
ఉసిరిక చెట్టువద్ద కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు
పవిత్ర కార్తిక మాసం ప్రారంభం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.ఈ కార్తిక మాసంలో భక్తులంతా తెల్లవారు జామునే లేచి పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేయడంలో నిమగ్నం అయిపోతారు. కార్తిక మాసం సర్వమంగళకరం హరిహరులకు ప్రీతికరమైనది.కార్తిర మాసంలో ఏ పనిచేసినా...మంచి ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం అందుకే ఈ మాసంలో భక్తులు ఉదయాన్నే నది స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి హరిహరులకు పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి సోమవారాలు, ఏకాదశి, ద్యాదశి, పౌర్ణమి తిదులను పరమ పవిత్రమైన దినాలుగా భావిస్తారు.
ధర్మపురి: కార్తీకమాసం ఎంతో శుభప్రదం. ఆదివారం సెలవు రోజు కావడంతో ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఆలయం శ్రీయోగానందుడైన శ్రీలక్ష్మీనృసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరిక చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment