ముంబై: మహారాష్ట్రలో బీజేపీ నకిలీ హిందుత్వను ప్రచారం చేస్తోందని శివసేన( యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాదు.. ఒక కాంట్రాక్టర్ మంత్రి అని అన్నారు. హిందుత్వ పట్ల తమ పార్టీ, బీజేపీ ఆదర్శలు, వైఖరికి స్పష్టమైన తేడాలు ఉన్నాయని తెలిపారు.
‘‘ మేము పాటించే హిందుత్వం బీజేపీ హిందుత్వం ఒకటి కాదు. మా హిందుత్వ సంస్కరణలు.. ప్రజలు ఏం తినాలి, ధరించాలి అనే వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఉంటాయి. మతపరమైన విలువలను కాపాడుతాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మౌనంగా ఉంటూ.. మన దేశంలోని ముస్లింలపై బీజేపీపై దాడి చేయాలనుకుంటోంది.ఎన్నికల ప్రయోజనాల కోసం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించింది.
అదే సమయంలో మా పార్టీ రాజకీయాలు చేయకుండా అనేక ఆలయాలను సందర్శించింది. 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే.. పార్టీ ఫిరాయించి.. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే నాయకుడిగా షిండేకు పేరుంది. ఈ ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు. కాంట్రాక్టర్ మంత్రి. నేను ఓడిపోయినా మహారాష్ట్ర, ముంబై కోసం పోరాటం ఆపను’’ అని అన్నారు.
ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment