తడి, పొడి చెత్త కలిపి రిక్షాలో వేస్తున్న పారిశుధ్య సిబ్బంది
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరి« దిలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కరువైంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌కు తరలించాలనే లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసిన నగరపాలక సంస్థ ఆ తర్వాత పర్యవేక్షణ మరిచింది. తడిచెత్త, పొడి చెత్త రెండూ ఒకే డబ్బాల్లో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చెత్తను ఎక్కడికక్కడే తగ్గించడానికి అమల్లోకి తీసుకొచ్చిన విధానం స త్ఫలితాలివ్వడం లేదు. ప్రతీ ఇంటికి రెండు డబ్బాలు ఇ చ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి రిక్షాలకు ఇవ్వాలని ప్రచా రం చేశారు. రిక్షాల ద్వారా కూడా తడి, పొడి వేరు చేసేం దుకు వాటికి కూడా డబ్బాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
వేరు చేయకపోవడంతో ఇబ్బందులు
చెత్తను వేరు చేసేందుకు రెండు రకాల డబ్బాలు ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి స్పందన రావడం లేదు. తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగానే చెత్త డంప్‌యార్డుకు చేరుతుంది. దీంతో డంపింగ్‌యార్డు పూర్తిగా నిండింది. ఇటీవల పలుమార్లు అగ్నిప్రమాదం జరిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. తడి చెత్తను వర్మీ కంపోస్టు యార్డుకు తరలించడం, పొడి చెత్తను పాత సామగ్రి కింద కా>ర్మికులు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇదంతా చెత్త సేకరణ సమయంలోనే చేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్త తగ్గుతోంది.
తడి, పొడి ఒకే డబ్బాలో..
నగరంలోని కొన్ని డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి రిక్షాలకు డబ్బాలు అమర్చారు. ఇంటి యజమానుల దగ్గర ఉన్న వేర్వేరు డబ్బాల్లో తడి, పొడి చెత్తను వేసి రిక్షాల్లో ఉన్న డబ్బాలలోనే తడి, పొడి చెత్తను వేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త సేకరణకు నగరపాలక సంస్థ అన్ని డివిజన్లకు డబ్బాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క డబ్బాకు రూ.120 ఖర్చుచేసి ఇస్తుండగా ఇంటి యజమానులు తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో స్వచ్ఛసర్వేక్షణ్ లక్ష్యం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా అధికారులు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి వేర్వేరుగా సేకరిస్తే డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment