కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని శాంతినగర్‌లో ప్రజలు డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారు.
హుస్నాబాద్(కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని శాంతినగర్‌లో ప్రజలు డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారు. ఆదివారం నాటికి శాంతినగర్‌కు చెందిన ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి తీవ్రంగా ఉంది. అంతే కాకుండా మరో ఆరుగురు డెంగీ భారినపడి చికిత్స పొందుతున్నారు. మండల కేంద్రానికి చెందిన రజినీకాంత్(26) గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగా, శనివారం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రజినీకాంత్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, ఇదే ప్రాంతానికి చెందిన వంశీ(25) అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రజినీకాంత్‌కు భార్య ఇద్దరు పిల్లలున్నారు.