
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ప్రస్తుతం పతనం అంచుల్లో ఉందన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. ఎవరికి వారు ఈ పోరులో గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా శివసేన మంత్రి ఆదిత్య థాకరే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది సత్యానికి, అబద్ధానికి మధ్య జరిగే యుద్ధం అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిణామాలపై జరిపిన సమావేశంలో ఏమి చర్చించారో మీకందరికీ ఇప్పటికే తెలుసు, అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మాతో పాటు పార్టీ కూడా ఎప్పటికీ మరచిపోదని చెప్పారు. ప్రస్తుత పోరులో తాము ఖచ్చితంగా గెలుస్తామని ఆదిత్య ఠాక్రే చెప్పారు. దీంతో పాటు రెబెల్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండేకు శివసేన షాకిచ్చింది. పార్టీ పేరును, వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఇతరులెవరూ వాడకూడదని సేన జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఇక ఎంవీఏ సర్కార్ సభలో మెజారిటీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) చీఫ్ రాందాస్ అథవలే శనివారం సవాల్ విసిరారు.
చదవండి: ఆ పంచాయితీలో తలదూర్చం.. అలాగని చూస్తూ ఊరుకోం! శివ సైనికులకు ఒకటే వార్నింగ్!
Comments
Please login to add a commentAdd a comment