husnabad
-
స్కూల్ చుట్టూ చీరలు.. సంగతేంటంటే?
అది ప్రభుత్వ పాఠశాల.. ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు, పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. రహదారికి ఆనుకుని ఉండటంతో దుమ్మూధూళి అధికంగా వస్తోంది. ప్రహరీ నిర్మాణానికి డబ్బులు లేక ఉపాధ్యాయులే పాఠశాల చుట్టూ చీరలు (Sarees) కట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలం జిల్లెలగడ్డ (Jilleligada) గ్రామ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. దుమ్మూధూళి తరగతి గదులలోపలికి వచ్చి విద్యా బోధనకు ఇబ్బంది కలిగిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. చేసేదిలేక చీరలను అడ్డుగా కట్టించామన్నారు. కలెక్టర్ స్పందించి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. – హుస్నాబాద్ రూరల్ చక్కని ఉత్తీర్ణతకు చిరుతిండి.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు టెన్త్ విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఇందులో మిల్లెట్స్, పల్లీపట్టీలు, నువ్వుల పట్టీలు, మొలకలు, అరటిపండ్లు, ఉడికించిన పల్లీలు ఉంటున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపెల్లి జెడ్పీ హైసూ్కల్ పదో తరగతి విద్యార్థుల స్టడీఅవర్స్‌లో స్నాక్స్ అందిస్తూ, పిల్లల సందేహాలు నివృత్తి చేస్తూ.. హెచ్ఎం అన్నపూర్ణ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి రేషన్ కోసం... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలోని ఒక రేషన్ దుకాణాన్ని తెరవకముందే మధ్యాహ్నం 3 గంటల నుంచి లబ్ధిదారులు బారులు తీరారు. ఇందుకోసం వరుసలో సంచులు, బండరాళ్లను పెట్టి డీలర్ రాక కోసం నిరీక్షించడం కనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ఎరువు కష్టాలు రైతులకే ఎరుక సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో సహకార సంఘాల ఎదు ట రైతులు బారులు తీరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారిలా.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిఆశలు రాలిన చోట కొత్త చిగురుపంట రాని మామిడి చెట్లను కాండం వరకు కొట్టేసినా.. చిగురిస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగులచెలకలో ఏళ్ల క్రితం నాటిన మామిడి తోటలో చెట్లకు కాలం చెల్లింది. పంట రాకపోవడంతో రైతు చెట్లను కాండం వరకు కొట్టేసి అధికారుల సూచనలతో కొన్ని రసాయనాలు పూశాడు. దీంతో ఇటీవల మళ్లీ కాండం పక్క నుంచి కొత్తగా చిగుళ్లు వస్తుండడంతో.. రెండు, మూడేళ్ల తర్వాత పంట మొదలయ్యే అవకాశముందని ఆశిస్తున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సాక్షి, ఖమ్మంవిస్తృతంగా పొగాకు సాగుసూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో కొందరు రైతులు పొగాకు పంట సాగుపై దృష్టి సారించారు. గతంలో ఒకరిద్దరు రైతులు సాగు చేయగా.. ప్రస్తుతం 50మందికి పైగానే ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని ఐటీసీ సంస్థ వారు రైతులకు నారు సరఫరా చేస్తున్నారు. రైతులు పంట పండించి ఆ కంపెనీకే దిగుబడిని విక్రయిస్తున్నారు. అర్వపల్లి మండలంలో సుమారు 300 ఎకరాల్లో పొగాకు పంట సాగవుతోంది. ఈ పంటకు కోతులు, అడవి పందుల బెడద లేదు.చదవండి: భద్రాద్రి సీతారామచంద్ర స్వామికి కాసుల పంట -
అనుమానంతో.. భార్యను వెంటాడి మరీ..
దొడ్డబళ్లాపురం,కర్ణాటక: అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చాడో కిరాతక భర్త. ఈ సంఘటన బెంగళూరు ఆనేకల్ తాలూకా హెబ్బగోడిలోని వినాయకనగరలో చోటుచేసుకుంది. శ్రీగంగ (27), భర్త మోహన్‌రాజు(30). వీరు చిరుద్యోగులు. శ్రీగంగ అక్కడే డిమార్ట్‌లో పనిచేసేది. పృథ్విక్ (6) అనే కుమారుడు ఉన్నాడు.శ్రీగంగ సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేది. గత 7 నెలలుగా మోహన్‌రాజు పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలం గడుపుతున్నాడు. దీంతో నిత్యం ఇద్దరికీ గొడవ జరిగేది. అంతేకాకుండా శ్రీగంగ ప్రవర్తనపై మోహన్ అనుమానంతో పీడించేవాడు. బుధవారం ఉదయం ఇద్దరూ గొడవపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మోహన్ కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె రోడ్డు మీదకు పరుగులు తీయగా వెంటాడి ఎనిమిది సార్లు పొడిచాడు. చావు బతుకుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. హెబ్బగోడి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మోహన్‌రాజుని అరెస్టు చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా దంపతులు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, అతడు అప్పుడప్పుడు కొడుకును చూడాలని వచ్చి వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. అలా వచ్చినప్పుడు గొడవపడి హత్య చేశాడని తెలిపారు. -
మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన
సాక్షి,హన్మకొండజిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి సంక్రాంతి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. జాతర సందర్భంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీరభద్రస్వామి ఆలయ కమిటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అలిగిన మంత్రి పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆలయ గెస్ట్‌హౌజ్ వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ మోకాళ్లపై నిలబడి తన అసహనాన్ని వెల్లడించారు. కాగా,హైదరాబాద్ ఇంఛార్జ్‌గా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గతేడాది హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో అధికారులపై అలిగి గుడిలోనే బైఠాయించారు.తనకు, జీహెచ్ఎంసీ మేయర్‌కు ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై తన నిరసనను తెలిపారు. అనంతరం అధికారులు బుజ్జగించిన తర్వాత పొన్నం అలకవీడడం గమనార్హం. సొంత హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ జాతరలోనూ తాజాగా పొన్నం అధికారులపై బహిరంగంగానే తన అసహనాన్ని తెలపడం చర్చనీయాంశమైంది. -
ఎంబీబీఎస్ సీటొచ్చినా కూలి పనులకు.. ఏం చేయాలో తెలియక
కౌడిపల్లి(నర్సాపూర్): కూలి పనులు చేస్తేనే కూడు దొరకని కుటుంబం.. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. అయితేనేం ముత్యాల్లాంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు చదువులో మేటిగా ఉన్నారు. ఇప్పుడా దంపతుల రెండో కుమార్తెకు ఎంబీబీఎస్ సీటొచ్చినా.. డబ్బుల్లేక కూలి పనులకు వెళ్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి సాగు చేస్తూ, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.పెద్ద కొడుకు విజయ్‌కుమార్ కాకినాడలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం.. పెద్దకూతురు అనిత సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో నర్సింగ్ చదువుతున్నారు. చిన్న కొడుకు రాహుల్ ఖమ్మం ఎస్టీ గురుకుల కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కూతురు కాట్రోత్ సుమలత సిద్దిపేటలోని సురభి ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. కానీ ప్రైవేట్ కళాశాల కావడంతో ఏటా సుమారు రూ 3 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న పొలం తాకట్టుపెట్టి రూ.లక్షన్నర చెల్లించింది. ఇంకా హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు రూ.లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక సుమలత ఆవేదన చెందుతోంది. పెద్ద మనుసున్న దాతలు 77801 06423 ఫోన్ నంబర్‌కు తోచిన సాయం చేయాలని కోరుతోంది.మెడికల్ సీటు సాధించిన పేద విద్యార్థినికి పొన్నం భరోసా హుస్నాబాద్ రూరల్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన పేద విద్యార్థిని లావుడ్య దేవి ఓ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తోంది. దీనిపై ‘సాక్షి’ సోమవారం సంచికలో ‘డాక్టర్ చదువుకు డబ్బుల్లేక కూలి పనులకు..’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గిరిజన విద్యార్థి కుటుంబం గురించి స్థానిక నాయకులతో అరా తీశారు. మంగళవారం హుస్నాబాద్‌కు వచ్చిన మంత్రి.. గిరిజన విద్యార్థిని అభినందించారు. ఆమె కాలేజీ ఫీజుకు ఆర్థిక సాయంతో చేయడంతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాదికి కూడా కాలేజీ ఫీజుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. జెన్కో ఇంజనీర్లకు పోస్టింగ్‌లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో భారీ సంఖ్యలో ఈ నెల 9న అడ్హాక్ (తాత్కాలిక) పదోన్నతులు పొందిన ఇంజనీర్లకు ఎట్టకేలకు కొత్త పోస్టింగ్స్ కేటాయిస్తూ సోమవారం సంస్థ సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లోని 203 మంది ఏడీఈలు, ఎలక్ట్రికల్ విభాగంలో 34 మంది డీఈలు, ఏడుగురు ఎస్ఈలు, ఇద్దరు సీఈలతో పాటు మెకానికల్ విభాగంలో 12 మంది డీఈలు, ఎస్ఈలు.. సివిల్ విభాగంలో ఐదుగురు ఏఈఈలుగా, ఇద్దరు ఈఈలకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు. చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్త -
డాక్టర్ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..
హుస్నాబాద్ రూరల్: వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.పదో తరగతి, ఇంటర్మిడియెట్‌లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్‌కు సిద్ధమైంది. నీట్లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్ కాలేజీలో సీటు వచి్చంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి..
పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. విద్యే ఆయుధంగా చేసుకొని జీవితంపై పోరాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారే హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్. తండ్రి హమాలీ కారి్మకుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. పట్టణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హుస్నాబాద్: పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్‌కుమార్, శ్వేత, శ్రీకాంత్ సంతానం. పెద్ద కుమారుడు రాజ్‌కుమార్ అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్ నెల రోజుల క్రితం ఫైర్‌స్టేషన్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కాల్ లెటర్ రాగానే జూలైలో ఫైర్ కానిస్టేబుల్‌గా శిక్షణ పొందనున్నాడు. తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకలి్పంచారు. భవిష్యత్‌లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. -
ఆయన రాహుల్ గాంధీ కాదు.. ‘రాంగ్’ గాంధీ: హరీశ్‌రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రైతుల ఉసురు పోసుకుందంటూ.. బీజేపీని కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్‌రావు. బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే బీజేపీ ఆలోచించిందని.. 14 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పంచిన బొమ్మలను చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? అంటూ ప్రశ్నించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. ట్రస్ట్ కట్టింది.ఆలయ నిర్మాణానికి తానుకూడా 2 లక్షలు ఇచ్చానని చెప్పారు.నిన్న హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలల 12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పండి. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హుస్నాబాద్‌కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ’’ అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.‘‘ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక కల్యాణ లక్ష్మి ఖతమయ్యింది. తులం బంగారం తుస్సు మంది. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంతా వృధా అయిపోతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థాలో ఉంది. అది గెలిచే ప్రసక్తే లేదు’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
ఎన్నికలు కరెంట్ పైనే..
హుస్నాబాద్/చిగురుమామిడి/ అక్కన్నపేట/కోహెడ: కరెంటు సరఫరా ప్రధాన ఎజెండాగానే ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న మన తెలంగాణకు వచ్చి మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లొల్లి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లకి కరెంట్‌పై ఎంత అవగాహన ఉందో డీకే మాటలను బట్డి అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కాంగెస్ నేతలు తెలంగాణలో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్‌కు వచ్చి మంచి ముచ్చట చెప్పారని హరీశ్ వ్యాఖ్యానించారు. బోర్ బావుల వద్ద మోటార్లు బిగించిన రాష్ట్రాలకు కేంద్ర నిధులు ఇచ్చామని, తెలంగాణలో మీటర్లు బిగించడం లేదని, అందుకే రూ.35వేల కోట్ల రూపాయల నిధులను ఆపామని ఆమె చెప్పారని వివరించారు. బోరు బావుల వద్ద మీటర్లు బిగించమని కేసీఆర్ తెగేసి చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు రూ.35వేల కోట్ల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69లక్షల మంది రైతులే ముఖ్యమని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. కర్ణాటకలో ప్రజలు అవస్థలు పడుతున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో హుస్నాబాద్ అభ్యర్థి సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో ఐదు గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బోల్తా పడిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మనకు కూడా 6 గ్యారంటీలని వస్తున్నారని, వారి మాటలు విని ఆగం కావద్దని హెచ్చరించారు. అక్కడి ప్రభుత్వం అన్ని ధరలు పెంచడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. నీతి లేని కాంగ్రెస్‌ను నమ్మొద్దని హెచ్చరించారు. -
రూట్ మార్చిన పొన్నం.. టార్గెట్ అదే!
మాజీ ఎంపీ పొన్నం రూట్ మార్చేశారు. తనకు అచ్చిరాని చోట నుంచి.. మరో కొత్త చోట తన భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు. అనువుగాని చోట అధికులమనరాదనే భావనతో పాటు.. కలిసొచ్చే చోట ప్రయత్నిస్తే లక్కూ కలిసి రావొచ్చనేమో పొన్నం యోచన. అందుకే ఇప్పుడు పొన్నం చూపు హుస్నాబాద్ నియోజకవర్గం వైపు పడింది. సరే, మరి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాటేమిటి..? ఆయనెంతవరకూ పొన్నంకు సహకరిస్తారు..? మరోవైపు కామ్రేడ్స్ కత్తిదూస్తున్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎవరెవరు ఆశావహులు ఏ ఏ నియోజకవర్గాల నుంచి బరిలో ఉండాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు తెలంగాణా కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. అయితే, అంతా అనుకున్నట్టుగా కరీంనగర్ నుంచి కాకుండా.. ఈసారి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన భవిష్యత్తును హుస్నాబాద్ నుంచి పరీక్షించాలనుకోవడమే విశేషం. అందుకోసం కరీంనగర్ స్థానానికి ఆశావహ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోని పొన్నం ప్రభాకర్.. హుస్నాబాద్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తానే మీడియా ముఖంగా తెలిపారు. తన ఇష్టదైవమైన పొట్లపల్లి స్వయం భూ రాజరాజేశ్వరుడితో పాటు.. హుస్నాబాద్‌లో గుట్టపైనున్న సిద్ధరామేశ్వరుడిని దర్శించుకుని... తాను హుస్నాబాద్ నుంచే బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. పొన్నం తరపున ఆయన సోదరుడు గాంధీభవన్ లో దరఖాస్తు చేశారు. అయితే, ఇప్పుడు పొన్నం చూపు హుస్నాబాద్ వైపు ఎందుకు పడిందనేదే సర్వత్రా జరుగుతున్న చర్చ. పొన్నంకు అసలే రోజులు బాలేనట్టుగా కనిపిస్తున్నాయి. తనకు ఎన్నికల వేళ ఎలాంటి పదవులు ప్రకటించకపోవడం.. పొన్నం అలగడం.. 48 గంటల్లోపు పొన్నంకు పదవిస్తామని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించడం.. ఆ తర్వాత ఎలాంటి ఊసూ లేకపోవడంతో ఒకింత అసహనంగానే పొన్నం పొల్టికల్ జర్నీ ప్రస్తుతం కొనసాగుతోంది. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలోకి దిగితే మూడోస్థానానికి పరిమితం కావడం.. 2014, 2018 కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలూ కలిసి రాకపోవడంతో పొన్నం కరీంనగర్ నుంచి తన మనసు మార్చుకున్నారు. పైగా పొన్నం ప్రభాకర్ కు గత పార్లమెంట్ ఎన్నికల్లో.. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ లోనే 50 వేలకు పైగా ఓట్లు పోలవ్వడం.. ఈ నియోజకవర్గంలో తన గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 40 వేల వరకూ ఉండటం.. తనకున్న బీసీ కార్డుకు.. ఓ 90 వేల ఓట్ల పైచిలుకు అడ్వంటేజ్ గా భావించడం.. సతీష్ బాబుకు దీటైన నాయకుడు లేడన్న భావన.. తనైతే గెలవగలనన్న భరోసా.. అంతకుమించి తన అనుయాయులు, అనుచరుల నుంచి వచ్చిన ఒత్తడి వంటివాటితోనే పొన్నం అడుగులు హుస్నాబాద్ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇంటింటి తన ప్రచారాన్ని ప్రారంభించారు. మీడియాలో పెద్దగా లైమ్ లైట్ లో లేకున్నా.. సోషల్ మీడియాలో తన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి.. పొన్నంకు సహకరిస్తారా..? కాంగ్రెస్ టిక్కెట్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికా.. లేక, కొత్తగా బరిలోకి దిగుతున్న పొన్నంకా...? ఒకవేళ హుస్నాబాద్ లో తనకు టిక్కెట్ రాకుంటే పొన్నం అడుగులెలా ఉండబోతాయి...? ఒకవేళ పొన్నంకే టిక్కెట్ ఇస్తే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటూ పొన్నంకు సహకరిస్తారా..? లేక, ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో.. కమలం వైపు ఏమైనా అడుగులు వేస్తారా అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పై విరుచుకుపడుకున్న కామ్రెడ్స్ కు కూడా హుస్నాబాద్ స్థానంలో బరిలో ఉండాలన్నది గట్టి తలంపు. ఈ క్రమంలో కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు కుదురుతుందా..? మిత్రపక్షంగా కాంగ్రెస్ నుంచి అయితే పొన్నం.. లేదంటే అల్గిరెడ్డి ఎవ్వరు బరిలో ఉన్నా.. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటారా...? ఎంత మిత్రపక్షమైనా.. బరిలో నిల్చే విషయంలో మిత్రభేదం తప్పదంటూ చాడ కూడా బరిలోకి దిగుతారా...? అప్పుడు మొత్తంగా హుస్నాబాద్ రాజకీయమెలా ఉండబోతుందన్నది ఇప్పుడు కడు ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ నుంచి తన మనసు మార్చుకుని పొన్నం పక్కకు తప్పుకోవడంతో కరీంనగర్ అసెంబ్లీకి కూడా ఆశావహుల జాబితా పెద్దదే తయారైనట్టుగా గాంధీభవన్ లో దరఖాస్తైన ఫారాలే చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో హుస్నాబాద్ వైపు పొన్నం చూపు పడటంతో.. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించిన చర్చతో పాటు.. హుస్నాబాద్‌లో ఫైట్ పై ఓ పేద్ద డిబేటే కొనసాగుతోంది. -
భార్య ఉరేసుకున్న చోటే.. భర్త ఆత్మహత్య
వివాహమైన 4 నెలలకే ఆమె.. తన పుట్టింటి వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే ప్రదేశంలో సరిగా పెళ్లి రోజుకు ముందు భర్త సైతం ప్రాణాలు తీసుకున్నాడు. హుస్నాబాద్: జీవితంపై విర్తకి చెంది ఓ వ్యక్తి తన పెళ్లిరోజే...భార్య ఉరేసుకున్న చోటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జిల్లా నేదునూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్(35)కు ఏడాది క్రితం హుస్నాబాద్ పట్టణానికి చెందిన శారదతో వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ఆరునెలల క్రితం శారద తన ఇంటివద్ద ఉన్న చెట్టుకే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన నాటి నుంచి మనస్తాపానికి లోనైన శ్యాం ఆదివారం అర్ధరాత్రి హుస్నాబాద్‌కు వచ్చి భార్య చనిపోయిన చెట్టు వద్దే పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించేలోగానే మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంపీగా నాలుగేళ్లు ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదు: కేటీఆర్
సాక్షి, సిద్ధిపేట: వినోద్ కుమార్‌ను ఎంపీగా గెలిపించుకుంటే కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ వచ్చేదని మంత్రి కేటీఆర్ పేర్కొనన్నారు. ప్రస్తుత ఎంపీ వ్యవహారంతో కరీంనగర్ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. నాలుగేళ్లు ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. ఓ గుడి, బడి, యూనివర్సిటీ కట్టలేదని ధ్వజమెత్తారు. కేవలం మతాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప చేసిందేం లేదని మండిపడ్డారు. ఈ మేరకు హుస్నాబాద్ బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘మోదీ దేవుడని అంటున్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన మోదీ దేవుడా? రైతుల కష్టాలు, సిలిండర్ ధరలు పెంచినోడు దేవుడా..? దయచేసి ఆలోచించండి. ఇలాంటి పిచ్చోళ్లను పార్లమెంట్‌కు పంపితే జరిగే నష్టం ఇదే. అభివృద్ధికి పునాదులు తవ్వాలి. కానీ హింసకు కాదు. ఎమ్మెల్యే సతీశ్‌తో పాటు ఎంపీ అభ్యర్థి వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. కాగా కాద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాసేపు బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. ఆయనతో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్‌తో బ్యాడ్మింటన్ ఆడారు. చదవండి: కోమటిరెడ్డికి జ్వరమొచ్చిందో.. ఏం నొప్పొచ్చిందో నాకేం తెలుసు?: జానా రెడ్డి -
హుస్నాబాద్‌లో నాటుబాంబుల కలకలం.. పేలుడుతో ఉలిక్కిపడ్డ జనం..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఆర్డీసీ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రెండు బాంబులు పేలగా ఐదు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడుతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం బస్టాండ్‌లోని పార్కింగ్ స్థలం పక్కన ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో ప్రయాణికులు, అక్కడున్న జనం ఉలిక్కిపడ్డారు. తోపుడు బండి కార్మికుడు బస్టాండ్‌లోని తన తోపుడు బండిని బయటకు తీస్తుండగా అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్న నాటుబాంబులకు తగిలి పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఆ కార్మికుడు ఆర్టీసీ సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్ వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, పార్కింగ్ స్థలంలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఉన్న స్థలం వద్దకు ఎవర్నీ రానివ్వకుండా కట్టడి చేశారు. అయితే బస్టాండ్ ఆవరణలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ నాటు బాంబులు ఊర పందులు, అడవి పందులను అరికట్టేందుకు వినియోగిస్తారని తెలుస్తోంది. గన్‌పౌడర్ (నల్ల మందు)తో వీటిని తయారు చేస్తారని సమాచారం. ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులను పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నామన్నారు. -
కీచక ఉపాధ్యాయుడు.. ప్రత్యేక తరగతులని చెప్పి విద్యార్థినిని..
సాక్షి, హుస్నాబాద్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన ఏనుగు రవి ఈనెల 20న బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక తరగతులు ఉన్నాయని, కాలేజీకి రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన సోదరుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వచ్చింది. ఆదివారం కావడం, కళాశాల మూసి ఉండడంతో వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది. తాను నర్మెట్ట నుంచి వస్తున్నాని, లద్నూరు వరకు రావాలని విద్యార్థినికి సూచించాడు. యువతి తన సోదరుడితో కలిసి లద్నూరుకు వెళ్లింది. ఉపాధ్యాయుడు చెప్పిన చోటుకు నడుచుకుంటూ వెళ్లగా, అతడు తన బైక్‌పై ఎక్కించుకొని లద్నూరు రిజర్వాయర్ పైకి తీసుకువెళ్లాడు. గమనించిన యువతి సోదరుడు మరికొంత మందితో కలిసి ఉపాధ్యాయుడిని వెంబడించి పట్టుకున్నారు. ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థిని ఎక్కడి తీసుకువెళుతున్నావని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి సోదరుడు, మరికొంత మంది కలిసి ఉపాధ్యాయుడు రవికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై ఎస్ఐ నారాయణను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఫోన్ కాల్
-
పక్కా ప్లాన్! జెండా వందనం చేశాక మాట్లాడాలని పక్కకు పిలిచి..
చిగురుమామిడి(హుస్నాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానమే పెనుభూతమై స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేశాక కత్తితో భార్య గొంతు కోసి, కడతేర్చాడు ఓ భర్త.. ఈ ఘటన చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేవపట్నం మండల కేంద్రానికి చెందిన అరెపల్లి రవి–యాదమ్మ దంపతుల పెద్ద కూతురు శిరీష. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్ డిగ్రీ, శిరీష(27) ఇంటర్ చదివారు. చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. ప్రవీణ్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, పెద్దల సమక్షంలో 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు శరణ్య, కుమారుడు శశివర్దన్ ఉన్నారు. 2018లో శిరీష అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలం తన విధులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించింది. ఈ క్రమంలో గత 6 నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ నిత్యం శిరీషను అనుమానించేవాడు. విచక్షణారహితంగా కొట్టేవాడు. భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. (చదవండి: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. ఎంతకూ మాట వినకపోవడంతో తోటి హిజ్రాలతో కలిసి..) పెద్ద మనుషులు ఒక్కటి చేసినాగొడవలు ఆగలేదు.. నిత్యం గొడవలు పడుతున్న వీరిని పెద్ద మనుషులు ఒప్పించి, ఒక్కటి చేశారు. దీంతో కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో శిరీష 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. కోర్టును ఆశ్రయించి, భర్త ప్రవీణ్‌కు విడాకుల నోటీసు పంపించింది. కేశవపట్నం పోలీస్స్టేషన్లోనూ అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 45 రోజులు అంగన్వాడీ విధులకు హాజరు కాలేదు. అధికారుల మందలింపుతో ఈ నెల 3 నుంచి తన తండ్రి రవిని వెంట తీసుకొని, కేశవపట్నం నుంచి బైక్‌పై అంగన్వాడీ సెంటర్‌కు వస్తోంది. అంగన్వాడీ సెంటర్ పక్కనే ఇల్లు అద్దెకు.. శిరీషను చంపాలని ప్రవీణ్ పథకం వేశాడు. ఇందుర్తిలో అతనికి ఇల్లు ఉన్నా అంగన్వాడీ సెంటర్ పక్కన మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అవకాశం కోసం చూసిన ప్రవీణ్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన పథకాన్ని అమలు చేశాడు. వివరాలు తెలుసుకుంటున్న సీఐ, ఎస్సైలు చంపవద్దని బతిమిలాడినా వినలేదు సోమవారం స్వాతంత్య్ర వేడుకలకు వచ్చిన శిరీషను ప్రవీణ్ జెండా వందనం పూర్తయ్యాక మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఓ యువకుడిపైనా అదే ఆయుధంతో దాడి చేసి, గాయపరిచాడు. తననేమీ చేయొద్దని శిరీష ఎంత బతిమిలాడినా వినకుండా ప్రాణాలు తీశాడు. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పట్టుకునేలోపే పారిపోయి, చిగురుమామిడి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలిని తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్‌లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి, శిరీష మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె బంధువులతో మాట్లాడారు. మృతురాలి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. (చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి) -
మోదీకి యాదమ్మ మెనూ
‘ఇంటి వంట’ స్త్రీలకు అప్పజెప్పి ‘ఉత్సవ వంట’ మగాడు హస్తగతం చేసుకున్నాడు. నలభీములే భారీ వంటలు చేస్తారట. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్స్ మగాళ్లే ఉండాలట. ఈ మూస అభిప్రాయాన్ని మన తెలంగాణ మహా వంటగత్తె బద్దలు కొట్టింది. ‘వింటే భారతం వినాలి తింటే గూళ్ల యాదమ్మ వంట తినాలి’ అని పేరు సంపాదించింది. అందుకే హైదరాబాద్‌కు మోదీ వస్తుంటే కాల్ యాదమ్మకు వెళ్లింది. ‘యాదమ్మగారూ ఏం వొండుతున్నారు ప్రధానికి?’ అని అడిగితే నోరూరించేలా ఆమె చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? ప్రధాని మోదీ ఇష్టపడే వంటకం ఏమిటో తెలుసా? కిచిడి. ఆయన గుజరాతీ కాబట్టి ‘ఢోక్లా’ అంటే కూడా చాలా ఇష్టం. శనగపిండి, మజ్జిగ కలిపి చేసే ‘ఖాండ్వీ’ ఉంటే మరో ముద్ద ఎక్కువ తింటారు. ఈ మూడూ మామిడి పచ్చడి, శ్రీఖండ్ ఉంటే సరేసరి. అయితే ఈసారి ఆయనను సంతోషపెట్టే వంటకాలు వేరే ఉన్నాయి. అవి అచ్చు తెలంగాణ వంటకాలు. తెలుగు వంటకాలు. హైదరాబాద్ పర్యటనకు హాజరవుతున్న మోదీ ‘స్థానిక వంటకాలు తింటాను’ అని చెప్పినందున సిద్ధమవుతున్నాయి. అయితే వీటిని వండుతున్నది ఫైవ్‌స్టార్ హోటళ్ల చెఫ్‌లు కాదు. కరీంనగర్ పల్లె నుంచి ఇంతింతై ఎదిగిన గొప్ప వంటకత్తె గూళ్ల యాదమ్మ. ఆమెతో ‘సాక్షి’ మాట్లాడింది. గంగవాయిలి కూర... ఆలుగడ్డ వేపుడు ‘మోదీ గారికి ఏం వండాలో చివరి నిమిషంలో చెప్తామన్నారు. కాని తెలంగాణ రుచి తెలియాలంటే ఏం వండాలో మనసులో అనుకున్నా. ముద్దపప్పు, గంగవాయిలి కూర, పప్పు చారు, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నా’ అంది గూళ్ల యాదమ్మ. వీటితో పాటు సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్ష్యాలు, పాయసం, పప్పుగారెలు యాదమ్మ లిస్ట్‌లో ఉన్నాయి. ‘ఇంతకాలం 20 వేలు, 50 వేల మందికి వంట చేశాను.135 కోట్ల మందికి ప్రధాని అయిన మోదీకి చేస్తానని ఏనాడూ అనుకోలేదు. ఒక రకంగా దేశ ప్రజలందరికీ వంట చేసినట్లుగానే భావిస్తున్నా’ అంది యాదమ్మ. జీవితం చెదిరినా రుచి కుదిరింది ‘మా స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. అత్తవారు పక్కనే కొండాపూర్. పదిహేనేళ్లకు పెళ్లయితే కొడుకు పుట్టిన మూడు నెలలకు నా భర్త చంద్రయ్య పనిలో మట్టిపెళ్లెలు కూలి మరణించాడు. బతుకు చెదిరిపోయింది. అత్తగారి ఇంట నరకం మొదలయ్యింది. నేనూ నా కొడుకు బతకాలంటే నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. 1993లో కొండాపూర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు భుజాన మూడు నెలల పసిగుడ్డును వేసుకుని బస్టాప్‌కు వచ్చి కరీంనగర్ బస్సెక్కా. కొన్నాళ్లు స్కూల్ ఆయాగా పని చేశా. ఆ తర్వాత నా గురువు వెంకన్న వద్ద పనికి కుదరడం నా జీవితాన్ని మార్చివేసింది. ఆయన రోజుకు 15 రూపాయలు కూలీ ఇచ్చేవాడు. ఆ దశ నుంచి లక్షల రూపాయల కాంట్రాక్టుతో వేల మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగాను’ అంది యాదమ్మ. నిజానికి భారీ వంటలంటే మగవారే సమర్థంగా చేయగలరు అనే స్థిర అభిప్రాయం ఉంది. కాని యాదమ్మ వేల మందికి అలవోకగా వండుతూ పెద్ద పెద్ద వంట మాస్టర్లను చకితులను చేస్తోంది. ఇది సామాన్యమైన విజయం కాదు. నాటుకోడి... నల్ల మాంసం ‘నేను తెలంగాణ నాన్‌వెజ్ కూడా బాగా చేస్తాను. అవే నాకు పేరు తెచ్చాయి. మటన్, చికెన్, నాటుకోడి, బిర్యానీ, నల్ల మాంసం, బోటీ, చేపల పులుసు, చైనీస్, ఇండియన్ అన్ని వెరైటీలు చేస్తాను.అయితే పని వస్తేనే సరిపోదు.క్రమశిక్షణ ఉండాలి. 25 ఏళ్ల కింద కరీంనగర్ పట్టణంలో స్కూటీ నడిపే ఐదారుగురు మహిళల్లో నేను ఒకదాన్ని. టైంకు ఫంక్షన్లకు వెళ్లాలని పట్టుబట్టి మరీ స్కూటీ నేర్చుకున్నా. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లు బాగా ప్రోత్సహిస్తారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు నాదే వంట. కాలేజీ ఫంక్షన్ల నుంచి రాజకీయ సభల దాకా 20 వేల మందికి ఇట్టే వండిపెడతా.ఈ రోజు నా వద్ద 30 మంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నా, నా దగ్గర పని నేర్చుకున్న స్త్రీలు ఎందరో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డారు క్యాటరింగ్ చేసుకుంటూ’ అందామె. వేములవాడ నుంచి పుష్కరాల దాకా ‘కష్టపడుతూ నిజాయతీగా ఉంటే దేవుడు అవకాశాలు తానే ఇస్తాడు. అలాగే నాకూ ఇస్తున్నాడు. ఏటా శివరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తులకు వండి పెట్టే భాగ్యం దక్కింది. అలాగే కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలకు కూడా పిలుస్తారు. గోదావరి పుష్కరాలకు కూడా వండాను. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తవారింట్లోనే 25 ఏళ్లుగా వంటలు చేస్తున్నాను. సీఎం గారిని చాలాసార్లు చూశాను. ఆయన నా వంటలు రుచి చూశారు. కానీ ఏనాడూ మాట్లాడే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడు కేటీఆర్ మూడు సభలకు వండిపెట్టాను. అందులో అసెంబ్లీ ఎన్నికలకి ముందు తరవాత 50 వేల మందికి వండాను. ఇటీవల తీగల బ్రిడ్జి శంకుస్థాపన సమయంలోనూ 20 వేల మందికి వంట చేశాను. నా వంటలు బాగున్నాయని కేటీఆర్ కితాబిచ్చారు’ అందామె. ఇంటికి పెద్దకొడుకయ్యా ‘నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా నాన్న అనారోగ్యంతో చనిపోతూ చిన్న చెల్లె, తమ్ముడు బాధ్యతలను నాకు అప్పగించారు. తమ్ముడిని నా దగ్గరే ఉంచి చదివించి వాడి పెళ్లి చేశాను. చెల్లి పెళ్లిలోనూ నాకు చేతనైనంత సాయపడ్డా. మొన్న ఊళ్లో అమ్మవారి గుడిలో విగ్రహం పెట్టించి, వెండి కిరీటం చేయించా. ఊరంతా కదలివచ్చి అభినందించింది. అంతేకాదు, నాకు ఊరి నుంచి రావాల్సిన మూడున్నర ఎకరాల భూమిని నా కొడుకు వెంకటేశ్ పేరిట ఊరంతా ఒక్కటై చేయించింది’ అందామె. ఒంటరి మహిళలకు భయం వద్దు ‘ఏ కారణం చేతనైనా సమాజంలో మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తే అస్సలు భయపడవద్దు. కష్టపడి చేసే ఏ పనైనా బెరుకు, భయం వద్దు. నిజాయతీగా చేస్తే తప్పకుండా ఎదుగుదల ఉంటుంది. ఆ నిజాయతీ మీకు, మీ పనికి తప్పకుండా గుర్తింపు తీసుకువస్తాయి. ఏనాడూ ఆడిన మాట తప్పకూడదు. అలా చేస్తే మార్కెట్లో, సమాజంలో పలుచనైపోతాం. నేను లక్ష రూపాయల వంటకు ఆర్డర్ తీసుకున్నాక అదేరోజు పని చేయాలంటూ కోటి రూపాయల ఆర్డర్ వచ్చినా తీసుకోను. మాటంటే మాటే.ఆ నిజాయితీ ఉంటే తప్పకుండా పైకి రావచ్చు’ అందామె. యాదమ్మను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? – భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి -
నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
సాక్షి, సిద్దిపేట: ‘భూసేకరణ చట్టం–2013 ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టు కింద ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తాం. ఎవరైనా మిగిలిపోయి ఉన్నవారికి సైతం పరిహారం అందేలా కృషి చేస్తాం. వెం టనే ఆందోళన విరమించుకుని ప్రాజెక్టుల పనులకు సహకరిస్తే.. 18 ఏళ్లు నిండిన వారికి స్థలాలిచ్చి ఇళ్లు కట్టించే అంశాన్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఇళ్లు వారే కట్టుకుంటామంటే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తాం. అర్హులందరికీ ప్రయోజనం అందే విధంగా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తాం..’’అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గౌరవెల్లి భూనిర్వాసితులకు ఎకరానికి రూ.15 లక్షల పరిహారం ఇస్తున్నామని చెప్పారు. బుధవారం సిద్దిపేట జిల్లా మందపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మంత్రి హరీశ్‌రావు చర్చించారు. అంతకుముందు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఇప్పటివరకు 97.82 శాతం భూసేకరణ జరిగిందని, ఈ మేరకు రూ.200 కోట్లు చెల్లించామని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామన్నారు. కొద్ది కుటుంబాలకే పెండింగ్! గౌరవెల్లి ప్రాజెక్టు కోసం 3,900 ఎకరాలకుగాను 3,816 ఎకరాల భూమి సేకరించామని.. కేవలం 84 ఎకరాల నిర్వాసితులు పరిహారం తీసుకోలేదని హరీశ్‌రావు తెలిపారు. మొత్తంగా ప్రాజెక్టు కింద 693 నివాసాలు ముంపునకు గురైతే.. 2015లోనే 683 ఇళ్లకు రూ.83 కోట్ల మేర పరిహారం చెల్లించామన్నారు. ఆర్అండ్ఆర్ (సహాయ పునరావాసం) కింద మొత్తం 927 కుటుంబాలకు పరిహారం చెల్లించామని, మరో 10 కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయని వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం చైనా నుంచి మోటార్లు తెప్పించామని, వాటికి ఉన్న 3 ఏళ్ల వారెంటీ దగ్గరపడుతుండటంతో వెట్‌రన్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మూడేళ్ల వారెంటీ పూర్తయ్యాక.. మోటార్లు నడవకపోతే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. నీళ్లు రావొద్దని ప్రతిపక్షాల కుట్ర కొందరు ఇరిగేషన్ అధికారులను అడ్డుకోవడం వల్లే.. అధికారుల కోరిక మేరకు పోలీసు భద్రత కల్పించామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెళ్లి వివాదం సృష్టించాయని.. హుస్నాబాద్ ప్రాంత రైతులకు నీళ్లు రావొద్దనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ల పనుల సమయంలోనూ రైతులు పోలీసులపై తిరగబడేలా చేసి తప్పుకున్నారని.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నిర్వాసితులకు దండం పెట్టి చెప్తున్నా.. కాంగ్రెస్, బీజేపీల ట్రాప్‌లో పడకండి. సమస్యలుంటే మీ తరఫున ప్రతినిధి బృందం వచ్చి అధికారులతో చర్చించండి. ఎన్నిమార్లు మాట్లాడటానికైనా అధికారులు సిద్ధం. ప్రభుత్వం నిర్వాసితుల పట్ల సానుభూతితో ఆలోచిస్తుంది’’అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. మంత్రితో నిర్వాసితుల చర్చలు బుధవారం గుడాటిపల్లిలో నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి సందర్శించారు. దీక్షలు కాదు మంత్రి హరీశ్‌రావును కలిసి సమస్యలను విన్నవిద్దామంటూ నిర్వాసితులను తీసుకుని ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో సిద్దిపేటకు బయలుదేరారు. పోలీసులు వారిని ఆపారు. 10 మంది నిర్వాసితులు, మరో 10 మంది కాంగ్రెస్ నేతలను తీసుకుని చిన్నకోడురులోని మందపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి హరీశ్‌రావు వద్దకు తీసుకెళ్లారు. అంతా అక్కడే మంత్రితో చర్చలు జరిపారు. నిర్వాసితుల డిమాండ్లను విన్న మంత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
హుస్నాబాద్ రణరంగం
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై మళ్లీ లాఠీచార్జి జరిగింది. పూర్తిగా పరిహారమిచ్చాకే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్ చేపట్టాలంటూ నిర్వాసితుల ఆందోళన.. ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీ.. పరస్పరం రాళ్లదాడులు.. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి.. కొట్టుకుంటూ, లాక్కెళ్లి పోలీస్స్టేషన్లకు తరలించడంతో హుస్నాబాద్ పట్టణం రణరంగంగా మారింది. సోమవారం తెల్లవారుజామున గుడాటిపల్లిలో పోలీసుల అరెస్టులతో మొదలైన ఆందోళన.. మంగళవారం సాయంత్రానికి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెల్లవారుజామున అరెస్టులతో మొదలై గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రధాన కాల్వ పనులపై కోర్టు స్టే ఉండటంతో ట్రయల్‌రన్ నిర్వహించేందుకు మరో కాల్వ నిర్మాణం చేపట్టి, నీళ్లు నింపాలని నిర్ణయించారు. ఇందుకోసం గుడాటిపల్లిలో సేకరించిన భూమిలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేపట్టగా.. నిర్వాసితులు అడ్డుకుని, నిరసన తెలిపారు. అయితే సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భారీగా పోలీసు బలగాలు గుడాటిపల్లికి చేరుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిపేసి.. ఇళ్లలోకి చొరబడి నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ నిర్వాసితులు పాదయాత్రగా హుస్నాబాద్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం హుస్నాబాద్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం కూడా నిర్వాసితులు ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన భూ నిర్వాసితులు ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి.. ఓ వైపు నిర్వాసితుల ఆందోళన కొనసాగుతుండగానే.. మరోవైపు టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలంతా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకోవాలంటూ సమాచారం వెళ్లింది. గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్‌రన్ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డు కుంటున్నాయని, వెంటనే ట్రయల్ రన్ చేపట్టాలంటూ ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం ఇద్దామని.. అంతా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచన వచ్చింది. టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర నేతలు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కూడా అక్కడికి వస్తున్నారని తెలిసిన నిర్వాసితులు.. ఎమ్మెల్యేకు తమ సమస్యలు వివరిస్తామంటూ భారీ ర్యాలీగా క్యాంప్ ఆఫీస్ వైపు బయలుదేరారు. పోలీసులు వారిని క్యాంపు ఆఫీసుకు కొద్దిదూరంలో హన్మకొండ ప్రధా న రహదారిపై అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు ప్రధాని రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టీఆర్ఎస్ శ్రేణులు బయటికొచ్చి.. క్యాంపు ఆఫీస్‌లో పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ప్రాజెక్టు ట్రయల్‌రన్ వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో ర్యాలీగా బయలుదేరారు. బయట నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారని, వెళ్లొద్దని ఏసీపీ, ఇతర పోలీసు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. టీఆర్ఎస్ నేతలు వినలేదు. మరోవైపు ఆందోళన విరమించాలంటూ పోలీసులు కోరినా నిర్వాసితులూ వినలేదు. కాసేపటికే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాలు ఎదురుపడటంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు వచ్చి లాఠీచార్జి మొదలుపెట్టారు. దొరికినవారిని దొరికినట్టు కొడుతూ.. కర్ర, ఫైబర్ లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రధానంగా నిర్వాసితులను ఉరికించి కొట్టారు. కొందరిని ఈడ్చిపారేశారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా నిర్వాసితులపై దాడికి పాల్పడ్డాయి. నిర్వాసితులను కొడుతుంటే వారి కుటుంబ సభ్యులు, మహిళలు అడ్డురాగా వారిపైనా పోలీసులు లాఠీ ఝలిపించారు. కొందరిని క్యాంపు ఆఫీస్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకూ కొట్టుకుంటూ లాక్కెళ్లారు. తమ వారిని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి కొట్టి చంపుతారని ఆందోళన వ్యక్తం చేస్తూ మహిళలు, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని లాఠీలతో చెదరగొట్టి నిర్వాసితులను లోనికి తీసుకెళ్లారు. దీనితో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. నలుగురు మహిళలు స్పృహతప్పి పడిపోగా ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనల్లో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్‌లకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు గుర్తుపెట్టుకుని మరీ కొట్టారు! పోలీసులు గత మూడు రోజులుగా ఆందోళనలో ముందున్న నిర్వాసితులను గుర్తుపెట్టుకుని మరీ లాఠీలు, కర్రలు విరిగేలా కొట్టారని కుటుంబ సభ్యులు, గుడాటిపల్లి గ్రామస్తులు మండిపడ్డారు. తమ వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పరామర్శించారు. కాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం రాత్రి గుడాలిపల్లి నిర్వాసితులను, గాయపడిన మహిళలను పరామర్శించారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతలు కలిసి తమపై దాడి చేశారని మహిళలు రోదిస్తూ గోడు వెళ్లబోసుకున్నారు. రిజర్వాయర్ లెక్క ఇదీ.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గౌరవెల్లి రిజర్వాయర్‌ను 1.14 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2007లో సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 1,870 ఎకరాల భూమికి ఎకరానికి రూ.2.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించి సేకరించారు. 2015లో టీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. దీనితో గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి, మద్దెలపల్లి, చింతలతండా, జాలుబాయితండా, కొత్తపల్లి, సేవనాయక్ తండా, తిర్మల్ తండా, సోమాజి తండాల్లో ఇళ్లు, వ్యవసాయ భూములు పూర్తిగా రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యాయి. రీడిజైన్ కోసం అదనంగా 1,900 ఎకరాలు అవసరమవడంతో.. మొదట 1,600 ఎకరాలను ఒక్కో ఎకరానికి రూ.6.95 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు. గత నవంబర్‌లో మరో 222 ఎకరాలను ఎకరానికి 15 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు. నిర్వాసితుల డిమాండ్లివే! ► భూనిర్వాసితులు తమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన అందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. 2015 నాటికి నిర్వాసితుల్లో మేజర్లకు రూ.8 లక్షల చొప్పున, మైనర్లకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనిని నిర్వాసితులు తిరస్కరించారు. అందరికీ రూ.8 లక్షల పరిహారమివ్వాలని కోరారు. ఈ ఏడేళ్లలో చాలా మంది మేజర్లు అయ్యారు. అందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటున్నారు. ► నిర్వాసితులకు పరిహారం చెల్లించే సమయంలో 57 మంది రైతుల పేర్లు మిస్సయ్యాయని.. మరో 59 మంది వృద్ధులని చెప్పి ప్యాకేజీ అందించలేదని.. వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. ► ఇక 88 ఎకరాలకు చెందిన రైతులు తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ► మరోవైపు అధికారులు మాత్రం భూసేకరణకు సంబంధించి 80శాతం పరిహారం చెల్లింపు పూర్తయిందని, మిగతా వారికి నెలరోజుల్లో చెల్లిస్తామని చెప్తున్నారు. ఇక ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి మైనర్లు తిరస్కరించడం వల్లే చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. -
హుస్నాబాద్‌లో హై టెన్షన్.. పోలీసుల లాఠీఛార్జ్
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భూ నిర్వాసితులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాగా, సోమవారం తెల్లవారుజామున 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో నిర్వాసితులు ఆందోళనలకు దిగారు. మంగళవారం ప్రజా ప్రతినిధులు ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాంపు ఆఫీసు నుండి బయటకు వచ్చిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో వాగ్వాదం జరిగింది. తోపులాట చోటుచేసుకోవడంతో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి కింద పడిపోయారు. అనంతరం నిర్వాసితులను పోలీసులు అడ్డుకుని అనంతరం లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు నిర్వాసితులు, హుస్నాబాద్ ఎసీపీ సతీష్, ఎస్ఐ గాయపడ్డారు. దీంతో ఐదుగురు భూ నిర్వాసిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సిద్దిపేట: హుస్నాబాద్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
-
వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి!
కోహెడ రూరల్ (హుస్నాబాద్): ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు వన్య ప్రాణుల దాడులు. రైతు తమ పంటను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇలాగే కోతులు, అడవి పందుల నుంచి తన పంటను కాపాడు కోవడానికి ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎలుగుబంటి వేషధారణ ద్వారా పంటలను కాపాడుకోవచ్చని గుర్తించాడు. కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి కోతుల బెడద ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లో రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించాడు. పంట రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణ కోసం కూలీని పెట్టుకుని రోజుకు అతనికి రూ.500 చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నాడు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే పది రోజుల వరకు పంటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. (చదవండి: అకాల వర్షంతో పంట నష్టం) -
కన్నీరు పెట్టిస్తున్న వినయ్ సూసైడ్ లేఖ.. ఆ 14 మందే కారకులు..
సాక్షి, సైదాపూర్(హుస్నాబాద్): అర గుంట భూమి కోసం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. తన చావుకు కారకుల పేర్లు సూసైడ్ నోట్లో రాసి, గురువారం ఉదయం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని జాగీర్పల్లి గ్రామానికి చెందిన కమ్మం వినయ్‌కుమార్(34) ఎంబీఏ పూర్తి చేశాడు. మండల కేంద్రంలోని వెంకటసాయి ఫర్టిలైజర్ షాపులో ఆరేళ్లు పని చేశాడు. కొన్ని రోజుల క్రితం పని మానేశాడు. అతడి తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉన్నారు. ఉమ్మడి ఆస్తులు, వ్యవసాయ భూములు పంపకాలు జరిగాయి. చదవండి: (వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..) ఎవరి భూమి వారు కాస్తు చేసుకుంటున్నారు. కాగా వినయ్‌కుమార్ తండ్రి పెద్దన్నకు 20 గుంటల భూమి పట్టా కావడంలేదు. అంతే కాకుండా ఇళ్ల స్థలం రెండు గుంటలు వినయ్ తాత, మేనత్తకు ఇచ్చాడు. ఆమె తమ్మునికి అమ్ముకుంది. తమ్ముడు మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ రెండు గుంటల్లో తన తండ్రికి అర గుంట రావాలని వినయ్‌కుమార్ కొంతకాలంగా మేనత్త, చిన్నాన్నలపై పోరాటం చేస్తున్నాడు. ఈ సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో పాటు ఆరేళ్లు తాను పని చేసిన ఫర్టిలైజర్ షాపు యజమాని తనను దొంగగా, మోసగాడిగా ముద్రవేశాడని మనస్తాపం చెందాడు. చదవండి: (ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..) ‘వేణు అంకుల్ నా గోస తగిలి మీరు, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండమంటూ, తన చావుకు బూర్ల భాస్కర్, కమ్మం సమ్మయ్య, కమల, కమ్మం వినీత్, కమ్మం వివేక్, కమ్మం విశాల్, దొడ్డి సురేష్, దొడ్డి గట్టయ్య, కమ్మం చంద్రయ్య, మహెంద్ర, కమ్మం ఉదయ్, కమ్మం కావ్య, గంజి అలేఖ్యలు కారకులని, తన భూములు ఆక్రమించుకున్నారు’ అని సూసైడ్‌లో పేర్కొన్నాడు. మృతుడికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి తల్లి కమ్మం జయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధూకర్‌రెడ్డి తెలిపారు. -
భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం.. వేధింపులతో
సాక్షి, హుస్నాబాద్(మెదక్): అదనపు వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అక్కన్నపేట మండలం కేశనాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధి గొల్లపల్లిలో జరిగింది. శుక్రవారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలానికి చెందిన ధనూజకు అక్కన్నపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సంజీవ్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో వధువు తల్లిదండ్రులు సంజీవ్‌కు రూ.12 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చారు. కొన్ని నెలలు వీరి సంసారం ససజావుగా సాగింది. ఇటీవల భర్త సంజీవ్, అతడి తల్లిదండ్రులు అదనపు కట్నం తీసుకోరావాలని ధనూజను వేధిస్తున్నారు. అంతేకాకుండా సంజీవ్‌కు గ్రామంలోని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తరచూ భార్యను వేధించేవాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి తల్లి కల్లూరి అయిలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. చదవండి: మహిళపై కన్నేసిన హెడ్ కానిస్టేబుల్.. కంప్లైట్ ఇచ్చేందుకు వస్తే లోబర్చుకొని -
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది: స్మృతి ఇరానీ
సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తొలి విడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నేడు ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం హుస్నాబాద్‌లో భారీ బహరంగ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ సభకు హాజరయ్యారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు స్మృతి ఇరానీ. ఎంఐఎంకు టీఆర్ఎస్ భయపడుతుందేమో కానీ బీజేపీ భయపడదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమం నుంచి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని మళ్లీ మోసం చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం. నిధులు కేసీఆర్ జేబులోకి వెళ్తున్నాయి. నియామకాలు కేసీఆర్ ఇంట్లోకి వెళ్లాయి’’ అన్నారు. (చదవండి: కష్టాలు కదిలించాయి.. కన్నీళ్లు తెప్పించాయి) ప్రగతి భవన్లో కాషాయ జెండా ఎగరవేసే వరకు యాత్ర కొనసాగిస్తాం: డీకే అరుణ నియంత పాలన అంతం చేసేందుకు ప్రారంభించిందే ప్రజాసంగ్రామ యాత్ర.. ప్రభుత్వంలోకి వచ్చే వరకూ దశలవారీగా యాత్ర చేపడతాం అన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెలంగాణ రావాలన్నారు. ఇప్పుడేమో అన్ని ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారు అని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడు. తెలంగాణలో ఆదాయం ఎటు పోతుంది.. గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు. దళిత బందు హుజూరాబాద్ లోనే ఎందుకు... ప్రతి పేదవారికి ఆర్థిక సాయం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. (చదవండి: క్షమించండి.. ఈరోజు సోమవారమా?!) ‘‘ఏ పథకానికీ పైసలు లేవు అంటడు.. కాని హుజూరాబాద్ ఎన్నిక రాగానే కేసీఆర్‌కు దళిత బంధు గుర్తుకు వచ్చింది. ఏం చేసైనా ఈటెలను ఓడించాలని చూస్తున్నారు. ఎన్నికల లోపు దళిత బందు అన్ని జిల్లాల్లో అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఈటల ముందుండి పోరాటం చేశాడు. పార్టీలో నిరంకుశత్వం.. అవినీతి గురించి మాట్లాడుతున్నాడని.. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఈటలను బయటకు పంపిండు. కేసీఆర్ ఎక్కడ పోయినా సోది తప్ప ఏదీ చెప్పడు. కథలతోనే ప్రజలను మోసం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నిదులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు’’ అని తెలిపారు. చదవండి: సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు ! -
నేడు హుస్నాబాద్‌లో బీజేపీ సభ
సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తొలి విడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నేడు ముగియనుంది. ఆగస్టు 28న హైదరాబాద్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు వింటూ వారికి భరోసానిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సంజయ్ పాదయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో ఇద్దరు మాజీ సీఎంలు, ఆరుగురు కేంద్ర మంత్రులు సహా 24 మంది జాతీయ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. నేటి రోడ్‌షో, సభను లక్ష మందితో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతీఇరానీ రోడ్‌షో, సభకు హాజరుకానున్నారు. హుస్నాబాద్ అంతా ప్లెక్సీలు, జెండాలతో కాషాయమయం అయింది. సభను విజయవంతం చేయాలని యాత్ర ఇన్చార్జి మనోహర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గౌరవెల్లి, గండిపల్లిపై సీఎం వివక్ష... గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన వివక్ష చూపుతూ హుస్నాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభమై 12 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తి చేయకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. శుక్రవారం 35వ రోజు సిద్దిపేట జిల్లా పొట్లపల్లి నుంచి హుస్నాబాద్ వరకు యాత్ర సాగించిన సంజయ్.. దారిపొడవునా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ‘1.14 టీఎంసీ నీటి సామర్థ్యంతో గౌరవెల్లి, 0.4 టీఎంసీ సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులకు 2009లో శంకుస్థాపన చేశారు. రైతుల నుంచి 1,836 ఎకరాలు సేకరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీడిజైన్ పేరుతో 2017లో 8.23 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతూ పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల నుంచి అదనంగా 2 వేల ఎకరాలు సేకరించారు. దీంతో 7 గిరిజన తండాలు ముంపునకు గురవుతున్నా బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేయకపోవడం సిగ్గుచేటు. కేసీఆర్ నియోజకవర్గానికి, అల్లుడి నియోజకవర్గానికి ఒక న్యాయం.. హు స్నాబాద్‌కు ఇంకో న్యాయమా?’అని హెచ్చరించా రు. కాగా పాదయాత్ర విజయవంతంగా సాగ డం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి బండి సంజయ్‌ను అభినందించారు. ఇక ముందు రాష్ట్రం లో ఇలాగే ముందుకు సాగాలని సూచించారు. పాదయాత్ర సాగిందిలా.. మొత్తం రోజులు: 36 (మధ్యలో రెండురోజులు విరామం) కిలోమీటర్లు: 438 జిల్లాలు: 8 (హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట) అసెంబ్లీ నియోజకవర్గాలు: 19 (చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్) పార్లమెంట్ నియోజకవర్గాలు: 6 (హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్, కరీంనగర్) రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల నుంచి వినతులు: 11,675 -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
మతిస్థిమితం లేకనే చంపేసింది
అక్కన్నపేట(హుస్నాబాద్): తల్లికి మతిస్థిమితం సరిగా లేకనే కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపిందని అడిషనల్ ఎస్పీ సందేపోగు మహేందర్ అన్నారు. అక్కన్నపేట మండలం మల్‌చెర్వుతండాలో తొమ్మిదేళ్ల ‘కూతురునే కడతేర్చిన కన్నతల్లి’ జరిగిన దారుణ సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం హుస్నాబాద్‌లోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తల్లి మమత అలియాస్ రాణిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన వివరాలు వెల్లడించారు. భూక్య తిరుపతి, మమత దంపతుల పెద్ద కూతురు భూక్య సోని(09) వంట చేసేందుకు ఇంట్లో బియ్యం తీస్తున్న క్రమంలో కోపోద్రికురాలై తల్లి రోకలిబండతో కూతురి తలపై బలంగా కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిందన్నారు. తల్లికి సరిగ్గా మతిస్థిమితం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని విచారణలో తెలిందన్నారు. ఈ సమావేశంలో సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, ఎస్సై కొత్తపల్లి రవి పాల్గొన్నారు. -
నిన్న రోడ్డెక్కిన తండ్రి.. నేడు చెట్టెక్కిన కొడుకు
హుస్నాబాద్: తండ్రీకొడుకులు రోడ్డెక్కారు. ఆకలిబాధతో అలమటిస్తున్నానని తండ్రి అంటుండగా, అదేం కాదు, అనవసరంగా బద్నాం చేస్తున్నాడని కొడుకులు అంటున్నారు. తండ్రి నిరాహారదీక్ష చేపట్టగా, తండ్రి వైఖరిని నిరసిస్తూ కొడుకు చెట్టెక్కి ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చర్చనీయాంశమైంది. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామికి ఇద్దరు కొడుకులు. కొడుకులను పెంచి పోషించి ప్రయోజకులుగా చేసి, ఆస్తులు కూడబెట్టి ఇచ్చినా.. బుక్కెడు బువ్వ పెట్టడం లేదని తండ్రి ఆదివారం ఆమరణ దీక్ష చేట్టారు. ఈ నేపథ్యంలో తమను కావాలనే అభాసుపాలు చేస్తున్నాడని పెద్ద కొడుకు సంతోష్ తమ ఇంటి ముందున్న చెట్టెక్కాడు. విషయం తెలుసుకుని వచ్చిన ఎస్ఐ శ్రీధర్ సర్దిచెప్పడంతో సంతోష్ కిందికి దిగివచ్చాడు. స్వామి, ఆయన కొడుకులు సంతోష్, సుధాకర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆస్తి పంపకాలు, ఇతర సమస్యలను తామే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని ఒప్పుకున్నారని ఎస్ఐ తెలిపారు. -
4 కోట్ల ఆస్తులు: బుక్కెడు బువ్వ పెట్టరూ..
హుస్నాబాద్: కొడుకులను పెంచి ప్రయోజకులను చేస్తే అప్పులు అంటగట్టడమే కాకుండా కనీసం బు క్కెడు బువ్వ కూడా పెట్టడం లేదంటూ రూ. 4 కోట్ల ఆస్తులున్న ఓ తండ్రి పడుతున్న ఆవేదనకు అద్దం పట్టే చిత్రమిది. అన్నం వండుకోవడానికి కూడా చేత కాని పరిస్థితుల్లో ఉన్న తనకు తిండి పెట్టాలని బతిమిలాడినా పట్టించుకోవడం లేదంటూ ఓ పెద్దా యన ఆమరణ దీక్షకు దిగిన వైనమిది. సిద్దిపేట పట్టణానికి చెందిన కొత్తకొండ స్వామి అనే వృద్ధు డు తన కుమారులైన సంతోశ్, సుధాకర్ల మనసు కరగాలని ఆదివారం రాత్రి వారి ఇంటి ముందు బ్యానర్ కట్టుకొని ఇలా నిరశనకు దిగాడు. కౌలురైతు ఆత్మహత్యాయత్నం కోనరావుపేట: కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షంలో తడిసి మొలకెత్తడంతో ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆసరి అంజయ్య కొంత భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పండిన ధాన్యాన్ని సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కొద్దిరోజుల క్రితం పోశాడు. కొనుగోళ్లలో జాప్యం జరగగా.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అతని ధాన్యం తడిసి మొలకెత్తింది. దీం తో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో లేరోనని ఆందోళన చెందిన అంజయ్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కొనుగోలు కేంద్రం సిబ్బందిని వివరణ కోరగా.. ధాన్యాన్ని తూర్పారబడితే తూకం వేస్తామని సదరు రైతు కుమారుడికి సమాచారం ఇచ్చామని, అయినా ఆ రైతు రాకపోవడంతో తూకం వేయలేదని సమాధానమిచ్చారు. చదవండి: త్వరలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ -
కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు
సాక్షి, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన మాసున శ్రీనివాస్ (38) పాము కాటుకు గురై మృతి చెందగా, కూతురే కొడుకై తండ్రి చితికి నిప్పు పెట్టింది. శ్రీనివాస్ జీవనోపాధి కోసం హన్మకొండలో ఓ మడిగను అద్దెకు తీసుకొని కంకబొంగులతో గంపలు, తడకలు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అద్దెకు ఉంటున్న మడిగలో సోమవారం రాత్రి శ్రీనివాస్ పాము కాటుకు గురై మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు స్వగ్రామం హుస్నాబాద్‌కు తీసుకొచ్చారు. మృతుడి శ్రీనివాస్‌కు భార్య స్వరూప, కుమార్తెలు అనూష్క, అక్షయలు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అనుష్క తండ్రి అంత్యక్రియలు చేసి చితికి నిప్పు పెట్టడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. చదవండి: ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్..మహిళా సర్పంచ్ మృతి -
ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు.. సిద్దిపేటలో కలకలం
హుస్నాబాద్: టాస్క్‌ఫోర్స్ సోదాల్లో ఓ ఆర్ఎంపీ ఇంట్లో రూ.66.11 లక్షలు గుర్తించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆర్ఎంపీ కొడం ఆంజనేయులు ఇంట్లో ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్రోడ్లో క్లినిక్ నడిపిస్తూ, వినాయకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు. ఈ సోదాల్లో రూ.66,11,100 స్వాదీనం చేసుకొని సీజ్ చేసినట్లు మహేందర్ తెలిపారు. సీజ్ చేసిన డబ్బులను ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నట్లు తెలిపారు. కాగా, ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సంతోష్‌ను చంపింది సోదరుడే.. -
బావిలో పడిపోయిన క్రేన్
సాక్షి, హుస్నాబాద్: పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన యత్నం వారి ప్రాణాలనే హరించింది. బావిలో పనిచేస్తుండగా క్రేన్ మీద పడటంతో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లునాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. లావుడ్య దేవోజీ, ఇస్లావత్ దుర్గా బావ, బావమరుదులు. ఇద్దరికీ కలిపి పక్కపక్కనే మూడున్నర ఎకరాల పొలం ఉంది. అందులో వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇటీవల పెరిగిన ఎండలకు బావిలో నీరు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు నీటి కోసం బావిని మరింత లోతుగా తవ్వేందుకు క్రేన్‌ను కిరాయికి తెచ్చుకున్నారు. కూలీలను పెట్టుకునే స్తోమత లేకపోవడంతో దేవోజీ భార్య చాంది (45), కుమారుడు సాయికుమార్, తన సోదరుడు లావుడ్య బీమా (50), బంధువులు ఇస్లావత్ ఎంక్యా, లావుడ్య సరోజనను సాయంగా రప్పించుకున్నారు. 15 రోజుల నుంచి బావిలో బండరాళ్లను తొలిచే పనులు చేస్తున్నారు. గురువారం రాళ్లను తవ్వేందుకు దేవోజీ, బీమా, ఎంక్యా బావిలోకి దిగారు. పైన క్రేన్ ఆపరేటర్‌కు సాయంగా దుర్గా, చాంది, సాయికుమార్, సరోజన ఉన్నారు. క్రేన్ డబ్బాలో పెద్ద బండరాయి వేసి బయటకుతీసే యత్నంలో పైభాగంలో క్రేన్‌పై అందరూ నిలుచొని బరువును సరిచూశారు. అనంతరం బండరాయిని క్రేన్ ద్వారా పైకి తెచ్చిన తర్వాత దాన్ని పక్కకుతోసే సమయంలో క్రేన్‌పై నిలబడిన చాంది కిందికి దిగింది. దీంతో బరువు అంచనా తప్పి క్రేన్ మొత్తం బావిలో పడిపోయింది. చాంది క్రేన్‌తో సహా బావిలోపడి ప్రాణాలు కోల్పోయింది. బావిలో పనిచేస్తున్న వారిపై ఒక్కసారిగా క్రేన్ పడటంతో బీమా అక్కడికక్కడే మరణించగా ఎంక్యాకు తీవ్ర గాయాలయ్యాయి. బావిపైన ఉన్న వారు కేకలు వేయడంతో తండా నుంచి స్థానికులు వచ్చారు. తాళ్ల సాయంతో బావిలో ఉన్న వారిని బయటకు తీసి 108 వాహనం ద్వారా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఇస్లావత్ ఎంక్యను వరంగల్ ఎంజీఎంకు తరలించగా, లావుడ్య సరోజనను కరీంనగర్ ఆస్పతికి తరలించారు. ప్రమాద ఘటనపై ఎస్సై శ్రీధర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వారెవ్వా.. ఎల్లవ్వ
ఆమె వయస్సు 65 ఏళ్లు. అయితేనేం వ్యవసాయ పనుల్లో తాను ఎవరికీ తక్కువకాదు అన్నట్లు పొలం పనులు చేస్తోంది. చిన్న వయసులోనే తల్లి దూరమైంది. అప్పటినుంచే కష్టాలతో సావాసం చేయడం నేర్చుకుంది. 15వ ఏటనే పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టగానే తాగుబోతు భర్త విడిచిపెట్టేశాడు. దీంతో పిల్లలను తీసుకుని తండ్రి దగ్గరకు చేరింది. వృద్ధాప్యం లో తండ్రి కష్టం చూడలేక తాను వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యతలను మోస్తూ ఏటికి ఎదురీదుతోంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌కు చెందిన మంచాల ఎల్లవ్వ. ఈ వయసులోనూ నెలకు రూ.8 వేల చొప్పున వ్యవసాయ పనులు చేయడానికి ఓ ఆసామి దగ్గర పాలేరుగా పని చేస్తూ మగవారికి సరితోడుగా పనులు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ఏటికి ఏతం పెట్టి పంటల సాగు భర్త నుంచి విడిపోయిన తర్వాత అయ్య వ్యవసాయ భూమి పక్కనే రెండు ఎకరాల భూమిని బిడ్డకు ఇవ్వడంతో ఎల్లవ్వ చెరువుకు ఏతం పెట్టి రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేసి ధాన్యం పండించగా వచ్చిన వాటిని విక్రయించి ఒంటిచేత్తో పిల్లలను పోషించుకుంటూనే చదువులు కూడా చెప్పించింది. అయ్య నేర్పిన మోట తోలుడు అనుభవమో ఏతం వేసిన అనుభవమో ఆమెకు బతుకు బాటను చూపించాయి. 15 ఏళ్ల వరకు వ్యవసాయం చేసి పిల్లలను పెద్ద చేసి 25 ఏళ్ల క్రితమే కూతురుకు రూ.50వేల కట్నం ఇచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు బిడ్డ కూతురే డిగ్రీ చదువుతోంది. కొడుకు రమేశ్ పెద్దగా చదువుకోకపోవడంతో ఆటో కొనిచ్చి బతుకు చూపించిన తాను ఇంటి దగ్గర కూర్చోలేక తన వ్యవసాయ బావి దగ్గర ఓ ఆసామికి వ్యవసాయ పనులు చేయడానికి పసల్ అంటే ఒక సీజ¯Œ కు రూ.32వేలకు పాలేరుగా పనికి కుదిరి సాగు పనులు చేస్తోంది. ఎన్ని కష్టాలొచ్చినా అధైర్యపడకుండా మట్టిని నమ్ముకొని చెమటోడ్చి 45 ఏళ్లుగా కష్టాలతో కాపురం కొనసాగిస్తోంది. పిల్లలే నా ఆస్తి పేదరికంలో పుట్టిన ఎల్లవ్వకు చిన్నప్పటి నుంచి కష్టాలే ఎదురొచ్చినా ఎక్కడా రాజీపడకుండా మొండి ధైర్యంతో శ్రమను నమ్ముకొని సేద్యం చేసి పిల్లలను సాదుకుంది. పిల్లలే నాకు కోట్ల ఆస్తి అన్నట్లు మనుమలతో ముచ్చటిస్తూ మురిసిపోతోంది. చెరువు దగ్గర తండ్రి ఇచ్చిన రెండు ఎకరాల భూమి తప్ప ఎల్లవ్వకు ఎలాంటి ఆస్తులు లేవు. చెరువు నిండితే ఏతం ఏసుకొంటేనే పొలం పారుతుంది. 20 ఏళ్ల క్రితం కరువచ్చి ఎవుసం సాగకపోవడంతో ఎల్లవ్వ పొరుగువారికి వ్యవసాయ పనులు చేయడానికి పాలేరుగానే పని చేసి పిల్లలను పోషించుకుంది. ఇప్పుడు చెరువు నిండటంతో మళ్లీ తన పొలంలో వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతోంది. ధైర్యం చెప్పే తండ్రి అసువులు బాసినా ఎల్లవ్వ గుండె చెదరలేదు. అయ్య నేర్పిన వ్యవసాయ పనులనే బతుకు బాటలుగా వేసుకొని ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి వృద్ధాప్యంలో సైతం వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి బాసటగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అస్తులు కూడబెట్టాలనే ఆశ ఎన్నడూ లేదు నా చిన్నప్పటి నుంచి అయ్యతోనే ఎవుసం పనులకు పోయేది. అయ్య మోట తోలితే సద్ది తినే యాళ్లకు వెళ్లి నేను మోట తోలి పొలానికి నీళ్లు పెట్టేదాన్ని. చెరువు మీది పొలానికి ఏరుకు ఏతం పెట్టి రెండు ఎకరాలకు నీళ్లు పారించేదాన్ని. ముసిముసి మబ్బులోనే పొలం కాడికి పోయి సాయంత్రం కనుమసుక అయ్యేదాకా ఏతం ఏసి ఇల్లు చేరుకోనేది. ఎనుక ముందు దిక్కు అసరా లేని దాన్ని. పిల్లలు, నేను బతికితే చాలనుకున్న. అస్తులు కూడబెట్టాలనే ఆశ ఎప్పుడు రాలేదు. ఇద్దరు మనుమలు, ఇద్దరు మనుమ రాళ్లే నేను సంపాదించిన అస్తి. – మంచాల ఎల్లవ్వ, మహిళా రైతు – దుండ్ర ఎల్లయ్య, సాక్షి, హుస్నాబాద్ రూరల్ -
వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ సమీపంలో ఎనిమిది నెమళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేగింది. వేటగాళ్ల ఉచ్చులో పడ్డాయా? లేక బర్డ్‌ఫ్లూ వ్యాధితో చనిపోయాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. రెండేళ్లు సమృద్ధిగా వర్షాలు కురవడంతో హుస్నాబాద్ ప్రాంతంలో పంట పొలాలు, పచ్చటి అడవుల విస్తీర్ణం పెరిగింది. దీంతో నెమళ్ల సంఖ్య పెరిగింది. అయితే.. నెమళ్లు మృత్యువాత పడటం పలు అనమానాలకు తావిస్తోంది. పంటలు కోతకొచ్చే సమయంలో వాటిపై చల్లిన విషపు గుళికలు, రసాయనాలు కలిపిన నీళ్లు తాగడంతో మృతి చెందిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అలాంటప్పుడు నెమళ్లు మృతి చెందే అవకాశం లేదని చెబుతున్నారు. వేటగాళ్లు వేరుశనగ, మొక్కజొన్న గింజలకు విషపదార్థాలు కలిపి నెమళ్లు సంచరించే ప్రదేశంలో చల్లడంతోనే వాటిని తిని మృత్యువాత పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. మాంసం సరఫరాపై ఆరా.. కొంత కాలంగా జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాల్లో నెమలి మాంసం దొరుకుతుందనే ప్రచారం జరుగుతోంది. దాబాలకు నెమలి మాంసం సరఫరా చేసే వేటగాళ్లే ఈ పాపానికి ఒడిగట్టి ఉంటారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి అడవి పంది, కుందేలుతో పాటు, నెమలి మాంసం కూడా సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెమలి మాంసం ప్రియం గా ఉండటంతో అధిక లాభాలు గడించేందుకు వేటగాళ్లే ఈ పని చేసి ఉంటారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వందల సంఖ్యలో పక్షులు మృతి చెందుతాయని, హుస్నాబాద్‌లో చనిపోయిన నెమళ్లు వేటగాళ్లు ఎరవేసిన విషం కలిపిన గింజలు తినే చనిపోయాయని పలువురు స్థానికులు అంటున్నారు. శాంపిల్స్ సేకరించాం అనుమానాస్పదంగా మృతి చెందిన 8 నెమళ్లకు మంగళవారం పోస్టుమార్టం చేశాం. నెమళ్ల కడుపులో మొక్కజొన్న గింజలు ఉన్నాయి. శాంపిళ్లను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తాం. ఇరవై రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగా నెమళ్లు ఎలా మృతి చెందాయో నిర్ధారించొచ్చు. – డాక్టర్ విజయ్ భార్గవ్, పశువైద్యాధికారి, హుస్నాబాద్ -
బిగ్‌బాస్ : సోహైల్‌కు ఫ్యాన్స్ ఘన స్వాగతం
హుస్నాబాద్: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్తున్న సోహైల్‌కు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అభిమానులు స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడారు. కాగా సోహైల్‌కు స్నేహితుడు ఒకరు అతని వాహనంలో ప్రయాణించడంతో.. స్నేహితుడి స్వగ్రామం హుస్నాబాద్ కావడంతో అతని కోరిక మేరకు హుస్నాబాద్ నుంచి వెళ్దామని కోరడంతో సోహైల్ వరంగల్ నుంచి హుస్నాబాద్ మీదుగా కరీంనగర్‌కు వెళ్లేందుకు పయనమయ్యాడు. అప్పటికే తన స్నేహితుడి సమాచారం మేరకు అయనను కలుసుకునేందుకు హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు సిద్ధమయ్యారు. అంబేడ్కర్ చౌరస్తాలో సోహైల్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బిగ్‌బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, చివరకు 5గురు టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్‌గా నిలిచారు. కాగా చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారిలో సోహైల్ అంగీకరించడంతో అతను రూ.25లక్షలు ప్రైజ్‌మనీ పొందాడు. -
జలియన్ వాలాబాగ్‌ను మించిన నరమేధం
సాక్షి, మద్దూరు(హుస్నాబాద్): జలియన్ వాలాబాగ్ సంఘటనని తలపించిన వీరబైరాన్‌పల్లి నెత్తుటి చరిత్రకు నేటితో 72 ఏళ్లు నిండాయి. రజాకారుల పాశవిక దాడులను ఎదిరించి పోరాడిన బైరాన్‌పల్లి వీరుల ప్రాణత్యాగం మరువలేనిది. బైరాన్‌పల్లి మాతృభూమి విముక్తి కోసం 118 మంది యోధులు నేలకొరిగారు. 1947 ఆగస్టు15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తుండగా నిజాం రాజు గుప్పిట్లో ఉన్న తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకారుల దురాగతాలకు బలై బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిసింది. నిజాం సైన్యాధిపతి ఖాసీం రజ్వీ సైనికులు (రజాకార్లు)గ్రామంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 1,200 మంది సైన్యంతో 1948 ఆగస్టు 27న తెల్లవారు జామున 4 గంటలకు గ్రామాన్ని చుట్టు ముట్టారు. వెంటనే దళా కమాండర్ ఇమ్మడి రాజిరెడ్డి ప్రజలంతా తగిన రక్షణలో ఉండాలని కోరుతూ నగర మోగించారు. గ్రామస్తులంతా బురుజు వద్ద గడీలోకి పరుగులు తీశారు. యువకులు గ్రామానికి నాలుగు వైపులా కాపు కాసి శత్రువులను గ్రామంలోనికి రాకుండా చూడాలని హెచ్చరికలు జారీ చేశారు.గ్రామాన్ని చుట్టుమూట్టిన రజాకార్లును తరిమి వేయడానికి బురుజు పై నుంచి కాల్పులు ప్రారంభించారు. గ్రామస్తులు ఏవైపు నుంచి కాల్పులు జరుపుతున్నారో చూసి రజాకార్లు కూడా కాల్పులు ప్రారంభించారు. రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికిన్నట్లుగా చంపారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ బురుజు పైనున్న కొందరిని కిందకు దింపి వరుసగా నిల్చోబెట్టి దారుణంగా కాల్చి చంపి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. శవాల చుట్టూ బతుకమ్మ ఆట.. బురుజు నుంచి భయంతో పరుగులు పెతున్న మహిళలను వెంటాడి పట్టుకున్నారు. అనేక మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. గుట్టలుగా పడి ఉన్న శవాల చుట్టూ మహిళలను వివస్తలను చేసి బతుకమ్మ ఆటలు ఆడించి కసి తీర్చుకున్నారు. 118 మంది గ్రామస్తులు వీరమరణం పొందారు. నిజాం రజాకార్లు 25 మంది మృతి చెందారు. పోరాటానికి గుర్తింపు కరువు జలియన్‌వాలాబాగ్ ఘటనను మించిన బైరాన్‌పల్లి పోరాటాన్ని ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం శోఛనీయమని సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.అమరుల కుటంబలను ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో నేటికీ ఆ కుటుంబలు దయనీయ పరిస్థితిలో కాలం వెల్లదీస్తున్నాయి. స్వరాష్ట్రం కోసం సాగిన తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన వీర బైరాన్‌పల్లి పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని పలువురు కోరుతున్నారు. కళ్లముందు కదలాడుతున్నాయి నాటి రజాకార్ల దురాగతాలు నేటికి కళ్ళ ముందు కదలాడుతున్నట్లు ఉంది. గ్రామస్తులను బురుజుపై నుంచి దించి వరుసగ నిలబెట్టి కాల్చిచంపి వారు పైశాచిక ఆనందం పొందారు. ఒక్క రోజు 118 మందిని కోల్పోయి గ్రామం శవాల దిబ్బగా తయారైన ఘటన నేటికి కళ్ళముందు మెరుస్తుంటుంది. – వంగపల్లి రాజమ్మ, స్వాతంత్య్ర∙సమరయోధురాలు, బైరాన్‌పల్లి సమరయోధుల కుటుంబాలను ఆదుకోవాలి ఖాసీం రజ్వీ వారసులకు ఎదురు నిల్చి గ్రామం కోసం ప్రాణలు వదిలిన సమరయోధుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. జలియన్ వాలాబాగ్ ఘటనను పోలిఉన్న ఉధంతానికి ఎదురోడి తమ ప్రాణలు లెక్క చేయకుండా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో పాటు ఆగస్టు 27 జరిగిన పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. – బండి శ్రీనివాస్, సర్పంచ్ బైరాన్‌పల్లి -
ఆఖరి నిమిషంలో ఆశలు ‘గల్లంతు’
కోహెడ రూరల్ (హుస్నాబాద్) : గంట గంటకూ ఉత్కంఠ.. ఓ వైపు దూసుకొస్తున్న వరద ప్రవాహం.. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటల పాటు చెట్టు కొమ్మలను పట్టుకుని..బిక్కుబిక్కుమంటూ గడిపాడో లారీ డ్రైవర్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రెస్క్యూ టీం అధికారులు కాపాడే ప్రయత్నంలో తాడు తెగి కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోతిమొగ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలకు కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు ఇసుక లారీ (టీఎస్02–యూబీ1836) లోడ్‌తో వంతెనపై నుంచి వెళ్తోంది. ' మొత్తం 8 లారీల్లో ఐదో లారీ వాగు దాటే క్రమంలో వర ద ఉధృతికి కొట్టుకుపోయింది. క్లీనర్ ధర్మజీ ప్రమాదాన్ని పసిగట్టి లారీ లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్ శంకర్ (35) వరదలో కొట్టుకుపోయి ముళ్ల చెట్టును పట్టుకుని 12 గంటల పాటు సహాయం కోసం నిరీక్షించాడు. క్లీనర్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఎస్ఐ రాజ్‌కుమా ర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల సమయంలో మంత్రి హరీశ్‌రావుకు స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన మంత్రి.. డ్రైవర్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌లను ఆదేశించారు. తాడు తెగడంతో.. శనివారం ఉదయం 11 గంటల సమయం లో ఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్, వరంగల్ నుంచి రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లను రప్పించారు. డ్రైవర్ శంకర్ వద్దకు తాడు సహాయంతో ట్యూబ్‌ను వదిలారు. రబ్బరు ట్యూబ్‌ను పట్టుకుని మధ్య వరకు రాగానే ప్యాంటుకు కంప తట్టుకొని తాడు తెగి నీటి లో గల్లంతయ్యాడు. హెలికాప్టర్లో అధికారులు వాగు చుట్టూ గాలించినా ఫలితం లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. -
వేడినీళ్లలో పడి చిన్నారి మృతి
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్) : ఆభం శుభం తెలియని ఓ పసివాడు ఆడుకుంటూ వేడినీళ్లపైపడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద సంఘటన అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండా గ్రామపంచాయితీ పరిధిలోని బాలునాయక్‌తండాలో నెలకొంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్–ముని దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అందులో చిన్న కుమారుడు ధరావత్ సాయికుమార్(4) స్నానం కోసం ఉడుకుతున్న వేడినీళ్లు మీద పడి మృతి చెందాడు. ఈ నెల 26న ఇంటి ముందు పొయిపై మరుగుతున్న వేడినీళ్లపై ఆడుకుంటూ అటూగా వెళ్లిన బాలుడు గిన్నెపై పడ్డాడు. దీంతో ఆ బాలుడుకి ఒంటిపై వేడినీళ్లు పడి చర్మం తీవ్రంగా గాయపడింది. హుటాహుటిన తల్లిదండ్రులు ముందట హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయికుమార్ మృతి చెందడంతో తండాలో విషాదఛాయాలు అలుముకున్నాయి. నీన్నే చూస్తూ బతుకుతున్నం కొడుకా.....నాలుగేళ్లకే నూరేల్లు నిండాయా కొడుకా...ఇగ మేము ఎవరి కోసం బతకాలి బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది. -
హుస్నాబాద్‌లో యువకుడి దారుణ హత్య
-
అక్కన్నపేటలో ఏకే–47 కాల్పులు
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్/ అక్కన్నపేట : హుస్నాబాద్‌లో ఏకే–47 శబ్దం వినిపించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గొర్రెల కాపరిగా ఉంటున్న వ్యక్తి ఏకే–47 గన్ పట్టుకొని తిరగడం, చిన్న గొడవ పెద్దది కావడంతో ఎదుటి వారిపై కాల్పులు జరిపిన సంఘటన గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిమెంట్ ఇటుకల చేబదులుపై తలెత్తిన ఓ గొడవ పెద్దదై ఏకే–47 గన్‌తో కాల్పుల వరకు వచ్చింది. కోహెడకు చెందిన దేవుని సదానందం అక్కన్నపేటలోని తన మేనమామ గుంటి వెంకటయ్య ఇంటికి 2010లో వచ్చి పదేళ్లుగా గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. అక్కన్నపేటకు చెందిన గుంటి గంగరాజు వెంకటయ్య వద్ద సిమెంట్ ఇటుకలను చేబదులు తీసుకున్నాడు. తర్వాత ఇటుకల విషయంలో సదానందం, గంగరాజు మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో కోపంగా ఉన్న సదానందం బుధవారం గంగరాజు తల్లి ఎల్లవ్వ వద్దకు తల్వార్‌తో వెళ్లి చంపుతానని బెదిరించాడు. అలాగే గురువారం రాత్రి సదానందం నల్లటి దుస్తులు, తలకు నల్లటి క్యాప్ ధరించి, భుజానికి ఏకే–47 తుపాకీ వేసుకొని అది పని చేస్తుందా లేదా అని ఇంటి ముందు నేలకేసి కాల్చాడు. ఈ శబ్దానికి ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై గంగరాజుకు చెప్పారు. దీంతో గంగరాజు, కుటుంబ సభ్యులు భయంతో ఇంటి తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. గంగరాజు ఇంటికి వచ్చిన సదానందం తుపాకితో కిటికీ నుంచి ఇంట్లోకి కాల్పులు జరిపి పరారయ్యాడు. మాజీ మావోయిస్టుగా అనుమానం సదానందానికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే స్వస్థలం కోహెడలో ఉన్న సమయంలోనే సదానందం పదేళ్లు కన్పించకుండా పోయాడని తెలుస్తోంది. తర్వాత తిరిగి వచ్చి అక్కన్నపేటలో ఉంటున్నాడు. అయితే అతను గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాయమైన ఏకే–47 ఇదేనా.? గతంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్న తుపాకులను సిద్దిపేట జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు పం పించారు. ఈ సందర్భంగా ఒక ఏకే–47, మరో ఎస్ఎల్ఆర్ తుపాకీ మాయమైంది. గురువారం అక్కన్నపేటలో ఏకే– 47 గన్ కాల్పుల ఉదాంతం బయటకు రావడంతో కనిపించకుండా పోయిన గన్ ఇదేనా అనే చర్చ జరుగుతోంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎస్సై పాపయ్యనాయక్ ఘటనాస్థలాన్ని పరిశీలిం చారు. అక్కడ 3 తుపాకీ గుండ్లతో పాటు తుపాకీ బెల్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదా నందం ఇంటిని సోదాచేశారు. ఇంటిలో తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదానందంకోసం గాలిస్తున్నారు. సిద్దిపేట ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత ఈ ఘటనపై ఆరా తీశారు. గంగ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడం కోసం 3 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. త్వరలో కేసును ఛేదిస్తామని ఇన్చార్జి సీపీ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల అదుపులో నిందితుడు సదానందం? ఇదిలా ఉండగా పరారైన నిందితుడు దేవుని సదానందంను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సదానందం ఇద్దరు భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా అదే సమయంలో గుర్తు తెలియని నంబర్ ద్వారా సదానందం ఇద్దరు భార్యల్లో ఒకరికి ఫోన్ చేసినట్లు తెలిసింది. అక్కడే ఉన్న పోలీసులు సదానందం చేసిన నంబర్‌ను ట్రేస్ చేసి అతడిని పట్టుకున్నట్లు సమాచారం. అతడిని కోహెడ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపిన పోలీసులు అక్కడి నుంచి వేరే చోటుకు తరలించినట్లు సమాచారం. సదానందంను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించలేదు. -
దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని మొట్ట మొదటిసారిగా బీసీ మహిళనే వరించింది. అందరి అంచనాలను తలకిందులయ్యాయి. మొదటి నుంచి చైర్ పర్సన్ మహిళకే దక్కుతుంది అనుకున్నప్పటికీ జనరల్ మహిళా స్థానంలో బీసీ మహిళకు కట్టబెట్టారు. వైస్ చైర్ పర్సన్ పదవిని పురుషుడికి అప్పగిస్తారని భావిస్తే అన్యూహంగా వైస్ చైర్ పర్సన్ పదవిని సైతం మహిళకు అప్పగించడం హుస్నాబాద్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో దాదాపు 30ఏళ్ల తర్వాత అతివలు పాలించే అవకాశం దక్కింది. 20 మంది వార్డు మెంబర్లకు ఇందులో 11 మంది మహిళలే కావడం, అందులో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులు మహిళలనే వరించడంతో మున్సిపల్లో మహిళా సాధికారత వెళ్లివిరియనుంది. మున్సిపల్ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇక ముందుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, కాంగ్రెస్‌కు చెందిన 6 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యులు, ఇండిపెంటెండెంట్కు చెందిన ముగ్గురు సభ్యులచే ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ ప్రారంభించారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణులు తమకు పూర్తి స్థాయి సంఖ్యా బలం లేదని, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సమావేశాన్ని బహిష్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజిత... మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో భాగంగా కోరం ఉన్నందున ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా ఆకుల రజిత, కాంగ్రెస్ నుంచి చిత్తారి పద్మకు భీపాంలు అందటంతో ఆల్ఫా బెటికల్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి బలం నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా చిత్తారి పద్మను కాంగ్రెస్ సభ్యుడు మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ చైర్ పర్సన్‌గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించగా, మరో సభ్యుడు పెరుక భాగ్యరెడ్డి బలపరిచాడు. అలాగే ఇండిపెంటెండెంట్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనగామ రత్నను కాంగ్రెస్ సభ్యురాలు పున్న లావణ్య ప్రతిపాదించగా, భూక్య స్వరూప బలపర్చారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి చైర్ పర్సన్లుగా కాంగ్రెస్ సభ్యులే ప్రతిపాదించి బలపర్చగా, మొదటగా ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మనే పరిగణనలోకి తీసుకుంటామని ఆర్డీఓ స్ఫష్టం చేశారు. అనంతరం ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజితకు మద్దతుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, ఇండిపెంటెండెంట్లు ఇద్దరు, ఎక్స్ అఫియోసభ్యుడు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌లు మొత్తం 12 సభ్యులు చేతులు లేపి మద్దతు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మకు కాంగ్రెస్‌కు చెందిన 6గురు, ఇండిపెంటెండెంట్ అభ్యర్థి జనగామ రత్నలు చేతులెత్తి మద్దతు పలికారు. దీంతో రజితకు 12 మంది మద్దతు పలుకగా, పద్మకు 7గురు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి ఆర్డీఓ అత్యధిక సభ్యులు రజితకు మద్దతు తెలుపడంతో మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజిత ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా అయిలేని అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ముందుగా పార్టీని ఆహ్వానించగా, వైస్ చైర్మన్ అయిలేని అనితను టీఆర్ఎస్ సభ్యురాలు కొంకట నళినీదేవి ప్రతిపాధించగా, బొజ్జహరీశ్ బలపర్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి చైర్ పర్సన్‌గా కోమటి స్వర్ణలతను మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం ఎన్నిక నిర్వహించగా, టీఆర్ఎస్కు చెందిన అయిలేని అనితకు 9 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు ఇండిపెంటెండెంట్ సభ్యులు, ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యుడు మొత్తం 12 మంది సభ్యులు చేతులేత్తి మద్దతు పలికారు. కోమటి స్వర్ణలతకు కాంగ్రెస్ 6గురు సభ్యులు, ఇండిపెంటెండెంట్ ఒకరు చేతుతెత్తి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి అయిలేని అనితకు 12 మంది, కాంగ్రెస్ అభ్యర్థి కోమటి స్వర్ణలతకు 7గురు మద్దతు తెలిపారు. అత్యధికంగా సభ్యులు మద్దతు ఉన్న అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్‌గా అయిలేని అనితలచే ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. వాల సుప్రజా నవీన్‌రావును అభినందిస్తున్న ఎమ్మెల్యే సతీశ్‌బాబు అత్యధిక మెజార్టీ సాధించిన వాల సుప్రజ.. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. ఇక మున్సిపాలిటీలోని 20వ వార్డు అభ్యర్థినిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాల సుప్రజా నవీన్‌రావు భారీ మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 84.5 శాతం మెజార్టీ సాధించి సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థినిగా నిలిచారు. టీఆర్ఎస్ చైర్ పర్సన్‌గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించారు. -
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం: చాడ
సాక్షి, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉల్లిగడ్డ ధరలతో సహా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు బంధు పథకం కింద రైతులకు ఖరీఫ్ సహాయాన్ని త్వరగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు పర్మిట్లు ఇవ్వడంతో మద్యానికి బానిసలైన యువకులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . -
కొత్త ‘ఆసరా’పై స్పష్టత కరువు
సాక్షి, హుస్నాబాద్: ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 వరకు తగ్గించి పథకం వర్తింప చేస్తామని చెప్పింది. రూ.1000 పింఛన్‌ను రూ.2,016లకు పెంచుతామని ప్రజలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓటరు జాబితాల ఆధారంగా ఐకేపీ సిబ్బందితో 57 నుంచి 65 మధ్య వయస్సు ఉన్న జాబితాను అందించాలని చెప్పడంతో గ్రామాల వారిగా సర్వే చేసి జాబితాలను సిద్ధం చేశారు. ఇటీవల పెంచిన ఫించన్లు అమలు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు చేసి ఆసరా పింఛన్‌దారులకు మంజూరు పత్రాలను అందజేసింది. ఆసరా ఫింఛన్లకు వయస్సును తగ్గించడంతో మాకు కూడా అందుతాయని ఆశపడ్డ లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. కొత్త ఆసరా పింఛన్లపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వారి ఎంపిక అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వం వీటిపై మళ్లీ నిర్ణయం తీసుకునేవరకు ఆశావాదులు నిరీక్షించక తప్పడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఆసరాకు అర్హులెవరు? ప్రభుత్వం ఆసరా పథకానికి 65 నుంచి 57 సంవత్సరాలకు వయస్సు తగ్గించడంతో చాలా మంది రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారికి 57 సంవత్సరాలు ఉంటే ఆసరా పథకానికి అర్హలవుతారు. కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఆసరాకు దరఖాస్తు చేసుకునే వారికి ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి. వీరందరూ ఆయా గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని అధికారులు పరిశీలించి ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే అధికారులు కొత్త ఆసరా లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. కొత్తగా 4,207 మంది అర్హులు.. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని 49 గ్రామ పంచాయతీల్లో గతంలోనే స్వశక్తి సంఘాల అధ్వర్యంలో ఓటరు జాబితలను అధారంగా ఐకేపీ అధికారులు గ్రామాల వారిగా సర్వే చేయించారు. అప్పటి వరకు 57 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని సర్వే చేసి గ్రామ పంచాయతీల వారిగా జాబితలను ఉన్నతాధికారులకు పంపించారు. అక్కన్నపేట మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో 2,939, హుస్నాబాద్ మండలంలోని 17 పంచాయతీల్లో 1,268 మంది ఉన్నట్లు సర్వే చేశారు. వీరందరూ ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఆసరా ఫించన్లకు అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఉద్యోగ విరమణ చేసి ఫించన్ పొందేవారు కూడ ఇదే జాబితాలో ఉన్నారు. అయితే వారిని తొలగించి అర్హతగల వారికి ఆసరా పింఛన్లు అందించుటకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు మరికొంత సమయం పట్టనుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు కొత్త ఆసరా పథకం అమలుకు వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. ఓటరు జాబితాల ఆధారంగా సర్వే చేసి గ్రామాల వారీగా జాబితాలను సిద్ధం చేశాం. కొత్త వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ నుంచి ఉత్తర్వులు వెలువడగానే ఎంపికపై కసరత్తు చేస్తాం. అర్హులకు అందేలా చూస్తాం. – ఉదయ్‌భాస్కర్, ఇన్చార్జి ఎంపీడీఓ, అక్కన్నపేట -
నాసిరకం సరుకులు సరఫరా చేశారు
హుస్నాబాద్‌రూరల్: మీర్జాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు టెండర్లో చూపిన కంపెనీ సరుకులు కాకుండా తక్కువ ధరలకు వచ్చే నాసిరకం సరుకులను సరఫరా చేసినా వార్డెలు పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్ ఆరోపించారు. శనివారం హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టె భోజన సామగ్రిని పరిశీలించారు. పిల్లలకు పోషకాలు లభించే కోడి గుడ్లలో కూడ తక్కువ ధరలకు వచ్చే చిన్న కోడి గుడ్లను సరఫరా చేస్తున్నారని అన్నారు. టీచర్లు పాఠశాలకు రావడం లేదు.. పాఠశాల సమయంలో తరగతి గదుల్లో ఉండాల్సిన టీచర్లు వారికి ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారని అన్నారు. కొందరు టీచర్లు పాఠశాలకు రావడం హాజరు రిజిష్టర్‌లో సంతకాలు చేసి మళ్లీ రోడ్లపైకి వస్తున్న ప్రిన్సిపాల్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పాఠశాలలో జీవశాస్త్రం టీచరు లేరని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసే ఏఎన్ఎం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. వెంటనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి వెంట డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి.శివరాజ్,రమేశ్‌లు ఉన్నారు. -
ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు
సాక్షి, హుస్నాబాద్(సిద్దిపేట) : మారుమూల గ్రామాలకు సైతం కాన్వెంట్ బస్సులు వచ్చేస్తున్నాయి. సర్కాడు బడులంటే సమస్యల చిరునామాగా మారాయి. ప్రైవేటు పాఠశాలలో ఉన్న వసతులు ప్రభుత్వ బడుల్లో లేవు. చిన్న సంపాదన పరుడైనా పిల్లలకు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రైవేటు బడులకు పంపుతున్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను తను పని చేస్తున్న పాఠశాలలోనే పిల్లలను చేర్పించి చదివిస్తున్నాడు. ప్రైవేటు బడుల్లో ఎన్ని హంగులు ఉన్నా.. సర్కారు బడిలో నాణ్యమైన విద్య అందుతుందని పాటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తను పని చేసే బడిలోనే చేర్పించాడు.. మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోగిటి సత్యనారాయణ ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి 1998లో డీఎస్సీ ద్వారా టీచర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇదే మండలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యాను బోధిస్తున్నారు. తను నడిచిన మార్గంలోనే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పిల్లలను ప్రభుత్వ బడికే పంపడం ప్రైవేట్ పాఠశాలల్లో రూ. వేలు ఖర్చు చేసి పిల్లలను చదివించే తల్లదండ్రులు సైతం ప్రభుత్వ బడి గురించి ఆలోచించేలా చేస్తుంది. సత్యనారాయణ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని భార్య విమల, గ్రామస్తులు అభినందిస్తున్నారు. పలువురు ఆయన బాటలోనే నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. బోధనలోనూ ప్రత్యేక శైలీ మండలంలోని తంగళ్లపల్లి పాఠశాలలో పనిచేసే సమయంలో సత్యనారాయణ విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించేవారు. ప్రత్యేక్షంగా వాటిని చూపించి పాఠం అర్థమయ్యేలా చేస్తారు. బరువులు కోలతల గురించి చౌకదారుల దుకాణం తీసుకెళ్లి అవగాహన కల్పించడం, లీటర్లు, కిలో గ్రాముల గురించి వివరించారు. వివిధ వస్తువుల వినియోగాన్ని ప్రత్యేక్షంగా చూపించి ఆ పరిసరాలను వారికి తెలియజేసి భోదించేవారు. అక్షయ ఫౌండేషన ద్వారా సేవ.. తన మిత్రులలో కలసి సత్యనారాయణ అక్షయ ఫౌండేషన్ ద్వారా గ్రామంతోపాటు చుట్టుపక్కల పల్లెల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో రెండు నెలల పాటు 200 మందికి ఉచిత మజ్జిక పంపిణీ అందిస్తారు. పేద ప్రజలకు దుస్తులలతోపాటు దుప్పట్లు పంపిణీ చేస్తారు. విద్యార్థులకు చదువుకు అవసరమైన వస్తువులు అందజేసి వారిని చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటారు. పలు విషయాల్లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పారుచుకున్న తోగిటి సత్యనారాయణ జిల్లా విద్యాధికారి అభినందించారు. -
డొక్కు బస్సులే దిక్కు !
సాక్షి, హుస్నాబాద్,మెదక్: రవాణా సౌకర్యం మెరుగుపడినా బస్సుల సంఖ్య పెరగడం లేదు. ఎక్స్‌ప్రెస్ బస్సులు అసలు కనిపించడమే కరువయ్యాయి. డిపో ప్రారంభం అయినప్పుడు ఎన్ని బస్సులున్నాయో? నేటికీ అదే సంఖ్యలో బస్సులు ఉండటం గమనార్హం. స్క్రాప్ బస్సుల పేరిట ఇక్కడి నుంచి బస్సులను పక్కనబెడుతున్నా.. వాటి స్థానంలో మళ్లీ పాత బస్సులకే కలరింగ్ చేసి వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. బస్సుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. పెద్ద బస్సుల స్థానంలో మినీ బస్సులను తెచ్చి డిపోను మరింత నష్టాల్లోకి నెట్టేశారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో మొత్తం 54 బస్సులున్నాయి. ఇందులో ఆర్టీసీకి చెందిన 4 ఎక్స్‌ప్రెస్‌లు, 2 సూపర్ లగ్జరీ, 25 ఆర్డినరీ, 11 మిని పల్లె వెలుగు బస్సులున్నాయి. అలాగే 2 అద్దె బస్సులు(ఎక్స్‌ప్రెస్), 10 హైర్‌విత్ ఆర్డీనరీ బస్సులు నడుస్తున్నాయి. బస్సుల నిర్వాహణకు గాను 89 మంది డ్రైవర్లు, 94 మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. హ్నుస్నాబాద్ డిపో ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. డిపోలోని మొత్తం 54 బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. మినీ బస్సులు తక్కువ దూరంలో ఉన్న గ్రామాల్లో నడిపించి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించాల్సింది. అంతే కాకుండా కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను నడిపించడంతో కొత్తదనం ఏమీలేదు. లాంగ్రూట్లల్లో ఈ బస్సులు నడిపించే పరిస్ధితి లేదు. మినీ బస్సుల ఉద్దేశం, లిమిటెడ్ స్టేజీలు, దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న గ్రామాలకు మాత్రమే నడపాలి. కరీంనగర్, హుజురాబాద్, సిద్దిపేట, హన్మకొండ రూట్లల్లో ఈ మినీ బస్సులను నడిపిస్తున్నారు. ఈ రూట్లలో గతంలో పెద్ద బస్సులు నడిచేవి. అవి కాలం చెల్లడంతో మినీ బస్సును నడిపిస్తున్నారు. పెద్ద బస్సులు 55 సీట్ల కెపాసిటీ ఉండగా, మినీ బస్సుల్లో కేవలం 35 సీట్ల కెపాసిటీ మాత్రమే. ఈ బస్సులను నడిపించడంతో పరోక్షంగా ఆటోలకు అశ్రయం కల్పించడమే అవుతోంది. అసలే చిన్న బస్సులు ఆపై వన్‌మెన్ సర్వీస్ వెరసి డ్రైవర్లపై అదనపు భారం పడుతోంది. హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్లాలంటే, 9 స్టేజీలతో పాటు, హుస్నాబాద్ పట్టణంలోనే ఆరు స్టేజీలుంటాయి. ఇంచుమించు డ్రెవర్ 15 స్టేజీల్లో బస్సు ఆపుకుంటూ టికెట్లు ఇస్తూ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయడమంటే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఆదాయంలో కోత, డ్రైవర్లకు అదనపు పని భారం, కండక్టర్ల కుదింపు, మరో వైపు ప్రయాణికులకు అసౌకర్యం.. ఇన్ని రకాల ఇబ్బందులు డిపోకు శాపంగా మారాయి. కనిపించని ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు జిల్లాలకు ప్రధాన డివిజన్ కేంద్రంగా ఉన్న హుస్నాబాద్‌కు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్టుంటారు. ప్రతి రోజు పట్టణాలు, నగరాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. అందుకు తగ్గట్లుగా ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు లేవు. లాంగ్ రూట్లకు ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లు లేకపోవడం డిపో నష్టానికి ఇదో కారణమని అభిప్రాయ పడుతున్నారు. ఉన్న ఒక్క ఎక్స్‌ప్రెస్ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లాలంటే సీట్లు దొరకని పరిస్ధితి. గతంలో బాసర, గోదావరిఖని, భద్రాచలం, యాదగిరి గుట్ట, మంచిర్యాల వంటి పట్టణాలకు లాంగ్ సర్వీస్‌లు నడిచేవి. ప్రస్తుతం ఈ లాంగ్ సర్వీస్‌లను పూర్తిగా రద్దు చేశారు. హుస్నాబాద్ కేంద్రం నుంచి ఏటూ 40 కి.మీ దూరంలో ఉన్న జిల్లా కేంద్రాలు వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, జనగామకు వెళ్లాలంటే పల్లె వెలుగు బస్సులే దిక్కవుతున్నాయి. డిపోకు ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు కేటాయించకపోతే డిపొ మూసివేత బాట పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. డిపో ఇప్పటికే రూ.6 నుంచి 7 కోట్ల వరకు నష్టాల్లో ఉందని తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన కాకముందు హుస్నాబాద్ డిపో కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉండేది. హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలిపిన తర్వాత అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఏ పనికి వెళ్లాలన్నా సంగారెడ్డికి వెళ్లాల్సిన పరిస్థితి. ఉన్నతాధికారులకు నివేదించాం.. హుస్నాబాద్: పాత బస్సులైనా కండిషన్ ఉన్న బస్సులనే కేటాయిస్తున్నారు. ఈ ప్రాంతం చుట్టూ అన్నీ అర్డినరీ రూట్లు ఉన్నాయి. హుస్నాబాద్ నుంచి గోదావరిఖనికి ఎక్స్‌ప్రెస్ నడిపిస్తున్నా.. అనుకున్న స్థాయిలో కలెక్షన్ రావడం లేదు. వాస్తవానికి ఎక్స్‌ప్రెస్‌లతో ఆదాయం పెరుగుతుంది. హుస్నాబాద్ నుంచి వరంగల్ టు సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపిస్తే లాభమే ఉంటుంది. ఈ రూట్లో పర్మిట్ లేదు. ఆర్డినరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి లాంగ్ రూట్లకు నడిపిద్దామంటే కార్మికులు ఎక్కువ కిలోమీటర్లని సహకరించడం లేదు. ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది, అధికారులు కలిసి పని చేస్తేనే డిపో పురోగతి సాధిస్తుంది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. –రజనీకృష్ణ, డిపో మేనేజర్, హుస్నాబాద్ దీర్ఘకాలికంగా నష్టపోతారు.. మెయిన్ రోడ్డులో చిన్న బస్సులు నడపడం వల్ల ప్రయాణికులు నష్టపోతారు. అందుకే కండక్టర్లు, డ్రైవర్లు ఉన్న పెద్ద బస్సులనే నడిపించాలి. చిన్న బస్సులను లిమిటెడ్ స్టేజీలు ఉన్న గ్రామాలకు నడిపిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. లేదంటే డిపోకు నష్టం వస్తుంది. డిపోకు ఎక్స్‌ప్రెస్ బస్సులతోనే ఆదాయం. వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్‌తో పాటుగా లాంగ్ రూట్లల్లో ఎక్కువ మొత్తంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపిస్తే తప్పా డిపోకు మనుగడ ఉండదు. –పందిల్ల శంకర్, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు, హుస్నాబాద్ -
వృద్ధ దంపతుల దారుణ హత్య
అనంతగిరి: వికారాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరిగుట్ట అడవుల్లో వృద్ధ దంపతుల మృతదేహాలు కలకలం రేపాయి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు సమీపంలో ఉన్న నందిగామకు చెందిన నవరతన్‌రెడ్డి (76), భార్య స్నేహలతారెడ్డి (72)కి కర్ణాటకలోని హుమ్నాబాద్‌లో 60 ఎకరాల పొలం ఉంది. వీరు అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లి వస్తుంటారు. ఇదిలా ఉండగా ఈనెల 14న వీరు అదృశ్యమైనట్లు హుమ్నాబాద్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం అనంతగిరి గుట్ట కెరెళ్లి ఘాట్ రోడ్డు పక్కన పొదల్లో ఓ శవం ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తుండగా మరో శవం కనిపించింది. అప్పటికే మిస్సింగ్ కేసుపై దృష్టిసారించిన పోలీసులు అదృశ్యమైన వృద్ధ దంపతుల టెంపరరీ కారు డ్రైవర్ సతీశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడ్ని పట్టుకుని అనంతగిరిగుట్టకు వచ్చిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే స్థానిక పోలీసులు అక్కడ ఉన్నారు. మృతుల నగలు, డబ్బుపై కన్నేసిన కారు డ్రైవర్ సతీశ్ వీరిని హతమార్చాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత 12వ తేదీన హైదరాబాద్ నుంచి హుమ్నాబాద్ వెళ్తున్న క్రమంలో తన స్నేహితుడు రాహుల్ సాయంతో కారులోనే ఇద్దరినీ హతమార్చారు. శవాలను అనంతగిరి అడవుల్లో పడేశారు. అనంతగిరికి వచ్చిన హుమ్నాబాద్ పోలీసులు.. స్థానిక పోలీసుల సాయంతో శవాలను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
సివిల్స్‌లో మెరిసిన గిరిజన వజ్రం
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): చదువుకు పేదరికం అడ్డుకాదు.. సాధించాలనే లక్ష్యం, తపన ఉంటే కష్టపడి తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించాడు గ్రామీణ ప్రాంత విద్యార్థి ప్రవీణ్ నాయక్. సివిల్ సర్వీసెస్–2018 ఫలితాల్లో వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబల్లికి చెందిన నునావత్ ప్రవీణ్‌నాయక్ 610 ర్యాంక్‌ను సాధించాడు. నునావత్ భీమా నాయక్–రాజమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారి కుమారుడు ప్రవీణ్ నాయక్ ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కరీంనగర్‌లోని పారమిత హైస్కూల్లో చదువుకున్నాడు. పదో తరగతి పూర్తికాగానే 2008 సంవత్సరం హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్(ఎంపీసీ), అనంతరం వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేశాడు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి కాగానే ఢిల్లీలో కొన్ని నెలల పాటు కోచింగ్ తీసుకున్న ప్రవీణ్ నాయక్ 2016 సివిల్స్ మెయిన్స్‌లో తప్పాడు. రెండో ప్రయత్నంలో లక్ష్యం సాధించాడు. 2018 సంవత్సరానికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ కమిషన్) గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వూలు నిర్వహించగా అందులో ప్రవీణ్నాయక్కు 610 ర్యాంక్ సాధించాడు. సంతోషంగా ఉంది.. నా కుమారుడు సివిల్స్ సాధించడం చాల సంతోషంగా ఉంది. మాది చాలా పేద కుటుంబం. మా తండాల్లో ఎర్రమట్టి విక్రయాలే జీవనాధారం. మా తండ్రి నునావత్ బిక్యా–బూలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నాన్న ఎర్రమట్టి అమ్మి వచ్చిన డబ్బులతో నన్ను చదివించాడు. ప్రస్తుతం మా ఇద్దరు తమ్ముళ్లలో ఒకరు ఆటో డ్రైవర్‌గా, మరో తమ్ముడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నేను పదో తరగతి వరకు ముల్కనూర్‌లో చదువుకున్నాను. 1996 సంవత్సరంలో ఓరియంటల్ బ్యాంక్ కామర్లో ఫ్యూన్‌గా ఉద్యోగం లభించింది. నాకు కుమారుడు ప్రవీణ్‌తో పాటుగా కూతురు నవ్య సంతానం. నవ్య ఇప్పుడు డిగ్రీ చదువుతోంది. – భీమా నాయక్, ప్రవీణ్ నాయక్ తండ్రి పేపర్ చదవడం వల్లే సివిల్స్ సాధించాను.. మాది పేద కుటుంబం.. సివిల్స్ చదవాలనే తపన ఇంటర్మీడియట్లోనే కలిగింది. అప్పటి నుంచి అందే సంకల్పంతో బీటెక్ పూర్తి కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి ఢిల్లీలో కోచింగ్‌కు వెళ్లాను. అయిప్పటికీ స్వతహాగా నోట్స్ తయారు చేసుకున్నాను. ఇతర పుస్తకాలతోపాటు నిత్యం పేపర్ చదివాను. సివిల్స్ సాధించడానికి ఇవి తోడ్పడ్డాయి. పేపర్ చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. నిత్యం 8 నుంచి 10 గంటలు ప్రిపేరయ్యాను. ఆశయం ఉంటే లక్ష్యం సాధించడం కష్టమేమి కాదు. – నునావత్ ప్రవీణ్ నాయక్ -
వినోద్‌కుమార్‌కు 5లక్షల మెజార్టీ తేవాలి
సాక్షి, హుస్నాబాద్‌రూరల్: టీఆర్ఎస్ బలపరిచిన కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్‌ను 5 లక్షల మెజార్టీతో గెలుపించడానికి ట్రాస్మా ఉపాధ్యాయులు అందరూ పని చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరిశేఖర్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో ట్రస్మా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనతి కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వినోద్‌కుమార్ గెలుపు కోసం ట్రస్మా నాయకులు పని చేయాలని కోరారు. తమ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి గెలుపు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపెల్లి మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు బుర్ర రాజేందర్, నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ముత్తినేని రాజేశ్వర్‌రావు, అయిలేని శంకర్‌రెడ్డి, మహ్మద్ అయూబ్, రవికుమార్,టీఆర్ఎస్ నాయకులు వాల నవీన్‌చాడ సత్యనారాయణరెడ్డి, వెంకటనారాయణ, శ్రీధర్‌రెడ్డి, కిరణ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది తొమ్మిది రోజులే..
సిద్దిపేటజోన్: సరిగ్గా కేవలం తొమ్మిదిరోజుల గడువు.. కానీ మున్సిపాలిటీల ముందు కొండంత లక్ష్యం పేరుకుని ఉంది. నిర్దేశిత మార్చి 31నాటికి జిల్లాలోని ఐదు మున్సిపాలిటిల్లో 4కోట్ల పైచీలుకు బకాయిలు వసూలు చేయాల్సిన లక్ష్యం ముందుంది. జిల్లా రికార్డుల ప్రకారం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటిల్లో మార్చి 31వరకు 15కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా నేటి వరకు 11కోట్లు వసూలు కావడం విశేషం. స్వల్ప సమయం ఉండడం రూ.4కోట్ల వసూళు చేయాల్సిన బాధ్యత బల్దియా అధికారులపై ఉందనే చెప్పాలి. మరోవైపు సిద్దిపేట మినహా మిగతా మున్సిపాలిటీల్లో నల్లా పన్నుల వసూలు నిరాశాజనకంగానే ఉన్నాయి. 2018–19 వార్షిక లక్ష్యానికి అనుగుణంగా బల్దియా అధికారులు పన్నుల వసూళ్ల ప్రక్రియను చేపట్టినప్పటికి మరో 9రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో లక్ష్యం సాధించడానికి స్పెషల్ డ్రైవ్ పేరిట ప్రణాళిక రూపకల్పనకు రంగం సిద్ధం చేయడం విశేషం. వివరాల్లోకి వెళ్తే జిల్లాలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేటతో పాటు దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపల్ రికార్డుల ప్రకారం ప్రతి యేటా ఆర్థిక, వార్షిక ప్రణాళికకు అనుగుణంగా ఆస్తి, నల్లా పన్నుల వసూళ్లను రెవెన్యూ విభాగం చేపడుతుంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లో 2018–19 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనుంది. ఆయా మున్సిపల్ రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 25వేల పైచీలుకు అసెస్మెంట్లకు సంబంధించి రూ.9.61కోట్ల నిర్దేశిత వసూలు లక్ష్యానికి అనుగుణంగా నేటి వరకు 7.86కోట్ల రూపాయలను బల్దియా అధికారులు వసూలు చేశారు. మిగిలిన 1.75 కోట్ల రూపాయల్లో అత్యధికం జిల్లా కేంద్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆస్తి పన్ను పేరుకుని ఉంది. ఇప్పటి వరకు 82శాతం వసూలుతో జిల్లాలో సిద్దిపేట అత్యధికంగా పన్నులను వసూలు చేసినప్పటికి మరో తొమ్మిది రోజుల్లో భారీ లక్ష్యం ముందుందనే చెప్పాలి. దీనికి తోడు దుబ్బాక మున్సిపాలిటిలో రూ.90లక్షలకు గాను ఇప్పటి వరకు కేవలం రూ.32 లక్షలు వసూలు కావడం, అదే విధంగా చేర్యాల మున్సిపాలిటిలో రూ.74లక్షల ఆస్తి పన్ను వసూలుకు గాను కేవలం రూ.14లక్షలే నిరాశజనకంగా ఫలితాలతో ఉందనే చెప్పాలి. మరోవైపు హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.1.02కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటి వరకు రూ.65లక్షలను మాత్రమే అధికారులు పన్నురూపంలో వసూలు చేయడం గమనార్హం. మరోవైపు గజ్వేల్ మున్సిపాలిటీలో రూ.2.83కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.2.19కోట్ల ఆస్తి పన్నును అధికారులు వసూలు చేశారు. ఇంకా రూ.64లక్షలు గజ్వేల్‌లో వసూలు చేయాల్సి ఉండగా ఇదే సమయంలో సిద్దిపేటలో రూ.1.75కోట్లు, దుబ్బాకలో రూ.32లక్షలు, హుస్నాబాద్‌లో రూ.18లక్షలు, చేర్యాలలో రూ.60లక్షలు మొత్తంగా ఈ నెలాఖరి నాటికి రూ.4కోట్ల రూపాయలను జిల్లాలోని ఆయా మున్సిపాలిటిల్లో ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంది. -
వరుడు పరారీ.. తాళి కట్టిన మరో యువకుడు
హుస్నాబాద్ రూరల్: ఉదయం 11 గంటలకు వివాహ ముహూర్తం.. వధువు బంధువులు వరుడిని తీసుకొచ్చేందుకు అబ్బాయి ఊరు వెళ్లారు. అబ్బాయిని తీసుకుని పెళ్లి మండపానికి వచ్చే క్రమంలో.. వరుడు వాహనం దిగి పారిపోయాడు. దీంతో ఏం చేయాలనే అయోమయంలో పడ్డ వధువు తల్లిదండ్రులు.. అనుకోకుండా ఓ యువకుడి నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లి ఆగిన క్రమంలో సదరు యువకుడు ముందుకొచ్చి వధువు మెడలో తాళి కట్టాడు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు, భూలక్ష్మి దంపతులు తమ కుమార్తెను మేనత్త కొడుకు, చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. అయితే శ్రీనివాస్ నుస్తులాపూర్‌కు చెందిన మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇది తెలిసే తమ కుమార్తెను మొదట ముల్కనూర్‌కు చెందిన పందిపెల్లి రమేశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు వధువు తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే, శ్రీనివాస్ తల్లి అడ్డుపడి తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో పెళ్లి కుదుర్చుకున్నారు. కానీ పెళ్లిపీటల పైకి వచ్చే సమయంలో శ్రీనివాస్ పరారు కావడంతో మొదట నిర్ణయించిన వరుడైన రమేశ్ తల్లిదండ్రులతో మాట్లాడి.. అదే వేదికపై పెళ్లి కానిచ్చారు. పందిపెల్లి రమేశ్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి వధువు మెడలో తాళికట్టి, అమ్మాయి తల్లిదండ్రుల ముఖంలో సంతోషం నింపడంతో బంధువులు ప్రశంసలతో ముంచెత్తారు. -
‘టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి’
సాక్షి,సైదాపూర్: టీఆర్ఎస్తోనే తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన వెన్కెపల్లి–సైదాపూర్ జంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళహారతి, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతు బీమా పథకాలు చేపట్టామన్నారు. నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి ఆశీర్వదిస్తే గ్రామాల్లో మిగిలిన పనులు పూర్తి చేయిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, వొడితెల శ్రీనివాస్‌రావు, ప్రణవ్‌బాబు, పేరాల గోపాల్‌రావు, జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, కనుకుంట్ల విజయ్‌కుమార్, దేవేంద్ర, రాయిశెట్టి కోమల, చంద్రయ్య, కనుకుంట్ల కవిత, సులోచన, ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రవీందర్‌రెడ్డి, జిల్లా సభ్యుడు టీ.యుగేంధర్‌రెడ్డి, బెదరకోట రవీందర్, కొండ గణేశ్, కొత్త మధుసూదన్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రమణాచారి, పైడిమల్ల తిరుపతిగౌడ్, రవీందర్‌గౌడ్, బొమ్మగాని రాజు, వెంకటయ్య, నర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు. పాన్ కడుతా..ఓటు కొడతా.. హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాంగంగా రాము పాన్ షాపులో పాన్ కడుతూ..ఓటు అడుగుతూ..ఆకట్టుకున్నారు. మండల కేంద్రమైన వెన్కెపల్లి–సైదాపూర్ జంట గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు సోమారపు రాజయ్య, బిల్లా వెంకటరెడ్డి, మునిగంటి స్వామి, పోలు ప్రవీణ్, బొమ్మగాని రాజు, పైడిపల్లి రవీందర్, నవీన్ తదితరులు ఉన్నారు. -
వొడితల సతీష్ కుమార్‌తో లీడర్
-
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తాం..
‘జీవన విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని బాగు చేయడానికి నోరు కట్టుకుని, కడుపు కట్టుకొని పని చేసినం. శాశ్వత ప్రయోజనాలు చేకూరేలా సంక్షేమ పథకాలను రూపకల్పన చేసినం. ముదనష్టపు, దరిద్రపుగొట్టు కాంగ్రెస్ పాలనలో 50 ఏండ్ల తెలంగాణ రాష్ట్రం ఎంతగా చితికి పోయిందో హుస్నాబాదే నిదర్శనం. ఇలా తెలంగాణ అంతట కరువే. కరువుకు మూల కారణమే కాంగ్రెస్ పార్టీ. మీ దీవెనలు, ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించినం. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నం. మళ్లీ ఆశీర్వదిస్తే కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తాం’ అంటూ గుళాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కోటి ఎకరాల మాగాణి, ఆకుపచ్చ తెలంగాణ తన స్వప్నమని, అందుకోసమే అధికారంలో ఇంకా కొనసాగే అవకాశం ఉన్నా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘ఎలక్షన్ ఎందుకు వచ్చిందో నిన్ననే నేను చెప్పాను. హుస్నాబాద్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. కొత్తకొండ వీరన్న కొలువుదీరిన నేల హుస్నాబాద్. అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీ ముందే ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీరందరూ చూస్తున్నారు. చైతన్యవంతమైన హుస్నాబాద్ ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు. ముందస్తు ఎన్నికలు రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టేనని, ప్రభుత్వం, అధికారుల మనోస్థెర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు రుజువు కాలేదని, అయినప్పటికీ మళ్లీ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలనుకున్నామని కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో శిథిలమైన తెలంగాణను తీర్చిదిద్దుతున్నామమని, నాలుగేళ్లలో 17.17 నుంచి 29.17 వరకు ఆర్థిక వృద్ధి సాధించామని, ఇది తాను చెప్పడం కాదని.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రకటించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన సమయంలో కరెంట్ సమస్య ఉండేదని.. కరెంట్ విషయంలో భయంకరమైన పరిస్థితులు ఉండేవని.. కరెంట్ 24 గంటలు ఇస్తే.. తానే గులాబీ కండువా కప్పుకుంటానని జానారెడ్డి శాసనసభలో అన్నారని, ఇప్పుడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, జానారెడ్డికి నిజాయితీ ఉంటే ఆ పని చేసి చూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని రాష్ట్రాభివృద్ధిని చూడాలని.. కాంగ్రెస్ దరిద్రపు పాలన వల్లే ఒక్క హుస్నాబాద్, తెలంగాణ కాదు.. యావత్ భారత్ మోసపోయిందని, అవినీతి రహితంగా పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై నిప్పుల చెరిగిన కేసీఆర్.. ‘కాంగ్రెస్ నేతల బతుకు ఢిల్లీలో డిసైడైతది. తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ పనిచేయలేదు. నేను తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసి చావు అంచుల దాకా వెళ్లా. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలు దీవించి అధికారం ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు భరోసా వచ్చింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు 31 జిల్లాల ఏర్పాటు అన్నది సాహసోపేత నిర్ణయం. కనీవిని ఎరగని అభివృద్ధి చేస్తే కాంగ్రెసోళ్లు అవాకులు చవాకులు పేలుతున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తప్పట. నోటికి హద్దు పద్దూ లేకుండా మాట్లాడే వారికి సిగ్గుండాలి. అధికారం ఢిల్లీ పెద్దల చేతుల్లో కాదు. మన చేతుల్లో ఉండాలి. మళ్లీ టీఆర్ఎస్కు అధికారం అప్పగిస్తే ఐదేళ్లు బ్రహ్మాండంగా పాలిస్తాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెసోళ్లు అధికారం కోసం ఆవురావురు అంటున్నారని, వారికి అధికారం ఇస్తే పంటికి తగలకుండా మింగేస్తారని అన్నారు. ఢిల్లీ గులాములైన కాంగ్రెస్ పార్టీ నేతలు తమను కూడా అక్కడ తాకట్టు పెడతారని, వచ్చే ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎంత నాశనమైందో అందరికీ తెలుసని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరిగి ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏనాడూ క్రియాశీలకంగా పనిచేయలేదని, కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కనీసం నోరు మెదపలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పైసలు తినడానికి, పైరవీలు చేయడానికి వారికి సమయం సరిపోలేదని, పెన్షన్ రూ.2 వేలు ఇస్తామని హర్రాజ్ పాట పాడినట్లు పాడుతున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని, ఏనాడైనా పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు ఇవ్వాలని మీ బుర్రలకు తట్టిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై మెదడు కరిగించి ఒక టీఎంసీ నుంచి ఎనిమిది టీఎంసీలకు తీసుకొచ్చినామని, గౌరవెల్లి ప్రాజెక్టు కింద ప్రజల పొలాలు పారుతాయా..? కేసీఆర్ పొలాలు పారుతాయా? దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఎన్కౌంటర్లు లేవు..మట్క లేదు, గుట్క లేదు.. ‘తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ఎన్కౌంటర్లు లేవు. ఎరువుల కొరత లేదు. పేకాట క్లబ్బులు లేవు. గుట్కా లేదు, మట్కా లేదు. కాంగ్రెస్ పార్టీ ఖర్మకాలి అధికారంలోకి వస్తే మళ్లీ కరెంటు ఎటమటం అవుతుంది’ అంటూ కేసీఆర్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పుడు కరెంటు బాధలు పోయినయని, మత కల్లోలాలు లేవని, అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సహాయం అందిస్తున్నామని, రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక వెసులుబాట కల్పిస్తున్నామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమన్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. సతీష్ నా తమ్ముడు, మా కెప్టెన్ సాబ్ కొడుకు.. గెలిపించండి.. హుస్నాబాద్ నుంచి ఒడితెల సతీష్‌కుమార్‌ను మళ్లీ ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు. ‘సతీష్ నా తమ్ముడు. మా కెప్టెన్ సాబ్ కొడుకు. కెప్టెన్ సాబ్ నేను పద్దెనిమిదేళ్లుగా ఉద్యమంలో, పార్టీలో కలిసి పని చేస్తున్నం. హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోతే నా దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుని మరి సాధించుకున్నడు. ఆయనను మరోసారి గెలిపించండి’ అని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోని తీసుకురావాలని అన్నారు. సమావేశంలో ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆపద్ధర్మ మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీష్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీలు వినోద్‌కుమార్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, తాజా మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, వి.సతీష్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, చెన్నమనేని రమేష్‌బాబు, పుట్ట మధు, బొడిగె శోభ తదితరులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సమరభేరీ మోగించిన గులాబీ నేత
-
ఆశీర్వదించండి.. మళ్లీ వస్తున్నా
సాక్షి, సిద్దిపేట : రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రజలను కోరారు. ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తానన్నారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన నేపథ్యంలో ‘ప్రజా ఆశీర్వాద సభ’పేరిట శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. టీఆర్ఎస్ తొలి ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యంకాని హామీలు... స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని పాలించింది. వారి పాలనలో తెలంగాణ రాష్ట్రమే కాదు.. దేశమంతా కరువు కాటకాలు, పేదరికంతో అలమటించింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు. మాయమాటలు చెబుతున్నారు. వారి మాటలు విని మోసపోతే ఐదు సంవత్సరాలు గోస పడుతాం. పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేశాం. లాఠీ దెబ్బలు తిన్నం.. జైళ్లకు వెళ్లాం.. చావు నోట్లోకి వెళ్లి వచ్చిన నేను పసిగుడ్డుగా ఉన్న తెలంగాణను నాలుగేళ్లలోనే అభివృద్ధి పథంలో నడిపించా. వారు పట్టించుకుంటే తెలంగాణ వచ్చేదే కాదు.. ఢిల్లీ నాయకుల చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో సీఎంలతో మాట్లాడాలంటేనే వారికి లాగులు తడిసేవి. వారు మన ప్రాంతం గురించి ఆలోచించి ఉంటే.. ఇక్కడ ప్రజల అవసరాలను పట్టించుకొని ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేదే కాదు. ఇటువంటి ఢిల్లీకి వెళ్లి బిచ్చమెత్తుకునే కాంగ్రెస్ పాలకులు కావాలో.. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకునేలా టీఆర్ఎస్ పాలన కావాలో మీరే తేల్చుకోండి. అసలే అధికార వాంఛతో ఆకలితో ఉన్న కాంగ్రెస్ నాయకులకు రాష్ట్రాని అప్పగిస్తే పంటికి అందకుండా మింగేస్తారు. చైనా, సింగపూర్‌లతో పోలిస్తే వెనుకబడ్డాం... మన సరిహద్దు దేశమైన చైనాలో 2.23 లక్షల కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ రైలు మార్గం ఉంటే మన దేశంలో కేవలం 19 వేల కిలోమీటర్లు మాత్రమే రైలు మార్గం ఉండటం శోచనీయం. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీల సగటు వేగం 80 కిలోమీటర్లు ఉండగా.. ఇండియాలో అది 24 కిలోమీటర్లే. అదేవిధంగా గూడ్స్ రైలు వేగం 86 కిలోమీటర్లు ఉంటే ఇండియాలో 36 కిలోమీటర్లు. దీనంతటికీ కాంగ్రెస్ అవినీతి పాలనే కారణం. కేవలం 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ఏటా 5.70 కోట్ల కంటెయినర్లను డీల్ చేస్తోంది. కానీ 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న మన దేశం మాత్రం 47 లక్షల కంటెయినర్లనే డీల్ చేస్తోంది. ఇది సిగ్గుచేటు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? భగవంతుడు, ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులు 70 వేల టీఎంసీలు ఉండగా.. వాటిని సద్వినియోగం చేసుకుంటే కరువు అన్న మాటే ఉండదు. అభివృద్ధిలో వెనుకబడొద్దనే ముందస్తుకు... తమ పాలనలో తెలంగాణ గ్రామీణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే నోటికొచ్చినట్లు పేలుతున్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి 17.17 శాతం ఉంది. ఈ ఏడాది అది 21.96 శాతానికి పెరిగిన విషయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. దీన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి అడ్డు పడుతున్నారన్నారు. తరచూ విమర్శలు చేసే పార్టీలతో.. ప్రజల మధ్యకు వెళ్లి ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నప్పుడు సరే అన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పుడు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. దిక్కు తోచక ఆగమాగం అవుతున్నారు. మరో ఏడు నెలల పదవీ కాలం ఉన్నా.. రాష్ట్రంలో జరగనున్న అభివృద్ది ముందుకు పోవాలని, ఆర్థిక ప్రగతి 21.96 శాతానికి మించి ఎదగాలని భావించే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాం. అభివృద్ధి ఆగొద్దనే ఆలోచనతో పదవీకాలం త్యాగం చేశాం. మీరు ఆశీర్వదించి ప్రభుత్వాన్ని రెన్యూవల్ చేయిస్తే మరో ఐదేళ్లు అద్భుతంగా పనిచేస్తాం. ప్రాజెక్టులు పూర్తి చేసి కోటి ఎకరాల మాగాణిగా, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తా. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టాం.. పరాయి పాలనలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను నాలుగేళ్లలో చక్కబెట్టాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గొల్లకురుమలు, చేనేత కార్మికులను ఆదుకున్నాం. అంగన్వాడీ, ఆశ వర్కర్లకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచాం. ఎవరూ అడగకుండానే కల్యాణలక్ష్మి అమలు చేశాం. కాంగ్రెస్ నాయకులు కనీసం మహిళల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించలేదు. వాళ్ల హయాంలో ఆపరేషన్ లేకుండా ప్రసవాలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు తల్లీబిడ్డల క్షేమానికి పథకాలు ప్రవేశపెట్టాం. ఎన్కౌంటర్లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. రాష్ట్ర సంపదను హైదరాబాద్‌లో ఖర్చు పెట్టలేదు. కొత్త సంసారాన్ని ఎలా చక్కబెట్టుకుంటారో.. నోరు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి పల్లెల సంక్షేమానికి వెచ్చించాం. గులాబీ కండువా కప్పుకుంటావా జానారెడ్డీ? రైతులకు ఉచితంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటిస్తే ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శలు చేశారు. మీరు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే గులాబీ కండువా కప్పుకుంటామని సవాల్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది నీకు కన్పిస్తలేదా.. జానారెడ్డి. కళ్లు కనిపించకపోతే రాష్ట్రమంతటా అమలవుతున్న కంటి వెలుగు పథకం కింద కంటి పరీక్షలు చేయించుకో. విద్యుత్‌ను ఎలా తీసుకురావాలో.. ఉత్పత్తి ఎలా పెంచాలో కాంగ్రెస్ నాయకులకు తెలియదు. తిరిగి వారికి ఓటు వేస్తే రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు మళ్లీ వస్తాయి. తిరిగి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్‌ను గెలిపించి దీవించాలి. సభలో ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రసంగించారు. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్‌రావు, బి. వెంకటేశ్వర్లు, ఫారూఖ్ హుస్సేన్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌రావు, పుట్ట మధు, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, బొడిగ శోభ, బస్వరాజు సారయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, విద్యాసాగర్‌రావు, టూరిజం శాఖ చైర్మన్ భూపతిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈదె శంకర్‌రెడ్డి, కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్రావు, రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ఆశీర్వాద సభ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : సెంటిమెంట్ ఖిల్లా.. కరీంనగర్ జిల్లా నుంచే గుళాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నగారా మోగించనున్నారు. మొదటి నుంచి తనకు సెంటిమెంట్ జిల్లా అని చెప్పుకునే ఆయన ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గురువారం అసెంబ్లీ రద్దు తర్వాత ముందస్తు ఎన్నికలకు తెర లేసింది. అంతకుముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు అధినేత సంకేతాలు ఇచ్చారు. శుక్రవారం హుస్నాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కలిసొచ్చిన సెంటిమెంట్ కోట.. కరీంనగర్ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే ‘ముందస్తు’ సభ కోసం ఉమ్మడి కరీంనగర్‌లోని హుస్నాబాద్‌ను వేదికగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజా ఆశీర్వాద సభ నుంచే శంఖారావం.. సెంటిమెంట్ ఖిల్లా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ పేరిట నేడు నిర్వహించే బహిరంగ సభ నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావం మోగించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మూడు రోజులుగా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణపై మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ సిద్దిపేటలో ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించారు. హుస్నాబాద్‌లో సభ నిర్వహణకు ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీష్రావుతోకలిసి వారు స్థల పరిశీలన, ఏర్పాట్ల పర్యవేక్షణ చేశారు. చివరకు హుస్నాబాద్ ఆర్టీసీ బస్‌డిపో స్థలంలో సభ నిర్వహించాలని నిర్ణయించి వేదిక ఏర్పాటు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ కోసం మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించి కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ ప్రజాప్రతినిధుల సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో జన సమీకరణపై కసరత్తు చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్ హాజరయ్యే భారీ సభకు 65 వేల మందిని సమీకరించే వీలుగా వాహనాలను సమకూర్చారు. జన సమీకరణలో నిమగ్నం.. హుస్నాబాద్‌లో కేసీఆర్ సభను జయప్రదం చేసేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సర్వశక్తులొడ్డారు. చిగురుమామిడి మండలానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సైదాపూర్ మండలానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కోహెడకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్, అక్కన్నపేటకు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, భీమదేవరపల్లికి ఎమ్మెల్యే పుట్ట మధు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, ఎల్కతుర్తికి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, హుస్నాబాద్ టౌన్, రూరల్‌కు నీటిపారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరించారు. ఈ మేరకు 5, 6 తేదీల్లో ఆయా మండలాల్లో విస్తృతంగా మండల పార్టీ సమావేశాలు నిర్వíßహించారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్వహించే సభను పార్టీ నేతలు, శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు, భారీ సంఖ్యలో జనాన్ని తరలించేందుకు నేతలు కృషి చేశారు. ఎన్నికలకు ముందు నిర్వహించే తొలిసభ విజయవంతంలో అందరూ తలమునకలయ్యారు. విజయవంతం చేయండి సైదాపూర్(హుజూరాబాద్) : టీఆర్ఎస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ నిర్మాణానికి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. మండల కేంద్రంలో గురువారం పార్టీశ్రేణులతో కలిసి హుస్నాబాద్‌లో శుక్రవారం కేసీఆర్ నిర్వహించే ఆశీర్వాద సభకు రావాలని బొట్టుపెట్టి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సారెస్పీ కాలువల్లో నీరు లేక సేద్యపు భూముల్లో తుమ్మలు మొలిచాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్, సాగునీటికి ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలను ఆదకున్నామని స్పష్టం చేశారు. ఈనెల 7న హుస్నాబా ద్లో నిర్వహించే తొలి ఆశీర్వాద సభకు మండలం నుంచి 10 వేల మంది తరలి రావాలని కోరారు. సమావేశంంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, నాయకులు పేరాల గోపాల్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రావుల రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోలు ప్రవీణ్, రాయిశెట్టి చంద్రయ్య, ముత్యాల వీరారెడ్డి, కనుకుంట్ల విజయ్‌కుమార్, తాటిపల్లి యుగెందర్‌రెడ్డి, పోలిరెడ్డి హరీశ్, పైడిమల్ల తిరుపతిగౌడ్, పైడిపల్లి రవీందర్, బొమ్మగాని రాజు పాల్గొన్నారు. -
అదిరేలా ఆరంభ సభ..!
సాక్షి, సిద్దిపేట: అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటిలాగే తన సెంటిమెంట్ సభకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే ఎన్నికల ఆరంభ సభ అదిరేలా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌లు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఎన్నికలకు వెళ్లేందుకు ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. అదే ఊపుతో పాల్గొనే హుస్నాబాద్ సభను విజయవంతం చేయడం టీఆర్ఎస్ శ్రేణులకు కీలకం కాగా.. ఇది ఎన్నికల తొలి ప్రచార సభ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపూ హుస్నాబాద్‌పైనే ఉంది. ఈ సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీని ద్వారా నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్ ఉత్సాహాన్ని నింపుతారని పార్టీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి సమర శంఖం పూరించనున్నారు. ఇక్కడ మొదలు పెట్టిన ఎన్నికల సభలను నిరంతరాయంగా 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు.. కొత్త హామీలు, గెలిచిన తర్వాత చేయబోయే పనులను ప్రజలకు వివరించనున్నారు. అలాగే స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీశ్‌కుమార్‌ను గెలిపించాలని ఈ సభ ద్వారా ప్రజలను అభ్యర్థించనున్నారు. సభకు జనాన్ని తరలించే బాధ్యతను హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తోపాటు, కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. గజ్వేల్ నుంచి నేరుగా సభకు.. హుస్నాబాద్ సభకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి మధ్యాహ్నం 2.30కు నేరుగా సభా ప్రాంగణా నికి రానున్నారు. 2 గంటలపాటు సభ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా నేరుగా హైదరాబాద్ తిరిగి వెళ్తారు. -
టీఆర్ఎస్ హుస్నాబాద్ సభ పేరు ఇదే
సాక్షి, హైదరాబద్ : తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్.. మరింత దూకుడు పెంచింది. ప్రతిపక్షాలకు అంతు చిక్కని వ్యూహాలతో ముందుకెళ్తున్న కేసీఆర్.. ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మరో బహిరంగ సభ ఏర్పాటు సిద్ధమయ్యారు. ఈ సభకు ‘ప్రజా ఆశీర్వాద సభ’గా నామకరణం చేసినట్లు హరీశ్‌రావు ప్రకటించారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, సభా స్థలాన్ని మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. హుస్నాబాద్ లో బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని మంత్రులు హరీశ్ రావు, ఈటల, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ లతో కలిసి పరిశీలించారు. మంత్రుల వెంట పలువురు ప్రజాప్రతినిధులున్నారు. సభ విజయవంతం చేసేందుకు మండలాల వారిగా ఇంఛార్జీలను నియమించారు. హుస్నాబాద్ ఇంఛార్జ్‌గా ఎంపీ వినోద్, సతీష్ బాబు, సుధాకర్ రెడ్డిలను, కోహెడకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గంగులు, సైదాపూర్‌కు మంత్రి ఈటలను, భీమదేవరపల్లికి పుట్ట మధు, ఎల్కతుర్తికి విద్యాసాగర్‌రావులను ఇంఛార్జీలుగా నియమించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయా మండలాల ఇంఛార్జ్‌లు కార్యకర్తతో భేటీకానున్నారు. -
ట్రయల్ రన్‌లోనే లీక్.. ఉవ్వెత్తున జలపాతం!
సాక్షి, హుస్నాబాద్: మిషన్ భగీరథ ట్రయల్ రన్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణం నడిబొడ్డున శుక్రవారం భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంత వరదమయమైంది. అంతెత్తున ఎగిసిపడుతున్న నీటి ఉధృతికి అక్కడ జలపాతం ఉందేమోనన్న భ్రాంతి కలిగింది. ఒక్కసారిగా నీరు పైకి ఎగజిమ్మడంతో అక్కడున్న వారంత ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత సన్నగా మొదలైన నీటి ధార చూస్తుండగానే ఉధృతమైన వరదలా మారింది. ట్యాంకర్ల కొలది నీరు రోడ్ల వెంట పరుగులు పెట్టింది. అధికారులకు సమాచారం అందించడంతో నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ఓ యువకుడు ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. -
మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ
-
కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు
చిగురుమామిడి(హుస్నాబాద్) : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిగురుమామిడిలో సోనియాగాంధీ చిత్రపటానికి కార్యకర్తలతో కలసి క్షీరాభిషేకం చేశారు. ఈ పథకాలు, ఆ పథకాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నేటికి నెరవేరలేదని, మళ్లీ కొత్త వాగ్దానాలతో రైతులు, ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. రైతుబంధు పథకం ఉన్నవాడికే లాభదాయకమన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేం లేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు తప్పనిసరిగా 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వంగర మల్లేశం, డీసీసీ కార్యదర్శి చిటుమల్ల రవీందర్, ఎస్సీ, ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ బోయిని సురేశ్, మాజీ దేవస్థానం చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాబుమియా, నాయకులు కాటం సంపత్‌రెడ్డి, గజ్జేల రాములు, కూతురు మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పచ్చిమట్ల లక్ష్మి, గాజుల అంజారెడ్డి, పోటు మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఆగని రెవెన్యూ లీలలు
అక్కన్నపేట(హుస్నాబాద్) : రెవెన్యూ లీలలు ఒక్కొకటిగా బయట పడుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన శుద్ధీకరణ–నవీకరణ కార్యక్రమంలో వీఆర్వోలు చేతివాటంను ప్రదర్శించారు. గుంట భూమితో సహా రైతుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన బాగోతంపై రైతులే స్వయంగా ఫిర్యాదులు చేయడం విశేషం. అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు పోతారం(జే),రామవరం గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసిన విషయాలు తెలిసిందే. ఇదిలా ఉండగా మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన విట్టల మల్లయ్య అనే రైతు భూమి సర్వే నెంబర్ 5ఏలో 25గుంటల భూమి ఉంది. పట్టా చేయాలని భూ ప్రక్షాళన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.10వేలు ఇస్తే కానీ పట్టా చేయనని వీఆర్వో డిమాండ్ చేయడంతో సదరు రైతు మల్లయ్య రూ.10వేలను సైతం అప్పగించా డు. కానీ నేటికి రైతుకు పట్టా పాసుపుస్తకం ఇవ్వకుండా ఇంకా పైసలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేస్తున్నాడని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఆందోళనలతో మోమో ఏఐవైఎఫ్ నాయకులు ఇటీవల పోతారం(జే) వీఆర్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తు తహసీల్ధార్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తహసీల్ధార్ సదరు వీఆర్వోకు మోమోను జారీ చేశాడు. ఒక్క రోజులో వివరణ ఇవ్వాలని, లేకపోతే కలెక్టర్‌కు సమాచారం అందించనున్నట్లు తెలిసింది.పట్టా పాసుపుస్తకం కావాలంటే డబ్బులు అడిగిండు నాకు 18ఎకరాల 6గుంటల వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం ద్వారా కొత్త పట్టా పాసుపుస్తకాలు ఇస్తుండ్రు. కానీ నాకు చెక్కు ఇచ్చారు. పట్టా పాసుపుస్తకం కావాలంటే వీఆర్వో రూ.1500 ఇస్తేనే ఇస్తానంటుండ్రు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. ఎండీ ఖాసీం, రామవరం -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
చిగురుమామిడి(హుస్నాబాద్) : వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న యువకుల బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు ట్రాక్టర్ యజమాని ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో ఆదివారం జరిగింది. వివరాలు పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం. గాగిరెడ్డిపల్లికి చెందిన ప్రశాంత్ తన స్నేహితుడు భిక్షపతితో కలిసి శనివారం బెజ్జంకి మండలం రేపాక గ్రామానికి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. శనివారం రాత్రి దాదాపు 8.30 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి తిరుగు ప్రయణమయ్యారు. ఈక్రమంలో చిగురుమామిడి శివారులోని ఊరచెరువు కట్టకింద లంబాడిపల్లికి వెళ్లేదారిలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్, భిక్షపతి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను కరీంనగర్‌కు ప్రైవేటు వాహనంలో తరలించారు. చికిత్స పొందుతూ కూన ప్రశాంత్ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. ప్రశాంత్ మల్లవ్వ–బాలయ్య దంపతుల చిన్నకుమారుడు. యువకుడికి పెళ్లి కాలేదు. పదోతరగతి వరకు చదువుకుని ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ప్రశాంత్ దుర్మరణం తట్టుకోలేక కోపోద్రిక్తులైన బంధువులు మృతదేహంతో ట్రాక్టర్ యజమాని కాటం రాజిరెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ ధర్నా కొనసాగించారు. చిగురుమామిడి ఎస్సై సత్యనారాయణ అక్కడికి చేరుకుని ప్రశాంత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాజిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సతీ మమత
హుస్నాబాద్‌రూరల్ : కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురై మంచాన పడ్డ భర్తకు తన నగలు చివరకు తాళి బొట్టుకూడా అమ్మి వైద్యం చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ సతీ మమత. కలకాలం ఏ కష్టం వచ్చిన తోడుగా ఉంటానని బాస చేసి తాళి కట్టిన భర్తకు అనుక్షణం అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. భర్త ఆస్పత్రి ఖర్చులకు, కుటుంబ పోషణకు ఆమె ఒంటి మీద ఉన్న బంగా రం, ఉన్న ఆస్తి అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక మమత సతమతమవుతోంది. కులి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నా, భర్తకు ఎలా వైద్యం చేయించాలో తెలియక సాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద సాయం మంజూరు చేయాలని వేడుకుంటోంది. కుటుంబాన్ని కల్లోలం చేసిన ప్రమాదం.. హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్‌కు చెందిన కుంటమల్ల రమణచారి మమత దంపతులు వివాహాం తర్వాత ఫోటో స్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగించారు. వీరికి ఒక కూతురు ఉంది. రమణా చారి గత సంవత్సరం మార్చిలో ఓ పెళ్లికి ఫొటోలు తీయడానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రమాణా చారి ప్రాణాలతో బయటపడ్డా ఎడమ చేయి, కాలు మాత్రం పనిచేయడం లేదు. నాటి నుంచి నేటి వరకు అతని వైద్యం కోసం రూ. 8 లక్షల వరకు ఖర్చైంది. అతని భార్య మమత తాన తాళితో సహా, నగలను సైతం అమ్మేసి వైద్యం చేయించింది. బంధువుల వద్ద రూ. 2 లక్షల అప్పు చేసి భర్త వైద్యం కోసం ఖర్చు పెట్టింది. కుటుంబ పోషనకు కూలి పనికి సైతం వెళ్తోంది. మరో నాలుగేళ్లు వైద్యం మరో నాలుగు సంవత్సరాలు వైద్యం అందిస్తే రమణాచారి ఎప్పటిలాగే నడుస్తాడని వైద్యులు మమతకు సూచించారు. భర్తను ఎలాగైనా నడిచేలా చేయాలన్న సంకల్పంతో మమత ప్రతీ నెల హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో భర్తకు వైద్యం చేయిస్తోంది. ప్రతీ నెల వైద్య ఖర్చులకు రూ. 10 వేలు, ప్రయాణానికి మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది. ప్రతీ నెల ఆ డబ్బులు సమకూర్చలేక మమత అవస్థలు పడుతోంది. అచేతన స్థితిలో ఉన్న తన భర్తకు ప్రభుత్వం స్పందించి చిన్న పని చూపించాలని వేడుకుంటోంది. తద్వారా మందుల ఖర్చులు అయినా తీరుతాయ ని ప్రాధేయపడుతోంది. సాయం చేయని సదరం క్యాంపు అధికారులు.. ఏడాది నుంచి రమణచారి సదరం క్యాంపు చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. 2017 సెప్టెంబర్‌లో సిద్దిపేట సదరం క్యాంపుకు పోయిన రమణచారికిని వైద్యులు పరీక్షించి ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఇంటికి పంపించారు. ంతో అధికారులు పింఛన్ ఇవ్వడం లేదు. అందని సీఎం సహాయ నిధి... భర్త ఆరోగ్యం కోసం మరో మూడేళ్లు వైద్యం అందించడానికి వైద్యం కోసం చేతిలో పైసలు లేక అవస్థలు పడుతోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన భర్తకు వైద్యం చేయించడానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు స్పందించి సీఎం సహాయ నిధి నుంచి సహాయం అందేలా చూడాలని కోరుతోంది. జిల్లా కలెక్టర్ స్పందించి కంప్యూటర్ పరిజ్ఞనం ఉన్న రమణాచారికి ఏదైన ఉపాధి చూపించి వీధిన పడ్డ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మమత వేడుకుంటోంది. -
ప్రాణం తీసిన పూడిక బావి
భీమదేవరపల్లి(హుస్నాబాద్) : ఎండిపోతున్న మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు తాపత్రయపడిన యువరైతు తన వ్యవసాయ బావి పూడికతీసేందుకు ఉపక్రమించాడు. దురదృష్టావశాత్తు వ్యవసాయ బావిలోనుంచి క్రేన్ సాయంతో పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌కు గ్రామానికి చెందిన బొల్లంపల్లి రాకేష్(30) అనే యువ రైతు దుర్మరణం పాలయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గట్లనర్సింగపూర్‌కు చెందిన బొల్లంపల్లి యోహోన్, కొంరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కలదు. పెద్ద కుమారుడైన రాకేష్ డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయం చేస్తున్నాడు. వీరికున్న ఎకరం వ్యవసాయ భూమిలో వర్షకాలంలో పత్తి పంట సాగు చేస్తే దిగుబడి రాలేదు. దీంతో యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికొచ్చె సమయంలోనే వ్యవసాయ బావిలో నీటి మట్టం తగ్గిపోవడంతో పంట వల్లుమోహం పట్టింది. దీంతో పంటను రక్షించుకునేందుకు గత రెండు రోజుల క్రితమే క్రేన్ సాయంతో తండ్రి యోహోన్, కుమారుడు రాకేష్‌తో పాటుగా కూలీలతో వ్యవసాయ బావిలో పూటీకతీత పనులు చేపట్టారు. కాగా బుధవారం బావిలోని విద్యుత్ మోటర్ పనిచేయకపోవడంతో మోటర్‌ను పైకి తీసేందుకు రాకేష్ బావిలోకి దిగాడు. క్రేన్ వైర్ మోటర్‌కు అమర్చి మోటర్‌పై రాకేష్ కూర్చుండి పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో రాకేష్ బావిలో పడగా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా మారిన రాకేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. మృతదేహాన్ని సర్పంచ్ సల్పాల రాధికతిరుపతితో పాటు పలువురు సందర్శించి నివాలులర్పించారు. కాగా రాకేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్యాల ప్రకాశ్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి షడ్రక్ ప్రభుత్వాన్ని కోరారు. -
వీరులారా వందనం
హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకాలను నేటి ప్రజలు మరిచి పోవడం లేదు. నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన వీరుల జ్ఞాపకార్థం గుట్ట కింద అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిల సమాధులు నిర్మించి ప్రతి ఏటా సెప్టెంబర్ 17న, మార్చి 14 కమ్యూనిస్టులు నిర్వహించే సభలకు ప్రజలు పార్టీలకు అతీతంగా హాజరై వీరులకు నివాళులర్పించి ఆనాటి జ్ఞాపకాలను నేమరువేసుకుంటారు. మహ్మదాపూర్ శివారులోని ఎతైన గుట్టలు, ప్రకృతి సోయగాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకొనే ప్రకృతి సౌందర్యం కోటగిరి గుట్టల సొంతం. ప్రతీ శ్రావణమాసంలో పర్యటకులు గుట్టల ప్రదేశానికి వనభోజనాలకు వచ్చి ఆనందంగా గడిపి ఆనాటి తెలంగాణ వీరు త్యాగాలను స్మరించుకుంటారు. ప్రతీ ఏటా సీపీఐ అధ్వర్యంలో హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్ వరకు భారీ ర్యాలీ తీసి అమరుల వర్ధంతి సభను ఘనంగా జరుపుకుంటారు. 2016 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పేరున భారీతీయ జనతా పార్టీ మహ్మదపూర్లోని అమరుల వీర భూమిని సందర్శించి పర్యటక కేంద్రంగా మార్చుతామని చెప్పినా నేటికి ఆచరణలో అమలుకు నోచుకోలేదు. 14 మంది వీరుల మరణానికి గుర్తుగా నిర్మించిన శిలా ఫలకం సాయుధ వీరులకు స్థావరం ఈ కోటలు.... తెలంగాణ పేద ప్రజల విముక్తి కోసం నిజాం ప్రభుత్వ అరాచక పాలనను ఎదిరించిన తెలంగాణ సాయుధ పోరాట వీరులకు, హుస్నాబాద్ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. సాయుధ పోరాటంలో పేదల విముక్తి కోసం పోరు చేసిన కమ్యూనిస్టులు పోలంపల్లికి చెందిన అనభేరి ప్రభాకర్‌రావు, íసిరిసిల్ల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డిల దళాలు రజాకార్ల పోరు చేస్తూ మహ్మదాపూర్‌కు చేరుకున్నాయి. 14 మార్చి 1948లో పేద ప్రజలకు చైతన్యం చేస్తున్నక్రమంలో మహ్మదాపూర్లో సమావేశం అయినప్పుడు రజాకార్లు సమాచారం తెలుసుకొని సాయుధ దళాలపై దాడులు చేశాయి. రజాకార్ల తో పోరు చేస్తూ గుట్టలకు వెల్లుతున్న సాయుధులను రజాకార్లు వెంటబడి వేటాడి కాల్పులు జరుపడంతో అక్కడే 12 మంది వీరులు వీరమరణం పొందారు. దీంతో హుస్నాబాద్ ప్రాంతానికి ప్రత్యేకత చోటు చేసుకుంది. వీరుల జ్ఞాపకార్థం ఆనాటి దళనాయకులైన అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి పేరుతో రెండు సమాధులు నిర్మించారు. ప్రతి ఏటా వర్ధతి రోజున సీపీఐ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తూ వీరుల త్యాగలను గుర్తు చేసుకుంటారు. పర్యాటక కేంద్రం చేయాలి.. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రం చేయాలని ఆనాటి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపించారు. పర్యటక కేంద్రానికి వైఎస్ సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా ప్రయత్నం సాగుతున్న క్రమంలో ఆయన మరణంతో పర్యటక కేంద్రం అక్కడే ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి పర్యటక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి
కోహెడ(హుస్నాబాద్): కోహెడలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుం ది. బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెపల్లికి చెందిన గొట్టే చంద్రయ్య(42) 20 సంవత్సరాల క్రితం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో అవుట్సోర్సింగ్ ద్వారా విధుల్లో చేరాడు. బస్వాపూర్ చెక్ పోస్టులో సై తం సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహించారు. కోహె డ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు అనంతరం కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కోహెడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట శుక్రవారం గణతంత్ర వేడుకలకు జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నాడు. జెండా కోసం సిద్ధం చేసిన ఇనుమ పైపు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రూ.5 లక్షలు విద్యుత్ శాఖ ద్వారా, మరో రూ.5 లక్షలు వ్యవసాయ మార్కెట్ శాఖ నిధుల నుంచి బాధిత కుటుంబానికి అందే విధంగా కృషి చేస్తామన్నారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి పంపిణీ చేయాలని ఆర్డీఓ శంకర్‌కుమార్‌ను కోరారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. ఎస్ఐ చాంద తిరుపతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి నాగేశ్వర్‌శర్మ, పెర్యాల రవీందర్రావు, దేవేందర్‌రావు, ఎంపీపీ ఉప్పుల స్వామి, జెడ్పీటీసీ సభ్యుడు పొన్నాల లక్ష్మయ్య, కోహెడ పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కర్ర శ్రీహరి, తైదాల రవి, వైస్ చైర్మన్లు కోల్ల రాంరెడ్డి, తోట ఆంజనేయులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. -
హత్యా..? ఆత్మహత్యా..?
సైదాపూర్(హుస్నాబాద్): ఓ యువకుడు ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని అనుమానాస్పదస్థితిలో చనిపోయిన ఘటన మండలంలోని ఎలబోతారం గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. యువకుడి మృతికి సదరు మహిళే కారణమని, వివాహేతర సంబంధం నెరిపి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన మ్యాకల ముత్యాలమ్మ, రాజయ్య కుటుంబం మండలంలోని ఎలబోతారం గ్రామానికి ఏళ్ల క్రితమే వలసవచ్చింది. వీరి కుమారుడు హరీష్(23) చింతలపల్లి గోదాములో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులిద్దరూ హరీశ్ చిన్నతనంలోనే చనిపోయారు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో హరీష్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సదరు వివాహిత భర్త రాజన్నసిరిసిల్ల జిల్లాలో పనిచేస్తుండగా.. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎలబోతారంలోనే ఉంటోంది. హరీష్‌తో వివాహేతర సంబంధముందన్న విషయం తెలిసి ఆమె భర్త తరచూ గొడవపడుతున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేవరకూ వెళ్లింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా.. కొద్దిరోజులకు మళ్లీ ఎప్పటిలాగే వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి హరీష్ మద్యంతాగి తన ఇంటికి వచ్చాడని సదరు వివాహిత పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించింది. బ్లూకోట్ సిబ్బంది వచ్చేసరికే.. ఇంట్లో దూళానికి ఉరేసుకుని కనిపించాడు. ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హరీష్‌ను సదరు మహిళే హత్య చేసి ఉంటుందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని ఆందోళనకు దిగారు. అనుమానితులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో సదరు వివాహితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. -
మత ఘర్షణలు సృష్టిస్తున్న బీజేపీ
మద్దూరు(హుస్నాబాద్): బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్ చేతిలో కీలు బొమ్మగా మారి దేశంలో మత ఘర్షణలు సృష్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి. వెంకట్ ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో సీపీఎం 4వ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బోయిని సిద్దిరాములు అమరవీరుల స్థూపం వద్ద పార్టి జెండాను ఆవిష్కరించి, అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తోంటే బీజేపి ప్రభుత్వం సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడుతోందని అన్నారు. సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. జీఎస్టీ పేరుతో పేద ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ విధానాలనే అవలంబిస్తూ రైతులను మోసం చేస్తోందన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెరాల భూపంపిణీ, రైతుల రుణ మాఫీల్లో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, దాసరి కళావతి, ఆలేటి యాదగిరి, సుంచు విజేందర్, ఎండీ షఫీ, సావిత్రి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ తర్వాత కూడా చదువుకుంటాం..పెళ్లి చేసుకోం!
సిద్దిపేట: పదో తరగతి పూర్తయిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోబోమని, ఉన్నత చదువులు చదువుకుంటామని కస్తూరిభా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ప్రమాణం చేశారు. నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, వ్యవసాయ చైర్మన్ లింగాల సాయన్న పాఠశాలలో బుధవారం ఉదయం డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంఈవో అర్జున్ మాట్లాడారు. పాఠశాల విద్యార్థినులు తమకు ఒక హామీ ఇవ్వాలని కోరారు. పేద కుటుంబాల వారు తమ బిడ్డలు మంచి చదువులు చదివి ప్రయోజకులు కావాలని కలలు కంటున్నారని అన్నారు. అయితే, ఎక్కువ మంది పదో తరగతి పూర్తి కాగానే పెళ్ళిళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా, ఉన్నత చదువులు చదివిన తర్వాతే వివాహం చేసుకొనేలా తమకు మాట ఇవ్వాలని కోరారు. దీంతో విద్యార్ధినులంతా ఒక్కసారిగా తాము టెన్త్ అయిపోగానే ఎట్టి పరిస్ధితుల్లో వివాహం చేసుకోమని, ఉన్నత చదువులు పూర్తి చేసే వరకూ పెళ్ళి మాట ఎత్తమని, మాటే కాదు ప్రమాణం చేసి చెబుతున్నామని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ
ట్రేడ్ ఇండియా ఫర్ యూ పేరిట మోసం కటకటాల్లోకి నిందితుడు హుస్నాబాద్ : ట్రేడ్ యూనియన్ ఫర్యూ డాట్‌కమ్ పేరిట మోసాలకు పాల్పడడమే కాకుండా.. కిడ్నాప్ కథ అల్లిన ఓ సైబర్ నేరస్తున్ని కోహెడ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సదరు నిందితుడికి సంబంధించిన వివరాలను హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ దాసరి భూమయ్య విలేకరులకు వెల్లడించారు. బెజ్జంకి మండలం మాదాపూర్‌కు చెందిన గూడూరు శ్రీనివాసాచారి కరీంనగర్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్ ఫర్యూ డాట్ కమ్ పేరిట వెబ్సైట్ ప్రారంభించాడు. రూ.20వేలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.వెయ్యి చొప్పున నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తానని నమ్మించాడు. ఇందుకు గొలుసుకట్టు విధానాన్ని ఎంచుకున్నాడు. ఇలా హుస్నాబాద్, కోహెడ, మెదక్ జిల్లా సిద్దిపేటలో కొందరిని ఏజెంట్లుగా పెట్టుకుని వారికి 20శాతం కమీషన్ ఇచ్చేవాడు. వారిద్వారా 50 మంది నుంచి దాదాపు రూ.కోటి వరకు వసూలు చేశాడు. అడ్డం తిరిగిన కిడ్నాప్ కథ డబ్బులు వసూలు చేసిన శ్రీనివాసాచారి రూ.వెయ్యి మాత్రం చెల్లించలేదు. దీంతో బాధితులు పలుమార్లు ఫోన్ చేసినా.. స్పందన లేదు. ఇటీవల కోహెడ మండలం పెద్దసముద్రాలకు రాగా.. బాధితులు నిలదీశారు. ఆ సమయంలో వారికి రూ. నాలుగు లక్షలు చెల్లించనున్నట్లు ప్రామిసరి నోట్ రాసిచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకున్న శ్రీనివాసాచారి తనను కొందరు కిడ్నాప్ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను అశ్రయించాడు. అతడి ఫిర్యాదుపై లోతుగా విచారణచేపట్టగా.. కిడ్నాప్ కథ ఒట్టిదేనని, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఐ వివరించారు. నిందితుడిని పట్టుకున్న కోహెడ ఎస్సై తిరుపతి, సిబ్బందిని అభినందించారు. హుస్నాబాద్ ఎస్సైలు సంజయ్, పాపయ్యనాయక్ తదితరులున్నారు. -
హుస్నాబాద్‌లో ఉద్రిక్తత
టవరెక్కిన యువకులు అఖిలపక్షం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన హుస్నాబాద్: హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలపకుండా కరీంనగర్‌లోనే కొనసాగించాలని కోరుతూ యువకులు సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అడిగినోళ్లందరికీ సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండలాలను ఇస్తుండగా..హుస్నాబాద్‌లో మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ వచ్చేంత వరకు టవర్ దిగేది లేదని స్పష్టం చేశారు. సీఐ దాసరి భూమయ్య, ఎసై ్స సంజయ్ అక్కడికి చేరుకుని ఇక్కడి ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు టవర్ దిగొచ్చారు. మరో వైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, అఖిలపక్ష నాయకులు మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, వలుస సుభాష్, అక్కు శ్రీనివాస్, వాల నవీన్, వరయోగుల అనంతస్వామి, విద్యాసాగర్ తదితరలున్నారు. -
ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డు శివారులోని కల్వర్టు వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి బస్సు అద్దాలు పగులగొట్టారు. బస్సు డ్రైవర్ చంద్రారెడ్డి కథనం ప్రకారం.. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్ హన్మకొండ నుంచి సిద్దిపేటకు వెళ్తోంది. మార్గమధ్యంలో హుస్నాబాద్ శివారులో కల్వర్టర్ సమీపంలో ఎదురుగా రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు బస్సు ఆపాలని కోరారు. దీంతో డ్రైవర్ చంద్రారెడ్డి బస్సు నిలపివేశాడు. బైక్‌పై వచ్చిన వారు బస్సు వెనుక భాగంలోని అద్దాలను పగులగొట్టారు. దీంతో 20 మంది ప్రయాణికులు భయంతో బస్సు దిగి పరుగులు పెట్టారు.ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. హుస్నాబాద్ పట్టణంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మురికి కాలువలు చెత్తా, చెదారంతో నిండిపోవడంతో మురికి నీరు, వరద నీరంతా రహదారులపై నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు దుకాణాలు, ఇళ్ళలోకి వరదనీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ఆవరణలోని మురికి కాలువ మట్టితో పూర్తిగా కూరుకుపోవడంతో బస్టాండ్ ఆవరణంతా సేలయేరుగా మారింది. హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన్లు, వరిపొలాలు నీటితో నిండాయి. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో వ్యవసాయ బావి తవ్వుతున్న కూలీలు వర్షం రావడంతో చెట్టుకిందకు చేరారు. వీరిపై పడుగు పడింది. మేడిచెల్మల రాజయ్య(35) మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అత్యధికంగా కేశవపట్నం మండలంలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కమలాపూర్‌లో 8.4, ఎల్కతుర్తిలో 2.2, బెజ్జంకిలో 4.8, కోహెడలో 6.3, హుస్నాబాద్‌లో 4.8, సైదాపూర్‌లో 3.6, గంగాధరలో 2.7, చిగురుమామిడిలో 3.2, రామడుగులో 2.9, మల్లాపూర్‌లో 2.6, కోరుట్లలో 2.2, మేడిపల్లిలో 2.2, ముస్తాబాద్‌లో 4.2, వేములవాడలో 2.1, బోయినిపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన మండలాల్లో ముసురువర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఏకపక్షంగా విభజిస్తే రావణకాష్టమే...
పోలీసులు ప్రభుత్వానికి ఏజెంట్లు కాదు..ప్రజల సేవకులు సీపీఐ శాసనసభ పక్ష మాజీ నేత గుండా మల్లేశం హుస్నాబాద్ : జిల్లాల పునర్విభజనలో ప్రజాభీష్టాన్ని గౌరవించక ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని సీపీఐ శాసనసభ పక్ష మాజీ నేత గుండా మల్లేశం హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హుస్నాబాద్ బంద్‌కు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ భుస్నాబాద్ను కరీంనగర్లో కొనసాగించాలని ఉద్యమం చేస్తున్న అఖిలపక్ష నాయకులపై పోలీస్‌లు అత్యుత్సాహం చూపి దుశ్చర్యలకు పాల్పడడాన్ని ఖండించారు. పోలీసులు ప్రభుత్వ ఏజెంట్లు కాదని ప్రజాసేవకులని అన్నారు. సిద్దిపేటకు ఇచ్చే ప్రాధాన్యత ఇతర జిల్లాలకు ఇవ్వడంలేదని ఆరోపించారు. సీఎంకు మతిభ్రమించిందని ప్రజలను పిచ్చోళ్ల మాదిరిగా చేస్తున్నాడని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు రాజకీయ జీవితం ఇచ్చిన కరీంనగర్ గుండెతో ఆడుకుంటున్నాడనిఅన్నారు. జిల్లాను ఆరు ముక్కలు చేసి చరిత్ర, సంస్కృతి లేకుండా చేస్తున్నాడని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన కొత్త జిల్లాల ప్రక్రియ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగితే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్‌ను ముక్కలు చేస్తూ అస్థిత్వం లేకుండా చేస్తున్నాడని అన్నారు. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్లో కొనసాగించాలని డిమాండ్ చేశాడు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్, కొత్త మండలాలను విడగొడుతున్నారని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకొకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో రిలే దీక్షలు చేపడితే పోలీస్‌లతో టెంట్లు కూల్చివేయించడం, అరెస్ట్‌లు చేయడం బ్లాక్ డేగా అభివర్ణించాడు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
15నుంచి ఆమరణ దీక్ష
హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలి హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి శాసనమండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం హుస్నాబాద్ : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించకపోతే ఈ నెల 15 నుంచి అమరణ దీక్ష చేపడుతామని హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి హెచ్చరించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు ఎనిమిదో రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షలో మహ్మదాపూర్ గ్రామస్తులు కూర్చున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ.. మండలంలో మెజార్టీ గ్రామ పంచాయతీలు కరీంనగర్‌లోనే కొనసాగించాలని గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. ఇందుకు భిన్నంగా టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో హుస్నాబాద్‌ను సిద్దిపేటలో జిల్లాలో కలపాలని మళ్లీ తీర్మానాలు చేసి పంపించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సింగిల్ విండో డైరెక్టర్ అయిలేని మల్లిఖార్జున్‌రెడ్డి, అఖిల పక్ష నాయకులు ఆకుల వెంకట్, కొయ్యడ సృజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు కోమటి సత్యనారాయణ, చిత్తారి రవీందర్, అయిలేని శంకర్‌రెడ్డి, మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, పిట్టల నారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, వేముల ప్రభాకర్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్,జాగిరి సత్యనారాయణ, శివరాజ్, గవ్వ వంశీధర్‌రెడ్డి, వలస సుభాష్, రాజు,శ్రీధర్ తదితరులున్నారు. -
నగర పంచాయతీ ఎదుట అఖిలపక్షం ధర్నా
తీర్మానానికి చైర్మన్ కట్టుబడాలన్న నాయకులు హుస్నాబాద్ మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని నగర పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానానికి చైర్మన్ సుద్దాల చంద్రయ్య కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ బుధవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. హుస్నాబాద్‌ను కరీంనగర్‌లోనే కొనసాగించాలని నగర పంచాయతీలో తీర్మానం చేసిన చైర్మన్.. టీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో మాత్రం సిద్దిపేటలో కలపాలని మాట్లాడడం సరికాదన్నారు. మండలంలోని మెజార్టీ గ్రామాలు కరీంనగర్‌లోనే కొనసాగించాలని తీర్మానాలు చేసి అధికారులకు పంపించాయన్నారు. చైర్మన్ బయటకు రావాలని నినాదాలు చేశారు. నగరపంచాయతీ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. చైర్మన్ చంద్రయ్య బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ప్రజలకు ఏది ఆమోదయోగ్యంగా ఉంటే అదే చేస్తామన్నారు. ఒకసారి తీర్మానించాక పునరాలోచించబోమని స్పష్టం చేశారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు. ధర్నాలో సింగిల్‌విండో డైరెక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు అయిలేని శంకర్‌రెడ్డి, బొల్లి శ్రీనివాస్, మైదంశెట్టి వీరన్న, పచ్చిమట్ల రవీందర్, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల సంపత్, బీజేపీ నాయకులు విజయపాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మినారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, విద్యాసాగర్, అనిల్, వరయోగుల అనంతస్వామి, టీడీపీ నాయకులు వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజిరెడ్డి, సీపీఐ నాయకులు మాడిశెట్టి శ్రీధర్, జగన్నాధం తదితరులున్నారు. -
టీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధిస్తాం
హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి ఎమ్మెల్యే సతీష్‌కుమార్ దిష్టిబొమ్మ దహనం హుస్నాబాద్ : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్లో కొనసాగించకపోతే టీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధిస్తామని హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి హెచ్చరించారు. హుస్నాబాద్‌ను సిద్దిపేటలో కలపడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. కరీంనగర్లో కొనసాగించాలని గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసిన ఎవరి స్వార్థం కోసం సిద్దిపేటలో కలుపుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం మెుండి వైఖరి వీడనాడకుంటే టీఆర్ఎస్ నేతల ఇళ్ల ఎదుట చావుదప్పులు మోగిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్న, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, సీపీఐ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్, సింగిల్‌విండో డైరెక్టర్ అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, అయిలేని శంకర్‌రెడ్డి, లింగంపల్లి మల్లారెడ్డి, అక్కు శ్రీనివాస్, పచ్చిమట్ల రవీందర్, కేడం కనకయ్య, బీజేపీ నాయకులు వేముల ప్రభాకర్‌రెడ్డి, వేముల దేవేందర్‌రెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి, పెరుమాండ్ల శేఖర్, టీడీపీ నాయకులు ముప్పిడి రాజిరెడ్డి తదితరులున్నారు. స్వార్థ రాజకీయాల కోసమే.. –బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలుపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌ను కరీంనగర్లో కొనసాగించాలని అఖిలపక్షం చేపట్టిన రిలే నిరహార దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి సంఘీభావం తెలిపారు. అభివృద్ధి చేయలేని ఎమ్మెల్యే సిద్దిపేటలో కలిపేందుకు అంగీకరించడం సిగ్గుచేటన్నారు. సైదాపూర్‌ను హన్మకొండ జిల్లాలో కలపాలని అక్కడి గ్రామాలు తీర్మానాలు చేయడం వెనుక ఎమ్మెల్యే కుట్ర దాగి ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీక్షలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పెందోట అనిల్‌కుమార్, గుత్తికొండ విద్యాసాగర్, అన్నబోయిన ప్రశాంత్, వరయోగుల అనంతస్వామి, జున్నోజు శ్రీకాంత్, భీమేశ్వర్, చందు, బోనగిరి రవి, ప్రదీప్ కూర్చున్నారు. -
రెవెన్యూ డివిజన్‌పై సీఎంతో మాట్లాడుతా
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హుస్నాబాద్ : హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలని అఖిలపక్ష నాయకులు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం కలిశారు. సిద్దిపేటలో హుస్నాబాద్‌ను కలిపితే రెవెన్యూ డివిజన్ ఏర్పడే పరిస్థితులు లేవని అఖిలపక్ష నాయకులు వారికి తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిందని, హుస్నాబాద్‌కు రెవెన్యూ డివిజన్ విషయమై సీఎంతో మాట్లాడుతానని కెప్టెన్ లక్ష్మీకాంతారావు హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. పదిహేను రోజుల్లోగా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పినట్లు వారు తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మాణాల కాపీలతో అభ్యంతరాల స్వీకరణలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారన్నారు. హుస్నాబాద్ పరిరక్షణ సమితి కన్వీనర్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో అధ్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, జేఏసీ మండల కన్వీనర్ కొయ్యడ కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు చిత్తారి రవీందర్, మైదంశెట్టి వీరన్న, బొల్లి శ్రీనివాస్, అక్కు శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆడెపు లక్ష్మీనారాయణ, వేముల దేవేందర్‌రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, పెందోట అనిల్‌కుమార్, సీపీఎం నాయకులు జాగిరి సత్యనారాయణ, శివరాజ్, సీపీఐ నాయకులు గడిపె మల్లేశ్, హన్మిరెడ్డి, మాడిశెట్టి శ్రీధర్, టీడీపీ నాయకులు వరయోగుల శ్రీనివాస్, ముప్పిడి రాజిరెడ్డి పాల్గొన్నారు.