
లాతర్: డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని నిరూపించే ఘటన ఇది. బీమా డబ్బు కోసం ఏకంగా భర్తనే హతమార్చిందో భార్య. అనంతరం ఆ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించింది. చివరకు బీమా కంపెనీ వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మహారాష్ట్రలో ఎదిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా పోలీసులు మరోసారి విచారణ జరిపి నిందితురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో బభాలగాన్ సమీపంలోని గ్రామంలో రోడ్డు ప్రమాదంలో అన్నారావు బన్‌సోడే ప్రాణాలను విడిచాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఔస పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, రోడ్డు ప్రమాదం జరిగినట్లు కేసు ఫైల్ చేసి విచారణను ముగించారు. .(చదవండి: పెళ్లయినా 12 రోజులకే..)
అయితే భర్త పేరుపై ఉన్న కోటి రూపాయల బీమా డబ్బు కోసం ఆమె ఇన్సురెన్స్ కంపెనీ దగ్గరకు వెళ్లగా అసలు విషయం బహిర్గతం అయింది. బీమా కంపెనీ వారికి అనుమానం రావడంతో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి గమనించి, పోలీసు కేసు నడోదు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 28, 2014లో మృతుడి సోదరుడు భగవత్ బన్‌సోడే ఔస పోలీస్ స్టేషన్‌లో వదిన జ్యోతి బన్‌సోడేకి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. ఇన్సురెన్స్ డబ్బుల కోసం హత్య చేసిందని ఇన్స్‌రెన్స్ ఏజెంట్ వివేకి, అతని స్నేహితుడు సుబోధి ఆరోపించినట్లు క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సునీల్ నాగార్‌గోజే తెలిపారు.
అయితే హత్య ఆరోపణలపై ఔస పోలీసులు జ్యోతి బన్‌సోడే పై కేసును నమోదు చేయలేదు. పోలీసు సుపరింటెండెంట్ నిఖిల్ పింగాలే ఆదేశాల మేరకు గత మూడు నెలలుగా ఈ కేసును కొత్తగా విచారిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఔస కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలవ్వగా సోమవారం జ్యోతి బన్‌సోడేను అరెస్ట్ చేశామని,వ్యక్తిగత పూచిపై ఆమెని విడుదల చేసినట్లు నాగార్‌గోజే తెలిపారు. (చదవండి: అడవిలో శవం..పీక్కుతిన్న జంతువులు)
Comments
Please login to add a commentAdd a comment