aditya thackeray
-
‘షిండే ముఖ్యమంత్రి కాదు.. కాంట్రాక్టర్ మంత్రి’
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ నకిలీ హిందుత్వను ప్రచారం చేస్తోందని శివసేన( యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాదు.. ఒక కాంట్రాక్టర్ మంత్రి అని అన్నారు. హిందుత్వ పట్ల తమ పార్టీ, బీజేపీ ఆదర్శలు, వైఖరికి స్పష్టమైన తేడాలు ఉన్నాయని తెలిపారు.‘‘ మేము పాటించే హిందుత్వం బీజేపీ హిందుత్వం ఒకటి కాదు. మా హిందుత్వ సంస్కరణలు.. ప్రజలు ఏం తినాలి, ధరించాలి అనే వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఉంటాయి. మతపరమైన విలువలను కాపాడుతాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మౌనంగా ఉంటూ.. మన దేశంలోని ముస్లింలపై బీజేపీపై దాడి చేయాలనుకుంటోంది.ఎన్నికల ప్రయోజనాల కోసం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించింది. అదే సమయంలో మా పార్టీ రాజకీయాలు చేయకుండా అనేక ఆలయాలను సందర్శించింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే.. పార్టీ ఫిరాయించి.. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే నాయకుడిగా షిండేకు పేరుంది. ఈ ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు. కాంట్రాక్టర్ మంత్రి. నేను ఓడిపోయినా మహారాష్ట్ర, ముంబై కోసం పోరాటం ఆపను’’ అని అన్నారు.ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. చదవండి: వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ -
‘స్పీకర్ పదవి తీసుకోండి.. లేదంటే మీ పని అంతే!’
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించలేకపోయింది. దీంతో కేంద్రంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడానికి తెలుగుదేశం(టీడీపీ), జేడీ (యూ)లు కీలకంగా వ్యవహరించి మద్దతు పలికాయి.టీడీపీ, జేడీ(యూ) పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడానికి మద్దతు పలికిన టీడీపీ, జేడీ(యూ) భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలని శివసేన (యూబీటీ) వర్గం నేత ఆదిత్య ఠాక్రే హెచ్చరించారు.If TDP and JDU want to save their party, they should keep Loksabha speaker post with them otherwise BJP will break their parties for sure. — Aditya Thackeray pic.twitter.com/vopynhKkVp— Shantanu (@shaandelhite) June 10, 2024 ‘టీడీపీ, జేడీ(యూ) పార్టీలు.. తమ పార్టీను రక్షించుకోవాలి. అందుకోసం బీజేపీ నుంచి లోక్‌సభ స్పీకర్ పదవి డిమాండ్ చేసి తీసుకోండి. లేదంటే త్వరలోనే మీ పార్టీలను బీజేపీ చీల్చివేస్తుంది’ అని ఆదిత్య ఠాక్రే ‘ఎక్స్’ వేదికగా అన్నారు.మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్డీయే కూటమి ఇంకా లోక్‌సభ స్పీకర్ పదవిని ఎవరికీ కేటాయించలేదు. భాగస్వామ్య పార్టీలు స్పీకర్ పదవిని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే వారి డిమాండ్‌కు బీజేపీ ఒప్పుకోవటం లేదని ఎన్డీయే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీలో చీలిక తర్వాత మహా పాలిటిక్స్‌లో ‘పవార్’ పేరే జోరుగా వినిపిస్తోంది. తాజాగా ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను శివసేన నేత (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. బుధవారం ముంబైలో జరిగిన ఈ భేటీలో శివసేన నేత ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. కాగా అజిత్ పవార్ బీజేపీ, శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరిన తర్వాత వీరిరువురు కలవడం ఇదే తొలిసారి. అయితే అజిత్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గతంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సంగతి విదితమే. శివసేనలో చీలిక ఏర్పడి ఎంవీఏ ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవార్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అజిత్ పనితీరు తెలుసు: ఉద్ధవ్ అజిత్‌తో భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు.. అజిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ధృతరాష్ట్రుడిలా గుడ్డిది కాదని, ఛత్రపతి శివాజీ మహారాజా నడియాడిన రాష్ట్రమని తెలిపారు. అజిత్ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో అజిత్‌తో కలిసి పనిచేశాను కాబట్టి అతని పని తీరు తెలుసని చెప్పారు. చదవండి: మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం విపక్షాల భేటీ మరుసటి రోజే.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బెంగుళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల కీలక భేటీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే అజిత్‌తో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అజిత్ పవార్ సైతం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. ఎన్డీయేలో చేరాలని శరద్‌ను కోరారు. కాగా అజిత్ తన బాబాయిని 24 గంటల వ్యవధిలో రెండుసార్లు (ఆది, సోమవారం) కలిశారు. అజిత్ తన వర్గం నేతలతో కలిసి ముంబయిలోని శరద్ పవార్ నివాసానికి చేరుకొని, పార్టీని ఐక్యంగా ఉంచే విషయంపై ఆయనతో చర్చించారు. అయితే, తమ విజ్ఞప్తిని విన్న శరద్ పవార్.. మౌనంగా ఉన్నారని, ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. చదవండి: షాకింగ్ వీడియో.. మహిళా పైలట్‌ను జుట్టు పట్టుకొని లాక్కొచ్చి.. VIDEO | Shiv Sena (UBT) leader Uddhav Thackeray meets Maharashtra Deputy CM Ajit Pawar in Mumbai. (Source: Third Party) pic.twitter.com/38w33jcPnv — Press Trust of India (@PTI_News) July 19, 2023 -
‘50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది మరిచారా?’
ముంబై: శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మీ ఇద్దరిని చూసి బీజేపీ భయపడదన్నారు. 32 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో శుక్రవారం మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. ‘కనీసం అతడి తండ్రిని చూసి కూడా ఇక్కడ ఎవరూ భయపడరు. మీ పార్టీ నుంచి అంతా చూస్తుండగానే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముంబయి అట్టుడుకుతుందని, కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు.’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ వేదికగా.. శ్రీ సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో అవకతవకలపై విచారణను నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: 'నన్నెవరు కొట్టలేదు.. అదో పెద్ద స్కామ్': నటి ఆవేదన -
సుశాంత్ మృతిలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? దర్యాప్తు స్టేటస్ ఏంటి?
న్యూఢిల్లీ: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఈ కేసు విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే క్యాంప్ ఎంపీ రాహుల్ షెవాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందా? సీబీఐ దర్యాప్తు స్టేటస్ ఏమిటి? అని ప్రశ్నించారు ఎంపీ. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఆదిత్య ఠాక్రే 44 సార్లు ఫోన్ చేసినట్లు గతంలో తేలిందని గుర్తు చేశారు. లోక్‌సభలో షిండే వర్గం ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడుతూ..‘ఏయూ నుంచి రియా చక్రవర్తికి 44 సార్లు ఫోన్ వెళ్లింది. ఏయూ అంటే ఆదిత్య ఉద్ధవ్ ఠాక్రే అని బిహార్ పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రస్తుత స్టేటస్ ఏంటి?’అని ప్రశ్నించారు. తిప్పికొట్టిన ఆదిత్య ఠాక్రే.. లోక్‌సభ వేదికగా తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు ఆదిత్య ఠాక్రే. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఊహించలేమని విమర్శలు గుప్పించారు. ‘నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్పగలను. సొంత పార్టీకి, ఇంట్లో విధేయుడిగా ఉండని వారి నుంచి ఇంతకు మించి ఆశించలేం. ఇది కేవలం సీఎం ఏక్నాథ్ షిండే భూకుంభకోణం, రాష్ట్ర ప్రముఖులను అవమానించిన అంశాలను పక్కదారిపట్టించేందుకే చేస్తున్నారు. అలాంటి నిరాధారమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అని స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఏయూ అనే వ్యక్తికి మధ్య పలుమార్లు ఫోన్ కాల్స్ నడిచినట్లు 2020లోనే ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 44 కాల్స్ వెళ్లినట్లు పేర్కొంది. సుశాంత్ సింగ్ మరణంపై ఆదిత్య ఠాక్రే మౌనంగా ఉండిపోవడంతో ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బిహార్ ప్రభుత్వం ఆరోపించింది. యాదృచ్చికంగా ఆ సమయంలో ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ ఖాతా @AUThackeray అని ఉండటం ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ఇదీ చదవండి: సుశాంత్.. నువ్వు లేకుండా జీవితం లేదు: రియా భావోద్వేగం -
ఉద్ధవ్ మాస్టర్ ప్లాన్.. తేజస్వీ యాదవ్‌తో ఆదిత్య థాక్రే భేటీ అందుకేనా?
మహారాష్ట్రలోని శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఉద్ధవ్ థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీతో కలిసి షిండే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, శివసేన వర్గంలో కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో రానున్న బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికలపై ఉద్ధవ్ వర్గం ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో అక్కడ నివసిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే శివసేన నేత ఆదిత్య థాక్రే.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను పాట్నాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున తేజస్వీని ప్రచారం కోసం ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, శివసేన కోరిక మేరకు తేజస్వీ యాదవ్.. ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బీఎంసీ ప్రాంతంలో యూపీ, బీహార్ వలసవాసులు దాదాపు 50 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. ఎన్నికల వీరి ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ క్రమంలో శివసేనుకు చెందిన ఉద్ధవ్ వర్గం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇక, ఉద్ధవ్ థాక్రే సైతం.. 2024 రాబోయే లోక్‌సభ ఎన్నికల కన్నా బీఎంసీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం విజయం సాధిస్తే రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికల కోసం బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. After meeting with #AadityaThackeray, Bihar Deputy CM #TejashwiYadav is likely to campaign for the Uddhav Sena faction for the upcoming Brihanmumbai Municipal Corporation elections.@rohit_manas https://t.co/jExTeMlEAy — IndiaToday (@IndiaToday) November 24, 2022 -
అసలు సీఎం ఎవరో తెలియడం లేదు: ఆదిత్యా ఠాక్రే
ముంబై: మహారాష్ట్రలోని ఏక్నాథ్ శిండే–దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై శివసేన నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఎవరో అర్థం కావడం లేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సోమవారం మాతోశ్రీ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఠాక్రే మాట్లాడుతూ, తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివసేన సుప్రీంకోర్టులో పోరాడుతోందని, సుప్రీం ఇచ్చే తీర్పు పార్టీపైనే కాకుండా మొత్తం దేశంపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వం ఉందా లేదా అన్నది అసలు ప్రశ్న. ఇద్దరే ఇద్దరు వ్యక్తుల జంబో క్యాబినెట్లో, అసలు ముఖ్యమంత్రి ఎవరో అర్థం చేసుకావడం లేదు’ అని ఠాక్రే అన్నారు. యాదృచ్ఛికంగా, జూన్ 30న షిండే, ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత మంగళవారం మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. శిండేతోపాటు 39 మంది సేన ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం జూన్ 29న పడిపోయిన విషయం తెలిసిందే. చదవండి: కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. 18 మంది మంత్రులు వీరే -
'షిండే సర్కార్ కూలిపోతుంది.. మధ్యంతర ఎన్నికలు ఖాయం'
ముంబై: మహారాష్ట్రలో సీఎం ఏక్నాథ్ షిండే సర్కార్ త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు ఆదిత్య థాక్రే. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం అన్నారు. శివ్ సంవాద్ యాత్రలో భాగంగా పైఠణ్లో శివసేన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఉద్ధవ్ థాక్రేను శివసేన రెబల్ ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు ఆదిత్య థాక్రే. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు అదను చూసి ద్రోహం చేశారని విమర్శించారు. పైఠణ్ ఎమ్మెల్యే, షిండే వర్గంలో ఒకరైన సందీపన్ భుమ్రేపై విరుచుకుపడ్డారు. మహావికాస్ అఘాడీ హయాంలో నిధులు మంజూరు చేయలేదని ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయనకు ఐదుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలకు తాము చేసిందంతా తలుచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయని, కానీ ఇది ఏడవాల్సిన సమయం కాదు పోరాడాల్సిన సమయం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొందరు బలవంతం చేయడం వల్లే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తన తండ్రిపై తిరుగుబాటు చేశారని ఆదిత్య థాక్రే ఆరోపించారు. వారంతా తిరిగి తమతో కలవాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చన్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి ఊహించని షాక్ ఇచ్చారు ఏక్నాథ్ షిండే. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో సీఎం పదవి చేజిక్కుంచుకున్నారు. శివసేన తమదే అని ఇప్పుడు థాక్రే, షిండే వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ బలం నిరూపించుకోవాలని ఎన్నికల సంఘం సూచించిన విషయం తెలిసిందే. చదవండి: ఎన్డీఏకు సరికొత్త నిర్వచనం చెప్పిన రాహుల్ -
Maharashtra Crisis: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు..
మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ హస్తీనా చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిషాతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే భేటీ అయ్యే అవకాశముంది. అయితే రెబెల్స్‌తో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారనే చర్చ జరుగుతోంది. అదే విధంగా సీఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం సాయంత్రం 5 గంటలకు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఏదేమైనా నేడు ఢిల్లీలో జరిగే సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. Maharashtra former CM and BJP leader Devendra Fadnavis arrives at Delhi airport #MaharashtraPoliticalCrisis pic.twitter.com/x7ZA1LjbmO — ANI (@ANI) June 28, 2022 కాగా మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యలకు ఏక్నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. గౌహతి క్యాంప్‌లో ఎవరూ అసంతృప్తిగా లేరని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. తనతోపాటు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ఉద్దవ్ ఠాక్రేతో ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉంటే వారి పేర్లు బయటపెట్టాలని షిండే సవాల్ విసిరారు. చదవండి: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘డబుల్’ ట్విస్ట్ ప్రభుత్వం చేసిన తప్పేంటి? అంతకముందు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై ఆదిత్య ఠాక్రే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం చేసిన తప్పేంటో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వేళ అసెంబ్లీలో అవిశాస్వ తీర్మాణం జరిగితే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బల పరీక్షకంటే ముందు నైతిక పరీక్ష జరగాలన్నారు. వాళ్లు రెబెల్స్ కాదని, ద్రోహులని అన్నారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయొచ్చని, ఇలాంటి వారు ఎప్పటికీ గెలవలేరన్నారు. -
మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్‌కు ఆదిత్య థాక్రే వార్నింగ్
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే సర్కార్‌పై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ వర్గం, రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే వర్గం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా.. సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాక్రే.. రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై విరుచుకుపడ్డారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దోశద్రోహులు అని పేర్కొన్నారు. శివసేనకు ద్రోహం చేసిన వారిని మహారాష్ట్ర ఎప్పటికీ క్షమించదని ఆయన అన్నారు. ద్రోహులుగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలను మాత్రం తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఆదిత్య థాక్రే అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండేకు తమను ఎదుర్కొనే దమ్ములేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో తిరుగుబాటు చేసే ధైర్యం లేక గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి.. పార్టీ నేతలతో తిరుగుబాటు చేశారని ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి బలవంతంగా అసోంకు తరలించారని అన్నారు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీజేపీలో చేరడం లేదా ప్రహార్‌లో చేరడం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఏక్నాథ్ షిండే మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది.. -
‘మహా’ సంక్షోభం: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆదిత్య ఠాక్రే
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ప్రస్తుతం పతనం అంచుల్లో ఉందన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. ఎవరికి వారు ఈ పోరులో గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా శివసేన మంత్రి ఆదిత్య థాకరే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది సత్యానికి, అబద్ధానికి మధ్య జరిగే యుద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలపై జరిపిన సమావేశంలో ఏమి చర్చించారో మీకందరికీ ఇప్పటికే తెలుసు, అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మాతో పాటు పార్టీ కూడా ఎప్పటికీ మరచిపోదని చెప్పారు. ప్రస్తుత పోరులో తాము ఖచ్చితంగా గెలుస్తామని ఆదిత్య ఠాక్రే చెప్పారు. దీంతో పాటు రెబెల్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండేకు శివసేన షాకిచ్చింది. పార్టీ పేరును, వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఇతరులెవరూ వాడకూడదని సేన జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఇక ఎంవీఏ సర్కార్ సభలో మెజారిటీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రాందాస్ అథవలే శనివారం సవాల్ విసిరారు. చదవండి: ఆ పంచాయితీలో తలదూర్చం.. అలాగని చూస్తూ ఊరుకోం! శివ సైనికులకు ఒకటే వార్నింగ్! -
‘మహా’ సంక్షోభం: సీఎం ఉద్దవ్‌థాక్రే రాజీనామా?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆ శివసేన నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే.. ఇప్పటికే ట్విట్టర్ ఖాతాలో ఉన్న మంత్రి హోదాను తొలగించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం కేబినెట్ భేటి జరగనుంది. అలాగే, సాయంత్రం 5 గంటలకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం ఉద్దవ్ థ్రాకే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने.. — Sanjay Raut (@rautsanjay61) June 22, 2022 -
ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఐటీ దాడులు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఆదాయపన్ను శాఖ పలు దాడులు నిర్వహించింది. బెంగాల్, ఏపీలోలాగా తమను వ్యతిరేకించేవారిని కేంద్రం లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిస్తోందని ఆదిత్య విమర్శించారు. పార్టీ ఆఫీస్ బేరర్, షిర్డీ ట్రస్ట్ సభ్యుడు రాహుల్ కనాల్, కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్, బజరంగ్ ఖర్మాటే నివాసాలపై ఐటీ శాఖ మంగళవారం దాడులు నిర్వహించింది. వీరిలో రాహుల్ ఆదిత్యకు, మిగిలిన ఇద్దరు శివసేన మంత్రి అనీల్పరాబ్కు సన్నిహితులు. ముంబై కార్పొరేషన్ ఎన్నికలయ్యేవరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని సేన నేత సంజయ్‌రౌత్ కేంద్రంపై విమర్శలు సంధించారు. రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14మంది ప్రముఖులపై దాడులు జరిగాయని, వీరిలో ఎవరూ బీజేపీకి చెందరని చెప్పారు. తాము బీజేపీకి చెందిన పలువురి పేర్లను ఐటీ, ఈడీలకు పంపామని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. (చదవండి: ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు) -
ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే..
దాదర్ (ముంబై): బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ ప్రాంతంలో బీఎంసీకి చెందిన ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’ రూపుదిద్దుకుంటోంది. పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సంకల్పంతో ముంబైలో మొదటిసారిగా చేపడుతున్న ఈ ట్రీ–హౌజ్ పర్యాటకులను ఆకట్టుకోనుంది. అందుకు అవసరమైన కోటి రూపాయలు జిల్లా ప్లానింగ్ కమిటీ నిధుల నుంచి సమకూరుస్తున్నారు. పనులు పూర్తయి ట్రీ–హౌస్ వినియోగంలోకి వస్తే స్థానికుతోపాటు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాలక్షేపం కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ముంబైని స్వచ్ఛంగా, సౌందర్యంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని ఆదిత్య ఠాక్రే సంకల్పించారు. అందులో భాగంగా ముంబైలో అక్కడక్కడ పర్యాటక, ఉద్యానవనాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బాంద్రాలోని బ్యాండ్‌స్టండ్ సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేసిన ట్రీ–హౌస్ పనులు జోరుగా సాగుతున్నాయని బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిఘావ్కర్ అన్నారు. ఇలాంటి ట్రీ–హౌస్ ముంబైలో ఇదే తొలిసారి అని, పర్యాటకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకతలివే.. ►ట్రీ–హౌస్‌ను పూర్తిగా కలపతో నిర్మిస్తున్నారు. ఇందులోకి నేలపై నుంచి వెళ్లేందుకు నిచ్చెన అందుబాటులో ఉంటుంది. అంతేగాకుండా పక్కనే ఉన్న మరో చెట్టు పైనుంచి కూడా ట్రీ–హౌస్‌లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ►ఎదురుగా సముద్రం, సుమారు 500 చదరపు మీటర్ల స్ధలంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పిల్లలు, పర్యాటకులు, ముంబైకర్లు సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ►ఫొటోలు దిగేందుకు సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ►పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పర్యాటకులకు అడవిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. -
Maharashtra: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు..
సాక్షి, ముంబై, బెంగళూరు: మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక– పర్యావరణ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేను బెదిరించిన కేసులో ముంబై పోలీసులు గురువారం బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తి జైసింగ్ రాజపుత్‌గా గుర్తించారు. ఇతడిని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ విభాగం పోలీసులు అరెస్ట్‌చేసి ముంబైకి తీసుకెళ్లారు. కాగా ఈ నెల 8వ తేదీన మంత్రికి జైసింగ్ ఫోన్ చేశాడు. మంత్రి ఫోన్ తీయకపోవడంతో రాజపుత్ ప్రాణహాని బెదిరింపులతో మళ్లీ మెసేజ్ పంపించాడు. ఈ నేపథ్యంలో నిందితున్ని గురువారం అరెస్ట్ చేశారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు ఇతడు అభిమాని అని, ఆ ఘటనకు సంబంధించి బెదిరింపు సందేశాలను పంపినట్లు తెలిసింది. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. చదవండి: ‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్ -
ఏపీలో ‘దిశ’లాగే మహారాష్ట్రలో ‘శక్తి’..
సాక్షి, ముంబై: మొదటి రోజు మాదిరిగానే రెండో రోజూ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాపీ (అనుకరణ), మాఫీతో గరంగరంగా సాగిన కార్యకలాపాలు రెండో రోజు కూడా దాదాపు అలాగే కొనసాగాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రారంభమైన గురువారం నాటి సభా కార్యకలాపాలు చివరకు ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రక్షణకోసం తీసుకువచ్చిన ‘దిశ’ లాంటి చట్టాన్ని ‘శక్తి’ పేరుతో అమలు చేయాలనే ప్రతిపాదనను ఆమోదించుకున్నాయి. ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి. ఇదిలాఉండగా సభ కార్యకలాపాల ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేతలందరూ అసెంబ్లీ హాలులోకి వెళ్లే మెట్లపై కూర్చున్నారు. అదే సమయంలో పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే రావడంతో మెట్లపై గుంపులో కూర్చున్న ఎమ్మెల్యే నితేశ్ రాణే ఆయన్ని చూస్తూ మ్యావ్, మ్యావ్ అంటూ శబ్ధం చేశారు. ఒకప్పుడు పులిలా గాండ్రించే శివసేన పార్టీ ఇప్పుడు పిల్లిలా మారిందని, దీన్ని గుర్తు చేయడానికే ఇలా మ్యావ్, మ్యావ్ మంటూ శబ్ధం చేశానని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆదిత్య ఠాక్రే నితేశ్ రాణేను పట్టించుకోకుండా నేరుగా ముందుకు వెళ్లిపోయారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే సభా ప్రాంగణంలో కొందరు సభ్యులు మాస్క్ లేకుండా తిరుగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గమనించారు. దీంతో మాస్క్ ధరించని సభ్యులను (పరోక్షంగా బీజేపీ నాయకులు) సభ నుంచి బయటకు పంపించాలని డిప్యూటీ స్పీకర్ నరహరి జిరావల్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ ప్రభూ మాట్లాడుతూ ఆదిత్య ఠాక్రేకు వాట్సాప్‌లో బెంగళూర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని, అది కర్నాటక నుంచే వచ్చిందని అన్నారు. చదవండి: (‘మహా’ అసెంబ్లీ సమావేశాలు: 10 మందికి పాజిటివ్) గతంలో దాబోల్కర్, పాన్సారేలను హత్య చేసిన హంతకులకు కర్నాటకతో సంబంధాలున్నాయి. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని ఘటనకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీల్ ప్రభూ ఈ అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని, అవసరమైతే తాను స్వయంగా కర్నాటక ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఫడ్నవీస్ సభకు స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన హంతకులతో సంబంధాలున్నట్లా? అన్ని ప్రశ్నిస్తూనే, సాక్షాలు లేనిదే అనవసరంగా ఆరోపణలు చేయవద్దని సభ్యులకు ఫడ్నవీస్ హితవు పలికారు. చదవండి: (Flight Charges: విమాన చార్జీల మోత) కొత్త చట్టంతో మహిళలకు సత్వర న్యాయం మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలన్నా, నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం మాదరిగానే ‘శక్తి’ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ఎమ్మెల్యే అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఆ ప్రకారం శక్తి చట్టాన్ని అమలుచేసేందుకు రూపొం దించిన బిల్లుపై గత సంవత్సరం జరిగిన ఆర్థిక బడ్జెట్ సమావేశాల్లో చర్చించారు. ఈ చట్టం ద్వారా సమాజంలో మహిళలపై జరిగే వేధింపు లు, యాసిడ్ దాడులు, అసభ్యకర ప్రవర్తన తదిత ర నేరాలపై నాన్‌బెయిల్ కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన నెల రోజుల్లోనే విచారణ జరిపి తీర్పు వెల్లడించడం, ప్రతి జిల్లాలో దీనికోసం స్వతంత్రంగా దర్యాప్తు సంస్ధలు, ప్రత్యేక కోర్టులు స్ధాపించడం లాంటివి ఈ చట్టం ద్వారా సాధ్యమవుతుంది. రెండోరోజు జరిగిన సమావేశంలో శక్తి చట్టాన్ని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించుకున్నాయి. అందుకు ప్రతిపక్షాలు కూడా సహకరించాయి. దీంతో ఇకనుంచి యాసి డ్ దాడులు, సామూహిక అత్యాచారం, హత్య చేసిన నిందితులకు సత్వరమే శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టు స్ధాపించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ సభకు వెల్లడించారు. -
ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ట్రాఫిక్ తిప్పలు త్వరలోనే తీరనున్నాయి. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, మెట్రో–2, 3, 4 దశలు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టులు 2023 వరకు వినియోగంలోకి వస్తాయని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలో జీవనాడి అయిన లోకల్ రైళ్లు సహా బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం నగరంలో ప్రతీరోజు కొన్ని వందల కొద్దీ కొత్త వాహనాలు రోడ్డుపైకి రావడమే. వీటివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటంతో పాటు వాహనాలలో నుంచి వెలువడుతున్న పొగ, ఇతర విష వాయువులు, ధ్వని కాలుష్యం వల్ల వాతావరణం కలుషితం అవుతోంది. దీంతో ముంబైకర్లకు స్వచ్చమైన గాలి, ప్రశాంత వాతావరణం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ముంబైకర్లకు ట్రాఫిక్ జామ్ సమస్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు స్వచ్చమైన గాలితో కూడిన ప్రశాంత వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రణాళికలు రచించింది. చదవండి: ('పోల్‌వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం) ఈ క్రమంలోనే బీఎంసీ పరిపాలనా విభాగం కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) మెట్రో–2, 3, 4 దశల ప్రాజెక్టులు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ముంబైలో ట్రాఫిక్ జామ్ సమస్య చాలా శాతం వరకు తీరనుంది. ప్రయాణం వేగవంతం అవుతుంది. ప్రస్తుతం రెండు గంటల్లో పూర్తి అవుతున్న ప్రయాణం అప్పుడు అర గంటలోనే ముగుస్తుంది. అలాగే, బీఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోస్టల్ రోడ్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు దాదాపు 45 శాతం పూర్తి కావచ్చాయని మంత్రి ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ఇక, ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి వర్లీ సీ–లింకు వరకు 10.58 కిలోమీటర్ల పొడవైన మార్గం ఉంది. ఇందులో నాలుగు లేన్లు (2+2) ఉంటాయి. ఈ మార్గం కొన్ని చోట్ల నేలపై నుంచి, మరికొన్ని చోట్ల భూగర్భం లోపలి నుంచి ఉంటుంది. దీనికి సంబంధించిన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు 2,300 టన్నుల భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మలబార్ హిల్ వద్ద భూగర్భం లోపల తవ్వకం పనులు ఈ ఏడాది జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి కూడా 2023 వరకు పూర్తికానున్నాయి. ఈ పనుల కోసం బీఎంసీ ఏకంగా రూ. 12,700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదే తరహాలో మెట్రో వివిధ ప్రాజెక్టు పనులు, శివ్డీ–నవశేవా సీ–లింకు పనులు కూడా పూర్తవుతాయని ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివ్డీ–నవశేవా సీ–లింకును వర్లీ–బాంద్రా సీ–లింకుతో అనుసంధానం చేయనున్నారు. దీంతో వర్లీలో సీ–లింకు వంతెన పైకెక్కిన వాహనాలు శివ్డీ–నవశేవా మీదుగా నేరుగా నవీ ముంబైలో బయటకు వస్తాయి. ప్రస్తుతం ట్రాఫిక్ ఉన్న సమయంలో వర్లీ నుంచి నవీ ముంబై చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. కానీ, సీ–లింకు మీదుగా వెళితే సుమారు 30–45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీంతో వాహనదారుల విలువైన సమయంతో పాటు వాహనాల ఇంధనం కూడా దాదాపు 50–70 శాతం వరకు ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం కూడా సగానికి పైగా తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో ముంబైకి ఎంతగానో దోహదపడుతాయని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. -
పాల్ఘర్లో మరో విమానాశ్రయం..
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాల్ఘర్లో మరో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముంబైలోని విమానాశ్రయం పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండగా, నవీ ముంబైలో నిర్మిస్తున్న విమానాశ్రయం కూడా భవిష్యత్ అవసరాలను తీర్చలేదని, అందుకే పాల్ఘర్లో మూడో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కరోనా కోరల్లో నలుగుతున్న సమయంలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు విధానపరమైన నిర్ణయాలెన్నో తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ‘పర్యటన్ పరిషద్’అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముంబైలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 50 మీటర్ల వరకు నిర్ధారించామని, కొంకణ్ ప్రాంతం విషయంలో కూడా జనవరి వరకు శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ముంబై, ఠాణే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, మరాఠ్వాడా, విదర్భతో సహా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక స్థలాల్ని అభివృద్ధి పరిచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముంబైతో పోల్చితే పాల్ఘర్లో మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉందని, కాబట్టి ఈ ప్రాంతం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ముంబై, నవీ ముంబైలోని విమానాశ్రయాల సేవలు సరిపోవని, అందుకే పాల్ఘర్లో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక విమానాశ్రయాన్ని నిర్మించేందుకు పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు 24 గంటల పాటు తెరిచే ఉంటున్నాయని, దాంతో ఆయా నగరాలు, ప్రభుత్వాల ఆదాయం పెరిగిందని చెప్పారు. ముంబైలో కాల్‌సెంటర్ లాంటి వ్యాపారాలు 24 గంటలు కొనసాగుతున్నాయని, కానీ, హోటల్స్ మూసివేయడం వల్ల ఆ సంస్థల్లో పనిచేసేవారికి రాత్రిపూట ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముంబై విశ్వనగరంగా మారి ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రకృతి, సాగర తీరం, గడీలు, ఖిల్లాలు, ఆరోగ్య, ధార్మిక రంగాలకు చెందిన పలు పర్యాటక స్థలాల్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని, ఆయా ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఉత్పత్తి రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, అదేవిధంగా సేవారంగంలోనూ అభివృద్ధి సాధించి ఉపాధి అవకాశాల్ని పెంచాలని పేర్కొన్నారు. పర్యాటక, హోటల్ రంగాలకు కావాల్సిన అనుమతులను 80 నుంచి 10కి తగ్గించామని, ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాలీవుడ్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ పర్యాటకాన్ని పెంచేందుకు ద్రాక్ష, సంత్ర లాంటి తోటల్లో మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసే విధానాన్ని రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
‘కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందని అనలేదు’: ముంబై మేయర్
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మళ్లీ దేశంలో కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ముంబై, నాగ్‌పూర్‌లో కేసుల నమోదు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ఓ మేయర్ థర్డ్ వేవ్ వచ్చేసిందని ప్రకటించారు. ఇదిగోండి మీ ఇళ్ల ముందే ఉందని పేర్కొన్నారు. వారిద్దరి ప్రకటనలు ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందనేది స్పష్టం చేస్తోంది. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ‘నాగ్‌పూర్‌లో థర్డ్ వేవ్ వచ్చేసింది’ అని మంగళవారం తెలిపారు. తాజాగా ముంబై మేయర్ కిశోరీ పడ్నేకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘మూడో దశ రావడం కాదు. వచ్చేసింది! మన ఇంటి ముందరే ముప్పు పొంచి ఉంది. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం’ అని ఆమె తెలిపారు. ‘నాగ్‌పూర్‌లో వచ్చేసింది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైవాసులు జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు. ‘గత రెండు దశల అనుభవంతో ఇప్పుడు మూడో దశ రాకుండా అడ్డుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది’ అని విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. అయితే ఆ ప్రకటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా ఆమె బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ‘నేను అలా అనలేదు’ అని చెప్పారు. ముంబైలో థర్డ్ వేవ్ ఉందని తాను అనలేదని స్పష్టం చేశారు. మంత్రి నితిన్ రౌత్ థర్డ్ వేవ్ ఉన్నట్టు చెప్పడంతో థర్డ్ వేవ్ ఇంటి ముందరే ఉందని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. జాగ్రత్తలు అవసరం అని మాత్రమే తాను చెప్పినట్లు వివరించారు. కరోనాపై మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా స్పందించారు. కరోనా ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ‘12-18 ఏళ్ల వారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదనే విషయాన్ని గుర్తించాలి. ముంబైతో పాటు మహారాష్ట్రలో మూడో దశ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్‌ను అడ్డుకోగలం’ అని ఆదిత్య తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే వేడుకలు చేసుకోవాలని సూచించింది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా -
1న బీడీడీ చాల్స్‌కు శంకుస్థాపన
సాక్షి, ముంబై: వర్లీ బీడీడీ చాల్స్ అభివృద్ధి పనుల భూమి పూజా కార్యక్రమానికి ఆగస్టు ఒకటో (ఆదివారం) తేదీన ముహూర్తం ఖరా రైంది. అందుకు మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) అధికార వర్గాలు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భూమి పూజా కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరిగే ఈ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే తదితర మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని మాడా అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా భూమిపూజా కార్యక్రమం గతంలో కూడా ఒకసారి వాయిదా పడింది. ఆ తరువాత ఈ నెల 27న జరగాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. వేలాది కుటుంబాలు గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇలాంటి సందర్భంలో నూతన గృహ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం సమంజసం కాదని ముఖ్యమంత్రి భావించారు. అదే సందర్భంలో వరద ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి బయలుదేరడంతో ఆయన నాలుగైదు రోజులు బిజీగా ఉన్నారు. దీంతో ఈ నెల 27వ తేదీన జరగాల్సిన భూమి పూజా కార్యక్రమం వాయిదా వేయాల్సి వచ్చింది. చివరకు ఆగస్టు ఒకటో తేదీన మళ్లీ ముహూర్తం ఖారు చేయడంతో వర్లీ ప్రాంత వాసుల్లో ఆనందం చిగురించింది. ఈసారైన భూమిపూజా కార్యక్రమం సఫలమవుతుందా...? లేక మరేమైన అడ్డంకులు ఎదురవుతాయా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. -
రూపాయికే పెట్రోలు : ఎగబడిన జనం
సాక్షి,ముంబై: మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వారికి వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్రలోని, శివసేన పార్టీ వాహనదారులకు ఈ తీపి కబురు అందించారు. డోంబివలీలోని పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పంపిణీ చేశారు. సుమారు 1200 మందికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందించారు. మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన అభిమానులు లీటరు పెట్రోలు రూపాయికే విక్రయించారు. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులకు బారులుతీరారు. డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గంటలకు రూపాయికే లీటర్ పెట్రోల్‌ను పంపిణీ చేశారు. లాక్డౌన్ ఆంక్షలతో ప్రయాణికులు తమ సొంత వాహనాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా వీరిపై రోజుకు సుమారు 400 రూపాయల భారం పడుతోదని శివసేన స్థానిక దీపేశ్ మత్రే చెప్పారు. మొదటి 500 మందికి ఇవ్వాలనుకున్నాం. కానీ జనం భారీగా రావడంతో దీన్ని కొనసాగించామని తెలిపారు. కాగా ముంబైలో లీటరుకు రూ. 102.58, డీజిల్ రూ. 94.70 పలుకుతున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ Petrol diesel prices: పెట్రో రికార్డు పరుగు -
కరోనా విజృంభణ: ముఖ్యమంత్రి తనయుడికి పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో భయాందోళన పరిస్థితి ఏర్పడింది. ప్రజలతో పాటు ఈ ప్రముఖులు కూడా ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజా శివసేన పార్టీ యువ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తనయుడు మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజాగా చేసిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ‘కొన్ని లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. నన్ను ఎవరైనా కలిసిన వారు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఈ సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి’ అని ఆదిత్య ఠాక్రే ట్విటర్లో పోస్టు చేశాడు. కాగా మహారాష్ట్రలో కొన్ని రోజులుగా దాదాపు రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో సంపూర్ణ, పాక్షిక లాక్డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. On having mild symptoms of COVID, I had myself tested and I am COVID positive. I request everyone who came in contact with me to get themselves tested. I urge everyone to realise that it is extremely important to not let your guard down. Please follow COVID protocols & stay safe — Aaditya Thackeray (@AUThackeray) March 20, 2021 -
కొడుకు కోసమే కక్షసాధింపు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈసారి మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకును విమర్శించారు. మూవీ మాఫియా, సుశాంత్ రాజ్‌పుత్ హంతకులు, వారికి చెందిన డ్రగ్ రాకెట్ ముఠాల గుట్టును తాను బయటపెట్టడం మహారాష్ట్ర సీఎంకు సమస్యగా మారిందని, ఎందుకంటే ఈ మూడింటితో ఆయన కుమారుడు ఆదిత్య చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారని కంగన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలను బయటపెట్టడమే తాను చేసిన అతిపెద్దనేరమని, అందుకే తనపై కక్షగట్టినట్లు శివసేన ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన ట్వీట్‌కు సంబంధించి వచ్చిన పత్రికా కథనంపై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేశారు. వీరి గుట్టు బయటపెట్టినందుకే తనపై కత్తికట్టారని చెబుతూ ‘‘చూద్దాం! ఎవరి ఆట ఎవరు కట్టిస్తారో?’’ అని ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ఒక మహిళను అవమానించి, భయపెట్టి వారి ఇమేజీని వారే పాడుచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జూన్‌లో నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత నుంచి ఆమె బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శిస్తూవస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, బయట నుంచి వచ్చిన వాళ్ల ఎదుగుదల చూసి ఓర్వలేని సినీ పరిశ్రమ చేసిన ప్రణాళికాయుత హత్యని ఆమె ఆరోపించారు. (చదవండి: కంగనపై శివసేన ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు!) ముంబై వీడిన క్వీన్ సోమవారం కంగన ముంబైని వీడి స్వరాష్ట్రం హిమాచల్‌కు చేరుకున్నారు.‘నిరంతర దాడులు, తన ఆఫీస్ కూల్చివేత, చుట్టూ బాడీగార్డుల రక్షణ పెట్టుకోవాల్సిరావడం చూస్తే నేను ముంబైని పీఓకేతో పోల్చడం కరెక్టేననిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. కుక్కతోక వంకర! ముంబైని పీఓకేతో తాను పోల్చడం కరెక్టేనంటూ కంగన చేసిన తాజా వ్యాఖ్యలపై శివసేన ఎంఎల్ఏ ప్రతాప్ సర్నాయక్ మండిపడ్డారు. ఎంత యత్నించినా కుక్కతోక వంకరేనన్న మాటలకర్ధం తెలిసిందని పరోక్షంగా కంగనపై విమర్శలు చేశారు. ముంబై మరీ అంత చెడ్డనగరమనిపిస్తే, పీఓకేలాగా కనిపిస్తే కంగన నగరం వదిలి తనకు సరైన చోటుకు పోవచ్చని శివసేన మంత్రి అనీల్ సూచించారు. ముంబై గురించి చెడుగా మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. -
‘ఆదిత్యా ఠాక్రేతో ఆమెకు పరిచయం లేదు’
ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆదిత్యా ఠాక్రేపై ఆరోపణల నేపథ్యంలో రియా చక్రవర్తి శివసేన నేతను ఎన్నడూ కలుసుకోలేదని ఆమె న్యాయవాది సతీష్ మనేషిండే పేర్కొన్నారు. ఆదిత్యా ఠాక్రేతో రియాకు పరిచయం లేదని చెప్పుకొచ్చారు. జూన్ 8నే సుశాంత్ నివాసం నుంచి రియా బయటకు వచ్చారని తెలిపారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు బిహార్ పోలీసుల పరిధిలో లేనుందున వారి దర్యాప్తునకు రియా చక్రవర్తి స్పందించాల్సిన అవసరం లేదని ఆమె న్యాయవాది మంగళవారం స్ప్షష్టం చేశారు. చట్ట ప్రకారం బిహార్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముంబై పోలీసులకు బదలాయించాలని, ఈ కేసు పరిధి బిహార్ పోలీసుల పరిమితిలో లేదని పేర్కొన్నారు. సుశాంత్ మృతిపై 40 రోజులు తాత్సారం బిహార్ పోలీసులు తాత్సారం చేసినా ఫిర్యాదు వచ్చిన రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని రియా చక్రవర్తి న్యాయవాది పేర్కొన్నారు. తమ విచారణకు సహకరించాలని రియాను కోరకుండానే బిహార్ పోలీసులు ముంబై చేరుకున్నారని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు బిహార్ పోలీసులు వెనుకాడారని, రాజకీయ నేతల ప్రోద్బలంతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఫిర్యాదుదారు న్యాయవాది చెప్పారని పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఉటంకించారు. తన క్లయింట్ ఏ దర్యాప్తు సంస్థకైనా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ కేసును విచారించే పరిధి కలిగి నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. బిహార్‌లో దర్యాప్తు జరుగుతున్న తీరు అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాజకీయ నేతల జోక్యం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని బాంద్రా నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చదవండి : మూవీ మాఫియాపై కంగనా ఫైర్ -
పోలీసులకు అక్షయ్ ఫిట్నెస్ ట్రాకర్లు..
ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరోనా మహమ్మారి పోరులో అవిశ్రాంతంగా పని చేస్తున్న ముంబై పోలీసులకు ఫిట్నెస్-హెల్త్ ట్రాకింగ్ పరికరాలు అందజేశారు. కరోనా పరిస్థితుల్లో అవి పోలీసుల శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, హృందయ స్పందనలును తెలియజేస్తుంది. పోలీసులకు ఈ పరికరాలు చాలా ఉపయోగపడతాయి. శనివారం ఆయన ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌కు ఫిట్నెస్ హెల్త్ ట్రాకింగ్ పరికారాలు అందజేశారు. అక్షయ్ పోలీసులకు చేసిన సాయంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ట్విటర్లో స్పందించారు. ‘ముంబై పోలీసులకు అక్షయ్జీ ఫిట్నెస్-హెల్త్ ట్రాకింగ్ పరికరాలు అందజేశారు. కరోనాతో నివారణలో యుద్ధం చేస్తున్న పోలీసులకు ఈ పరికరాలు వారి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందనలను తెలియజేయడంలో ఉపయోగపడతాయి. ఫిట్నెస్- హెల్త్ ట్రాకింగ్ పరికరాలను గత నెలలో నాసిక్ పోలీసులకు కూడా అందించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని పోలీసులకు అండగా ఉంటున్నారు. దేశంలోని సాయుధ దళాలు, కరోనా కట్టడిలో పోరాడుతున్న పోలీసులపై ఆయనకున్న గొప్ప మనసుకు కృతజ్ఞతలు’ అని అదిత్య ఠాక్రే పేర్కొన్నారు. Earlier today, @akshaykumar ji handed over fitness- health tracking devices to @MumbaiPolice . It gives a constant reading of oxygen, body temp and heart rate, helpful in Covid battle. Last month, Akshay ji gave it to @nashikpolice . (1/n) pic.twitter.com/rgWh2LfbIW — Aaditya Thackeray (@AUThackeray) August 1, 2020 అదే విధంగా ఈ ట్రాకర్లను బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌కు ఇవ్వడంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 56 మంది పోలీసులు కరోనా పాజిటికు గురైనట్లు ఓ అధికారి తెలిపారు. కరోనాపై పోరులో కృషి చేస్తున్న ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు అక్షయ్ తన వంతు సాయంగా రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారత్‌కు చేరుకున్న 480 విద్యార్థులు
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రష్యాలో చిక్కుకున్న 480 మంది భారతీయ వైద్య విద్యార్థులు సోమవారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ముంబై చేరుకున్నారు. వారిని భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శివసేనకు చెందిన ముంబై-సౌత్ ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యాలో ఉన్న భారత విద్యార్థులు మొదట తనను సంప్రదించారని, దీంతో వారికి మంత్రి ఆదిత్య ఠాక్రేకు ట్వీట్ చేయమని సలహా ఇచ్చానని చెప్పారు. ఇక ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్నందున ప్రోటోకాల్ విభాగానికి బాధ్యత వహించి విద్యార్థులను భారత్‌కు రప్పించారని సావంత్ తెలిపారు. (చదవండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు) మహరాష్ట్ర చేరుకున్న 480 విద్యార్థుల్లో 470 మంది మహరాష్ట్ర చేరుకున్నారని, దాద్రా, నగర్ హవేలీకి చెందిన వారు 4, మధ్యప్రదేశ్‌కు చెందిన వారు 4, గోవాకు చెందిన ఇద్దరూ ఉన్నారు. రష్యా నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రతి విద్యార్థికి 400 డాలర్లు (సుమారు రూ. 30,000) ప్రభుత్వం చెల్లించినట్లు నిక్స్టోర్ విమాన ఆన్లైన్ టికెటింగ్ కంపెనీకి చెందిన నికేష్ రంజన్ తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఠాక్రే సహాయం చేశారని, ఇందుకు ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ), రాష్ట్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలను సంప్రదించారని రంజన్ పేర్కొన్నారు. (చదవండి: గుడ్‌న్యూస్: కరోనా డ్రగ్ ధర తగ్గింది) -
న్యాప్కిన్స్పై ఠాక్రే ఫోటో : సేనపై ఎంఎన్ఎస్ ఫైర్
ముంబై : శివసేన పార్టీ కార్యకర్తలు ఆదిత్య ఠాక్రే ఫోటో ముద్రించిన శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేయడం పట్ల పాలక పార్టీపై రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది. మహా వికాస్ అఘది ప్రభుత్వంలో శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పర్యావరణ, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. శివసేన కార్యకర్తలు ఆదిత్య ఠాక్రే ఫోటో ముద్రించిన 500 ప్యాకెట్ల శానిటరీ న్యాప్కిన్స్ను కొలబా అసెంబ్లీ నియోజకవర్గంలోని మహిళలకు పంచారని సీనియర్ ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్‌పాండే ఆరోపించారు. శివసేన యువజన విభాగం యువతి, యువసేన కార్యకర్తలు వీటిని పంపిణీ చేశారని దేశ్‌పాండే ట్వీట్ చేశారు. ఆదిత్య ఠాక్రే యువ సేన అధ్యక్షుడిగానూ వ్యహరిస్తుండటం గమనార్హం. కాగా కరోనా వైరస్‌తో ముంబై నగరం విలవిలలాడుతోంది. దేశ ఆర్థిక, వినోద రాజధానిలో ఇప్పటివరకూ 23,935 కోవిడ్-19 కేసులు నమోదవగా 841 మంది మరణించారు. చదవండి : మండలికి ఠాక్రే: ఎన్నిక ఏకగ్రీవం..! -
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ముంబై: రాష్ట్రంలోని పేదలు ఆకలితో పస్తులుండకుండా చూడటమే లక్ష్యంగా పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'శివ్ భోజన్' పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆరంభించింది. ఈ పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువగా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. (ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..) ఈ పథకాన్ని ప్రవేశపెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా థాక్రే కదులుతున్నారు. శివ్ భోజన్ ప్లేటులో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు. తొలి రోజునే అనూహ్యమైన స్పందన లభించిందని, పేదలు బారులు తీరి ఖరీదు చేశారన్నారు. ఇంత తక్కువ ధరకు అందిస్తున్నందున ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ('88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ') -
24/7 ఓపెన్.. ముంబై నెటిజన్ల హర్షం
మహారాష్ట్రలోని మాల్స్, సినిమా థియేటర్లు, షాపులు, రెస్టారెంట్లు ఇకపై 24 గంటల పాటు తెరిచే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సోషల్ మీడియా వినియోగదారులు, ముంబై వాసులు పెద్ద సంఖ్యలో స్వాగతించారు. జనవరి 27 నుంచి 24/7 పేరుతో రిటైల్ అవుట్ లెట్లను ప్రారంభించాలన్న ప్రతిపాదనను బుధవారం మహారాష్ట్ర మంత్రివర్గం కేబినెట్ బేటీలో నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రసుత్తం ఈ సేవారంగాలలో పనిచేస్తున్న ఐదు లక్షల మందితో పాటు కొత్తవారికి అవకాశాలు వస్తాయని, దీనిని అమల్లోకి తేవడం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చని టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. అయితే మొదటి దశలో మాల్స్‌లో ఉండే షాపులు, సినిమా థియేటర్లు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నట్లు ఆదిత్య స్పష్టం చేశారు. కానీ పబ్‌లు, బార్ అండ్ రెస్తారెంట్లు మాత్రం ఎప్పటిలానే అర్థరాత్రి 1.30 గంటల తర్వాత మూసే ఉంటాయని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియా వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. కమెడియన్ అతుల్ కాత్రి ఆదిత్య థాక్రేకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.'మొత్తం మీద ముంబయి నగరం 24 గంటలు పడుకోకుండా పని చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యాపారవేత్తలకు, నిరుద్యోగులు, భద్రత వంటి విషయాలలో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఒక ముంబయి వ్యక్తిగా దీనిని స్వాగతిస్తున్నా. థ్యాంక్యూ ఆదిత్యథాక్రే' అంటూ అతుల్ కాత్రి పేర్కొన్నాడు. Finally! #Mumbai24x7 This is something what 'the max city which never sleeps' needed. This is a very big step for Mumbai in terms of opportunity, business, employment & also security. Let all of us Mumbaikars ensure we don't mess it up. Thank you @AUThackeray — Atul Khatri (@one_by_two) January 23, 2020 'ఇక మీదట తెల్లవారుజామున 2గంటలకు హెయిర్ కట్ చేయించుకోవచ్చు, బ్యాంక్‌కు వెళ్లొచ్చు.. కానీ మద్యం మాత్రం తాగలేనంటూ' సరిత అనే యువతి ఫన్నీ ట్వీట్ చేశారు. ' మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. ఈ నిర్ణయం ద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, మిగతా నగరాల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని' మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దీనిని తప్పుబట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాల్స్, సినిమా థియేటర్స్ 24 గంటల పాటు తెరిచే ఉంచితే రేప్ కేసులు పెరిగిపోతాయంటూ బీజేపీ నేత రాజ్ పురోహిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. So, I can get a haircut at 2am, go to the bank, but I cannot get a drink. Non-drinkers can get food all night long. #MumbaiNeverSleeps #Mumbai24x7 pic.twitter.com/o9TEJuO7Ir — Sarita (@ViolentVeggy) January 23, 2020 -
ఉద్ధవ్‌కు చెక్.. రాజ్‌ఠాక్రే సరికొత్త వ్యూహం..!
సాక్షి ముంబై : ఠాక్రే కుటుంబం నుంచి మరో వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నాడు. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే రాజకీయ అరంగ్రేటంకు అంతా సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తుండగా మరోవైపు అమిత్ సైతం రాజకీయాల్లో తనదైన ముద్రను వేసేందుకు సిద్దమవుతున్నాడు. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే జయంతి జనవరి 23వ తేదీన ముంబైలో జరగనున్న ఎమ్మెన్నెస్ మొట్టమొదటి మహా సమ్మేళనంలో అమిత్ రాజకీయాల్లో ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆదిత్యకు చెక్‌పెట్టేందుకే అమిత్‌ను తెరపైకి తీసుకువస్తున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నుంచే.. గత ఎన్నికల నుంచి అనేక రాజకీయ ఊహగానాలు కొనసాగుతున్నాయి. రాజ్ తన పార్టీ జెండాను మార్చేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు రాజ్ ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ బయటికి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో జరగబోయే మహా సమ్మేళనంలో రాజ్ ఠాక్రే పలు ప్రకటనలను చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తన కుమారున్ని రాజకీయాల్లోకి పూర్తిగా తీసుకువస్తారని ఎమ్మెన్నెస్ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ ఠాక్రే ఎంట్రీతో ఎమ్మెన్నెస్ పార్టీలో నూతన చైతన్యం వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ ఠాక్రే పలు స్థానిక సమస్యలపై గళమెత్తారు. అయితే అనంతరం మాత్రం ఆయన మళ్లీ పెద్దగా రాజకీయాల్లో కన్పించలేదు. 2015లోనే అమిత్ ఠాక్రే రాజకీయ అరంగేట్రం చేయనున్నారన్న వార్తలు వచ్చాయి. ముంబైలోని పర్యావరణ సమస్యలపై ఆయన గళమెత్తి రాజకీయాల్లోకి క్రియాశీలంగా రానున్నట్టు సంకేతాలిచ్చినప్పటికీ అలాంటిదేమి జరగలేదు. ఇప్పటికే శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే క్రియాశీలపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆదిత్య ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడమే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపొంది కేబినేట్ మంత్రిగా మారారు. మరోవైపు ఉద్దవ్ ఠాక్రే స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభోదన్ ఠాక్రే రెండో కుమారుడైన బాల్ ఠాక్రే మరాఠా భూమిపుత్రుల హక్కులను కాపాడేందుకు 1966లో శివసేన పార్టీని స్థాపించారు. అనంతరం పార్టీ ద్వారా బాల్ ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే, మనుమడు ఆదిత్య ఠాక్రేలు ఇప్పటికే రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అయితే ఉద్దవ్ ఠాక్రే నేతృత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్ ప్రారంభించారు. ఇప్పటి వరకు అమిత్ ఠాక్రే రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చారు. కానీ, ఇంకా దూరంగానే ఉన్నారు. అయితే తాజాగా మాత్రం ఆయన క్రియాశీలంగా రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిసింది. -
కేబినెట్లోకి అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రే!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు పూర్తయింది. ఈరోజు (సోమవారం) సాయంత్రంలోపు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్సీపీ ముఖ్యనేత అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కోరిన విషయం తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం ఠాక్రే.. అజిత్‌తో పాటు ఆదిత్యానూ కేబినెట్లోకి తీసుకుంటామని శరద్‌తో చెప్పినట్టు సమాచారం. అజిత్‌కు మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై మూడు పార్టీల ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. చివరికి శరద్ విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు ఠాక్రే అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఆయతో పాటు ఆదిత్య మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. కానీ వీరిద్దరి స్థానంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవి కోసం ఎన్సీపీ సీనియర్ నేత జయంత్ పాటిల్ తీవ్రంగా పోటీపడుతున్నారు. పదవి ఎలాగైనా తనకే వచ్చేలా తన మద్దతు దారులతో మంతనాలు జరుపుతున్నారు. దీంతో అజిత్, పాటిల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నా.. చివరికి పవార్‌నే వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?) మొత్తం 42 మందికి అవకాశం ఉండటంతో శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్‌కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. శివసేన, ఎన్సీపీలకు 10 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు ..కాంగ్రెస్ నుంచి 8 మంది కేబినెట్, ఇద్దరు సహాయ మంత్రులు కానున్నారు. కాగా సీఎంతో పాటు ఇదివరకే ఆరుగురు మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. -
కొట్టి.. గుండు చేశారు.. వాళ్లను పట్టించుకోవద్దు
ముంబై : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే ట్రోల్స్‌కు సమాధానం చెబుదామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు. ఉద్యోగాల రూపకల్పన, ఆర్థిక వ్యవస్థ పురోగమనంతో వారికి తగిన దీటుగా బదులిద్దామని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు వర్సిటీలోకి వెళ్లి విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడంపై స్పందించిన... ఉద్ధవ్ ఠాక్రే... పోలీసుల చర్యను జలియన్ వాలాబాగ్ ఊచకోతతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలను తప్పుబడుతూ హిరణ్మయి తివారీ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు హిరణ్మయిపై దాడి చేసి.. అతడికి శిరోముండనం చేశారు. ఈ మేరకు అతడు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో శివసేన కార్యకర్తల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆదిత్య ఠాక్రే ట్విటర్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘మత సామరస్యాన్ని పెంపొందించేందుకు... సీఏఏపై మహారాష్ట్ర ప్రజలకు ఉన్న భయాన్ని పోగొట్టేందుకు... సీఎం చేసిన వ్యాఖ్యలను... చవకబారు వ్యక్తులు ట్రోల్ చేశారు. అటువంటి కిందిస్థాయి వ్యక్తుల పట్ల మీరు స్పందించిన తీరు నా దృష్టికి వచ్చింది. నిజానికి శాంతి భద్రతల విషయం పోలీసులకు సంబంధించింది. అయితే ఇటువంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసే చెత్త మనుషులు, నీచులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలు, చిన్నారులపై నీచపు కామెంట్లు చేసే ఇలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. వాళ్లను ప్రజాస్వామ్య వ్యవస్థ తిరస్కరిస్తుంది. సోషల్ మీడియాలో ద్వేషం వెళ్లగక్కుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎవరూ క్షమించరు. కాబట్టి మనం ప్రజల మనసు గెలవాలే తప్ప ట్రోల్స్ గురించి పట్టించుకోనవసరం లేదు. వారు దేశంలోని కొంతమంది బడా నాయకులను అనుసరిస్తున్నారు’ అని ఆదిత్య ఠాక్రే తన తండ్రిని విమర్శిస్తున్న వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. Our statement on trolls and reactions. pic.twitter.com/AvTUnAZo5H — Aaditya Thackeray (@AUThackeray) December 24, 2019 -
తండ్రి ప్రభుత్వంలో కుమారుడికి చోటెక్కడ?
సాక్షి, ముంబై: నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతుంది. ఈరోజు (గురువారం) సాయంత్ర 6:40 గంటలకు ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ పాటు ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన మరికొంత మంది కీలక నేతలకు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, శివసేన నేతలు సుభాష్ దేశాయ్, ఏక్నాథ్ షిండేలు ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్యా ఠాక్రే, ఎన్సీపీ సీనియర్ నేత, తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడితే సీఎం పదవి ఆదిత్యాకు ఇవ్వాలని శివసేన నేతలు ఎన్నికల ముందు నుంచే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వంలోనా.. పార్టీలోనా? ఆదిత్యా ఠాక్రేకు మంత్రివర్గం చోటు దక్కడం ఖాయమనీ, కీలక శాఖనే అప్పగించే అవకాశం ఉందని సేనలో జోరుగా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్యాను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా అనేది పూర్తిగా ఉద్ధవ్ నిర్ణయమని అన్నారు. ఠాక్రే ఆదిత్యాకు తండ్రి మాత్రమే కాదని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా అని వ్యాఖ్యానించారు. దీంతో నూతన ప్రభుత్వంలో ఆదిత్యా స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన ఉద్ధవ్ సీఎం పదవిని చేపట్టబోతుండటంతో, ఆదిత్యా పూర్తిగా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటారని సేన వర్గాల సమాచారం. ఎమ్మెల్యేగా తొలిసారి గెలవడం, పదవులు చేపట్టిన అనుభవం లేకపోవడంతో మంత్రివర్గంలో చోటు దక్కకపోచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ ఐదేళ్ల పాటు సీఎం పదవికే పరిమితమై ఉంటారని, పార్టీ బాధ్యతలను ఆదిత్య చూసుకుంటారని ఓ సీనియర్ నేత వెల్లడించారు. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేలా చేయడం ద్వారా ఆదిత్యాను రాజకీయాల్లో రాటుదేలేలా చేయాలన్నదే శివసేన తాజా ఆలోచనగా చెబుతున్నారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను ఆహ్వానించేందుకు స్యయంగా ఆదిత్యను ఉద్ధవ్ పంపడం కూడా ఈ ఆలోచనలో భాగంగానే చెబుతున్నారు. అయితే దీనిపై ఠాక్రేనే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. (అజిత్ చుట్టూ హైడ్రామా?) ప్రమాణం చేయటం లేదు: అజిత్ ఇక ఎన్సీపీపై తిరుగుబాటు చేసి బీజేపీతో చెతులు కలిపి విఫలమై, తిరిగి ఎన్సీపీ గూటికి చేరిన అజిత్ పవార్ దారెటనేది ప్రశ్నార్థాకంగా మారింది. గురువారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఇదివరకే ప్రకటించారు. అజిత్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ అధినేత శరద్ పవార్ ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వంలో చేరే అంశంపై అజిత్ పవాద్ స్పందించారు. తాను ఎలాంటి పదవులు స్వీకరించడంలేదని, ప్రస్తుతానికి ఎన్సీపీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం అజిత్‌ను ప్రభుత్వంలోకి తీసుకుంటారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. దీనిపై శరద్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
సుప్తచేతనావస్థలోకి మహారాష్ట్ర అసెంబ్లీ!
ముంబై: మహారాష్ట్రలో కనుచూపు మేరలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాని నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లనుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ తొలిసారి సమావేశపర్చేవరకూ 14వ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉంటుందని అసెంబ్లీ వ్యవహరాల మాజీ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర 13వ అసెంబ్లీ పదవీకాలం శనివారం రాత్రితో ముగిసింది. అయితే బీజేపీ, శివసేనల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య పీటముడి కొనసాగుతోంది. శనివారం అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. అసెంబ్లీని సమావేశపర్చే వరకూ అంతే.. ‘కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపర్చనంత వరకూ మహారాష్ట్ర 14వ అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్తుంది’అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి అనంత కల్సే చెప్పారు. సుప్తచేతనావస్థలో ఎంత కాలం ఉంచాలన్న దానిపై నిర్దిష్ట సమయమేదీ లేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ సమయంలో జీతాలు, ఇతర అలవెన్సులు అందుకుంటారన్నారు. ‘రాష్ట్రపతి పాలనే చివరి ప్రత్యామ్నాయం. కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ కూడా కొత్త అసెంబ్లీని సమావేశపర్చలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ లేదు’అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించండి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని కోరుతూ గవర్నర్ కోషియారీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు శనివారం లేఖ రాశారు. సీఎం పీఠం విషయంలో బీజేపీ, శివసేన మధ్య పక్షం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేయడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని ఆ లేఖలో కోరారు. ఈ పరిణామంపై ఎన్సీపీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో శాసనసభలో తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేసింది. శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులు నడుపుతున్నాయి. -
సీఎం పీఠమూ 50:50నే!
ముంబై: ‘మహా’ సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన గురువారం మరోసారి స్పష్టం చేసింది. సమ అధికార పంపిణీ అంటే.. ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకోవడమేనని తేల్చిచెప్పింది. దాంతో, డిమాండ్ల విషయంలో సేన మెత్తబడిందని, త్వరలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని వచ్చిన వార్తలకు తెరపడింది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం పలు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఠాక్రే వంశాంకురం ఆదిత్య ఠాక్రే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదిత్య ఠాక్రేనే షిండే పేరును ప్రతిపాదించారు. ఉద్ధవ్ సూచన మేరకే ఎల్పీ నేతగా షిండే తెరపైకి వచ్చారని సమాచారం. పలువురు పార్టీ నేతలతో కలిసి ఉద్ధవ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ కోషియారీని కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు పంటలను దారుణంగా దెబ్బతీశాయని, అందువల్ల రాష్ట్రంలో అతివృష్టి వల్ల ఏర్పడిన కరువు నెలకొన్నట్లుగా ప్రకటించాలని గవర్నర్‌ను కోరారు. కాగా, శివసేన కార్యాలయం ముందు ‘ఆదిత్య ఠాక్రేనే మహారాష్ట్ర సీఎం’ అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. మరోవైపు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత మల్లిఖార్జున్ ఖర్గే ముంబైలో సమావేశమయ్యారు. త్వరలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. వాడుకుని వదిలేసే విధానం వద్దు బీజేపీ వాడుకుని వదిలేసే విధానాన్ని అవలంబిస్తోందని శివసేన ఆరోపించింది. పొత్తు సమయంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. అధికార పంపిణీ విషయంలో సేన మెత్తబడిందన్న వార్తలు వదంతులేనని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆదిత్య ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి తుది నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రేదేనని స్పష్టం చేశారు. ఢిల్లీ ముందు తలొంచం ఎన్సీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు ఒక భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ‘ఢిల్లీ సింహాసనానికి మహారాష్ట్ర ఏ నాటికి తలొంచదని చరిత్ర చెబుతోంది’ అని ఆ హోర్డింగ్‌పై రాసి ఉంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై కేసు పెట్టినప్పుడు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ చేసిన వ్యాఖ్య అది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ బాగా పుంజుకున్న విషయం తెలిసిందే. 2014లో కన్నా 13 స్థానాలు ఎక్కువగా, మొత్తం 54 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ(105), శివసేన(56)కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. పవార్‌తో సంజయ్ రౌత్ భేటీ బీజేపీ, శివసేనల మధ్య విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవిని శివసేనతో సమంగా పంచుకునేందుకు బీజేపీ వ్యతిరేకత చూపుతున్న పరిస్థితుల్లో.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సమీకరణాలు మారుతున్నాయని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ఎన్సీపీ ఖండించింది. సేన, బీజేపీల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసానికి వెళ్లడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. -
శివసేన ఎంపీ సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ముంబై : ‘ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి దుష్యంత్ ఎవరూ ఇక్కడ లేరు’ అంటూ శివసేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ- శివసేన అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే శాసన సభ స్థానాలు కైవసం చేసుకున్నాయి. కాగా బీజేపీతో పొత్తు ఖరారైన నాటి నుంచి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి తమకు కేటాయించడంతో పాటుగా కేబినెట్లో కూడా సముచిత స్థానం కల్పించాలని శివసేన... కాషాయ పార్టీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం మరాఠా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీ మాత్రం సీఎం పదవి పంచుకునేందుకు సుముఖంగా లేనట్లుగానే కనిపిస్తోంది. దీంతో శివసేన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్- ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగానే గవర్నర్‌తో భేటీ అవడంతో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘ బీజేపీ, మేము ఉమ్మడిగానే ఎన్నికలకు వెళ్లాం. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మేము ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించుకునే విధంగా బీజేపీ మాతో పాపం చేయించకూడదు. రాజకీయంలో సన్యాసులు ఎవరూ ఉండరు. పైగా ఇక్కడ దుష్యంత్ ఎవరూ లేరు. ఎవరి తండ్రైతే జైలులో ఉన్నారో ఆయన.. ఇక్కడ మేము ధర్మబద్ధమైన, నిజాయితితో కూడిన రాజకీయాలే చేస్తాం. శరద్ పవార్ గారేమో బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేక వాతావరణం సృష్టించారు’ అంటూ హరియాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కాగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 స్థానాలు కైవసం చేసుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలాతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దుష్యంత్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టిన బీజేపీ కేబినెట్లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక దుష్యంత్ ప్రమాణ స్వీకారానికి జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్ చౌతాలా పెరోల్‌పై బయటకు వచ్చిన నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా అధికారంలో ఉన్న సమయంలో అజయ్ చౌతాలా ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. -
థాక్రే చేతిలోనే రిమోట్ కంట్రోల్.. సీఎం పదవిని పంచాల్సిందే!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన పార్టీ ఆదివారం సంచలన వ్యాఖ్యలే చేసింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే.. ప్రస్తుత ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా.. ప్రభుత్వానికి సంబంధించి రిమోట్ కంట్రోల్ తమ చేతిలోనే ఉందని తేల్చి చెప్పింది. 1995 నుంచి 1999 వరకు బీజేపీ-శివసేన కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు తన చేతిలోనే ఉందని, ప్రభుత్వం తాను చెప్పినట్టు వినక తప్పదని సేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లినప్పటికీ.. అనుకున్నస్థాయిలో రాణించలేకపోయింది. 2014లో ఒంటరిగా పోటీ చేసి 122 స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. అటు శివసేనకు కూడా గతం కంటే స్థానాలు తగ్గాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీది కీలక పాత్ర కావడంతో అధికార పంపిణీ విషయంలో శివసేన గట్టిగా బేరసారాలు జరుపుతోంది. అధికారాన్ని చెరోసగం పంచాల్సిందేనని, సీఎం పదవిని రెండు పార్టీల మధ్య కూడా చెరిసగం పంచాలని శివసేన గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా థాక్రే వారసుడు ఆదిత్యా ఠాక్రే తొలిసారి పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సీఎం పదవి కోసం ఆ పార్టీ గట్టిగానే పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో తన కాలమ్ ‘రోఖ్‌థోఖ్’లో సంజయ్ రౌత్ ఓ వ్యాసాన్ని ప్రచురించారు. ‘2014లో శివసేనకు 63 సీట్లు రాగా.. ఇప్పుడు 56 సీట్లే వచ్చాయి. కానీ, అధికారానికి సంబంధించి రిమోట్ కంట్రోల్ మాత్రం పార్టీ చేతిలోనే ఉంది. బీజేపీ నీడలోనే శివసేన ఉండిపోతుందన్న భ్రమ పటాపంచలైంది. పులి (శివసేన చిహ్నం) చేతిలో కమలంపువ్వు (బీజేపీ గుర్తు) కార్టూన్ ప్రస్తుత పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఎవరినీ తేలికగా తీసుకోవద్దని సూచిస్తోంది’ అని రౌత్ ఈ వ్యాసంలో తేల్చి చెప్పారు. సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా, పార్లమెంటులో పార్టీ చీఫ్‌విప్‌గా ఉన్న రౌత్ తన వ్యాసంలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ డిమాండ్లపై ఏమాత్రం వెనుకకు తగ్గబోమని విస్పష్ట సంకేతాలు ఇచ్చారు. -
రాసిస్తేనే మద్దతిస్తాం..
సాక్షి ముంబై: మరాఠా రాజకీయం వేడెక్కుతోంది. సంకీర్ణంలో పదవుల పంపకంపై శివసేన పట్టు బిగించింది. ముఖ్యమంత్రి పదవి ఆదిత్య ఠాక్రేకు ఇవ్వడంతోపాటు మంత్రి పదవుల్లో సమాన వాటా కల్పిస్తామంటూ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలంటూ బీజేపీపై ఒత్తిడి తెస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో శనివారం తన నివాసం మాతోశ్రీలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా పార్టీ ఎమ్మెల్యేలంతా రెండున్నరేళ్లు ముఖ్యమంత్రితోపాటు ఇతర మంత్రి పదవుల్లో సమాన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, యువసేన చీఫ్, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే(29)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో లిఖిత పూర్వకంగా బీజేపీ హామీ ఇచ్చేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు’అని వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సమాన వాటా ఇస్తామంటూ లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఇచ్చిన హామీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టారన్నారు. బీజేపీ, శివసేన హిందుత్వకు కట్టుబడి ఉన్నాయని, అందుకే ప్రత్యామ్నాయాలున్నా వాటిపై ఆసక్తి లేదని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారని సర్నాయక్ తెలిపారు. సీఎం పదవి మాదే: బీజేపీ ఇన్చార్జి సరోజ్ పాండే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీదేనని బీజేపీ మహారాష్ట్ర ఇన్చార్జి సరోజ్ పాండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఊహించిన దానికంటే 17 సీట్లు తగ్గినా 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. మిత్రపక్షమైన శివసేనకు కూడా ఏడు సీట్లు తగ్గి, 56 సీట్లు గెలుచుకుందని తెలిపారు. దీపావళి తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్‌తో సీఎం ఫడ్నవిస్ చర్చలు జరుపుతారని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావుసాహెచ్ దన్వే వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఈ నెల 30న సమావేశమై శాసనసభా పక్షం నేతను ఎన్నుకోనున్నారు. సీఎం ఫడ్నవిస్ స్వతంత్రులు, చిన్న పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేం ప్రతిపక్షంలోనే: పవార్ ప్రభుత్వం ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ మద్దతిస్తుందంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘మేం ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పును పాటిస్తాం’అని పేర్కొన్నారు. ‘ప్రతిపక్షంగా ఉండాలనే ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాతీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవ్వాలనుకుంటే శివసేననే ముందుగా స్పందించాలి’అని కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెత్తివార్ అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని అధికా రం నుంచి తప్పించేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని మాజీ సీఎంలు చవాన్, పృథ్వీరాజ్ తెలిపారు. -
ఈ కుర్రాళ్లకు కాలం కలిసొస్తే...
బాల్ థాకరే వారసుడిగా వచ్చిన ఆదిత్య... ఓం ప్రకాష్ చౌతాలా మనవడిగా బరిలోకి దిగిన దుష్యంత్... ఇద్దరూ కుర్రాళ్లే. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగినవారే!!. అయితేనేం... శివసేన భారీ విజయాన్ని దక్కించుకుని... సీఎం కుర్చీని రెండున్నరేళ్లు తమకివ్వాలని బేరాలకు దిగింది. బీజేపీ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్– ఎన్సీపీలతో జట్టుకట్టి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అలాగే హరియాణాలో 10 సీట్లు గెలిచి దుష్యంత్ చౌతాలా జేజేపీ కూడా కింగ్ మేకర్‌గా మారింది. దుష్యంత్‌ను సీఎంను చేసినవారికే మద్దతిస్తామని షరతు పెడుతోంది. కాలం గనక కలిసొచ్చి వీళ్లిద్దరూ ముఖ్యమంత్రులయితే... మొదటి బంతికి సిక్స్ కొట్టేసినట్లే. దుష్యంత్... దేవీలాల్ వారసుడు!! హరియాణాలోని హిస్సార్ జిల్లా, దరోలిలో 1988 ఏప్రిల్ 3న దుష్యంత్ జన్మించారు. తల్లి నైనా సింగ్ చౌతాలా, తండ్రి అజయ్ చౌతాలా. తండ్రి పార్లమెంటు మాజీ సభ్యుడు. రాజకీయ దిగ్గజం, తాత ఓం ప్రకాష్ చౌతాలా. నాలుగు సార్లు హరియాణా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు. ముత్తాత దేవీలాల్. మాజీ ఉప ప్రధాని కూడా!!. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన దుష్యంత్ 2014లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నుంచి పోటీ చేసి హిసార్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్లు. తక్కువ వయసులోనే లోక్ సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు కూడా. లోక్కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నల్సార్ నుంచి ఎల్ఎల్ఎమ్ చేశారు. మేఘనా చౌతాలాని ఏప్రిల్ 18, 2017న పెళ్లి చేసుకున్నారు. అన్నదమ్ముల పోరు... అన్నదమ్ములు అజయ్ చౌతాలా, అభయ్ చౌతాలాల మధ్య తలెత్తిన విభేదాలు ఐఎన్ఎల్డీలో చీలికకు దారితీశాయి. టీచర్ రిక్రూట్ మెంట్లో అవినీతి ఆరోపణలతో ఓం ప్రకాష్ చౌతాలా 2013లో జైలుకెళ్ళాల్సి వచ్చింది. తరువాత ఎంపీగా గెలిచిన దుష్యంత్ చౌతాలా... అభయ్ చౌతాలా నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబ రాజకీయాలు పార్టీని మరింత విచ్ఛిన్నం చేశాయి. 2018 డిసెంబర్లో ఐఎన్ఎల్డీ నుంచి దుష్యంత్‌ని బహిష్కరించారు. దీంతో 2018 డిసెంబర్ 9న జననాయక్ జనతాపార్టీని (జేజేపీ) దుష్యంత్ ఏర్పాటు చేశారు. తన ముత్తాత దేవీలాల్‌తో పాటు దుష్యంత్ చౌతాలా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు. చట్టసభలోకి ‘ఠాక్రే’ ముంబై: బాల్ ఠాక్రే కావచ్చు... ఉద్ధవ్ థాకరమే కావచ్చు. శివసేన అధిపతులుగా వీరు తమ ఇంట్లోంచే పార్టీని నడిపించారు. కార్యకర్తల్ని చట్టసభలకు పంపించారు కానీ... తామెన్నడూ ఎన్నికల బరిలో నిలవలేదు. కానీ వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే (29) మాత్రం ఎన్నికల బరిలో నిలిచి... గెలిచారు. ఆ కుటుంబం నుంచి చట్టసభలో అడుగుపెడుతున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముంబయిలోని వర్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆదిత్య ఠాక్రే బాంబే స్కాటిష్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. సెయింట్ జేవియర్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ చేశారు. తరవాత కేసీ కళాశాలలో న్యాయ విద్య చదివారు. సాహిత్యంపై అభిరుచి కలిగిన ఆదిత్య ఠాక్రే తాను రాసిన కవితలతో 2007లో ‘మై థాట్స్ ఇన్ బ్లాక్ అండ్ వైట్’అనే పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘ఉమ్మీద్’పేరిట ప్రైవేట్ పాటల ఆల్బమ్నూ వెలువరించారు. ఆదిత్య ఠాక్రే 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కింది స్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ముంబయిలో షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లను రాత్రంతా తెరిచి ఉంచేందుకు అనుమతించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జన ఆశీర్వాద్ యాత్ర పేరిట మహారాష్ట్ర మొత్తం చుట్టివచ్చారు. -
మైఖేల్ జాక్సన్ నా దేవుడు: ఆదిత్య ఠాక్రే
సాక్షి, ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో నవశకం మొదలైంది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆదిత్యా ఠాక్రే వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వర్లి నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. అయితే విజయం మరింత బాధ్యతను పెంచుతుందన్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం శివసేన భవన్‌కు చేరుకొని తల్లిదండ్రులతో కలిసి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కేవలం సైనికుడిని మాత్రమేనని తెలిపారు. శివసేన అధినేత, తన తండ్రి ఉద్దవ్ ఠాక్రే ఆదేశాల మేరకు పనిచేస్తానని, మహారాష్ట్ర అభివృద్దిలో భాగంగా అయన ఏ బాధ్యతలు అప్పగించినా శిరసా వహిస్తానని ఆదిత్యా ఠాక్రే స్పష్టం చేశారు. పాప్ రారాజు మైకేల్ జాక్సన్ తనకు దేవుడితో సమానమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నతనం నుంచే జాక్సన్ అంటే అమితమైన ఇష్టమని, చిన్నప్పుడు ఓ సారి అయనను కలిశానని గుర్తుచేశారు. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ఇక తన తల్లిదండ్రుల ప్రేమ, ఆశీర్వాదాలతోనే ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోతున్నట్లు తన తల్లికి చెప్పగానే ఆప్యాయంగా కౌగిలించుకొని కష్టపడి పని చేయమని చెప్పిందన్నారు. ఇక ఆదిత్య ఠాక్రే నామినేషన్ వేసినప్పట్నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు అందరి దృష్టి ఆయనపైనే ఉన్న విషయం తెలిసిందే. ఇక కూటమిలో భాగంగా సీఎం పదవి శివసేనకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ శివసేనకే సీఎం పీఠం అప్పగిస్తే.. సీఎం అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రే పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారనేది రెండు మూడ్రోజుల్లో తేలనుంది. -
థాక్రేకు పీఠం.. సీఎం పదవి చెరి సగం!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సంకీర్ణ రాజకీయం రసవత్తరమైన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కును విజయవంతంగా దాటగలిగింది. కానీ, అనుకున్నట్టుగా బీజేపీ భారీగా స్థానాలు సాధించలేకపోయింది. కాషాయ పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గగా.. దాని మిత్రపక్షం శివసేన తన స్థానాలను మెరుగుపరుచుకొని.. రియల్ కింగ్‌మేకర్‌గా అవతరించింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ఘోరంగా ఏమీ ఓడిపోలేదు. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ గతంలో కంటే గణనీయంగా తన స్థానాలను పెంచుకుంది. ఫలితాల్లోని ఈ పరిణామాలు సహజంగానే అధికార బీజేపీపై హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కూటమితో శివసేన అధికారాన్ని పంచుకోవచ్చునని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ ఊహాగానాలను కొట్టిపారేసిన శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పిన ఆయన.. అందులో ఓ మెలిక పెట్టారు. గతంలో మాదిరిగా ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీకి ఇచ్చేది లేదని సంకేతాలు ఇచ్చారు. సంకీర్ణ కూటమిలో భాగంగా అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామని, ఆ ప్రకారంగానే ప్రభుత్వం ఉండబోతున్నదని ఆయన కుండబద్దలు కొట్టారు. అటు థాక్రేల వారసుడు ఆదిత్యా థాక్రే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి.. వర్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపు దిశగా సాగుతున్నారు. మహారాష్ట్రలో థాక్రేల పాలన రావాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబడుతోంది. ఆదిత్య థాక్రేను సీఎంగా చూసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కూడా అందుకు సానుకూల సంకేతాలే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పదవిలో ఫడ్నవిస్ రానున్న ఐదేళ్లూ కొనసాగుతారా? లేక శివసేనతో ఆ పదవిని పంచుకుంటారా? ఆదిత్య థాక్రే సీఎం అవుతురా? అన్నది ఆసక్తి రేపుతోంది. -
పెద్దాయన మనవడికి తిరుగులేదా?
సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే (29) ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఇటీవల ప్రధానంగా ఆకర్షించిన పత్రికా శీర్షికల్లో ఒకటి. ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి కావడమే కాకుండా పిన్న వయస్సులో పోటీ చేస్తుండడం వల్ల కూడా ఆయన ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షకుడిగా నిలబడ్డారు. ఠాక్రే ఇంటి పేరు కారణంగా ఆయనకు పరిచయం అక్కర్లేదు. బాల్ ఠాక్రే 53 ఏళ్ల క్రితం శివసేనను ముంబైలో ఏర్పాటు చేసిన అనతికాలంలోనే అది కొంకణ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి ప్రజల్లో మంచి పట్టును సాధించింది. థాకరే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల్లో దింపడం ద్వారా రాజకీయ చక్రం తిప్పగలిగారు. బీజేపీతో 25 ఏళ్ల అనుబంధాన్ని తెంపేసుకొని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా శివసేన బాగా దెబ్బతిన్నది. తిరిగి రాజకీయంగా మంచి పట్టు సాధించాలనే లక్ష్యంతో, శివసేన పార్టీలో ఎక్కువ మంది నాయకులు 65 ఏళ్లకు పైబడిన వారవడంతో, యువకులను ఆకర్షించడం కోసం 29 ఏళ్లకే ఆదిత్య ఠాక్రేను రంగంలోకి దింపింది. ఇక ఆదిత్య ఠాక్రే విజయం తథ్యమని తెలుస్తోంది. ఠాక్రే కుటుంబం పట్ల ఉన్న గౌరవమే కాకుండా ఆయన సరైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల ఆయన విజయం సునాయాసమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు మినహా అనేక సార్లు వర్లి నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన ఎన్సీపీ తమ అభ్యర్థిగా బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు సురేశ్ మానేను నిలబెట్టారు. స్థానిక నియోజక వర్గంలో ఆయన పేరు ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేదు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సచిన్ అహిర్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయనపై శివసేన అభ్యర్థి సునీల్ షిండే పోటీ చేశారు. ఆ తర్వాత శివసేనలో చేరిన సచిన్ అహిర్, ఠాక్రేకు మద్దతుగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే విజయం ఖాయమని తెలుస్తోంది. (చదవండి: ఆదిత్యకు కలిసొచ్చేవి ఇవే...) -
వర్లిలో కుమార సంభవమే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణ ముంబైలో అందరి దృష్టి వర్లి నియోజకవర్గంపై పడింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో యువ సేనాని ఆదిత్య ఠాక్రే దిగడంతో ఈ సీటుపై చర్చ సాగుతోంది. ఆయన గెలుపుపై కాకుండా మెజార్టీ ఎంత వస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. వర్లి ఎప్పట్నుంచో శివసేనకు కంచుకోట. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. బీజేపీ–సేన కూటమి గెలిస్తే ఆదిత్య ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇక ఆదిత్యపై పోటీకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానె దళిత నాయకుడు. ఆయన స్థానిక నేత. పక్కా లోకల్ అన్న ప్రచారంతోనే ఆదిత్యకు పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వర్లి ఒక మినీ మహారాష్ట్ర ఈ నియోజకవర్గం మినీ మహారాష్ట్రను తలపిస్తుంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరైన వర్లి గత కొద్ది ఏళ్లలో రూపురేఖలు మారాయి. ఆకాశహర్మ్యాలు, అధునాతన వాణిజ్య భవనాలు వచ్చాయి. వాటి పక్కనే మురికివాడల్లో ప్రజలూ ఉన్నారు. చాల్స్ (ఇరుకు గదులుండే నాలుగైదు అంతస్తుల భవంతులు)లో ఉద్యోగులు ఉన్నారు. భిన్న కులాలు, మతాలు, విభిన్న భాషలు ఇలా ఈ ఒక్క నియోజకవర్గం మహారాష్ట్రకు నమూనాలా ఉంటుంది. మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తెలుగు వారితోపాటు ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇలా భిన్న తరహా ఓటర్లను ఆకర్షించడం సులభమేమీ కాదు. దానికి తగ్గట్టుగానే ఆదిత్య ప్రచారంలో ముందున్నారు. ‘సలాం వర్లి’ అంటూ వివిధ ప్రాంతీయ భాషల్లో భారీ కటౌట్లు ఉంచి మరాఠీయేతరుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరే కాలనీలో వందల భారీ వృక్షాల నరికివేత, ముంబై నైట్ లైఫ్ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, ఆద్యితకు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ మద్దతుపలికారు. ఆదిత్యకు కలిసొచ్చేవి ► బాల్ ఠాక్రే వారసత్వం ► సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం ► ముంబై లైఫ్ వంటి అంశాల ప్రస్తావన ► అభివృద్ధి మంత్రం సురేశ్ మానెకు అనుకూలమివీ.. ► దళిత కార్డు ► లోకల్ ఇమేజ్ ► ఇంటింటికీ తిరగుతూ ప్రజలతో అనుసంధానం ► వివిధ భాషల వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు గతంలో ఫలితాలు ఇలా.. ► 1990 నుంచి ఎన్నికల ఫలితాలను చూస్తే సేన ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. ► 1990 నుంచి 2004 ఎన్నికల వరకు శివసేన నుంచి దత్తాజీ తనవాందే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సచిన్ ఆహిర్ గెలుపొందారు. రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ ఓట్లు భారీగా చీల్చడంతో ఎన్సీపీ అభ్యర్థికి లాభం చేకూరింది. ► 2014లో శివసేన అభ్యర్థి సునీల్ షిండే గెలుపొందారు. -
రూ.10కి భోజనం.. రూ.1కే వైద్యపరీక్షలు
సాక్షి ముంబై: మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో శివసేన పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నట్టే రూ. 10కే భోజనం అందించనున్నట్టు పేర్కొన్నారు. ఒకే వంటశాలలో తయారుచేసిన భోజనాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పొదుపు సంఘాల మహిళలను కూడా ఇందులో చేర్చుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు ఇళ్లలో వినియోగించే విద్యుత్ చార్జీలలో 300 యూనిట్ల వరకు వచ్చే బిల్లులపై 30 శాతం రాయితీ కల్పించనున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యం..విద్య.. ప్రజలకు అందుబాటులో లేని 200 రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కేవలం ఒక్క రూపాయికే అందించనున్నట్లు తెలిపారు. పేద రైతులకు ప్రతి సంవత్సరం రూ.10వేలు నేరుగా అకౌంట్లో జమ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 15 లక్షల పట్టభద్రులైన యువకులకు ‘యువ ప్రభుత్వం ఫెలో’ ద్వారా స్కాలర్షిప్ అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే శిక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల నుంచి పాఠశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. విద్యార్థులందరికి మానసిక, శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు వంటి విషయాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. ముంబైలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేత గురించి మేనిఫేస్టోలో లేదు. -
ఏకం చేసేది హిందూత్వమే
ముంబై: హిందూత్వ ఎజెం డాయే బీజేపీని, శివసేనను కలిపి ఉంచుతోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంచేశారు. రెండు పార్టీల కలయిక విజయం చేకూరుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శుక్రవారం ముంబైలో ఆయన మాట్లాడారు. మొత్తం 288 సీట్లలో శివసేన 124, ఎన్డీయే మిత్రపక్షాలైన ఆర్పీఐ, ఆర్ఎస్పీలు 14, బీజేపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. రెబల్ అభ్యర్థులను రెండు రోజుల్లోగా వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరతామని, లేకపోతే వారి స్థానమేంటో వారికే చూపిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌నేత ఖడ్సేకు టికెట్ రాకపోగా, ఆయన కుమార్తె రోహిణికి ముక్తయినగర్‌లో సీటు కేటాయించారు. ఖడ్సే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆదిత్య భారీ విజయం ఖాయం.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య భారీ మెజార్టీతో గెలుస్తారని ఫడ్నవిస్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ఆదిత్యను సెక్రటేరియట్‌లోని ఆరో అంతస్తులో (ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఉండే చోటు) చూడాలనుకుంటున్నారని తెలిపారు. ఆదిత్య రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. రెండు పార్టీల్లో పెద్దన్న (ఆధిపత్య పార్టీ) ఏదన్న చర్చలు లేనేలేవని పేర్కొన్నారు. -
శివసేనకు పూర్వవైభవం వస్తుందా?
చంద్రయాన్ విజయవంతం కాలేకపోవచ్చు. కానీ మా సూర్యయాన్ (ఆదిత్య అంటే సూర్యుడు) కచ్చితంగా మంత్రాలయ ఆరో అంతస్తులో (మహారాష్ట్ర సీఎం కార్యాలయం) స్మూత్‌గా ల్యాండింగ్ అవుతుంది. ఇప్పడు శివసేనలో ముక్తకంఠంగా వినిపిస్తున్న మాట ఇది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనవడు 29 ఏళ్ల వయసున్న ఆదిత్య ఠాక్రే ఈ సారి శివసేనకు కంచుకోటైన దక్షిణ ముంబైలోని వర్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడంతో ఆయననే భవిష్య సీఎంగా కీర్తిస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఠాక్రే కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తమ కనుసన్నలతోనే ప్రభుత్వాలను శాసించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటలేకపోయిన శివసేన ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ఆదిత్యను బరిలోకి దింపుతోంది. ► సేన ట్రంప్ కార్డు ఉద్ధవ్ ఠాక్రే, రష్మి ఠాక్రే దంపతులకు ఆదిత్య 1990లో జన్మించారు. ముంబైలో బీఏ ఎల్ఎల్బీ చేశారు. స్వతహాగా కవి, రచయిత. ఆదిత్య రాసిన కవిత్వం మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో పుస్తకంగా వచ్చింది. తాను రాసిన ప్రైవేటు గీతాలతో . ఉమ్మీద్ అనే ఆల్బమ్‌ని తీసుకువచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి ఆయన పేరు మారుమోగిపోయింది. 2010లో యువజన విభాగం చీఫ్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆదిత్య శివసేనపై తన ముద్ర వేయడానికి మొదట్నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంప్రదాయ శివసేన భావాలను వదిలించుకొని ఆధునిక హంగుల్ని సమకూర్చడానికి వ్యూహాలు రచించారు. నగరాల్లో యువతను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది ముంబైలో నైట్ లైఫ్‌ను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. మాల్స్, రెస్టారెంట్లు రాత్రంతా తెరిచి ఉంచాల ని ప్రతిపాదనలు చేశారు. అవి సాకారం కానప్పటికీ మార్పు కోసం అంటూ నినదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నడిపారు. వొర్లి నియోజకవర్గంలో ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ► శివసేనకు పూర్వవైభవం వస్తుందా? కొన్నేళ్ల క్రితం వరకు బీజేపీ, శివసేన కూటమిలో సేనదే పై చేయిగా ఉండేది. బాల్ ఠాక్రే జీవించినంత కాలం ఒక పెద్దన్న పాత్రనే పోషించారు. ఎన్నోసార్లు ఆయన బీజేపీపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. కమలదళాన్ని కమ్లి అని స్త్రీలింగాన్ని గుర్తుకు తెచ్చే పేరుతో పిలుస్తూ ‘ఆమెను బయటకు పొమ్మని తలుపు చూపించినా కిటికీలోంచే నా వైపే చూస్తూ ఉంటుంది’అని వ్యాఖ్యానించేవారు. కానీ బీజేపీ లో మోదీ, అమిత్ షా హవా పెరిగాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాలను కూడా మోదీ, షా ద్వయం తమ గుప్పిట్లో పెట్టుకోవడం మొదలు పెట్టారు. అం దుకే కూటమిలో పై చేయి సాధించడమే కాదు, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికే శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న ఈ యువసేనాని అసెంబ్లీకి ఎన్నిక కావడం కష్టమేమీ కాదు కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదిత్య ఉదయం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి. ఆదిత్య ఠాక్రే ఆస్తులు 16 కోట్లు వర్లి నుంచి నామినేషన్ దాఖలు ముంబై: ఠాక్రే వంశం నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న శివసేన అ«ధినేత కుమారుడు ఆదిత్య ఠాక్రే దక్షిణ ముంబైలోని వర్లి శాసనసభ నియోజకవర్గం నుంచి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తండ్రి ఉద్ధవ్ ఠాక్రే, తల్లి రష్మి తన వెంట రాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేయడానికి ముందు తాత శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆదిత్య ఠాక్రే దాఖలు చేసిన అఫడివిట్ ప్రకారం ఆయనకున్న ఆస్తుల విలువ రూ. 16.5 కోట్లు. అందులో చరాస్తులు రూ.11.38 కోట్లని, స్థిరాస్తులు రూ. 4.67 కోట్లుగా చూపించారు. అందులో రూ.10.36కోట్లు బ్యాంకు డిపాజిట్లు ఉంటే, ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. దీని ధరని రూ. 6.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక ఆదిత్యకు రూ. 64.65 లక్షల విలువైన బంగారం, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. 29 ఏళ్ల వయసున్న ఆదిత్య బీఏ ఎల్ఎల్బీ చేశారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. -
ఆదిత్య ఠాక్రే ఆస్తులివే..
ముంబై : శివసేన యూత్ ప్రెసిడెంట్ ఆదిత్య ఠాక్రేకు రూ 16 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. ఆదిత్య చరాస్తుల విలవ రూ 11.38 కోట్లు కాగా, రూ 4.67 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆదిత్య ప్రస్తుతం రూ 6.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కలిగిఉన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమనల్ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వొర్లి నుంచి బరిలో దిగిన సందర్భంలో ఆదిత్య తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. 29 ఏళ్ల ఆదిత్య ఠాక్రే శివసేన దిగ్గజ నేత దివంగత బాల్‌ఠాక్రే మనవడు కాగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నతొలి ఠాక్రే కుటుంబ సభ్యుడు కావడం గమనార్హం. ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆదిత్య ఠాక్రే వద్ద రూ 13,344 నగదు ఉండగా, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్ల రూపంలో రూ 10.36 కోట్ల నగదు నిల్వలున్నాయి. రూ 20.39 లక్షలను బాండ్లు, డిబెంచర్లు, మ్యూచ్‌వల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆయనకు రూ 64.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులున్నాయి. -
పోటీపై ఆదిత్య థాకరే క్లారిటీ..
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శివసేన యువజన విభాగం అధ్యక్షుడు, బాల్‌థాకరే మనవడు ఆదిత్య థాకరే నిర్ధారించారు. శివసేనకు సురక్షిత స్ధానంగా పరిగణించే వొర్లి స్ధానం నుంచి ఆదిత్య పోటీ చేయనున్నారు. సోమవారం ముంబైలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో బాలాసాహెబ్‌కు ఆ తర్వాత మా తండ్రి ఉద్దవ్‌కు ప్రేమాభిమానాలు అందించిన మీరు అదే ప్రేమను తన యాత్ర సందర్భంగా కొద్దిరోజులుగా తనపై కురిపించిన తీరు ముదావహమని అన్నారు. తాను వొర్లి నుంచి పోటీ చేస్తున్నా యావత్ మహారాష్ట్ర తన కర్మభూమిగా ఉంటుందని ఆదిత్య స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే, మంత్రి, లేదా ముఖ్యమంత్రి కావాలనే కోరికతో పోటీ చేయడం లేదని, ప్రజలకు సేవ చేసేందుకే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. దివంగత బాల్‌థాకరే శివసేనను 1966లో స్ధాపించినప్పటి నుంచి థాకరే కుటుంబం నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయడం, రాజ్యాంగ పదవిని చేపట్టడం జరగలేదు. థాకరే కుటుంబం నుంచి తొలిసారిగా ఆదిత్య థాకరే ఎన్నికల బరిలో నిలవడం గమనార్హం. -
‘మహా’ కాంగ్రెస్ తొలి జాబితా
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 51 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఖరారు చేసింది. అభ్యర్థుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ భికర్ స్థానం నుంచి, పార్టీ రాష్ట్ర చీఫ్ విజయ్ బాలసాహెబ్ థోరాట్ సంగమ్నెర్ నుంచి పోటీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ లాతూర్ సిటీ నుంచి, మాజీ హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే కూతురు ప్రణితి సోలాపూర్ సిటీ సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ సీనియర్‌నేత నితిన్ రౌత్ నాగ్‌పూర్ నార్త్ నుంచి పోటీ చేయనున్నారు. అక్టోబర్ 21న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ముంబైలోని వర్లి స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఠాక్రే కుటుంబం తరఫున ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. -
4 వేల కి.మీ.; మరో వారసుడి ప్రజాయాత్ర!
ముంబై : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్న మరాఠా పార్టీ ఈ దఫా ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివసేన చీఫ్ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, పార్టీ యూత్వింగ్ నాయకుడు ఆదిత్య ఠాక్రేను సీఎం అభ్యర్థిగా బరిలో దింపాలని యోచిస్తోంది. ఆదిత్యను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రశాంత్ కిషోర్‌తో శివసేన ఒప్పందం కుదర్చుకున్నట్లుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే గురువారం ప్రజాయాత్ర చేపట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గడపగడపకూ శివసేన విధానాలను చేర్చాలనే ఉద్దేశంతో జన ఆశీర్వాద యాత్ర పేరిట ఆదిత్య ఠాక్రే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. పార్టీ సీనియర్ నేతలు ఏక్నాథ్ షిండే, రామ్‌దాస్ కదమ్‌లతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పార్టీ శ్రేణులు వెంటరాగా ప్రత్యేక వాహనం(కారు)లో ఆదిత్య ఠాక్రే బయల్దేరారు. జలగాన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక పర్యటనకు సంబంధించిన విశేషాలను ఆదిత్య ఠాక్రే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చదవండి : మహారాష్ట్ర సీఎంగా ఆదిత్య ఠాక్రే!? జన ఆశీర్వాద యాత్ర గురించి ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ...‘ మహారాష్ట్రలోని ప్రతీ ఇంటికి శివసేనను చేర్చాలనే సంకల్పంతో నేడు ఈ యాత్ర ప్రారంభించాను. సరికొత్త మహారాష్ట్ర నిర్మాణం మాతోనే సాధ్యం. శివసేన యువకులు, రైతులు, మహిళల పక్షపాతి. ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుంది. వారి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఓట్లను అడిగేందుకు నేను ఈ యాత్ర చేపట్టలేదు. నా దృష్టిలో ఇది ఒక పవిత్ర తీర్థ యాత్ర. సమస్యలను ఎలా పరిష్కరించాలో నా తండ్రి, తాతయ్య నుంచి నేర్చుకున్నాను. నేటి నుంచి దానిని క్షేత్ర స్థాయిలో అమలు చేస్తాను’ అంటూ భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు. చదవండి : అమిత్ షా హామీ ఇచ్చారు..నెక్ట్స్ సీఎం! తనేం చేస్తున్నాడో తనకు తెలుసు.. జన ఆశీర్వాద యాత్ర గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ..‘ తను చేపట్టిన ఈ యాత్రపై ఆదిత్య ఠాక్రేకు పూర్తి అవగాహన, స్పష్టత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు ఓట్లు వేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసేందుకు, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయమని ఆదిత్య ప్రజలకు విఙ్ఞప్తి చేస్తారు. శివసేన విధానాల గురించి సభల్లో ప్రసంగిస్తారు. ఆదిత్య ఠాక్రే నాయకత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా’ అని వ్యాఖ్యానించారు. కాగా కాబోయే మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే అంటూ సంజయ్ రౌత్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పార్టీలోని సీనియర్ నాయకులు సహా పలువురు యువ నాయకులు కూడా ఉద్ధవ్ ఠాక్రే స్థానాన్ని భర్తీ చేసి ముఖ్యమంత్రి కాగల సత్తా ఆదిత్యకు మాత్రమే ఉందని అభిప్రాయపడుతున్నారు. అన్నీ సజావుగా జరిగితే 29 ఏళ్ల ఈ యువ నాయకుడే సీఎం అవుతాడంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వారసుడిగా రంగంలోకి దిగిన ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రజాయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి : ప్రశాంత్ కిషోర్ చేతిలో ఠాక్రే వారసుడు -
మహారాష్ట్ర సీఎంగా ఆదిత్య ఠాక్రే!?
ముంబై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన శివసేన ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీఎం పదవి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఠాక్రే డిప్యూటీ అయ్యేందుకు ఇష్టపడరు. ఆ కుటుంబానికి చెందిన వారెవరైనా అధినేతగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఠాక్రే కుటుంబానికి ఉన్న ప్రతిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో నిలవాలా లేదా అన్న విషయంపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేదే తుది నిర్ణయం. అయితే డిప్యూటీగా కాకుండా చీఫ్‌గా ఉండేందుకే తను ఇష్టపడతాడు’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, శివసేన యూత్ వింగ్ చీఫ్ ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన యువసేన విభాగం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందన్న నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే వారసుడు క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసినప్పటికీ ఫలితాల అనంతరం శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ శివసేన.. అనేక మార్లు బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించింది. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటన్నింటినీ మరచి మరోసారి ఎన్డీయే కూటమిలో చేరింది. ఇక తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై శివసేన కన్ను వేయడంతో రాజకీయ పోరు రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నైట్ లైఫ్ ఇలా ఉండాలి..
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం ఎప్పుడూ నిద్రపోదంటారు. అక్కడ రోజంతా జన సంచారం కనిపిస్తూనే ఉంటుంది. మరి అలాంటి చోట్ల నైట్ లైఫ్ అంటే ఎలా ఉండాలి? ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చిస్తానని అంటున్నారు.. శివసేన యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే. 'బార్లు, రెస్లారెంట్లను రాత్రి ఒంటి గంటకే మూసేయమనడం సరికాదు. మందుల షాపుల్లా.. మందు షాపులను కూడా రోజుకు 24 గంటలూ తెరిచే ఉంచాలి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. అప్పుడే ప్రశస్తమైన ముంబై నైట్‌లైఫ్‌కు మరిత ప్రభ చేకూరుతుంది' అని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తనయుడు యువసేన చీఫ్ ఆదిత్య ఠాక్రే చెప్పారు.ఈ విషయాలపై చర్చించేందుకు త్వరలో మహా సీఎం ఫడ్నవిస్తోనూ కలవనున్నట్లు ఆదిత్య ట్విట్టర్లో పేర్కొన్నారు. -
వెనక్కు తగ్గిన శివసేన
ముంబై: మగాళ్లపై అత్యాచార ఆరోపణలు చేయడం ఫ్యాషన్‌గా మారిందంటూ సామ్నా సంపాదయకీయంలో రాసిన వివాదాస్పద రాతలపై శివసేన వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. ‘ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ వివాదం నేపథ్యంలో సామ్నా రాసిన సంపాదకీయాన్ని తప్పుగా అర్థం చేసుకొని శివసేన పార్టీని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోంది. అత్యాచారమనేది తీవ్రమైన నేరమే. ఈ విషయంలో శివసేనకు మరో అభిప్రాయం లేదు. అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా అత్యాచార ఆరోపణలు చేయడం కూడా తీవ్రమైన నేరమే’నని తాజా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అత్యాచార బాధితురాలు కేసు నమోదు చేయాలని సంపాదకీయంలో స్పష్టంగా చెప్పామని పేర్కొంది. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఐదారు నెలల్లో వైద్యపరమైన సాక్ష్యాలు విలువలేనివిగా మారిపోతాయని, కేసు అనేక మలుపులు తిరుగుతుందనే అభిప్రాయాన్ని మాత్రమే తాను వ్యక్తం చేశామని శివసేన పేర్కొంది. మరాఠీలో రాసిన సంపాదకీయాన్ని అనువాదం చేసే సమయంలో అనేక వక్రీకరణలో చోటుచేసుకున్నాయని, అంతా శివసేనవైపే వేలెత్తి చూపుతున్నారే తప్ప మరోవైపు చూడడంలేదని పేర్కొంది. టీవీ చానళ్లు, కొన్ని పత్రికలు జర్నలిజంపై అత్యాచారం చేశాయని విమర్శించింది. ప్రెస్ కౌన్సిల్ ఈ విషయంపై దృషి సారించాలని శివసేన డిమాండ్ చేసింది. సామ్నా సంపాదకీయం విషయంలో ఎటువంటి వివాదానికి తావులేదని, సునీల్ పరస్కార్ కేసు కోర్టు పరిధిలో ఉందని సూచించింది. ఇదిలాఉండగా ‘ఏదో జరిగిపోయిందన్నట్లుగా చూపడానికి ఉన్నతవర్గాలకు చెందినవారిపై అత్యాచారం, అత్యాచారయత్నం కేసులు పెట్టడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇదో ఫ్యాషన్‌గా మారిపోయింది. డీఐజీ సునీల్ కుమార్ ఎన్నో సంవత్సరాలు పోలీసుశాఖలో పనిచేశారు. ఓ మోడల్ ఆయనపై ఆరోపణలు చేయగానే రాత్రికి రాత్రే ఆయన విలన్ అయిపోయారు. వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి చట్టాలు ఆయుధాలుగా మారుతున్నాయ’టూ సామ్నా సంపాదకీయంలో రాయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్దదుమారమే రేపుతోంది. -
వచ్చేది రామరాజ్యమే
పింప్రి, న్యూస్‌లైన్: రావణ రాజ్యం ముగిసిందని, ఇక రామ రాజ్యం వస్తుందని యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం పుణేలో మోషి నుంచి బోసిరి వరకు ఆదిత్యఠాక్రే రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. శివసేన కూటమి అభ్యర్థులను గెలిపించి ఎర్రకోటపై పార్టీ జెండా ఎగిరేవిధంగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్-ఎన్సీపీలు అటు దేశానికిగానీ లేదా ఇటు రాష్ట్రానికిగానీ చేసిందీ ఏమీ లేదన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. వీరిని ఎన్నుకుంటే శూన్యమే మిగులుతుందన్నారు. ఎన్సీపీ అంటేనే నేషనల్ కరప్షన్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ముందుగా మోషిలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసిన ఆదిత్య... బోసిరి వరకు రోడ్‌షో నిర్వహించారు. బోసిరిలోని పీయూటీ చౌక్ వద్ద ఉన్న శివాజీ విగ్రహం నుంచి రోడ్‌షోను ప్రారంభించారు. బోసిరి, ఆలంది మార్గం మీదుగా దిఘి వరకు రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శివాజీరావ్ అడల్‌రావ్ పాటిల్‌తోపాటు కార్పొరేటర్లు సులభా ఉభాలే, సంగీత పవార్, శివసేన విభాగ ప్రముఖులు విజయ్ పాల్గొన్నారు.