జిల్లాలోని అనందమయం మండలం గుడిలోవ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.
జిల్లాలోని అనందమయం మండలం గుడిలోవ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారి ఆలయంలో దీపారాధాన చేశారు. కొండపై నుంచి భక్తులు వెళ్లిపోయాక ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి.
కొండపై గాలులు భారీగా వీస్తున్నాయి. దాంతో దగ్గర్లోని గ్రామాలకు మంటలు వ్యాపించే ప్రమాదమని నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం.