టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు.
టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్‌లైన్‌లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు.
బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు.
ఫిర్యాదు చేయడం ఇలా...
► ట్రోలింగ్‌కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు.
► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు..
సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/
సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100
సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667
గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు
వైఎస్సార్‌సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది.
ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్‌లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment