maha rashtra
-
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను
పుణే: ఎన్సీపీ దిగ్గజ నేత శరద్ పవార్ త్వరలో రాజ కీయాల నుంచి వైదొల గనున్నారా? అంటే అవు ననే చెప్పుకోవాల్సి ఉంటుంది. మంగళవారం మహా రాష్ట్రలోని బారామ తిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన వెల్లడించిన విషయం దీనిని రూఢీ చేస్తోంది. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, యువ తరానికి మార్గదర్శకంగా ఉంటానని శరద్ పవార్ అన్నారు. ‘ప్రస్తుతం అధికారంలో లేను. రాజ్యసభ సభ్యుడిగా మరో ఏడాదిన్నర కొనసాగుతాను. కానీ, ఆ తర్వాత మళ్లీ రాజ్యసభకు పోటీ చేయాలా వద్దా అనే విషయం ఆలోచించాలి. లోక్‌సభకే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను’అని అన్నారు.‘బారామతి నుంచి 14 సార్లు పోటీ చేశా. ప్రతిసారీ మీరు నన్ను గెలిపించారు. ఒక్కసారి కూడా ఓడించలేదు. కానీ, నేనే దీనికి ముగింపు పలకాలి. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. ఆ తపనతోనే పనిచేస్తున్నా. అధికారం కాదు, ప్రజలకు సేవ చేయాలనేదే నా ఉద్దేశం. ప్రజల కోసం ఇకపైనా పనిచేస్తూనే ఉంటా’అని ఆయన ప్రకటించారు. ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న శరద్‌పవార్ వయస్సు 83 ఏళ్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పనిచేశారు. 1967లో మొదటిసారిగా బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత 57 ఏళ్లలో ఒక్క ఓటమిని కూడా ఎరగని నేత శరద్‌పవార్. -
‘షిండే ముఖ్యమంత్రి కాదు.. కాంట్రాక్టర్ మంత్రి’
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ నకిలీ హిందుత్వను ప్రచారం చేస్తోందని శివసేన( యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాదు.. ఒక కాంట్రాక్టర్ మంత్రి అని అన్నారు. హిందుత్వ పట్ల తమ పార్టీ, బీజేపీ ఆదర్శలు, వైఖరికి స్పష్టమైన తేడాలు ఉన్నాయని తెలిపారు.‘‘ మేము పాటించే హిందుత్వం బీజేపీ హిందుత్వం ఒకటి కాదు. మా హిందుత్వ సంస్కరణలు.. ప్రజలు ఏం తినాలి, ధరించాలి అనే వాటిపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఉంటాయి. మతపరమైన విలువలను కాపాడుతాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మౌనంగా ఉంటూ.. మన దేశంలోని ముస్లింలపై బీజేపీపై దాడి చేయాలనుకుంటోంది.ఎన్నికల ప్రయోజనాల కోసం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించింది. అదే సమయంలో మా పార్టీ రాజకీయాలు చేయకుండా అనేక ఆలయాలను సందర్శించింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే.. పార్టీ ఫిరాయించి.. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?. కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే నాయకుడిగా షిండేకు పేరుంది. ఈ ముఖ్యమంత్రి సామాన్యుడు కాదు. కాంట్రాక్టర్ మంత్రి. నేను ఓడిపోయినా మహారాష్ట్ర, ముంబై కోసం పోరాటం ఆపను’’ అని అన్నారు.ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. చదవండి: వయనాడ్ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ -
అమిత్‌షాపై ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు
ముంబై : శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను నిర్విర్యం చేసేలా అమిత్‌షా తన సొంత పార్టీ నేతల్ని ఉసిగొల్పారని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా బీజేపీ.. శివసేనతో పాటు ఎన్సీపీ (ఎస్పి) శరద్ పవార్‌ను ఎంపిక చేసుకున్నారని తెలిపారు. అయితే, తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని సూచించారు. తనను (ఉద్ధవ్), శరద్ పవార్‌ను రాజకీయంగా నిలువరించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.అమిత్ షా ఇటీవల నాగ్‌పూర్‌లో పర్యటించినప్పుడు బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అక్కడ ప్రతిపక్ష శ్రేణులను విభజించి.. నన్ను, శరద్ పవార్‌ను రాజకీయంగా నిలువరించాలని కోరారు. అమిత్ షా ఇలా ఎందుకు చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.‘రాబోయే ఎన్నికలు అధికారం కోసం కాదు. మహారాష్ట్ర దోపిడీకి గురికాకుండా నిరోధించడానికి అవి చాలా కీలకం’ అని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమికి భారీ విజయాన్ని అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
పోర్షే కారు ప్రమాదం: ‘పబ్‌లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
ముంబై: పుణె రోడ్డు ప్రమాదం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన విషయాలను పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలను అమితేష్ కుమార్ తెలిపారు.‘‘శనివారం 10.40కి మైనర్ నిందితుడు తన స్నేహితులతో కలిసి కోసీ రెస్టారెంట్(పబ్)కు వెళ్లారు. అక్కడ వారు భారీ బిల్లును చెల్లించారు. స్నేహితులతకు మైనర్ బాలుడు రూ. 48 వేలతో మద్యం తాగారు. కోసీ రెస్టారెంట్ మూసిన తర్వాత.. అక్కడి నుంచి వారు రెండో పబ్ బాలక్ మారియట్‌కు అర్థరాత్రి 12.10 గంటలకు వెళ్లారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆదివారం మెడికల్ టెస్ట్ పంపి.. అతని రక్త నమూనాలను ఫొరెన్సిక్ విభాగానికి పంపించాము. మద్యం తాగి మూలమలుపు రోడ్డుపై పోర్షే కారుకు నంబర్ ప్లేట్ లేకుండా నడిపాడు. రోడ్డు ప్రమాదానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది’అని అమితేష్ కుమార్ తెలిపారు.‘‘మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదానికి ముందు పబ్‌లో మద్యం సేవించారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిర్థారణకు వచ్చాం. ఫొరెన్సిక్ విభాగానికి పంపిన రక్త నమూనాల రిపోర్టు కోసం వేచి చేస్తున్నాం’’ అని అసిస్టెంట్ పోలీసుల కమిషనర్ మనోజ్ పాలిట్ తెలిపారు.ఈ కేసులలో మైనర్ బాలుడి తండ్రిని పుణె పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మైనర్ బాలుడికి మద్యం సర్వ్ చేసిన రెండు హోటళ్లకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండే , డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చాలా సీరియస్ అయ్యారు. దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ అమితేష్ కుమార్ తెలిపారు.ఆదివారం తెల్లవారుజామున మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి ఖరీదైన పోర్షే కారుతో ఓ బైక్‌ను దారుణంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఐటీ ఫ్రొపెషనల్స్ మరణించారు. ఈ ఘటన కల్యాణి నగన్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. గంటల వ్యవధిలో నిందిత బాలుడుని జువైనల్ జస్టిస్ కోర్టులో ప్రవేశపెట్టగా కఠినమైన షరతులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజురూకు విధించి షరతులు కూడా చర్చనీయాంశం అయ్యాయి. -
Pune Porsche Crash: మైనర్ తప్పిదం.. తండ్రి అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సదరు మైనర్ బాలుడు ఆదివారం మద్యం మైకంతో పోర్షే కారుతో ఓ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన మైనర్ బాలుడి తండ్రి పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు పలు బృందాలకు ఏర్పాడి మంగళవారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో అరెస్ట్ చేశారు.ప్రమాద సమయంలో 17 మైనర్ బాలుడు 200 కిలోమిట్లర్లు వేగంతో కారు నడిపి బైక్‌ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక.. పుణె పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘12వ తరగతి ఫలితాలు వెలువడిన తర్వాత నిందిత బాలుడు స్థానిక పబ్‌లో సంబరాలు చేసుకున్నాడు. కారు ప్రమాదానికి ముందు అతను మద్యం సేవించి ఉన్నాడు. మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం తాగే చట్టపరమైన అనుమతి ఉంది. చట్టవ్యతిరేకంగా మైనరకు మద్యం ఇచ్చిన బార్ ఓనర్లుపై చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.రోడ్డు ప్రమాదం జరిగిన 15 గంటల లోపే మైనర్ బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. ఇక.. అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు పలు షరతులు విధించింది. వాటన్నింటిని తప్పకుండా పాటించాలని ఆదేశించింది. తీవ్రమైన నిర్లక్ష్యంతో ఈ ఘటనకు పాల్పడిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్‌పై కూడా జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రముఖ బిల్డర్ అయిన విశాల్ అగర్వాల్ పరారీలో వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు సెర్చ్ చేసిన మంగళవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. -
Pune: బెయిల్ ఇస్తున్నాం.. ఈ షరతులు పాటించాల్సిందే
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ బాలుడు పోర్షే కారుతో బైక్‌ను ఢికొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎరవాడ పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన మైనర్‌పై కేసు నమోదు చేసి జువెనైల్‌లో కోర్టులో ప్రవేశపెట్టారు. 17 ఏళ్ల ఆ బాలుడి తరఫు న్యాయవాది బెయిల్ కోరగా.. పలు షురతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాము విధించే షరతులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు విధించిన షరతులు.. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. బైక్‌ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్‌పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్‌ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
మాట్లాడుతూనే.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయారు. అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స పొందడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. కొద్ది పాటి విరామం తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మహాయుతి కూటమిలో భాగంగా నితిన్ గడ్కరీ శివసేన - సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన యవత్మాల్ లోక్‌సభ అభ్యర్ధి రాజశ్రీ పాటిల్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ ప్రసంగంలో గడ్కరీ స్పృహ కోల్పోవడంతో సిబ్బంది, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిత్స అందించే ప్రయత్నాలు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद।— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 24, 2024 గడ్కరీ భవిష్యత్‌పై ఊహాగానాలుఈ ఏడాది ప్రారంభంలో నాగ్‌పూర్ సిట్టింగ్ అభ్యర్ధిగా ఉన్న గడ్కరీని ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి కొనసాగిస్తుందా? లేదా? అనే అనుమానాలు రాజకీయంగా చర్చానీయాంశంగా మారాయి. కమలం అధిష్టానం గడ్కరి పేరు ప్రకటించకపోవడంపై ఆయన భవిష్యత్‌పై ఊగాహానాలు ఊపందుకున్నాయి. మా పార్టీలో చేరండిఆ సమయంలో మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే..నితిన్ గడ్కరీని తమ పార్టీ శివసేనలో చేరండంటూ ఆహ్వానించారు. రెండు రోజుల క్రితమే గడ్కరీకి ఈ విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నాను. మీకు అవమానాలు ఎదురవుతుంటే బీజేపీని వీడి మహా వికాస్ అఘాడీలో చేరండి. మీ గెలుపు ఖాయం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని మంత్రిని చేస్తాం అని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఆ కొద్ది రోజుల తర్వాత నాగపూర్ లోక్‌సభ అభ్యర్ధిగా నితీన్ గడ్కరీ పేరు ప్రకటించింది బీజేపీ. పరిపక్వత లేని మాటలుఉద్ధవ్ ఠాక్రే తనని పార్టీలోకి ఆహ్వానించడంపై నితిన్ గడ్కరి స్పందించారు. ఠాక్రే మాటలు ‘పరిపక్వత లేని, హాస్యాస్పదంగా’ ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల టిక్కెట్ల కోసం బీజేపీ ఒక వ్యవస్థ ఉందని, నా ప్రత్యర్థి నా రాజకీయ జీవితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. హ్యాట్రిప్‌పై కన్నేసిన గడ్కరీకాగా, లోక్ సభ ఎన్నికల్లో గత రెండు పర్యాయాలుగా బంఫర్ మోజారీటీతో గెలిచిన నితిన్ గడ్కరీ హ్యాట్రిక్‌పై కన్నేశారు. మహారాష్ర్టలోని నాగపుర్ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న ఆయన..ఇక్కడ ముచ్చటగా మూడోసారి గెలవాలని చూస్తున్నారు. గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన.. కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని గడ్కరీ.. ధీమాగా చెబుతున్నారు. Nagpur's Sitting MP & Loksabha Candidate #NitinGadkari fainted (बेहोश) during an election sabha in Yavatmal.He was campaigning for Rajashree Patil, who is from Chief Minister Eknath Shinde's faction of the Shiv Sena.#GetWellSoonGadkari 🙏 pic.twitter.com/RSIcZFw9fj— Shashank Gattewar | Nagpur (@SGattewar_NGP) April 24, 2024 -
మహారాష్ట్ర - కర్ణాటక సరిహద్దుల్లో హైటెన్షన్
-
సోలార్ పవరే... సో బెటరు!
ముంబై: ‘వాన రాకడ, ప్రాణం పోకడ’ జాబితాలో ‘కరెంట్’ను కూడా చేర్చారు మహారాష్ట్ర సతార జిల్లాలోని మన్యచివాడి గ్రామస్థులు. ఆ ఊళ్లో కరెంటు అనేది ఉన్నప్పటికీ ఎప్పుడు ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. చీకటే చీకటి! రైతుల పొలాలు దెబ్బతింటున్నాయి. వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. సుదీర్ఘమైన కరెంటు కోతలు భరించలేక గ్రామప్రజలు ఎక్కే గడప, దిగేగడపలా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ‘చూద్దాం, చేద్దాం’ అనే మాటలు తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక ఇలా కాదనుకొని మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘ఎవరో ఇవ్వడం ఏమిటీ, కరెంట్ మనమే తయారు చేసుకుందాం’ అని ఒకరు ప్రతిపాదించినప్పుడు– ‘అవేమైనా రొట్టెలా మనమే తయారు చేసుకోవడానికి’ అని అనుకునేంత అమాయకులు కూడా ఉన్నారు. వారు సోలార్ పవర్ గురించి వినింది లేదు! రకరకాల మాటల తరువాత అందరూ సోలార్ పవర్‌కే ఓటు వేశారు. ఆ తరువాత సోలార్ పవర్ నిపుణులతో చర్చించారు. ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. మొదట గ్రామ వీధుల్లోకి సోలార్ పవర్ లైట్లు వచ్చాయి. ఆ తరువాత ప్రతి ఇంటికి ‘సోలార్ యూనిట్’ ఆలోచన చేశారు. అయితే ఒక్కో యూనిట్‌కి సుమారు ఆరువేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఊళ్లో బీదాబిక్కీ ఉంటారు కాబట్టి అంత మొత్తాన్ని అందరూ భరించే పరిస్థితి లేదు. దీంతో మహిళా స్వయం సహాయక బృందాలు ఆ ఖర్చులో ఎక్కువ భాగాన్ని భరించాయి. గ్రామపంచాయితీ, దాతలు తమ వంతుగా సహాయపడ్డారు. ఎట్టకేలకు ఊరు చీకటి నుంచి విముక్తి అయింది...‘సోలార్ గ్రామ్’గా మారింది. ఇప్పుడు ఆ ఊళ్లో కరెంటు కోత అనే మాట వినబడదు. ‘ఒకప్పుడు మా ఊరికి కోడలుగా రావడానికి భయపడేవారు. కరెంటులాంటి మౌలిక సదుపాయాలు లేని ఊరు అనే పేరు ఉండేది. గ్రామ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండేది. అయితే పవర్ అనేది గ్రామ అభివృద్ధికి ఎంత కీలకం అనే విషయం అర్ధమైంది’ అంటుంది సంగీత అనే మహిళ. ‘చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు...చిరుదీపమైనా వెలిగించు’ అనే మంచిమాట ఉంది. చిరుదీపం ఏమి ఖర్మ....శక్తిమంతమైన సోలార్ దీపాన్నే వెలిగించారు గ్రామ మహిళలు. ఆ వెలుగులు ఊరకే పోలేదు. ఊరి అభివృద్ధికి గట్టి ఇంధనం అవుతున్నాయి. మన్యచివాడి ఇప్పుడు ఆదర్శ గ్రామం అయింది. ఈ చిన్న గ్రామం గురించి ఎప్పుడూ వినని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం...చిన్నా,పెద్దా తేడా లేకుండా ఊళ్లో ప్రతి ఒక్కరూ సోలార్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం. చదవండి: ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్‌కు ఎందుకు పెట్టారు..? -
రూ. కోటి కోసం భర్తనే హత్య చేసిన భార్య
లాతర్: డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని నిరూపించే ఘటన ఇది. బీమా డబ్బు కోసం ఏకంగా భర్తనే హతమార్చిందో భార్య. అనంతరం ఆ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించింది. చివరకు బీమా కంపెనీ వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మహారాష్ట్రలో ఎదిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా పోలీసులు మరోసారి విచారణ జరిపి నిందితురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో బభాలగాన్ సమీపంలోని గ్రామంలో రోడ్డు ప్రమాదంలో అన్నారావు బన్సోడే ప్రాణాలను విడిచాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఔస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రోడ్డు ప్రమాదం జరిగినట్లు కేసు ఫైల్ చేసి విచారణను ముగించారు. .(చదవండి: పెళ్లయినా 12 రోజులకే..) అయితే భర్త పేరుపై ఉన్న కోటి రూపాయల బీమా డబ్బు కోసం ఆమె ఇన్సురెన్స్ కంపెనీ దగ్గరకు వెళ్లగా అసలు విషయం బహిర్గతం అయింది. బీమా కంపెనీ వారికి అనుమానం రావడంతో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి గమనించి, పోలీసు కేసు నడోదు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 28, 2014లో మృతుడి సోదరుడు భగవత్ బన్సోడే ఔస పోలీస్ స్టేషన్లో వదిన జ్యోతి బన్సోడేకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఇన్సురెన్స్ డబ్బుల కోసం హత్య చేసిందని ఇన్స్‌రెన్స్ ఏజెంట్ వివేకి, అతని స్నేహితుడు సుబోధి ఆరోపించినట్లు క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సునీల్ నాగార్‌గోజే తెలిపారు. అయితే హత్య ఆరోపణలపై ఔస పోలీసులు జ్యోతి బన్సోడే పై కేసును నమోదు చేయలేదు. పోలీసు సుపరింటెండెంట్ నిఖిల్ పింగాలే ఆదేశాల మేరకు గత మూడు నెలలుగా ఈ కేసును కొత్తగా విచారిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఔస కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలవ్వగా సోమవారం జ్యోతి బన్సోడేను అరెస్ట్ చేశామని,వ్యక్తిగత పూచిపై ఆమెని విడుదల చేసినట్లు నాగార్‌గోజే తెలిపారు. (చదవండి: అడవిలో శవం..పీక్కుతిన్న జంతువులు) -
ఏపీ సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌సహా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు కదలికలు ఊపందుకున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. వారికి అందిన తాజా సమాచారం మేరకు రాష్ట్ర సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలు బాగా పెరిగినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలోని సీమాం ధ్రలో సమైక్య ఉద్యమ బందోబస్తులో పోలీసులు బిజీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న నక్సల్స్ తమ కార్యకలాపాలు పెంచి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా 4 రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పారామిలటరీ, గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇదిలావుంటే, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జిల్లా కలెక్టర్, పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర గురువారం పేలింది. ఇలాంటి మందుపాతరల ను మన రాష్ట్ర సరిహద్దుల్లో కూడా పెద్ద సంఖ్యలోనే అమర్చినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. పారామిలటరీ బలగాలను లక్ష్యంగా చేసుకుని వీటిని అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నక్సల్స్ కోసం వేట ముమ్మరం చేశారు. -
‘స్మగ్లర్’ వేట!
సాక్షి, నిజామాబాద్ : ఇందూరును కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున గంజాయి రవాణా కు పాల్పడుతున్న నగరానికి చెందిన ఓ బడా స్మగ్లర్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు, జీఆర్పీ పోలీసులూ ఇందులో భాగస్వాములయ్యారు. గంజాయి రవాణాలో ఆరితేరిన ఈ స్మగ్లర్ మహారాష్ట్రలో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్న ఈ కేటుగాడికి పోలీసుశాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఉన్నతాధికారులు ఇతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసు దర్యాప్తు తీరును అదనపు డీజీ స్థాయి అధికారి ఒకరు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సహకారం ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలో కేసు దర్యాప్తు విషయంలో ఉన్నతాధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైల్వే కేసులో ప్రమేయం? ఇటీవల రైలులో రవాణా అవుతున్న గంజాయిని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ గంజాయిని రైల్వే పోలీసులే కాజేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అధికారులు ప్రధాన నిందితులైన ఎస్ఐ హన్మాండ్లు, హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ఖాన్లపై ఎన్డీపీఎస్ చట్టంతో పాటు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. ఈ కేసులోనూ నగరానికి చెందిన సదరు గంజాయి స్మగ్లర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మూడో నిందితునిగా ఆ స్మగ్లర్‌ను చేర్చి విచారణ జరుపుతున్నారు. ‘మహా’ ముఠాలతో సంబంధాలు.. పెద్దఎత్తున గంజాయి స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగించే మహా రాష్ట్రకు చెందిన ముఠాలతో జిల్లాకు చెందిన గంజాయి స్మగ్లర్‌కు సంబంధాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్న వారి నుంచి, రాష్ట్రంలో వివిధ చోట్ల నుంచి సేకరించిన గంజాయిని మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్, షిర్డీ, యావత్మాల్, పాండ్రకోడ వంటి ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. సాధారణం నుంచి.. ఇన్నాళ్లు సాధారణ గంజాయినే రవాణా చేసిన సదరు స్మగ్లర్ ఇటీవలి కాలంలో తన పంథాను మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అత్యంత విలువ చేసే మేలు రకం గంజాయినే రవాణా చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. తనకున్న మందీ మార్బలంతో, బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాల్లో యథేచ్ఛగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల అండదండలుండడంతో ఇతడి కార్యకలాపాలను అడ్డుకునేవారు కరువయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ నేత ఆధ్వర్యంలో సదరు స్మగ్లర్ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. తన పలుకుబడిని ఉపయోగించుకుంటూ ఎలాగైనా కేసుల నుంచి బయటపడేందుకు అతడు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.