Dengue fever
-
ఐదు దోమలకు రూపాయిన్నర
మనీలా: డెంగీ వ్యాధి పేరు చెబితే ఎవరైనా హడలిపోవాల్సిందే. ప్రజాసంక్షేమానికి, తమ పౌరుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సైతం డెంగీ పేరు చెబితే వణికిపోతోంది. విజృంభిస్తున్న డెంగీ కేసులు, దోమలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది మాత్రమే రంగంలోకి దిగితే సరిపోదని స్థానిక పాలకులు భావించారు. పౌరులను ఈ క్రతువులో భాగస్వాములను చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా దోమలను చంపితే నజరానా ఇస్తామని ప్రకటించారు. ప్రతి ఐదు దోమలకు ఒక ఫిలిప్పీన్స్ పేసో( 1 పేసో అంటే భారతీయ కరెన్సీలో రూ.1.50) చొప్పున డబ్బులు ముట్టజెప్తామని సెంట్రల్ మనీలాలోని బరాంగే అడిషన్ హిల్స్ గ్రామ పెద్ద కార్లిటో సెర్నాల్ స్పష్టంచేశారు. దోమలను చంపితే కూడా డబ్బులిస్తారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు వ్యంగ్య పోస్ట్‌లు చేసినా ఆయన దానిని సానుకూలంగా స్పందించారు. ‘‘ఎవరేమనుకున్నా పర్లేదు. మాకు మా పౌరుల ఆరోగ్యమే ముఖ్యం’’అని తాపీగా సమాధానమిచ్చారు. ఇటీవల ఈ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు దోమకాటు కారణంగా డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ దోమల దండుపై దండయాత్రకు గ్రామపెద్ద పిలుపునిచ్చారు. ‘‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన దోమనల్లా చంపేయండి. కేవలం నెలరోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది’’అని ఆయన మరోసారి గుర్తుచేశారు. ఖాళీగా కూర్చోకుండా దోమల బ్యాట్‌తో రంగంలోకి దిగితే మంచి డబ్బులొస్తాయని కొందరు వెంటనే పని మొదలెట్టారు. గ్రామంలో ఇప్పటికే 21 మంది తాము చంపిన, సజీవంగా పట్టితెచ్చిన దోమలు, వారి లార్వాలను చూపించారు. వాళ్లు వందలాది దోమలు, లార్వాలను తీసుకొచ్చారు. బతికున్న దోమలను అవి డెంగీ వ్యాధికారక రకం దోమలో కాదో అతినీలలోహిత కిరణాల కింద పెట్టి పరీక్షించి నిర్ధారిస్తామని గ్రామ పెద్ద చెప్పారు. ఈ తతంగం చూసి నవ్వుకున్న కొందరు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో వ్యంగ్య పోస్ట్‌లు పెట్టారు. ‘‘పట్టుకునే, చంపే క్రమంలో దోమ రెక్క ఒకటి ఊడిపోతే దానిని లెక్కలోకి తీసుకుంటారా? లేదంటే తిరస్కరిస్తారా?’’అని ఒక వ్యక్తి పోస్ట్‌చేశారు. మెచ్చుకున్న ప్రభుత్వం స్థానిక యంత్రాంగం స్థాయిలో దోమల వ్యాప్తి కట్టడికి జరుగుతున్న కృషిని ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెచ్చుకుంది. ‘‘ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సిందే. పౌరులు సైతం తమ వంతు బాధ్యతగా స్థానిక ఆరోగ్య అధికారులు లేదా ఫిలిప్పీన్స్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ ఆఫీస్‌లకు వెళ్లి డెంగీ నివారణ, దోమల వ్యాప్తి నిరోధక పద్ధతులపై అవగాహన పెంచుకోండి’’అని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘మా ప్రాంతంలో దోమల బెడద చాలా ఎక్కువ. ఇటీవలే 44 డెంగీ కేసులు వెలుగుచూశాయి. సొంతంగా కట్టడి చర్యలకు ఉపక్రమించాం. ఎవరేమనుకుంటున్నారు అనేది మాకు అనవసరం. మాకు తోచినంతలో మా ప్రాంతాన్ని మేం దోమలరహితంగా మారుస్తున్నాం’’అని గ్రామ పెద్ద అన్నారు. ‘‘సెంట్రల్ మనీలాలోని 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న బరాంగే అడిషన్ హిల్స్ జనాభా 70,000. డెంగీ కారక దోమలు లార్వాలను విడిచేందుకు వీలులేకుండా ఎప్పటికప్పుడు నీటి నిల్వ ప్రాంతాలను శుద్ధిచేయడం చేస్తున్నాం’’అని ఆయన చెప్పారు. ఉష్ణమండల దేశమైన ఫిలిప్పీన్స్‌లో దోమల సమస్య ఎక్కువే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన 40 శాతం అధికంగా ఏకంగా 28,234 డెంగీ కేసులు నమోదైనట్లు దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. నీరు నిల్వ ఉండే టైర్లు, నిరుపయోగ డ్రమ్ములు, బకెట్లను పారేయాలని, ప్రజలు చేతులు పూర్తిగా కప్పేసేలా వస్త్రధారణ ఉండాలని సూచించింది. -
వైఎస్ అభిషేక్‌రెడ్డి మృతి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి (36) శుక్రవారం మృతి చెందారు. ఇతను వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు(వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి కుమారుడు). కొద్ది రోజులుగా డెంగీ జ్వరంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.హైదరాబాద్ నుంచి ఆయన పారి్థవదేహం రాత్రి పొద్దుపోయాక పులివెందుల చేరుకుంది. సౌమ్యుడు, వివాద రహితుడు, ఉన్నత విద్యావంతుడిగా అభిషేక్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. సన్నీగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. ఆర్థోపెడిక్స్ వైద్యుడిగా రాణిస్తూనే రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. శనివారం మధ్యాహ్నం వరకు కార్యకర్తలు, నాయకుల సందర్శనార్థం పులివెందులలోని స్వగృహంలో అభిషేక్‌రెడ్డి పారి్థవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. అభిషేక్‌రెడ్డి మృతితో వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాగా, వైఎస్ అభిషేక్‌రెడ్డికి భార్య డాక్టర్ సౌఖ్య, పిల్లలు వైఎస్ అక్షర, వైఎస్ ఆకర్ష ఉన్నారు. -
హైదరాబాద్‌లో చికున్ గున్యా ,డెంగీ జ్వరాల విజృంభణ.. (ఫొటోలు)
-
డెంగీతో.. 'పసి హృదయం' విలవిల..! ఆదుకోవాలంటూ కన్నోళ్ల వేదన..!!
మహబూబాబాద్: ఓ పసి హృదయం విష జర్వంతో విలవిలాడుతోంది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఆ శిశువును డెంగీ మహమ్మారి ఆవహించింది. వాంతులు, విరోచనాలతో చుట్టుముట్టింది. దీనికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. చిన్నారిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా తగ్గలేదు. వైద్యుల సూచన మేరకు చివరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ చిన్నారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక చేయూతనందించాలని వారు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీ పరిధి దుబ్బగూడెం గ్రామానికి చెందిన చిన్నారి తోటకూర బాలకృష్ణ, లలిత దంపతుల 9 నెలల పాప ప్రణిద ఉంది. ఈ క్రమంలో ప్రణితకు ఈనెల 13న జ్వరం రావడంతో బయ్యారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో 14వ తేదీన ఖమ్మంలోని జాబిల్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఖమ్మంలో కూడా జ్వరం తగ్గకపోగా, వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అక్కడి వైద్యులు ఈనెల 17న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి రెఫర్ చేయగా చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే వైద్యఖర్చుల రోజుకు రూ.2 లక్షలు అవుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై దాతలు స్పందించి 9949803665 నంబర్‌కు ఫోన్ పే చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ముల్కనూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం దుబ్బగూడెంలో వైద్యశిబిరం నిర్వహించారు. -
జ్వరం తగ్గడం లేదా? డెంగ్యూ ఉండొచ్చు జాగ్రత్త! ఈ లక్షణాలు..
వర్షాకాలం సీజన్ కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ లక్షణాలు త్వరగా బయటపడవు. ఆరోగ్యంగానే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అసలు డెంగ్యూ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ ఎలా వస్తుంది? డెంగ్యూ దోమల వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఏజిప్టి అనే ఆడదోమల కారణంగా వ్యాపిస్తుంది.ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. పగలు కుట్టే దోమలతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. దీంతో పాటు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లూ లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ వైరస్‌లో నాలుగు సెరోటైప్స్ ఉన్నాయి. వీటిని DENV-1, DENV-2, DENV-3, DENV-4 అని పిలుస్తారు. మన దేశంలో DENV-2 కారణంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తపడండి.. వర్షాకాలం మొదలైన జూన్, జులై మాసంలో ప్రారంభమయ్యే విషజ్వరాల తాకిడి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొనసాగుతుంది. డెంగ్యూ వచ్చిన వారిలో సహజంగానే 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు. మరికొందరిలో మాత్రం జ్వరం వచ్చిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ► డెంగ్యూ వచ్చిన వారికి 104 ఫారెన్‌హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ► వికారం, వాంతులు మరో ప్రధాన లక్షణం. కళ్లు మండటం, వికారం, వాంతులు,తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, విసుగు డెంగ్యూ జ్వరం లక్షణాలు. ► డెంగ్యూ జ్వరం ఉంటే శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. అందుకే ఈ లక్షణాలను బట్టి ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేల కంటే పడిపోతే ప్రమాదకర స్థాయిలో ఉందని అర్ధం. ఈ పరిస్థితుల్లో తక్షణం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. డెంగ్యూ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే ఆహారాలు డెంగ్యూ వచ్చిన జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూ జ్వరంతో బాధపడతున్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆరెంజ్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.నారింజలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ జ్వరం అటాక్ చేస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే కొబ్బరినీళ్లను ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోరోలైట్లు ఇందులో అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఓ కివి పండు తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కివి జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. పాలకూరలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే పాలకూరలోని పోషకాలు డెంగ్యూ జ్వరాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వీట్ గ్రాస్ డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. -
దోమలతో జాగ్రత్త.. డెంగీ, మలేరియాతో జనం ఇబ్బందులు
వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభావం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేరు నమోదుకు జనం బారులు తీరుతున్నారు. ఇందులో చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా వైరల్ కేసులు పెరిగాయి. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచాన పడుతున్నారు. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ప్రారంభించారు. విష జ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు చేపడతున్నారు. ముఖ్యంగా డయేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలి విష జ్వరాలు పెరిగే అవకాశం ఉంది. దుర్శేడ్‌లో ఒకరికి డెంగీ కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో డెంగీ కేసు నమోదు కావడంతో అధికారులు సోమవారం నియంత్రణ చర్యలు చేపట్టారు. దుర్శేడ్‌కు చెందిన కాశిపాక అర్జున్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫుడ్ డెలివరీ సంస్ధలో పనిచేస్తున్నాడు. రెండురోజులక్రితం జ్వ రం రావడంతో దుర్శేడ్‌కు వచ్చిన అర్జున్ ఆది వారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సర్పంచు గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచు సుంకిశాల సంపత్‌రావు, వార్డుసభ్యుడు అశోక్, ఏఎన్ఎం పద్మ, ఆశావర్కర్లు అనిత, లక్ష్మి తదితరులు అర్జున్ ఇంటిని సందర్శించారు. కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. ఇంటి పరిసరాలను పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లారు. అనంతరం చామనపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సమీపంలోని నివాస గృహాల్లోని వ్యక్తులకు వైద్యపరీక్షలు చేశారు. అందుబాటులో వైద్యులు, మందులు వ్యాధులు ప్రబలుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో మందులు, వైద్యులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. పేషెంట్లు ఏ సమయంలో వచ్చినా చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా వైరల్ ఫీవర్లు, డయేరియా బారిన పడుతున్నారు. చాలా మంది ఓపీ చూపించుకొని మందులు తీసుకెళ్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కృష్ణప్రసాద్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
చిన్నారికి ప్రాణదానం చేయరూ..
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల చిరుప్రాయం.. ఆడుతూపాడుతూ గడపాల్సిన బాల్యం.. కానీ అనూహ్యంగా తీవ్ర డెంగీ జ్వరం బారినపడటం ఆ చిన్నారి ప్రాణాలకు ముప్పుగా మారింది. చికిత్సకు రూ. లక్షలు అవసరం కావడంతో ఆ చిన్నారి కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. హైదరాబాద్‌కు చెందినవి. వినీల మూడేళ్ల కుమారుడు వి. వేదార్యన్ ఇటీవల తీవ్ర డెంగీ జ్వరంబారిన పడ్డాడు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే వివిధ అవయవాలు వైఫల్యం చెందాయి. ప్రస్తుతం ఆ బాలుడిని కుటుంబ సభ్యులు రెయిన్బో పిల్లల ఆస్పత్రిలోని పీఐసీయూ వార్డుకు తరలించారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడంతో హార్ట్ అండ్ లంగ్ బైపాస్ మెషీన్ (వీఏ–ఎక్మో) ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తున్నారు. అయితే ఖరీదైన ఈ చికిత్సలకు మరో రూ. 15 లక్షలు అవసరమని, దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని బాలుడి తల్లి వినీల కోరారు. దాతలు milaap.org/fundraisers/support-v-vedaryan?deeplink_type= ద్వారా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
Hyderabad: డెంగీ, ఇతర వ్యాధులతో తల్లడిల్లుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: నగరంపై విషజ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సీజనల్ ఫీవర్లు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. బస్తీ దవాఖానాల్లో పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. కరోనా సమయంలో కనపడకుండా పోయిన సీజనల్ వ్యాధులన్నీ ఇప్పుడు విరుచుకుపడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ బాధితులు దవాఖానాల బాట పడుతున్నారు. అధికారుల గణాంకాల్లో తక్కువగా కనపడుతున్నా, డెంగీ కేసుల సంఖ్య భారీగానే ఉందని ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్ల రద్దీ, ప్లేట్లెట్లకు పెరుగుతున్న డిమాండ్ వెల్లడిస్తోంది. మరోవైపు వైద్యారోగ్య శాఖ కేవలం నామమాత్రపు చర్యలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ ఓపీ విభాగంలో క్యూలైన్లలో బారులు తీరిన రోగులు గాంధీఆస్పత్రి/ నల్లకుంట/తార్నాక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో గత నెలలో 16, ఈ నెలలో ఇప్పటివరకు 6 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణ రోజుల్లో ఓపీ రోగుల సంఖ్య 60– 70 వరకు ఉంటే ప్రస్తుతం 110 నుంచి 120 మందికి, అలాగే 50 వరకు ఓపీ ఉండే సనత్‌నగర్ అశోక్ కాలనీ బస్తీ దవాఖానాలో ఆ సంఖ్య 100కు చేరింది. ఇక్కడ 6 దాకా డెంగీ కేసులున్నాయి. సనత్‌నగర్ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్లో సాధారణ రోజుల్లో 100–120 వరకు ఉండే సంఖ్య 150కు చేరింది. గత రెండు వారాల్లో ఇక్కడి యూపీహెచ్సీ పరిధిలో 2 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. అదే విధంగా కొండాపూర్ ఏరియా జిల్లా ఆస్పత్రికి రోజు 400 నుంచి 450 మంది వస్తున్నారు. వీరిలో రోజుకు 40 నుంచి 50 మంది జ్వరంతో బాధపడుతున్నవారు ఉండగా, రోజుకు 20 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. ‘వర్షాలతో మురుగు పేరుకుపోవడంతో దోమల ద్వారా జ్వరాలు సోకుతున్నాయి. ప్రస్తుతం పేషెంట్ల సంఖ్య రెట్టింపు అయ్యింది’ అని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్, డాక్టర్ వరదాచారి చెప్పారు. ఉప్పల్‌లో ఇంటికొకరు.. ఉప్పల్‌లో ఇంటికి ఒకరు చొప్పున విష జ్వరాలు బారిన పడుతుంటే వీరిలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో ఓపీల దగ్గర క్యూలు సైతం భారీగా పెరిగాయి. రోజుకు 80 నుంచి 100 వరకు ఉండే ఓపీలో 150 వరకు పెరగింది. వైరల్ ఫీవర్ల తీవ్రత ఉందని, ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో గత 25 రోజులుగా దాదాపు 30కి పైగా డెంగీ కేసులను నమోదయినట్లు వైద్యాధికారి సౌందర్యలత తెలిపారు. అలాగే రెండు మలేరియా కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ‘గత నెల రోజులుగా డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం 600లోపు ఓపీ ఉంటోంది. కొద్ది రోజులుగా 1000కి పెరిగింది’ అని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ చెప్పారు. గాంధీలో రోగుల రద్దీ.. విషజ్వరాల వ్యాప్తితో సికింద్రాబాద్ గాం«దీఆస్పత్రికి రోగుల సంఖ్య భారీగా పెరిగింది. అవుట్ పేషెంట్ విభాగంలో 1500 నుంచి 2000 వరకు, ఇన్‌పేషెంట్ విభాగంలో 1800 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం గాం«దీలో 160 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లు ఆస్పత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓపీ విభాగంలో కంప్యూటర్ చిట్టీలు, వైద్యసేవల కోసం వందలాది మంది రోగులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఇన్పేòÙంట్ విభాగంలోని పలు వార్డుల్లో రోగుల సంఖ్య పెరగడంతో ఫ్లోర్బెడ్స్ (నేలపై పరుపు)వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. నెలరోజల నుంచి గాంధీ ఆస్పత్రికి రోగుల రద్ధీ అధికంగా ఉందని, విషజ్వరాలకు గురైన రోగులు ఓపీకి 500, ఐపీలో 250 మంది గతం కంటే అధికంగా వస్తున్నట్లు గుర్తించామని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. -
Health Tips: డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి? నివారణకు చర్యలేంటి?
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య జ్వరం. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఈ బాధితుల్లో కొందరికి డెంగీ వల్ల జ్వరం వస్తోంది. అసలు వచ్చింది మామూలు జ్వరమా? లేక డెంగీ జ్వరమా తెలుసుకోవడం ఎలా అన్నది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. డెంగీ లక్షణాలు ►జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 డిగ్రీలు ►తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు ►కళ్లలో విపరీతమైన నొప్పి ►శరీరంపై దద్దర్లు ►వాంతులు కావడం, కడుపునొప్పి ►నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం ►కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం డెంగీ లక్షణాలుంటే ఏంచేయాలి? ►పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ద్రవాలను ఇవ్వాలి ►జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి ►దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్, లిక్విడ్, దోమ తెరలు వాడాలి డెంగీని నివారించడానికి అనుసరించాల్సిన ఆయుర్వేదంలో ఉన్న జాగ్రత్తలు 1. నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో 1015 లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు. 2. బొప్పాయి ఆకును తుంచి బాగా కడిగి వాటిని కలకండతో కలిపి కొన్ని నీళ్లు పోసి, మిక్సీ పట్టాలని. వచ్చిన ఆ మిశ్రమాన్ని వడగట్టి గంటకో గ్లాసు చొప్పున డెంగీ బాధితుడికి తాగిస్తే డెంగీ లక్షణాలు పూర్తిగా మాయం అవుతాయి. 3. క్యారెట్ జ్యూస్, చీనీ రసం, కొబ్బరి బోండం నీళ్లు బాగా తాగిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉంది. 4. కొబ్బరి నూనెను పాదాల నుంచి మోకాళ్ల దాకా బాగా పూయాలి. ఇది యాంటి బయోటిక్‌గా పనిచేస్తుంది. డెంగీ దోమను దగ్గరికి రాకుండా కాపాడుతుంది. 5. డెంగ్యూ జ్వరం కారణంగా తల నెప్పి, వాంతులు, ముక్కు, నోటి చిగుర్ల నుండి రక్తం రావడం, పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలకు డెంగ్యూ జ్వరం వస్తే ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ►డెంగీ వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. జ్వరం తగ్గాక కూడా పూర్తిగా కొలుకోవడానికి ఒక నెల వరకు కూడా సమయం పట్టవచ్చు. ►డెంగీ జ్వరం రోగనిరోధక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది. ►జ్వరం తగ్గాక పోషకాలతో కూడిన, శుభ్రమైన పరిసరాల్లో తీసిన చెరకు రసం, కొబ్బరినీళ్లు, తాజా పళ్ళ రసం లాంటివి ఇవ్వాలి. ►పాలు, పెరుగు, చేపలు, గ్రుడ్లు, కోడి మాంసం లాంటి పౌష్టికాహారం రోజువారీ ఆహారంలో చేర్చాలి. ►పళ్లలో దానిమ్మపాళ్లు, కూరగాయలతో బీట్ రూట్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. ►మసాలా కూరలు, నూనె పదార్థాలు, బయటి వంటకాలు వీలైనంత వరకు తగ్గించాలి. ►కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉన్నా శరీర తత్వాన్ని బట్టి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సులభంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. జ్వరం వచ్చినపుడు ప్లేట్ లెట్స్ తగ్గి తీవ్రమైన ముప్పుకు దారి తీస్తుంది. ఏ వైరస్ శరీరంలో ఏ భాగాన్ని దెబ్బ తీస్తుంది అనే అవగాహన కలిగిన డాక్టర్‌ను సంప్రదించాలి. అలాంటప్పుడు ప్లేట్ లెట్స్ తగ్గుదలను నిరోధించడానికి కావలసిన మందులు వాడడంతో పాటు ఇతరుల నుంచి సేకరించిన ప్లేట్లెట్లను శరీరంలోనికి ఎక్కిస్తారు. ►బొప్పాయి ఆకుల రసం ఈ ప్లేట్లెట్స్ పెరగడానికి దోహదం చేస్తుంది. ►డెంగ్యూ జ్వరం వచ్చిన తరువాత చర్య తీసుకొవడం కంటే ముందు అది రాకుండా నిరోధించడం మంచిది. ►డెంగ్యూ జ్వరం రాకుండా అడ్డుకొనే టీకా ప్రయోగ దశలో ఉన్నది కొన్ని నెలలలో అందుబాటులోకి రానుంది. అంత వరకు డెంగ్యూ సీజన్ లో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించడం మంచిది. కూలర్లలో , పూలకుండీలలో, పాత టైర్లలో... ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి లేకుంటే డెంగ్యూ దోమలు వీటిలో అభివృద్ధి చెందుతాయి. కిటీకీలకు తెరలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమలను ఇంట్లోకి రాకుండా చూడవచ్చు. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Pigmentation: బంగాళా దుంప, నిమ్మ రసం, తేనె.. పిగ్మెంటేషన్‌కు ఇలా చెక్! Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. -
ఖమ్మం జిల్లాలో డెంగ్యూ డెంజర్ బెల్స్
-
అనంతపురంలో డెంగీ కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెంగీ కేసులు కలకలం రేపుతున్నాయి. ఒకటీ, రెండు నమోదయ్యే కేసులు పది రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. శ్రీసత్యసాయి జిల్లాలో తక్కువగా ఉన్నా.. అనంతపురం జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆయా పట్టణాల్లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలను అధికారులు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్స్ (ఎంఎండీసీ)లను రంగంలోకి దించారు. తొలకరి జల్లులు పడగానే డెంగీ జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి..తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇప్పటికే నాలుగు సెంటినల్ సర్వేలెన్స్ కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అవసరమైతే వీటిని విస్తరించాలని యోచిస్తున్నారు. ప్లేట్లెట్స్ పేరిట భారీగా దోపిడీ వైరల్ జ్వరం వచ్చినా ప్లేట్లెట్లు తగ్గుతాయి. అయితే డెంగీ జ్వరమని చెబుతూ రోగిని, వారి కుటుంబ సభ్యులను ప్రైవేట్ ఆస్పత్రులు బెంబేలెత్తిస్తున్నాయి. రకరకాల వైద్య పరీక్షలు చేయించి.. వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇలా ఎవరైనా వసూళ్లు చేస్తే నేరుగా జిల్లా వైద్యాధికారికి గానీ, కలెక్టర్‌కు గానీ ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ డెంగీ నిర్ధారణ కాకున్నా ప్లేట్లెట్స్ పేరిట దోపిడీ చేయడం ఆస్పత్రుల యాజమాన్యాలకు రివాజుగా మారింది. ధర్మవరం పట్టణానికి చెందిన ఖాదర్‌బాషా వారం రోజుల క్రితం జ్వరంతో అనంతపురం కమలానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. ప్లేట్లెట్స్ తగ్గాయని, డెంగీ లక్షణాలున్నాయని తెలిపి చికిత్స పేరుతో రూ.40వేలు వసూలు చేశారు. చివరకు అతనికి వైరల్ ఫీవర్ అని తేలింది. అనంతపురంలోని పాతూరుకు చెందిన నాగభూషణం వాంతులు, జ్వరంతో సాయినగర్‌లోని ఓ నర్సింగ్‌హోంలో చేరాడు. డెంగీ పేరుతో అతనినుంచి రూ.50వేలకు పైగా లాగారు. రోగి కోలుకున్నాడు కానీ, డెంగీ జ్వరం నిర్ధారణ కాలేదు. -
Hyderabad: డెంగీ.. కార్పొ‘రేట్’ కాటు.. హడలిపోతున్న జనం
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చి పిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు.. ఇప్పుడు డెంగీ రోగుల జేబులు గుల్ల చేస్తున్నాయి. తప్పుడు రిపోర్టుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తూ రోగుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతూ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఇచ్చిన వాట్సాప్ నంబర్ (9154170960)కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు రాష్ట్రంలో డెంగీ విజృంభించింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. జ్వరం రాగానే కరోనా పరీక్షలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఈసారి డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వర్షాలు తగ్గాక మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ప్లేట్లెట్లు 20 వేల వరకు తగ్గినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలున్నప్పుడు మాత్రం 50 వేల లోపునకు తగ్గితే జాగ్రత్త వహించాలి. చాలావరకు కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే చికిత్సే చాలని వైద్య నిపుణులంటున్నారు. డెంగీ లేకున్నా.. అయితే డెంగీతో తమ వద్దకు వస్తున్న రోగుల వద్ద పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. రోగికి 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయి. ఒకసారి ప్లేట్లెట్లు ఎక్కిస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక డెంగీ ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడం గమనార్హం. డెంగీ లేకపోయినా, ప్లేట్లెట్ల కౌంట్ సరిపడా ఉన్నప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రతను తగ్గించడం ఎలా? డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజిని ముంచి రోగి శరీరాన్ని తుడవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు తగ్గడం అదుపులోకి వస్తుంది. రానిపక్షంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. రక్తస్రావం జరిగితే ప్రమాదకరం డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్త స్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం లేనప్పుడు 20 వేల వరకు పడిపోయినా ప్రమాదం ఉండదు. ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, కన్సల్టెంట్ ఫిజీషియన్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ ఐజీఎం పరీక్ష తప్పనిసరి డెంగీకి గురైతే ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వీటితో పాటు అధిక దాహం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. -
హైదరాబాద్‌లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా
సాక్షి, హైదరాబాద్: బస్తీకి సుస్తీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ సహా డెంగీ జ్వరాలు మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తూ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో మంచం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణం చల్లబడటంతో పాటు తరచూ వర్షంలో తడుస్తుండటంతో శ్వాసకోశ సమస్యలు కూడా రెట్టింపయ్యాయి. నీటితో పాటు ఆహారం కూడా కలుషితమై అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, డిఫ్తీరియా (కంఠసర్పి) బారిన పడుతున్నారు. ఫలితంగానల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగీ జ్వరాలు డేంజర్.. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి ఆవరణలోని పూల కుండీలే కాదు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు, ఇంటికి అటు ఇటుగా ఖాళీగా ఉన్న ప్రదేశా ల్లో తాగిపడేసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరడం, రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి సహా శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన గెజిటెట్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. వీటిలో ముఖ్యంగా డెంగీ కారక ఈడిస్ ఈజిప్టే దోమలు వృద్ధి చెంది మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 200పైగా డెంగీ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, మేడ్చల్ జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అంచనా. చదవండి: తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సగటున 250– 260, రంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60, మేడ్చల్ జిల్లాలో30 నుంచి 40 కేసులు నమోదుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలోనే కాదు సాధారణ జ్వరపీడితుల్లోనూ లక్షణాలు ఒకే విధంగా ఉండటం వైరస్ గుర్తింపు, చికిత్స కష్టంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వాంతులు.. విరేచనాలు నగరానికి కృష్ణా, గోదావరితో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కలషిత నీరు నదుల్లోకి చేరుతుండటం, సరిగా ఫిల్టర్ చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఈ నీటిని తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల్లో ఎక్కువ శాతం వీరే ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వండిన తాజా ఆహారానికి బదులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కాచి వడపోసిన నీరు తాగడం, అప్పుడే వండిన తాజా ఆహారం తీసుకోవడం, ముక్కుకు మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
విషాదం: డెంగ్యూతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి
గాంధీనగర్: గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస వదిలారు. గతంలో ఆమె కోవిడ్ బారినపడినట్టు తెలిసింది. ఆమె మరణ వార్తను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు. 2015లో ఆశాబెన్ పాటిదార్ రిజర్వేషన్ల అంశంపై పోరాడిన కీలక వ్యక్తుల్లో ఒకరు. ఆమె హార్దిక్ పటేల్‌కు సన్నిహితురాలు కూడా. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. ఆరుసార్లు బీజేపీ తరపున ఆ స్థానం నుంచి గెలిచి సత్తా చాటిన మాజీ మంత్రి నారాయణ్ పటేల్‌ని ఆమె ఆ ఎన్నికల్లో మట్టి కరిపించారు. (చదవండి: Transgender VRO: ఒక్క ఫోన్ కాల్.. హిజ్రా ద్రాక్షాయణికి ఉద్యోగం) అయితే, పార్టీతో విభేదాలు రావడంతో 2019 ఆమె కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆశాబెన్ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (చదవండి: పసికందును రైలులో వదిలేసి.. ప్రియుడితో కలిసి) -
Hyderabad: వ్యాధుల రొద.. రోగుల వరద!
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా మహమ్మారి జడలు విప్పి నాట్యం చేస్తుంటే.. దీనికి తోడు ఇతర వ్యాధులూ నగర వాసుల్ని పట్టిపీడిస్తున్నాయనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. డెంగీ, మలేరియా, డయేరియా, విష జ్వరాలు జనాలను భయకంపితుల్ని చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. వందల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు దవాఖానాలకు పోటెత్తుతున్నారు. సోమవారం గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు రోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చికిత్స కోసం గంటల తరబడి క్యూలైన్లో నిరీక్షించడం వ్యాధుల తీవ్రతకు దర్పణం పడుతోంది. చదవండి: గాంధీ.. ఇదేందీ! ఆస్పత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. ఫీవర్ ఆస్పత్రిలో క్యూలైన్.. నిలోఫర్ ఆవరణలో కిక్కిరిసి.. -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. మన్మోహన్సింగ్ ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని వైద్యులు తెలిపారు. చదవండి: కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’ కాగా మాజీ ప్రధాని జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో బుధవారం ఎయిమ్స్‌లో చేరారు. డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని.. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ఓ ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు.. -
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్
Adivi Sesh Discharged From The Hospital: టాలీవుడ్ హీరో అడివి శేష్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'ఇంటికి తిరిగి వచ్చాను. విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటాను' అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా కొద్ది రోజుల క్రితం అడివి శేష్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. డెంగ్యూ బారినపడి, ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ఈనెల 18న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చదవండి : షాకింగ్ : రకుల్‌కు సర్జరీ వికటించిందా? అందుకేనా ఇలా! ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శేష్ “మేజర్” సినిమాలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. చదవండి : మహేశ్ బాబు ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన ఏ.ఆర్.రెహమాన్ Back home. Rest & Recuperation. — Adivi Sesh (@AdiviSesh) September 27, 2021 -
చిన్నారుల్లో ‘డెంగీ’ కలవరం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి గ్రేటర్ వాసులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే తాజాగా డెంగీ, మలేరి యా, టైఫాయిడ్, చికెన్‌గున్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు...వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పుల వల్ల అనేక మంది విషజ్వరాల బారినపడు తున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రస్తుతం ఏ ఇంట్లోకి చూసినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ జ్వరపీడితుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఐదుగురు జ్వరపీడితుల్లో ఒకరికి డెంగీ పాజిటివ్ రిపోర్ట్ అవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. బస్తీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో శివారు ప్రాంతాల్లోని బాధితులంతా మెరుగైన వైద్యం కోసం నగరంలోని బోధనాసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ సహా నల్లకుం ట ఫీవర్ ఆస్పత్రి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్సలు అందించాల్సి వస్తుంది. వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన నిలోఫర్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1,200 మంది చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రులు.. హైదరాబాద్ జిల్లాలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 40పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 36 ఉన్నాయి. ఈ మూడు జిల్లాల పరిధిలో 200పైగా బస్తీ దవాఖానాలతో పాటు ఏడు ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందడం లేదు. సాధారణ రక్త, మూత్ర పరీక్షలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వారంతా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రిలో రోజు సగటు ఓపీ 1,200 ఉండగా, ప్రస్తుతం 1,800 నుంచి 2,000పైగా నమోదవుతోంది. ఇక ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో సగటు ఓపీ 350 ఉండగా, ప్రస్తుతం వెయ్యి దాటింది. ఇక నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 900 ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 1,500 దాటింది. ఈఎన్టీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో వచ్చిన వారిని నేలపై పడుకోబెట్టి వైద్యసేవలు అందిం చాల్సి వస్తుంది. ఓపీకి వస్తున్న వారిలో ఎక్కువగా జ్వరపీడితులే. కరోనా భయం ఇంకా పోకముందే, డెంగీ జ్వరాలు వెంటాడుతుండటంతో నగరవాసులు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. కరోనా, డెంగీలోనూ ఒకే లక్షణాలు ఉండటంతో ఈ జ్వరాల గుర్తింపు ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వర పీడితులకు డెంగీ బూచీ.. ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడికి వచ్చిన బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ఐపీఎంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపుతున్నారు. రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో జ్వరం తీవ్రత మరింత పెరిగి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విధిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కరోనా, డెంగీ పరీక్షల పేరుతో ఆయా కేంద్రాలు రోగుల నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లపై సరైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోని వైద్యులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ, కరోనా జ్వరాలుగా పేర్కొంటూ అత్యవసర చికిత్సలను సిఫార్సు చేస్తున్నారు. ఐసీయూ చికిత్సల పేరుతో పేదలను దోచుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నగరం లోని కొంత మంది వైద్యులు డెంగీ మరణాలను బూచిగా చూపించి..ప్లేట్లెట్ కౌంట్స్ చికిత్సల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు డెంగీ కేసుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాల్సి ఉన్నా.. అనుమానం రాకుండా సస్పెక్టెడ్ డెంగీ కేసుగా అడ్మిట్ చేసుకుని చికిత్సలు చేస్తుండటం విశేషం. డెంగీకి కారణాలివే – డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రంగారెడ్డిజిల్లా ►ఎడిస్ ఈజిప్టే (టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. సాధారణంగా ఇది పగలు మాత్రమే కుడుతుంది. ►కేవలం పగలు మాత్రమే కుట్టే డెంగీ దోమలు లైట్ల వెలుగులు విరజిమ్ముతుండటంతో రాత్రి వేళలోనూ కుడుతున్నాయి. ►ఇంటి పరిసరాల్లో ఖాళీ కొబ్బరి బోండాలు, సీసాలు, డబ్బాలు, టైర్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా చూసుకోవాలి. ►వర్షపు నీరు వీటిలో చేరి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయంగా మారి వీటిలో గుడ్లు పెడుతుంటాయి. ►ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టి ఉంచాలి. సీజన్ మారుతుండటం వల్లే – డాక్టర్ వెంకటి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హైదరాబాద్ జిల్లా వాతావరణ మార్పులను శరీరం తట్టుకోలేదు. సీజన్ మారిన ప్రతిసారీ దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలు సర్వసాధారణం. భయపడాల్సిన పనిలేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు బదులుగా అప్పుడే వండిన తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం, గోరు వెచ్చని మంచినీరు తాగడం; తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ టీకాలు వేసుకోవాలి. -
Kamareddy: నా కూతురిని బతికించండి..
సాక్షి, హైదరాబాద్: చదువుల తల్లి అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. డబ్బుల్లేక ఆమె తల్లిదండ్రులు ఇల్లు, ఆటో అమ్మేసుకున్నారు. వైద్యం చేయించేందుకు డబ్బుల్లేక దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.. ప్రసుత్తం కామారెడ్డి జిల్లాకు చెందిన రుబినా ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఐసెట్‌లో ర్యాంకు సాధించిన రుబినా డెంగీ పాజిటివ్‌తో పాటు ప్లేట్లెట్స్ పూర్తిగా పడిపోయి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టుపోయి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆపరేషన్ కోసం రూ.7లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పడంతో ఆటో డ్రైవర్ అయిన ఆమె తండ్రి దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. రుబినాకు ఆపరేషన్ అత్యవసరం మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రుబినాను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, ఇందుకు రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డను బతికించాలని వేడుకుంటున్నారు. ఫోన్‌పే లేదా గూగుల్ పే 94931 06370, 97030 58557 యూసుఫ్(రుబినా తండ్రి), బ్యాంక్ అకౌంట్ నంబర్లు 758402010000266, ఐఎఫ్‌సీ కోడ్ –యూబీఐఎన్0575844, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
డెంగీపై ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: డెంగీ జ్వరాల సీజన్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో డెంగీ కేసుల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు పడుతుండటం తో కొన్ని పట్టణ ప్రాంతాల్లో డెంగీ కేసులు పెరిగాయి. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. డెంగీ నిర్ధారణ చేసే ఎలీశా కిట్లు ప్రతి ఆస్పత్రిలోనూ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా డెంగీ నిర్ధారణ చేసే ఆస్పత్రుల సంఖ్య పెంచారు. గతంలో జిల్లా, బోధనాసుపత్రుల్లో మాత్రమే ఉండేవి. నిర్ధారించిన సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంత వాసులు వెళ్లాల్సి వచ్చేది. 14 జిల్లా ఆస్పత్రులు, 11 బోధనాస్పత్రులతో పాటు తాజాగా 48 ఏరియా ఆస్పత్రులనూ సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రుల జాబితాలో చేర్చారు. దీంతో ప్రతి ప్రాంతంలోనూ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. కనీసం నెల రోజులకు అవసరమైన కిట్లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో బ్యానర్లు డెంగీ నిర్ధారణకు గుర్తించిన ఆస్పత్రుల్లో ఆస్ప త్రి ముందు బ్యానర్లు కట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో డెంగీ లక్షణాలున్న వారిని గుర్తించి వారికి ఎలీశా టెస్టులు నిర్వహిస్తారు. సెంటినల్ సర్వైలెన్స్ ఆస్పత్రులకు ఆయా జిల్లా మలేరియా అధికారులే బాధ్యత వహించాలి. సేకరించిన నమూనాల వివరాలు రోజూ కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర కార్యాలయానికి పంపాలి. డెంగీ అను మానిత కేసులు ఎక్కడ ఉన్నా వారికి పరీక్షలు నిర్వహించి, ఆయా ప్రాంతాల్లో మందులు పిచికారీ చేయాలి. జనరల్ మెడిసిన్ వైద్యులు, పీడియాట్రిక్స్ వైద్యులు, మైక్రోబయాలజిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నోడల్ అధికారుల మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీలు ఇవ్వాలి. వీళ్లందరూ అందుబాటులో ఉండాలని కుటుంబ సంక్షేమశాఖ ఆదేశించింది. -
డెంగీతో బాలుడి మృతి
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెంలో డెంగీ సోకడంతో శనివారం ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన జర్పుల వీరన్న, కవిత దంపతుల కుమారుడు మోహన్ (14)కు 20 రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానికంగా ఓ ఆర్ఎంపీకి చూపించారు. అయినప్పటికి జ్వరం తగ్గకపోవడంతో 18న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. అయితే హైదరాబాద్‌కు తరలించేలోపే మోహన్ చనిపోయాడు. బాలుడు మహబూబాబాద్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. -
అదుపులో 'డెంగీ'!
సాక్షి, అమరావతి: తొలకరి జల్లులు మొదలయ్యాయంటే డెంగీ జ్వరాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి. గత ఏడాది వరకు ఎక్కడ చూసినా డెంగీ బాధితులే. అలాంటిది ఈ ఏడాది డెంగీ జ్వరం కాస్త అదుపులోకొచ్చింది. గతంతో పోలిస్తే జ్వరాల తీవ్రత చాలా తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఏడాది ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదు కాలేదని తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం కేసులు కూడా నమోదు కాలేదు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది డెంగీ తీవ్రత బాగా తక్కువగా ఉంది. నవంబర్ 30 వరకూ ఇదే తరహాలో నియంత్రణ చేయగలిగితే ఈ ఏడాది డెంగీ బారి నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలున్నాయి. నవంబర్ చివరి వరకు కార్యాచరణ ► నవంబర్ నెలాఖరు వరకు డెంగీ నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు. ప్రతి గ్రామాన్ని మున్సిపాలిటీ, ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖలు జల్లెడ పడుతున్నాయి. ► కాలనీల్లో, ఇంటి ముందర గుంటలు లేకుండా చూడటం, నీరు నిల్వ లేకుండా చేయడం, ప్రతి ప్రాంతంలో ఎంఎండీసీ (మొబైల్ మలేరియా, డెంగీ సెంటర్స్)ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ► డెంగీ లార్వా (గుడ్డు) దశలోనే విచ్ఛిన్నం చేసేందుకు పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, టైర్లు వంటి వాటిని పరిసరాల్లో లేకుండా చేస్తున్నారు. ► అన్ని ఆస్పత్రుల్లో డెంగీని నిర్ధారించే ఎలీశా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచారు. డెంగీ వలన వచ్చే ప్రమాదంపై కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నియంత్రణకు మరిన్ని చర్యలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు బాగా తగ్గాయి. నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా లార్వా దశలోనే దీన్ని నియంత్రించడం వల్లే కేసులు తగ్గాయి. రానున్న నెల రోజులు కీలకం. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చేసుకుంటే డెంగీ దోమలు వృద్ధి అయ్యే అవకాశం తక్కువ. – డా.అరుణకుమారి, ప్రజారోగ్య శాఖ సంచాలకులు -
డెంగ్యూ ఎంట్రీతో ప్రభుత్వం హెచ్చరికలు
నైపిడా(మయన్మార్): పులిమీద పుట్రలా కరోనాతో వ్యాప్తి నియంత్రణా చర్యల్లో మునిగిన మయన్మార్ ప్రభుత్వంపై డెంగీ రూపంలో అదనపు భారం పడింది. వర్షాకాలం మొదలవడంతో తాజాగా కరోనా వైరస్‌కు డెంగ్యూ తోడయ్యింది. దేశం వ్యాప్తంగా జూన్ 27 నాటికి డెంగ్యూతో 20 మరణాలు సంభవించినట్టు స్థానిక మీడియా తెలిపింది. మొత్తం 2862 మంది డెంగ్యూ బారినపడ్డారని వెల్లడించింది. దీంతో మయన్మార్ ఆరోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. దోమ కాటు బారినపడకుంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. (చదవండి: లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్) ముఖ్యంగా దేశంలోని 20 పట్టణాల్లో 1069 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 12 మంది మరణించడంతో ఆయా పట్టణాలపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టిందని తెలిపింది. ఇక దేశంలో గతేడాది 24,345 మంది డెంగ్యూ బారినపడగా, వంద మంది మృతిచెందారు. డెంగ్యూ జ్వరం ఈడెస్ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందన్నది తెలిసిందే. వార్షా కాలంలో డెంగ్యూ వ్యాప్తి సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఇదిలాఉండగా కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్కడ ఇప్పటివరకు కేవలం 339 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆరుగురు మరణించారు. 271 మంది కోలుకున్నారు. 62 మంది వైరస్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (మయన్మార్‌లో గని వద్ద ఘోర ప్రమాదం) -
డెంగీకి అప్రమత్తతే మందు..!
సాక్షి, అమరావతి : ఓవైపు కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే, మరోవైపు డెంగీపైనా అప్రమత్తమైంది. గతేడాది నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పటిష్ట నియంత్రణకు చర్యలు చేపట్టింది. మొబైల్ మలేరియా, డెంగీ క్లినిక్స్ (ఎంఎండీసీ)ను ఇప్పటికే రంగంలోకి దించింది. తొలకరి జల్లులు పడగానే డెంగీ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 14 సెంటినల్ సర్వ్లెన్స్ హాస్పిటల్స్ (ఎస్ఎస్హెచ్లు) దీనికోసం ముమ్మరంగా పనిచేస్తున్నాయి. సర్కారు తాజా చర్యలు ఇవే.. ప్రభావిత ప్రాంతాలను గుర్తించడం ►కార్పొరేషన్ల పరిధిలో ఎంఎండీసీల ఏర్పాటు. యాంటీ లార్వల్ చర్యలు ►ఫీవర్ స్క్రీనింగ్ చర్యలకు ఏర్పాట్లు ►పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రూరల్ డెవలప్మెంట్, హెల్త్ విభాగాల సమన్వయానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ ►డెంగీని నిర్ధారించే ఎలీశా టెస్టుల సంఖ్యను భారీగా పెంచడం ►ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్‌ను వేరు చేసే యంత్రాల ఏర్పాటు చికిత్సకు మార్గదర్శకాలు ►డెంగీ జ్వరాన్ని ఎలీశా టెస్టు ద్వారా నిర్ధారిస్తారు. ఫిజీషియన్ సూచనల మేరకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి ►యాంటీవైరల్ ఇంజక్షన్లు, జ్వర తీవ్రతను తగ్గించేందుకు పారాసెటిమాల్ ఇవ్వాలి ►రోగికి పళ్లు, పళ్ల రసాలు ఆహారంగా ఇవ్వాలి. పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి ►రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీరు తాగించాలి ప్రజలకు సూచనలు ►ఇంటి ఆవరణంలో కొబ్బరి చిప్పలు, టైర్లు వంటి వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ►సెప్టిక్ ట్యాంకులు తదితర వాటికి నైలాన్ దారంతో కూడిన మెష్‌లు కట్టుకోవాలి. రాత్రిపూట వీలైనంత వరకూ దోమతెరలు వాడాలి ►ఇంటి ఆవరణాన్ని పొడిగా ఉంచాలి. డెంగీ లక్షణాలు ►డెంగీ జ్వరం ఈడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ►దోమ కుట్టిన 24 గంటల్లోనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. జ్వర తీవ్రత పెరిగే కొద్దీ కళ్లు ఎర్రగా మారుతుంటాయి ►మరుసటి రోజు కండరాల నొప్పి, అనంతరం మోకాళ్లు, ప్రతి కీలు వద్దా నొప్పి తీవ్రత ►ఒళ్లంతా దద్దుర్లలా మొదలై, ఎర్రగా మారతాయి ►ఆహారం తీసుకోవాలనిపించదు, తీసుకున్నా వాంతులవుతాయి ►డెంగీ హీమరోజిక్ ఫీవర్ (డీహెచ్ఎఫ్) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు ఇక చివరి దశను డెంగీ షాక్ సిండ్రోమ్ (డీఎస్ఎస్) అంటారు. -
డెంగీ పంజా!
పాలమూరు: ఒకవైపు కరోనా వైరస్ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు డెంగీ జ్వరం జిల్లాను వణికిస్తోంది. తెల్లబోతున్న రక్తకణాల రూపంలో దిగాలు పరుస్తోంది. అవసరానికి అందని కణాలు.. ముందుకు రాని రక్తదాతల రూపంలో బాధితుల్లో ఆవేదన రగిలిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కేసులతో పాటు ఆడపాదడపా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లోపిస్తున్న పారిశుద్ధ్యమే శాపంగా అనారోగ్య పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజల్ని ఆర్థికంగా దిగాలు పరుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రెగ్యులర్‌గా వచ్చే కేసుల కంటే ఎక్కువగా డెంగీవి నమోదవుతుండటం గమనార్హం. ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు పెరగడంతో దోమలు విజృంభిస్తున్నాయి. నిర్ధారణ పరికరాలు ఎక్కడ? సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సమీక్ష సమావేశాల్లో అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో తప్పా.. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా డెంగీ నిర్ధారణ పరికరాలు లేవు. దీంతో బాధితులు కొందరు జనరల్ ఆస్పత్రికి వస్తున్నా చాలా మంది హైదరాబాద్ వెళ్లి వేలాది రూపాయలను ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులకు కార్పొరేట్ హంగులు కల్పించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్లేట్లెట్ల కిట్లు, వాటికి సంబంధించిన యంత్రాలు ఆయా ప్రాంతీయ ఆస్పత్రుల్లో లేవు. ఈ ఏడాది జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువగా హన్వాడ, జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర మండలాలతోపాటు గంగాపూర్, ఎదిరలో నమోదయ్యాయి. జనరల్ ఆస్పత్రిలోనే.. జిల్లా జనరల్ ఆస్పత్రిలో డెంగీకి సంబంధించి రూ.25లక్షల విలువజేసే సింగిల్ డోనర్ ప్లేట్లెట్ (ఎస్డీపీ) మిషన్‌ను ఏర్పాటు చేశారు. డెంగీ రోగులకు రక్తంలో ఉండే ప్లేట్లెట్ మాత్రమే కావాల్సి ఉండగా, దాత నుంచి అవసరమైన కణాలను మాత్రమే గ్రహించి మిగిలిన వాటిని తిరిగి పంపించేస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లా కేంద్రంతో పాటు భూత్పూర్, బాదేపల్లి మున్సిపల్ అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడం సమస్యను జఠిలం చేస్తోంది. ఆయా వార్డుల్లో చెత్త కష్టాలు తీర్చేందుకు ప్రత్యేకంగా చొరవ చూపడంలేదు. ప్రధాన ప్రాంతాలు మినహా, ఇరుకుగా ఉన్న కాలనీల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు లేదని స్థానికులు వాపోతున్నారు. అధ్వాన పరిస్థితులకు ఖాళీ స్థలాలే అందుకు కారణమని గుర్తించినా చర్యలు లేవు. ప్రతినిత్యం పట్టణంలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నా పూర్తిస్థాయిలో వార్డుల నుంచి చెత్తకుప్పలు తొలగడం లేదు. పర్యవేక్షణ లోపం, పని చేస్తున్నామనే భ్రమ కల్పించడమే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం ఫలితం కన్పించడం లేదు. ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. వాతావరణ మార్పులతో.. వాతావరణ మార్పులతో ఒక్కసారిగా సీజన్ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుంది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. వాతావరణంలో ఎండకాలం నుంచి వేడి పూర్తిగా తగ్గడంతో వైరల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దోమలు నిల్వ ఉండటం వల్ల డెంగీ వ్యాధి సోకుతుంది. అలాగే ఇళ్ల చుట్టూ.. మధ్యలో మురుగు నిల్వ ఉంటే వాటిపై దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. నీటి కాలుష్యం ఎక్కువ. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు కాసి వడబోసిన నీళ్లే తాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా చూసుకోవాలన్నారు. -
పాపం నవ వధువు.. పెళ్లైన నెలలోపే..
సాక్షి, గంగవరం: పెళ్లయిన నెలలోపే నవ వధువును డెంగీ మహమ్మారి కబళించింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కూర్నిపల్లిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. హరీష్‌కు కర్ణాటకలోని కోగిలేరుకు చెందిన గీత(21)తో గత నెల 24న వివాహమైంది. వధూవరులు ఈ నెల 5న కూర్నిపల్లికి వచ్చారు. గీతకు జ్వరం రావడంతో పలమనేరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందింది. కోలుకోవడంతో మూడో మెరివలికి వధువు స్వగ్రామానికి వెళ్లారు. మళ్లీ జ్వరం రావడంతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగీగా నిర్ధారించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో గత శనివారం ఆస్పత్రిలో మృతిచెందింది. (చదవండి: ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది కానీ అంతలోనే..) -
డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతి
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్‌లో డెంగీతో ఆరేళ్ల చిన్నారి మృతిచెందింది. అంజయ్య, పద్మ దంపతుల కుమార్తె దివ్య(6) తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా స్థానికంగా చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో గురువారం ఆమనగల్లులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు డెంగీ అని చెప్పారు. దీంతో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఈ మొక్కలుంటే.. దోమలు రావు
సాక్షి; హైదరాబాద్ : హైదరాబాద్‌లో డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల సీజన్ నడుస్తోంది. ప్రకృతిలో సహజసిద్ధంగా పెరిగే మొక్కలైన నిమ్మగడ్డి మొక్కలను ఇంటి ముందు పెంచుకుంటే చాలు.. దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒకట్రెండు మొక్కలను పెంచితే చాలు.. దోమలు పరారవుతాయి. నిమ్మగడ్డిలో చాలా రకాలుంటాయి. వాటన్నింటిలోకి సైబోపోగాన్, నార్డస్, సెట్రోనెల్లా వింటేరియానస్ అనే మొక్కల రకాలే దోమలను సమర్థవంతంగా అరికడతాయి. (చదవండి : ప్రతి నలుగురిలో ఒకరికి డెంగీ) -
ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న డెంగీ
మంచిర్యాల టౌన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన గుడిమల్ల రాజయ్య కుటుంబాన్ని డెంగీ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే డెంగీ వల్ల రాజయ్య కొడుకు గుడిమల్ల రాజగట్టు, కోడలు సోనీ, మనవరాలు శ్రీవర్షిణి కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కొద్ది రోజుల క్రితం రాజయ్య రక్తాన్ని వైద్య సిబ్బంది సేకరించి పరీక్షించగా డెంగీ పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం తనకు డెంగీ సోకిన విషయం కూడా తెలియని రాజయ్య.. తన నాలుగు రోజుల మనవడితోపాటు పెద్ద మనవడు శ్రీవికాస్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే ఆందోళనలో ఉన్న గుడిమల్ల కుటుంబ సభ్యులు.. శ్రీవికాస్కు శుక్రవారం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎప్పుడు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారికి తగ్గిన ప్లేట్లెట్స్ సోనీ డెంగీతో చనిపోవడానికి ఒక్కరోజు ముందు జన్మించిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో పుట్టినరోజు నుంచే ఐసీయూలో ఉంచారు. నాలుగు రోజుల ఆ చిన్నారిని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా శుక్రవారం ఆ చిన్నారికి సైతం ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో వెంటనే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించాలని వైద్యులు సూచించారు. దీంతో వారు దాతల సహకారం కోరగా, రామకృష్ణాపూర్‌కు చెందిన సురేశ్ ప్లేట్లెట్స్ అందించడానికి ముందుకొచ్చాడు. రెడ్‌క్రాస్ సొసైటీ వారు సైతం సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 12 వేల విలువైన ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పీలను ఉచితంగా అందించి, ఆ చిన్నారికి ఆసరాగా నిలిచారు. -
కుటుంబంలో నలుగురిని మింగిన డెంగ్యూ
-
డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
సాక్షి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్ /రాంగోపాల్‌పేట్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఓ కుటుంబాన్ని వీడని నీడలా వెంటాడి ఛిద్రం చేసేసింది డెంగీ. పదిహేను రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులు డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తొలుత భర్త, తర్వాత భర్త తరఫు తాత, ఆపై ముద్దుల కూతురు..ఇప్పుడు ఏకంగా జన్మనిచ్చిన బిడ్డను చూసుకోకుండానే తల్లినే కబళించేసింది మహమ్మారి డెంగీ జ్వరం. వైద్యాధికారుల్ని, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే ఈ హృదయ విదారకర ఘటనల వివరాలిలా ఉన్నాయి. ఒకరి వెనుక ఒకరు.. మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీశ్రీనగర్‌లో నివాసం ఉంటోన్న ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు గుడిమల్ల రాజగట్టు (30), సోని (28) దంపతులు. రాజగట్టుకు జ్వరం రావటంతో ఈనెల 12న స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి, మూడ్రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఎంతకూ జ్వరం తగ్గకపోగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 16న మృతిచెందాడు. మృతుడికి సంబంధించిన ఐదోరోజు కర్మ కార్యక్రమాలను నిర్వహిస్తుండగానే రాజగట్టు తాత లింగయ్య(80)కు జ్వరం వచ్చింది. దీంతో లింగయ్యను అదేరోజు రామకృష్ణాపూర్ సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 20న మరణించాడు. వీరి మృతిని జీర్ణించుకోకముందే రాజగట్టు, సోని దంపతుల కుమార్తె శ్రీవర్షిణి (6)కి డెంగీ జ్వరం వచ్చింది. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 27న దీపావళిరోజు మృతి చెందింది. అప్పటికే సోనీకి నెలలు నిండటం..ఆమెకు కూడా డెంగీ లక్షణాలున్నాయని వైద్యులు నిర్ధారించడంతో.. వైద్యం కోసం ఈనెల 28న సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం సిజేరియన్ ద్వారా సోని మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు కూడా డెంగీ సోకడంతో ఐసీయూ ఉంచి తల్లీ బిడ్డలకు చికిత్సను అందజేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం తల్లి సోని మృతి చెందింది. సోనీని, ఆమెకు పుట్టబోయే బిడ్డనూ ఎలాగైనా రక్షించుకోవాలన్న తాపత్రయంతో రూ.లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతదేహాన్ని బుధవారం రాత్రి మంచిర్యాలకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి మృతదేహం తరలింపునకు ఉచితంగా అంబులెన్సును సమకూర్చారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మిగిలింది ఇద్దరే.. ఒకే కుటుంబంలో డెంగీ మహమ్మారి నలుగుర్ని పొట్టనబెట్టుకోవడంతో ఆ కుటుంబం ఇద్దరు మాత్రమే మిగిలారు. మంగళవారం సోనికి జన్మించిన మగశిశువు(3రోజులు)తో పాటు, పెద్దకుమారుడు శ్రీవికాస్. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. కన్నీరుమున్నీరవుతున్న కుమారుడు.. కేవలం 15 రోజుల వ్యవధిలో నలుగురిని కోల్పోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి, చెల్లెలు ఒకరి తరువాత ఒకరిని కోల్పోయిన రాజగట్టు సోని దంపతుల కుమారుడు శ్రీవికాస్(8)ను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. -
తెలంగాణ:డెంగీ నివారణ చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
-
నేలవేమ కషాయాన్ని పంచండి
చెన్నై,పెరంబూరు: రాష్ట్రంలో డెంగీ జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ వ్యాధితో మరణాలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటుడు రజనీకాంత్ డెంగీ బారి నుంచి ప్రజలను రక్షించడానికి నేలవేమ కషాయాన్ని ఉచితంగా అందించాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. దర్బార్ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన రజనీకాంత్ ఈ నెల 13న ఆధ్యాత్మిక బాట పట్టి హిమాలయలకు వెళ్లారు. ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక పయనాన్ని ముగించుకుని శనివారం చెన్నైకి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై విమానాశ్రయంలో వీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మక పయనం విజయవంతంగా ముగిసిందని తెలిపారు. అదే విధంగా దర్బార్ చిత్రం చాలా బాగా వచ్చిందని తెలిపారు. అయోమయంలో అభిమానులు కాగా రజనీకాంత్ దర్బార్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత రాజకీయాలపై దృష్టిసారిస్తారని, రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని ఆయన అభిమానులు భావించారు. అలాలటిది దర్బార్ చిత్రం తరువాత రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడం, రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు మరో ఏడాదిన్నలో జరగనుండటంతో రజనీ రాజకీయ రంగప్రవేశంపై ఆయన అభిమానులు అయోమయంలో పడ్డారు. చాలా నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ విషయం గురించి రజనీకాంత్ సన్నిహితులు తలైవా రాజకీయాల్లోకి రావడం పక్కా అని భరోసా ఇస్తున్నారు. రజనీకాంత్ త్వరలో శివ దర్శకత్వంలో తన 168వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని, ఆ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత లేదా చిత్ర విడుదల సమయంలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తారని తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందుగాని లేదా ఆరు నెలల ముందుగాని రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు. -
ప్లేట్లెట్స్ ఒక ప్యాకెట్ రూ.14వేలు
ఏలూరు కొత్తపేటకు చెందిన ఇలియాజ్‌కు డెంగీ జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళితేడెంగీ అని వైద్యులు నిర్ధారించారు. ఆకస్మికంగా ఒకరోజు ప్లేట్లెట్స్ కౌంట్ 20వేలకు పడిపోయిందని వైద్యులు చెప్పారు. అర్జెంటుగా ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే మనిషి ప్రాణాపాయస్థితికి చేరతాడని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం తీసుకువెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు తమవద్ద ప్లేట్లెట్స్ లేవని, విజయవాడ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళ్ళాలని రిఫర్ చేశారు. ఆ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకువెళితే ప్లేట్‌లెట్స్‌కు సుమారుగా రూ.14వేల వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే మూడు రోజులపాటు అక్కడ వైద్యం చేయించుకుంటే అయ్యే ఖర్చు సుమారుగా రూ.50 వేలు. దీంతో బంధువుల నోట మాటరాలేదు. ఏమి చేయాలో దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారు. చివరకు రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ (ఎస్డీపీ) ఇవ్వటంతో ఊపిరిపీల్చుకున్నారు.ఇలా.. ప్లేట్లెట్స్ దొరకక, లభ్యమైనా ఖర్చు భరించలేక ఎందరో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు ఏలూరు టౌన్: జిల్లాలో డెంగీ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవటంతో రోగులు ప్రాణాపాయస్థితికి చేరుతున్నారు. జిల్లాలో డెంగీ బాధితులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి రోగులను తీసుకువచ్చినా వైద్యం చేసే పరిస్థితి కనిపించటంలేదు. మెడికల్ సూపరింటెండెంట్, వైద్య అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ లేవని, తామేమీ చేయలేమని రోగుల బంధువులకు చెప్పటంతో వారు లబోదిబోమంటున్నారు. ఇక ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకువెళ్ళలేని పేదవర్గాలప్రజల ప్రాణాలకు భరోసాలేని దుస్థితి నెలకొంది. వైద్య అధికారులకు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు కానరావటం లేదు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు తూతూ మంత్రంగానే చికిత్స చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌కు భారీగా వసూళ్లు ప్రభుత్వ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు మినహా ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ కావాలంటే భారీగా సొమ్ములు చెల్లించాల్సిందే. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఏకంగా ఒక ప్యాకెట్ ప్లేట్లెట్స్ కోసం రూ.12వేల నుంచి రూ.16వేల వరకూ వసూలు చేస్తున్నాయి. ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో కనీసం నామమాత్రంగా అయినా రక్తనిల్వలు లేని దుస్థితి నెలకొంది. రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో మాత్రమే రోగులకు కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తున్నారు. డెంగీ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వాస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంట్ డౌన్ అయితే మాత్రం విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయటం పరిపాటిగా మారింది. ప్రభుత్వ ఆధీనంలో పెద్దగా బ్లడ్ బ్యాంకులు లేకపోవటం, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లోని సిబ్బందిలో చిత్తశుద్ధి లోపించటంతో మాకేంటీ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఏలూరు, జంగారెడ్డిగూడెంలో ఉండగా, రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులు ఏలూరు, తణుకు, నరసాపురంలో ఉన్నాయి. వీటికి అనుసంధానంగా స్టోరేజీ పాయింట్లు పాలకొల్లు, పెనుగొండ, భీమవరం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, భీమడోలు, చింతలపూడిలో ఏర్పాటు చేశారు. ఇక ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఉండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు నిల్ జిల్లా వ్యాప్తంగా ఆయా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, వివిధ వ్యాధులకు సంబంధించి ఆపరేషన్ల సందర్భంలోనూ రోగి ప్రాణాలు రక్షించేందుకు ప్రాణాధారం రక్తమే. కానీ జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో రక్తనిధుల్లో రక్త నిల్వలు లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఒక నెలకు సుమారుగా 5000యూనిట్ల వరకూ రక్త నిల్వలు అవసరం అవుతాయని అంచనా. కానీ జిల్లా వ్యాప్తంగా క్యాంపులు, ఇతర దాతల ద్వారా సేకరించిన రక్త నిల్వలు 3000యూనిట్ల వరకూ మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఇక డెంగీ వంటి వ్యాధుల బారిన పడిన రోగికి అత్యవసరంగా ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవటంతో రక్తం అవసరం అవుతుంది. కానీ రక్త దాతలనుంచి రక్తం సేకరించేందుకు శ్రమించాల్సి వస్తోంది. రక్తాన్ని స్వీకరించటానికి వివిధ నిబంధనలు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కష్టంగా మారుతోంది. దాతల నుంచి రక్తసేకరణ చేయాలి జిల్లాలో అవసరమైన మేరకు బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిధులు లేవు. రక్త దాతలను ప్రోత్సహించి, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తసేకరణ పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పించాలి. యువత, విద్యార్థులు కొంతవరకూ ముందుకు రావటంతోనే చాలా వరకు ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. జిల్లాలో సుమారుగా 5వేల యూనిట్ల వరకూ రక్తనిల్వలు అవసరం అవుతాయి. కానీ ఆ మేరకు రక్త సేకరణ జరగటంలేదనే చెప్పాలి. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో తక్కువ ధరకు, పేదలకు ఉచితంగానూ ప్లేట్లెట్స్ సరఫరా చేస్తున్నాం. రక్తసేకరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.– చిట్టిబాబు, రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుజిల్లా కో–ఆర్డినేటర్ -
సాధారణ జ్వరానికీ డెంగీ పరీక్షలు
జ్వరం వస్తే మందు బిళ్ల వేసుకునేవాళ్లం.. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంజక్షన్ వేసుకుంటే రెండు, మూడు రోజుల్లో నయం అయ్యేది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం కూడా ఖరీదైన వ్యాధిగా మారింది. కొందరు ప్రైవేట్ వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకుల పుణ్యమా అని జ్వరం పేరు చెబితే భయపడే రోజులు వచ్చాయి. కొన్ని రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు మొదలు కొని వృద్ధుల వరకు జ్వరాలతో బాధ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు దోచుకునే పనిలో పడ్డాయి. ప్రొద్దుటూరు క్రైం : టైఫాయిడ్, మలేరియా, సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఎవరికైనా నీరసంగా ఉంటుంది. ఈ కారణంగా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయి. అయితే జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతి కేసుకు ప్రైవేట్ ఆస్పత్రులు, అనుబంధ ల్యాబ్ నిర్వాహకులు డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తకణాలు తగ్గాయని వారిని భయపెడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. రోజుకు రెండు సార్లు రక్తపరీక్షలు చేస్తూ రోగిని పిప్పి చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షలు నిర్వహించే క్రమంలో రోగులకు డెంగీ పాజిటివ్ వచ్చినట్లు చూపుతుండటంతో రోగి, కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా నాలుగైదు రోజులకే సుమారు రూ. 40–50 వేలు దాకా ఆస్పత్రి బిల్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా ల్యాబ్‌లు జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని ల్యాబ్‌లు వందల్లో ఉన్నాయి. జిల్లాలో సుమారు 550కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో జంకుతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా కోర్సు పూర్తి చేసి ల్యాబ్‌టెక్నీషియన్‌లచే క్లినికల్ ల్యాబ్‌లను నిర్వహించాలి. అయితే చాలా చోట్ల అర్హత, అనుభవం లేని వారితో పరీక్షలు చేయిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నారు. లేబొరేటరీలను తనిఖీ చేసే అధికారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకుంది. ప్రతి ల్యాబ్‌ను అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేశారా, రిజిష్టర్ చేయించారా, అర్హులైన టెక్నీషియన్లు ఉన్నారా అనే వివరాలను పరిశీలించాలి. ప్రైవేట్ వైద్యులకు భారీగా కమీషన్లు జిల్లాలోని అనేక ఆస్పత్రులకు ల్యాబ్ సౌకర్యం లేదు. దీంతో వారు బయటికి రాసి పంపుతుంటారు. రెఫర్ చేసినందుకు ప్రైవేట్ ల్యాబ్‌లు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ డబ్బులే కొందరు డాక్టర్లకు నెలకు రూ. లక్షలు వస్తున్నాయి. వైద్యులు రాసే పరీక్షల్లో వైద్యుడిని బట్టి రక్తపరీక్షలు, స్కానింగ్‌లకు 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది వైద్యులు ఆస్పత్రిలోనే ల్యాబ్‌లను సొంతంగా నిర్వహించుకుంటున్నారు. ఫీజులు తగ్గిస్తున్నారా అంటే బయట ల్యాబ్‌ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా అనుమతి లేని ల్యాబ్‌లు ప్రొద్దుటూరులో అనుమతి లేకుండా విచ్చలవిడిగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు ఉండగా వాటిలో కేవలం 14 వాటికే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఎక్కువగా ల్యాబ్‌లు వెలిశాయి. వీటిల్లో ఇచ్చే రిపోర్టుల్లో కూడా తేడాలున్నట్లు తెలుస్తోంది. ఒక ల్యాబ్‌లో ఒక వ్యక్తి రక్తపరీక్ష చేయించుకొని, అతను మరో ల్యాబ్‌కు వెళ్తే వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారనే వివరాలు ల్యాబ్‌ల్లో కనిపించవు. నిబంధనల ప్రకారం అన్ని ల్యాబ్‌లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్లకు కనిపించేలా ధరల పట్టిక పెట్టాలి. ధరల పట్టిక లేకపోవడంతో ఆస్పత్రి డిమాండ్‌ను బట్టి ల్యాబ్ టెస్ట్‌లకు డబ్బు వసూలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం.. అనుమతి లేకుండా ల్యాబ్‌లను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే ల్యాబ్‌ల్లో నిబంధనల మేరకు టెక్నీషియన్లతోనే పని చేయించాలి. ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ పనిలో ఉన్నాం. రిక్రూట్మెంట్ పూర్తవ్వగానే క్లినికల్ ల్యాబ్‌లను పరిశీలిస్తాం. – ఉమాసుందరి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, కడప. -
హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి
బొమ్మలరామారం: రాష్ట్రంలో డెంగీ జ్వరం వస్తే లక్షలు ఖర్చు చేసుకుంటున్న పేదలను ఆదుకోకుండా వాస్తు దోషం పేరిట రూ.4 వేల కోట్లతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారన్నారు. -
ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌కు డెంగీ జ్వరం
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటకు చెందిన రాష్ట్ర శాసన మండలి సభ్యుడు ఫారూక్ హుస్సేన్‌కు డెంగీ జ్వరం సోకింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో సిద్దిపేటలో ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు డెంగీ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఫారూక్ హుస్సేన్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన బంధువులు తెలపారు. -
ఈసారి డెంగీతో డేంజరస్ డబుల్ ధమాకా!..
సాధారణంగా షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇస్తుంటాయి. చిత్రం ఏమిటంటే... అటాంటి డబుల్‌ధమాకానే ఈ సారి ఈ సీజన్లో ఈ దోమ కూడా ఇస్తోంది. రెండు జబ్బులనూ వ్యాప్తి చేయగల ఈ దోమ కావడం వల్ల ఇది డెంగీనీ, చికన్గున్యాను కలిసి డెంజరస్ డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తోంది. డెంగీ మళ్లీ విజృభించింది. టైగర్ దోమ తన పంజా విసిరి ఇరు రాష్ట్రాలనిప్పుడు అల్లకల్లోలం చేసేస్తోంది. డెంగీ వైరస్‌ను ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వ్యాప్తి చేసే విషయం తెలిసిందే కదా. ఈ దోమనే వాడుక భాషలో టైగర్ మస్కిటో అని కూడా అంటారు. డెంగీను వ్యాప్తి చేసే ఇదే దోమ ఇప్పుడు చికన్గున్యాను కూడా తెస్తోంది. మిక్స్డ్ ఇన్ఫెక్షన్ జ్వరాలుగా ఈ సీజన్లో ఈ వ్యాధులు వస్తున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే డెంగీపైనా, ఈ మిక్స్డ్ ఇన్ఫెక్షన్పైన అవగాహన పెంచుకోడాల్సిన అవసరం ఉంది. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. నిజానికి డెంగీ కూడా చాలా రకాల వైరల్ జ్వరాల్లాగే తనంతట తానే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) వ్యాధి. కానీ కొంతమంది వ్యాధిగ్రస్తుల్లో వారి ప్లేట్లెట్లు ప్రమాదకర స్థాయి కంటే కిందికి పడిపోతాయి. దాంతో అది చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటివారి విషయంలో మాత్రం చాలా అప్రమత్తత అవసరం. అది మినహా మిగతా అందరికీ ఇది లక్షణాలకు చేసే వైద్యచికిత్స (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్)తోనే తగ్గిపోతుంది. కాకపోతే రోగి ప్రమాదకరమైన పరిస్థితిల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక ప్లేట్లెట్లు పడిపోయిన కారణంగా రోగిలోని అంతర్గత అవయవాల్లోకి రక్తస్రావమయ్యే పరిస్థితి రోగికి వచ్చినప్పుడు మాత్రం అలాంటి వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. అలాంటి కేసులు మినహాయిస్తే డెంగీ అనేది మనం అనుకున్నంత ప్రమాదకరం కాదని గుర్తిస్తే, దాని గురించి ఉన్న అపోహలతోనూ, వ్యాధి పట్ల ఉన్న దురభిప్రాయాలతో కలిగే ఆందోళన తగ్గుతుంది. డెంగీలో రకాలు డెంగీలో మూడు రకాలు ఉన్నాయి. అవి... 1 ఎలాంటి హెచ్చరికలూ చూపకుండా వచ్చే సాధారణ డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) 2 కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు చూపుతూ వచ్చే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) 3 తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) లక్షణాలు ►హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా కనిపించే డెంగీ (డెంగీ విదవుట్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : ఈ తరహా డెంగీ వచ్చిన వారు సాధారణంగా డెంగీ విస్తృతంగా వస్తున్న ప్రాంతంలో నివసిస్తున్న వారై ఉంటారు. వైద్యపరిభాషలో ఇలా డెంగీ విస్తృతంగా ఉన్న ప్రాంతాలను ఎండెమిక్ ప్రాంతాలుగా చెబుతుంటారు. ఇలాంటి చోట్ల ఉన్న వారిలో జ్వరం, వికారం/వాంతులు, ఒళ్లంతా నొప్పులు (జనరలైజ్డ్ బాడీ పెయిన్స్), ఒంటి మీద ర్యాష్ వంటి బయటి లక్షణాలు కనిపిస్తాయి. వీరికి టార్నికేట్ అనే పరీక్ష చేస్తారు. దీంతో పాటు సాధారణ రక్తప్రరీక్ష చేసినప్పుడు డెంగీ వ్యాధిగ్రస్తుల్లో తెల్ల రక్తకణాల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తుంది. ►హెచ్చరికలతో కనిపించే డెంగీ (డెంగీ విత్ వార్నింగ్ సైన్స్) కేసుల్లో : పై లక్షణాలతో పాటు పొట్టలో నొప్పి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరా అనే పొరలో లేదా పొట్టలో నీరు చేరడం కొందరిలో పొట్టలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం అవుతుండటం, రోగి అస్థిమితంగా ఉండటం, రక్తపరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలకూ, మొత్తం రక్తం పరిమాణానికి ఉన్న నిష్పత్తి కౌంట్ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ సంఖ్య విపరీతంగా పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►తీవ్రమైన డెంగీ (సివియర్ డెంగీ) కేసుల్లో : అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కారణంగా రోగి తీవ్రమైన షాక్‌కు గురవుతాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి (పల్మునరీ ఎడిమాతో) శ్వాసప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా రోగి స్పృహకోల్పోవడం లేదా పాక్షికంగానే స్పృహలో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతర్గత అవయవాలు తమ విధులు నిర్వహించడంలో విఫలం అవుతాయి. అంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే కండిషన్ ఏర్పడి చాలా కీలకమైన అవయవాలు పనిచేయకుండా మొరాయిస్తాయి. ►మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో భాగంగా చికన్గున్యాతో పాటు వస్తే... అలాంటప్పుడు మరింత ఎక్కువగా ఎముకలు, కీళ్ల నొప్పులు (జాయింట్ పెయిన్స్) ఉంటాయి. డెంగీలో కంటే మిక్స్డ్ ఇన్ఫెక్షన్లో ఈ నొప్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. డెంగీలో మరింత ప్రమాదకరమైన మరికొన్ని లక్షణాలివీ... ►ప్లేట్ లెట్స్ తక్కువైన కారణాన అంతర్గత అవయవాలలోకి రక్తస్రావం అయ్యే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితితో పాటు మరికొన్ని సందర్భాల్లో కొన్ని ఇతర లక్షణాలూ రోగుల్లో కనిపిస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది ఒంట్లో నీరు, లవణాల మోతాదు బాగా తగ్గిపోవడం (సివియర్ డీహైడ్రేషన్). ►కొందరిలో కొన్ని సందర్భాల్లో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హెమటోక్రిట్ పెరుగుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది. హార్ట్‌బీటింగ్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల మెదడు దెబ్బతినే (బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే) ప్రమాదమూ ఉంది. మన వ్యాధినిరోధక వ్యవస్థ (పూర్తి ఇమ్యూన్ సిస్టమే) డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ►గుండె స్పందనలు (హార్ట్‌బీట్) 60 కంటే తక్కువకు పడిపోవడం అన్నది చాలా ప్రమాదకరమైన సూచన. రోగికి ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్‌లో ఉంచాల్సిన అవసరం ఏర్పడవచ్చు. నివారణే ఎంతో మేలు అన్ని వ్యాధుల లాగే డెంగీ విషయంలోనూ చికిత్స కంటే నివారణ ఎంతో మేలు. డెంగ్యూ వచ్చేందుకు దోహదపడే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే కుడుతుంది. నిల్వ ఉండే మంచి నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తపడాలి. వీలైతే వారంలో ఏదో ఒకరోజు ఇంటిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి. ►ఇంట్లోని మూలల్లో.. చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశాల్లో ఎడిస్ ఎజిపై్ట అవాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. అయితే అదే సమయంలో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించుకోడానికి తలుపులకు, కిటికీలకు మెష్ అమర్చుకోవడం చాలా మంచిది. ►ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి ప్రదేశాల్లో మనకు తెలియకుండానే నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుకే ఇంటి పరిసరాల్లో ఉండే ఇలాంటి వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. ఇంట్లో వాడని డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టడం మంచిది. అలాగే వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీరు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిపై్ట గుడ్లు పెట్టకుండా నివారించ వచ్చు. ►ఇది పెద్దగా ఎత్తులకు ఎగరలేదు. అందుకే కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు తొడుక్కోవడం చాలా రక్షణ ఇస్తుంది. అలాగే చేతుల విషయంలోనూ ఫుల్‌స్లీవ్ మంచివి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా షార్ట్స్ లాంటి వాటికి బదులుగా ఒంటిని నిండుగా కప్పిచేసే దుస్తులనే ధరించాలి. కాళ్లనూ కవర్చేసే పైజామాలు, రాత్రిపూట కూడా సాక్స్ వేసుకుని నిద్రించడం మంచిది. ►ఏడిస్ ఈజిపై్ట దోమలు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ►దోమలను దూరంగా తరిమివేసే మస్కిటోరిపలెంట్స్ వాడటం మేలు. పగలు కూడా మస్కిటో రిపల్లెంట్స్ వాడవచ్చు. (పికారిటిన్ లేదా ఆయిల్ ఆఫ్ లెమన్ యూకలిప్టస్ లేదా ఐఆర్3535... కంపోజిషన్లోని ఈ మూడింటిలో ఏది ఉన్నా ఆ రిపల్లెంట్స్ వాడవచ్చు. ఈ మస్కిటో రిపల్లెంట్స్ ప్రతి 4 – 6 గంటలకు ఒకసారి శరీరంపై బట్టలు కప్పని భాగాల్లో స్ప్రే చేసుకోవాలి. అయితే ముఖం మీద స్ప్రే చేసుకునే సమయంలో ఇవి కళ్ల దగ్గర స్ప్రే కాకుండా జాగ్రత్త పడాలి. వ్యాక్సిన్ అందుబాటులో ఉంది... అయితే ? ఇప్పుడు డెంగీకి టీకా (వ్యాక్సినేషన్) అందుబాటులో ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు ఈ టీకాను గతంలో డెంగీ వచ్చిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండోసారి డెంగీ రావడం చాలా ప్రమాదకరం కాబట్టి అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని నివారించేందుకు ఈ టీకా తోడ్పడుతుంది. అంటే అంతర్గత అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం అయి రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. సాధారణ డెంగీ నివారణకు దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రమాదకర పరిస్థితులకు ముందస్తు సంకేతాలివి ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చిగుర్ల్లలోంచి కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అలాగే ఒంటి మీద (చర్మం కింద) రక్తపు మచ్చల్లాంటివి కనిపిస్తే అది డెంగ్యూకు ముందస్తు స్థితి అన్నమాట. ఇలాంటి మచ్చలనే వైద్యపరిభాషలో ‘పిటేకియే’ అంటారు. దీన్ని బట్టి డెంగీని గుర్తించవచ్చు. మొదటి సారి కంటే... తర్వాతి వాటితోనే మరింత డేంజర్ సాధారణంగా మొదటిసారి వచ్చే డెంగీ కంటే... ఒకసారి వచ్చి తగ్గాక మళ్లీ వస్తే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే... డెంగీని సంక్రమింపజేసే వైరస్‌లో నాలుగు రకాలున్నాయి. అదే రకం వైరస్ మరోసారి వస్తే అది ప్రమాదకరం కాదు. కాని... ఒకసారి వ్యాధికి గురైన వాళ్లలో మరోసారి ఇంకోరకమైన డెంగీ వైరస్ వచ్చినప్పుడు అది మరింత తీవ్రరూపంలో కనిపిస్తుంది. అందుకే మొదటిసారి కంటే ఆ తర్వాత వచ్చేవి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. చికిత్స... డెంగీ అనేది వైరస్ కారణంగా వచ్చే వ్యాధి కాబట్టి దీనికి నిర్దిష్టంగా మందులేమీ ఉండవు. అందువల్ల కేవలం లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తుంటారు. అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచే నోటిద్వారా లవణాలతో కూడిన ద్రవాహారం (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్– ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి షాక్‌లోకి వెళుతుంటే అప్పుడు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల నుంచి 15 వేలు అంతకంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. వాటిని ఎప్పుడు ఎక్కించాలన్న అంశాన్ని డాక్టర్లు నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా డెంగీ ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగీ కావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఆ సాధారణ మందులు...డెంగీ రోగులకు ఎంతో ప్రమాదం సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగీ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను మరింత పెంచుకున్నట్టే. ఇది చాలా ప్రమాదకరం కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడకూడదు. ఇది మరింత ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోడాల్సిన విషయం. ►ప్లేట్లెట్లు తగ్గుతున్నప్పుడు ప్రతి రోజూ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష రోజుకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు బాగా నీరసంగా ఉన్నా... దాంతో పాటు రక్తపోటు (బీపీ) పడిపోతూ ఉన్నా వెంటనే హాస్పిటల్లో చేరడం అవసరం. డెంగీ లక్షణాలు కనిపిస్తే యాంటీబయాటిక్స్ వద్దు చాలా మంది గ్రామీణ డాక్టర్లు డెంగీ లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్ మందులు ఉపయోగిస్తుంటారు. అయితే డెంగీ రోగికి జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే యాంటీబయాటిక్స్ వాడటం సరికాదు. ఇలా మందుల వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గతే అది అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. ఫలితంగా మందులే ప్రమాదకరం కావచ్చు. డాక్టర్ల విచక్షణ, సలహా మేరకే ఇతర మందులు కూడా ఇక మనం వాడే చాలారకాల ఇతర మందులు సైతం ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ర్యానిటడిన్, సెఫలోస్పోరిన్, క్యాప్టప్రిల్, ఏసీ ఇన్హిబిటార్స్, బ్రూఫెన్, డైక్లోఫినాక్, యాస్పిరిన్ వంటి అనేక మందులు ప్లేట్లెట్ కౌంట్‌ను తగ్గించడం లేదా ప్లేట్లెట్ ఫంక్షన్‌ను ప్రభావితం చేయడం చేస్తాయి. అందుకే మరీ అత్యవసరం అయితే తప్ప డెంగీ లక్షణాలు కనిపిస్తే వారికి యాంటీబయాటిక్స్‌తో పాటు ఇతర రకాల మందులు వాడటం సరికాదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వాడాలి. డెంగీ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ ఉండదు. కొందరిలో మినహాయించి అది అంతరిలోనూ ప్రమాదకరం కాదు. అందుకే ఎప్పటికప్పుడు తమ ప్లేట్లెట్ల కౌంట్‌ను పరిశీలిస్తూ... నయమయ్యే వరకు అప్రమత్తంగా ఉంటే చాలు. నిర్ధారణ పరీక్షలు ►సీబీపీ ప్రతి 24 గంటలకు ఒకసారి చేయాలి. ►డెంగీ నిర్ధారణ కోసం డెంగ్యూ ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష అవసరం కావచ్చు. ►డెంగీ ఐజీఎమ్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ రిపోర్టులు వచ్చే సమయం కూడా ఎక్కువే కాబట్టి అవి వచ్చే వరకు ఆగకుండా... లక్షణాలను బట్టి ముందుగానే చికిత్స తీసుకోవడం మంచిది. పైగా దీనికి చేసే చికిత్స కూడా లక్షణాలను బట్టి చేసేదే కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఇప్పుడు మరింత అధునాతనమైన నిర్ధారణ పరీక్ష ఇప్పుడు అత్యంత అధునాతమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. అదే ఐపీఎఫ్ (ఇమ్మెచ్యూర్ ప్లేట్లెట్ ఫ్రాక్షన్) అనే అత్యాధునిక పరీక్ష. అయితే ఇది పెద్ద పెద్ద మెడికల్ సెంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్లేట్లెట్లను ఎప్పుడు, ఎంత పరిమాణంలో ఎక్కించాలో తెలుసుకోడానికి ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్లకు సంబంధించిన కచ్చితమైన వివరాలతో పాటు శరీరంలో ప్లేట్లెట్ల ఉత్పత్తికి తోడ్పడే ఎముకలోని భాగమైన బోన్‌మ్యారో పనితీరు కూడా ఈ పరీక్షతో తెలుస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్లు వృద్ధి చెందుతాయా, లేదా, ఒకవేళ ప్లేట్లెట్లు ఎక్కించడం ఎంతమేరకు అవసరం... లాంటి చికిత్సకు ఉపకరించే ఎన్నో విషయాలు ఈ పరీక్ష ద్వారా వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఆ మేరకు ప్లేట్లెట్స్ మార్పిడి, చికిత్స విధానాన్ని అవలంబిస్తారు. ఒకవేళ బోన్‌మ్యారోలో లోపం ఉంటే పైపై చికిత్సలను ఆపేసి, ప్రధానమైన మూలాల్లోకి వెళ్లి మెరుగైన చికిత్సను సకాలంలో అందించి, పేషెంట్ ప్రాణాలను కాపాడతారు. ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం రోగులందరికీ ఉండదు ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే... డెంగీకి గురైన ప్రతి పేషెంట్‌కీ ప్లేట్లెట్ల మార్పిడి అవసరం ఉండదు. కేవలం ప్రమాదకరమైన స్థాయిలో ప్లేట్లెట్లు పడిపోయిన వారికి మాత్రమే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అనే ఈ చికిత్స చేస్తారు. మిక్స్డ్ ఇన్ఫెక్షన్తో ఈసారి మరింత ప్రత్యేకం...! ఈసారి వస్తున్న డెంగీకి మరో ప్రత్యేకత ఉంది. ఈ సీజన్లో వస్తున్న వైరల్ జ్వరాల్లో డెంగీతో పాటు చికన్‌గున్యా ఫీవర్స్ కలిసి వస్తున్నాయి. అంటే ఒకరకంగా చెప్పాలంటే ‘మిక్సిడ్ ఇన్ఫెక్షన్’లాగా వస్తోంది. సాధారణంగానే డెంగీలో ఎముకల నొప్పి ఉంటుంది. పైగా దీనితో పాటు చికన్‌గున్యా తోడవ్వడంతో ఎముకల్లో నొప్పి మరింత తీవ్రస్థాయిలో ఉంటోంది. ఒకవేళ అది మిక్స్డ్ ఇన్ఫెక్షన్ అయితే.. డెంగీకి ఇచ్చే చికిత్సతో పాటు ప్రతి ఆరుగంటలకు ఒకసారి పార్సిటమాల్ టాబ్లెట్ ఇవ్వాలి. దీనివల్ల జ్వరం, నొప్పులు రెండూ తగ్గుతాయి. అదే కేవలం డెంగీకి అయితే ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి పారసిటమాల్ ఇస్తారు. మూడు రోజులు మాత్రం ఇచ్చి ఆ తర్వాత ఆపేస్తారు. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ పెరిగి డెంగీ నుంచి కోలుకున్న తర్వాత చికన్‌గున్యాకు అవసరమైన చికిత్స ఇస్తారు. ఎందుకంటే చికన్గున్యాతో వచ్చే నొప్పులు నెలల తరబడి ఉంటాయి కాబట్టి నొప్పులు తగ్గడానికి అవసరమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వైరల్.. హడల్
నల్లకుంట/గాంధీ: విషజ్వరాలు నగరవాసులను వణికిస్తున్నాయి. ఎప్పడూ లేని విధంగా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతుండడంతో రెండు వారాల క్రితం అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 2వేల నుంచి 3వేల మంది రోగులు వస్తున్నారు. అయితే ఆస్పత్రిలో 20 మంది వైద్యులే అందుబాటులో ఉండడంతో... ఒక్కో వైద్యుడు సగటున 120–150 మందిని చూడాల్సి వస్తోంది. దీంతో రోగులు గంటల తరబడి లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి అదనపు వైద్యులను ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు ల్యాబ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. రక్త పరీక్షల కోసం రోగులు బారులుతీరుతున్నారు. ఇక్కడ క్యూలైన్ పాటించకపోవడంతో ఒక్కోసారి తోపులాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. ‘గాంధీ’లో డెంగీ డేంజర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఐదు రోజుల్లో 555 విషజ్వరాల కేసులు నమోదు కాగా... వాటిలో 121 డెంగీ పాజిటివ్ కేసులు కావడం గమనార్హం. బాధితుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 11, 12 తేదీల్లో ఇద్దరు డెంగీతో మరణించగా... ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు డెంగీతో మృతి చెందారు. నేలపైనే వైద్యం గాంధీకి రోగుల తాకిడి పెరగడంతో బెడ్స్ సరిపోవడం లేదు. దీంతో రోగులను వరండాలో నేలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో స్ట్రెచర్లు, వీల్‌చైర్లపైనే వైద్యం అందించాల్సి వస్తోంది. 1,062 పడకలున్న ఆస్పత్రిలో సుమారు 3వేల మందికి వైద్యం అందించడం గమనార్హం. విషజ్వరాల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైరల్ ఫీవర్ వార్డు రోగులతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం స్పందించి రోగుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు. సంఖ్య పెరిగింది సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధిచెందుతాయి. తాగునీరు కలుషితం కావడం వల్ల కూడా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. అధికంగా జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ సొంతంగా వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి. – డాక్టర్ పద్మజ, ఫీవర్ సీఎస్ ఆర్ఎంఓ -
ఫీవర్ ఆస్పత్రిలో అవస్థలు
సాక్షి హైదరాబాద్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రిలో మొత్తం 51 మంది స్టాఫ్ నర్స్ పోస్టులకు గానూ ప్రస్తుతం 41 మంది మాత్రమే ఉన్నారు. కొందరు పదవీ విరమణ పొందగా మరి కొందరు బదిలీపై వెళ్లడంతో 11 స్టాఫ్ నర్స్‌ల ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఓపీ, ఇన్ పేషెంట్ వార్డుల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఇటీవల సీజనల్ వ్యాధులతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడికి పెరిగింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు పడకలు ఏర్పాటు చేసినా ఆరోగ్య శాఖ అదే స్థాయిలో నర్సింగ్ సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల రద్ధీ కనుగుణంగా ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు లేదా నలుగురు నర్సులు ఉండాలి. ఎడతెరిపిలేని వర్షాలకు తోడు పారిశుధ్య సమస్యలు నెలకొనడంతో గతంలో ఎన్నడూలేని విధంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో రోగులు చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సాధారణ రోగులకు ఓపీలో చికిత్సలు అందిస్తున్న వైద్యులు ఇంటికి పంపేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిన రోగులను ఇన్పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగుల రద్ధీకి అనుగుణంగా ఆరోగ్యశాఖ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో అదనంగా 50 పడకలు ఏర్పాటు చేసింది. అయితే దానికి తగినట్లుగా స్టాఫ్ నర్స్‌ల కొరతకు తోడు అదనపు సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. వార్డు 2లో ఒక్కరే.. గత ఆదివారం వార్డు 2లో ఒక్క నర్స్ మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. వార్డులో దాదాపు 75 మంది రోగులు ఉండగా ఒక్క నర్స్ మాత్రమే అందరినీ చూసుకోవడం కష్టంగా మారిందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్స్‌ల కొరత ఉన్నప్పుడు అదనంగా ఎన్ని పడకలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదన్నారు. రోగుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని డిప్యూటేషన్‌పై అదనపు నర్స్‌లను నియమించాలని కోరుతున్నారు. సీజన్ ముగిసే వరకు కనీసం నర్సింగ్ విద్యార్థులనైనా సహాయకులుగా నియమించాలని వారు పేర్కొన్నారు. -
15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్
-
15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్
సాక్షి, హైదారాబాద్ : అంటు వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అవగాహన సదస్సులతో పాటు త్వరలోనే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. సోమవారం ఆయన మంత్రి ఈటల రాజేందర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విష జ్వరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతోనే విషజ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రమంతటా ప్రజలు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. అందరికి వైద్యం అందేలా ప్రభుత్వం యుద్ధప్రాతిక చర్యలు చేపబట్టబోతుందన్నారు. ఆస్పత్రుల్లో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ సమీక్షిస్తున్నారన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, రోడ్ల పరిస్థితిపై సమీక్షించామని, సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక క్యాలెండర్ రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో దోమలను నివారించవచ్చునని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కేబినెట్ ఆమోదిస్తే బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచుతామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో అంటువ్యాధులు, నివారణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారులు ఉదయం 6 గంటలకల్లా విధుల్లో ఉండాలని సూచించారు. డెంగీని 15 రోజుల్లో అదుపులోకి తెస్తామని మంత్రి తెలిపారు. వినాయక మండపాల వద్ద పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. నిర్మాణరంగ వ్యర్థాలపై నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. మేయర్, కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో డ్రైనేజీ పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం జీహెచ్ఎంసీ బాధ్యత అని కాకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. -
డెంగీతో 9 నెలల బాలుడి మృతి
కీసర: డెంగీతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం కీసర రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్పలో నివసించే సాయిచంద్ర కుమారుడు జి.వినేష్ (9 నెలలు) వారం రోజుల క్రితం జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు నాగారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జ్వరం తగ్గకపోవడంతో ఏఎస్‌రావునగర్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. దీంతో వినేష్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
ఆస్పత్రులు హౌస్‌ఫుల్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో డెంగీ, డిఫ్తీరియా, స్వైన్‌ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు డెంగీతో చనిపోగా, మరొకరు డిఫ్తీరియాతో మృతి చెందారు. తాజాగా శుక్రవారం కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన గర్భిణి డెంగీతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మృతి చెందడంపై ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు స్వైన్‌ఫ్లూ సైతం నగరవాసుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రమాదకరమైన డెంగీ, మలేరియా జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుకుంటున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల ఔట్ పేషెంట్ విభాగాలకు సుమారు 8 వేల మంది రోగులు వచ్చారు. వీరిలో కొత్తగా ఒక్కో ఆస్పత్రిలో 150 నుంచి 200 మంది ఇన్‌పేషంట్లుగా చేరారు. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో పడకల నిష్పత్తి కంటే ఎక్కువ సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ, డిఫ్తీరియా బాధితులు పెరగడంతో ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిచింది. అదనంగా 21 కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు పడకలను సమకూర్చినట్లు చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే జనరల్ మెడిసిన్ విభాగాలన్నీ డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోగా, కొత్తగా వచ్చే రోగులకు పడక దొరకని పరిస్థితి. నిలోఫర్ చిన్నప్లిలల ఆస్పత్రిలో ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తుండగా.. ఉస్మానియాలో పడకలు లేక నేలపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాంధీలో పడకల సంఖ్య కంటే రెట్టింపు రోగులు చికిత్స పొందుతుండడంతో కొత్తగా వచ్చిన వారికి ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘ప్రైవేటు’లో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతార్ సాధారణంగా మనిషి శరీరంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ ప్లేట్ లెట్కౌంట్ పడిపోవడం సహజం. 25 వేల వరకు పడిపోయినా పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఈ కౌంట్ 20 వేల కంటే తగ్గిపోతే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించాలి. కానీ చాలా ప్రైవేటు ఆస్పత్రులు రోగుల ఆందోళనను ఆసరాగా చేసుకుని అవసరం లేకపోయినా ఐసీయూ చికిత్సలు, ఉదయం, సాయంత్రం పరీక్షల పేరుతో భారీగా డబ్బు పిండుతున్నాయి. ఆస్పత్రి పరీక్షలో డెంగీ పాజిటివ్‌గా నిర్థారణ అయిన రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి నారాయణగూడలోని ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉంది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రులు మినహా నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా పంపడం లేదు. మళ్లీ విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ సాధారణంగా చలితీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్1ఎన్1 కారక స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తుంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సీజన్‌తో సంబంధం లేకుండా నగరవాసులను ఇప్పుడు ‘ఫ్లూ’ వెంటాడూతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 409 పాజిటివ్ కేసులు నమోదవగా, వీరిలో 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం గాంధీలో ఒకరు చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వళ్లు నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు డయేరియా...అటు టైఫాయిడ్.. నగరానికి కృష్ణ, గోదావరి ప్రాజెక్టుల నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ఇటీవల ఆయా ప్రాజెక్టులకు వరదలు పోటెత్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. సాధారణంగా ’సాల్మోనెల్లా టైఫి’ బ్యాక్టీరియా కలిసిన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్ సోకుతుంది. అధిక జర్వంతో మొదలై...అలసట, తలనొప్పి, కడుపునొప్పి, మలబద్ధకం, వికారం, ఛాతిపై గులాబీరంగు మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వీరికి సరైన వైద్యసేవలు అందక పోవడంతో వారంతా ఫీవర్ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మల, మూత్ర విసర్జన త ర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం, వేడివేడి ఆహారం తీసుకోవడం, కాచివడపోసిన నీటిని తాగడం ద్వారా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల భారీ నుంచి బయటపడొచ్చు అని డాక్టర్ రంగనాథ్ సూచించారు. డెంగీతో గర్భిణి మృతి కీసర: డెంగీతో గర్భిణి మృతి చెందింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొల్కూరి స్వాతి(24) ఎనిమిది నెలల గర్భిణి. ఐదు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆమెను మేడ్చల్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె గురువారం తీవ్ర అస్వస్తతకు గురవడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్లేట్లెట్స్ 20 వేలకు పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయి శుక్రవారం తెల్లవారుజామున కడుపులో ఉన్న బిడ్డతో పాటు స్వాతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
డెంగీతో చిన్నారి మృతి
లాలాపేట: డెంగీ జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం లాలాపేటలో చోటు చేసుకుంది. స్థానిక లక్ష్మీనగర్ యాదవ బస్తీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, అనిత దంపతుల ఏకైక కూతురు రుత్విక(4)కు నాలుగు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌లో చూపించారు. పరీక్షించిన వైద్యుడు పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని రెయిన్బో హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ రుత్విక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి స్థానికంగా ఉన్న ఆశ్రయ్ మోడల్ స్కూల్లో యూకేజీ చదువుతుండడంతో బుధవారం ఆ పాఠశాలకు సెలవు ప్రకటించారు. -
డెంగీ వ్యాక్సిన్ కనబడదేం?
సాక్షి, హైదరాబాద్: నాలుగైదేళ్లుగా సీజన్ మారగానే దేశానికి డెంగీ జ్వరం పట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా లక్షలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయ్. మన రాష్ట్రంలోనూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండగా.. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు పండుగ చేసుకుంటున్నాయి. అయినా దేశవ్యాప్తంగా డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అనేక దేశాలు డెంగీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా భారత్ మాత్రం దాన్ని ప్రవేశపెట్టడానికి ముందుకు రాకపోవడంపై విమర్శలొస్తున్నాయి. కార్పొరేట్ లాబీయింగ్ వల్లే డెంగీ వ్యాక్సిన్ ఇంతవరకు భారత్‌లోకి రాలేదనే చర్చ జరుగుతోంది. అయితే.. వ్యాక్సిన్ పనితీరుపై వివాదాలు నెలకొన్నందునే భారత్ ముందడుగు వేయడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో 5.24 లక్షల భారతీయులకు.. ప్రపంచంలో అనేక దేశాలను డెంగీ వణికిస్తోంది. భారత్‌లో గత నాలుగేళ్లుగా డెంగీ జ్వరాలు ప్రజలను పీల్చి పిప్పిచేశాయి. కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేకరించిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం డెంగీ కేసులను లెక్కగట్టగా.. ఒక్క 2015లోనే దేశంలో లక్ష మందికి డెంగీ సోకింది. అందులో 220 మంది చనిపోయారు. 2016లో 1.26 లక్షల మందికి డెంగీ జ్వరం రాగా.. ఇందులో 245 మంది చనిపోయారు. 2017లో 1.88 లక్షల మందికి డెంగీ రాగా, అందులో 325 మంది చనిపోయారు. 2018లో 1.01 లక్షల మంది బాధితుల్లో.. 172 మంది చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలో 5,504 మందికి డెంగీ రాగా ఐదుగురు చనిపోయినట్లు తేల్చారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 967మంది చనిపోయారు. తెలంగాణలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో 17,476 మందికి డెంగీ సోకగా.. 8 మంది మాత్రమే చనిపోయినట్లు కేంద్ర నివేదిక పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసులను మాత్రమే కేంద్రం పరిగణన లోకి తీసుకుంది. ప్రైవేటుతో కలిపితే ఈ సంఖ్య ఏకంగా 5రెట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో డెంగీ కేసులు నమోదవుతుంటే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్‌తో డెంగీకి చెక్! ‘డెంగ్వాక్సియా’అనే వ్యాక్సిన్ 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మాత్రం ఈ ఏడాది మాత్రమే ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. అలాగే గతేడాది చివర్లో యూరోపియన్ కమిషన్ కూడా.. యూరప్‌లోని డెంగీ ప్రభావిత ప్రాంతాలలో ఈ టీకా వాడేందుకు అనుమతిచ్చింది. మరో 19 దేశాలలో ఈ వ్యాక్సిన్‌కు పచ్చజెండా ఊపారు. తాజాగా లాటిన్ అమెరికా సహా ఆసియాలోని 10 దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులు ‘డెంగ్వాక్సియా వ్యాక్సిన్’ను గతంలో ఓసారి డెంగీకి గురైన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మరోసారి వారికి డెంగీ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్పొరేట్ లాబీకి తలొగ్గేనా? లక్షలాది మందికి ఇప్పటికే ఓసారి సోకినప్పటికీ మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ను ఎందుకు ప్రవేశపెట్టడంలేదన్న చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్‌కు అనుమతిస్తే డెంగీ ద్వారా వచ్చే వ్యాపారమంతా పోతుందన్న భావనలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు వ్యక్తం చేసినట్లు వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. భారత్‌లో వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఉంది డెంగీ వ్యాక్సిన్ దేశంలో 4వ దశ ట్రయల్స్‌లో ఉంది. ఎఫ్‌డీఏ అనుమతి కూడా వచ్చినందున నాలుగో దశ ట్రయల్ తర్వాత ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. – డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్,సన్‌షైన్ ఆసుపత్రి, హైదరాబాద్. ఫ్లూ వ్యాక్సిన్ మాత్రమే ఉంది ప్రస్తుతం దేశంలో డెంగీ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని ప్రవేశానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియదు. ప్రస్తుతం కేవలం ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. – డాక్టర్ శ్రీనివాసరావు, సంచాలకులు, ప్రజారోగ్యం, తెలంగాణ ప్రభుత్వం -
డెంగీ బూచి..కాసులు దోచి!
బైరమల్‌గూడకు చెందిన కరుణాకర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యపరీక్షల్లో డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్లేట్లెట్స్ కౌంట్పడిపోయిందని చెప్పి..ఐసీయూలో చేర్చి...ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు చేయడంతో పాటు ప్లేట్లెట్స్ ఎక్కించారు. వారం రోజులకు రూ.1.50 లక్షలు చెల్లించారు. డిశ్చార్జ్ సమయంలో చేతికిచ్చిన బిల్లు చూసి కుటుంబసభ్యులు వణికిపోయారు. ఇలా ఒక్క కరుణాకర్ కుటుంబసభ్యులు మాత్రమే కాదు..సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది వైద్య పరీక్షలు, వాటికవుతున్న ఖర్చులు చూసి వెంటవచ్చిన బంధువులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాక్షి, సిటీబ్యూరో:డెంగీ జ్వరం సంగతేమో కానీ..ఆ పేరుతో ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు చేతికిచ్చే బిల్లులను చూస్తే మాత్రం కచ్చితంగా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం సీజన్ మారడంతో నగరంలో డెంగీ జ్వరాలు చాపకింది నీరులా విస్తరిస్తున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రి సహా నగరంలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ బెడ్లు దొరకని పరిస్థితి. సాధారణ జ్వరాలతో పోలిస్తే డెంగీ కొంత ప్రమాదకరమైనది. ఈ డెంగీ జ్వరంపై రోగుల్లో భయాన్ని నగరంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు అవకాశంగా తీసుకుంటున్నాయి. దీన్ని బూచీగా చూపించి...సాధారణ జ్వర పీడితులను ఆ చికిత్సల పేరుతో నిలువుదోపిడీకి గురిచేస్తున్నాయి. అవసరం లేకపోయినా ఐసీయూ చికిత్సలు, గంటకోసారి వైద్య పరీక్షలు, హడావిడిగా ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు. తీవ్రమైన డెంగీ బాధితులే కాదు..సాధారణ జ్వర పీడితులు సైతం చికిత్సల తర్వాత ఆస్ప త్రులు చేతికిచ్చే బిల్లులు చూసి విస్తుపోవాల్సి వస్తుంది. చికిత్సల పేరుతో ఒక్కో రోగి నుంచి రూ.1.50 లక్షల నుంచి మూడు నుంచి నాలుగు లక్షలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనవసరంగా ప్లేట్లెట్లు, ప్లాస్మాలను మోతాదుకు మించి ఇస్తే..భవిష్యత్తులో అక్యూట్లంగ్ ఇంజ్యూరీ, కొన్ని సార్లు అలర్జిక్ రియాక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం లేకపోలేదని హెమటాలజిస్టులు చేస్తున్న హెచ్చరికలను సైతం వారు బేఖాతారు చేస్తుండటంపై స ర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐపీఎంకు చేరని రెండో శాంపిల్: ప్రభుత్వం ఐజీఎం ఎలీసాటెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ ఎన్ఎస్–1 టెస్టు లో పాజిటివ్ వచ్చిన కేసులను కూడా డెంగీగా నమోదు చేస్తున్నాయి. నిజానికి క్లినికల్ వైద్య పరీక్షలో డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయిన రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్(ఐపీఎం)కు పంపాలనే నిబంధన ఉంది. కానీ ఉస్మానియా, గాంధీ, ఫీవర్ వంటి ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా దీన్ని పట్టించుకోడం లేదు. సాధారణ జ్వరాలను కూడా అనుమానిత డెంగీగా నమోదు చేసి గుట్టు చప్పుడు కాకుండా చికిత్సలు చేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎపిడమిక్ సెల్‌కు అందజేయక పోవడంతో ఏ ఆస్పత్రిలో ఎంత మంది ఏ వ్యాధిబాధితులు చికిత్స పొందుతున్నారనే విషయం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కూడా తెలియడం లేదు. ఫలితంగా సీజనల్ వ్యా ధుల తీవ్రత ప్రభుత్వ దృష్టికి వెళ్లడం లేదు. జ్వరాలన్నీ డెంగీ కాదు– డాక్టర్ రంగనాథ్,మాజీ సూపరింటెండెంట్, నిలోఫర్ ♦ ఈడిస్ ఈజిప్ట్(టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. ♦ నల్లని ఈ దోమ ఒంటిపై తెల్లని చారలు కన్పిస్తూ కేవలం పగటిపూట మాత్రమే కుడుతుంది. ♦ కళ్లమంట, కండరాల నొప్పులు, అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి. ♦ చర్మం చిట్లిపోయి రక్తస్తావం అవుతోంది. ♦ బీంగ్ వల్ల బీపీ పడిపోవడంతో షాక్‌కు గురై కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి– డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజిషియన్ ♦ డెంగీ వ్యాధి బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ♦ ఇంటి పరిసరాల్లో మురుగు నీరు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ♦ నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. ♦ ఇంటి గదుల్లో గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. -
గ్రేటర్లో మృత్యుఘంటికలు
సాక్షి, సిటీబ్యూరో: ఒక వైపు స్వైన్‌ఫ్లూ..మరో వైపు డెంగీ జ్వరాలు గ్రేటర్ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది, బస్తీల్లో ఫాగింగ్ నిర్వహించి దోమల వృద్ధిని నియంత్రించాల్సిన ఎంటమాలజీ విభాగం అధికారులు, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఆయా విభాగాలు పడకేయడంతో డెంగీ, మలేరియా దోమలు బస్తీవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతుండటంతో గ్రేటర్‌వాసులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం వారం రోజుల్లోనే 3723 నమూనాలు పరీక్షించగా, 148 డెంగీ పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయ్యింది. ఇందులో 92 శాతం కేవలం గ్రేటర్‌లోనే నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్సల పేరుతో రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. సాధారణంగా డెంగీ జ్వరం వచ్చిన వారిలో చాలా మందికి ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదు. నోటి ద్వారా ద్రావణాలను తాగించడం, ఐవీ ఫ్లూ యిడ్స్ ఎక్కించడం, పారాసెటమాల్ టాబ్లెట్‌ను ఇవ్వడం ద్వారా జ్వరం తగ్గిపోతుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రులు ఐసీయూలో అత్యవసర వైద్యసేవలు, ప్లేట్లెట్స్ కౌంట్ పేరుతో ఒక్కో రోగి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ప్లేట్లెట్స్ ప్రామాణికం కాదు.. ప్లేట్లెట్ల సంఖ్య లక్ష కంటే తగ్గిపోయినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేర్చాలి. సంఖ్య 10 వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే రక్తస్రావం ఉన్నా లేకపోయినా తిరిగి వాటిని భర్తీ చేయాలి. సంఖ్య 20 వేలలో ఉన్నప్పుడు.. రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే అప్పుడు బయటి నుంచి ఎక్కించాల్సి ఉంటుంది. 20 వేలకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అవుతుంటే.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు అందించే చికిత్సలో భాగంగా ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం వల్ల అనర్థాలు రావడమనేది వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్లేట్లెట్ల సంఖ్యతోపాటు రక్తంలో ప్యాక్డ్ సెల్ వాల్యూమ్(పీసీవీ) ఎంత ఉంది? అనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంగా ఉండాల్సిన దానికంటే 20 శాతం, అంతకంటే ఎక్కువైతే.. అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డెంగీలోనే కాకుండా ఏ రక్త సంబంధ వ్యాధుల్లో అయినా.. అనవసరంగా ప్లేట్లెట్లు, ప్లాస్మాలను మోతాదుకు మించి ఇస్తే.. అక్యూట్ లంగ్ ఇన్జ్యూరీ, కొన్నిసార్లు అలర్జిక్ రియాక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావొచ్చు. రోగికి రక్త ఉత్పత్తుల అవసరం ఎంత మేరకు ఉంది? అనేది నిర్ధరించుకున్నాక.. రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించేందుకు అ వకాశాలున్నాయని గుర్తించిన తర్వాతే వాటిని వినియోగించాలి. కోరలు చాస్తున్న స్వైన్‌ఫ్లూ స్వైన్‌ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2625పైగా నమూనాల పరీక్షించగా, వీటిలో 480 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితుల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 215 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. రంగారెడ్డి జిల్లాలో 82 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ముగ్గురు చనిపోయారు. మేడ్చల్ జిల్లాలో 80 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. ఇతర జిల్లాల్లో 103 పాటిటివ్ కేసులు నమోదు కాగా, పది మంది వరకు చనిపోయారు. బాధితుల్లో 90 శాతం మంది గ్రేటర్ పరిధిలోని జిల్లాలకు చెందిన వారే కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. అంత మాత్రాన జ్వరం, దగ్గు, ముక్కు కారడం తదితర లక్షణాలు కనిపించగానే స్వైన్ ఫ్లూగా భావించాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే మధుమేహులు, గర్బిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారిలో ఫ్లూ భారిన పడే అవకాశాలు ఎక్కువ. స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తుమ్మిప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవడం, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఫ్లూ భారిన పడకుండా కాపాడుకోవచ్చు. -
నెలలో పెళ్లి.. డెంగీతో యువకుడి మృతి
తూర్పుగోదావరి, తాళ్లరేవు (ముమ్మిడివరం): నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడ్ని డెంగీ బలి తీసుకుంది. దీంతో అతడి కుటుంబంలో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది. మండలంలోని శుంకరపాలెం గ్రామ మాజీ సర్పంచి శీలం నాగేశ్వరరావు ద్వితీయ కుమారుడు శీలం వెంకన్న (26) ఇటీవల అనారోగ్యంగా ఉండటంతో గ్రామంలోని ఆర్ఎంపీని వైద్యం చేయించారు. అతని పరిస్థితి విషమం కావడంతో కాకినాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చడంతో అతడికి డెంగీ సోకిందని అక్కడి వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతుండగా ప్లేట్లెట్స్ పడిపోవడంతో అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారని చెప్పారు. వెంకన్నకు ఇటీవలే పెండ్లి నిశ్చితార్థం అయిందని, మరో నెలలో వివాహం కానుందని వారు విలపిస్తూ తెలిపారు. గ్రామంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, వీటిని నిరోధించాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం క్షీణించిందని, వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గ్రామానికి రావడం లేదని వారు ఆరోపించారు. -
ఒకేసారి పుట్టిన వారిని ఒకేసారి కాటికి చేర్చింది
ఐదేళ్ల నోములు, వ్రతాల ప్రతిఫలంగా జన్మించిన చిన్నారులకు ఏడేళ్ల ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయాయి. లేకలేక కలిగిన సంతానంకావడంతో తల్లిదండ్రులు ఆ కవలలను రెండుకళ్లలా కాపాడుకుంటూ వచ్చారు. డెంగీ జ్వరం రూపంలో ఆ కవలలను విధి కాటేసింది. ఒకేసారి పుట్టిన వారిని ఒకేసారి కాటికి చేర్చింది. ఆ తల్లికి ఏర్పడిన గర్భశోకం ఎవ్వరూ ఓదార్చలేనిది. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కొళత్తూరు తణికాచలం నగర్‌కు చెందిన సంతోష్, గజలక్ష్మిలకు 2004లో వివాహమైంది. అయితే ఏళ్లు దాటుతున్నా సంతానం కలుగలేదు. దీంతో తీవ్రంగా కుంగిపోయిన ఆ దంపతులు ఎక్కని ఆలయం లేదు, మొక్కని దేవుడు లేడు. నోములు, వ్రతాలు ఆచరించారు. ఆ దేవుడు వారి ఆవేదనను తీర్చినట్లుగా 2011లో దక్షిణ్ (7) అనే కుమారుడు, దీక్ష (7) అనే కుమార్తె కలిగారు. వీరిద్దరూ కవలలు, పైగా ఆడ, మగ సంతానం ఒకేసారి కలగడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. అదే ప్రాంతంలోని ప్రయివేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నారు. ఇదిలా ఉండగా పిల్లలిద్దరికీ వారం రోజుల క్రితం జ్వరం సోకింది. ఏమాత్రం అలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయితే వారిద్దరికీ జ్వరం తగ్గకపోగా తీవ్రమైంది. దీంతో వారిద్దరినీఈనెల 20 వ తేదీన చెన్నై ఎగ్మూరు ఆస్పత్రిలో చేర్పించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స ప్రారంభించారు. అయితే దురదృష్టశాత్తూ చికిత్స ఫలించక ఆదివారం రాత్రి 11 గంటలకు దీక్ష మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ కన్నీటి తడి ఆరక ముందే మరో ఘోర సమాచారం వారి చెవినపడింది. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో దక్షిణ్ సైతం ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలపడంతో దుఃఖాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు ఇద్దరూ తల్లడిల్లిపోయారు. భార్యాభర్తలు విలపిస్తున్న తీరుచూసి మొత్తం వార్డులోని వారంతా ఆవేదన చెందారు. ఒకేసారి జన్మించడమేకాదు, ఒకేసారి మరణించడం, ఇంట ముంగిట ఒకేసారి రెండు శవపేటికల్లో చిన్నారుల మృతదేహాలను చూస్తూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించడం బంధువులను, ఇతరులను సైతం కన్నీరుపెట్టించింది. కవలల మృతిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ, తాము నివసించే తణికాచలం నగర్లో ఎక్కడ చూసిన మురుగునీరు నిలిచిపోయి దుర్గంధంగా మారింది. ప్రజలు తట్టుకోలేక అనారోగ్యం పాలవుతున్నారు. చివరకు ఇద్దరు చిన్నారులే ప్రాణాలు కోల్పోయారు. డెంగీ జ్వరాల అదుపునకు ప్రభుత్వం ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. -
డెంగీ డేంజర్
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో డెంగీ కలకలం రేపుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టామని చెబుతున్నా.. ఆస్పత్రులు మాత్రం ఈ తరహా రోగులతో నిండిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో గడిచిన 20 రోజుల్లో 28 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మరో 35 కేసులు నమోదవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఇప్పటికే ఐదుగురు బాధితులు చనిపోగా, ఆ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదు. వీటిలో అత్యధిక కేసులు నందనవనం, దానికి సమీప బస్తీల్లోనే నమోదు కావడం గమనార్హం. సాధారణంగా మురుగు ప్రవహించే మూసీ పరీవాహక ప్రాంతాల్లోనే ఇప్పటి వరకు ఎక్కువ డెంగీ కేసులు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ డెంగీ, మలేరియా దోమలుతమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దోమల నియంత్రణ కోసం జీహెచ్ఎంసీ ఏటా రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా దోమల సంఖ్య తగ్గకపోగా, మరింత పెరుగుతోంది. ఎప్పటికప్పుడు బస్తీల్లో ఫాగింగ్ చేయకపోవడం వల్ల దోమలు విజృంభించి డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమవుతున్నాయి. దోమలకు నిలయంగా వ్యర్థాలగోదాములు.. నగనంలోని చాలా ప్రాంతాల్లో నివాసాలకు దూరంగా ఉండాల్సిన ప్లాస్టిక్ వ్యర్థాల గోదాములు ఇళ్ల మధ్యే ఉంటున్నాయి. కాచిగూడ, కాటేదాన్, సహా నందనవనంలో డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఆయా బస్తీ సమీపంలోని ఇళ్ల మధ్య ప్లాస్టిక్ వ్యర్థాల నిల్వ గోదాములే కారణమని అధికారులు గుర్తించారు. వర్షపు నీరు ఖాళీ బాటిళ్లలోకి చేరడం వల్ల అవి డెంగీ, మలేరియా దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. వీటిని ఊరిచిరవకు తరలించాల్సిందిగా స్థానికులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోగా, నిర్వహకులకు కొమ్ము కాస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నగరంలో కొత్త నిర్మాణాలు పెరిగాయి. ఫ్రూపింగ్ కోసం ప్రతి రోజూ వాటర్ కొడుతుండండం వల్ల ఆ నిల్వ నీరు దోమలకు ఆవాసంగా మారుతోంది. అంతేకాదు కంటోన్మెంట్, సహా ఉస్మానియా సహా పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రాకపోవడంతో ఆయా పరిసరాల్లో దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. వారి బలహీనతే.. వీరికి బలం మరోపక్క నగరంలో విష జ్వరాల ప్రబలుతున్నాయన్న భయం ప్రజలను వెండుతోంది. దీంతో ఏ చిన్న నలతగా ఉన్నా.. నీరసం అనిపించినా ప్రజలు ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. ఇదే అదనుగా పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వారికి కూడా మలేరియా, డెంగీ జ్వరారాల బూచీ చూపుతున్నారు. రకరకాల వైద్య పరీక్షలు చేసి ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోయాయని భయపెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోగుల బలహీనతను ఆసరా చేసుకుని వారి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్ని జ్వరాలు డెంగీ కాదు.. వాస్తవానికి అన్ని జ్వరాలు డెంగీ కాదు. ఈడిస్ ఈజిప్ట్(టైగర్) దోమ కుట్టడం వల్ల మాత్రమే డెంగీ వస్తుంది. నల్లని శరీరంపై తెల్లని చారలు ఉండే ఈ దోమ పగటి పూట మాత్రమే కుడుతుంది. ఇది కుట్టిన 7–8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు బయటపడతాయి. కళ్లమంట, కండరాల నొప్పులు, అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. వాధి తీవ్రమైనప్పుడు చర్మం చిట్లిపోయి రక్తస్రావం అవుతుంది. బ్లీడింగ్ వల్ల బీపీ పడిపోయి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్లేట్లెట్ కౌంట్స్ 20 వేల వరకు పడిపోయినా మళ్లీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. అంతకంటే కౌంట్ పడిపోతే మాత్రం ప్లేట్లెట్స్ విధిగా ఎక్కించాలి. కానీ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు అందుకు భిన్నంగా 60 వేలకు పైగా కౌంట్స్ ఉన్నప్పటికీ రక్తకణాలను ఎక్కించి భారీగా దండుకుంటున్నాయి. జాగ్రత్తలు అవసరం ఇటీవల డెంగీ కేసులు బాగా పెరిగాయి. మా ఆస్పత్రి ఓపీకి సగటున 150 మంది పిల్లల్లో ఆరు డెంగీ కేసులు ఉంటున్నాయి. కొత్త నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్న శివారు ప్రాంతాల్లోనే ఈ జ్వరాలు అధికంగా ఉన్నాయి. వ్యాధి బారిన పడుకుండా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వ లేకుండా చూడాలి. నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. పాత టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్త కుండీలు అస్సలు ఉంచకూడదు. పిల్లలకు విధిగా దోమ తెరలు వాడాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు -
‘నిండు’ ప్రాణాలు బలి
విధి వక్రీకరించడమంటే ఇదేనేమో.. తాను రెండేళ్ల వయసున్నప్పుడు అమ్మను కోల్పోయి తల్లి లేని అనాథగా పెరిగింది. ఇప్పుడు తాను చనిపోతూ రెండేళ్ల కుమార్తెను ఒంటరి చేసి వెళ్లిపోయింది. డెంగీ మహమ్మారి కారణంగా చింతాడలో నిండు గర్భిణితో పాటు కడుపులో బిడ్డ సైతం మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారం పది రోజుల్లో ఇంటికి మరో చిన్నారి వస్తుందని ఆశగా ఎదురుచూసినా కుటుంబ సభ్యులు గర్భిణి మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని చింతాడ గ్రామంలో డెంగీ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చింతాడకు చెందిన గుండ సత్యనారాయణతో కిల్లిపాలెం గ్రామానికి చెందిన గీత గాయత్రీ(27)తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 21 నెలల వయసున్న దేదీప్య అనే కుమార్తె ఉంది. భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గీత గాయత్రీ తొమ్మిది నెలల గర్భిణి కావడంతో ప్రసవం కోసం చింతాడకు రెండు వారాల క్రితమే వచ్చింది. ఈ నెల 11న జ్వరం రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జ్వరం తగ్గకపోవడంతో విశాఖపట్నం తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా డెంగీ జ్వరం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించినా జ్వరం తగ్గలేదు. నిండు గర్భిణి కావ డం, శరీరం సహకరించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున గీత గాయత్రీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కళ్లు తెరవకుండానే కాటికి. గీత గాయత్రీకి చికిత్స అందిస్తున్నప్పుడే కడుపులోని బిడ్డ మృతి చెందింది. వైద్యులు సాధారణ ప్రసవం చేయించి మృతశిశువును బయటకు తీశారు. తల్లి రెండు గంటల సమయంలో మృతి చెందింది. గీతగాయత్రీ మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. తల్లి మృతి చెందిందన్న విషయం తెలియక కుమార్తె దేదీప్య బిత్తరచూపులు చూడటం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. గీతా గాయత్రీ రెండేళ్ల పాపగా ఉన్నప్పుడే తల్లి మృతి చెందిందని, ఇప్పుడు ఆమె కూడా అలాగే చనిపోవడం ఘోరమని స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరో పది మంది వరకు డెంగీ బాధితులు.. చింతాడలో బోర హనీష్, గుండ నవ్య, మణ్యం రామలక్ష్మి, చింతాడ అరుణలు ప్రస్తుతం డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వీరితో పాటు మరో పది మంది డెంగీ జ్వరంతో, సుమారు 70 మంది వైరల్, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతూ మంచం పట్టినట్లు పేర్కొన్నారు. గీత గాయత్రీ మృతితో ఆయా కుటుంబాలు భయాందోళనకు గురౌతున్నాయి. పారిశుద్ధ్య లోపం వల్లే జ్వరాల విజృంభణ చింతాడలో పారిశుద్ధ్యం క్షీణించింది. శ్రీకాకుళం రూరల్ మండలం, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో కలిసి ఈ గ్రామం ఉండడంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి అయినప్పటికీ పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామం మధ్యలో ఉన్న సాంబయ్య బంద మురికికూపంగా మారినా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. వారపు సంతలోనూ పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలేదని, రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి పారిశుద్ధ్య పనులు నిర్వహించడంతో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జ్వరం..కలవరం..!
జూన్, జూలైలో తొలకరి చినుకులు పలకరించాయి. తరువాత అడపాదడపా వానలు పడ్డాయి. తేలికపాటి జల్లులకే నిద్రావస్థలో ఉన్న దోమలు మేల్కొన్నాయి. అందుకు జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం తోడైంది. ఇంకేముంది దోమలు ప్రజలపై దండయాత్ర చేయడం ప్రారంభించాయి. దీంతో జిల్లా వాసులు జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రుల బాట పట్టారు. కడప రూరల్: జిల్లాలోని కడప రిమ్స్‌లో ఒక రోజుకు ఔట్ పేషెంట్స్ గడిచిన మే నెలలో 800 నుంచి 1100 వరకు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 1200 నుంచి 1600 వరకు పెరిగింది. ఇందులో అన్ని వ్యాధులకు సంబంధించిన వారు ఉన్నప్పటికీ, జ్వర పీడితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో తాజాగా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అక్కడికి ఒక రోజుకు దాదాపు 70 నుంచి 100 మందికి పైగా వస్తున్నారు. గడిచిన ఏడాది వానలు పుష్కలంగా పడ్డాయి. దాంతోపాటే రోగాలు కూడా పెరిగాయి. ప్రతి ఏటా దాదాపు ఒక లక్ష మంది వరకు కేవలం వివిధ రకాల జ్వరాల బారిన పడుతున్నారు. తాజాగా ఇప్పటి వరకు దాదాపు 40 వేల మందికిపైగా జ్వరాలకు గురయ్యారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అధికారికంగా డెంగీ కేసులకు సంబంధించి 45 మంది అనుమానితులుగా గుర్తించగా అందులో కడప నగరం ప్రకాష్‌నగర్, మరియాపురం, మస్తాన్‌వలి వీధిలో ఒక్కక్కరి చొప్పున ప్రొద్దుటూరు, పెద్ద చెప్పలి, ఎర్రగుంట్లలో మొత్తం ఏడుగురికి డెంగీ ఉన్నట్లుగా గుర్తించారు. పరిసరాల అపరిశుభ్రత, కలుషిత నీరు, తదితర కారణాల వల్ల జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డయేరియా, నీళ్ల విరేచనాల కేసులు నమోదవుతున్నాయి. జ్వరాలు ఎందుకొస్తాయంటే... వాతావరణంలో సంభవించే మార్పులు, ఇంట్లో, బయట పరిసరాల అపరిశుభ్రత కారణంగా వాతావరణంలో అనూహ్యంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా ఏడాదికి ఒకవైరస్ పుడుతోంది. ఆ మేరకు వైరల్ ఫీవర్స్ వస్తాయి.వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను పాటించడం వల్ల దీనికి అడ్డుకట్ట వేయవచ్చు అని వైద్యులు అంటున్నారు. కొరవడిన శాఖల మధ్య సమన్వయం... దోమల నివారణ, పరిసరాల శుభ్రత, ప్రజల్లో చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, వైద్య సేవలను అందించడం తదితర పనులను పంచా యతీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు ఏకకాలంలో చేపట్టాలి. అయితే ఆ శాఖల మధ్య సమన్వయం లోపం వల్ల జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఉదాహరణకు దోమలనే చెప్పుకోవచ్చు. వీటివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అప్పులు చేసి అవస్థలు పడుతున్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్చలు చేపట్టాల్సి ఉంది. వ్యాధుల తీవ్రత అదుపులోనే ఉంది.. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల పరిధిలో వైద్య శిబిరాలను విరివిగా చేపడుతున్నాం. మా హాస్పిటల్స్‌లో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో డీడీటీని స్ప్రే చేయిస్తున్నాం. ప్రజలు వ్యక్తిగత, పరసరాల శుభ్రతకు పాటు పడాలి. జిల్లాలో వ్యాధుల తీవ్రత అదుపులోనే ఉంది.– డాక్టర్ ఉమాసుందరి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
దడపుట్టిస్తున్న డెంగీ
కృష్ణాజిల్లా, అవనిగడ్డ: నిన్నటి వరకు పాముకాట్లతో వణికిన దివిసీమను నేడు డెంగీ జ్వరాలు భయపెడుతున్నాయి. చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాలకు చెందిన 8 మంది డెంగీ లక్షణాలతో బాధపడుతూ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని కొత్తపేటకు చెందిన మద్దాల శేషుబాబు జ్వరంతో నాలుగు రోజుల క్రితం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వెళ్లాడు. రక్తపరీక్ష అనంతరం అతనికి డెంగీ లక్షణాలు బయట పడ్డాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఆయనను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. స్థానిక 8వ వార్డుకు చెందిన సాలా నాగరాజుకు పది రోజుల క్రితం జ్వరం రావడంతో అవనిగడ్డ వైద్యశాలలో చికిత్స పొందాడు. తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స చేస్తున్నా తగ్గకపోవడంతో పరీక్షలు నిర్వహించారు. ప్లేట్లెట్స్ తగ్గిపోయినట్లు గుర్తించి బుధవారం ప్లేట్లెట్స్ ఎక్కించారు. వీరితో పాటు అవనిగడ్డకు చెందిన మరొకరు, చల్లపల్లి మండలంలో ముగ్గురు, మోపిదేవి, నాగాయలంక మండలంలో ఒక్కొక్కరు చొప్పున డెంగీ లక్షణాలతో విజయవాడ, గుంటూరు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలు, మలేరియా జ్వరాలతో బాధపడుతున్న కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. విజృంభిస్తున్న విషజ్వరాలు దివిసీమలో రోజురోజుకీ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రస్తుతం చల్లపల్లి, అవనిగడ్డ, నాగాయలంకలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వర పీడితులతో నిండిపోయాయి. స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం 22 జ్వరాల కేసులు నమోదయ్యాయి. వీరిలో 17మంది మహిళలు ఉన్నారు. వీటిలో విష జ్వరాల కేసులు 20, 2 టైఫాయిడ్ కేసులు ఉన్నాయి. స్థానిక పంచా యతీ పరిధి 8వ వార్డులోని ఎస్టీ కాలనీలో విష జ్వరాల బాధితులు బాగా పెరిగిపోయారు. ఈ ప్రాంతానికి సమీపంలో డంపింగ్‌యార్డు ఉండటం, నివాసాల మధ్య పందులు పెంచడం, ము రుగు నిల్వ ఉండటం వల్ల విష జ్వరాల కేసులు పెరిగాయి. ఈ కాలనీలో సు మారు 20 మంది వరకు విష జ్వరాలతో బాధపడుతున్నారు. చల్లపల్లి పంచాయతీ పరిధి ఎస్సీ బా లికల వసతిగృహం పక్కనున్న దళితవాడలో 24 విష జ్వరాల కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంతంలో గురువారం ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. భయపడవద్దు నాలుగు రోజుల నుంచి జ్వరాల కేసులు పెరిగాయి. జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ తగ్గితే డెంగీ జ్వరం అని కొంతమంది భయపడుతున్నారు. ప్లేల్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈరోజు వచ్చిన కేసుల్లో 20 విషజ్వరాలు, రెండు టైఫాయిడ్ కేసులున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దోమల బారిన పడకుండా రక్షణ చర్యలు, కాచి చల్లార్చిన నీటిని తాగితే జ్వరాలు రాకుండా రక్షణ పొందవచ్చు.– డాక్టర్ కృష్ణదొర, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా వైద్యశాల, అవనిగడ్డ -
జనం జీవితాలతో చెలగాటమాడుతున్నారు
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మలేరియా, డెంగీ, విషజ్వరాలతో మంచాన పడుతుం టే స్పందించి సరైన వైద్య సదుపాయాలు అందించాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందన్నారు. ఎక్కడ చూసినా విషజ్వరాలతో ప్రజలు అల్లాడిపోతూ మంచం పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో 120మంది, విజయనగరం జిల్లాలో 60మంది విషజ్వరాల వలనే మృత్యువా త పడ్డారన్నారు. విషజ్వరాలు విజృంభించడంతో విశాఖపట్టణంలోని కేజీహెచ్, గుంటూరు జిల్లాలో జీజీహెచ్, విజయవాడ ఆస్పత్రుల్లో బెడ్లు లేక ఒకే బెడ్‌పై నలుగురైదుగురు రోగులు ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆఖరకు రోగులను రోడ్డుపైకి లాగుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్యాంధ్ర ప్రదేశ్‌గా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా విషజ్వరాలే రాజ్యమేలుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోనిచంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయని తమ్మినేని అన్నారు. మలేరియా, విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం, చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒక్క విశాఖ కేజీహెచ్‌లో నే 21 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. గుంటూరులో 21 మందికి, తూర్పుగోదావరి, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమని దుయ్యబట్టారు. ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ సీఎం చంద్రబాబు వద్దే ఉందని, ఈ శాఖపై చంద్రబాబు దృష్టి సారించకపోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఇటీవలే చం ద్రబాబు జ్వరాలపై సమీక్షించి జ్వరాలపై నియంత్రణ కొరవడిందంటూ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడం శోచనీయమన్నారు. జూలై 2016 నుంచి జూన్ 2017 మధ్యకాలంలో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు పట్టేందుకు రూ.60లక్షలు నిధులు ఖర్చు చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందన్నారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా ఉన్న లోకేష్ అవగాహనా రాహిత్యం వల్లనే గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో దోమలబెడద అధికమైందని చెప్పారు. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ ఘోర వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేసి ఆదాయం వచ్చే మార్గాలనే అన్వేషిస్తోందన్నారు. బాబు డ్యాష్బోర్డుపైకి రాష్ట్ర ప్రజలకు అందుతున్న వైద్యసేవల నివేదిక చేరలేదా అని ప్రశ్నించారు. అందని వ్యాక్సిన్లు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు కూడా వ్యా క్సిన్ అందని దుస్థితి నెలకొందని తమ్మినేని సీతా రాం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు 38 వేల మంది శిశువులు జన్మిస్తున్నారని, చిన్నారులకు ఇన్ఫెక్షన్లు, కామెర్లు సోకకుండా వాక్సిన్లు వేయించాల్సి ఉంటుందన్నారు. వ్యాక్సిన్లు పీహెచ్‌సీలు, సీహెచ్‌ల్లో అందుబాటులో లేకున్నా ప్రభుత్వం చలించకపోవడం దారుణమన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక చిన్నారులు రోటావాక్, హెపటైటిస్–బి వంటి వ్యాక్సిన్లకు దూరమవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేత బొనిగి రమణమూర్తి తదితరులు ఉన్నారు. -
కాండ్రేగులలో ఇద్దరికి డెంగీ
పెదపూడి (అనపర్తి): మండలంలోని కాండ్రేగుల గ్రామంలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయని సంపర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు బీవీవీ సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ నురుకుర్తి శ్రీను, వేమగిరి వెంకటరమణ అనే వారు డెంగీ జ్వరంతో చికిత్స పొందుతున్నారన్నారు. కాండ్రేగుల గ్రామంలో మరో 32 మంది వైరల్ జ్వరాలతో బాధపడు తున్నారన్నారు. వారికి రక్త పరీక్షలు నిర్వహించగా, పి.గంగాధర్, ఎన్.ఈశ్వరరావు అనే మరో ఇద్దరికి కూడా డెంగీ లక్షణాలు ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు. వారిని కూడా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు. గ్రామంలో ఈ నెల 10వ తేదీ నుంచి వైరల్ జ్వరాలు వ్యాపించాయని చెప్పారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు ఇచ్చి, రక్త పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికీ గ్రామంలో వైద్య శిబిరం కొనసాగుతోందన్నారు. అలాగే జిల్లా మలేరియా అధికారి తులసి గ్రామంలో పర్యటించారు. అప్రత్తంగా ఉండాలి: ఆర్డీఓ రఘుబాబు కాండ్రేగుల గ్రామంలో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వైరల్ జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కాకినాడ ఆర్డీఓ ఎల్.రఘబాబు ఆదేశించారు. కాండ్రేగుల గ్రామంలో వైరల్ జ్వరాలతో బాధపడుతున్న కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు .వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగీ లక్షణాలున్న నక్కా ఈశ్వరరావుతో ఆర్డీవో మాట్లాడారు. తక్షణం కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని ఆదేశించారు. అలాగే సోమవారం రాత్రి చనిపోయిన ఎనిమిది నెలల శిశువు నాగశివలోహిత్ వివరాలను బంధువులను, వైద్యుడ్ని అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ నాగశివలోహిత్కు మూడు రోజులు క్రితం జ్వరం వచ్చిందన్నారు. జ్వరం తగ్గిన తర్వాత కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని వైద్యలు చెప్పారన్నారు. అనంతరం రాత్రి ఫిట్స్ రావడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, కొద్ది సేపటికే చనిపోయాడని వారు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కాండ్రేగుల గ్రామంలో జరిగే ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెలియజేయాలన్నారు. ఎంపీడీఓ కె.హరికృష్ణ సత్యరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో గత వారం రోజులుగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచామన్నారు. డెంగీతో ఆస్పత్రిలో చేరిన మహిళ కడియం (రాజమహేంద్రవరం రూరల్): మండలంలోని దుళ్ళ వినాయకుడి కాలనీకి చెందిన యు.సూర్యావతి డెంగీ జ్వరంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న సూర్యావతిని రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు డెంగీగా నిర్ధారించి వైద్యమందిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా మహిళకు డెంగీ వ్యాధిగా నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది మంగళవారం హడావుడిగా కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పి.కోమలి శిబిరాన్ని సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే చేపట్టారు. అయితే చికిత్స పొందుతున్న మహిళ కుటుంబ సభ్యులతో పాటు ఇతరులెవ్వరు జ్వరాలతో లేరని సిబ్బంది చెబుతున్నారు. దోమల లార్వాలను సేకరించారు. కాగా ఎంపీడీఓ కె.రత్నకుమారి, ఈఓపీఆర్డీ వైవీఎస్ లక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అశోక్, సిబ్బంది శిబిరాన్ని సందర్శించారు. తక్షణం కాలనీలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చాలని పంచాయతీ సెక్రటరీ పి. సుబ్బారావును అధికారులు ఆదేశించారు. -
డెంగీతో జర భద్రం...
గుంటూరు మెడికల్: కృష్ణాజిల్లా నందిగామకు చెందిన విద్యార్థిని మారం జయశ్రీ (18) సోమవారం డెంగీ జ్వరంతో మృతిచెందింది. రాజధాని జిల్లా గుంటూరులో సైతం డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ జ్వరం సోకినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్‌గా రామాంజనేయులు ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో డెంగీ జ్వరాలు సోకి మరణాలు సంభవించడంతో హెల్త్ ఎమర్జన్సీ సైతం ప్రకటించారు. డెంగీ జ్వరంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో చాలా మంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట జ్వరం బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంతమంది బొప్పాయి రసం తాగితే, బొప్పాయి తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెంగీపై కొద్దిపాటి అవగాహన కల్గి ఉండి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం బారిన పడకుండా ఉండవచ్చు. ప్రజలకు డెంగీ జ్వరంపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. డెంగీ జ్వరం లక్షణాలు... పగటి వేళల్లో కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వాంతులు, తలనొప్పి, కంటి గుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అయినట్టు భ్రాంతి కలగడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఒంటిపై ఎర్రటి గుల్లలు ఏర్పడి, ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. రక్తపరీక్ష చేసి ఎలీసా పద్ధతిలో డెంగీ జ్వరాన్ని నిర్ధారణ చేస్తారు. దోమలు పెరిగే ప్రదేశాలు... డెంగీ జ్వరాన్ని కలుగజేసే దోమలు మంచినీటిని నిల్వచేసే ప్రదేశంలో పెరుగుతాయి. వాడి పారేసిన వస్తువులు, నీటిని నిల్వచేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బురోళ్లు, వాడి పారేసిన టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, వాడి పారేసిన కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్స్ వెనుక భాగాల్లో, పూల కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో దోమ లార్వాలు పెరుగుతాయి. తాడికొండలో డెంగీ కేసు నమోదు తాడికొండ: తాడికొండలో డెంగీ కేసు నమోదైంది. పెదపరిమి రోడ్డులోని స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనం సమీపంలో చెరుకూరి ప్రణవ్ తేజ(8) అనే చిన్నారికి డెంగీ జ్వరం సోకింది. ఈనెల 3వ తేదీన జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రుల్లో తిరిగినా ఫలితం లేకపోవడంతో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది. అయితే డెంగీ కేసు నమోదైందని వైద్య ఆరోగ్య శాఖాధికారుల దృష్టికి సమాచారం అందడంతో మంగళవారం ఆ ప్రాంతానికి చేరుకున్న మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రత్నాకర్ పంచాయతీ సిబ్బంది సహకారంతో నిల్వ ఉన్న నీటిని మళ్లించడంతో పాటు ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. ఇటీవల గ్రామంలో నూతనంగా డ్రెయిన్లు అసంపూర్ణంగా నిర్మించి వదిలేయడంతో మురుగు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచి ప్రధాన రహదారుల వెంట దుర్గంధం వెదజల్లుతోంది. శివారు ప్రాంతాల్లో సైతం మురుగు దెబ్బకు పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి అపరిశుభ్ర వాతావరణం తొలగించి దోమల నివారణకు చర్యలు తీసుకోకపోతే రోగాలు విజృంభించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్లెట్స్పై అపోహలు వీడండి ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గడం సహజంగా జరుగుతుంది. అంతమాత్రానికే రోగులు కంగారు పడకూడదు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం సంభవించదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి వాటి ద్వారా రక్తం వస్తే, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.–డాక్టర్ కె.కళ్యాణ చక్రవర్తి, జ్వరాల స్పెషలిస్ట్, హెల్ప్ హాస్పటల్ -
తల్లీబిడ్డను మింగిన డెంగీ
సాక్షి, విజయనగరం : ఆ తల్లి నవమాసాలూ మోసింది. తొలిచూలు బిడ్డపై గంపెడాశలు పెట్టుకుంది. ఆ బిడ్డను అందరికంటే మిన్నగా పెంచాలని... చక్కగా తీర్చిదిద్దాలని... ఎన్నో కలలు కన్నది. మాయదారి డెంగీ మృత్యువుగా మారుతుందనుకోలేదు. ప్రసవానికి వారం రోజులముందే ఆమెకు జ్వరం సోకింది. అదికాస్తా డెంగీకి దారితీసింది. చికిత్స చేయించి... నిండు గర్భిణి అయిన ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం విఫలమైంది. విశాఖ కేజీహెచ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె కన్నుమూసింది. కన్నులైనా తెరవని ఆ శిశువు ఈ లోకాన్ని చూడకుండానే... తన తల్లిలేని లోకంలో తానెందుకుండాలనుకున్నాడో ఏమో... ప్రాణాలు కోల్పోయాడు. ఇదీ గరివిడి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన వలిగింటి జానకి(23) విషాద గాథ. భర్త వలిగింటి జనార్దన రాజాంలో చిన్నపాటి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడేళ్లక్రితం వారికి వివాహం జరిగింది. జానకి ప్రస్తుతం నిండు గర్భిణి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుంటే రాజాంలోని ఓ డాక్టర్‌కు చూపించారు. వారు డెంగీ సోకిందని తల్లిబిడ్డను రక్షించుకోవాలంటే వెంటనే కేజీహెచ్‌కు తరలించాలని చెప్పారు. గత సోమవారమే కేజీహెచ్‌లో చేర్చారు. కానీ విధి వక్రీకరించింది. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఓ బిడ్డకు జన్మనిచ్చి ఆమె కన్నుమూయగా... పుట్టిన బిడ్డ సైతం మృత్యువాతపడింది. మృతదేహాలను సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
జ్వరంతో కానిస్టేబుల్ మృతి
ఎచ్చెర్ల క్యాంపస్ శ్రీకాకుళం : ధర్మవరం గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ గుండ శేఖర్ (32) జ్వరంతో విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గత రెండు వారాల క్రితం జ్వరంతో బాధపడుతూ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శేఖర్ చేరారు. ఇతనికి పరీక్షలు చేయించగా వైద్యులు డెంగీ జ్వరంగా నిర్ధారించారు. 17000కు ప్లేట్ లేట్స్ పడిపోవటంతో ప్రత్యేక వైద్య సేవలు అందజేశారు. అయితే ఆరోగ్యం క్షణించటంతో విశాఖపట్నం తీసుకువెళ్లా లని వైద్యులు సూచించారు. గత వారం రోజులుగా విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రలో చికిత్స పొందు తున్నారు. ఆరోగ్యం కుదుట పడక పోవటంతో శస్త్ర చికిత్స అవసరం అవుతుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే రక్త పోటు సమస్య వల్ల శస్త్రచికిత్సలో జాప్యం జరిగింది. చివరకు ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మృతి చెందాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా డిప్యూటేషన్‌పై ఆమదాలవలస రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మృతునికి భార్య ఇంద్రావతి, కుమార్తె నిత్య కల్యాణి ఉన్నారు. కుంటుంబ పోషకుడు, జీవనాధారం అయిన వ్యక్తి మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
డెంగీతో బాలుడి మృతి
చిట్యాల(నకిరేకల్) : చిట్యాల పట్టణంలో గురువారం తెల్లవారుజామున డెంగీ వ్యాధి లక్షణాలతో ఓ బాలుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ముత్యాలమ్మగూడెం గ్రామానికి చెందిన బొబ్బలి రాములు కుమారుడు శివమణి(7) చిట్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం తీవ్రజ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. అయినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం శివమణిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు డెంగీ వ్యాధి లక్షణాలతో శివమణి బాధపడుతున్నట్లు గుర్తించి వైద్యం అం దించారు. పరిస్థితి విషమించడంతో శివమణి గురువారం తెల్లవారుజామున మృతి చెందా డు. కాగా శివమణి చెల్లెలు భావన కూడా విషజ్వరంతోనే బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. ఓ వైపు కుమారుడు మృతి చెందడం, కూతురు విషజ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిసి వేసింది. శివమణి మృతదేహా న్ని చిట్యాల జెడ్పీటీసీ శేపూరి రవీందర్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యు లకు రూ.5వేల ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బెల్లి సత్తయ్య, వార్డు సభ్యులు ఏళ్ల మల్లేష్, టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు కోసనపు అశోక్, రాము, సల్లా రాజు ఉన్నారు. -
శశికళకు డెంగీ జ్వరం
సాక్షి,చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. పెరోల్‌పై బయటకు వచ్చిన ఆమె డెంగీతోనే పరప్పన అగ్రహార జైలుకు తిరిగి వెళ్లినట్లు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఆమె సోదరి వనితామణి కుమారుడు దినకరన్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భర్త నటరాజన్ మృతితో శశికళ కుంగిపోయా రని తెలిపారు. అందుకే ఆమెకు పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయించామన్నారు. వైద్యపరీక్షల్లో ఆమెకు డెంగీ జ్వరం ఉన్నట్లు తేలిందన్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించి వైద్యులు ఇచ్చిన సర్టిఫి కెట్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించామన్నారు. ఆమెకు వైద్య పరీక్షలతోపాటు మందులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
కాకినాడలో విజృంభిస్తున్న డెంగ్యూ
-
డెంగీ చికిత్సకు రూ.16 లక్షలు
న్యూఢిల్లీ/చండీగఢ్: డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఏడేళ్ల బాలికకు చికిత్స అందించినందుకు రూ.16 లక్షలు వసూలు చేసి, అప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయిన ఓ ఆసుపత్రి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. హరియాణాకు చెందిన ఆద్యా సింగ్ అనే చిన్నారికి డెంగీ జ్వరం రావడంతో గుర్గావ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత ఆగస్టు 31న చేర్పించారు. బాలికకు 15 రోజులు చికిత్స అందించిన ఆసుపత్రి సిబ్బంది... ఆమె తల్లిదండ్రుల నుంచి రూ.16 లక్షలు వసూలు చేశారు. అయినా చిన్నారిని మృత్యువు నుంచి కాపాడలేకపోయారు. ఆసుపత్రి వర్గాలు భారీగా డబ్బు గుంజిన విషయాన్ని బాలిక తండ్రి స్నేహితుడొకరు ఇటీవల ట్వీటర్లో బయటపెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం స్పందిస్తూ దీన్ని దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఇలా ఎక్కువ రుసుములు వసూలు వేయకుండా వైద్యశాలలను నియంత్రించేందుకు ఓ చట్టం కూడా ఉందనీ, దానిని అనుసరించాల్సిందిగా గతంలోనూ తాము అన్ని రాష్ట్రాలనూ కోరామనీ, మరోసారి ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని చెప్పారు. బాలిక మృతి కేసుపై విచారణ జరపాలని కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని నడ్డా ఆదేశించారు. అనంతరం కార్యదర్శి హరియాణా ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఆసుపత్రిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం బాలికకు చికిత్స అందించడంలో తాము ఏ మాత్రం నిర్లక్ష్యం వహించలేదనీ, అన్ని నిబంధనలను పాటించామనీ, చికిత్సకు అవుతున్న ఖర్చు గురించి కూడా ఎప్పటికప్పుడు బాలిక కుటుంబానికి తెలియజేశామంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. -
డెంగీతో బాలిక మృతి
కందుకూరు: డెంగీతో బాధపడుతున్న బాలిక పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ సంఘటన పట్టణంలో ఆదివారం వెలుగు చూసింది. బంధువుల కథనం ప్రకారం.. పట్టణంలోని బ్రహ్మంగారి గుడి ప్రాంతానికి చెందిన టైలర్ వృతి చేసుకుని జీవనం సాగించే కిరణ్ కుమార్తె పొట్టేట మíహిత∙(5) ఐదు రోజుల క్రితం జ్వరం బారిన పడింది. మొదట పట్టణంలోనే చికిత్స చేయించినా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిత ఆదివారం మృతి చెందింది. కిరణ్ దంపతులకు మహిత ఏకైక కుమార్తె కావడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. -
డెంగీ లక్షణాలతో వివాహిత మృతి
అనంతపురం జిల్లా / కళ్యాణదుర్గం: పట్టణంలోని శంకరప్పతోట కాలనీకి చెందిన నందిని (23) అనే వివాహిత డెంగీ లక్షణాలతో బెంగళూరులో మంగళవారం తెల్ల వారుజామున మృతి చెందింది. భర్త టి.రవి, తల్లిదండ్రులు తిమ్మయ్య, రాజ్యలక్ష్మిలు తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం నందినికి జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసి డెంగీ లక్షణాలు ఉన్నట్లు చెబుతూ బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. బెంగళూరులోని బ్యాప్‌సిస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ ఆస్పత్రి వద్దకు వెళ్లి నందిని మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గానికి తీసుకొచ్చాక మునిసిపల్ చైర్పర్సన్ బిక్కీ రామలక్ష్మి, ఆమె భర్త బిక్కీ గోవిందప్పలు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
డెంగీ కాదా.. మరి ఏ వైరస్?
ఆ ఊళ్లలో మరణాలకు విషజ్వరాలు.. డెంగీ కారణం కాదు. మరేదో వైరస్ సోకింది. అదేదో అంతుచిక్కని వ్యాధి.. అదేమిటి.. ఎలా ప్రబలింది..? ఇదీ స్థానికులను తొలుస్తున్న ప్రశ్న. ఇది తెలుసుకోవడానికే వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, కారిపాకం, రాచకండ్రిగ, పులివల్లం గ్రామాల్లో కేంద్ర, జాతీయ వైద్య బృందం రంగంలోకి దిగింది. సాక్షి, తిరుపతి: ఆ నాలుగు గ్రామాలను అంతుచిక్కని వ్యాధి భయపెడుతోంది. వరదయ్యపాళెం మండలంలోని ఆ పల్లెలకు ఏదో వైరస్ సోకిందనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వైరస్ ఏది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి జాతీయ, కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగింది. బత్తలవల్లంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, కారిపాకం, రాచకండ్రిగ, పులి వల్లం గ్రామాల్లో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 17 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా కేవలం డెంగీ జ్వరం కారణంగానే మరణించినట్లు భావిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం డెంగీ కాదని, సాధారణ మరణాలేనని చెబుతున్నారు. ప్రైవేటు వైద్యులు మాత్రం డెంగీ కారణంగానే మరణిస్తున్నారని తేల్చిచెబుతున్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వ వైద్యులు డెంగీ లేదని రిపోర్టు ఇస్తే, ప్రైవేటు వైద్యులు మాత్రం డెంగీ ఉందని రిపోర్టులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అంతుచిక్కని మరణాల గురించి జిల్లా యంత్రాంగం జుట్టు పీక్కుంటున్న సమయంలో శుక్రవారం తాజాగా బత్తలవల్లం దళితవాడకు చెందిన వై.రాధిక (29) విష జ్వరంతో మరణించింది. షాక్‌కు గురైన అధికారయంత్రాంగం మొత్తం శుక్రవారం వరదయ్యపాళెం మండలానికి చేరుకుంది. బత్తలవల్లంలో జాతీయ, కేంద్ర బృందం పర్యటన వరదయ్యపాళెం మండలంలోని నాలుగు గ్రామాల్లోనే జ్వరంతో 17 మంది మరణించారు. ఈ స్థాయి మరణాలు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ వరుస మరణాల సమాచారం ఢిల్లీకి చేరింది. స్పందించిన జాతీయ, కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగింది. అందులో భాగంగా శుక్రవారం ఏడుగురితో కూడిన బృందం వరదయ్యపాళేనికి చేరుకుంది. వీరితో పాటు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరిషా, ఇన్చార్జి డీఎంహెచ్ఓ అరుణసులోచనతోపాటు వైద్యశాఖాధికారులు, పంచా యతీరాజ్ అధికారులు బత్తలవల్లం చేరుకున్నారు. వీరంతా గ్రామంలో సమావేశమై స్థానికులతో మాట్లాడారు. ప్రస్తుతం మరణించిన కుటుంబాల వారి పరిస్థితి ఏమిటి?, ఎక్కడ పనిచేస్తారు? ఎన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు? ఎక్కడ వైద్యం చేయించుకున్నారు? తదితర వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ గ్రామ ప్రజల ఆహారపు అలవాట్లపై ఆరా తీశారు. అనంతరం జాతీయ, కేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం ప్రతి నివాసానికి వెళ్లి పరిసరాలను పరిశీలించడంతోపాటు, వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరి రక్త నమూనాలు సేకరించారు. భయం భయంగా గ్రామస్తులు ఎన్నడూ లేని విధంగా అంతుచిక్కన వ్యాధులు, వరుస మరణాలతో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఢిల్లీ, పూణే నుంచి వైద్య బృందంతో పాటు కలెక్టర్, జేసీ, డీఎంహెచ్ఓ తదితరులు గ్రామంలో ఇంటింటా సర్వే చేస్తుండడంతో ‘మన ఊరికేమైంది. ఏం జరుగుతోంది’ అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. సుమారు నెల రోజులుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులు, ఏఎన్ఎంలు గ్రామాల్లో పర్యటిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే డీఎంహెచ్ఓతో పాటు ఇతర అధికారులు గ్రామంలో తిష్ట వేసి, జ్వరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా జ్వరాలు, మరణాలు నియంత్రణ కాకపోవడంతో మూడు రోజుల క్రితం ఎస్వీ మెడికల్ కళాశాల వైద్యులు గ్రామాల్లో పర్యటించి, రక్తనమూనాలు సేకరించారు. ఈ సంఘటనలతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. మరి కొందరు ఇప్పటికే ఊరొదిలి బంధువుల నివాసాలకు వెళ్లిపోయారు. వరుస మరణాలకు విష జ్వరాలు, డెంగీ కారణం కాదని, మరేదో వైరస్ సోకిందనే అనుమానాలు వైద్య బృందం వ్యక్తం చేస్తోంది. ఆ వైరస్ ఏదనేది తెలుసుకునేందుకే ఢిల్లీ నుంచి వైద్య బృందం రంగంలోకి దిగిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. -
జైలుకెళ్తారు జాగ్రత్త!
మురుగునీరు నిల్వ ఉంటే కుదరదంటూ ప్రాణాంతకమైన డెంగీ దోమల వ్యాప్తికి కారకులైన 20 వేల మందికి మంగళవారం ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. 48 గంటల్లోగా నీటి నిల్వలను తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. ఇక ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ పిలుపునిచ్చారు. డెంగీ నివారణ చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ కోరారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా డెంగీ జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. డెంగీ జ్వరాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పదివేల మందికి పైగా డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరగా వందల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ కొన్నివేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోయంబత్తూరులో డెంగీ జ్వరాలకు ముగ్గురు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయారు. సేలం జిల్లాలో గత వారం రోజుల్లో 18 మంది మృతి చెందడంతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి డెంగీ నివారణ పనులను చేపడుతున్నారు. వ్యాధి నిరోధక కషాయం విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులతో చైతన్యర్యాలి నిర్వహిస్తున్నారు. అదుపులోకి రాని డెంగీ ఎన్ని చర్యలు తీసుకున్నా డెంగీ అదుపులోకి రాలేదు. ప్రజల్లో భయాందోళనలు తొలగిపోలేదు. సాధారణ జ్వరం వచ్చినా డెంగీ జ్వరం అనుకుని జడుసుకుంటున్నారు. రోజుల కొలదీ నిల్వ ఉన్న మంచినీటిలో మాత్రమే డెంగీ దోమ వ్యాప్తిచెందుతుందున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి వాటిని నిర్మూలించాల్సిందిగా సూచించారు. ప్రజల్లో ధైర్యం కలిగించి, దోమలవ్యాప్తిని నివారించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 8వ తేదీన చెన్నైలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చెన్నై పుదుప్పేట, రాయపేట తదితర ప్రాంతాల్లోని దుకాణాల వద్ద నీరునిలిచిపోయి ఉండడాన్ని గుర్తించారు. అలాగే ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాల్లో నీరు పేరుకుపోయి ఉండడాన్ని గమనించారు. కొన్ని ఇళ్ల ప్రాంగణంలో వాడకం నీరు ప్రవాహానికి నోచుకోకుండా నిలిచిపోయి ఉండగా వారికి జాగ్రత్తలు సూచించారు. ఇలా రాష్ట్రం నలుమూలలా గుర్తించిన 20 వేల మందికి మంగళవారం నోటీసులు జారీచేశారు. 48 గంటల్లోగా నీటి నిల్వలను తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష లేదా రూ.1 లక్ష జరిమానా తప్పదని హెచ్చరించారు. కాగా డెంగీ వ్యాప్తికి దోహదపడుతున్న 64 మంది నుంచి పూందమల్లి మునిసిపాలిటీ రూ.43వేల జరిమానా వసూలు చేసింది. పుదుచ్చేరిలో చెత్తవేస్తే రూ.100 జరిమానా డెంగీ నిరోధకానికి జాగ్రత్తల్లో భాగంగా మంగళవారం పుదుచ్చేరిలో పాదయాత్ర నిర్వహించిన గవర్నర్ కిరణ్‌బేడీ రోడ్డులో చెత్తవేసిన వారికి అక్కడికక్కడే రూ.100 జరిమానా విధించారు. పుదుచ్చేరి మంత్రి కందస్వామి డెంగీ జ్వరం అనుమానంతో సోమవారం రక్తపరీక్షలు చేయించుకోగా ఫలితాలు రావాల్సి ఉంది. ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోజుకు 2 వేల కిలోల నిలవేంబు కషాయాన్ని టామ్బాక్స్ సంస్థలో తయారుచేయించి ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఈ కషాయాన్ని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. జ్వరం సోకగానే నిర్లక్ష్యం చేయకుండా డెంగీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పథకంలో కొత్తగా డెంగీ చికిత్సను కూడా చేర్చినట్లు చెప్పారు. ప్రతి మంగళవారాన్ని డెంగీ నివారణ దినంగా పాటించాలని జిల్లా కలెక్టర్లకు, ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. డెంగీ నివారణ చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ కోరారు. ప్రభుత్వానికి కోర్టు నోటీసులు డెంగీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మదురై హైకోర్టులో రమేష్ అనే వ్యక్తి మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీచేసింది. -
డెంగీ జ్వరాలు.. 20వేల మందికి నోటీసులు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డెంగీ వ్యాప్తికి కారకులైన 20 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంగళవారం నోటీసులు జారీచేసింది. దుకాణాలు, ఇళ్లు, ఇంటి ఖాళీ స్థలాల్లో మురుగునీటి గుంతలతో పారిశుద్ద్యాన్ని భంగపరిచేలా వ్యవహరిస్తున్న 20 వేల మందికి ఈ నోటీసులు అందాయి. గత రెండు నెలల కాలంలో డెంగీ జ్వరాల బారిన పడి వందల సంఖ్యలో మృత్యువాత పడగా, పదివేల మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ దోమలతో నిండి ఉన్న 20 వేల మురుగు నీటి గుంతలను గుర్తించిన ప్రభుత్వం.. 48 గంటల్లోగా వాటిని తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించింది. -
అనంతను వణికిస్తున్న డెంగీ..
-
డెంగీ జ్వరంతో విద్యార్థిని మృతి
రాయదుర్గంరూరల్: మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి చెందిన త్రిష ( 6) అనే ఒకటవ తరగతి విద్యార్థిని డెంగీ జ్వరంతో మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన రత్నమ్మ, నింగప్ప దంపతుల కుమార్తె త్రిషకు జ్వరంగా ఉండంతో కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రిలో నాలుగు రోజులు అక్కడే చికిత్స చేశారు. రక్తకణాలు తక్కువగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడా నాలుగు రోజులు చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
వైద్యుడి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
- చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన - ముందే చెప్పి ఉంటే బతికించుకునే వారిమని ఆవేదన బేతంచెర్ల: స్థాయికి మించి వైద్య సేవలందించి చివర్లో చేతులెత్తేయ్యడంతో తమ కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ సంజీవనగర్ కాలనీకి చెందిన బాధిత కుటుంబీకులు శుక్రవారం బేతంచెర్లలో ప్రయివేటు క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. సంజీవనగర్ కాలనీకి చెందిన మురళీధర్‌రెడ్డి, సుజాత దంపతుల రెండవ కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి(4) డెంగి జ్వరంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మరణించాడు. అయితే ఈ నెల 19న బాలుడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ప్రయివేటు క్లినిక్‌లో చేర్పించారు. బాలున్ని పరీక్షించిన వైద్యుడు మలేరియా జ్వరం అంటూ చికిత్స నిర్వహించాడు. 4 రోజులైనా నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలున్ని పరీక్షించిన వైద్యులు డెంగి జ్వరంగా నిర్ధారించి వైద్యం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించాడు. అయితే బాలునికి సోకింది డెంగి జ్వరం అని ముందే చెప్పి ఉంటే తాము మెరుగైన వైద్యం చేయించి బతికించుకునే వారమని, ఏమీ తెలియకున్నా నాలుగురోజులపాటు చికిత్స అందిస్తూ బాలుని ప్రాణాలతో చెలగాటమాడి చివరకు చేతులెత్తేసి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడని ప్రయివేటు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డెంగీ లక్షణాలతో బీటెక్ విద్యార్థి మృతి
ధర్మవరం అర్బన్ : డెంగీ లక్షణాలతో పామిశెట్టి తేజ అనే బీటెక్ విద్యార్థి (17) మృతిచెందాడు. ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు పామిశెట్టి తేజ ఈ నెల 26న బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద గల శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ) కళాశాలలో బీటెక్‌లో చేరాడు. అదే రోజు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి జ్వరం వస్తుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. వైద్యుల సలహా మేరకు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. తేజ డెంగీ లక్షణాలతో బాధపడుతున్నాడని వైద్యపరీక్షల్లో తేలింది. రక్తంలో ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గిపోవడంతో గురువారం రాత్రి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. -
డెంగ్యూతో ప్రాణాపాయ స్థితిలో బాలుడు
-
మంత్రుల మాటలు దారుణం
• డెంగీతో 23 మంది చనిపోతే ఇద్దరే అని చెప్తారా..? • వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు సుధీర్‌బాబు • రావినూతల గ్రామంలో మృతుల కుటుంబాలకు పరామర్శ బోనకల్: మండలంలో డెంగీ జ్వరంతో 23 మంది చనిపోతే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరే మృతి చెందారని చెప్పటం అత్యంత దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. రావినూతల గ్రామంలో డెంగీ జ్వరంతో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ఆర్ సీపీ బృందం బుధవారం పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలబోరుున సారుుసుధ కుటుంబం నిరుపేద కుటుంబం కావటం ఉన్న ఒక్కంటిని తాకట్టు పెట్టి వైద్యం చేరుుంచినప్పటికి బతకలేదని కుటుంబసభ్యులు సుధీర్‌బాబు ఎదుట కన్నీంటి పర్యంతమయ్యారు. అదేవిధంగా గిరిజన కుటుంబానికి చెందిన గుగులోతు సైదులు ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉండే తరుణంలో డెంగీతో మృతి చెందాడని కుటుంబసభ్యులు విలపించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న వైద్యశిబిరాన్ని పరిశీలించారు. సర్పంచ్ షేక్ వజీర్‌ను గ్రామంలో జ్వరాల పరిస్థితి, వైద్యసేవలు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ కొండలరావుతో మాట్లాడి జ్వరపీడుతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా లక్కినేని మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు మండలానికి వచ్చి కనీసం డెంగీతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించకపోవటం వారి అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. మండలంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలస్యం సుధాకర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టౌన్ అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి, మండల నాయకులు షేక్ మౌలాలి, చిట్టోజి శ్రీనివాస్, మర్రి ప్రేమ్‌కుమార్, తాళ్లూరి వెంకటి, గణపారపు వెంకటేశ్వర్లు, ఇరుగు జ్ఞానేష్, షేక్ సయ్యద్‌బాబు, షేక్ షరీఫ్ పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రంపై డెంగీ పంజా
-
డెంగీ బెల్స్
► డెంగీ బెల్స్ ► రాష్ట్రానికి దోమ కాటు ► సోమవారం ఒక్కరోజే 67 కేసులు ► ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పరిస్థితి తీవ్రం ► ఇప్పటిదాకా 22 మంది మృతి ► 351 పాజిటివ్ కేసులు.. దేశంలోనే అత్యధికం ► మూడునెలలుగా జ్వరంతో అల్లాడుతున్న 15 గ్రామాలు ► ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 వేల మందికి డెంగీ నిర్ధారణ ► చేష్టలుడిగి చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ ► డెంగీతో మరణించింది ఐదుగురేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. జ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. రాష్ట్రమంతటా డెంగీ కేసులు నమోదవుతున్నా.. ఖమ్మం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్క బోనకల్ మండలం లోనే 22 మందిని డెంగీ పొట్టనబెట్టుకుంది. డెంగీ ఏ స్థాయిలో విజృంభించిందంటే ఒక్క సోమవారమే రాష్ట్రవ్యాప్తంగా 146 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 67 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. అందులో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 58 మంది ఉన్నారు. డెంగీ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ ఇప్పటివరకు సమగ్ర చర్యలు తీసుకోలేదు. బోనకల్ మండలంలో 22 మంది చనిపోయినా కేవలం ఐదుగురే చనిపోయారని చెబుతోంది. గత మూడు నెలలుగా ఈ మండలంలోని 15 గ్రామాలు డెంగీతో అల్లాడుతున్నాయి. బోనకల్ మండలంలో దేశంలోనే అత్యధికంగా 351 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 10 నెలల్లో 1,983 కేసులు రాష్ట్రవ్యాప్తంగా డెంగీ, మలేరియా కేసులు పెరిగాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారమే.. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో 1,983 మందికి డెంగీ సోకినట్లు నిర్ధారించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా మృతులు మాత్రం ఐదుగురేనని చెబుతున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 22 మంది చనిపోయినా.. మృతుల సంఖ్యను తక్కువగా చూపడంపై విమర్శలు వస్తున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో (జనవరి–అక్టోబర్ మధ్య) 2,284 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 894 మందికి డెంగీ సోకినట్లు తేలింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో 3,072 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 377 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లాలో 204 మందికి డెంగీ ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 1118 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 825 కేసులు నమోదయ్యాయి. బోనకల్‌కు మంత్రి లక్ష్మారెడ్డి! రెండు మూడ్రోజుల్లో బోనకల్ మండలంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించే అవకాశాలున్నాయని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. డెంగీపై మంత్రి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌తోపాటు రావినూతల, గోవిందాపురం గ్రామాలకు ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారు. డాక్టర్లు, సిబ్బంది, సెల్ కౌంట్ మిషన్లను కూడా పంపుతామని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని స్ప్రేయర్లను బోనకల్‌కు పంపాలని ఆదేశించారు. వారానికి రెండుసార్లు బాధిత ఇళ్లల్లో స్ప్రే చేయాలన్నారు. సీరియస్ కేసులను హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఫీవర్ ఆసుపత్రి నుంచి ఇప్పటికే ఒక బృందాన్ని బోనకల్ పంపామన్నారు. గ్రామానికి ఒకటి చొప్పున 108, మూడు 104 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఆ మండలంలో ఇంటింటికి జ్వరమే ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగీతో రోజుకొకరు మృత్యువాత పడుతున్నారు. మండలంలోని గ్రామాల్లో ఒక్కో ఇంట్లో ముగ్గురు, నలుగురు జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు మండలంలోని రావినూతలలో 8 మంది మృతి చెందగా.. 31 మంది డెంగీతో బాధపడుతున్నారు. మరో 56 మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. జ్వరం లక్షణాలు కనపడితే జనం బెంబేలెత్తిపోతున్నారు. డెంగీ భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. బోనకల్లో ఈ ఏడాది ఆగస్టులో 5,143, సెప్టెంబర్‌లో 6,138, అక్టోబర్‌లో 6,735 మందికి విష జ్వరాలు సోకాయి. మండలంలోని 21 గ్రామాల ప్రజలు ఖమ్మం, విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్యం కోసం లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 790 డెంగీ కేసులు నమోదైతే.. ఈ మండలంలోనే సగం కేసులు నమోదయ్యాయి. మండలంలో డెంగీతో మరణంచిన 22 మందిలో 15 మంది వరకు 40 ఏళ్ల లోపు వారే ఉన్నారు. జ్వరాలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు భయంతో గ్రామాలను వీడుతున్నారు. చేతికందిన కుమారుడిని కోల్పోయి.. బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన గుగులోతు రూప్లా కుమారుడు సైదులు(30) డెంగీతో అక్టోబర్ 14న మృతి చెందాడు. గత నెల 11న సైదులుకు జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ వద్ద తగ్గకపోవడంతో మరుసటిరోజు ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఒక్కరోజు వైద్యం చేసిన తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డెంగీ జ్వరం వచ్చిందని, కిడ్నీ, లివర్‌పై ప్రభావం పడిందని వైద్యులు తెలిపారు. రూ.2.20 లక్షలు ఖర్చు చేసినప్పటికీ కుమారుడు దక్కలేదంటూ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. కూలీనాలీ చేసి కుమారుడిని ఎమ్మెస్సీ బీఈడీ చేయించాడు. ఆరునెలల కిందటే వివాహం చేశాడు. పెద్దదిక్కుని కబలించింది.. రావినూతల గ్రామానికి చెందిన అజ్మీరా రఘుపతి(65) గతనెల 19న డెంగీతో మృతి చెందాడు. ఈయనకు 17వ తేదీన జ్వరం రావడంతో మరుసటి రోజు ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరంతోపాటు ప్లేట్లెట్లు పడిపోయాయి. వైద్యానికి రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేసినా లాభం లేకపోయింది. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆయన భార్య మస్రు కన్నీరు మున్నీరవుతోంది. జ్వరం వచ్చిన రెండు రోజులకే.. రావినూతలకు చెందిన పుచ్చకాయల లక్ష్మి (35)కి అక్టోబర్ 24న జ్వరం వచ్చింది. ఆమె భర్త జగ్గయ్యపేట ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తగ్గకపోవడంతో కోదాడలోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. డెంగీ జ్వరం వచ్చిందని, ప్లేట్లెట్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో 26న లక్ష్మి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శక్తివంతమైన వైరస్ వల్లే..: డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం శక్తివంతమైన విరువెంట్ వైరస్ వల్లే బోనకల్ మండలంలో 22 మందికిపైగా మరణించారు. పారిశుద్ధ్య లోపం కూడా ప్రధాన కారణం. సాధారణ జ్వరంగా భావించి కొందరు స్థానిక వైద్యులను సంప్రదించారు. వాళ్లు స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ప్లేట్లెట్లు తగ్గినా చివరి వరకు తెలియని పరిస్థితి నెలకొంది. మా అంచనా ప్రకారం 22 మంది కంటే ఎక్కువగానే చనిపోయి ఉంటారు. ==== జిల్లాల వారీగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు డెంగీ, మలేరియా కేసుల వివరాలు ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– జిల్లా డెంగీ మలేరియా ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఆదిలాబాద్ 23 1,118 కరీంనగర్ 134 48 వరంగల్ 140 438 ఖమ్మం 894 825 మహబూబ్‌నగర్ 64 46 మెదక్ 19 66 నల్లగొండ 28 17 హైదరాబాద్ 377 138 రంగారెడ్డి 100 30 నిజామాబాద్ 204 32 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 1,983 2,758 –––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: పొంగులేటి
హైదరాబాద్ : రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ పక్ష ఉప నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన వైద్య ఆరోగ్య శాఖే పేషెంట్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం సచివాలయం మీడియా పాయింట్లో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఖమ్మంలో డెంగ్యూ, విష జ్వరాల్లో రికార్డు సృష్టిందన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్‌లోనే 20వేలమందికి పైగా విష జ్వరాలు బారినపడ్డారన్నారు. ఇందుకు సంబంధించి తాము నెల రోజుల క్రితమే ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి, కలెక్టర్‌కు లేఖ రామన్నారు. అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పడు హడావుడిగా సమీక్ష సమావేశం పెట్టి ఓ బృందాన్ని పంపిస్తోందన్నారు. ప్రభుత్వం ముందే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు. -
డెంగీతో విద్యార్థిని మృతి
ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా కేతనకొండలో డెంగీ జ్వరంతో ఓ విద్యార్థిని బుధవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన పులి మరియమ్మ కుమార్తె తబితారాణి (16) స్థానిక కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. వారం కిందట జ్వరం బారిన పడడంతో గొల్లపూడిలోని ఓప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గాయని, డెంగీ జ్వరమని వైద్యులు చెప్పినట్టు బంధువులు తెలిపారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తబితారాణి మృతిచెందింది. -
డెంగీ విషజ్వరాలపై అవగాహన సదస్సు
ఎస్కేయూ : ‘దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత’లో భాగంగా గురువారం ఎస్కేయూ సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్లు డెంగీ జ్వరంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎస్కేయూ సమీపంలోని చిన్నకుంట గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిరోజ్‌ఖాన్, డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డెంగీతో విద్యార్థి మృతి
సెలవు ప్రకటించిన బూర్గుపల్లి పాఠశాల కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కొత్తపల్లిలో విషాదం మెదక్ రూరల్: డెంగీ వ్యాధితో ఓ విద్యార్థి చికిత్సపొందుతూ మృతి చెందిన సంఘటన మెదక్ మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొత్తపల్లిలోని మనిగిరి మల్లయ్య, లక్ష్మి దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు మనిగిరి ప్రకాష్(12)బూర్గుపల్లిలోని ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ అక్కడే ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో 6వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో ఉండగా 15 రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో హాస్టల్ సిబ్బంది ప్రకాష్‌ను ఇంటికి పంపించారు. జ్వరంతో బాధపడుతున్న కొడుకును మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు చికిత్సలు నిర్వహించగా వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. అక్కడ రక్త కణాల సంఖ్య తగ్గిపోవడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీగా నిర్దారిచారు. వ్యాధి మెదడుకు సోకడంతో పరిస్థితి విషమించి 13 రోజులపాటు చికిత్సపొంది బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బూర్గుపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించి పాఠశాలకు సెలవు ఇచ్చారు. ప్రకాష్ కుటుంబీకులను పరామర్శించి సంతాపం తెలిపారు. కళ్ల ముందే కదలాడిన ఉన్న ఒక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరితరం కాలేదు. ప్రకాష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.