వీరంతా హుస్నాబాద్ మండలం ధర్మారం పంచాయతీ పరిధి ర్యాగటోనిపల్లి రైతులు. ఎస్‌ఎస్1 కింద 45 బావులు ఉండగా.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీ మాత్రం 100 కేవీ. ఇప్పటికే మూడుసార్లు ఓవర్‌లోడ్‌తో కాలిపోయింది. అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌కోసం రైతులు 22 రోజుల క్రితం రూ.62 వేల డీడీ తీసి స్థానిక అధికారులకు ఇచ్చారు. వారు ఎస్‌ఈకి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పంపామని డీఈఈ చెప్పడంతో రైతులు ఎస్‌ఈ దగ్గరికి ఇప్పటికి మూడుసార్లు వెళ్లినా అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ తిప్పుకుంటూ నేటికీ వారి ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వలేదు. దీంతో వారి పంటలు ఎండిపోతున్నారుు.
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : మెట్టప్రాంతమైన హుస్నాబాద్‌ను ఓవర్‌లోడ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నెల రోజులుగా రెండువందలకుపైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయూరుు. ఫలితం.. వేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చేను పండించేందుకు సరిపడా నీళ్లున్నా... ఓవర్‌లోడ్‌ను తీర్చేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను బిగించే విషయంలో ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయి.
రబీ సీజన్‌లో పంటలసాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో విద్యుత్ కష్టాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌తో 5 హెచ్‌పీ మోటార్లు 20 నడుస్తారుు. ఒక్కో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌పై 40 నుంచి 50 వరకు విద్యుత్ మోటార్ల కనెక్షన్లు ఉండడంతో ఓవర్‌లోడ్ సమస్య తలెత్తుతోంది. దీంతో తరుచూ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వాటిస్థానంలో మరో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరగడం.. ఒకవేళ ఏర్పాటు చేసినా వెనువెంటనే కాలిపోతుండటంతో పొలాలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. హుస్నాబాద్, అంతకపేట, అక్కన్నపేట, జనగామ, మీర్జాపూర్, పందిల్ల, కేశ్వాపూర్, మహ్మదాపూర్ తదితర గ్రామాల్లో ఓవర్‌లోడ్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు వంతులవారీగా విద్యుత్‌మోటార్లను ఉపయోగించుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.
150కి పైగా ప్రతిపాదనలు
ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయంటూ రైతులు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లకోసం డీడీలు చెల్లిస్తున్నా మంజూరులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఒక్క హుస్నాబాద్ మండలంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 130, డివిజన్ పరిధిలో 150కిపైగా ప్రతిపాదనలు వె ళ్లారుు. మంజూరు మాత్రం 20 ఇచ్చారు. మిగతా వాటికోసం రైతులు ఎస్‌ఈ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
అడిగేది 100, 60కేవీ.. ఇచ్చేది 25కేవీలు
ఓవర్‌లోడ్ సమస్య అధిగమించేందుకు 100, 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు బిగించాల్సి ఉండగా.. ట్రాన్స్‌కో అధికారులు మాత్రం 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు ఇస్తున్నారు. వీటితో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ప్రత్యేకంగా లైన్ల నిర్మాణం చేపట్టాల్సి వస్తుందని, పనుల జాప్యంతో పంటలు చేతికి వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు మాత్రం 25, 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఇస్తామని చెబుతున్నారు. ఓవర్‌లోడ్ తగ్గించేందుకు 100, 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను కేటాయించని పక్షంలో రబీ పంటలు చేతికి అందకుండా పోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తప్పిదమే అసలు కారణం
వ్యవసాయానికి విద్యుత్ అందించేందుకు మూడేళ్ల క్రితం 25, 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించినా హుస్నాబాద్ మండల అధికారులు అనుసరించిన నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారింది. మూడు బావులకు 16 కేవీ, ఐదు బావులకు 25 కేవీ చొప్పున విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మిగతా మండలాల్లో బిగించినా ఇక్కడ మాత్రం పట్టించుకోలేదు. దీంతో హుస్నాబాద్ మండలంలో రైతులు ఓవర్‌లోడ్ సమస్య ఎదుర్కోవాల్సి వ స్తోంది.
అన్నదాతకు ఓవర్‌లోడ్
Published Thu, Feb 6 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement