Karimanagar
-
కరీంనగర్లో హీట్ పాలిటిక్స్.. మేయర్‌కు గంగుల సవాల్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మేయర్ సునీల్ రావు అత్యంత అవినీతిపరుడు. ఈ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో వివరాలు వెల్లడిస్తాను. అవినీతిని బయటపెడతాను అంటున్న సునీల్ రావే ఈ ఐదేళ్లు దోపిడీ చేశాడు. అతడికి పార్టీలు మారడం అలవాటు. ఆయనతో ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లడం లేదు. నాపై అవినీతి ఆరోపణలు చేశారు కదా.. ఏ విచారణకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. దీంతో, జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.ఇదిలా ఉండగా.. పార్టీ మార్పుపై మేయర్ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. బండి సంజయ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నాను. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురేస్తాం. నా వెంట రెండు వేల మంది కార్యకర్తలు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో జాయిన్ అవుతున్నారు. నేను మొదట ఏబీవీపీ కార్యకర్తనే. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే నాకు మేయర్ పీఠం దక్కింది. కాంగ్రెస్‌లో చేరాలని కూడా చాలా మంది కోరారు. నన్ను మేయర్ పీఠంపై కూర్చోకుండా చాలామంది స్థానిక నాయకులు అడ్డుపడ్డారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
దాయ్ యాప్ పేరుతో ఘరానా మోసం
-
భారీ వరదతో పెరుగుతున్న మిడ్ మానేరు నీటి మట్టం
-
కేటీఆర్‌కు అస్వస్థత.. ‘కదన భేరి’కి దూరం
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆయన బీఆర్ఎస్ కరీంనగర్ సభకు దూరంగా ఉంటారని తెలిపింది. ఇవాళ కరీంనగర్లో కదన భేరి పేరుతో బీఆర్ఎస్ సభ నిర్వహించనుంది. ఈ సభ నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధినేత కేసీఆర్ పూరించనున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్కు కరీంనగర్ సెంటిమెంట్ ఎక్కువ. దీంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటి సభకు అనారోగ్యంతో కేటీఆర్ హాజరు కాలేకపోతుండడం విశేషం. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్ గారు గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన… — BRS Party (@BRSparty) March 12, 2024 మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం తర్వాత కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని.. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. -
కరీంనగర్లో ఆపరేషన్ బంటి సక్సెస్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మానుకొండూరులో అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ బంటి సక్సెస్ అయ్యింది. మత్తు మందు ఇచ్చి ఎలుగును బంధించిన అధికారులు చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం మానకొండూరు హనుమాన్ టెంపుల్ వద్ద ఎలుగుబంటి ఓ ఇంట్లోకి చొరబడింది. అనంతరం, వీధి కుక్కలు ఎలుగుబంటిని తరమడంతో అది పరుగులు తీసి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో గ్రామస్తులు.. పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఎలుగును బంధించే ప్రయత్నం చేశారు. అయితే అది చిక్కకుండా తప్పించుకుంది. మానకొండూరు చెరువువైపు ఉన్న పొదల్లోకి ఎలుగు పారిపోయింది. దీంతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ జరిపి.. మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు దానిని బంధించారు. -
మద్యం తాగి.. పలుమార్లు రైతు పైనుంచి ట్రాక్టర్ని.. ఘోర విషాదం..
పెద్దపల్లి: మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా కొందరు వినడం లేదు. మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఓ రైతును బలితీసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబారిపేటకు చెందిన ముడిమడుగుల పోచయ్య(50) తన వ్యవసాయ పొలం దున్నడానికి మంగళవారం అదే గ్రామానికి చెందిన జాడి బానయ్యను పిలిచాడు. అతను అతిగా మద్యం తాగి, ఆ మత్తులో ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్నాడు. వెనక ఉన్న పోచయ్యను గమనించకుండా వేగంగా నడపడంతో ట్రాక్టర్ అతన్ని తొక్కుకుంటూ వెళ్లింది. ఈ సంఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న బానయ్య పలుమార్లు ట్రాక్టర్‌ను మృతదేహం పైనుంచి తిప్పడంతో నుజ్జునుజ్జయి, తల, మొండెం, కాళ్లు, చేతులు వేటికవే పూర్తిగా తెగిపోయాయి. పొలం దున్నడం పూర్తయిన తర్వాత పోచయ్య కనిపించడం లేదని అతని కుమారుడు సతీశ్‌కు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు గ్రామంలో వెతకగా ఆచూకీ లభించలేదు. రాత్రి సమయంలో పొలంలో వెతకగా రక్తం, పోచయ్య శరీర భాగాలు కొద్దిగా కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు బుధవారం పొలంలో పూర్తిగా తెగిపడిన మృతుడి శరీర భాగాలను బయటకు తీయించి, పోస్టుమార్టం చేయించారు. పోచయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం తాగి, ట్రాక్టర్ నడిపి, పోచయ్య మృతికి కారణమైన బానయ్యపై కఠినచర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
మానకొండూరు: రసమయికి గట్టి పోటీనే!
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉన్నారు. డబుల్ బెడ్ రూం ఇచ్చే అంశంలో వెనుకడుగు, అలాగే 100 పడకల హాస్పిటల్ రాకపోవడం మైనస్ లుగా చెప్పవచ్చు. ► ఎస్సీలు 23శాతం ► బీసీలు 65 శాతం ► ఎస్టీలు 1 శాతం ► ఇతరులు 11 శాతం ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుండి: రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ నుండి: కవ్వంపెల్లి సత్యనారాయణ బీజేపీ పార్టీ నుండి: గడ్డం నాగరాజు దరువు ఎల్లన్న సొల్లు అజయ్ వర్మ కుమ్మరి శంకర్ బీఎస్పీ పార్టీ నుండి: నిషాణీ రామచంద్రం మాతంగి అశోక్ వీరందరూ బరిలో ఉండేందుకు సన్నద్ధం అవుతుండగా ప్రధాన పోటీలు మాత్రం రసమయి బాలకిషన్ (బిఆర్ఎస్), కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్), ఆరపెల్లి మోహన్ (బిఆర్ఎస్), ఓరుగంటి ఆనంద్ (బిఆర్ఎస్)గడ్డం నాగరాజు (బీజేపీ)దరువు ఎల్లన్న (బీజేపీ)ల మధ్య గట్టి పోటీ ఉంటదని తెలుస్తుంది. ఆయా పార్టీల నుండి ఇచ్చే టికెట్‌పై ఆధారపడి ఉంటుంది. -
కరీంనగర్: ఈసారి సర్వత్రా ఆసక్తి
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు.. రాజకీయ చైతన్యానికి కేరాఫ్.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో సరికొత్త అందాలను సంతరించుకుని సుందరంగా రూపుదిద్దుకుంటున్న నగరం.. ఇప్పుడీ నియోజకవర్గంలో గెలుపు గుర్రమెవ్వరనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం.. కరీంనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో స్త్రీ, పురుష, ఇతరుల నిష్పత్తి ఏవిధంగా ఉంది? ఏ ఏ సామాజికవర్గాలది పైచేయి ఇప్పుడు చూద్దాం. ► 40 వేల ఓట్లు మున్నూరు కాపులు ► 38 వేల ఓట్లు ముస్లిం మైనారిటీలు ► 22 వేల ఓట్లు పద్మ శాలీలు ► 29 వేల ఓట్లు ఎస్సీలు ► 14 వేల ఓట్లు ముదిరాజ్ ► 9 వేల ఓట్లు గౌడ ► 8 వేల క్రిస్టియన్ ఓట్లు 1957లో కరీంనగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి జువ్వాడి చొక్కారావు గెలిచారు. ఆ తర్వాత 5 సార్లు కాంగ్రెస్ అధిష్టానంలో నిలిచింది. ఇక నాలుగు సార్లు టీడీపీ, 2 సార్లు గులాబీ పార్టీలు ఇక్కడ సత్తా చాటాయి. హ్యాట్రిక్ విజయాలు సాధించిన జువ్వాడి చొక్కారావు అదే తరహాలో మూడుసార్లు మంత్రిగా గెలిచి మంత్రి పదవి చెపట్టారు. ఎమ్మెస్సార్, ముద్దసాని దామోదర్ రెడ్డి సరసన ప్రస్తుత మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ .. కానీ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తప్పలేదు 2009, 2014, 2018 లో వరుసగా గెలిచి... హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ రికార్డ్ సాధించారు. 2009లో 68738 ఓట్లు, 2014 లో 77209 ఓట్లు సాధించి గెలుపొందారు. 2018లో మాత్రం గంగుల, బండి సంజయ్‌ల మధ్య పోరు రసవత్తరంగానే సాగింది. గంగులకు 80, 983 ఓట్లు రాగా... బండి సంజయ్‌కి 66, 009 ఓట్లు, పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై కేవలం 14 వేల 974 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ టికెట్ బరిలో ఉండగా.. 4వ సారి సమరానికి సై అంటున్నారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా గంగుల కమలాకర్‌ను ఎంపీగా పోటీ చేయించాలన్న ఓ చర్చ దాదాపు ఊహాగానమేనని వినిపిస్తోంది. గంగులతో పాటు, అధికారపార్టీ బలాలు ఆర్థికంగా బలమైన నేత... మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పోరేటర్ల సంఖ్య 21 ఇందులో అధికార పార్టీ కార్పొరేటర్లు 19 గంగుల ప్రధాన బలం ప్రత్యమ్నాయా ప్రతిపక్షాలు లేకపోవటం నిత్యం ప్రజలతో మమేకం బలమైన క్యాడర్ బలహీనతలు నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండే కోటరీ. ప్రజలు ఆయనని నేరుగా కలిసే అవకాశం లేకపోవటం. తన సామాజిక వర్గాన్ని మాత్రమే ఎక్కువగా ప్రోత్సహిస్తారన్న అపవాదు. రూరల్, అర్బన్ నేతల కబ్జా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు. మునిసిపల్ కార్పొరేషన్ లో కమీషన్ల కక్కుర్తిపై ఆరోపణలు. బొమ్మకల్, కొత్తపల్లితో వంటి మేజర్ ప్రాంతాల్లోని కీలక నేతలతో ఈమధ్య సయోధ్య చెడటం. కులుపుకోవాలని చూసినా నివురుగప్పిన నిప్పులాగే కొనసాగుతున్న సంబంధాలు. ఎంఐఎం నేతలు పూర్తిగా వ్యతిరేకమవ్వటం. చేసిన పనులు కరీంనగర్ సిటీలో 14 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి. ఐటీ టవర్ నిర్మాణం. 234 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం. 600 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు. మెడికల్ కళాశాల మంజూరు. టీటీడీ దేవాలయం. కరీంనగర్ చుట్టూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి, కొత్తపల్లి వద్ద కాకతీయ కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయించి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించడం, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, ఏటా కరీంనగర్ మున్సిపాలిటీకి 100 కోట్ల నిధులు వచ్చేలా మూడేళ్ల నుంచి మంజూరు చేయించుకోవడం... స్మార్ట్ సిటీ, ఐలాండ్ లతో సుందరంగా నగరాన్ని తీర్చిదిద్దడం వంటివి ప్లస్. చేయని పనులు 24 గంటల నీటి సరఫరా విలీన గ్రామాల సమస్య డంప్ యార్డ్ ప్రధాన సమస్య ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేకపోవడం నగరంలో పార్కింగ్ సమస్య నూతనంగా గొప్పగా చెప్పుకున్న కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్స్ కుంగిపోవడం రక్షణ వాల్స్ కు బీటలు రావడం అధ్వానంగా అంతర్గత రోడ్ల పరిస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి కానీ దుస్థితి డబుల్ బెడ్ రూమ్ హామీ నెరవేర్చలేకపోవటం ప్రత్యర్థులు... బీజేపీ నుండి బండి సంజయ్, ఆయన రాజకీయ గురువు పొల్సాని సుగుణాకర్ రావు ఉన్నారు. బండి సంజయ్ కుమార్, అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో 14 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుండి ఎంపీ వరకు ఎదిగారు. బీజేపీ మూల సిద్ధాంతాల నుండి వచ్చిన ఏబీవీపీ, RSS విద్యార్థి స్థాయిలోనే పనిచేస్తున్నారు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు సంపాదించుకున్నారు. హిందూ ఏక్తా యాత్ర హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తూ 80% ఉన్న హిందువుల కోసం తమ పోరాటం అంటూ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. 2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 48వ డివిజన్ నుండి బిజెపి. కార్పొరేటర్ గా మూడుసార్లు గెలిచాడు. సంజయ్ రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 52455 ఓట్లు సాధించారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్‌పై 66009 ఓట్లు సాధించి 14,000 పైగా ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్నారు బండి. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2018 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో 14 వేల ఓట్ల ఓటమి చవిచూసిన తర్వాత సానుభూతి పవనాలు బలంగా వీచాయి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుహ్య విజయం సాధించారు. అగ్ర నాయకుల దృష్టిలో పడ్డ బండి సంజయ్‌ని ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి పార్టీ పగ్గాలాయన చేతిలో పెట్టారు. ఆ తర్వాత ఆయన మూడు విడుతలగా జరిపినటువంటి మహా సంగ్రామ పాదయాత్ర బిజెపికి కొత్త ఊపును తెచ్చిపెట్టింది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచి తన మార్కు నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ మునుగోడు ఓడిపోవడంతో సీనియర్లతో వచ్చిన వర్గ విభేదాలు పదవీకాలం ముగియడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని మరో కీలక పదవైన జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావడంతో నూతనోత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ.. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌కు డిమాండ్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్ వంటివారు టికెట్ ఆశిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ : పొన్నం ప్రభాకర్ గతంలో కాంగ్రెస్ రెబెల్ గా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆ తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన పొన్నం ప్రభాకర్ కెరీర్లోనే అత్యుత్తమ స్థాయి గ్రాఫ్ అందుకున్నాడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఫోరం కన్వీనర్ గా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. తెలంగాణ వాదిగా ముద్ర వేసుకున్నాడు. మరోసారి ఆయన బరిలో ఉంటారా? ఉండరా? అనే అంశంపై క్లారిటీ ఇవ్వట్లేదు? మేనేని రోహిత్ రావు : కరుడు గట్టిన కాంగ్రెస్ వాది... మాజీ మంత్రి ఎమ్మెస్సార్...మనవడు రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు... కరీంనగర్ కార్పొరేషన్ లోని పారిశుద్యం, 1000 కోట్ల కుంభకోణం, స్థానిక సమస్యలతో పాటుగా రైతాంగ సమస్యలు ధాన్యం కొనుగోలు అంశాలపై మంత్రిని టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్ సభతో పాటుగా కరీంనగర్లో రేవంత్ రెడ్డి సభకి పూర్తిస్థాయిలో అన్ని తానై నిర్వహించాడు.... వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా కృషి చేస్తున్నారు. కొత్త జైపాల్ రెడ్డి... ట్రేండింగ్ లో ప్రముఖ వ్యాపారవేత్త, మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ కూడా ప్రిపేర్ అయింది. బీజేపీ లో వెళ్తారన్న టాక్ వినిపించినా ఎందుకో ఆగిపోయింది. గంగులకు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ మైనారిటీ వర్గాలు సపోర్ట్ చేస్తూ చెబుతున్నాయి. 1996 లో తెలుగుదేశం రాజకీయ అరంగేట్రం చేసిన జైపాల్ రెడ్డి 1999 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత కు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఉన్నారు. 2005, 2013 లో సింగిల్ విండో చైర్మన్ గా గెలిచిన జైపాల్ రెడ్డి...2010 లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేశారు. 2013లో పొలిటికల్ గాడ్ ఫాదర్ నాగం జనార్దన్ రెడ్డి తో సహా రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీ లో చేరారు. 2018 లో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ చొప్పదండి అభ్యర్థి మేడిపల్లి సత్యం గెలుపుకు కృషిచేశారు. జైపాలన్న మిత్ర మండలి పేరుతో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించారు. గోల్డెన్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుండి అంబటి జోజిరెడ్డి బరిలో ఉంటామని చెబుతున్నారు. గతంలో తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేసిన అంబటి. కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జిగా పార్టీకి సేవలందించారు. ఏఐఫ్ బి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. -
కరీంనగర్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను ప్రధాన మంత్రి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌తో పాటు పెద్దపెల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ల రిన్నోవేషన్కు శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించిన కార్యక్రమంలో ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అధికారుల తీరుపై సంజయ్ మండిపడ్డారు. ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘అధికారిక కార్యక్రమానికి అధికారులు ఎందుకు రాలేదు. ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదే...?.. రావొద్దని ఎవరైనా బెదిరించారా..? అని ప్రశ్నించారు. ఎవరొచ్చినా, రాకున్నా కేంద్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని, కరీంనగర్ –హసన్ పర్తి రైల్వే లేన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కరీంనగర్ –తిరుపతి రైలును ప్రతిరోజు నడిచేలా రైల్వే మంత్రిని ఒప్పిస్తానన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తోందని.. అతి త్వరలోనే కరీంనగర్ రైల్వే స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు 5 వేల కోట్ల రూపాయలతో కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 95.6 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తవగా.. 178 కి.మీల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. రూ. 1374 కోట్లతో 151 కిలోమీటర్ల మేరకు మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. చదవండి ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్ వర్సెస్ సర్కార్‌గా సాగుతున్న వివాదం -
వెలమ Vs కాపు: బీఆర్ఎస్ సీనియర్‌కు వ్యతిరేక పవనాలు..
రాజకీయాలు సహజంగా పార్టీలవారీగా నడుస్తుంటాయి. కానీ.. తెలంగాణలో ఒక జిల్లాలో పార్టీల కంటే సామాజికవర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడ పార్టీలు ఒక భాగమైతే.. సామాజికవర్గాలు మరో భాగంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజికవర్గం నేతలు అన్ని పార్టీల్లోని తమవారు గెలవాలని కోరుకుంటారు. ఎవరిని ఎలా గెలిపించాలా? ప్రత్యర్థి సామాజికవర్గాన్ని ఎలా దెబ్బ తీయాలా అని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంతకీ ఆ జిల్లా ఏది అంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆది నుంచీ వెలమ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా అధికంగా ఉన్న మున్నూరు కాపు వర్గం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మరోసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం అందరి కంటే ముందుగానే సిద్దమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే వినోద్‌కు దెబ్బ పడిందో ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఇందుకోసం సామాజికవర్గ లెక్కలు వేస్తున్నారు స్థానిక నాయకులు. వెలమ వర్సెస్ కాపు.. బోయినపల్లి వినోద్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని భరించలేకే మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మున్నూరు కాపు వర్సెస్ వెలమ సామాజికవర్గం మధ్య గ్యాప్ కొనసాగుతోంది. గతంలో వెలమ సామాజికవర్గం వారే కరీంనగర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించడంతో.. వెలమ సామాజికవర్గానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలో... పార్లమెంట్ సెగ్మెంట్లో వినోద్‌తో పాటు.. కరీంనగర్ అసెంబ్లీలోనూ ఆ సామాజికవర్గాలకు సందు ఇవ్వొద్దనే రీతిలో మరి కొన్ని సామాజికవర్గాలు.. ఏకంగా పార్టీలకతీతంగా కంకణం కట్టుకోవడం.. కరీంనగర్లో కనిపించే విభిన్న రాజకీయ తంత్రం. వినోద్ డామినేటింగ్ శైలి.. రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతివ్యూహాలుగా భావించే రోజుల్లో.. నేతల స్వయంకృతాపరాధాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు.. అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులకూ అడ్వాంటేజ్‌గా మారుతాయి. గత పార్లమెంట్ ఎన్నికలే అందుకు నిదర్శనం. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేసినా తనను ఓడించారని మాజీ ఎంపీ వినోద్ భావిస్తుండగా.. ఎన్ని చేశామన్నది కాదు.. ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చేశారా అని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేశారు. పైగా ప్రస్తుతం అధికారంలో లేనప్పుడే వినోద్ శైలి డామినేటింగ్‌గా ఉందని ఫీలవుతున్న కొందరు కీలక ప్రజాప్రతినిధులు.. మరోసారి ఎంపీగా గెలిస్తే.. ఇక తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే భావన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. కరీంనగర్ రాజకీయాల్లో ఒక పార్టీవారంతా ఒకే తాటిపైన ఉన్నారనుకుంటే పొరపాటే. ఒక సామాజికవర్గం వారైతే మాత్రం కచ్చితంగా ఒక్క తాటిపైనే ఉన్నట్టు సామాజిక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనేకంటే.. ఏ సామాజికవర్గానిది పైచేయి అవుతుందని మాట్లాడుకోవాల్సిన భిన్నమైన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ మార్చిన ఒవైసీ! -
పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు
సాక్షి, కరీంనగర్: కవల ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే అన్నీ అయి చదివించారు. వాళ్ల శ్రమ వృథా కాలేదు. ఆ కవలలిద్దరూ ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లెంకి వీరేశంకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్లో ఔట్‌సోర్సింగ్‌లో ఎల్రక్టానిక్స్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 16 ఏళ్ల క్రితం కవితకు ఏడో నెల సమయంలో డెలివరీ కోసం భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. కవల కూతుళ్లు పుట్టడంతో ఇక్కడే వదిలేశాడు. దీంతో అప్పటినుంచి వారి ఆలనపాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూస్తున్నారు. శర్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రయివేటు స్కూల్లో, 6వ తరగతి నుంచి మోడల్‌సూ్కల్‌లో చదివారు. బుధవారం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో ఇద్దరూ 10 జీపీఏ సాధించారు. ‘అమ్మమ్మ, తాతయ్యలు, ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతోనే 10 జీపీఏ సాధించాం’ అని శర్వాణి, ప్రజ్ఞాని చెప్పారు. చదవండి: టెన్త్‌లో 86.60% పాస్ -
‘ఆలీబాబా నలభై దొంగల్లాంటి మంత్రి మండలి.. కేసీఆర్ పాలన ఇదే!’
సాక్షి, కరీంనగర్: పోలీసులు తెలంగాణాలో సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌లదీ అదే దుస్థితి అని మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఒక పార్లమెంట్ సభ్యుడిని ఎలాంటి నోటీస్, వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. అయినా న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తెలంగాణా యువత కోసం పోరాటం చేసినందుకు సంజయ్‌ను అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని తరుణ్ చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనాగరిక, ఆటవిక పాలన కొనసాగుతోందని, ఒక లోక్ సభ సభ్యుడికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని సూటిగా ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఓ ఆతంకవాది తరహాలో ఓ పార్లమెంటేరియన్‌ను అరెస్ట్ చేసిన విధానం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో కేసీఆర్ పాలనపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఆలీబాబా నలభై దొంగల్లాంటి మంత్రి మండలిని పెట్టుకుని నియంతృత్వ పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీ మాఫియా వెనుక ఎవరున్నారో కేసీఆర్ చెప్పాలని, ఆ కింగ్ పిన్ ఎవరో బయటపెట్టాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. -
పల్లెల్లో ‘సహారా’ కలకలం.. నాలుగేళ్లలో రెండింతలిస్తామంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘సహారా’డిపాజిట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. సహారా బ్యాంకు పేరిట సేకరించిన ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు తీరినా సొమ్ము చెల్లించకపోతుండటంతో డిపాజిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సహారా ఏజెంట్లను నిలదీస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇల్లు, స్థలాల కొనుగోలు, కుటుంబ అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని.. ఇప్పుడు సొమ్ము రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సంస్థలో పలు ఆర్థిక సమస్యల కారణంగా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, సొమ్ము వస్తుందని ఏజెంట్లు పైకి సర్ది చెప్తున్నా.. లోపల వారు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే సంస్థలో పనిచేసే ఓ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఇంటి నష్ట పరిహారం పైసలు డిపాజిట్ చేశా.. మిడ్‌మానేరు కింద అనుపురంలో ముంపునకు గురైన ఇంటి నష్ట పరిహారం కింద వచ్చిన రూ.4.70 లక్షలను సహారాలో డిపాజిట్ చేశాను. ఏజెంట్లు 5 ఏళ్ల 4 నెలల్లో రెట్టింపు డబ్బులు వస్తాయన్నారు. గడువు ముగిసి 16 నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇప్పించాలి. – తాండ్ర రజిత, అనుపురం, సిరిసిల్ల జిల్లా అప్పుచేసి బిడ్డ పెళ్లి చేయాల్సి వచ్చింది మాది బిహార్. 30 ఏళ్ల కింద సిరిసిల్లకు వచ్చి స్థిరపడ్డాం. వేములవాడ, సిరిసిల్లలోని సులభ్ కాంప్లెక్స్‌లను కాంట్రాక్టు తీసుకొని పనిచేయిస్తున్నాను. ఏడేళ్ల కింద సహారా ఏజెంట్లు వచ్చి రూ.4.40 లక్షలు ఎఫ్డీ చేస్తే 5 ఏళ్ల 4 నెలలకు రూ.10 లక్షలు వస్తాయని చెప్పి డిపాజిట్ చేయించుకున్నారు. గడువు దాటి 17 నెలలు అయినా డబ్బివ్వలేదు. నా బిడ్డ పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చింది. – సునీల్ మిశ్రా, సిరిసిల్ల దాదాపు ఏడాదిన్నర నుంచి.. ఐదున్నరేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పడంతో చాలామంది తమ కష్టార్జితాన్ని సహారాలో డిపాజిట్ చేశారు. కొందరు ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేస్తే.. చాలా మంది వారానికోసారి, నెలకోసారి కట్టే రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ)గా పొదుపు చేశారు. వీరిలో చాలా వరకు కూలీలు, పేదలే. చివరిలో పెద్దమొత్తంలో సొమ్ము చేతికి అందుతుందని ఆశపడ్డవారే. సహారా సంస్థ ఏజెంట్లు గ్రామాల్లో పర్యటిస్తూ.. తమకున్న పరిచయాలతో డిపాజిట్లు సేకరిస్తున్నారు. కొన్నిరోజులుగా డిపాజిట్లు మరింత పెంచేందుకు నాలుగేళ్లలోనే సొమ్ము డబుల్ అవుతుందని చెప్తున్నట్టు తెలిసింది. అయితే దాదాపు ఏడాదిన్నరగా డిపాజిట్లను తిరిగి చెల్లించడం లేదని.. గత ఏప్రిల్ నుంచి మొత్తంగా రావడం లేదని డిపాజిటర్లు చెప్తున్నారు. దీనితోపాటు డిపాజిటర్లు నెలనెలా చెల్లించే మొత్తానికి వారి పేరున కాకుండా ఏజెంట్ పేరుతో రశీదులు ఇవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై ఏజెంట్లను నిలదీయగా.. సంస్థకు సంబంధించిన పలు కారణాలతో ఇలా జరుగుతోందని పై అధికారులు చెప్పారని వివరిస్తున్నారు. సంస్థ అధికారులు ప్రతి శనివారం ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 17న జూమ్ మీటింగ్‌కు హాజరైన అనంతరం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాలకు చెందిన సహారా మేనేజర్ కందాల సంపత్ (55) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన హన్మకొండ జిల్లా కమలాపూర్ సహారా బ్రాంచికి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. డిపాజిటర్లకు మెచ్యూరిటీ తీరినా సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఉందని, పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన కుమారుడు వినయ్ హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఈ ఘటన ఏజెంట్లలో ఆందోళన పెంచింది. సొమ్ము వస్తుంది.. ఆందోళన వద్దు! కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక చిక్కుల వల్ల మెచ్యూరిటీ పూర్తయినా డిపాజిట్లు చెల్లించలేకపోతున్న మాట వాస్తవమే. అయితే అత్యవసరమున్న వారికి సర్దుబాటు చేస్తున్నాం. డిపాజిటర్లు, ఏజెంట్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రశీదులు ఏజెంట్ పేరు మీద రావడమంటే అవన్నీ ముందస్తు చెల్లింపులే. దానిపై కంగారు వద్దు. డిపాజిటర్లకు భరోసా కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేనేజర్ సంపత్ ఆత్మహత్యకు ఇతర ఆర్థిక కారణాలే తప్ప.. సహారాకు సంబంధం లేదు. శ్రీనివాస్, సహారా సంస్థ రీజినల్ మేనేజర్, కరీంనగర్ సిరిసిల్లలో చీటింగ్ కేసులు సహారా సంస్థలో డిపాజిట్ చేసివారిలో ఎక్కువ మంది పేద, దిగువ మధ్య తరగతివారే. ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, చదువు, అనారోగ్యం తదితర అవసరాల కోసం.. త్వరగా డబ్బు రెట్టింపు అవుతుందన్న ఆశతో డిపాజిట్లు చేశారు. ఇప్పుడు సొమ్ము అందకపోవడంతో సంస్థపై, ఏజెంట్లపై చీటింగ్ కేసులు పెడుతున్నారు. ఇలా సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఒకటి, వేములవాడ పోలీస్స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కరీంనగర్లో ఉన్న సహారా రీజనల్ మేనేజర్, ఇతర అధికారులను సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే పిలిపించి వివరణ కూడా తీసుకున్నారు. చదవండి: కథ కంచికి.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం -
కాళేశ్వరంపై బండి సంజయ్ ఫోకస్.. సీఎస్ రెస్పాన్స్‌పై సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా రెండు పార్టీల నేతలు పరస్పర రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని ఒకడుగు ముందుకేసి బండి సంజయ్ పాదయాత్రలో దాడులు కూడా చేసుకున్నారు. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం పర్యటన కోసం తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాయండి చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఆదివారం సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. లేఖలో.. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సాగునీటి పారుదల రంగం నిపుణులతో కూడిన 30 మంది ప్రతినిధి బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం అనుమతి ఇవ్వాలని సీఎస్‌ను కోరారు. అయితే, సెప్టెంబర్ తొలి వారంలో తాము వెళ్లనున్నట్టు బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలకు, తమకు ఉన్న పలు అనుమానాలను తమ పరిశీలన ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పర్యటనకు బీజేపీ నేతల పర్యటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇది కూడా చదవండి: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి -
పంద్రాగస్టుకు పైసల్లేవ్!.. చాక్‌పీస్, డస్టర్‌కు ఇబ్బందులే
సాక్షి, కరీంనగర్: పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులన్నీ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవడంతో స్కూల్ గ్రాంటు ఖాతాలు ఖాళీగా మిగిలాయి. ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలన్నింటికి మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట దేవుడెరుగు కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల నిర్వహణకు విడుదలైన నిధులను తిరిగి ఏప్రిల్‌లో ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించడంతో పాఠశాలల బ్యాంక్ అకౌంట్ ఖాతాలన్ని ఖాళీ అయ్యాయి. జిల్లాలో కొందరు పాఠశాల గ్రాంటును వినియోగించుకోగా, మిగిలిన నిధులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపయోగించుకుందామని అనుకున్నారు. వెనక్కి తీసుకోవడంతో చాక్‌పీస్‌లు, డస్టర్ కొనుగోళ్లకు ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అవసరాలను తీర్చుకుంటున్నారు. స్కూల్ గ్రాంటు ఖర్చు ఇలా జిల్లాలో వివిధ విభాగాల్లో గల 652 పాఠశాలల్లో 42,218 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల గ్రాంటుతో ప్రధానోపాధ్యాయులు చాక్‌పీసులు, డస్టర్లు, విద్యార్థుల హాజరు పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేస్తారు. గణతంత్ర దినం, రాష్ట్ర అవతరణ దినం, స్వాతంత్య్ర దినోత్సవం తదితర జాతీయ దినోత్సవాల్లో పాఠశాలల్లో కార్యక్రమాల నిర్వహణ, సున్నం వేయడం చిన్న మరమ్మతులను ఈ నిధులతో చేసుకోవచ్చు. ఒక్కో పాఠశాలలకు ఆయా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు గ్రాంటు విడుదల చేస్తారు. ఈ నిధులను అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం అకస్మాత్తుగా పాఠశాలల ఖాతాల్లోని నిధులను వాపసు తీసుకోవడంతో చిన్న అవసరాలకూ తమ జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, గిరిజన సంక్షేమ ప్రాథమిక, క్రీడా పాఠశాలలు, అంధ, మూగ, చెవిటి పాఠశాలలకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను ఆధారంగా గ్రాంటు విడుదల చేస్తుంది.1–15 మంది విద్యార్థులు ఉంటే రూ.12,500, 16–100 మంది విద్యార్థులకు రూ.25,500, 101 నుంచి 250 మంది విద్యార్థులకు రూ.50 వేలు, 251–1000 మంది విద్యార్థులు ఉంటే రూ.75 వేలు, 1000కిపైగా విద్యార్థులు ఉంటే రూ.లక్ష చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. చదవండి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి విచారకరం పాఠశాలల నిర్వహణకు వచ్చిన నిధులను ప్రభుత్వం తిరిగి తీసుకోవడం విచారకరం. తక్షణమే స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేయాలి. చిన్నపాటి అవసరాలకు పాఠశాలల్లో నిధులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు సతమతమవుతున్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకునేందుకు నిధులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. – పోరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయులదే బాధ్యత... ఆర్థిక సంవత్సరం పూర్తి కావడంతో పాఠశాలకు సంబంధించిన నిధులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. త్వరలోనే ప్రభుత్వం సంబంధిత పాఠశాలల ఖాతాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు జమ చేస్తుంది. అప్పటివరకు ప్రధానోపాధ్యాయులే పాఠశాల నిర్వహణకు సంబంధించి నిధులు ఖర్చు చేయాలి. నిధులు రాగానే ప్రధానోపాధ్యాయులకు చెల్లించడం జరుగుతుంది. – సీహెచ్ జనార్దన్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి, కరీంనగర్ -
పాపకు ప్రాణమున్నా పోయిందన్నారు.. చివరి నిమిషంలో ట్విస్ట్
జగిత్యాల: ఐదు రోజుల శిశువు. అనారోగ్యంతో ఆస్పత్రిలోనే ఉంది. కాపాడుకోవడానికి రూ.లక్ష కుమ్మరించారు తల్లిదండ్రులు. అయినా ‘పాప ప్రాణం పోయింది.. తీసుకెళ్లండి’ అన్నారు డాక్టర్లు. దీంతో ఆశలొదులుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ప్రేమ ఆ పసిగుడ్డు గుండెను కరిగించిందేమో.. శ్మశానంలో ఉండగా కదలికలొచ్చాయి. ప్రాణంతోనే ఉందని గుర్తించి, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వేణుకు సంగీతతో వివాహం జరిగింది. ప్రసవానికి సంగీత తల్లి ఊరైన కోరుట్లకు వెళ్లింది. అక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏప్రిల్ 27న పాపకు జన్మనిచ్చింది. పాప ఉమ్మ నీరు తాగిందని, ఆరోగ్య సమస్యలున్నాయని అక్కడే చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో... కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రూ. లక్ష వరకు ఫీజు వేసిన ఆస్పత్రి, పాప బతికే పరిస్థితి లేదని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించింది. పాపలో చలనం లేకపోవడంతో చనిపోయిందని భావించి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ పాప కదలడం గుర్తించిన తల్లిదండ్రులు.. వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పడంతో సంగీత–వేణు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో..
సాక్షి,మంచిర్యాలక్రైం: ఎవరికంట పడకుండా, దొంగతనం చేసి డబ్బులు సంపాధించుకుందామనుకున్న ఓ ముగ్గురు, ముఠాగా ఏర్పడి దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు. దొంగతనం చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం, పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనాన్ని అమ్మేందుకు వెళ్తూ దొరికిపోయారు. స్థానిక సీఐ నారాయణ్‌నాయక్ ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాతమంచిర్యాలకు చెందిన వీర్ల శ్రీనివాస్‌కు చెందిన ఎమ్హెచ్ 40 ఎల్ 3165 నంబర్ గల ట్రాక్టర్ ఈ నెల 3న తెల్లవారుజామున దొంగతనానికి గురైందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని ప్రత్యేక పోలీస్ బృందంతో తనిఖీలు చేశాం. దొంగతనం చేసిన తీరు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 3వ తేదీన దొంగతనానికి పాల్పడి ట్రాక్టర్‌ను కాలేజీ రోడ్డులోని ముళ్లపొదల్లో దాచిపెట్టారు. ట్రాక్టర్‌ను తిరిగి బుధవారం అమ్మేందుకు వెళ్తుండగా, ఫ్లై ఓవర్‌బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖి చేస్తుండగా చూసి బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అనుమానించి పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ట్రాక్టర్‌ను గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసిన తీరును ఒప్పుకున్నారు. ఈ మేరకు రూ. 3లక్షల విలువ గల ట్రాక్టర్‌ను, వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు దొంగలను రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. మొదటి సారి దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయి.. మొదటిసారి దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన దొంగల ముఠాలో ములుగు జిల్లా లక్ష్మిదేవిపేటకు చెందిన సెగ్గం రాజతిరుపతి, సెగ్గం లచ్చులు, భూపాలపల్లి జిల్లా దేవరాంపల్లి గ్రామానికి చెందిన బోర్లకుంట ప్రకాష్ ఈజీగా మనీ సంపాదించాల నే దురాలోచనతో మొదటి దొంగతనానికి అలవా టుపడి దొరికిపోయి కటకటాలపాలయ్యారు. 48గంటల్లో కేసు చేధించిన పోలీసులు.. ట్రాక్టర్ దొంగతనానికి గురైన 48గంటల్లో మంచిర్యా ల పోలీసులు చేధించడంతో ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నారాయణ్‌నాయక్, ఎస్సై హరిశేఖర్, స్పెషల్ పార్టీ పోలీసులు దివాకర్, రాము, మహేష్‌బాబు, శ్రీనివాస్‌లను రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీపీ అఖిల్‌మహాజన్, ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్ అభినందించారు. చదవండి: రెండేళ్ల ప్రేమ.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో.. -
కరీంనగర్‌కు మచిలీపట్నం పోలీసులు?
సాక్షి,కరీంనగర్‌క్రైం: మచిలీపట్నంలోని ఇనగదురుపేట పోలీసుస్టేషన్ పరిధికి చెందిన ఒక దివ్యాంగురాలి(40)పై కరీంనగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడినట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందగా.. విచారణ నిమిత్తం కరీంనగర్‌కు చేరుకున్నట్లు తెలిసింది. వివరాలలోకి వెళ్తే.. దివ్యాంగురాలైన మహిళ మరో ఇద్దరితో కలిసి వంట పని కోసం గత ఫిబ్రవరిలో కరీంనగర్ వచ్చింది. (చదవండి: భర్త కోసం అందరినీ వదిలి వచ్చా.. ఇప్పుడు ఎవరూ లేరు ) తర్వాత ఆమె తిరిగి ఇంటికి చేరకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి సదరు మహిళ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ బస్టాండ్ వద్ద ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో మార్చి 09న ఆమె మచిలీపట్నం చేరుకుంది. ఆ దివ్యాంగ మహిళపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కేసు నమోదవగా ఆరుపేట సీఐ బృందం కరీంనగర్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఆది, సోమవారాల్లో కరీంనగర్ బస్టాండ్ సమీపంలో, కొత్తపల్లి ఠాణా పరిధిలో కొంతమంది నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. -
బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్.. దమ్ముంటే గంగులపై పోటీ చెయ్ అంటూ..
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో తెలంగాణలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. గురువారం కరీంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. పైసా పని కూడా చేయలేదని విమర్శించారు. మూడేళ్ల కాలంలో సంజయ్ ఏం అభివృద్ధి చేశారని సూటిగా ప్రశ్నించారు. వర్గాల పేరుతో ప్రజల మధ్య పంచాయితీ పెట్టడం తప్ప బండి సంజయ్‌కు ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కూడా మాట్లాడలేదని కేటీఆర్ ఫైరయ్యారు. రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడం, పనికి మాలిన మాటలు మాట్లాడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. ఈ సందర్భంగానే బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. బండి సంజయ్‌కు ధ్యైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేయాలని సవాల్ చేశారు. కమలాకర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తాజాగా తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. -
కమర్షియల్ పైలట్‌గా ఎంపికైన కరీంనగర్ విద్యార్థిని.. రూ.4 లక్షల కోసం..
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పేదింటిలో పుట్టినా తన చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది.. డిగ్రీ పైనలియర్ చదువుతూనే పైలట్ కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది.. కాంపిటీటివ్ పరీక్ష రాసి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. కానీ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది కేశవాపూర్‌కు చెందిన పాతకాల స్పందన. వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల సదయ్య–రమ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన వరంగల్‌లోని సోషల్ వెల్ఫేర్ డీగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతూ ఎలాగైనా పైలట్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్ష రాసింది. అందులో సత్తా చాటి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. శిక్షణ కోసం బేగంపేటలోని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చేరింది. కానీ పూర్తి శిక్షణ కోసం రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి, కూలి పని చేసుకునే తన తల్లిదండ్రులకు అంత మొత్తం చెల్లించలేరని ఆవేదన చెందుతోంది. దాతలు స్పందించి, ఆర్థికసాయం చేస్తే పైలటవుతానని వేడుకుంటోంది. -
మద్యం ప్రియుల్లో ‘నయా’ జోష్ .. తాగండి.. ఊగండి..! కానీ
సాక్షి, పెద్దపల్లి (కరీంనగర్): మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం షాపులకు ఆంక్షలను ఎత్తివేసింది. పైగా అర్ధరాత్రి వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని, బార్లు ఒంటిగంట వరకూ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈవెంట్లు కూడా చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ కావడంతో మద్యంప్రియుల్లో జోష్ నెలకొంది. జిల్లావ్యాప్తంగా 77 మద్యం షాపులు ఉన్నాయి. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కషాప్ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. శుభకార్యాలు ఉంటే మరింత పెరుగుతాయి. అయితే డిసెంబర్ 31 అంటేనే యువతలో తెలియని జోష్ ఉంటుంది. మద్యంతో విందులు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటల వరకే వైన్స్‌షాపులు మూసివేయాలి. కానీ.. ఈ 31న మాత్రం అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటే వెసులుబాటు కల్పించింది. ఈవెంట్లు నిర్వహించుకునేవారు మాత్రం ఎక్సైజ్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బయటకొస్తే తాట తీస్తారు.. డిసెంబర్ 31 సందర్భంగా మద్యంషాపులపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం పోలీసులకు మాత్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా గుంపులు, గుంపులుగా కనిపించినా.. తాగి బయటకొచ్చినా పోలీసులు వదలరు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టనున్నారు. ఒకవేళ మద్యం తాగి పోలీసులకు చిక్కితే మాత్రం కటకటాల్లోకి పంపించనున్నారు. ఎవరి ఇళ్లలో వారే పార్టీ చేసుకోవాలని, బయటకొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే జోరందుకున్న అమ్మకాలు డిసెంబర్ 31 నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వైన్స్‌షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని తెలిసినా.. పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే తనిఖీలు చేపడతామని, ఎవరు పట్టుబడినా.. జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలి నిబంధనలు అందరూ పాటించాలి. ఎవరి ఇళ్లలో వారే సెలబ్రేషన్ చేసుకోవాలి. బయటకు రావొద్దు. జనజీవనానికి ఆటంకం కలిగించొద్దు. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం తీసుకెళ్లొచ్చు. అయితే అప్పటికే తాగి ఉండరాదు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్ ఉంటుంది. అందులో పట్టుబడితే జైలుకు పంపిస్తాం. ఇందులో అనుమానం లేదు. – ఇంద్రసేనారెడ్డి, సీఐ, సుల్తానాబాద్ చదవండి: సాక్షి ఎఫెక్ట్: విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా -
జాండీస్ ఎఫెక్ట్‌తో లివర్, కిడ్నీలు సరిగ్గా పనిచేయవు.. దయ చూపి.. ప్రాణం నిలపండి
సాక్షి,జ్యోతినగర్(పెద్దపల్లి): జాండీస్ బారినపడి లివర్, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో ఓ నిరుపేద వైద్య ఖర్చులకు దాతల సాయ కోసం ఎదురుచూస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో అప్పులు చేస్తూ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ ఇల్లాలు దీనంగా రోధిస్తుంది. రామగుండం కార్పొరేషన్ నాలుగో డివిజన్ కృష్ణానగర్‌కు చెందిన రామగిరి శ్రావణ్‌కుమార్ కిరాణా వ్యాపారం చేసుకుంటూ భార్య మౌనిక, తల్లి లలిత, కుమారులు మోక్షానంద్(మూడేళ్లు), అనిరుధ్(మూడు నెలలు)లతో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రావణ్‌కుమార్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు జాండీస్ ఎఫెక్ట్‌తో లివర్, కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని మెరుగైన వైద్యం అందించాలన్నారు. దీంతో ఆ కుటుంబం అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలుపడంతో దాతలు ఆదుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు రామగిరి శ్రావణ్‌కుమార్ గూగుల్ పే, ఫోన్ పే: 8465921213 -
ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. మరి ఈ కక్కుర్తి ఏంటి!
సాక్షి, పెద్దపల్లి: వేతనాలు పెంచుతున్నా.. పీఆర్సీలు ప్రకటిస్తున్నా కొన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతస్థాయి నుంచి దిగువస్థాయి అధికారుల వరకూ లంచం ఇవ్వనిదే పనికాని పరిస్థితి నెలకొంది. దీనికి మూడు నెలల్లో ముగ్గురు అధికారులు పట్టుబడడమే నిదర్శనం. జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కలకలం రేపుతున్నా.. అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. నూతన జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలు, పెరిగిన రియల్ ఎస్టేట్ బూమ్‌తో ఏరికోరుకుంటూ పెద్దతలలకు రూ.లక్షలు ఎదురిచ్చి మరీ పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. చేతుల్లో లంచం పడకపోతే దస్త్రం కదలదంటూ తేల్చి చెబుతున్నారు. ఏసీబీ దాడులు చేస్తున్నా తీరు మారడం లేదు. అదే పనిగా సామాన్యులను పట్టి పీడిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. పలు విభాగాల్లో అక్రమాలెన్నో.. ప్రజల నుంచి ఎక్కువగా లంచాలు తీసుకుంటున్న శాఖలపైనే కాకుండా ఆ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపైనా ఏసీబీ అధికారులు ఇక నుంచి సీరియస్‌గా ఆరా తీయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవినీతి పరుల పక్కా సమాచారాన్ని సేకరించిన తరువాతనే వ్యూహాత్మకంగా దాడి జరిపేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేయబోతున్నట్లు పేర్కొంటున్నారు. ఇటు రెడ్‌హ్యాండెడ్ కేసులతోపాటు అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బంది ఆస్తులపై.. వారి బినామీల ఆస్తులపై కూడా ఆరా తీసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్, ఆర్టీఏ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, మరికొన్ని శాఖల్లో పెరిగిపోతున్న లంచాల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కొంతకాలంగా ఈ శాఖల్లో పెద్దఎత్తున అవినీతి కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితమే ఎఫ్ఏసీగా బాధ్యతలు.. కోల్‌సిటీ:పెద్దపల్లి ఆర్డీవో కె.శంకర్‌కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ 2న కార్పొరేషన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీఈ రషీద్‌ను ఏసీబీకి పట్టించిన రజినీకాంత్ అనే కాంట్రాక్టరే.. ఆర్డీవోను కూడా పట్టించడం గమనార్హం. గోదావరిఖనికి చెందిన రజినీకాంత్‌కు కరోనా వ్యాప్తి నివారణకు పిచికారీ చేయించిన హైపోక్లోరైడ్‌కు సంబంధించి రూ.9.20 లక్షలు, హరితహారం కింద నాటిన మొక్కల బిల్లు రూ.25లక్షలు రావాల్సి ఉంది. పనులు పూర్తి చేసి ఆర్నెళ్లు గడుస్తున్నా తమకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యే, మేయర్‌కు చెప్పినా ఫలితం కనిపించలేదని, పైగా కమిషనర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు రజినీకాంత్ వెల్లడించారు. భూపాలపల్లికి బదిలీ అయినా.. కరీంనగర్లో భూసేకరణ విభాగంలో పనిచేసిన శంకర్‌కుమార్‌కు జయశంకర్భూపాలపల్లి జిల్లాకు బది లీ అయ్యింది. అక్కడకు వెళ్లకుండా పెద్దపల్లికి వచ్చా డు. తహసీల్దార్‌గా పనిచేసిన పలు ప్రాంతాల్లోనూ ఈయనపై అవినీతి ఆరోపణలు అధికంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నారు. రూట్ మారుస్తున్నారు జిల్లాలో వరుస ఏసీబీ దాడులతో మిగతా శాఖల ఉద్యోగులు అవినీతికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా పట్టుబడిన ఆర్డీవో ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని మరీ లంచం తీసుకోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది. జిల్లాలోని పలుశాఖల్లోని అధికారులు సైతం అదే బాటలో కొనసాగుతున్నారు. పనికోసం వచ్చిన వారిని సెక్షన్లో ఫలానా వ్యక్తిని కలవాలని చెబుతున్నారు. మరికొందరు నేరుగా డబ్బు తీసుకోకుండా తమ బినామీల వ్యక్తుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేసి.. దానికి సంబంధించిన బ్యాంక్ రిసిప్ట్ చూపిస్తే పనులు చేస్తున్నారు. మరికొందరు బంగారం, ఇతరత్రా గిఫ్ట్‌ల రూపంలో ‘మామూళ్లు’ తీసుకుంటున్నారు. చదవండి: ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే.. -
వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. ఆమె ఏం చేసిందంటే
సాక్షి, కరీంనగర్: వివాహేతర సంబంధం పెట్టుకుందని నిత్యం ప్రచారం చేయడంతో ఆ కోడలు విసుగు చెందింది.. తన మామను అక్క కుమారుడితో కలిసి అంతమొందించింది.. గత నెల 27న కాచాపూర్‌లో మాతంగి కనకయ్య(70) హత్యకు గురవగా.. చంపింది కోడలేనని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనకయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతిచెందారు. ఈ క్రమంలో ఆయన నిత్యం మద్యం సేవించి, కోడలు కొంరమ్మకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు. తిండిపెట్టడం లేదని తిడుతున్నాడు. ఈ నెల 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముసలోడు బతికుంటే ఎప్పుడూ తనను అనుమానిస్తాడని, ఆస్తి కూడా దక్కదని ఆమె భావించింది. తన అక్క కుమారుడు, మానకొండూర్ మండలం కల్లెడకు చెందిన ప్రవీణ్‌తో కలిసి కనకయ్యను చంపేందుకు ప్లాన్ వేసింది. అదేరాత్రి గదిలో నిద్రిస్తున్న కనకయ్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి, బలంగా లాగడంతో మృతిచెందాడు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కొంరమ్మ, ప్రవీణ్‌లపై హుజూరాబాద్ రూరల్ సీఐ కిరణ్, ఎస్సై ప్రశాంత్‌రావులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. హత్య కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. చదవండి: ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే.. -
మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్ అడిగేవాడు.. కాదనడంతో క్షణికావేశంలో..
సాక్షి,కరీంనగర్‌క్రైం: సెల్‌ఫోన్, బైక్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన బాలుడు(16) ఇంటర్ చదువుతున్నాడు. తన తల్లిదండ్రులను మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్ కొనివ్వమని అడిగేవాడు. కానీ బైక్ నడిపే వయసు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని వారు తిరస్కరించారు. క్షణికావేశంలో శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో... చింతకుంట కెనాల్లో గుర్తుతెలియని శవం కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ శివారులోని పోచమ్మ గుడి వద్ద గల ఎస్సారెస్పీ కెనాల్లో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు ఎస్సై బి.ఎల్లయ్యగౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మత్స్యకారులు చేపలు పడుతుండగా కెనాల్లో మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వగా పోలీసులు మోఖాపైకి వెళ్లి చూడగా 35–45 ఏళ్ల వయస్సు వ్యక్తి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. మృతుడి శరీరంపై బ్లూ, వైట్ లైన్స్ కలిగిన హాఫ్ షర్ట్, నలుపు రంగు లోయర్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎడమ చేతి పైభాగంలో నితిన్ అని హిందీలో పచ్చబొట్టు రాసి ఉందన్నారు. కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నందున ఆచూకీ తెలిస్తే కొత్తపల్లి ఎస్సై–94409 00974, కరీంనగర్ రూరల్ సీఐ–94407 95109, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్: 94944 90268 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య -
ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించడంతో.. బయటకు వెళ్లి..
సాక్షి,మెట్పల్లి(జగిత్యాల): సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మెట్పల్లి పట్టణంలోని బర్కత్పురాకు చెందిన షేక్ నజీముద్దీన్(18) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా సెల్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తుండటాన్ని గమనించిన తండ్రి ఖుత్బుద్దీన్ రెండు రోజుల క్రితం అతన్ని మందలించాడు. దీనికి మనస్తాపం చెందిన నజీముద్దీన్ గత నెల 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. బాధిత కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం కోరుట్ల మండలం ఎఖిన్‌పూర్ వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో స్థానికులకు అతని మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సదాకర్ పేర్కొన్నారు. చదవండి: Amberpet: తల్లి చిన్నప్పుడే మృతి.. నాన్న మరొకరిని పెళ్లి చేసుకోవడంతో -
నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకున్నా.. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా!
సాక్షి ,సిరిసిల్లకల్చరల్( కరీంనగర్): కాలం మారుతోంది. ఉద్యోగాల్లో కొరవడిన స్థిరత్వం.. ఆశించిన మేర లభించని వేతనం. కరోనా లాంటి విపత్తులు.. యువతరం ఆలోచన సరళిలో మార్పు తెస్తున్నాయి. అర్హతకు తగిన ఉద్యోగం కన్నా అభిరుచికి అనుగుణమైన రంగంలో అధికంగా రాణించగలం అనేది యువత దృక్పథం. దీనికి అనుగుణంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలువురు యువకులు బీటెక్, ఎంఎస్, ఎంబీఏ లాంటి ఉన్నత విద్యార్హతలు సంపాదించుకుని కూడా సొంతకాళ్లమీద నిలబడాలని ప్రయత్నిస్తున్నారు. సమాజంలో స్థిరపడేందుకు ఉద్యోగం ఒక్కటే పరిష్కారం అనే సంప్రదాయానికి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్నారు. తమ అభిరుచి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభిన్న వ్యాపార మార్గాలను ఎంచుకున్నారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి గోపాల్‌నగర్ వెళ్లే దారిలో ఇటీవల ప్రారంభమైన పలు వాణిజ్య సంస్థలు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. వారి స్వయంకృషి గురించి ఆ యువత మాటల్లోనే.. ఓపెనింగ్స్ బాగున్నాయి హైదరాబాద్ అరోరా కాలేజీలో డిగ్రీతో పాటు ఎంబీఏ పూర్తి చేశాను. పీజీలో ఉండగానే అక్కడే చిన్న వ్యాపారం ప్రారంభించాను. దురదృష్టవశాత్తు కరోనా కారణంగా అది దెబ్బతింది. ఆ కసితోనే ఉన్న వూళ్లో పిజ్జా సెంటర్ ప్రారంభించాను. మా బంధువులకు సిద్దిపేట, కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో ఇదే తరహా వ్యాపారాలు ఉండడంతో తొందరగానే వ్యాపార మెలకువలు నేర్చుకున్నాను. ఓపెనింగ్స్ బాగున్నాయి. రోజుకు కనీసం వందకు తగ్గకుండా కస్టమర్లు వస్తున్నారు. – తీగల సాయినాథ్‌గౌడ్, ఎంబీఏ, మాస్టర్ పిజ్జా సెంటర్ వ్యాపారమే నయం హైదరాబాద్ సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ మెకానికల్ చేశాను. రెండేళ్లపాటు ప్రైవేట్ ఉద్యోగం చేశాను. సంతృప్తినివ్వలేకపోయింది. మూడేళ్ల క్రితం ఈ కేఫ్ కార్నర్ మరో కజిన్‌తో కలసి స్టార్ట్ చేశాం. తను ఇప్పుడు మరో వ్యాపారంలో స్థిరపడడంతో నేనే నడుపుతున్నాను. ఉద్యోగం కన్నా వ్యాపారమే నయం అనిపిస్తోంది. ఖర్చులన్నీ పోయినా నేను ఆశించినంతగా వస్తోంది. ఇప్పుడు అంతా హ్యాపీనే. – మచ్చ ఉదయ్, కేఫ్ కార్నర్ గోపాల్‌నగర్ నలభై లక్షల ప్యాకేజీ వద్దనుకుని హైదరాబాద్ తీగల కృష్టారెడ్డి కాలేజ్‌లో బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్ కంప్యూటర్స్ కోసం యుఎస్ వెళ్లాను. ఏడాదిన్నర కోర్సు అయ్యాక ఐదున్నర సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను. ఐడెంటిటీ కోసం అమెరికా వెళ్లాను కానీ నాకు ఇండియాలోనే ఇంటికి చేరువగా ఉండాలని ఉండేది. అందుకే ఐఐటీ చదువుకున్న స్నేహితుడితో పాటు మరో మిత్రుడితో కలిసి కేక్ హౌజ్ ప్రారంభించాను. వెరైటీ ఫ్లేవర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాం. సొంతంగా వ్యాపారం ఆనందంగా ఉంది. – గోవిందు సుమన్, ఎంఎస్ (యుఎస్) హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను. హైదరాబాద్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశాను. ఉద్యోగంలో కోరుకున్నంత పురోగతి ఉండదని తొందరలోనే గుర్తించాను. సొంతంగా వ్యాపారం చేద్దామనుకుని స్నేహితులను సంప్రదించాను. మా కజిన్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి ఐస్ హౌజ్‌ను ప్రారంభించాను. వైవిధ్యమైన ఐస్‌క్రీములని పరిచయం చేయడం ద్వార ప్రజలకు చేరువయ్యాం. మొదట్లో స్పందన తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా కస్టమర్లు పెరిగారు. రోజుకో 150 మంది వస్తుంటారు. స్నేహితులకు కూడా స్థిరపడగలమనే విశ్వాసం పెరిగింది. – ఒడ్డెపెల్లి ప్రసాద్, ఐస్‌హౌస్ నిర్వాహకుడు చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’ -
గర్భిణీకి తీవ్ర రక్తస్రావం.. ప్రాణం పోసిన మేయర్
సాక్షి,రామగుండం(కరీంనగర్): ప్రజాపాలనలో నిత్యం బిజీగా ఉంటున్న రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్ సకాలంలో స్పందించి గర్భిణీకి మంగళవారం ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. మంథని మండలం గుంజపడుగు ప్రాంతానికి చెందిన దుస్స రమ్యకృష్ణ అనే గర్భిణికి పురుటి నొప్పులు ఎక్కువకావడంతో మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రెండోకాన్పుకోసం తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రసవంకోసం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రమ్యకృష్ణకు తీవ్ర రక్తస్రావం అయింది. వైద్యం అందిస్తున్నప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాలేదు. కంట్రోల్ కాలేదు. వెంటనే విషయాన్ని సీనియర్ జనరల్ సర్జన్ అయిన నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్‌కుమార్‌కు తెలిపారు. సకాలంలో స్పందించిన మేయర్ హుటాహుటిన ఆపరేషన్ థియేటర్‌కు చేరుకుని, సదరు గర్భిణికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్‌కావడంతో పండంటి బాబుకు రమ్మకృష్ణ జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండడంతో ఆమె భర్త అశోక్‌కుమార్, కుటుంబసభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించి శస్త్రచికిత్స అందించిన నగర మేయర్‌ను ఆస్పత్రి వైద్యులతోపాటు రమ్యకృష్ణ కుటుంబసభ్యులు అభినందించారు. డాక్టర్లు శౌరయ్య, శ్రవంతి, కళావతితోపాటు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం -
హుజురాబాద్ ఉప ఎన్నిక: ఆట ఆరంభం.. ఎవరూ తగ్గడం లేదు
సాక్షి, కరీంనగర్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేసింది. షెడ్యూలు విడుదలతో జిల్లాలో అసలైన రాజకీయ ఆట మొదలైంది. ఈటల రాజేందర్ హుజూరాబాద్ స్థానానికి రాజీనామా చేసిన దాదాపు నాలుగునెలల సుదీర్ఘ సమయం తరువాత షెడ్యూల్ రావడంతో నేతల నిరీక్షణకు తెరపడింది. ఇక అసలైన కదనరంగంలోకి కొదమసింహాల్లా దూకనున్నారు. వాస్తవానికి రాజేందర్ రాజీమానాతోనే జిల్లాలో ఉపఎన్నిక వాతావరణం మొదలైంది. రెండు ప్రధాన పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్టాకంగా తీసుకోవడంతో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించ తలపెట్టిన ఈ ఎన్నిక నిర్వహణను అధికారులు సైతం సవాలుగా తీసుకున్నారు. కాగా.. హుజూరాబాద్ ఓటర్ల సంఖ్య 2.36,283గా అధికారులు తేల్చారు. గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల మంది ఓటర్లు పెరగడం గమనార్హం. నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చని అధికారులు వివరించారు. విమర్శలు– ప్రతివిమర్శలు.. ► రాజేందర్ రాజీనామా అనంతరం హుజూ రాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న ఆలోచనతో కేసీఆర్ తన మాస్టర్‌ప్లాన్‌ను అనుకున్నట్లుగానే అమలు చేస్తున్నారు. ► దళితబంధు పథకం అమలుకు చకచకా రూ.2000 కోట్లు విడుదల చేశారు. లబ్ధి దారుల సర్వే కూడా అంతే వేగంగా పూర్తయింది. 10 మందికిపైగా లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ జరిగిపోయింది. ► మరోవైపు మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి రాజేందర్ విమర్శలకు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది వ్యవహారం. ఒకదశలో వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. ► టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్, హరీశ్‌రావులను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో హరీశ్‌రావు కూడా దీటుగానే ప్రత్యారోపణలు చేస్తున్నారు. ► బీజేపీ విధానాలను, పెట్రో ధరల పెంపును, ప్రైవేటీకరణ, ప్రభుత్వాస్తుల విక్రయం తదితర విషయాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. డబుల్ డోస్ లేకుంటే అంతే.. ► కేంద్రం ఎన్నికల సంఘం ఉపఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. రాజకీయ పార్టీల నేతలు–విధుల్లో పాల్గొనే అధికారులు సెకండ్ డోస్ సర్టిఫికేట్ లేకుండా అనుమతించరు. ► ఇప్పటికే హుజూరాబాద్ వ్యాప్తంగా దాదా పు 80శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా అధికారులు త్వరలోనే పూర్తి చేయనున్నారు.ఈ నేపథ్యంలో ప్రధానపార్టీల రాజకీయ నేతలు, కార్యకర్తల్లో చాలామంది డబుల్ డోస్ వేసుకోలేదు. దీంతో రెండో డోస్ కోసం మధ్యాహ్నం నుంచి ఉరుకులు పరుగులు తీస్తున్నారు. 30న అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్? ► ఈ ఏడాది ఏప్రిల్ నుంచి హుజూరాబాద్ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ► ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించింది. బీజేపీ నుంచి రాజేందర్ పోటీ చేస్తారు. ఇక ప్రధా న ప్రతిపక్షాల్లో ఒకటైన కాంగ్రెస్ పార్టీ మాత్రం హుజూరాబాద్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయక పోగా.. ఈనెల 30న అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ నలుగురు పేర్లను తెరపైకి తీసుకొ చ్చింది. వీరిలో కొండా సురేఖ, పత్తి కృష్ణారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ప్యాట రమేశ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ► మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక దూకుడుగా వెళుతున్నా రు. ఆయన సభలకు హాజరవుతున్న ఉమ్మడి జిల్లా నేతలు తమ అనుచరులను తరలించడంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్షా’ ఎవరో? -
మందు బాబులకు పండగ.. దసరాకు ముందే కిక్కు
సాక్షి,కరీంనగర్: నోటిఫికేషన్‌కు ముందే హుజూరాబాద్ ఉప ఎన్నికకు మద్యం కిక్కు ఎక్కుతోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం కాగా.. అప్పటి నుంచే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు ఈసీ పచ్చజెండా ఊపడంతో మద్యం మరింత ఏరులైపారనుంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో మద్యం అమ్ముడుపోతుండగా.. పార్టీలు, కులసంఘాలు, సమావేశాలు ఏవైనా మద్యం కిక్కు తప్పనిసరిగా మారింది. ఐదు మాసాలుగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో రూ.వందలకోట్లలో లిక్కర్ అమ్మకాలు జరుగుతన్నాయి. ఈ ప్రభావం మరో రెండునెలలు ఉండనుంది. మొత్తంగా ఉప ఎన్నిక నేపథ్యంలో దసరాకు ముందే ఇక్కడివారికి కిక్కు ఎక్కుతోందని చెప్పుకుంటున్నారు. అమ్మకాల జోరు.. పక్క జిల్లాల నుంచి దిగుమతి ► హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వేడి ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట ఎక్సైజ్ సర్కిల్లో మొత్తం 29 దుకాణాలున్నాయి. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రూ.125కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. 2021లో రూ.170కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదికన్నా సుమారు రూ.45 కోట్ల వ్యాపారం అధికంగా జరిగింది. ► గతేడాది ఆగస్టు వరకు రూ.3.60 లక్షల బీర్లు, లిక్కర్లు అమ్ముడవగా, ప్రస్తుతం లిక్కరు,బీర్లు కలిపి 3,92,616 కేసుల మద్యం అమ్ముడైంది. ముఖ్యంగా గత మూడు నెలల నుంచే రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లామొత్తం రూ.320 కోట్ల వ్యాపారం జరగ్గా.. 55శాతం అమ్మకాలు ఇక్కడే జరగడం విశేషం. నోటిఫికేషన్‌తో అమ్మకాల జోరు మరింత పెరగనుంది. ► హుజూరాబాద్ నియోజకవర్గానికి కేవలం కరీంనగర్ జిల్లాకు చెందిన మద్యమే కాకుండా, వివిధ జిల్లాల నుంచి కూడా దిగుమతి అవుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే పెద్దఎత్తున మద్యం నిల్వలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీశాఖకు కూడా భారీగానే ఆదాయం పెరగనుంది. ► ఎన్నికల షెడ్యూలు ఖరారవడం... దసరా తర్వాత ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింత పెరగనున్నాయి. యేటా దసరాకు రూ.కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే ఈసారి హుజూరాబాద్‌లో ఇటు ఎన్నికలు, అటు దసరా పండగ మరింత కిక్కునిస్తుందని తెలుస్తోంది. చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్షా’ ఎవరో? -
భారీ వర్షాలతో కరీంనగర్ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు
-
చివరి రక్తపు బొట్టు వరకు దళితుల కోసం పోరాడతా: సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘మొన్నీ మధ్య టీవీలో చూసిన.. ఉత్తరభారతంలో ఓ దళిత యువకుడు పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కిం డని కొందరు అతన్ని కొట్టి చంపారు. ఎవడు పెట్టిండో, ఎప్పట్నుంచి పెట్టిండోగానీ ఈ దుర్మార్గమైన ఆచారం ఇంకా పోలేదు. సమాజంలో ఇప్పటికీ దళితులంటే చిన్నచూపే, అంటరానితనం పోయినా వివక్ష పోలేదు. ఆ వివక్షను రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. దళితుల జీవితాలు పూర్తిగా మారాలి. అందుకోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. కునారిల్లుతున్న కులవృత్తుల వారికోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నామని తెలిపారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ‘దళితబంధు’ పథకంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అన్ని వర్గాలకు అండగా.. ‘‘తెలంగాణలో సాగునీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసుకున్నాం. నిరంతరాయంగా కరెంటు ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనులకు పోయిన రాష్ట్రంలో ఇప్పుడు.. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకుంటున్నాం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా మా ప్రభుత్వం నిలబడింది. అన్ని రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అన్ని వర్గాలకు అండదండలు అందిస్తూ నేనున్నాననే ధీమాను ప్రభుత్వం అందిస్తోంది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృద్ధి కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలుపరుస్తున్న దళితబంధు కార్యక్రమాన్ని అందరి సహకారంతో తప్పకుండా విజయవంతం చేస్తాం. దేశానికే పాఠం నేర్పే విధంగా దళిత బంధును నిలబెడదాం చదవండి: 27 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.22 వేలే.. ఇది ఓట్ల కోసం కాదు.. సబాల్ట్రన్ స్టడీస్ సెంటర్ ఏర్పాటు చేసి దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల పట్ల అధ్యయనం చేశాం. ప్రపంచవ్యాప్తంగా 165 జాతులు ఆర్థిక, సామాజిక వివక్షకు గురవుతున్నయనే విషయాన్ని గుర్తించాం. భారతదేశ దళితుల పరిస్థితి కూడా ఆ 165 జాతుల మాదిరిగానే ఉందనే విషయం నిర్ధారణ అయింది. అందుకే దళితుల అభివృద్ధి కోసం పథకం తెస్తున్నాం. ఇది చిల్లర మల్లర ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు, ఆదరాబాదరా అవసరం లేదు. ప్రతి దళిత కుటుంబాన్ని పేరు పేరునా అభివృద్ధిపరిచే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా ఎలా అందిస్తున్నామో.. అదే పద్ధతిలో దళితబంధుకు కూడా పరిమితులు ఉండవు. దళితబస్తీల్లోని దరిద్రాన్ని బద్దలుకొట్టాలంటే ఉద్యోగస్తులకు కూడా దళితబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉప కులాలకు దళిత బంధు వర్తిస్తుంది. హుజూరాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి దేశానికే వెలుగులు పంచుతుంది. అణగారిన దళితవర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుంది. భిన్నమైన పనులు ఎంచుకోండి అందరూ ఒకే పని కాకుండా భిన్నమైన పనులను ఎంచుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత లబ్ధి పొందవచ్చు. అధికారులు దళితబంధు పథకం ద్వారా అమలుపరుస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలున్న కరపత్రాన్ని వెంట తీసుకెళ్లి.. ఆయా వ్యాపార, ఉపాధి మార్గాలను లబ్ధిదారులకు వివరించాలి. లబ్ధిదారులు స్వయంగా వారి పనిని ఎంచుకునేందుకు సహకరించాలి. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే ఫర్టిలైజర్, మెడికల్, వైన్స్ తదితర రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తాం. హాస్టళ్లు, హాస్పిటళ్లు, విద్యుత్ రంగ సంస్థలకు వివిధ మెటీరియల్ సరఫరా, సివిల్ సప్లయ్స్ రంగాల్లో కూడా దళితులకు అవకాశాలను మెరుగుపరుస్తాం. కాంట్రాక్టుల విషయంలోనూ కొంత రిజర్వేషన్ కోసం ఆలోచన చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! హుజూరాబాద్‌లో డెయిరీ ఏర్పాటు చేయండి ఎస్సీ వెల్ఫేర్ మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి, కరీంనగర్ జిల్లా వారే కావడం, ఆర్థికమంత్రిది కూడా పక్క నియోజకవర్గమే కావడంతో.. హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం మరింత సుగమమైందని సీఎం కేసీఆర్ అన్నారు. పాల ఉత్పత్తి రంగంలో కరీంనగర్ డెయిరీ విజయం గర్వకారణమని చెప్పారు. దళితబంధు పథకంలో భాగంగా ఔత్సాహికులు డెయిరీ ఫారాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హుజూరాబాద్‌లో డెయిరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కరీంనగర్ డెయిరీ నిర్వాహకులు.. ‘అవసరమైతే లక్ష లీటర్ల వరకు పాలను అదనంగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, మేయర్ సునీల్‌రావు, అధికారులు పాల్గొన్నారు. సీఎం ఎత్తుకున్న శిశువుకు కేటీఆర్ పేరు కలెక్టరేట్లో సమీక్ష అనంతరం రామగుడు ఎంపీపీ ఎలిగేటి కవిత–లక్ష్మణ్ దంపతులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. తమకు కుమారుడు జన్మించాడని, ఆశీర్వాదించాలని కోరారు. కేసీఆర్ ఆ చిన్నారిని ఎత్తుకుని ఆశీర్వదించారు. తర్వాత కవిత–లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడికి కేటీఆర్ అని పేరు పెట్టుకుంటున్నామని తెలిపారు. ‘దళితబంధు’తో పునరుత్పాదకత రాష్ట్రంలో పరిశ్రమలకోసం ఇప్పటివరకు 2 లక్షల 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాయి. అలాగే మేం 1.75 లక్షల కోట్ల రూపాయలను దళితులకు పెట్టుబడిగా పెట్టడం ద్వారా.. అది తిరిగి పునరుత్పాదకతను సాధిస్తుంది. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తుంది. రిజర్వేషన్లు పెంచుకుందాం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. రాష్ట్ర జనాభాలో సుమారు 18 శాతం మేర.. అంటే సుమారు 75 లక్షల దళిత జనాభా ఉంది. వారి జనాభా పెరుగుతున్నది. దానికి తగ్గట్టు రాబోయే కాలంలో దళిత రిజర్వేషన్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఏం నర్సయ్యా.. హైదరాబాద్ రా.. మొగ్ధంపూర్ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం కరీంనగర్ రూరల్: కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా తీగలగుట్టపల్లిలోని తెలంగాణభవన్‌లో బస చేసిన సీఎం కేసీఆర్‌ను.. కరీంనగర్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మొగ్ధుంపూర్ సర్పంచ్ జక్కం నర్సయ్యను కేసీఆర్ పలకరించారు. ‘పిల్లలు బాగున్నారా.. అంతా మంచిదేనా.. ఒకసారి హైదరాబాద్ రా..’ అని ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నర్సయ్య సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు కేసీఆర్ ఇలా నర్సయ్యను ప్రత్యేకంగా పలకరించడం, హైదరాబాద్‌కు ఆహ్వానించడం అందరికీ ఆసక్తి కలిగించింది. చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు -
కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదు: ఈటల
సాక్షి, కరీంనగర్: కేసీఆర్ దళితుడిని సీఎం చేయలేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఓట్ల కోసమే దళిత బంధు ఇస్తామంటున్నారని విమర్శించారు. తాజా పరిణామాలు చూస్తుంటే హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక తేది ఎప్పుడని స్పష్టంగా తెలియకపోయినా ఇప్పటినుంచే రాజకీయ పార్టీల నేతలు హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మాటల యుద్ధాలు అప్పుడే మొదలయ్యాయి. -
TRS: హుజూరాబాద్‌లో ఇక దూకుడే!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్‌లో ఇక దూకుడు పెంచాలని మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ నిర్ణయించింది. వీలైనంత త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టాలని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, నేరుగా కేడర్‌తో మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకలాపాలను సమన్వయం చేస్తు న్న మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని కమిటీ గురువారం హైదరాబాద్‌లో మంత్రుల నివాస సముదాయంలోని కొప్పుల ఈశ్వర్ నివాసంలో భేటీ అయింది. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ పాల్గొన్నారు. కాగా ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో టీఆర్ఎస్ కూడా శరవేగం గా పావులు కదుపుతోంది. శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన ఈటల.. 13న స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసే అవకాశం ఉంది. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుండటంతో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈనెల 5న మంత్రి గంగుల నివాసంలో సమావేశంలో ఖరారు చేసిన వ్యూహంపై మరోమారు చర్చించినట్లు సమాచారం. సానుభూతి ఉందా? ఈటల బీజేపీలో చేరిక తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏదైనా సానుభూతి ఉందా.. వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల పర్యటన తీరుతెన్నులపై చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ తర్వాత హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌తో వరుస భేటీ అవుతూ హుజూరాబాద్‌లో పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. 14న బీజేపీలోకి ఈటల సాక్షి,హైదరాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు కూడా బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు కూడా ఈటల చేరిక సమయానికి ఢిల్లీకి వెళ్లనున్నారు. గత నెల 31న ఢిల్లీలో జేపీ నడ్డాతో భేటీయైనప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీలో చేరితే తనకుండే ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. బీజేపీ జాతీయ నేతలు కూడా తనకు సముచిత స్థానం కల్పిస్తామని హామీనివ్వడంతో పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. తొలుత ఈ నెల 13 లేదా 14న బీజేపీలో చేరేందుకు పార్టీ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ కూడా కోరారు. అయితే 14న ఢిల్లీకి రమ్మని ఆహ్వానం అందడంతో అదేరోజు బీజేపీలో చేరనున్నారు. చదవండి: నిరుద్యోగ భృతి ఏమైంది?.. టీఆర్ఎస్ పార్టీపై ఈటల ఫైర్ -
‘బంగారాలూ.. వారంలో వచ్చేస్తాం’ అంతలోనే...
ముత్తారం(మంథని): ‘బంగారాలు.. నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండండి. అల్లరి చేయొద్దు. బయట తిరగొద్దు.. ’అంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఆ తల్లి జాగ్రత్తలు చెప్పింది. మారాం చేస్తున్న కొడుకులిద్దరినీ.. ‘వారం రోజుల్లో తిరిగి వస్తాం. అందరం కలిసి మనింటికి వెళ్లిపోదాం..’ అంటూ బుజ్జగించింది. అప్పట్నుంచీ తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారం గడిచినా రాలేదు. కరోనా కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి తర్వాత మరొకరు 12 గంటల వ్యవధిలోనే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులిద్దరూ విగతజీవులై రావడం చూసిన చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కరోజులోనే దంపతులు మరణించడం, పెద్ద కొడుకైన 11 ఏళ్ల బాలుడు తన ఏడేళ్ల తమ్ముణ్ణి ఓదార్చడం స్థానికుల్ని కంటతడి పెట్టించింది. తొలుత భర్తకు.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకు చెందిన కుడికల్ల మల్లేశ్ (36), సృజన (34) దంపతులు.. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మెడికల్ షాపు నడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కోవిడ్ లక్షణాలతో చాలామంది మల్లేశ్ వద్దకు వచ్చి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం అతడికి జ్వరం వచ్చింది. రెండు రోజులు మందులు వాడినా తగ్గకపోవడంతో భార్య ఒత్తిడితో గోదావరిఖనిలో హెచ్ఆర్సీటీ స్కాన్ చేయించుకున్నాడు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దంపతులిద్దరూ బేగంపేటకు వెళ్లి పిల్లల్ని నాన్నమ్మ, తాతయ్య దగ్గర విడిచి పెట్టారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన మల్లేశ్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత భార్యకు కూడా.. కరీంనగర్లో ఆస్పత్రి బయట ఉంటూ భర్త బాగోగులు చూసుకుంటున్న సృజన కూడా నాలుగురోజుల తర్వాత అస్వస్థతకు గురయ్యింది. అదే ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. బుధవారం వరకు చికిత్స కోసం మల్లేశ్‌కు రూ.8 లక్షలు, సృజనకు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షలు ఖర్చుపెట్టినా వారి ప్రాణాలు దక్కలేదు. మెడికల్ షాపుతో ఉపాధి పొందుతున్న వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అయినా వారి చికిత్స కోసం కుటుంబసభ్యులు.. బంధువుల సాయంతో అప్పు చేసి రూ.10 లక్షల వరకు ఆస్పత్రికి చెల్లించారు. కానీ ఆరోగ్యం విషమించడంతో బుధవారం మధ్యాహ్నం 3.30 సమయంలో మల్లేశ్ మృతి చెందాడు. ఈ విషయం సృజనకు తెలియనివ్వకుండా.. కుటుంబసభ్యులు అదేరోజు మృతదేహాన్ని బేగంపేటకు తీసుకొచ్చి రాత్రికల్లా అంత్యక్రియలు పూర్తిచేశారు. మల్లేశ్ దహన సంస్కారాలు ముగించి 12 గంటలు కూడా గడవకముందే సృజన కూడా ఆరోగ్యం విషమించి మరణించినట్టు ఆస్పత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. బంధువులు మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని కూడా బేగంపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లల్ని చూసి నాన్నమ్మ, తాతయ్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎలాగైనా బతికించుకోవాలనుకుని.. మల్లేశ్ దంపతులు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో.. మల్లేశ్ తమ్ముడు సది, సృజన సోదరుడు కృష్ణ తమ అన్న, అక్కను ఎలాగైనా బతికించుకోవాలని భావించారు. ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు పని చేస్తోందని విని దాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కృష్ణ.. తనతో పాటుగా పనిచేసే పరిచయస్తులైన కృష్ణపట్నం వాసుల సహాయంతో ఆనందయ్య మందు కోసం ప్రయ త్నించాడు. వారు మందు తెస్తున్నామని చెప్పడంతో బుధవారం ఉదయం సది, కృష్ణ ఇద్దరూ అంబులెన్స్ మాట్లాడుకొని ఆంధ్రా సరిహద్దుకు వెళ్లారు. మందు తీసుకుని తిరిగి కరీంనగర్‌కు బయల్దేరారు. ఆనందయ్య మందు దొరికిందన్న వారి ఆనందం అంతలోనే ఆవిరైంది. సరిహద్దు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే మల్లేశ్ మృతిచెందిన వార్తను కుటుంబసభ్యులు వారికి ఫోన్ చేసి చెప్పారు. ఆ విషాదంలోనే వారు గురువారం తెల్లవారుజా మున 4.30కి కరీంనగర్ చేరుకున్నారు. అయితే అప్పటికి గంట క్రితమే సృజన కూడా చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. -
రూ.కోటి ఎగ్గొట్టి.. బిచ్చగాడిగా మారి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నకిలీ ధృవపత్రాలతో వివిధ బ్యాంకుల నుంచి రూ.కోటికిపైగా రుణాలు పొంది బురిడి కొట్టించాడు.. అడ్డదారులు తొక్కి ఆర్థికంగా చితికిపోయి భిక్షాటన చేసే స్థితి చేరుకు న్నాడు.. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాడు.. అయితే 15 ఏళ్ల తర్వాత ఆ నిందితుడిని కరీంనగర్ పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ తలాష్’లో భాగంగా నిందితుడు కుందన శ్రీనివాస్ రావు అలియాస్ శశాంకరావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా ఎన్జీవో కాలనీకి చెందిన శ్రీనివాస్‌రావు 1991లో ఇంజనీరింగ్ పూర్తిచేసి పైవ్రేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. 2006 నుంచి విలాసవంత మైన జీవితానికి అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ కిసాన్ వికాస పత్రాలు సృష్టించాడు. వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోటికి పైగా రుణాలు పొందాడు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇలాగే మోసా లుచేశాడు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వరంగల్, హైదరాబాద్, గుంటూరు, హన్మకొండ, కరీంనగర్ టూటౌన్లో కలిపి మొత్తం 40 కేసులు నమోదయ్యాయి. అలిపిరి మెట్లపై భిక్షాటన.. 2007లో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో శ్రీనివాసరావును కరీంనగర్ పోలీసులు రిమాండ్‌కు పంపగా, ఏడాదిపాటు కరీంనగర్ జైళ్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాంమార్చాడు. కూర శశాంకరావు పేరుతో చెలా మణి అవుతూ నకిలీ ఆధార్, పాన్ కార్డులతో తరచూ చిరునామా మారుస్తూ మూడేళ్లు గడిపాడు. వరంగల్‌లో కొంతకాలం మారుపేరుతోనే ఇంజనీ రింగ్ కళాశాలల్లో పనిచేశాడు. తదుపరి కుటుంబం లో వివాదాలు తలెత్తడంతో భార్య అతడిని విడిచి పెట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని విజయవాడకు మకాం మార్చాడు. అక్కడ కొంత కాలం, తిరుపతిలో కొంతకాలం హోటళ్లలో పనిచేశాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగిపోయింది. అప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులతో జీవితం దుర్భరంగా మారింది. చివరికి అలిపిరి మెట్ల మీద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కుటుంబంతో సం బంధాలు కోల్పోయిన శ్రీనివాస్‌రావు కనిపించడం లేదని బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచే స్తున్న అతని తమ్ముడు శ్రీధర్ 2018లో వరంగల్‌లో ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులకు తిరుపతిలో భిక్షా టన చేస్తున్న శ్రీనివాసరావును నిజామాబాద్ నుంచి వచ్చిన కొందరు గమనించి సమాచారాన్ని అతని సోదరుడు శ్రీధర్‌కు అందించారు. అతను తన అన్నను బెంగుళూర్ తీసుకెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు. ఫోన్‌కాల్స్ ఆధారంగా.. కరీంనగర్ పోలీసులు ‘ఆపరేషన్ తలాష్’లో భాగంగా శ్రీనివాసరావు ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ రావును గాలించేందుకు టౌన్ అడిషనల్ డీసీపీ పి.అశోక్ పర్యవేక్షణలో ఏఎస్ఐ సుజాత, కానిస్టేబుల్ కృష్ణ, రమేశ్, సంపత్తో ఓ బృం దాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందానికి చెందిన పోలీసులు శ్రీనివాస రావుకు గతంలో జామీను ఇచ్చిన వారిని, తెలి సిన వారిని ఆరా తీశారు. శ్రీనివాసరావు కుటుం బసభ్యుల ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. అలా బెంగుళూర్లో ఉన్నట్లు నిర్ధారించుకొని ఆచూకీ కనుగొన్నారు. జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్చార్జి మురళితో కూడిన బృందం 2 రోజులు బెంగళూర్‌లో గాలించి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కరీంనగర్‌కు తరలించారు. గతంలోని వారెంట్లతోపాటు నకిలీ పాన్‌కార్డు, ఆధార్ కార్డులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందం సభ్యులను సీపీ అభినందించి రివార్డులు అందించారు. -
వామన్‌రావు దంపతుల హత్య కేసు: చార్జిషీట్లో ఏముంది?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మంథని: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో చార్జిషీట్‌ను పోలీ సులు బుధవారం ఆన్లైన్లో కోర్టుకు పంపినట్లు తెలిసింది. 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉండగా.. బుధవారంతో గడువు ముగియడంతో ఆన్లైన్ ద్వారా సాఫ్ట్‌కాపీలను అప్లోడ్ చేశారు. చార్జిషీట్ కాగితపు ప్రతులను గురువారం మంథని కోర్టులో అందజేసే అవకాశం ఉంది. చార్జిషీటులో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపారనేది తెలియాల్సి ఉంది. కేసు నేపథ్యం: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిలను ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో ప్రధాన రహదారిపైనే కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. తమపై దాడి చేసింది కుంట శ్రీను అని తీవ్రంగా గాయపడ్డ వామన్‌రావు చెప్పిన వీడియా టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌లను 19న మంథని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను కస్డడీలో విచారించగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి వచ్చింది. తమకు కత్తులు, కారు ఇచ్చి హత్యకు సహకరించింది బిట్టు శ్రీను అని వెల్లడించారు. దీంతో బిట్టు శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు దర్యాప్తును కూడా స్వయంగా పర్యవేక్షిస్తోంది. తెరపైకి జడ్పీ చైర్మన్ హత్యలపై మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు దంపతులను విచారించాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. తనను అరెస్టు చేస్తారనే అనుమానంతో పుట్ట మధు కొద్ది రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారం తర్వాత పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మూడు రోజులపాటు విచారించి వదిలి పెట్టడంతో మధు పాత్రపై పోలీసులు ఏం తేల్చారనే విషయం తెలియాల్సి ఉంది. మధు దంపతులతోపాటు కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, మరికొందరు అనుమానితులను సైతం పోలీసులు విచారించారు. దీంతో చార్జిషీట్లో ఏయే విషయాలు పొందుపరిచారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. -
పట్టపగలు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్ దారుణం..
సాక్షి, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మహిళా సిబ్బందికి రక్షణ లేకుండాపోయింది. ఆసుపత్రిలో పనిచేసే ఓ యువతిపై కాంట్రాక్టు విధానంలో పనిచేసే వార్డుబాయ్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆసుపత్రివర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. గురువారం ఉదయం ఆసుపత్రిలో ఓ వార్డులో విధులు నిర్వహిస్తున్న యువతి అదే వార్డులో స్టాక్ ఉండే గదిలోకి వెళ్లగా వార్డుబాయ్ ఆమె వెనకాలే వచ్చి గది తలుపులు బిగించి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన ఆసుపత్రి అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వార్డుబాయ్‌ని శుక్రవారం బాధితురాలి బంధువులు ఆసుపత్రిలోనే చితకబాదినట్టు తెలిసింది. ఉదయం షిప్టులోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఇక రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఇదేవార్డుబాయ్ పై పలు ఆరోపణలు ఉన్నా వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక మతలబు ఏమిటన్నది ఆసుపత్రిలో చర్చజరుగుతోంది. ఇద్దరి మధ్య సయోధ్యకుదిర్చేయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మహిళా సిబ్బంది ప్రజలకు వైద్యాసేవలందిస్తుంటే ఇలాంటి వారితో ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందని , వార్డుబాయ్ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
భార్య మోసం చేసిందని భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి దిగువ మానేరు జలాశయం కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్ శివారులో జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక చేపలకాలనీకి చెందిన జాలర్లు ప్రాణాలు తెగించి కాపాడారు. బాధితుడు, జాలర్ల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడకు చెందిన వెంకటేశ్ భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులుగా బయటే తిరుగుతూ సోమవారం ఉదయం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు చేరుకొని అందులో దూకాడు. ఇదే సమయంలో చేపల కాలనీకి చెందిన బాలరాజు కరీంనగర్ మార్కెట్లో చేపలు విక్రయించి ఇంటికి వస్తున్నాడు. కాలువ వద్దకు రాగానే వెంకటేశ్ నీటిలో కొట్టుకుపోతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన బాలరాజు అక్కడే ఉన్న చిందం శ్రీను, అమర్ సాయంతో తన బండికి ఉన్న తాడును కాలువలోకి వేసి యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే యువకుడు తాడు పట్టుకోకపోవడంతో బాలరాజు తాడుసాయంతో కాలువలోకి దిగి వెంకటేశ్‌ను ఒడ్డుకు చేర్చాడు. ఈ సందర్భంగా బాధితుడిని వివవరాలు అడగ్గా, తనది ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడ అని చెప్పాడు. తనను భార్య మోసం చేసిందని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని కాలువలో దూకానని వెల్లడించాడు. యువకుడిని కాపాడినవారు ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించగా, అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి వెంటకేశ్‌ను కాపాడిన బాలరాజు, శ్రీను, అమర్‌ను ఎస్సై కృష్ణారెడ్డి అభినందించారు. -
భారీగా ఐపీఎల్ బెట్టింగ్; ఏడుగురు అరెస్ట్
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాకు చెందిన ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 15 వేల రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో లో ఏడుగురు పట్టుబడగా.. వారిపై పోలీసులు కరీంనగర్ రూరల్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. బెట్టింగ్ తో రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపి అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. -
స్పందించిన అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్ కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లాక్డౌన్ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్ఫోన్లో మేసేజ్‌లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
మిడ్‌మానేరు వద్ద మంచు లక్ష్మి షూటింగ్
సాక్షి, కరీంనగర్: శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్ స్పాట్‌గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు ప్రాజెక్టు వెబ్ సిరీస్ పాటల చిత్రీకరణకు వేదికగా మారుతోంది. ప్రాజెక్టు డౌన్ స్ట్రీమ్, వరదకాలువ పరిసరాలతోపాటు, ప్రాజెక్టు బ్యాక్‌వాట ర్ ఏరియాలో ప్రముఖ టీవీ ఛానళ్లు సీరియల్స్ షూటింగ్ నిర్వహించడం విశేషం. పలువురు లోకల్ టాలెంట్ కళాకారులు, యూ ట్యూబ్ ఛానల్స్ వారు పలు జానద గేయాలు చిత్రీకరిస్తున్నారు. వరదకాలువ వద్ద మంచు లక్ష్మి షూటింగ్ గత జనవరి మొదటి వారంలో వెబ్ సిరీస్ ఆన్లైన్ షూటింగ్ నిమిత్తం ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మితో దేశాయిపల్లి వరదకాలువ వద్ద షూటింగ్ నిర్వహించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ వరదకాలువపై నుంచి ఓ అమ్మాయి నీటిలో దూకే సీన్ చిత్రీకరించారు. ఇందులో మంచు లక్ష్మి గ్రామ పెద్ద పాత్ర పోషించారు. బ్యాక్ వాటర్ ఏరియాలో టీవీ సీరియళ్ల చిత్రీకరణ సందడి వారంక్రితం మిడ్‌మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామం వరదవెల్లి బ్యాక్ వాటర్ పరిసరాల్లో మా టీవీ నిర్మిస్తున్న కస్తూరి సీరియల్ షూటింగ్ సందడి చేసింది. అగ్నిసాక్షి సీరియల్ ఫేం హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతంరాజు నటించారు. వైద్యశిబిరం జరిగే సన్నివేశం చిత్రీకరించారు. మూడురోజులపాటు షూటింగ్ చేశారు. వారంక్రితం జరిగిన సీరియల్ షూటింగ్ దృశ్యం జానపద గీతాలు.. మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాల్లో లోకల్ టాలెంటెడ్ కళాకారులు పలు జానపద గీతాలు చిత్రీకరించారు. కరీంనగర్, వేములవాడ ప్రాంతాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ టాలెంట్‌తో నిర్వహించే గీతాలు చిత్రీకరిస్తున్నారు. మండలంలోని కొదురుపాకకు చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ పలు ప్రేమ గీతాలతోపాటు, జానపద గీతాలు చిత్రీకరించారు. ప్రాజెక్టు అందాలు అద్భుతం మెరుగు యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మించిన సరియా.. సరియా.. అనే గీతంలో నటించా. ప్రాజెక్టు గేట్ల పరిసరాల్లో పాట చిత్రీకరించారు. గేట్ల మీదుగా నీరు వెళ్తుండగా సాంగ్‌లో నటించడం ఎంతో మధురానుభూతిని అందించింది. – అశ్రుత, నటి, హైదరాబాద్ ప్రాజెక్టు వద్ద సందడి మాన్వాడ వద్ద గల మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిసరాలు షూటింగ్‌కు వేదికయ్యాయి. ప్రాజెక్టు గేట్లు, బ్యాక్ వాటర్ పరిసరాల్లో వివిధ యూట్యూబ్ ఛానల్స్ వారు పలు జానపద గీతాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో సందడి నెలకొంది. దీంతో గ్రామానికి సందర్శకుల తాకిడి పెరిగింది. – రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ -
కరోనా కరాళనృత్యం
సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. నాలుగు నెలల్లో ఎప్పుడూ లేని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంపై మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది. శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో జిల్లాలో 168 కేసులు తాజాగా నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 6,168 మంది కరోనా బారిన పడగా, 3650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో కరోనా మహమ్మారి ధాటికి 78 మంది మృత్యువాత పడ్డారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కోవిడ్ కారణంగా సేవలను నిలిపివేస్తున్నాయి. అయినా ప్రజల్లో కరోనా పట్ల భయం లేకుండా పోతోంది. దగ్గు, జ్వరం ఇతరత్రా లక్షణాలతో బాధపడుతున్నా నిర్ధారణ పరీక్షలకు వెళ్లకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన అనేక మంది ఆ తర్వాత భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తోంది. వెంటిలేటర్ అవసరమయ్యే పరిస్థితిలో ఆసుపత్రిలో చేరినా ఫలితం లేకుండా పోతోంది. 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఇన్నాళ్లు భావించినా.. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా యువత కూడా కోవిడ్‌కు బలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నపాటి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాతో మందులు వాడిన వందలాది మంది సులభంగానే వైరస్ బారి నుంచి బయటపడుతున్నారు. ప్రభుత్వం కట్టడి చర్యల పట్ల చేతులెత్తేయడంతో రోగుల సంఖ్యలో విపరీతంగా పెరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో రోగాన్ని ఎలాగైనా జయించవచ్చనే విశ్వాసం కలుగుతోంది. వేగంగా పెరుగుతున్న కేసులు.. కమ్యూనిటీ విస్తరణతో కరోనా పాజిటివ్‌ల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది. ఎవరి నుంచి ఏ విధంగా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం తదితర ఏ లక్షణాలు కనిపించినా పరీక్ష చేయించుకోవాలి. -
‘కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరం’
సాక్షి, కరీంనగర్: హరితహారంలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రామ్‌నగర్‌లోని హాస్పిటల్ ఆవరణంతో పాటు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు చోట్ల సోమవారం మొక్కలు నాటారు. అనంతరం మేయర్ సునీల్ రావుతో కలిసి డివిజన్లోని ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఆ తర్వాత మొగ్దుంపూర్లో కలెక్టర్ శశాంక్‌తో కలిసి ఎకరం ప్రభుత్వ స్థలంలో మంకీ ఫుడ్ కోర్టుకు శ్రీకారం చుట్టి.. పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. అందుచేత అడవి లేని కరీంనగర్ జిల్లాలో 50 లక్షల మొక్కలు సెప్టెంబర్ చివరి వరకు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అడవులు లేని జిల్లాగా ఉన్న కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరంగా మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే కరీంనగర్ జిల్లా మళ్లీ అడవులకు నిలయంగా మారుతుందన్నారు. నగరంలో 10 నుంచి 12 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని, నగర ప్రజలకు కావలసిన పండ్లు, పూల మొక్కలు ఇంటికి ఆరు ఉచితంగా పంపిణీ చేస్తుననామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించితే బావి తరాలకు భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతామని మంత్రి వ్యాఖ్చానించారు. -
కరీంనగర్ ఐటీ టవర్ రెడీ
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వ ర్యంలో వీటి నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణ శివారులో నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ప్రారం భిస్తారు. ఇప్పటికే వరంగల్‌లో మడికొండ మొదటి దశ ఐటీ టవర్‌తో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. టెక్ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారం భించగా, రెండో దశ ఐటీ టవర్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రా ల్లోనూ రూ.25 కోట్ల చొప్పున వ్యయంతో ఐటీ టవర్ల నిర్మాణం కొనసాగుతోంది. మహబూబ్ నగర్లో నిర్మాణ పనులు ప్రాథమిక దశలో ఉండగా నిజామాబాద్, ఖమ్మంలో పనులు చివరి దశలో ఉన్నాయి. 70 వేల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ రూ.25 కోట్ల వ్యయంతో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదంతస్తుల్లో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ నిర్మాణ పనులు గతేడాది చివరిలోనే పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీని ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించినా మున్సిపల్ ఎన్నికల కోడ్ మూలంగా వాయిదా పడింది. కరీంనగర్ ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిం చేందుకు 26 కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించగా, 15 కంపెనీలకు ఆఫీస్ స్పేస్ కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 12 కంపెనీలు కార్య కలాపాలు ప్రారంభిస్తుండగా 400 మంది యువ తకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. భవిష్య త్తులో కరీంనగర్ ఐటీ టవర్ ద్వారా దాదాపు 3,600 మందికి ఉపాధి దక్కనుంది. కాగా, ప్రస్తుతం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో ఐటీ టవర్ ప్రారంభమవుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర ఐటీ టవర్ల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ మంగళవారం జరిగే కార్యక్రమంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు. ఐటీ టవర్ ప్రత్యేకతలివే – ఐదంతస్తుల్లో నిర్మించిన ఐటీ టవర్‌లో 12 చదరపు అడుగులు సెల్లార్ కాగా, మరో 60 వేల అడుగులు ఆఫీసు స్పేస్‌కు కేటాయిస్తారు. – గ్రౌండ్ ఫ్లోర్లో శిక్షణ కేంద్రం, మొదటి అంతస్తులో కార్యాలయం, రెండు, ఐదో అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తారు. – మూడు, నాలుగో అంతస్తులను హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలకు భవిష్యత్తులో కేటాయిస్తారు. -
‘నానమ్మా.. అమ్మకు ఏమైంది’
‘‘నానమ్మా.. అమ్మకు ఏమైంది.. ఎన్ని రోజులు ఆ రూంలోనే ఉంటది.. అమ్మ బువ్వ తినిపిస్తలేదు.. అమ్మ దగ్గరికి మేం ఎందుకు వెళ్లద్దు..’’ అంటూ గుక్కపట్టి ఏడుస్తూ ఆ చిన్నారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ నానమ్మ తల్లడిల్లిపోతోంది.. మరోవైపు పిల్లల ఏడుపులు చెవిన పడి పక్క గదిలోనే ఉన్న తల్లి పిల్లలను అక్కున చేర్చుకోలేక గుండెలవిసేలా రోదిస్తోంది.. కరోనాతో భర్తను కోల్పోయి హోంఐసోలేషన్లో ఉంటున్న అయిలాపూర్‌కు చెందిన ఓ తల్లి గుండెకోత ఇదీ.. ‘‘ఇరవై రోజులైతుంది.. అమ్మ ఎక్కడుంది.. ఇంకెన్ని రోజులకు ఇంటికి వస్తుంది.. అమ్మ దగ్గరికి పోయి తీసుకొద్దాం.. అమ్మ వచ్చినంక ముంబయిలోని మనింటికి వెళ్లిపోదాం..’’ అంటూ కోరుట్లకు చెందిన పదేళ్లలోపు పిల్లలు ఇద్దరు తల్లి కోసం తండ్రిని నిలదీస్తూ రోజూ కంటతడి పెడుతున్నారు. సాక్షి, కోరుట్ల: అనుబంధాలు, ఆత్మీయతల మధ్య కరోనా వైరస్ పెను అగాధాన్ని సృష్టిస్తోంది. కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియలకు బంధుగణం దూరంగా ఉండటం ఓ దీనావస్థ కాగా.. పసి పిల్లలు కరోనా సోకిన తల్లులకు రోజుల తరబడి దూరంగా ఉండాల్సిన దయనీయ స్థితి గుండెలను పిండేస్తోంది. కోరుట్ల పట్టణంలో ఓ వృద్ధుడు నెలరోజుల క్రితం కరోనాతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను పదిహేను రోజులపాటు జగిత్యాలలోని ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. మృతిచెందిన వ్యక్తి కోడలుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను జగిత్యాల నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి రోజుల తరబడి కనబడకుండా పోవడంతో ఆమె పిల్లలు ఇద్దరు తండ్రి వద్ద ఉంటూ రోజు అమ్మ ఎక్కడుంది. అమ్మకు ఏమైందంటూ విలపించడం చుట్టుపక్కల వారిని కలచివేసింది. (జీహెచ్ఎంసీ: వెంటాడుతున్న కోవిడ్ భూతం! ) అచ్చు ఇదే తీరుగా కోరుట్ల మండలంలోని అయిలాపూర్‌లో కరోనాతో భర్త మృతి చెందడంతో భార్య హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం భర్తను ఉంచి పిల్లల కోసం బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా భర్త మృతి సంగతి తెలుసుకున్న ఆమె తనకు తానుగా వైద్యులకు, పోలీసులకు ఫోన్ చేసి ఐసోలేషన్‌కు వెళ్లింది. ఇంటి వద్ద ఉండటానికి చుట్టుపక్కల వారు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు పిల్లలను ఇంట్లోనే ఉంచి గ్రామంలోని పాఠశాలలో ఐసోలేషన్‌లో ఉంది. ఇరవై రోజులు గడిచిపోయినా పిల్లలను దగ్గరకు తీసుకుంటే ఎక్కడ వారికి వైరస్ వస్తుందోనన్న భయంతో ఇప్పటికీ హోం ఐసోలేషన్‌ను కొనసాగిస్తుండటం తల్లి పడుతున్న వేదనకు అద్దం పడుతుంది. (కారు బోల్తా.. మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం) దగ్గరి బంధువులే దిక్కు.. కరోనా వైరస్‌తో తల్లులు హోం ఐసోలేషన్‌కు వెళుతుండగా పిల్లలను దగ్గరి బంధువుల దగ్గర ఉంచాల్సిన పరిస్థితి. కొంత మంది పిల్లలు అమ్మమ్మ, నానమ్మల వద్ద ఉంటున్నారు. కరోనా సోకిన వారి ఇళ్లకు వెళ్లకుండా అందరూ దూరంగా ఉంటున్నారు. కరోనా భయం ఉన్నా.. తప్పని పరిస్థితిలో దగ్గరి బంధువులే పసివాళ్లను పట్టించుకుని అవసరాలు తీర్చుతున్నారు. కరోనా వైరస్ విషయం సరిగా అర్థం చేసుకోలేని వయసులో ఉన్న పిల్లలు తల్లులు దూరంగా ఉండటంతో ఏం జరిగిందని వేస్తున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేని అయోమయ పరిస్థితి. పెద్దవాళ్లు కరోనాతో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకుంటుండగా అభం శుభం తెలియని చిన్నారులు మాత్రం కన్నీళ్లు పెట్టని రోజు లేదు. -
మరో కరోనా మరణం
సాక్షి, కోరుట్ల : కరోనాతో మరో వృద్ధుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లాలో మొదటి కరోనా కేసు వెలుగు చూసిన కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోనే ముంబయి నుంచి వచ్చిన ఓ వృద్ధుడు(70) సోమవారం గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చనిపోగా అతని భార్య చికిత్స పొందుతోంది. మృతుడి అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు తెలిసింది. (ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు ) ముంబయిలో పెళ్లికి హాజరు.. కోరుట్లలోని కల్లూర్‌రోడ్ వెంట భీమునిదుబ్బలో నివాసముండే వృద్దుడు తన భార్యతో కలిసి ముంబయిలో మార్చిలో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. ఆ తర్వాత కోరుట్లకు వచ్చే క్రమంలో మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. దీంతో వారు ముంబయిలోనే ఉండే తమ కుమారుడి ఇంట్లో ఉండిపోయారు. లాక్డౌన్ సడలింపులతో ఈ నెల 14న స్వగ్రామం వచ్చేశారు. అప్పటికే జ్వరం, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న వృద్ధున్ని గుర్తించిన వైద్య సిబ్బంది అతనితో పాటు భార్యను కొండగట్టు ఐసోలేషన్‌కు పంపారు. ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో గత అదివారం గాంధీ ఆస్పత్రికి పంపించారు. వారం పాటు అక్కడ చికిత్స తీసుకున్న బాధితుడు సోమవారం మృతి చెందాడు. (ప్రశాంత్ కిషోర్‌కు పోటీగా సునీల్) చివరిచూపు దక్కలేదు.. కుటుంబసభ్యులకు వృద్ధుని భౌతికకాయాన్ని కడసారి చూసుకునే అవకాశం దక్కలేదు. మృతుని భార్య గాంధీలోనే చికిత్స పొందుతుండగా కుమారుడు, కోడలు, వారి పిల్లలు కొండగట్టు ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఐ రాజశేఖర్, తహసీల్దార్ సత్యనారాయణ, కమిషనర్ ఆయాజ్‌లు వృద్ధుడి కుమారుని నుంచి అంగీకారప త్రం తీసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. -
కరీంనగర్ టు టౌన్ సీఐపై ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఆయనో పోలీస్ అధికారి.. తన సమీప బంధువులకు చెందిన కారును అపహరించారు. కారు యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పుడు వివరాలతో ఇన్సూరెన్స్ సైతం క్లయిమ్ చేశారు. చివరకు ఫోరెన్సిక్ ఆధారాలు ఆయన నిందితుడని ప్రాథమికంగా తేల్చాయి. కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన ఇన్స్పెక్టర్ దేవరెడ్డి.. సదరు నేరం చేశారనడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఓయూ పోలీసులు మూడు రోజుల క్రితం సీఆర్పీసీ 41 (ఏ) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. సోమవారంలోపు తమ ఎదుట హాజరై ఆరోపణలకు సంబంధించి వివరణనివ్వాలని స్పష్టం చేశారు. దీంతో కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ దేవరెడ్డిని కమిషనర్ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హబ్సిగూడలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివసించే రాగిడి లక్ష్మారెడ్డి భార్య రజని వెర్నా కారు (ఏపీ29 ఏఈ 0045).. 2013, మార్చి 11న చోరీకి గురైంది. దీనిపై మార్చి 14న, తర్వాత అనేకసార్లు ఉస్మానియా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె తన వాహనం ఆచూకీ కనిపెట్టడానికి భర్తతో కలసి ప్రయత్నాలు ప్రారంభించారు. 2017, డిసెంబర్ 17న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లి ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 2015, ఏప్రిల్ 4న దేవరెడ్డి ఆ వాహనానికి ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా తీసుకున్నారని, ఆ సందర్భంలో యజమాని పేరు, వివరాలను ‘రజని.ఆర్ కేరాఫ్ దేవరెడ్డి’గా పేర్కొన్నారని తెలుసుకున్నారు. దీంతో ఆమె జరిగిన విషయం చెప్పి, ఇన్సూరెన్స్ కంపెనీని వివరాలు కోరారు. కోర్టు ఆదేశాల మేరకు..: ఇదిలా ఉండగా దేవరెడ్డి ఆధీనంలో ఉన్న ఆ కారు ప్రమాదానికి గురైంది. 2018, జనవరి 18న రజని మాదిరిగా సంతకాలు చేసి సదరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లయిమ్ కూడా పొందారు. హైదరాబాద్ మెట్టుగూడలోని ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దేవరెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సీఐగా పని చేస్తున్నారు. ఈ తతంగంపై రజని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు దేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి 25న ఓయూ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దేవరెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ చోరీ, ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు చేర్చారు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2018, జనవరిలో క్లయిమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను ఓయూ పోలీసులు సంపాదించారు. ఆ సమయంలో దేవరెడ్డి తన డ్రైవింగ్ లైసెన్సును దాఖలు చేశారని, క్లయిమ్ ఫామ్స్‌పై రజనీ మా దిరిగా సంతకం ఉన్నట్లు గుర్తించారు. దీంతో రజని నుంచి సంతకాల నమూనాలు తీసుకున్న పోలీసులు వాటితో పాటు క్లయిమ్ ఫామ్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. క్లయిమ్ ఫామ్‌పై సంతకం చేసింది రజని కాదని ‘ఫోరెన్సిక్’ తేల్చింది. దీని ఆధారంగా ఓయూ పోలీసులు దేవరెడ్డిని నిందితుడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో సోమవారంలోపు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఫిర్యాదు చేసినవారు నిందితుడి సమీప బంధువులే అని పేర్కొన్నారు. నోటీసుల నేపథ్యంలో దేవరెడ్డిని కరీంనగర్ కమిషనరేట్‌కు ఎటాచ్ చేశారు. ‘మా కారును దేవరెడ్డి చోరీ చేశాడని 2013లోనే ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశాం. అప్పట్లో ఆ ఠాణాలో పనిచేసిన వారు దేవరెడ్డికి వత్తాసు పలుకుతూ మా ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో ప్రాథమిక ఆధారాలు సేకరించి కోర్టును ఆశ్రయించాం. అప్పుడు కేసు నమోదై, దర్యాప్తు ప్రారంభమైంది’అని రాగిడి లక్ష్మారెడ్డి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. -
లాక్డౌన్ నేర్పించిన ఆర్థిక సూత్రం
బీవైనగర్‌కు చెందిన వడ్డేపల్లి రూప బీడీ కార్మికురాలు. గతంలోనే భర్త చనిపోయాడు. మురని, లహరి కూతుళ్లు. వీరిద్దరూ ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. రోజూ కనీసం వెయ్యి బీడీలు తయారు చేస్తే.. నెలకు రూ.5వేల వరకు ఆదాయం వచ్చేది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో రూప ఉపాధి కోల్పోయింది. రాష్ట్రప్రభుత్వం అందించిన రేషన్ బియ్యం, రూ.1,500, నగదు, కేంద్రప్రభుత్వం ద్వారా అందిన రూ.500 సాయంతో ప్రస్తుతం కాలం వెళ్లదీస్తోంది. దాతలు ఇస్తున్న కూరగాయలు, నిత్యాసవరాలతో సరిపెట్టుకుంటోంది. ప్రభుత్వం నుంచి అందిన ఆర్థికసాయం ద్వారా మహిళా సంఘంలో తీసుకున్న రుణం తాలూకు వాయిదా చెల్లిస్తోంది. (ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాల సీజ్ ) సిరిసిల్లలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేసే రాజు నెలవేతనం రూ.8వేలు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలే. తన వేతనంలోంచే ఇంటి కిరాయి చెల్లించాడు. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాడు. కానీ, లాక్‌డౌన్‌తో పనిబందైంది. ఈనెల వేతనం రాలేదు. వారానికోసారి నాన్‌వెజ్‌తో కూడిన భోజనం చేసే అతడి కుటుంబం.. ఈసారి పూర్తిగా కూరగాయలకే పరిమితమైంది. వాయిదా పద్ధతిన కొనుగోలు చేసిన మొబైల్‌ఫోన్ వాయిదా చెల్లించాడు. అవసరమైన ఔషధాలకు కొంత వెచ్చిస్తున్నాడు. తమ కుటుంబసభ్యులకు ఆకలిబాధ తెలియకుండ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేద, మధ్య తరగతివారు ఆచితూచి ఖర్చు చేస్తున్నారనే దానికి వీరి కుటుంబాల పొదుపు చర్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పిల్లలకే పాలు నా నెల జీతం రూ.12వేలు. భార్య ఫర్హానాజ్, పిల్లలు నైలా(3), మునజాహ్(1). ఈనెలకు సంబంధించిన జీతమింకా రాలే. అందుకే ఒక్కసారి కూడా నాన్‌వెజ్ భోజనం లేదు. పిల్లల కోసమే పాలు కొంటున్నం. మేం రోజూ తాగే ఛాయ్ కూడా దాదాపు బంద్‌జేసినం. – ఎండీ యూనస్, ప్రైవేటు ఉద్యోగి పొదుపు చేయక తప్పడం లేదు నాకు తక్కువ జీతం. అయినా గతంలో కుటుంబంతో కలిసి పార్కు, సినిమాలకు వెళ్లేవాళ్లం. అంతోఇంతో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు ఖర్చు తగ్గించుకున్నం. ఇంట్లోనే ఉంటున్నం. కిస్తులు కడుతున్నం – కోమటి వెంకటస్వామి,కాంట్రాక్టు ఉద్యోగి..అవసరాల గురించి తెలిసింది అవసరాల గురించి తెలిసింది. కరోనా లాక్‌డౌన్‌తో అవసరాలు, అనవసరాల గురించి తెలిసింది. సాంచాలు నడిపితే నెలకు రూ.8వేలు వస్తయి. పదిహేను రోజుల కింద బతుకమ్మ చీరలు నేయడం షురూ జేసినం. నెలకు రూ.15 వేలు వస్తయనుకుంటే ఉన్న పనిపోయింది. నా భార్య రంజిత, పిల్లలు సంధ్య, అఖిల్. అందరం ఇంట్లోనే ఉంటున్నం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తున్నం. సర్కారు ఇచ్చిన బియ్యం, రూ.1,500తోనే కాలం వెళ్లదీస్తున్నం. (తండ్రైన ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ జీవీ ) – బింగి సంపత్, నేతకార్మికుడు -
ఇండోనేషియా బృందానికి బస: జమీల్‌కు పాజిటివ్
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో పర్యటనకు వచ్చిన ఇండోనేషియా వాసులకు ఆశ్రయం ఇచ్చిన మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కొరకు నగరంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే పరీక్షల్లో జమీల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కి వచ్చిన 9మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారైన విషయం తెలిసిందే. ఇండోనేషియా బృందానికి బస ఏర్పాటు చేసిన జమీల్ అహ్మద్ కొన్ని రోజుల పాటు పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్య పరీక్షలుకు తరలించారు. మరోవైపు జమీల్‌పై అధికారులు ఆసుపత్రిలోనే విచారణ జరుపుతున్నారు. (వందేళ్లకో మహమ్మారి..) అదేవిధంగా కరీంనగర్లో జనతా కర్ఫ్యూను నగర సీపీ కమలాసన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ‘జనతా కర్ప్యూ’కి సహకరిస్తున్నారని తెలిపారు. రోడ్ల మీదికి ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పారు. ఇండోనేషియాకు చెందిన తొమ్మిది మందికి ఆశ్రయం కల్పించి కరోనా పాజిటివ్ తెచ్చుకున్న కరీంనగర్‌కు చెందిన మహమ్మద్ జమీల్ అహ్మద్‌ను శనివారం రాత్రి పట్టుకున్నామని ఆయన వెల్లడించారు. అతన్ని బైండోవర్ చేశాక మూడు రోజులుగా తప్పించుకుని తిరిగాడని కమలాసన్‌రెడ్డి తెలిపారు. జమీల్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఉండడంతో ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డుకు తరలించామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. (జనతా కర్ఫ్యూ: లైవ్ అప్డేట్స్) చదవండి: ఇంట్లో ఉండకపోతే.. ఆస్పత్రిలో వేస్తారు! చదవండి: రామగుండంలో ‘కరోనా’ దడ! -
కరోనా బారిన పడింది వీరే..
-
ఇండోనేషియన్లు ఇక్కడే తిరిగారట!
సాక్షి, రామగుండం(కరీంనగర్): ఇండోనేషియన్లు తిరిగన ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నా రు. కరోనా వైరస్ బారిన పడిన ఇండోనేషియన్లు ఈ నెల 14న ఏపీ సంపర్క్‌క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి రామగుండంకు వచ్చిన విషయం తెలిసిందే. వారంతా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సదరు ఇండోనేషియన్లు రైలు దిగి బయట రోడ్డుపై ఉన్న ఆటోస్టాండు వద్దకు బ్యాగులతో వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే రైల్వేశాఖ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంతో వారు ఎవరెవరినీ కలిశారన్న సమాచారం లభించడం లేదు. ఇప్పటికైన రైల్వేశాఖ స్పందించి రైల్వే ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కరోనా మరణాల్లో చైనాను మించిన ఇటలీ పర్యటనపై ఆరా.. వేములవాడ: వేములవాడలోని సుభాష్‌నగర్ మజీద్‌కు ఈ నెల 7, 8 తేదీల్లో ఇండినేషియాకు చెందిన 12 మంది బృంద సభ్యులు పర్యటించిన అంశంపై కలెక్టర్, ఎస్పీ, స్థానిక పోలీసులు గురువారం ఆరా తీశారు. కరీంనగర్లో ఇండోనేషియా బృందం పర్యటన సందర్భంగా మూడు మజీద్లు, ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేములవాడలోనూ మరో ఇండోనేషియా బృందం పర్యటించి వెళ్లిన అంశంపై అధికారులు ఆరా తీశారు. ఎవరెవరు వచ్చారు..? ఏయే ప్రాంతాల్లో పర్యటించారన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. -
సీఎంకు మాజీ సీఐ దాసరి భూమయ్య బహిరంగ లేఖ!
సాక్షి, కరీంనగర్: రిటైర్డు డీఎస్పీ, ప్రస్తుతం ఎస్ఐబీలో పనిచేస్తున్న వేణుగోపాల్‌రావుతో పాటు, హైదరాబాద్‌కు చెందిన ఎక్కటి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని రిటైర్డు సీఐ, పీసీసీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ పంపారు. బుధవారం భూమయ్య తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలీసు అధికారిగా విధి నిర్వహణలో నిక్కచ్చిగా పనిచేసిన తనకు అప్పటి ప్రభుత్వాలు ఎన్నో అవార్డులు, రివార్డులు ఇచ్చాయని, బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌తో పాటు నలుగురు గన్మెన్లను ఇచ్చిందని గుర్తుచేశారు. పోలీసుశాఖలో అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండి, విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించడం వల్ల రిటైర్డు డీఎస్పీ వేణుగోపాల్‌రావుతో పాటు కొంత మంది తనపై కక్ష కట్టారని ఆరోపించారు. హుస్నాబాద్ పోలీసుస్టేషన్లో మాయమైన తుపాకుల కేసులో తనను ఇరికించి మనోవేదనకు గురి చేశారన్నారు. హుస్నాబాద్ తుపాకుల కేసు విషయం తేటతెల్లమైందని గుర్తు చేశారు. ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయాలని తనను 2018 సంవత్సరంలో ఏసీబీ కేసులో ఇరికించి జైలుపాలు చేశారని, ఆ కేసు కోర్టు పరిధిలో ఉందని నిర్దోషిగా బయటపడుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా పోలీసు ఇన్ఫార్మర్ అయిన హైదరాబాద్‌కు చెందిన ఎక్కటి జైపాల్‌రెడ్డి అనే వ్యక్తి తనపై హైదరాబాద్‌లో చైతన్యపురి పోలీసుస్టేషన్లో మరోకేసు నమోదు చేయించారని, కట్టుకథలు అల్లుతూ తనను ఎలాగైనా అంతమొందించాలని పోలీసు అధికారి వేణుగోపాల్‌రావు కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డి అనే వ్యక్తిని చంపేందుకు తాను సుపారీ ఇచ్చి కొందరిని పంపించానని, వాళ్లు తనకు లొంగిపోయారని జైపాల్‌రెడ్డి చెప్పడాన్ని చూస్తుంటే ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేశారు. నక్సలైట్లకు టార్గెట్‌గా ఉండి ప్రభుత్వ పక్షాన ఉన్న తనకు గన్మెన్లను తొలగించడమే కాకుండా ఏసీబీ కేసు నమోదైందనే సాకుతో తన గన్ లైసెన్స్‌ను సైతం రద్దు చేశారని ఆరోపించారు. జైపాల్‌రెడ్డి వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయని, అతనికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సంబంధాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని నిరాయుధుడైన తాను ఎలా చంపగలనని ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డిని పోలీసులే అంతమొందించి, ఆ నేరాన్ని తనపై నెట్టే ప్రమాదం ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలకు సూత్రధారి, పాత్రధారి అయిన వేణుగోపాల్‌రావును వెంటనే ఎస్ఐబీ ఉద్యోగం నుంచి తొలగించి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియాకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
గద్దెనెక్కిన సారలమ్మ
అడవి బిడ్డల మహా జాతర జిల్లాలో వైభవంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కోయపూజారుల మంత్రోచ్చరణలు.. డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాల నడుమ సారలమ్మ గద్దెకు చేరుకుంది. దీంతో జాతరలో మొదటిఘట్టం కన్నుల విందుగా సాగింది. బుధవారం సాయంత్రం నుంచే జిల్లాలోని సమ్మక్క గద్దెల వద్దకు భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ నగరపాలక పరిధిలోని రేకుర్తి, శంకరపట్నం, వేగురుపల్లి– నీరుకుల్ల, వీణవంక, హుజూరాబాద్, కొత్తపల్లి మండలం చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సమ్మక్క– సారలమ్మ జాతరకు వేలాది మంది పయనమవుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నేడు సమ్మక్కతల్లి గద్దెకు చేరుకోనుంది. శుక్రవారం అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క– సారలమ్మ జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. తొలిరోజు బుధవారం వరకే లక్షమందికి పైగా భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. రేకుర్తి కరీంనగర్లో విలీనమైన తరువాత తొలిసారి నిర్వహిస్తున్న జాతర సందర్భంగా బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. సారలమ్మకు ఘనస్వాగతం.. రేకుర్తి శ్రీ సమ్మక్క– సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కోయ పూజారులు, ఆలయ ఈవో రత్నాకర్‌రెడ్డి, వ్యవస్థాపక చైర్మన్ పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో పక్కనే ఉన్న కొండపైకి వెళ్లారు. అక్కడ సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా ఊరేగింపు మధ్య గద్దెవద్దకు తీసుకొచ్చారు. అమ్మవారు వచ్చే సమయంలో భక్తులు ఘనస్వాగతం పలికారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సాయంత్రం 5.10 గంటలకు సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలకు చేరనుంది. అప్పటి నుంచి ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనం ఇస్తారు. శుక్రవారం అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి. శనివారం సాయంత్రం వనప్రవేశం చేస్తారు. ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం సాయంత్రానికే లక్షమందికి పైగా భక్తులు వచ్చారు. గురువారం, శుక్రవారం మరో ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. తాగునీరు, సానిటేషన్, బందోబస్తు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఏర్పాట్లను కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జాతర నోడల్ అధికారి క్రాంతి బుధవారం పరిశీలించారు. భక్తులకు శానిటేషన్, మంచినీరు, స్నానపుగదులు, దుస్తులు మార్చుకునే గదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సమయంలో తీసుకునే చర్యలను అధికారులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా సందడి.. సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. జిల్లాలో రేకుర్తితో పాటు శంకరపట్నం, హుజూరాబాద్, వీణవంక, వేగురుపల్లి– నీరుకుల్ల, చింతకుంట(శాంతినగర్), చొప్పదండి మండలంలోని ఆర్నకొండ తదితర ప్రాంతాల్లో జాతర ఘనంగా ప్రారంభమైంది. సారలమ్మ తల్లి ఆగమనంతో అన్ని ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అందుకు అనుగుణంగా అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్..?
సాక్షి, శంకరపట్నం(మానకొండూర్): కేశవపట్నం ఎస్సై శ్రీనివాస్‌ను సోమవారం పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆరు నెలల క్రితం జమ్మికుంట పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్సై శ్రీనివాస్ బదిలీపై కేశవపట్నం వచ్చారు. గతంలో ఇప్పలపల్లె గ్రామ శివారులో పేకాటలో పట్టుబడిన వారిలో కొందరిపై కేసు నమోదు చేసి, మరి కొందరిని కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారు. ఈ విషయమై ‘పేకాటలో పోలీసుల చేతివాటం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పేకాటలో పట్టుబడిన వారిలో కొందరిని విడిచిపెట్టడంతోపాటు కానిస్టేబుల్ రాజునాయక్ డబ్బులు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చా యి. సివిల్ తగాదాల్లో తలదూర్చి వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నా యి. శంకరపట్నం మండల సర్పంచ్ల ఫోరం ఎమ్మెల్యే, అధికారులకు ఎస్సై శ్రీని వాస్‌పై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్ రాజునాయక్‌ను సస్పెండ్ చేస్తూ వేటు వేసినట్లు సమాచారం. కరీంనగర్లో పని చేస్తున్న ఓ ఎస్సైకి కేశవపట్నం ఎస్సైగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. -
కరీంనగర్ పైనా గులాబీ జెండా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ విజయాల ఖాతాలో కరీంనగర్ నగర పాలక సంస్థ కూడా చేరింది. రెండు రోజుల ఆలస్యంగా ఎన్నికలు జరిగిన కరీంనగర్లో ఇతర పురపాలక సంస్థల తరహాలోనే కారు షికారు చేసింది. 60 మునిసిపల్ డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో రెండు స్థానాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, మిగతా 58 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 31 గెలుచుకుంది. దీంతో 33 మంది అభ్యర్థుల గెలుపుతో ఇతర పార్టీల సభ్యుల సహకారం లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కైవసం చేసుకునే స్థాయిలో మెజారిటీ సాధించింది. కాగా 53 డివిజన్లలో పోటీ చేసిన బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందింది. గత కౌన్సిల్లో ఏకంగా 14 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి జీరోకే పరిమితమైంది. సిట్టింగ్ కార్పొరేటర్లు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఎంఐఎం పది చోట్ల పోటీ చేసి ఆరింట విజయం సాధించింది. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్స్ మూడు చోట్ల గెలుపొందడం గమనార్హం. ఇక స్వతంత్రులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు. కాగా 29న జరిగే తొలి నగర పాలక మండలి సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. టీఆర్ఎస్కు బీజేపీ గట్టిపోటీ 2014లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో టీఆర్ఎస్ 24 స్థానాలు గెలుచుకొని, ఇతర పార్టీల సహకారంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను సాధించుకుంది. ఈసారి 60 డివిజన్లకు పోటీ చేసిన టీఆర్ఎస్కు బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైంది. 40కి పైగా సీట్లు సాధిస్తుందని భావించిన అధికార పార్టీకి సైలంట్ ఓటింగ్‌తో బీజేపీ షాకిచ్చింది. 2014లో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌తోపాటు మరో సీటు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా 13 స్థానాల్లో విజయం సాధించింది. మరికొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఎంఐఎం తన బలాన్ని 2 స్థానాల నుంచి ఆరుకు పెంచుకుంది. టీఆర్ఎస్ టికెట్టు ఆశించి భంగపడి ‘సింహం’గుర్తుతో ఏఐఎఫ్బీ నుంచి పోటీ చేసిన వారిలో ముగ్గురు విజయతీరాలకు చేరారు. ఇక స్వతంత్రులుగా విజయం సాధించిన ఐదుగురు కూడా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నుంచి టికెట్టు ఆశించి భంగపడ్డ వారే కావడం గమనార్హం. కరీంనగర్లో అన్ని పట్టణాల్లో టీఆర్ఎస్సే కరీంనగర్లో గెలుపుతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ విజయయాత్ర సంపూర్ణమైంది. ఇప్పటికే సోమవారం జరిగిన పాలకమండళ్ల ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లను టీఆర్ఎస్ కైవసం కైవసం చేసుకుంది. 14 మునిసిపాలిటీల్లో సైతం గులాబీ జెండాతో గెలిచిన వారే మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. -
కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
-
మంత్రి గంగుల వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్ : భూదందాలతో డబ్బులు దండుకున్న వారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లోని పలు డివిజన్లలో రోడ్ షో తో మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకొని టిఆర్ఎస్కే ఓటు వేయాలని సూచించారు. నాయకులను పిలిచి మరీ.. ఓటుకు రెండు వేలు తీసుకోవాలని మంత్రి ఓటర్లకు తెలిపారు. ఎన్నికల్లో పంచె డబ్బులు మనవేనని, కాదనకుండా తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. -
నన్ను చూసి.. వారికి ఓటేయండి: ఈటల
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి చల్ల స్వరూపరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అభ్యర్థులను చూడకుండా వారి వెనక ఉన్న తనను చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే అభ్యర్థులకు శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒకరో, ఇద్దరో గెలిస్తే వారు అభివృద్ధి చేయలేరని, పదవులు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేవని, ఆ పదవిని ప్రజల సేవ కోసం ఉపయోగించాలని హితవు పలికారు. ప్రజలు మెచ్చే పద్ధతిలో నాయకుల పని విధానం ఉండాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఇక హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని మంత్రి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా: జగిత్యాలలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఓ వ్యక్తిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుంచి రూ. 7లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థుల ఆందోళన పెద్దపల్లి జిల్లా: సుల్తాన్‌బాద్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీధర్ రావు తమ పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కొందరు విద్యార్థులు కళాశాల భవనంపై వాటర్ ట్యాంక్ ఎక్కి యాజమాన్యం దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దిగేది లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. -
మున్సిపల్లో ర్యాండమైజేషన్ సిబ్బంది: కలెక్టర్
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎన్నికల అబ్జర్వర్‌తో కలిసి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్‌స్టేషన్‌కు ఒక ప్రిసైడిండ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను మొత్తం ఐదుగురిని ఒక బృందంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలో పని చేయని, ఇతర మండలాల్లో పని చేస్తున్న సిబ్బందిని, ఒకే స్కూల్, ఒకే కార్యాలయం నుంచి ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, అన్ని పోలింగ్ టీంలలో ఒక మహిళ ఉద్యోగి ఉండేలా కేటాయింపులు చేశామని, పోలింగ్ విధుల్లో మున్సిపల్ ఉద్యోగులను ఎవరినీ నియమించలేదని పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 348 మంది ప్రిసైడింగ్ అధికారులు(పీవో), 348 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీవో), 1,044 మంది ఇతర పోలింగ్ అధికారులు, మొత్తం 1,710 మంది సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 46 మంది పీవోలు, 46 మంది ఏపీవోలు, 138 మంది ఇతర పోలింగ్ సిబ్బంది మొత్తం 230 మంది, జమ్మికుంట మున్సిపాలిటీకి 60 మంది పీవోలు, 60 మంది ఏపీవోలు, 180 మంది ఇతర పోలింగ్ అధికారులు, మొత్తం 300 మంది సిబ్బందిని కేటామయించినట్లు తెలిపారు. చొప్పదండి మున్సిపాలిటీకి 24 మంది పీవోలు, 24 మంది ఏపీవోలు, 72 మంది ఇతర సిబ్బంది మొత్తం 120 మంది, కొత్తపల్లి మున్సిపాలిటీకి 15 మంది పీవోలు, 15 మంది ఏపీవోలు, 45 మంది ఇతర సిబ్బంది, మొత్తం 75 మందిని కేటాయించినట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో 20 శాతం పోలింగ్ సిబ్బందిని రిజర్వ్‌గా ఉంచుటకు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు అద్వైత్‌సింగ్, జేసీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రావీణ్య, కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్న ఒకటే: పొన్నం
సాక్షి, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సెలెక్ట్ ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆశావాహులు కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికకు 15 మంది సభ్యులతో కమిటీ వేశామని అన్నారు. ఎంత మంది పార్టీని వీడినా, ఆఖరికి తాను కూడా వెళ్లినా కాంగ్రెస్ జీవనదిలాంటిదన్నారు. కరీంనగర్ కార్పోరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగుతుందని మంత్రి చెప్పడం అవాస్తవమని అన్నారు. కరీంనగర్లో టీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిపై చర్చకు మంత్రి గంగుల సిద్ధమా అని సవాల్ విసిరారు. లండన్, న్యూయార్క్ లాగా కరీంనగర్‌ను చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వేములవాడ దగ్గరున్న నీటిని చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. (జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం) దేశానికి కాంగ్రెస్ మాత్రమే రక్ష అని, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ టీఆర్ఎస్, బీజేపీ ఆశాంతికి కారణమవుతున్నాదని ఆరోపించారు. కరీంనగర్లో పార్టీకి నష్టం కలగకుండా తొందరలోనే కమిటీ వేయాలని పార్టీని కోరారు. తాను నామినేషన్ వేసినప్పుడు రానోళ్లు ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఎవరున్నా..లేకున్నా పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. వార్డుల విభజనలో అభ్యంతరాలు తీసుకున్నా.. వాటిని పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల టికెట్లలో తాను ఎవరికీ సిఫారసు చేయనని స్పష్టం చేశారు. -
క్రిస్మస్ కానుకలు సిద్ధం
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను సిద్ధం చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయాలని, క్రిస్మస్ రోజు వారికి విందు ఏర్పాటు చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్ ప్యాక్‌లను అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో మనిషికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. ఈ మేరకు క్రిస్మస్ పండుగ కిట్లతోపాటు విందు భోజనం ఏర్పాట్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల కలెక్టరేట్లో క్రైస్తవ మతపెద్దలతో సమీక్ష నిర్వహించి పండుగ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్‌కు దుస్తుల పంపిణీ చేసి ఇఫ్తార్ విందులు, క్రైస్తవులకు కానుకలను అందజేస్తోంది. ప్రభుత్వం 2014 నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తుండగా.. ఈసారి కూడా క్రిస్మస్కు వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొత్త దుస్తులు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక చీర, జాకెట్, ప్యాంట్, చొక్కా, చుడీదార్ డ్రెస్మెటీరియల్స్తో కూడిన గిఫ్ట్ ప్యాక్‌లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గానికి వెయ్యి కిట్లు.. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్ ప్యాక్‌లను సిద్ధం చేసి పంపించారు. గిఫ్ట్ ప్యాక్‌లు పొందే లబ్ధిదారులకు క్రిస్మస్ రోజున నియోజకవర్గాల్లో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని, వెయ్యి మందికి రూ.2 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. నేటి నుంచి పంపిణీ.. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, కొడిమ్యాల మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతుల మీదుగా బుధవారం క్రైస్తవులకు కానుకలు అందజేయనున్నారు. ఈ నెల 21న కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీకి నిర్ణయించారు. క్రిస్మస్ రోజు ఏర్పాటు చేసే విందు భోజనాల కార్యక్రమంలో కూడా వీరు క్రైస్తవ మతపెద్దలు, ఇతర మతాలకు చెందిన పెద్దలు పాల్గొంటారు. చర్చి పాస్టర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక... నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. కరీంనగర్‌లోనే 28 వేల మంది క్రైస్తవులు ఉండగా జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య 50 వేల వరకు ఉంటుందని మత పెద్దలు పేర్కొంటున్నారు. వీరిలో అత్యధికులు నిరుపేదలు కాగా ప్రభుత్వం నాలుగు వేల మందికి మాత్రమే క్రిస్మస్ కానుకలు అందించి విందు భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై క్రైస్తవుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్ని ఏర్పాట్లు చేశాం క్రిస్టియన్ మైనార్టీలకు పంపిణీ చేసేందుకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గిఫ్ట్‌ప్యాకెట్లు సిద్ధం చేశాం. ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి మంది నిరుపేద క్రైస్తవులను ఎంపిక చేశాం. పేదరికంలో ఉండి క్రిస్మస్కు కొత్తబట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం కిట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. – రాజర్షిషా, మైనార్టీ డెవలప్మెంట్ అధికారి -
ఫ్రీడం స్కూల్ విధానానికి గురుకుల సొసైటీ శ్రీకారం
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): సంప్రదాయ బోధనా పద్ధతులకు భిన్నంగా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ, వారిలో బోధన, గ్రహణ, పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ స్వేచ్ఛా పాఠశాలల (ఫ్రీడం స్కూళ్లు) విధానం తీసుకువచ్చింది. స్వేచ్ఛా పాఠశాలల్లో పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకు నడుస్తోంది. దీంతో ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనతో సేచ్ఛ ప్రారంభం ఉదయం ప్రార్థనతో విద్యార్థులకు సేచ్ఛ ప్రారంభం అవుతుంది. మాడ్యూల్స్‌లోని అంశాలపై విద్యార్థులు పరస్పరం వేర్వేరుగా, బృందాలుగా చర్చలు జరుపుకోవడంతోపాటు లోతుగా పరిశీలించడం చేస్తుంటారు. సాధారణ పాఠశాలల్లో నిర్వహించే పరీక్షలు ఈ పాఠశాలల్లో కానరావు. పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు. స్కిట్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతో విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. పాఠాల బోధనకు స్వస్తి స్వేచ్ఛా పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠాలు బోధించరు. సలహాదారులుగా మాత్రమే ఉంటారు. తరగతిగదుల్లో చదువుకోవాలనే నిబంధనలేమీ ఉండవు. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయనే భయం ఉండదు. విద్యార్థుల ప్రతిభను బట్టి మార్కులు వేస్తుంటారు. ఈ పాఠశాలల్లో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు భయం ఉండదు. ఆటలు ఆడుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. అంతా విద్యార్థుల ఇష్టం. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య ఆప్యాయత పెంపొందించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. వీటి ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు కరచాలనం, ఆలింగనం చేసుకుంటారు. దీంతో పిల్లల్లో భయం పోయి ఉపాధ్యాయులతో ఆత్మీయంగా ఉంటారు. 23 గురుకుల పాఠశాలల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 23 గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం సేచ్ఛా పాఠశాలల విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపరిచేందుకు సరికొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అన్ని గురుకులాల్లో ఏర్పాటు చేయాలి ఫ్రీడం స్కూల్ విధానాన్ని దశలవారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో అమలు చేయాలి. గురుకులంలో చదువుతున్న విద్యార్థిని 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ, బెంగుళూరులో పేరుగాంచిన యూనివర్శిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఫ్రీడం స్కూల్ విధానం అమలులోకి వస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. – అంబాల ప్రభాకర్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జమ్మికుంట పరిజ్ఞానం పెరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 23 గురుకులాల్లో స్వేచ్ఛా పాఠశాలల విధానం కొనసాగుతోంది. విద్యార్థుల్లో పరి జ్ఞానం పెరుగుతుంది. బోధన, అభ్యసన తదితర కార్యక్రమాలన్నీ విద్యార్థులే చూసుకోవడం వల్ల ప్రతీ అంశంపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఇది భయాన్ని పోగొట్టే కార్యక్రమం. – పల్లె సురేందర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీపీఏ, చింతకుంట కొత్త విషయాలు తెలుస్తాయి ఫ్రీడం స్కూల్ విధానంలో విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్తకొత్త పద్ధతులు అలవాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. విద్యార్థులపై ఒత్తిడి లేని బోధన, అభ్యసన సాగాలనే ఉద్దేశంతో అమలు చేసిన స్వేచ్ఛా పాఠశాలల విధానాన్ని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. – గుడిసె అనిత, ముస్తాబాద్ -
యువతపై కమిషనర్ ఉక్కుపాదం!
సాక్షి, కరీంనగర్: సామాజిక మాధ్యమాలు... కొత్త కొత్త పోకడలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇంటర్, డిగ్రీ చదువుతున్న యువకులు దురలవాట్లకు చేరువవుతూ సంఘ విద్రోహ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. రౌడీషీటర్లు, ల్యాండ్ మాఫియా నడిపే వ్యక్తులకు చేరువవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ యువత దారి తప్పకుండా వ్యవస్థను కూకటివేళ్లతో నరికే దిశగా చర్యలు చేపట్టింది. కరీంనగర్, రామగుండం పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వెర్రితలలు వేస్తున్న యువత పోకడలను ఆదిలోనే తుంచివేసేందుకు కమిషనర్లు విడివిడిగా చర్యలు చేపట్టారు. కరీంనగర్ శివార్లలో భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ సెటిల్మెంట్లు సాగిస్తున్న వ్యక్తుల ను ఓ వైపు టార్గెట్ చేసుకుంటూనే... యువతరంతో గ్యాంగులు తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతూ జనాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపేందుకు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. లవన్‌కుమార్ అనే ఓ రౌడీషీటర్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిషనర్ అతనికి సహకరిస్తున్న వారిని, అతను పెంచిపోషిస్తున్న గ్యాంగ్‌ను టార్గెట్ చేశారు. గురువారం స్వయంగా టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయన లవన్ గ్యాంగ్, అతనికి సహకరిస్తున్న వారి గురించి ఆరా తీశారు. అదుపులోకి తీసుకున్న వారి వివరాలు తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా యువకులు సాగిస్తున్న దందాలు, నమోదైన కేసులను పరిశీలించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న 169 మంది రౌడీషీటర్లు, ఆస్తుల వివాదాల్లో జోక్యం చేసుకొనే మరో 241 మంది ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులను తూలనాడుతున్న వ్యక్తులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. శివార్లలో పెరిగిన భూదందాలు కరీంనగర్ శివార్లలో భూ వివాదాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి రూట్లలో జిల్లా కేంద్రం నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు భూముల క్రయ విక్రయాల్లో లాండ్ మాఫియా ప్రవేశించింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, కరీంనగర్ నుంచి భూదందా సాగించే మాఫియా ప్రధాన రోడ్ల పక్కన ప్లాట్లు కొన్న వారిని, భూములు కొన్న వారిని లక్ష్యంగా చేసుకొని లేని వివాదాలు సృష్టిస్తున్నారు. తరువాత సెటిల్మెంట్ల పేరుతో గతంలో భూములు కొన్నవారిని, అమ్మిన వారిని బెదిరించి తామే సొంతం చేసుకుంటున్నారు. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన దందాల స్థాయిలో కరీంనగర్ చుట్టుపక్కల ల్యాండ్ మాఫియా భూ వివాదాలు సృష్టిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి భూ వివాదంలో జోక్యం చేసుకున్న లవన్ కుమార్ అనే రౌడీషీటర్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించారనే అనుమానంతో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. బొమ్మకల్ ప్రాంతంలో ఓ స్థానిక ప్రజాప్రతినిధి ఆగడాలు కూడా పెరిగిపోవడంతో ఆ వైపు కూడా దృష్టి పెట్టారు. చిన్న చిన్న భూవివాదాలను పెద్దవిగా చేసి, లబ్ధిపొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న ఈ దందాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి సమాచారం తెప్పించిన కమిషనర్ ఫిర్యాదులు అందిన వెంటనే ‘లోపలికి’ పంపించే దిశగా ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, కించపరిచే వ్యాఖ్యలు పెట్టిన వారిపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో చదువుకొంటూనో... ఉద్యోగాలు చేస్తూనో ఉండే యువకులు రెచ్చగొట్టేలా పెట్టే పోస్టింగ్‌లను కూడా సీరియస్‌గా తీసుకొని ‘రెడ్‌కార్నర్’ నోటీస్‌లు జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 241 మంది భూవివాదాల్లో జోక్యం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో కలిపి 536 మందిని వివాదాస్పద వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు, పలు ‘షీట్ల’ను తెరిచారు. క్రిమినల్ కేసుల్లో బుక్కయిన వారు, బెదిరింపులకు పాల్పడుతూ రౌడీయిజం చేస్తున్న 169 మంది మీద ఇప్పటికే రౌడీషీట్లు తెరిచారు. వీరిలో కొందరిపై పీడీ యాక్టు ప్రయోగించి జైళ్లకు పంపించారు. మతపరమైన సమస్యలు వచ్చినప్పుడు అనుమానాస్పదంగా వ్యవహరించే 61 మంది జాతకాలు కూడా తీసుకున్నారు. ఇక ఆస్తులకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకునే వారి జాబితా 241గా రికార్డు చేశారు. వీరిలో 100 మంది వరకు రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. మట్కా ఆడించేవారు ఐదుగురైతే, గుట్కా సరఫరా చేసేవారు 47 మంది. గంజాయి రవాణాలో పాల్గొనే నలుగురు వ్యక్తులతోపాటు ఇసుక మాఫియా కింద మరో 9 మందిపై ప్రత్యేక షీట్లు తెరిచారు. వీరంతా కరీంనగర్ నుంచి హుజూరాబాద్, చొప్పదండి వరకు విస్తరించి ఉండడంతో వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కమిషనర్ అన్ని పోలీస్స్టేషన్లను ఆదేశాలు జారీ చేశారు. కాగా 84 మందిపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించడమే కాకుండా... జైలుకు వెళ్లివచ్చిన వారందరిపై రౌడీషీట్లు తెరవడం గమనార్హం. రౌడీయిజం, భూ దందాలను సహించం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదు. యువత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. విద్యార్థి దశలో దారి తప్పితే చెడు ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఉంది. బర్త్‌డే పార్టీలు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఇళ్లలోనే జరుపుకోవాలని తల్లిదండ్రులు చెప్పాలి. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ విషయంలో పోలీస్ శాఖ సీరియస్‌గా ఉంది. అక్రమ పద్ధతుల్లో భూదందాలు సాగిస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. బాధితులు సిటీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ 0878 – 2240276కు గానీ, ఇన్స్పెక్టర్కు 9440795104 నెంబర్ ద్వారా గానీ సంప్రదించవచ్చు. ఎవరినీ వదలం. – కమలాసన్‌రెడ్డి, కమిషనర్ ఆఫ్ పోలీస్ చౌరస్తాల్లో... కత్తులతో కేకులు కట్ యువత ఆలోచనలు వెర్రితలలు వేసిందనడానికి ఇటీవలి కాలంలో పెరిగిన రోడ్లపై బర్త్‌డేలు నిర్వహించుకునే సంస్కృతే నిదర్శనం. బైపాస్‌లో బొమ్మకల్ వైపున్న బ్రిడ్జి మీద గతంలో అర్ధరాత్రి బర్త్‌డేలు జరుపుకొన్నట్లు వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లడం లేదు. కానీ నగరంలోని కాలనీలు, రోడ్లతోపాటు మునిసిపాలిటీలు, గ్రామాల్లో చౌరస్తాల్లో రాత్రి 12 తరువాత తాగి తందనాలాడుతూ బర్త్‌డేలు జరుపుకొనే వింత ధోరణి పెరిగింది. బర్త్‌డే కేకును ప్లాస్టిక్ లేదా స్టీల్ చాకుతో కోయడం ఆనవాయితీ. కానీ ఇటీవల కాలంలో తల్వార్లు, పొడవాటి పెద్దపెద్ద కత్తులతో కేకులు కట్ చేస్తూ సినిమాల్లో తరహా వాటిని ప్రదర్శిస్తున్నారు. లవన్‌కుమార్ అనే రౌడీషీటర్ బర్త్‌డే పార్టీ కూడా ఓ అపార్ట్మెంట్లో రాత్రి నుంచి తెల్లవారు జాము దాక జరగడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో లవన్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. కాగా బర్త్‌డే సందర్భంగా గానీ, ఇతర ఏ సందర్భంలో గానీ కత్తులను ప్రదర్శిస్తే ‘ఆయుధ చట్టం’ కింద కేసు నమోదు చేయనున్నట్లు కమిషనర్ కమలాసన్ రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
కరీంనగర్లో ముగిసిన ఇస్రో ప్రదర్శన
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో రెండురోజులపాటు నిర్వహించిన ఇస్రో అంతరిక్ష ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. ఇస్రో పితామహుడు, ప్రముఖ ఖగోళశాస్త్రవేత్త విక్రం సారాబాయి శత జయంతి సందర్భంగా రాష్ట్రంలోని ఐదు ప్రముఖనగరాల్లో నిర్వహిస్తోంది. ఖగోళ ప్రదర్శన కరీంనగర్ జిల్లాలో రెండురోజులపాటు నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రసాంకేతి క పరిజ్ఞానం పెంపొందించడమే లక్ష్యంగా ప్రదర్శన ఏర్పాట యింది. ఉమ్మడి కరీంనగర్లోపాటు సిద్దిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వేలాదిమంది తరలివచ్చి ప్రదర్శన తిలకించారు. విద్యార్థులకు ఇస్రోశాస్త్రవేత్తలు ప్రతీ విషయం వివరిస్తూ ఖగోళశాస్త్రంపై ఆసక్తి పెంపొందించారు. విద్యార్థులతోపాటు వారి వెంట వచ్చిన ఉపాధ్యాయులు కూడా ఖగోళ పరిశోధనలు, రాకె ట్ ప్రయోగం, కమ్యూనికేషన్, టెక్నికల్ శాటిలైన్ ప్రయో గం, చంద్రయాన్, మంగళ్యాన్, రాకెట్, పీఎస్ఎల్వీ, ఉపగ్రహాల ప్రయోగం, పని తీరు, జీవితకాలం, అంతరిక్షంలో జరిగే ప్రమాదాలు, ఫ్యూయల్ వినియోగం, ప్రయోగంలో పాల్గొనే శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానం, దేశం తరఫున ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహాల గురించి వివరించారు. ఆకట్టుకున్న రాకెట్ ప్రయోగ ప్రదర్శన ఇస్రోశాస్త్రవేత్తలు విద్యార్థులకోసం తాత్కాలికంగా రూపొందించి ప్రయోగించిన రాకెట్‌లాంచింగ్ సన్నివేశం విద్యార్థులను సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. తక్కువ ఖర్చుతో నిర్మించిన వాటర్రాకెట్ను విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. ఒత్తిడి, పైగి ఎగిసే వేగం తదితర అంశాల గురించి విద్యార్థులు వివరించారు. సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. గైడ్లు కూడా విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేశారు. ఆలోచింపజేసిన చంద్రయాన్–2 ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రయోగాన్ని కళ్లకు కట్టేలా శాస్త్రవేత్తలు ప్రదర్శించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇస్రో బస్సులో చంద్రయాన్ ప్రయోగం, అది వెళ్లిన దూరం, క్రాష్ ల్యాండ్ అయిన వివరాలు వీడియో రూపంలో ప్రదర్శించడంతోపాటు విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించారు. ప్రయోగం తీరు, విఫలం కావడానికి కారణాలు విద్యార్థులను ఆలోచింపజేసింది. రాకెట్లు, ఉపగ్రహ నమూనాల ప్రదర్శన.. ఇస్రో ప్రదర్శనలో భాగంగా రాకెట్ల నమూనాలు, ఉపగ్రహ నమూనాలు, ఇంధన వినియోగం, భూఆకర్షణ శక్తి, గురు గ్రహ ఆకర్షణ, కక్షలు, ఒక కక్ష నుంచి మరో కక్షలోకి ప్రవేశపెట్టే విధానం, కమ్యూనికేషన్, టెక్నీకల్ ఇన్మర్మేషన్ వినియోగం తదితర అంశాలను శాస్త్రవేత్తలు చిత్రాలు, వీడియోల ద్వారా సందర్శకులకు వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, సందర్శకులు ‘సాక్షి’తో అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగం.. రాకెట్ ప్రయోగంపై అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇళ్లలో లభించే ఖాళీ బాటిళ్లు, గాలి, నీరుతో ప్రయోగించే విధానాన్ని ఇస్రో ప్రదర్శనలో విద్యార్థులకు కళ్లకు కట్టేలా చూపించాం. ప్రతక్ష అనుభవం ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగింది. చాలామంది సందర్శకులు తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. సందేహాలు అడిగి తెలుసుకున్నారు. – హరీష్‌కుమార్, ఇస్రో గైడ్ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి ప్రతీ విద్యార్థిలో శాస్త్రపరిజ్ఞానం ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. చాలామంది విద్యార్థులు హాజరై ప్రత్యక్ష అనుభవం పొందారు. సందేహాలు నివృత్తి చేశారు. అనుమానాల గురించి అడిగి తెలుసుకున్నారు. నమూనాలు ప్రత్యక్షంగా పరిశీలించారు. – పద్మారాణి, ఇస్రో శాస్త్రవేత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపే లక్ష్యం.. విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో దేశంలోని వంద నగరాల్లో ప్రదర్శనకు కార్యాచరణ రూపొందించాం. ఇందులో భాగంగా తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మంలో ప్రదర్శన ఏర్పాటు చేశాం. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. సుమారు 20 వేల మంది రెండురోజులు ప్రదర్శన తిలకించారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకున్నారు. – రాజశ్రీ, ఇస్రో మేనేజర్ ప్రత్యక్ష అనుభూతి.. ఇస్రో అంతరిక్ష ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఈ ప్రదర్శనలో నేను వలంటీర్ గైడ్‌గా వ్యవహరించా. నేను ప్రయోగాలు, ఉపగ్రహాలు రాకెట్ల గురించి తెలుసుకుంటూ సందర్శనకు వచ్చిన విద్యార్థులకు వివరించడం ప్రత్యక్ష అనుభూతి కలిగించింది. చాలా వరకు నేను నేర్చుకోవడంతోపాటు విద్యార్థులకు తెలియజేశా. – పల్లవి, గైడ్ -
ఆర్టీసీ సమ్మె: 48 రోజులు.. రూ.30 కోట్లు
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మెను మించిపోయింది ఆర్టీసీ జేఏసీ సమ్మె. ఆర్టీసీ చరిత్రలోనే సుదీర్ఘమైన 48 రోజుల సమ్మెతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన రూట్లల్లో బస్సులు నడుపుతున్నా గ్రామీణ ప్రాంతాల్లోకి బస్సులు నడుపకపోవడం వల్ల ఆర్టీసీ ఆదాయం సగానికి తగ్గిపోయిందని చెప్పవచ్చు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ మాజీ ఉద్యోగులు, అధికారులు లెక్కలు వేసి చెబుతున్నారు. అయితే అదేమిలేదంటున్న అధికారులు వాస్తవ గణాంకాలను కూడా వెల్లడించడం లేదు. మరోవైపు సమ్మెలో ఉన్న కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు అందక పడుతున్న పాట్లు వర్ణనాతీతం. తాత్కాలిక సిబ్బందితో 48 రోజులుగా బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. అవి తిరిగిన రూట్లు అరకొరే. సమ్మెకు ముందు వచ్చిన ఆదాయంలో సగం కూడా ఆర్టీసీ ట్రెజరీలో జమకాలేదు, ఇక సగానికి పైగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోతున్నాయి. కరీంనగర్ రీజియన్ పరిధిలోని పది డిపోల్లో ఉన్న 651 బస్సులు సమ్మెకు ముందురోజు వరకు మూడున్నర లక్షల కిలోమీటర్లు తిరిగేవి. ప్రస్తుతం రోజు ఆర్టీసీ, ప్రైవేట్‌కు చెందిన 600 నుంచి 670 బస్సులు తిరుగుతున్నా... అవి సగటున 1.65 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. మరోవైపు రీజియన్ పరిధిలోని కార్మికులకు చెల్లించాల్సిన దాదాపు రూ.25 కోట్ల వేతనాలు నిలిచిపోయాయి. భారీగా తగ్గిన ఆదాయం... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తోపాటు మరో 22 డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ సెప్టెంబర్ 5 నుంచి సమ్మెను తలపెట్టింది. గురువారం నాటికి సమ్మె 48వ రోజుకు చేరుకుంది. గతంలో కరీంనగర్ రీజియన్‌లోని కరీంనగర్ వన్, టూ డిపోలు, హుజూరాబాద్, గోదావరిఖని, మంథని, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల బస్‌డిపోల పరిధిలో 448 ఆర్టీసీ బస్సులు, 203 అద్దె బస్సులు మొత్తం 651 బస్సులను నడిపించే వారు. ఈ బస్సులు ప్రతిరోజు 3.50 లక్షల కిలోమీటర్లు తిరిగి ప్రయాణికులను గమ్యం చేర్చి రోజుకు రూ.కోటి 10 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీకి సమకూర్చిపెట్టేవి. ఇప్పుడు ప్రతిరోజు 620 నుంచి 670 వరకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను నడిపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బస్సుల సంఖ్య పెరిగినా అవి ప్రయాణించే దూరం మాత్రం సగానికి పైగా తగ్గిపోయింది. గతంలో 3.50 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు 1.65 లక్షల కిలోమీటర్లు మాత్రమే బస్సులు తిప్పుతున్నారు. దీంతో సగానికి సగం ఆదాయం పడిపోయి రోజుకు సగటున 55 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే సమకూరుతున్నది. సమ్మెకు పూర్వం రోజుకు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల వరకు ఆదాయంగా సమకూరేది. ఈ లెక్కన గడిచిన 48 రోజుల్లో రూ.55 కోట్ల వరకు ఆదాయం సమకూరాల్సి ఉండగా... వచ్చిన రాబడి రూ.26.45 కోట్లు మాత్రమే. 48 రోజుల్లో రూ.30 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు జవాబుదారీ తనం లేకపోవడం కూడా ఆదాయంపై ప్రభావం చూపిందని మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు ఆర్టీíసీకి వాటిల్లిన నష్టం తరహాలోనే ప్రజలు కూడా ప్రైవేటు వాహనాలకు అధిక చార్జీలు చెల్లించి నష్టపోయారు. కరీంనగర్ రీజియన్‌లో 4,130 మంది ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తుండగా వారికి నెలకు రూ.10 కోట్ల వేతనాలు చెల్లించేవారు. రెండు నెలలుగా సమ్మె కారణంగా వారు వేతనాలు పొందలేకపోతున్నారు. కార్మికులకు సమ్మెకు ముందు పనిచేసిన కాలానికి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో రెండు నెలలుగా జీతాలు రాక పస్తులుం డాల్సి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకా నిక్‌లు, కార్మికులు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంటి అద్దె చెల్లించలేక, అంతకుముందు తీసుకున్న అప్పులు, చిట్టిల కిస్తులు చెల్లించలేక, అనారోగ్యాలు ఏర్పడిన హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నా రు. డిపో మేనేజర్లకు అక్టోబర్ నెలలో అలవెన్సులు మాత్రమే చెల్లించాలని, వేతనాలు ఇవ్వద్దని ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మె కారణంగా బస్‌పాసులతో నెలవారీగా వచ్చే రూ.3.85 కోట్లు కూడా రాకుండా పోయింది. సమ్మె కారణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో వారికి అల్పాహారం, టీ, భోజనం, తాగునీరు సమకూర్చడానికే రోజుకు రూ.50 వేలు వెచ్చించాల్సి వస్తున్నదని, ఇప్పటికే సుమారు రూ.20 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. రక్షణ, నిర్వహణ ఖర్చులు అదనపు భారం.. కార్మికులు సమ్మెలో ఉండడంతో డిపోల వద్ద పోలీసు బందోబస్తుతోపాటు రెవెన్యూ, పంచా యతీరాజ్ శాఖల ఉద్యోగులను విధులకు కేటా యించారు. ఈ నిర్వహణ భారమంతా ఆర్టీసీనే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నిర్దిష్టం గా ఎంత చెల్లించారనే విషయంలో స్పష్టమైన లెక్కలు వేయలేదని, కానీ యాజమాన్యం నుంచి ఆదేశాలొచ్చిన వెంటనే ఆయా శాఖలకు నిధులివ్వాల్సి ఉంటుంది. ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. డిపోల వద్ద స్పెషల్ బ్రాంచి డీఎస్పీలు, సివిల్ డీఎస్పీల పర్యవేక్షణతోపాటు రోజు ఒక సీఐ నేతృత్వంలో 20 మంది ఇతర పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తంగా ఈ నిర్వహణకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో డిపోల్లో రోజూ సగటున రూ.లక్ష 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి దాదాపు రూ.72 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. తాత్కాలిక సిబ్బంది.. సగం సేవలు... కరీంనగర్ రీజియన్ పరిధిలో 454 మంది తాత్కాలిక డ్రైవర్లు,675 మంది కండక్టర్లు, మెయింటనెన్స్ కోసం మరో 300 మంది తాత్కాలిక పద్ధతిలో రోజుకు 600 నుంచి 670 వరకు బస్సులను నడిపిస్తున్నారు. ప్రధాన రూట్లకే బస్సులు పరిమితం అయ్యాయని తెలుస్తోంది. గ్రామీణ రూట్లకు బస్సులు నడవకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక కండక్టర్లకు రోజుకు రూ.1000, తాత్కాలిక డ్రైవర్లకు రూ.1500 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. వీరికి ఏ రోజు వేతనం అదే రోజు అందిస్తున్నామని డిపో మేనేజర్లు తెలిపారు. అధికారులకూ అందని అక్టోబర్ వేతనం.. ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులకు కూడా అక్టోబరు వేతనం ఇంకా రాలేదు. యాజమాన్యం వేతనాలను ఇంకా విడుదల చేయలేదని, ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే అవకాశముందని అధికా రులు తెలిపారు. డిపోల్లో మేనేజర్లతోపాటు ఒకరిద్దరు సిబ్బంది విధులలో ఉండడంతో షెడ్యూల్స్ నిర్వహణ, కలెక్షన్లు సరిచూసుకోవడానికే సరిపోతోందని వారు చెబుతున్నారు. -
ఆ అధికారుల మధ్య నిశ్శబ్ద యుద్ధం!
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం అమలు చేసే ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేర్చే రెండు వ్యవస్థల మధ్య అంతరం పెరుగుతోంది. ప్రభుత్వ పెద్దల వద్ద వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలనే ఆలోచన జిల్లా అధికార యంత్రాంగంలో కూడా పెరిగిపోవడంతో ప్రజా ప్రతినిధులతో నిశ్శబ్దయుద్ధం వాతావరణం నెలకొంది. మీటింగులు, ముఖ్యమైన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మెలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తనను అనర్హుడిని చేసేందుకు ఓ అధికారి విపక్ష నాయకుడితో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. కరీంనగర్ నుంచి అధికార పార్టీ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే ఆరోపణలు చేయడమే గాక, అప్పటి బీజేపీ అభ్యర్థి సంజయ్‌కుమార్‌తో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడిన ఆడియో టేప్‌ను ముఖ్యమంత్రికి పంపించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి తీరు వెలుగు చూసింది. ఒక్క కరీంనగర్‌లోనే గాక పెద్దపల్లి జిల్లాలో కూడా ప్రజా ప్రతినిధులు, అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం గమనార్హం. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు పెద్దపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులకు మింగుడు పడడం లేదు. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జిల్లా స్థాయి అధికారులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. 2014 నుంచే గంగులతో అంతరం? 2014లో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించారు. కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరించిన ఆయన వద్దకు మునిసిపల్ ఉద్యోగులు ఒక ఫైల్‌పై సంతకం కోసం వెళ్లారు. అప్పటి స్పెషల్ ఆఫీసర్ ఫైల్‌ను తమపైకే విసిరేశారని ఆరోపిస్తూ పెన్‌డౌన్ సమ్మె నిర్వహించారు. ఈ వివాదానికి అప్పటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూర్తి సహకారం అందించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందనే వాదన ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్‌తో గంగులకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇటీవల లీకైన సంజయ్–కలెక్టర్ ఆడియో టేప్‌తో వెల్లడవుతోంది. 2017లో రసమయితో ‘డోంట్ టాక్ ’ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ–ధన్‌మేళా కార్యక్రమాన్ని 2017 మార్చి 1న కరీంనగర్లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ వినోద్‌కుమార్ ఫొటో ముద్రించకపోవడాన్ని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ తప్పుపట్టారు. వేదికపైకి రమ్మన్నా వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. తరువాత ఈటల, వినోద్‌కుమార్ పిలవడంతో స్టేజీపైకి వెళ్లిన వీరిద్దరు వినోద్‌కుమార్ ఫ్లెక్సీ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రసమయి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఉద్ధేశించి ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ ఫొటో పెట్టకపోవడాన్ని తప్పు పడుతూ ప్రశ్నించగా... ఆయన ఎమ్మెల్యేకు కుడిచేతి వేలు చూపిస్తూ... ‘డోంట్ టాక్’ అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పెద్దపల్లిలో పూడ్చలేని అగాధం పెద్దపల్లి జిల్లాలో సైతం ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య అంతరం పూడ్చలేనంతగా పెరిగిందని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జిల్లా ముఖ్య అధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పారిశుధ్యంలో జిల్లా నెంబర్‌వన్‌గా మారినట్టు అవార్డులు వస్తున్నా... ఆ క్రెడిట్ ఏదీ ప్రజాప్రతినిధులకు రావడం లేదు. అదే సమయంలో పారిశుధ్య నిర్వహణ కోసం చేస్తున్న కొనుగోళ్ల వ్యవహారం కూడా వివాదాస్పదం అవుతోంది. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణకు 237 ట్రాక్టర్ల కొనుగోలు అంశం మొదలుకొని ప్లాస్టిక్ బుట్టలు, ట్రీ గార్డుల కొనుగోళ్ల వరకు ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే నిర్ణయాలు జరిగిపోయినట్లు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కీర్తికాంక్షతో ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోని వైనం పెద్దపల్లి జిల్లాలోనే నెలకొందని ఓ ఎంపీపీ ‘సాక్షి’కి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఏమాత్రం విలువ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు గౌరవ మర్యాదలకు ఢోకా లేకున్నా.. ఎంపీపీ, జెడ్పీటీసీల పరిస్థితి పెద్దపల్లికి భిన్నంగా లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు మధ్య పెరుగుతున్న అంతరం చివరికి ప్రజలకు అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
శాస్త్రవేత్తలు అయ్యాకే పెళ్లిపీటలు ఎక్కారు..
సాక్షి, జగిత్యాల : తల్లితండ్రులు ఒత్తిడి చేస్తున్నారని.. అబ్బాయిలు ప్రేమ పేరుతో వెంట పడుతున్నారని.. వయస్సు పెరిగిపోతోందని.. ఉద్యోగం రాక ఇక చదువు అయిపోయిందనే తదితర కారణాలతో అనుకున్న లక్ష్యాలు, కోరికలు నెరవేరకుండానే నేటి యువతులు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఆ తర్వాత పెద్ద ఉద్యోగం రాక.. చిన్నచిన్న ఉద్యోగాలు చేయలేక.. పిల్లల బాధ్యత మోయలేక.. రకరకాల ఆర్థిక, కుటుంబ సమస్యలతో విలవిలలాడుతున్నారు. గృహిణిగా అత్తింటి వేధింపులు, భర్త చీదరింపులు, భార్యాభర్తల మధ్య ఏదో విషయంపై రోజు గొడవలతో.. ఏదో ఇలా గడిచిపోతోందంటూ యువతులు తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన పలువురు మహిళలు విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, లక్ష్యం సాధించేవరకు అహోరాత్రులు కష్టపడి, విజయం సాధించిన తర్వాతే తాను మెచ్చిన, తనకు నచ్చిన జోడిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడుతున్నారు. జగిత్యాల మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన పలువురు యువ మహిళలు కలలుకన్న ‘శాస్త్రవేత్త’ అనే ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడ్డారు. 25–27 ఏళ్ల వయస్సులోనే లక్ష్యాన్ని విజయవంతంగా సాధించారు. ఇప్పుడు తనకు నచ్చిన, మెచ్చిన వరుడిని పెళ్లి చేసుకున్నారు. భర్త, పిల్లలతో ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారే పరిశోధన స్థానానికి చెందిన ఆరుగురు యువ మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్ డి.రజినిదేవి, బి.మాధవి, సాధ్వి, ప్రజ్ఞ, యమున, స్వాతి. యువ మహిళా శాస్త్రవేత్తల మనోభావాలు వారి మాటల్లోనే.. ఇద్దరం శాస్త్రవేత్తలమే.. నాది భువనగిరి ప్రాంతంలోని మోతుకూర్ మండలం పాలడుగు గ్రామం. చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో బీఎస్సీ అగ్రికల్చర్ అశ్వారావుపేటలో, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. చదువు పూర్తి కాగానే ఏడాదిపాటు వ్యవసాయశాఖలో ఏఈఓగా పనిచేసిన. 2018లో శాస్త్రవేత్తగా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాతే హన్మకొండ ప్రాంతంలోని ఐనవోలు మండలం ముల్కలగూడెంకు చెందిన రాజుతో పెళ్లయింది. మావారు కూడా పొలాసలో శాస్త్రవేత్తే. మహిళలు ఇంటికి పరిమితమైతే చదివిన చదువుకు సార్థకత ఉండదు. – బి.మాధవి–రాజు దంపతులు తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి మా ఊరు సిద్దిపేట. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని కుటుంబసభ్యులకు చెప్పిన. ఆ మేరకు కష్టపడి చదివి శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించిన. బీఎస్సీ, ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ను రాజేంద్రనగర్‌లో చదివి, ఆ తర్వాత శాస్త్రవేత్తగా ఎంపికయ్యా. వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహేష్‌తో 2019లో పెళ్లి జరిగింది. పెళ్లి కంటే ముందు ఉద్యోగం సాధించాలంటే తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలి. – సాద్వి–మహేష్‌రెడ్డి దంపతులు చిన్నప్పటి నుంచి కష్టపడటంతోనే.. నాది వరంగల్ జిల్లా మహబూబాబాద్. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోవద్దనుకున్నాను. ఆ మేరకు ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ లక్ష్యం కోసం తపించాను. బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ బాపట్లలో, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. పొలాసలో రిసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు 2016లో పెళ్లయ్యింది. 2017లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాబ్ వచ్చింది. నా భర్త గోన్యానాయక్ది నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఆయన సైతం పొలాసలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. – ప్రజ్ఞ–గోన్యానాయక్ దంపతులు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతే.. మాది వికారాబాద్. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలని అనుకున్నా. ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తానన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతే చేసుకుంటానని చెప్పిన. బీఎస్సీ హార్టికల్చర్ అశ్వరావుపేటలో, ఎమ్మెస్సీ హార్టికల్చర్ రాజేంద్రనగర్‌లో, పీహెచ్డీ పశ్చిమబెంగాల్లో పూర్తి చేసిన. అదే సమయంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యా. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకున్నా. మా జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. ప్రతీ విద్యార్థిని పట్టుదలతో ముందడుగు వేస్తేనే విజయం.– స్వాతి–శ్రీనివాస్ దంపతులు ఏదైనా సాధిస్తేనే ఆనందం మాది జోగులాంబ గద్వాల జిల్లా. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ. ఏదైనా సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పిన. తల్లిదండ్రులకు నమ్మకం కలిగించిన తర్వాత లక్ష్యం కోసం కృషి చేయడం ప్రారంభించిన. బీఎస్సీ అగ్రికల్చర్ అశ్వరావుపేటలో, ఎమ్మెస్సీ రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. కష్టపడి చదివి 2018లో వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించిన. ఇటీవలే రైల్వేలో సీనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అభినయ్‌రెడ్డితో వివాహమైంది. ఇప్పుడు జీవితం హ్యాపీ. ప్రతీ మహిళకు ఏదో సాధించాలనే తపన ఉండాలి.– యమున–అభినయ్‌రెడ్డి దంపతులు ఆనందమయ జీవితం.. మాది హుజూరాబాద్. చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త కావడమే లక్ష్యంగా ఉండేది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ(అగ్రికల్చర్) రాజేంద్రనగర్‌లో పూర్తి చేసిన. చదువు పూర్తి కాగానే కొద్దిరోజుల పాటు ఉద్యోగం చేసిన. ఆ సమయంలో జగిత్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేణుగోపాల్‌తో 2011లో పెళ్లి అయ్యింది. అహోరాత్రులు కష్టపడి 2018లో శాస్త్రవేత్తగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో మా జీవితం ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థిక స్వాతంత్య్రం కోసమైనా మహిళలు ఉద్యోగం చేయడం మంచిది. – డాక్టర్ రజనీదేవి–వేణుగోపాల్ దంపతులు -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
సాక్షి, కరీంనగర్ : ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 170 కొనుగోలు కేంద్రాలను ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సింగిల్‌విండో ఆధ్వర్యంలో 104, ఐకేపీ 50, డీసీఎంస్ 15, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుత సీజన్ నుంచి కొత్త నిబంధనల అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ శాఖల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలో జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లా లేబర్ ఆఫీసరు, లీడ్‌బ్యాంకు మేనేజరు సభ్యులుగా ఉంటారు. ధరణిపైనే భారం... ధాన్యం కొనుగోళ్లలో కీలకపాత్ర పోషించిన వీఆర్వోలను తప్పించి కొత్తగా ఏఈవోలకు బాధ్యతలు అప్పగించారు. గతంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాలంటే ఆయా గ్రామాల వీఆర్వోలు సంబంధిత పంట ఎంత పండించారంటూ నిర్ధారణ చేసి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ను సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలకు లింకేజీ చేయడంతో సంబంధిత రైతుల వివరాలన్నింటిని ఏఈవోలు సమగ్రంగా పరిశీలిస్తారు. రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. నెలాఖరులో ప్రారంభం.. జిల్లాలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ వరినాట్లు ఆలస్యమయ్యాయి. జూన్‌లో నాట్లు వేసినట్లయితే ఈ నెల మొదటివారంలో వరిపంట కోతకు వచ్చినట్లయితే ధాన్యం సేకరణ ప్రారంభించేవాళ్లు. ఆగస్టు నెలాఖరు వరకు వరినాట్లు వేయడంతో పంట దిగుబడి వచ్చేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశముంది. ప్రస్తుత ఖరీఫ్‌లో హుజూరాబాద్, గన్నేరువరం, మానకొండూరు, తిమ్మాపూర్, చిగురుమామిడి, వీణవంక, సైదాపూర్, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల్లో వరిపంట ఎక్కువగా సాగైంది. వరికోతలు ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఈ నెలాఖరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖరీఫ్‌లో 66,422 హెక్టార్లలో వరి సాగు కాగా.. 2.20 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1835, సాధారణ రకానికి రూ.1815 చెల్లించనున్నారు. కౌలురైతులకు ఇబ్బంది.. ధాన్యం కొనుగోళ్లలోని కొత్త నిబంధనలతో కౌలురైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి తోపాటు ఇతర భూమిని కౌలుకు తీసుకుని పం టలు పండిస్తున్నారు. కౌలురైతులు పండించిన ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు అసలైన రైతుల వివరాలే ధరణి వెబ్సైట్లో ఉంటాయి. ఈ రైతుల పేరిటనే ధాన్యం విక్రయించడంతోపాటు డబ్బులు సైతం వారి బ్యాంకు ఖాతాల్లోనే జమయ్యే అవకాశం ఉండడంతో కౌలురైతులు కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని అధికారులు పేర్కొంటున్నారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, కొత్తపల్లి(కరీంనగర్) : కొత్తపల్లి శివారులోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం కలకలం రేపింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్–వందనల కుమార్తె బి.వైష్ణవి(9) నాల్గో తరగతి చదువుతూ అదే పాఠశాల హాస్టల్లో ఉంటోంది. ఇటీవల సెలవులు రావడంతో ఈనెల 10న తన ఇంటికి వెళ్లింది. ఈనెల 18న బాలికను ఆమె తండ్రి హాస్టల్లో వదిలివెళ్లాడు. సోమవారం అనారోగ్యంతో ఉన్న బాలికను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. మంగళవారం ఫిట్స్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. అయితే పోచమ్మ, దురద, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురై అనారోగ్యంతో ఉన్న బాలికను తల్లిదండ్రులే ఆసుపత్రిలో చూపించి తగ్గకుండానే మందులతో హాస్టల్లో వదిలి వెళ్లారని యాజమాన్యం చెబుతుండగా..జ్వరం తగ్గాకే హాస్టల్లో వదిలి వెళ్లామని, మందులు వాడే విధానాన్ని టీచర్‌కు తెలపాల్సిందిగా సోమవారం ఫోన్లో తెలపడం జరిగిందని, ఇంతలోనే మంగళవారం మధ్యాహ్నం మీ కూతురుకు ఫిట్స్ వచ్చాయని, సీరియన్‌గా ఉందని ఫోన్లో తెలపడంతోనే కరీంనగర్‌కు చేరకున్నామని, ఇక్కడికి రాగానే చిట్టితల్లి విగతజీవిగా మార్చురీలో పడుందని తల్లి వందన బోరున విలపించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వైష్ణవి మృతి చెందిందని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌టీఎస్‌ఎఫ్, ఏఐఎస్బీ, ఎల్‌హెచ్‌పీఎస్ విద్యార్థి సంఘాలు మార్చురీ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి. çసంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ టూటౌన్, రూరల్ పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. విచారణ జరిపించాలి.. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలోని సీసీ టీవీ పుటేజీలను బయటకు తీస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బుర్ర సంజయ్, గుగులోత్ రాజునాయక్, జూపాక శ్రీనివాస్, గవ్వ వంశీధర్‌రెడ్డి, గట్టు యాదవ్, మల్లేశం, రత్నం రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంవీఐ లంచం.. వయా గూగుల్ పే
సాక్షి, కరీంనగర్ : రవాణాశాఖ కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయనే సుప్రీం. పేరుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) అయినా... రవాణా శాఖ జిల్లా అధికారికి తగ్గని స్థాయి ఆయనది. జిల్లాల పునర్విభజన తరువాత నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిమితమైన కరీంనగర్‌కు ఆయనొక్కడే ఎంవీఐ. ఐదేళ్లుగా రెగ్యులర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ లేరు. ప్రస్తుతం ఆదిలాబాద్ డీటీసీ శ్రీనివాస్ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఐదే ఇష్టారాజ్యం. మూడేళ్లలో పదవీ విరమణ చేయాల్సిన ఆయన వాహనాల తనిఖీ పేరిట సాగించే అవినీతి దందాకు సరికొత్త విధానాన్ని ఎన్నుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నగదు రహిత లావాదేవీల విధానాన్ని లంచం వసూళ్లకు కూడా వాడుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నుంచి వసూలు చేసే అపరాధ రుసుమును ‘గూగుల్ పే’ ద్వారా చెల్లించాలని డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. అయితే అది వెళ్లేది మాత్రం రవాణా శాఖకు కాకుండా సొంతానికి. ఇందుకోసం ప్రైవేటు సైన్యాన్ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం ఎంపీటీసీ భర్త అశోక్‌రెడ్డి నుంచి రూ.5 వేలు గూగుల్‌పే యాప్ ద్వారా ఎంవీఐ లంచం తీసుకున్నాడు. అలాగే వాహన తనిఖీ పేరిట పెద్ద ఎత్తున డబ్బులు పలు ఖాతాల్లో జమ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు అశోక్‌రెడ్డి డీటీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, మీడియాలో రవాణా శాఖలో జరుగుతున్న దందాపై కథనాలు రావడంతో కరీంనగర్ ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ సదరు ఎంవీఐని రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేశారు. ఎంవీఐ గౌస్‌పాషా సరెండర్ కరీంనగర్ జిల్లా రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్‌పాషాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను రవాణాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి డీటీసీ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనలు, ఇతర ఫిర్యాదుల మేరకు జరిపిన ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిన అంశాల ఆధారంగా గౌస్‌పాషాను సరెండర్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గుర్తించిన అంశాలపై పూర్తిస్థాయిలో రవాణాశాఖ కమిషనర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కాగా, గౌస్‌పాషా సరెండర్‌తో ప్రస్తుతం జిల్లాలో రెగ్యులర్ ఎంవీఐ లేకుండా పోయినట్లయింది. మూడేళ్ల సర్వీస్.. పర్సనల్ గార్డుల నియామకం సరెండర్ అయిన వీఎంఐకి ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉంది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న కాలంలో అందిన కాడికి దండుకోవాలనే ఆలోచనతో నిత్యం వాహనాల తనిఖీ పేరిట వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. డీటీసీకి సైతం సమాచారం ఇవ్వకుండా తనే వాహనంలో వెళ్లి తనిఖీల దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వ్యక్తులను గార్డులుగా నియమించుకొని మరీ వాహనాలను నిలిపివేయించి, నిబంధనలు పాటించని వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరైనా మీరెవరు..? మీ గుర్తింపు కార్డేది? అని ప్రశ్నిస్తే వెంటనే ఎంవీఐకి ఫోన్‌చేసి మాట్లాడిస్తారు. అధికారి స్వయంగా మాట్లాడి తానే వారిని నియమించానని, మీ పత్రాలు చూపించి వెళ్లాలని చెప్పి... వారికి డబ్బులు ఇచ్చి వెళ్లాని ఆదేశించేవారని తెలిసింది. ఇటీవల కూడా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో సదరు పర్సనల్ హోంగార్డులు వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై గతంలో కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కొత్తగూడెంలో పనిచేసిన సమయంలోనూ ఇదేరీతిన వ్యవహరించినట్లు సమాచారం. గూగుల్ పేతో పలు నెంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ రవాణా అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఎంవీఐ లంచం తీసుకున్నాడని నిర్ధారణ అయినట్లు తెలిసింది. తన చేతికి కరెన్సీ నోట్లు అంటని విధంగా... నేరుగా డబ్బులు తీసుకోకుండా ‘గూగుల్ పే’ ద్వారా పలు బినామీ నంబర్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు తేలింది. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. వాహనాల తనిఖీలో నిబంధనలు పాటించని వాహనాలపై వేసే అపరాధ రుసుము ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉండగా... తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నట్లు తేలింది. గతమంతా అవినీతిమయమే.. కరీంనగర్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంవీఐ గత చరిత్ర కూడా అవినీతిమయమే అని తెలుస్తోంది. గతంలో కొత్తగూడెం రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించిన సమయంలో వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీకి పట్టుపడ్డట్టు సమాచారం. దీంతో రవాణా అధికారులు ఈయనతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి విధుల్లో చేరారు. అతడిని విధుల్లోకి తీసుకున్న అధికారులు కరీంనగర్ రవాణా కార్యాలయానికి బదిలీ చేశారు. -
ఫేస్బుక్ మిత్రుల ఔదార్యం
సాక్షి, ధర్మపురి (కరీంనగర్) : అనారోగ్యంతో బాధపడుతున్న వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇరువురు పేద మహిళలకు వైద్య ఖర్చుల కోసం ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ చొరవతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు రూ.1.15 లక్షలు సాయం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మానెపెల్లి వరలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్. వైద్య పరీక్షలకు కూడా డబ్బులు లేకపోవడంతో వైద్యానికి నోచుకోలేక పోయింది. అదేవిధంగా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోదినపు లక్ష్మి కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోగా, ఉన్న ఒక్క కూతురు చదువు మానేసి తల్లికి సేవలందిస్తోంది. ఫేస్బుక్ పోస్టుతో దాతల సాయం బాధితుల సమస్యలను వివరిస్తూ ధర్మపురికి చెందిన రమేష్ జూలై 4న ఫేస్బుక్లో పోస్టు చేసి సాయం అందించాలని బాధితుల ఖాతా వివరాలను పొందుపర్చాడు. దాంతో మిత్రులు వరలక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.62 వేలు, బోదినపు లక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.53 వేలు సాయం పంపించారు. దాతలు అందించిన సాయంతో వైద్యం చేయించుకోవడం కోసం బాధితులు ఆస్పత్రికి వెళ్లారు. -
శ్రీ చైతన్య.. కాదది.. తేజ
‘‘ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో ఉన్నది ఓ స్కూల్ బిల్డింగ్. ఈ ఫొటోల్లో ఒకటి ఉదయం తీసినదయితే... రెండోది మధ్యాహ్నం తీసిన ఫొటో. జాగ్రత్తగా గమనిస్తే ఆ భవనానికి తగిలించిన బోర్డులు మారినట్లు తెలుస్తోంది. ఉదయం తీసిన ఫొటోలో ‘శ్రీ చైతన్య స్కూల్ ’ అనే బోర్డు ఉండగా... రెండో ఫొటోలో ఆ బోర్డు మాయమై... స్కూల్ గేటుకు ‘తేజ ఇంగ్లిష్ మీడియం స్కూల్’ అనే బ్యానర్ కట్టారు. అనుమతి లేకపోయినా శ్రీచైతన్య స్కూల్ పేరుతో పాఠశాలలను నడుపుతున్నారని విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనతో కార్పొరేట్ బోర్డులను తొలగించి పాత స్కూల్ పేరుతో గల బ్యానర్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అదీ ఈ ఫొటోల వెనుకున్న కథ... సాక్షి, కరీంనగర్ : మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు కళ్లు మూసుకోగా... పక్క రాష్ట్రపు కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు రాకపోయినా... యథేచ్ఛగా కరీంనగర్‌లోకి చొచ్చుకు వస్తున్నాయనడానికి ఇదో నిదర్శ నం. తీగలగుట్టపల్లి అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్న తేజ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను కొనుగోలు చేసిన శ్రీ చైతన్య గ్రూప్ ‘శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరిక్యులం’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు తీసుకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని బినామీగా చూపుతూ కార్పొరేట్ విద్యాసంస్థ ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఇదొక్కటే కాకుండా కరీంనగర్ సిటీలోనే వావిలాలపల్లిలో, అల్గునూరు, కమాన్ ప్రాంతాల్లో కూడా ఈ పాఠశాలలు ఏర్పాటై అడ్మిషన్లు కూడా ముగించారు. అయితే వీటికి దేనికీ విద్యాశాఖ నుంచి అనుమతులు లేకపోవడం గమనార్హం. వావిలాలపల్లిలో గతంలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పేరుతో నడుపుతున్నారని సీజ్ చేసిన పాఠశాల తిరిగి యధాతథంగా నడవడమే గాక, కొత్త విద్యాసంవత్సరం అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకొంది. బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళనల నేపథ్యంలో మరోసారి సీజ్ చేసేందుకు ప్రయత్నించగా, పాఠశాల యాజమాన్యం పాత స్కూల్ పేరుతో బ్యానర్లు కట్టింది. కళ్లు మూసుకున్న విద్యాశాఖ గత ఫిబ్రవరి నెలలో అనుమతి లేకుండా శ్రీ చైతన్య పాఠశాల పేరుతో నాలుగు బ్రాంచీలు నడుపుతుండడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆందోళన చేసింది. దాంతో ఆ స్కూల్‌ను సీజ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ మీడియాకు తెలిపింది. మళ్లీ ఏం అనుమతులు వచ్చాయని స్కూల్ యధాతథంగా నడిచిందో జిల్లా విద్యాశాఖాధికారికే తెలియాలి. సిక్ అయిన స్కూళ్లను కొనుగోలు చేసిన సదరు కార్పొరేట్ సంస్థ వరంగల్‌లోని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎలాంటి అనుమతి రాకపోయినా, దర్జాగా బోర్డులు ఏర్పాటు చేసి పాఠశాలల పేరుతో ‘దుకాణాలు’ తెరిచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ‘వ్యాపారం’ సాగిస్తోంది. స్కూళ్లలోనే నోట్‌బుక్స్, టెక్టŠస్ బుక్స్, స్టడీ మెటీరియల్, యూనిఫారాలు, పెన్నులు, పెన్సిళ్లు కూడా విక్రయిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాలుగు చోట్ల వందలాది మంది విద్యార్థులతో పాఠశాలల వ్యాపారం నడుస్తుంటే విద్యాశాఖ డీఈవోకు గానీ, మండలాల్లో ఉండే ఎంఈవోలకు గానీ తెలియకపోవడం. ఈ విషయంలో అధికారుల నటనా కౌశల్యానికి పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి. దీనిపై డీఈవో వెంకటేశ్వర్లును సంప్రదించగా... ‘ఒకే బోర్డుతో నాలుగు పాఠశాలలు నడపడం నిబంధనలకు విరుద్ధం. వెంటనే ఎంఈవోను పంపించి సీజ్ చేయిస్తాం. వరంగల్ ఆర్జేడీ వద్ద ఆయా స్కూళ్ల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించం’ అనే అరిగిపోయిన రికార్డునే తిరిగి వినిపించడం జరుగుతోంది. విద్యాశాఖ, కార్పొరేట్ విద్యాసంస్థలు కుమ్మక్కై కరీంనగర్లో విద్యావ్యాపారం సాగిస్తున్న విషయం ఉన్నతాధికారులకు తెలిసినా, పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వంలోని కొన్ని పెద్ద తలకాయల అండతో కార్పొరేట్ విద్యాసంస్థ కరీంనగర్‌తో పాటు తెలంగాణ జిల్లాలో వేళ్లూనుకొంటోంది. ఉమ్మడి జిల్లానే టార్గెట్‌గా... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీ చైతన్య విద్యాసంస్థ పలు చోట్ల బ్రాంచీలు తెరిచింది. ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పేరిట ఈ స్కూళ్లన్నింటికీ అనుమతులు పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే గోదావరిఖని, జగిత్యాల, కోరుట్లలో ఈ విద్యాసంస్థ బ్రాంచీలు తెరిచింది. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకొని టెక్నో, ఐఐటీ, ఫౌండేషన్ తదితర తోక పేర్లతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో నారాయణ. శ్రీ చైతన్యతోపాటు నారాయణ విద్యాసంస్థ కూడా పాఠశాలల గేట్లు తెరిచేందుకు కరీంనగర్‌ను ఎంచుకొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఫైళ్లు సచివాలయం స్థాయిలో కదులుతుండగా, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల తదితర ప్రాంతాల్లో సిక్ స్కూళ్ల అన్వేషణలో ఏజెంట్లు బిజీగా ఉన్నారు. భాష్యం కార్పొరేట్ సంస్థ కూడా కరీంనగర్లో బ్రాంచీలు తెరిచే ఆలోచనలో ఉంది. తెలంగాణ వచ్చాక ఎక్కువైంది.. తెలంగాణ రాష్ట్రంలో పరాయి పెత్తనం పెరిగింది. కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 60 పాఠశాలలు తెరిచేందుకు శ్రీచైతన్య ఏర్పాట్లు చేసుకొంది. త్వరలో నారాయణ కూడా రాబోతుంది. తెలంగాణ వచ్చాక అందరికీ తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య దక్కుతుందని భావించిన జనానికి ఇది ఆశనిపాతం. విద్యతోపాటు సంస్కారాన్ని బోధించే స్థానిక ప్రైవేటు పాఠశాలలపై ఉక్కుపాదం మోపే కుట్ర జరుగుతోంది. ఒక వ్యక్తి పేరిట వందలాది పాఠశాలలకు అనుమతి ఎలా ఇస్తారు? ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి. కరీంనగర్లో అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలలను ఏ పేరుతో కూడా నడవకుండా సీజ్ చేయాలి. – ట్రెస్మా ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు -
పోలీస్‌లకు స్థానచలనం!
సాక్షి, కరీంనగర్ : పోలీసు బదిలీలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఐ స్థాయి అధికారులను మినహా ఒకే స్టేషన్లో మూడు నుంచి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరికీ స్థానభ్రంశం కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని వివిధ జిల్లాల్లో సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైల బదిలీల ప్రక్రియను బల్దియా ఎన్నికలతో సంబంధం లేకుండా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. పాత కరీంనగర్ యూనిట్‌గా జరిగే ఈ బదిలీలు, పోస్టింగ్‌ల బాధ్యత డీఐజీ హోదాలో కమలాసన్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. దీంతో పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌తోపాటు సిద్దిపేట, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని తొమ్మిది పోలీస్స్టేషన్లకు చెందిన పోలీసుల బదిలీలు కరీంనగర్ కమిషనర్ నేతృత్వంలోనే జరుగనున్నాయి. ఆయా జిల్లాల ఎస్పీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా రెండు మూడు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కమలాసన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 16వ తేదీ వరకు బదిలీ దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది మే 31 వరకు ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లుగా పనిచేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుళ్లతోపాటు మూడేళ్లుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సైలను బదిలీ చేయాలని కమిషనర్ కమలాసన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అంతర్గత బదిలీలకు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏవైనా ఐదు పోలీస్స్టేషన్లను ఆప్షన్లుగా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ సబ్ డివిజన్, సొంత మండలం కాకుండా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు ఆయా జిల్లాల ఎస్పీలకు దరఖాస్తులు చేసుకున్నారు. చాలాకాలంగా ఈ స్థాయి పోలీసుల బదిలీలు జరగకపోవడంతో సుమారు 500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎస్పీలు దరఖాస్తులను పరిశీలించి కరీంనగర్ కమిషనరేట్‌కు బదిలీలకు అర్హులైన వారి వివరాలు, వారు కోరుకుంటున్న పోలీస్స్టేషన్ల డేటాను పంపించారు. అయితే ఒకటి రెండు జిల్లాల నుంచి ఇంకా ప్రతిపాదనలు రాకపోవడంతో కమిషనర్ ప్రక్రియను ప్రారంభించలేదని తెలిసింది. శుక్రవారంలోగా అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పలు అంశాల పరిశీలన చాలా కాలం నుంచి జిల్లాల సరిహద్దులు, అటవీ ప్రాంతాలు, సరైన ప్రాధాన్యత లేని మండలాల్లో పనిచేస్తున్న పోలీసులు ఈసారి బదిలీల్లో కరీంనగర్‌తోపాటు కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్స్ సమీపంలోకి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారు ఎక్కువగా కరీంనగర్‌ను ఆప్షన్‌గా ఇచ్చినట్లు సమాచారం. బదిలీల విషయంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా నుంచి వివిధ స్థాయిల్లో 50 మంది బదిలీ జరిగే అవకాశం ఉంటే, ఇతర జిల్లాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా 50 మందికే అవకాశం లభిస్తుంది. అలాగే ఇతర సర్వీసుల్లో ఉన్నవారి బదిలీల తరహాలోనే పదవీ విరమణకు గల గడువు, భాగస్వామి పనిచేస్తున్న ప్రాంతాలు, మెడికల్ గ్రౌండ్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పోలీస్‌స్టేషన్ రైటర్లు, క్రైం టీంలు, ఇతర పరిపాలన విభాగాల్లో పనిచేస్తున్న వారి బదిలీల విషయంలో స్థానికంగా ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల బదిలీలపై పోలీస్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐ, సీఐల బదిలీల విషయంలో ఆచితూచి కమిషనరేట్ పరిధిలోని ఎస్ఐల అంతర్గత బదిలీల విషయంలో కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బుధవారం బదిలీ చేసిన 13 మంది ఎస్ఐలలో ముగ్గురు మినహా మిగతా వారంతా వివిధ కారణాల వల్ల అటాచ్డ్ అయిన వారే. వారికి ఖాళీలుగా ఉన్న చోట పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రేంజ్ పరిధిలో జరిగే ఎస్ఐల బదిలీలను డీఐజీ ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో జరుగుతాయి. రేంజ్ పరిధిలో బదిలీలకు సంబంధించి డీఐజీ ప్రమోద్‌కుమార్ తీసుకునే నిర్ణయంపై స్పష్టత లేదు. మునిసిపల్ ఎన్నికలకు గడువు పెరిగితే ఎస్ఐల బదిలీలు కరీంనగర్ రేంజ్ పరిధిలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక సీఐల బదిలీలకు సంబంధించి ఐజీ నాగిరెడ్డి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలలో ఈ బదిలీల ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అయితే మునిసిపల్ ఎన్నికలు ముగిసే వరకు సీఐ, డీఎస్పీల స్థాయిలో బదిలీలు ఉండకపోవచ్చని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. -
‘కేశోరాం’లో కార్మికుడి మృతి
సాక్షి, పాలకుర్తి(కరీంనగర్): పాలకుర్తి మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో బుధవారం లిఫ్ట్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి కొడారి నర్సింగం(42) అనే పర్మినెంట్ కార్మికుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు, తోటికార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింగం కేశోరాం సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఉదయం షిఫ్ట్ విధులకు హాజరై సిమెంట్ మిల్లు వద్ద నాల్గో అంతస్తులో పని చేస్తుండగా ఉదయం సుమారు 10 గంటలకు టీ తాగేందుకు లిఫ్ట్ ద్వారా కిందకు దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు 60 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలతోపాటు చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటికార్మికులు, అధికారులు కంపెనీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్‌లతోపాటు ఇతర నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్మికసంఘం నాయకులు, అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన వీఆర్‌పీఎం లిఫ్ట్ ప్రాంతాన్ని, సిమెంట్ మిల్లు నాల్గో అంతస్తు పైకి ఎక్కి పరిశీలించి మృతుడి కుటుంబానికి రూ.40లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐదుగంటల పాటు ఉద్రిక్త వాతావరణం కార్మికుడు నర్సింగం మృతితో కార్మికులు ఉదయం షిప్టు విధులను బహిష్కరించి కంపెనీ గేట్ ఎదుట నిరసనకు దిగారు. తొలుత యాజమాన్యం రూ.20లక్షలతోపాటు నర్సింగం కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు కంపెనీ ప్లాంట్ హెడ్ రాజేశ్‌గర్గు ఈవిషయాన్ని కార్మికసంఘం నాయకులకు తెలుపగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కార్మికసంఘం నాయకులకు, అధికారులకు మధ్య పలుదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో నాయకులు, కార్మికులు గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దాదాపు 5గంటల పాటు పలు దఫాలుగా కొనసాగిన చర్చల అనంతరం మృతుడి కుటుంబానికి రూ.33లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన విచారణ నిర్వహించి చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ వ్రాతపూర్వకంగా ఒప్పందపత్రాన్ని అందజేశారు. దీంతో కార్మికులు, నాయకులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మికసంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్, జీడీనగర్, బసంత్‌నగర్, పాలకుర్తి సర్పంచులు సూర సమ్మయ్య, కట్టెకోల వేణుగోపాలరావు, జగన్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్, పాలకుర్తి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, నాయకులు అయోధ్య సింగ్, తంగెడ అనిల్‌రావు, ముల్కల కొంరయ్య, అంతర్గాం జెడ్పీటీసీ నారాయణతోపాటు సమీప గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. కాగా మృతుడికి భార్య సరితతోపాటు ఇద్దరు కుమారులున్నారు, మృతుడి తల్లి సుశీల కంపెనీ ఎదుట పండ్ల షాపు నిర్వహిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే నర్సింగం మృతితో ఈసాలతక్కళ్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణం కేశోరాం కర్మాగారంలో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్మాగారంలో ఐదో అంతస్తులు గల సిమెంట్ మిల్లు వద్ద కార్మికులు ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన గల వీఆర్‌పీఎం లిఫ్ట్‌కు ఆపరేటర్ లేడని, లిఫ్ట్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఒకచోట ఆగాల్సింది ఇంకో చోట ఆగుతోందని ఈవిషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ సరిగ్గా ఆగకపోవడం వల్లనే నర్సింగం అదుపుతప్పి కింద పడి మృతిచెందాడని, వెంటనే సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నా’
సాక్షి, కరీంనగర్ : తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో 68.8 శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషమన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తే.. కేంద్రమంత్రి అవుతారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ భారీ మెజార్టీ వస్తుందన్నారు. అన్ని కుల సంఘాలు, కరీంనగర్ ప్రజలు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయమని అన్నారు. -
ఆ ఊరికి పోలింగ్ ఆమడ దూరం
సాక్షి, కరీంనగర్‌రూరల్: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటే ఈ గ్రామస్తులు మరో ఊరికి పోవాల్సిందే. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి ఓట్లు వేయాల్సిన పరిస్ధితి ప్రస్తుతం ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఓట్లేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఊరిలోనే పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేయాలని స్ధానిక ప్రజాప్రతినిధులు అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే కొత్త పోలింగ్స్టేషన్ల ఏర్పాటులో ఎన్నికల సంఘం నిబంధనలు అడ్డురావడంతో అధికారులు పాత విధానంలోనే పోలింగ్‌ను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త గ్రామపంచాయతీతో సమస్య.. ప్రభుత్వం దుబ్బపల్లిని కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో చామన్‌పల్లి పంచాయతీవాసులకు కొత్త సమస్య ఏర్పడింది. కొత్త గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ మండలంలోని 17 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 46,597 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 23,217, మహిళలు 23,379 మంది ఉన్నారు. మొత్తం 65 పోలింగ్స్టేషన్లు ఉన్నాయి. గతంలో చామన్‌పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న శివారు గ్రామం దుబ్బపల్లిని గత ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది.అయితే దుబ్బపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న జెడ్పీ పాఠశాలలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సైతం ఈ పాఠశాలలో చామన్‌పల్లి, దుబ్బపల్లి గ్రామాలకు కలిపి మొత్తం 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చామన్‌పల్లిలో ప్రస్తుతం మొత్తం ఓటర్లు 2357 మంది ఉండగా వీరిలో పురుషులు 1145, మహిళలు 1212 మంది ఉన్నారు. ఈ ఓటర్లందరికీ 85, 86, 87, 88 నంబర్ గల పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొత్త గ్రామపంచాయతీ దుబ్బపల్లిలో 571 మంది ఓటర్లు ఉండగా పురుషులు 289, మహిళలు 282 మంది ఉన్నారు. వీరందరికీ 89 నంబర్ పోలింగ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్లు పోవాల్సిందే.. చామన్‌పల్లి నుంచి దుబ్బపల్లి గ్రామపంచాయతీ దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దుబ్బపల్లిలోని జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం దుబ్బపల్లిలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఓటు వేయడానికి చామన్‌పల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు అందుబాటులో లేకపోవడంతో పలువురు ఓటర్లు నడుచుకుంటు వెళ్లాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఓటు వేసేందుకు ముందుకురాకపోవడంతో స్థానిక నాయకులు ఆటోలను ఏర్పాటు చేశారు. ఆటోల్లో ఓటర్లను తరలించడాన్ని అధికారులు అడ్డుకోవడంతో పలు వివాదాలేర్పడ్డాయి. ఈక్రమంలో చామన్పల్లిలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్ధానిక నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొత్త పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేయడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో అధికారులు గతంలో ఉన్నట్లుగానే పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఈనెల 11న జరిగే పోలింగ్‌లో చామన్‌పల్లి ఓటర్లు గతంలో మాదిరిగానే దుబ్బపల్లికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి చామన్‌పల్లి నుంచి దుబ్బపల్లిలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు వృద్ధులు, మహిళలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ రోజున ఓటర్లను తరలించేందుకు అధికారులు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయాలి. – వడ్లకొండ పర్షరాములు, చామన్‌పల్లి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి చామన్‌పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రంను ఏర్పాటు చేయాలి. గ్రామపంచాయతీ ఎన్నికలప్పుడు తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దుబ్బపల్లిలో కేంద్రాలను ఏర్పాటు చేయడం తగదు. దుబ్బపల్లికి వెళ్లి ఓటు వేయడం వృద్ధులు, మహిళలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. – బోగొండ లక్ష్మి, సర్పంచ్, చామన్‌పల్లి పాత పోలింగ్ కేంద్రాల్లోనే.. కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలతో ప్రస్తుతం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉన్న కేంద్రాల్లోనే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. – జి.కుమారస్వామి, తహసీల్దార్, కరీంనగర్‌రూరల్ -
ఆస్పత్రిలో బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. టవర్ సర్కిల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్పృహ కోల్పోవడంతో ఆందోళన చెందిన అభిమానులు, కార్యకర్తలు వెంటనే అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. సంజయ్‌ను పరీక్షించిన వైద్యులు వడదెబ్బ కారణంగానే ఆయన కింద పడిపోయినట్లు భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, సంజయ్‌కు గతంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో స్టంట్ వేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్వస్థతకు గురికావడంతో పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడి ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో సంజయ్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున బరిలోకి దిగిన బండి సంజయ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉన్న నాయకుడిగా పేరొందిన సంజయ్ పట్ల యువతకు ఉన్న అభిమానం, ఆయన సేవా కార్యక్రమాలు బీజేపీకి విజయం చేకూరుస్తాయని భావించిన అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా మరో అవకాశం కల్పించింది. కాగా సంజయ్‌తో పాటు కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా టీఆర్ఎస్ తరఫున జి. వినోద్‌కుమార్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. -
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకం
సాక్షి, మల్యాల: రైతులు, కార్మికులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని, దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకం కానున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలకేంద్రంలో గ్రామ సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్ స్వగృహంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీపీ తైదల శ్రీలత, జనగం శ్రీనివాస్, నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి, బల్మూరి రామ్మోహన్రావు, తాటిపాముల రాజేందర్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు బద్దం తిరుపతిరెడ్డి, కట్కూరి తిరుపతి, ఉప సర్పంచ్ డి.కరుణాకర్, ఎంపీటీసీ ఏనుగు రాజిరెడ్డి, దూస వెంకన్న, పోచంపల్లి రాయమల్లు, వంశీధర్, మోత్కు కొమురయ్య, సింగిల్‌విండో చైర్మన్ అడువాల సురేశ్, శివ, రియాజొద్దీన్ పాల్గొన్నారు. రామడుగులో... ప్రతి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలిచేందుకు కృషి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. వెదిర గ్రామానికి చెందిన వ్యాపారి దొడ్డ లచ్చిరెడ్డితోపాటు ఉప సర్పంచ్ ఎడెల్లి సత్యనారాయణరెడ్డి, వార్డు సభ్యుడు బొల్లి రమేశ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తొరికొండ నారాయణ, పలువురు టీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, రామడుగు, కొక్కెరకుంట సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్రావు, ఒంటెల మురళీకృష్ణారెడ్డి, వెదిర గ్రామ వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్‌గౌడ్, డైరెక్టర్ ఏరెడ్డి కొంరారెడ్డి, నాయకులు లేఖ రాజు, ప్రసాద్, అంజన్‌కుమార్, రాల్లబండి శ్రీనివాస్‌రెడ్డి, నరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పుర్మాణి శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రశ్నించే వారికి కాదు.. పరిష్కరించే వారికి మద్దతు
సాక్షి, కథలాపూర్(వేములవాడ): ఎన్నో ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామని, వచ్చే ఎన్నికల్లో ప్రశ్నించే నేతలను కాదు.. పరిష్కరించే నేతలకు ఓటర్లు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి కోరారు. శనివారం కథలాపూర్ మండలకేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ఆదివారం కరీంనగర్లో జరిగే సీఎం కేసీఆర్ సభకు వేములవాడ నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల స్థానానికి చంద్రశేఖర్‌గౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సుధాకర్‌రెడ్డికి ఓటర్లు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు నాగం భూమయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎం. జీ రెడ్డి, నాయకులు నాగేశ్వర్రావు, ధర్మపురి జలేందర్, జెల్ల వేణు, కల్లెడ శంకర్, దొప్పల జలేందర్, ఆకుల రాజేశ్, కిరణ్‌రావు, మహేందర్, గోపు శ్రీనివాస్, ఎం.డీ రఫీక్, సంబ నవీన్, శీలం మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సీతరామ్‌నాయక్ పాల్గొన్నారు. -
‘పొన్నం’కు హ్యాట్రిక్ ఓటమి ఖాయం
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు హ్యాట్రిక్ ఓటమి తప్పదని ఏఎంసీ మాజీ చైర్మన్, కార్పొరేటర్ వై.సునీల్‌రావు అన్నారు. శనివారం కశ్మీర్‌గడ్డలోని ఎస్బీఎస్ ఫం క్షన్‌హాల్‌లో మాట్లాడుతూ.. పొన్నంను కాంగ్రెస్ అ భ్యర్థిగా ప్రకటించడంలోనే కాంగ్రెస్ బలహీనత నాయకత్వలేమి బయటపడిందన్నారు. క్యాడర్ మొత్తం నిరుత్సాహంలో ఉందని, వారంరోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు. అన్ని వ ర్గాలప్రజలు, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటిస్తున్నారని, కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కరీంనగర్ లో వినోద్‌కుమార్ ఎంపీగా స్మార్ట్‌సిటీ, నేషనల్ హైవేలు, కొత్తరైల్వే లైన్లు, పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వేలైన్, హైకోర్టు విభజన, కాళేశ్వరం అను మతులు, మిడ్‌మానేరు పూర్తి, రివర్స్ పంపింగ్ కార్యక్రమాల్లో శక్తివంచన లేకుండా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ నిర్వహించే టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం బహిరంగసభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.నాయకులు చంద్రమౌళి, వినోద్, ఫహాద్, మహేశ్, వెంకటయ్య, నాంపల్లి, సంజీవ్, ఫరీద్, అనిల్, శంకర్, బాలు, నరేందర్, అంజన్‌రావు పాల్గొన్నారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించడానికి ఆదివారం స్పోర్ట్స్స్కూల్ మైదానంలో జరిగే కేసీఆర్ సభను విజయవంత చేయా లని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుర్రాల మల్లేశం అన్నారు. శనివారం ప్రెస్‌భవన్‌లో మాట్లాడుతూ.. 7 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ సభను విజయవంత చేయాలని పిలునిచ్చారు. సమావేశంలో లక్ష్మణ్, కోలిపాక మల్లికార్జున్, సత్తయ్య, పండుగ నాగరాజు, సిద్ది సంపత్, శ్రీకాంతం, శివ, నగునూరు మధుకర్, జడుగుల తిరుపతి, అట్లు శంకర్, అంజి, తిరుపతి తదితరులున్నారు. టీఆర్ఎస్ మైనార్టీసెల్ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్‌భవన్‌లో మాట్లాడారు. కేసీఆర్ సభను విజయవంతం చేయాలని జిల్లా టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ.శకురోద్దీన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహమ్మద్ శుక్రోద్దీన్, అబ్దుల్ బషీర్, షాదుల్, గౌసోద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
తడి, పొడిపై అవగాహన ఏది?
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరి« దిలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కరువైంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్‌కు తరలించాలనే లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసిన నగరపాలక సంస్థ ఆ తర్వాత పర్యవేక్షణ మరిచింది. తడిచెత్త, పొడి చెత్త రెండూ ఒకే డబ్బాల్లో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చెత్తను ఎక్కడికక్కడే తగ్గించడానికి అమల్లోకి తీసుకొచ్చిన విధానం స త్ఫలితాలివ్వడం లేదు. ప్రతీ ఇంటికి రెండు డబ్బాలు ఇ చ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి రిక్షాలకు ఇవ్వాలని ప్రచా రం చేశారు. రిక్షాల ద్వారా కూడా తడి, పొడి వేరు చేసేం దుకు వాటికి కూడా డబ్బాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వేరు చేయకపోవడంతో ఇబ్బందులు చెత్తను వేరు చేసేందుకు రెండు రకాల డబ్బాలు ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి స్పందన రావడం లేదు. తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగానే చెత్త డంప్‌యార్డుకు చేరుతుంది. దీంతో డంపింగ్‌యార్డు పూర్తిగా నిండింది. ఇటీవల పలుమార్లు అగ్నిప్రమాదం జరిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. తడి చెత్తను వర్మీ కంపోస్టు యార్డుకు తరలించడం, పొడి చెత్తను పాత సామగ్రి కింద కా>ర్మికులు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇదంతా చెత్త సేకరణ సమయంలోనే చేయడం ద్వారా డంప్‌యార్డుకు చెత్త తగ్గుతోంది. తడి, పొడి ఒకే డబ్బాలో.. నగరంలోని కొన్ని డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి రిక్షాలకు డబ్బాలు అమర్చారు. ఇంటి యజమానుల దగ్గర ఉన్న వేర్వేరు డబ్బాల్లో తడి, పొడి చెత్తను వేసి రిక్షాల్లో ఉన్న డబ్బాలలోనే తడి, పొడి చెత్తను వేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త సేకరణకు నగరపాలక సంస్థ అన్ని డివిజన్లకు డబ్బాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క డబ్బాకు రూ.120 ఖర్చుచేసి ఇస్తుండగా ఇంటి యజమానులు తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో స్వచ్ఛసర్వేక్షణ్ లక్ష్యం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా అధికారులు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి వేర్వేరుగా సేకరిస్తే డంప్‌యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. -
గంగులపై విమర్శలు చేస్తే ఊరుకోం
సాక్షి, కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు స్థాయిని మించి మాట్లాడి విమర్శలు చేస్తే ఊరుకోమని టీఆర్ఎస్వీ కరీంనగర్ అధ్యక్షుడు ఫహాద్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఉనికి కోసం అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో గంగుల కమలాకర్ చేస్తున్న కృషి కొండంత అయితే మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసింది గొరంత అని ఎద్దెవా చేశారు. గంగుల కమలాకర్‌పై ఆరోపణలు చేస్తే ప్రజలు బుద్ధిచెపుతారని అన్నారు. సమావేశంలో నాయకులు కోల చందన్ పటేల్, జేఎస్ రెడ్డి, తబ్రెస్, సందమల్ల రవితేజ, రాచర్ల శ్రీనివాస్, బిగ్లు సుదర్శన్, రాజశేఖర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఎమ్మెల్సీ పోరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి ఈనెల 22న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలే బరిలోకి దిగగా.. ఉపాధ్యాయులే ఓటర్లుగా వ్యవహరించనున్నారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీకి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించడం లేదని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా గ్రూప్–1 మాజీ అధికారి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు ఇస్తున్నట్లు తాజాగా స్పష్టం చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. చంద్రశేఖర్ గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అధికార పార్టీ నుంచి అనధికారిక అభ్యర్థిగా రంగంలోకి దిగిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ జిల్లాల వారీగా 42 నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓట్ల కోసం వేట ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటల్లాంటి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో విద్యావంతులు తనకే ఓటేస్తారని ఆశాభావంతో ఆయన ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రశ్నించే గళం కావాలంటున్న జీవన్‌రెడ్డి శాసనమండలిలో ప్రతిపక్షం ఊసే లేకుండా చేయాలని టీఆర్ఎస్ పార్టీ అప్రజాస్వామిక పద్ధతిలో సాగుతోందని విమర్శిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికార అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ప్రజా గొంతుక అవుతానని చెబుతున్న ఆయన రాష్ట్ర మంత్రిగా, జగిత్యాల ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులు కూడా గెలుపునకు దోహదపడతాయని అంటున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే 70వేలకు పైగా పట్టభద్రుల ఓట్లు ఉండగా.. వరంగల్, ఆదిలాబాద్‌లో సైతం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతృప్తికరమైన రీతిలో ఓటింగ్ జరగడం తనకు అనుకూలించే అంశంగా ఆయన భావిస్తున్నారు. అన్నింటికి మించి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ఆయన తాజా అసెం బ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓడిపోవడం.. వెనువెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో సానుభూతి కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన మిగతా జిల్లాల్లో ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారు. యువ ఓటర్ల మద్దతుపై రాణి రుద్రమ ఆశలు యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల స్థానానికి చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు. పట్టభద్రులైన యువ ఓటర్లతో పాటు విద్యావంతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమ సంఘాల మద్దతు తనకు లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం మద్దతు పొందిన ఆమె ఆదివారం నుంచి ప్రచార పర్వంలోకి దిగాలని నిర్ణయించారు. తన వంటి యువతను ఎన్నుకుంటే శాసనమండలి విలువలను కాపాడుతానని చెబుతున్న రాణిరుద్రమ సమాజంలో మార్పు కోసం యువత తన వెంట నిలుస్తుందని, పట్టభద్రుత మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్‌రెడ్డితోనే పోటీ.. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పొల్సాని సుగుణాకర్‌రావు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు జీవన్‌రెడ్డితోనే పోటీ అని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతూ ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఆయన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ఇప్పటికే నష్టపోయామన్న భావనతో ఉన్న పట్టభద్రులు.. ఏ అజెండా లేని ఆ పార్టీలకు ఈసారి ఓటు వేసేందుకు యువత, ఉద్యోగ సంఘాలు సిద్ధంగా లేరనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఇండిపెండెంట్లు కూడా... సామాజిక, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్న పలువురు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. ఆయా జిల్లాల్లో తమకు ఉన్న సంబంధాలు, వివిధ సమస్యలపై గతంలో తాము చేసిన పోరాటాలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఎన్నికల్లో ఓట్లు సంపాదించి పెడతాయని భావిస్తున్నారు. ఏబీవీపీ మాజీ నాయకుడు గురువుల రణజిత్‌మోహన్, ఎడ్ల రవికుమార్, కేశిపెద్ది శ్రీధర్‌రాజు, ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు పడే ఓట్లపై ప్రభావం చూపనున్నారనడంలో సందేహం లేదు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ సహా నాలుగు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
గ్రామాల్లో ‘స్థానిక’ సందడి షురూ
సాక్షి, కథలాపూర్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత ఐదు నెలలుగా గ్రామాల్లో రాజకీయాలు వెడేక్కి.. ప్రశాంతంగా ముగియడంతో నాయకులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో గ్రామాల్లో రాజకీయాలు మరోమారు వెడేక్కాయి. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని కొందరు నాయకులు తమకు రిజర్వేషన్లు కలిసిరాలేదని మరికొందరు తమ అనుచరవర్గాలతో రాజకీయ భవితవ్యంపై చర్చల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు ఏ నాయకుడిని గెలిపిస్తే మంచిపాలన అందిస్తారనే విషయంలో ప్రజలు సైతం కూడళ్ల వద్ద చర్చించుకోవడం విశేషం. బీసీలకే కథలాపూర్ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు.... ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ జిల్లాస్థాయిలో జరగడంతో కథలాపూర్ మండల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానం బీసీలకే రిజర్వ్ అయ్యాయి. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. 13 ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయించారు. ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను మండలస్థాయి యూనిట్‌గా ఖరారు చేయనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆయా గ్రామాల్లో ఇటివలే జరిగిన సర్పంచ్ ఎన్నికలకు వర్తించే రిజర్వేషన్లు ఎంపీటీసీ స్థానాలకు దగ్గరగా ఉంటాయని ఆయా గ్రామాల్లో ఆశావహులు ఇప్పటికే అనుచరవర్గంతో ప్రచారాలు ప్రారంభించడం గమనార్హం. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురి నాయకులకు ప్రజాతీర్పు కోరుకునేందుకు ఎంపీటీసీ ఎన్నికల రూపంలో మరోచాన్స్ వచ్చినట్లయిందని.. గెలుపుకోసం ఏమి చేయాలనే వ్యుహాలు రచించుకుంటున్నారు. మండలంలో 32,712 మంది ఓటర్లు.. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలకు గాను 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. 32,712 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 17,354 మంది, పురుషులు 15,358 మంది ఓటర్లు ఉన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో యువత ఉపాధి నిమిత్తం గల్ఫ్‌బాట పట్టినవారే ఉండటంతో మహిళ ఓటర్లు ఎక్కువగా వినియోగించుకునే అవకావం ఉంది. ఆయా గ్రామాల్లో గెలుపు ఓటములకు మహిళ ఓటర్లు కీలకం కానున్నారని పార్టీల నాయకులు భావిస్తున్నారు. కథలాపూర్‌కు మరోసారి జెడ్పీ చైర్మన్ పోస్టు దక్కేనా..? 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందిన తుల ఉమ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లాల పునర్విభజన జరగడంతో ప్రస్తుతం కథలాపూర్ మండలం జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చింది. జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలుండటంతో ఏ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ జెడ్పీ చైర్మన్ సీటు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీగా బరిలో ఉండే నాయకులు సైతం జిల్లాస్థాయిలో ప్రభావం చూపాలని అప్పుడే ఉన్నతస్థాయిలో పార్టీ నేతలో చర్చలు జరుపుతుండటం విశేషం. మరోసారి కథలాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందినవారు జెడ్పీ చైర్మన్ సీటు దక్కించుకుంటారా లేదా అనేది రాజకీయ నాయకుల్లో ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఏప్పుడేమి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయనాయకులతోపాటు ప్రజల్లో రోజురోజుకు ఉత్కంఠ నెలకొంది. -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోంది. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్యసేవలు అందుబాటులోకి రావాలి. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: వైద్యరంగంలో మన దేశం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు ఒక వరమని అన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందారన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (పిమ్స్)లో శనివారం సికిల్‌సెల్, తలసేమియా చికిత్స కేంద్రాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభించారు. వైద్య విద్యలో అత్యంత ప్రతిభ చూపిన ఐదుగురు మెడికోలకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతిమ ఆడిటోయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మెడికోలు, వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మెడికల్ టూరిజంలో మన దేశం ప్రత్యేకమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. అయినప్పటికీ చిన్నారుల్లో తలసేమియా వ్యాధి బాధిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ తరహా వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ప్రభుత్వాలు, డాక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. దేశంలో పోలియో, స్మాల్ఫాక్స్ వ్యాధులను విజయవంతంగా నిర్మూలించామని, అదే తరహాలో తలసేమియా వ్యాధి నిర్మూలనకు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్యలో బాలబాలికల నిష్పత్తి పెరగడం సంతోషకర పరిణామమని అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం గల కరీంనగర్‌కు రావడం ఇదే ప్రథమని, ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఒకప్పుడు ఒక్కరే.. ఇప్పుడు మూడు, నాలుగు కోట్ల మంది : మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు తలసేమియా దేశాన్ని కంగదీసే వ్యాధి అని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. 1938లో దేశంలో ఒక్కకేసే నమోదైతే... ఇప్పుడా సంఖ్య మూడు నుంచి నాలుగు కోట్లకు చేరిందన్నారు. కేరళలోని ఆదివాసీలలో తలసేమియా అధికంగా ఉందన్నారు. తలసేమియా విషయంలో భారతావని అప్రమత్తం కావాలన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి కోసం 2లక్షల యూనిట్లు అవసరమని తెలిపారు. బాధితులకు ఉచిత రక్తమార్పిడి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మేనరికం వల్ల మాత్రమే తలసేమియా వస్తుందనుకుంటే పొరపాటని, ఇప్పుడు అందరికీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువతీ యువకులు పెళ్లికి ముందు రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. అందరూ కృషి చేస్తేనే ఆరోగ్య తెలంగాణ: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒక మంచి ఆశయం, లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. పట్టణ ప్రాంతాలకు తోడు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆరోగ్యంపై అవగాన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణలం తా ఆరోగ్యంగా ఉండాలన్నారు. తలసేమియా, సికెల్‌సెల్ తదితర వ్యాధులపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. ఆర్యోగవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం అందరి కృషి అవసరమన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఆసుపత్రి చైర్మన్ బోయినపల్లి శ్రీనివాస్‌రావు, కళాశాల ప్రొఫెసర్లు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు మందు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతి, గవర్నర్లను హెలిప్యాడ్ వద్ద కలిసి స్వాగతం పలికారు. -
సిరిసిల్ల: సర్వేలపై ఆసక్తి చూపుతున్న ప్రజానీకం
సాక్షి, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో అత్యధికంగా 80.39 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితమే మిగిలి ఉంది. ఈనెల 11న గెలుపు ఎవరిని వరించనుందో తేలనుంది. అప్పటివరకు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో భద్రంగా ఉంటుంది. లెక్క తేలేదాక అభ్యర్థులు, నాయకులతోపాటు అందరిలో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. అందరి నోటా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంద?నే మాటలే వినిపిస్తున్నాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయావకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా పోలింగ్ కేంద్రాల వారీగా తమ గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని బూత్‌ల వారీగా ఏజెంట్లు, నాయకులతో సమాచారం తెలుసుకుంటూ తమకు లభించే ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కూటమి అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల నుంచి లభించిన సానుభూతి తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్ నాయకులు ఈసారి ఓట్లు శాతం పెరగనుందని, ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరామని భావిస్తున్నారు. ఈవీఎంలకు పటిష్ట భద్రత శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలోకి అధికారులు భద్రంగా చేర్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ, డీఎస్పీల సమక్షంలో పరిశీలించిన తర్వాత స్ట్రాంగ్‌రూముకు సీల్‌వేశారు. స్ట్రాంగ్‌రూం వద్ద మూడెంచల వ్యవస్థతో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. మొదటి వరుసలో బీఎస్ఎఫ్ జవాన్లు, రెండోవరుసలో రాష్ట్రసాయుధ బలగాలు, మూడో అంచెలో సివిల్ ఫోర్స్‌తో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. వీరితోపాటు 24 గంటలపాటు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. పెరిగిన పోలింగ్ శాతం.. జిల్లాలో ఈసారి అత్యధిక పోలింగ్‌శాతం నమోదైంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 7 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడలో 73.04 శాతం, సిరిసిల్లలో 73.24 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి వేములవాడలో 80.30 శాతం, సిరిసిల్లలో 80.48 శాతం నమోదైంది. మొత్తంగా జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80.39 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ రద్దు నుంచి ఎన్నికల సంఘం, వివిధ పార్టీల నాయకులు పెద్దఎత్తున ఓటు నమోదు గురించి అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయడంతో పోలింగ్ శాతం పెరిగినట్లు అధికారులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్‌శాతం పెరగడం ఎవరికి లాభం చేకూరుతుందనేది ఈనెల 11న తేలనుంది. లెక్కల్లో అభ్యర్థులు.. నియోజకవర్గంలోని భూత్‌ల వారీగా నమోదైన పోలింగ్ శాతంతో ఎక్కడ ఎవరికి ఓట్లు పడ్డాయన్న లెక్కల్లో నేతలు ఉన్నారు. భూత్‌లో ఉన్న ఓటర్లులో మనపార్టీ వారు ఎందరు? ఇతర పార్టీలోని ఓటర్లు ఎందరు? తటస్థ ఓటర్లు ఎవరు? అందులో ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొన్నారు? అనే లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ పార్టీకి కలిసి వచ్చింది? ఎక్కడ దెబ్బతిన్నదో? సమీక్ష చేయటంతోపాటు, పార్టీలో ఉంటూ పోలింగ్ ముందురోజు ప్రత్యర్థి పార్టీలకు కోవర్టుగా పనిచేసిన నాయకులను గుర్తించే పనిలో పడ్డారు. ఓటింగ్ సరళిని బట్టి భూత్‌ల వారీగా తమకు దక్కిన మద్దతును లెక్కగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన సర్వేలతో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనే అంశాలపై పోటీ చేసిన అ భ్యర్థులతోపాటు పార్టీల నాయకులు, జనం చ ర్చించుకుంటున్నారు. అందరి నోటా ఇదేమాట వినిపిస్తోంది. దీనిపైనే బెట్టింగులు, సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల చివరి ఘట్టమైన ఫలి తాలు వెలువడే ఈనెల 11వ తేదీపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
మీ బిడ్డగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడతా: ఈటల
సాక్షి, ఇల్లందకుంట: మీరు ఆదిరించిన బిడ్డగా మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడతానని, తెలంగాణాలో ఆంధ్ర సీఎం చంద్రబాబు పెత్తనం చెలాయించేందుకు మహాకూటమితో కలిసి కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, దేశిని కోటి, పొనగంటి మల్లయ్య, మనోహర్‌రావు, వార్డు కౌన్సిలర్లు ,నాయకులు తదితరులు ఉన్నారు. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి హుజూరాబాద్: సంక్షేమ పథకాలే తిరిగి గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రచారంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మొలుగూరి సరోజన, మండల అధ్యక్షుడు గోపు కొమురారెడ్డి, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ దాసరి రమణారెడ్డి, కో కన్వీనర్ మండల సాయిబాబా, మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఖాలీక్హుస్సేన్ తదితరులు ఉన్నారు. -
ప్రజాకూటమిదే విజయం... జీవన్‌రెడ్డి
ప్రతిపక్ష శాసనసభ్యుడిగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డ. నా కృషితో ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి జరిగినా టీఆర్ఎస్ నాయకులు దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ తొలిసారిగా కరీంనగర్‌కు వచ్చినప్పుడు నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన బోర్నపల్లి బ్రిడ్జి పనుల అంచనాలు రూపొందించుకుని నిర్మాణం చేపట్టాలని విన్నవించిన. ఆవశ్యకతను గుర్తించిన కేసీఆర్ వెంటనే మంజూరు చేసిండు. ఇప్పుడు ఆ బ్రిడ్జి నిర్మాణం క్రెడిట్ అంతా మాదేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నేను ప్రతిపాదించిన ఇలాంటివి మరెన్నో పనులనూ టీఆర్ఎస్ నేతలు తామే చేశామని ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తోంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేనునందునే సీఎం కేసీఆర్ తన వద్ద ఉంచుకున్న రూ.2వేల కోట్ల వరకు రాష్ట్ర అభివృద్ధి నిధుల నుంచి నయాపైసా జగిత్యాలకు ఇవ్వలేదు. అదే మానకొండూరు, వేములవాడ ఇతర నియోజకవర్గాలకు నిధులిచ్చారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. జనమే నా బలం.. బలగం. వాళ్ల ఆశీర్వాదంతో నేను మళ్లీ గెలవబోతున్న. ఓడినా వారి వెన్నంటే ఉంటా. రాష్ట్రంలోనూ ప్రజాకూటమిదే విజయం..’ అన్నారు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి. ఎన్నికల ప్రచారతీరు.. గెలుపు అవకాశాలు.. నాలుగేళ్ల పాలన విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, జగిత్యాల : నేను ప్రజల మనిషిని. నిత్యం అందుబాటులో ఉంటున్న.. రాజకీయాలకతీతంగా నా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను వింటా. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తున్న. నేను ప్రతిపక్షంలో ఉన్నా నా నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్న. నిరుపేదల సంక్షేమాన్ని కాంక్షించేలా ప్రజాకూటమి రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై అన్నివర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అన్నింటికంటే మించి నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతే నన్ను గెలిపిస్తుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓడిన వ్యక్తికే ప్రజల్లో సానుభూతి ఉంటుంది. కానీ.. ఇక్కడ దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నేను గెలిచినా ఎంపీ కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ప్రస్తుత నా ప్రత్యర్థి సంజయ్కుమార్నే ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా బహిరంగ సభల్లోనూ పదే పదే చెప్పడం నన్ను బాధించింది. నేను ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామని చెబుతున్నరు. ఆ ఫైలును తొక్కిపెట్టారు..! ఈ ఎన్నికల్లో యావర్‌రోడ్డు సమస్య అన్ని పార్టీలకు ప్రధాన ఎజెండా మారింది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా గతంలో 60ఫీట్లకు ఆమోదం పొందిన యావర్‌రోడ్డు విస్తరణ.. 40ఫీట్లకు పరిమితమైంది. జగిత్యాల ఇప్పుడు జిల్లాకేంద్రం అయింది. ఆ రోడ్డు వంద ఫీట్లకు విస్తరించబడాలి. దీనికి సంబంధించి తీర్మానం చేసిన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ గతేడాది జూన్ 31న ఈ ప్రతిపాదనను హైదరాబాద్‌లోని ‘డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్’కు పంపింది. అక్కడ ఆ ఫైలును తొక్కిపెట్టారు. దీనికి సంబంధించిన లేఖ ఇప్పటికీ మా దగ్గర ఉంది. యావర్‌రోడ్డు విస్తరణకు కాంగ్రెస్ పార్టీ, జగిత్యాల కౌన్సిల్ కట్టుబడి ఉంది. 2009లో మేం (కాంగ్రెస్) అధికారంలో ఉన్నప్పుడు నూకపల్లిలో 4వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూసేకరణ చేసి.. ఒక్కో ఇంటికి రూ.లక్షతో పనులు మొదలుపెట్టినం. ప్రభుత్వం మారడంతో వాటి నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. మరో రూ.లక్ష కేటాయిస్తే వాటి నిర్మాణాలు పూర్తయ్యేవి. అవి పూర్తి చేస్తే నాకు పేరొస్తుందనే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పక్కనబెట్టింది. అదే ప్రాంతంలో కొత్తగా 4వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. దీనికి టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. నాలుగేళ్ల పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చని టీఆర్ఎన్ పార్టీని అన్నివర్గాలు.. పార్టీలు చీదరించుకుంటున్నాయి. నీళ్లు.. నిధులు.. నియామకాల విషయంలో జరిగిన అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నించేందుకు.. రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ, నియంతృత్వ పాలనను తుది ముట్టించేందుకు.. నాడు ఉద్యమంలో పాల్గొన్న పార్టీలు, ముఖ్యులందరూ ప్రజాకూటమిగా ఏర్పడ్డారు. ఇది నేను చేసింది కాదా..? 30 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పనులు చేపట్టిన. అవి టీఆర్ఎస్ నేతలకు కనిపించినా.. చూడనట్లు మాట్లాడుతున్నరు. నేను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన.. అది భవిష్యత్తులో యూనివర్సిటీగా రూపుదిద్దుకోబోతుంది. పొలాసలోని వ్యవసాయ డిగ్రీ కాలేజీ, నిరుద్యోగ యువతకు సంబంధించిన నాక్ శిక్షణ కేంద్రం, పీజీ కాలేజీలు తెచ్చింది నేను కాదా..? జగిత్యాల జిల్లాగా రూపుదిద్దుకున్న క్రమంలో ఇక్కడ ఓ మెడికల్ కాలేజీ అవసరమైంది. ఇప్పుడు నా దృష్టి మెడికల్ కాలేజీ ఏర్పాటుపై ఉంది. చల్గల్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేసుకుని జగిత్యాలలో కోర్టు భవనం నిర్మించుకున్నం. గోదావరి నదిపై రూ.40 కోట్లతో కమ్మునూరు – కలమడుగుపై వంతెన మంజూరు చేయించిన. వాటి పనులు పూర్తయ్యాయి. నా నియోజకవర్గంలో బీటీ రోడ్డు లేని గ్రామాలు లేనేలేవు. పట్టణ విషయానికి వస్తే అంతర్గత, బహిర్గత బైపాస్ రోడ్ల నిర్మాణాలు చేపట్టిన. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి.. నాలుగేళ్లలో టీఆర్ఎస్ అభివృద్ధి ఆ పార్టీ నేతలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేడ్ 1 ఉన్న జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50కోట్లు కేటాయించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు గ్రేడ్–2, గ్రేడ్ –3 మున్సిపాలిటీలు అయిన కోరుట్ల, మెట్పల్లిలకూ అవే నిధులు కేటాయించారు. ఇందులో జగిత్యాల పట్టణానికి ప్రత్యేకంగా చేసిందేమిటో వారికే తెలియాలి. వీటిని ఎందుకు పరిష్కరించలేకపోయారు..? గత విద్యాసంవత్సరం రాయికల్‌లో డిగ్రీ కాలేజీ ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం మంజూరైంది. కానీ బోధన, బోధనేతర సిబ్బంది నియామకం లేక ప్రారంభంకాలేదు. సీఎం పర్యటన నేపథ్యంలో రాయికల్ మండలం బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ మధ్య వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ కవిత ప్రకటించారు. ఇంతవరకు దాని నిర్మాణ పనులకు పరిపాలన అనుమతి రాలేదు. రాయికల్‌లో మ్యాంగో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. సారంగాపూర్‌లో 0.25నీటి సామర్థ్యం ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును టీఎంసీకి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆధునీకరణ పనులు నత్తకునడక నేర్పుతున్నాయి. రాయికల్ మండలం మూటపల్లి–భూపతిపూర్‌లో పంచాయతీ రాజ్ శాఖకు చెందిన రోడ్డు ధ్వంసమై నాలుగేళ్లవుతున్నా.. రెన్యువల్ చేయలేదు. బీటి రోడ్డు కూడా వేయించలేకపోయారు. ఇప్పుడు టెండర్, అగ్రిమెంట్, అంచనాలు లేకుండా ఎన్నికల కోడ్ అని కూడా చూడకుండా బినామీతో పనులు ప్రారంభించాలని చూస్తే కోర్టు పనులు ఆపేసింది. ఐదు నెలల క్రితం జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో రూ.8 కోట్లతో విత్తనశుద్ధి కేంద్రం ఏర్పాటు పనులకు భూమిపూజ చేసిండ్రు.. ఆ పనులకు సంబంధించి ఇప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. -
సిరిసిల్ల: ప్రలోభాల పర్వం
జిల్లాలో ఎన్నికల ప్రచార పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మనీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడికక్కడ ఓటు లెక్కన ముట్టజెప్పడానికి అన్నిఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నేటిసాయంత్రం నుంచి పోలింగ్ రోజువరకు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయి. దీంతో ముందస్తు వ్యూహంతో భారీ స్థాయిలో మద్యం నిల్వలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం, డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఉంచినా.. యంత్రాంగం కళ్లుగప్పి తమపని తాము చేసుకుపోవడానికి అభ్యర్థులు రెడీ అవుతున్నట్లు సమాచారం. సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో అభ్యర్థుల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత మైకులు, ప్రచారాలు, ప్రసంగాలు ఉండరాదని, ప్రచారం కోసం వచ్చిన బయటి వ్యక్తులు సైతం సాయంత్రానికల్లా నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. ప్రచారపర్వం తర్వాత, పోలింగ్ సమయానికి ముందున్న 48 గంటల పాటు జిల్లాలో ప్రలోభాల పర్వం జోరుగా సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరెండు రోజుల్లో చీకటిమాటున పెద్దఎత్తున ఓటర్లను డబ్బు, మద్యంతో ఎరవేసి ప్రలోభపర్చుకోవడానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. నిఘా కళ్లు గప్పి.. జిల్లాలోని కొంతమంది అభ్యర్థులు నిఘా కట్టుదిట్టం కాకముందే జాగ్రత్తపడి ముందస్తుగానే తమ నియోజవర్గాల్లోని నమ్మకస్తుల వద్ద, మండలస్థాయి నాయకుల వద్ద అవసరమైన సరుకు నిల్వ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న బడా వ్యాపారులు, బంధువుల ద్వారా నిధుల సమీకరణ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లకు ఎర.. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఆయా పార్టీల బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ కోసం జనసమీకరణలో మహిళలనే భారీసంఖ్యలో భాగస్వామ్యం చేసుకోవడంపై దృష్టి సారించాయి. వారి ఓట్లను రాబ ట్టుకోవడానికి అభ్యర్థులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి మించి మరొకరు తమ ఔదర్యాన్ని ఒలకబోస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలకు కమ్యూనిటీహాళ్ల నిర్మాణం విషయంలో తామంటే తాము నిర్మిస్తామని హామీలు గు ప్పిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల మహిళా సంఘా ల గ్రూపులకు ఒక్కో బృందానికి రూ.30 వేల చొప్పున సమకూర్చుతూ వారి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
కరీంనగర్: సమ ఉజ్జీల సమరం
ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్లో ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్టాత్మకమే.! అన్ని పార్టీలకు కీలకమే.! ఇక్కడి ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తూ అందరు నాయకుల్ని ఆదరించిన సందర్భాలున్నాయి. జిల్లా కేంద్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేకతను సాధించింది కరీంనగర్. ఓసీలకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈ సారి ముగ్గురు బీసీ అభ్యర్థులు నువ్వా–నేనా అన్నట్లు తలపడుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్, బండి సంజయ్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. నియో జక వర్గంలోని అన్ని గ్రామాల్లో కలియ తిరు గుతూ ప్రత్యర్థుల వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎవరికి వారు గెలుపుధీమాతో ఉన్నారు. సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ రాష్ట్రస్థాయి నాయకులు కావడంతో ఓటర్లు అసక్తిగా ప్రజాతీర్పు ఎలా ఉండబోతుందోనంటూ ఎక్కడ చూసిన చర్చించుకోవడం వినబడుతోంది. గంగుల కమలాకర్ హ్యట్రిక్ సాధించాలనే దిశగా తన ప్రచార పర్వాన్ని ఇప్పటికే కొత్తపల్లి, కరీంనగర్‌రూరల్, కరీంనగర్ పట్టణంలో ప్రచారాన్ని ఉధృతం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. నగరంలో ఆరు రోజుల పాటు పాదయాత్ర జరిపి ప్రజా సమస్యలను అవగతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గతంలో రెండోస్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైన కమలం జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో చాపకింద నీరులా పుంజుకుంటున్నారు. అభివృద్ధి పనులు... ⇔పట్టణంలో రహదారుల వెడెల్పు, నూతన రహదారుల నిర్మాణానికి రూ.46 కోట్లు ⇔విద్యుత్ టవర్ల నిర్మాణానికి రూ.22 కోట్లు ⇔కరీంనగర్ పట్టణం నుంచి రేకుర్తి వరకు విద్యుత్ టవర్ల తొలగింపుకు రూ.36 కోట్లు ⇔అంతర్గత రహదారుల అభవృద్ధికి రూ. వంద కోట్లు ⇔రెండోదఫా అంతర్గత రహదారుల అబివృద్ధికి రూ.147 కోట్లు ⇔మూడోదఫా అంతర్గత రహదారులలకు రూ. వంద కోట్లు ⇔బైపాస్ రోడ్ రేకుర్తి నుంచి తీగలగుట్టపల్లి, దుర్శెడ్ ద్వారా మానకొండూర్ వరకు 145 కోట్లతో రోడ్డు నిర్మాణం ⇔సదాశివపల్లె దగ్గర మానేరు వంతెనకై దక్షిణ భారతదేశంలోనే మొదటగా నిర్మిస్తున్న తీగల వంతెనకు 183 కోట్లు ⇔కమాన్ నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీ రహదారి నిర్మాణానికి రూ.34 కోట్లు ⇔33 నూతన రహదారుల నిర్మాణానికి అర్అండ్బీ శాఖ ద్వారా రూ.504 కోట్లు ⇔రూ. 4.50 కోట్లతో రైతు బజార్ ప్రధాన సమస్యలు ⇔పట్టణంలో 24 గంటల నీటి సరఫరా సమస్య ⇔అస్తవ్యస్తంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ⇔పట్టణంలో పార్కుల సుందరీకరణ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్ కరీంనగర్ పట్టణంలోని క్రిస్టియ న్ కాలనీకి చెందిన గంగుల కమలాకర్ బీటెక్ (సివిల్) పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో తెలుగుదేశంపార్టీలో రాజకీయ ప్రవేశం చేశారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, తెలుగుదేశంలో పార్టీలో జిల్లాస్థాయి పదవులు చేపట్టారు. 2000– 2009 వరకు రెండుసార్లు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పనిచేశారు. 2009 సంవత్సరంలో మొదటిసారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండవసారి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్సాధించాలనే తహతహతో ముందుకు సాగుతున్నారు. పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) మం కమ్మతోటకు చెందిన పొ న్నం ప్రభాకర్ 1987– 88 లో ఎస్సారార్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా రాజకీయ అరంగ్రేటం చేశారు. 1989 నుంచి 2004 వరకు ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, పీసీసీ మీడి యా విభాగం, రాష్ట్ర స్థాయి పదవులను చేపట్టారు. 2005– 09 వరకు ఉమ్మడి రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2009–2014 వరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా, ఏపీ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. మొదటిసారిగా అసెంబ్లీకి పోటీచేస్తున్న ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా కొనసాగినకాలంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలుపిస్తాయని ధీమాతో ఉన్నారు. బండి సంజయ్‌కుమార్ (బీజేపీ) కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన బండి సంజయ్‌కుమార్ విద్యార్థి దశ నుం చే ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ఏపీ, తమిళనాడు బీజేవైఎం ఇన్చార్జిగా కొనసాగారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు ఒకసా రి కౌన్సిలర్‌గా , రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేశారు. బీజేపీ నగర అధ్యక్షుడిగా, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. 2014 శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. మరోసారి పోటీలో నిలిచి బండి సంజయ్ తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. ప్రధాని మోడీ పథకాలు, హిందుత్వం ఏజెండాగా పనిచేస్తున్నారు. ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని... గెలుపుఖాయమని అంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గం వార్తల కోసం... -
కమలం.. నిస్తేజం..!
సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరిష్మాతో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుంటే.. జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుంటామనే ధీమాతో కాషాయ పార్టీ అధినేతలు ఉంటే.. జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికలవేళ బీజేపీయేతర పార్టీల క్యాడర్ కలిసి తమ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుంటే జిల్లాలో కమలం ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ఇంటిపోరును ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో కలిసిరాని క్యాడర్‌తో ఆందోళన చెందుతున్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తితో కొందరు సీనియర్లు అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోపక్క.. ఎమ్మెల్యే టికెట్టు పొందిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తమ సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదనీ, జూనియర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇదే కారణంతో కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లికి చెందిన ఆ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి సద్దిబత్తుల వేణు పదిరోజుల క్రితమే పార్టీనీ వీడి కారెక్కారు. మైనార్టీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు హమీద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పి.శేఖర్, బీసీ విభాగం మెట్పల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ సోమవారం ప్రజాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండు నెలల క్రితమే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జేఎన్.వెంకట్‌కు కమలం పార్టీ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారు చేసింది. దీంతో అప్పటివరకు ఆ స్థానం నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న మెట్‌పల్లికి చెందిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోరుట్లకు చెందిన రైల్వేబోర్డు సభ్యురాలు పూదరి అరుణ సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం ఇలాంటి సీనియర్లు వెంకట్‌కు మద్దతుగా ప్రచారంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో వెంకట్ తన బీసీ కార్డు, పాత పీఆర్పీ క్యాడర్‌తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ విషయమై బాజోజి భాస్కర్ వివరణ ఇస్తూ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు సీనియర్లను కలుపుకుపోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో పూదరి అరుణ కొన్నిరోజుల పాటు హైదరాబాద్‌లో ఉన్నారు. రేపటి నుంచి ప్రచారంలో పాల్గొంటారు. మెట్పల్లిలో మాత్రం బీజేపీ బలంగా ఉంది. పార్టీ అధినేతలను పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. జగిత్యాల, ధర్మపురిలో బహిరంగ సభలు పెడ్తాం అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్ధి కన్నం అంజయ్యకు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. ఏళ్ల నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న తమను ఎమ్మెల్యే అభ్యర్థి ఏనాడూ ప్రచారానికి పిలవలేదని మండిపడుతున్నారు. కనీసం సలహాలు, సూచనలు సైతం తీసుకోలేదంటూ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నీలకంఠం, రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కిసాన్‌మోర్చా నాయకుడు ఏలేటి లింగారెడ్డి, నాయకులు హనుమాండ్లు, గోవర్ధన్‌రెడ్డి తదితరులు ఇటీవల పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. జగిత్యాలలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. ఇక్కడినుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఎం.రవీందర్‌రెడ్డి గెలుపు మాత్రం అనుమానంగానే ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్, మహాకూటమి అభ్యర్థి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి మధ్యే ప్రధాన పోరు ఉంది. ఈ రెండువర్గాలు చేస్తున్న పోటాపోటీ ప్రచారానికి తగ్గట్టు రవీందర్‌రెడ్డి ప్రచారం చేయకపోవడం.. క్యాడర్ అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే చర్చ జరుగుతోంది. ప్రచారానికి అతిరథులు దూరం..! ఎన్నికల వేళ.. తమతమ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ అతిరథులు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి మాత్రం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, స్వామి పరిపూర్ణానంద మెట్పల్లిలో ఒక్కోసారి పర్యటించారు. జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో స్వామి పరిపూర్ణానంద పది నిమిషాలు కూడా మాట్లాడలేదు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్‌రెడ్డితో ప్రతిజ్ఞ చేయించి వెళ్లిపోయారు. ధర్మపురిలో మాత్రం ఒక్కరూ పర్యటించలేదు. దీంతో కోరుట్ల మినహా జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో అభ్యర్థులే అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం వంటి చిన్న జిల్లాల్లోనూ బీజేపీ కేంద్ర నాయకులు హాజరుకావడం.. ఉద్యమాల గడ్డ అయిన జగిత్యాలకు రాకపోవడంతో కమలనాథులను నిరాశకు గురిచేస్తోంది. -
టీఆర్ఎస్ 'రామా'బాణం!
ఎన్నికల ప్రచారానికి 48 గంటలు మాత్రమే గడువున్న ఆఖరు సమయంలో టీఆర్ఎస్ రామబాణం ప్రయోగించింది. గులాబీ బాస్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలతో నెలకొన్న జోష్‌ను కొనసాగించేందుకు యువనేత కేటీఆర్ సోమవారం జిల్లాలో పర్యటించారు. పెద్దపల్లి, గోదావరిఖనిలో కేటీఆర్ నిర్వహించిన బహిరంగసభలు విజయవంతం కావడంతో ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది. సాక్షి, పెద్దపల్లి: టీఆర్ఎస్ యువనేత, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గోదావరిఖని, 2.30 గంటలకు పెద్దపల్లి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలు నిర్వహించిన స్థలాల్లోనే కేటీఆర్ సభలను ఏర్పాటు చేశారు. రెండు సభల్లోనూ ఆయన దాదాపు అరగంట పాటు ప్రసంగించారు. తన ప్రచారంలో టీఆర్ఎస్ అభివృద్ధిని వివరించడంతో పాటు, కాంగ్రెస్, బీజేపీలను మరీ ముఖ్యంగా చంద్రబాబును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. విపక్షాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సభికుల నుంచి స్పందన కనిపించింది. మధ్యలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ, తన సహజ శైలిలో సాగిన కేటీఆర్ ప్రసంగం ఆకట్టుకుంది. పెద్దపల్లిలో పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డిపై కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తాను చూసిన ఎమ్మెల్యేల్లో ఇంత మంచి ఎమ్మెల్యే లేడంటూ, సొంత డబ్బులు ఖర్చుపెట్టి హరితహారాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. పలుమార్లు స్థానిక అంశాలను కేటీఆర్ ప్రస్తావించడంతో సభికుల నుంచి స్పందన లభించింది. మళ్లీ దాసరి మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యే, కేసీఆర్ సీఎం అయితే నియోజకవర్గంలోని చివరి ఎకరాకు కూడా నీళ్లందిస్తామంటూ హామీ ఇచ్చారు. అంతేగాకుండా తాను వ్యక్తిగతంగా ఇందుకు బాధ్యత తీసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల తరహాలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళుతానన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పదమూడు స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఇటీవల కేసీఆర్ సభలు, సోమవారం కేటీఆర్ సభలు విజయవంతం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. సెంటిమెంట్...సెటిల్మెంట్...ప్లేస్మెంట్...పనిష్మెంట్ సుల్తానాబాద్‌లో విజయశాంతి రోడ్‌షో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలి స్టార్ క్యాంపెయినర్ సోమవారం జిల్లాకు వచ్చారు. సినీ నటి విజయశాంతి సుల్తానాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు పర్యటించకపోవడం తెలిసిందే. రేవంత్‌రెడ్డి సభలు ఉంటాయని ముందుగా ప్రచారం జరిగినా, ఇప్పటివరకు స్పష్టత రావడంలేదు. ప్రచారానికి మరో రెండు రోజులు ఉండడంతో చివరివరకైనా రేవంత్‌రెడ్డిని తీసుకురావాలనే ప్రయత్నంలో పార్టీ నేతలున్నారు. రోడ్‌షోలో ప్రజలను ఆకట్టుకోవడానికి విజయశాంతి ప్రయత్నించారు. ఉద్యమ సమయంలో సెంటిమెంట్, అధికారంలోకి వచ్చాక సెటిల్మెంట్, తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులకు మంత్రి వర్గంలో ప్లేస్మెంట్, ఇదేంటని ప్రశ్నిస్తే మనకు పనిష్మెంట్ అంటూ కేసీఆర్‌పై విజయశాంతి సెటైర్లు విసిరారు. -
కరీంనగర్: టీఆర్ఎస్కు ఓటేసి ఆత్మగౌరవాన్ని చాటాలి
సాక్షి, కరీంనగర్‌రూరల్: రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్కు ప్రజలందరూ ఓట్లేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం నగునూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చావిడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమలాకర్ మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నగునూరుకు పాతరోడ్డు, చెక్‌డ్యామ్, కాట్నెపల్లిరోడ్డు, ఎలబోతారం గ్రామాలకు రహదారుల నిర్మాణంతో రవాణాసౌకర్యం కల్పించినట్లు తెలిపారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీలు భద్రయ్య, చంద్రమ్మ, మాజీ సర్పంచులు కె. సుమలత, జె. సాగర్, పి.శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, డైరెక్టర్లు శ్రీధర్, నేక్ పాషా, కె.రాంరెడ్డి, శ్రీనివాస్‌రావు, దిలీప్, సంపత్, కె.శ్రీనివాస్, బి.గోపాల్‌రెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, ఎస్.సంపత్‌రావు, కె.శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజలంతా ఏకమై టీఆర్ఎస్ను గెలిపించాలి తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో ఆంధ్రోళ్లు విషం చిమ్మే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రజలంతా ఏకమై టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం ఎలగందులలో సోమవారం ఆయనకు మహిళలు మంగళహారతులు.. పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గంగుల మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్, బీజేపీ పార్టీల మోసపూరిత వాగ్ధానాలు నమ్మి మోసపోద్దని, ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీని గెలుపించుకోవల్సిన ఆవశ్యకత ఉదన్నారు. లేకపోతే తెలంగాణను కుక్కలు చింపిన ఇస్తారిలా మార్చేందుకు ఆంధ్రోళ్లు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆచంపల్లి చెరువుపై నిర్మించిన వరద కాలువకు తూం ఏర్పాటు చేయకపోవడం వల్లనే నాగులమల్యాల, బావుపేట, ఎలగందుల, కమాన్‌పూర్, బద్ధిపల్లి గ్రామాల్లోని చెరువులు ఎండిపోయాయన్నారు. ఇక్కడి భూములు బీడుగా మారడానికి కాంగ్రెస్‌దే పాపమని విమర్శించారు. ఆచంపల్లి శివారులోని వరద కాలువపై నిర్మిస్తున్న ఫీడర్ చానల్ ద్వారా సంక్రాంతికి చెరువులు నింపకుంటే గ్రామాల్లోకి రానయ్యద్దని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కో డూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, వైస్ ఎంపీపీ నిమ్మల అంజయ్య, మాజీ సర్ప ంచ్ ప్రకాష్, నాయకులు చంద్రమౌళి, మంద రమేష్‌గౌడ్, శ్రీనివాస్, ప్రభాకర్ పాల్గొన్నారు. -
గోదావరిఖని: కార్మికులంతా టీఆర్ఎస్ వైపే..
సాక్షి, గోదావరిఖని: సింగరేణి కార్మికులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని రామగుండంలో వార్ వన్ సైడ్ అవుతుందని పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు, నాయకుల కృషి ఫలితంగా రామగుండంలో ఎలక్షన్స్ వన్ సైడ్ అవుతుందని మిగతా పార్టీలకు డిపాజిట్లు రావన్నారు. జీతాలు పెంచమని పోయిన ఉద్యోగులను గుర్రాలతో తొక్కి, కరెంట్ ఇవ్వమని అడిగిన రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వారసులు ఇక్కడకి రాబోతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 20 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించానని తెలిపారు. టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, నూనె కొమురయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, దేవ వెంకటేశం, కనంక శ్యాంసన్, ఎట్టం కృష్ణ, ఆరెల్లి పోషం, వడ్డేపల్లి శంకర్, నాయిని మల్లేష్, కృష్ణమూర్తి, పుట్ట రమేశ్ పాల్గొన్నారు. రామగుండం: ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతర్గాం మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో సోమారపు ఎడ్లబండితో రోడ్‌షో నిర్వహించారు. టీఆర్ఎస్కు ఓటేస్తేనే సంక్షేమ పథకాల కొనసాగుతాయన్నారు. -
పెద్దపల్లి: నాయకుడి పూజలు ఫలించేనా?
సాక్షి,పెద్దపల్లి: పట్టణంలోని పలు ఆలయాల్లో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మిగణపతి,సంతోషిమాత, చాముండీశ్వరీ ఆలయాల్లో పూజలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజయ్య, నాయకులు కొట్టె సదానందం, మర్రిపల్లి సతీష్ తదితరులున్నారు. పెద్దపల్లి: దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం ఆంధ్రా పాలకుల కారణంగా నిరాదరణకు గురైందని, రాష్ట్రాన్ని సాధించి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమేనని దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ మండలం కనుకుల, కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు దాసరి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మైలారపు నారాయణ, నూనె కుమార్, కుంభం సంతోష్, మోహన్‌రావు, కొండాల్‌రెడ్డి, పెద్ది రాజేషం పాల్గొన్నారు. చేరిక ఎలిగేడు: నారాయణపల్లి, సుల్తాన్పూర్, లాలపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు దాసరి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మల్లారాపు మల్లేశం(సుల్తాన్‌ఫూర్), సబ్బు తిరుపతి(నారాయణపల్లి), గట్టు రాజు, ముద్రవేని ఓదెలు, కవ్వంపల్లి సుమన్(సుల్తాన్పూర్), తీపిరెడ్డి రాంరెడ్డి(లాలపల్లి)తోపాటు వారి అనుచర వర్గం టీఆర్ఎస్లో చేరినట్లు నాయకులు పేర్కొన్నారు. మోహన్‌రావు, కొండాల్‌రెడ్డి, రాజేశం, రాయనర్సయ్య, తిరుపతిరెడ్డి, రాజేశం, కొండ వెంకన్న, రాజకొమురయ్య, వెంకటేశ్ పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం వార్తల కోసం... -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి: శ్రీధర్‌బాబు
సాక్షి, మంథని: నాల్గున్నర సంవత్సరాలు మాయమాటలు చెప్పి కాలం వెల్లదీసిన టీఆర్ఎస్ నాయకులు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీధర్‌బాబు అన్నారు. మంథని మండలం బిట్టుపల్లి, గద్దలపల్లి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిసాన్‌ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ కాచే, మంథని జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన, మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, ఎంపీటీసీ అంబీరు సరోజన, నాయకులు బాపు, లింగాగౌడ్, గడ్డం రాజు, వంగరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి మాటలు నమ్మొద్దు
సాక్షి, రామగిరి/మంథని : మాయమాటలు చెబుతూ మభ్యపెట్టేందుకు వస్తున్న మహాకూటమి నాయకులను నిమ్మితే మనల్ని నట్టేట ముంచుతారని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు పేర్కొన్నారు. చందనాపూర్, ఎస్సీకాలనీ, పెద్దంపేట, పస్నూరు గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. మండల అధ్యక్షుడు పూదరి సత్యనారాయణగౌడ్, అధికార ప్రతినిధి కొంరయ్యగౌడ్, ఎంపీటీసీ ఎలువాక ఓదెలు, నాయకులు దాసరి రాయలింగు, బేతి కుమార్, ఇజ్జగిరి రాజు, గద్దల శంకర్, మేదరవేన కుమార్, రొడ్డ శ్రీనివాస్, పొన్నం సదానందం, శ్యాం(లడ్డా), వేగోళపు మల్లయ్య, ఆసం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నాల్గున్నర సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వాకర్స్‌ను కలిశారు. పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన యువత ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వారితో మాట్లాడారు. యోగా సాధన చేస్తున్నవారిని కలిసి ఓటు అభ్యర్థించారు, ఏగోళపు శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చొప్పదండి: దొంగల కూటమిని నమ్మకండి
సాక్షి, కొడిమ్యాల: కేసీఆర్‌ను ఓడించడం లక్ష్యంగా ఏర్పడ్డ ప్రజాకూటమి దోపిడీ దొంగల కూటమిని చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు నమిలికొండ, శ్రీరాములపల్లి, గోపాల్రావుపేట, ఆరెపల్లి, పూడూరు, అప్పారావుపేట, రామారావుపేట, చింతలపల్లి గ్రామాలలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకులు 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. మళ్లీ మోసపోయి కాంగ్రెస్, టీడీపీలకు ఓటువేస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. జగిత్యాల సభ నుంచి కరీంనగర్ సభకు కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో తనను వెంట తీసుకెల్లినప్పటికీ.. మాజీ ఎమ్మెల్యే శోభ కేసీఆర్ ప్రసంగంలో తన పేరు కూడా ప్రస్తావించలేదని అనడం హాస్యాస్పదమన్నారు. మండలంలోని మైసమ్మచెరువు, పోతారం పెద్దచెరువు రిజర్వాయర్లను ఎల్లంపల్లి నీటితో నింపి ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. ఎంపీపీమేన్నేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, విండోచైర్మన్ పునుగోటి కృష్ణారావు, నాయకులు మేన్నేని రాజనర్సింగరావు, ఎంపీటీసీలు నాగరాజు, చంద్రశేఖర్, బల్కంమల్లేశం, కోఆప్షన్మెంబర్ చాంద్‌పాషా, ఆదయ్య, హన్మయ్య, లింగాగౌడ్, చంద్రమోహన్‌రెడ్డి, బైరివెంకటి, బింగిమనోజ్, కొత్తూరిస్వామి, శివప్రసాద్‌రెడ్డి, మొగిలిపాలెం శ్రీనివాస్, పులి వెంకటేష్, నసీర్ పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం... మల్యాల: మండల కేంద్రంతో పాటు, ఒబులాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం ముమ్మరం చేశారు. ఒబులాపూర్‌లో ఎండీ.సుభాన్, అనిల్‌రెడ్డి, మండల కేంద్రంలో మైనార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బూసి గంగాధర్, పొన్నం మల్లేశం గౌడ్, అమీర్, పందిరి శేఖర్, లాలా మహమ్మద్, నూర్ మహమ్మద్, సలీం, మాజీద్ పాల్గొన్నారు. -
అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ
సాక్షి, గంగాధర: తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాగానే రైతులకు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. చొప్పదండి మండల కేంద్రంతో పాటు రుక్మాపూర్, కొలిమికుంట, భూపాలపట్నం, వెదురుగట్ట, చాకుంట గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిధులు, నీళ్లు, నియామాకాల కోసం సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలుగా కుటుంబపాలనకే పరిమితమైందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా నాలుగున్నర సంవత్సరాలుగా చొప్పదండి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి రైతులు, ప్రజల సమస్యలపై పోరాడిన వ్యక్తినన్నారు. ఈసారి అవకాశం ఇస్తే చొప్పదండి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపుతానని, అసంపూర్తి కాలువ నిర్మాణం పనులు పూర్తి చేస్తానన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజక్టులకు రిడిజైన్ పేరుతో అంచనా వ్యయంతో పెంచి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు, ఒక ఇంట్లో ఎందరు అర్హులుంటే వారందరికీ పింఛన్ మంజూరు చేస్తోందని తెలిపారు. అంతేగాక పింఛను పెంచుతామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వారికి అదనంగా రెండు లక్షలు, ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 50వేల నగదును, ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తోందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి నాలుగైదు రాష్ట్రాల బడ్జెట్ కావాలని విమర్శించిన టీఆర్ఎస్ అదే మేనిఫెస్టోను కాపీ కొట్టిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మండల కాంగ్రెస్ నాయకులతో పాటు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జగిత్యాల: ద్విముఖ పోరు
సాక్షి,జగిత్యాల(కరీంనగర్) : జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 1952లో ఏర్పడిన నియోజకర్గ పరిధిలో జగిత్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాలు ఉన్నాయి. 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 10 సార్లు, టీడీపీ 4సార్లు విజయం సాధించాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ 12 సీట్లు గెలుచుకుంటే.. జగిత్యాలను మాత్రం జీవన్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. అయితే ఈ సారి ఎలాగైన జగిత్యాల కోటపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ జోరుగాప్రచారం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ముదుగంటి రవీందర్‌రెడ్డి ప్రచారంలో మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు. ⇔యావర్‌రోడ్డు పూర్తికావాలి. ⇔పాతబస్టాండ్‌ను విస్తరించాలి. ⇔మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి. ⇔ఆయకట్టు కాలువల మరమ్మతులు చేపట్టాలి. ⇔నూతన ఫిల్టర్బెల్డ్ను లింగంపేట చెరువుకు కాకుండా నూతన చెరువుకు కలపాలి. ⇔జగిత్యాల పట్టణంలో రూ.5కోట్లతో నిర్మించిన టౌన్వాల్ 25ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. దానిని ఉపయోగంలోకి తేవాలి. ⇔రాయికల్ మున్సిపాలిటీ అయిన్పటికీ... బస్టాండ్ ఏర్పాటు చేయాలి. ⇔రాయికల్‌లోని మాదికకుంట స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. ⇔పాత సారంగాపూర్ మండలంలో మిషన్‌భగీరథ అస్తవ్యస్తంగా ఉంది. ⇔మండలంలోని రోల్లవాగు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదు. ⇔సాంగాపూర్, బీర్పూర్ మండలాల కు కలిపి డిగ్రీకళాశాల ఏర్పాటు చేయాలని అక్కడి విద్యార్థులు కోరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫైల్.. జగిత్యాల జిల్లాపెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి న్యాయవాదిగా జగిత్యాలలో స్థిరపడ్డారు. మొట్టమొదటిసారిగా మల్యాల సమితి అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి అప్పటి నుండి చేతిగుర్తు తరుఫునపోటీ చేసి ఇప్పటి వరకు 6సార్లు గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంజయ్‌కుమార్ (టీఆర్ఎస్) టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్‌ది జగిత్యాల మండలం అంతర్గాం. వృత్తిరీత్యా కంటి వైద్య నిపుణులుగా జగిత్యాలలో స్థిరపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున టికెట్ దక్కింది. అప్పుడు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. మళ్లీ టీఆర్ఎస్ ఆయనకే టికెట్ కట్టబెట్టింది. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే సంజయ్‌కుమార్‌ను ఎలాగైనా గెలిపించి రికార్డు సృష్టించాలని ఎంపీ కవిత పట్టుపట్టారు. ఆయన తరఫున ముందుండి ప్రచారం చేస్తున్నారు. ఊరూరా తిరిగి, సంజయ్‌కుమార్‌ను గెలిపించి, జగిత్యాల కోటలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నారు. ముదుగంటి రవీందర్‌రెడ్డి (బీజేపీ) మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన ముదుగంటి రవీందర్‌రెడ్డి మొదటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. 24 ఏళ్లుగా పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీచేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం అవకాశం రావడంతో రవీందర్‌రెడ్డి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన బీఈ ఇంజినీరింగ్ చేసినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. జగిత్యాల నియోజకవర్గం వార్తల కోసం... -
చైతన్యం.. నవ్యపథం
సిరిసిల్ల: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంతో కీలకమైనవి. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును స్వేచ్ఛగా.. నిర్భయంగా వినియోగించుకునే సమయం ఇది. తెలంగాణలో ముందస్తుగా జరుగుతున్న ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్, జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పిస్తున్నాయి. ఓటర్లలో ఓటుహక్కు వినియోగంపై చైతన్యాన్ని కలిగించి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసమ్మర్ధం కలిగిన ప్రదేశాల్లో ఓటు చైతన్యంపై ప్రచార పోస్టర్లు వేస్తున్నారు. ఓటును అమ్ముకోవద్దని కోరుతూ ఎన్నికల్లో అక్రమాలపై సమాచారం అందించేందుకు పౌరులకు అందించిన ఆయుధం సీ విజల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల పక్రియలో ఎన్నడూ లేని విధంగా నవ్యపథంలో ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రం సిరిసిల్లలోపాటు, వేములవాడ, అన్నిమండల కేంద్రాల్లోనూ ఓట్లపై ప్రజా చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఎన్నికల తేదీని మరిచిపోకుండా ఉండేందుకు ఈనెల 7న ఎన్నికలు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ జిల్లా యంత్రాంగం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. -
జగిత్యాల: ప్రతీ పల్లె వికసించాలన్నదే నా కల
‘ప్రచారం కోసం నేను ఏ పల్లెకు వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. ఈసారి కారుగుర్తుకే ఓటేస్తామంటున్నరు. నాపై పూర్తి విశ్వాసంతో మళ్లీ గెలిపించుకుంటామని తీర్మానాలు చేస్తున్నరు. కేసీఆర్ ఆశీస్సులతో నాలుగేళ్లలో రూ.1,230 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసిన. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలిచి.. మరింత అభివృద్ధి చేస్తా. ప్రతీ పల్లెను వికసింపజేసి.. అన్ని మండలాలను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేయాలన్నదే నా ధ్యేయం’ అని టీఆర్ఎస్ ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొప్పుల ఐదోసారి ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. సౌమ్యుడు.. స్నేహశీలిగా పేరొందిన కొప్పుల ఎన్నికలలో ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రజల స్పందన.. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి? అధికారంలోకి వస్తే చేయనున్న పనులపై ఆయన మాటల్లోనే... – సాక్షి, జగిత్యాల సాక్షి, జగిత్యాల: నియోజకవర్గంలో దాదాపు 70వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రాజెక్టులు, లిఫ్టులు, కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ధర్మపురి, బీర్పూర్ మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 30 వేలకు పైగా ఎకరాలకు తాగు, సాగునీరందించేలా బీర్పూర్ మండలంలో రోళ్లవాగు ప్రాజెకుŠట్ నిర్మాణ, ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆరు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. కొనసాగుతున్న బొల్లిచెరువు ఆధునికీకరణ పనులతో మరో 5వేల ఎకరాలకు సాగునీరందనుంది. వీటితోపాటు నియోజకవర్గ పరిధిలోని స్తంభంపల్లి, వెల్గటూరు, జగదేవ్‌పూర్, దమ్మన్నపేట, అక్కపల్లిలో లిఫ్ట్‌ల పనులు జరుగుతున్నాయి. రంగదామునిపల్లి బైపాస్ కెనాల్, పత్తిపాక బొమ్మెనపల్లి కాలువ, మద్దులపల్లి లింగాపూర్, అంబరిపేట కాలువ విస్తరణ పనులు జరుగుతున్నాయి. రూ.7 కోట్లతో మేడారం తూముల ద్వారా వెల్గటూరులోని 11 గ్రామాలకు సాగునీరందించేలా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.5 కోట్లతో 31 చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మళ్లీ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే కొనసాగుతున్న పనులు పూర్తి చేయడంతోపాటు నియోజకవర్గంలో మరో 30 వేల ఎకరాలకు సాగునీరందించేలా పనులు చేస్తా. ధర్మపురి టెంపుల్ సిటీ సమైక్యవాదుల పాలనలో తెలంగాణలోని అన్ని దేవాలయాలు ఆదరణకు నోచుకోలేకపోయాయి. ముఖ్యంగా దక్షిణకాశీగా పేరొందిన ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయానిదీ ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించడంతో(కొంతభాగం)పాటు టెంపుల్ సిటీలా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నం. ఇప్పటికే రూ.50 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఆ నిధులతో ఎలాంటి పనులు చేపట్టాలి? ఇంకెన్ని నిధులు అవసరం? అనే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నం. త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. ఏడాదిలోగా లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని టెంపుల్‌సిటీగా మారుస్తా. ఇదే క్రమంలో ధర్మపురి నుంచి మురుగునీరంతా పవిత్ర గోదావరిలో చేరుతున్నాయి. వచ్చిన నిధుల్లోంచి రూ.6 కోట్లతో గోదావరి నది ప్రక్షాళన చేయబోతున్నాం. కొత్త కొత్తగా ! మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ధర్మపురిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడమే కాకుండా పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.25 కోట్లు మంజూరు చేసుకున్నాం. ధర్మపురిలో రూ.కోటితో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మించుకోబోతున్నాం: ధర్మపురిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం, పెగడపల్లి, వెల్గటూరులో జ్యోతిబాపూలే, ధర్మపురిలో మైనార్టీ బాలికల, గొల్లపల్లిలో ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయించుకున్నాం. ధర్మపురిలో డిగ్రీ, గొల్లపల్లి, వెల్గటూరులో జూనియర్ కాలేజీ మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. కొత్తగా బుగ్గారం మండలాన్ని మంజూరు చేసుకున్నం. 21 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నం. రూ.37 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు నిర్మించుకున్నాం. ముఖ్యంగా పెగడపల్లి నుంచి గుండి, వెల్గటూరు నుంచి కల్లెడ, చిల్వకొడూరు నుంచి ఐతుపల్లి, రాష్ట్ర రహదారి– 7 నుంచి మల్లాపూర్ వరకు, ధర్మారం నుంచి బొమ్మారెడ్డిపల్లి, అప్రోచ్ రోడ్డు నుంచి బానంపల్లి, పాతగూడురు నుంచి మేడారం, శానబండ నుంచి గొడిసెలపేట వరకు, గొల్లపల్లి నుంచి మల్లన్నపేట, వెంగళాపూర్ నుంచి గుట్టలపల్లి, బీర్సాని నుంచి మద్దనూరు వరకు, జైన నుంచి తీగలధర్మారం వరకు రోడ్ల నిర్మాణాలు చేపట్టుకున్నం. గుంజపడుగు, పాతగూడురు, దీకోండ, మ్యాకవెంకయ్యపల్లి, బుచ్చయ్యపల్లి, తిరుమలాపూర్, శెకల్లా, ఐతుపల్లి, ల్యాగలమర్రిలో వంతెన నిర్మాణాలు జరిగాయి. కొత్తగా ఎనిమిది విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించుకున్నాం. -
పెద్దపల్లి: తికమకలేదు.. టీఆర్ఎస్దే అధికారం
‘మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన...అందుకు కృతజ్ఞతగా దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుక ఇవ్వండి. దాసరి మనోహర్‌రెడ్డి గురించి చెప్పే అవసరం లేదు. ప్రజలందరికీ తెలుసు. అతను ఎంతో మంచి వ్యక్తి. ఇతరుల సొమ్ము ఆశించే వాడు కాదు. మంచివాళ్లను గెలిపిస్తే మంచిగుంటది. హరితహారంలో ఆయన జేబు నుంచి డబ్బులు పెట్టి, లక్షలాది మొక్కలు పంపిణీ చేసిండు. – పెద్దపల్లి సభలో గులాబీ దళపతి కేసీఆర్ ‘‘మంథనిలో పుట్ట మధు గాలి వీస్తోంది. గతంలో పాలించిన వారి కంటే మంచిగ పనిచేస్తున్నడు. అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. లేటెస్ట్ సర్వేలో మధు 50 వేల మెజార్టీతో గెలుస్తున్నట్లు వచ్చింది. మంథని ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారు. వివేకంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.ఎన్ని లారీల మందుగుండు సామగ్రి తెచ్చినా.. మధు విజయం ఆపలేరు.’’ – మంథని సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సాక్షి, పెద్దపల్లి/మంథని: గులాబీ దళపతి.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో ప్రజాఆశీర్వాద సభల్లో మాట్లాడారు. తికమకలేదని.. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడనుందని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ‘మీకు పెద్దపల్లి జిల్లా ఇచ్చిన...అందుకు కృతజ్ఞతగా నాకు దాసరి మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి కానుక ఇవ్వండి’...అంటూ టీఆర్ఎస్ అధినేత ప్రజలను కోరారు. పెద్దపల్లికి సంబంధించి ముఖ్యమైన సమస్య ఆయకట్టుకు సరిగా నీళ్లేనని అన్నారు. ఉద్యమ సమయంలో తాను వచ్చినప్పుడు కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో నీళ్లు పోలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పుష్కలమైన నీళ్లు వస్తున్నాయని, చివరి ఆయకట్టుకు నీళ్లీస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు కిరికిరి రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాలువ చివరిభూములు, మొదటి భూములు అనే మాటే లేదన్నారు. కాలువ మొదటి, చివరి భూములు అంటే చంపేస్తానని ఇంజనీరింగ్ అధికారులకు చెప్పానన్నారు. మొదట ఎంత పారుతుందో చివరన కూడా అంతే పారాలన్నారు. వచ్చే టర్మ్‌లో తాను స్వయంగా పెద్దపల్లికి వచ్చి సమీక్ష చేపట్టి, ప్రతీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. హుస్సేనిమియా, మానేరు చెక్‌డ్యాంలన్నీ పూర్తి చేస్తామన్నారు. గోదావరి పక్కనే పెద్దపల్లి ఉందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇక్కడి నుంచే పోతుందని, నీళ్లకు సమస్యే రాదన్నారు. నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనన్నారు. పెద్దపల్లి సభలో టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రఘువీర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, పార్టీ నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, గోపగాని సారయ్య తదితరులు పాల్గొన్నారు. పోడు సమస్య పరిష్కరిస్తా ‘తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి 58 ఏళ్లు అధికారంలో ఉండి పోడు భూముల సమస్య పరిష్కారం చేయలేదని.. ఢిల్లీల.. ఇక్కడ వాళ్ల పెత్తనమే. మరి ఎవరు అడ్డం వచ్చిండ్రు. వాళ్లకు సమస్య మీద చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో ‘పోడు సమస్య పరిష్కరించి హక్కులు కల్పిస్తా.’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంథని ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం మొదలుకొని మంథని వరకు పోడు భూముల సమస్య కనిపించదని.. గిరిజనుల భూ సమస్య పరిష్కరించి రైతుబంధు వర్తింజజేస్తామని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ఏదైనా పట్టుబడితే మొండి పట్టు పడుతడు. ఎవరినో పంపిచుడు కాదు.. స్వయంగా తానే మంథని చీఫ్ సెక్రటరీతో సహా వచ్చి ఒకటి లేదా రెండు రోజులు ఇక్కడే పుట్ట మధు ఇంట్లో ఉండి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అడవిని నరకొద్దని.. అటవీ సంపదను కాపాడుకోవాలన్నారు. గతంలో చాలా దుర్మార్గాలు జరిగాయని.. మంథని ప్రజలు రాజకీయ చైతన్యం కలిగిన వారని, వివేకంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రపంచం ఆశ్చర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని.. స్వీచ్ ఆన్ ఐతే మంథని నిత్య కల్యాణం, పచ్చతోరణమేనన్నారు. గోదావరి ఎప్పుడూ కళకళలాడుతుందని.. నీటి సంపద మంథని చుట్టూ అలుముకుంటుందన్నారు. మధు రెండు లిఫ్టులు కావాలన్నాడని.. రెండు కాదు మూడు మంజూరుచేసి నియోజకవర్గంలో అటవీ భూమి పోను ఒక ఇంచు కూడా ఎండకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. మంథనిలో పుట్ట మధు గాలి వీస్తోందని.. గతంలో పాలించిన వారి కంటే మొరుగ్గా పనిచేస్తున్నాడని కితాబిచ్చారు. అన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయని, లేటెస్ట్ సర్వేలో మధు 50 వేల మెజార్టీతో గెలుస్తున్నట్లు వచ్చిందన్నారు. మంథని సభకు వచ్చిన జనం నియోజకవర్గం ప్రజళ్లా లేరని, రెండు జిల్లాల నుంచి వచ్చినట్టుగా ఉందన్నారు. ఎన్ని లారీల మందుగుండు సామగ్రి తెచ్చినా.. మధు విజయం ఆపలేరన్నారు. రాష్ట్రంలో వంద సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని బహిరంగసభలు విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మంథని సభలో ప్రభుత్వ సలహాదారు వివేకానంద, టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు, టీబీజీకేఎస్ కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తోనే అన్నివర్గాల అభ్యున్నతి
సాక్షి, కొత్తపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసిందని కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని సాలెహ్నగర్, హనుమాన్‌నగర్, ద్వారకానగర్, గౌడ కాలనీ, షేకాబీకాలనీల్లో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్, మాజీ ఉపసర్పంచ్ సుదగోని కృష్ణకుమార్గౌడ్ల ఆధ్వర్యంలో శుక్రవారం కమలాకర్‌కు డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పలు మసీదుల్లో ముస్లింను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సభల్లో గంగుల మాట్లాడుతూ ఐదేళ్లుగా కనిపించని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఎందుకు పట్టించుకోలేదో నిలదీయాలని కోరారు. మహాకూటమి రూపంలో చంద్రబాబు తెలంగాణ గడ్డపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్రా దొంగలు పడేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కొనసాగాలంటే ఇంటిపార్టీ టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, జెడ్పీ కోఆప్షన్ జమీలొద్దీన్, ఎంపీటీసీ శేఖర్, టీఆర్ఎస్వీ నాయకుడు పొన్నం అనీల్‌గౌడ్, మాజీ వార్డుసభ్యులు ఎస్.నారాయణగౌడ్, మాజీద్, రహీం, రాచకొండ నరేశ్, పొన్నాల తిరుపతి, అస్తపురం నర్సయ పాల్గొన్నారు. పలువురి చేరిక రేకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సీనియర్ సీనియర్ నాయకులు అస్తపురం అంజయ్య, నెల్లి చంద్ర య్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రవీందర్‌లు గంగుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నేడు‘ గంగుల’ ప్రచారం కరీంనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ శనివారం సీతారాంపూర్ కాలనీ, కమాన్‌పూర్ గ్రామాల్లో ఉదయం ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం కరీంనగర్‌లోని 16, 17, 21 డివిజన్లలో ఇంటింటా ప్రచారంతోపాటు గంజ్, టవర్ సర్కిల్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఎన్ఎన్ గార్డెన్లో నిర్వహించే సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ హాజరుకానున్నారు. తెలంగాణ ఆసెంబ్లి ఎన్నికల మరిన్ని వార్తలు.. -
గోదావరిఖని: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
సాక్షి, గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. గురువారం స్థానిక లక్ష్మీనగర్‌లో, కళ్యాణ్‌నగర్‌లో ఆయన ప్రచారంలో భాగంగా వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందరికి అనుగుణంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలపై విశ్వాసంతో సేవ చేస్తూ, వస్తున్నానన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి, గుమ్మడి కుమారస్వామి, రియాజ్ అహ్మద్, గోపాల్‌రావు, తిప్పారపు శ్రీను, బాలరాజ్‌కుమార్, పొన్నం విజయ్‌కుమార్, చిదురాల రవీందర్, నర్సిన సంతోష్ పాల్గొన్నారు. పద్మశాలీల అభ్యున్నతికి కృషి పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ హామీ ఇచ్చారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కులబాంధవులు ఆయనకు మద్దతు ప్రకటించారు. నాయకులు వేముల రాంమూర్తి, కౌశిక్‌హరి, మండల సత్యనారాయణ, కొలిపాక సుజాత పాల్గొన్నారు. -
ఎవరిదీ...గెలుపు !
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల గెలుపు, ఓటములపై చర్చ జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులే గడువు ఉండగా.. 13 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల తీర్పులో ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడి ఎన్నికలలో ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండగా నిలిచారు. ఉద్యమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ నాలుగేళ్ల పనితీరుకు పరీక్షగా నిలుస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రిజర్వుడు స్థానాల్లో మళ్లీ ఎవరు..? ఉమ్మడి కరంనగర్ జిల్లాలో ధర్మపురి, మానకొండూరు, చొప్పదండి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు. ఈ మూడు స్థానాల్లో టీఆర్ఎస్ గతంలో గెలుపొందగా, ఈసారి మళ్లీ ఎవరిని విజయం వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ధర్మపురిలో పాత అభ్యర్థులే మళ్లీ బరిలో ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు, తర్వాత కొప్పుల ఈశ్వర్ 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈసారి మధ్యే పోటీ నెలకొంది. చొప్పదండిలో సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), బొడిగె శోభ (బీజేపీ) మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రవిశంకర్ కేసీఆర్ ప్రభుత్వ పథకాలతోనే ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మేడిపల్లి సత్యంకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పాలనలో చొప్పదండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ప్రచారంతో సత్యం ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ ఇక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ తరుపున బరిలో నిలిచారు. మానకొండూరు సెగ్మెంట్ ఏర్పడిన తర్వాత జరిగిన గత రెండు ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీఆర్ఎస్ను గెలిపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఏర్పుల బాలకిషన్ (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోటీ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బాలకిషన్ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండరనే కాంగ్రెస్ ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రతికూలంగా ఉంది. రామగుండం.. ఎవరికో వరం..! కార్మిక క్షేత్రం రామగుండంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉన్నాయి. 2009 నుంచి వరుసగా మూడోసారి ఒకేరకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సోమారపు సత్యనారాయణ (టీఆర్ఎస్), కోరుకంటి చందర్ (ఏఐఎఫ్బీ), మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ (కాంగ్రెస్), బల్మూరి వనిత (బీజేపీ) పోటీ పడుతున్నారు. 2009లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కోరుకంటి చందర్.. 2014లో, ఇప్పుడు టీఆర్ఎస్ రెబెల్‌గా ఏఐఎఫ్బీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల తరహాలోనే సోమారపు సత్యనారాయణకు, కోరుకంటి చందర్‌కు మధ్య ప్రధాన పోటీ ఉంది. పెద్దపల్లిలో.. పెద్దపీట ఎవరిదో..! పెద్దపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి (టీఆర్ఎస్), చింతకుంట విజయరమణారావు (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన విజయరమణారావు ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలో దిగారు. నియోజకవర్గంలో ఫలితాలపై ప్రభావం చూపే ప్రధాన సామాజికవర్గం ఓట్లపై టీఆర్ఎస్ అభ్యర్థి ధీమాతో ఉన్నారు. కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన రమణారావుకు వ్యక్తిగత సంబంధాలు ప్రధాన బలంగా ఉన్నాయి. వీరిద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సిరిసిల్ల.. కేటీఆర్ ఇలాకా..! టీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి కె.తారకరామారావు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో మాజీ ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి కేటీఆర్‌కు ఎన్నికలలో అనుకూలంగా మార్చింది. సాగునీటి వనరుల అభివృద్ధి, అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతో కేటీఆర్‌కు ఆదరణ పెరిగింది. చేనేత వర్గీయుల సంక్షేమ కోసం చేపట్టిన పథకాలతో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ వర్గీయులలో కేటీఆర్ సానుకూలత ఉంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలు, శ్రేణులు టీఆర్ఎస్లోనే ఉన్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో సిరిసిల్లకు గుర్తింపు వచ్చిందని ఇక్కడ అభిప్రాయం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి సైతం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంథనిలో హోరాహోరి..! మంథనిలోనూ గత ఎన్నికల ప్రత్యర్థులే మళ్లీ పోటీ పడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (టీఆర్ఎస్), మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్) మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. గత ఎన్నికల తర్వాత శ్రీధర్‌బాబు అందుబాటులో లేరనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణులలో ఉంది. అయితే.. ఇటీవల కొందరు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌కు కలిసొస్తుందంటున్నారు. మంత్రిగా శ్రీధర్‌బాబు చేసిన అభివృద్ధి, టీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని పోల్చుతూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అయితే.. కాంగ్రెస్ ఆలస్యంగా ప్రచార వ్యూహం మొదలు పెట్టింది. కాగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కావడంతో ఆ పార్టీకి ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. సామూహిక వివాహాలు, సేవా కార్యక్రమాలు, నిత్యం ప్రజలకు సన్నిహితంగా ఉండడం మధుకు అనుకూలంగా ఉంది. మారుమూల అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యాల కల్పనతో ఆయా ప్రాంతాల్లో మధుకర్‌కు ఎన్నికలలో ఉపయోగడుతోందంటున్నారు. హుస్నా‘బాద్’షా ఎవరు..! కరువు ప్రాంతంగా పేరున్న హుస్నాబాద్ స్థానాన్ని సర్దుబాటులో ప్రజాకూటమి సీపీఐకి కేటాయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు (టీఆర్ఎస్), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), చాడ శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ) మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఇక్కడ పోటీలో లేకపోవడమే టీఆర్ఎస్ అభ్యర్థికి పెద్ద ఊరటగా మారింది. అయితే.. తాగునీటి సరఫరా, జిల్లాలు, మండలాల పునర్విభజన విషయంలో ఎక్కువ గ్రామాల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో టీఆర్ఎస్కు నష్టం జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ఏడాదిన్నర క్రితం ఇక్కడ నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగసభలో ఏఐసీసీ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం ప్రవీణ్‌రెడ్డి 136 గ్రామాల్లో పూర్తిస్థాయిలో ప్రచారం చేశారు. ఇప్పుడు సీపీఐకి ఆ స్థానం కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు కొంత ఆగ్రహానికి గురై దూరమయ్యారు. అధిష్టానం బుజ్జగింపులతో ప్రవీణ్‌రెడ్డి సైతం చాడ వెంకటరెడ్డికి మద్దతుగా ప్రచారంలో దిగడం చర్చనీయాంశంగా మారింది. -
గెలిచేదెవరు.. ఓడేదెవరు..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల గెలుపు, ఓటములపై చర్చ జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులే గడువు ఉండగా.. 13 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థుల పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికల తీర్పులో ప్రతిసారీ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడి ఎన్నికలలో ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజలను ఆకర్షిస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో అప్పటివరకు ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండగా నిలిచారు. ఉద్యమ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ నాలుగేళ్ల పనితీరుకు పరీక్షగా నిలుస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. సాక్షి, కరీంనగర్ : హుజూరాబాద్‌లో ద్విముఖం..టీఆర్ఎస్ కీలక నేత, మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో నాలుగోసారి పోటీ చేస్తున్నారు. అంతకుముందు రెండు పర్యాయాలు కమలాపూర్ నుంచి గెలుపొందారు. ఈటల రాజేందర్ (టీఆర్ఎస్)తో పాడి కౌశిక్‌రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. మంత్రిగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ మందితో వ్యక్తిగత పరిచయాలు ఈటల రాజేందర్‌కు అనుకూల అంశాలు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడంతో ఎన్నికల వ్యూహంలో ఆ పార్టీ కొంత వెనుకబడి ఉంది. నీటి వనరుల అభివృద్ధి, ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలతను పెంచుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి గట్టి పట్టున్న హుజూరాబాద్‌లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆలస్యంగా ప్రకటించడంతో ప్రత్యర్థితో పోల్చితే కౌశిక్‌రెడ్డి ప్రచారంలో వెనుకబడగా, 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. కరీంనగర్లో త్రిముఖ పోటీ.. కరీంనగర్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇక్కడ గంగుల (టీఆర్ఎస్), పొన్నం (కాంగ్రెస్), బండి (బీజేపీ) మధ్య ప్రధాన పోటీనెలకొంది. వెలమ కోటగా ముద్ర పడగా.. ఆ కోటలో తొలిసారి గెలిచిన బీసీ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్. ఆయన ఇక్కడ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. హిందుత్వం కోసం చావడానికైనా సిద్ధమే అంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన సంజయ్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్ 2009లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. రాష్ట్రం కోసం లోక్‌సభలో పోరాటం, బీసీ నినాదం కలిసి వస్తుందని భావిస్తున్నారు. కోరుట్లలో నువ్వా నేనా..! కోరుట్లలో గత ఎన్నికల ప్రత్యర్థులే మళ్లీ పోటీ పడుతున్నారు. తాజామాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (టీఆర్ఎస్), జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. విద్యాసాగర్‌రావు నాలుగోసారి ఇక్కడ టీఆర్ఎస్ నుంచి బరిలో దిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ద్వితీయ స్థానంలో నిలిచిన నర్సింగారావు ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. నాలుగేళ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులు, కేసీఆర్ సంక్షేమ పథకాలపై విద్యాసాగర్‌రావు భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేయగా, ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. జగిత్యాల రసవత్తరం.. జగిత్యాల ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీపోటీగా ఎన్నికల వ్యూహా లను అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత తాటి జీవన్‌రెడ్డి లక్ష్యంగా టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల కవిత ఇక్కడ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరిస్తున్నారు. టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఎ.సంజయ్‌కుమార్ (టీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ పడుతున్నారు. జగిత్యాల నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పూర్తిస్థాయిలో జీవన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా రమణ, జీవన్‌రెడ్డిలో ఎవరో ఒకరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పని చేస్తుండడంతో టీఆర్ఎస్కు గట్టి సవాల్‌గా మారింది. కాంగ్రెస్ శాసనసభపక్ష ఉపనేతగా జీవన్‌రెడ్డి చేసే విమర్శలకు దీటుగా సమాధానం చెబుతూ కవిత మూడేళ్లుగా ఇక్కడ టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు జీవన్‌రెడ్డికి అనుకూలిస్తున్నాయి. టీఆర్ఎస్ అండగా నిలిచే ప్రధాన సామాజికవర్గం ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థి వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ఈ వర్గం ఓటర్లతో జీవన్‌రెడ్డికి ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. స్వతహాగా వైద్యుడైన టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ప్రజల కోసం, పార్టీ కోసం సమయం కేటాయిస్తారనే అభిప్రాయం ఉంది. సిరిసిల్ల.. కేటీఆర్ ఇలాకా..! టీఆర్ఎస్ ముఖ్యనేత, మంత్రి కె.తారకరామారావు నాలుగోసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో మాజీ ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి కేటీఆర్‌కు ఎన్నికలలో అనుకూలంగా మార్చింది. సాగునీటి వనరుల అభివృద్ధి, అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పన, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతో కేటీఆర్‌కు ఆదరణ పెరిగింది. చేనేత వర్గీయుల సంక్షేమ కోసం చేపట్టిన పథకాలతో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ వర్గీయులలో కేటీఆర్ సానుకూలత ఉంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలు, శ్రేణులు టీఆర్ఎస్లోనే ఉన్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌తో సిరిసిల్లకు గుర్తింపు వచ్చిందని ఇక్కడ అభిప్రాయం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి సైతం గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాజన్న ఆశీస్సులు ఎవరికో..! వేములవాడలో నాలుగోసారి పాత ప్రత్యర్థులే పోటీ పడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు (టీఆర్ఎస్), ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి ప్రతాప రామకృష్ణకు వచ్చే ఓట్లు ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులతోనే రమేశ్‌బాబు ప్రచారం చేస్తున్నారు. అవినీతి అరోపణలు లేకుండా పని చేశామని చెబుతున్నారు. ప్రత్యర్థి పాత వ్యక్తి కావడం రమేశ్‌కు అనుకూల అంశంగా కనిపిస్తోంది. రమేశ్‌బాబు గెలిచినా అందుబాటులో ఉండరనే శ్రీనివాస్ ప్రచారాన్ని ఓటర్లు గత ఎన్నికలలో పట్టించుకోలేదు. రమేశ్‌బాబు పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ న్యాయపోరాటం కొనసాగుతోనే ఉంది. రమేశ్‌బాబు, ఆది శ్రీనివాస్ 2009 నుంచి ఈ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈసారి కూడా నువ్వానేనా అన్న తీరులో తలపడటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఆసెంబ్లి ఎన్నికలు 2018 మరిన్ని వార్తలు.. -
ఈసారి జగిత్యాల మాదే..!
2014 ఎన్నికల్లో నేను ఓడి కాంగ్రెస్ నాయకులు జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా.. మా అధినేత కేసీఆర్ జగిత్యాలను ఏనాడూ చిన్నచూపు చూడలేదు. నాలుగేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,250 కోట్లు కేటాయించి అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇక్కడి ప్రజలకు అందించారు. జిల్లా ఏర్పాటు.. జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. రాయికల్ మున్సిపాలిటీ దాని అభివృద్ధికి రూ. 25 కోట్ల మంజూరు దీనికి నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే జగిత్యాలకు మెడికల్ కాలేజీ మంజూరు చేయిస్తా. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్‌రోడ్డు, పాత బస్టాండు విస్తరణ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు టీఆర్ఎస్తోనే సాధ్యం..’ అంటున్నారు జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్. ఆయన బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి.. ప్రచార తీరు.. హామీలు.. గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే.. సాక్షి, జగిత్యాల: 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనతో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఆ రెండు పార్టీల పుణ్యమా అని 1956లో ఏర్పాటైన జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. పట్టణ ప్రజల దశాబ్దాల కల యావర్‌రోడ్డు విస్తరణ అంశాన్నీ ఆయా పార్టీలు పట్టించుకోలేదు. 58 ఏళ్లలో ఆయా పార్టీల పనితీరు.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పనితీరు ప్రజల ముందుంది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అద్భుత పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారంచుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ టీఆర్ఎస్ నెరవేర్చింది. డాక్టర్‌గా ప్రజల్లో నాకు మంచి ఆదరణ, గౌరవం ఉంది. ఇవే నా గెలుపునకు సహకరిస్తాయి. ప్రజల ఆశీర్వాదంతో ఈ సారి జగిత్యాలపై గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఓడినా ప్రజల మధ్యే.. వృత్తిరీత్యా నేను కంటి వైద్యనిపుణుడిని. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇప్పటి వరకు 50వేల కంటి ఆపరేషన్లు ఉచితంగా చేశా. 2014 సాధారణ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే నేను టీఆర్ఎస్లో చేరిన. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ తరఫున జగిత్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయా. రాష్ట్రంలో మాత్రం మా పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఓడినా నిరుత్సాహపడలే. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటిరోజు నుంచి ఇప్పటి వరకు ప్రజల మధ్యలోనే ఉంటున్న. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలందరికీ వివరిస్తూ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసిన. పార్టీ అధిష్టానం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న. నిజామాబాద్ ఎంపీ కవిత, పార్టీ క్యాడర్ అందించిన సహాయసాకారాలు నాకు వరంలా కలిసొచ్చాయి. 2014కు ముందు జగిత్యాలలో అసలు టీఆర్ఎస్ కార్యాలయమే లేదు. నేను మోతెలో విశాలమైన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. దాని కేంద్రంగా ప్రజలకు సేవలందించా. ఆరు నెలల క్రితమే ఆస్పత్రిని మరో వైద్యుడికి అప్పగించి పూర్తిగా ప్రజల మధ్యే ఉంటున్న. రూ. 1250 కోట్లతో అభివృద్ధి.. నేను ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని ఏనాడూ చిన్నచూపు చూపలేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు దీటుగా జగిత్యాలలో అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేసింది. రాయికల్ మండలం బోర్నపల్లిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్లు విడుదల చేయగా.. పనులు ముగింపు దశలో ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల మంజూరు.. కొత్తగా రాయికల్ మున్సిపల్ ఏర్పాటుతో పాటు రూ.25 కోట్లు, నియోజకవర్గంలో 26వేల మంది బీడీ కార్మికులకు జీవనభృతి, 58వేల మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ, ఆరోగ్య శ్రీ పథకం కింద 9వేల మందికి కార్పొరేట్ వైద్యం, వెయ్యి మందికి సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల, 2800 మందికి కల్యాణలక్ష్మీ.. 750 మందికి షాదీముబారక్ చెక్కులు, 3,500 మందికి కేసీఆర్ కిట్ల పంపిణీ, చెరువుల పునరుద్ధరణ మొత్తంమీద నియోజకవర్గానికి నాలుగేళ్ల కాలంలో రూ.1250 కోట్లు మంజూరు చేయించిన. 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ఇవి నా గెలుపునకు సహకరిస్తున్నాయనే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులూ కేసీఆర్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. ఉపాధ్యాయుల సీపీఎస్ సమస్య పరిష్కారం కేంద్ర ఆధీనంలోనిది. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చే కృతనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు రెండు నెలల క్రితమే మా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చింది. 2014 ఎన్నికల ఫలితాల ప్రకటన మరుసటి రోజే నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రజల మధ్య ఉంటున్న నేను.. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన. ఇప్పటివరకు నియోజకవర్గం మొత్తాన్నీ రెండు సార్లు చుట్టి వచ్చిన. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, ఎంపీ కవిత పర్యటనలతో నియోజకవర్గంలో మరింత ఊపు వచ్చింది. పార్టీ క్యాడర్, నాయకులందరూ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించారు. ఫలితంగా ప్రచారానికి నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి నన్ను గెలిపించుకుంటామనీ తీర్మానాలు, వాగ్దానాలు చేస్తున్నారు. అది ప్రతిపక్షాల కుట్ర నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. చిరువ్యాపారులను ఇబ్బంది పెడతానని ప్రతిపక్షాలు నన్ను బద్నాం చేసే కుట్ర పన్నుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండ్‌ను విస్తరిస్తానని మాత్రమే నేను చెబుతున్న. ఏ ఒక్క చిరువ్యాపారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్న. అదో మాయకూటమి అభివృద్ధి నినాదం కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో 58 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కూటమిగా ఏర్పడ్డాయి. మహాకూటమి పేరుతో ప్రజలను మాయచేసేందుకే వీరందరూ ఒక్కటయ్యారు. ఇన్నాళ్లూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించని ఆ రెండు పార్టీలను ప్రజలు ఇప్పుడు నమ్మే స్థితిలో లేరు. జగిత్యాలలో కాదు అసలు రాష్ట్రంలోనూ మహాకూటమి ప్రభావం లేదు. జనాల్లో చర్చ లేదు. రాష్ట్రంలో మాదిరిగానే జగిత్యాలలోనూ టీఆర్ఎస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. జగిత్యాల నియోజకవర్గం వార్తల కోసం -
టీఆర్ఎస్ లో కొనసాగుతున్న సస్పెన్షన్లు
సాక్షి, పెద్దపల్లి : ఎన్నికల సమయంలో రామగుండం టీఆర్ఎస్లో వేటు పర్వం కొనసాగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులను వరుసగా సస్పెండ్ చేస్తుండడం కలకలం సృష్టిస్తోంది. అధినేత కేసీఆర్ గోదావరిఖని పర్యటనకు కొన్ని గంటల ముందు పార్టీ ఈ సస్పెన్షన్ల నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న సస్పెన్షన్లు పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు రామగుండం టీఆర్ఎస్లో అసమ్మతి వ్యవహారం మరోసారి వెలుగు చూస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ సహా 26 మందిని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మంగళవారం సస్పెండ్ చేశారు. ఇదే కారణంతో టీబీజీకేఎస్ నాయకులు లక్కాకుల లక్ష్మణ్, జలపతి, అల్లి శంకర్లను సస్పెండ్ చేస్తున్నట్లు టీబీజీకేఎస్ నేత టి.వెంకట్రావు బుధవారం ప్రకటించారు. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖనికి రానున్న కొద్దిగంటల ముందు సస్పెన్షన్ల వ్యవహారం జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అసమ్మతికి పెట్టింది పేరు. సంవత్సరాలుగా అసమ్మతి కార్యకలాపాలు చోటుచేసుకుంటుండడం, ప్రతిపక్ష పార్టీలకన్నా... సొంత పార్టీ నాయకులే విమర్శించుకోవడం ఇక్కడ సర్వసాధారణం. తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణల నడుమ వర్గపోరు గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. మాజీ మేయర్ వర్గానికి ఎంపీ బాల్క సుమన్ మద్దతుందనే ప్రచారమూ జరిగింది. నగరపాలకసంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అసమ్మతి ప్రత్యక్షపోరుకు కారణమైంది. టీఆర్ఎస్ నుంచే రెండు వర్గాలు పోటీపడగా, ఎమ్మెల్యే వర్గం పైచేయి సాధించింది. ఈ క్రమంలోనే అప్పటి మేయర్ లక్ష్మీనారాయణపై సోమారపు వర్గం అవిశ్వాసం ప్రకటించి పదవి నుంచి దింపేయించింది. అవిశ్వాసం సమయంలో పార్టీ అధిష్టానాన్ని సైతం తనతో వచ్చేట్లు చేయడంలో సోమారపు సఫలమయ్యారు. అవిశ్వాసాన్ని నిలిపివేయాలన్న అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించి, ఏకంగా ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. చివరకు అధిష్టానం అంగీకరించడంతో లక్ష్మీనారాయణను పదవి నుంచి దింపి తనపంతం నెగ్గించుకున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఉద్యమనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోరుకంటి చందర్ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. ఈ సారికూడా సిట్టింగ్‌లకే టికెట్ దక్కడంతో చందర్ ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో అసమ్మతి నేత పెద్దంపేట శంకర్ బీఎస్పీ నుంచి రంగంలో ఉన్నారు. రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి రెబల్‌గా పోటీకి సిద్ధపడ్డా.. చివరకు కోరుకంటి చందర్‌కు మద్దతుగా పోటీనుంచి తప్పుకున్నారు. సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్‌లు పోటీపడుతుండడంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా రెండుగా విడిపోయారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థికి కాకుండా, రెబల్ అభ్యర్థికి మద్దతునిస్తున్న నాయకులపై పార్టీపరంగా చర్యలు ప్రారంభించారు. జెడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ మేయర్ లక్ష్మీనారాయణలతో పాటు 26 మంది నాయకులను సోమారపు సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బుధవారం టీబీజీకేఎస్ నాయకులు ముగ్గురిపై కూడా వేటువేశారు. పార్టీ అభ్యర్థినైన తనకుకాకుండా.. తిరుగుబాటు అభ్యర్థికి మద్దతుగా ఉన్న నాయకులపై పార్టీపరంగా కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంవత్సరాలుగా తారాస్థాయిలో ఉన్న అసమ్మతి, కీలక ఎన్నికల వేళ సస్పెన్షన్లకు కారణమవుతుండడంతో, మరోసారి అసమ్మతిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. నియోజకవర్గ చరిత్ర కోసం మరిన్ని వార్తలు... -
పెద్దపల్లి: రికార్డుల ‘గని’!
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి సంస్థ ఒకే రోజు 2,43,731 టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. చరిత్రలోనే అత్యధికంగా 46 రేక్‌ల ద్వారా బొగ్గు రవాణా చేయడంతో సింగరేణి మరో ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఈ నెల 27న అత్యదిక బొగ్గు రవాణాతో రికార్డు సాధించింది. విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా సంస్థ భారీగా పెంచుకుంది. సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రతీవారం అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో నిర్వహిస్తున్న ఉత్పత్తి, రవాణా సమీక్షలు ఫలితాలిస్తున్నాయి. రైల్వేశాఖ వారితో నిర్వహిస్తున్న సమన్వయం ఫలితంగా తగినన్ని రేక్‌లు బొగ్గు రవాణా కోసం అందుబాటులోకి రావడంతో విద్యుత్ సంస్థలకు బొగ్గు సమకూర్చే వీలు కలిగింది. సాధారణంగా రోజుకు 30–33 రేక్‌ల బొగ్గును రవాణా చేసే కంపెనీ ఈ నెల 12న 41 రేక్‌లు, 10, 20న 42 రేక్‌లు, 22న 43 రేక్‌లు, 24న 44 రేక్‌లు, 27న అత్యధికంగా 46 రేక్‌ల బొగ్గు రవాణా చేయడం విశేషం. సింగరేణిలోని అన్ని ఏరియాల్లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ద్వారా 27న పెద్దఎత్తున బొగ్గు రవాణా జరిగింది. అత్యధికంగా 10 రేక్‌లను కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ సీహెచ్‌పీ నుంచి రవాణా చేశారు. మణుగూర్ కొండాపురం సీహెచ్‌పీ నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–2 నుంచి ఆరు రేక్‌లు, ఇల్లందు నుంచి ఆరు రేక్‌లు, బెల్లంపల్లి నుంచి ఆరు రేక్‌లు, రామగుండం–1 నుంచి నాలుగు రేక్‌లు, శ్రీరాంపూర్ నుంచి నాలుగు రేక్‌లు, మందమర్రి నుంచి నాలుగు రేక్‌లతో బొగ్గు రవాణా చేశారు. 27న రవాణా అయిన రేక్‌లలో తెలంగాణ జెన్కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అత్యధికంగా 12 రేక్‌లు, ఏపీ జెన్కో విద్యుత్ కేంద్రాలైన ఆర్టీపీఎం, వీటీపీఎస్‌లకు ఆరు రేక్‌లు, కర్నాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన మూడు విద్యుత్ కేంద్రాలకు ఐదు రేక్‌లు, మహారాష్ట్ర జెన్కోకు అనుబంధంగా ఉన్న పర్లి, కొరాడి, పరాస్, భూసాలి, చాపూర్ విద్యుత్ కేంద్రాలకు ఎనిమిది రేక్‌లు, ఎన్టీపీసీ రామగుండం, కుడ్గి, శోలాపూర్, మౌదా, సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆరు రేక్‌లు, ఎన్టీపీసీ (జేవీసీ)కి చెందిన మూడు కేంద్రాలకు ఒక రేక్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (జైపూర్)కు రెండు రేక్‌లు, సిమెంట్ తదితర పరిశ్రమలకు కలిపి ఆరు రేక్‌ల బొగ్గును ఒక్క రోజునే సరఫరా చేసింది కంపెనీ. విద్యుత్ కేంద్రాల్లో తగితనంత నిల్వలు.. సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని విద్యుత్ కేంద్రాలకు సింగరేణి సంస్థ క్రమం తప్పకుండా బొగ్గు సరఫరా చేస్తోంది. విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి అందుకు తగినంత బొగ్గును ఉత్పత్తి చేసి రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో గరిష్ట విద్యుత్ వినియోగం ఉంటున్న తెలంగాణ విద్యుత్ కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా బొగ్గు రవాణా జరుపుతోంది. కనుక బొగ్గు కొతర లేకుండా విద్యుత్ ఉత్పత్తి సజావుగా కొనసాగుతోంది. మహారాష్ట్ర అభ్యర్థనపై... ఇటీవల మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి స్వయంగా సింగరేణి యాజమాన్యంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పెరిగిన విద్యుత్ వాడకం రిత్యా అదనంగా నాలుగు రేక్‌ల బొగ్గు సరఫరా చేయాలని కోరగా, సింగరేణి తక్షణమే స్పందించి ఈనెల 27న ఎనిమిది రేక్‌ల బొగ్గు సరఫరా చేసింది. సీఎండీ అభినందనలు.. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసిన అన్ని ఏరియాల ఉద్యోగులు, అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందికి సీఎండీ శ్రీధర్ అభినందనలు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తి రవాణాను మరింతగా పెంచాలని, ఇదే ఒరవడితో పనిచేస్తూ లక్ష్యాలు దాటి ముందుకు పోవాలని కోరారు. -
సోమారపు డప్పు... ప్రచారం ఊపు
సాక్షి, రామగుండం: అంతర్గాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచార నిమిత్తం వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ డప్పు చేతపట్టి స్టెప్పులేయడంతో అందరిలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. అదే విధంగా ఆయన ఫొటోతో ఉన్న మాస్క్‌లను ధరించి పలువురు కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేపట్టడం అందరినీ ఆకట్టుకుంది. -
గంగుల దరువు.. కారు పరుగు..!
కొత్తపల్లి(కరీంనగర్) : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కారు పరుగుడెతోందని దప్పుతో దరువేసారు. టీఆర్ఎస్ అత్యధిక మెజారిటీ విజయం సాధిస్తుందని దండోరా వేస్తూ ప్రచారం నిర్వహించారు. గంగులకు బాసటగా... టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గెలుపు కోసం ఆయన సతీమణి రజిత, కుమారు డు హరిహరన్సాయి, కూతురు జాహ్నవి, అన్న కుమారుడు ప్రదీప్ నగరంలోని పలు డివిజన్లలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. -
ప్రచారంలో ఈటేల కుటుంబం
సాక్షి, హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి జమున, కుటుంబసభ్యులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ టీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జమునతో పాటు రాజేందర్ కూతురు నీత, కోడలు క్షమిత ప్రచారంలో పాల్గొంటున్నారు. -
కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి...
సాక్షి, అల్గునూర్: ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని..టీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ అభ్యర్థి రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, కొత్తపల్లి, గొల్లపల్లి, నుస్తులాపూర్, నేదునూర్, లక్ష్మీదేవిపల్లి, వచ్చునూర్, జూగుండ్ల, రామ్హనుమాన్నగర్ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణకు ద్రోహం చేసిన టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. మూడు నెలల్లో గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీరందిస్తామన్నారు. తిమ్మాపూర్ మండలం రైతులకు గోదావరి నీరు అందిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఇస్తామని..సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు కూడా ఇస్తామని వెల్లడించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే బంగారు తెలంగాణ సంకల్పం నెరవేరుతోందని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
నేతలొస్తున్నారు..
సాక్షి, పెద్దపల్లి : ప్రచారపర్వానికి గడువు సమీపించడంతో అన్నిపార్టీల అధినేతలు జిల్లాబాట పట్టారు. ఇప్పటివరకు ఆయా పార్టీలకు సంబంధించిన నేతల సభలు జరగకపోగా, వరుసగా అన్ని పార్టీల నేతలు ఒకేసారిగా ప్రచారం రానుండడంతో రాజకీయం వేడెక్కనుంది. పోలింగ్‌కు పదిరోజుల ముందు భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జోష్ నింపేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, పరిపూర్ణానంద స్వామి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29, 30న జిల్లాలో పర్యటించనున్నారు. 29న సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలోని జూనియర్‌కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 30న మధ్యాహ్నం 3.15 గంటలకు మంథనిలో, సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈమేరకు మంగళవారం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాగా వరుసగా రెండు రోజులు జిల్లాలో కేసీఆర్ పర్యటించనుండడంతో పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. రామగుండం, మంథని, పెద్దపల్లి అభ్యర్థులు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి బహిరంగసభల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రెండు, మూడు నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహించారు. కానీ.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం వరుసగా రెండు రోజులపాటు ప్రచార సభలు నిర్వహిస్తుండడం, అందునా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. రేవంత్‌రెడ్డి...అమిత్‌షా...పరిపూర్ణానంద... పార్టీ అధినేతలు, స్టార్కంపెయినర్లతో ప్రచార సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీజేపీ లు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచార సభ ఈ నెల 30 లేదా డిసెంబర్ ఒకటిన జిల్లా కేంద్రంలో నిర్వహించడానికి పార్టీ సన్నహాలు చేస్తోంది. తనతో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చింతకుంట విజయ రమణారావుకు మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. రామగుండం అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు మద్దతుగా గోదావరిఖనిలోనూ పర్యటించనున్నారు. రేవంత్‌రెడ్డి రావడంఖాయమే అయినా... తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సినీనటి విజయశాంతి, ప్రజాకవి గద్దర్లు మంథని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. మంథని పట్టణంలో విజయశాంతి, కాటారం మండల కేంద్రంలో గద్దర్ల సభలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సన్నహాలు చేస్తున్నారు. అధికారికంగా తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ఇక బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, స్వామి పరిపూర్ణానందస్వామి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీ రథసారథులను రప్పించేందుకు సన్నహాలు చేస్తున్నారు. పెద్దపల్లిలో అమిత్‌షా, పరిపూర్ణానందస్వామిల ప్రచార సభలు ఉండే అవకాశం ఉంది. అయితే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. వచ్చేనెల 4న కేంద్ర మంత్రి స్మృతిఇరానీ గోదావరిఖనిలో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఆయా పార్టీల అధినేతల పర్యటనలు వరుసగా జరగనుండడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కింది. -
అభ్యర్థుల దూకుడు..!
సాక్షి, మంథని : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారానికి 8 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంను ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నెల రోజుల కిందే అభ్యర్థులను ప్రకటించడంతో మంథని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. శుభకార్యాలు, అశుభ కార్యక్రమాల పేరిట ప్రజలను పలకరించారు. రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ప్రధానంగా నెలకొనడంతో ఇద్దరు పత్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా గ్రామాల్లో ప్రచార రథాలను దింపారు. ఓటర్లను ఆకర్షించేలా పాటలు, ప్రత్యర్థుల వైఫల్యాలు, తమ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచార రథాల్లో దూసుకుపోతున్నారు. మహిళలు, యువకులతో ప్రత్యేక సమావేశాలు, చేరికలను ఓవైపు చేస్తూనే ఇంటించా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం, రాత్రి సమావేశాలు నిర్వహిస్తూ పొద్దంతా గ్రామాల్లోనే ప్రచారం చేస్తున్నారు. గతం కంటే భిన్నం.. నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు గతం కంటే భిన్నంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అభ్యర్థులే కాకుండా వారి బంధువులు, కూతుళ్లు, కుమారులు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈనెల 30న మంథనిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన, వచ్చేనెల 1 లేదా 2న సినీ నటి విజయశాంతి, ప్రజా గాయకుడు గద్దర్‌తోపాటు ఇతర నాయకుల పర్యటనలు సైతం ఉండండంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తూర్పు మండలాల్లో రెండు రోజులుగా ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
కౌంట్‌డౌన్ షురూ...
సాక్షి, పెద్దపల్లి : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించిన తరుణంలో అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రచార పర్వానికి కేవలం మరో తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు రెట్టింపు చమటోడ్చుతూ ముందుకు సాగుతున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రచారాన్ని కొనసాగిస్తూ.. ప్రచారానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పోలింగ్ వచ్చేనెల 7న ఉండగా, 48 గంటల ముందుగానే ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. అంటే వచ్చేనెల 5 సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు పూర్తవుతుంది. ఈ లెక్కన కేవలం మరో తొమ్మిది రోజులు మాత్రమే అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ తొమ్మిది రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రచారం ఒకెత్తు అయితే.. ఇకముందు చేయబోయే ప్రచారం కీలకం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంతో పోల్చితే రెట్టింపు చమటోడ్చుతున్నారు. దాదాపు అభ్యర్థులంతా మార్నింగ్వాక్నూ వదిలిపెట్టకుండా తెల్లవారుజాము నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణాల్లో రాత్రివేళల్లోనూ సభలు నిర్వహిస్తున్నారు. కుల సంఘనేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో అర్ధరాత్రి వరకు మంతనాలు జరుపుతున్నారు. ఎక్కడా సమయాన్ని వృథా చేయకుండా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. చేరికలపై నజర్.. ఎన్నికలు సమీపించడంతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో కీలక నేతలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. పోలింగ్‌కు ముందు గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటే లాభం ఉంటుండడంతో వారికి గాలం వేస్తున్నారు. అన్ని పార్టీల్లోనూ కొంతమంది నాయకులు దీనికోసం ప్రత్యేకంగా పనిచేస్తుండడం గమనార్హం. ఊళ్లో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులెవరు...వారి ప్రభావమెంత.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు.. ఏంచేస్తే మన పార్టీలోకి వస్తారంటూ.. వాళ్లంతా వ్యూహరచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా అభ్యర్థులతో మాట్లాడించి, పార్టీలో చేర్చుకుంటున్నారు. సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ చైర్మన్లు, కులసంఘాల పెద్దలకు అన్నిపార్టీలు గాలం వేస్తున్నాయి. పార్టీలో చేరికల ద్వారా ఆయా గ్రామాలు, పట్టణాల్లో తమ బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. చివరన బహిరంగసభలు... ఎన్నికల ప్రచారంలో ఊపునిచ్చే బహిరంగసభలు ప్రచారం చివర్లో ఉండేలా అన్ని పార్టీలు వ్యూహరచన చేశాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల షెడ్యూల్లు ఇందుకు అనుగుణంగా మార్చుకున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఆయా పార్టీల అధినేతలు, స్టార్కంపెయినర్లు జిల్లాకు రానున్నారు. అధినేతల సభలు భారీగా నిర్వహించడం ద్వారా ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ప్రచారానికి కేవలం తొమ్మిది రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. మరిన్ని వార్తలు... -
కాంగ్రెస్‌నే గెలిపించండి
సాక్షి, కరీంనగర్ : కేంద్రం, రాష్టంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచించాయని, ఓట్ల కోసం మభ్యపెట్టే మాటలతో వస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి తనను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలో చేపట్టిన పాదయాత్ర సోమవారంకు మూడో రోజుకు చేరుకుంది. 7,6,10,11,12,13 డివిజన్లలో విక్రమ్, ఆరీఫ్, లింగంపెల్లి బాబు, ఏవీ సతీశ్, మెండి చంద్రశేఖర్, సరిళ్ల ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గంగుల కమలాకర్‌ను రెండుసార్లు గెలిపించారని అతను వ్యాపారాలకు పరిమితమయ్యాడని ఆరోపించారు. మరో అభ్యర్థి బండి సంజయ్ కలిసిమెలిసి ఉన్న హిందు, ముస్లింలలో మత విద్వేషాలు సృష్టించి లబ్దిపొందాలని చూస్తున్నాడని వారి మాటలను నమ్మొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, చల్మెడ లక్ష్మినర్సింహారావు, మాజీ మేయర్ డి.శంకర్, కర్ర రాజశేఖర్, అంబటి జోజిరెడ్డి, నరహరి జగ్గారెడ్డి, గందె మాధవి, తాజ్, ఆకుల ప్రకాష్, వాసాల శ్రీనివాస్, ఆగయ్య, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సమద్ నవాబ్, కార్పొరేటర్లు ఆరీఫ్, మెండి శ్రీలత, సరిళ్ల ప్రసాద్, బాకారపు శివయ్య, ఏవీ సతీష్, మహేందర్, సంతోష్, నదీమ్ పాల్గొన్నారు. ‘పొన్నం’కు మద్దతుగా ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రబాకర్కు మద్దతుగా 38వ డివిజన్లో ఇన్చార్జీ వై.సుకుమార్రావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి రవిల ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నియోజక వర్గ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నంనే గెలిపించాలని కోరారు. ఎంఏ కరీం, వసీమ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 39వ డివిజన్లో సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అఖిల్ అధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. 1వ డివిజన్ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీ, శివాలయం వీధి, సంజీవయ్య కాలనీల్లో డివిజన్ కన్వీనర్ దండి రవీందర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎంఐఎం మద్దతు కోసమే ‘ముందస్తు’
సాక్షి, కరీంనగర్‌రూరల్ : సీఎం కేసీఆర్ కుటుంబ అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంఐఎం మద్దతుతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని బీజేపీ కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్ధి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ మండలం ఎలబోతారంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా కోరారు. మాజీ సర్పంచ్ సుంచు లక్ష్మినర్సయ్య బీజేపీలో చేరగా సంజయ్ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేపీ మండలాధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, పబ్బతి సతీశ్‌రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, గందె మల్లారావు, దేవేందర్, గోపాల్, వి.శ్రీనివాస్, కొమురయ్య, చంద్రయ్య, కరుణాకర్‌రెడ్డి, ఆంజనేయులు, సాయి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌సిటీ : నగరంలోని 33వ డివిజన్ రాంన గర్, మార్కండేయనగర్, శివనగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇంటింటా ప్రచారం చేశారు. దేశంలోనే అత్యంత పెద్ద బస్సు ప్రమాదసంఘటన రాష్ట్రంలోని కొండ గట్టు వద్ద జరిగిందని ఆ ప్రమాదంలో మృతి చెందిన పేదల కోసం కొండగట్టు రాని కేసీఆర్ నేడు ఓట్ల కోసం ఎలా వచ్చారని ప్రశ్నించారు. -
ఆరు మండలాలు..148 పంచాయతీలు
సాక్షి,పెగడపల్లి : ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాలో 129 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇటీవల కొత్తగా 19 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. వీటిలో 2,05,778 ఓటర్లుండగా ఇందులో పురుషులు 1,01,175 మంది, 1,04,601 మహిళా ఓటర్లు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. అందరిని కలువ లేక పోయిన కనీసం ఆ ఊరుకు పోయి రావాలే.. అసలే మాఘీ పొద్దు సమయం పొద్దంతా తక్కువగా సమయం ఉంటుంది. రాత్రంతా చలి. అందులో ప్రచారానికి సమయం ఉండటం లేదు. సహజంగా ఎన్నికలప్పుడు తప్పా నాయకులు ఎప్పుడు గ్రామాలకు రాలేదంటారు. కానీ ఎన్నికల వేళ కూడా అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలకు తీరా టికెట్లు ఖరారై నామినేషన్లు వేసే సరికి పోలింగ్ సమయం దగ్గరికి వచ్చింది. అభ్యర్థులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడిగే సమయం లేదు. దీంతో ప్రధాన గ్రామాలపై దృష్టి సారించిన నేతలు పగలు ప్రచారం చేస్తూ రాత్రి వేళ మంతనాలు చేస్తున్నారు. ఫోన్లు చేస్తూ గ్రామాల్లో ఉండే కార్యకర్తలు, నాయకులకు సూచనలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర ఉండటంతో పగలు, రాత్రి ప్రచారం చేసినా అన్ని గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ప్రచారానికి ఇంకా 12 రోజులే గడువుంది. నియోజకవర్గంలోని రెండు, మూడు గ్రామాలకు వెళ్లినా, తిరిగి వచ్చే సరికి ఒక్క రోజు గడిచిపోతోంది. చీకటి అయితే చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేతలు గ్రామాలకు వెళ్తున్న సమయంలో ఇతర గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమేతంగా ప్రచారం చేస్తున్నా సమయం సరిపోని పరిస్థితి ఉంది. కార్యకర్తలపైనే ఆధారం... ప్రచారానికి సమయం లేక పోవడం, పైగా గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలపైనే ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అవసరమున్న గ్రామాలకు మాత్రమే వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని చక్కదిద్దే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వలసలు, చేరికలు తదితర వాటిపై నేతలు దృష్టి సారించారు. గ్రామాలకు వెళ్లలేని ఈ పరిస్థితుల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసే అవకాశమే లేదు. దీంతో చివరి రోజుల్లో ర్యాలీ ఏర్పాట్లకు సన్నాహలు చేసుకుంటున్నారు. గ్రామాలకు ప్రచారం చేసే బాధ్యతలను పార్టీల వారీగా కార్యకర్తలకు అప్పజెబుతున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అన్నీ గ్రామాలను చుట్టి రావడం అయ్యేపని కాదు. దీంతో ఆయా మండలాల్లో అత్యధిక ఓటర్లున్నా గ్రామాలకు వెల్లేందుకు ప్రణాళిక రూపొందించు కుంటున్నారు. నియోజకవర్గంలో 148 పంచాయతీలు ఉండగా సుమారు మరో 30 వరకు అనుబంధ గ్రామలున్నాయి. దీంతో అభ్యర్థులు మండల కేంద్రాలతో పాటు, ప్రధాన గ్రామాల్లో ప్రచారం చేసేందుకు దృష్టి సారిస్తున్నారు. మిగితా గ్రామాల్లో ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారం చేసేందుకు వ్యూహరచన చేసుకుంటున్నారు. అవసరమైతే అక్కడికి వెల్లిన తర్వాత స్థానికుల్లో ప్రధానమైన అనుచరగణంతో పోన్ల ద్వారా మాట్లాడి ఓట్లు వేయాలని కోరుతున్నారు. సమయం లేక పోవడంతో ఎన్నికల ప్రచారం ఒక వంతుగా చూస్తే అభ్యర్థులకు సవాలుగా మారినట్లే. దీంతో ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. మరిన్ని వార్తలు.... -
నేడు జిల్లాకు కేసీఆర్
జిల్లా ఏర్పాటు అనంతరం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మోతె శివారులో సోమవారం నిర్వహించతలపెట్టిన టీఆర్ఎస్ బహిరంగసభలో పాల్గొంటారు. సభ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా నాయకత్వం జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణకు నిమగ్నమైంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించేందుకు గులాబీ నేతలు తగిన రవాణా ఏర్పాట్లు చేశారు. వంద సీట్లు గెలుచుకొని.. మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ ఆ మేరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో జరిగే ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జిల్లా నాయకులు. జిల్లా ప్రజలందరూ తమవైపే ఉన్నారని చాటేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా దగ్గరుండి సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు జనసమీకరణపై సూచనలు చేశారు. ఇప్పటికే స్టేడియం, హెలీప్యాడ్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. భారీ భద్రత చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి, జగిత్యాల : రాష్ట్రం తెచ్చిన ఘనతతోపాటు నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకొని టీఆర్ఎస్ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా 2014లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకైక ప్రతిపక్ష స్థానం జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. క్షేత్రస్థాయి నుంచే క్యాడర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలలో జగిత్యాల సీటు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న జిల్లా నేతలు కేసీఆర్ పాల్గొననున్న ఈ సభపై భారీగా ఆశలు పెంచుకున్నారు. ఇందులో భాగంగా వేలాదిగా జనం తరలివచ్చేలా పల్లెపల్లెన జనాన్ని సమీకరిస్తున్నారు. మరోపక్క జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు రెండు నెలల నుంచే ప్రచారంలో ఉన్నారు. ఇప్పటికే తమ నియోజకవర్గమంతా రెండు దఫాలుగా చుట్టి వచ్చేశారు. తర్వాత బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. కేసీఆర్ సభ తర్వాత పరిస్థితులు తమకు మరింత అనుకూలంగా మారుతాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నారు. వాటిపై హామీ దక్కేనా ? గల్ఫ్ వలసలకు కేరాఫ్‌గా పేరొందిన జగిత్యాలలో ప్రజలు ప్రవాస పాలసీ అమలు గురించి ఏళ్లుగా కలలు కంటున్నారు. 2014లోనూ టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో ప్రవాస పాలసీ అమలును ప్రస్తావించిన అది అమలుకు నోచుకోలేదు. కనీసం ఈ సభలోనైన కేసీఆర్ వలస జీవులకు సంబంధించిన పాలసీ గురించి నోరు విప్పుతారా? లేదా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు, మూడేళ్ల క్రితం మూతబడ్డ మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ ఉంది. దీంతోపాటు ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు వాగ్దానాలు చేస్తున్నారు. దీనిపై కేసీఆర్ మాట్లాడుతారా? లేదా? అని వైద్యవర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
మిల్లింగ్ చిచ్చు!
సాక్షి, కొరుట్ల : ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’గా గుర్తింపు పొందిన జగిత్యాల జిల్లాలో మిల్లింగ్ చిచ్చు రేపుతుంది. జిల్లాలో పండిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం పొరుగు జిల్లాలకు తరలించడంపై అధికారులు తలోతీరుగా వ్యవహరించడం చర్చనీయమైంది. జిల్లాలో పండిన వరిధాన్యంలో సగానికి మించి మిల్లింగ్ కోసం పొరుగున ఉన్న జిల్లాలకు సరఫరా చేయాలని వారం క్రితం సివిల్‌సప్లయ్ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో స్థానిక రైస్‌మిల్లర్లకు నష్టమేకాకుండా ప్రభుత్వంపై రవాణాభారం పడుతుందని స్థానిక రైస్‌మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైస్‌మిల్లర్లు జిల్లాలోని ఓ కీలక అధికారికి విన్నవించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మిల్లర్లతో ఓ కీలకాధికారి చేసిన వ్యాఖ్యలు జిల్లా రైస్‌మిల్ వర్గాల్లో చర్చనీయంగా మారడమే కాకుండా.. అధికారుల మధ్య సమన్వయలోపానికి అద్దంపట్టాయి. ఇదీ సంగతి... జగిత్యాల జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో జగిత్యాల జిల్లాలో సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పారాబాయిల్డ్, బాయిల్డ్ రైస్‌మిల్లులు కలిపి మొత్తం 95 వరకు ఉన్నాయి. వీటి మిల్లింగ్ సామర్థ్యం ఎంత తక్కువ అనుకున్న 2.80 లక్షల మెట్రిక్ టన్నులుగా రైస్‌మిల్లర్లు చెప్పుకొస్తున్నారు. అధికారులు మాత్రం జగిత్యాల జిల్లాలోని రైస్‌మిల్లర్లకు కేవలం 1,35,250 మెట్రిక్ టన్నుల మిల్లింగ్ సామర్థ్యం మాత్రమే ఉందని నిర్ణయించారు. దీంతో మిగిలిన 1,15,250 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని రైస్‌మిల్లులకు పంపి మిల్లింగ్ చేయించాలని నిర్ణయించారు. స్థానిక రైస్‌మిల్లులకు సామర్థ్యం ఉన్నా.. ఇతర జిల్లాలకు ధాన్యం తరలించడంతో తమకు నష్టం జరుగడమే కాకుండా రూ.17కోట్ల మేర రవాణాభారం, సుమారు 5 వేల మంది కార్మికుల ఉపాధికి నష్టం జరుగుతుందని పేర్కొంటూ అధికారుల నిర్ణయంపై రైస్‌మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సమన్వయ లోపమేనా ? పొరుగు జిల్లాల్లో ధాన్యం మిల్లింగ్ విషయంలో జిల్లాలోని రైస్‌మిల్లర్లు చేసిన వినతిని స్వీకరించిన కీలకాధికారి ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైన రీతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న రైస్‌మిల్లులకు మిల్లింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ పొరుగు జిల్లాలకు ధాన్యం తరలింపునకు కిందిస్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవడంపై రైసుమిల్లర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చెప్పిన కిందిస్థాయి సిబ్బంది నిర్ణయంతో అయోమయానికి గురవుతున్నారు. అధికారుల మధ్య సమన్వయలోపానికి అద్దంపట్టినట్లయింది. సమన్వయలోపంతోనే స్థానికంగా ఉత్పత్తి అయిన ధాన్యం పొరుగు జిల్లాలకు తరలుతుందనే అనుమానాలు రేకెత్తాయి. జిల్లాలోని రైస్మిల్లర్లలోనూ ఈ విషయం ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. పొరుగు జిల్లాలకు ధాన్యం తరలింపుపై రైస్‌మిల్లర్లు తాజామాజీ ఎమ్మెల్యేలతో మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదని సమాచారం. -
మెడి‘కలే’నా?
డ్యూటీ చేసేందుకు బాయిమీదికి వెళ్లిన మల్లయ్యకు ఛాతిలో నొప్పి.. హుటాహుటిన అంబులెన్స్‌లో సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించిందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే మల్లయ్యను అంబులెన్స్‌లో తరలిస్తుండగా వైద్యం అందక మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలాడు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు గోదావరిఖనిని ఆనుకొని ఉన్న ఐదు జిల్లాల వాసులు ఎదుర్కొంటున్న దుస్థితి. గోదావరిఖని(రామగుండం) : పారిశ్రామిక ప్రాంతంలో వైద్యకళాశాల ఏర్పాటు కలగా మారింది. సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కార్మిక కుటుంబాలు, కార్మికుల పిల్లలు ఎక్కువగా ఉన్నారు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా గోదావరిఖనిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అనంతరం ఐదు జిల్లాలకు చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి కళాశాల విషయం ఊసెత్తలేదు. కార్మికులే ఎక్కువ.. పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో కార్మిక కుటుంబాలతోపాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. రామగుండంలో ఎన్టీపీసీలోనూ వేలాది మంది ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ఎఫ్సీఎల్ కూడా కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. అతిపెద్ద సంస్థలైన ఎన్టీపీసీ, సింగరేణి సహకారంతో రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ తలిచారు. 2014 ఎన్నికల సమయంలో గోదావరిఖని, మంథని ప్రచారానికి వచ్చిన సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి, ఎన్టీపీసీ సంస్థల సహకారంతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటైతే కార్మికులతోపాటు ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు కార్మికుల పిల్లలకు వైద్య విద్యకూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందని వైద్య సేవలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మందమర్రి, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో సింగరేణి ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వైద్యనిపుణులు లేకపోవడంతో కార్మికులు వారి కుటుంబాలు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులు.. హైదరాబాద్, కరీంనగర్ లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లిలో గతంలోనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలుగా ఏర్పడిన తర్వాత అక్కడి ఆస్పత్రులను ప్రభుత్వం ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేసింది. కానీ.. ఏ ఆస్పత్రిలోనూ రోగులకు సరిపడా సౌకర్యాలు కల్పించలేదు. వైద్యులను నియమించలేదు. పెరిగిన ప్రసవాల సంఖ్య.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఆస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు, వైద్యులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వైద్యుల కొరత కారణంగా కాన్పుల సమయంలో శిశువులు మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. సింగరేణి కార్మికులకు వైద్యం దూరం.. సింగరేణి ఆస్పత్రుల్లో కార్మికులకు వారి కుటుంబాలకూ సరైన వైద్యసేవలు అందడంలేదు. కార్మికుడు ప్రమాదశాత్తు గాయపడినా.. విధినిర్వహణలో గుండెపోటుకు గురైనా వెంటనే ఆయా జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ నిపుణులు లేకపోవడంతో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు రెఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లే వరకు పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు మధ్యలోనే మృతిచెందిన సంఘటనలున్నాయి. అంతేకాదు.. పట్టణ ప్రాంతాలకు వెళ్లిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గని ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడూ తక్షణ వైద్య సేవలు అందకపోవడం గమనార్హం. వైద్య కళాశాల ఏర్పాటైతే.. గోదావరిఖనిలో వైద్య కళాశాల ఏర్పాటుచేస్తే ప్రజలకు, కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కనీసం 500 పడకల సామర్థ్యంతో అన్నిరకాల వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఐసీయూ, ట్రామా, న్యూరో, ఆర్థో తదితర సేవలు అందనున్నాయి. ప్రాణాపాయస్థితిలో వచ్చినవారిని సత్వరసేవలు పొందే వీలుంది. పోస్టుమార్టం సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసుతలకు ఒకే చోట వైద్యం అందే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉపాధి అవకాశాలూ మెరుగుపడనున్నాయి. -
అభివృద్ధిని విస్మరించారు
పెద్దపల్లి : మంథని నియోజకవర్గాన్ని అరవై సంవత్సరాలు పాలించిన నాయకులు అభివృద్ధిని విస్మరించడంతో వెనుకబాటును ఎదుర్కొంటుందని టీఆర్ఎస్ మంథని అసెంబ్లీ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. ఆదివారం మండలం ఎగ్లాస్పూర్, నెల్లిపల్లి,గుంజపడుగు, ఉప్పట్లతో పాటు మంథని మున్సిపాలిటీలో వ్యాపార కూడలిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మా పాలనలో అభివృద్ధి చేసామని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పదే పదే చెబుతున్నారని, ఒక్క పని కూడూ చేయకుండా తాము అభివృద్ధి్ద చే శామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా వారికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసానన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిప్రజలకు సేవచేసామన్నారు. మరోసారి అవకాశం మరింత అధ్భుతంగా అభివృద్ధి్ద చూపిస్తామన్నారు. ఎంపీపీ ఏగోళపు కమల, మండల కో–ఆప్షన్ సభ్యుడు యాకూబ్,మండల పార్టీ అధ్యక్షుడు కొండ శంకర్, పట్టణ శాఖ అధ్యక్షుడు అరెపల్లి కుమార్,మంథని మాజీ సర్పంచ్ పుట్ట శైలజ, నాయకులు ఏగోళపు శంకర్‌తో పాటు తదితరులు ఉన్నారు. పల్లీలు విక్రయిస్తూ... పెద్దపల్లి జిల్లా మంథని టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చికెన్ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో పల్లీలు విక్రయించారు. కటింగ్ షాపులో కటింగ్ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్లో చేరిక కమాన్‌పూర్: మండలంలోని గుండారం గ్రామ మాజీ సర్పంచ్ పిడుగు నర్సయ్య ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. నర్సయ్య టీడీపీ ప్రభుత్వ హయంలో సర్పంచ్‌గా కొనసాగారు. పార్టీలో చేరిన పిడుగు నర్సయ్యకు పుట్ట మధు కండువవేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, గుండారం తాజా మాజీ సర్పంచ్ ఆకుల గట్టయ్యలతో పాటు తదితరులున్నారు. -
ఓటర్లకు ఫొటో స్లిప్పులు
సిరిసిల్ల : పోలింగ్ శాతం పెంచేందుకు, బోగస్ ఓటర్లను అరికట్టేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి ఓటరు చిత్రపటంతో కూడిన పోల్స్లిప్పు(చీట్టీ)లను పంపిణీ చేస్తోంది. గతంలో ఎన్నికల్లో అభ్యర్థులు మాత్రమే పోల్‌చిట్టీలు పంపిణీ చేసేవారు. తర్వాత ఎన్నికల అధికారులు పోల్‌చిట్టీలు అందించారు. తొలిసారి ఓటరు ఫొటోలు ముద్రించిన పోల్ స్లిప్పులను అందిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడంతోపాటు, ఎలాంటి తడబాటు లేకుండా ఓటర్లు ఆ స్లిప్పుతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ముద్రణలో ఫొటోస్లిప్పులు.. జిల్లాలోని 506 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఫొటో ఓటరు స్లిప్పులను ఎన్నికల అధికారులు ముద్రిస్తున్నారు. ఇప్పటికే తుది ఓటరు జాబితా వెల్లడించిన ఎన్నికల అధికారులు.. ఎన్నికల నిర్వహణలో ఎంతోకీలకమైన ఓటరు ఫొటో స్లిప్పులను ముద్రిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4,08,769 మంది ఓటర్లకు స్లిప్పులను అందించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో)ల ద్వారా క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రా ల వారీగా ఫొటో ఓటరు గుర్తింపు స్లిప్పులను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ స్లిప్పు ఉంటే చాలు.. ఓటరు నేరుగా పోలింగ్ కేం ద్రానికి వెళ్లి ఓటు వేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు వంటి ఇతర ఫొటో గుర్తింపు కార్డులు అవసరం లేదు. ఈఫొటో ఓటరు గుర్తిం పు కార్డులో ఓటరు జాబితాలో క్రమసంఖ్య, పో లింగ్ స్టేషన్ నంబరు, ఓటరు ఫొటో ఉండడంతో ఓటు వేసేందుకు నేరుగా అవకాశం ఉంటుంది. బీఎల్వోలు అందించిన ఈ స్లిప్పు తప్పిపోతే.. మళ్లీ పాతపద్ధతిలోనే ఓటరు గుర్తింపు కార్డుతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయవచ్చు. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా కొత్తగా ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణికి శ్రీకారం చుట్టింది. బ్యాలెట్లో అభ్యర్థుల గుర్తులు.. ఫొటోలు గతఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతోపాటు, అభ్యర్థుల ఫొటోలను కొత్తగా ముద్రిస్తున్నారు. ఇందుకు అవసరమైన బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రి ప్రింటింగ్ చేయించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 506 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సిరిసిల్లలో 13 మంది, వేములవాడలో 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వేములవాడలో మరో అభ్యర్థి బరిలో ఉంటే.. అంటే 16 మంది ఉండి ఉంటే.. ఈవీఎంలపై నోటాకు చోటు ఉండకపోయేది. కానీ ఒక్క అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈవీఎంలపై 16 గుర్తులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వేములవాడలో 15 మంది అభ్యర్థులు, నోటాతో కలిపితే 16 అవుతుంది. దీంతో అదనపు ఈవీఎంల ఏర్పాటు లేకుండానే ఒకే ఈవీఎం ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు అవసరమైన ఎన్నికల సామగ్రిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మొదటిదశ ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తికాగా.. బ్యాలెట్ పత్రాలు వచ్చిన తర్వాత మరోసారి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫొటో స్లిప్పులతో ప్రయోజనం ఓటర్లకు ఫొటో స్లిప్పులు ఇవ్వడం ద్వారా బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. ఓటరు ఇంటికే స్లిప్పు చేరుతుంది. దానిపై ఫొటో, ఓటరు సంఖ్య ఉంటుంది. ఎలాంటి గందరగోళం లేకుండా నేరుగా వెళ్లి ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఫొటో ఉంటుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది సులభంగా గుర్తు పడతారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ఈ స్లిప్పులు దోహదపడతాయి. – టి.శ్రీనివాస్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో -
పోలింగ్‌పై నిఘా
పెద్దపల్లిఅర్బన్ : జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను నిఘా నీడలోకి తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బందిని నియమించేందుకు పోలీస్‌శాఖ కార్యాచరణ షురూ చేసింది. ఓటింగ్ జరిగే సమయంలో అవరోధాలు కల్పించే వారిపై ఉక్కుపాదాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 1,526 సీసీ కెమెరాలు జిల్లాలోని ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌కేంద్రం బయట ఎటూ వందమీటర్ల పరిధిలో జరిగే ప్రతీ వి షయాన్ని రికార్డు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 1,526 సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. 196 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 763 పోలింగ్‌కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 196 సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాలను అధికారులు గుర్తించారు. రామగుండం 31, మంథని 111, పెద్దపల్లిలో 54 సమస్మాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాలన్నీ పూర్తిగా సీసీ కెమెరాల నీడలో ఉండనున్నాయి. మామూలు కేంద్రాల వద్ద ఇరువైపులా మాత్రమే కెమెరాలు ఏర్పాటు చేయనుండగా సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం వీలైనన్నీ ఎక్కువ కెమెరాలను బిగిస్తున్నారు. కేంద్రాల వద్ద ప్రచారం నిషేధం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడం నిషేధమని పోలీసులు ప్రకటించారు. పార్టీల నాయకులు జెండాలు, కరపత్రాలు, బ్యాలెట్‌పేపర్లు, పోలింగ్ చీటీలు, కండవాలు ధరించి ప్రచారం చేస్తే సీసీ కెమెరాల ఆధారంగా సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రతీ చర్యను రికార్డు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. గొడవలు చేసేవారిపై ఉక్కుపాదం పోలింగ్ సందర్భంగా గొడవలు సృష్టించే వారిని గుర్తించేందుకు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత నిర్వహణను ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు అదనపు బాధ్యతలు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల బాధ్యతను స్థానిక పోలీస్‌స్టేషన్ ఎస్సైలకు అప్పగించారు. వాటిని బిగించడం మొదలు పనితీరును పర్యవేక్షించే బాధ్యతలను సైతం వారికే అప్పగించారు. దీంతో పోలీసు అధికారులకు అదనపు బాధ్యతలు పెరగనున్నాయి. -
కొత్తకుంటకు జలకళ
గన్నేరువరం : మిడ్ మానేరు నీటితో మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది. మండలంలోని మాధాపూర్ గ్రామం కొత్తకుంటకు మిడ్ మానేరు నీటిని డిస్ట్రిబ్యూటర్ 9 ఉపకాల్వ ద్వారా విడుదల చేశారు. ఆ నీటితో కుంట నిండుకోవడంతో జలకళ వచ్చింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో నిర్మించిన మిడ్ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం వరకు గతంలో 34 కిలోమీటర్ల వరదకాల్వను పూర్తి చేశారు. మండలంలోని చీమలకుంటపల్లె, గునుకుల కొండాపూర్, పీచుపల్లి గ్రామాల మీదుగా మిడ్ మానేరు కుడికాల్వ నిర్మాణం ఉంది. అలాగే ఈ ఏడాది తోటపల్లి గ్రామంలో తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి గత నెల 11వ తేదీన దీనిలోకి మిడ్‌మానేరు కుడికాల్వ ద్వారా నీటి పారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రిజర్వాయర్ నిండుకుని కుడికాల్వలో బ్యాక్‌వాటర్ పెరిగింది. ఈ క్రమంలో ఈ నీటిని అక్టోబర్‌లో డిస్ట్రిబ్యూటర్ 4 ఉపకాల్వ ద్వారా గన్నరువరం గ్రామ చెరువుకు, పారువెల్ల గ్రామ పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బుధవారం ఖాసీంపేట గ్రామంలోని డిస్ట్రిబ్యూటర్ 8 ఉప కాల్వకు విడుదల చేశారు. తాజాగా మాధాపూర్ గ్రామానికి నీటిని విడుదల చేసి కొత్తకుంటను నింపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో భూగర్భజలాలు పెరగడానికి దోహదపడుతుందని అంటున్నారు. కుడికాల్వలో నీటినిల్వతో దాని సమీపంలోని బావుల్లో, బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగినట్లు చీమలకుంటపల్లెకు చెందిన శ్రీనివాస్ తెలిపారు. రబీలో వరిసాగు చేయడానికి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. -
పల్లెల్లో 'ఎన్నికల' మద్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : ముందస్తు ఎన్నికల కోసం నాయకులు మద్యం రెడీ చేశారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందే కొనుగోలు చేసి పల్లెల్లో నిల్వచేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బులు, మద్యంపై దృష్టి సారిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో సభలకు వచ్చేవారికి పంచేందుకు ఇప్పటికే భారీగా మద్యం కొనుగోలు చేశారు. ఎన్నికలకు ఇంకా 15 రోజులు ఉండడంతో అప్పటి వరకు సరిపోయేలా ఇంకా కొనుగోళ్లు జరుపుతూ రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 42 మధ్యం దుకాణాలు ఉన్నాయి. షాపుల నిర్వాహకులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టార్గెట్‌కు మించి మద్యం కొనుగోళ్లు చేశారు. కొనుగోలు చేసిన మద్యాన్ని పార్టీల నేతల సూచనల మేరకు డబ్బులు తీసుకుని లిక్కర్ కంపెనీల నుంచి మద్యం తీసుకొచ్చే వాహనాలను వారు సూచించిన ప్రాంతాలకు రహస్యంగా తరలిస్తున్నారు. గురువారంతో నా మినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు ఇక ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అం దుకు ప్రధానంగా మద్యంపైనే అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఎన్నికలకు ముందు మద్యం నిలువ చేయడం, పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కష్టం. అందుకే ఇప్పటికే భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి పల్లెల్లో డంప్ చేసినట్లు సమాచారం. పక్కా సమాచారంతో.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూనే ప్రత్యర్థి బలహీనతలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు మద్యం కొనుగోళ్లు జరుపుతున్నా.. ప్రత్యర్థి కొనుగోలు చేసిన మద్యం వాహనం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుందనే సమాచారం తెలుసుకుని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగుతున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో వారం రోజుల వ్యవధిలో ఆరుచోట్ల మద్యం నిల్వలపై పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా కంచర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో డంపు చేస్తున్న మద్యంను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ మద్యం నిల్వలపై నిత్యం దాడులు జరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడంలేదు. ప్రస్తుతం కొద్ది మొత్తంలో మద్యం దొరుకుతున్నప్పటికీ ఇంకా భారీ స్థాయిలో మద్యం డంపులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పరిమితికి మించి కొనుగోలు చేస్తే కేసులే.. ఎక్సైజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఆరు బాటిళ్ల కంటే ఎక్కువ కొనుగోలు చేయరాదనే నిబంధన ఉంది. మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. వైన్ షాపుల నిర్వాహకులు పరిమితికి మించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు అమ్మకాలపై దృష్టి పెట్టకుండా కొనుగోలు దారులను టార్గెట్ చేస్తున్నారు. బెల్టుషాపుల్లో భారీ నిల్వలు జిల్లాలో సుమారు 768 బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 42 వైన్ షాపులు, 42 పర్మిట్‌రూంలు, సిరిసిల్లలో 3, వేములవాడలో 2 బార్లు అధికారికంగా(లైసెన్స్) నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ మించి బెల్ట్‌షాపుల ద్వారానే మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా గ్రామాలలో మద్యంను పంపిణీ చేయడానికి ప్రధానంగా బెల్ట్‌షాపుల నిర్వాహకుల ద్వారానే మద్యాన్ని రహస్య ప్రదేశాల్లో డంపు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మద్యం దుకాణాలతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి భారీగా మద్యం తీసుకువచ్చి ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. మద్యం డంపు చేస్తే చర్యలు అనుమతులు లేకుండా రహస్య ప్రాంతాల్లో మద్యం డంపుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వైన్‌షాపు నిర్వాహకులు ఒక వ్యక్తి ఆరు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యం అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తాం. ఎక్సైజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పటికే కొన్నిచోట్ల నిల్వచేసిన మద్యాన్ని పట్టుకుని కేసులు పెట్టాం. ముఖ్యంగా బెల్ట్‌షాపుల నిర్వాహకులు పద్దతి మార్చుకోవాలి. – చంద్రశేఖర్, ఎక్సైజ్ నోడల్ అధికారి -
ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా
కథలాపూర్ : ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కథలాపూర్ మండలానికి సాగు, తాగు నీరందించి సస్యశామలం చేస్తామని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కథలాపూర్ మండలం చింతకుంట, భూషణరావుపేట, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల, దుంపేట, పోసానిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే కథలాపూర్ మండలంలో ఐదు గ్రామాలకు సాగునీరందించే రాళ్లవాగు ప్రాజెక్టును నిర్మించామని, కలిగోట శివారులో సూరమ్మ రిజర్వాయర్ కోసం కాంగ్రెస్ హయాంలోనే నిధులు మంజూరు చేశామన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పనిచేయించలేదని, రైతులను విస్మరించారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు భూమి పంపిణీ చేస్తామని హామీలు ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి మహిళ సంఘానికి రూ. లక్ష వారి ఖాతాలో జమచేస్తామని వాటిని తిరిగి చెల్లించనవసరంలేదన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు తొట్ల అంజయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలుమల్ల గంగాధర్, నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీ నర్సింహుని సన్నిధిలో.. వేములవాడ: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమ స్వగ్రామం రుద్రంగిలోని శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆది శ్రీనివాస్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
టీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కులేదు
మంథని(రామగిరి) : ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలుచేయకుండా విస్మరించిన టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రామగిరి మండలం లొంకకేసారం, కల్వచర్ల, రత్నాపూర్, గోకుల్‌నగర్, కృష్ణానగర్, సెంటినరీకాలనీల్లో గురువారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. కాసారం, కల్వచర్ల, గోకుల్‌నగర్, కృష్ణానగర్, రాజాపూర్‌కు చెందిన పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు చొప్పరి సదానందం, గంట వెంకటరమణారెడ్డి, కర్రు నాగయ్య, తొట్ల తిరుపతి యాదవ్, తోట చంద్రయ్య, వనం రాంచెందర్‌రావు, ముస్త్యాల శ్రీనివాస్, మోలుమూరి శ్రీనివాస్, బండారి సదానందం తదితరులు పాల్గొన్నారు. ఆదివారంపేటలో గడపగడపకు కాంగ్రెస్ రామగిరి: మండలంలోని ఆదివారంపేటలో గురువారం కాంగ్రెస్ నాయకులు గడపగడపకు కాంగ్రెస్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు జెడ్పీటీసీ సదానందం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి సదానందం కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
అవకాశమిస్తే సేవకునిగా పనిచేస్తా...
రామగిరి(మంథని) : ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో మరో అవకాశం ఇస్తే ప్రజా సంక్షేమానికి సేవకుడిలా పనిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. సెంటినరీకాలనీ రాణి రుద్రమాదేవి స్టేడియంలో గురువారం తెల్లవారు జామున వాకర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. మండలాధ్యక్షుడు పూదరి సత్యనారాయణ, ఎంపీటీసీ ఆశాకుమారి, నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరికలు రామగిరి: టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు పేర్కొన్నారు. ఇనగంటి రామారావు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ ఓపీపీ1 సీహెచ్‌పీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 50 మంది పుట్టమధు సమక్షంలో గురువారం టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మండలాధ్యక్షుడు పూదరి సత్యనారాయణ, కిషన్‌రెడ్డి, ఎంపీటీసీ ఆశాకుమారి నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఇంటింటీ ప్రచారం కమాన్‌పూర్: మండలంలోని పెంచికల్‌పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధును గెలిపించాలని కోరుతూ గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పుట్ట మధు కోడలు కుషాలీ ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి తన మామ పుట్ట మధును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ఇనగంటి భాస్కర్‌రావు, రామారావు, గడుప కృష్ణమూర్తి, కూర విజయ, తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు ఊరట
సింగరేణి(కొత్తగూడెం) : హైకోర్టు తీర్పు సింగరేణి కార్మికులకు ఊరట కలిగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకునే కార్మికులకు యాజమాన్యం విధించిన రెండు సంవత్సరాల నిబంధన రద్దు చేయాలని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ ఇన్వాలిడేషన్ చేయాలని ఈ నెల 5న ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాయి. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ఈ నెల 5న ఇచ్చిన తీర్పులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుడికి జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకున్న యాజమాన్యం వెంటనే ఇన్వాలిడేషన్ చేయకుండా, అతనికి రెండు సంవత్సరాల సర్వీసు ఉందా? ఉన్న జబ్బు ఎంత శాతం ఉంది? అనే నిబంధనలు విధించటం కార్మికులను వేధింపులకు గురిచేయటమే అవుతుందని, కానీ కార్మిక కుటుంబాలకు సహాయ కారిణి కాదని, ఇది రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిబంధనను పూర్తిగా కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. రెండేళ్ల నిబంధనతో అన్యాయం ఎనిమిది నెలలక్రితం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాల స్థానంలో మెడికల్ ఇన్వాలిడేషన్తో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. కారుణ్యం తమకు ఆసరా అవుతుందని కార్మిక కుటుంబాలు ఆశపడ్డాయి. కానీ రెండేళ్ల సర్వీస్ నిబంధన విధించడంతో చాలా మంది కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోయారు. రెండేళ్లకు వారం, పదిరోజులు, పక్షంరోజులు తక్కువగా ఉన్నా, వారు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ యాజమాన్యం మెడికల్ బోర్డుకు పిలవడంలేదు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో పుర్వపరాలు పరిశీలించిన పిదప యాజమాన్యంను తప్పుపడుతూ తీర్పు నిచ్చినిన్తూ రెండేళ్ల సర్వీసు నిబంధన సరైందికాదని, వెంటనే ఈ నిబంధనను ఉపక్రమించి కార్మికులకు న్యాయం చేయాలని ఆదేశించింది. -
నయా ఫ్యూడలిజం నశించాలి..
గోదావరిఖని(రామగుండం) : నయా ఫ్యూడలిజం నశించాలి.. ఓట్ల విప్లవం వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ప్రజాయుద్ధనౌక గద్దర్ ఆటాపాటా ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని జూనియర్ కళాశాల గ్రౌండ్ సోమవారం ఏర్పాటు చేసిన సభలో మహాకూటమి అభ్యర్థి రాజ్‌ఠాగూర్ మక్కాన్‌సింగ్ తరఫున ఆయన ప్రచారం చేశారు. చిన్నారులతో కలిసి గతంలో జరిగిన అన్యాయాలను నాటిక రూపంలో వివరించారు. గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని.. జనాభలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఉండగా టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి ఒక్కరికి కూడా దక్కలేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని బిర్యాని పెట్టి బుజ్జగించారన్నారు. గొర్రెలు, తోకలు, ఈకెలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదవి మాత్రం బీసీలకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని అన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో కారుణ్యం లేకుండా కఠినత్వంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రామగుండం ఉద్యమ గుండం, వెలుగు గుండాన్ని ప్రస్తుతం చీకటి మయం చేశారని విమర్శించారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్‌ఠాగూర్‌మక్కాన్‌సింగ్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, హర్కర వేణుగోపాల్, కౌశిక్‌హరి, బాబర్ సలీంపాషా, గుమ్మడి కుమారస్వామి, జీవీరాజు, విజయ్, జిమ్మిబాబు, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. -
కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థిగా జువ్వాడి నర్సింగరావు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ కోరుట్ల అభ్యర్థిగా జువ్వాడి నర్సింగరావును అధిష్టానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకుగాను 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్‌ను సీపీఐకి అప్పగించింది. హుజూరాబాద్, కోరుట్ల స్థానాల పై పదిరోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. టీపీసీసీ ఎన్నికల కమిటీ సిఫార్సు మేరకు హుజూరాబాద్‌ను కౌశిక్‌రెడ్డికి.. కోరుట్ల జువ్వాడి నర్సింగరావుకు కేటాయించారు. నర్సింగరావు ప్రొఫైల్.. పేరు : జువ్వాడి నర్సింగరావు పుట్టిన తేదీ : 04/04/1962 తల్లిదండ్రులు : రత్నాకర్‌రావు, సుమతి భార్య : రజని విద్యార్హతలు : ఎంబీఏ స్వగ్రామం : తిమ్మాపూర్, ధర్మపురి మండలం(ప్రస్తుత నివాసం హైదరాబాద్) రాజకీయ ప్రవేశం : 2005 నుంచి 2007 వరకు ఏపీఐఐసీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1996 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నాడు. 2014 ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రెండో స్థానంలో నిలిచారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో తెరాసలో చేరారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించి రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. -
ప్రజాస్వామ్యానికి ఓటే రక్ష
సిరిసిల్ల : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును మించిన ఆయుధం లేదని, రాజ్యాంగం ఇచ్చిన ఈఅవకాశాన్ని ఓటర్లు సద్వినయోగం చేసుకోవాలని ప్రముఖ లలిత గేయ కవి, సినీ దర్శకుడు వడ్డెపెల్లి కృష్ణ అన్నారు. ఆదివారం గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకుని నోటురూటు మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రతీపౌరుడు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాధ్యక్షుడు పొరండ్ల మురళీధర్ మాట్లాడుతూ మందుకో, విందుకో లొంగి ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతామన్నారు. అనంతరం సాహితీ సమితికి చెందిన పలువురు కవులు తమ కవితల్లో ఓటు ప్రాధాన్యతను వర్ణించారు. సమితి ప్రతినిధులు వడ్డెపెల్లి కృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య, కవులు, రచయితలు వెంగళ లక్ష్మణ్, వాసరవేణి పరుశరాం, మడుపు ముత్యంరెడ్డి, జక్కని వెంకట్రాజం, నేరోజు రమేశ్, సబ్బని బాలయ్య, వడ్నాల వెంకటేశం, పాముల ఆంజనేయులు, కనపర్తి హనుమాండ్లు, తుమ్మనపల్లి రామస్వామి, సిద్దిరాం, సత్యనారాయణ పాల్గొన్నారు. -
పచ్చని చెట్లతో ఆహ్లాదం
వేములవాడఅర్బన్ : వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లిలోని శాంతినగర్ కాలనీలో 2017లో హరితహారం కార్యక్రమంలో కాలనీవాసులు కాలనీలోని సీసీ రోడ్డుకు ఇరువైపుల గన్నేరు మొక్కలను నాటుకున్నారు. ఎండాకాలంలో కూడా వాటిని ఎవరి ఇంటి ఎదుట వారు నీరు పెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ చెట్లు పెరిగి ఇప్పుడు ఆ కాలనీలో గన్నేరు పూలతో, పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ చెట్లను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
'కూడు' దూరం చేసిన 'కోడ్'...
సాక్షి, పెద్దపల్లి : వర్షంవస్తే పంటలు పండుతాయి. రోడ్లు దెబ్బతింటాయి. ఈ రెండు ఎంత నిజమో.. ఎన్నికలు రావడంతో ఫ్లెక్సీ వ్యాపారులకు నష్టం.. ప్రచారంలో వెళ్లేవారికి లాభం అంతే జరుగుతోంది. ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల దెబ్బకు ఫ్లెక్సీ దుకాణాలు మూతపడడంతో ఎన్నికల కోడ్ తమకు కూడు లేకుండా చేసిందని ఫ్లెక్సీ తయారీదారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కేంద్రం సహా అన్నిచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ కింద ప్రచారాన్ని నిలిపివేయడంతో ఫ్లెక్సీ తయారీదారులు లబోదిబోమంటున్నారు. ఏడాదికి ఒక్కసారి దసరా పండుగా వస్తే.. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు దసరా పండుగలాంటిదని వ్యాపారులు పేర్కొంటున్నారు. తమకు కాస్త ఆదాయం వస్తుందని ఆశపడ్డ సమయంలో ఎన్నికల కమిషన్ గుర్రు మనడంతో తమ దందా పూర్తిగా నిలిచిపోయిందని పలువురు వ్యాపారులు తెలిపారు. ఒక్కోషాపు యజమాని ఈ సీజన్లో కనీసం రూ.రెండు నుంచి మూడు లక్షల మేర ఆదాయం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలతో రాజకీయ నాయకులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండడం తమ వ్యాపారానికి కలిసి వచ్చే అవకాశామని అంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కఠినమైన అంక్షలు విధించడంతో ఎన్నికలు వచ్చిన సంతోషమే లేకుండాపోయిందని అంటున్నారు. ఒక్కో పట్టణంలో నాలుగు నుంచి ఎనిమిది కరీంనగర్ లాంటి నగరంలో 25 ఫ్లెక్సీ షాపులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం గిరాకీ లేకుండా మూత వేసుకునే పరిస్థితిలో ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం నుంచే.. ఫ్లెక్సీ వ్యాపారం 15 ఏళ్ల క్రితం నుంచి జోరందుకుంది. నిరుద్యోగ యువకులు ఉపాధి మార్గంగా ఎంచుకున్న ఫ్లెక్సీ దందాలో చాలామంది విద్యావంతులు చేరారు. ఇద్దరు, ముగ్గురు మిత్రులు కలిసి కుటీర పరిశ్రమగా నడుపుకుంటున్న వ్యాపారంపై క్రమంగా ఆరేడు ఏళ్ల నుంచి ప్రభుత్వ నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. ప్లాస్టిక్ నియంత్రణ కింద ఫ్లెక్సీలను నిషేదించడంతో వ్యాపారం నష్టాల బాటపట్టింది. దీంతో ఎక్కడిక్కడ ఫ్లెక్సీల సంఖ్య తగ్గించేందుకు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీ నగరాల్లో నిషేదించారు. దాంతో చిన్న పట్టణాలు, గ్రామాలకు పెక్సీలు పరిమితం కాగా గిరాకీ సగం పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. సుమారు రూ.20 లక్షలతో ఫ్లెక్సీ తయరీ యంత్రాలను కొనుగోలు చేయగా ఇప్పుడు గిరాకీ తగ్గిపోవడంతో దందా లాభం లేకుండా పోయిందని ఈ సమయంలోనే వచ్చిన ఎన్నికలు మరింత నష్టాల పాలు చేశాయంటున్నారు. అనుమతి ఇవ్వండి.. ఫ్లెక్సీలతో సమాజానికి నష్టం కలుగుతున్న మాట వాస్తవమే. ఇది ఇప్పుడు తెలిసిందికాదు. ప్రభుత్వమే ముందుగానే ఫ్లెక్సీ తయారిని దేశంలో అనుమతించకపోతే బాగుండేది. ఇప్పుడు ఎన్నికల నిబంధనల పేరుతో మొత్తం ప్రచారాన్ని నిలిపివేస్తూ ఫ్లెక్సీలపై నిషేదం విధించడంతో దందాపూర్తిగా ఆగిపోయింది. కొద్దిగానైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తే తమ వ్యాపారం సగమైనా నడిచేది. 10 ఏళ్ల క్రితం ఎన్నికల సమయంలో ప్రచార నిమిత్తం కనీసం రూ.2 లక్షలు సంపాదించాను. ఇప్పుడు రూపాయి లేదు. -డి.అనిల్, ఫ్లెక్సీ తయారీ వ్యాపారి -
రామలింగేశ్వరునికి కార్తీక శోభ
మల్లాపూర్(కోరుట్ల): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక హరిహరక్షేత్రంగా శ్రీరామలింగేశ్వర ఆలయం కీర్తించబడుతుంది. మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న ఆలయంలో కార్తీక మాస పంచాహ్నిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి 23న కార్తీక పౌర్ణమి వరకు శివముష్టి, చందనోత్సవ, తులసీ వివాహా, అష్టోత్తర కళశ స్నపన, లక్ష కుంకుమార్చన, పుష్పయాగములతో పాటు..పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. లక్ష దీపాలంకరణోత్సవాలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మి, ఎంపీటీసీ ఇస్లావత్ లక్ష్మీబలరాంనాయక్, మాజీ సర్పంచులు చిలివేరి రమేశ్, ఎండీ.జమాల్, మాజీ ఉపసర్పంచ్ దండిగ రాజం తెలిపారు. విచ్చేయనున్న సాధుపుంగవులు.. కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి సాధుపుంగవులు ముఖ్య ఆథితులుగా విచ్చేయనున్నారు. మనోరబాద్ నుంచి శ్రీ శివానందభారతిస్వామి, శకణాగిరి నుంచి శ్రీకేశవనాథ్స్వామి, ఆదిలాబాద్ నుంచి శ్రీ ఆదినాథ్స్వామి, వాల్గొండ చంద్రయ్యస్వామి, వేంపేట నుంచి భవవద్గీత పారా యణ భక్తులు, కొలిప్యాక నుంచి శ్రీగంగాధర్స్వామి, కోరుట్ల నుంచి శ్రీ ఆత్మనందస్వామి, గంభీర్పూర్ నుంచి గిరిజామాతస్వామి, కోరుట్ల నుంచి శ్రీజగదీశ్వరస్వామి, కోరుట్ల నుంచి హరిప్రియమాత, పిప్రి నుంచి శ్రీయోగేశ్వరస్వామి, శ్రీ నర్సింగరెడ్డిస్వామి లక్షదీపోత్సవానికి విచ్చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. -
కార్తీకం శుభప్రదం!
పవిత్ర కార్తిక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఈ కార్తిక మాసంలో భక్తులంతా తెల్లవారు జామునే లేచి పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయడంలో నిమగ్నం అయిపోతారు. కార్తిక మాసం సర్వమంగళకరం హరిహరులకు ప్రీతికరమైనది.కార్తిర మాసంలో ఏ పనిచేసినా...మంచి ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం అందుకే ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే నది స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి హరిహరులకు పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి సోమవారాలు, ఏకాదశి, ద్యాదశి, పౌర్ణమి తిదులను పరమ పవిత్రమైన దినాలుగా భావిస్తారు. ధర్మపురి: కార్తీకమాసం ఎంతో శుభప్రదం. ఆదివారం సెలవు రోజు కావడంతో ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఆలయం శ్రీయోగానందుడైన శ్రీలక్ష్మీనృసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరిక చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. -
నామినేషన్ల ఘట్టం.. నేటితో సమాప్తం..
ముందస్తు ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల కాగా.. అదే రోజు నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. ప్రధానపార్టీలు అన్ని స్థానాలకు టికెట్లు ఖరారు చేయని కారణంగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు ఆశించిన మేరకు దాఖలు కాలేదు. శనివారం వరకు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు 55 మంది 68 సెట్లలో నామినేషన్లు వేశారు. సెప్టెంబర్ 6న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితాలో 107 మందిని ప్రకటించగా.. అందులో చొప్పదండి మినహా మూడు నియోజకవర్గాలకు సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ఖరారు చేశారు. రెండురోజుల కిందటే చొప్పదండికి అభ్యర్థిని ఖరారు చేశారు. అదే విధంగా కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించాయి. 12 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కాగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పలువురు వేశారు. అయినప్పటికీ ఆఖరిరోజు నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు పోటెత్తనున్నాయి. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి, కరీంనగర్ : తొలి జాబితాలో మంత్రి ఈటల రాజేందర్ (హుజూరాబాద్), గంగుల కమలాకర్ (కరీంనగర్), రసమయి బాలకిషన్ (మానకొండూరు) ఉండగా.. నాలుగు రోజుల క్రితం చొప్పదండికి సుంకె రవిశంకర్‌ను ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్ల ప్రారంభం రోజే హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ తరఫున ఆయన సతీమణి ఈటల జమునారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మొదటి సెట్‌ను వేసిన పాడి కౌశిక్‌రెడ్డి తరఫున శనివారం ఆయన సతీమణి శాలినీరెడ్డి మరోసెట్ దాఖలు చేశారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ (టీఆర్ఎస్), పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), బండి సంజయ్‌కుమార్ (బీజేపీ) నామినేషన్లు వేశారు. చొప్పదండిలో మేడిపల్లి సత్యం (కాంగ్రెస్), సుంకె రవిశంకర్ ఒక్కో సెట్ దాఖలు చేశారు. మంచిరోజు, చివరి రోజు కావడంతో మళ్లీ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి బీ ఫారంతో కలిపి ఇప్పటివరకు నామినేషన్ వేయని, వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం మరో సెట్లో వేసేందుకు నామినేషన్ వేసేందుకు ముహూర్తం కుదుర్చుకున్నారు. హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్లో గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్, మానకొండూరులో రసమయి బాలకిషన్ (టీఆర్ఎస్), ఆరెపెల్లి మోహన్ (కాంగ్రెస్) భారీ జనంతో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్ (టీఆర్ఎస్), బొడిగ శోభ (బీజేపీ) కూడా సోమవారం నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇతర పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, స్వతంత్రులు కూడా నామినేషన్లు వేయనుండగా.. పోలీసులు భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన... 22న ఉప సంహరణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు నేటితో తెరపడనుండగా.. శనివారం నాటికి 55 మంది వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 68 సెట్లలో దాఖలు చేశారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 23 నుంచి ఎన్నికల ప్రచారం హోరెత్తనుండగా.. ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రచారసరళిపై నిఘా ముమ్మరం చేసింది. డిసెంబర్ 7న అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. అదేనెల 11న ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం వరకు ఢిల్లీ, హైదరాబాద్‌లో టికెట్ల కోసం క్యూకట్టిన కొందరు నేతలు.. సోమవారం నాలుగు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేసేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో బారులు తీరనున్నారు. ముందస్తుపోరులో ఉండే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ దాదాపుగా సోమవారమే నామినేషన్లు వేయనుండటంతో నామినేషన్ కేంద్రాల్లో సందడి నెలకొననుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గం కేంద్రంలో తహసీల్దారు/ఆర్డీవో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా.. నామినేషన్ పత్రాలపై ఆదివారం రాత్రే కసరత్తుపూర్తి చేశారు. ముహూర్తం కోసం ఎదురుచూసిన అభ్యర్థులు చివరిరోజు నామినేషన్లకు సిద్ధం కావడం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. -
కాంగ్రెస్ పార్టీలో చేరిక
మంథని: గుంజపడుగు గ్రామానికి చెందిన సుమారు 200 మంది మాజీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో టీఆర్ఎస్, టీడీపీ, సీఎస్సార్ యువసేన నాయకులున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన, మండల పరిషత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ పూదరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ రాష్ట్రంగా తెలంగాణ తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కాని నేడు తెలంగాణ నిరుద్యోగ రాష్ట్రంగా మారిందని ఉస్మానియా యూనివర్సిటీ జేఎసీ చైర్మన్ నాగరాజు అన్నారు. మహాకూటమి అభ్యర్థి డి.శ్రీధర్‌బాబుకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీ పూర్వ విద్యార్థులు ఆదివారం మంథనిలో ప్రచారం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు వినీత్ మాట్లాడారు. మహేశ్‌గౌడ్, భట్టు సాయి, రామకృష్ణ, నవీన్, రాము, సందీప్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, నాయుకులు వొడ్నాల శ్రీనివాస్, పోలు శివ, ఎల్లంకి వంశీ, బొబ్బిలి శ్రీధర్, మంథని సురేష్, టి.రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి... కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ముత్తారం జెడ్పీటీసీ సదానందం, టీపీసీసీ కార్యదర్శి జగన్మోహన్రావు అన్నారు. ముత్తారం గ్రామంలో ఆదివారం గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. మాజీ సర్పంచులు తాటిపాముల వకూళారాణి, గోవిందుల పద్మ, ఎంపీటీసీ పప్పు స్వరూప, నాయకులు బాలసాని మొగిళిగౌడ్, బుచ్చంరావ్, మద్దెల రాజయ్య, దుండె రాజేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పనితీరు నచ్చకే కాంగ్రెస్‌లో చేరికలు.. టీఆర్ఎస్ పార్టీ పని తీరు నచ్చకే ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ముత్తారం జెడ్పీటీసీ చొప్పరి సదానందం, టీపీసీసీ కార్యదర్శి జగన్మోహన్రావ్ అన్నారు. పోతారం గ్రామ టీఆర్ఎస్కు చెందిన నర్ర రవికుమార్, ముష్కె రాకేశ్, ముష్కె రామకృష్ణ, సాదుల సదయ్య, గడిచెర్ర శంకర్‌తోపాటు సుమారు 30 మంది ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు చెల్కల సుధీర్, జితేందర్, ప్రవీణ్, ఓదెలు, యుగేందర్, గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం లద్నాపూర్‌లో ఆదివారం గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీగోదారంగనాయక, శ్రీదాసాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ వనం రాంచందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు తోట చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి బండారి సదానందం, నాయకులు రొడ్డ బాపు, ముడుసు ఓదెలు, గొర్రె నరేష్, మల్లెంపల్లి శ్రీనివాస్, అడ్డూరి ప్రవీణ్, తొగరి చంద్రయ్య, మేడగోని రాంచందర్, వీరగోని లక్ష్మణ్, గండి ప్రశాంత్, పులి సాయి, గాజు రఘుపతి తదితరులు పాల్గొన్నారు. -
జీవనదిగా...మానేరు
సాక్షి, పెద్దపల్లి: కరువంటే తెలియని జిల్లాగా అభివృద్ధిచేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లిలో శుక్రవారం తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హుజూరాబాద్, పెద్దపల్లి అన్నాచెల్లెలాంటి ఊళ్లన్నారు. మానేరు ఎండిపోయి కాల్వశ్రీరాంపూర్, ఓదెల, వీణవంక రైతులు ఏటా అల్లాడిపోతున్నారని.. ఇక ముందు అలాంటి సమస్యలు ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించిందని గుర్తుచేశారు. మానేరుపై నాలుగుచోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు జరుగుతున్నాయని .. మరో నాలుగుచోట్ల నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే మానేరు జీవనదిగా మారుతుందన్నారు. ఇప్పటికే వర్షాకాలంలో మిషన్ కాకతీయ ఫలితాలు కనిపించాయన్నారు. వచ్చే రెండేళ్లలో పెద్దపల్లి మానేరు, హుస్సేన్‌మియా వాగులు జలా హా రంగా కనువిందు చేస్తాయన్నారు. గతంలో రైతులు రాత్రి వేళ కరెంట్ కోసం వెళ్లి పాముకాటుకు గురై చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని.. ఇప్పుడు 24 గంటల కరెంట్ సరఫరాలతో ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యలతో పాటు ఆడబిడ్డల పెళ్లీలకు అన్నదమ్ములు కూడా ఇవ్వని రీతిలో రూ.లక్ష కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా అందించినట్లు చెప్పారు. బీజేపీ, మహాకూటమిలపై ఈటల ఆగ్రహం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 20 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో తెలంగాణ తరహా పథకాలు అమలు చేయలేదని ఈటల మండిపడ్డారు. కల్లబొల్లి మాటలతో ఓట్లకోసం తిరుగుతున్న బీజేపీని నమ్మొద్దన్నారు. మహాకూటమిలో జతకట్టిన పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసినవేనన్నారు. ఇక్కడ దాసరి.. అక్కడ కేసీఆర్ గెలవాలి.. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేసుకోగలుగుతామని మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు అన్నారు. తెలంగాణ ప్రాంతం విముక్తి కావడానికి తన తండ్రి వెంకటస్వామి కృషి చేశారని ప్రభుత్వ సలహాదారు వివేక్ అన్నారు. ప్రాణాహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం జరిగితేనే తెలంగాణ బాగుపడుతుందన్నారు. కూటమి వెనుక ఉన్న చంద్రబాబు కుట్రలను గమనించాలని సమావేశంలో భానుప్రసాద్‌రావు కోరారు. కూటమి తాళం చెవి చంద్రబాబు వద్ద ఉందన్నారు. సమావేశానికి స్థానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ ఎంపీ డాక్టర్ వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, నాయకులు కోట రాంరెడ్డి, డాక్టర్ టీవీరావు, నల్ల మనోహర్‌రెడ్డి, బాలజీరావు, పారుపెల్లి రాజేశ్వరి, సందవేన సునీత, గట్టు రమాదేవి, రఘువీర్‌సింగ్, అమ్రేష్, రాజు, రాజ్‌కుమార్, హన్మంత్, వివిధ మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు కొమురయ్య యాదవ్, మార్క్ లక్ష్మణ్, రమారావు, వెంకట్‌రెడ్డి, రమేష్, పురుషోత్తం, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పురాజు కుమార్, కొయడ సతీష్‌గౌడ్, తబ్రేజ్, సాబీర్‌ఖాన్, శ్రీనివాస్, చంద్రమౌళి, రాజేందర్‌యాదవ్ పాల్గొన్నారు. -
వేములవాడలో ప్రధాని సోదరుడు
వేములవాడ: భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ శుక్రవారం రాత్రి వేములవాడ చేరుకున్నారు. ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు రాజన్నను దర్శించుకోనున్నారు. ప్రహ్లాద్ మోదీకి వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాపరామకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. -
పాతాళంలోకి భూగర్భజలాలు
వేములవాడ అర్బన్: ఇసుకాసురుల పైసాచికానందానికి మూలవాగు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భజలాలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికే మూలవాగుతోపాటు చుట్టూపక్కల ప్రాంతాలలో చుక్క నీరు కనిపించని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటికీ మూలవాగులోని ఇసుక ఖాళీ కావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. వేములవాడ పట్టణంలో దాదాపు 30 ట్రాక్టర్లు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు. పాతాళంలోకి భూగర్భజలాలు: ఈ ఏడాది జిల్లాలో సగటు వర్షపాతంలో 21 శాతం లోటు ఉంది. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 14.25 మీటర్లు లోతులో ఉంది. వర్షాకాలంలో వర్షాలు సాధారణ వర్షపాతం 823.19 మిల్లీమీటర్లుకాగా 646.40 మిల్లీమీటర్లు కురిసింది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఈ సంవత్సరం మూలవాగు పారలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని నీటి వనరులు ఎండిపోయాయి. శీతాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాల పాతాళంలోకి పోవడంతో అటు అన్నదాతులు.. ఇటు పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. వేములవాడ అర్బన్‌లో 24.72 మీటర్ల అత్యధిక లోతుల్లో నీరు ఉంది. మూలవాగే ఆధారం... కోనరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలు, వేములవాడ మండలంలోని నాంపల్లి, అయ్యోరుపల్లి, వేములవాడ, జయవరం, తిప్పాపూర్, మల్లారం, హన్మాజీపేట గ్రామాలకు మూలవాగే ఆధారం. ఆయా గ్రామాలలో సాగు, తాగునీరు కోసం మూలవాగుపైనే ఆధారపడతారు. ఇసుక అనుమతులు.. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పనులకు మాత్రమే అధికారులు ఇసుక అనుమతి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అది కూడా మిడ్‌మానేరు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని పరిసరాల వాగులో ఇసుకను తీసేందుకే అనుమతి ఇస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ పనులకు అయితే మంగళవారం, గురువారం, శనివారం మూడు రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇస్తున్నారు. కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తెచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక ట్రిప్పునకు రూ.220 డీడీ చెల్లించాలి. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులు పొందాలి. తర్వాతనే ఇసుకను తరలించే అవకాశం ఉంటుంది. కానీ వేములవాడ మూలవాగులో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టారీతిగా తోడేస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తే చర్యలు... వేములవాడలోని ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుకను అనుమతి ఇస్తున్నాం. అది కూడా కేటాయించిన రోజు, సమయానికే తరలించాలి. మూలవాగులో ఇసుక తోడేందుకు ఎలాంటి అనుమతి లేదు. అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. -నక్క శ్రీనివాస్ తహసీల్దార్, వేములవాడ బావుల వద్ద తోడుతున్నారు మూలవాగులో ఉదయం 4 గంటలకే ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద కూడా ఇసుకను తోడేస్తున్నారు. ఇదేం పద్ధతి అం టే బెదిరింపులకు దిగుతున్నారు. అధికారులే పట్టించుకోవాలి. -చిర్రం శేకర్ రైతు గొల్లపల్లి అడుగంటుతున్న భూగర్భ జలాలు వర్షాలు సరిగ్గా కురువక మూలవాగులోని వ్యవసా య బావుల్లో నీరు అడుగంటిపోయింది. బావులల్లా నీరు మోటార్ల ద్వారా ఒక్క గంట కూడా పోయడం లేదు. ఏసంగి వ్యవసాయం చేయడం కష్టమే. -ఎం.మల్లేశం రైతు గొల్లపల్లి -
అమోమయంలో 'బొడిగె' అనుచరవర్గం...
బోయినపల్లి: చొప్పదండి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ బీజేపీలో చేరడంతో ఇంతకాలం ఆమె వర్గంలో ఉన్న మండలంలోని పలువురు టీఆర్ఎస్ నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. గురువారం కరీంనగర్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నివాసంలో సమావేశమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సమావేశంలో మెజార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో మండలంలో టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా ఉండేది. వీరిలో కొంతమంది ఎమ్మెల్యే వర్గంలో, మరికొంత మంది స్థానిక నేతలతో మరో వర్గంగా ఉండేవారు. మండలంలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు వర్గాల నేతలు వేర్వేరుగా నిర్వహించే వారు. ఈ క్రమంలో మండలంలో టీఆర్ఎస్ తీరు చర్చనీయాంశంగా ఉండేది. కాగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయడం, ఎన్నికలకు వెళ్లడం చక చకా జరిగింది. ఈ క్రమంలో చొప్పదండి టీఆర్ఎస్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్యేకు కేటాయించవద్దని మండలంలోని కొంతమంది నేతలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే శోభ చివరి క్షణం వరకు వేచి చూశారు. చివరకు ఈ నెల 14న బీజేపీ పార్టీ తరపున నామినేషన్ వేశారు. దీంతో చాలా రోజులు టికెట్ పెండింగ్‌లో ఉంచిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌కు టికెట్ కేటాయించారు. నేతల సమాలోచనలు... ఇంతకాలం ఒకే పార్టీలో ఉన్న రెండు వర్గాలుగా ఉన్న నేతలు.. ఇపుడు మాజీ ఎమ్మెల్యే శోభ బీజేపీలో చేరడంతో తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. మండలంలోని మాజీ సర్పంచులు, నామినేటెడ్ పదవులు పొందిన పలువురు కరీంనగర్లో గెట్టూగెదర్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. రెండు వర్గాలుగా ఉన్న నాయకులం దరినీ ఒకేచోట చేర్చేందుకు ఓ సీనియర్ నాయకుడు చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం. -
20న కరీంనగర్‌కు గులాబీ దళపతి
సాక్షి, కరీంనగర్: గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 20న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 19తో ముందస్తు ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియనుండగా.. అదే రోజు నుంచి రాష్ట్రంలో ప్రచార సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో 20న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట కొంగరకలాన్ నుంచి ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. రెండో సభను హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు. అభ్యర్థుల ప్రకటన.. నామినేషన్ల ఘట్టం తర్వాత మలివిడత ప్రచారానికి సిద్ధమైన ఆయన.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈనెల 20న భారీ ప్రచార సభ నిర్వహించనున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. మొదటగా ఉమ్మడి జిల్లాలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచే ఈ సభలను నిర్వహించనున్నారు. 20న మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించనుండగా.. 3.30 గంటలకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల సభను సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభలను విజయవంతం చేసేందుకు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సర్వసన్నద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చింది. -
మహాకూటమి ఓ 'విష'కూటమి
కరీంనగర్‌అర్బన్: టీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రజలకు ఊరట లభించిందని టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. 3వ డివిజన్లో గురువారం నిర్వహించిన మహిళల ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చెట్టు ఫలాలను పొందాలంటే మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. మేయర్ రవీందర్‌సింగ్, నాయకులు ఎడ్ల ఆశోక్, ఆర్ష మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 27, 30 డివిజన్లలో టీఆర్ఎస్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్లు కోడూరి రవీందర్‌గౌడ్, చొప్పరి జయశ్రీ వేణు, నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. మహాకూటమి గెలిస్తే అధోగతే.. కొత్తపల్లి: కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఓ విషకూటమని, కూటమి గెలిస్తే తెలంగాణ అధోగతి పాలు కాకతప్పదని కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్‌లో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పడుతూ స్వాగతించారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ వాసాల రమేశ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నాయకులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా యాదవ సంఘ భవనంలో గంగులను గొర్రె గొంగళితో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో చేరిక కరీంనగర్: మీసేవ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో జేఏసీ, బీసీ సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బొల్లం లింగమూర్తి, బిజిగిరి నవీన్‌కుమార్, బొల్లం రాజ్‌కుమార్, కొట్టె కిరణ్, పల్లె నారాయణగౌడ్ తదితరులున్నారు. డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు కట్ల సతీశ్, చల్ల హరిశంకర్, బోనాల శ్రీకాంత్, డిష్ మధు, కుమార్, మహేందర్, సత్యనారాయణ, ఉదారపు మారుతి, తోట మధు, శంకర్, మిర్యాల్‌కార్ నరేందర్ పాల్గొన్నారు. -
పొలాలను ముంచిన మిషన్ భగీరథ
సాక్షి,చిగురుమామిడి: మండలంలోని కొండాపూర్ గ్రామ ఊరచెరువు దగ్గర మిషన్‌భగీరథ మెయిన్ పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పైపుల నుంచి నీరు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో కోతకు వచ్చిన పంట నీటితో నిండిపోయింది. ఒకటి రెండు రోజుల్లో కోసే వరి నీటమునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్ర స్వామి, బింగి మల్లయ్య, బుర్ర శ్రీనివాస్‌లకు చెందిన పంటలు నీటమునిగాయని ఆందోళన చెందుతున్నారు. నీరు ఇంకిపోయే వరకు దాదాపు పదిరోజుల సమయం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పగిలిన పైపులైన్‌ను మరమ్మతు చేయాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
టార్గెట్–2020!
గోదావరిఖని/జ్యోతినగర్(రామగుండం): దక్షణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ రామగుండం ఎన్టీపీసీ అని.. తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించడం కోసమే వడవడిగా నూతన ప్రాజెక్టు నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర అన్నారు. సంస్థ 40వ ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని మిలీనియం హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థ 52,946 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అగ్రభాగాన నిలిచిందన్నారు. భారతావనికి 22.74 శాతం విద్యుత్‌ను అందిస్తున్న సంస్థగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. రామగుండం ప్రాజెక్టు 1978లో శంకుస్థాపన కాగా 1983లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిదని వెల్లడించారు. దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణలో అతిపెద్ద వెలుగుల కేంద్రంగా నిలిచిందని అన్నారు. రూ.10598.98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ స్టేజీ నిర్మాణపు పనులు ప్రమాదరహితంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం.. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజీ–1లో నిర్మాణంలో యూనిట్–1 టర్బైన్ జనరేటర్ 18 మీటర్లు. చిమ్నీ నిర్మాణం 180 మీటర్లు పూర్తయిందన్నారు. ఇంకా చాలా పనులు కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బాయిలర్ సీలింగ్, బాయిలర్ ప్రెజర్ పార్ట్స్, టర్భైన్ జనరేటర్ యూనిట్–2 పనులు, బూడిద పైపులైన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జూన్–2019లో స్టీమ్ బాయిలింగ్ విధానం ప్రారంభం కానుందన్నారు. యూనిట్–1, మే–2020, యూనిట్–2, నవంబర్–2020న విద్యుత్ ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రకటించారు. సమావేశంలో జనరల్ మేనేజర్లు అరవింద్‌కుమార్ జైన్, పుష్ఫేందర్ కుమార్ లాఢ్, డాక్టర్ సశ్మితా డ్యాష్, శ్రీరామారావు, సౌమేంద్రదాస్, ఉమాకాంత్ గోఖలే, విజయ్‌సింగ్, యం.ఎస్.రమేష్, సీఎస్సార్ మేనేజర్ జీవన్‌రాజు, ఉద్యోగ వికాస కేంద్రం మేనేజర్ ప్రవీణ్‌కుమార్, పీఆర్వో సహదేవ్సేథీ, విష్ణువర్ధన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.