ఎస్కేయూ : ‘దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత’లో భాగంగా గురువారం ఎస్కేయూ సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్లు డెంగీ జ్వరంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎస్కేయూ సమీపంలోని చిన్నకుంట గ్రామంలో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిరోజ్‌ఖాన్, డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.