నేడు జిల్లాలో పవన్ పర్యటన | pawan kalyan arrives in districts | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో పవన్ పర్యటన

Published Sat, Apr 26 2014 3:02 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

pawan kalyan arrives in districts

కరీంనగర్,  న్యూస్‌లైన్ : జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ శనివా రం జిల్లాలోని గో దావరిఖని, హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. గోదావరిఖనిలో ఉదయం 11 గంటల కు సభలో బీజేపీ రామగుండం అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డికి, పెద్దపల్లి పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ శరత్‌బాబుకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.
 
 అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గకేంద్రంలో జరిగే బహిరంగ సభలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. సిరిసిల్లలో జరగనున్న బహిరంగ సభను వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement