ముంబై : శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను నిర్విర్యం చేసేలా అమిత్‌షా తన సొంత పార్టీ నేతల్ని ఉసిగొల్పారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా బీజేపీ.. శివసేనతో పాటు ఎన్‌సీపీ (ఎస్‌పి) శరద్ పవార్‌ను ఎంపిక చేసుకున్నారని తెలిపారు.
అయితే, తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని సూచించారు. తనను (ఉద్ధవ్), శరద్ పవార్‌ను రాజకీయంగా నిలువరించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
అమిత్ షా ఇటీవల నాగ్‌పూర్‌లో పర్యటించినప్పుడు బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అక్కడ ప్రతిపక్ష శ్రేణులను విభజించి.. నన్ను, శరద్ పవార్‌ను రాజకీయంగా నిలువరించాలని కోరారు. అమిత్ షా ఇలా ఎందుకు చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.
‘రాబోయే ఎన్నికలు అధికారం కోసం కాదు. మహారాష్ట్ర దోపిడీకి గురికాకుండా నిరోధించడానికి అవి చాలా కీలకం’ అని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమికి భారీ విజయాన్ని అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment