పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలను తరిమికొడదామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలను తరిమికొడదామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం జేసీ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అవగాహనలు కల్పించాలన్నారు. సాయంత్రం 5–6 గంటలకే తలుపులు, కిటికీలు మూసేసి,దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ అంజయ్య, సమాచార శాఖ ఏడీ తిమ్మప్ప,తహశీల్దార్ శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.