Sanitation
-
ఈ బాధలు ఎప్పటికీ తీరేను.. పాలకులు పట్టించుకోరా?
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ (నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) -
ఆమ్రపాలి.. ఆన్ డ్యూటీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లకుంట శంకర్‌మఠ్ సమీపంలో ఆర్ఎఫ్సీ వాహన డ్రైవర్‌తో మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే దారిలో తనకు తారసపడిన ఓ విద్యార్థినితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేయాలని ఆ విద్యారి్థనికి చెప్పారు. నారాయణగూడ క్రాస్‌రోడ్స్ దగ్గర నిరి్మంచిన మార్కెట్ గదుల కేటాయింపులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్‌కు సూచించారు. కమిషనర్ వెంట తనిఖీలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. కాగా ఐఏఎస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కార్యాలయాలకే పరిమితం కారాదని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించడం తెలిసిందే. సమావేశానికి సిద్ధం కండి ఈ నెల 6న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఆయా విభాగాల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం తన చాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ, 6న జరగనున్న సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్‌కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్‌లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్‌తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్‌గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్‌గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్‌లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్‌తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్‌లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్‌ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్‌ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్‌ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్‌లో తండ్రి రాజేష్‌తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్‌లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్‌లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌రూరల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం మావలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 468 గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్‌కు తరలించాలన్నారు. రోడ్లపై వర్షపునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే మురుగు కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. దోమలతో వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 25 లక్షల 5వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు గుర్తించడం, గుంతలు తవ్వడం వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈనెల 30 నుంచి 8,702 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ ఉంటుందన్నారు. అర్హులైన బీసీ చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన, అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. సమగ్ర ఓటరు జాబితా తయారీకి బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ జలశక్తి అవార్డు అందుకున్న కలెక్టర్‌ను అధికారులు సత్కరించారు. సమావేశంలో జెడ్పీ ిసీఈవో గణపతి, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ... కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్‌గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది. లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్‌గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్‌ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్‌రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్‌గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేతివాట.. డస్ట్‌బిన్, బకెట్, చీపుర్లు.. ఏదీ వదలడం లేదు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మెరుగైన వైద్యం, వసతులను కల్పించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సిబ్బంది చేతివాటంతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని పలువురు అంటున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్ వస్తువులైన డస్ట్‌బిన్, చీపుర్లు, ఇతర సామగ్రిని ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎత్తుకెళ్లారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని పేషెంట్‌కేర్ విభాగంలో పని చేసే ఓ మహిళ ఆస్పత్రి నుంచి డస్ట్‌బిన్ బకెట్, చీపుర్లను పట్టుకుని బయటకు రాగా అదే ఆస్పత్రిలో పని చేసే ఓ సెక్యూరిటీగార్డ్ తన ద్విచక్రవాహనంపై వచ్చి సదరు మహిళను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇదే ఘటనపై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా చోరీ జరిగిన విషయం ఆదివారం ఉదయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం అందించామని తెలిపారు. ఇదిలా ఉండగా వస్తువులను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన విషయంలో పేషెంట్కేర్లో పని చేసే మహిళ, సెక్యూరిటీగార్డుపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
కిటికీ అద్దాలు తుడిస్తే చాలు..కోటి రూపాయిల జీతం!
శానిటైజేషన్ వర్క్‌ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. ఇంతకీ శానిటైజేషన్ వర్కర్లకు చెల్లించే జీతం ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయిలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఆ పనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సదరు సంస్థలు వేతనాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేడయం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా డాక్టర్లు, ఇంజినీర్ల శాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు..క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటల వ్యవధిలో భారీ ఎత్తున ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. 2021 నుంచి దేశం మొత్తం క్లీనింగ్ విభాగంలో డిమాండ్ ఎక్కువైంది. గతంలో అంటే 2021 ముందు క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటకు రూ.2700 ఇస్తే ఇప్పుడు రూ.3600వరకు చెల్లిస్తున్నాయి. అంతేకాదు అత్యవసర సమయాల్లో గంటకు రూ.4700 చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సిడ్నీకి చెందిన అబ్సిల్యూట్ డొమెస్టిక్ (Absolute Domestics) సంస్థతో పాటు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇళ్లలో ఉండే చిన్న చిన్న కాలువలు మొదులుకొని, కిటికీలు శుభ్రం చేసే ఉద్యోగులకు చాలా కంపెనీలు గంటల వ్యవధికి శాలరీలు ఇస్తుంటాయి. ఆ లెక్కన ఉద్యోగులు ప్రతి నెలా సగటున రూ. 8లక్షల జీతం పొందేవారు. ఆశ్చర్యకరంగా దేశంలో ఉద్యోగుల కొరతతో వారి సగటు జీతం ప్యాకేజీ రూ. 72లక్షల నుండి రూ.80లక్షల వరకు చేరింది. అయితే చాలా కంపెనీలు ఆ వేతానాల్ని రూ.98 లక్షల పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా రూ.కోటి ఇస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాలో శానిటైజేషన్ సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే..బ్రిటన్‌కు చెందిన క్లీనింగ్ ఉద్యోగుల శాలరీలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. అక్కడ క్యాబేజీని పండించిన ఉద్యోగులకు సంవత్సరానికి రూ.65లక్షల జీతం ఇస్తున్నారు. -
వైరల్.. అమ్మ నీకు దండమే...
కొండలు పగిలేంత ఎండ కోరలు చాచి భయపెడుతుంది. రాక్షస దుమ్ము మేఘం ఒకటి ఊపిరిలోకి రావడానికి దూసుకొస్తుంది. అయినా తప్పదు...పని చేయాల్సిందే. ఈ ఎండలో బిడ్డను బయటికి తీసుకురావడం ఏమంత మంచిది కాదు. ఎండమ్మా కాస్త కరుణ చూపు... నా బిడ్డ ముఖం చూసైనా! కానీ ఎండ తగ్గేలా లేదు. అయినా తప్పదు... పని చేయాల్పిందే. పచ్చని చెట్టుకు కట్టిన ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతుంటే, ఆ కేరింతలను చూసి ఎన్ని సంవత్సరాలైనా సంతోషంగా బతకవచ్చు. కానీ బతుకుపోరు తనను బజార్‌కు తీసుకువచ్చింది. ఎండైనా, వానైనా పని తప్పదు. పనికి వెళుతున్నప్పుడు బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లాలి కదా. ఇంట్లో ఎవరు ఉన్నారని! పెనిమిటి తనలాగే పనికి పోయాడు. పక్కింటివాళ్లకు అప్పగించాలనుకుంటే వారు ఇంట్లో ఉండరు. తనలాగే పనికోసం వెళ్తారు. అందుకే... పనికి వెళ్లక తప్పదు. వెళుతూ వెళుతూ బిడ్డను తీసుకువెళ్లక తప్పదు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు బిడ్డను కొంగుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక చిత్రం వంద పదాల పెట్టు అంటారు. ఇప్పుడు ఆ వరుసలో లఘుచిత్రాన్ని కూడా చేర్చవచ్చు. శ్రమైకజీవన సౌందర్యం నుంచి వర్కింగ్ వుమెన్ పర్సనల్ చాయిస్ వరకు నెటిజనులు ఈ వీడియో చిత్రం నేపథ్యంగా తమ మనసులోని భావాలను ప్రకటించుకున్నారు. ‘ఇదేనా మహిళా సంక్షేమం అంటే!’ అని ఒకరు వ్యంగ్యబాణం విసిరితే, ‘ఇలాంటి వృత్తి నిబద్ధత ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తారు. దేశం ముందడుగు వేయడానికి ఇలాంటి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది’ అంటూ స్పందిస్తారు మరొకరు. ‘ఈ అమ్మలో మా అమ్మను చూసుకున్నాను’ అని ఒకరు కన్నీరు కార్చితే, మరొకరు ‘ఇది పట్టణ దృశ్యం. ఇక మాలాంటి పల్లెల్లో పొలం పనులకు బిడ్డతో వచ్చే తల్లులు ఉన్నారు. చెట్టుకు జోలె కట్టి బిడ్డను అందులో పడుకోబెట్టి పొలం పనులు చేస్తుంటారు. ఆ తల్లి మనసంతా బిడ్డ మీదే ఉంటుంది!’ అని జ్ఞాపకాల్లోకి వెళతారు ఒకరు. ‘మా ఊళ్లో ఒక అమ్మ తన బిడ్డను చెట్టు కింద కూర్చోబెట్టి కూలీపనులు చేసుకుంటుంది. నీళ్లు తాగడం కోసం పొలం దాటి బయటికి వచ్చిన ఆమె బిడ్డను చూసిపోదామని వచ్చేసరికి కాస్త దూరంలో పాము కనిపించి పెద్దగా అరిచి బిడ్డను అక్కడి నుంచి తీసుకొని పరుగెత్తింది. ఈ సంఘటన గురించి ఇప్పటికీ మా ఊళ్లో చెప్పుకుంటారు’ భావోద్వేగాల సంగతి సరే, మంచి సూచనలు ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి... ‘పేదవాళ్లకు కేర్టేకర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దేశంలో రకరకాల స్వచ్ఛందసంస్థల గురించి విని ఉన్నాం. పేద ఉద్యోగులు ఉద్యోగానికి లేదా పనికి వెళితే వారి పిల్లలను చూసుకునే స్వచ్ఛందసంస్థలు కూడా వస్తే మంచిది. ఈ దిశగా ఎవరైనా ఆలోచించాలి’. సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అనేది కొత్త కాదు. అయితే ఒక మంచి కారణంతో చర్చల్లో ఉండే వీడియోలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. -
శానిటేషన్.. పరేషాన్!
♦వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్న ప్రసూతి వార్డు ఇది. గతంలో 100 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిని 330 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ఇక్కడ కనీసం 80 మంది శానిటేషన్ వర్కర్లు అవసరం. కానీ ఉన్నది 44 మందే. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించకపోవడం, సరిగా శుభ్రం చేయకపోవడంతో వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. పలు వార్డులు, గదుల్లో పందికొక్కులు తిరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ♦సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రి శానిటేషన్ స్టోర్ గది, ఆస్పత్రిలో వాడే నాసిరకం ఫినాయిల్, ఇతర సామగ్రి ఇవి. ఇక్కడ తగిన శుభ్రత కోసం వినియోగించే సామగ్రి లేదు. కాస్త ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ మాత్రమే ఉన్నాయి. 3 నెలలుగా పరిస్థితి ఇలాగే ఉందని సిబ్బంది, రోగులు చెప్తున్నారు. ♦రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్యం దుస్థితికి ఇవి చిన్న ఉదాహరణలు. ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులు చేసే కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం.. ఏమాత్రం నాణ్యతలేని సామగ్రిని వినియోగించడం.. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం.. తూతూమంత్రంగా క్లీనింగ్ చేయడం వంటివి పరిపాటిగా మారిపోయాయి. అధికారవర్గాలు దీనిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో శానిటేషన్ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు కొరకడం.. గతంలో మెదక్ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని పందికొక్కులు కొరుక్కుతినడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా పారిశుధ్య లోపం, కొరవడిన పర్యవేక్షణ కారణమనేది సుస్పష్టం. ఇలాంటి సమయంలో అసలు సమస్య ఎక్కడ? ఎవరు బాధ్యులు? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రక్షాళన చేపట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని.. దీనిని ఆసరాగా తీసుకుని శానిటేషన్ కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో బుధవారం ‘సాక్షి’ చేపట్టిన విజిట్‌లో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ప్రైవేట్ ఏజెన్సీల తెంపరితనం, రోగుల అవస్థలు వెలుగుచూశాయి. సిబ్బంది లేరు.. పరిశుభ్రత అసలే లేదు.. ♦ప్రభుత్వాస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పర్యాయాలు వార్డులు, ఆవరణ, ఐసీయూ, ఇతర గదులను షిఫ్టుల వారీగా శుభ్రం చేయాలి. కానీ చాలాచోట్ల రెండుసార్లు మాత్రమే శుభ్రం చేస్తున్నారు. ♦శానిటేషన్ ఏజెన్సీలు అగ్రిమెంట్ ప్రకారం.. నాణ్యమైన డెట్టాల్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్, ఇతర సామగ్రి వినియోగించాలి. చాలాచోట్ల డెట్టాల్ వాడటంలేదు. ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కూడా నాసిరకాలవి వినియోగిస్తున్నారు. ♦శానిటేషన్ సిబ్బంది హాజరుకు సంబంధించి ఒకట్రెండు చోట్ల మినహా ఎక్కడా బయోమెట్రిక్ హాజరు లేదు. ఏజెన్సీల నిర్వాహకులు దీనిని ఆసరాగా చేసుకుని కొందరితో హాజరుపట్టికలో సంతకాలు చేయించి బయట పనులకు వినియోగించుకుంటున్నారు. ప్రతినెలా పదుల సంఖ్యలో సిబ్బంది వేతనాలను మిగుల్చుకుంటున్నారు. ♦నిబంధనల ప్రకారం శానిటేషన్ సిబ్బందికి నెలకు రూ.9,400 వేతనం ఇవ్వాలి. కా>నీ చాలాచోట్ల రూ.8 వేలు, కొన్నిచోట్ల అయితే రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండటంతో పారిశుధ్య సిబ్బంది పనిపై శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ♦కొత్తగా మెడికల్ కళాశాలలు ప్రారంభమైన చోట.. వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య సిబ్బంది సంఖ్య పెంచలేదు. దానితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలాఖరులోగా నోటిఫికేషన్ వేసి టెండర్ ఆహ్వానిస్తామని అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల ఇదే దుస్థితి.. ♦ఖమ్మం జిల్లాలో 400 పడకల ప్రభుత్వాస్పత్రిలో 80 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. అందులోనూ కొందరే విధుల్లో ఉంటున్న పరిస్థితి. ఊడవడం, తుడవడం వంటివి ఒకరిద్దరే.. అదీ తూతూమంత్రంగా ముగిస్తున్నారని రోగుల బంధువులు చెప్తున్నారు. టాయిలెట్ల క్లీనింగ్ దారుణమని, బ్లీచింగ్ పౌడర్ కూడా సరిగా చల్లడం లేదని మండిపడుతున్నారు. ♦మెదక్ జిల్లాలోని వంద పడకల ఆస్పత్రిలో మూడు విడతల్లో కలిపి కేవలం 15 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారు. వీక్లీ ఆఫ్‌లు, సెలవులు పోగా.. రోజూ పనిచేసేది ముగ్గురు, నలుగురే. దీనితో పారిశుధ్యం కొరవడింది. ఆస్పత్రి ఆవరణలో మార్చురీ పక్కన చెత్తాచెదారం నిండిపోయింది. జనగామ జిల్లా ఆస్పత్రిలో ఫ్లోర్‌ను తుడుస్తున్న శానిటేషన్ వర్కర్ ఇతను. ఆస్పత్రిలో 17 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. వార్డులను రోజూ మూడుసార్లు శుభ్రం చేయాల్సి ఉండగా.. రెండుసార్లే క్లీన్ చేస్తున్నారు. సోప్ ఆయిల్, హైపోక్లోరైడ్, యాసిడ్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటివి నాసిరకంగా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో 170 మంది పారిశుధ్య సిబ్బందికిగాను 112 మంది మాత్రమే ఉన్నారు. దానితో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇక మంచిర్యాల ఆస్పత్రి 200 పడకలకు అప్‌గ్రేడ్ అయినా.. 40 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. దుర్వాసన వస్తున్నా పట్టించుకోవట్లేదు కాలుకు గాయమవడంతో చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చాను. రెండు రోజులుగా వార్డులో ఉంటున్నాను. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. –నర్సింహ, రామచంద్రపురం, భువనగిరి -
బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించం
హస్తినాపురం: డివిజన్లోని కాలనీల ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించేది లేదని కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నందనవనం కాలనీలో పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డివిజన్లోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గణేశ్, జవాన్ శంకర్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి , మల్లేశ్‌గౌడ్ , రాజుగౌడ్, మారం శ్రీధర్ పాల్గొన్నారు. -
పారిశుధ్యం మెరుగుదలకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మునిసిపాలిటీల్లో 256 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (జీటీఎస్)లు నిర్మిస్తోంది. ప్రస్తుతం మునిసి పాలిటీల్లోని వార్డుల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఓ ప్రాంతంలో పోగు చేస్తున్నారు. తర్వాత టిప్పర్ల ద్వారా డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశంలో పోగేయడం వల్ల అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం మెరుగు, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పోగు చేయకుండా 8 నుంచి 10 లేదా స్థానిక పరిస్థితులను బట్టి మరికొన్ని వార్డులను కలిపి ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను పోగు చేయడానికి జీటీఎస్‌లు నిర్మించాలని నిశ్చయించింది. రూ.213 కోట్లతో 256 జీటీఎస్‌ల నిర్మాణం రాష్ట్రంలో 123 మునిసిపాలిటీల్లో రూ.213.39 కోట్లతో 256 జీటీఎస్‌ల నిర్మాణానికి ఆ శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 104 మునిసిపాలిటీల్లో 210 జీటీఎస్‌ల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి. 92 మునిసిపాలిటీల్లో 189 జీటీఎస్‌ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. 72 మునిసిపాలిటీల్లో 136 జీటీఎస్‌లకు టెండర్లు పూర్తయ్యాయి. 68 మునిసిపాలిటీల్లో 124 జీటీఎస్‌ల నిర్మాణానికి వర్క్ ఆర్డర్లు చేయడం ముగిసింది. శ్రీకాకుళం, మచిలీపట్నం, ఒంగోలు కార్పొరేషన్లు, హిందూపురం, వినుకొండ, నంద్యాల, పుంగనూరు, నగరి సహా 30 మునిసిపాలిటీల్లో 46 జీటీఎస్‌ల నిర్మాణం ప్రారంభించారు. మిగిలిన జీటీఎస్‌ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. 30 సెంట్ల నుంచి అర ఎకరం, ఎకరం, మూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కూడా పలు మునిసిపాలిటీల్లో జీటీఎస్‌ల నిర్మాణం చేపడుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా ఇక్కడికి తరలిస్తారు. అనంతరం తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలిస్తారు. -
శుభ్రతకు 'క్లాప్' కొడదాం
సాక్షి, అమరావతి: పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేందుకు రూపొందించిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సన్నద్ధమవుతోంది. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం కోసం ముందుగా పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు ఇంటింటి నుంచి చెత్త సేకరణపై విస్తృత అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 21.19 లక్షల మంది పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం కల్పించింది. వీరికి రెండంచెల శిక్షణ కార్యక్రమాన్ని మెప్మా నిర్వహిస్తోంది. వార్డు సచివాలయాల కేంద్రంగా కార్యాచరణ చేపట్టింది. ముందుగా ప్రతి మున్సిపాలిటీకి ఒకరుతోపాటు ఆ మున్సిపాలిటీ పరిధిలో పైలట్ వార్డుకు ఇద్దరు చొప్పున మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్, మెప్మా అధికారులు వారికి క్లాప్ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. పారిశుధ్య కార్మికులు ఇంటింటి నుంచి చెత్త సేకరించే తీరు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులు మొదలైన వాటిపై వారికి అవగాహన కల్పించారు. అలాగే రాష్ట్రంలో 3,826 వార్డు సచివాలయాల పరిధిలో 7,652 మంది రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసిన మెప్మా.. వీరికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇప్పించింది. ఈ రిసోర్స్ పర్సన్ల ద్వారా డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తారు. వీరంతా కలసి వార్డు సచివాలయాల సిబ్బంది సహకారంతో పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు క్లాప్ కార్యక్రమం గురించి వివరిస్తారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా మూడు బుట్టల్లో వేయడం, ఇంటింటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు వాటిని అందించడం, వీధిలో ఎక్కడా చెత్తపారేయకుండా ఉండాల్సిన అవసరం మొదలైన వాటిని వివరిస్తారు. ఇక ముందుగా డ్వాక్రా సంఘాల మహిళలు చెత్త రుసుమును స్వచ్ఛందంగా చెల్లించేందుకు ముందుకు వచ్చారు. తద్వారా తమ ప్రాంతాల్లో శాస్త్రీయంగా పారిశుధ్య నిర్వహణ ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేస్తారు. పరిశుభ్ర పట్టణాలే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణాలు, నగరాలను పూర్తి పరిశుభ్ర ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి చెప్పారు. మాస్టర్ ట్రైనర్లకు నిర్దేశించిన యూనిఫాంలను ఆమె గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను భాగస్వాములుగా చేసుకుని క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. – వి.విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
YS Jagan: పరిశుభ్రతకు పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సమీపంలోని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించే ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక నంబర్‌ను డిస్ప్లే చేయాలి. కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వ్యర్థాలను సేకరించి, ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించాలి. మురుగు నీటి కాల్వల శుద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డ్రెయిన్లను తరచూ శుభ్రం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బలమైన పారిశుధ్య కార్యక్రమాల వల్లే ప్రజారోగ్యం మెరుగు పడుతుందని చెప్పారు. ప్రధానంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 14 వేల ట్రై సైకిళ్లు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల్లో ఎంత స్వచ్ఛత పాటిస్తే అంత ఎక్కువగా రోగాల వ్యాప్తిని నిరోధించవచ్చని స్పష్టం చేశారు. డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ కోసం ఇప్పటికే విధుల్లో 23,747 మంది గ్రీన్ అంబాసిడర్స్, 4,482 గ్రీన్ గార్డ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో 11,453 మంది గ్రీన్ అంబాసిడర్స్, 5,551 మంది గ్రీన్ గార్డ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యర్థాల నిర్వహణకు భారీగా యంత్రాలను వినియోగించాలని, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇంకా ఏమన్నారంటే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి వ్యర్థాల సేకరణతో పాటు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి. పీపీఈ కిట్స్ డిస్పోజల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను పక్కాగా చేపట్టాలి. ఈ అంశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. అప్పుడే క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. – ఫోన్ చేయగానే వ్యర్థాలను తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రోటోకాల్ ఉండాలి. 6 లక్షల మంది మహిళలకు సుస్థిర జీవనోపాధి కింద లబ్ధి వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా సుస్థిర జీవనోపాధి కింద ఈ ఏడాది 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మహిళల ఉత్పాదనలు, వారి వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. టై అప్ చేస్తున్న కంపెనీలు కచ్చితంగా ప్రతిష్ట ఉన్నవి, మంచి పనితీరు కలిగినవిగా చూసుకోవాలి. మార్కెటింగ్ సామర్థ్యాలు విస్తృతంగా ఉన్న కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలి. సమగ్ర భూ సర్వే, ఉపాధి పనులు వేగవంతం సమగ్ర సర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై దృష్టి పెట్టాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ చేయాలి. ఈ ఏడాది ఉపాధి హామీ కింద చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీ కూడా పూర్తి కావాలి. వీటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నిర్మాణాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. జియో ట్యాగింగ్ చేసి.. నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రోడ్లు.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టుపై మరింతగా దృష్టి సారించాలి. భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా చిన్న చిన్న నదులపై ఉన్న వంతెనల వద్ద చెక్‌డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టాలి. ప్రగతిపథంలో పనులు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల ప్రగతిని, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం వివరాలు తెలిపారు. నాడు–నేడులో భాగంగా పనులు చేపడుతున్న ఆస్పత్రులు, స్కూళ్లలో కూడా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైఎస్సార్ బీమా, జలజీవన్ మిషన్, గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 9,148 ఇన్సినిరేటర్స్ (బూడిదగా మార్చేవి), 3,279 మిస్ట్ బ్లోయర్స్ (పిచికారి చేసేవి), 3,197 బ్రష్ కట్టర్స్ (గడ్డి కత్తిరించేవి), 3130 హైప్రెషర్ టాయ్‌లెట్ క్లీనర్లు, 165 పోర్టబుల్ థర్మల్ ఫాగింగ్ మిషన్లు, 157 షడ్డింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డ్స్ అందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ పి.రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పరిశుభ్రంగా పల్లెలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రజలందరూ స్వచ్ఛమైన వాతావరణంలో జీవనం సాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా.. గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయనుంది. అలాగే, పల్లెల్లో రోడ్లపై మురుగునీటి ప్రవాహం ఓ పెద్ద సమస్య. సైడ్ కాల్వలు శుభ్రం చేసేందుకు చాలాచోట్ల కూలీలు ముందుకు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కూలీ రేటు ఎక్కువగా డిమాండ్ చేస్తుండడంతో ఈ పని గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారింది. దీంతో ఈ సమస్యకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా చెక్ పెట్టనుంది. ప్రతి మండలంలోని మురుగు కాల్వల్లో పూడిక తీయడంతో పాటు కాల్వల పక్క పెద్దస్థాయిలో పెరిగే పిచ్చి మొక్కలను తొలగించడానికి డివిజన్‌కు ఒకటి చొప్పున బాబ్‌కాట్ మిషన్లను గ్రామాలకు అందుబాటులో ఉంచనుంది. దీనికి తోడు.. గ్రామాల్లో సాధారణ మురుగు తొలగించడానికి మండలానికి ఒకటి చొప్పున మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టరు నడపడం వచ్చినవారు ఈ మిషన్ ద్వారా రోజుకు 6–8 కి.మీ. పొడవున మురుగు కాల్వలను శుభ్రంచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటిద్వారా మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఏడాదికి కనీసం రెండు మూడు సార్లు మురుగుకాల్వలన్నింటినీ శుభ్రం చేయించనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 660 మిషన్లను గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉంచనుంది. ప్రతీ పంచాయతీకి టాయిలెట్ క్లీనర్ గ్రామంలో ఉండే కమ్యూనిటీ టాయిలెట్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసేందుకు ప్రతి గ్రామ పంచాయితీకి ఒక హైపవర్ టాయిలెట్ క్లీనర్ మిషన్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అందజేయనుంది. బ్యాటరీ ద్వారా పనిచేసే ఈ మిషన్‌ను సాధారణ నైపుణ్యం ఉండే ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 13,371 గ్రామ పంచాయితీలకుగాను ప్రస్తుతం 2,640 చోట్ల ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన పంచాయితీల్లోనూ వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఫాగింగ్ మిషన్లతో దోమల నివారణ ఇక గ్రామాల్లో దోమల నివారణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ఫాగింగ్ మెషీన్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం 2,743 గ్రామాల్లో ఇప్పటికే ఇవి అందుబాటులో ఉండగా, మిగిలిన 10,628 గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
పట్టణాలకు దీటుగా పల్లెలు
సాక్షి, అమరావతి: పట్టణాలకు దీటుగా పల్లెల్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు ముందుండి పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వంద రోజులపాటు చేపట్టే ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఆ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక శంఖారావం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్డీ దుర్గాప్రసాద్‌లు తాడేపల్లి కమిషనర్ కార్యాలయం నుంచి పాల్గొనగా.. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆయా మండలంలో సర్పంచులందరూ ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ తపిస్తున్నందున ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 పల్లెలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని పెద్దిరెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,371 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరారు. పరిశుభ్రతతో 95 శాతం అంటువ్యాధులు తగ్గాయి గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు 95 శాతం తగ్గినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని సర్పంచ్‌లకు సూచించారు. 11,412 మంది సర్పంచులకు చెక్ పవర్.. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 11,412 మంది సర్పంచులకు సోమవారం నాటికి చెక్ పవర్ బదలాయింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,680 మందికీ ఒకట్రెండు రోజులలోనే బదలాయించనున్నట్లు తెలిపారు. అలాగే, పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేశామన్నారు. మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్‌లు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. కాగా, వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి సర్పంచ్ ఇందిరెడ్డి స్వాతి, కర్నూలు జిల్లా ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష, నెల్లూరు జిల్లా జమ్మలపాలెం సర్పంచ్ బి. శ్రీదేవి, ప్రకాశం జిల్లా జువ్వలేరు సర్పంచ్ ఎస్. సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. రీచ్‌ల నుంచే నేరుగా జగనన్న కాలనీలకు ఇసుక విజయవాడలో మంత్రి పెద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేరుగా రీచ్‌ల నుంచే జగనన్న కాలనీల్లో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రవాణా చార్జీలు తగ్గడంతోపాటు డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లే హ్యాండ్లింగ్ చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. లేనిపక్షంలో వీటిని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. కడుతున్న ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా, వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. నెలాఖరులోపు ఈ సీజన్‌కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు. -
5 సంవత్సరాల్లో గ్రామాల్లో పరిశుభ్రత, మంచినీటికి 6,140 కోట్లు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మెరుగైన పరిశుభ్రత, మంచినీటి సరఫరా సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో భారీగా నిధులు వెచ్చించనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.6,140 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అదనంగా ఇతర కార్యక్రమాలు, పథకాల నిధులను వీటికి జతచేసి ఈ అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిబంధనల్లో మార్పులు తేనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. 60 శాతం నిధులు.. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఏటా కేటాయించే నిధుల్లో 60 శాతం పరిశుభ్రత, మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలని ముసాయిదాలో పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ప్రతి గ్రామంలో ఏడాది పొడవునా తాగునీటి లభ్యత సౌకర్యాల కల్పన, రోజూ ప్రతి ఇంటికీ నీటి సరఫరాకు మౌలిక వసతుల ఏర్పాటు, పర్యవేక్షణ, రహదారులు, ఇతర ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, క్రమ విధానంలో చెత్త సేకరణ తదితరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ప్రతి గ్రామానికి ఐదేళ్ల ప్రణాళిక.. గ్రామంలో పరిశుభ్రత, మంచినీటి సరఫరా సౌకర్యాల కోసం ప్రతి పంచాయతీకి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులు, అదనపు సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందిస్తారు. తుపాన్లు లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. గ్రామసభలో ప్రణాళికపై చర్చించి తుది ఆమోదం తీసుకోవాలి. ప్రణాళికల అమలుకు సర్పంచ్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కమిటీని నియమించుకోవచ్చు. కమిటీలో మహిళలు, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు
బంజారాహిల్స్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలో వీర్‌నగర్, ప్రేమ్‌నగర్, బాపునగర్, ఎల్లారెడ్డిగూడ. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ తదితర ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ జోన్లలో జీహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు, పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. రోజువారి పర్యవేక్షణ కూడా అవసరం. ►పర్యవేక్షణ కరువు.. మేయర్ ►దృష్టిసారిస్తేనే ముందుకు.. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గత వారం రోజుల నుంచి సంబంధిత సిబ్బంది, అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. కనీసం అటువైపు తొంగిచూడటం లేదు. ►తాజాగా బుధవారం గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్ జోన్లో క్రిమి సంహారక స్ప్రే (ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని)ను చేయించారు. ఇదంతా రోజువారి కార్యక్రమం కాగా మేయర్ దృష్టిసారిస్తేనే సంబంధిత సిబ్బంది ఒక రోజుకు కదిలారు. మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ►శానిటైజేషన్ చేపట్టేందుకు ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ►ఇటీవల నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య డ్రైవ్ లు మాత్రం నిర్వహించారు. ►మైక్రో కంటైన్మెంట్ ఏర్పాటు చేసినట్లు కొంత మంది అధికారులకు సమాచారమే లేదని తెలుస్తుంది. ►మైక్రో డిపార్ట్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ నుంచి కానీ, ఉన్నతాధికారుల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు, సూచనలు జారీ కాలేదని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఒకరు స్పష్టం చేశారు. ►ఈ విషయంపై ఖైరతాబాద్ జోన్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బంది పర్యటించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ►ప్రజలు ఇష్టారాజ్యంగా బయట తిరగకుండా నిబంధనలు ఉండాలి. ►ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించిన తర్వాతనే రోడ్లపై తిరగాల్సి ఉంటుంది. ►నిత్యం హైడ్రో క్లోరైట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ►ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందని బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికులను అప్రమత్తం కూడా చేయాల్సి ఉంటుంది. ►ఇలాంటి ప్రోటోకాల్స్ ఏవీ మైక్రో ఈ జోన్లలో అమలు చేయడం లేదు. ►తమ నివాసిత ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందనే విషయమే అక్కడ ప్రజలకు తెలియదంటూ కోవిడ్–19పై అధికారులు ఎంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ►మాకు ఎలాంటి సూచన లేదు.. మేమేం చేయాలి.. ►సరైన సూచనలు, జాగ్రత్తలు లేకపోతే తాము మాత్రం ఏం చేయాలంటూ జీహెచ్ఎంసీ కింది స్థాయి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ►మేయర్ కదిలింది కాబట్టి ఒక రోజు స్ప్రే చేశారు. ►మరి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది అధికారులకే తెలియాలి. ►మైక్రో కంటైన్మెంట్ జోన్ అన్నది కాగితం మీదనే కనబడుతున్నదని క్షేత్రస్థాయిలో దాని జాడే లేదని స్థానికులు దుయ్యబడతున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో అసలు కర్ఫ్యూ ఉందా? ఓ యువతి ట్వీట్ ) -
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి
సాక్షి, అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్, రక్షిత మంచినీటి సరఫరాకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించామని చెప్పారు. రూ.1,486 కోట్ల ఖర్చుతో గ్రామాల్లో 1,944 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. బోర్వెల్ డ్రిల్లింగ్కు రూ.2,340 కోట్లు, పంపుసెట్లకు రూ.1,875 కోట్లు, విద్యుత్ పరికరాలకు రూ.1,500 కోట్ల మేర అంచనాలతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎస్సీ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, వాటర్‌షెడ్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కోసం తాపత్రయ పడే జీహెచ్ఎంసీలో వాస్తవ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. వరుసగా మూడో రోజు ఆకస్మిక తనిఖీల్లోనూ మేయర్‌కు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, అధ్వాన్నపు పారిశుధ్య పరిస్థితులు దర్శనమిచ్చాయి. చెత్త తీసుకువెళ్లేందుకు స్వచ్ఛ ఆటోల వాళ్లు రావడం లేదని పలు ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ప్రాంతాల్లో పారిశుధ్యం జరగడం లేదని నింబోలిఅడ్డాలోని ప్రజలు మేయర్ దృష్టికి తేగా, సంబంధిత ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)ను తొలగించాలని ఆదేశించడంతో అందుకనుగుణంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో.. మేయర్ గద్వాల విజయలక్ష్మి క్షేత్రస్థాయి పర్యటనలతో చెత్త సమస్యలపై ఇప్పుడు దృష్టి సారించినప్పటికీ, జీహెచ్ఎంసీ ఈ అంశాన్ని ఎంతోకాలంగా వదిలేసింది. క్షేత్రస్థాయిలో ఈ పనులు నిర్వహించాల్సిన డీసీలు, ఏఎంఓహెచ్‌లు, ఎస్‌ఎఫ్‌ఏలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పట్టు లేకుండా పోయింది. దాంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. పేరుకు బయోమెట్రిక్ హాజరైనప్పటికీ, ఏ ఒక్కరోజు కూడా పారిశుధ్య సిబ్బంది టీమ్స్‌లోని సభ్యులందరూ హాజరు కారు. ఇవన్నీ పైస్థాయిలోని వారికి తెలియక కాదు. తెలిసినా పట్టించుకోలేదు. కేవలం స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం.. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరానికి తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చర్యలతో వారిని ఆకట్టుకునే పనులు చేస్తున్నారు. అంతేకాదు.. పౌరస్పందన విభాగంలో మార్కులు పొందేందుకు ప్రజల బదులు జీహెచ్ఎంసీ సిబ్బందే, అసలు విధులు పక్కనపెట్టి ఫీడ్‌బ్యాక్ పంపించారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ర్యాంకుల సర్టిఫికెట్లపై చూపే మోజులో నాలుగోవంతైనా వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తే ప్రజలకు చెత్త సమస్యలు తప్పుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేసినా ఉన్నతస్థాయిలోని యంత్రాంగం పట్టించుకోకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ చదవండి: అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు హైదరాబాద్ సిటీ బస్సులు తిరిగేది ఇక ఈ సమయంలోనే! -
పారిశుద్ధ్యంపై జనచైతన్యం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై స్థానిక ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోలిస్తే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మలేరియా వ్యాధులు సగానికి పైగా తగ్గగా.. డెంగీ, డయేరియా తదితర వ్యాధులు దాదాపు 20 శాతానికే పరిమితమయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రజాచైతన్యాన్ని మరింత పెంచడం ద్వారా గ్రామాల్లో అంటువ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు ఆ శాఖ నడుంకట్టింది. ► మనం – మన పరిశుభ్రత పేరుతో పంచాయతీరాజ్‌శాఖ రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామాల్లోనూ విడతల వారీగా సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తారు. ఇప్పటికే మొదటి విడతలో 1,320 గ్రామాల్లో , రెండో విడతలో 4,740 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ► దీనికి తోడు ప్రజాచైతన్యం కోసం సోషల్ మీడియాను ఉపయోగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2.70 కోట్ల వరకు జనాభా ఉన్నట్లు అంచనా. వీరిలో కోటిమందికిపైగా ఇంటర్నెట్ వసతితో కూడిన మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించింది. వీరిలో 66 లక్షల మంది ఫేస్బుక్, వాట్సాప్‌లను, 40 లక్షలమంది ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ► పరిసరాల అపరిశుభ్రత కారణంగా సంక్రమించే వ్యాధులు, ఫలితంగా కలిగే ఆర్థికభారం, సంపూర్ణ పారిశుద్ధ్యం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ స్క్రీన్షాట్లను రూపొందించి గ్రామాల్లో మొబైల్ ఫోన్ల వినియోగదారులకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రాంతాల వారీగా సబ్ గ్రూపుల రూపకల్పనకు ఆలోచిస్తున్నారు. ► గ్రామీణ ప్రాంతానికి ఎక్కువగా సంబంధం ఉండే ఉన్నత పా´ఠశాలలు, జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు ఇతరత్రా చురుగ్గా ఉండే వారిని వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపట్టే చర్యల్లో భాగస్వాముల్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
ముంపు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి: తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన 112 గ్రామాలకు ప్యాకెట్లు, క్యాన్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ సరఫరా చేస్తోంది. పాక్షికంగా నీట ముంపునకు గురైన వాటితో కలిపి మూడు జిల్లాల్లో 330 గ్రామాల వరకు వరద నీటి ప్రభావం ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డిలు మంగళవారం సాయంత్రం మూడు జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలు, ఎస్ఈలు, ఇతర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ► ముంపు గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 4.86 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 20 లీటర్ల సామర్ధ్యం కలిగిన 1,160 క్యాన్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 ట్యాంకర్లను గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలకు ఇప్పటికే తరలించింది. ► ముంపు గ్రామాల్లో డయేరియా, మలేరియా, అంటు వ్యాధులు ప్రబలకుండా ఆయా గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాల ఓవర్‌హెడ్ ట్యాంకులు, బోర్ల నీటిని రెండు, మూడు రోజుల పాటు తాగొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించాలి. ► ముంపు గ్రామాల్లో ప్రతి బోరు, బావి నుంచి నీటి శాంపిల్స్ సేకరించి, అవి తాగునీటి అవసరాలకు పనికి వస్తాయా లేదా అని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి, ప్రతి రోజూ క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలి. ► తాగడానికి పనికొస్తాయని నిర్ధారణ అయిన బోర్లను గుర్తించి, వాటిలోని నీటిని మాత్రమే వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజెప్పాలి. ► ఆయా ప్రాంతాల్లో నీరు పూర్తిగా గ్రామం నుంచి వెళ్లగానే పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా చేపట్టాలి. ► మేట వేసిన మట్టిని తొలగించి బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ చల్లాలి. ► రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఎక్కడైనా రోడ్లపై చెట్లు విరిగిపడితే, వాటిని వెంటనే తొలగించాలి. -
ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్ రవాణా
కోల్‌కతా: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ దేశంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రల్లో ప్రజా రవాణా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో బస్సులను శానిటైజ్ చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సు మొదలైనప్పుడు తప్ప మరెక్కడ బస్సును శానీటైజ్ చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. పశ్చిమ మిడ్నపూర్‌లో జిల్లా మేజిస్టేట్ బస్సులను శానిటైజ్ చేయాలని ఆదేశించినప్పటికీ బస్సు యజమానులు ఖాతరు చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లకు, కండక్టర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. (చదవండి: కరోనా మృతులకు 10 లక్షలు.. ఉద్యోగం) దీంతో మిగిలిన వారు కూడా విధులకు రావడానికి సంకోచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో బస్సులు ఆగిపోయాయి. కరోనా పాజిటివ్ సోకిన ఒక కండక్టర్ 30 మంది ఇతర సిబ్బందితో కలిసి ఉండటం కలకలం రేపింది. ఈ విషయం గురించి ప్రైవేట్ బస్సు యజమానులు మాట్లాడుతూ.. బస్సుకు 20 మందినే అనుమతించడం వల్ల తమకు చాలా నష్టం వస్తుందని, ఇక శానిటైజర్లు వాడటం, బస్సులను శానిటైజ్ చేయించడం అంటే తమ వల్ల కాదని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ సిన్హా స్పందిస్తూ.. ‘బెంగాల్లో బస్సు సదుపాయాలను కల్పిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సిబ్బందికి ఇప్పటి వరకు సరైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు కూడా ఇవ్వలేదు’ అని ఆయన ఆరోపించారు. (చదవండి: కరోనా కట్టడికే ఆన్లైన్ ప్రజావాణి) -
నేటినుంచి గ్రేటర్ శానిటేషన్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై నేటినుంచి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సీఎం కేసీఆర్ సూచనలకనుగుణంగా జూన్ 1 నుంచి (సోమవారం) 8వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా రోడ్ల వెంబడి, ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారాన్ని తొలగించనున్నారు. నాలాలు, నీటి నిల్వ ప్రాంతాల్లో డీసిల్టింగ్, పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్కను, రహదారులు, ఓపెన్ ప్లాట్లలోని కన్స్ట్రక్షన్, డిమాలిషన్ వ్యర్థాలు తదితరాలను తొలగించనున్నారు. ఆయా కార్యక్రమాల అమలు కోసం వార్డుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాల కోసం అన్ని వార్డులనూ మ్యాపింగ్ చేయడంతో పాటు తగినన్ని వాహనాలను సమకూర్చి అవసరమైన సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాలను డిప్యూటీ, జోనల్ కమిషనర్లు పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని, అవసరానికనుగుణంగా అదనపు సిబ్బంది, వాహనాలను సమకూర్చనున్నట్లు కమిషనర్ తెలిపారు. నిరాడంబరంగా అవతరణ వేడుకలు జూన్ 2వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ తదితర కార్యక్రమాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నిర్వహించాలని కమిషనర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. కోవిడ్– 19 నివారణ నిబంధనలకనుగుణంగా మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజింగ్ స్ప్రే, శానిౖటైజర్లు అందుబాటులో ఉంచడం వంటివి అమలు చేయాలన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు పతాకావిష్కరణ చేయాలని సూచించారు.