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. (క్లిక్: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ) -
సాక్షి కార్టూన్ 12-10-2022
-
షిండే వర్గానికి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఏకానాథ్ షిండే వర్గానికి 'రెండు కత్తులు-డాలు' గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. ఈమేరకు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించించి. షిండే వర్గం పార్టీ పేరును 'బాలాసాబెబ్‌చీ శివసేన'గా ఈసీ సోమవారం ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. వీటిని పరిశీలించిన ఈసీ రెండు కత్తులు-డాలు గుర్తును ఫైనల్ చేసింది. శివసేన ఎవరిదో తేలేవరకు షిండే, థాక్రే వర్గాలకు ఈ పార్టీ పేర్లు, గుర్తులే ఉండనున్నాయి. చదవండి: ఇదేనా మీకు నేర్పింది? రిక్షా బోల్తాపడినా ఆగని కలెక్టర్ కాన్వాయ్ -
మూడింటిలో ఏదో ఒక గుర్తు ఇవ్వండి.. ఈసీకి షిండే ప్రతిపాదనలు
ముంబై: అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు మూడు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది ఏక్నాథ్ షిండే వర్గం శివసేన. సుర్యూడు, కత్తి-డాలు, రావి చెట్టు గుర్తులను పరిశీలించాలని కోరింది. మరి ఈ మూడింటిలో ఎన్నికల సంఘం ఏది ఖరారు చేస్తుందో చూడాలి. అసలైన శివసేన తమదంటే తమదే అని ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని ఈసీ తాత్కాలికంగా సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నికల కోసం కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి షిండే, థాక్రే వర్గాలు ఈసీకి కొన్ని ప్రతిపాదలను పంపాయి. వీటిని పరిశీలించిన అధికారులు థాక్రే వర్గానికి 'శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)' పేరు, కాగడా గుర్తును సోమవారం ఖరారు చేసింది. అలాగే షిండే వర్గానికి 'బాలాసాహెబ్ శివసేన' పేరును ఫైనల్ చేసింది. కానీ షిండే అడిగిన ఎన్నికల గుర్తులు కొన్ని ఇప్పటికే రిజిస్టర్ అయినందున ఎలాంటి గుర్తును కేటాయించలేదు. మళ్లీ కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే షిండే వర్గం మంగళవారం సూర్యుడు, కత్తి-డాలు, రావిచెట్టు గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఈసీని మళ్లీ కోరింది. చదవండి: థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్! -
శిండే, ఠాక్రే వివాదంలో జోక్యం వద్దు..రాజ్ ఠాక్రే ఆదేశం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో జోక్యం చేసుకోవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ పదాధికారులకు, శ్రేణులకు ట్విట్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో స్ధానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయవద్దని, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేసిన క్లిప్పింగులు, రాతలుగానీ పెట్టవద్దని సూచించారు. ఇరువురు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగాక సమయం చూసుకుని తానే స్వయంగా అభిప్రాయాలను వెల్లడిస్తానని పదాధికారులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. శివసేన ఎవరిదనే విషయం తాజాగా ఉండగానే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం గుర్తును వినియోగించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి సమయంలో మీరు జోక్యం చేసుకుంటే పరిస్ధితి మరో విధంగా మారుతుందని రాజ్ అన్నారు. గతంలో ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యాఖ్యలు, సందేశాలు దుమారం లేపాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎమ్మెన్నెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కొద్దిరోజుల వరకు సాగింది. గత అనుభవం, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదంలో ఎవరూ మాట్లాడవద్దని, రాయవద్దని రాజ్ హెచ్చరించారు. -
గుర్తింపు పోరాటం!
మహారాష్ట్ర రాజకీయం మరో అంకానికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన పార్టీ అనే పంచాయతీలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రస్తుతానికి ఇద్దరినీ సమదూరం పెట్టేసింది. బాలాసాహెబ్ ఠాక్రే పెట్టిన అసలు శివసేన పార్టీ పేరు, విల్లంబుల చిహ్నం ఇరువర్గాలూ వాడకుండా స్తంభింపజేస్తూ, మధ్యంతర నిర్ణయం తీసుకుంది. మూడు ప్రత్యామ్నాయాలతో కొత్త పేరు, కొత్త ఎన్నికల గుర్తు ప్రతిపాదనల్ని సోమవారాని కల్లా పంపాల్సిందని నిర్దేశించింది. రెండుగా చీలిన శివసేన ఇప్పుడు ప్రత్యామ్నా యమైన పేర్లు, ఎన్నికల గుర్తుల కసరత్తుతో గుర్తింపు సమస్యలో పడింది. నవంబర్ 3న అంధేరీ (ఈస్ట్) అసెంబ్లీ ఉప ఎన్నిక, ఆపై రానున్న ముంబయ్ కార్పొరేషన్ ఎన్నికలతో ఇది కీలకంగా మారింది. ఉప ఎన్నికలో కమలం గుర్తుపై సొంత అభ్యర్థిని నిలబెట్టి, శిందే వర్గాన్ని అక్కున చేర్చుకున్న బీజేపీకి ఇది కలిసొచ్చే అంశం. ఉప ఎన్నిక దగ్గరవుతున్నందున మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న తమకే పార్టీ విల్లంబుల గుర్తు ఇవ్వాలంటూ శివసేన తిరుగుబాటు వర్గానికి సారథ్యం వహిస్తున్న శిందే అక్టోబర్ 4న ఈసీని అభ్యర్థించారు. అయితే, ఎమ్మెల్యేలు గోడ దాటినా, కార్యకర్తల్లో అధిక సంఖ్యాకులు తన వైపే ఉన్నారన్నది ఉద్ధవ్ వాదన. వీటి ఫలితమే – ఈ తాత్కాలిక ఆదేశం. ఎన్నికల్లో గందరగోళం నివారించడానికే ఈ నిర్ణయమని ఈసీ తేల్చేసింది. నిజానికి కాంగ్రెస్, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలను అక్కునచేర్చుకొని, అసలైన శివసేన సిద్ధాంతాలకు ఉద్ధవ్ తిలోదకాలిస్తున్నారని శిందే వాదన. ఆ ఆరోపణలు చేస్తూనే మొన్న జూన్‌లో ఆయన తన వర్గంతో బయటకొచ్చి, పార్టీని నిలువునా చీల్చారు. బాలాసాహెబ్ అసలైన సేన తమదేనని వాదిస్తున్నారు. అయితే, శివసేన సంస్థాపకుడి వారసుడిగా పార్టీని నడుపుతున్న ఉద్ధవ్‌ను శివసేన గుర్తుకు దూరం చేస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమేనని కపిల్ సిబల్ తదితరుల విమర్శ. బీజేపీతో అంట కాగుతున్న శిందే వర్గానికి అప్పనంగా అన్నీ అప్పజెప్పడానికే ఈ ప్రయత్నమని వారి ఆరోపణ. నిజానికి, ఒకే పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గాలు గనక పార్టీ పేరు, జెండా, గుర్తులపై అధికారంపై జగడానికి దిగితే, ‘ఎన్నికల చిహ్నాల (కేటాయింపు) ఆదేశం–1968’, సెక్షన్ 15 ప్రకారం నిర్ణయాధికారం ఈసీదే. అసలు శివసేన ఎవరిదనే విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడం సుదీర్ఘ ప్రకియ. అందుకు నెలలు పడుతుంది. ఇటీవలే సుప్రీమ్ కోర్ట్ సైతం ఉద్ధవ్ వర్గం వేసిన పిటిషన్‌పై రూలింగ్ ఇస్తూ, ‘అసలైన శివసేన’ ఎవరిది లాంటి అంశాలు నిర్ణయించే అధికారం ఈసీదేనని స్పష్టం చేసింది. శిందే వర్గంలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మాత్రం విచారణ జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఈసీ నిర్ణయం ‘అన్యాయ’మని అభివర్ణిస్తున్న ఉద్ధవ్ చేసేదేమీ లేక ప్రస్తుతానికి వేరే గుర్తులు ప్రతిపాదిస్తూ, తమను ‘బాలాసాహెబ్ ఠాక్రే శివసేన’గా గుర్తించాలని కోరారు. విజయదశమికి ఉద్ధవ్, శిందే వర్గాలు పోటాపోటీ ర్యాలీలు జరిపి, బలప్రదర్శనకు దిగాయి. అసలు బలం వచ్చే వివిధ ఎన్నికల్లో తేలనుంది. మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుంది. రాష్ట్రంలో రెక్కలు చాస్తున్న బీజేపీ, ఉద్ధవ్‌పై పాత పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. కన్ను మూసిన తమ ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్యను నిలబెట్టిన ఉద్ధవ్ సేన అసెంబ్లీలో కాకున్నా ప్రజల్లో బలం తమదేనని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడింది. అసలే ఎమ్మెల్యేలు చేయిదాటి పోయి, కార్యకర్తలపై పట్టుపోతున్న వేళలో ఈ ఎన్నికలు, అందులోనూ అలవాటైన ఎన్నికల గుర్తు లేకపోవడం ఉద్ధవ్‌కు ఇరకాటమే. కొత్త గుర్తు, పేరు జనంలోకి తీసుకెళ్ళడం ఇప్పటికిప్పుడు తేలికేమీ కాదు. కాకపోతే, ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం సోమవారం ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. రేపు కథ సుప్రీమ్ దాకా వెళ్ళవచ్చు. అప్పుడు విల్లంబుల గుర్తు శాశ్వత స్తంభనకు గురికావచ్చు. గతంలో 1969లో సీనియర్లతో ఇందిరా గాంధీకి తీవ్ర విభేదాలు వచ్చినప్పడు కాంగ్రెస్ అసలు గుర్తు కాడి – జోడెద్దులు గుర్తు శాశ్వత స్తంభనకు గురైంది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్)కు ఆవు – దూడ గుర్తు, కాంగ్రెస్ (ఒ)కు చరఖాపై నూలు వడుకుతున్న స్త్రీ గుర్తు ఇవ్వడం ఓ చరిత్ర. అప్పట్లో ఇందిరా గాంధీ కొత్త ఎన్నికల గుర్తు ఆవు – దూడపైనే పోటీ చేసి, ‘గరీబీ హఠావో’ నినా దంతో 1971 లోక్‌సభ ఎన్నికల్లో, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్ రెండోసారి చీలినప్పుడు ఇందిర వర్గానికి హస్తం గుర్తు దక్కింది. 1960లలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిక వేళ, సీపీఐ (ఎం) కొడవలి – సుత్తి – నక్షత్రం గుర్తును ఎంచుకోవడం మరో కథ. ఆ మధ్య 2017లో ఓ ఉప ఎన్నిక వేళ అన్నాడిఎంకే వర్గాల మధ్య పోరులో రెండు ఆకుల చిహ్నాన్ని ఇప్పటిలాగే ఈసీ తాత్కాలికంగా స్తంభింపజేసింది. ఇలా ఎన్నికల చిహ్నాలపై పార్టీలలో చీలిక వర్గాలలో పోరు కొత్త కాదు. శివసేన వ్యవహారం రేపు ఏ మలుపు తీసుకుంటుందన్నది చూడాలి. ఒకరకంగా ఈసీ తన నిష్పాక్షికతనూ, స్వతంత్ర ప్రతిపత్తినీ మరోసారి నిరూపించుకోవాల్సిన సందర్భం ఇది. ఫలితం ఏమైనా, యాభై ఆరేళ్ళ క్రితం 1966 జూన్‌లో బాలాసాహెబ్ చేతుల మీదుగా ఆరంభమై, మరాఠా రాజకీయాలను దశాబ్దాలుగా శాసించిన బలమైన ప్రాంతీయ పార్టీకి ఇది దీర్ఘకాలంలో దెబ్బే. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన విధంగా ఈ గొడవలో చివరకు లాభపడేది కమలనాథులే! -
థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్!
సాక్షి,న్యుఢిల్లీ: అంధేరీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) పేరు, కాగడా(ఫ్లేమింగ్ టార్చ్) గుర్తును ఖరారు చేసింది. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గానికి 'బాలసాహెబ్చీ శివసేన' పేరును ఫైనల్ చేసింది ఈసీ. అయితే ఎన్నికల గుర్తు మాత్రం ఖరారు చేయలేదు. షిండే వర్గం అడిగిన గుర్తులు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయని, కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే థాక్రే, షిండే అడిగిన త్రిశూలం, గధ, ఉదయించే సూర్యుడి గుర్తులను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కొన్ని గుర్తులు మతపరంగా ఉన్నాయని, ఉదయించే సుర్యూడి గుర్తు డీఎంకే రిజిస్టర్ చేసుకుందని పేర్కొంది. అసలైన శివసేన తమదంటే తమదే అని థాక్రే, షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నిక కోసం పార్టీ పేరు, గుర్తు కోసం రెండు వార్గాలు కొన్ని ప్రతిపాదనలను ఈసీకి పంపాయి. చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్.. -
ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!
ముంబై: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వార్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని చెప్పినా ఈసీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు 'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పార్టీ పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే, త్రిశూలం గుర్తు అని, అవి కుదరకపోతే రెండో ఆప్షన్‌కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుతోంది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి -
షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్!
న్యూఢిల్లీ:అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ను ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేవర్గాలు ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం విధించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోవద్దని రెండు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉప ఎన్నిక కోసం ఏవైనా మూడు నచ్చిన పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తుల్లో కొన్నింటిని ఎంపిక చేసుకొని, సోమవారంలోగా తమకు తెలియజేయాలని సూచించింది. వాటిని రెండు వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తామని పేర్కొంది. పార్టీ ఎన్నికల గుర్తును తమ అభ్యర్థికే కేటాయించాలని షిండే వర్గం కోరగా ఈసీ తిరస్కరించింది. శివసేన ఈ ఏడాది జూన్‌లో రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలు శివసేన తమనంటూ షిండే, ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీపై హక్కును నిరూపించుకోవడానికి అక్టోబర్ 7లోగా ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలకు ఈసీ ఆదేశించింది. చదవండి: థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! -
థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్
సాక్షి,న్యూఢిల్లీ: శివసేన ఎన్నికల గుర్తు కేటాయింపుపై ఉద్ధవ్ థాక్రే వర్గానికి డెడ్‌లైన్ విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. శనివారం మధ్యాహ్నం 2గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అసలైన శివసేన తమదే అని, తూర్పు అంధేరీ ఉపఎన్నికలో విల్లు-బాణం గుర్తు తమకే కేటాయించాలని ఏక్నాథ్ షిండే వర్గం ఈసీని కోరిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఇచ్చిన గడవులోగా తప్పకుండా వివరణ ఇస్తామని థాక్రే వర్గం స్పష్టం చేసింది. ఇప్పటికే శుక్రవారం ఈసీ అధికారులను కలిసి శివసేన పార్టీని షిండే వర్గం వారే స్వచ్ఛందంగా విడిచివెళ్లారని, కాబట్టి వారికి విల్లు-బాణం గుర్తు ఇవ్వొద్దని కోరింది. కానీ షిండే వర్గం శివసేన తమదే అని ఈసీకి శుక్రవారం రోజే చెప్పడంతో అధికారులు థాక్రే వర్గాన్ని మరోమారు వివరణ కోరారు. శనివారం మధ్యాహ్నం 2గంటల్లోగా స్పందించకపోతే నిబంధనల ప్రకారం గుర్తు ఎవరికి దక్కితే వారికే కేటాయిస్తామన్నారు. అంధేరి ఉపఎన్నికలో శివసేన(థాక్రే వర్గం) అభ్యర్థిగా రుతుజా లట్కే బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ కార్పోరేటర్ ముర్జి పటేల్ పోటీ చేస్తున్నారు. షిండే వర్గం ఈయనకు మద్దతు తెలుపుతోంది. మిహావికాస్ అఘాడీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు రుతుజా లట్కేకే మద్దతుగా ఉంటున్నాయి. చదవండి: శివసేన గుర్తు వాళ్లదెలా అవుతుంది: ఉద్ధవ్ థాక్రే -
శివసేన గుర్తు వాళ్లదెలా అవుతుంది: ఉద్ధవ్ థాక్రే
ముంబై: శివసేన పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందదని ఉద్ధవ్ థాక్రే వర్గం ఎన్నికల సంఘానికి తెలిపింది. ఆ వర్గం వారంతా స్వచ్ఛందంగా పార్టీని వీడి వెళ్లిపోయారని, అలాంటప్పుడు పార్టీ గుర్తు వాళ్లది చెందకూడదని పేర్కొంది. నవంబర్ 3న మహారాష్ట్రలోని తూర్పు అంధేరి ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎన్నికల గుర్తు ఎవరిదనే విషయంపై వివరణ ఇవ్వాలని ఉద్దవ్ థాక్రే వర్గాన్ని కోరింది ఎన్నికల సంఘం. ఈ గడువు శనివారం వరకు ఉన్నప్పటికీ ఒక రోజు ముందుగానే థాక్రే వర్గం వివరణ ఇచ్చింది. అంధేరి ఉపఎన్నికలో శివసేన(థాక్రే వర్గం) అభ్యర్థిగా రుతుజా లట్కే బరిలోకి దిగుతున్నారు. ఆమె భర్త రమేశ్ లట్కే మృతితో ఈ ఎన్నిక అనివార్యమైంది. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ కార్పోరేటర్ ముర్జి పటేల్ పోటీ చేస్తున్నారు. షిండే వర్గం ఈయనకు మద్దతు తెలుపుతోంది. మిహావికాస్ అఘాడీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలు రుతుజా లట్కేకే మద్దతుగా ఉంటున్నాయి. సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో చేతులు కలిపి ఏక్నాథ్ షిండే సీఎం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత థాక్రే వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా షిండే గూటికి చేరారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లు-బాణం కోసం ఈ రెండు వర్గాలు పోరాడుతున్నాయి. చదవండి: మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు -
కొడుకులు వారసులు కాలేరు! ఏక్నాథ్ షిండే సెటైర్లు
ముంబై: ముంబైలో శివసేన ప్రత్యర్థి వర్గాల మద్య దసరా ర్యాలీలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్ణణ జరగడానికి కొద్దిసేపటి ముందే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే.. ఉద్ధవ్ థాక్రేని లక్ష్యంగా చేసుకుని సెటైరికల్ ట్విట్లు పోస్ట్ చేశారు. ఈ మేరకు షిండే ట్విట్టర్లో...పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వారసత్వంగా కొడుకులు రావాల్సిన అవసరం లేదంటూ ఉద్ధవ్ థాక్రేని ఉద్దేశిస్తూ సెటైర్లు విసిరారు. అలాగే ప్రముఖ కవి హరివంశరాయ్ బచ్చన్ గురించి ప్రస్తావిస్తూ... నా కొడుకు కావడం వల్ల అతను నా తర్వాత వారసుడు కాలేడు, నా తదనంతరం ఎవరైతే వస్తారో వారే తన కొడుకు అవుతాడని చమత్కరించారు. అంతేగాదు నిజమైన శివసేనకు నాయకత్వం వహించనప్పుడు థాక్రే వారసత్వం గురించి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఉద్ధవ్ థాక్రే తన తండ్రి నిలబెట్టిన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విసయమై థాక్రే, ఏక్నాథ్ షిండేల మధ్య న్యాయపోరాటం జరుగుతుంది. అలాగే ఇరువురి మధ్య సంప్రదాయ దసరా ర్యాలీ విషయమై కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. ఐతే ఉద్ధవ్ థాక్రేకి ఈవిషయంలో బాంబే హైకోర్టు సంప్రదాయ వేదిక శివాజీ పార్క్‌ను మంజూరు చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. (చదవండి: కశ్మీర్‌ను శాంతివనంగా మారుస్తాం! పాక్‌తో చర్చలపై హోం మంత్రి ఏమన్నారంటే..) -
ఉద్దవ్ థాక్రేకు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని సుప్రీం కోర్టును ఆశ్రయించింది షిండే వర్గం. అయితే.. గుర్తింపు అధికారం ఇవ్వకుండా ఈసీని అడ్డుకోవాలంటూ మరో పిటిషన్ వేసింది థాక్రే వర్గం. ఈ పిటిషన్ల విచారణకై సుప్రీం కోర్టు ప్రత్యేకంగా ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో.. ఇరు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నిలక సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్ థాక్రే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఆగష్టు 23న.. ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ చేసింది. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హత.. తదితర రాజ్యాంగ బద్ధమైన ప్రశ్నల నడుమ ఆ పని చేసింది. అంతేకాదు స్పీకర్,గవర్నర్, న్యాయ సమీక్షల విచక్షణ అధికారాన్ని ఆ పిటిషన్లు ప్రశ్నించాయి కూడా. ఏక్నాథ్ షిండేకు విధేయులైన ఎమ్మెల్యేలు మరో రాజకీయ పార్టీలో విలీనం చేయడం ద్వారానే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండవచ్చని థాకరే వర్గం కోర్టుకు తెలిపింది. సొంత పార్టీ విశ్వాసం కోల్పోయిన నాయకుడికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఆయుధంగా మారదని షిండే టీమ్ వాదించింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి ఆయన తప్పుకోలేదు! -
Maharashtra: దసరా ర్యాలీ.. హైకోర్టులో ఉద్దవ్ ఠాక్రేకు భారీ ఊరట..
సాక్షి, ముంబై: గత కొన్ని రోజులుగా తార స్థాయికి చేరిన దసరా ర్యాలీ(సదస్సు) వివాదంపై ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. కోర్టుకు వరకు వెళ్లిన ఈ పంచాయతీలో ఉద్దవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు వెలువడింది. శీవాజీ పార్క్ మైదానంలో అక్టోబర్ 2 నుంచి 6 మధ్యన దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు అనుమతిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించేందుకు అనుమతివ్వాంటూ శివసేన హైకోర్టు దాఖలు చేసిన విషయం తెలిసిందే. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దసరా ర్యాలీని నిర్వహించేందుకు కోర్టు ఉద్దవ్ ఠాక్రేకు అనుమతిని ఇచ్చింది. అయితే శాంతిభద్రతల నడుమ ర్యాలీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. కోర్టు ఆదేశాల అనంతరం శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. ‘ఒకే పార్టీ నాయకుడు, ఒక శివసేన, ఒకే శివతీర్థం. ఒకే దసరా సమావేశం. అక్టోబర్ 5న పులి గర్జన వినబడనుంది.’ అని ట్వీట్ చేశారు. కాగా లాక్డౌన్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత శివాజీ పార్క్‌లో ఈ ఏడాది దసరా ర్యాలీ నిర్వహించనున్నారు. చదవండి: అధ్యక్షుడు ఎవరైనా.. పార్టీ మొత్తానికి నాయకుడు మాత్రం అతడే! వివాదం ఏంటి? అక్టోబర్ నెలలో దసరా ర్యాలీ కోసం శివాజీ పార్క్ మైదానం అద్దెకివ్వాలని గత నెలలోనే(ఆగస్టు 22) శివసేన దరఖాస్తు చేసుకుంది. ఆ తరువాత వారం రోజులకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం తరపున స్థానిక శివసేన ఎమ్మెల్యే సదా సర్వస్కర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు మైదానం అద్దెకిచ్చే విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్దవ్ వర్గం మరోసారి(ఆగస్టు26) దరఖాస్తు చేసుకున్నప్పటికీ బీఎంసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బీఎంసీ నియమ నిబంధనల ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతివ్వాలి. కానీ శివసేన చీఫ్ ఉద్దవ్ వర్గానికి శివాజీ పార్క్ మైదానం అద్దెకివ్వకూడదని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అయితే నెలరోజులులైనా బీఎంసీ అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్దవ్ ఠాక్రే వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నాలుగు సార్లు మినహా 55 ఏళ్లుగా.. దాదాపు 55 ఏళ్ల కిందట బాల్ ఠాక్రే శివసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ సుదీర్ఘ కాలంలో నాలుగు సార్లు మినహా ఏటా శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తున్నారు. 2012లో బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఈ పరంపరాను ఆయన తనయుడు ఉద్దవ్ ఠాక్రే కొనసాగిస్తున్నారు. దీంతో శివాజీ పార్క్ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహించే హక్కు ప్రథమంగా తమకే ఉందని ఉద్దవ్ వర్గం వాదిస్తోంది. చదవండి: సిగరెట్ వేరు.. మద్యం వేరు.. అందుకు నో చెప్పిన సుప్రీంకోర్టు -
ఐఎన్ఎల్డీ ర్యాలీకి పవార్, నితీశ్, ఠాక్రే
న్యూఢిల్లీ: హరియాణాలోని ఫతేబాద్‌లో ఈ నెల 25వ తేదీన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) తలపెట్టిన ర్యాలీకి ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, డీఎంకే నేత కళిమొళి ఈ సమావేశంలో పాల్గొంటారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. మాజీ ఉప ప్రధాని, ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు దేవీలాల్ జయంతిని పురస్కరించుకుని చేపట్టే ఈ కార్యక్రమానికి ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా వస్తామని తెలిపారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే దిశగా చారిత్రక ఘట్టం కానుందని పేర్కొన్నా రు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కూడా ఐఎన్ఎల్ డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలా ఆహ్వానాలు పంపారన్నారు. -
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్
శివసేన ఎవరిది..? మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. తిరుగుబాటుతో సీఎం పగ్గాలు దక్కించుకున్న షిండే పార్టీని చేజిక్కించుకునేందుకు ఏం చేస్తున్నారు? మహారాష్ట్ర సంక్షోభం కొలిక్కి వచ్చినా ఆధిపత్యపోరు తగ్గడం లేదు. తమనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం ఈసీని ఆశ్రయించడం, తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం.. మరాఠా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మెజార్టీ పార్టీ ఎవరి వైపు ఉంటే వారిదే అసలైన పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. కానీ మహారాష్ట్రలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండేతో వెళ్లినా పార్టీ సంస్థాగత నిర్మాణం మాత్రం ఇంకా ఉద్దవ్‌పై విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో శివసేన తరపున మొత్తం 55 మంది శాసనసభ్యులుగా గెలవగా, అందులో ఏకంగా 39 మంది ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లిపోయారు. ఈ ఎమ్మెల్యేలు తమతో పాటు పార్టీలో కింది వర్గాన్ని కూడా థాకరేకు దూరంగా పెట్టారు. ఈ సమీకరణాలు పైకి చూడ్డానికి షిండే వైపు మొగ్గు చూపినా.. పార్టీ హర్డ్‌కోర్ సానుభూతి పరుల్లో మాత్రం వీరంతా థాకరేకు అన్యాయం చేశారన్న ప్రచారం ఉంది. ఏక్నాథ్ షిండే వెన్నుపోటు వల్లే థాకరే రోడ్డు మీద పడ్డారన్న సింపథీ కూడా కొంత నెలకొంది. ఇటీవల అన్నాడీంకేలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్ సెల్వం వర్గం వ్యతిరేకించడంతో... పళని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఒక దశలో మెజార్టీ పార్టీ శ్రేణులు పళనికి మద్దతు తెలపడంతో.. పన్నీర్ సెల్వం బలహీనపడిపోయారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలాంటి పరిస్థితే పునరావృతమయ్యే అవకాశముందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ గుర్తు విల్లు కూడా షిండే వర్గానికే వెళ్లే అవకాశముందనే టాక్ వినిస్తుండడం మహా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కోర్టులో పార్టీ ఫిరాయింపులపై నమోదయిన పిటిషన్లు ప్రస్తుతానికి షిండేకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటును షిండే వర్గం తప్పించుకున్నట్టే కనిపిస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు షిండే వైపు వచ్చినా.. వచ్చే ఎన్నికల్లో ప్రజా కోర్టులో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. -
నమ్మక ద్రోహాన్ని సహించబోం: అమిత్ షా
ముంబై: రాజకీయాల్లో దేన్నైనా భరించొచ్చుగానీ.. ద్రోహాన్ని సహించలేమని అన్నారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో దేన్నైనా సహించగలంగానీ.. ద్రోహాన్ని సహించలేం. ఉద్దవ్ థాక్రే(శివసేన అధినేత) బీజేపీకి చేసింది ముమ్మాటికీ ద్రోహమే. అందుకే ఆయనకు అలా(ప్రభుత్వం కుప్పకూలి.. సీఎం పదవీచిత్యుడు అయ్యడు) జరిగింది. ఉద్దవ్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మోసం చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే అని షా వ్యాఖ్యానించారు. శివసేన చీలడానికి, తదనంతర పరిణామాలకు ఉద్దవ్ థాక్రేనే కారణం. అతని అధికార దాహమే.. దగ్గరి వాళ్లను ఎదురు తిరిగేలా చేసింది. బీజేపీని మోసం చేయడమే కాదు.. నమ్మిన సిద్దాంతాలకు వెన్నుపోటు పొడిచారు. అంతేకాదు.. మహరాష్ట్ర ప్రజలను ఘోరంగా అవమానించారు. దురాశతో అతను చేసిన పని.. పార్టీని ముంచేసింది. ఉద్దవ్ థాక్రేను ముఖ్యమంత్రిని చేస్తామని ఏనాడూ మేం చెప్పలేదు. తలుపులు మూసుకుని గదుల్లో రాజకీయాలు చేయడం మాకు తెలియదు. మాకు తెలిసింది ఓపెన్ పాలిటిక్స్ అని అమిత్ షా అక్కడున్న నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ముంబై స్థానిక సంస్థల ఎన్నికల కోసం మిషన్ 150ను తెరపైకి తెచ్చింది బీజేపీ. దేశంలోనే అత్యంత సంపన్నమైన పౌర సంస్థగా బృహణ్‌ముంబై కార్పొరేషన్‌కు పేరుంది. అందుకే దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ సుదీర్ఘ కాలం నుంచి ప్రయత్నిస్తోంది. ఇదీ చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’ -
శివసేన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం దీనిపై విచారణ జరిపి తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో గురువారం వరకు శివసేన ఎన్నికల గుర్తు(విల్లు, బాణం)ను ఎవరికి కేటాయించాలనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. శివసేన పార్టీ తమదే అని ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించి అసలైన శివసేన ఎవరిదో ఎన్నికల సంఘమే నిర్ణయించేందుకు అనుమతించాలని షిండే గతనెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివసేన మెజార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని, పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవద్దని కోరారు. మరోవైపు థాక్రే వర్గం కూడా శివసేన తమదే అని వాదిస్తోంది. పార్టీ విప్‌ను ధిక్కరించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో పేర్కొంది. చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ -
ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం పెట్టడం కాదు.... గుండెల్లో ఉండాలి!
ముంబై: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ చేపట్టిన 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ...కేవలం త్రివర్ణ పతాకన్ని పెడితే దేశభక్తుల కాలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది అజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా చేస్తున్నారు నిజమే కానీ 75 ఏళ్ల స్వాతంత్య్ర అనంతరం ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తన తండ్రి బాల్ థాకరే 1960లో ప్రారంభించిన కార్టూన్ మ్యాగజీన్ మార్మిక్ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఓ వీడియోలో మాట్లాడుతూ...భారత్ బానిసత్వం వైపు వెళ్లడానికి వ్యతిరేకంగా కార్టూనిస్టులు ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుందన్నారు. అయినా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయమంది, కానీ ఎవరో పంపించిన ఒక వైరల్ చిత్రంలో తన వద్ద త్రివర్ణ పతాకం ఉంది గానీ ఇల్లు లేదని ఒక పేదవాడు చెబుతున్నాడని అన్నారు. నేటికీ అరుణాచల్ ప్రదేశ్‌లో చైనీయులు ప్రవేశిస్తున్నారు. మన ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఉంచితే వాళ్లు వెళ్లిపోతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జాతీయత అనేది మన హృదయాల్లో ఉండాలని గట్టిగా నొక్కి చెప్పారు. అలాగే సాయుధ బలగాల బడ్జెట్లో కోత పెట్టాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. త్రివర్ణ పతాకాన్ని డీపీ పెట్టడం సంతోషమే, కానీ ఇళ్లను వదిలి దేశం కోసం సరిహద్దులో పోరాడుతున్న సైనికుల బడ్జెట్లో కోత పెట్టడం దురదృష్టమని అన్నారు. అగ్నిపథ్ పథకం పై కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్కి కోంస మీ వద్ద డబ్బు లేదు కానీ రాష్ట్రల్లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మీ వద్ద డబ్బు ఉందంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. అలాగే బిహార్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క రాష్ట్రంలోని ప్రభుత్వాలను పడగొట్టడమే ధ్యేయంగా బీజేపీ కంకణం కట్టుకుందంటూ విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు ఆదిత్యనాథ్ ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని బీజేపీని ప్రశ్నించారు కూడా. (చదవండి: థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. ఫుల్ జోష్‌లో బీజేపీ) -
థాక్రే శిబిరానికి ఎదురుదెబ్బ.. జోష్‌లో బీజేపీ
ముంబై: న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్నారు శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. ఈ తరుణంలో.. తాజాగా థాక్రే శిబిరానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అక్కడ జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా.. థాక్రే సారథ్యంలోని శివ సేన నాలుగో స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్రంలో మొత్తం 28,813 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. తాజాగా గురువారం 62 మండలాల్లోని 271 గ్రామ పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. అందులో పుణే, సతారా, ఔరంగాబాద్, నాసిక్ పరిధిలోని గ్రామాలు సైతం ఉన్నాయి. శుక్రవారం వాటికి కౌంటింగ్ జరగ్గా.. ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 82 స్థానాలు దక్కించుకోగా.. ఎన్సీపీ 53 స్థానాలు, శివ సేన(షిండే వర్గం) 40 స్థానాలు కైవం చేసుకుంది. ఇక శివ సేన(ఉద్దవ్ థాక్రే వర్గం) 27, కాంగ్రెస్ 22, ఇతరులు 47 చోట్ల విజయం సాధించారు. ఈ విజయంతో బీజేపీ సంబురాలు చేసుకుంది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ బీజేపీ నెంబర్ వన్ పార్టీ అని, బీజేపీతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివ సేన బాగా పని చేసిందని ట్వీట్ చేశారు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌ను, కార్యకర్తలను అభినందించారాయన. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ సైతం స్పందిస్తూ.. ఇది ప్రజాతీర్పు అని, ప్రజావ్యతిరేక కూటమికి(మహా వికాస్ అగాఢిని ఉద్దేశించి) ఇది ప్రజలు ఇచ్చిన తిరస్కారం, మునుముందు ఇదే కొనసాగుతుంది అంటూ పరోక్షంగా థాక్రే వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ్నవీస్‌కు! -
Shiv Sena Row: ఉద్దవ్ థాక్రేకు భారీ ఊరట
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టు ‘శివ సేన’ పంచాయితీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఏక్నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివ సేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంతేకాదు సోమవారం(ఆగస్టు 8వ తేదీన) ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రాజ్యాంగబద్ధమైన బెంచ్‌కు సిఫార్సు చేయాలా? వద్దా? అనే విషయంపై సుప్రీం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపింది. గురువారం వాదనల సందర్భంగా సీజే ఎన్వీ రమణ.. షిండే వర్గాన్ని ఉద్దేశించి ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు. ‘‘మీరు ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా?’’ అని తెలుసుకోవాలని ఉందని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేను ఉద్దేశించి సీజే ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి ‘లేదు’ అనే సమాధానం వచ్చింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం తేలేవరకు ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని ఉద్దవ్ థాక్రే వర్గం.. సుప్రీంను అభ్యర్థించింది. అయితే రాజ్యాంగబద్దమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమనే అసలైన వర్గంగా గుర్తించాలని, ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని షిండే వర్గం సుప్రీంలో వాదన వినిపించింది. ఈ తరుణంలో షిండే గ్రూప్ పిటిషన్‌పై ప్రతికూలంగా స్పందించిన బెంచ్.. శివ సేన నియంత్రణను షిండే వర్గానికి అప్పగించ్చొద్దంటూ ఈసీకి సూచించింది. ఎవరిది అసలైన శివ సేన తేల్చేందుకు అగస్టు 8వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇది వరకే ఇరువర్గాలను ఆదేశించింది కూడా. ఇదీ చదవండి: ఇది మమత మార్క్ రాజకీయం! -
రౌత్ అరెస్ట్: థాక్రే నోట పుష్ప డైలాగ్ ప్రస్తావన
సాక్షి, ముంబై: ప్రతీకార రాజకీయాలతో శివ సేనను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించారని శివ సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే.. తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ‘మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తుడిచిపెట్టేస్తాం’ అనే ధోరణితో దర్యాప్తు ఏజెన్సీల ద్వారా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారు. సంజయ్ రౌత్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. అయినా ఏ దశలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. పుష్ప అనే సినిమాలో ఓ పాపులర్ డైలాగ్ ఉంది. ఝుకేగా నహీ(తగ్గేదే లే) అని. అది రౌత్‌కు అన్నివిధాల సరిపోతుంది. నిజమైన శివసైనికుడిగా ఆయన వ్యవహరించారు. కొందరిలా ఆయన ఈడీ బూచికి భయపడలేదు. పిరికిపందలా వెన్నుచూపలేదు. ఎక్కడా తగ్గలేదు. బాలా సాహెబ్ చూపిన మార్గం ఇదే. రౌత్ నిజమైన శివ సైనికుడు అంటూ ఉద్ధవ్ థాక్రే ప్రశంసలు గుప్పించారు. సోమవారం మధ్యాహ్నాం రౌత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అనంతరం.. ఉద్దవ్ థాక్రే పైవ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రౌత్కుటుంబ సభ్యులు సైతం బీజేపీపై మండిపడ్డారు. బీజేపీపై సంజయ్ రౌత్ సహేతుక విమర్శలతో విరుచుకుపడుతున్నారని, అందుకే భయపడే ఈడీని ఆయనపై ప్రయోగించిందని బీజేపీపై సంజయ్ రౌత్ కుటుంబం ధ్వజమెత్తింది. ఇదిలా ఉంటే.. పత్రా చాల్ భూకుంభకోణానికి సంబంధించి ఆదివారం సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆరేడు గంటలపాటు ఆయన్ని పశ్నించి.. చివరికి అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేసింది. సోమవారం మనీల్యాండరింగ్ ఆరోపణలపై అరెస్టైన సంజయ్ రౌత్‌ను.. నాలుగు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది ముంబై కోర్టు. -
Sakshi Cartoon: మీకు జన్మదిన శుభాకాంక్షలు: నిజమైన శివసేన పార్టీ
ఉద్ధవ్ ఠాక్రేకు బర్త్ డే విషెస్ చెప్పిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే: ఇట్లు నిజమైన శివసేన పార్టీ -
దమ్ముంటే ఆ పని చెయ్యి.. షిండేకు థాక్రే సవాల్
ముంబై: రాజకీయ చదరంగంలో ఓడినా.. న్యాయం తమవైపే ఉందని, ప్రజాక్షేత్రంలో నెగ్గి తీరతామని మరోసారి ఉద్ఘాటించారు శివ సేన అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే. అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోనుందుకే ఇదంతా జరిగిందని మరోసారి సంక్షోభంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తింపు వ్యవహారం ఈసీ దగ్గర ఉన్న తరుణంలో.. తాజా ఇంటర్వ్యూలో థాక్రే మరోసారి సీఎం షిండేపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లు(రెబల్స్) నన్ను మోసం చేశారు. పార్టీని చీల్చారు. శివ సేన గౌరవ వ్యవస్థాపకులు బాల్‌థాక్రే ఫొటోను ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు. దమ్ముంటే.. అలా అడుక్కోవడం ఆపండి. మీ మీ సొంత తండ్రుల ఫొటోలను వాడి ఓట్లు సంపాదించుకోండి’’ అంటూ చురకలంటించారు. వాళ్లు శివ సేన అనే మహా వృక్షానికి పట్టిన చీడ. కుళ్లిన ఆకులు వెళ్లిపోయాయి. అయినా శివ సేనే నేలకు ఒరగదు. నా ప్రభుత్వం కుప్పకూలినా.. నా పదవి పోయినా.. నాకేం బాధ లేదు. కానీ, నా సొంత వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారన్న బాధను సహించలేకపోతున్నా. ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న సమయంలో.. కోలుకోలేని దెబ్బ వేశారు నా అనుకున్నవాళ్లే. నమ్మి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన వ్యక్తే నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎలాగైనా పార్టీని నిలబెడతాడన్న నమ్మకం అతనిపై ఉండేది. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్లతో పొత్తు పెట్టుకున్నాడు. కుట్రకు తెరలేపాడు. ఆ నమ్మక ద్రోహికి సవాల్ చేస్తున్నా.. నీ తండ్రి ఫొటోతో ఎన్నికల్లో నెగ్గి చూపించూ.. అంటూ పరోక్షంగా షిండేపై విమర్శలు గుప్పించారాయన. తన తండ్రి తర్వాత పార్టీ చీలిపోకుండా ఉండేందుకు తాను ప్రయత్నించానని, కానీ, అయినవాళ్లే ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర పార్టీలకు చెందిన గొప్ప నాయకుల పేర్లను, వాళ్ల పాపులారిటీని వాడుకుని బీజేపీ లాభపడాలని ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్ నుంచి సర్దార్ పటేల్‌ను ఎలాగ వాడుతుందో.. ఇప్పుడు తన తండ్రి(బాల్‌థాక్రే) విషయంలోనూ అదే పని చేస్తోందని చెప్పారు. బాల్ థాక్రేకు అసలైన వారసులం, శివ సైనిక్లం తామేనంటూ మహారాష్ట్ర సీఎం షిండే ప్రకటించిన నేపథ్యంలో.. ఉద్దవ్ థాక్రే ఇలా తీవ్రంగా స్పందించారు. -
ఉద్ధవ్‌కు మరో షాక్!.. ఆ జిల్లాలో శివసేనకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, ముంబై: శివసేన నేత, మాజీ మంత్రి అర్జున్ ఖోత్కర్ సోమవారం ఉద్ధవ్ ఠాక్రేతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంలో చేరారు. ఇటీవలే అర్జున్ ఖోత్కర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ శిందేతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రాగానే నేరుగా ముఖ్యమంత్రి శిందే వర్గంలో చేరారు. శిందే వర్గంలో అర్జున్ చేరడంతో శివసేనకు మంచి పట్టు ఉన్న జాల్నా జిల్లాలో ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి దెబ్బ తగిలినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఎంపీ సమావేశం జరిగింది. అదే రోజు ఖోత్కర్ ఢిల్లీ ప్రయాణమయ్యారు. అక్కడ మహారాష్ట్ర సదన్‌లో శిందేతో భేటీ అయినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన శిందే వర్గంలో చేరుతుండవచ్చని అప్పుడే జాల్నా నియోజక వర్గంలో ఊహగానాలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే నిజమైంది. నేరుగా ఆయన శిందే వర్గంలో చేరారు. అర్జున్‌కు శివసేన పార్టీలో ఓ నిబద్ధతగల కార్యకర్తగా పేరుంది. ఆయన నేతృత్వంలో జాల్నా జిల్లాలో పార్టీ పటిష్టంగా తయారైంది. ఎప్పుడు, ఎలాంటి ఎన్నికలు జరిగిన జాల్నా జిల్లాను ఖోత్కర్ కాపాడుతూ వస్తున్నారు. అయితే 2019 జరిగిన ఎన్నికల్లో అర్జున్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు శిందే వర్గంలో చేరి పోయిన ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలాఉండగా మరఠ్వాడ రీజియన్ శివసేనకు కంచుకోట గా పేరుంది. కానీ తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో శివసేన రోజురోజుకూ బలహీన పడసాగింది. మరఠ్వాడలో అతిపెద్ద జిల్లా గా పేరుగాంచిన సంభాజీనగర్ (ఔరంగాబాద్)లో అనేక మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు శిందే వర్గంలో చేరారు. తిరుగుబాటు నేతల వలసలను ఆపడం ఉద్ధవ్ ఠాక్రేకు కష్టసాధ్యంగా మారింది. ము ఖ్యంగా రెండు రోజుల కిందటే యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, తిరుగుబాటు నేతల వలసలను ఆపేందుకు ఇక్కడ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా బలప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీలో జరుగుతున్న చీలికలను అరికట్టేందుకు, ఉద్దవ్ ఠాక్రేపై పడుతున్న భారాన్ని తన భుజస్కందాలపై వేసుకునేందుకు ఆదిత్య ఠాక్రే మూడు రోజులపాటు పలు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. చీలికలవల్ల మానసికంగా కుంగిపోతున్న పార్టీ కార్యకర్తలకు, పదాధికారులకు ఆయన మనోధైర్యాన్ని నూరిపోశారు. మన భగ్వా–మనదే శివసేన అనే నినాదంతో అందరితో భేటీ అయి, జరుగుతున్న పరిణామాలతో కుంగిపోవద్దని కార్య కర్తలకు, కిందిస్థాయి నేతలకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ ఆయన సభ జరిగిన రెండు రోజుల్లోనే అర్జున్ ఖోత్కర్ శిందే వర్గంలోకి ప్రవేశించి శివసేనను ఊహించని విధంగా దెబ్బ తీశారు. దీంతో ఆదిత్య ఠాక్రే పర్యటన, నూరిపోసిన మనోధైర్యం ఎలాంటి ప్రభావం చూపలేదని దీన్ని బట్టి స్పష్టమైతోంది. శివసేనకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. -
'మమ్మల్ని వెన్నుపోటు పొడిచినప్పుడే ఉద్ధవ్ తలరాత డిసైడ్ అయ్యింది'
ముంబై: బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఎన్సీపీతో చేతులు కలిపినప్పుడే ఉద్ధవ్ థాక్రే తలరాత ఖరారైందని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిప్పుడు ఆయనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్సీపీతో జతకట్టాలని ఉద్ధవ్ ముందుగానే నిర్ణయించుకున్నారని చెప్పారు. అది అసహజ కూటమి అన్నారు. ఆ రోజు తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ నుంచి స్పందన రాలేదని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వడం ఎవరికీ ఇష్టం లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలంతా తననే ముఖ్యమంత్రి కావాలనుకున్నారని, కానీ అలా జరగకపోయేసరికి బాధపడ్డారని తెలిపారు. తాము అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పనిచేస్తున్నామని నిరూపించేందుకే షిండేకు సీఎం బాధ్యతలు అప్పగించామని ఫడ్నవీస్ వివరించారు. బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని ఫడ్నవీస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీ చేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు -
Maharashtra political crisis: రాజ్యాంగపరమైన ప్రశ్నలెన్నో!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన, రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లు పార్టీల్లో చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత తదితరాలకు సంబంధించి పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వీటన్నింటినీ విస్తృత ధర్మాసనం లోతుగా మదింపు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలేందుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి ఉద్ధవ్, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై జస్టిస్ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ ఉద్ధవ్ వర్గం తరఫున, హరీశ్ సాల్వే తదితరులు షిండే వర్గం తరఫున వాదనలు వినిపించారు. ప్రజా తీర్పుకు విలువేముంది: సిబల్ మహారాష్ట్రలో జరిగినట్టు అధికార పార్టీని ఇష్టానుసారం చీలుస్తూ పోతే ప్రజా తీర్పుకు విలువేముందని సిబల్ ప్రశ్నించారు. ‘‘ఫిరాయింపులను నిరోధించే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌కు కూడా విలువ లేకుండా పోతుంది. వేరే పార్టీలో విలీనానికే తప్ప ఇలాంటి చీలికలకు ఫిరాయింపుల నుంచి రక్షణ వర్తించబోదు. అలా కాదని మెజారిటీ సూత్రాన్నే అంగీకరించాల్సి వస్తే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్నీ సులువుగా కూలదోయవచ్చు. పార్టీల్లో చీలికలను నిషేధిస్తున్న రాజ్యాంగ రక్షణకు అర్థమే ఉండదు. ఇదో ప్రమాదకరమైన పోకడకు దారితీస్తుంది’’ అన్నారు. బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి ఓటేసినందుకు షిండే వర్గానికి చెందిన 40 మంది సేన ఎమ్మెల్యేలపై పదో షెడ్యూల్లోని రెండో పేరా ప్రకారం అనర్హత వేటు పడ్డట్టేనని వాదించారు. అంతేగాక వివాదం సుప్రీంకోర్టులో ఉండగా గవర్నర్ కొత్త ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయించడమూ సరికాదన్నారు. సీఎంను మారిస్తే కొంపలేమీ మునగవు: సాల్వే సిబల్ వాదనలను సాల్వే తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన కొంపలు మునగవన్నారు. నాయకున్ని మార్చాలని పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఒక్కటై ప్రధానిని కూడా వద్దు పొమ్మని చెప్పవచ్చు. కాబట్టి మహారాష్ట్ర ఉదంతానికి సంబంధించినంత వరకు ప్రజాస్వామ్య సంక్షోభం తదితరాల్లోకి పోకుండా స్పీకర్ ఎన్నిక చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్నదానికే వాదనలు పరిమితం కావాలి’’ అని సూచించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ రమణ స్పందిస్తూ మహారాష్ట్ర ఉదంతం పలు రాజ్యాంగపరమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు. ‘‘10వ షెడ్యూల్లో మూడో పేరా తొలగింపు తర్వాత పార్టీలో చీలికకు గుర్తింపు లేకుండా పోయింది. దీని తాలూకు పరిణామాలెలా ఉంటాయో ఆలోచించాల్సి ఉంది. పార్టీ చీలికను గుర్తించే విధానం లేకపోవడం, పార్టీలో మైనారిటీలో పడ్డ నాయకునికి చట్టసభల్లోని తమ పార్టీ నేతను తొలగించే అధికారముందా వంటివన్నీ లోతుగా చర్చించాల్సన అంశాలు. ఇరుపక్షాల వాదనలూ విన్నాక, వీటిలో పలు అంశాలను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి నివేదిస్తాం. అందుకే ఏయే అంశాలపై విచారణ జరపాలో ఇరు వర్గాలూ ఆలోచించుకుని జూలై 27కల్లా మా ముందుంచాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేశారు. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. బలపరీక్ష, స్పీకర్ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకు ఉద్ధవ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న షిండే వర్గం విజ్ఞప్తిపై అప్పటిదాకా ఏ చర్యలూ చేపట్టొద్దని స్పీకర్‌ను ఆదేశించారు. -
Shiv Sena: ఆగని ఫిరాయింపులు.. ఆదిత్య ఠాక్రే కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు యువ నేత ఆదిత్య ఠాక్రే నడుం బిగించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో చీలికలను అరికట్టేందుకు మూడు రోజులపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలైన భివండీ, నాసిక్, దిండోరీ, సంభాజీనగర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో ఆదిత్య ఠాక్రే పర్యటించనున్నారు. ఆ తరువాత రెండో దశ పర్యటనలో మరికొన్ని నగరాలు, పట్టణాలను ఎంచుకోనున్నారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రే ‘మన భగ్వా (కాశాయం జెండా)–మనదే శివసేన’ అనే నినాదంతో ప్రధాన నగరాలు, పట్టణాలను పర్యటిస్తూ ప్రజలతో సంప్రదింపులు జరుపనున్నారు. అదేవిధంగా నియోజక వర్గాలలోని శివసేన ప్రతినిధులు, పదాధికారులు, కార్యకర్తలతో చర్చిస్తారు. శిందే వర్గంలో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఏక్నాథ్ శిందే తిరుగుబాటు చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఊహించని విధంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత ఏక్నాథ్ శిందే బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని విధంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గట్ నాయకులు, శాఖ ప్రముఖులు, విభాగ ప్రముఖులు, కార్పొరేటర్ స్ధాయి నుంచి ఎమ్మెల్యేల స్ధాయి వరకు ఇలా అనేక మంది శిందే వర్గంలో చేరుతున్నారు. తాజాగా మరో 12 మంది శివసేన ఎంపీలు శిందే వర్గంలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలా దశల వారిగా కిందిస్ధాయి కార్యకర్త నుంచి పైస్ధాయి ఎంపీల వరకు శివసేనతో తెగతెంపులు చేసుకుంటున్నారు. శిందే వర్గంలో చేరికల వల్ల శివసేన రోజురోజుకూ బలహీన పడుతోంది. పదాధికారులు, కార్యకర్తలు మనోస్ధైర్యాన్ని కోల్పుతున్నారు. చీలికలను నియంత్రించేందుకు శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేనా భవన్లో ఉద్ధవ్ ఠాక్రే తరచూ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ పార్టీ నుంచి బయటపడే వారి సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రేపై పడుతున్న అదనపు భారాన్ని కొంతమేర తన భుజస్కందాలపై వేసుకోవాలని ఆదిత్య భావించారు. అందులో భాగంగా ఇటీవల నెలకొన్న తాజా పరిణామాలతో ఆత్మస్ధైర్యం కోల్పోయిన శివసైనికులను ఓదార్చడం, వారికి మనోధైర్యాన్ని నూరిపోసేందుకు యువనేత నడుం బిగించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ శిందే, ఆయన శిబిరంలో చేరిన మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు గుప్పించనున్నారు. వీరంతా శివసేనను మోసగించిన తీరును ప్రజల ముందు ఎండగట్టనున్నారు. బలహీనపడుతున్న శివసేనను తిరిగి పటిష్టం చేయడానికి తనవంతుగా ప్రయత్నం చేయనున్నారు. బాల్ ఠాక్రే బతికుండగా శివసేన పార్టీ గర్జించే సింహం లాగా కనిపించేదని, ఇప్పుడు అదేవిధంగా శివసేన పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
సాక్షి కార్టూన్ 21-07-2022
-
అదే జరిగితే రాజకీయాలు వదిలేస్తా: సీఎం షిండే
ముంబై: రాజకీయ సంక్షోభ ఎపిసోడ్‌ను ప్రజల మది నుంచి తుడిచేసేందుకు.. పాలనా పరమైన సంస్కరణలను తెరపైకి తీసుకొస్తున్నారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. అయితే శివ సేన అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే మాత్రం.. రెబల్ ఎమ్మెల్యేలపై విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా థాక్రే చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు సీఎం షిండే. ‘‘అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీతో కలిసి ఘన విజయం సాధిస్తాం. రెబల్స్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా గెలవరని కొందరు అంటున్నారు. కానీ, నేను చెప్తున్నా.. అందరికి అందరూ గెలుస్తారు. దానికి నాది బాధ్యత. వీళ్లలో ఏ ఒక్కరూ ఓడినాసరే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. అసలు ఓడిపోతారని.. గెలుస్తారని చెప్పడానికి నువ్వెవరు? అదంతా ప్రజలు.. ఓటర్లే నిర్ణయించేది’’.. అంటూ పరోక్షంగా ఉద్దవ్ థాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెబల్స్ శివసేన ఎమ్మెల్యేల్లో నలభై మంది ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవరని, కావాలంటే ఛాలెంజ్‌కు సిద్ధమని శివసేన పార్టీ అధినేత ఉద్దవ్‌థాక్రే వ్యాఖ్యానించారు. దీంతో థాక్రే పేరెత్తకుండానే.. శుక్రవారం సాయంత్రం రెబల్ ఎమ్మెల్యే సంజయ్ షిర్సత్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం షిండే పైవ్యాఖ్యలు చేశారు. -
కీలక నిర్ణయాలకు షిండే స్టే.. వివిధ రంగాల నుంచి తీవ్ర వ్యతిరేకత
సాక్షి,ముంబై: శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు ఇప్పటి ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే స్టే ఇచ్చారు. తాజాగా శిందే తీసుకున్న నిర్ణయంతో వివిధ రంగాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దు కావడానికి ఒకరోజు ముందు నిర్వహించిన (చివరి) మంత్రిమండలి సమావేశంలో ఔరంగాబాద్ పేరు సంజాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్‌గా నామకరణం చేసే ప్రతిపాదనను ఉద్ధవ్ ఠాక్రే ఆమోదించారు. దీంతో ఔరంగాబాద్ పట్టణ వాసులు అప్పట్లో ఆనందోత్సవాలు జరుపుకున్నారు. కానీ, తాజాగా శిందే తీసుకున్న నిర్ణయంతో పట్టణవాసుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో మళ్లీ సంబాజీనగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళనకు దిగాల్సి వస్తుందని ప్రజలు సంకేతాలిస్తున్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగిన ఏక్నాథ్ శిందే గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు చీలిపోవడంతో శివసేనపై తిరుగుబాటు చేశారు. బీజేపీతో కలిసి పొత్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఆఘాడి ప్రభుత్వం కూలిపోవడం, శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, పదవీ బాధ్యతలు చేపట్టడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే హయాంలో మంత్రిమండలిలో తీసుకున్న కీలక నిర్ణయాలపై శిందే దృష్టి సారించారు. అందులో గత అనేక సంవత్సరాలుగా పెండింగులో ఉన్న వివాదస్పద ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయించారు. కానీ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో శిందే, ఫడ్నవీస్ కలిసి ఇరు నగరాలకు కొత్తగా చేసిన నామకరణానికి స్టే ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై పునరాలోచిస్తామని వెల్లడించారు. శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావుత్ తీవ్రంగా ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే ఎవరిని లెక్కచేయకుండా హిందూత్వానికి కట్టుబడి ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయించారు. కానీ, శిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం ఆ నిర్ణయానికి స్టే ఇచ్చి నకిలీ హిందూత్వవాదులని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి నకిలీ హిందూత్వవాదులను ఎక్కడ చూడలేదని వ్యాఖ్యానించారు. -
వీడిన ఉత్కంఠ.. ద్రౌపది ముర్ముకే సపోర్ట్
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది. నిన్న(సోమవారం) ఎంపీలతో జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు మెజార్టీ సభ్యులు ముర్మువైపే మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో అధిష్టానం సైతం ఆ దిశగా సానుకూలత చూపిస్తోంది. మహారాష్ట్ర జనాభాలో పది శాతం ఎస్టీ జనాభా ఉంది. ఈ తరుణంలో.. గిరిజన కమ్యూనిటీకి చెందిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని సేన ఎంపీలు.. శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేపై ఒత్తిడి తెచ్చారు. మొత్తం 22 ఎంపీలకుగానూ 16 మంది(ఇద్దరు షిండే గూటిలో ఉన్నారు) ముర్ముకే మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో శివసేన రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో దాదాపుగా ఒక స్పష్టత వచ్చినట్లయ్యింది. మరోవైపు ఈ మధ్యాహ్నాం సంజయ్ రౌత్.. రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలోనూ ఒక స్పష్టత ఇచ్చేశారు. సోమవారం ఎంపీల సమావేశంలో ద్రౌపది ముర్ము మద్దతు అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే.. ముర్ముకు మద్దతు ఇచ్చినంత మాత్రానా బీజేపీకి సపోర్ట్ చేసినట్లు కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం బలంగా ఉండాలన్నది మా ఉద్దేశం. యశ్వంత్ సిన్హా విషయంలోనూ శివ సేన సానుకూలంగానే ఉంది. గతంలో ఎన్డీయే అభ్యర్థికి కాకుండా.. ప్రతిభా పాటిల్‌కు మద్దతు ఇచ్చాం. ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చాం. ఒత్తిడిలో శివసేన ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. శివసేన ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. అంటూ సంజయ్ మాట్లాడారు. సంకుచిత స్వభావం కాదు.. ఉద్దవ్‌థాక్రే శివసేనది సంకుచిత స్వభావం కాదని, తనపై ఎవరి ఒత్తిడి ఉండదని.. ఉండబోదని శివసేన చీఫ్ ఉద్దవ్ ధాక్రే స్పష్టం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముకు తాము మద్దతు ప్రకటిస్తామని స్వయంగా వెల్లడించిన ఆయన.. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఆమెను బలపర్చకూడదు. కానీ, మేమంతా సంకుచిత స్వభావం ఉన్నవాళ్లం కాదు. అందుకే గిరిజన మహిళకు మద్దతు ప్రకటిస్తున్నాం అని ఉద్దవ్ థాక్రే తెలిపారు. ఇక రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన.. రాజకీయాలు పట్టించుకోదని, గతంలో మాదిరే ఇప్పుడు గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చి తీరుతుందని ఎంపీ గజానన్ కిరీట్కర్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలో మల్లగుల్లాలు పడుతుంటే.. పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంది శివసేన. అందుకే కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో అప్పటి నుంచి ఎవరికి మద్దతు ఇస్తుందా? అనే ఆసక్తికర చర్చ నడుస్తూ వచ్చింది. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలు.. చంద్రబాబు ఎక్కడ?? -
తెగని ‘మహా’ పంచాయితీ.. ఇంతకూ అసలైన ‘సేన’ ఎవరిది?
కొన్ని వారాలుగా మహా రాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. శివ సేన సీనియర్ నేత ఏక్నాథ్ శిందే 34 మంది ఎమ్మెల్యే లతో తిరుగుబాటు చేసి, ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మద్దతుతో శిందే వర్గం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 288 కాగా 164 మంది సభ్యుల మద్దతు శిందే వర్గానికి లభించింది. ఈ మొత్తం సంక్షోభంలో ఒక కీలక ప్రశ్నకు సమా ధానం లభించలేదు. తమదే నిజమైన శివసేన అని ఇరు పక్షాలూ ప్రకటించుకుంటున్న నేపథ్యంలో శిందే, అతడి రెబల్ ఎమ్మెల్యేలకు ఉన్న రాజ కీయ అనుబద్ధత ఏమిటి? శిందేకు స్పష్టంగానే శివసేన శాసన సభ్యుల మద్దతు ఉంది. కానీ ఆ ప్రాతిపదికన మొత్తం శివసేన తనదే అని హక్కును చాటు కోవడానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సరి పోతుందా? ఏది నిజమైన శివసేన అనేదాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయిస్తుంది. పార్టీ అధినేతగా ఠాకరేని తొలగించి పార్టీ స్టేటస్‌ని మార్చాల్సిందిగా శిందే వర్గం ఇప్పటికే ఈసీని కలిసింది. కానీ ఈ అంశంపై చట్టం చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాం గంలోని పదవ షెడ్యూల్ ఆర్టికల్ 191 (2)లో దీనికి సమాధానం కనబడుతుంది. ఫిరాయింపు దారులను ‘అనర్హుల’ను చేసే నిబంధనలు పదో షెడ్యూ ల్లో ఉన్నాయి. వీటిని రాజ్యాంగ (52వ సవరణ) చట్టం, 1985లో పొందుపరిచారు. పార్టీనుంచి ఫిరాయిం చిన ప్రజాప్రతినిధిని అనర్హుడిని చేయాలని ఇది స్పష్టంగా పేర్కొంది. ఏ పార్టీ అయినా మరొక పార్టీలో విలీనం కావాలంటే పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఆ విలీనానికి అను కూలతను ప్రదర్శించాలని రాజ్యాంగ (91వ సవరణ) చట్టం–2003 పేర్కొంది. పదవులిస్తామనో, ఇతర ఆశలు చూపో రాజ కీయ ఫిరాయింపులకు పాల్పడే దుష్టకార్యాలను నిరోధించడమే పదో షెడ్యూల్ లక్ష్యం. ఎందుకంటే ఫిరాయింపులు మన ప్రజాస్వామ్య పునాదులను ప్రమాదంలోకి నెడతాయి. అందుకే పార్లమెంటు ఉభయ సభలకు లేదా శాసన సభలకు చెందిన సభ్యుడిని అనర్హుడిని చేయడమే ఫిరాయింపులకు తగిన చికిత్స అని పదో షెడ్యూల్ నిర్దేశించింది. పదో షెడ్యూల్ శాసనసభా పార్టీలో చీలికను గుర్తించ లేదు. దానికి బదులుగా అది విలీనాన్ని గుర్తిస్తోంది. కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే ఉద్ధవ్ ఠాకరే వర్గం ఇప్పుడు మైనారిటీలో ఉంటోంది కాబట్టి తమదే నిజమైన శివసేన అని చెప్పుకునే స్వతంత్ర హక్కు శివసేన రెబల్స్‌కు లేదు. అనర్హత నుంచి తప్పించుకోవా లంటే ఒక పార్టీలోని మూడింట రెండొంతుల సభ్యులు మరో పార్టీలో విలీనం కావలసి ఉంటుంది. శివసేన రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్న వాస్తవం రెండు వర్గాలకూ తెలుసు. సేన రాజ్యాంగంలో పార్టీ పతాక, పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తు వంటివాటి కోసం విడి విడిగా ఆర్టికల్స్ ఉన్నాయి. ముంబై దాదర్ లోని సేన భవన్ పార్టీ రిజిస్టర్డ్ ఆఫీసుగా ఉంది. ఇది సంస్థాగత చట్రాన్ని అందిస్తుంది. ఈ చట్రంలో శివసేన అధ్య క్షుడికి పార్టీలో కీలక స్థానం ఉంటుంది. సేన అధ్యక్షు డికి సర్వాధికారాలు ఉంటాయి. రాష్ట్రీయ కార్యకా రిణి సభ్యుల నుంచి ప్రతినిధి సభకు ఎన్నికైన సభ్యులు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. శివసేన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పార్టీలో అత్యున్నత అధికారం ఉంటుంది. పార్టీ పాలసీ, యంత్రాంగానికి సంబంధించిన అన్ని విష యాల్లో అతడి నిర్ణయమే ఫైనల్ అవుతుంది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 పేర్కొన్న ఏ పదవినైనా, నియామకాన్నయినా పార్టీ అధ్యక్షుడు నిలిపి వుంచ గలడు లేదా తొలగించగలడు. శివసేన శాసన సభా పక్షనేతకైనా ఇదే వర్తిస్తుంది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అధ్యక్షుడికి తప్ప మరే ఇతర పార్టీ ఆఫీస్ బేరర్‌కి గానీ, సభ్యుడికి గానీ ఎవరినీ పార్టీ నుంచి బహిష్కరించే అధికారం లేదు. ఆఫీసు బేరర్లు, ప్రజా సంఘాల పనులకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్రీయ కార్యకారిణికి ఉండగా, దాని సమావేశా లను నిర్ణయించే అధికారం పార్టీ అధ్యక్షు డికి ఉంటుంది. అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్. కాబట్టి పార్టీ సభ్యులను, ఆఫీస్ బేరర్లను తొలగించే అధికారం పార్టీ రాజ్యాంగం ప్రకారం శివసేన అధ్యక్షుడిగా ఠాకరేకి ఉంటుంది. శిందేకు గానీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలకుగానీ అలాంటి అధికారాలు ఉన్నాయని ప్రకటించుకునే అధికారం లేదు. తిరుగుబాటుదారులకు మూడింట రెండొం తుల మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడి అధి కారాలను తమవిగా వీరు ప్రకటించుకోలేరు. మహా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గానీ, సుప్రీంకోర్టుగానీ ఇలాంటి అధికారాలను రెబెల్స్‌కి ఇవ్వలేరు. ఎన్నికల కమిషన్ వద్ద అయినా, శిందే వర్గం శివసేనపై తన చట్టబద్ధతనూ, హక్కులనూ నిరూ పించుకోవడం కష్టమే. పార్టీ చిహ్నం, పార్టీ గుర్తుపై ఎలాంటి హక్కు ప్రక టించుకోవాలన్నా శివసేనలోని రెండు వర్గాలూ పార్టీ రాజ్యాంగంపైనే ఆధారపడాలి. శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఠాకరేని తొలగిస్తే తప్ప, రెబల్స్ పార్టీపై ఎలాంటి హక్కునూ ప్రకటించు కోలేరు. పార్టీ చిహ్నం, పార్టీ ఎన్నికల గుర్తు వంటి వాటిపై అసోసియేట్ హక్కులను కూడా వీరు పొందలేరు. వ్యాసకర్త: అభయ్ నెవగీ, సీనియర్ న్యాయవాది (‘ది వైర్’ సౌజన్యంతో...) -
ఉద్దవ్ థాక్రే నెత్తిన పిడుగు.. సేన ఎంపీల అల్టిమేటం!
ముంబై: శివ సేన ఎంపీలు తమ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రేకు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. బీజేపీ-ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ప్రకటించాలంటూ శివ సేన లోక్‌సభ ఎంపీలు ముక్తకంఠంతో పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ముంబైలో ఇవాళ(సోమవారం) జరిగిన కీలక సమావేశంలో వాళ్లు పార్టీ వ్యతిరేక గళం వినిపించినట్లు సమాచారం. భేటీ అనంతరం సేన ఎంపీ గజానన్ కిరీట్కర్ మాట్లాడుతూ.. ముర్ము గిరిజన మహిళ అయినందున ఆమెనే బలపర్చాలని, ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే వాళ్ల నిర్ణయానికి అధిష్టానం ఎలా స్పందించిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. శివ సేనకు 18 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా.. మీటింగ్‌కు పదమూడు మంది హాజరైనట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు ఎంపీలు సంజయ్ జాదవ్, సంజయ్ మాండలిక్, హేమంత్ పాటిల్‌కు భేటీకి హాజరుకాకపోయినా.. ద్రౌపది ముర్ముకే మద్ధతు ప్రకటిస్తామని తెలిపినట్లు గజానన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. శివసేనకు మహారాష్ట్ర నుంచి 18 మంది లోక్‌సభ ఎంపీలు ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతాల తరపున ఎంపీ కాలాబెన్ డేల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీలలో ఇద్దరు రెబల్స్ ఉండగా.. భావనా గవాలి, శ్రీకాంత్ షిండే(సీఎం ఏక్నాథ్ షిండే తనయుడు) భేటీకి దూరంగా ఉన్నారు. భేటీ జరిగింది, కానీ.. అయితే శివ సేన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తున్న విషయంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మరోలా స్పందించారు. మాతోశ్రీలో లోక్‌సభ ఎంపీల భేటీ జరిగిందని, 15 మంది హాజరయ్యారని చెప్తున్నారు. అయితే భేటీలో ఏం చర్చించారనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో భేటీలు ఉద్దవ్ థాక్రేకు అల్టిమేటం జారీ చేశారని, కుదరకపోతే.. ఎంపీలు సైతం షిండే గూటికి తరలిపోయే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి.. ఎంపీల జంప్? -
మహారాష్ట్ర సీఎం షిండే సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శనివారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీతో మంత్రి వర్గ విస్తరణ కోసం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి కీలక నేతలను కలిశారాయన. ఈ క్రమంలో.. సీఎం షిండే శివసేన పరిణామాలపై తొలి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సేన గుర్తు కోసం ఆయన శిబిరం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆశ్రయిస్తారా? అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. కాలమే సమాధానం ఇస్తుందని బదులిచ్చారు. పార్టీ గుర్తు కోసం పోరాటం అనేది నా ఒక్కడి నిర్ణయం కాదు.. నాతోటి సభ్యులతో చర్చించాలి. వాళ్లు ఎలా నిర్ణయిస్తే.. అలా ముందుకెళ్తాం అని బదులిచ్చారు ఆయన. అంతేకాదు.. శివ సేన సంక్షోభాన్ని చల్లార్చేందుకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను ఒప్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అయితే తమ అభ్యర్థనలు బెడిసికొడుతున్నాయని ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. బీజేపీకి ప్రభుత్వాలు కూలగొట్టడం అలవాటని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, ఇప్పుడు అదే విమర్శ ఎందుకు రావడం లేదు?.. ఎందుకంటే.. ఇది మహారాష్ట్ర ప్రజల కోరిక కూడా. ప్రజాభీష్టం మేరకే బీజేపీతో పొత్తుకు వెళ్లామని షిండే వివరించారు. మహా వికాస్ అగాడి కూటమిలో శివసేన ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని మేం వాదించాం. కానీ, ఆ ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. బాలాసాహెబ్(బాల్‌థాక్రే) ఏనాడూ కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు కోరుకోలేదు. పైగా దూరంగా ఉండాలనే అంటుండేవారు అని సీఎం షిండే పేర్కొన్నారు. Maharashtra CM Eknath Shinde & Deputy CM Devendra Fadnavis called on PM Narendra Modi in Delhi today (Source: PMO) pic.twitter.com/ri1Xp9fE0W — ANI (@ANI) July 9, 2022 మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిపాలని డిమాండ్ చేసిన ఉద్దవ్ థాక్రే.. రెబల్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే శివసేన గుర్తుతో కాకుండా వేరే గుర్తుతో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంతేకాదు.. శివసేన పార్టీ గుర్తు తమతోనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ దరిమిలా కౌంటర్‌గా మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం షిండే స్పందించారు. మహారాష్ట్ర విషయంలో ప్రధాని మోదీ ఒక విజన్‌తో ఉన్నారని, ఆయన ఆశీస్సులు తీసుకునేందుకే వచ్చానని షిండే వెల్లడించారు. మధ్యంతర ఎన్నికల ప్రస్తావనే ఉండబోదన్న షిండే.. సీఎంగా తన ప్రభుత్వ పదవీకాలం పూర్తి చేసి మరీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. షిండే వర్గంలోని పదహారు మందిని అనర్హులుగా ప్రకటించాలన్న ఉద్దవ్ థాక్రే పిటిషన్‌ను జులై 11న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. दिल्ली दौऱ्यादरम्यान आज भारतीय जनता पक्षाचे राष्ट्रीय अध्यक्ष मा.श्री.@JPNadda यांची सदिच्छा भेट घेतली. यावेळी राज्याच्या वतीने त्यांना विठोबा रखुमाईची मूर्ती भेट म्हणून दिली. pic.twitter.com/Ize8tzdaOX — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 9, 2022 -
అధికారం పోయింది, మరి పార్టీ?
మహారాష్ట్ర తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాకరేకు దక్కిందేమిటి? శివ సైనికుడైన ఏక్నాథ్ శిందేకు మహారాష్ట్ర అత్యున్నత పదవి లభించడం ఠాకరే కుటుంబా నికి చెంపపెట్టు అనడంలో ఏం సందేహమూ లేదు. ఏక్నాథ్ శిందేను సీఎం కుర్చీకి ఎంపిక చేయడం ద్వారా బీజేపీ ఆయన వర్గం ఎమ్మెల్యేలకు అధికారిక గుర్తింపునిచ్చింది. ఈ ‘రెబెల్’ వర్గం మహా రాష్ట్రలో అసలైన శివసేనగా ఎదుగుతుంది. శిందే వర్గ మిప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి శివసేన ఎన్నికల గుర్తు విల్లూ బాణాన్ని తమకు కేటాయించాల్సిందిగా కోరగలదు. నమ్మకస్థులని అనుకున్న వాళ్లే తనను వదిలేసి నప్పుడే ఉద్ధవ్ భవిష్యత్తును ఊహించి ఉండాల్సింది. పైగా నష్ట నివారణ చర్యలు తీసుకోకపోగా... కొడుకు ఆదిత్యనాథ్, పార్టీ వాగుడుకాయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ద్వారా కుప్పకూలిపోతుందని స్పష్టంగా తెలిసినా ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రెండున్నర ఏళ్ల క్రితం బీజేపీ అధికారం చేపట్టేందుకు ఉద్ధవ్ అంగీకరించి ఉంటే సీఎంగా రెండు న్నరేళ్లు ఆయన కొనసాగి ఉండేవారు. ఒకవేళ రెండున్న రేళ్ల తరువాత పదవి నుంచి తప్పుకొనేందుకు బీజేపీ నిరాకరించి ఉంటే, బీజేపీ ద్వంద్వ ప్రమాణా లను ఎత్తి చూపే అవకాశం దక్కేది. అలా చేసి ఉంటే పార్టీ విడిపోయే ప్రమాదం కూడా తప్పి ఉండేదేమో! లేదా ఏ సైద్ధాంతిక అంశాన్ని అయినా ఎంచుకుని ఉద్ధవ్ బీజేపీ భాగస్వామ్యాన్ని నిరాకరించి ఉండవచ్చు. ఔరం గాబాద్ పేరు శంభాజీ నగర్‌గా మార్చేదైనా ఒక అంశం అయ్యుండేది. అధికారం వదులుకునే క్రమంలో ఉద్ధవ్ తీసుకున్న చివరి నిర్ణయం ఇదే కావడం ఇంకో వైచిత్రి. 1994లో బీజేపీ, శివసేన రెండూ వేర్వేరుగా ఎన్నికల బరిలో దిగినప్పుడు శివసేన ఇచ్చిన హామీల్లో ఒకటి ఔరంగాబాద్ పేరు మార్చడం. హిందుత్వ అనుకూలమైన ఈ వాగ్దానమే సేనకు ఓట్ల వర్షం కురిపించింది. గాంధియన్ సోషలిజమ్ విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఘోరమైన ఓటమి తరువాత బీజేపీ తన తప్పులను దిద్దుకునే ప్రయత్నం చేసింది. బాల్ ఠాకరే నేతృత్వంలోని శివసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు కారణంగా బీజేపీ తన హిందుత్వ అజెండాను రాష్ట్రం నలుమూలలకూ విస్తరించగలిగింది. శివసేనకు కూడా ఈ సందర్భంలోనే ఉత్తర/దక్షిణ భారతదేశాల వ్యతిరేకత కలిగిన పార్టీ అన్న ముద్రను చెరిపేసు కునేందుకు మంచి అవకాశం లభించింది. బాల్ ఠాకరే సంపాదించిన రాజకీయ బలం మొత్తాన్నీ 22 ఏళ్ల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఉద్ధవ్ వృథా చేసినట్లు అయ్యింది. ఆదిత్య ఠాకరేను తన వారసుడిగా శివసేన అధ్యక్షుడిగా ప్రకటించేందుకు తొందరపడటం కూడా పార్టీ సీని యర్ నేతల తీవ్ర విమర్శలకు కారణమైంది. నిజానికి బాల్ ఠాకరే ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రకమైన అధికారమూ చేపట్టలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు సొంత కుమారుడిని కాదని పార్టీ సీనియర్ నేత, నమ్మకస్థుడైన మనోహర్ జోషీ పేరు ప్రతిపాదించారు. ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఉద్ధవ్‌కు అధికారం లేకుండా పోయింది. అదే సమయంలో మహారాష్ట్ర మొత్తాన్ని శాసించిన కుటుంబ వారసుడిగా ఉన్న గౌర వమూ పోయింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వ పతనం తరువాత శివసేన, ఎన్సీపీ రెండూ ఇప్పుడు తీవ్ర సవాలు ఎదుర్కొంటున్నాయి. అయితే మహా రాష్ట్రను మళ్లీ పట్టాలెక్కించడం ప్రభుత్వానికీ అంత సులువైన పనేమీ కాబోదు. ఉద్ధవ్ నేతృత్వంలోని ప్రభుత్వం వెళుతూ వెళుతూ దాదాపు 390 నోటిఫి కేషన్లు జారీ చేసింది. వీటిల్లో అత్యధికం ప్రభుత్వం మైనార్టీలో ఉందని నిర్ధారణ అయిన తరువాతే జరిగి నట్లు తెలుస్తోంది. కాబట్టి వీటన్నింటినీ ఛాలెంజ్ చేయడం గ్యారెంటీ! డాక్టర్ శేషాద్రి చారి వ్యాసకర్త ‘ఆర్గనైజర్’ పత్రిక మాజీ సంపాదకులు -
ఉద్ధవ్‌కు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు!
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ ఉద్దవ్ ఠాక్రేను చిక్కులు వీడటం లేదు. పార్టీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నుంచి మొదలైన తలనొప్పులు ఇంకా ఉద్ధవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేకపోతున్న ఠాక్రేకు మళ్లీ కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. కీలకమైన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ముందు శివసేనకు((ఉద్దవ్ వర్గం) మరో షాక్ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్‌లోని శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. ఇప్పటికే 66 మంది రెబెల్ కార్పొరేటర్లు మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండేను బుధవారం రాత్రి ఆయన నివాసంలో కలిసినట్లు తెలుస్తోంది. అయితే 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్ధవ్ ఠాక్రే టీఎంసీపై అధికారాన్ని కోల్పోయారు. ఇక మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ముఖ్యమైన పౌర సంస్థ. చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి ఇప్పటికే అధికారం కోల్పోయి తలపట్టుకుంటున్న ఉద్దవ్‌కు మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేనకు ఉన్న18 మంది ఎంపీల్లో 12 మంది త్వరలో షిండే నేతృత్వంలోని వర్గంలో చేరతారని శివసేన రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ ప్రకటించడం కలకలం రేపుతోంది. కాగా మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో ఉద్ధవ్ ఠాక్రే ముందుగానే సీఎంగ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అధికారం కోల్పోయి రోజులు గడవక ముందే.. మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీ ఎంపీలు వీడతారంటూ ఆందోళనల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందునా.. షిండే వర్గం వైపు శివసేన ఎంపీలు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. థాక్రే టీంలోని లోక్‌సభ ఎంపీ రాహుల్షివాలే.. మంగళవారం రాత్రి ఉద్దవ్ థాక్రేకు ఓ లేఖ రాశారు. గిరిజన మూలాలు ఉన్న ద్రౌపది ముర్ముకు మద్ధతు ప్రకటించాలంటూ కోరారు. ఆపై షిండే శిబిరంలోని ఓ ఎమ్మెల్యే.. శివసేనకు ఉన్న పద్దెనిమిది మంది ఎంపీలలో 12 మంది తమ గూటికే వస్తారంటూ ప్రకటించడం కలకలం రేపింది. ఈ తరుణంలో పార్టీకి కొత్త చీఫ్ విప్‌ను ఎన్నుకున్నారు. ఈ మేరకు శివసేన పార్లమెంటరీ నేత సంజయ్ రౌత్.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహాద్ జోషికి ఓ లేఖ రాశారు. లోక్‌సభ ఎంపీ రాజన్ విచారేను పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నుకుంటున్నట్లు రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఎంపీ భావనా గవాలి స్థానంలో రాజన్ విచారేను ఎన్నుకున్నట్లు, తక్షణమే ఈ నియామకం అమలులోకి వస్తుందని లేఖలో రౌత్ స్పష్టం చేశారు. భావనా గవాలి.. యావత్మల్-వాషిమ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. షిండే శిబిరంలో గవాలి ఉండడంతో ఉద్దవ్ థాక్రే టీం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వంద సీట్లు ఉద్దవ్ థాక్రేవే!
ముంబై: శివ సేన రెబల్స్ తిరుగుబాటు సంక్షోభ సస్పెన్స్ తర్వాత.. బీజేపీ మద్దతుతో షిండే వర్గం అధికారంలో కొలువుదీరింది. అయితే.. శివ సేన మాత్రం తమది నైతిక విజయం అని, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని సవాల్ విసురుతోంది. ఈ తరుణంలో శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ థాక్రే.. కనీసం వంద సీట్లు అయినా గెలుచుకుంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్తున్నారు. కేవలం ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఓటర్లు దూరమైనట్టు కాదని.. మహారాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను(ఈడీ, సీబీఐలను ఉద్దేశిస్తూ..), డబ్బును అడ్డం పెట్టుకుని శివ సేనను హస్తగతం చేసుకోలేరని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టినా ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివ సేన 100 సీట్లకుపైగా గెలుచుకుంటుంది. ఉద్ధవ్ థాక్రేపై ప్రజల్లో సానుభూతి ఉంది. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహం ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోతే.. శివ సేన తమ ఓటర్లను కోల్పోయినట్టు కాదు” అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శివ సేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కూడా ఈ విషయంపై ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలకు సవాలు చేసిన విషయం తెలిసిందే. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ఉద్ధవ్ సవాల్ చేశారు. దానికి కొనసాగింపుగానే తాజాగా సంజయ్ రౌత్ మాట్లాడారు. -
తెగని పంచాయితి.. మహారాష్ట్రలో ఆ 16 మంది ఎమ్మెల్యేల పరిస్థితేంటి?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన ఎమ్మెల్యేలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించినందుకు ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని శివసేన (షిండే వర్గం) చీఫ్ విప్ భరత్ గోగావలే అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ అందించారు. నిబంధనలను అతిక్రమించినందుకు వారిపై చర్యలు తోసుకోవాలని కోరారు. దీంతో ఠాక్రే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలకు సస్పెన్షన్ నోటీసులు జారీ చేయనున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. సీఎం ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన స్పీకర్ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్ జారీ చేశాయి. చదవండి👉Maharashtra political crisis: విల్లు బాణమెవరికో? షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్‌గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. రాహుల్ నర్వేకర్‌కు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. స్పీకర్ ఎన్నిక అనంతరం పార్టీ విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్‌కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్ ప్రభు చెప్పారు. ఠాక్రే వర్గంలోని 16 ఎమ్మెల్యేలే పార్టీ విప్‌ను ధిక్కరించారని షిండే వర్గం చీఫ్ విప్.. స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నాయి. చదవండి👉బల పరీక్షలో నెగ్గిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం -
Maharashtra political crisis: విల్లు బాణమెవరికో?
సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర కొద్ది రోజులుగా తెర వెనుక వ్యూహ ప్రతివ్యూహాలతో, ఎత్తులూ పై ఎత్తులతో పూటకో మలుపుగా సాగిన రాజకీయ రగడ ముఖాముఖి పోరుగా మారుతోంది. చీలిక వర్గం నాయకుడైన సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి బహిష్కరిస్తే, అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష కార్యాలయానికి షిండే వర్గం తాళం వేసింది. సీఎం పీఠం మాదిరిగా పార్టీని కూడా సొంతం చేసుకోవడానికి పెద్ద పులి వారసుడితో ఢీకొట్టేందుకు షిండే సిద్ధమయ్యారు. కానీ పార్టీని, గుర్తును దక్కించుకోవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు షిండే ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఎమ్మెల్మేల మద్దతుకు అదనంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ యంత్రాంగం షిండేకే జై కొట్టాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఎలా నిర్ధారిస్తుంది? ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఉత్తర్వులు, 1968 ప్రకారం గుర్తింపున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తు కేటాయింపు, రద్దు అధికారం ఎన్నికల సంఘానిదే. ఒకే గుర్తుపై పార్టీలో రెండు వర్గాలు పట్టుబడితే వారిలో ఎవరో ఒకరికి కేటాయించవచ్చు. లేదంటే ఇరు వర్గాలకూ ఇవ్వకుండా సదరు గుర్తును ఫ్రీజ్ చేయొచ్చు. దీనిపై కేవలం ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోదు. పార్టీలో ఎన్నో విభాగాలు, కమిటీలు, మండళ్లు ఉంటాయి. అత్యున్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే కార్యనిర్వాహక వర్గం, యువత, మహిళ తదితర విభాగాలు, ఆఫీసు బేరర్లు, జిల్లాస్థాయిలో పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలు ఇలా అందరు ఎవరి వైపు ఉంటారో విచారిస్తుంది. ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపిస్తున్నారో స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు పార్టీ గుర్తు, గుర్తింపులతో పాటుగా ఆస్తిపాస్తులన్నీ వాళ్లపరమే అవుతాయి. ఈసీ నిర్ణయంపై కోర్టుకు వెళ్లొచ్చు కూడా. తొలి కేసు ఇందిరదే పార్టీ గుర్తు కోసం ఈసీ ముందుకు వెళ్లిన తొలి కేసు దివంగత ప్రధాని ఇందిరాగాంధీదే. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిలబెడితే, ప్రధానిగా ఉన్న ఇందిర ఆ నిర్ణయాన్ని బేఖాతర్ చేసి ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.నిజలింగప్ప జారీ చేసిన విప్‌ను ధిక్కరించి గిరికి మద్దతు నిలిచారు. ఆత్మప్రబోధ నినాదంతో ఆయన్ను గెలిపించుకున్నారు కూడా. దాంతో ఇందిరను పార్టీ నుంచి బహిష్కరించారు. ఫలితంగా కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. నిజలింగప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ (ఒ), ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) అప్పటి పార్టీ చిహ్నమైన కాడెద్దుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. చివరికి కాడెద్దుల గుర్తు నిజలింగప్ప వర్గానికే దక్కింది. ఇందిర వర్గానికి ఆవు, దూడ గుర్తు ఎన్నికల చిహ్నంగా వచ్చింది. తర్వాత దాదాపు పదేళ్లకు 1978లో మళ్లీ కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు ఇందిరా కాంగ్రెస్ (ఐ)కి హస్తం గుర్తు లభించింది. తాజా వివాదాలు... గత అక్టోబర్‌లో బిహార్‌లో లోక్ జనశక్తి పార్టీలో చిరాగ్ పాశ్వాన్, పశుపతి కుమార్ పరాస్ చీలిక వర్గం మధ్య విభేదాలొస్తే పార్టీ పేరు, గుర్తు, బంగ్లాను తమ తుది నిర్ణయం దాకా ఎవరూ వాడొద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. దాంతో ఉప ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి (రామ్‌విలాస్ పాశ్వాన్) పేరుతో, హెలికాప్టర్ గుర్తుతో; పరాస్ వర్గం రాష్ట్రీయ లోక్‌జనశక్తి పేరుతో, కుట్టు మిషన్‌తో పోటీ చేశాయి. తమిళనాడులో జయలలిత మరణానంతరం రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు పోటీపడ్డాయి. దాంతో ఆ గుర్తును 2017 మార్చి దాకా ఈసీ స్తంభింపజేసింది. అవినీతి కేసుల్లో జైలు పాలైన శశికళపై నాటి సీఎం పళనిస్వామి తిరుగుబాటు చేసి పన్నీర్ సెల్వంతో చేతులు కలపడంతో రెండాకుల గుర్తు వారి పరమైంది. యూపీలో 2017లో సమాజ్‌వాదీ పార్టీలో తండ్రి ములాయంపై కుమారుడు అఖిలేశ్ తిరుగుబాటు చేసి పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అసలు పార్టీ తనదేనంటూ ములాయం ఈసీకి ఫిర్యాదు చేసినా యంత్రాంగమంతా అఖిలేశ్ వైపు నిలవడంతో సైకిల్ గుర్తు ఆయనకే దక్కింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏక్నాథ్ షిండే శివసేన సభ్యత్వం తొలగింపు
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు.. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఝలక్ ఇచ్చారు. షిండేను శివసేన పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారాయన. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినందుకుగానూ తొలగిస్తున్నట్లు శుక్రవారం ఓ అధికారిక లేఖ ద్వారా షిండేకు థాక్రే తెలియజేశారు. శివసేన పక్ష ప్రముఖ హోదాలో ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండేను శుక్రవారం సాయంత్రం పార్టీ నుంచి తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడినందుకుగానూ స్వచ్ఛందంగా ఆయన(షిండే) తన సభ్యత్వాన్ని కోల్పోయారని, ఇకపై పార్టీలోని ఏ పదవిలోనూ(ప్రాథమిక సభ్యత్వంతో సహా) ఆయన ఉండబోరని లేఖలో థాక్రే వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మెజార్టీ ఎమ్మెల్యేలతో మద్దతుతో తనదే సిసలైన శివసేన వర్గంగా ప్రకటించుకున్న ఏక్నాథ్ షిండే.. పార్టీ చీఫ్‌గా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. కాకపోతే బాల్‌థాక్రేకు తానే నిజమైన రాజకీయ వారసుడిగా పేర్కొంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లో ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చేసుకున్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం మాత్రం తమదే అసలైన శివసేన అంటూ సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా పేర్కొంది. ఈ పంచాయితీ ఎటూ తేలని తరుణంలో.. సాంకేతికంగా ఇప్పటికీ ఉద్దవ్ థాక్రే నే శివసేన అధినేతగా కొనసాగుతున్నారు. బీజేపీ మద్ధతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిండే.. మెజారిటీని నిరూపించుకునేందుకు బలపరీక్షను ఎదుర్కొన్నారు. ఇందుకోసం జూలై 2 నుంచి మహారాష్ట్ర శాసనసభలో రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. చదవండి: ఫడ్నవిస్ అసంతృప్తి.. బీజేపీ సంబురాలకు దూరం! -
కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన
సాక్షి, ముంబై: నాటకీయ పరిణామాల మధ్య శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ విషయాన్ని భాగోద్వేగంతో బుధవారం రాత్రి ప్రకటించారు. దీనిపై ఇటు మహావికాస్ ఆఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు, సొంత పార్టీ శివసేన నాయకులు, సంజయ్ రావుత్, ఇతర పార్టీల పదాధికారుల నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. కానీ ఉద్ధవ్ సోదరుడు, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి రాజ్ ఠాక్రే నుంచి ఉద్ధవ్‌ను ఓదార్చడం, బాధ, ఆవేదన, సానుభూతిలాంటి ఎలాంటి స్పందనలు రాలేదు. ఒకవేళ రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరకు ఉద్ధవ్ రాజీనామా చేసిన 15 గంటల తరువాత అంటే.. గురువారం ఉదయం ఎట్టకేలకు రాజ్ ట్విటర్లో స్పందించారు. అందులో ఉద్దవ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కాని పరోక్షంగా వ్యాఖ్యలు మాత్రం ఆయనపై చేశారు. ‘ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, అధికారం చేతిలో ఉంది కదాని విర్రవీగితే పరిస్ధితులు ఇలాగే ఉంటాయి’ అని చురకలంటించారు. మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగించాలని అప్పట్లో రాజ్ చేసిన ప్రకటన చర్చల్లోకి వచ్చింది. చదవండి: నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న లౌడ్స్పీకర్లను తొలగించాలని ఆందోళన చేస్తున్న, మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా వినిపిస్తున్న ఎమ్మెన్నెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాజ్ ఠాక్రే ఆఘాడి ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు ఒక లేఖ రాశారు. అందులో నేను మీకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దు, అధికారం ఇవ్వాళ ఉంటుంది. రేపు పోతుంది. అధికారాన్ని పుట్టుకతోనే అమ్మ కడుపులోంచి ఎవరు తెచ్చుకోలేదు. ఉద్ధవ్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు నెలన్నర కిందట రాసిన ఆ లేఖను గురువారం మళ్లీ ట్విటర్లో పెట్టారు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్
ముంబై: సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిసిన ఉద్దవ్.. షిండే అసలైన సీఎం కాదని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం ముందుకెళ్లరాదని హెచ్చరించారు. ముంబైలోని సేన భవన్లో ఉద్దవ్ శుక్రవారం మాట్లాడుతూ.. మెట్రో కార్ షెడ్‌ను ఆరే కాలనీకి మార్చవద్దని కోరారు. ముంబై పర్యావరణాన్ని నాశనం చేయొద్దని సూచించారు. ‘నాకు ద్రోహం చేసినా పర్లేదు కానీ ముంబైకు ద్రోహం చేయకండి. నా మీద కోపాన్ని ముంబై ప్రజలపై చూపించొద్దు. మెట్రో షెడ్ ప్రతిపాదనను మార్చవద్దు. మేము అభివృద్ధికి అడ్డుపడటం లేదు కానీ ముంబైని వెనుకబాటు గురి చేయకుండా పాలించండి. ముంబై పర్యావరణంతో ఆటలాడకండి. పర్యావరణానికి హాని చేసే ఈ నిర్ణయం మంచిది కాదు. మేం దానికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించాం. పర్యావరణ సహితంగా నిర్ణయం తీసుకోండి నేడు సీఎం పదవిని బీజేపీ కాదనుకుంది. నేను రెండున్నర సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాను. శివసేన, భాజపా ముఖ్యమంత్రి పదవిని సగం కాలం పంచుకోవాలని నాకు, అమిత్ షా అదే ఫార్ములా నిర్ణయించుకున్నాం. 2019లో కుర్చీల పంపకాన్ని ఎందుకు తిరస్కరించింది. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంది’ అని ఠాక్రే ప్రశ్నించారు. చదవండి: మహారాష్ట్ర: షిండే రాక.. కాషాయ నేతల్లో అప్పుడే కలకలం.. ప్రాజెక్టు వివాదం ఏంటీ ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మించాలని అప్పట్లో ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు బీఎంసీ, మెట్రోరైల్ కార్పొరేషన్ అనుమతులు కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లు నరకాల్సి వస్తుంది. దీనిపై పర్యావరణ వేత్తలనుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. తర్వాత 2019లో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో లైన్ 3 కారిడార్ షెడ్‌ను ఆరే కాలనీలో నిర్మించడాన్ని వ్యతిరేకించింది. దీన్ని కుంజుర్‌మార్గ్‌కు మార్చాలని నిర్ణయం తీసుకుంది. అఘాడి ప్రభుత్వం ఆరే కాలనీని రిజర్వ్ అటవీ ప్రాతంగా గుర్తించింది. అయితే మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండే మెట్రో కార్ షెడ్‌పై ఉద్దవ్ నిర్ణయాన్ని పక్కనపెట్టి తిరగి ఆరే కాలనీలో చేపట్టాలని నిర్ణయించారు. కంజుర్మార్గ్ నుంచి మళ్లీ ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్‌ను మారుస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు. -
ఉద్ధవ్ ఠాక్రే ముందు పెను సవాల్.. బయటపడతారా?
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే, బీజేపీతో చేతులు కలిపి పంతం నెగ్గించుకున్నారు. బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి భంగపడ్డారు. ఇప్పుడు ఆయనకు మరో సవాల్ ఎదురుకానుంది. తన తండ్రి స్థాపించిన పార్టీలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా, లేదా అనేది మరాఠా రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. శివసేన పార్టీకి చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది ఏక్నాథ్ షిండేతో జట్టు కట్టారు. చట్టబద్దంగా శివసేన పార్టీ తమకే చెందుతుందని ఆయన వాదిస్తున్నారు. బాల్ ఠాక్రే కుమారుడిగా ఉద్ధవ్ ఠాక్రేను తామంతా గౌరవిస్తామని ఆయన అంటున్నారు. వెంటనే పార్టీ పగ్గాలు ఉద్ధవ్ ఠాక్రే నుంచి లాగేసుకుంటారా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. అటు బీజేపీ కూడా తమ కంటే తక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు కలిగిన ఏక్నాథ్ షిండేకు సీఎం పీఠాన్ని కట్టబట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ భవిష్యత్‌పై ఎలా ఉండబోతుందన్నది అంతుబట్టడం లేదు. చేతులారా చేసుకున్నారా? ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తుత పరిస్థితికి ఆయన నిర్ణయాలే కారణమని షిండే వర్గం ఆరోపిస్తోంది. సుదీర్ఘ కాలం మిత్రపక్షంగా ఉన్న బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టడమే ఉద్ధవ్ రాజకీయ పతనానికి నాంది పలికిందని అంటున్నారు. తాము తిరుగుబాటు చేసినప్పుడైనా ఆ రెండు పార్టీలతో తెగతెంపులు చేసుకునివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోవడంతో పాటు పార్టీ పగ్గాలు కూడా కోల్పోయే ప్రమాదం దాపురించిందన్నారు. అయితే రెండు వర్గాలుగా చీలిపోయిన పార్టీపై పట్టు సాధించడానికి ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి వ్యూహాలు అవలంభిస్తారో చూడాలి. (క్లిక్: శివసేనకు వెన్నుపోటు పొడిచి మొత్తం ఆయనే చేశారు!) -
ఔరంగాబాద్ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం
సాక్షి, ముంబై: ఔరంగాబాద్ పేరు మారుస్తూ మహా రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తప్పుబట్టారు. అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఔరంగాబాద్కో చరిత్ర ఉందని, దాన్నెవరూ చెరపలేరని అన్నారు. ఎంవీఏ నేతలు... ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరును తమ రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉందన్న ఇంతియాజ్, నిర్ణయానికి వ్యతిరేకంగా అవసరమైతే తాము వీధుల్లోకొస్తామని స్పష్టం చేశారు. పేరు మార్చడానికి ముందు ఔరంగాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారని, కానీ అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఔరంగాబాద్ శివసేన, మహానవనిర్మాణ్ సేన, బీజే పీ నేతలు స్వాగతించారు. ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమో దించాలని ఎమ్మెల్సీ అంబదాస్ అన్నారు. ఔరంగాబాద్ పేరు మార్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తన తండ్రి బాల్ ఠాక్రే హామీ ఉద్ధవ్ నెరవేర్చారని, ఇక ఆమో దం విషయంలో బీజేపీ ఎంత చిత్తశుద్ధి చూపుతుందో తెలుస్తుందని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని ఇంకాస్త ముందు తీసుకు ని ఉంటే బాగుండేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతుల్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఎమ్మెల్యేలను వదులుకున్నారు.. ఎన్సీపీని వదలలేరా? -
52 మందిని వదులుకున్నారు.. ఎన్సీపీని వదలలేరా? ఉద్ధవ్‌ను ప్రశ్నించిన రెబల్ మంత్రి
ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన 52 మంది ఎమ్మెల్యేలను వదులుకున్నారని, అయితే ఎన్సీపీని మాత్రం వదలలేక పోతున్నారని శివసేన రెబెల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు అవకాశవాదులు కాదని, వారు సీఎంను ఒప్పించలేని స్థితిలో పార్టీ కోసం, తమ నాయకుడి కోసం అన్నీ చేశారని పాటిల్ అన్నారు. శివసేనపై గత వారం సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే ప్రారంభించిన తిరుగుబాటులో గులాబ్‌రావు పాటిల్ కూడా ఉన్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో తమ పార్టీతో అధికారాన్ని పంచుకున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో సంబంధాలు తెంచుకోవాలని తిరుగుబాటు శాసనసభ్యులు ఉద్ధవ్ ఠాక్రేను కోరుతున్నారు. ‘ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని, 52 మంది ఎమ్మెల్యేలను విడిచిపెట్టాడు. కానీ శరద్ పవార్‌ను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు’ అని అసమ్మతి శిబిరం విడుదల చేసిన ప్రసంగంలో పాటిల్ తన తోటి రెబల్ శాసనసభ్యులతో అన్నారు. చదవండి: శివసేనకు వెన్నుపోటు పొడించింది ఆయనే! -
శివసేనకు వెన్నుపోటు పొడిచింది ఆయనే!
Maharashtra Political Crisis ముంబై: శివసేనలో సంక్షోభానికి మూల కారకుడు సంజయ్ రౌత్ అనేది ఆ పార్టీ రెబల్స్ ఆరోపణ. అంతేకాదు ఎన్సీపీతో కుమ్మక్కై ఆయన తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతోంది. ‘‘మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఉద్దవ్ థాక్రే అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. సంజయ్ రౌత్ ఎన్సీపీకి విధేయుడిగా వ్యవహరించాడు. అందుకే శివసేనకు వెన్నుపోటు పొడిచాడు’’ అని రెబల్స్ తరపున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ గురువారం ఉదయం మీడియాతో స్పందించారు. సొంత మనుషులే శివసేనను వెన్నుపోటు పొడిచారని, తనపై ఈడీ కేసు కూడా రాజకీయ ప్రతీకారమంటూ తాజాగా సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. దీపక్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఉద్దవ్ థాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు. మహా వికాస్ అగాఢితో తెగదెంపులు చేసుకుంటే మేం ఆయనతో చర్చించేవాళ్లం. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేవాళ్లం కూడా కాదు. ఇప్పటికీ మేం థాక్రేను గౌరవిస్తున్నాం’’ అని దీపక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏక్నాథ్ షిండే గోవా నుంచి ముంబైకి బయలుదేరారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. కేవలం ప్రజల్లో సానుభూతి కోసమే సంజయ్ రౌత్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఉద్దవ్ థాక్రే నిన్న(బుధవారం) రాజీనామా చేశారు. కానీ, మాకు ఆయన్ని తప్పించే ఉద్దేశం లేదు. ఇప్పటికీ మేం శివసేనలోనే ఉన్నాం. ఆయన్ని అగౌరవపరచడం, బాధపెట్టడం మా ఉద్దేశాలు ఎంత మాత్రం కాదు.. అని రెబల్స్ తరపున దీపక్ కేసర్కర్ మీడియాకు తెలిపారు. Maharashtra BJP leader Devendra Fadnavis will decide the oath-taking date. It is the prerogative of the Governor to give him that date. Our negotiations have already started and we will form a govt: Shiv Sena MLA Deepak Kesarkar, spokesperson of the Eknath Shinde camp pic.twitter.com/8skbQ8IgEf — ANI (@ANI) June 30, 2022 చదవండి: థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం! -
థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం: రెబల్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగి వేళ.. శివసేన రెబల్స్ గువాహతి నుంచి ముంబైకి కాకుండా నేరుగా గోవాకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి.. ఎమ్మెల్యేకు రాజీనామా, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు దగ్గర పడిన టైంలోనే తిరిగి స్వరాష్ట్రంలో అడుగుపెట్టాలని, మద్ధతు ప్రకటించాలని షిండే వర్గం భావిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్‌థాక్రే రాజీనామా చేయడం తమకు సంతోషాన్ని ఇవ్వడం లేదని రెబల్స్‌లో కొందరు భావిస్తున్నారు. ఉద్దవ్ థాక్రే మేం లేవనెత్తిన అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన రాజీనామా మాకేం సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పోరాడుతున్నప్పుడు.. మా నాయకుడిపై కూడా కోపం తెచ్చుకున్నందుకు మేమంతా బాధపడ్డాము.. అందుకు కారణం.. ఎన్సీపీ, సంజయ్ రౌత్. ప్రతీరోజూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు చేసిన కామెంట్లే.. మాలో అసంతృప్తిని రగిల్చాయి. వాళ్ల వల్లే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు చెడిపోయి.. పొసగని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా సంజయ్ రౌత్ జోక్యాలు ఎక్కువై పోవడం పట్ల మాలో చాలామందికి అసంతృప్తిగా ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చేయడంతో పాటు బీజేపీతో జట్టు కట్టడంపై మేమంతా ఏకతాటిగా నిలిచి డిమాండ్ చేశాం అని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్‌ఖర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎనిమిది రోజుల కిందట మొదలైన మహారాజకీయ సంక్షోభం.. బుధవారం రాత్రి ఉద్దవ్ థాక్రే రాజీనామాతో తెర పడింది. మహా వికాస్ అగాఢి కూటమిని వ్యతిరేకిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలతో గుజరాత్ సూరత్‌కు చేరుకున్నారు షిండే. ఆ సమయంలో ముంబై నుంచి మంతనాలు మొదలుకావడంతో.. రెబల్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు గువాహతి(అస్సాం)కు షిప్ట్ చేశారు. అక్కడ మరికొందరు తిరుగుబాటుకు మద్ధతు ప్రకటించారు. నలభై మంది శివ సేన ఎమ్మెల్యేలు పది మంది ఇతరులు.. మొత్తంగా 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు కూటగట్టుకున్నాడు ఏక్నాథ్ షిండే. చదవండి: మహా రాజకీయం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం! -
ఫొటోగ్రాఫర్ నుంచి సీఎం దాకా..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫొటోగ్రఫీపై మంచి అభిరుచి కలిగిన ఉద్ధవ్ ప్రస్థానం ఆసక్తికరం. తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి, ఓనమాలు నేర్చుకున్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారు. మరాఠా పులి బాలాసాహెబ్ బాల్ ఠాక్రే–మీనా ఠాక్రే ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే 1960 జూలై 27న జన్మించారు. ముంబైలో బాలమోహన్ విద్యామందిర్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. ‘సర్ జె.జె.ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్’లో ఫొటోగ్రఫీ ప్రధాన సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2002లో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ప్రచార బాధ్యుడిగా సేవలందించారు. ఈ ఎన్నికల్లో శివసేన మెరుగైన ఫలితాలు సాధించడంతో పార్టీలో ఉద్ధవ్ ప్రతిష్ట పెరిగింది. 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2006లో పార్టీ పత్రిక ‘సామ్నా’ చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019లో రాజీనామా చేశారు. మోస్టు పాపులర్ సీఎం 2012లో బాల్ ఠాక్రే మరణించడంతో, 2013లో శివసేన అధినేతగా ఉద్ధవ్ ఠాక్రే పగ్గాలు చేపట్టారు. ఉద్ధవ్ నాయకత్వంలో మహారాష్ట్రలో 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా చేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపారు. మహా వికాస్ అఘాడీ పేరిట మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పదవి ఉద్ధవ్‌ను వరించింది. మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి నాయకుడు ఉద్ధవ్ కావడం విశేషం. 2021లో 13 పెద్ద రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ‘మోస్టు పాపులర్ సీఎం’గా ఉద్ధవ్‌కు అత్యుత్తమ ర్యాంకు దక్కడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మంది మళ్లీ ఉద్ధవ్‌కే ఓటు వేస్తామని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకు చిన్నప్పటి ఫొటోగ్రఫీపై అమితాసక్తి. ఆయన తీసిన ఎన్నో ఫొటోలను ఎగ్జిబిషన్లను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రకృతి అందాలను, కోటలను ఆయన కెమెరాల్లో చక్కగా బంధించారు. ఉద్ధవ్ 1989లో రష్మీ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఆదిత్య, తేజస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివసేన యువజన విభాగం అధ్యక్షుడైన పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర కేబినెట్లో పర్యాటకం, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చిన్నకుమారుడు తేజస్ ఠాక్రే పర్యావరణ పరిరక్షకుడిగా, వైల్డ్‌లైఫ్ పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. వివాదాలు.. ఆరోపణలు ► మహారాష్ట్ర ప్రభుత్వంపై ఠాక్రే కుటుంబ పెత్తనంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిపాలనలో ఉద్ధవ్ భార్య, కుమారుడి జోక్యం మీతిమీరుతోందంటూ సాక్షాత్తూ శివసేన ఎమ్మెల్యేలే రచ్చకెక్కారు. ► మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న అభియోగాలు ఉద్ధవ్‌పై ఉన్నాయి. ► పార్టీలో సంక్షోభం ముదురుతున్నా గుర్తించకపోవడం, నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం ఉద్ధవ్ పదవికి ఎసరు తీసుకొచ్చింది. ► అనైతిక పొత్తులను శివసేన నేతలు, ప్రజా ప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలతో తలపడి, ఫలితాల తర్వాత అవే పార్టీలతో జతకట్టడం చాలామందికి నచ్చలేదు. ► బలమైన నాయకుడైన ఏక్నాథ్ షిండేను పక్కనపెట్టి, సంజయ్ రౌత్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఎమ్మెల్యేలు సహించలేకపోయారు. -
ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. బలపరీక్షపై స్టే విధించలేమని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
తుది అంకానికి ‘మహా’ సంక్షోభం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. బలపరీక్షపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. బలపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బలపరీక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఫ్లోర్ టెస్ట్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుంది. చదవండి: నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి: సీఎం ఉద్దవ్ భావోద్వేగం -
శివసేన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఇరు వర్గాల వాదనలివే!
సాక్షి, న్యూఢిల్లీ: శివసేన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడీవేడి విచారణ కొనసాగుతోంది. శివసేన తరపున అభిషేక్ సింఘ్వి, షిండే తరపున ఎంకే కౌల్ వాదనలు వినిపించారు. మరోవైపు సుప్రీంకోర్టు విచారణను సీఎం ఉద్దవ్ ఠాక్రే నిశితంగా గమనిస్తున్నారు. సుప్రీం తీర్పును అనుసరించి సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ బల పరీక్షలకు సుప్రీం అనుమతిస్తే రాజీనామా చేస్తానని కేబినెట్ భేటీలో సీఎం ప్రకటించిన విషయం తెలసిందే. రేపు బల పరీక్ష సాధ్యం కాదు బల నిరూపణకు ఒక రోజు మాత్రమే సమయం ఇవ్వడం అన్యాయమని శివసేన లాయర్ సింఘ్వి కోర్టుకు వాదనలు వినిపించారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిందని, మరికొంతమంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉన్నారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో బల పరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రేపు సాధ్యం కాదని అన్నారు. బల పరీక్ష, అనర్హత పరస్పర సంబంధం ఉన్న వ్యవహారాలని, అనర్హత పిటిషన్ కోర్టు వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. విపక్ష నేతలు చెప్పినట్లు గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనర్హులైన ఎమ్మెల్యేలను బల పరీక్ష నుంచి మినహాయించాలని కోరారు. అయితే ఎవరు అర్హులో, ఎవరు అనర్హులో మీరు ఎలా నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు జస్టిస్ సూర్య కాంత్ ప్రశ్నించారు. 16 మందిని అనర్హులుగా ప్రకటించమని స్పీకర్‌ను కోరారని.. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. అలాంటప్పుడు వారు ఎలా అనర్హులవుతారని ప్రశ్నించారు. చదవండి: నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి: సీఎం ఉద్దవ్ భావోద్వేగం బలపరీక్ష ఆపొద్దు ప్రజాస్వామ్యంలో బలపరీక్ష కీలకమైందని, ఎట్టి పరిస్థితుల్లో బల పరీక్షను ఆపొద్దని షిండే లాయర్ ఎంకే కౌల్ వాదనలు వినిపించారు. గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నాయన్నారు. మెజార్జీ ఎమ్మెల్యేలు షిండే వైపే ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి విశ్వాసాన్ని కోల్పోతే బల పరీక్ష అత్యవసరమన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్ ఠాక్రే విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ‘కోవిడ్ నుంచి కోలుకున్న గవర్నర్ రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించకూడదా? బల పరీక్ష ఎదుర్కొనేందుకు సీఎంకు ఇష్టం లేదంటేనే.. ఆయన విశ్వాసం కోల్పోయారని అర్థమవుతోంది. 9 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు షిండేనే సమర్థిస్తున్నారు. షిండే వర్గానిదే అసలైన శివసేన. బల పరీక్షల కోసం గవర్నర్‌కు కేబినెట్ సలహాలు అక్కర్లేదు. సభలో మెజారిటీ నిరూపణకు బలపరీక్షే ఆయుధం. స్పీకర్‌ను ఉంచాలా;.. తొలగించాలా? అన్నది ముందు నిర్ణయించాలి. అనర్హత పిటిషన్, ఫ్లోర్ టెస్ట్.. రెండు వేరు వేరు అంశాలు’ అని కోర్టుకు తెలిపారు. మధ్యప్రదేశ్ అంశాన్ని ప్రస్తవించిన షిండే లాయర్.. బలనిరూపణను వాయిదా వేస్తే బేరసారాలు జరిగే అవకాశం ఉందన్నారు. చదవండి: మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్నాథ్ షిండే ప్లాన్ ఇదే! -
నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి: సీఎం ఉద్దవ్ భావోద్వేగం
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్ బుధవారం సాయంత్రం భేటీ అయ్యింది. రేపటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించారు. కేబినెట్ మీటింగ్‌లో ఉద్వేగభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్ ధన్యవాదాలు తెలిపారు. తన వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించాలని కోరారు. నా వాళ్లే మోసం చేశారు ఈ రెండున్నరేళ్లుగా తనకు అండగా నిలబడిన, సహకరించిన వాళ్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. తన వాళ్లే తనను మోసం చేశారని, ఈ పరిస్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. సుప్రీంకోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. భేటీ అనంతరం మీడియాకు నమస్కరించి ఉద్దవ్ వెళ్లిపోయారు. చదవండి: ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? కాగా మహారాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రెండు నగరాల పేర్లను ఉద్దవ్ సర్కార్ మార్చింది. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా.. ఉస్మానాబాద్ పేరు ధారా శివ్‌గా మార్చింది. నవీముంబై ఎయిర్‌పోర్టు పేరును డీబీ పాటిల్ ఎయిర్‌పోర్టుగా మారుస్తూ ఉద్ధవ్ ఠాక్రే కేబినేట్ ఆమోదం తెలిపింది. -
ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు?
సాక్షి, ముంబై: వేగంగా మారుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్ధానాలు 288 ఉండగా అందులో శివసేనకు 55 ఉన్నాయి. అందులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి 16, ఏక్నాథ్ షిందే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా మొత్తం 36 జిల్లాల్లో ఏక్నాథ్ షిందేకు 18 జిల్లాల్లో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి తొమ్మిది జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే ఉద్ధవ్‌కు 25 శాతం జిల్లాల్లో, షిందే వర్గానికి 50 శాతం జిల్లాల్లో ఎమ్మెల్యేలున్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఏం జరగవచ్చు? ►288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత మెజారిటీ మార్కు 143. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణం వాస్తవ బలం 168. కానీ 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో కనీసం 39 మంది తిరుగుబాట పట్టడం, 10 మందికి పైగా స్వతంత్రులు వారితో చేతులు కలపడంతో కూటమి మైనారిటీలో పడ్డట్టు ఇప్పటికే స్పష్టమైంది. ►బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. షిండే వర్గం మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు దానికి నల్లేరుపై నడకే. అయితే 2019లో ఎన్నికల తర్వాత ఎన్సీపీ చీలిక వర్గంతో హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తలకు బొప్పి కట్టించుకుని మూడు రోజుల్లోనే తప్పుకున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ జాగ్రత్త పడుతోంది. తనకు చెడ్డ పేరు రాకుండా సంకీర్ణాన్ని గద్దె దించడంపైనే దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభం.. ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు? ►షిండే వర్గం గురువారం ముంబై తిరిగొస్తే నేరుగా గవర్నర్‌ను కలిసి సంకీర్ణానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చెప్పడంతో పాటు బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరవచ్చు. అదే జరిగితే సంకీర్ణం కుప్పకూలినట్టే. ►అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో షిండే వర్గం చేతులు కలుపుతుందన్నది ఒక వాదన. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయంటున్నారు. 9 దాకా మంత్రి పదవులిస్తామని బీజేపీ చెబుతోందని, షిండే ఉప ముఖ్యమంత్రి పదవి పట్టుబడుతున్నారని సమాచారం. ►ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసేన దాడుల నేపథ్యంలో శాంతిభద్రతలను కారణంగా చూపి రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేసే ఆస్కారం లేకపోలేదనీ అంటున్నారు. అదే జరిగితే అంతిమంగా అసెంబ్లీ ఎన్నికలకు దారి తీయవచ్చు. చదవండి: మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు -
మహారాష్ట్ర సంక్షోభం.. ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదరడంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. దీంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప కచ్చితమైన ఎమ్మెల్యేల సంఖ్య ఎవరూ బయటపెట్టడం లేదు. శివసేనలో మొత్తం 55 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో 15–20 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం చెబుతోంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకే ఉందని ఉద్ధవ్ మద్దతుదార్లు ప్రకటనలు చేస్తున్నారు. కానీ మా వెంట 40 మంది శివసేన ఎమ్మెల్యేలున్నారని, ఇతరులతో కలిపి మొత్తం 50–55 మంది మద్దతుదారులున్నారని ఏక్నాథ్ షిందే వర్గం ప్రకటిస్తోంది. దీంతో ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారనే దానిపై ఇటు ప్రజల్లో అటు మహావికాస్ ఆఘాడినేతల్లో అయోమయ పరిస్ధితి నెలకొంది. చదవండి: మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్ధానాలు 288 ఉండగా అందులో శివసేనకు 55 ఉన్నాయి. అందులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి 16, ఏక్నాథ్ షిందే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా మొత్తం 36 జిల్లాల్లో ఏక్నాథ్ షిందేకు 18 జిల్లాల్లో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి తొమ్మిది జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే ఉద్ధవ్‌కు 25 శాతం జిల్లాల్లో, షిందే వర్గానికి 50 శాతం జిల్లాల్లో ఎమ్మెల్యేలున్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. -
రెబెల్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగ లేఖ
రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగ లేఖ -
అప్పుడు కుక్కలు, పందులని.. ఇప్పుడు రమ్మని అడుగుతున్నారా?.. షిండే ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజులుగా సాగుతున్న ఎమ్మెల్యేల తిరుగుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. అయితే, తాజాగా ఈ వివాదం కోర్టుకెక్కడంతో త్వరలోనే సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన రెబల్ ఎమ్మెల్యేలంతా గువాహటిలోని ఓ హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌పై ఏక్నాథ్ షిండే మండిపాటు ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెబెల్ ఎమ్మెల్యే తిరిగి ముంబై రావాలని సీఎం ఉద్ధవ్ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ఏక్నాథ్ కౌంటర్ అటాక్ చేశారు. ఈ మేరకు ట్విటర్లో విరుచుపడ్డారు. ‘ఓ వైపు ఆదిత్య ఠాక్రే మమ్మల్ని కుక్కలు, పందులు, మేకలు అని తిడుతూనే.. మరోవైపు తిరిగి రావాలని విజ్ఙప్తి చేస్తున్నారు. మా ఆత్మలు నశించాయని, వట్టి దేహాలే ఉన్నాయని ఒకరు.. ముంబై ఎలా వస్తారో చూస్తామని మరికొందరు శివసేన నేతలు బెదిరించారు. ఇప్పుడే సమస్యలు పరిస్కరించుకుందాం రండి అని పిలుస్తున్నారు’ అని ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు. సంబంధిత వార్త: రెబెల్స్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ భావోద్వేగ లేఖ! एका बाजूला आपल्या पुत्राने व प्रवक्त्याने वंदनीय बाळासाहेबांच्या शिवसैनिकांना डुकरं,नाल्याचीघाण,रेडा,कुत्रे,जाहील व मृतदेह म्हणायचे,त्यांचा बाप काढायचा तर दुसऱ्या बाजूला मात्र हिंदूविरोधी मविआसरकार वाचवण्यासाठी याच आमदारांना समेटाची हाक द्यायची,याचा अर्थ काय?#donttrickmaharashtra — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 28, 2022 దయచేసి ముంబై తిరిగి రండి: ఉద్దవ్ శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మంగళవారం భావోద్వేగ లేఖ రాశారు. రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకు తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని కోరారు. సమయం ఇంకా మించి పోలేదని, రెబెల్ ఎమ్మెల్యేలను శివసేన వదులుకోలేదని, ముంబైకు వస్తే చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. శివసేన ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదని అన్నారు. ‘మీకు సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందాం తప్ప ఇది సరైన దారి కాదు. గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేల గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ అధినేతగా నేను మీ మనోభావాలను గౌరవిస్తాను, ముందుగా ఈ గందరగోళం నుంచి బయటపడండి. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలి. అందరం కలిసి ఒక పరిష్కారం కనుగొద్దాం’ అని ఠాక్రే ఆ లేఖలో సూచించారు. చదవండి: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? -
రెబెల్స్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ భావోద్వేగ లేఖ!
ముంబై: మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. ఈ పోరులో అంతిమ విజయం కోసం ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలను రప్పించేందుకు చివరి ప్రయత్నంగా వారికి భావోద్వేగంగా లేఖ రాశారు. అందులో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో ఏముందంటే.. రెబెల్ ఎమ్మెల్యేలకు రాసిన లేఖలో.. “మీరు తిరుగుబాటు చేసినా, ఇప్పటికీ మీరంతా శివసేనతోనే ఉన్నారు. మీలో చాలా మంది మాతో ఇంకా టచ్‌లో ఉన్నారు. మీ గ్రూప్‌లోని కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను మాకు తెలియజేసారు' అని ఉద్దవ్ లేఖలో పేర్కొన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను శివసేన వదులుకోలేదని, వారంతా ముంబై వచ్చి తనతో మాట్లాడాలని రెబెల్స్‌కు లేఖ ద్వారా ఠాక్రే సందేశం పంపారు. ‘మీకు సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందాం తప్ప ఇది సరైన దారి కాదు. గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేల గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ అధినేతగా నేను మీ మనోభావాలను గౌరవిస్తాను, ముందుగా ఈ గందరగోళం నుంచి బయటపడండి. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలని’ ఠాక్రే ఆ లేఖలో సూచించారు. Maharashtra CM & Shiv Sena chief Uddhav Thackeray appeals to party MLAs in Guwahati, to come & discuss; said "Many of you are in touch with us, you're still in Shiv Sena at heart; family members of some MLAs have also contacted me & conveyed their sentiments to me..." (file pic) pic.twitter.com/6pfhtQs7Go — ANI (@ANI) June 28, 2022 చదవండి: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు.. -
రెండుసార్లు సీఎం రాజీనామా యోచన.. ఆయన వల్లే వెనక్కి!
ముంబై: ‘అస్లీ శివ సేన’ పంచాయితీతో.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పుతో ఊరట పొందిన షిండే రెబల్స్ వర్గం.. గువాహతి(అస్సాం) హోటల్లో ఉంటూనే రాజకీయ సమీకరణాలు చేస్తోంది. మరోవైపు పార్టీ-అధికారం చేజారిపోనివ్వకుండా ప్రయత్నాలు కొనసాగిస్తోంది శివ సేన. ఈ తరుణంలో తిరుగుబాటు పరిణామాలతో కలత చెందిన సీఎం ఉద్దవ్ థాక్రే.. రెండుసార్లు రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు పరిణామాల తర్వాత ఉద్దవ్ థాక్రే.. ముఖ్యమంత్రి పదవికి రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారట. జూన్ 21వ తేదీన రాజీనామా చేయాలనుకున్న థాక్రే.. ఆ విషయాన్ని సాయంత్రం ఐదు గంటల సమయంలో ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రకటించాలని భావించారు. అందుకు కారణం.. పార్టీ నుంచి మరింత మంది రెబల్స్ గ్రూప్‌కు వెళ్తారని ఆయన ఆందోళన చెందారు. ఈ విషయం తెలిసిన మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ నేత ఆ ప్రయత్నాన్ని ఆపేయించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మరుసటి రోజే.. థాక్రే మరోసారి రాజీనామా చేయాలనే ఆలోచనను చేశారట. అందుకే ఉన్నతాధికారుల్ని పిలిపించుకుని ఫేర్వెల్ చర్చలు కూడా చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఫేస్బుక్ ద్వారా రాజీనామా ప్రకటించాల్సి ఉంది. అదే సమయంలో.. మళ్లీ ఆ సీనియర్ నేత జోక్యం చేసుకున్నారు. సుమారు గంటపాటు చర్చించి.. థాక్రే చేత ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరో కాదు.. మహా వికాస్ అగాడి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మౌనంగా, చాకచక్యంగా పోరాటం చేయాలని.. వెన్నుచూపి పారిపోవద్దని థాక్రేకు ఆయన హిత బోధ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఉద్దవ్ థాక్రే.. శివ సేన రెబల్స్‌ను ఎదుర్కొంటానని బహిరంగ ప్రకటన చేశారు కూడా. -
రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం!
ముంబై: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను వేరేవారికి అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూడదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఎవరి శాఖలు... ఎవరికి.. రెబల్స్ గ్రూపు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. అలాగే మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు. శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ మంత్రిగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌తో ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలు ప్రస్తుతం ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే వద్ద ఉన్నాయి. రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు. మరోవైపు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ కీలక నేతలతో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. చదవండి: Maharashtra Poliical Crisis: శివసేన రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ . -
ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్
ముంబై: మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్లోనే మకాం వేసిన ఏక్నాథ్ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది. మరోవైపు రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం ఉద్దవ్ థాక్రే.. అసెంబ్లీలోనే బలనిరూపణకు పట్టుబడతుంది. ఈ క్రమంలో.. సుప్రీం కోర్టుకు మహా పంచాయితీ చేరుకుంది. అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్‌పై వెకేషన్ బెంచ్ ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రెబల్స్ ఇళ్లు, కార్యాలయాలపై శివ సైనికుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం భద్రత కల్పించింది. పదిహేను మంది రెబల్ ఎమ్మెల్యేలకు వై ఫ్లస్ సెక్యూరిటీ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్‌లో ఏక్నాథ్ షిండే పేరు లేకపోవడం గమనార్హం. మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్, సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఆత్మలు చనిపోయాయని, వారి ఉత్త దేహాలు మాత్రమే ముంబైకి తిరిగి వస్తాయని ఆదివారం అన్నారు. ఆ నలభై మంది రెబల్ ఎమ్మెల్యేలు.. బతికి లేరు. తమ చేష్టలతో వాళ్లు వాళ్ల వాళ్ల ఆత్మలను చంపేసుకున్నారు. కేవలం వాళ్ల ఉత్తదేహాలు మాత్రమే మహారాష్ట్రకు తిరిగి వస్తాయి. గువాహతి నుంచి బయటకు అడుగుపెట్టగా.. మనస్ఫూర్తిగా వాళ్లను వాల్లు చంపేసుకున్నట్లే లెక్క. ఆత్మలు లేని వాళ్ల దేహాలు.. పోస్ట్‌మార్టం కోసం వాళ్లను నేరుగా అసెంబ్లీకి పంపడమే మిగిలింది అని రౌత్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలు, అధికార దాహంతోనే ఈ వేరుకుంపటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజుకున్న నిప్పుతో ఏం జరుగుతుందో వాళ్లకు తిరిగొచ్చాక తెలుస్తుందని. అని సంజయ్ రౌత్ హెచ్చరించారు. ‘వాళ్లు ఇక్కడికి వస్తే.. అసలు తిరుగుబాటు ఎక్కడి మొదలైందో స్పష్టత వస్తుంది. వాళ్లు ఏం కోల్పోతున్నారో వాళ్లకు అర్థం అవుతుంది. నిజమైన సైనికుల తీరు ఇది కాదు. అధికారం కోల్పోయే ప్రసక్తే లేదు.. శివ సేన పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు ఎంపీ సంజయ్ రౌత్. చదవండి: రంగంలోకి గవర్నర్.. మహాలో రాష్ట్రపతి పాలన తప్పదా? -
‘మహా’ ట్విస్ట్: పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు.. రాష్ట్రపతి పాలన తప్పదా?
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మొదలైన పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పటికీ సీఎం ఉద్దవ్ థాక్రే ఈ పోరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే బృందం అసలైన బాల్‌ఠాక్రే వారసులం తామేనని ప్రకటించుకున్నారు. మరో వైపు శివసేన కార్యకర్తలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వారి ఆఫీసులపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీస్ చీఫ్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశాలు పాటిస్తున్నారు. ఈ తరుణంలో బలనిరూపణకై రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో అడుగుపెట్టినా వారిపై శివసేన కార్యకర్తల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించే యోచనలో గవర్నర్ ఉన్నట్లు సమాచారం. గవర్నర్ కూడా ఓ వైపు ఎలాంటి అలజడులు లేకుండా పోలీస్ శాఖతో చర్చలు జరుపుతూనే మరోవైపు కేంద్రంతో ఎప్పటికప్పుడు ముంబైలోని పరిస్థితులను వివరిస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్రంతో పూర్తి స్థాయి చర్చించిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా ఎంపీ నవనీత్ కౌర్ రానా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరడం గమనార్షం. శివ సైనికుల గూండాయిజంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పేలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. మరో వైపు సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యే సతీమణీల ఇళ్లకు వెళ్తూ.. తమ భర్తలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని వారిని కోరుతున్నారు. చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే -
Maharashtra Political Crisis: ముదురు పాకాన...
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి సారథి శివసేనలో ఇంటి పోరు మరింత ముదురుతోంది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో రాష్ట్రంలో మంగళవారం మొదలైన రాజకీయ సంక్షోభం నానా మలుపులు తిరుగుతోంది. షిండే సారథ్యంలో నాలుగు రోజులుగా అసోంలోని గౌహతిలో హోటల్లో మకాం చేసిన 40 మందికి పైగా సేన రెబల్ ఎమ్మెల్యేలు తమది శివసేన (బాలాసాహెబ్) వర్గమని ప్రకటించుకున్నారు. తామేమీ పార్టీని వీడటం లేదని, షిండే సూచించిన మేరకు తమ వర్గానికి ఓ పేరు మాత్రం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. సభలోనూ అదే పేరిట కొనసాగుతామనే సంకేతాలిచ్చారు. రెబల్స్ తరఫున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శనివారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్ధవ్‌పై తమకేమీ వ్యతిరేకత లేదన్నారు. ‘‘కానీ 55 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో ఆయన వైపున్న వారి సంఖ్య 15 కంటే తక్కువకు పడిపోయింది. మూడింట రెండొంతుల మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో గళమెత్తుతున్నామంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆయనే అర్థం చేసుకోవాలి. పార్టీని హైజాక్ చేసింది మేం కాదు, అధికార కూటమి భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్. వాటి బారినుంచి పార్టీని కాపాడుకోవడమే మా ఉద్దేశం’’ అన్నారు. ఉద్ధవ్ ఇప్పటికైనా ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పి బీజేపీతో చేతులు కలపాలని డిమాండ్ చేశారు. పార్టీకి మద్దతు ఉపసంహరిస్తారా అని ప్రశ్నించగా తమదే అసలైన శివసేన అని చెప్పుకొచ్చారు. ‘‘ఈ ఒత్తిళ్లలో ముంబై తిరిగి రావడం క్షేమం కాదు. సరైన సమయంలో తిరిగొస్తాం’’ అని ప్రకటించారు. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండేను గుర్తించాలన్న తమ లేఖను డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని ఖండించారు. ‘‘ప్రభుత్వానే ఉద్ధవ్ నెలల తరబడి ఆన్లైన్ మీటింగులతో నడిపిస్తున్నారు. కనుక డిప్యూటీ స్పీకర్‌నూ ఆన్లైన్ మీటింగ్ పెట్టమనండి. మా బలం నిరూపించుకుంటాం’’ అని సవాలు చేశారు. జూన్ 30 దాకా వాళ్లు గౌహతి హోటల్లోనే ఉంటారని సమాచారం. సంకీర్ణ కొండచిలువ విషకౌగిలి నుంచి శివసైనికులను విముక్తులను చేసేందుకే పోరాడుతున్నానంటూ శనివారం రాత్రి పొద్దుపోయాక షిండే ట్వీట్ చేశారు. శివసేన కార్యకర్తలంతా దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఆయన శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని వడోదర వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినట్టు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మహారాష్ట్ర విపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు అందులో పాల్గొన్నట్టు చెబుతున్నారు. ముంబైలో 144 సెక్షన్ మరోవైపు ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన జాతీయ కార్యవర్గ భేటీ జరిగింది. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభ్యులంతా ఉద్ధవ్‌కు కట్టబెట్టారు. శివసేన, బాలాసాహెబ్ ఠాక్రే పేరు ఎవరూ వాడుకోవడానికి వీల్లేదంటూ తీర్మానం చేశారు. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఉద్ధవ్‌కు సంఘీభావం ప్రకటించారు. శివ సైనికులను వీధుల్లోకి వదులుతామంటూ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ప్రకటన చేశారు. దమ్ముంటే ముంబై వచ్చి పార్టీని ఎదుర్కోవాలని షిండేకు సవాలు విసిరారు. సత్యాసత్యాల మధ్య పోరాటంలో గెలుపు తమదేనని ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే అన్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలువురు రెబల్ ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల వద్ద భారీ నిరసనలకు, దాడులకు దిగారు. పలువురి కార్యాలయాలను ధ్వంసం చేశారు. తనతో పాటున్న 38 మంది రెబల్ ఎమ్మెల్యేల కుటుంబాలకు పోలీసులు కావాలనే భద్రత ఉపసంహరించారని షిండే ఆరోపించారు. వీటిని హోంమంత్రి దిలీప్ వాస్లే పాటిల్ ఖండించారు. ఉద్రిక్తత నేపథ్యంలో ముంబైలో జూలై 10 దాకా 144 సెక్షన్ విధించారు. ఉద్ధవ్ ఫిర్యాదు మేరకు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు పంపారు. సోమవారం సాయంత్రంలోగా స్పందించాలని ఆదేశించారు. -
‘మహా’ సంక్షోభం: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆదిత్య ఠాక్రే
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ప్రస్తుతం పతనం అంచుల్లో ఉందన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. ఎవరికి వారు ఈ పోరులో గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా శివసేన మంత్రి ఆదిత్య థాకరే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది సత్యానికి, అబద్ధానికి మధ్య జరిగే యుద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలపై జరిపిన సమావేశంలో ఏమి చర్చించారో మీకందరికీ ఇప్పటికే తెలుసు, అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మాతో పాటు పార్టీ కూడా ఎప్పటికీ మరచిపోదని చెప్పారు. ప్రస్తుత పోరులో తాము ఖచ్చితంగా గెలుస్తామని ఆదిత్య ఠాక్రే చెప్పారు. దీంతో పాటు రెబెల్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండేకు శివసేన షాకిచ్చింది. పార్టీ పేరును, వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఇతరులెవరూ వాడకూడదని సేన జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఇక ఎంవీఏ సర్కార్ సభలో మెజారిటీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రాందాస్ అథవలే శనివారం సవాల్ విసిరారు. చదవండి: ఆ పంచాయితీలో తలదూర్చం.. అలాగని చూస్తూ ఊరుకోం! శివ సైనికులకు ఒకటే వార్నింగ్! -
Maharashtra Political Crisis శివ సైనికులకు కేంద్ర మంత్రి అథవాలే వార్నింగ్!
సాక్షి, ముంబై: మహా రాజకీయ సంక్షోభం ముదురుతున్న వేళ బీజేపీ ‘వేచి చూసే ధోరణి’ని అవలంభిస్తోంది. అవకాశం వస్తే వదులుకోం అన్న సంకేతాలను పార్టీ నేతలు కొందరు ఇస్తుండగా మరికొందరు శివసేన ఇంటి పంచాయితీలో వేలు పెట్టబోమని అంటున్నారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తాజాగా అటువంటి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య పంచాయితీలో జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సింది వారేనని అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో శుక్రవారం జరిగిన భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనే తమకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని పేర్కొన్నారు. శివసేన అంతర్గత విషయాల్లో తలదూర్చకూడదని ఫడ్నవీస్ కూడా అభిప్రాయపడినట్టు అథవాలే తెలిపారు. అది ఎలా సాధ్యం? చాలామంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అయినప్పటికీ సభలో మెజారిటీ నిరూపించుకుంటామని మహావికాస్ అఘాడి సీనియర్లు శరద్ పవార్, అజిత్ పవార్, ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్ చెప్పడం విడ్డూరంగా ఉందని అథవాలే అన్నారు. సొంత పార్టీ నుంచి 37 మంది, 7 నుంచి 8 మంది స్వతంత్ర ఎమ్మేల్యేలు తన వెంట ఉన్నారని ఏక్నాథ్ చెప్పడం కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వారి కార్యాలయాలపై దాడుల ఘటనలపై అథవాలే స్పందించారు. శివసేన ఎమ్మెల్యేలు దాదాగిరి చేస్తే సహించబోమని అన్నారు. తాము కూడా అంతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చారు. కాగా, పుణెలోని శివసేన రెబెల్ఎమ్మెల్యే తానాజి సావంత్ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. శివసైనికులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. వెన్నుపోటుదారులందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. -
Maharashtra Crisis: జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన శనివారం శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఈ భేటీలో శివసేన జాతీయ కార్యవర్గం మొత్తం 6 తీర్మానాలను ఆమోదించింది. ►బాల్‌థాక్రే పేరును షిండే వర్గం వాడకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన జాతీయ కార్యవర్గం. ►దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న శివసేన ►బాల్‌థాక్రే పేరు వాడుకునే అర్హత శివసేనకు మాత్రమే ఉందన్న ఉద్ధవ్ ►శివ సైనికుల నిరసన కారణంగా ముంబైలో వచ్చే నెల 10వరకు 144 సెక్షన్ అమలు ►16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు పంపిన శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు. ►సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ►సోమవారం 5:30కి డిప్యూటీ స్పీకర్‌కార్యాలయం ముందు హాజరుకావాలని ఆదేశాలు ►నోటీసులపై షిండే స్పందించకపోతే చట్టం ప్రకారం ముందుకెళ్తామని డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ తెలిపింది. అవిశ్వాస తీర్మానం తిరస్కరణ ఏక్నాథ్ షిండే వర్గం ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. రెబల్ ఎమ్మెల్యేలు పంపిన లేఖపై ఒరిజినల్ సంతకాలు లేకపోవడంతోనే తిరస్కరించినట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చ ఇదిలా ఉంటే, మరోవైపు తన వర్గ ఎమ్మెల్యేలతో గౌహతిలోని ఓ హోటల్లో శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తమ మద్దతు షిండేకు ఉంటుందని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శివసేన భవన్ ముందు రెబల్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపైన కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. చదవండి: (తెర మీదకు శివసేన కొత్త పార్టీ!.. అగ్గి రాజుకుంటుందని హెచ్చరికలు) -
సొంత వాళ్లే వెన్నుపోటు పొడిచారు: థాక్రే ఆవేదన
మహా రాజకీయ సంక్షోభంలో ఇవాళ(శనివారం) సాయంత్రం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు 40 మంది శివ సేన ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారంటూ ప్రకటించిన రెబల్ నేత ఏక్నాథ్ షిండే.. సాయంత్రంలోగా సంఖ్యా బలం ఆధారంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉండగా.. మరోవైపు శివసేన జాతీయ కార్యవర్గ భేటీ ఈ సంక్షోభాన్ని ఒక కొలిక్కి తీసుకురావొచ్చని.. కార్యకర్తలు ధీమాగా ఉన్నారు. అయితే.. శుక్రవారం పొద్దుపోయాక తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, రెబల్స్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. తన అనారోగ్యాన్ని అదనుగా తీసుకుని.. తిరుగుబాటు మొదలుపెట్టారని మండిపడ్డారు. ‘‘షిండేను సీఎం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చి ఉంటే సరే. కానీ కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి కోసమే ఆయన ఇదంతా చేస్తున్నట్టయితే మాత్రం పదవిని మేమే ఇచ్చేవాళ్లం అని పేర్కొన్నారు. శివసేనలో సొంత మనుషులే ఎప్పుడూ ద్రోహానికి పాల్పడుతుంటారు. అర్హులైన శివసైనికులను కాదని రెబల్ ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్లే సేనకు నష్టం కలిగించాలని చూస్తున్నారు.. వాళ్లపై వేటు ఖాయం అన్నారు థాక్రే. బీజేపీని అంతా అంటరానిదిగా భావించిన రోజుల నుంచీ ఆ పార్టీతో కలిసి నడిచాం. ప్రతిఫలంగా శివసేననే తుడిచిపెట్టేయాలని చూస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘థాక్రే పేరు వాడకుండా రాజకీయాల్లో మనగలవా? పార్టీ నీకేం తక్కువ చేసింది. రెండుసార్లు మంత్రిని చేసింది. నీకు కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ, నీ కుమారుడు ఎంపీ. నా కుమారుడు మాత్రం రాజకీయంగా ఎదగొద్దా?’’అంటూ ఏక్నాథ్ షిండేను నిలదీశారు. ఎమ్మెల్యేల రూపంలో ఎన్నికల ఫలాలను షిండే లాగేసుకున్నా కార్యకర్తల రూపంలో కీలకమైన పార్టీ మూలాలు మాత్రం తమ వద్దే ఉన్నాయన్నారు. శివ సేన అనే మహావృక్షం నుంచి కుళ్లిన ఆకులను తొలగించి పడేయాల్సిందేనన్నారు. బీజేపీపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ.. ‘‘శివసేన నుంచి ఠాక్రేలను వేరు చేయడం ఎవరి తరమూ కాదు. మనవెంట ఎవరూ లేరనే భావిద్దాం. శివసేనను కొత్తగా నిర్మించుకుందాం’’ అని కార్యకర్తలను పిలుపునిచ్చారు. తాను వీడింది సీఎం బంగ్లా మాత్రమే తప్ప పట్టుదలను, పోరాట పటిమను కాదన్నారు. గతంలోనూ ఇలాంటి తిరుగుబాట్లు జరిగినా పార్టీ మళ్లీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. చదవండి: మాట మార్చిన షిండే.. బీజేపీకి సంబంధం లేదా? -
‘మహా’ సంక్షోభం: షిండేపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలై రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వాసపాత్రులమని చెప్పి కొందరు నమ్మక ద్రోహం చేశారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీకి వ్యతిరేకరంగా మారిన రెబల్స్ డబ్బుల కోసం అమ్మడుపోయారని ఆరోపించారు. తాను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు (గత నవంబర్‌లో) కొందరు శివసేన ఎమ్మెల్యేలు తనకు ద్రోహం చేసేందుకు ప్లాన్ చేశారని ఉద్ధవ్ ఆరోపించారు. ప్రస్తుతం తనపై పలు ఆరోపణలు చేస్తున్న ఏక్నాథ్ షిండే కోసం తాను అన్నీ చేశానని ఉద్ధవ్ తెలిపారు. ‘ఏక్నాథ్ షిండే కుమారుడు శివసేనకు చెందిన ఎంపీ, నేను అతని కోసం అన్నీ చేశాను. నాకు ఉన్న శాఖను కూడా షిండేకు కేటాయించారు. అయినప్పటికీ ఏం ఆశించి షిండే నాపై అనేక ఆరోపణలు చేస్తున్నాడో తెలియడం లేదని’ అన్నారు. బాలాసాహెబ్ తనని ప్రేమించిన దానికంటే శివసేననే ఎక్కువగా ప్రేమించేవాడని ఉద్ధవ్ పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి అన్నారు. తాను అసమర్ధుడినని కార్యకర్తలు అనుకుంటే, పదవిపై తనకు వ్యామోహం లేదని శివసేన పార్టీని కార్యకర్తలే ముందుకు నడిపించవచ్చని అయన చెప్పారు. మరో వైపు శుక్రవారం సాయంత్రం మాతోశ్రీ (ఠాక్రే నివాసం)లో ఎన్సీపీ నాయకులు సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవనున్నారు. -
Maharashtra political crisis: షిండే తొలగింపు చెల్లుతుంది!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. పాలక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో జరిగిన సమావేశానికి మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు 13 మందే హాజరైనట్టు సమాచారం. గురువారమే ఒక మంత్రితో సహా మరో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ రెండు గ్రూపులుగా గౌహతి వెళ్లి షిండే గూటికి చేరినట్టు వార్తలొస్తున్నాయి. దాంతో షిండే శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటిందని చెబుతున్నారు. వీరిలో 40 మంది దాకా సేన ఎమ్మెల్యేలు కాగా 10 మంది స్వతంత్రులని సమాచారం. సేన ఎంపీల్లో కూడా పలువురు షిండేవైపు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షిండేతో పాటు 12 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్ జిర్వాల్‌ను శివసేన కోరింది. షిండే తొలగింపు చెల్లుతుంది: డిప్యూటీ స్పీకర్ శివసేన శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండే తొలగింపు చెల్లుబాటు అవుతుందని డిప్యూటీ స్పీకర్ జిర్వాల్ ప్రకటించారు. ఆయన స్థానంలో అజయ్ చౌదరి నియామకాన్ని ఆమోదించినట్టు మీడియాకు తెలిపారు. తమదే అసలైన శివసేనగా గుర్తించాలన్న షిండే లేఖపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు ఉద్ధవ్ తీరును తప్పుబడుతూ రెబెల్ ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ ఆయనకు లేఖ రాశారు. ఇక రెబల్స్ పేర్లతో పార్టీ నూతన శాసనసభా పక్ష నేత అజయ్ చౌదరి, డిప్యూటీ స్పీకర్ జిర్వాల్‌కు లేఖ రాశారు. బుధవారం నాటి శాసనసభాపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా వారు విప్‌ను ధిక్కరించారని ఫిర్యాదు చేశారు. దీనిపై షిండే స్పందిస్తూ అనర్హత పేరుతో తమను బెదిరించలేరన్నారు.‘‘మాకూ నిబంధనలు తెలుసు. అసెంబ్లీ సమావేశాలకే తప్ప పార్టీపరమైన భేటీలకు విప్ వర్తించదు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజంతా పలు పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో సేన పొత్తు అసహజ బంధమని, దాన్ని తెంచుకోవాలని షిండే బుధవారం డిమాండ్ చేయడం, అందుకు ఉద్ధవ్ ఠాక్రే నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎంవీఏ నుంచి బయటికొచ్చేందుకు శివసేన ఉన్నట్టుండి సంసిద్ధత వెలిబుచ్చింది. “్ఙమీరే సిసలైన శివ సైనికులమని మీరంటున్నారు. దమ్ముంటే ట్విట్టర్, వాట్సాప్‌ల్లో లెటర్లు రాయడం ఆపి 24 గంటల్లోపు ముంబై తిరిగొచ్చి ఉద్ధవ్‌తో మాట్లాడండి. ఎంవీఏను వీడాలన్నదే రెబల్ ఎమ్మెల్యేలందరి అభిప్రాయమైతే సానుకూలంగా పరిశీలిస్తాం’’అని సేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఏది అసలు సేనో!: కాంగ్రెస్ రౌత్ ప్రకటనపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఉద్ధవ్ ఒక్క రోజులోనే వైఖరి మార్చుకుని కూటమికి గుడ్‌బై చెప్తారని అనుకోవడం లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఏది అసలైన శివసేనో కూడా అర్థం కావడం లేదంటూ వాపోయారు. అయితే శివసేనకు, ఉద్ధవ్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. సంకీర్ణాన్ని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఎన్సీపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కాంగ్రెస్‌కు చెందిన మంత్రి అశోక్ చవాన్ అన్నారు. రౌత్ వ్యాఖ్యలపై ఉద్ధవ్‌తో మాట్లాడతామని అజిత్ చెప్పారు. బీజేపీ హస్తముంది: పవార్ పాలక సంకీర్ణం భవితవ్యం సభలోనే తేలుతుంది తప్ప రెబల్స్ క్యాంపు పెట్టిన గౌహతిలో కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి బలపరీక్షతో నెగ్గి మెజారిటీ రుజువు చేసుకుంటుందని ధీమా వెలిబుచ్చారు. రెబల్స్ ముంబై వచ్చి సభలో పరీక్షకు నిలవాలన్నారు. ఈ సంక్షోభంలో బీజేపీ హస్తం కచ్చితంగా ఉందని ఆరోపించారు. ఇందులో బీజేపీ పాత్ర ఉందని చెప్పలేమని ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ‘‘ఆయనకు బీజేపీ నేతల గురించి తెలియక అలా మాట్లాడుంటారు. వారి గురించి నాకు బాగా తెలుసు. ఓ జాతీయ పార్టీ తనకు అన్నివిధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చిందని షిండే స్వయంగా చెప్పారుగా! ఈ సంక్షోభంలో మిగతా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీల పాత్ర లేదన్నది స్పష్టమే. ఇక మిగిలింది బీజేపీయే. షిండే వ్యాఖ్యలు ఆ పార్టీని ఉద్దేశించినవే’’ అన్నారు. ఎన్సీపీ తమను చిన్నచూపు చూస్తోందన్న రెబల్ ఎమ్మెల్యేల అభ్యంతరాలన్నీ సాకులేనన్నారు. గెలుపు మనదే: షిండే మరోవైపు గౌహతిలో రెబల్ ఎమ్మెల్యేలంతా షిండేను తమ నాయకునిగా మరోసారి ప్రకటించారు. తమ తరఫున ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు. వారినుద్దేశించి షిండే మాట్లాడుతున్న వీడియోను ముంబైలోని ఆయన కార్యాలయం విడుదల చేసింది. ‘‘మన బాధలు, ఆనందాలు అన్నీ ఒకటే. ఐక్యంగా ఉందాం. గెలుపు మనదే. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన మహాశక్తి అయిన ఓ జాతీయ పార్టీ ఉంది. మనం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని కొనియాడింది. అన్నివిధాలా సాయం చేస్తామని మాటిచ్చింది’’ అని వారినుద్దేశించి అందులో షిండే మాట్లాడుతూ కన్పించారు. -
మహారాష్ట్ర సంక్షోభం.. హాట్ టాపిక్‌గా మారిన నెంబర్ గేమ్!
ముంబై: మహారాష్ట్ర సస్పెన్స్ అంతకంతకూ పెరిగిపోతుంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కఠ రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో నంబర్ గేమ్ హాట్ టాపిక్‌గా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే గురువారం ఉదయం తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిత్య ఠాక్రేతో సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండేకు మద్దతిస్తున్న శివసేన ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరగుతుంది. తాజాగా విడుదల చేసిన వీడియో ప్రకారం ఏక్నాథ్ షిండే వర్గంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 35 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సంబంధిత వార్త: Maharashtra Crisis: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన శివసేన, బీజేపీతో చేతులు కలపాలి: షిండే మరోవైపు గౌహతిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రదర్మన నిర్వహించారు. రాడిసన్ హోట్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఓకే వేదికపై వచ్చారు. మొత్తం 42 మంది ఎమ్మెల్యేలతో షిండే వీడియో విడుదల చేశారు. సీఎం పీఠం నుంచి ఉద్దవ్ ఠాక్రే దిగిపోవడం తమకు ముఖ్యం కాదని ఏక్నాథ్ షిండే అన్నారు. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని కోరారు. ఇదిలా ఉండగా గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: సీఎం థాక్రేకు రెబల్ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు శివసేన బలంగా ఉంది: సంజయ్ రౌత్ అయితే గౌహతి గ్రూప్‌లో 22 మంది ఎమ్మెల్యే మద్దతు తమకే ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వారంతా ముంబైకు తిరిగి వస్తున్నట్లు తమకు చెప్పినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మాణం జరిగితే కచ్చితంగా గెలుస్తామన్నారు. థాక్రే మళ్లీ అధికారిక నివాసం వర్షకు వస్తారని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నా శివసేన బలంగా ఉందన్నారు. కొంతమంది ఈడీ భయంతో పార్టీ మారరన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు షిండేతో ఎందుకు వెళ్లారో, పార్టీలో ఎందుకు తిరుగుబాటు ఎందుకు వచ్చిందో తరువాత తెలుస్తుందన్నారు. ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు ఎవరి బలమెంటో తెలుస్తుందన్నారు. బీజేపీ పోస్టర్లు అటు దేవేంద్ర ఫడ్నవీస్‌కు అనుకూలంగా మహారాష్ట్రలో పోర్టు పోస్టర్లు వెలిశాయి. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నాడంటూ బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
మీకు పాజిటివ్ అని మనవాళ్లు కాస్త దూరంగా ఉన్నారంతే సార్!
మీకు పాజిటివ్ అని మనవాళ్లు కాస్త దూరంగా ఉన్నారంతే సార్! -
శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మహా రాజకీయ పరిణామాలు పూట పూటకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చనే ఊహాగానాల నడుమ.. శివ సేన కీలక నేత సంజయ్ రౌత్ తాజా ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని ఆయన మీడియాకు చెప్పడం విశేషం. ఈ తరుణంలో.. దొరికిన అవకాశం చేజార్చుకోవద్దని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. అస్సాం నుంచే ఇది మొదలైనట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేతో సహా మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలు బస చేసిన గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకున్నారు. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివ సేన రెబల్స్ గనుక తమతో చేతులు కలపాలని, బదులుగా భారీగా పోర్ట్‌పోలియో వాళ్ల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. రెబల్స్ గనుక తమతో కలిసి వస్తే.. ప్రభుత్వంలో ఎనిమిది కేబినెట్ మంత్రి పదవులు, ఐదు సహాయక మంత్రి పదవులు ఆఫర్ చేసింది. ఒకవేళ శివ సేన ఎంపీలు గనుక వస్తే.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినట్లు భోగట్టా. ఇదిలా ఉంటే.. సీఎం ఉద్దవ్ థాక్రేను కలవకుండానే.. ఏక్నాథ్ షిండే మూడు పేజీల లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయితే.. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని సంజయ్ రౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రెబల్స్‌లోనే 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వాళ్లు ముంబైకి రాగానే పరిస్థితి సర్దుమణుగుతుందని రౌత్ ప్రకటించడం గమనార్హం. ఈడీకి భయపడి శివసేనకు ద్రోహం చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లు బాల్‌థాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరంటూ సంజయ్ రౌత్ మీడియాతో వ్యాఖ్యానించారు. బలపరీక్ష ఎప్పుడు జరుగుతుందో అందరూ చూస్తారు, పార్టీని వీడే వారు బాలాసాహెబ్ భక్తులు కాదు.. ఇవాళ సీఎం ఉద్దవ్ థాక్రే ఎలాంటి భేటీ నిర్వహించబోవడం లేదంటూ వ్యాఖ్యానించాడాయన. చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..? -
సీఎం థాక్రేకు రెబల్ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే.. సీఎం ఉద్ధవ్ థాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో షిండే ఘాటుగా స్పందించారు. సీఎం థాక్రేను కలిసే ప్రసక్తేలేదని షిండే.. తేల్చి చెప్పారు. ఉద్ధవ్ ప్రతిపాదనలను సైతం షిండే తిరస్కరించారు. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ థాక్రే అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఎమ్మెల్యేలను ఏనాడు సీఎం థాక్రే పట్టించుకోలేదుంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీ నేతలను బీజేపీ బంధించింది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022 ఇది కూడా చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..?: సీఎంపై ఫైర్ -
అనర్హత వేటు.. షిండే వర్గంలో తీవ్ర ఉత్కంఠ
ముంబై: శివ సేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వైఖరితో.. మహారాష్ట్ర రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పార్టీని వీడమని, సొంత కుంపటి ఊసే ఉండదంటూ.. ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చేయాలంటూ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు అల్టిమేట్ జారీ చేశాడు షిండే. ఈ తరుణంలో సీఎం పదవికి రాజీనామా చేయకుండానే.. కుటుంబంతో పాటు సీఎం అధికార భవనాన్ని వీడాడు సీఎం థాక్రే. అయితే.. షిండే వర్గం ముందర ఇప్పుడు మరో గండం పొంచి ఉంది. అసెంబ్లీలో శివ సేన 55 సీట్లతో అడుగుపెట్టింది. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఇప్పుడు షిండే వర్గంపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అది తప్పించుకోవాలంటే.. తన బలం 37గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది షిండేకి. బుధవారం శివ సేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. మహారాష్ట్ర గవర్నర్‌కు పంపిన లేఖలో 34 మంది మద్దతు ఎమ్మెల్యేల(షిండేతో సహా) సంతకం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో నలుగురు శివ సేన ఎమ్మెల్యేలు కాదు. శివ సేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్.. తిరిగి నిన్న సాయంత్రం నాటకీయ పరిణామాల నడుమ థాక్రే గూటికి చేరుకున్నారు. ఈ తరుణంలో.. గురువారం ఉదయం మరో నలుగురు రెబల్స్ గ్రూపుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలతో షిండే వర్గం అనర్హత గండం గట్టెక్కుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. A total of 42 Maharashtra MLAs are present with Eknath Shinde at Radisson Blu Hotel in Guwahati, Assam. This includes 34 MLAs from Shiv Sena and 8 Independent MLAs: Sources#MaharashtraCrisis — ANI (@ANI) June 23, 2022 -
సీఎం ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్ చేశారు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్ పాల్ సింగ్ బగ్గా.. ఈ మేరకు ముంబై మలబార్ హిల్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ కంప్లయింట్ చేశాడు. ఉద్దవ్ థాక్రేకు కరోనా పాజిటివ్ సోకిందని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. బుధవారం నాటి రాజకీయపరిణామాల అనంతరం రాత్రి.. ఆయన సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ ఖాళీ చేసి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై పూలు చల్లి.. కార్యకర్తలంతా ‘మీ వెంటే ఉంటాం.. ముందుకు వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కొవిడ్ బారిన పడ్డ వ్యక్తి.. ఐసోలేషన్‌లో ఉండకపోవడం, భౌతిక దూరం తదితర కొవిడ్ ప్రోటోకాల్స్‌ను ఉద్దవ్ థాక్రే ఉల్లంఘించారన్నది తజిందర్ పాల్‌సింగ్ ఆరోపణ. ఇక కుటుంబంతో సహా ‘మాతోశ్రీ’కి చేరుకున్న తర్వాత కూడా.. ఆయన వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించినట్లు తజిందర్ పాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. #WATCH Maharashtra CM Uddhav Thackeray greets hundreds of Shiv Sena supporters gathered outside his family home 'Matoshree' in Mumbai pic.twitter.com/XBG0uYqYXu — ANI (@ANI) June 22, 2022 -
దేనికైనా రెడీ.. ఉద్దవ్ థాకరే సంచలన ప్రకటన
-
ఉద్ధవ్ ఠాక్రే సంచలనం.. ‘ఎమ్మెల్యేలు కోరితే రాజీనామాకు సిద్ధం’
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. తనకు ఈరోజు(బుధవారం) కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. చెప్పాల్సింది చాలా ఉదని, ఈ రోజు చాలా ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. ‘హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన. దేశంలో టాప్-5 సీఎంలలో నేను ఒకడిని. బాల్‌థాక్రే వారసత్వాన్ని కొనసాగించేది మేమే. నేను ప్రజల్నికలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. కరోనా వల్ల ప్రజలను కలవలేకపోతున్నా. ఇప్పుడు ఉత్పన్నమైన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం’ అని సీఎం పేర్కొన్నారు. ఆ సమయంలో సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా '30 ఏళ్లుగా మేము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించాం. కానీ శరద్‌పవార్.. నన్నే సీఎం బాధ్యతలు స్వీకరించమని కోరారు. ఆ సమయంలో ఓ సవాల్‌గా బాధ్యతల్ని స్వీకరించా. ఎన్సీపీ, కాంగ్రెస్ నాకు పూర్తి సహకారం అందించాయి. ఇప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్ అయ్యా. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉంది. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గవర్నర్‌కు కూడా తెలియజేశా. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది' అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. నమ్మకద్రోహానికి గురయ్యా ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లి మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలి. సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చలకు రావాలని రెబల్ ఎమ్మెల్యేలను, ఏక్నాథ్ షిండేను ఆహ్వానిస్తున్నా. నేను నమ్మకద్రోహానికి గురయ్యాను. నాతో ఏక్నాథ్ షిండే నేరుగా మాట్లాడాలి. శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను. శివసేన పార్టీని నడిపేందుకు నేను పనికిరానని చెప్పండి.. పార్టీ నుంచి తప్పుకుంటా. పదవులు వస్తాయి.. పోతాయి. అధికారం కోసం నేను పాకులాడటం లేదు అని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. చదవండి: ‘మహా’ రాజకీయంలో ట్విస్ట్.. తిరిగొచ్చిన శివసేన ఎమ్మెల్యే. ఏం చెప్పాడంటే!