అదుపులోకి రాని అతిసార | diarrhea Do not fall under control | Sakshi
Sakshi News home page

అదుపులోకి రాని అతిసార

Published Sat, Aug 20 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

అదుపులోకి రాని అతిసార

అదుపులోకి రాని అతిసార

బాన్సువాడ  : బాన్సువాడ పరిధిలో పక్షం రోజులుగా అతిసార అదుపులోకి రావట్లేదు.  ప్రతిరోజు సగటున 70 మందికి పైగా అతిసార రోగులు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే  అతిసారతో బీర్కూర్‌ మండలం దుర్కిలో ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆ గ్రామంలో అతిసారతో గంగవ్వ (50), మురళి (24) మృత్యువాత పడ్డారు. జూలైలో అతిసారతో చికిత్సపొందిన వారు సుమారు 1500మంది ఉండగా, ఆగుస్టులో ఇప్పటికే 1500కి పైగా అతిసారకు గురయ్యారు. 
పారిశుధ్యలోపమే కారణం..
గ్రామాల్లో పారిశుధ్య లోపం, కలుషిత నీటిని తాగడమే అతిసార ప్రబలడానికి ప్రధాన కారణం. బాన్సువాడ, బీర్కూర్, నిజాంసాగర్, పిట్లం మండలాల నుంచి అధికంగా రోగులు వస్తున్నారని తెలుస్తోంది. గతేడాది బాన్సువాడ ప్రాంతంలో సుమారు 8మందికి డెంగీ సోకిన విషయం విదితమే. వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం కలుషిత నీరు, దోమలు, పందులు. కలుషిత నీటి వల్ల డయేరియా ప్రబలుతోంది. పందులు, దోమల వల్ల జ్వరం, డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా వంటి రోగాలు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో అస్తవ్యస్తమైన మురికికాలువలు, చెత్తచెదారమే ఈ రోగాలకు కారణం.  బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్నీ మండలాల్లో మారుమూల గ్రామాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. కోనాపూర్, హాన్మజిపేట, ఇబ్రాహింపేట, బరంగేడ్గి, హంగర్గ తదితర గ్రామాల్లో పారిశుధ్యం గురించి పట్టించుకొనేవారు కరువయ్యారు. 
పట్టించుకోని అధికారులు
ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేసుకుని వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్య శాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దుర్కిలో గత వారం రోజులుగా అతిసార రోగులు ఇబ్బందుల పాలవుతున్నా, గ్రామ పంచాయతీ అధికారులు పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టలేదు.  అలాగే గ్రామాల్లో మంచినీరు అందించడంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు విఫలమవుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ వారిపై పర్యవేక్షణ కరువవడంతో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారు.  
మరుగుదొడ్ల పథకం ఎటుపోయింది..
 గ్రామాల్లో  బహిరంగ మల విసర్జన పారిశుధ్య నివారణ ^è ర్యల్లో తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తోంది. నీరు కాలుష్యం కావడానికి ఇది కారణమవుతోంది.  ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఏదో మారు మూల ప్రాంతంలో ఇలా బహిరంగ మ విసర్జన జరుగుతుంటే అధికారులకు తెలియలేదని అనుకోవచ్చు. కానీ మండల కేంద్రాల్లో, మేజర్‌ గ్రామ పంచాయతీల్లోనే బహిరంగ మల విసర్జన జరుగుతోంది.  దీంలో అపారిశు«ధ్యం నెలకొంటోంది. ప్రజలు అంటురోగాల బారిన పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement