Ranganathaswamy Temple
-
వైకుంఠ ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనాలు
-
ఉత్తరద్వార దర్శనం చేసుకుంటున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు
-
నెల్లూరు : రంగడి రథోత్సవం.. ఊరంతా సంబరం (ఫోటోలు)
-
రంగ రంగ వైభవం.. 19 ఏళ్లకు ఓ సారి
‘రంగ.. రంగ’ నామస్మరణతో శ్రీరంగం పులకించింది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): 108 వైష్టవ క్షేత్రాల్లో రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 19 ఏళ్లకు ఓ సారి వైకుంఠ ఏకాదశి వేడుకలు మార్గశిర మాసంలో కాకుండా కార్తిక మాసం ఏకాదశిలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది మనవాళ మహామునుల నియమావళి ప్రకారం తైపూసంలో వార్షిక ఉత్సవాలను సైతం ముగించాల్సి ఉంది. దీంతో కార్తిక మాసంలో అధ్యయన ఉత్సవం వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టం వైకుంఠ ద్వార ప్రవేశం మంగళవారం కనుల పండువగా జరిగింది. బారులు తీరిన భక్తులు సోమవారం నుంచి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజల అనంతరం 4.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచారు. మూల స్థానం నుంచి స్వామివారు ప్రత్యేక అలంకరణలో పరమపద మార్గం వైపుగా ముందుకు సాగారు. రంగ .. రంగ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయితే స్వామివారి స్వర్గ ద్వార ప్రవేశం సమయంలో ఆలయ అధికారులు, అర్చకులు మాత్రమే ఉన్నారు. భక్తులను అనుమతించ లేదు. బయట ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుచ్చి జిల్లా కలెక్టర్ శివరాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 7 గంటల అనంతరం భక్తులను స్వామివారి దర్శనార్థం అనుమతించారు. అప్పటికే కి.మీ కొద్ది భక్తులు ఆలయ పరిసరాల్లో బారులు తీరారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను అనుమతించారు. -
షూటింగ్‌లకు నిలయం.. ఆ ఆలయం
సాక్షి; శ్రీరంగాపూర్ (కొత్తకోట): ఇక్కడి రంగనాథస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా సెలవు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుండే గాక విదేశాల నుంచి సైతం భక్తులు పర్యాటకులు అధికంగా వస్తుంటారు. వనపర్తి జిల్లాలోనే అత్యధిక శిల్ప సంపద కలిగిన ఈ ఆలయం చుట్టూ నీటితో కళకళలాడే రంగసముద్రం చెరువు ఉంది. ఇది రమణీయంగా ఉంటుంది. ఇక్కడి మ్యూజియంలో ప్రసిద్ధిగాంచిన తంజావూరు చిత్రపటాలను భద్రపరిచారు. ఏటా హోలి రోజు ఇక్కడ పగలు రంగనాయకస్వామి వారి రథోత్సవం నిర్వహిస్తారు. కార్యక్రమాలు రాజా రాజరామేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతాయి. సినిమా, సీరియల్ షూటింగ్‌లకు ప్రత్యేకత రంగనాయకస్వామి ఆలయం చుట్టూ నీటితో కళకళలాడుతున్న చెరువు ఉండడంతో పాటు పురాతన ఆలయం, గోపురాలు, శిల్పాలు ఉండడంతో చాలా సినిమాలు, తరచూ సీరియల్ షూటింగులు ఇక్కడే జరుగుతుంటాయి. ఆలయాన్ని చేరుకోండి ఇలా.. హైదరాబాద్ నుంచి 160 కి.మీ. దూరంలో శ్రీరంగాపూర్ ఉంటుంది. 44వ జాతీయ రహదారిపై పెబ్బేరు మీదుగా 10 కి.మీ. వెళితే ఈ ఆలయం వస్తుంది. వనపర్తి జిల్లా కేంద్రం నుంచి 25 కి.మీ. ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ఆటోలు నిత్యం అందుబాటులో ఉంటాయి. -
ఆదిశ్రీరంగ క్షేత్రం శ్రీరంగపట్నం
పవిత్ర కావేరీ తీరంలో వెలసిన మూడు శ్రీరంగనాథ క్షేత్రాలలో మొదటిది శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథ ఆలయం. కావేరీ నది మొదట్లో వెలసిన శ్రీరంగపట్నం క్షేత్రాన్ని ఆది శ్రీరంగంగా, కావేరీ ప్రవాహానికి కాస్త ముందుకు వెళితే శివసముద్రం వద్ద వెలసినది మధ్య శ్రీరంగ క్షేత్రంగా, తమిళనాడులోని శ్రీరంగంలో వెలసినది అంత్య శ్రీరంగ క్షేత్రంగా విరాజిల్లుతున్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకం, పురాతనం. శ్రీరంగపట్నంలో వెలసిన క్షేత్రం ఏనాటికి చెందినదో తెలిపే కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే, అంబ అనే భక్తురాలు క్రీస్తుపూర్వం 3600 సంవత్సరంలో ఇక్కడ శ్రీరంగనాథునికి చిన్న గుడి కట్టించినట్లు ప్రతీతి. తర్వాతి కాలంలో గంగ, హొయసల, విజయనగర రాజుల కాలంలో ఆలయం వివిధ కళారీతుల్లో విస్తరించింది. తొలుత చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దిలో గంగ వంశపు రాజులు భారీ స్థాయిలో పునర్నిర్మించారు. తర్వాత హొయసల, విజయనగర రాజులు అభివృద్ధిపరచారు. ఇక్కడి గర్భగుడి గంగవంశీయుల నాటి శిల్పశైలిలోను, ఆలయ అంతర్నిర్మాణాలు హొయసల శైలిలోను, ఆలయంలోని రంగమండపం, గోపురం విజయనగర శైలిలోను కనువిందు చేస్తాయి. -
ఆలయ పవిత్రతకు రాజకీయ రంగు
సాక్షి, నెల్లూరు(బృందావనం): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆలయ పవిత్రతకు తెలుగు తమ్ముళ్లు తిలోదకాలిచ్చారు. సింహపురి క్షేత్రపాలకుడు శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామివారి రాజగోపురాన్ని దేవదాయ, ధర్మాదాయశాఖ నిబంధనలకు నీళ్లొదిలి, ప్రభుత్వ ఉత్తర్వులను, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాల తీర్పును అగౌరవ పరుస్తూ నూతన పాలకమండలి సభ్యుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో రంగడి రాజగోపురాన్ని కప్పేశారు. దీంతో స్వామివారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నూతన పాలక మండలి బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా ఆదివారం స్వామివారి కల్యాణ మండపం వద్ద అభినందన సభ నిర్వహించదలిచారు. దీంతో స్వామివారి తూర్పున ఉన్న రాజగోపురం ఇరువైపులా ధర్మకర్తల మండలి సభ్యురాలి చిత్రాలతో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ ఇతర నాయకుల చిత్రాలతో రథం వద్ద నుంచి కల్యాణ మండపం వరకు ఇరువైపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రంగడి రాజగోపురం ఎదురుగా త్రిదండి రామానుజాచార్యుల వారి విగ్రహం పక్కన ఫ్లెక్సీలను కట్టా రు. గత పాలకమండలి సాక్షాత్తు త్రిదండి రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలుగకుండా ఉత్సవాల ఫ్లెక్సీలను సైతం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. తూర్పు రాజగోపురాన్ని ఆ పాలకమండలి సొంత నిధులతో శాండ్‌బ్లాస్టింగ్ చేయించి గోపురం అసలు రూపం వెలుగు చూసేలా చర్యలు తీసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన నూతన పాలకమండలి మాత్రం అభినందనసభ నిర్వహిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా దేవదాయ, ధర్మాదాయశాఖ నిబంధనలను తుంగలోతొక్కి సాక్షాత్తు పాలకమండలి సభ్యుల చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై భక్తులు విస్మయంతోపాటు అధికారపార్టీ నాయకులు తీరుతెన్నులను ఏవగించుకుంటున్నారు. దేవదాయశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
-
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య పరాశ్రీకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆయనను రంగరాజన్ భుజస్కంధాలపై ఎత్తుకొని మండపం నుండి ప్రధాన ధ్వజస్థంభం వరకు తీసుకెళ్లారు. ప్రదక్షిణ అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. శిరస్సుపై శఠగోపం ధరింపచేసి ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సమావేశంలో రంగరాజన్ మాట్లాడుతూ 2,700 ఏళ్ల నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కుల ఆధారిత సమాజంలో దళితులు నేటికీ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ఇది అంకురార్పణ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ ప్రతిగుడిలో దళితులకు ప్రవేశం కల్పించడంతోపాటు వారిని అన్ని విధాల జాగృతిపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి కారెంపుడి లక్ష్మీనరసింహా మాట్లాడుతూ నగరంలో మొదటిసారి చేపట్టిన మునివాహన సేవా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆధిత్య పరాశ్రీ మాట్లాడుతూ దళితులు ఆలయ ప్రవేశం చేయడంతోపాటు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తిరుపావై కోకిల మంజులశ్రీ, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ వంశీతిలక్, రంగనాథస్వామి దేవాలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్టీ చార్యులు, శేషాచార్యులు, సుందర రాజన్, రాధామనోహర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
రంగనాథ స్వామి ఆలయంలో భక్తుల ఆగ్రహం
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవాలయాల్లో భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారంగుండా దర్శించుకుంటున్నారు. ద్వారకా తిరుమల, అన్నవరం, నెల్లూరు, పెంచలకోన, కడప గడపల్లో స్వామివారు తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వారంలో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఏర్పాట్ల పై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనానికి గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, వీఐపీ టిక్కెట్లు అధికంగా విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపూరు మండలం పెంచలకోన ఆలయానికి భక్తులు తరలివచ్చారు. బోగోలు మండలం బిలకూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారుల తీరి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తులకు ఉత్తర ద్వార ముఖంగా దర్శనం ఇస్తున్నారు. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామి(పానకాల స్వామి) ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారు జామున 3 గంటల నుంచే వైకుంఠ ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. బంగారు శంఖు తీర్దం కోసం భక్తులు బారులు తీరారు. వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహిస్తున్నారు. గరుడ వాహనంపై కోదండరాముడు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. -
కొండ పై ఇంకా ఆరని చిచ్చు
-
రంగనాథస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం
-
రంగనాథస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం
జిల్లాలోని అనందమయం మండలం గుడిలోవ రంగనాథస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివారి ఆలయంలో దీపారాధాన చేశారు. కొండపై నుంచి భక్తులు వెళ్లిపోయాక ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. కొండపై గాలులు భారీగా వీస్తున్నాయి. దాంతో దగ్గర్లోని గ్రామాలకు మంటలు వ్యాపించే ప్రమాదమని నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం.