jana sena party
-
కోడి పందాల బరుల దగ్గర బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
‘జనసేన వాళ్లమని చెప్పినా చితకబాదారు!’
ఎన్టీఆర్, సాక్షి: పండుగ పూట కూటమి నేతలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు. రికార్డింగ్ డ్యాన్యుల ముసుగుతో అశ్లీల నృత్యాలను దగ్గరుండి మరీ ప్రొత్సహిస్తున్నారు. అలాగే బరుల్లో తమ ఆధిపత్యమే కొనసాగేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకూ పాల్పడుతున్నారు. అయితే.. కోడి పందేలు కూటమి మధ్య లుకలుకలను బయటపెడుతున్నాయి. బరుల్లో తెలుగు తమ్ముళ్లు(TDP Activists) బరి తెగించేస్తున్నారు. ఎవరూ ముందుకు రాకుండా.. ఉత్త పుణ్యానికే దాడులకు దిగుతున్నారు. అయితే ‘‘ఎందుకు కొడుతున్నారు?’’ అని అడిగినందుకు కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. దాడిని అడ్డుకున్న వారి వాహనాలను సైతం ధ్వంసం చేశారు. దాడిలో ఆరుగురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ ఆరుగురు జనసేన కార్యకర్తలని తేలింది. కంచికచర్ల(Kanchikarla) మండలం గండేపల్లి కోడిపందేల బరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాము జనసేన వాళ్లమని చెప్పిన్నా వినకుండా దుర్భాషలాడుతూ తమను చితకబాదారని బాధితులు వాపోయారు. మరోవైపు తమ కార్యకర్తల పై జరిగిన దాడిపై జనసేన(Jana Sena) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చంద్రబాబు, పవన్‌లు 15 ఏళ్లు కలిసి పొత్తులో ఉందామనుకుంటున్నారు. కానీ టీడీపీ నేతలు అలా ఉండనిచ్చేలా లేరు’’ అని అంటున్నారు. తాజా దాడిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో కోడి పందేలు(Rooster Fightings) కూటమి నేతల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. జనసేన, బీజేపీ వాళ్లను టీడీపీ వాళ్లు ముందుకు రానివ్వకపోవడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఘటనలు.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఇక.. ఏపీలో సాంప్రదాయ సంబరాల ముసుగులో యధేచ్ఛగా జూద క్రీడలు. కోడిపందాల బరులను ఆదాయ వనరులుగా మార్చేసుకుంటున్నారు కూటమి నేతలు. కోడి పందాల బరుల్లో వాటాల కోసం కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తహతహలాడిపోతున్నారు. ఈ క్రమంలో.. తమ అనుచరులను రంగంలోకి దించుతున్నారు. ఏపీలో మునుపెన్నడూ లేనంతగా ఇష్టానుసారంగా బరులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల బరుల్లో జూదక్రీడలకు స్పెషల్ ఎరేంజ్ మెంట్స్ చేస్తున్నారు. పేకాట, గుండాట, లోన బయట , నంబర్ల గేమ్స్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేయించారు. ఇక.. జూద క్రీడలకు తోడు మద్యం ఏరులై పారుతోంది. మద్యం కోసం ప్రత్యేకంగా మినీ బార్లు , బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ.. తొలి రెండు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొత్తం.. ఈ పండక్కి జూదం ,మద్యం ద్వారా భారీగా సంపాదించాలని పక్కా ప్రణాళిక వేసుకున్న కూటమి నేతలు.. దానిని అంతే పక్కాగా అమలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. కోడిపందాలు , పేకాట ,గుండాటలు ఆడితే తాటతీస్తామని పండగ ముందు పోలీసులు హెచ్చరికల వరకే పరిమితం అయ్యారు. బరుల వద్ద కనీసం కనుచూపుమేరలో కూడా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కనిపించకపోవడంతో.. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కోడి పందేల కోసం మహిళా బౌన్సర్లు!! -
పవన్ పరామర్శ కోసం పడిగాపులు
కాకినాడ, సాక్షి: ఎవరైనా బాధితులను ఎలా పరామర్శిస్తారు?. స్వయంగా వెళ్లి పరామర్శించే వాళ్లు కొందరైతే.. బాధితుల్నే తమ దగ్గరకు రప్పించుకునేవాళ్లు మరికొందరు. అందుకు రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం మూడో రకం!. సమయం-సందర్భం ఈ రెండింటితో సంబంధం లేకుండా బాధితులను తన దగ్గరికి రప్పించుకుని మరీ వాళ్లను వెయిట్ చేయిస్తారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈవెంట్‌కు వెళ్లి మెగా అభిమానులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత సంగతి తెలిసిందే. సినిమా పిచ్చి.. అంతకు మంచి హీరోలంటే వెర్రి అభిమానం తమవాళ్ల ప్రాణాలు తీసిందని ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత అటు చిత్ర యూనిట్‌గానీ, ఇటు ఆ ఈవెంట్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరైన పవన్ కల్యాణ్‌గానీ బాధిత కుటుంబాల్ని పరామర్శించి ఓదార్చలేదు. సరికదా.. గత ప్రభుత్వం రోడ్డు సరిగ్గా వేయలేదని, అందుకే రెండు నిండుప్రాణాలు బలయ్యాయంటూ రాజకీయం చేయబోయారు. ఆపై కంటితుడుపు చర్యగా.. తన జనసేన తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే.. పవన్ నియోజకవర్గం పిఠాపురం నుంచి బాధిత కుటుంబాలు ఉండేది పది కిలోమీటర్ల దూరంలోనే. ఘటన జరిగి వారం అవుతున్నా బాధితులను పవన్‌గానీ, జనసేన తరఫు నేతలుగానీ కలిసింది లేదు. పోనీ.. ఇప్పుడు వాళ్లను రప్పించుకున్న సందర్భమైనా బాగుందా? అంటే అదీ లేదు. పిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలను ఇప్పుడు తన కోసం పడిగాపులు పడేలా చేశారాయన. పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో వాళ్లను పవన్ పరామర్శించడం చర్చనీయాంశమైంది. ఓవైపు సంబరాలు జరుగుతుంటే.. మరోవైపు ఆ వేదిక వద్ద కింద వాళ్లు కూర్చున్నారు. ఉదయం నుంచి వాళ్లు ఆయన కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవత్వం లోపించలేదంటారా?. ఆయన అభిమానులైనా.. ఇదేం పరామర్శ అని అనుకోరంటారా?!. -
సూపర్ సీఎం సెల్ఫ్ గోల్స్.. టీడీపీ ఫుల్ హ్యాపీ!
రాజకీయాలలో ఓర్పు,నేర్పు అవసరం. వ్యూహం కూడా ముఖ్యమే. ఏపీలో జరుగుతున్న కూటమి రాజకీయాలను పరిశీలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు అభాసుపాలు అవుతున్నారు. అది ఆయనకు అర్దం కావడం లేదేమో కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగానే అవగతమవుతోంది. రాజకీయాలలో కలిసి ఉంటూనే బోల్తా కొట్టించడం ఒక ప్లాన్ గా ఉంటుంది.ఈపాటికే పవన్ కళ్యాణ్ కు ఆ విషయం బోధపడవలసి ఉంది.కాని అలా జరగడం లేదు. దానికి కారణం.... ఆయనకు అనూహ్యమైన రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ,దానిని ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండడం ఒకటైతే.. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో తొందరపడుతున్న వైనం మరో కారణంగా కనిపిస్తుంది. రాజకీయాలలో ఎల్లకాలం అబద్దాలు ఆడితే అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు!. ముఖ్యమంత్రి , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శైలి అలవరచుకుని నిత్యం అబద్దాలు చెప్పడం ద్వారా ప్రజలలో పలుకుబడి పెంచుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. జనంలో అవసరం ఉన్నా,లేకపోయినా తిరుగుతూ తానేదో సూపర్ సీఎంనని అనుకుంటే అది అంత తెలివైన పని కాదని ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆ క్రమంలో పవన్ ఇటీవల పలు ఘట్టాలలో చేసిన ప్రకటనలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయనే చెప్పాలి.రాజమండ్రి వద్ద గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రసంగం చాలా అభ్యంతరకరంగా ఉంది. యువకులకు మంచి మాటలు చెప్పవలసిన బాధ్యతలో ఉన్న పవన్.. అల్లరి ,చిల్లర పనులు చేయండని సలహా ఇవ్వడం పై విమర్శలు తలెత్తాయి.యువకులకు ఉద్యోగాలు రావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ,ఇలాంటి సినిమా ఉత్సవాలలో పాల్గొనాలని, సినిమాలు చూస్తూ చొక్కాలు చించుకోవాలని, స్టంట్ లు నేర్చుకోవాలని, మోటారు సైకిళ్ల సైలెన్సర్ లు తొలగించి విపరీతమైన ధ్వని సృష్టిస్తూ గోల చేయాలని చెప్పడం చూస్తే పవన్ కు అసలు మెచ్యూరిటీ ఉందా అన్న సందేహం కలుగుతుంది.ఒక వైపు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువత,పేద వర్గాలు మంచి విద్య అభ్యసించాలని, చదువే సంపద అని హితబోధ చేస్తూ వచ్చారు. కానీ, పవన్ మాత్రం అల్లరి చేయండని చెబుతున్నారన్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.గేమ్ చేంజర్ సినిమా కార్యక్రమానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడం విషాదం. ఇందుకు ఎవరైనా బాధ పడతారు. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తప్పు చేసినట్లు చెప్పరు. కాని హైదరాబాద్ సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఉదంతంలో ఆయనకు బంధువు, మరో నటుడు అయిన అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన తీరు .. చేసిన వ్యాఖ్యలు మెడకు చుట్టుకున్నాయి. అల్లు అర్జున్ కు తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా తెలంగాణ పోలీసులు కేసు పట్టారని సినిమా ప్రముఖులంతా భావించి ఆయనను పరామర్శించారు. చివరికి ఆయన పార్టనర్ చంద్రబాబు కూడా ఫోన్ చేసి పలకరించారు. కానీ, ఫోన్ పలకరింపు కూడా చేయలేదు పవన్?!.పైగా..రేవంత్ కు మద్దతుగా ప్రసంగించారు.అల్లు అర్జున్ మానవత్వంతో వ్యవహరించలేదని అనుచిత వ్యాఖ్య చేశారు.తొక్కిసలాట లో మరణించిన రేవతి కుటుంబానికి సుమారు రెండు కోట్ల మేర వివిధ రూపాలలో సాయం అందింది. అయినా రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి అనేట్లు పవన్ కామెంట్లు చేశారు.పోనీ అదే సమయంలో బెనిఫిట్ షో లు, టిక్కెట్ల దరలు పెంచుకోవడానికి , తొక్కిసలాటకు ఏమి సంబంధం అని పవన్ ప్రశ్నించలేదు.సినిమా టిక్కెట్ల రేట్లతో ప్రభుత్వానికి ఏమి సంబంధం అని గతంలో జగన్ ప్రభుత్వంపై పెద్దపెట్టున అరచిన పవన్ కల్యాణ్.. తెలంగాణలో మాత్రం ధైర్యం చేయలేకపోయారు. రాజమండ్రి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు, మెగా కుటుంబ వీరాభిమానులు మరణిస్తే జనసేన తరపున చెరో ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.ఇది మానవత్వమేనా? అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. పవన్ కళ్యాణ్ కాని, రామ్ చరణ్ తేజ కాని, గేమ్ చేంజర్ సినిమా బృందం కాని ఎవరూ బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదన్న ప్రశ్నకు జవాబు దొరకదు.అర్జున్ విషయంలో ఒక నీతి, తన వరకు వచ్చేసరికి మరో రీతా అనే విమర్శ వచ్చింది.పైగా జగన్ టైమ్ లో రోడ్డు బాగు చేయలేదు కనుక ప్రమాదం జరిగిందని దిక్కుమాలిన ఆరోపణ చేశారు.తీరా చూస్తే ఆయన అబద్దం ఆడారని తేలిపోయింది. ప్రమాదం జరిగిన చోట రోడ్డుపై ఎక్కడా ఒక్కగొయ్యి కూడా లేదు.అయినా ప్రమాదం జరిగింది. తమ అభిమానులు మరణించిన విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం పవన్ ఈ ప్రయత్నం చేశారని అనుకోవాలి.మరణించిన యువకుల కుటుంబ సభ్యులు రోదిస్తూ మెగా కుటుంబం పట్ల వారికి ఎంత అభిమానమో వివరించారు. ఈ సినిమా పిచ్చి తోనే వారు మరణించారని వాపోయారు. దాని గురించి పవన్ నోరెత్తడం లేదు. రోడ్డు బాగోలేదని చెబుతున్నారు. నిజానికి ఆ ఏడీబీ రోడ్డు దశాబ్దాల తరబడి రకరకాల సమస్యలను ఎదుర్కుంటోంది. దాంతో రోడ్డు పాడవుతోంది. అయినా తాము రాగానే అన్నీ చేసేస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఈ ఏడు నెలలు ఏమి చేసినట్లు అన్న ప్రశ్న కూడా వస్తుంది.తాజాగా కూటమి ఎమ్మెల్యే ఒకరు తనకు కమిషన్ ఇవ్వకుండా మెటల్ గ్రావెల్ తొలనివ్వడం లేదని ఆరోపణ వచ్చింది.ఇలా ఏది పడితే అది మాట్లాడితే పవన్ కు ఏమి ఉపయోగం?. అది టీడీపీకే ప్రయోజనం అవుతుంది. పవన్‌కు సీఎం అవ్వాలనే కోరిక ఉన్నా, ఆయన తీరు ఆ స్థాయిలో లేదని , లోకేష్ సీఎం అయితేనే బెటర్ అని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తాయి.నిజానికి అబద్దాలు చెప్పడం పవన్‌కు కొత్త కాదు.ఆయన ఈ విషయంలో చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.కాని అబద్దాలు ఆడడంలో చాకచక్యం కూడా అవసరమే అని అంటారు. అందులో చంద్రబాబు సిద్దహస్తులనే అభిప్రాయం ఉంది. ఆ విషయం తెలియక చంద్రబాబు చెప్పినట్లే చెబుతూ, ఆయన చేసినట్లే చేస్తూ పవన్ పరువు పోగొట్టుకుంటున్నారు. గతంలో పవన్ ఏపీఅంతటా 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ తప్పుడు ఆరోపణ చేసి.. దానికి వలంటీర్లను బాధ్యులు చేసి అప్రతిష్ట మూట కట్టుకున్నారు.చంద్రబాబుతో పాటు అనేక వాగ్దానాలను చేసి ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా ఇప్పుడు ప్రజలు భావించే పరిస్తితి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయంటూ ,హోం మంత్రి బాధ్యతలు చేపడతానంటూ వ్యాఖ్యానించి , ఆ తర్వాత జారిపోయి,దానిని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సూచించినట్లు సోషల్ మీడియాపై దాడి చేశారు. ఆ విషయం జనానికి అర్ధం అయింది.పవన్ తాను ఎక్కడకు వెళితే అక్కడే పుట్టానని చెప్పడం,చదువుపై ఒక్కోసారి ఒకరకంగా మాట్లాడడం వంటివాటిని ఆయన అభిమానులు కూడా సరిపెట్టుకున్నారు.కాని అధికారం వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారు. అది చంద్రబాబు మెప్పుదల కోసమో లేక, తాను సూపర్ సీఎం అని పరోక్షంగా ప్రజలు అనుకోవాలన్న లక్ష్యంతోనో ఇలా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు👉 తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు ఒక అసత్య ఆరోపణ చేశారు. వెంటనే పవన్ సనాతని అవతారం ఎత్తి అంతకన్నా గట్టిగా ప్రచారం చేసి బోల్తా పడ్డారు.👉తన పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన రేప్ బాధితులను ,జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ-ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు గురైన బాధితులను పరామర్శించకుండా.. కడపలో జరిగిన ఒక చిన్న ఘటనపై ఆవేశంగా స్పందిస్తూ అక్కడకు వెళ్లిన తీరుతో అపహాస్యం పాలయ్యారు.👉 వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ కంపెనీ భూముల వద్దకు అవసరం లేకపోయినా సందర్శించి ఏదో చేయాలని అనుకున్నారు. కాని అధికారులు అక్కడ ఏమీ లేదని చెప్పడంతో తుస్సుమన్నారు.👉కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్లి తనకు అధికారం లేకపోయినా ‘‘సీజ్ ద షిప్’’ అంటూ ఆదేశించి ఈయనేం ఉప ముఖ్యమంత్రి? అని అధికారులు తల పట్టుకునేలా చేసుకున్నారు.ఇవన్నీ చూస్తే తాను లోకేష్ కన్నా సమర్ధుడనని, అన్ని వ్యవహారాలలో తను జోక్యం చేసుకోగలనని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నట్లుగా ఉంది. బీజేపీతో కలిసి భవిష్యత్తులో వేరు కుంపటి పెట్టవచ్చని పవన్ పై ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాయడం ఆరంభించింది. పవన్ వేస్తున్న తప్పటడుగులతో జనసేన కార్యకర్తలు నెత్తి,నోరు కొట్టుకుంటుంటే.. టీడీపీ నేతలు, శ్రేణులు మాత్రం లోలోపల సంతోషిస్తున్నాయి. ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రకటనల ద్వారా పవన్ కల్యాణ్ భ్రష్టు పడితే అది తమకే మరింత ఉపయోగమన్నది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పైకి ఏదో పవన్ కు బాగా మర్యాద ఇస్తున్నట్లు కనిపిస్తూ.. మరోవైపు ఆయా సందర్భాలలో పవన్ సెల్ఫ్ గోల్ వేసుకునేలా టిడిపి నాయకత్వం ,ముఖ్యంగా లోకేష్ అనుచర వర్గం ప్రయత్నిస్తున్నట్లు కొందరి భావనగా ఉంది. ఎందుకంటే లోకేష్ సీఎం కాకుండా పవన్ అడ్డుపడుతున్నారన్న అభిప్రాయం ఏర్పడడమే!.ఈ టరమ్ మాత్రమే కాకుండా ఆ పై పదేళ్లు కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పి సంతోషపెడుతున్నానని పవన్ భావిస్తుండవచ్చు.కాని ఇది లోకేష్ కు మంట పుట్టించే అంశమే అవుతుంది. వైఎస్సార్సీపీ చేసే విమర్శల వల్ల జరిగే నష్టం కన్నా.. టీడీపీ నేతలు అమలు చేసే వ్యూహాల వల్లే పవన్ కు అధికనష్టం కలుగుతోంది. ఏది ఏమైనా పవన్ కల్యాణ్ పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకు సరెండర్ అయినట్లు కాకుండా.. తనకంటూ ఒక మంచి టీమ్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. సరైన రీతిలో రాజకీయం చేయకపోతే నష్టపోయేది పవనే అవుతారు. ఏపీలో గత ఏడు నెలల పరిస్థితులు చూస్తే.. ఏదో రకంగా వచ్చిన రాజకీయవకాశాన్ని పవన్ తనకు తాను చేజార్చుకుంటున్నారన్న భావన ఏర్పడుతోంది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్‌కు మొత్తానికి గుర్తుకొచ్చింది!
మొత్తానికి ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తనకొక రాజకీయ పార్టీ ఉందని.. దానికీ ఆవిర్భావ దినం ఉందని యాదొచ్చింది. ఎంత సేపూ పార్టీని ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కోలా వాడుకోవడం మినహా.. పార్టీ నిర్మాణం.. పధ్ధతి.. దానికొక విధివిధానాలు లేకుండా నడుపుతూ.. పీస్ రేట్.. అంటే చేసినపని డబ్బు తీసుకునే కూలీ లెక్క పార్టీని నడుపుతూ వచ్చిన పవన్ కు ఇన్నేళ్లకు తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్న స్ఫురణకు రావడం గొప్పేనని క్యాడర్ అంటోంది.2014లో జస్ట్ ఎన్నికల ముంది మార్చి 14 న కేవలం చంద్రబాబుకు సాయం చేయడం కోసమే అన్నట్లుగా ప్రారంభమైన ఈ జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జస్ట్ చంద్రబాబు కు మద్దతు ఇచ్చింది. చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యం అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో మొత్తానికి బాబును సీఎం చేసారు. అందరినీ ఒడ్డుకు చేర్చి తనుమాత్రం ఒంటరిగా మిగిలిన నావమాదిరి ఉండిపోయిన పవన్ ఆ ఐదేళ్లు.. సినిమాలు చేస్తూ గడిపేశారు. అప్పుడప్పుడు రావడం సినిమా కబుర్లు. స్కిట్లు చేయడం .. అరుపులు కేకలతో గడిపేశారు తప్ప పార్టీని ఏనాడూ నిర్మించలేదు.. అసలు అది అవసరం అనికూడా అనుకోలేదు. ఆ తరువాత 2019లో సింగిల్ గా పోటీ చేసిన జనసేన(Jana Sena) పార్టీ ఘోరమైన దెబ్బతిన్నది. ఆఖరుకు పవన్ సైతం భీమవరం.. గాజువాకలో ఓడిపోయారు.ఆ ఐదేళ్లు అప్పుడప్పుడూ బయటకు రావడం. వకీల్ సాబ్(Vakreel Saab) వంటి సినిమాలు.. ఇప్పటం గ్రామంలో కారుమీదెక్కి రోడ్డు షో.. ఇలాంటివి చేస్తూ టైంపాస్ చేసారు టాప్ పార్టీ రాష్ట్ర.. జిల్లా కమిటీలు ఏమీ వేయలేదు. ఒక్కో ఎలక్షన్ కు ఇలా పార్టీని చంద్రబాబుకు అప్పగిస్తూ వెళ్తే పోయేదానికి పార్టీ నిర్మాణం ఎందుకు అనుకున్నారో ఏమో ఎన్నడూ ఆ విషయాన్నీ ఆలోచించలేదు. అసలు ఆపార్టీలో పవన్, నాదెండ్ల మినహా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి.. కానీ మొన్నటి 2024 ఎన్నికల సమయంలో నాగబాబు(Nagababu) మాత్రం ప్రధానకార్యదర్శి పేరిట హడావుడి చేయడం.. క్యూ ఆర్ కోడ్ చూపించి చందాలు వసూలు చేసారు తప్ప ఎక్కడా పార్టీ గురించి చర్చలేదు. పార్టీకి ఒక పధ్ధతి.. విధానం లేకున్నా ఇన్నాళ్లు నడిపేసినా.. ఇప్పుడు ఎట్టకేలకు.. అధికారం వచ్చాక పార్టీ గుర్తొచ్చినట్లుంది. మార్చి 12, 13,14 తేదీల్లో పార్టీ ప్లీనరీ.. ఆవిర్భావదినం పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే పార్టీ పెట్టిన పదేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారా ? అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు.. పార్టీ గుర్తొచ్చిందా..? అనే సౌండ్ వినిపిస్తోంది.పోనీ ఇప్పుడైనా పార్టీకి జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తారా.. ఎమ్మెల్యే టిక్కెట్లు రానివాళ్లు.. గత పదేళ్లుగా పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నవాళ్లకు గుర్తింపు ఉంటుందా .. కేవలం పవన్ భజనకు మాత్రమే ఈ ప్లీనరీ నిర్వహిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం పవన్ కు పార్టీ గుర్తొచ్చిందనే కామెంట్లు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.. :::సిమ్మాదిరప్పన్న -
టార్గెట్ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడైన కొణిదెల నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ ప్రకటన చేశారు. ఈ పరిణామంపై జనసేన ఫుల్ ఖుషీగా ఉంది. కష్టకాలంలో అండగా ఉన్న అన్నకు పవన్ తగిన బహుమతి ఇవ్వబోతున్నాడని అనుకుంటున్నారు. కానీ, టీడీపీ మాత్రం లోలోపల రగిలిపోతోంది. అందుకు కారణం.. గతంలో టీడీపీని, చినబాబును నాగబాబు ఫుల్‌గా ఆడేసుకోవడం!.2014లో జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఆయన అన్న నాగబాబు నడుస్తున్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆయన రాజకీయ మనుగడ కష్టమేనని అంతా అనుకున్నారు. అనూహ్యంగా.. జనసేన ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ పార్టీ బలోపేతం కోసం పని చేశారు. 2024 ఎన్నికలకు పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించగానే.. జనసేన శ్రేణుల్లో నైరాశ్యం ఆవహించింది. అయితే.. ఆ అసంతృప్తిని కప్పిపెట్టడంలో నాగబాబే ముఖ్యభూమిక పోషించారు. చివరకు ఏదైతేనేం.. ఎమ్మెల్సీ కోటాతో మంత్రి పదవి దక్కించుకోబోతున్నారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కొణిదెల నాగబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణలాంటి అర్హత ఉన్నవాళ్లు ఉండగా.. ఏనాడూ ఎన్నికల్లో గెలవని నాగబాబును మంత్రిని చేయడం ఏంటని? ప్రశ్నిస్తున్నారు. అదే టైంలో.. గతంలో నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కొందరు ప్రస్తావిస్తున్నారు.2019-24 మధ్య వైఎస్సార్సీపీతో పాటు టీడీపీని టార్గెట్‌గా పెట్టుకుని నాగబాబు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్లో అడ్డగోలు కామెంట్స్ చేశారు. అందులో చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్‌తో పాటు కొడుకు లోకేష్ నోరు జారి చేసిన ప్రసంగాలను నాగబాబు బాగా హైలైట్ చేశారు. యూట్యూబ్ ఆదాయం కోసమే నాగబాబు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయనపై ఆ టైంలో సెటైర్లు కూడా బాగానే పేలాయి. చివరకు.. ఎందుకనో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.సంబంధిత వార్త: ‘లోకేష్ కామెడీ ముందు జబర్దస్త్ ఏపాటిది’కట్ చేస్తే.. 2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్‌కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు.సంబంధిత వార్త: లోకేష్‌కు ఓ.. వేస్కోండి!ఇప్పుడు కాబోయే మంత్రి నాగబాబుపై పెడుతున్న పోస్టుల వెనుక.. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ మొదలైంది. ప్రతీకార చర్యలో భాగంగానే.. టీడీపీ అనుకూల సోషల్ మీడియా ద్వారా ఈ తతంగం నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల టైంలో పవన్ కోసం నారా లోకేష్‌ను పక్కనపెట్టారు చంద్రబాబు. తీరా ఎన్నికలయ్యాక లోకేష్‌ను మంత్రిని చేసినప్పటికీ.. జనసేనానితో గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతోంది. మరోవైపు ఈ పోస్టుల ఆధారంగా.. నాగబాబుకు టీటీడీ చైర్మన్ సహా ఏ పదవీ దక్కకపోవడానికి చినబాబే కారణమై ఉంటాడని జనసేనలోనూ ఓ చర్చ నడుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ కోటా మంత్రి అయిన సందర్భాన్ని లోకేష్‌కు అన్వయింపజేస్తూ కౌంటర్‌కు దిగారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా.. టీడీపీ-జనసేనల మధ్య ఏళ్లుగా నడుస్తున్న సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణులు వద్ద సమాచారం
-
పబ్లిక్‌గా.. లోకం మాధవి పరువు తీసిన టీడీపీ
విజయనగరం, సాక్షి: కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు కొత్తకాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అవి అంతే స్థాయిలో కొనసాగుతూ వస్తుండడం గమనార్హం. ఈ తగవులు ఇరు పార్టీల అధినేతల దృష్టిలోకి తరచూ వెళ్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ వస్తుండడం గమనిస్తున్నదే. తాజాగా..మరోమారు ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కింది. అది ఎక్కడదాకా వెళ్లింది అంటే.. బహిరంగంగా సమావేశం నిర్వహించి మరీ మాధవి పరువును తీసిపారేశారు టీడీపీ నేతలు.‘‘ముంజేరు ఆడపడుచు అంటూ ఆమె గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమె నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలని రాలేదు. కేవలం తన 30 ఎకరాల భూమిని రక్షించుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు..’’ అంటూ ఓ టీడీపీ నేత ఒకరు వేదిక మీద మాట్లాడారు.తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించగా.. మాధవి ఎలాగైనా టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, టీడీపీ వాళ్లను కూలీల్లాగా తీసి పారేస్తోందని ఆవేశంగా ఓ మహిళా నేత మాట్లాడారు. ఇలా.. టీడీపీ నేతలంతా ఆమెపై ఆరోపణలు, విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బంగార్రాజు రివెంజా?బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం వేదికగా మాధవి-బంగార్రాజు మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశంలో మాధవి మాట్లాడుతుండగా.. బంగార్రాజు అడ్డుకుని ఏదో ప్రశ్న వేశారు. దానికి ఆమె కాసేపు ఆగాలంటూ ఆయనకు సూచించారు. దీంతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. ఆపై ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని బంగార్రాజు మీడియాకు చెప్పారు. ఈలోపే.. నలుగురిలో తనకు జరిగిన అవమానానికి తన అనుచరగణంతో పబ్లిక్‌గా మీటింగ్ పెట్టించి మరీ ఇలా రివెంజ్ తీర్చుకుని ఉంటారనే చర్చ నడుస్తోందక్కడ. -
టీడీపీని మేమే ఓడిస్తాం.. జనసేన నేతల వార్నింగ్
సాక్షి, ఏలూరు జిల్లా: చింతలపూడిలో టీడీపీ-జనసేన పార్టీలో ముసలం పుట్టింది. జంగారెడ్డిగూడెంలో జరిగిన చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిపించిన టీడీపీని తామే ఓడిస్తామంటూ మాజీ డీసీసీబి చైర్మన్ కరాటం రాంబాబు హెచ్చరించారు.టీడీపీ నేతలు జనసేన పార్టీ పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఒకలా ఎన్నికల అనంతరం మరోలా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని నేతలు వాపోయారు. అన్ని గ్రామాల్లో.. జనసేన పార్టీకి, కేడర్‌కు సరైన ప్రాధాన్యత లభించడం లేదని సమావేశంలో ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయం అని జనసేన శ్రేణులు అంటున్నాయి. వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీ పార్టీని బతికించింది జనసేన పార్టీ అని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతలకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. -
ఒంగోలు: వాసన్నకు వరుస అవమానాలు!
ప్రకాశం, సాక్షి: జనసేనలో చేరకముందే ప్రత్యర్ధి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేయగా.. మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో ‘రాజకీయ సహకారం’ అందడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ క్రమంలోనే ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది. తాజాగా.. నగరం అంతటా బాలినేని అభిమానులు కట్టిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడం మళ్లీ చర్చనీయాంశమైంది. బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది. ఆయనకు స్వాగతం చెబుతూ.. ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు. కానీ, నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు. మొన్న చర్చి సెంటర్లో.. ఈ మంగళవారం లాయరు పేటలో.. ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు చించివేయడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. గత శుక్రవారం రాత్రి నగరంలోని చర్చి సెంటర్ వద్ద బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగు దేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది. మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది. ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది. అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫొటో లేదు. కానీ.. చంద్రబాబు ఫొటో మాత్రం ముద్రించారు. వాటినీ ఎవరో చించేశారు. గత కొద్దిరోజులుగా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఇప్పుడు దామచర్ల వర్గీయులు జనసేనలోకి బాలినేని వెళ్లడాన్ని భరించలేకపోతున్నారు. మరోవైపు.. భవిష్యత్తులో జనసేనలోనూ బాలినేని వల్ల వర్గపోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ఫ్లెక్సీల చించివేత వ్యవహారాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండడం గమనార్హం. -
జనసేన నేత ప్రేలాపలనపై భగ్గుమన్న కార్మిక సంఘాలు
విశాఖపట్నం, సాక్షి: స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలేబొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారుకార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదుదమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుందిప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతబొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాంపవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారుస్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాంస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమవుతున్నారుడైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారుప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్ సంబంధిత వార్త: విశాఖ ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు -
బొలిశెట్టి నోటి దురుసు.. మళ్లీ అల్లు అర్జున్‌పై కామెంట్స్
పశ్చిమగోదావరి, సాక్షి: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ జనసేన ఎమ్మెల్యే.. మళ్లీ అదే పని చేశారు.‘‘అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తా. నాకు, నా పార్టీతో అల్లు అర్జున్‌కు ఎలాంటి శత్రుత్వం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తాను’’ అని బొలిశెట్టి మళ్లీ బన్నీ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అంతకు ముందు.. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?.అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. బన్నీ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలను బొలిశెట్టి ఎదుర్కొంటున్నారు. -
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు.. అర్ధరాత్రి ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: గుడివాడ కూటమి రాజకీయాల్లో విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జెండా దిమ్మపై దాడి ఘటనతో గత అర్ధరాత్రి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో టీడీపీ - జనసేన కార్యకర్తల బాహాబాహీ కాస్తలో తప్పింది.నాగవరప్పాడు జంక్షన్లో జనసేన జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేత ధారా నరసింహారావు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు కూటమి ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. టీడీపీ వాళ్లు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదం కాస్త గొడవగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. జనసేన కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించి వేశారు. అయితే.. జనసేన జెండా దిమ్మ పై దాడిని తమ పై దాడిగా భావిస్తామంటున్న జనసేన కార్యకర్తలు, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. అలాగే.. టీడీపీ నుంచి నరసింహారావును బహిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే రాముకు జనసేన నాయకులు హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత ధారా నరసింహారావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్తలు. -
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్‌ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
డిప్యూటీ స్పీకర్ విషయంలో ట్విస్ట్ తప్పదా?
అమరావతి, సాక్షి: కొత్తగా ప్రభుత్వం కొలువుదీరడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండ్రోజులపాటు నిర్వహించేందుకు సన్నాహకాలు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. ఆ మరుసటి రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా ఇప్పటికే అయ్యన్నపాత్రుడి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసేశారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎవరనే ఉత్కంఠ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో.. రేపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాతే మిగిలిన 174 మంది వరుసగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు.ఇదీ చదవండి: ముసుగు తొలగింది.. బూతులు.. బెదిరింపులు మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు వెళ్తుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. ఆ విషయంలో ట్విస్ట్ తప్పదనే ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మంత్రి పదవులు తక్కువగా ఇచ్చారు చంద్రబాబు. దీంతో.. డిప్యూటీ స్పీకర్ ఇవ్వొచ్చని తొలి నుంచి ప్రచారం నడిచింది. ఈ క్రమంలో జనసేన తరఫున లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్ పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారని కథనాలు వెలువడ్డాయి కూడా. అయితే.. స్పీకర్ పదవి విషయంలో జనసేనకు మొండి చేయి దక్కవచ్చనేది లేటెస్ట్ టాక్. డిప్యూటీ స్పీకర్ పదవిని మరో మిత్రపక్షం బీజేపీకి వెళ్లవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి(బాబు అనుచరుడు కూడా) పేరు ఫైనల్ కావొచ్చని తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షం జనసేనకు తక్కువ మంత్రి పదవులు ఇచ్చినా.. పవన్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతో పాటు ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇవ్వడం, అదే సమయంలో బీజేపీకి కేవలం ఒకే మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు ఈమేర ఆలోచన చేస్తున్నారన్నది తాజా ప్రచార సారాంశం. -
ఏపీ మంత్రుల శాఖలపై ఇదేం సస్పెన్స్?
అమరావతి, సాక్షి: మంత్రులుగా ప్రమాణం చేసి 48 గంటలు ముగిసింది. అయినా కూడా ఇంకా శాఖలు కేటాయించలేదు. అసలు ఎవరికి ఏ శాఖ దక్కుతుందో అని మూడు పార్టీల శ్రేణులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ ఏపీ కేబినెట్ కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తులు పూర్తి చేశారా? లేదంటే తర్జన భర్జనలు పడుతున్నారా?.. ఇంకా ఏమైనా చర్చలు జరగాల్సి ఉందా?. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిత్వ శాఖల కేటాయింపుపై ఇవాళ సాయంత్రంలోపు ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. నిన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక మంత్రుల శాఖల జాబితా వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ, అది జరగలేదు. మరోవైపు కీలక శాఖలు మా నేతలకంటే మా నేతలకే దక్కుతాయంటూ ధీమాగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా పవన్‌తో పాటు నారా లోకేష్‌కు, అలాగే టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి ఏ శాఖ దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నడుస్తోంది.ఏపీలో మొత్తం 25 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే.. టీడీపీ నుంచి 20, జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు.. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. హోం, ఆర్థిక లాంటి కీలక శాఖలను చంద్రబాబు టీడీపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు డిప్యూటీ సీఎంతో పాటు ఏవైనా మూడు ముఖ్య శాఖల్ని కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఏకైక మంత్రి సత్యకుమార్‌కు దేవాలయ, ధర్మాదాయ ఇవ్వొచ్చనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.మంత్రలు శాఖల కేటాయింపు సస్పెన్స్‌కు నేడు తెర పడే అవకాశాలున్నాయి. ఇవాళ మధ్యాహ్నాం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. మంత్రుల జాబితాపై మరోసారి పునఃసమీక్ష జరిపి ఈ సాయంత్రం లేదంటే అర్ధరాత్రి పూర్తి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొనసాగుతున్న లీక్స్.. ఏపీలో ఎవరికి ఏ శాఖ అంటే..?
విజయవాడ, సాక్షి: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు కోసం కసరత్తులు ముగిశాయా? లేదంటే ఇంకా చర్చించాల్సి ఉందా? అసలు కూటమి పార్టీలు ఏ శాఖల కోసం పట్టుబట్టాయి? కీలక శాఖలను టీడీపీనే దక్కించుకోబోతోందా? త్యాగాల జనసేన శాఖల విషయంలో పంతం నెగ్గించుకుంటుందా? ఫలానా వాళ్లకు ఫలానా మంత్రిత్వ శాఖ అని లీకులు ఇస్తోంది ఎవరు?.. ఏపీలో కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారనేదానిపై ఈ సాయంత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక.. ఈ ప్రకటన ఉండనున్నట్లు అధికారిక సమాచారం. మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేశారని చెబుతున్నప్పటికీ.. మరోసారి పునఃసమీక్షిస్తారా? అనే చర్చా మొదలైంది.గురువారం ఆయన తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల పర్యటనలు ముగించుకున్నాక అమరావతికి తిరిగి రానున్నారు. సాయంత్రం సచివాలయం వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల ఫైల్స్పైనా సంతకాలు చేస్తారని ఇప్పటికే సమాచారం అందింది. అయితే.. ఆ తర్వాతే ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారట. ఈ క్రమంలో గత రెండు రోజులుగా శాఖల కేటాయింపులపై లీకులు అందుతున్నాయి. ఇటు టీడీపీ శ్రేణులు.. అటు జనసేన.. ఇంకోవైపు ఎల్లో మీడియా సంస్థలు.. మంత్రిత్వ శాఖలపై గత రెండురోజులుగా వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. అందులో మొదటిది పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతారని. అయితే నిన్న మంత్రిగానే పవన్ కల్యాణ్ ప్రమాణం చేసినప్పటికీ.. అధికారికంగా డిప్యూటీ సీఎం అని ఎక్కడా ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఆయన సోదరుడు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఉప ముఖ్యమంత్రి అనే లీక్ ఇచ్చేశారు. ఇక.. జనసేనకు మూడూ కీలక శాఖలే ఉంటాయని టీడీపీ అనుకూల ప్రధాన మీడియా కథనం ఇచ్చింది. అందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు పేర్కొంది. అయితే.. పవన్ హోం శాఖ కోసం కూడా పట్టుబడుతున్నారంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి. మరోవైపు నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు లీకులు అందుతున్నాయి. ఇక టీడీపీ శ్రేణులేమో.. ఐటీ శాఖ మరోసారి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ బాబుకే వెళ్లొచ్చని చెబుతున్నాయి. గతంలో.. 2014 టైంలో ఎమ్మెల్సీగా నారా లోకేష్ ఈ శాఖను చేపట్టారు. అయితే టీడీపీలోనే మరో వర్గం లోకేష్‌కు ఈసారి ఇంకా ప్రాధాన్యం ఎక్కువ ఉన్న మంత్రిత్వ శాఖ దక్కుతుందని చెప్పుకుంటోంది. సీఎం చంద్రబాబు బాధ్యతను స్వీకరించిన తర్వాత రాత్రికి అధికారిక ప్రకటన. ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఫలానా మంత్రిత్వ శాఖ దక్కుతుందనే ప్రచారంలో ఉంటే.. మరో మిత్రపక్షం బీజేపీ మాత్రం ఒక్క మంత్రి పదవి పోస్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయకపోవడం గమనార్హం. -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్‌పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్‌కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు కేబినెట్.. తెరపైకి కొత్త ఈక్వేషన్లు!
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంపై కసరత్తులు కొనసాగుతున్నవేళ.. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, హోం శాఖ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌కు హోం శాఖ ఖరారైందన్న ప్రచారం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. చంద్రబాబు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడూ అదే ఫార్ములా అమలు చేయాలంటు జనసేన పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్‌కు హోం శాఖ ఇచ్చి ఆ గ్యాప్‌ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ జనసేన చేస్తోంది. ఇంకోవైపు హోం మంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్‌తో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్థత నెలకొంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా? అనే చర్చ నడుస్తోంది. కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా కేబినెట్లో కీలక పోస్టులను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మంత్రి పదవులెవరికో?.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠమరోవైపు.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు. ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ముగ్గురూ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్పదవి ఇచ్చుకున్న చంద్రబాబు.. ఈసారైనా బీసీ, ఎస్సీలకు ఇస్తారా? లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇప్పించుకుంటారా?అనే సస్పెన్స్ కొనసాగుతోంది. -
జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ శాసన సభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోకి పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జనసేన సీనియర్.. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, పవన్ పేరును ప్రతిపాదించగా.. అందుకు జనసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవుల కోసమూ ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాసేపట్లో విజయవాడలో జరగబోయే ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి పవన్‌తో పాటు జనసేన ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. -
ఏపీ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిశాక నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నకున్నట్లు గవర్నర్ నజీర్‌కు లేఖ ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉందని, చంద్రబాబును తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వాళ్లు ఆయన్ని కోరారు. ఆ ఎమ్మెల్యేల సంతకాల లేఖను పరిశీలించిన గవర్నర్ నజీర్.. ప్రభుత్వ ఏర్పాటునకు సాయంత్రంలోగా ఆహ్వానిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నేతగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఎన్డీయే కూటమి నేతగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఆమోదం తెలిపారు. ఆవెంటనే మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమ్మతి తెలపడంతో సభా నాయకుడిగా చంద్రబాబు ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కూటమి అద్భుత విజయం ఏపీ రాష్ట్రం సాధించిన విజయం. సమిష్టిగా పోరాడి అద్భుత విజయం సాధించాం. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. అద్భుతమైన మెజారిటీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కక్ష సాధింపులు.. వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదు. ఏపీ ప్రజలు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబుకి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. చంద్రబాబు అనుభవజ్ఞుడే కాదు.. ధైర్యశాలి కూడా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం. ప్రజలకు ఎన్నో హామీలిచ్చాం. వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.:: పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించాం. ఇంతటి ఘన విజయం సాధిస్తామని ఎవరూ ఊహించలేదు. ::బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిఎన్డీయే శాసనసభా పక్ష నేతగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకం అయ్యాయి. అధిక స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించాం. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు. ఇది అన్‌స్టాపబుల్ విజయం. ఏపీలో ఘన విజయంతో ఢిల్లీలో గౌరవం పెరిగింది. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ::చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేతల ఎంపికకూటమి మీటింగ్ కంటే ముందే.. మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, గెలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పవన్‌ను జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఈ పేరును ప్రతిపాదించగా.. అందుకు ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం అయ్యారు. కానీ, శాసన సభా పక్ష నేత ఎంపిక నిర్ణయం అధిష్టానానికే వదిలేసినట్లు సమాచారం. దీంతో బీజేఎల్పీపై సస్పెన్స్ కొనసాగుతోంది.రేపే ప్రమాణం.. స్టేట్ గెస్ట్‌గా చిరుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణం చేయనున్నారు. విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. మరోవైపు ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా నటుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు చంద్రబాబు. దీంతో ఈ సాయంత్రమే చిరు విజయవాడకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో పాటు రాం చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. మంత్రి వర్గంపై ఉత్కంఠమరోవైపు.. రేపు(బుధవారం) ఉదయం ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీ కోటాతోపాటు జనసేన, బీజేపీ నుంచి పేర్లతో కేబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు కోసం మూడు పార్టీల నేతలు సుదీర్ఘ కసరత్తులే చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ ఆయా పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
పిఠాపురం వర్మపై జనసేన దాడి
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్‌లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్
AP Election 2024 Counting And Results Updates03:43 PM, June 4th, 2024పులివెందులలో వైఎస్ జగన్ గెలుపు61,169 ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపుఅధికారికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలియాల్సి ఉంది02:43 PM, June 4th, 2024పులివెందుల 19వ రౌండ్ ముగిసేసరికి 56వేల ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్02:41 PM, June 4th, 2024అన్నమయ్య జిల్లా:రాయచోటి 14 వ రౌండ్ ముగిసేసరికి 3929 ఓట్ల ఆదిక్యం లో శ్రీకాంత్రెడ్డిశ్రీకాంత్ రెడ్డి(వైఎస్ఆర్సీపీ) : 63824మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ): 5989502:40 PM, June 4th, 2024కడప పార్లమెంట్వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజ.63218 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ అవినాష్వైఎస్ అవినాష్ రెడ్డి: 500912టిడిపి భూపేష్ సుబ్బరామి రెడ్డి: 437694వైఎస్ షర్మిలా రెడ్డి: 11871202:40 PM, June 4th, 2024ముందంజలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిరాజంపేట: 20వ రౌండ్ ముగిసేసరికి 8378 ఓట్ల ఆధిక్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డివైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 89664టిడిపి సుగవాస బాలసుబ్రమణ్యం: 8128602:26 PM, June 4th, 2024పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజచిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 19 రౌండ్లకు గాను 17 రౌండ్ లు ఓట్ల లెక్కింపు పూర్తి6623 ఓట్ల లీడింగ్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజ 01:50 PM, June 4th, 2024ముందంజలో అవినాష్‌రెడ్డి కడప: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి16 రౌండ్లు ముగిసే సమయానికి 39,637 ఓట్లతో వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ముందంజ01:05 PM, June 4th, 2024రాజంపేటలో వైఎస్సార్సీపీ ముందంజరాజంపేటలో వైఎస్సార్సీపీ 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 7,108 ఓట్ల మెజారిటీతో ముందంజకదిరిలో ఐదువేల ఓట్లతో వైఎస్సార్సీపీ లీడ్12:21 PM, June 4th, 2024పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ జగన్పుంగనూరు: ముందంజలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసత్యవేడులో వైఎస్సార్సీపీ ఆధిక్యంవైఎస్సార్సీపీ-23497బీజేపీ-16,60311:15 AM, June 4th, 2024పాలకొండలో వైఎస్సార్సీ ముందంజగుంతకల్లులో వైఎస్సార్సీపీ ఆధిక్యతగుంతకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ఆధిక్యత మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంపై 2608 ఓట్ల ఆధిక్యంలో వెంకట్రామిరెడ్డినరసరావుపేట అసెంబ్లీ 4వ రౌండ్ పూర్తయ్యేసరికి ఎమ్మెల్యే గోపిరెడ్డి 4700 ఓట్ల ఆధిక్యం10:54 AM, June 4th, 2024దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆధిక్యంలో దిశగా దూసుకుపోతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసేరికివైఎస్సార్సీపీ-22965టీడీపీ-20921పలాస అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5110టీడీపీ-12309టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం (రెండో రౌండ్)వైఎస్సార్సీపీ-5478టీడీపీ-6263ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం (నాలుగో రౌండ్)వైఎస్సార్సీపీ-13805టీడీపీ -1786410:31 AM, June 4th, 2024తిరుపతి పార్లమెంట్.. ఆధిక్యంలో గురుమూర్తిగూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మూడో రౌండ్లో గురుమూర్తి 1596 ఓట్లు ఆధిక్యంవైఎస్సార్సీపీ-12,687బీజేపీ-11091నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి సర్వేపల్లి అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 107 ఓట్లు ఆధిక్యం9:52 AM, June 4th, 2024వైఎస్ అవినాష్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ పరిధిలో నాలుగో రౌండ్ ముగిసేసరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజ9:24 AM, June 4th, 2024అనపర్తి, తిరువూరులో వైఎస్సార్సీపీ లీడ్హిందూపురం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యంపుట్టపర్తిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీధర్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంసర్వేపల్లిలో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధిక్యందర్శిలో వైఎస్సార్సీపీ ముందంజఅరకు పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి లీడ్9:20 AM, June 4th, 2024పాలకొల్లులో టీడీపీ ముందంజఆచంటలో టీడీపీ 3747 ఓట్లు ఆధిక్యం ఉండిలో టీడీపీ 5,729 ఓట్లు ఆధిక్యంభీమవరంలో జనసేన 7012 ఓట్లు ఆధిక్యంతణుకులో టీడీపీ 7580 ఓట్లు ఆధిక్యంతాడేపల్లిగూడెంలో జనసేన 1524 ఓట్లు ఆధిక్యం నర్సాపురం పార్లమెంట్లో బిజెపి 18384 ఓట్లు ఆధిక్యం9:15 AM, June 4th, 2024విశాఖ లోక్ సభ స్థానానికి పోలైన సర్వీస్ ఓట్లు మొత్తం 1350ఆరు స్కానర్లు ద్వారా స్కాన్ చేస్తున్న సిబ్బంది.. పర్యవేక్షిస్తున్న ఆర్వోలుసర్వీస్ ఓట్లలో 13ఏలు పెట్టకుండా పోస్ట్ చేసిన కొంతమంది ఓటర్లుమరో గంటలో పూర్తి వివరాలు వచ్చేందుకు అవకాశం9:13 AM, June 4th, 2024పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజతిరువూరులో వైఎస్సార్సీపీ ముందంజఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యం9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యంఅవినాష్రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్లుపోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలుపోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్ సెంటర్లో పినిపే విశ్వరూప్అమలాపురంలో కౌంటింగ్ సెంటర్‌కి వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్‌వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్లు, ఛైర్పర్సన్లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులుకౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది. -
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: అంచనాలకు మించి ఆనాడు..
జూన్ 4వ తేదీనాటి ప్రజాతీర్పు కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ఫలితాల హ్యాష్ ట్యాగులు ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం వెలువడబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చా నడుస్తోంది. ఇక.. 2019 ఏపీ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల నాటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. 2019 మే 23వ తేదీ వెలువడ్డ ఫలితాలతో పోలిస్తే.. ఆ అంచనాలు ఎంత వరకు ఫలించాయో పరిశీల్తిస్తే.. 2019 మే 19 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వాటిల్లో ఎక్కువ సర్వే సంస్థలు లోక్‌సభ, అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపించాయి. ఒకటి రెండు సర్వే సంస్థలు తప్పించి.. లోక్‌సభ స్థానాల్లో 20కి దగ్గర్లో వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ చెప్పింది. వాటిల్లో.. 👉లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది.👉 ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 20 నుంచి 24 ఎంపీ సీట్లు రావొచ్చని తెలిపింది. టీడీపీకి 1 నుంచి 5 ఎంపీ సీట్లు వస్తాయని పేర్కొంది.👉 టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం వైఎస్సార్సీపీకి 18 సీట్లు టీడీపీకి 7 సీట్లు రావొచ్చని అంచనా.👉 న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు వస్తాయి. టీడీపీ 10 నుంచి 12 సీట్లు దక్కించుకుంటుంది.లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా.. అంతకు మించే ఫలించింది. 25 స్థానాలకుగానూ 22 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తొలిసారి అధికార పగ్గాలు చేపట్టనుందని, అలాగే ఏపీ ఎన్నికల్లో తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని తేల్చాయి. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. 👉 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 133 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) అంచనా వేసింది. టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.👉 వైఎస్సార్సీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. వైఎస్సార్సీపీకి 18 నుంచి 21 లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.👉 ఆరా మస్తాన్ సర్వేలో వైఎస్సార్సీపీకి 126 అసెంబ్లీ సీట్లు వస్తాయని తేలింది. టీడీపీ 47, జనసేన పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది.👉 వీడీపీ అసోసియేట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైఎస్సార్సీపీకి 111 నుంచి 121 సీట్లు వస్తాయి. టీడీపీకి 54 నుంచి 64 స్థానాలు దక్కుతాయి. జనసేనకు 4 సీట్లు వచ్చే అవకాశముంది.👉 ఐపల్స్ సర్వే ప్రకారం వైఎస్సార్సీపీకి 110 - 120, టీడీపీకి 56 - 62, జనసేన పార్టీ 0 - 3 స్థానాలలో విజయం సాధిస్తాయి.👉 కేకే సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 130 - 135, టీడీపీ 30 - 35, జనసేన పార్టీ 10 - 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి👉 మిషన్ చాణక్య సర్వే ప్రకారం వైఎస్సార్సీపీ 98 స్థానాల్లో, టీడీపీ 58 స్థానాల్లో, జనసేన పార్టీ 7 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధిస్తారని అంచనా వేశారు. ఇక్కడా ఆ అంచనాలు మించాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకుగానూ 151 సీట్లు సాధించి.. చరిత్ర సృష్టిస్తూ సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారాన్ని కైవసరం చేసుకుంది. మరి ఈసారి ప్రతిపక్షం కూటమిగా పోటీ చేసింది. వైఎస్సార్సీపీ సంక్షేమ పాలన నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. చూద్దాం.. సాయంత్రం రాబోయే ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉంటాయో!. -
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్‌బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్‌గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన.