Crime branch
-
AP Police: ‘దిగులొద్దు.. భయపడొద్దు.. భరతం పడతాం’
టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్లైన్లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేయడం ఇలా... ► ట్రోలింగ్‌కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. ► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు.. సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు వైఎస్సార్సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్.. మహిళలపై 12 శాతం పెరిగిన నేరాలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశం శుక్రవారం జరిగింది. యానివల్ క్రైం రౌండప్ బుక్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్, అడిషనల్ సీపీలు , డీసీపీలు పాల్గొన్నారు. నగరంలో నేరాలకు సంబంధించిన వివరాలు.. హైదరాబాద్‌లో 24,821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 2 శాతం పెరిగిన క్రైమ్ రేట్ 9% పెరిగిన దోపిడీలు , మహిళలపై 12 % పెరిగిన నేరాలు గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 % పెరిగిన రేప్ కేసులు గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12 % తగ్గిన నేరాలు వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు , పొగొట్టుకున్న సొత్తులో 75 % రికవరీ హత్యలు 79 , రేప్ కేసులు 403 , కిడ్నాప్ లు 242, చీటింగ్ కేసులు 4,909 రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు ఈ ఏడాది 83 డ్రగ్ కేసుల్లో 241మంది అరెస్ట్ గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 % పెరిగిన సైబర్ నేరాలు ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా 401 కోట్లు మోసాలు మల్టిలెవల్ మార్కెటింగ్ 152 కోట్లు మోసం ఆర్థిక నేరాలు 10 వేల కోట్లు కు పైగా మోసం ల్యాండ్ స్కామ్ లల్లో 245 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్ పీడీ యాక్ట్ 18 మందిపై నమోదు ట్రాఫిక్ కేసులు ఇలా.. డ్రంక్ డ్రైవ్ లో 37 వేల కేసులు నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రంక్ డ్రైవ్ ద్వారా రూ.91 లక్షలు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినవారి 556 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదా ద్వారా మరణాలు 280 నమోదు కాగా.. అందులో పాదచారులు 121 మంది ఉన్నారు. మైనర్ డ్రైవింగ్స్ 1,745 కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన రూ. 2.63 లక్షల మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ అనే మాట వినపడొద్దు.. ఈ ఏడాది మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం -
సోషల్ మీడియాపై పోలీస్ నిఘా!
హైదరాబాద్: గ్రేటర్లో పాలక, ప్రతిపక్ష పార్టీల సమావేశాలతో ఎన్నికల వాతావరణం నెలకొంది. దీనికి తోడు గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ, దసరా, దీపావళి ఇలా వరుస పండుగలు వస్తున్నాయి. దీంతో గ్రేటర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై నిఘా పెట్టారు. సైబర్ పెట్రోలింగ్, హైదరాబాద్‌లో సోషల్ మీడియా యాక్షన్, స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ (స్మాష్) పేరిట రంగంలోకి దిగారు. ► సామాజిక మాధ్యమాలతో రెప్పపాటులోనే ప్రపంచం నలువైపులా భావోద్వేగాలను రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. ఇది శాంతి భద్రతల సమస్యకు కారణమవుతోంది. ► సామాజిక మాధ్యమాలలో ఎవరైనా అశ్లీల, అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టులు, విద్వేష ప్రసంగాలు, వందతులు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను పెడితే వాటిపై ఫిర్యాదులు వచ్చి..చర్యలు తీసుకునేలోపే అనర్థం జరుగుతోంది. ►దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు సైబర్ పెట్రోలింగ్, స్మాష్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక టూల్ సహాయంతో పోలీసులు వీటిని గుర్తిస్తారు. ► సాధారణ రోజుల్లో 4–5 వేల సామాజిక ఖాతాలను పరిశీలిస్తే.. ఇలాంటి కీలకమైన సమయాల్లో రోజుకు 10 వేలకు పైగా సోషల్ అకౌంట్లను విశ్లేషిస్తుంటారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గుర్తించగానే పోలీసు విభాగాలన్నీ అప్రమత్తమవుతారు. ఆ పోస్టు చేసిన వ్యక్తి లేదా సంస్థలను నిమిషాల వ్యవధిలోనే గుర్తించి, వీరిపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ► వదంతులు వ్యాప్తి చేసే వారి ఫోన్ ఐఎంఈఐ నంబర్లు, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా క్రియేటర్లను పోలీసులు గుర్తిస్తారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. -
ఆస్తి కాజేశారని నటి గౌతమి ఫిర్యాదు
తన ఆస్తిని కాజేశారని నటి గౌతమి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 29వ తేదీ మరిన్ని వివరాలను అందించడానికి తిరువణ్ణామలై ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమచారం. గౌతమి 2004లో క్యాన్సర్ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఆస్తులకు పవర్ ఏజెంట్‌గా అళగప్పన్ అనే రియల్ఎస్టేట్ ఏజెంట్‌ను నియమించుకున్నారు. కాగా అళగప్పన్ ఆయన కుటుంబ సభ్యులు శ్రీపెరంబత్తూర్లోని గౌతమికి చెందిన రూ.25 కోట్ల ఆస్తులను పోర్జరీ పత్రాలతో ఆక్రమించినట్లుగా సోమవారం చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలైలో 2019లో రూ.48 లక్షలతో 4 ఎకరాల భూమిని కోనుగోలు చేశానని.. ఇప్పుడు కోట్ల విలువ చేస్తుందని.. ఆ భూమిని అళగప్పన్, అతని భార్య నాచ్చాన్ కాజేశారని తన న్యాయవాది ద్వారా తిరువణ్ణామలై జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అళగప్పన్, అతని భార్యను స్టేషన్‌కు పలిపించారు. డీఎస్పీ అన్నాదురై, ఇన్స్పెక్టర్ కవిత విచారించారు. కాగా ఈ కేసులో మరిన్ని ఆధారాలను సమర్చించడానికి నటి గౌతమి ఈ నెల 29వ తేదీ తిరువణ్ణామలై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. -
మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం
భువనేశ్వర్: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం శుక్రవారం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఒడిశా క్రైమ్ బ్రాంచ్ 540 పేజీలకు పైగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ విషాద ఘటనలో ప్రధాన నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ (53) వ్యతిరేకంగా ఆయుధాల చట్టం ప్రకారం 307, 302, 27 (1) సెక్షన్లు కింద అభియోగాలు నమోదు చేశారు. పాత వైరం కారణంగా నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు విచారణలో ధ్రువీకరించినట్లు చార్జ్‌షీటులో వెల్లడించారు. జనవరి 29న హత్య ఈ ఏడాది జనవరి 29న మంత్రి అధికారిక కార్యక్రమం పర్యటనలో నడి రోడ్డమీద జన సందోహం మధ్య నిందితుడు తుపాకీ గురిపెట్టి పేల్చడంతో మంత్రి అక్కడిక్కడే కుప్పకూలిపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, శాసీ్త్రయ బృందం పరిశీలన నివేదికల ఆధారంగా నిందిత ఏఎస్ఐ గోపాల కృష్ణ దాస్‌ని విధుల నుంచి బహిష్కరించారు. మంత్రితో బ్రజ్‌రాజ్‌నగర్ ఠాణా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ) పి.కె.స్వంయి మరో సిబ్బంది జీవన్ కుమార్ నాయక్‌ని హత్య చేసేందుకు నిందితుడు విఫలయత్నం చేసినట్లు ఝార్సుగుడ ఎస్డీజేఎం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ మీడియాకు తెలియజేసింది. ముందస్తు ప్రణాళికతోనే... నిందితుడు ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ తెలివిగా ముందస్తు ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడ్డాడని క్రైం బ్రాంచ్ తెలిపింది. అతని మానసిక పరిస్థితి స్థిరంగా, సాధారణమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మానసిక అనారోగ్య లక్షణాలు దర్యాప్తులో బయటపడనట్లు వివరించింది. సంచలనాత్మక హత్య సంఘటనకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించింది. ఈ నేపథ్యంలో మౌఖిక, దస్తావేజులు, మెడికో–లీగల్, సైబర్ ఫోరెన్సిక్ మరియు బాలిస్టిక్ నివేదికలను క్రైం శాఖ లోతుగా సమీక్షించింది. ఈ సమీక్షలో నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ మరియు అతని అనుచరులతో తనకు ప్రాణాపాయం ఉన్నట్లు భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంత్రి అనుచర వర్గాలు తరచు ఆయనకు ప్రాణాపాయ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మంత్రిపై వ్యక్తిగత ద్వేషం బలపడి మానసిక వేదనతో మంత్రిని నిలువునా హత్య చేసి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టమైంది. అభద్రతా భావంతోనే మంత్రి హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనికోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుని బెడిసి కొట్టని వ్యూహంతో తుపాకీ గురి పెట్టి ఘటనా స్థలంలో మంత్రిని కుప్పకూల్చినట్లు క్రైం శాఖ తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, కొన్ని నివేదికలు, వివరణలను పొందడం కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. మానసిక రోగి: కుటుంబ సభ్యులు నిందితుడి కుటుంబ సభ్యులు గోపాల్ కృష్ణదాస్ చాలాకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొంతకాలంగా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని అంటున్నారు. అయితే అనుబంధ చికిత్స కొనసాగుతుందని దర్యాప్తు వర్గాలు విచారణలో పేర్కొన్నాయి. మానసిక ఇబ్బందుల విషయం ధ్రువీకరించేందుకు వైద్య విద్య మరియు శిక్షణ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు అనుబంధ పరీక్షలను నిర్వహించి, నిందితుడిలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు లేవని స్పష్టం చేసింది. స్థానికులు, సహోద్యోగుల వాంగ్మూలం వైద్య బోర్డు అభిప్రాయానికి చేరువగా ఉన్నట్లు క్రైమ్ శాఖ తెలిపింది. నిందితుడు సాదాసీదాగా కలిసిమెలిసి తిరుగాడే వ్యక్తిగా తోటి వ్యక్తుల వాంగ్మూలం దర్యాప్తు బృందం నమోదు చేసింది. ఇలా పరిసరాల పరిశీలన, అనుబంధ విశ్లేషణలో నిందితుని మానసిక పరిస్థితి చాలా సాధారణంగా ఉందని, ఎటువంటి అసాధారణత లేదని నిర్ధారించారు. విచారణకు నిందితుడు సంతృప్తికరంగా సహకరించారని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అధికారిక రివాల్వరే హత్యాస్త్రం విధి నిర్వహణలో ఉండగా పోలీసు ఏఎస్ఐ గోపాల్ కృష్ణ దాస్ హత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న అధికారిక రివాల్వర్‌తో సిటింగు ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవ కిషోర్ దాస్‌ను జన సందోహం మధ్య కాల్చి నడిరోడ్డు మీద కుప్పకూల్చేశాడు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిలువెత్తున ఆరోపించాయి. విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసిన క్రైమ్ బ్రాంచ్ విచారణలో కుట్ర కోణం జాడ లేనట్లు వెల్లడించింది. 10 బృందాలతో దర్యాప్తు సిటింగ్ మంత్రి హత్య జరిగిన రోజు నుంచే క్రైమ్ బ్రాంచ్, బ్రజరాజ్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోతైన దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ 10 బృందాలను ఏర్పాటు చేసింది. హత్య వ్యూహం పూర్వాపరాలను ఆరా తీసేందుకు రాష్ట్రంలో ఝార్సుగుడ, భువనేశ్వర్, బరంపురం మరియు పలు ఇతర రాష్ట్రేతర ప్రాంతాలు సందర్శించి దర్యాప్తు బృందాలు పూర్వాపరాలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు వర్గాలు 89 మంది సాక్షులను ప్రశ్నించారు. తుపాకీలు, లైవ్ కాట్రిడ్జ్‌లు, ఖాళీ కాట్రిడ్జ్‌లు ఇతరేతర పలు రుజువుపూరిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ జరిగింది ఝార్సుగూడ జిల్లాలో మంత్రి కార్యక్రమం పురస్కరించుకుని నిందిత ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్‌ని ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ కోసం నియమించారు. ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా మలచుకుని తన దగ్గర ఉన్న 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ని ఉపయోగించి అతి సమీపం నుంచి మంత్రిపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కూరుకుపోయిన మంత్రిని హెలికాప్టర్లో హుటాహుటిన భువనేశ్వర్‌కు తరలించారు. అయితే అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ మంత్రి తుదిశ్వాస విడిచాడు. నిందితుడు 2013లో ఝార్సుగుడ జిల్లాలో పోలీసు ఉద్యోగం పొందాడు. తన ఉద్యోగ జీవితంలో నిందిత గోపాల కృష్ణ దాస్ శ్రేష్టమైన పనితీరుకు తొమ్మిది రివార్డులు, 18 ప్రశంసా పత్రాలు పొందడం విశేషం. అతని కుటుంబం బరంపురం శివారులోని జలేశ్వరఖండిలో ఉంటుంది. విచారణలో భాగంగా నిందితుడికి మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రేతర (బెంగుళూరు) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌కు తీసుకెళ్లాలన్న అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది. -
మానస్ కేసు క్రైమ్ బ్రాంచ్‌కి! రాసలీలల చిప్ కోసమే..?
తమ కొడుకుది సుపారీ హత్యేనని ఆ తల్లిదండ్రులు, తన భర్త మరణం వెనుక కుట్ర దాగుందని, తనకి న్యాయం చేయకపోతే ఆత్మాహుతికి పాల్పడతానంటూ ఓ బాధితురాలు.. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందే ధర్నాకు సిద్ధపడడం సంచలనంగా మారింది. ఓ వెబ్‌పోర్టల్‌లో పని చేసే కెమెరామ్యాన్ హత్యోదాంతం.. ఇప్పుడు ఒడిశాను కుదిపేస్తోంది. ఓ వెబ్ పోర్టల్‌లో కెమెరామ్యాన్ మానస్ స్వాయిన్(28) హత్య ఉదంతం ఒడిషాను కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్న సదరు వెబ్ పోర్టల్ ఓనర్ సర్మిస్తా రౌత్ ఇంకా పరారీలోనే ఉంది. దాదాపు ఇరవై రోజులు కావొస్తున్న కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులపై విమర్శలు పెరిగాయి. దీంతో ఈ కేసును సీఐడీ క్రైం బ్రాంచ్‌కు కేసు అప్పగించింది ప్రభుత్వం. మానస్ స్వాయిన్‌ను ఫిబ్రవరి 7వ తేదీన ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లాడు. ఆ టైంలోనే సర్మిస్తాతో పాటు మరో నలుగురు వ్యక్తులు మానస్‌ను అపహరించి.. భువనేశ్వర్ సుందర్‌పాదాలో సర్మిస్తాకు చెందిన ఓ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ మరుసటి రోజు మానస్ మృతదేహం పోలీసులకు దొరికింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. హత్యగా నిర్ధారించారు. చిప్ కోసమేనా? ఈ కేసు ఓ మెమొరీ చిప్ చుట్టూ తిరుగుతుండడం విశేషం. అందులో సర్మిస్తా, పలువురు ప్రముఖులకు చెందిన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిని మానస్ స్వాయిన్ ఎక్కడో దాచి పెట్టాడని, తన రాసలీలలు బయటపడతాయనే భయంతోనే ఆమె అతన్ని దారుణంగా హతమార్చిందని పోలీసులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆమెకు ఉన్న పరిచయాలపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ఒడిషా సమాచార విభాగంలో(OIS) అధికారిగా పని చేసిన నిరంజన్ సేథీని.. మూడు రోజుల కిందట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన.. తన రిటైర్మెంట్కు సరిగ్గా ఒక రోజు ముందు సర్మిస్తా నడిపించే ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్‌కు యాడ్ పర్మిషన్లు ఇప్పించాడు. పైగా మానస్ హత్యకు ముందు రోజు సర్మిస్తా-నిరంజన్ మధ్య దాదాపు అరగంటకు పైగా ఫోన్ సంభాషణలు సాగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అందుకే అరెస్ట్ చేసి.. ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటిదాకా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సర్మిస్తా రౌత్ సోదరుడు పరమేశ్వర్‌ను విజయవాడలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రౌత్ తప్పించుకుని పోవడానికి పరమేశ్వర్ కారణమని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో రెండు టీంలు రంగంలోకి దిగాయి. ఒకటి రౌత్ కోసం గాలిస్తుండగా.. మరొకటి ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. సర్మిస్తా రౌత్ వేరే రాష్ట్రంలో తలదాచుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే కేసును లోతుగా దర్యాప్తు చేస్తే.. రాజకీయ, హైప్రొఫైల్ సెలబ్రిటీల గుట్టు బయటపడొచ్చని భావిస్తున్నారు. -
ఇదో రియల్ సస్పెన్స్ కథ: బెడ్రూమ్లోని రూ.55 లక్షలు మాయం!
తగరపువలస (భీమిలి): ఇదో రియల్ సస్పెన్స్ కథ. బెడ్రూమ్లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ ఆసామి ఫిర్యాదు చేయడం.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగటం.. ఆ వెనుకే క్లూస్‌టీమ్.. తరువాత డాగ్ స్క్వాడ్ రావడం.. పలుచోట్ల తవ్వకాలు జరపటం.. సోదాలు చేయటం.. ఎదురింట్లో రూ.19 లక్షలు లభించటం వంటి పరిణామాలు రోజంతా కనిపించాయి. సీన్ కట్‌చేస్తే.. ఉన్నట్టుండి ‘మేమూ.. మేమూ.. పరిష్కరించుకుంటాం. ఇక మీరు వెళ్లి రావొచ్చు’ అని ఆ ఆసామి చెప్పటం.. మారుమాట్లాడకుండా పోలీసులు వెనుదిరగడం జరిగిపోయాయి. భీమిలి జోన్ రెండో వార్డు సంగివలసలో జాతీయ రహదారిని ఆనుకుని ఉంటున్న మేడ చిన్నారావు అలియాస్ గురుమూర్తి కర్ర పెండలం వ్యాపారం చేస్తుంటాడు. ఈ ఏడాది మార్చిలో విజయనగరం జిల్లా గజపతినగరంలో భూమి విక్రయించగా రూ.75 లక్షలు వచ్చాయి. అందులో రూ.20 లక్షలు బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షల్ని డబ్బాలో ఉంచి బెడ్రూమ్లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆపై సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేయించాడు. ఈ నెల 17న ఇద్దరు కుమారులు, కోడళ్లు అత్తారింటికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా డబ్బులు పాతిపెట్టిన చోట కొత్తగా సిమెంట్ ప్లాస్టింగ్ చేసి ఉండటంతో కంగారుపడి అక్కడ తవ్విచూశారు. డబ్బులు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రైమ్ విభాగం క్లూస్ టీమ్ వచ్చి సోమవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను విచారించారు. పోలీసులు వచ్చి ఇంట్లో, ఆవరణలో పలుచోట్ల తవ్వి చూశారు. అయినా ప్రయోజనం లేక.. అదే ఇంటికి ఎదురుగా చిన్నారావు (గురుమూర్తి)కే చెందిన పెంకుటింట్లో సోదాలు నిర్వహించగా.. అక్కడ గొయ్యి తీసి దాచిన రూ.19 లక్షలు బయటపడ్డాయి. ఇది ఇంట్లో వాళ్ల పనేనని అనుమానించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. సీన్ మారిపోయింది. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఫిర్యాదుదారు చిన్నారావు చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రూ.55 లక్షలు మాయమైన భవనంలో ఫిర్యాదుదారు చిన్నారావు నివసిస్తుండగా.. రూ.19 లక్షలు లభ్యమైన ఎదురింట్లో అతని ఇద్దరు కుమారులు ఉంటున్నారు. -
కార్వీ పార్థసారథిపై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకాగా, తాజాగా రూ.350 కోట్ల స్కామ్‌కు సంబంధించి బెంగళూరులోని వివిధ ఠాణాల్లో నలుగురు బాధితులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన మదుపరుల డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును కార్వీ సంస్థ దుర్వినియోగం చేసిందంటూ వాటిలో పేర్కొన్నారు. ఈ కేసులను అక్కడి క్రైమ్ వింగ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ చేరుకున్న అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకున్నారు. మరోపక్క హరియాణా సహా ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదవుతున్నా యి. తక్కువ మొత్తాలతో ముడిపడి ఉన్న కేసులను పార్థసారథి సంబంధీకులు సెటిల్ చేస్తున్నారు. -
భగ్గుమంటున్న దేశ రాజధాని.. కేసు క్రైం బ్రాంచ్‌కు బదిలీ
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 వసంతాలు. మరి సామాన్యుల జీవితాల్లో మార్పు వచ్చిందా? బడుగు జీవుల బతుకుల్లో వెలుగు నిండిందా? ఆడ వారిపై అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గాయా? ఓ పేదవానికి వెంటనే న్యాయం అందుతుందా? ఒకటా.. రెండా.. వందలు.. వేలు.. లక్షల ప్రశ్నలు. ఇలా లెక్కించుకుంటూ పోతే రామయాణ, మహాభారత గ్రంథాలను మించి రాయాల్సి ఉంటుంది. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన 9 ఏళ్ల మైనర్ బాలికపై హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీనిని పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయడానికి క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 1న నైరుతి ఢిల్లీలో తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారం, హత్య చేసి, రాత్రికి రాత్రే దహనం చేశారు. కాగా ఈ కేసును ఆగస్టు 4న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీసీసీఆర్) సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా 48 గంటల్లో దీనిపై సరియైన నివేదికను సమర్పించాలని ఢిల్లీ సౌత్ వెస్ట్ డీసీపీకి ఎన్సీసీసీఆర్ లేఖ రాసింది. కాగా ఢిల్లీ పోలీసు కమిషనర్, రాకేశ్ ఆస్థానా ఈ కేసు బదిలీకి దిశానిర్దేశం చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలి: అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బుధవారం ఆయన బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఇక నిందితులకు కఠిన శిక్షలు పడేలా ఉన్నత న్యాయవాదులను నియమిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన సిగ్గుచేటు అని పేర్కొన్నాడు. ఢిల్లీలో శాంతిభద్రతలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. కాగా బాధితురాలి తల్లి తల్లి స్టేట్మెంట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. -
రాజ్‌కుంద్రా కేసు: నటికి సమన్లు
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త , శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అశ్లీ చిత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు సాక్ష్యాలను సేకరించగా, వియాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులు అందించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుంద్రాకు పోర్న్ వీడియోల రాకెట్ఖుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. రేపు (జూలై 27, ఉదయం 11 గంటలకు) తమ ముందు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చింది. ఈ కేసుకు సంబంధించి షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కుంద్రా ఉద్యోగులు సమాచారం కీలకంగా భావిస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే అవకాశముందని అంచనా. కాగా రాజ్ కుంద్రా వ్యవహారంపై సోషల్ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్, జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించిన తరువాత షెర్లిన్ చోప్రా మొదటిసారి మౌనం వీడింది. ఈమేరకు ఒకవీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్‌కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై ఎటాక్ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగు తున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
Sushil Kumar: పరారీలో ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్?!
న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణం దారుణ హత్య జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల రెజ్లర్ మరణించారు. అయితే బాధితుడి మృతిలో ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. ''మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలో ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు చెందిన ఇంట్లో సాగర్, అమిత్ కుమార్, ప్రిన్స్ దలాల్ ఉంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే విషయమై, ఇరువర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో ఘటనస్థలానికి చేరుకున్న మోడల్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలంలో సాగర్ కుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అతడిని ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా గుర్తించారు. ఇక ఈ ఘటనలో సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రిన్స్ దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్ చేసి.. పార్క్ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్ చేసిన గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుశీల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ ఈ ఘటనలో సుశీల్ కుమార్ హస్తం ఉందని తేలడంతో అతనిపై ఎఫైఆర్ నమోదైందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ చెప్పారు. కేసు దర్యాప్తు భాగంగా సుశీల్ కుమార్ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశాం. అక్కడ సుశీల్ కుమార్ లేడు. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. చదవండి: Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి -
అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్‌పై బదిలీ వేటు
సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో అనేక ట్విస్ట్ అండ్ టర్న్స్ మధ్య తాజాగా ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) హెడ్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేపై వేటు పడింది. ఆయనను క్రైమ్ బ్రాంచ్ నుండి తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ కేసులో స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ మరణం కేసులో వాజేను రక్షించేందుకు శివసేన ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు. అలాగే ఫిబ్రవరి 22 న హోటల్లో శవమై కనిపించిన దాద్రా, నాగర్ హవేలీ ఎంపీ మోహన్ డెల్కర్ రాసిన సూసైడ్ లేఖ తన దగ్గర ఉందంటూ రాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. (ఈ ఘటనపై అసెంబ్లీలో రచ్చ చేసిన ప్రతిపక్షాలు) గతనెల 25న అంబానీ ఇంటి ముందుపేలుడు పదార్థాలతో కనిపించిన స్కార్పియో యజమాని, ఆటో విడిభాగాల వ్యాపారి మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంపై ఫడ్నవిస్, పోలీసు అధికారి సచిన్ వాజేపాత్రపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సచిన్ తన భర్తను హత్య చేసి ఉండవచ్చని హిరేన్ భార్య ప్రకటన మేరకు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు) మరోవైపు తాజా వ్యవహారంతో శివసేన, బీజేపీ మధ్య రగులుతున్న వివాదం మరింత రాజుకుంది. అన్వే నాయక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ) -
రూ. కోటి కోసం భర్తనే హత్య చేసిన భార్య
లాతర్: డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని నిరూపించే ఘటన ఇది. బీమా డబ్బు కోసం ఏకంగా భర్తనే హతమార్చిందో భార్య. అనంతరం ఆ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించింది. చివరకు బీమా కంపెనీ వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మహారాష్ట్రలో ఎదిమిదేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. తాజాగా పోలీసులు మరోసారి విచారణ జరిపి నిందితురాలిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో బభాలగాన్ సమీపంలోని గ్రామంలో రోడ్డు ప్రమాదంలో అన్నారావు బన్సోడే ప్రాణాలను విడిచాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఔస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రోడ్డు ప్రమాదం జరిగినట్లు కేసు ఫైల్ చేసి విచారణను ముగించారు. .(చదవండి: పెళ్లయినా 12 రోజులకే..) అయితే భర్త పేరుపై ఉన్న కోటి రూపాయల బీమా డబ్బు కోసం ఆమె ఇన్సురెన్స్ కంపెనీ దగ్గరకు వెళ్లగా అసలు విషయం బహిర్గతం అయింది. బీమా కంపెనీ వారికి అనుమానం రావడంతో ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి గమనించి, పోలీసు కేసు నడోదు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 28, 2014లో మృతుడి సోదరుడు భగవత్ బన్సోడే ఔస పోలీస్ స్టేషన్లో వదిన జ్యోతి బన్సోడేకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఇన్సురెన్స్ డబ్బుల కోసం హత్య చేసిందని ఇన్స్‌రెన్స్ ఏజెంట్ వివేకి, అతని స్నేహితుడు సుబోధి ఆరోపించినట్లు క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సునీల్ నాగార్‌గోజే తెలిపారు. అయితే హత్య ఆరోపణలపై ఔస పోలీసులు జ్యోతి బన్సోడే పై కేసును నమోదు చేయలేదు. పోలీసు సుపరింటెండెంట్ నిఖిల్ పింగాలే ఆదేశాల మేరకు గత మూడు నెలలుగా ఈ కేసును కొత్తగా విచారిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఔస కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలవ్వగా సోమవారం జ్యోతి బన్సోడేను అరెస్ట్ చేశామని,వ్యక్తిగత పూచిపై ఆమెని విడుదల చేసినట్లు నాగార్‌గోజే తెలిపారు. (చదవండి: అడవిలో శవం..పీక్కుతిన్న జంతువులు) -
40 లక్షల దొంగతనం: చివరికి..
లక్నో : ప్రజలందరూ దేవుడా ఓ మంచి దేవుడా ఓ బ్యాగ్ నిండా నోట్ల కట్టలతో నిద్ర లేచేసరికి ప్రత్యక్షం అయ్యేట్లు కరుణించూ అంటూ ఏదో ఒక సమయంలో కోరుకునే ఉండి ఉంటారు.. అది నిజంగా జరిగితే ఎగిరి గంతేసి సంతోషంగా దాచిపెట్టుకుని, ఉక్కిరిబిక్కిరి అవుతూ నోట్లకట్టలను ఒకటికి రెండు సార్లు లెక్కగట్టుతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ చెందిన ఒక వ్యక్తికి పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. (చదవండి: మహిళ కొంపముంచిన సెకండ్ హ్యాండ్ ఫోన్) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని మిషన్ కాంపౌండ్‌కి చెందిన ఒక వ్యక్తి బుధవారం నిద్రలేచేసరికి తన ఇంటి పైకప్పు పై రెండు బ్యాగుల కరెన్సీ నోట్లు కనపడటంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతకుముందు రోజు తమ ఇంటి పక్కన ఉన్న వ్యాపారవేత్త ఇంట్లో 40 లక్షల దొంగతనం జరగటంతో, అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారవేత్త ఇంట్లో పనిచేసే నేపాలీ రాజు ఈ దొంగతనానికి పాల్పడినట్లు, ఇందులో సెక్యురిటీగార్డు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరైన నేపాలీ రాజును అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు సెక్యురిటీ గార్డు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ) -
వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!
ముంబై: బాలీవుడ్‌తో పాటు శాండల్‌వుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కన్నడ నటీనటులు అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నివాసంలో నిన్న (గురువారం) బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(బీసీసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అంతేగాక ఆయన భార్య ప్రియాంక అల్వా ఒబెరాయ్‌కు క్రైం బ్రాంచ్ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. అయితే డ్రగ్ కేసులో కర్ణాటక మాజీ దివంగత మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు అదిత్య అల్వా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: డ్రగ్ కేసు; వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు) City Crime Branch Bengaluru serves notice to Priyanka Alva Oberoi over links with brother Adithya Alva in connection with Sandalwood drug case. #Karnataka CCB raided actor Vivek Oberoi's Mumbai residence in search of his relative Aditya Alva in connection with the case y'day. — ANI (@ANI) October 16, 2020 ఆదిత్య అల్వా స్వయంగా ప్రియాంక అల్వా సోదరుడు, వివెక్ ఒబెరాయ్‌కి బావమరిది కావడంతో పోలీసులు ఆయన ఇంటిలో తనిఖీ చేసినట్లు తెలిసింది. అయితే ఆదిత్య పరారీ ఉండటంతొ ఆచూకి కోసం ఇవాళ ప్రియాంకను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ... ‘డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆదిత్య అల్వా పరారీలో ఉన్నాడు. అతడు నటుడు వివెక్ ఒబెరాయ్ భార్య ప్రియాంకకు సోదురుడు. అతడి ఆచూకి కోసమే వివేక్ ఇంటిలో సోదాలు నిర్వహించాం. అయితే ఆచూకి లభించకపోవడంతో ప్రియాంకను విచారించేందుకు ఇవాళ నోటీసులు జారీ చేశాం’ అని అధికారి చెప్పుకొచ్చారు. (చదవండి: వారికి అండర్‌వరల్డ్ డాన్లతో సంబంధాలు..!) -
కంగనా డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు
ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్– మహారాష్ట్ర సర్కారు వివాదం ముదురుతోంది. ముంబై మరో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా మారిందన్న కంగనా ఆరోపణలపై.. శివసేన సర్కారు కంగనా ఆఫీసులోని కొన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమంటూ కూలగొట్టిన విషయం తెలిసిందే. దీంతో, కంగనా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా డ్రగ్స్ వాడేవారన్న ఆరోపణలపై శుక్రవారం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించింది. మీకేమీ బాధ అనిపించడం లేదా? సోనియాగాంధీకి కంగనా ప్రశ్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం ఠాక్రేను తీవ్రంగా విమర్శించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తన గురిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ వైపు తిప్పారు. మహారాష్ట్రలోని శివసేన–కాంగ్రెస్ ప్రభుత్వం తనను వేధిస్తుంటే సాటి మహిళగా బాధ అనిపించడం లేదా అని ఆమెను ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సోనియాను కోరారు. కంగనకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావలె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరారు. ఉద్ధవ్ సర్కార్‌పై ఫడ్నవిస్ మండిపాటు కరోనాపై పోరు ముగిసి, కంగనాపై పోరు ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్కారు యంత్రాంగం యావత్తూ కంగనాపైనే పోరాడుతోందన్నారు. ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ, కోవిడ్–19పై పోరాటంపై శ్రద్ధ చూపాలని సూచించారు. చదవండి: కంగనను నడిపిస్తున్నది ఎవరు? -
శాంతి పావురం
మరో కొత్త బ్యాచ్ బయటికొచ్చింది. నూట ముప్పై ఒక్క మంది ఐపీఎస్‌లు. హైదరాబాద్‌లో పాసింగ్ అవుట్ పరేడ్. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ. ఒకటే సలహా ఇచ్చారు. ‘సింగం’ హీరోలం అనుకోకండి.. పీపుల్ ఫ్రెండ్లీ అవండి.. అని. అంటే.. ఎలా?! మోనికా భరద్వాజ్లా అనుకోవచ్చు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కొత్త డీసీపీ ఆమె. యూనిఫామ్‌లో.. శాంతి పావురం!! పార్కింగ్ దగ్గర గొడవ. ఢిల్లీ పోలీస్‌లకు, లాయర్లకు! పైకి పార్కింగే, వెనకేం ఉందో.. పెద్ద ఘర్షణ మొదలైంది. వెంటవెంటనే మూడొందల మంది లాయర్లు పోగయ్యారు. ఉన్నది పది మంది పోలీసులు. వాహనాలు దగ్ధం అయ్యాయి. పాత ఢిల్లీ తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో నల్ల కోటు, తెల్ల ప్యాంటు ధరించి ఉన్న లాయర్లు పోలీసుల మీదకు ఉరికారు. అప్పుడొచ్చారు ఒక పోలీస్ ఆఫీసర్. మహిళా పోలీస్ ఆఫీసర్. పోలీసులకంటే ముందు వెళ్లి, మీదకి వస్తున్న లాయర్లకు అడ్డుగా నిలబడ్డారు! ‘ప్లీజ్.. స్టాప్’ అంటూ చేతులు జోడించారు. లాయర్లు ఆగలేదు. ఆమె మీదకు వచ్చారు. ఆమెను తోసుకుంటూ వచ్చారు. నెట్టుకుంటూ వచ్చారు. ఆమె కాలర్ పట్టుకుని లాగారు. మామూలు కాలర్ కాదది. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కాలర్. ఆమె ఒళ్లు గీసుకుపోయింది. కొన్ని చోట్ల కందిపోయింది. యూనిఫామ్ చెదిరిపోయింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఇదంతా క్లియర్‌గా ఉంది. ఆ మహిళా ఆఫీసర్.. మోనికా భరద్వాజ్, ఐపీసీ. వెస్ట్ ఢిల్లీ డీసీపీ. ‘‘వాళ్లు కావాలని నన్నలా చేయలేదు. తోపులాటలో అలా జరిగింది’’ అని విచారణలో చెప్పారు మోనిక! సామరస్య పరిష్కారం. ఏడాది కిందటి సంగతి ఇది. నాలుగేళ్లక్రితం పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో పంకజ్ నారంగ్ అనే నలభై ఏళ్ల డెంటిస్టుపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు. మత కలహాలు చెలరేగడానికి తగినంతగా ఆ ఘటనలో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అప్పటి నుంచే వెస్ట్ ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ! దోషుల్ని తక్షణం అరెస్ట్ చేశారు. ఏ క్షణమైనా ‘మతం’ రాజుకోవచ్చని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. వెంటనే ఆమె.. ‘ఇందులో మతపరమైన కోణం లేనే లేదు. డాక్టర్ హత్యకేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మందిలో నలుగురు మైనర్లే. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వందతులను నమ్మకండి’’ అని ట్వీట్ చేశారు. వెంటనే ఆమెపై ఒక వర్గం నుంచి తిరుగు తిట్ల ట్వీట్లు కురిశాయి. ట్రోల్స్ వచ్చాయి. ‘‘పట్టించుకోకు అని కిరణ్ బేడి’’ ఆమెకు మద్దతుగా ట్వీట్ చేశారు. క్రికెట్లో బంగ్లాదేశ్‌పై ఇండియా గెలిచిన పర్యవసానంగా మొదలైన తగవులాటలే ఆనాడు డాక్టర్ హత్యకు దారి తీసిన కారణం. మోనిక ఆ ట్వీట్ పెట్టినందువల్లే సిటీ శాంతించింది. లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మోనికా భరద్వాజ్ ఇప్పుడు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కొత్త డీసీపీ. కొద్ది రోజుల క్రితమే చార్జి తీసుకున్నారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచికి తొలి మహిళా డీసీపీ! 2016లో వెస్ట్ ఢిల్లీ డీసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా.. కిరణ్ బేడీ తర్వాత ఆ పోస్ట్‌లోకి వెళ్లిన రెండో మహిళగా ఆమెకు గుర్తింపు లభించింది. అంతకన్నా ముందు మోనిక పుదుచ్చేరిలో చేశారు. 21 ఏళ్ల మహిళపై జరిగిన సామూహిక లైంగిక దాడిలో నిందితుల్ని పట్టుకోవడంతో పోలీస్ డిపార్ట్మెంట్లోకి మరో చురుకైన మహిళా ఐ.పి.ఎస్. వచ్చినట్లయింది. మోనిక 2009 బ్యాచ్ ఆఫీసర్. కొంతకాలం యు.ఎస్.లో ఉండి వచ్చారు. రొహ్టాక్ జిల్లాలోని (హర్యానా) సంప్లా ఆమె స్వస్థలం. స్కూలంతా రొహ్టాక్లో, డిగ్రీ ఢిల్లీలో. అక్కడి నుంచే సివిల్స్‌కి ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించారు. రెండు తరాలుగా వాళ్లది పోలీస్ కుటుంబం. మోనిక మూడో తరం. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను చేసుకున్నారు. ఐదేళ్ల క్రితమే పెళ్లయింది. నిజాయితీ, సత్యసంధత, నిరంతర ప్రయత్నం ఇవి మూడూ ఉండాలి పోలీస్ ఆఫీసర్‌కి అంటారు మోనిక. ‘‘పోలీస్ శాఖలోకి మరింత మంది మహిళలు రావాలి. జనాభాలో సగంగా ఉన్న మనం, డిపార్ట్మెంట్లో పది శాతం కూడా లేకపోవడం ఏమిటి?’’ అని నవ్వుతారు. స్పూర్తిని కలిగించే నవ్వు అది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ : మోనికా భరద్వాజ్ (సీసీ టీవీ ఫుటేజ్ : 2019 నవంబర్ 2) -
నేరాల రేటు ‘డౌన్’
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా రా ష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. సాధారణ రోజుల కంటే కాస్త అటూ ఇటుగా 33 నుంచి 55 శాతం తగ్గుద ల నమోదైంది. రోడ్లపై, వీధుల్లో జ నసంచారం లేకపోవడం నేరాలు త గ్గడానికి ప్రాథమిక కారణమైతే.. ప్ర తీ వీధిలోనూ పోలీసు గస్తీ, ని ఘా పెరగడం రెండో కారణం. అదే సమయంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన కేసులు మాత్రం పెరుగుతున్నాయి. నగరాలు, ప ట్టణాల్లో ప్రజలు ముఖ్యంగా యువత లాక్డౌన్ నిబంధనల ను ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. మార్చి 22 నుంచి 31 వ రకు 10 రోజుల పాటు రాష్ట్రం లోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో 4 వేలకు పైగా నేరాలు నమోదయ్యాయి. 2018 నేషనల్ క్రైం బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. ఈ నేరా లను పోల్చి చూసినపుడు ఐపీసీ సెక్షన్ల కింద రోజూ 383 నేరాలు నమోదు కాగా, 33 శాతం (254 నేరాలు మాత్రమే) తగ్గుదల నమోదైంది. ఇందులో సాధారణంగా పెట్టీ కేసులు ఎక్కు వగా ఉంటాయి. ప్రస్తుతం నమోదైన ఐపీసీ కే సుల్లో అధికశాతం లాక్‌డౌన్‌కు సంబంధించిన వే కావడం గమనార్హం. ఇక కిడ్నాపుల పరంగా చూస్తే.. రోజుకు సగటున దాదాపు 5 కిడ్నాపు కేసులు నమోదు కాగా.. ఈ పదిరోజుల్లో రోజు కు 2.5 కేసులే నమోదయ్యాయి. 2018 ఎన్సీఆ ర్బీ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో రోజుకు 2.5 హత్యల చొప్పున నమోదవగా.. ఈ పదిరోజుల్లో రోజుకు 1.4 హత్యల చొప్పున రికార్డయింది. పదిరోజుల్లో 4,369 కేసులు.. డెకాయిటీ (1), రాబరీ (2), పగ టి చోరీలు(2), రాత్రిచోరీలు (17), దొంగతనాలు (153), హత్య లు (14), అల్లర్లు (14), కి డ్నాప్‌లు (24), లైంగిక దాడులు (8), తీవ్రంగా గాయపర్చడం (4), స్వల్పదాడులు (260), మోసాలు (101), నమ్మకద్రోహం (12), మాద కద్రవ్యాల సరఫరా (0), హ త్యాయత్నాలు (18), తీవ్ర రోడ్డు ప్రమాదాలు (48), సా ధారణ రోడ్డు ప్రమాదాలు (92), ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులు (2,546), ఇతర సెక్షన్ల కింద 1,053 కేసులు కలిపి మొత్తంగా పదిరోజుల్లో 4,369 కేసులు నమోదయ్యాయి. అధిక రోడ్డు ప్రమాదాలు అందువల్లే.. రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో రో జుకు సగటున 63 రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అందులో 60మంది గాయపడగా, 18 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పది రోజు ల్లో చిన్నాపెద్దా అన్నీ కలిపి 140 రోడ్డు ప్రమా దాలు జరిగాయి. వీటిలో 90 శాతం ప్రమాదా లు వాహనదారుల స్వయంకృతాపరా ధం వల్లే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. -
దొంగచాటు.. చార్జీల పోటు
సాక్షి, నెల్లూరు(క్రైమ్): చంద్రబాబు పాలన అంతా దోపిడీనే. ప్రజలపై భారాలను మోపనంటూనే పరోక్షంగా చార్జీల మోతను మోగించారు. సంక్షేమ పథకాలు, హామీల్లో మోసం చేసినట్లే ఆర్టీసీ చార్జీల విషయంలోనూ బాబు తన మోసపూరిత వైఖరిని చూపించారు. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీ చార్జీలు పెంచనంటూనే ఒక్కసారి పెంచారు. సేఫ్టీ, సౌకర్యాలు తదితరాల పేరిట అడ్డూ అదుపులేకుండా చార్జీల రేట్లు పెరిగిపోవడం ఇందుకు నిదర్శనం. డీజల్ ధరలు పెరిగినా ఆర్టీసీ చార్జీలు పెంచలేదని గతాన్ని మరిచిపోయి గొప్పులు చెప్పుకునే బాబు చాప కిందనీరులా ప్రయాణీకులపై దోపిడీ పర్వానికి తెరతీశారు. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి ఆర్టీసీ చార్జీలను 10 శాతానికి పెంచారు. 2015 అక్టోబర్ 28న అధికార పూర్వకంగా ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఆ తర్వాత నేరుగా బస్సు చార్జీలను పెంచకుండా పరోక్ష రూపంలో వడ్డించడం ప్రారంభించారు. ఇందుకు ప్రయాణికుల సౌకర్యాల కల్పన అనే ముద్దు పేరుతో 2016లో టికెట్‌పై రూ.2 పెంచారు. అనంతరం 2017లో అమరావతి నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో భద్రత (సేఫ్టీ) సెస్ పేరిట ఒక్క రూపాయి, స్వచ్ఛభారత్ పేరుతో మరో రూపాయి వంతున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇదిగాక గతంలో ఉన్న టోల్ చార్జీలను అదనంగా పెంచి వసూలు చేయడం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాల పేరుతో టికెట్‌పై రూ.2 వసూలు చేస్తున్నా కల్పిస్తున్న సౌకర్యాలు ఏమీ లేవు. గతంలో ఆర్డనరీలో ఒక టోల్ గేట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌లో రూ.3 వసూలు చేసేవారు. ఈ టోల్ చార్జీలు అప్పటికి.. ఇప్పటికీ పెరగకపోయినా ఇప్పుడు రూ.10 వంతున టోల్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఇక లాంగ్ సర్వీసుల్లో అయితే ప్రతి టోల్ గేటుకు రూ.6 వంతున వసూలు చేస్తున్నారు. జిల్లాలోని పది డిపోల్లో 4 అమరావతి బస్సులు, గరుడ, ఇంద్ర, 12 అల్ట్రా డీలక్స్‌లు, 102 సూపర్‌లగ్జరీ, 220 ఎక్స్‌ప్రెస్, 487 తెలుగు వెలుగు బస్సులు ఉన్నాయి. ఇవి రోజుకు 3.15 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తున్నాయి. 4 లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. రోజుకు సగటున అదనపు చార్జీల రూపంలో రూ.96 లక్షల నుంచి రూ.కోటి వరకు సంస్థలో ఖాతాలోకి వెళుతున్నాయి. సౌకర్యాల కల్పన పేరిట సౌకర్యాల కల్పన పేరిట 2016లో టికెట్‌పై రూ. 2 పెంచారు. దీని ద్వారా జిల్లాలో సుమారు 8 లక్షలు అదనంగా ప్రజలపై భారం మోపారు. టికెట్ రేటు పెంచకుండానే ప్రయాణికులపై పడిన అదనపు భారంతో ప్రజలు బాబు మోసాన్ని గుర్తించడానికి చాలా కాలం పట్టింది. 2017 సెప్టెంబర్ నుంచి డీలక్స్ ఆపై కేటగిరీ బస్సు సర్వీసుల్లో సెస్ పేరిట ఒక్కో టికెట్‌పై రూపాయి వసూలు చేస్తోంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సైతం సెస్ వసూళ్లకు పాల్పడుతోది. జిల్లాలో సుమారు 3 లక్షల మంది ఎక్స్‌ప్రెస్, డీలక్స్ ఆపై కేటగిరీలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సుల్లో టికెట్ ధరతో పాటు భద్రత సెస్ పేరిట రూపాయి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 3 లక్షల ప్రయాణికుల వద నుంచి ఆర్టీసీ రోజుకు రూ.3 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంకోవైపు టోల్ చార్జీల పేరిట దోపిడీ కొనసాగుతూనే ఉంది. వీటితో పాటు పండగలు వచ్చినప్పుడు చార్జీలు ఏ రేంజ్లో పెరుగుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకే సౌకర్యాలు కిలో మీటర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ప్రయాణికుడి వద్ద నుంచి భద్రత సెస్ పేరిట రూపాయి వసూలు చేస్తున్నారు. అయితే ప్రయాణికుల భద్రతకు కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్సకు సంబంధించిన కిట్లు కూడా అందుబాటులో ఉండటంలేదు. దీంతో బస్సుల్లో ప్రయాణికుల భద్రత ఏ పాటిదో ఇట్టే అవగతమవుతోంది. మొత్తం మీద ప్రయాణికుడే లక్ష్యంగా దోపిడీ చేస్తోంది. సవరణ పేరుతో బాదుడు ఒక వైపు ఆర్టీసీలో క్యాట్, వనిత, సీనియర్ సిటిజన్ వంటి రాయితీలకు మంగళం పాడిన సంస్థ, బస్సుల్లో చార్జీల çసవరణ పేరుతో ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ప్రయాణికులు, కండక్టర్లకు చిల్లర సమస్యలు రాకుడదనే టికెట్ ధరల్లో సవరణలు చేశామని ప్రకటించినప్పటికీ ఆ పేరిట దోపిడీకి శ్రీకారం చుట్టారు. సవరించిన చార్జీలు ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సుల్లో తొలుత అమలులోకి తీసుకువచ్చి ఆపై దానిని తెలుగువెలుగు బస్సులకు సైతం వర్తించేలా చేశారు. వీటి ద్వారా వచ్చే మొత్తం యాజమాన్యం ఖాతాలోకి చేరుతోంది. తెలుగువెలుగు బస్సులో ఓ గ్రామానికి వెళ్లేందుకు గతంలో రూ.12 వసూలు చేయగా సవరణ అనంతరం రూ.15కు పెంచారు. ఈ లెక్కన జిల్లాలో ప్రయాణికులపై సవరణల పేరుతో అదనంగా రూ.20 నుంచి రూ.30 లక్షలు అదనపు భారం పడింది. ఆర్టీసీలో ప్రయాణికుల అవసరాలు, డిమాండ్లను బట్టి టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ ప్రజలను దోచుకోవడంలో బాబు ప్రభుత్వంలో జరిగినన్ని అక్రమాలు మరెప్పుడు జరగలేదని ప్రజలు వాపోతున్నారు. డబుల్ చార్జీలు పెరిగాయి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు డబుల్ పెరిగాయి. గతంలో సంగం నుంచి నెల్లూరుకు రూ.25 ఉంటే.. ఇప్పుడు రూ.35 వసూలు చేస్తున్నారు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం సురక్షితమైందని, విధిలేని పరిస్థితుల్లో చార్జీలు పెరిగినా బస్సులోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. – ఇండ్ల మణి, గాంధీజనసంఘం, సంగం మండలం టోల్ చార్జీల బాదుడు మరీ ఎక్కువ ఆర్టీసీ చార్జీల బాదుడు భరించలేని విధంగా ఉంది. ఆత్మకూరు నుంచి నెల్లూరుకు గతంలో అర్డనరీలో రూ.35 ఉంటే.. ఇప్పుడు టోల్ చార్జీ కింద రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. మాకు డీసీపల్లి, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసిన తర్వాత బస్సు చార్జీలతో ప్రతి టోల్‌గేట్‌కు పది రూపాయల మేర పెంచేశారు. – రేవూరు పెంచల రెడ్డి, వెన్నవాడ, ఆత్మకూరు మండలం ఆర్టీసీ బస్సుల్లో దోపిడీ బస్ చార్జీలు ఇష్టానుసారంగా పెరిగిపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో సామాన్య ప్రజలు ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది. దొరవారిసత్రం నుంచి సూళ్లూరుపేటకు రూ.25, నాయుపేటకు రూ.20 టికెట్ల ధరలు ఉన్నాయి. దగ్గరగా ఉన్న సూళ్లూరుపేటకు టికెట్ రూ.15 అయినా.. టోల్గేట్ చార్జీ రూ.10 వంతున పెరిగి భారం పడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో కంటే ప్యాసింజర్ రైళ్లను నమ్ముకుని తిరుగుతున్నాము. – దేవళ్ల సుధాకర్, ఏకొల్లు, దొరవారిసత్రం మండలం బస్సు చార్జీలు భారం బస్సు చార్జీలు పెరిగిపోయాయి. బస్సు ఎక్కాలంటే భయమేస్తోంది. ఓజిలి నుంచి నాయుడుపేటకు గతంలో రూ.15 ఉంటే.. ఇప్పుడు రూ.20 చేశారు. గూడూరుకు అయితే గతంలో రూ.30 ఉంటే.. ఇప్పుడు రూ.45 అయింది. ఇక నెల్లూరుకు అయితే గతంలో రూ.50 ఉంటే.. మధ్యలో రెండు టోల్గేట్ల చార్జీలతో కలుపుకుని రూ.75 వసూలు చేస్తున్నారు. – శ్రీనివాసులు ఓజిలి టికెట్ దోపిడీ తీరు చూద్దాం.. కావలి నుంచి నెల్లూరు ఆర్డనరీ టికెట్ ధర : రూ.35 టోల్ చార్జీ : రూ.10 ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర : రూ.46 టోల్ చార్జీ : రూ.10 సెస్ చార్జీలు అన్నీ : రూ.4 -
విద్యుత్ షాక్‌తో కౌలురైతు మృతి
సాక్షి, కడియం (రాజమహేంద్రవరం రూరల్): దుళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు తోట చింతాలు (59) పొలంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కౌలుకు తీసుకున్న చేనులో మోటారు తిరగడం లేదని అతడు గోతిలోకి దిగి చూశాడు. మోటార్‌ను తాకిన వెంటనే షాక్‌కు గురై గోతిలో కుప్పకూలిపోయాడు. తోటి రైతులు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సరఫరాను నిలిపివేసి అతడిని బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు స్థానిక ప్రైవేటు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎల్.కనకరాజు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని కడియం ఎసై ఎ.వెంకటేశ్వరరావు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలిచారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కౌలురైతు చింతాలు (ఫైల్) -
కుమారుడి అన్నప్రాసన పిలుపులకు వెళ్తూ..
సాక్షి, తిరువూరు : కుమారుడి అన్న ప్రాసన శుభకార్యానికి రావాల్సిందిగా పిలుపులకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ కల్వర్టులో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. రహదారిపై ఆరు నెలల క్రితం ధ్వంసమైన కల్వర్టును పునర్నిర్మించడంలో తిరువూరు నగర పంచాయతీ ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పీటీ కొత్తూరు నుంచి తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసిన అధికారులు కల్వర్టు నిర్మాణం చేయలేదు. బలహీనంగా ఉన్న కల్వర్టు నిర్మించకపోవడంతో గానుగపాడుకు చెందిన యువకుడు బట్ట రామకృష్ణ (26) బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తూ ఆ గోతిలో పడి మృతి చెందాడు. కుమారుడి అన్న ప్రాసన మరో రెండు రోజుల్లో జరపడానికి బం ధుమిత్రులను పి లిచేందుకు వెళ్లిన భర్త కానరాని లోకాలకు చేరడంతో అతని భార్య విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడి కుటుంబాన్ని స్థానిక సామాజిక ఆస్పత్రిలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పరామర్శించి ఓదార్చారు. -
వైఎస్ వివేకానందరెడ్డికి ఘన నివాళి
సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జిల్లా వాసులు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. సౌమ్యుడు, అజాతశత్రువుగా గుర్తింపు పొందిన ఆయన మరణం వార్తతో వైఎస్సార్ సీపీ శ్రేణులు నిర్ఘాంతపోయారు. ఈ సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నగర వర్కింగ్ పెసిడెంట్ మల్లాది విష్ణు, అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉండే అవకాశం ఉందని.. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఘన నివాళులు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ వివేకానందరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ వివేకా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అలాగే పెడన నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో బందరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి, పెడన నియోజకవర్గ సమన్వయ కర్త జోగి రమేష్‌లు వివేకా చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేసి నివాళులు అర్పించారు. విజయవాడ సిటీ: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, సినీనటుడు విజయచందర్, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్ వైఎస్ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, శాసన మండలి సభ్యునిగా, మాజీ మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారన్నారు. ఆయన ప్రజల మనిషిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అడపా శేషు, అశోక్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, లంకా బాబు, మల్లికార్జున రెడ్డి, పలువురు అనుబంధ విభాగాల అ««ధ్యక్షులు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. అత్యంత దారుణం పూర్ణానందంపేట(విజయవాడ పశ్చిమ): వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య దుర్మార్గమైందని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోజ్జగాని రామస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా రాష్ట్రానికి వైఎస్ వివేకానందరెడ్డి చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ‘సీబీఐతో విచారణ చేయాలి’ కృష్ణలంక(విజయవాడ తూర్పు): వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ సీపీ వైద్యవిభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికార దాహంతో వివేకనందారెడ్డిని హత్యచేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేదనే సంకేతం ఇచ్చి భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందన్నారు. ఇది టీడీపీ కుట్రే గన్నవరం: హత్యాలు, అరాచాకాలు సృష్టించి అయినా ఎన్నికల్లో గెలవాలనే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డిని టీడీపీ హతమార్చిందని మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోస్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. 1989 నుంచి వైఎస్ వివేకాతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. అజాత శత్రువు, సున్నిత మనస్తత్వం కలిగిన ఆయన ఎవరూ గురించి చెడుగా మాట్లాడరని చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన మంచి వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం చూస్తుంటే ఈ రాజకీయాలు ఎక్కడకి పోతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఈ హత్య వెనుక వాస్తవాలు వెలికితీసేందుకు విచారణను సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అమ్మ కోసం ఒకరు.. స్నేహం కోసం మరొకరు..!
ప్రమాదవశాత్తూ మరణించిన అమ్మ కోసం బెంగపెట్టుకుని ఒక విద్యార్థిని, ప్రాణ స్నేహితురాలు లేకుండా ఉండలేనని మరో విద్యార్థిని.. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శీతల పానీయంలో పురుగు మందు కలిపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన మండలంలోని నాగుల్లంక గ్రామంలో జరిగింది. ఈ సంఘటనలో ఒక విద్యార్థిని మరణించగా, మరో విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సాక్షి, పి.గన్నవరం: నాగుల్లంక శివారు రాయిలంకకు చెందిన మామిడిశెట్టి లక్ష్మీప్రసన్న (15), అయోధ్యలంక గ్రామం నుంచి వచ్చి నాగుల్లంకలో నివశిస్తున్న బొక్కా సూర్య భవాని (15) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ప్రాణ స్నేహితులని స్థానికులు తెలిపారు. లక్ష్మీప్రసన్న తల్లి భవాని గత జనవరి 16న పంట బోదెలో బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించింది. దీంతో తల్లి కోసం కుమార్తె బెంగ పెట్టుకుంది. అమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమె లేనిదే తనకు జీవితం లేదని, తాను కూడా చనిపోయి అమ్మ వద్దకు వెళ్తానని సుమారు సుమారు 10 లేఖలు రాసుకుని స్కూలు బ్యాగులో దాచుకుంది. మాతృమూర్తితో చంటి బిడ్డ ఉన్న చిత్రాలను పెన్నులతో గీసి తల్లిపై తనకున్న అభిమానాన్ని స్పష్టం చేసింది. అయితే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చిన వారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లారు. అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లలో గుళికల మందు కలిపి తాగి పాఠశాలకు వచ్చారు. సాయంత్రం సమయంలో లక్ష్మీ ప్రసన్న వాంతులు చేసుకోవడంతో పక్కనే ఉన్న పీహెచ్‌సీకి హెచ్ఎం హరినాథ్ తరలించారు. ఈలోగా ఆమె స్కూలు బ్యాగులోని టిఫిన్ బాక్సులో గుళికలు ఉండటాన్ని గమనించిన విద్యార్థులు హెచ్ఎంకు తెలిపారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈలోగా సూర్య భవాని కూడా వాంతులు చేసుకోవడంతో ఇద్దరిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రసన్న మరణించగా, ఆమె మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న సూర్య భవానికి కిమ్స్‌లో వైద్యం చేస్తున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు కావడంతో ఒకరినొకరు వీడలేక ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్బడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. నాగుల్లంక గ్రామంలో విషాదఛాయలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థినులలో లక్ష్మీ ప్రసన్న మరణించగా, సూర్య భవాని అపస్మారక స్థితికి చేరుకోవడంతో నాగుల్లంకలో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్ష్మీ ప్రసన్న తల్లి భవాని ఇటీవల మరణించగా తండ్రి దుర్గారావు, చెల్లెలు లక్ష్మీదుర్గ ఉన్నారు. కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి దుర్గారావు బోరున విలపిస్తున్నాడు. సూర్యభవానికి తల్లి సుజాత, తండ్రి శ్రీనివాసరావు, తమ్ముడు గణేష్ ఉన్నారు. సూర్య భవాని అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు. పి.గన్నవరం ఎస్సై ఎస్.రాము కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటానికి మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న సూర్య భవాని -
ఒంటికి నిప్పంటించుకొని..
సాక్షి, సంగెం: క్షణికావేశంతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందగా..కాపాడబోయిన భర్త తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిన విషాద సంఘటన మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాపులకనిపర్తి గ్రామానికి చెందిన సదిరం మమత అలియాస్ అఖిల(25) అదే గ్రామానికి చెందిన సదిరం అనిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దలు సైతం వీరి ప్రేమ అంగీకరించారు. సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా కుమార్తె లాస్య(4), సిద్దార్థ(2)జన్మించారు. కూలీనాలీ చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. కొంత కాలంగా అఖిల మనస్సు స్థిమితంగా లేకుండా ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్తతో గొడవ పడింది. క్షణికావేశానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం చుకుంది. మంటల్లో కాలుతున్న అఖిల అరుపులు విన్న అనిల్ కాపాడే ప్రయత్నంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అఖిల 90 శాతం, అనిల్ 50 శాతం గాయపడగా ఇరువురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా అఖిల సోమవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మృతి చెందింది. అనిల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి కలకొట్ల రాజు ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.నాగరాజు తెలిపారు. చిన్నారులు లాస్య(4), సిద్దార్థ(2)లకు అసలు తమ తల్లితండ్రులకు ఏం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితి. తల్లి, తండ్రి ఎందుకు గొడవ పడ్డారో తెలియదు. ఎందుకు కాల్చుకుని గాయపడ్డారో కూడా తెలియదు. తల్లి మృతి చెందిందని, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా తెలియని ఇద్దరు చిన్నారులను చూసిన స్థానికుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. తల్లి మృతి చెందగా తండ్రి చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుండడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. అనాథలుగా మిగిలిన చిన్నారులు -
తస్మాత్ జాగ్రత్త..
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రమైన కూసుమంచిలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. తాళ్లాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలోనే రెండు దొంగతనాలు జరగటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈఘటనలు పోలీసులకు కూడా సవాల్‌గా మారడంతో వారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన ఓ పత్రికా విలేకరి, పురుగుమందుల వ్యాపారి ఎండీ రంజాన్ ఆలీ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును, ఎల్ఈడీ టీవీ ఎత్తుకెళ్లారు. కొద్ది రోజుల వ్యవథిలోనే మార్చి 8న గ్రామానికి చెందిన అర్వపల్లి మౌలాలీ ఇంట్లో దొంగలు పడి 5తులాల బంగారు ఆభరణాలు, 60వేల రూపాయకల నగదును ఎత్తుకెళ్లారు. ఈ రెండు గృహాలు జనం రద్దీగా ఉండే ప్రాంతాలే. అయినప్పటికీ దొంగలు చాకచక్యంగా చోరీలకు పాల్పడటంతో గృహాల వారికి కునుకు పట్టడం లేదు. ఈ ఘటనలతో బాధితులతో పాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల బెడదను అరికట్టాలని పోలీసుశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే వేసవికాలం చోరీలు ఎక్కువగా జరిగే సీజన్. ఇప్పటికే చోరీలు ప్రారంభం కావటంతో పోలీసులు నిఘాను పెంచారు.