karthika masam
-
పోలి స్వర్గం.. భక్తుల పుణ్యస్నానాలు (ఫొటోలు)
-
తిరుపతి జిల్లాలో మహా దీపోత్సవం (ఫొటోలు)
-
శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు..
-
విజయవాడ భవానీ ఐలాండ్ లో వన భోజనాల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : కనులపండువగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
సముద్ర స్నానాలు ఆచరించి..భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!ఏం చేస్తారంటే..కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.సత్యనారాయణ వ్రతం :సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.ఏకాదశి రుద్రాభిషేకం :ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత. జ్వాలాతోరణం...ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.ఈ పూర్ణిమకు మరొక పేరు..కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. మరోవేపు సిక్కులు , జైనులు కూడా..సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.(చదవండి: 365 వత్తులు..కార్తీక పురాణం ఏం చెబుతోంది?) -
శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవం..భక్తకోటి పరవశం (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష స్వీకరణ (ఫొటోలు)
-
కార్తీక సోమవారం.. శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)
-
దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!
కార్తీకమాసం సందర్బంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన మయూర నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరు గాంచింది. మాయవరంలోని మయూర నాథ ఆలయం. శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు అనేకంఉన్నాయి, అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమింటంటే... పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఇదెక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుందాము...తమిళనాడు లోని, నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలిచే మాయవరంలో మయూరనాథ దేవాలయం వుంది.ప్రస్తుతమున్న మైలాడుతురైనే మాయవరం అని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్థులలో నిర్మితమైంది.దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి.స్థలపురాణంఇక్కడ దక్షప్రజాపతి శివపార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి, పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో... జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి, అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి, ఒడిలో ఉన్న నెమలిపిల్ల కూడా ఆహుతైపోతుంది.అలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో, తర్వాత నెమలి రూపంలో జన్మించి, జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి, శివుణ్ణి ప్రార్థించి, ఆయనలో లీనమైనట్లు స్థల పురాణం చెబుతోంది. పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి, ఈ ఆలయానికి మయూర నాథ దేవాలయం అని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక, అభయ ప్రధాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.ఈ ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది.ఈ మర్రి చెట్టుకిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లు భక్తులు భావిస్తారు.ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. దీనిని వృషభా తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో, ప్రతీ పౌర్ణిమ రోజున తమ తమ గంగ యమునలతోపాటు ఇక్కడికి వచ్చి తమ అంశలతో కూడిన నదులు ఇక్కడికి వచ్చి, తమ జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు తలుస్తుంటారు.మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.పురాతన ఆలయం శాసనాల ప్రకారం క్రీ.శ 9 వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందని చెబుతారు.చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
నాగుల చవిత విశిష్టత..! ఈ ఆచారం ఎలా వచ్చిందంటే..
ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. మనం కూడా పాములమే..హిందువులు పాములను దేవతలుగా భావించి పుజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణం గా, శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు ఆవు నుంచి నాగ పాము వరకూ అనేక రకాల జంతుజాలాలను పుజిస్తారు. అలాంటి పండగలలో ఒకటి నాగుల చవితి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితిని శాస్త్రం ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని. ఈ రోజు(నవండర్ 5 ) చవితి తిధి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ ఉంటుంది కనుక.. ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.నాగుల విశిష్టత..కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. నాగుల ప్రాణాలను రక్షించిన ఆస్తికుడుపాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుడుని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగాలనాటిది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
శ్రీశైలం టెంపుల్ లో కార్తీక మాసం శోభ (ఫొటోలు)
-
కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?
ఈ కార్తీకమాసం అంటే పుణ్య మాసం అనే చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీకమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశ దీపం వెలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతీ శివాలయం లో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్లిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి కోసం అని కార్తీకపురాణం చెబుతోంది. ఇలా ఆ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిది మనలో ఉన్న నెగిటీవ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు పండితులు చెబుతారు, కొందరు ఇళ్లల్లో కూడా దీనిని కడతారు.(చదవండి: కార్తీకం.. పరమ పవిత్రం) -
పంచారామ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
-
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
కార్తీక మాసం తొలి సోమవారం.. భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట
-
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్‌లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్‌లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
అమెరికా, న్యూజెర్సీలో కార్తిక మహోత్సవాలు
-
కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా
-
Vijayawada: విజయవాడ భవానీ ద్వీపంలో కార్తీక మాసం సందడి (ఫొటోలు)
-
కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతం చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయట
కార్తీక మాసం..అనేక పర్వదినాలకు ఆలవాలం. శివకేశవులకు, ఆయన వారి కుమారుడు అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం. నోములు, వ్రతాలు, పూజలు ఈ మాసంలో చేసుకుంటే అధిక ఫలాన్నిస్తాయి. అటువంటి వాటిలో కేదారేశ్వర వ్రతం ఒకటి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం నోచుకుంటే సిరిసంపదలకు, అన్న వస్త్రాలకు లోటుండదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు , పురుషులనే తారతమ్యం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులు ఇంటిల్లిపాది ఉపవాసాలుండి ఆ కేదారేశ్వరుని ధ్యానించాలి. గంగాజలం లేదా శుద్ధజలం, ఆవుపాలు, చెరుకు రసం, కొబ్బరినీళ్లు, తమలపాకులు , పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం సమర్పించిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకోవాలి. కార్తీక మాసంలో కొన్ని ప్రాంతాల్లో నవగ్రహ దీపాల నోముగా నోస్తారు. ఈ నోములో ముందుగా గణపతి ఆరాధన చేసి, తరువాయి శివలింగార్చన చేసి, నవధాన్యాలను కొద్దికొద్దిగా తీసి వాటిపై వేస్తూ దీప ప్రమిదల నుంచి ఓం నమఃశ్శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు స్మరిస్తారు. తరువాత అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసి తొమ్మండుగురు బ్రాహ్మణులకు ఆ దీపాలను దానం ఇస్తారు. దానం చేసేటప్పుడు యథాశక్తి నిండు మనస్సుతో ఇవ్వాలి. ఈ నోము శుభతిథులలో సాయంత్రం వేళల్లో మాత్రమే జరగాలి. నోము అనంతరం అక్షతలను గృహం ఈశాన్య భాగంలో కొద్దిగా చల్లి , కుటుంబంలో అందరూ శిరస్సుపై చల్లుకోవాలి. ఇది సర్వ రక్షాకరంగా కుటుంబాన్ని కాపాడుతుందని పురాణోక్తి. శ్రీ కేదారేశ్వర వ్రత కథ శివుడిని మనం అర్ధనారీశ్వరుడిగా ఆరాధిస్తాం కదా... ఆయన అర్ధనారీశ్వరుడెలా అయ్యాడో వివరించే కథ ఇందులో కనిపిస్తుంది. ఈ కథను సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడం కోసం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ–సాధ్య– కిన్నర కింపురుష–యక్ష–గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణాలు శివుని స్తుతిస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు ఆనందపులకితుడై వినోద సంభరితమైన నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పించాడు. శివుడాతనిని అభినందించి సింహాసనం నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలు గాగల వంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి ‘‘నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితిరి?’’ అని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని ‘‘దేవీ! పరమార్ధ విదులగు యోగులు నీవలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించార’’ ని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయాలనుకుని కైలాసాన్ని వదలి భూలోకంలో సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. అక్కడి మునులు, వారి పత్నులను చూసి వారితో ‘‘నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా! పవిత్రాంగన లారా! నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను. కాబట్టి నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి’’ అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు ‘‘అమ్మా! పార్వతీ! ఈప్సితార్ధదాయకమగు ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవావ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ వ్రతవిధానాన్ని వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. కొంతకాలమునకు శిభక్తపరాయుణడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరవ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడిచేయగోరి దివినుండి భువికేతించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరం ఉజ్జయినీ నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని భక్తితో పూజ చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తంగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది, ఆమె భర్త ఆమెను, కుమారుడ్ని రాజ్యం నుంచి వెడలగొట్టివేసాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చేరబలిచి ‘‘నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్థించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడాసొమ్మును తీసుకొని పోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ‘‘ఓయీ! నీవు ఎన్నిసార్లు నీపెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు’’ అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడాప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్బలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదురో అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖంగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యం పొందుతారు. -డి. వీ. ఆర్. భాస్కర్ -
కార్తీక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
సాక్షి, హైదరాబాద్: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయియి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో దంపతులు, మహిళలు వేలాదిగా వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. నిర్మల్ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవలయలలో భక్తులు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని రుద్రశ్వరస్వామి (వెయ్యి స్తంభాల గుడి), సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కార్తీకపౌర్ణమి పర్వదినం కావడంతో దేవాలయలకు పోటెత్తారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ సంతరించుకుంది. కాకినాడ జిల్లా కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వ్రతములు ఆచరిస్తూ శ్రీ స్వామి దర్శనానికి బారులు తీరారు.పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖపట్నం విశాఖ నగరంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలు దర్శించుకుంటున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా. ద్వారకాతిరుమల శేషాచల కొండపై శివాలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కార్తీకదీపం వెలిగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కార్తీక సోమవారం పౌర్ణమి పర్వదిన సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లాలోని కోటిపల్లి మురమళ్ళ ముక్తేశ్వరం లోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు.