
కొండంత కేక్
దివాలీ సంబరానికి తెరపడగానే.. సిటీలో కార్తీక శోభ మొదలైంది. కార్తీక మాస తొలి రోజు సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం గోవర్ధనగిరి వేడుకలు జరిగాయి. వందలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఇదే రోజున ఎత్తారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా గోవర్ధనగిరి ఆకారంలో 333 కిలోల కేక్‌ను రూపొందించారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.