cake
-
హైదరాబాద్‌లో భారీ కేక్.. ఏకంగా 2254 కేజీలు (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో 3 వేల కిలోల భారీ కేక్.. గిన్నిస్ రికార్డ్
అతిపెద్ద హనీ కేక్ తయారీ ద్వారా గిన్నిస్ రికార్డ్ సాధనకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోంది. నగరంలోని మాదాపూర్‌లో ఉన్న హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ ఈ వినూత్న ఫీట్‌ను సమర్పిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సురేష్‌నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత ఆదరణ పొందిన మెడోవిక్ హనీ కేక్ ద్వారా ఈ రికార్డ్ సాధించనున్నామని, దీని కోసం ఇప్పటికే 3వేల కిలోల బరువున్న కేక్‌ను తయారు చేశామని వివరించారు. భారీ కేక్ 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు ఉంటుందన్నారు. గతంలో ఉన్న రికార్డ్ కంటే దాదాపు 10 రెట్లు మిన్నగా ఈ భారీ కేక్ రూపొందిందన్నారు. ఈ భారీ కేక్‌ను శుక్రవారం నగరంలోని మాయా కన్వెన్షన్ సెంటర్లో ప్రదర్శించనున్నామని తెలియజేశారు.ఏళ్ల వయసు.. 16 వేల అడుగుల ఎత్తు..16 ఏళ్లకే 16 వేలకుపైగా అడుగుల పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు హైదరాబాద్‌కు చెందిన విశ్వనాథ్ కార్తికేయ. అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సన్ మాసిఫ్(16,050 అడుగులు)ను అధిరోహించిన అతి పిన్న వయసు్కడైన భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. నిర్మల్ పుర్జా నేతృత్వంలో బూట్స్, క్రాంపాన్స్–ఎలైట్ ఎక్స్‌పెడ్ బృందంలో విశ్వనాథ్ ఈ నెల 3న శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అనంతరం సురక్షితంగా బేస్ క్యాంప్‌నకు చేరుకున్నాడు.నవంబర్ 21న హైదరాబాద్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, 25న యూనియన్ గ్లేసియర్‌కు చేరుకున్నాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడిన అనంతరం బేస్ క్యాంప్‌నకు తరలించారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, లక్ష్యాన్ని సాధించాడు. ‘నీకు నచ్చింది చేయడం వల్ల సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితం ఉంటుంది’అని తన తల్లి చెప్పేదని ఆయన అన్నారు.లాంగ్వేజ్.. స్కిల్స్ అందించేందుకు..పాఠశాల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్(కేఈఎఫ్) నడుం కట్టింది. ఇందులో భాగంగా కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ ఫ్యూచర్ రెడీ(సిఈ–ఎఫ్ఆర్) డిజిటలైజ్డ్ కంటెంట్‌ను ఉపాధ్యాయులకు అందించే ప్రక్రియను ‘వన్ కేఈఎఫ్’ అనే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పలు ప్రాంతాల్లో ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.చదవండి: ఆ విషయంలో మిగిలిన మెట్రో నగరాలన్నింటికన్నా మనమే టాప్ప్రపంచీకరణ ప్రపంచంలో విజయం సాధించడానికి సంభాషణా చాతుర్యం ముఖ్యంగా ఆంగ్లభాషా నైపుణ్యం ముఖ్యమైనదని, తమ కంటెంట్ ద్వారా విద్యార్థులు భాషా నైపుణ్యంతో పాటు ఇతర సవాళ్లను ఎదుర్కొనే అనేక సామర్థ్యాలను సొంతం చేసుకుంటారన్నారు.హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆదరిస్తున్న యువత సహజసిద్ధ ఉత్పత్తులను తయారు చేసే చేనేతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మిసెస్ ఇండియా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ 2023 విజేత ఛాయాదేవి రుద్రరాజు అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని కళింగ కల్చరల్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన జాతీయ చేనేత పట్టువస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ కొలువుదీరిన చేనేత వ్రస్తోత్పత్తులు తిలకించి చేనేత వస్త్ర తయారీ విధానం, ప్రత్యేకతలను తెలుసుకున్నారు.భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు. ఆ ఉత్పత్తులకు నేటికీ వన్నె తగ్గలేదన్నారు. నేటితరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేతకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు 75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారని తెలిపారు. -
నోరూరించే కేక్ వెనుక ఇంత హిస్టరీ ఉందా? ఇంట్రస్టింగ్ స్టోరీ
పుట్టిన రోజంటే కేక్ కోయాల్సిందే! ఏదైనా వేడుక జరిగినా కేక్ కోయడం తప్పనిసరి. లోపల బ్రెడ్‌తో, పైన క్రీమ్‌తో నోరూరించే కేక్ అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కేక్ చరిత్రేమిటో తెలుసుకుందామా?కేక్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ఈజిప్టులో కేక్ తయారు చేసినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ మనం చూసే కేక్‌కు భిన్నంగా తేనె, గోధుమపిండితో దాన్ని తయారు చేసేవారు. అప్పట్లో సంపన్నులు వారింటి వేడుకల్లో అతిథులకు కేక్‌ను ఇచ్చేవారని, కేక్ రుచికరంగా మారేందుకు తేనె, తృణధాన్యాలు వాడేవారని చరిత్రకారులు అంటున్నారు. రోమ్ సామ్రాజ్యంలో సైతం కేక్ తయారీ ఉందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కేక్‌లు తయారు చేసి పూలు, ఇతర ఆకులతో అలంకరించేవారు. అందువల్లే ఆ కాలంలో అవి ఆలివ్ కేక్, ప్లమ్ కేక్‌గా ప్రసిద్ధి పొందాయి. మొదట్లో కేక్ తయారీకి తేనె వాడేవారు. చక్కెర అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కేతో తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో చక్కెర ఖరీదైన వస్తువు కావడం వల్ల కేక్‌లు కేవలం సంపన్నవర్గాల వారికే పరిమితమయ్యేవి. పుట్టినరోజులు, పెళ్లిరోజుల సమయంలో కేకు కోసి అందరికీ పంచడం అప్పట్లో ఆనవాయితీగా మారి నేటికీ కొనసాగుతోంది. 1764లో డాక్టర్ జేమ్స్ బేకర్, జాన్ హానోన్ కలిసి కోకో గింజలను పొడి చేసి పేస్ట్‌లా మార్చి తొలిసారి చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న కేక్ రూపానికి వారు అంకురార్పణ చేశారు. దీంతో కేక్‌ను వివిధ పదార్థాలతో తయారు చేయొచ్చన్న ఆలోచన అందరికీ వచ్చింది. ఆ తర్వాత 1828లో డచ్‌కు చెందిన శాస్త్రవేత్త కోయెనెరాడ్ జోహన్నెస్ వాన్ హౌటెన్ కోకో గింజల్లో పలు రకాల పదార్థాలు కలిపి, అందులోని చేదును ΄ోగొట్టి కేక్‌ను మరింత రుచికరంగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వంటవాళ్లు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల ఫ్లేవర్లలో కేక్‌లు తయారుచేయడం మొదలుపెట్టారు. అందులో గుడ్డు, చక్కెర, వైన్, బాదం, జీడిపప్పు వంటివి కలిపి సరికొత్త ప్రయోగాలు చేశారు. 1947 తర్వాత మైక్రోవేవ్ అవెన్స్ రావడంతో కేక్‌ను బేక్ చేసే ప్రక్రియ సులభంగా మారింది. ప్రస్తుతం వందలాది ఫ్లేవర్లలో కేక్‌లు దొరుకుతున్నాయి. గుడ్డు తినడం ఇష్టపడని వారికోసం ‘ఎగ్‌లెస్ కేక్’ తయారుచేస్తున్నారు. రోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేక్‌లు తయారై అమ్ముడు΄ోతున్నాయి. -
ది గోట్ సరికొత్త రికార్డ్.. కేక్ కట్ చేసిన విజయ్
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించగా.. ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్‌లో మెరిశారు.తాజాగా దళపతి విజయ్ తన చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాఈ చిత్రం తమిళనాడులో రూ. 100 కోట్ల షేర్ సాధించడంతో నిర్మాత అర్చన కల్పాతితో కలిసి కేక్ కట్ చేశారు. అర్చనతో కలిసి నటుడు కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. Celebrating #TheGreatestOfAllTime moment with @actorvijay na❤️❤️❤️ @archanakalpathi for achieving #100CRORESSHAREINTAMILNADU @vp_offl @Jagadishbliss bro thanks @Ags_production @agscinemas @aishkalpathi pic.twitter.com/JdaTdxpvCq— raahul (@mynameisraahul) October 12, 2024 -
కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు
బనశంకరి: బెంగళూరులో కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.కొంతసేపటికే విషమంవివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్ చనిపోగా, బాలరాజ్, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.పోలీసుల విచారణకేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.అనేక సందేహాలుఓ వ్యక్తి స్విగ్గీలో కేక్ ఆర్డర్ చేసి తరువాత క్యాన్సిల్ చేయడంతో బాలరాజ్ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. -
కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు
బనశంకరి: బెంగళూరులో కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.కొంతసేపటికే విషమంవివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్ చనిపోగా, బాలరాజ్, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.పోలీసుల విచారణకేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.అనేక సందేహాలుఓ వ్యక్తి స్విగ్గీలో కేక్ ఆర్డర్ చేసి తరువాత క్యాన్సిల్ చేయడంతో బాలరాజ్ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. -
బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు.. భాజా భజంత్రీలతో సంబురాలు!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్రబృందం ఫుల్ ఖుషీ అవుతున్నారు.తాజాగా కల్కి మూవీ సక్సెస్ వేడుకను చిత్రబృంద సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ భాజాభజంత్రీలతో సందడి చేశారు. నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. Fans of Rebel Star #Prabhas celebrated the success of #Kalki2898AD with Producer @AshwiniDuttCh garu ❤️🔥#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/5IeNZx3DZr— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2024 -
అంతా 77 మయం.. లాలూ బర్త్‌డే స్పెషల్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు(జూన్ 11) తన77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాలూ యాదవ్ కుటుంబసభ్యులు 77 కిలోల కేక్‌ను కట్ చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు 77 కిలోల లడ్డూలను రబ్రీ నివాసానికి తీసుకువచ్చారు. ఈ వేడుకల్లో రబ్రీదేవి, కుమార్తె రోహణి ఆచార్య పాల్గొన్నారు.దీనికి ముందు లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన తల్లి, సోదరితో కలిసి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ సమక్షంలో కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు. తన 'ఎక్స్' ఖాతాలో ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘సాన్నిహిత్యం, వినయం, సరళత కలగలసిన వ్యక్తి’ అంటూ తన తండ్రిని కొనియాడారు. ఈ ఫొటోలలో లాలూ యాదవ్, రోహిణి ఆచార్య కూడా కనిపిస్తున్నారు.లాలూ ప్రసాద్‌కు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘకాలం జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ కుమార్తెలు మిసా భారతి, రోహిణి ఆచార్య లు పట్నాలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఆర్జేడీ కార్యాలయంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. To the person who is a perfect blend of affinity, humility and simplicity.THE MAN who leads by example.A leader who nurtures leaders.Happiest birthday my papa ♥️Love you infinity ♾️ @laluprasadrjd @yadavtejashwi @RJDforIndia @RahulGandhi @yadavakhilesh @RabriDeviRJD pic.twitter.com/XmpsZV30Ju— Tej Pratap Yadav (@TejYadav14) June 10, 2024 -
ఇటీవలే రెండో పెళ్లి.. భార్యతో కేక్ కట్ చేసిన బిగ్‌బాస్ విన్నర్!
బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫారూఖీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నారు. గతేడాది బిగ్‌బాస్ సీజన్-17లో విజేతగా నిలిచిన మునావర్ మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజబీన్ కోట్వాలాను పెళ్లాడారు. పెళ్లయిన పది రోజుల తర్వాత ముంబయిలో రిస్పెప్షన్ వేడుక కూడా నిర్వహించారు.తాజాగా మునావర్.. తన భార్య మహ్జబీన్ కోట్వాలాతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరలవుతున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కోట్వాలాను సీక్రెట్‌గా వివాహం జరిగిన విషయం అత్యంత సీక్రెట్‌గా ఉంచారు. ఈనెల 26న ఆదివారం ముంబయిలోని ఐటీసీ మరాఠాలో రిసెప్షన్‌తో ఈ విషయం బయటకొచ్చింది. ఈ వేడుకలో నటి హీనా ఖాన్ సందడి చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఫోటోను పంచుకున్నారు.కాగా.. మునావర్‌కు గతంలోనే వివాహం జరిగింది. అతనికి మొదటి భార్యతో ఓ కుమారుడు ఉన్నాడు. మరోవైపు మెహజబీన్కు కూడా 10 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by MunawarXTabish (@munawar___faruquiiii) -
ఆలూ కేక్.. ఎప్పుడైనా ట్రై చేశారా..!
కావలసినవి: గోధుమ పిండి ఆలూ గుజ్జు – 1 కప్పు చొప్పున బాదం పౌడర్, జొన్న పిండి – పావు కప్పు చొప్పున పాలు – ముప్పావు కప్పు (కాచి చల్లార్చినవి) నూనె లేదా బటర్ – పావు కప్పు (బటర్ అయితే కరిగించుకోవాలి) గడ్డ పెరుగు, వాల్ నట్స్ తరుగు, చాక్లెట్ చిప్స్ – పావు కప్పు చొప్పున బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్ తయారీ విధానం: ముందుగా గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఒక బౌల్లో జల్లించుకోవాలి. మరో బౌల్ తీసుకుని అందులో ఆలూ గుజ్జు, బాదం పౌడర్, జొన్నపిండి వేసుకుని, అర కప్పు పాలు కొద్దికొద్దిగా పోసుకుంటూ, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో నూనె లేదా బటర్, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిగిలిన పావు కప్పు పాలనూ పోసేసుకుని మరోసారి పేస్ట్‌లా కలుపుకుని.. వాల్ నట్స్ ముక్కలు, చాక్లెట్ చిప్స్ వేసుకుని.. ఆ మిశ్రమాన్ని బేకింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్‌తో క్లియర్..! -
బర్త్‌డేకి బంగారపు కేకు కట్ చేసిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
సినీ సెలెబ్రిటీలు ఏ పని చేసినా కాస్త డిఫరెంట్‌గానే ఉంటుంది. వాళ్లు ధరించే దుస్తులు, మాట్లాడే తీరు.. వ్యవహార శైలీ అన్ని ఇతరుల కంటే కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం తమ జీవనాన్ని సాదాసీదాగా కొనసాగిస్తే.. మరికొంత మంది మాత్రం చాలా రిచ్‌గా గడుపుతారు. రిచ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసే వాళ్లలో ఊర్వశీ రౌతేలా ఒకరు. (Image Courtesy:Instagram) ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎవరో గుర్తుకు రాకపోవచ్చు కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్ పార్టీ’ పాటకు స్టెప్పులేసిన భామ అనగానే అందరికి గుర్తొస్తుంది. ఆ పాటకు తనదైన స్టెప్పులేని అందరిని ఆకట్టుకుంది ఈ భామ. నేడు(ఫిబ్రవరి 25) ఊర్వశి బర్త్‌డే. ఈ సందర్భంగా గొల్డెన్ కేక్ కట్ చేసి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ భామ. (Image Courtesy:Instagram) ప్రతి ఏడాది తన పుట్టిన రోజు వేడుకను చాలా గ్రాండ్‌గా జరుపుకోవడం ఊర్వశికీ అలవాటు. అలా ఈ ఏడాది కూడా తన బర్త్‌డేని స్నేహితుల సమక్షంగా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేకును కట్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫోటోలు వైరల్‌గా మారాయి. తినే కేకుకు బంగారపు పూత పూయడం అవసరమా? ఎంత డబ్బులు ఉన్నా.. బంగారంతో కేకును తయారు చేస్తారా? అవి డబ్బులా మంచి నీళ్లా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy:Instagram) -
అటుకుల పోహాతో కేక్..ఎప్పుడైనా ట్రై చేశారా?
పోహా కేక్ తయారీకి కావల్సినవి: మైదా పిండి – 3 కప్పులు అటుకులు – ఒకటిన్నర కప్పులు (నానబెట్టి గుజ్జులా చేసుకోవాలి) అరటి పండు – 1 (ముక్కలు చేసుకోవాలి),పంచదార – 2 కప్పులు పీనట్ బటర్, బటర్ – పావు కప్పు చొప్పున బేకింగ్ సోడా – 2 టీ స్పూన్లు,పాలు – 2 కప్పులు వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూన్ తయారీ విధానమిలా: ముందుగా మిక్సీ బౌల్లో పంచదార వేసుకుని పొడి చేసుకుని, అందులో బటర్, పీనట్ బటర్, అరటిపండు ముక్కలు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో బేకింగ్ సోడా, పాలు, మైదాపిండి, అటుకుల పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌లో కేక్ మేకర్ తీసుకుని.. అందులో ఈ మిశ్రమం వేసుకుని సుమారు 45 నిమిషాల పాటు ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ కేక్‌ని కాస్త చల్లారనిచ్చి.. నచ్చిన విధంగా క్రీమ్, ఫ్రూట్స్‌తో డెకరేట్ చేసుకుని, కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
భారత్‌లో తొలి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యిందో తెలుసా!
కేక్ అనేది మన సంప్రదాయ వంటకం కాదు. బ్రిటీష్ వాట్ల నుంచి వచ్చిందే. అయితే మన దేశంలో మొట్టమొదటి క్రిస్మస్ కేక్ ఎక్కడ తయారయ్యింది? ఎవరు తయారు చేశారో వింటే ఆశ్చర్యపోతారు. పైగా ఆ కాలంలో కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు కూడా అందుబాటులో కూడా ఉండేవి కాదు. అయితే కేరళకు చెందిన ఒక వ్యక్తి బ్రిటీష్ వాళ్లు మెచ్చుకునేలా తయారుచేశాడు. ఇప్పుడు అతని షాపే ఫ్లమ్ కేక్ తయారీలో నెంబర్ వన్‌గా లాభాలు ఆర్జిస్తోంది కూడా. 1883లో క్రిస్మస్ సందర్భంగా బర్మా నుంచి వచ్చిన ఔత్సాహిక స్థానిక వ్యాపారవేత్త మాంబల్లి బాపు భారతదేశంలో తొలి క్రిస్మస్ కేక్‌ని తయారు చేశారు. దాల్చిన చెక్క తోటను అభివృద్ధి చేస్తున్న బ్రిటీష్ వ్యవసాయాధికారి మర్డోక్ బ్రౌన్ సూచనలతో తయారు చేసినట్లు బాపు మనవడు చెబుతున్నాడు. తన ముత్తాత మాంపల్లి బాపు బర్మాలో వ్యాపారావేత్త. అతను ఈజిప్టులో బ్రిటీష్ దళాలకు పాలు, టీ, రొట్టే వంటివి రవాణ చేసేవాడని, ఆ తర్వాత 1880లో కేరళలలోని తన సొంతూరు తలస్సేరికి వచ్చిన వెంటనే బేకరీని స్థాపించాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దూరంగా ఉన్న కోలకతాలో ఉన్న ఒకేఒక్క బేకరీ మాత్రమే బ్రిటీష్ ప్రజల అవసరాలను తీర్చేది. ఆ లోటుని బాపు బిస్కట్స్ ఫ్యాక్టరీ తీర్చింది. కాబట్టి బాపు రాయల్ బిస్కట్స్ ఫ్యాక్టరీ భారతీయులచే స్థాపించబడిన తొలి బేకరిగా మారింది. బర్మాలో ఉండగా బాపు తొలుత బిస్కెట్ తయారీలో మంచి శిక్షణ పొందాడు. ఆ బ్రిటీష్ రైతు మర్డోక్ బ్రౌన్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన రిచ్ ప్లం కేక్‌తో బాపు బిస్కెట్ ఫ్యాక్టరీకి వెళ్లాడు. కేక్ ముక్కను రుచి చూడమని బాపుని కోరాడు. అంతేగాక ఇదే మాదిరిగా కేక్‌ని తయారీ చేయాలని చెప్పాడు కడా. ఈ తయారీనే తనకు భారతదేశ పాకశాస్త్ర చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరస్తుందని ఊహించని బాపు అందుకు ఒప్పుకున్నాడు. మర్డోకో ఆ కేక్ తయారీకి కావాల్సిన బ్రౌన్ కోకో, ఖర్జూరం, ఎండుద్రాక్ష, వివిధ డ్రై ఫ్రూట్స్‌ని అందించాడు. అలాగే పక్కనే ఉన్న పుదుచ్చేరి నుంచి బ్రాందీని కూడా కొనుగోలు చేసి తయారు చేయమని చెప్పాడు మర్డోక్. ఆ రోజుల్లో కిణ్వన ప్రక్రియ కోసం అందుబాటులో ఈస్ట్ లేదు. అందుకని 14 కిలోమీటర్లు ప్రయాణించి మాహేకి వెళ్లి బ్రాందీని కొనుక్కోవాల్సి వచ్చేది. దీంతో వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు బాపు జీడిపప్పు, యాపిల్, అరటి రకమైన కడలిపాజమ్ని ఉపయోగించి స్థానికంగా తయారుచేసిన మద్యంతో ఆ సమస్యను భర్తీ చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలా కేక్ తయారీకి స్థానికంగా తయారైన మద్యంతోనే తయారు చేయడం మొదలు పెట్టాడు బాపు. అయితే బాపు చేసిన కేక్‌ని రుచి చూసిన మర్డోకో బ్రౌన్ వావ్! ఇదే ది బెస్ట్ కేక్ అని కితాబి ఇచ్చి మరీ డజనులు కొద్దీ కేకులను కొనుక్కుని మరీ వెళ్లాడు. ఇప్పుడూ ఆ షాపే భారతదేశంలో అతిపెద్ద ప్లం కేక్ మార్కెట్‌ని కలిగి ఉంది. ఈ వ్యాపారంలో మాంపల్లి కుటుంబానికి ప్రధాన వాటా కూడా ఉందని బాపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడి కుటుంబ సభ్యులంతా కేరళలో అగ్రశ్రేణి బేకరీలను నిర్వహిస్తున్నారు. వారంతా కేరళలో.. కొచ్చిలోని కొచ్చిన్ బేకరీ, తిరువనంతపురంలోని శాంత బేకరీ, కోజికోడ్‌లోని మోడరన్ బేకరీ, కొట్టాయంలోని బెస్ట్ బేకింగ్ కో. తలస్సేరిలోని మాంబల్లి బేకరీలతో బాపు వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. అంతేగాదు ప్రతీ బేకరీలో బాపు బ్రౌన్కేక్ను అందచేసిన పేయింటింగులతో కస్టమర్లను స్వాగతిస్తూ చారిత్రక ఘట్టాన్ని తెలియజేస్తున్నారు. (చదవండి: జీసస్ రియల్ లుక్ ఎలా ఉండేదంటే..? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
బేకరి స్టైల్లో స్వీట్ రైస్ కేక్.. ఇలా చేసుకోండి
స్వీట్ రైస్ కేక్ తయారీకి కావల్సినవి: బియ్యప్పిండి –100 గ్రాములు మైదాపిండి, మొక్కజొన్న పిండి – అర టేబుల్ స్పూన్ చొప్పున బ్రౌన్ షుగర్ – 60 గ్రాములు,నీళ్లు – 1 కప్పు (గోరువెచ్చగా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు,గుడ్డు – 1 తయారీ విధానమిలా: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు గోరువెచ్చని నీటిలో బ్రౌన్ షుగర్‌ను కరిగించాలి. అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. అనంతరం ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో నూనె జోడించి, హ్యాండ్‌హెల్డ్ మిక్సర్‌తో బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కేక్ కంటైనర్ లోపల కొద్దిగా నూనె రాసి, అందులో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అనంతరం 45 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. కేక్ చల్లారాక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కట్ చేసుకుని.. వాటిని గుడ్డు మిశ్రమంలో ముంచి ఇరువైపులా పాన్ పై వేయించుకుని సర్వ్ చేసుకోవాలి. -
మెర్క్యూర్ హోటల్ లో కేక్ మిక్సింగ్ సందడి
-
వెరైటీగా ఫిష్ కేక్ ట్రై చేయండిలా!
ఫిష్ కేకు తయారీకి కావాల్సినవి: శుభ్రం చేసిన చేప ముక్కలు – మూడు కప్పులు(చర్మం, ముల్లు తొలగించి చిన్న ముక్కలు చేయాలి) బ్రెడ్ ముక్కల పొడి – అరకప్పు నూనె – టేబుల్ స్పూను స్ప్రింగ్ ఆనియన్ తరుగు – కప్పు బంగాళ దుంపలు – రెండు మిరియాల పొడి – రెండు టీస్పూన్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – అరకప్పు పచ్చిమిర్చి – రెండు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: బంగాళదుంపలను ఉడికించి, తొక్కతీసి చిదుముకోవాలి. చేప ముక్కలను గిన్నెలో వేసి, పచ్చిమిర్చిని తరిగి వేయాలి. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర తరుగు, చిదుముకున్న బంగాళ దుంపల మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి ముక్కలు పట్టేలా కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత మిశ్రమాన్ని టిక్కీల్లా తయారు చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల పొడిలో ఈ టిక్కీలను అద్దాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేకు నూనె రాసి, బ్రెడ్ ముక్కల పొడిలో అద్దిన ఫిష్ కేక్స్‌ను బేకింగ్ ట్రేలో పెట్టి అరగంటపాటు బేక్ చేస్తే ఎంతో రుచికరమైన ఫిష్ కేక్ రెడీ. (చదవండి: అరటికాయ మంచూరియా టేస్టీగా తయారు చేసుకోండిలా!) -
ఈ ఫోటోలో ఉన్నది కేకు అనుకుంటున్నారా? తెలిస్తే షాకవ్వుతారు!
ఫొటోలో చూస్తే ఇదేదో కేకులా కనిపిస్తుంది గాని, నిజానికి ఇది వెడ్డింగ్ కేకు నమూనాలో రూపొందించిన భవంతి. బటర్ క్రీమ్ మెట్లు, ఐసింగ్ టైల్స్ వంటి అలంకరణలను సిరామిక్‌తో ఏర్పాటు చేసి, దీనిని అచ్చంగా వెడ్డింగ్ కేకును తలపించేలా రూపొందించడం విశేషం. భారీ స్థాయిలో పన్నెండు మీటర్ల (39 అడుగులు) ఎత్తున ఈ వెడ్డింగ్ కేకు భవంతిని పోర్చుగీస్ కళాకారిణి జోవానా వాస్కోన్సెలస్ రూపొందించింది. కళాత్మకమైన శిల్పాల తయారీలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న జోవానా తన అనుభవాన్నంతా రంగరించి ఈ భవంతిని సిసలైన కేకులా తీర్చిదిద్దడంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అతిథులు ఈ భవనంలోని మూడంతస్తుల్లోనూ తిరుగుతూ, ఇందులోని ప్రతి ఒక్క అంశాన్నీ పరిశీలించడానికి వీలుగా దీన్ని తయారు చేయడం విశేషం. లోపలి భాగంలో బంగారు రంగులో చేసిన అలంకరణలు, ఐసింగ్లా తయారు చేసిన శిల్పాకృతులు చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. పద్దెనిమిదో శతాబ్దినాటి పోర్చుగీస్ సంప్రదాయమైన గార్డియన్ పెవిలియన్స్ ఆతిథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేసేందుకు ఈ వెడ్డింగ్కేకు భవంతిని రూపొందించినట్లు జోవానా తెలిపారు. వచ్చే అక్టోబర్ 26 వరకు ఈ కేకు భవంతిని తిలకించేందుకు సందర్శకులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. (చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!) -
కుమారుని బర్త్‌డే కేక్ కట్ చేస్తూ తండ్రి మృతి!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒక కాలనీలో కుమారుని బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఉందంతం స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది. లక్నోలోని ములాయం నగర్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సుశీల్‌శర్మ(45) తన భర్య కిరణ్, పిల్లలు సాక్షి, సార్థక్, మన్నత్‌లతో పాటు స్థానికంగా ఉంటున్నాడు. తాజాగా సునీల్ శర్మ తన కుమారుడు సార్థక్ పుట్టినరోజు సంద్భంగా కేక్ కట్ చేస్తుండగా కళ్లుతిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. సునీల్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య కిరణ్ మాట్లాడుతూ తమపై 22 లక్షలు రుణం ఉందని, ప్రతీనెల రూ. 70 వేలు కడుతున్నామని తెలిపారు. అయితే ఈనెల సొమ్ము కట్టలేకపోవడంతో అప్పు ఇచ్చినవారు ఘోరంగా అవమానించారని, దీంతో తన భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని పేర్కొన్నారు. మృతుని భార్య కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బావిలోకి తోసి.. భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి.. -
ఈ కేక్ చాలా హెల్తీ.. మిల్లెట్స్‌తో చేసుకోండి ఇలా
ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీకి కావల్సినవి: ఫింగర్ మిల్లెట్ (రాగి) పౌడర్ – 80 గ్రాములు, గుడ్లు – 8 గడ్డపెరుగు – 800 గ్రాములు (నీళ్లు పోయకుండానే.. ఒక బాటిల్లో వేసి.. 1 నిమిషం పాటు బాగా గిలకొట్టాలి) పంచదార – అర కప్పు, నెయ్యి – కొద్దిగా ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీ విధానమిలా ముందుగా ఒక బౌల్లో గిలకొట్టుకున్న పెరుగు, రాగి పౌడర్, పంచదార వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో పంచదార కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో గుడ్లు కూడా వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. చివరిగా కేక్ బౌల్‌కి నెయ్యి పూసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసి.. ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కేక్‌ని గార్నిష్ చేసుకుని, ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
కేకు డబ్బులు అడిగాడని కాల్పులు!
బేకరీ నిర్వాహకుని హత్య అనంతరం స్థానికులతోపాటు ఇతర దుకాణదారులు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, మార్కెట్ మధ్యలో ఆందోళన చేపట్టారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన కారులు కోరారు. బీహార్‌లోని ఆరా ప్రాంతంలో శనివారం అర్థరాత్రి ఆయుధాలు ధరించిన కొందరు దుండగులు ఒక బేకరీ దుకాణదారుడిని తుపాకీతో కాల్చి హత్యచేశారు. కేకు కొనుగోలు చేసేందుకు వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే మృతుని కుటుంబసభ్యులతో పాటు స్థానికులు రోడ్లపైకి చేరి ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. బిహియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజా బాజార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉంటున్న అశుతోష్ సింగ్ కుమారుడు మనోహర్ కుమార్ ఉరఫ్ మిన్చీ(35) తన ఇంటిలో బేకర్స్ కింగ్ అనే దుకాణాన్ని నడుపుతున్నాడు. మృతుని తండ్రి అశుతోష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో దుకాణానికి ముగ్గురు వినియోగదారుల వచ్చి కేకు అడిగారు. దీంతో మనోహర్ వారికి కేకు అందించి, డబ్బులు అడిగాడు. వెంటనే వారు తుపాకీతో తన కుమారునిపై కాల్పులు జరిపారన్నారు. కాల్పుల శబ్ధం వినగానే ఇంటిలోనివారంతా దుకాణంలోనికి వచ్చి చూశారు. అయితే ఇంతలోనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మనోహర్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడని పరిశీలించి మృతి చెందాడని నిర్థారించారు. కాగా మృతునికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ శతృవులెవరూ లేరని అశుతోష్ తెలిపారు. ఈ సందర్భంగా భోజ్‌పుర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని, ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటమన్నారు. చదవండి: విచిత్రంగా ప్రవర్తిస్తున్న రైలు ప్రమాద బాధితులు -
Recipe: బీట్రూట్, డ్రై ఫ్రూట్స్‌తో కేక్ తయారు చేసుకోండిలా!
రొటీన్‌గా కాకుండా ఇలా బీట్రూట్ చీజ్ కేక్ తయారు చేసుకోండి! ఇంట్లోనే కొత్త రుచులు ఆస్వాదించండి! కావలసినవి: ►వాల్నట్స్ – 150 గ్రాములు ►ఎండు అంజీరాలు – 8 ►దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ ►ఉప్పు – చిటికెడు ►బీట్రూట్ తురుము – 300 గ్రాములు ►కోకోనట్ చీజ్ – 200 గ్రాములు ►కోకో పౌడర్, కొబ్బరి నూనె, నెయ్యి, మేపుల్ సిరప్ (మార్కెట్లో దొరుకుతుంది) – 4 టేబుల్ స్పూన్ల చొప్పున ►బాదం పాలు – 2 టేబుల్ స్పూన్లు ►పిస్తా పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా వాల్నట్స్ని మిక్సీ పట్టుకోవాలి. ►అందులో ఎండు అంజీరాలు, దాల్చిన చెక్క పొడి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని.. నెయ్యి కలిపి, పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం బీట్ రూట్ తురుము, కోకోనట్ చీజ్, బాదం పాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల మేపుల్ సిరప్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ►తర్వాత ఒక కేక్ ట్రేలో ముందు వాల్నట్ మిశ్రమాన్ని .. దానిపైన బీట్రూట్ మిశ్రమాన్ని పరచాలి ►కాస్త ఆరి, గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ►సర్వ్ చేసుకునే ముందు.. మిగిలిన కోకో పౌడర్, కొబ్బరి నూనె, మేపుల్ సిరప్ వేసుకుని బాగా కలిపి.. కోన్ మాదిరి కవర్లో చుట్టాలి. ►నచ్చిన డిజైన్‌లో కేక్ ముక్కలపై గార్నిష్ చేసుకుని.. వాటిపై పిస్తా పొడిని జల్లుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: Keema Ragi Ponganalu: కీమా – రాగి పొంగనాలు తయారు చేసుకోండిలా! Udupi Sambar: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్ తయారీ ఇలా -
పాపం బర్త్‌డే బాయ్...ఆ కేక్ ఏంటి మచ్చా! పగలబడి నవ్వండి!
సాక్షి, హైదరాబాద్: బర్తడేను సెలబ్రేట్ చేసుకోవడమంటే అందరికీ కాకపోయినా చాలామందికి సరదానే. అందులోనూ యూత్ అయితే ఇంకా ఇంట్రస్ట్ ఎక్కువ. ఇక స్నేహితులతో అయితే ఆ మజానే వారు. కేక్ కటింగ్‌లు, స్వీట్లు, సినిమాలు షికార్లతో ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక యువకుడి బర్తడేకి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసి..అరే ఏంటిరా ఇది అనుకుంటారు. ఆ కేక్ ఏంటి మచ్చా..పాపం రా అని కచ్చితంగా అంటారు. ఆ తరువాత పగలబడి నవ్వుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి మరి! Laughter dose 😂🤣😆. #hilarious #funny #bunny #funnymoments #humor #comedy #comic #fun #funnyvideos #laugh #funnymeme #hilariousvideos #enjoy #laughter #banter #joke #meme #Memes #stressbuster #stressrelief #MEMES #memesdaily #savetheplanet #memeslover @hvgoenka pic.twitter.com/ia1vkSn2Ce — Tarana Hussain (@hussain_tarana) November 15, 2022 -
లండన్‌లో నిరసనలు...కింగ్ చార్లెస్ ముఖంపై కేక్ విసిరి...
లండన్‌లో ఆయిల్ స్టాప్ అంటూ నిరసనలు వెలువెత్తాయి. ఈ నిరసనల నేపథ్యంలోనే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లోని కింగ్ చార్లెస్ 3 మైనపు విగ్రహాన్ని ఇద్దరు వాతావరణ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం లండన్ ప్రభుత్వం కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లు అనుమతివ్వడంపై పలు ప్రాంతాల్లో వాతావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఇద్దరు వాతావరణ కార్యకర్తలు తాము ధరించిన నల్లని చొక్కాలను తీసేసి ...జస్ట్ స్టాప్ ఆయిల్ అని రాసి ఉన్న టీ షర్ట్‌లను ధరించి కింగ్ చార్లెస్ మైనపు విగ్రహం ముంఖంపై చాక్లెట్ కేక్ విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతేగాదు ఆ నిరసకారులు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ....ప్రభుత్వం ఆదేశించిన అన్ని కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు దీంతో ఈ ఘటనపై స్పందించిన మెట్రోపాలిటన్ పోలీసులు నిరసకారులు నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇటీవల గత కొద్ది రోజులుగా లండన్‌లో పలు చోట్ల ఈ జస్ట్ స్టాప్ ఆయిల్ నిరసనలు అధికమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. 🎂 BREAKING: JUST STOP OIL CAKES THE KING 🎂 👑 Two supporters of Just Stop Oil have covered a Madame Tussauds waxwork model of King Charles III with chocolate cake, demanding that the Government halts all new oil and gas licences and consents.#FreeLouis #FreeJosh #A22Network pic.twitter.com/p0DJ8v3XVB — Just Stop Oil ⚖️💀🛢 (@JustStop_Oil) October 24, 2022 (చదవండి: అమెరికా వైట్‌హౌస్‌లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్) -
Interview Tip: ఆమె థింకింగ్ వేరె లెవల్.. జాబ్ కోసం ఇలా కూడా చేస్తారా?
ఒక పనిని ఒకే విధంగా చేయాలి అనే రూలేమీ లేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు తమ వినూత్న ఆలోచనతో పనిచేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చాలా స్మార్ట్‌గా ఆలోచించింది. అందులో భాగంగానే కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసి.. కంపెనీకి పంపించింది. ఆమె చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. నార్త్ కరోలీనాకు చెందిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్బర్న్ అనే మహిళ సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసింది. అనంతరం, ఆ కేక్‌ను ప్రముఖ సంస్థ ‘నైకీ’కి పంపించింది. ఈ సందర్భంగా ఆమె.. ఎందుకు ఇలా చేశానో సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కొన్ని వారాల క్రితం తాను కేక్‌పై రాసిన రెజ్యూమ్ని నైకీ కంపెనీకి పంపినట్లు పేర్కొంది. నైకీ కంపెనీ టీం ప్రస్తుతం ఎలాంటి పోస్ట్‌లకు రిక్రూట్ చేసుకోవడం లేదని తెలిపింది. అయితే, తన గురించి నైకీ కంపెనీలో ఉద్యోగం సాధించడమే తన టార్గెట్ అని పేర్కొంది. ఈ విషయం నైకీ టీంకి తెలియజేయడం కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఇలా చేసినట్టు చెప్పింది. అందుకే కేక్‌పై రెజ్యూమ్ ప్రింట్ చేసి పంపినట్లు వివరించింది. నైకీ కంపెనీ హెడ్ ఆఫీసులో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని తనను తాను సమర్ధించుకుంది. కాగా, ఆమె చేసిన కేక్ రెజ్యూమ్ ఆలోచన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొంతమంది ఆమె ఆలోచనను మెచ్చుకున్నారు. కంపెనీ యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు అద్భుతమైన కాన్సెప్ట్ అని అన్నారు. మరికొంత మంది మాత్రం ఆమె జిమ్మిక్స్ చేస్తుందంటూ కామెంట్స్ చేశారు. Did you like Karly's idea?https://t.co/tr4SAmwLD6 — IndiaToday (@IndiaToday) September 27, 2022 -
మీ కోసం తెచ్చిన కేక్ పక్కోడు కట్ చేస్తే?.. అచ్చం ఇలాగే ఉంటుంది కదూ!
మీ బర్త్‌డే కేక్ పక్కోడు కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ జరిగింది కూడా అదే. చిత్రంలోని హేలీ అనే ఆమె తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లింది. వేదిక మీద వెడ్డింగ్ కేక్ ఉంది. అదేంటి.. వధూవరులు కేక్ కట్ చేసి.. అతిథులకు ప్లేట్లల్లో ఇవ్వడం మరిచిపోయారనుకుని.. కత్తి తీసుకుని.. కేక్‌ను కట్ చేసింది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. ఆ కేక్ కటింగ్ వీడియోను హేలీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇది నా ఫ్రెండ్ పెళ్లి. వధూవరులకు నా క్షమాపణలు. నిజానికి వాళ్లు కట్ చేయడం మర్చిపోయారనుకుని నేను కట్ చేశాను’ అంటూ వివరణ ఇచ్చుకుంది. వైరల్ అవుతున్న వీడియోపై కొందరు నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తే మరికొందరు సీరియస్ అయ్యారు. పెళ్లి కూతురు మాత్రం ‘నేను క్షమించాను.. పెళ్లిలో ఎలా ఉండాలో మర్యాద కూడా నేర్పించాను’ అని కామెంట్ చేసింది. -
పోలీస్ వ్యాన్‌లో బర్త్ డే జరుపుకున్న ఖైదీ: వైరల్
థానే: ఒక ఖైదీ పోలీస్ వ్యాన్‌లో బర్త్ డే జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి. ఈ ఘటన మహారాష్ట్రలో థానే జిల్లాలో చోటుచేసుకుంది. రోషన్ ఝూ అనే 28 ఏళ్ల నిందితుడు ఒక కేసు విచారణ కోసం కోర్టు వెలుపల నిరీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అతను ఒక హత్య కేసులో నిందితుడు, గత నాలుగేళ్లుగా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మేరకు పోలీసు వ్యాన్‌లో ఉన్న సదరు నిందితుడు రోషన్‌కి అతని అనుచరులు బర్త్ డే కేక్‌ని వ్యాన్ విండ్ వద్ద నుంచి అందించారు. అతను చక్కగా కేక్ కట్ చేసి బర్త్ డే జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద దూమరం రేపింది. అయినా ఒక ఖైదీ పోలీసు వ్యాన్‌లో దర్జాగా వేడుకలు జరుపుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు వచ్చాయి. ఐతే జైలు సూపరింటెండెంట్ అధికారులు ఆ నిందితుడు కళ్యాణ్ అధర్వడి జైలులో ఖైదీగా ఉన్నాడని, కేసు విచారణ విషయమై అన్ని ప్రోటోకాల్స్‌ని అనుసరించే బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఆ నిందుతుడిని కోర్టులో హాజరుపర్చేందుకు ప్రత్యేక ఎస్కార్ట్ పోలీసు బృందం తీసుకువెళ్లిందని తెలిపారు. ఆ నిందితుడి కార్యకలాపాలపై ఆ బృందం గట్టి నిఘా ఉంచుతుందని చెప్పారు. ఇది అధికారులకు చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతో కావాలని చేసిన పనిగా అధికారులు పేర్కొన్నారు. పైగా ఆ నిందితుడిని తీసుకువెళ్లిన ఎస్కార్ట్ బృందాన్ని కూడా విచారిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అతనిపై వివిధ పోలీస్స్టేషన్లలో దాడి, హత్యాయత్నం, దోపిడి వంటి ఇతర కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అంతేగాక 2017లో ఒక కానిస్టేబుల్ పై కూడా దాడి చేశాడని చెబుతున్నారు. (చదవండి: అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు ) -
కొంపముంచిన డెలివరీ ఇన్స్ట్రక్షన్.. కేక్ చూసి షాక్ అయిన యువతి
స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు.. ఇందులో కొన్ని ఆర్డర్ తెచ్చే బాయ్‌కు సంబంధించి ఉంటే.. మరికొన్ని రెస్టారెంట్‌ను ఉద్దేశించి ఉంటాయి. ‘మసాలా తగ్గించండి’ లాంటివి. అయితే ఇవి ఒక్కోసారి తేడా కొడితే మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అలాంటి ఘటనలు తాజాగా మహారాష్ట్రలోని ముంబై, నాగపూర్‌లో చోటుచేసుకున్నాయి. ముంబైకి చెందిన వైష్ణవి ఇటీవల బర్త్‌డే కోసం ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అందులో వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని బాయ్‌కు డెలివరీ ఇన్స్ట్రక్షన్ పెట్టారు. తీరా కేక్ ఇంటికొచ్చిన కేక్‌ను చూసి ఆమె షాకయ్యారు. హ్యాపీ బర్త్‌డేకి బదులు.. కేక్‌పై సదరు బేకర్ రూ.500కి చిల్లర తీసుకురా అని రాశాడు. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు నవ్వు ఎమోజీలు పెడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. మరో ఘటనలో నాగ్‌పూర్‌కు చెందిన కపిల్ నగరంలోనే పేరొందిన బేకర్ నుంచి కేక్ ఆర్డర్ చేశారు. అందులో డెలివరీ ఇన్స్ట్రక్షన్ కింద.. ‘ఇందులో ఎగ్ ఉందన్న విషయాన్ని తెలియజేయండి’ అని పెట్టారు. ఆయన ఉద్దేశం డెలివరీ చేసినప్పుడు.. అది ఎగ్‌తో చేసిన కేక్ అని చెప్పడం కోసం ఈ బేకర్ డైరెక్టుగా కేక్ మీదే.. ఇది ఎగ్‌తో చేసినది అని రాశాడు. దాన్ని చూశాక నాకు నోట మాట రాలేదు అని కపిల్ తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. -
బతుకు చిత్రం: గృహిణులకు సరికొత్త ఉపాధి మార్గంగా కేక్ తయారీ
-
తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..!
Cutting this ‘onion’ won't make your eyes watery: ఉల్లిపాయలను కట్ చేయడం కూడా ఓ రకమైన స్టంట్ లెక్కే! ఎంతటి ఘరనా ధైర్యవంతులకైనా కంట్లో నీళ్లు ఇట్టే తెప్పించగలవు. ఆ ఘాటుకు ముక్కు ఛీదేసి.. కళ్లు నులుమేసి.. ఆ కాసేపట్లోనే సతమతంచేసేస్తుంది.. ఉల్లి. కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిగడ్డలుంటే ఎంతబాగుంటుందో.. అని అనుకోని వారు ఉండరేమో! ఐతే ఈ వీడియోలో కనిపించే ఉల్లిని కట్ చేస్తే మాత్రం కళ్లు చెమ్మగిల్లవట!! కంట్లో నీళ్లు తెప్పించని ఉల్లిపాయలా? ఆశ్చర్యంగా ఉందే.. ఎక్కడున్నాయ్! ఇదేనా మీ సందేహం. ఆ విశేషాలు మీకోసం.. గతనెల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఉల్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఏ రకమైన ఉల్లి అయ్యుంటుందనేది.. ప్రతి ఒక్కరి అనుమానం. విషయం తెలిశాక ముక్కుమీద వేలేసుకున్నారంత! చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. నిజానికి.. అచ్చం ఉల్లిలాగే కనిపించే, ఉల్లి రూపంలో తయారు చేసిన రియలిస్టిక్ కేక్ అది. దీనిని చూసిన నెటిజన్లు రియాక్షన్లయితే.. ‘అది నిజమైన ఉల్లికానప్పుడు దానికి ఉల్లి తొడుగు ఎందుకు తొడిగారు' అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, ఆనియన్ స్కిన్ కూడా నిజమైనది కాదనీ. వెనీలాతో తయారుచేసినదని.. దాన్ని భేషుగ్గా తినొచ్చని ఈ ఉల్లి కేక్‌ను తయారు చేసిన బేకర్ రిప్లై ఇచ్చాడు. ‘అబద్ధం చెప్పకండి.. పై పొర నిజమైనదే' అని ఒకరు ప్రశ్నిస్తే, ‘అద్భుతమైన స్కిల్.. మనసుకు హత్తుకునేలా ఉంద'ని మరొకరు ప్రశంశించారు. మరి మీరేమంటారు? చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!
World's oldest wedding cake: పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడుతుండటం చూస్తుంటాం.. కానీ, మానవుడు తయారు చేసిన తినుబండారం చెక్కుచెదరకుండా బయట పడటం ఇదే మొదటిసారి కావొచ్చు. అది కూడా రెండు రోజుల్లో కుళ్లిపోగల కేకు.. ఇన్నేళ్లుగా ఎలా చెడిపోలేదో ఆశ్యర్యపోతున్నారా! నిజం.. ఇంగ్లండ్‌లోని దహనమైపోయిన ఓ ఇంటిలో సుమారు 88 సంవత్సరాల క్రితం తయారు చేసిన కేకు ఒకటి బయటపడింది. ఆ కేకు రూపం మాత్రం చెక్కు చెదరలేదు. పైగా గార్నిషింగ్ కోసం వాడిన చాక్లెట్ చిప్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఓ కత్తి, నాలుగు చెంచాలు కూడా దొరికాయి. ఇదంతా చూస్తుంటే.. ఎవరి పుట్టినరోజో విషాదాంతంగా ముగిసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ కేకు ఎవరు తయారు చేశారో తెలియదు కానీ, ఆ ఇంటి యజమానిని జోహాన్ వార్మ్ అనే వ్యక్తిగా గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వందలాది ఇళ్లు మంటల్లో చిక్కుకుపోయాయి. ఈ ఇల్లు కూడా ఆ మంటల్లోనే చిక్కుకొని పూర్తిగా దహనమైపోయిందని అధికారులు తెలిపారు. పైగా ఈ కేకులో ఎటువంటి రసాయనాలను గుర్తించలేదని, ఇలా చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణం, త్వరలోనే కనుగొంటామని వారు చెప్పారు. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
భలే రుచులు.. బనానా రైస్ కేక్, డ్రైఫ్రూట్స్ బన్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఇంటి వంటలో ఉండే రుచి, ఆరోగ్యం మరి దేనిలోనూ దొరకదు. ఈ కింది స్పెషల్ రెసిపీలతో మీ కుంటుంబానికి కొత్త రుచులను పరిచయం చేయండి. బనానా రైస్ కేక్ కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు – పావు లీటర్ అరటిపండు గుజ్జు – అర కప్పు అన్నం – 2 కప్పులు పంచదార – 1 కప్పు నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్ బౌల్స్ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుని చల్లారనివ్వాలి. దానిపైన అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్క పొడివేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా.. డ్రైఫ్రూట్స్ బన్స్ కావలసిన పదార్థాలు మైదా పిండి – 500 గ్రా. ఉప్పు – అర టీ స్పూన్ పంచదార – 3 టేబుల్ స్పూన్లు బటర్ – 100 గ్రా. పాలు – 300 గ్రా. గుడ్డు – 1 ఈస్ట్ – 1 టేబుల్ స్పూన్ (పావు కప్పు వేడినీటిలో వేసి జ్యూస్‌లా చేసుకోవాలి) దాల్చిన చెక్కపొడి – కొద్దిగా నూనె – కొద్దిగా తయారీ విధానం ముందు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదారతో పాటు.. ఈస్ట్ జ్యూస్, 50 గ్రాముల బటర్, గుడ్డు, పాలు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా కలిపి చపాతీ ముద్దలా చేసుకుని, కొద్దిగా నూనె పూసి, 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అది పొంగుతుంది. అనంతరం మరో పది నిమిషాలు ముద్దను మరింతగా కలిపి.. కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ అప్పడాల కర్రతో పొడవుగా వెడల్పుగా ఒత్తుకుని దానిపైన మిగిలిన బటర్ రాసి.. 2 టేబుల్ స్పూన్ల పంచదార, దాల్చిన చెక్కపొడి ఒకదాని తర్వాత ఒకటి జల్లి.. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, బాదం ముక్కలు వంటివన్నీ మొత్తం జల్లి ఓ వైపు నుంచి చుట్టుకోవాలి. తర్వాత గుండ్రంగా కట్ చేసుకుని బేకింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. అనంతరం ఒక గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి.. బ్రష్‌తో బన్స్కి ఆ మిశ్రమాన్ని పూసి ఓవెన్లో బేక్ చేసుకోవాలి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
ఏంటీ....స్నేక్ కేక్ ఆ!
న్యూఢిల్లీ: కేక్‌లంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందరూ రకరకాల కేకులను ఆస్వాదిస్తుంటారు. అంతేందుకు పాకశాస్త్ర నిపుణులు కూడా తమ నైపుణ్యానంతా రంగరించి మరి సరొకొత్త కేకులను సృష్టించడం మనం చూశాం. అదేవిధంగా వారు వివిధ రకాల ప్లేవర్లతో మనకు రకరకాల కేక్‌లను అందిచారు. ఆ ఖరికి వెజ్ కేక్ అంటూ కూడా చాలా వైరైటీలను ఆస్వాదించాం కానీ. (చదవండి: విమానం నడిపిన 84 ఏళ్ల బామ్మ) స్నేక్ కేక్ గురించి ఎప్పుడైన వ్నిన్నారా ? బాబాయో ఏంటి ఇది అని అనుకోకండి. నటాలీ సైడ్‌సెర్ఫ్ అనే ప్రముఖ చెఫ్ రకరకా కేకులు తయారు చేయడంలో పేరుగాంచిని చెఫ్. ఆమె చేసే కేక్‌లన్ని చాలా వైరైటిగానూ రియలస్టిక్‌గా ఉంటాయి అంటారు. బార్బీ బ్మొలాంటివి, సీనరీస్, రకరకాల మొక్కల్లాంటి కేకులను మనం చూసి ఉంటాం. నిజంగా చూస్తే పాము అని అనింపించేలాంటి కేక్ తయారు చేసింది నటాలీ. పైగా దాన్ని చూస్తే ఎప్పుడూ అటాక్ చేద్దామ్మా అన్నంత కోపంగా చూస్తున్న నిజమైన 'పాము' లా ఉందే తప్ప కేక్‌లా లేదు. అంతేకాదు నటాలి వచ్చి ఆ స్నేక్ కేక్‌ని కట్ చేసేంత వరకు కూడా అది చూడంగానే వెన్నలో వణుకు పుట్టించేంత భయంకరమైన పసుపు రంగులో ఉన్న పాములానే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్ష్లల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అమ్మో...... 48 బీర్ గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకెళ్లాడు) View this post on Instagram A post shared by Sideserf Cake Studio (@sideserfcakes) -
కళ్లు చెదిరే వేడుక..ఇలా కూడా చేస్తారా?
ముంబై: ఎవరి పుట్టినరోజు వేడుక వారికే ప్రత్యేకం. ఎవరికి వారు ఇతరులకు భిన్నంగా తమ పుట్టినరోజు వేడుక జరుపుకోవాలని భావిస్తారు. అయితే కొందరు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో వైరలయి.. అందరిని ఆకట్టుకుంటాయి. ఈ కోవకు చెందిన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పుట్టిన రోజు నాడు మహా అయితే 1,2 కేకులు కట్ చేస్తాం. కానీ ఇక్కడ మీరు చూడబోయే వ్యక్తి మాత్రం ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. ముంబైకి చెందిన సౌర్య రాటూరి అనే యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. అవి కూడా వేర్వేరు సైజుల్లో.. షేపులు, ఫ్లేవర్స్ ఉన్న కేక్‌లు కట్ చేశాడు. ఈ కేకులన్నింటిని.. ఓ పెద్ద టేబుల్ మీద పెట్టి.. వరుసగా వాటన్నింటిని కట్ చేసుకుంటూ వెళ్లాడు. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు సౌర్య చుట్టూ చేరి అతడిని ఎంకరేజ్ చేయసాగారు. (చదవండి: బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు) ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు కొందరు ప్రశంసిస్తుండగా.. చాలా మంది మాత్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఇంత అట్టహాసం అవసరమా.. పుట్టిన రోజు అంటే ఏదైనా పనికి వచ్చే పని చేయాలి కానీ.. ఇలాంటి పనులు ఎందుకు అని విమర్శిస్తున్నారు. చదవండి: ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..! -
వైరల్: పెళ్లిలో అదనంగా తిన్నాడని బిల్ కట్టాలన్న కొత్త జంట
సాధారణంగా వివాహం అంటే అతిథుల రాక, భోజన మర్యాదలు, చివర్లో వారి ఆశీర్వాదాలు ఉండడం సహజమే. కొందరు అయితే తమ పెళ్లి పది కాలాలు గుర్తుండి పోవాలని ఖర్చుకు ఏ మాత్రం వెనకాడరు. ఇక పెళ్లంటే ప్రధానంగా భోజనాలు గురించే ఎక్కువగా మాట్లాడుతారు. అందుకే పెళ్లిలో వంటకాల విషయంలో ఏ మాత్రం రాజీపడరు. తాజాగా ఓ పెళ్లిలో మాత్రం కాస్త ఎక్కువగా తిన్నందుకు అతిథిని బిల్ కట్టాలన్నారు ఓ నవవధూవరులు. వినడానికి షాకింగ్‌గా ఉన్నా అది నిజమే.. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లాడు. అయితే అక్కడ వెడ్డింగ్ కేక్ ముక్కను అదనంగా తిన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత అతనికి ఆ జంట నుంచి చిన్న వీడియో క్లిప్ రాగా దాన్ని చూసిన సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. అందులో.. ‘మేము మా పెళ్లి వీడియో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాం. అందులో నువ్వు వెడ్డింగ్ కేక్ రెండు ముక్కలు తిన్నావు, నవ్వు అదనపు ముక్క తిన్నందుకు దానికి అయిన ఖర్చు 3.66 పౌండ్లు (రూ.366) పంపాలని అందులో రాసి పంపారు. కాగా, వెడ్డింగ్ కేక్ ఒక్క ముక్కే ఇవ్వనున్నట్లు అందుకు గెస్ట్‌లు పైసలు కూడా చెల్లించాలని ఆ జంట ముందుగానే పేర్కొంది. కాగా, తనకు ఎదురైన ఈ అనుభవాన్ని రెడ్డిట్తో పంచుకున్న ఆ వ్యక్తి, వధువు పంపిన ఈ మెసేజ్‌ను కూడా అందులో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోని చూసిన నెటిజన్లు దీనిపై మండిపడ్డారు. వెడ్డింగ్ కేక్ కోసం గెస్ట్‌ల నుంచి చార్జ్ చేస్తారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చైసామ్ విడాకులు.. ఏంటీ? ఏం జరిగింది? -
జోయ్ బర్త్‌డే.. ఈ కుక్కకి రోజు వచ్చిందోచ్ !
బషీరాబాద్: మనుషులు బర్త్‌డేలు చేసుకోవడం అందిరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఓ కుక్క బర్త్‌డే చేసుకుంది. అదేంటి కుక్క బర్త్‌డే చేసుకోవడమేంటని ఆశ్చర్యపోకండి. ప్రతీ కుక్కకి ఓ రోజు వస్తుందనే సామెత ఉందిగా.. అలా ఈ రోజు జోయ్ ది అన్నమాట. ఇటీవల నగరాల్లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు వారి ఇళ్లళ్లో పెంపుడు కుక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న ‘జోయ్’ అనే కుక్క సోమవారం తన రెండో పుట్టిన రోజును జరుపుకొంది. తన బర్త్‌డే సందర్భంగా కేక్‌కట్ చేసింది. ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇంట్లోనే. మూగజీవాలను అమితంగా ప్రేమించే సునీతారెడ్డి తన పెంపుడు కుక్కకు రెండో పుట్టిన రోజు సందర్భంగా ఇలా బర్త్‌డే చేశారు. ఇదండీ మ్యాటరు. ఆన్లైన్ తరగతులపై దృష్టి సారించాలి దోమ: విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని దోమ మండల విద్యాధికారి హరిశ్చందర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పలుగుతండా, కుమ్మరికుంటతండా, బుద్లాపూర్, హుస్సేన్ నాయక్ తండాలలోని పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలలలో విద్యార్థుల విద్యాబోధన గురించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను బోధించాలన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల పట్ల ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బుద్లాపూర్ సర్పంచ్ మారోనిబాయ్, పాండు నాయక్, సీఆర్పీ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వేలానికి 40 ఏళ్ల నాటి కేక్ ముక్క.. ధర ఏకంగా
లండన్: పురాతన కాలం నాటి వస్తువులు.. ముఖ్యంగా రాజులు, రాణలుకు సంబంధించిన వస్తువులు పట్ల చాలా మంది అమితాసక్తి కనబరుస్తుంటారు. ఈ తరహా వస్తువుల వేలం కోసం ఎదురు చూస్తుంటారు. వాటికి లక్షల్లో డబ్బులు చెల్లించి మరి సొంతం చేసుకుంటారు. వేలం పాటలో వస్తువులను సొంతం చేసుకుంటే పర్లేదు కానీ.. మరీ ఏళ్ల క్రితం నాటి ఆహారాన్ని తెచ్చుకుంటే ఏం లాభం ఉంటుంది. అటు తినలేం ఇటు పడేయలేం. వాసన రాకుండా జాగ్రత్తగా దాచుకోవాల్సిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 40 ఏళ్ల క్రితం నాటి ఓ కేకు ముక్క వేలానికి రాబోతుంది. అది కూడా బ్రిటన్ రాణి డయనా పెళ్లి నాటి కేకు కావడంతో చాలా మంది దీని వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ వివరాలు.. ప్రిన్సెస్ డయానా-ప్రిన్స్ చార్లెస్ వివాహ సందర్భంగా అనగా 1981 కాలంలో తయారు చేసిన కేక్ ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. వివాహం సందర్భంగా వచ్చిన 23 అధికారక పెళ్లి కేకుల్లోని ఓదాని ముక్కను త్వరలో వేలం వేయబోతున్నారు. దీనిపై జూలై 29, 1981 అని డేట్ రాసి ఉంది. ఇది మార్జిపాన్ బేస్, షుగర్ ఆన్‌లే కోట్-ఆఫ్-ఆర్మ్స్, పైన బంగారం, ఎరుపు, నీలం వెండి రంగులతో అలంకరించబడి ఉంది. ఈ కేక్ ముక్కను క్లారెన్స్ హౌస్‌లోని రాణి తల్లిగారి ఇంటి సభ్యురాలైన మొయిరా స్మిత్‌కు ఇవ్వబడింది. ఆమె దీన్ని ఓ పూల కేక్ టిన్‌లో భద్రపరిచింది. ఈ టిన్ మూత మీద చేతితో తయారు చేసిన లేబుల్ అంటించి ఉంది. దాని మీద ‘చాలా జాగ్రత్తగా పట్టుకొండి.. ఇది ప్రిన్స్ చార్లెస్-ప్రిన్సెస్ డయానాల వివాహ కేక్’ అని ఉంది. అలానే 24-07-81 అని డేట్ వేసి ఉంది. స్మిత్ కుటుంబ సభ్యులు 2008లో ఈ కేక్‌ను ఓ వ్యక్తికి అమ్మారు. ఆ తర్వాత ఆగస్టు, 2011న ఈ కేక్‌ను మరోసారి వేలం వేశారు. త్వరలో జరగబోయే వేలంలో ఈ కేక్ ముక్క 300-500 పౌండ్ల (31,027-51,712) ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ కేక్ ముక్క వేలం పాట సదర్భంగా సర్వీస్ ఆర్డర్, వేడుక వివరాలు, ఒక రాయల్ వెడ్డింగ్ అల్పాహార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోమినిక్ వింటర్ ఔక్షనీర్స్ సీనియర్ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘వాస్తవంగా ఈ కేక్ ముక్కను అమ్మినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉంది. అయితే పొరపాటున కూడా దీన్ని తినకూడదు అని హెచ్చరిస్తున్నాం’’ అని తెలిపారు. -
బైక్‌ను వెంబడించిన చిరుత; కేక్‌తో ప్రాణాలు కాపాడుకున్నారు
భోపాల్: తమను వెంబడిస్తున్న చిరుతపులిపై బర్త్‌డే కేక్‌ను విసిరి ఇద్దరు సోదరులు వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఫిరోజ్, సబీర్ మన్సూరీ ఇద్దరు అన్నదమ్ములు. కాగా గురువారం ఫిరోజ్ తన కుమారుడు పుట్టినరోజు కావడంతో కేక్ కొనుగోలు చేసేందుకు అతని సోదరుడు సబీర్ మన్సూరితో కలిసి బైక్‌పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. కేక్ కొనుగోలు చేసి తిరిగి గ్రామానికి వస్తుండగా దారి మధ్యలో ఉన్న చెరుకుతోట వద్ద ఒక చిరుతపులి వీరి బైక్‌ను వెంబడించింది. భయంతో వారిద్దరు తమ బైక్‌ను వేగంగా పోనిచ్చినప్పటికి చిరుత పులి వేగంగా వారిని సమీపించింది. బైక్‌పై వెనుకాల కూర్చున్న సబీర్ ఏం చేయాలో తెలియక తన చేతొలో ఉన్న కేక్‌బాక్స్‌ను చిరుత మీదకు విసిరాడు. అయితే అది ఏదైనా మారణాయుధం అని భావించిన చిరుత పులి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. అప్పటివరకు ప్రాణభయంతో పరుగులు పెట్టిన వారిద్దరు బతుకుజీవుడా అంటూ గ్రామానికి చేరుకున్నారు. ఊర్లోకి వెళ్లిన తర్వాత గ్రామస్థులకు విషయం చెప్పడంతో స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఫిరోజ్ అందించిన సమాచారం మేరకు చిరుత పులి వారి బైక్‌ను దాదాపు 500 మీటర్ల దూరం వెంబడించిందని అధికారులు తెలిపారు. తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం తమ చేతిలో ఉన్న కేక్‌బాక్స్‌ను విసిరేసి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు..
వాషింగ్టన్: పిదపకాలం పిదప బుద్ధులు అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు నేటి పిల్లలు. తమకు కావాల్సిన దాని కోసం ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు. ట్రెండ్‌ను ఫాలో కాకుండా.. సెట్ చేయటంలో ఆరితేరారు. అమెరికాకు చెందిన లియోనా కూడా అంతే! తన బర్త్‌డే కేకును మొత్తంగా దక్కించుకోవటానికి అద్భుతమైన ప్లాన్ వేసింది. సోషల్ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది. వివరాలు.. అమెరికా, మిన్నిసోటాలోని సేయింట్ పాల్‌కు చెందిన లియోనా ఫేయ్ అనే చిన్నారి.. కొద్ది రోజుల క్రితం మూడవ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. తన బర్త్‌డేకు ఎలాంటి కేకు కావాలో కూడా తనే చెప్పింది. వాల్ట్ డిస్నీ సంస్థ రూపొందించిన ప్రముఖ చిత్రం ‘లయన్ కింగ్’ సినిమాలోని ముఫాసా మరణ సన్నివేశాన్ని కేక్‌గా తయారు చేయించింది. సినిమా చూసిన వారికి ఆ సన్నివేశం కళ్లకు కడుతుంది. చిన్నారి ఆ కేకును ఎందుకలా తయారు చేయించమని చెప్పిందో పాప మేనమామ వివరిస్తూ.. ‘‘ మా మేనకోడలు మూడవ పడిలోకి అడుగుపెట్టింది. లయన్ కింగ్ కేకు తయారు చేయించమని తను అడిగింది.. ఎందుకంటే! దాన్ని చూసిన వారు విషాదం కారణంగా తినటానికి ఇష్టపడరు. దీంతో మొత్తం లియోనా తినేయాలని ప్లాన్’’ అని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ కేకుపై ఆమె తల్లి ఎలిసన్ మాట్లాడుతూ.. ‘‘ లయన్ కింగ్ కేకు తయారు చేయించటానికి నిజంగా చాలా ఇబ్బంది పడ్డా. బేకరీ వాళ్లు నన్ను ఓ భయంకరమైన తల్లి అనుకుంటారేమోనని’’ అని చెప్పింది. కేకు తయారు చేసిన బేకరీ వాళ్లు కూడా పిల్ల వింత ప్రవర్తనకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : 2 మిలియన్ల వ్యూస్: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న యువతి -
అమెజాన్ పార్సిల్ అనుకుంటున్నారా.. కాదండోయ్!
పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్ వేడుకలు... ఇలా శుభకార్యం ఏదైనా కేక్ ఉండాల్సిందే. కేక్ కటింగ్ చేస్తేనే స్పెషల్ డేగా ఫీల్ అవుతాం. మరి కేక్‌కు ఇంతలా డిమాండ్ పెరుగుతండటంతో తయారీదారులు(బేకర్స్) కూడా విభిన్న రూపాల్లో డిజైన్ చేస్తున్నారు. మనకు నచ్చే విధంగా కొత్త కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు. ఇటీవలే హాస్పిటల్ బెడ్‌పై నవ్వుతున్న ఓ పేషెంట్లా తయారు చేసిన కేకు ఒకటి ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వినూత్న కేక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది సాధారణమైన కేక్ కాదండోయ్.. అమెజాన్ పార్సిల్ రూపంలో ఉన్న కేక్. అవును మీరు విన్నది నిజమే. అచ్చం అమెజాన్ నుంచి వచ్చే ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేక్‌ను డిజైన్ చేశారు. అయితే దీనిని ఓ కేకు తయారీ సంస్థ డిజైన్ చేసింది. యాజమాని కొడుకు పుట్టినరోజు కోసం ఈ కేక్ తయారు చేశారు. ఇక దీనిని ట్వీటర్లో పోస్టు చేయడంతో అమెజాన్ పార్సిల్ కేక్ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీన్నిచూసిన నెటిజన్లు నిజంగానే అమెజాన్ పార్సిల్ అనుకుంటున్నారు. కానీ అది కేక్ అని చెప్పడంతో సందేహించి మరింత పరీక్షించి చూస్తున్నారు. ఈ తర్వాత కేక్ అని క్లారిటీ రావడంతో సర్ప్రైజ్ అవుతున్నారు. అంతేగాక అనేకమంది నెటిజన్లు ఈ కేక్‌పై మీమ్స్ సృష్టిస్తున్నారు. మరి ఇతంలా వైరలవుతున్న దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి Yn dilyn my mhost ddoe, teisan bocs Amazon, dyma'r prawf i ddangos mai teisen ydyw. 😊 Following my post yesterday, Amazon box cake, here's the proof that it is actually cake! 😊#Anglesey #Amazon #cake #cakes pic.twitter.com/RZ5HbcQ7T1 — Nina's Cake Cabin (@angleseycakeart) February 3, 2021 Omds not this shit again wtf pic.twitter.com/b1fsQihngf — ً (@rxmchls) February 18, 2021 Omds not this shit again wtf pic.twitter.com/b1fsQihngf — ً (@rxmchls) February 18, 2021 Imagine seeing this outside your door and picking it up to put under your arm pic.twitter.com/ghiaiGMqn7 — KSB 👨🏾🚒 (@kfRedhot) February 19, 2021 -
ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..!
లండన్: ప్రస్తుత కాలంలో మార్కెట్లో మనకు భిన్న రకాలైన కేకులు అందుబాటులోకి వస్తున్నాయి. మనకు ఎలా కావాంటే ఆ రూపంలో కేకులను తయారు చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఆడ వస్తువులు, మనం ధరించే దుస్తులు, చెప్పుల నుంచి ఆఖరికి వంటింట్లో వాడే కూరగాయల వరకూ ఇలా విభిన్నమైన కేకులు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో మరి వింతగా పెంపుడు జంతువుల రూపంలో కూడా కేకుల వీడియోలు, సామాజిక మాధ్యమాల్లో తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ హాస్పిటల్ బెడ్‌పై నవ్వుతున్న ఓ వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి బెడ్‌పై ఒరిగి ఉండగా.. అతడి బెడ్ పక్క టెబుల్‌పై మందులు, క్యాండిల్‌తో పాటు పక్కనే ఓ మహిళ చేతితో కేకు పట్టుకుని అతడికి తినిపించేందుకు రేడీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆశ్చర్యంగా ఆ వ్యక్తి కాళ్లు, చేతులు, ముక్కులు ముక్కలుగా కట్ చేసి ఉన్నప్పటికి ఆ వ్యక్తి నవ్వుతూనే కనిపిస్తున్నాడు. దీంతో అదేంటి ఈ వ్యక్తి అలా ఎలా నవ్వుతున్నాడంటు పరీక్షించి చూడగా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తి నిజమైన వ్యక్తి కాదు. బ్రిటిష్‌కు చెందిన ఓ కేకుల తయారి నిపుణుడు బెన్ కూల్లేన్ వినూత్న ఆలోచన ఇది. ‘ది బేక్ కింగ్’ గా పిలిచే బెన్ వివిధ రూపంలో కేకు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఈ క్రమంలో అతడు మరింత భిన్నంగా ఆలోచించి ఏకంగా మనిషి రూపంలో హైపర్ రియలిస్టిక్ కేక్ తయారు చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిజంగా మనిషిలా కనిపిస్తున్న ఈ కేకు మనిషిని చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బెడ్ పడుకున్న వ్యక్తి రూపంలో కేకు తయారు చేసిన అతడి సృష్టికి అవాక్కవుతూ కొంతమంది ప్రశంసిస్తూంటే.. ఇలా హాస్పిటల్ బెడ్‌పై పెషెంట్ వ్యక్తి రూపంలో కేకు తయారు చేయడమెంటో విడ్డూరం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: జాత్యహాంకార వ్యాఖ్యలు: రాజీనామా..) (గాల్లో ఎగిరే దోశలు.. వీడియో వైరల్) -
కొత్త ఏడాదికి కేక్లెట్లతో స్వాగతం పలుకుదాం..
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం.. కొత్త నిర్ణయాలు.. కొత్త ఆలోచనలు.. కొత్త వంటలు... కొత్త కొత్త రుచులు... కేకులు... చాకొలేట్లు మామూలే. ఈసారి కొత్తగా కేక్లెట్లు చేద్దామా... కొత్త వంటేమీ కాదు... సరదాగా కొత్త పిలుపు... అంతే... కొత్త కేకులు చేసి పాత స్నేహితులకు పంచుదాం... కొత్త సంవత్సరానికి కేక్లెట్లతో స్వాగతం పలుకుదాం... చాకొలేట్ బర్ఫీ కావలసినవి: పాలు – ఒకటిన్నర లీటర్లు; పంచదార – ఒక కప్పు; పటిక లేదా నిమ్మ రసం – కొద్దిగా; కోకో పొడి – అర కప్పు; జీడి పప్పు తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; తయారీ: స్టౌ మీద ఒక పాత్రలో ఒకటిన్నర లీటర్ల పాలు, ఒక కప్పు పంచదార వేసి బాగా కలపాలి ∙పాలు సగం అయ్యాక కొద్దిగా పటిక/నిమ్మ రసం జత చేయాలి పాలు బాగా చిక్కబడి ముద్దలా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి (చిక్కబడటానికి సుమారు అరగంట సమయం పడుతుంది) పావు కప్పు కోకో పొడి, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు జత చేసి, మంట పెంచి, ఆపకుండా బాగా కలియబెట్టాలి ∙మిశ్రమం బాగా దగ్గర పడ్డాక దింపేయాలి అల్యూమినియం ప్లేటుకి నెయ్యి పూసి, తయారైన చాకొలేట్ మిశ్రమాన్ని అంగుళం మందంలో సమానంగా పరిచి, అప్పడాల కర్రతో జాగ్రత్తగా ఒత్తి, చాకుతో కట్ చేయాలి ∙జీడిపప్పు, బాదం తరుగులతో అలంకరించి, అందించాలి. బ్లాక్ ఫారెస్ట్ కేక్ కావలసినవి: డార్క్ చాకొలేట్ – పావు కప్పు; బటర్ – 100 గ్రా. (అరకప్పు కంటె తక్కువ + ఒక టేబుల్ స్పూను); పంచదార – 200 గ్రా. కోడి గుడ్లు – 3; మైదా పిండి – 150 గ్రా. బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూను కోకో పౌడర్ – పావు కప్పు; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; ఇన్స్టంట్ కాఫీ పొడి – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను; సిరప్ కోసం... నీళ్లు – పావు లీటరు; పంచదార – 200 గ్రా.; దాల్చిన చెక్క – చిన్న ముక్క; క్రీమ్ – 400 గ్రా. తయారీ: స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఒక చిన్న పాత్రలో డార్క్ చాకొలేట్ వేసి, ఆ నీళ్ల మీద ఉంచి కరిగించాలి ∙ఒక పాత్రలో బటర్, పంచదార వేసి కరిగే వరకు బ్లెండర్తో బాగా గిలకొట్టాలి ∙కోడి గుడ్డు సొనలు జత చేస్తూ మరోమారు గిలకొట్టాలి ∙కరిగించిన చాకొలేట్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙బేకింగ్ పౌడర్, కోకో పొడి జల్లెడలో వేసి జల్లించాలి ∙వెనిలా ఎసెన్స్, ఇన్స్టంట్ కాఫీ పొడి జత చేసి, మరోమారు కలపాలి (కట్ అండ్ ఫోల్డ్ అంటే ఒకే వైపుగా కలపాలి, రెండో వైపు నుంచి కలపకూడదు) 180 డిగ్రీల దగ్గర అవెన్‌ను సుమారు పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి ∙వెడల్పుగా లోతుగా ఉన్న కేక్ మౌల్డ్‌కు బటర్ పూసి, దానిలోనే చాకొలేట్ మిశ్రమాన్ని సమానంగా పరిచి, ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఉంచాలి (కుకర్‌లో అయితే, కుకర్ గ్యాస్ కట్, విజిల్ తీసేసి, లోపల స్టాండ్ పెట్టి, మూత పెట్టి, హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు వేడి చేసి, అప్పుడు కేక్ మౌల్డ్ పెట్టి, మూత పెట్టి 40 నిమిషాలు సన్నటి మంట మీద బేక్ చేయాలి. పంచదార సిరప్ తయారీ ∙స్టౌ మీద ఒక పాత్రలో నీళ్లు పోసి, దాల్చిన చెక్క చిన్న ముక్క, 200 గ్రా. పంచదార జత చేసి మరిగించి, దింపాలి ∙ఒక పాత్రలో క్రీమ్ వేసి, క్రీమ్ బాగా గట్టిగా అయ్యేవరకు ఆపకుండా స్పీడ్‌గా గిలకొట్టాలి ∙బేక్ చేసుకున్న కేక్ పూర్తిగా చల్లారాక, పైన ఉన్న పొరను తీసేసి, ఒక ప్లేటులోకి బోర్లించి, అర అంగుళం మందంలో రెండు పొరలుగా కట్ చేయాలి ∙కేకు కింది భాగాన్ని ప్లేట్లో ఉంచి, దాని మీద పంచదార సిరప్, ఆ తరవాత క్రీం వేసి సమానంగా పరవాలి మొదటి పొరను అంటే కేక్ మీద ఉన్న లేయర్‌ను పెట్టి, దాని మీద పంచదార సిరప్, క్రీమ్ వేసి సమానంగా పరవాలి ∙మధ్య పొరను కూడా ఉంచి ఇదేవిధంగా చేయాలి ∙కేకు మీద కొద్దిగా డార్క్ చాకొలేట్‌ను తురుముకుని, పక్కల వరకు వెళ్లేలా పరచుకోవాలి ∙కేక్ మీద, పక్కల... నచ్చిన ఆకారంలో డిజైన్ చేసుకోవాలి ∙ఇలా కేకు పూర్తిగా తయారైన తరవాత ఫ్రిజ్‌లో ఉంచి, గంట తరవాత బయటకు తీసి, ముక్కలుగా చేసి, అందించాలి. ఎగ్‌లెస్ చాకొలేట్ నట్స్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు; కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కోకో పొడి – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; జీడిపప్పు తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బ్లూ బెర్రీలు – 2 టేబుల్ స్పూన్లు (ఎండబెట్టినవి); కిస్మిస్ – టేబుల్ స్పూను; ఖర్జూరం తరుగు – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటిన్నర కప్పులు. తయారీ: ∙ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, సన్నని మంట మీద ఉంచాలి ∙ బేకింగ్ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి ∙ మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు గిలకొట్టాలి (ఎంత ఎక్కువ సేపు గిలకొడితే అంత రుచిగా వస్తుంది) ∙ ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి ఏడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి (బటర్ బదులు బటర్ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు) ∙ ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారైనదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లి అందించాలి. రవ్వ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; మైదా పిండి – అర కప్పు; పంచదార పొడి – ముప్పావు కప్పు; తాజా పెరుగు – అర కప్పు; వేడి పాలు – ఒక కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; ఏలకులు – 4; బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో ముందుగా పెరుగు వేసి గిలకొట్టాలి ∙పంచదార పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙నెయ్యి, మైదా పిండి, ఒకదాని తరవాత ఒకటి వేసి కలియబెట్టాలి ∙బొంబాయి రవ్వ వేసి మరోమారు కలపాలి ∙చివరగా పాలు జత చేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి ∙మూత పెట్టి అరగంటసేపు వదిలేయాలి ∙స్టౌ మీద కుకర్‌లో ఉప్పు వేసి దాని మీద స్టాండ్ ఉంచాలి ∙విజిల్ లేకుండా మూత ఉంచి కుకర్‌ను వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి ఏలకుల పొడి, బేకింగ్ పౌడర్, కొద్దిగా పాలు జత చేసి కలియబెట్టి, మౌల్డ్‌లో సమానంగా పోయాలి ∙ప్రీ హీట్ చేసిన కుకర్‌లో ఈ పాత్రను జాగ్రత్తగా ఉంచి మూత పెట్టి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, సుమారు అర గంటసేపు ఉంచాలి (పుల్లతో గుచ్చితే అంటుకోకపోతే కేక్ సిద్ధమైనట్లే) ∙గిన్నె బయటకు తీసి, కొద్దిగా చల్లారాక కేక్‌ను జాగ్రత్తగా బయటకు తీసి, నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఎగ్‌లెస్ మిల్క్ కేక్ కావలసినవి: మైదా పిండి – ముప్పావు కప్పు; కరిగించిన వెన్న – ముప్పావు కప్పు; నీళ్లు – ముప్పావు కప్పు; పాల పొడి – పావు కప్పు; బేకింగ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – ముప్పావు కప్పు; మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ – పావు కప్పు తయారీ: ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి పంచదార కరిగే వరకు బాగా కలపాలి ∙పాల పొడి జత చేసి ఉండలు లేకుండా కలపాలి ∙కరిగించిన వెన్న జత చేసి క్రీమ్‌లా అయ్యే వరకు బాగా కలపాలి ∙జల్లెడ పట్టిన మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని జత చేసి బాగా కలియబెట్టాలి (ఒకే దిశలో కలపాలి, రెండో వైపుకి కలిపితే కేక్ గట్టిగా వస్తుంది) ∙కేక్ టిన్‌లో బటర్ పేపర్ వేసి దాని మీద పిండి పోయాలి (ఆలస్యం చేయకూడదు) ∙డ్రైఫ్రూట్స్‌కి మైదా పిండి జత చేసి, కేక్ మీద సమానంగా పరవాలి ∙ప్రీహీట్ చేసిన అవెన్‌లో 180 డిగ్రీల దగ్గర 25 నిమిషాలు పాటు కేక్‌ను బేక్ చేయాలి ∙కొద్దిగా చల్లారాక టిన్‌లో నుంచి బయటకు తీసి, కట్ చేసుకోవాలి. వెనిలా కప్ కేక్స్ కావలసినవి: ఉప్పు – 2 కప్పులు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; మైదా పిండి – కప్పు; సోడా – అర కప్పు (క్లబ్ సోడా); చెర్రీస్ – 20. తయారీ: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ∙ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి ∙సోడా (క్లబ్ సోడా వంటివి) వేసి బాగా కలపాలి ∙కప్ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి (విజిల్ పెట్టకూడదు) సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి చల్లారాక బయటకు తీసి అందించాలి. ఎగ్‌లెస్ ఫ్రెష్ ఫ్రూట్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; తాజా క్రీమ్ – పావు కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కస్టర్డ్ పౌడర్ – టీ స్పూను; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; ఉప్పు – 2 కప్పులు; చిలకరించిన క్రీమ్ – 500 గ్రా.; పంచదార పొడి – పావు కప్పు; పంచదార సిరప్ – పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు – (కివి, కమలాపండు తొనలు, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు....)– ఒక కప్పు; స్ట్రాబెర్రీ వేఫర్స్ – తగినన్ని. తయారీ: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ ఉంచి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలపాలి ∙కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలకొట్టాక, పావు కప్పు క్రీమ్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙మైదా పిండి, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్... వీటిని జల్లెడ పట్టి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి ∙ఏడు అంగుళాల అల్యూమినియం కేక్ ట్రే కి బటర్ పూసి, కేక్ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్ చేసి కేక్‌ను బయటకు తీయాలి 500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలకొట్టాలి ∙పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలకొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి) ∙కేక్‌ను ఒక ప్లేట్లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్ చేయాలి ∙చాకుతో కేక్ చుట్టూ క్రీమ్ అప్లయ్ చేయాలి ∙పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార సిరప్ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి ∙పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి ∙ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అర గంట సేపు ఉంచి తీయాలి ∙చివరగా మళ్లీ కేక్ మీద క్రీమ్ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా స్ట్రాబెర్రీ వేఫర్లు అలంకరించి సుమారు నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచి, తీసి అందించాలి. బ్లూ బెర్రీ రసగుల్లా చీజ్ కేక్ కావలసినవి: బిస్కెట్లు – 125 గ్రా.; కరిగించిన బటర్ – 75 మి.లీ.; క్రీమ్ చీజ్ – 200 గ్రా.; పంచదార పొడి – 1/3 కప్పు; క్రీమ్ – 300 మి.లీ. (బాగా గిలకొట్టాలి); కండెన్స్డ్ మిల్క్ – 200 మి.లీ.; చైనా గ్రాస్ – 10 గ్రా.; బ్లూ బెర్రీలు – 3 టేబుల్ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు – 3 టేబుల్ స్పూన్లు; చిన్న రసగుల్లాలు – 30. తయారీ: •బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్లో నెమ్మదిగా వేస్తూ కలపాలి (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది) •ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి •1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి •ఒక పాత్రలో క్రీమ్ వేసి బాగా గిలకొట్టాలి •మరో పాత్రలో క్రీమ్ చీజ్, పంచదార పొడి వేసి గిలకొట్టాలి •సన్నని మంట మీద పాన్ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి •పాన్‌లో కండెన్స్డ్ మిల్క్, గోరు వెచ్చని నీళ్లు జత చేయాలి •ఉడికించిన చైనా గ్రాస్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి •ఈ మిశ్రమాన్ని క్రీమ్ చీజ్ మిక్స్‌కి జత చేసి బాగా గిలకొట్టాలి •బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి •(బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు) •గిలకొట్టిన క్రీమ్, రసగుల్లాలను వేయాలి •కేక్ టిన్‌లో చీజ్ కేక్ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి •కేక్‌ను టిన్ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి. -
వైరల్: యువతి తలను కోసుకుని తినొచ్చు!!
మనల్ని ఆశ్చర్యపరిచే సరికొత్త వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరలవటం పరిపాటిగా మారింది. వాటిలో కొన్ని ఎంటర్టైన్ చేసేవి అయితే మరికొన్ని మనల్ని ఎడ్యుకేట్ చేసేవి. తాజాగా ఓ కేకుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అచ్చం తన తల ఆకారంలో కేకును తయారు చేసిందో యువతి. యువతి తలను, కేకు పక్కన పెడితే తేడా తెలియనంతగా చక్కగా రూపొందించింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ‘ సైడ్ సర్ఫ్ కేక్స్’లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ‘నేను తయారు చేసిన కేకుల్లో ప్రత్యేకమైనది’ అనే శీర్షికను జోడించింది. (2 వేల ఏళ్ల నాటి శవాలు: లావాలో..) ప్రస్తుతం ఈ వీడియో 7 లక్షలకు పైగా వ్యూస్, 90 వేలకు పైగా లైక్స్, వందల సంఖ్యలో కామెంట్లతో దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నేను మొదటిసారి చూసినపుడు మేకప్ ఏమో అనుకున్నాను... నేను ఆ వీడియో చూస్తున్న కొద్దీ ఆశ్చర్యపోతూనే ఉన్నా... ఆగండి! ఇదేమి మంత్రం... ఈ యువతి తలను కోసుకుని తినొచ్చు!!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
భార్య పుట్టినరోజున కోహ్లి ఏంచేశాడంటే..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఆఫ్ ఫీల్డ్ నైపుణ్యాలను బాగా పెంచుకుంటున్నారు. అంతటితో ఆగక ఆ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే తాజాగా మయాంక్ అగర్వాల్‌తో సరదాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ పుట్టిన రోజున భార్య కోసం తానే కేక్ తయారు చేసినట్లు కోహ్లి వెల్లడించారు. అయితే కేక్ తయారుచేయడం తన జీవితంలో మొదటి ప్రయత్నం అని.. అయితే ఆ ప్రయత్నం ఫలించి కేక్ మంచిగానే వచ్చినట్లు తెలిపారు. అనుష్క శర్మ నుంచి కూడా కేక్ బాగుంది. ఈ కేక్ నాకు చాలా ప్రత్యేకమైనది' అనే కాంప్లిమెంట్స్ వచ్చినట్లు విరాట్ కోహ్లి మయాంక్ అగర్వాల్‌తో అన్నారు. (అలా ఆ సమస్యను అధిగమించా: కోహ్లి) From baking for his special someone in the lockdown to revealing the best smoothie makers in the team, @imVkohli answers it all on #OpenNetsWithMayank. Part 2 of the show coming up soon on https://t.co/Z3MPyesSeZ. Stay tuned 😊😊@mayankcricket pic.twitter.com/IuvdfOST0Y — BCCI (@BCCI) July 26, 2020 కాగా.. టీమిండియా క్రికెటర్లలో ఉత్తమ ప్రొటీన్ షేక్‌లను తయారుచేసే వారి గురించి మయాంక్ అడిగినపుడు.. విరాట్ సమాధానంగా మయాంక్ అగర్వాల్, నవదీప్ షైనీ, తన పేరు చెప్పాడు. ఆ వెంటనే మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు. మొదటి మిమ్మల్ని, తర్వాత నవదీప్ షైనీని, ఆ తర్వాత నాకు నేను రేటింగ్ ఇచ్చుకుంటాను' అంటూ కోహ్లి సమాధానమిచ్చారు. అయితే లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్ ఫిట్నెస్ను కాపాడుకోవడంతోపాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు. ఇక 2020లో ఐపీఎల్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుండటంతో.. ఈ సీజన్లో అయినా రాయల్ ఛాలెంజర్స్ జట్టును విజేతగా నిలపాలనుకుంటున్నాడు. గత 12 సీజన్లలోనూ బెంగళూరు జట్టుకు నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. (ముగింపు బాగుండాల్సింది: అనిల్ కుంబ్లే) -
క్యారెట్ కేక్ చేసిన జాన్వీ
-
నాన్నకు ప్రేమతో!
సినిమా షూటింగ్స్‌తో వాళ్ల పుట్టినరోజులు జరుపుకోవడానికే కొన్నిసార్లు కుదరదు స్టార్స్‌కి. అయితే లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి రావడంతో ఫ్యామిలీతో కావాల్సినంత క్వాలిటీ టైమ్ గడుపుతున్నారు. శనివారం పూజా హెగ్డే తండ్రి పుట్టినరోజు. నాన్నకు ప్రేమతో ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. ఇటీవలే వంట చేయడం, కేక్ చేయడం నేర్చుకున్నారు పూజ. దాంతో తన తండ్రి కోసం ఎంతో ప్రేమగా కేక్ తయారు చేశారు. ‘‘మా నాన్న కోసం చేశాను. ఆయన్ను సర్ప్రైజ్ చేయబోతున్నాను’’ అని తయారు చేసిన కేక్ ఫోటోలను షేర్ చేశారామె. -
’బర్త్‌డే కేక్’ కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, సిద్దిపేట: నాలుగు నెలల క్రితం సిద్ధిపేట జిల్లాలో బర్త్‌డే కేక్ తిని ప్రాణాలు కోల్పోయిన తండ్రీకొడుకుల కేసులో మిస్టరీ వీడింది. పాపమంతా కేకు తయారు చేసిన బేకరీ యజమానిదేనని తేలింది. కాలం చెల్లిన రసాయనాలతో కేకు తయారు చేయటం వల్లే తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ పరీక్షలతో తేలింది. ఆస్తి తగాదాల కారణంగా బాబాయే కేకులో విషంపెట్టి చంపాడన్న ఆరోపణలు వాస్తవం కాదని తేలింది. (‘కేక్’ బాధితుల ఇంట మరో విషాదం) ఐనాపూర్ ఘటనతో ఆందోళన.. సిద్దిపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఇస్తారిగల్ల రవీందర్, అతని కుమారుడు రాంచరణ్ 2019 సెప్టెంబర్ 4వ తేదీన కేక్ తినడం వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కొమురవెల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేక్ నమూనాలను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో అందులో ఎలాంటి విష ప్రయోగం జరగలేదని.. కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలు, రసాయానాలు వాడి ఎలాంటి శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసిన కేక్ తినడంతో వారిలో ఫంగస్, ఇన్ఫెక్షన్ సోకి శరీరంలో విష పదార్థంగా మారడంతో వారు చనిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో సిద్దిపేటలోని బేకరీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన జిల్లా వాసులు జిల్లాలోని పలు హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీల్లో కల్తీ పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారని, కాలం చెల్లిన తర్వాత కూడా విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. (కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త!) శాంపిల్స్తోనే సరి.. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్లో ఇడ్లీలో బొద్దింక వచ్చిందని వినియోగదారుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు ఆ హోటల్‌ను సీజ్ చేశారు. కానీ మరుసటి రోజు నామమమాత్రం జరిమానాతో సరిపెట్టడంతో హోటల్ నిర్వాహకులు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని హోటళ్లలో రాత్రి మిగిలిపోయిన మాంసం, ఇతర తినుబండారాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, మరుసటి రోజు మసాలాలు, పుడ్ కలర్స్, ఇతర రసాయానాలను వాడి గుర్తు పట్టలేకుండా ఘుమఘమలాడిస్తూ వినియోగదారులకు వడ్డిస్తున్నారు. వీటిని అడఫా దడఫా ఆహార భద్రతా అధికారి తనిఖీలు చేస్తున్నప్పటికీ శాంపిల్స్ సేకరణతోనే సరిపెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. (కల్తీ కేకులు.. 8 బేకరీలకు నోటీసులు) 197 శాంపిల్స్.. 27 కేసులు నమోదు.. జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌సెంటర్లు, బిర్యానీసెంటర్లు, పాల విక్రయకేంద్రాలు, సూపర్మార్కెట్లు, రోడ్డు పక్కన ఆహర పదార్థాలను విక్రమయించే బండ్లు, పండ్ల విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 2017 నుంచి 2019 డిసెంబర్ వరకు 179 ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆహార పదార్థాల విషయంలో కల్తీ జరిగిందని ఫలితాలు వచ్చిన రిపోర్టుల ఆధారంగా 27 కేసులు నమోదు చేశారు. ఇందులో 17 కేసుల్లో నిర్వాహకులకు రూ. 3,55,000 జరిమానా విధించారని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లా ఆహార భద్రతా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జిల్లాలో సక్రమంగా ఉండకపోవడంతోపాటు, ఎవ్వరో ఫిర్యాదు చేస్తే కానీ తనిఖీలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆహార భద్రతా అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు, తరుచూ తనిఖీలు నిర్వహించేలా ఆదేశించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవు.. జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయించే వారు తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోటల్, బేకరీ, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పండ్ల వ్యాపారులు తమ వ్యాపారాన్ని నిర్వహించాలి. గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. –రవీందర్రావు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సిద్దిపేట -
కేకు తినే పోటీలో పాల్గొని మహిళ మృతి
సిడ్నీ : కేకు తినే (ఈటింగ్ కేక్) పోటీలో పాల్గొని మహిళ మృతి చెందిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియా డే సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని బీచ్ హౌస్ హోటల్లో కేకు తినే(ఈటింగ్ కేక్) పోటీలను నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఫేమస్ అయిన ల్యామింగ్టన్ కేకులను ఈ పోటీలో ఉంచారు. ఈ పోటీలో పాల్గొన్న ఓ 60 ఏళ్ల మహిళ ల్యామింగ్టన్ కేకులను వెంట వెంటనే తినడానికి ప్రయత్నించింది. కొన్ని కేక్ పీసులను తిన్న వెంటనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హోటల్ యాజమాన్యం ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందారని వెల్లడించారు. మహిళ మృతి పట్ల హోటల్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ఆహ్లాదకరంగా జరుగుతున్న పోటీలో ఇలా మహిళ ప్రాణాలను పోగొట్టుకోవడం తమకు ఎంతో బాధగా ఉందంటూ హోటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాము ఫోన్ చేసిన నిమిషాల్లో హోటల్‌కు చేరుకున్న అంబులెన్స్ సర్వీసుకు హోటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపింది. ఆస్ట్రేలియా డే సందర్భంగా ఆ దేశంలో ప్రతి ఏడాది తిండి పోటీ (ఈటింగ్ కాంపిటీషన్) నిర్వహిస్తారు. కేకులు లేదా ఇతర ఆహార పదార్థాలను తక్కువ సమయంలో ఎక్కువ తినేవారిని విజేతలుగా ప్రకటిస్తారు. విజేతలకు విలువైన బహుమతులను కూడా అందిస్తారు. -
నెమలి ఆర్డర్ చేస్తే టర్కీ కోడి వచ్చింది..!
సాధారణంగా పెళ్లి వేడుకల్లో వివాహం చేసుకునే జంట అందమైన, రంగురంగుల ఆకృతిలో ఉండే కేకులను కట్ చేసి తమ అనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఈ క్రమంలోనే జార్జియాకు చెందిన రెనా డేవిస్ అనే పెళ్లి కూతురు తన వివాహ వేడుకకు నెమలి ఆకారంలో ఉన్న కేకును 300 డాలర్లు ఖర్చు చేసి మరి ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. కేకు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన తాను కేకు వచ్చాక దాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆ కేకు పూర్తిగా తాను పంపించిన నెమలి ఆకారానికి భిన్నంగా ఉండటంతో సదరు పెళ్లి కూతురు అగ్గి మీద గుగ్గిలంలా మారింది. తాను వృత్తాకారంలో ఉండే పదార్థం మీద కూర్చున్న నెమలి.. తన పింఛము కన్నులు నీలం, ఆకుపచ్చ రంగులతో చిన్న బుట్ట కేకులుగా ఉండే కేకును ఆర్డర్ చేసింది. అయితే అందమైన కేకు కోసం వేచి చూసిన రెనాకు చేదు అనుభవం ఎదురైంది. వింత ఆకారంలో తయారు చేయబడిన కేకును రేనా వదిన అన్నెట్ హిల్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘కేకును తయారు చేసే పదార్థం తెల్లగా లేదు. కుష్టి రోగం వచ్చిన నెమలి లేదా ఓ టర్కీ కోడిలా కేకు మాకు దర్శనమిచ్చిందని వ్యంగ్యంగా తెలిపారు. కనీసం ఆ పక్షికి తోక కూడా సరిగా లేదని మండిపడ్డారు. ఎటునుంచి చూసినా ఆ పక్షి ఆకారం తాము ఆర్డర్ చేసిన నెమలి ఆకృతిలో మాత్రము లేదని’ హిల్ పేర్కొన్నారు. ఇంత వికృతంగా తయారుచేయబడిన ఈ కేకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చివరగా సంబంధిత బేకరీ సిబ్బంది కేకు డబ్బులను తిరిగి ఇచ్చినట్టు హిల్ తెలిపారు. -
కేక్ కొంటే పెట్రోల్ ఫ్రీ
సాక్షి, చెన్నై: పెట్రో ధరలు వినియోగదారులకు సెగ పుట్టిస్తోంటే.. వినియోగదారులకు ఆకట్టుకునేందుకు సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇపుడు ఈ కోవలోకి ఒక బేకరీ సంస్థ వచ్చి చేరింది. ఒక కిలో కేక్ కొంటే లీటరు పెట్రోలు ఉచితంగా ఇస్తామంటూ ఒక బేకరీ వినూత్న ఆఫర్ అందిస్తోంది. తమిళనాడులోని ఒక బేకరీ దుకాణం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక కిలో పుట్టినరోజు కేక్ లేదా రూ .495 బిల్లు చేస్తే 1 లీటరు పెట్రోలు ఉచితమని అని ప్రకటించింది. దీంతో ఇది వైరల్‌గా మారింది కాగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు బాగా పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటు తున్నాయి. రికార్డు ధరలతో వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక పెళ్లి వేడుకలో వధూవరులకు 5 లీటర్ల పెట్రోలును బహుమతిగా ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా దేశంలో పెట్రోలు ధర మండుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. శుక్రవారం రాష్ట్ర రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 86.01 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై రెండింటిలో 10 పైసలు పెరిగి రూ. 82.32 , 89.92 రూపాయలుగా ఉంది. -
ఎగ్ లెస్.. లెస్స!
గుడ్డు లేకుండా గుడ్ కేక్ తినండి. ఇంట్లో చేసుకుని గుటుక్కుమనిపించండి. క్రిస్మస్ అంటేనే.. గుడ్ టైమ్. గుడ్డు తినని వాళ్లకు గుడ్ కేక్ ఎలా? అందుకే ఈ గుడ్డులెస్ కేక్! ఫ్రెష్ ఫ్రూట్ కేక్ కావలసినవి: మైదాపిండి – కప్పు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; తాజా క్రీమ్ – పావు కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కస్టర్డ్ పౌడర్ – టీ స్పూను; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; ఉప్పు – 2 కప్పులు; చిలకరించిన క్రీమ్ – 500 గ్రా.; పంచదార పొడి – పావుకప్పు; పంచదార సిరప్ – పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు – (కివి, కమలాపండు తొనలు, స్ట్రాబెర్రీ, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు) – తగినన్ని తయారి: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ ఉంచి, స్టౌ మీద మీడిమం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలిపాక, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలకొట్టాక, పావు కప్పు క్రీమ్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙మైదాపిండి, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్... వీటిని జల్లెడ పట్టి, పైన తయారు చేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి ∙ఏడు అంగుళాల అల్యూమినియం కేక్ ట్రే కి బటర్ రాసి, కేక్ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్ చేసి కేక్‌ను బయటకు తీయాలి ∙500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలక్కొట్టాలి. పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలక్కొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి) ∙కేక్‌ను ఒక ప్లేట్లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్ చేయాలి ∙చాకుతో కేక్ చుట్టూ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార సిరప్ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి ∙పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి. ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అరగంట సేపు ఉంచి తీయాలి ∙చివరగా మళ్లీ కేక్ మీద క్రీమ్ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా మనకు నచ్చిన వాటితో (స్ట్రాబెర్రీ వేఫర్లు బాగుంటాయి) అలంకరించి సుమారు 4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచి అందించాలి. చాకొలేట్ నట్స్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు; కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; జీడిపప్పు తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బ్లూ బెర్రీలు (ఎండబెట్టినవి) – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – టేబుల్ స్పూను; ఖర్జూరం తరుగు – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటిన్నర కప్పులు తయారి: ∙ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙బేకింగ్ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. (ఎంత ఎక్కువ సేపు గిలక్కొడితే అంత రుచిగా వస్తుంది) ∙ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి ∙యేడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి. (బటర్ బదులు బటర్ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు) ∙ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లితే బాగుంటుంది. బ్లూ బెర్రీ చీజ్ కేక్ కావలసినవి: బిస్కెట్లు – 125 గ్రా.; కరి గించిన బటర్ – 75 మి.లీ.; క్రీమ్ చీజ్ – 200 గ్రా.; పంచదార పొడి – 1/3 కప్పు; క్రీమ్ – 300 మి.లీ. (బాగా గిలక్కొట్టాలి); కండెన్స్డ్ మిల్క్ – 200 మి.లీ.; చైనా గ్రాస్ – 10 గ్రా.; బ్లూ బెర్రీలు – 3 టేబుల్ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు – 3 టేబుల్ స్పూన్లు. తయారి: ∙బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్లో నెమ్మదిగా వేస్తూ కలపాలి. (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది) ∙ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి ∙1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి ∙ఒక పాత్రలో క్రీమ్ వేసి బాగా గిలకొట్టాలి ∙మరో పాత్రలో క్రీమ్ చీజ్, పంచదార పొడి వేసి గిలక్కొట్టాలి ∙సన్నని మంట మీద పాన్ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి ∙పాన్‌లో కండెన్స్డ్ మిల్క్ వేసి గోరు వెచ్చన చేసి, ఉడికించిన చైనా గ్రాస్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి ∙ఈ మిశ్రమాన్ని క్రీమ్ చీజ్ మిక్స్‌కి జత చేసి బాగా గిలకొట్టాలి ∙బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి. (బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు) ∙గిలక్కొట్టిన క్రీమ్ కలపాలి ∙కేక్ టిన్‌లో చీజ్ కేక్ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి ∙కేక్‌ను టిన్ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి. వెనీలా కప్ కేక్స్ కావలసినవి: ఉప్పు – 2 కప్పులు ; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; కండెన్స్‌డ్‌మిల్క్ – అర కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; మైదా పిండి – కప్పు; సోడా – అర కప్పు (క్లబ్ సోడా); చెర్రీస్ – 20 తయారి: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలక్కొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలక్కొట్టాలి ∙ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి ∙సోడా (క్లబ్ సోడా వంటివి) వేసి బాగా కలపాలి ∙కప్ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. (విజిల్ పెట్టకూడదు) ∙సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి ∙చల్లారాక బయటకు తీసి అందించాలి. క్యారెట్ కేక్ కావాల్సినవి: మైదా – 2 కప్పులు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ను (500 మి.లీ), వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్) – అర కప్పు, పాలు – అర కప్పు తయారి: మైదా, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి ∙వెన్న, పంచదారపొడి, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి ∙ఇందులో జల్లించిన మైదా మిశ్రమం, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి పిండి గట్టిగా ఉంటే, కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్ టిన్ను లోపల ఫాయిల్ పేపర్ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదంటే చేతితో టిన్ను లోపల అంతా సర్దాలి ∙ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙ముందుగా తయారు చేసుకున్న కేక్ టిన్నును కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అరగంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదార పొడిని చల్లితే బాగుంటుంది. ప్రెజర్ కుకర్ కేక్... అవెన్ లేకుండా ప్రెజర్ కుకర్లోనూ కేక్ తయారు చేసుకోవచ్చు. కుకర్ అడుగున కేజీ ఉప్పు లేదా ఇసుక పోయాలి. దీని పైన ఒక కుకర్ బాటమ్ ప్లేట్ ఉంచాలి. మంట పూర్తిగా తగ్గించి, కుకర్ని వేడి చేయాలి. కుకర్‌లో చిన్న స్టాండ్ పెట్టి, సులువుగా పట్టేటంత మరొక గిన్నె తీసుకొని కేక్ మిశ్రమం పోయాలి. కేక్మిశ్రమం ఉన్న గిన్నెను కుకర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. పైన వెయిట్ పెట్టకుండా కుకర్మూత ఉంచాలి. (వెయిట్ పెడితే కుకర్ పేలే ప్రమాదం ఉంటుంది.) సన్నని మంట మీద 30–35 నిమిషాలు కేక్‌ను బేక్ చేసి, మంట తీసేయాలి. కుకర్ వేడి పూర్తిగా తగ్గేంత వరకు ఉంచి, కేక్ గిన్నెను బయటకు తీయాలి. తర్వాత నచ్చిన విధంగా అలంకరించుకోవాలి. -
బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఏం జరిగింది?!
-
బర్త్ డే సెలబ్రేషన్స్‌లో ఏం జరిగింది?!
సాక్షి, స్పెయిన్: పుట్టిన రోజు అంటేనే స్పెషల్ డే.. అందులోనూ చిన్న పిల్లల బర్త్‌డే అంటే ఇంట్లో ఇందరికీ పండుగ రోజనే చెప్పాలి. ఇంటిని అందంగా డెకరేట్ చేయడంతో పాటు.. బంధువులను, స్నేహితులను పిలిచి సాయంత్రం కేక్ కటింగ్ చేసి పార్టీ చేసుకుంటాం. అందరిలాగే స్పెయిన్‌లో ఒక ఫ్యామిలీ తమ 11 బిడ్డ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నారు.. స్నేహితులను, చుట్టాలను అందరినీ సాయంత్రం కేక్ కటింగ్‌కు పలిచారు. అందరూ హ్యాపీ బర్త్‌డే సాంగ్ పాడుతుండగా.. ఆ చిన్నారి కేక్కటింగ్కు సిద్దమైంది. కేక్‌పైన రెండు (కొవ్వొత్తుల మాదిరిగా) మెరుపులు వెదజిల్లే టపాసులు ఉంచారు. వాటిని చిన్నారి నోటితో ఊది ఆర్పే ప్రయత్నం చేస్తుండగా.. వెనకనుంచి అన్న ఆనందంతో ఫోమ్‌ను వెదజల్లాడు.. ఈ క్రాకర్స్‌కు ఆ ఫోమ్ తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగి.. చిన్నారి మొహం కాలిపోయింది. ఎడమ కంట్లో నిప్పురవ్వలు పడడంతో కన్ను పూర్తిగా పోయింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఘనంగా వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు శౌరీ విజయకుమారి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్ఆర్ అభిమానులు హాజరై కేకును కట్ చేశారు. అనంతరం ఒకరికొకరు కేకు, మిఠాయిలను పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వైఎస్ విజయమ్మ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యేవరకు సమష్టిగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. నాయకులు నాగరాజు యాదవ్, కటారి సురేష్, ఉమాభాయ్, రాజీవ్ కుమార్, సాంబ, సంజీవ్, ఏసన్న తదితరులు పాల్గొన్నారు. నేడు చలివేంద్రం ప్రారంభం.. వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని రవిటాకీసు సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టడంలో విఫలమైందన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చలివేంద్రాల్లో మంచినీటితోపాటు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు వివరించారు. -
నెల్లూరులో తెలుగు మహిళల లొల్లి
-
అభివృద్ధి వేగం పెంచుతాం
కొల్లాపూర్ : 2017లో అభివృద్ధి వేగాన్ని పెంచుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం వృద్ధాశ్రమంలోనూ కేక్ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ ఎక్బాల్, ఎంపీపీ నిరంజన్ రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్లు రఘుపతిరావు, ఖాజామైనొద్దీన్, టీఆర్ఎస్ మండల నాయకులు శేఖర్‌రెడ్డి, బోరెల్లి మహేష్, రహీంపాషా పాల్గొన్నారు. -
‘నూతన’ ఉత్తేజం
గతం గతః.. రాబోవు కాలం తేవాలి ‘కొత్త’ ఉత్తేజం.. అనుకోకుండా వచ్చిన అతిథి 2016 సంవత్సరం 365 రోజులు పూర్తి చేసుకుని బైబై చెప్పింది. ఎన్నో అనుభవాలు, అనుభూతులను మిగిల్చి.. జిల్లాల పునర్విభజనతో తరతరాలు మరిచిపోని ఏడాదిగా నిలిచింది. ఇప్పుడు మరో 365 రోజులు మనవెంటే ఉండేందుకు కొత్త సంవత్సరం 2017 వచ్చేసింది. శనివారం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సంబరం అంబరాన్నంటింది. టపాసులు పేల్చి.. డీజే హోరులో నృత్యం చేస్తూ.. కేక్‌లు కట్ చేసి కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. నవ వసంతం అందరిలోనూ సంతోషం నింపాలని ఆకాంక్షిస్తూ.. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు వేడుకలు కనుల విందుగా సాగాయి. ఆదిలాబాద్/ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలోని పట్టణలు, మండల కేంద్రాల్లో స్వీటుహౌస్ల్లో కేక్‌లు ప్రత్యేకంగా విక్రయించారు. కేక్‌లు, పలు తినుబండరాలు, చికెన్, మటన్ వంటకాల దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. ప్రత్యేకంగా గ్రీటింగ్‌లు తెలిపేందుకు యువత విభిన్న రీతులతో ఉత్సాహంగా గడిపారు. వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లలో వందల సంఖ్యలో మేసేజ్‌లు, న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. మందుబాబులు, స్నేహితులు బృందాలుగా మందువిందు భోజనాలు ఆరగించారు. ఎక్కడ చూసినా న్యూఇయర్ శుభాకాంక్షల బోర్డులు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. సిరులు పండించాలి.. కొత్త ఏడాదిలో రైతాంగం కష్టాలు తీరాలి. అందుకు ప్రభుత్వం వారిని పంటల సాగుకు ప్రోత్సహించాలి. జిల్లా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. పత్తి, సోయాబీన్ పంటలు ప్రధానంగా పండిస్తారు. జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతుండగా, ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తే పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. వీటితోపాటు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాఖా–కొరటా బ్యారేజీ పూర్తయితే తాంసి, జైనథ్, బేల మండలాల్లోని రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఉట్నూర్, గుడిహత్నూర్ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా టమాటా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో జ్యూస్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలోని పత్తి మార్కెట్లను అభివృద్ధి చేసి..దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా అభివృద్ధి చెందుతారు. జిల్లాలో మిషన్‌కాకతీయ ద్వారా చేపట్టిన చెరువులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలి. పరిశ్రమలకు ఊతం ఇవ్వాలి.. జిల్లాలో మూతపడ్డ జిన్నింగ్‌మిల్, ఆయిల్మిల్తోపాటు సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరించడం జిల్లా అభివృద్ధికి కీలకం. వీటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం సీసీఐ పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. జిల్లా ప్రజలు సీసీఐపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో 30 జన్నింగ్మిల్లుల, 90 ఆయిల్‌మిల్లులు మూతపడ్డాయి. వీటిని తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. దీంతోపాటు జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే ఇక రాష్ట్రంలోనే జిల్లాకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్య, వైద్యం మెరుగవ్వాలి.. జిల్లాలో విద్య, వైద్యం మెరుగవ్వాలి. వైద్య పరంగా జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాల పెద్ద దిక్కు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరగా పూర్తి చేయాలి. దీని ద్వారా ప్రజలు హైదరాబాద్, నాగ్‌పూర్‌లకు వెళ్లే తిప్పలు తప్పుతాయి. జిల్లాలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఉట్నూర్ కేంద్రంగా జిల్లా ఆసుపత్రి నిర్మిస్తే ఆదివాసీలకు వైద్య సేవలు అందుతాయి. జిల్లా విద్యారంగానికి వస్తే ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు. అప్పట్లో ముఖ్యమంత్రి జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఈ ఏడాది నవోదయ పాఠశాలతోపాటు మరికొన్ని గురుకులాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు, కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైన ఉంది. లక్ష్యంతో ముందకు కెళ్లాలి.. కొత్త సంవత్సరంలో యువత, విద్యార్థులు ఓ లక్ష్యంతో ముందుకెళ్లాలి. విద్యార్థులు భవిష్యత్తులో ఏం సాధించుకోవాలనుకుంటున్నారో అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి. నిరుద్యోగులు నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా శ్రమించాలి. కష్టపడనిది ఏదీ రాదని గ్రహించాలి. ఇప్పటి నుంచే అవసరమైన పుస్తకాలు చదవడం, చదివిన వాటిని మననం చేసుకోవడం ప్రారంభించాలి. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకూడదు. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని మరిచిపోకూడదు. -
శుభాకాంక్షల వెల్లువ
- నూతన సంవత్సర వేడుకల్లో నాయకులు, అధికారులు - కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్న వైనం - కలెక్టర్‌కు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు కర్నూలు అగ్రికల్చర్: నూతన సంవత్సరం సందర్భంగా నేతలు, ఉద్యోగులు ఆదివారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు తమ అభిమాన నేతలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు, మరో వైపు ఉన్నతాధికారులకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు కర్నూలుకు తరలివచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, నేతల గృహాలు కిటకిటలాడాయి. జిల్లా యంత్రాంగం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు , వివిధ స్థాయి ఉద్యోగులు కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కలిసి 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్ చేత క్యాలెండర్లు ఆవిష్కరించారు. నూతన సంవత్సర కేకులను కలెక్టర్ చేత కట్ చేయించారు. అలాగే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి దంపతులు, డోన్‌లో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అభిమానులు బొకేలు అందించి శుభకాంక్షలు తెలిపారు. జిల్లాను ప్రగతిపథంలో నిలుపుదాం కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జిల్లాను అభివృద్దిలో మొదటి స్థానానికి తీసుకెళ్దాన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసి–2 రామస్వామి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, ట్రెజరీ డీడీ శివఅర్జన్కుమార్, జడ్పీ సీఈఓ ఈశ్వర్, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, విద్యుత్ ఎస్ఈ బార్గవరాముడు , శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, గొర్రెల సంఘం అధ్యక్షడు నాగేశ్వరయాదవ్, ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, మిగిలిన శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు తరలివచ్చి కలెక్టర్‌కు బొకేలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు: జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్.వెంగళ్‌రెడ్డి, జవహార్‌లాల్, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టిఎండీ హుస్సేన్, జిల్లా నేతలు రామన్న, వేణుగోపాల్, నాగమణి ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు సర్దార్ అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితర ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు కూడా కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. - జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌ను వివిధ శాఖల అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. - జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడుకు ఆర్డీఓలు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, వివిదశాఖల అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
కమాండ్ కంట్రోల్ సెంటర్లో న్యూ ఇయర్ వేడుకలు
కర్నూలు: జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పోలీసు అధికారులు ఆదివారం ఉదయం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలిరావడంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ కిటకిటలాడింది. జేసీ హరికిరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ప్రాంతీయ అధికారి శివకోటిబాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్డీ రవిప్రకాష్, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ, ప్రతినిధి బృందం శేఖర్‌బాబు, రామకృష్ణ, నాగభూషణం, హోంగార్డు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయరత్నం డీఎస్పీలు రమణమూర్తి, బాబా ఫకృద్దీన్, సుప్రజ, వీరరాఘవరెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, బాబుప్రసాద్, హరినాథరెడ్డి ఎస్పీని కలిసి పూలబోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సబ్‌డివిజన్ అధికారులతో పాటు సీఐలు కూడా ఎస్పీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బీ.క్యాంపులో నివాసం ఉంటున్న డీఐజీ బంగ్లా, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయం కూడా పోలీసు అధికారులతో కిటకిటలాడాయి. ఏపీఎస్పీ రెండో పటాలంలో పనిచేస్తున్న పలువురు అధికారులు కమాండెంట్ విజయకుమార్‌ను కలిసి పూలబొకే ఇచ్చిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
స్లిమ్ కేక్స్
ఏడాదంతా బాగా తిన్నాం... ఫుల్లుగా లాగించాం... 2016లో పదహారణాల ఫ్యాట్ కుమ్మేశాం. 2017 వస్తోంది! సన్నగా, నాజూగ్గా అవ్వాలని అందరికీ ఉంది. కానీ, దానికి కేక్ అడ్డం కాకూడదు కదా! కండపట్టకుండా పిండేయండి. కేక్ బెండు తీయండి. 2017లో కేకుల కేక! స్లిమ్ కేక్... ఎంజాయ్! ఆరెంజ్ ఆల్మండ్ కేక్ కావల్సినవి: ఉప్పులేని బటర్ – 50 గ్రాములు (కరిగించాలి), ఆరెంజ్ జిస్ట్ (పై తొక్కను సన్నగా తరిగినది) – టేబుల్ స్పూన్, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, సెల్ఫ్రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – కప్పు, గసగసాలు – 2 టేబుల్ స్పూన్లు, వెన్న తీసిన పాలు – పావు కప్పు, షుగర్ ఫ్రీ షుగర్ – తగినంత, బాదంపప్పు పలుకులు – పావు కప్పు తయారీ: ∙అవెన్ని 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేయాలి. కేక్ బేకింగ్ బౌల్ అడుగున నూనెను స్ప్రే చేసి, పైన బేకింగ్ పేపర్ పరవాలి. దీనిపైన కూడా వంటనూనెను స్ప్రే చేయాలి. ఒక గిన్నెలో బటర్, ఆరెంజ్ జిస్ట్, పంచదార, గిలక్కొట్టిన గుడ్లసొన, పిండి, గసగసాలు, పాలు పోసి బాగా కలపాలి. ∙దీంట్లో బాదంపప్పు పలుకులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 35–40 నిమిషాలు బేక్ చేయాలి. కేక్ బయటకు తీసి, తర్వాత ప్లేట్లోకి తీయాలి. ∙చివరగా పంచదార పొడి, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పాలను కలిపి బాగా గిలక్కొట్టి, కేక్ టాప్ మీద సెట్ చేయాలి. ఆరెంజ్ ముక్కలతో అలంకరించాలి. బనానా స్లి్పట్ కేక్ కావల్సినవి: లైట్ వెనిలా స్పాంజ్ కేక్ – 1, అయిదు గుడ్డుల్లోని తెల్ల సొన, 3 గుడ్ల పసుపు సొన, సెల్ఫ్రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – అర కప్పు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు, పంచదార – అర కప్పు, వెన్నతీసిన పాలు – ఒకటిన్నర కప్పు, ఫ్యాట్ ఫ్రీ షుగర్ – పావు కప్పు, షుగర్ ఫ్రీ విప్డ్ క్రీమ్ – కప్పు, అరటిపండ్లు – 2 (పలచని ముక్కలుగా కట్ చేయాలి), స్ట్రాబెర్రీలు (పెద్దవి) – 4, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒక గిన్నెలో గుడ్ల తెల్లసొన, పసుపుసొన వేసి బాగా గిలకొట్టాలి. బేకింగ్ పాన్‌లో నూనె స్ప్రే చేయాలి. అడుగున బేకింగ్ పేపర్ పరవాలి. ఆ పేపర్‌పై కూడా నూనె స్ప్రే చేయాలి. ∙మరొక గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించాలి. ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద∙ప్రీ హీట్ చేయాలి. వెనిలా, గుడ్డులోని పసుపు సొన కలిపి 5 నిమిషాలు మిక్సీలో బ్లెండ్ చేయాలి. దీంట్లో పావు కప్పు పంచదార వేసి, కరిగేంతవరకు గిలకొట్టాలి. దీంట్లో పూర్తి గుడ్ల మిశ్రమం పోసి కలపాలి. ∙బేక్ బౌల్లో స్పాంజ్ కేక్ పెట్టి, గరిటతో పాన్‌లో మీద పిండి మిశ్రమం వేయాలి. ∙గిలకొట్టిన గుడ్లసొన ఆ పిండి మీద మరో లేయర్‌గా పోయాలి. తర్వాత గిలకొట్టిన పావు కప్పు షుగర్ ఫ్రీ షుగర్ వేయాలి. దీనిని12 నిమిషాలు బేక్ చేయాలి. బయటకు తీసి వెంటనే బేకింగ్ పేపర్ చివర్లను పట్టుకొని వదులు చేయాలి. ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి, 10 నిమిషాల తర్వాత బయటకు తీసి విపింగ్ క్రీమ్ పైన రాయాలి. ∙ దీన్ని 2 గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. పేపర్‌టవల్ తీసేసి, కేక్ స్లైసులుగా కట్ చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలను, స్ట్రా బెర్రీల స్లైసులను, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్‌తో అలంకరించాలి. ఛీజ్ చెర్రీ కేక్ కావల్సినవి: క్యారమెల్ కుకీస్ – 250 గ్రాములు, బటర్ – 40 గ్రాములు (కరిగించాలి), లైట్ క్రీమ్ ఛీజ్ (మెత్తనిది) – 250 గ్రాములు, ఫ్యాట్లేని రికోటా ఛీజ్ – 400 గ్రాములు, వెనిలా యోగర్ట్ – 200 గ్రాములు గుడ్లు – 2, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, సిరప్ చెర్రీ – 670 గ్రాములు, ఆరెంజ్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 1/4 కప్పు, లెమన్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు కప్పు తయారీ: ∙అవెన్‌ను 170 సెంటీగ్రేడ్ల వద్ద వేడిచేయాలి. పాన్ వేడి 150 డిగ్రీల వద్ద ఉండాలి. ∙కుకీస్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. దీన్ని పాన్ అడుగున బేకింగ్ పేపర్‌పైన చల్లాలి. ∙ఒక గిన్నెలో క్రీమ్ ఛీజ్, రికొట్టా, యోగర్ట్, గుడ్లు, వెనిలా వేసి కలపాలి. 30–35 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత 4 గంటలు, లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙చెర్రీ సిరప్, ఆరెంజ్ రిండ్, ఆరెంజ్ జ్యూస్, లెమన్ రిండ్, లెమన్ జ్యూస్ సాస్పాన్లో వేసి, మరిగించాలి. సిమ్‌లో మరో 6 నిమిషాలు ఉంచాలి. దీంట్లో చెర్రీస్ వేసి దించాలి. వేడి తగ్గాక ఛీజ్ కేక్ బయటకు తీసి, పైన అలంకరించాలి. ప్రెజర్ కుకర్ కేక్... అవెన్ లేకుండా ప్రెజర్ కుకర్లోనూ కేక్ తయారు చేసుకోవచ్చు. కుకర్ అడుగున కేజీ ఉప్పు లేదా ఇసుక పోయాలి. దీని పైన ఒక కుకర్ బాటమ్ ప్లేట్ ఉంచాలి. మంట పూర్తిగా తగ్గించి, కుకర్ని వేడి చేయాలి. కుకర్‌లో చిన్న స్టాండ్ పెట్టి, సులువుగా పట్టేటంత మరొక గిన్నె తీసుకొని కేక్మిశ్రమం పోయాలి. కేక్మిశ్రమం ఉన్న గిన్నెను కుకర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. పైన వెయిట్ పెట్టకుండా కుకర్మూత ఉంచాలి. (వెయిట్ పెడితే కుకర్ పేలే ప్రమాదం ఉంటుంది.) సన్నని మంట మీద 30–35 నిమిషాలు కేక్‌ను బేక్ చేసి, మంట తీసేయాలి. కుకర్ వేడి పూర్తిగా తగ్గేవంత వరకు ఉంచి, కేక్ గిన్నెను బయటకు తీయాలి. తర్వాత నచ్చిన విధంగా అలంకరించుకోవాలి. పియర్ లేయర్ కేక్ కావల్సినవి: గుడ్ల తెల్ల సొన – కప్పు + అర కప్పు, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, షుగర్ ఫ్రీ షుగర్ – కప్పు + 2 టేబుల్ స్పూన్లు, షుగర్‌లెస్ వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు – 2 టేబుల్ స్పూన్లు, పియర్ పండు గుజ్జు – ముప్పావు కప్పు + టేబుల్ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, కొబ్బరి పొడి – కప్పు + పావు కప్పు (పచ్చికొబ్బరిని గ్రైండ్ చేసి, పిండి, పాలు తీయాలి. ఆ పొడిని బ్లాటింగ్ పేపర్ మీద పరిచి, దాదాపు 12 గంటల పాటు ఆరబెట్టాలి. తర్వాత దీన్ని మిక్సర్‌లో వేసి పొడి చేయాలి. ), తీపి లేని ముదురు రంగు కోకా పౌడర్ – పావు కప్పు, తీపిలేని సాధారణ కోకా పౌడర్ – పావు కప్పు, మసాలా – 2 టీ స్పూన్లు (దాల్చిన చెక్క పొడి టీ స్పూన్, జాజికాయ పొడి అర టీ స్పూన్, యాలకులు+లవంగాల పొడి అర టీ స్పూన్), బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, బేకింగ్ సోడా – టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– అర టీ స్పూన్ క్రీమ్‌కి కావల్సినవి: కొబ్బరినూనె/వంటనూనె – టేబుల్ స్పూన్, తియ్యగా లేని వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు, ఆర్గానిక్ స్టేవియా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, బటర్ ఫ్లేవర్ – పావు టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– పావు టీ స్పూన్, ఆర్గానిక్ బ్రౌన్‌రైస్ పౌడర్ – 100 గ్రాములు, ఎరిత్రిటోల్ పొడి – కప్పు + 1/4 కప్పు తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేయాలి. 200 డిగ్రీల వద్ద బేకింగ్ పాన్‌ను హీట్చేయాలి. ∙ గుడ్ల సొన బాగా గిలక్కొట్టి అందులో వెనిలా ఎక్స్ట్రాక్ట్, షుగర్‌లెస్ షుగర్ పొడి, బాదం పాలు, పియర్పండు గుజ్జు, క్యారమెల్ ఫ్లేవర్ వేసి బాగా కలపాలి. ∙ కుకింగ్ పాన్ అడుగున నూనెను స్ప్రే చేయాలి. ఆ పైన బేకింగ్ పేపర్‌ను పరవాలి. అలాగే పాన్ చుట్టుపక్కల పేపర్‌ను సెట్ చేయాలి. ∙ మరొక గిన్నెలో కొబ్బరి పొడి, కోకాపౌడర్లు, మసాలా పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించాలి. ∙ దీంట్లో గుడ్ల మిశ్రమం వేసి బాగా కలపాలి. మిక్సీలో వేసి 20 సెకన్లపాటు బ్లెండ్ చేయాలి. ∙ ఈ మిశ్రమాన్ని పాన్‌లో గరిటెతో వేసి, పైన గరిటెతో చక్కగా సెట్ చేసి, అవెన్‌లో పెట్టాలి. 45 నిమిషాల పాటు బేక్ చేయాలి. క్రీమ్ తయారీ: ∙అవెన్‌లో ఆల్మండ్ మిల్క్ పోసి 20 సెకండ్లు వేడి చేసి, తీయాలి. దీన్ని గిలకొట్టాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్, ఉప్పు, ఎరిథ్రిటాల్ వేసి కలపాలి. దీన్ని కేక్ మీద అప్లై చేసి, ప్రిజ్‌లో పెట్టాలి. 10 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేయాలి. లైట్ చాకోలెట్ కేక్ కావల్సినవి: అన్సాల్టెడ్ బటర్ – 75 గ్రాములు, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, కోకాపౌడర్ – పావు కప్పు, సోడా – అర టీ స్పూన్, వెన్నలేని పాలు – కప్పు, కోకాపౌడర్, స్ట్రాబెర్రీలు, చెర్రీలు – అలంకరణకు తయారీ: ∙అవెన్‌ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేయాలి. పాన్ తగినది ఎంచుకోవాలి. ∙మిక్సర్‌లో బటర్, షుగర్, గుడ్ల సొన, పిండి, కోకాపౌడర్, సోడా, పాలు వేసి నిమిషం సేపు బ్లెండ్ చేయాలి. ∙ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 45–50 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారాక ప్లేట్లోకి తీసుకొని పైన కోకాపౌడర్ చల్లి, ఆ పైన చెర్రీస్తో అలంకరించి సర్వ్ చేయాలి. -
కేక్ బ్రేక్
ఇక్కణ్ణుంచి న్యూ ఇయర్ దాకా బేకినోళ్లకు బేకినంత! తిన్నదే తిని బోర్ కొట్టినోళ్లకి బ్రేకినంత!! ఓ రెండు లొట్టలెక్కువేసుకుంటే బ్రేవ్మన్నంత!!! పంప్కిన్ కేక్ కావలసినవి: మైదా – 2 కప్పులు; గుమ్మడికాయ – 1 (చిన్న సైజుది); మైదా – పావు కేజీ, బేకింగ్‌పౌడర్ – టీ స్పూన్; వంటసోడా – పావు టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; వెన్న – కప్పు; పంచదార పొడి – కప్పు; వెన్న – టీ స్పూన్; గుడ్లు – 6; వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూన్; డ్రై ఫ్రూట్స్ పొడి (బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్) – అర కప్పు; సుగుంధద్రవ్యాల పొడి – టీ స్పూన్ (ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు.. కలిపి పొడి చేయాలి ) తయారి: గుమ్మడికాయ సగానికి కోసి, గుమ్మడి గుజ్జు తీసి, గింజలు వేరు చేయాలి. గుజ్జు తీసేశాక గుమ్మడికాయ గిన్నెలా ఉంటుంది. దీనిని పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి(ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించవచ్చు), పైన మరో గిన్నె ఉంచి, ఆవిరి మీద ఉడికించి, తీసి పక్కన ఉంచాలి. గుమ్మడి గుజ్జును మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో బాగా కలిపిన నూనె, పంచదార, ఉప్పు, వెనిలా ఎసెన్స్, గుడ్ల మిశ్రమం పోయాలి. మైదా, బేకింగ్ పౌడర్, వంటసోడా కలిపి జల్లించి పై మిశ్రమంలో కలపాలి. డ్రై ఫ్రూట్స్, సుగంధద్రవ్యాల పొడి కూడా వేసి మళ్లీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నంతా వెన్నరాసిన గిన్నెలో పోసి, కుకర్‌లో బేక్ చేయాలి. బయటకు తీశాక ఉడికించిన గుమ్మడికాయలోకి సర్ది, ఆవిరి మీద మరో పది నిమిషాలు ఉడికించి, దించాలి. ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. అవెన్‌లో: కట్ చేసి, శుభ్రం చేసిన గుమ్మడికాయ చుట్టూత బ్లాటింగ్ పేపర్ చుట్టి, లోపల కేక్ మిశ్రమం పోసి అవెన్‌లో 30–35 నిమిషాలు బేక్ చేసి, తీయాలి. ప్లమ్ కేక్ కావలసినవి: మైదా – పావుకేజీ; డాల్డా – పావు కేజీ; పంచదార పొడి – 200 గ్రాములు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; వంటసోడా – చిటికెడు; కోడిగుడ్లు – 5; డ్రై ఫ్రూట్స్ – పావు కేజీ (జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరం, కిస్మిస్, ఖర్జూరం మొదలైనవి); సుగంధ ద్రవ్యాల పొడి – టీ స్పూన్ (ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు.. కలిపి పొడి చేయాలి) తయారి: మైదా, బేకింగ్ పొడి కలిపి జల్లించుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో గుడ్ల సొన, డాల్డా, పంచదార పొడి వేసి బాగా కలపాలి. దీంట్లో మైదా, డ్రై ఫ్రూట్స్ వేసి మళ్లీ బాగా కలపాలి. బేక్ చేసే గిన్నెలో అడుగున కొద్దిగా డాల్డా లేదా నెయ్యి రాసి మైదా మిశ్రమాన్ని అందులో పోయాలి. కుకర్ అడుగున ఇసుక పోసి పైన బేక్ చేసే గిన్నె పెట్టి, పైన మూత ఉంచాలి. 30 నిమిషాలు ఉడికిన తర్వాత దించాలి. పూర్తిగా చల్లారాక మూత తీసి, కేక్ గిన్నె బయటకు తీయాలి. ప్లేట్లో గిన్నెను బోర్లిస్తే గుండ్రటి పరిణామంలో కేక్ వస్తుంది. పైన డ్రై ఫ్రూట్స్‌ని అలంకరించి, కట్ చేసి, సర్వ్ చేయాలి. పాన్ కేక్ కావలసినవి: గోధుమపిండి – 1 1/4 కప్పు; మొక్కజొన్న రవ్వ – 1/3 కప్పు (పాప్‌కార్న్‌ని పొడి చేసి కూడా వాడచ్చు); గుడ్డు – 1 ; పంచదార – 1/3 కప్పు; మజ్జిగ – 1 1/2 కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; బేకింగ్ సోడా – అర టీ స్పూన్; నూనె – పావు కప్పు; ఉప్పు – అర టీ స్పూన్ తయారి: నాన్‌స్టిక్ పాన్ మీద కొద్దిగా నూనె రాసి వేడెక్కనివ్వాలి. ఒక గిన్నెలో పైన చెప్పిన అన్ని పదార్థాలు వేసి కలిపి, ఇడ్లీ పిండిలా తయారుచేసుకోవాలి. వేడి పెనం మీద పెద్ద గరిటెతో పిండి తీసుకొని వేయాలి. అదే గరిటెతో కొద్దిగా వెడల్పు అని, పైనుంచి మూత పెట్టాలి. ఒక వైపు మూడు నిమిషాలు, మరో వైపు మూడు నిమిషాలు బేక్ చేసి తీయాలి. ఇలాగే మిగతావి వేసుకొని, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చివరగా తేనె, బటర్‌తో సర్వ్ చేయాలి. స్పాంజ్ కేక్ కావలసినవి: మైదా – 1 1/2 కప్పులు; గుడ్లు – 2 (గుడ్లు వద్దనుకున్నవారు యోగర్ట్ అర కప్పు వాడచ్చు); పంచదార పొడి – కప్పు; నూనె – 1/2 కప్పు (నూనెకు బదులుగా బటర్ వాడుకోవచ్చు); పాలు – 1/2 కప్పు; వెనీలా ఎసెన్స్ / పైనాపిల్ ఎసెన్స్ – టీ స్పూన్; బేకింగ్ పౌడర్ – టీ స్పూన్; వంట సోడా – పావు టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; నెయ్యి లేదా నూనె లేదా వెన్న – టీ స్పూన్ తయారి: గిన్నెలో ఎగ్స్ వేసి, నురగ వచ్చేదాక గిలకొట్టాలి. దీంట్లో పంచదార పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో టేబుల్‌స్పూన్ మైదా వేసి కలపాలి. వెన్న రాసిన గిన్నెలో పై మిశ్రమం పోయాలి. దీంట్లో సన్నగా తరిగిన నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పోసిన గిన్నెను ప్రెజర్ కుకర్‌లో పెట్టి ఉడికించాలి లిడ్, గ్యాస్కట్ పెట్టకుండా పైన మూతను ఉంచి ఉడికించాలి. మధ్యలో మూత తీయకూడదు. 5–10 నిమిషాలు కేక్ మంచి వాసన వస్తుంది. మరో 5–10 నిమిషాల్లో మిశ్రమం గట్టిపడుతుంది. మొత్తం 40–45 నిమిషాలు ఉడికించాక దించాలి. 20–30 అలాగే చల్లారనిచ్చి, కేక్ ఉన్న గిన్నెను బయటకు తీసి, ప్లేట్లో బోర్లించాలి. కత్తితో కట్‌చేసి, సర్వ్ చేయాలి. ఎగ్‌లెస్ కేక్ కావలసినవి: మైదా – పావు కేజీ; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్; వంట సోడా – చిటికెడు; ఫ్రూట్ మిక్చర్ (డ్రై ఫ్రూట్స్, నట్స్) – కప్పు; అన్సాల్డెడ్ బటర్ – అర కప్పు (100 గ్రాములు); నీళ్లు – అర కప్పు; గోల్డెన్ సిరప్ – అర టేబుల్ స్పూన్; పంచదార – అర కప్పు; వంట సోడా – అర టీ స్పూన్; పెరుగు లేదా యోగర్ట్ – 3 టేబుల్ స్పూన్లు; వెనిల్లా ఎసెన్స్ – అర టీ స్పూన్; మసాలా పొడి – (లవంగాలు–1, ఇలాచీ –1, జాజికాయ– చిన్న ముక్క కలిపి పొడి చేసినది); బంగాళదుంప – అర కప్పు (ఉడకబెట్టి గుజ్జు చేసినది); ఆరెంజ్ జెస్ట్ లేదా ఆరెంజ్ తురుము – టేబుల్ స్పూన్, చిరోంజీ పప్పు – టేబుల్ స్పూన్ ప్రెజర్ కుకింగ్: ఉప్పు లేదా ఇసుక – అర కేజీ; ప్రెజర్ కుకర్ ప్లేట్– 1; అల్యూమినియమ్ బేకింగ్ పాన్ – కుకర్‌లో పట్టేటంత గిన్నె; బటర్ పేపర్ – పాన్ అడుగున పరవడానికి కావల్సినంత; వెన్న లేదా నూనె – పాన్ అడుగున రాయడానికి కావల్సినంత తయారి: వెడల్పాటి గిన్నెలో మైదా, సోడా, బేకింగ్‌పౌడర్ వేసి జల్లించాలి. డ్రై ప్రూట్స్, నట్స్ సన్నగా తరిగి ఉంచాలి. బంగాళదుంప ఉడికించి, మసాలా పొడి చేసి ఉంచాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నట్స్ కాకుండా డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేయించాలి. దీంట్లో నీళ్లు పోసి ఆ తర్వాత పంచదార వేసి కలపాలి. (నీళ్లు–పంచదార సమంగా ఉండాలి). 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాక పాకం చిక్కగా అవుతుంది. మంట తీసేసి వంట సోడా కలపాలి. తర్వాత మైదా మిశ్రమం వేసి కలపాలి. బేకింగ్పాన్ అడుగున బటర్‌పేపర్ పరిచి, అందులో మైదా మిశ్రమం వేయాలి. పైన మరి జీడిపప్పులు, బాదాంపప్పులతో అలంకరించాలి. 5 లీటర్ల ప్రెజర్ కుకర్‌లో అడుగున అరకేజీ మెత్తటి ఉప్పు లేదా ఇసుక పోసి ఆ పైన రంధ్రాలున్న ప్రెజర్కుకర్ ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్ మీద కనీసం 10 నిమిషాలు వేడెక్కనివ్వాలి. తర్వాత ఆ ప్లేట్ పైన మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచి, కుకర్ మూత పెట్టాలి. వెయిట్ మాత్రం ఉంచకూడదు. ఇలా సాధారణ మంట మీద 26–30 నిమిషాలు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత లోపలి మిశ్రమం ఉడికి, మంచి వాసనం వస్తుంది. అన్నీ కలిసిన తరువాత అందులో డ్రైఫ్రూట్స్, మైదా వేసి కలపాలి. బేక్ చేసే గిన్నె అడుగున బటర్‌పేపర్ పరచాలి. సిద్ధం చేసుకున్న కేక్ మిశ్రమాన్ని అందులో పోయాలి. కుకర్ అడుగున ఇసుక పోసి పైన బేక్ చేసే గిన్నె పెట్టి, ఆ పైన మూతను సెట్ చేయాలి. 30 నిమిషాలు తర్వాత దించాలి. చల్లారాక తీసి, పైన డ్రై ఫ్రూట్స్, చిరోంజీ పప్పుతో అలంకరించాలి. -
ఆ ఫోటోగ్రాఫ్తో మాకు సంబంధం లేదు
ఇది కొందరి అసత్య ప్రచారం: మలబార్ గోల్డ్ హైదరాబాద్: పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని పోలి ఉన్న కేక్‌ను కోస్తున్నట్లు ఉన్న ఫోటోగ్రాఫ్తో తమకెలాంటి సంబంధం లేదని ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా నమ్మకమైన కస్టమర్ బేస్ కలిగిన తమ బ్రాండ్‌ను అపఖ్యాతి పాలుచేయడానికి కొందరు ఈ కుట్రపన్నారని, సోషల్‌మీడియాలో ఈ మేరకు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అసలు ఆ కేక్ కటింగ్ చేసింది యూఏఈ ఎక్స్చేంజ్ కంపెనీ అని తెలియజేసింది. -
ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి
-
హర్టీ కేక్స్
కాలంతో కరిగి పోకుండా ఎంతో కాలం పదిలంగా ఉండే శిల్పాలు, బొమ్మలు చాలా చూసి ఉంటారు. వాటిని తాకి నాటి శిల్పుల కళా చాతుర్యానికి ఆశ్చర్య పోతుంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్నవి మాత్రం అలాంటివి కావు. ఈ కళాత్మక శిల్పాలు తాకినా.. నోటిలో వేసుకున్నా ఇట్టే కరిగిపోతాయి. - ఓ మధు స్వయంగా చేస్తేనే పర్ఫెక్ట్.. సాధారణంగా వర్క్‌షాప్‌లు అనగానే పెద్ద సంఖ్యలో హాజరవుతారు. తయారీ విధానం చూడటం తప్ప స్వయంగా చేసే అవకాశం వర్క్‌షాప్‌లలో తక్కువ. కానీ నేను అలా కాకుండా 5-8 మంది మాత్రమే వర్క్‌షాప్‌లో ఉండేట్లు చూసుకుంటాను. రెండు రోజుల వర్క్‌షాప్‌లో మెటీరియల్ ఇచ్చి పూర్తిగా వారితోనే కేక్ తయారు చేయిస్తాను. దీంతో వారు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. అలా నా దగ్గర శిక్షణ తీసుకున్న చాలా మంది హాబీగా మాత్రమే కాకుండా బిజినెస్ పరంగానూ రాణిస్తుండటం ఆనందంగా ఉంది. 20 నుంచి బేసిక్ బేకింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాను. ఆసక్తి గల వారు 8885848635 నంబర్లో సంప్రదించవచ్చు. - ప్రసన్న అలంకరణ, రుచి రెండూ కేక్ తయారీకి ముఖ్యమే. ఈ రెండిటిలో ప్రయోగాలు చేస్తూ అందమైన కేక్ బొమ్మలు మలచడంలో ప్రసన్న దేవిశెట్టి దిట్ట. హాబీని చక్కని వ్యాపార మార్గంగా మలుచుకున్నారీమె. తన నైపుణ్యాన్ని తనకే పరిమితం చేసుకోకుండా కేక్ మేకింగ్, డెకరేటింగ్, చాక్లెట్ మేకింగ్‌లలో నలుగురికి శిక్షణనిస్తున్నారు. చదువుతూనే పదను పెట్టా.. ‘చిన్నప్పటి నుంచి కేక్ తయారీ అంటే సరదా. అప్పుడప్పుడు సన్నిహితులు, బంధువులకు సరదాగా కేక్ తయారు చేసి ఇచ్చేదాన్ని కూడా’ అంటూ గుర్తు చేసుకున్నారు ప్రసన్న. ఎవరికైనా వ్యాపారం ప్రారంభిస్తే ఆర్డర్లు వస్తాయి. అయితే బీటెక్ చదువుతున్నప్పుడే ప్రసన్న ఫస్ట్ ఆర్డర్ అందుకున్నారు. ‘న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంటి పక్కనే ఉన్న స్కూల్ వాళ్లు 40 కేజీల కేక్ తయారు చేయమని అడిగారు. అదే నా ఫస్ట్ ఆర్డర్. ఖర్చులు, లాభనష్టాలు లెక్కలేసుకోకుండా ఎంతో ఇష్టంగా తయారు చేసి ఇచ్చాను. స్కూల్ నిర్వాహకులు, వందల మంది పిల్లలు తిని చాలా బాగుందన్నారు. చాలా తృప్తిగా అనిపించింది. ఇక అప్పటి నుంచి నా ఆసక్తిని మరింత మెరుగుపరుచుకొని కేక్ మేకింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ, పెళ్లైన తర్వాత భర్త ప్రోత్సాహం అందించడంతో చెన్నై, బెంగళూర్, పుణె.. ఇలా పలు నగరాలకు వెళ్లి తగిన శిక్షణ తీసుకున్నానం’టూ వివరించారామె. పది మందికి నేర్పిస్తూ.. సరదాగా నేర్చుకున్న కేక్, చాక్లెట్ తయారీలో ప్రసన్న సాధిస్తున్న వ్యాపార విజయం.. అనేక మందికి స్ఫూర్తిని అందించింది. దీంతో పలువురు తమకూ నేర్పమంటూ అడగడం ప్రారంభించారు. మహిళలు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే వ్యాపార పరంగానూ రాణించేందుకు ఇది చక్కని మార్గమని అంటున్న ప్రసన్న.. టీచర్‌గా కూడా మారారు. గృహిణిగా ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ కేక్ మేకింగ్ వర్క్‌షాప్‌లు సైతం నిర్వహిస్తూ ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్లో సైతం క్లాస్‌లు తీసుకుంటారు. అలా ఇప్పటికి 800 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. కేక్ మేకింగ్‌లో ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారీ సృజనశీలి. చిన్నప్పటి నుంచి సహజంగా అబ్బిన పెయింటింగ్‌ను కేక్‌లపై ప్రదర్శిస్తూ కొత్త కొత్త ఆర్టిస్టిక్ కేక్స్ అందిస్తున్నారు. -
అసదుద్దీన్ మెడపై కత్తిపెట్టి...
ముంబైః మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చిత్రంతోకూడిన కేక్ ను ముందుగా పీకదగ్గర కట్ చేసి, తన శైలిని చాటుకున్నారు. మహరాష్ట్రకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని సైతం ఇలా కేక్ ముక్కల్లా కట్ చేస్తామని కూడ రాజ్ థాకరే అన్నట్లు తెలుస్తోంది. ముంబై దాదర్ లోని తన నివాసం కృష్ణ కుంజ్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న రాజ్ థాకరే... అసదుద్దీన్ ఫొటోతో కూడిన కేక్ ను కట్ చేసి తనదైన శైలిలో మరోసారి వివాదానికి తెరతీశారు. తాను కట్ చేసిన కేక్ ను అభిమానులందరికీ పంచిన ఆయన... మహరాష్ట్రను వ్యతిరేకించేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మెడమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేది లేదని చెప్పిన ఒవైసీ పై గతంలో మండిపడ్డ థాకరే.. పార్టీ నిర్వహిస్తున్న మొదటి గుడిపడ్వా ర్యాలీ సందర్భంగా చిత్రంలోని ఒవైసీ మెడపై కత్తిపెట్టి కేక్ కట్ చేశారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కేక్ ను కట్ చేసిన ఘటనను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఖండించారు. కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!!
లండన్: ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు తమ సృజనకు పదును పెట్టి కొత్త కోణాల్లో ట్రెండ్ సెట్ చేసేందుకు చూస్తుంటారు. అయితే లండన్ కు చెందిన ఆ కేక్ డిజైనర్ మాత్రం తన సృజనతో ఓ బ్యూటిఫుల్ వెడ్డింగ్ కేక్ డ్రెస్ ను రూపొందించి ఔరా అనిపించుకొంది. ఆ డిజైనర్ డ్రెస్ ను చూసి తరించడమే కాదు... కొరికి... రుచి కూడా చూడొచ్చన్నమాట..! లండన్ కు చెందిన కేక్ డిజైనర్ సిల్వియా ఎల్బా... కొత్త కోణంలో వెడ్డింగ్ డ్రెస్ ను రూపొందించింది. విభిన్న డిజైన్లను సృష్టించడంలో మేటిగా పేరొందిన డిజైనర్ ఈసారి కాస్త భిన్నంగా ఆలోచించింది. ఫన్ అండ్ ఫంకీ కేక్ స్థాపకుడు ఎట్టె మ్యానర్ తో పాటు కళాకారుడు లింకా రింక్ లతో కలిసి తన కలను సాకారం చేసుకుంది. సుమారు రెండు మీటర్ల పొడవు, 70 కేజీల బరువైన కేక్ తో 'ద వెడ్డిబుల్ డ్రెస్' పేరిట కొత్తరకం గౌనుకు రూపకల్పన చేసింది. ఎల్బా బృందం.. సృష్టించిన ఈ వినూత్న వెడ్డింగ్ డ్రెస్ రూపొందించేందుకు 300 గంటలు పట్టిందట. అంటే సుమారు పన్నెండు రోజులపాటు కష్టించి ఈ పెళ్ళి గౌనును తయారు చేసిన డిజైనర్లు... దీనికి 35 కేజీల ఫాండెంట్ ప్లస్ ను, వేఫర్ పేపర్ షీట్లతో తయారైన 15,000 రఫుల్స్ ను వినియోగించారట. అంతేకాక వెండిరంగు పూసలను అద్ది.. మిరుమిట్లు గొలిపే డిజైనర్ కేక్ డ్రెస్ ను రూపొందించారు. ఇంత కష్టపడి ఈ కేక్ ను ఏ పెళ్ళికూతురుకోసం రూపొందించారో అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే... ఈ వారాంతంలో లండన్ లో జరగబోయే కేక్ ఇంటర్నేషనల్ షోలో ప్రదర్శనకోసం డిజైనర్లు ఇలా ప్రత్యేక శైలిని ప్రయోగించారన్నమాట. -
ఆకట్టుకుంటున్న వాటర్ కేక్!
న్యూయార్క్ః భోజన ప్రియులు ఇప్పటికే ఎన్నో రకాల కేక్ లను రుచి చూసి ఉంటారు. కానీ వాటర్ కేక్ ను ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు నీటితో తయారయ్యే స్వచ్ఛమైన నీటి బిందువులా కనిపించే వాటర్ కేక్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటిదాకా గుడ్డుతోనూ, గుడ్డు లేకుండానూ కూడా కేక్ లు తయారు చేయడం చూశాం. ఇప్పుడా రోజులు పోయి ఏకంగా నీటితోనే చవులూరించే రుచికరమైన కేక్ లు కొన్ని దేశాల్లో తయారైపోతున్నాయ్... స్వచ్ఛమైన నీటితో కేక్ ను తయారు చేయడం కొత్తగా కనుగొన్నారు న్యూయార్క్ వాసులు. ఈ కొత్త ప్రయోగానికి జనం ఆకర్షితులయ్యారంటే ఇక వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో త్వరలో మంచినీటికి ఎద్దడి ఏర్పడక తప్పదేమో అంటున్నారు వినియోగదారులు. తాజాగా తయారైన వాటర్ కేక్ ఇప్పుడు న్యూయార్క్ లోని సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ గా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. స్మార్గాస్ బర్గ్ లో ఈ సంవత్సరం అత్యంత ఆదరణను చూరగొన్నఈ జపనీస్ డెజర్ట్ ను మిజు షింగెన్ మోచీగా పిలుస్తున్నారు. జపాన్ లోని కేక్ ల సృష్టికర్త.. డేరెన్ వాంగ్ సృష్టించిన ఈ స్ఫటికాకారంలో ఉన్ననీటి వంటకాన్ని(వాటర్ కేక్) న్యూయార్క్ కు తీసుకొచ్చి రైన్ డ్రాప్ కేక్ గా మార్చారు. మృదువుగా, ట్రాన్స్పరెంట్ జెల్లీలా కనిపించే వాటర్ కేక్ ను ముక్కలు ముక్కలుగా కూడ కోయచ్చు. అయితే దీన్ని కాస్త భద్రంగా కూడ నిల్వ ఉంచాల్సి వస్తుంది. వేడి తగిలినా, ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా కరిగిపోతుంది. ఇప్పటికే పలు రకాల ఆహార పదార్థాలను సృష్టించి, తన ప్రయోగాలతో ఇన్ స్టాగ్రామ్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్న వాంగ్ కేవలం ఘనీభవించిన నీరు, జెలటిన్ తో ఈ కేక్ ను తయారు చేశారు. ఇలా తయారు చేసిన వాటర్ కేక్ పై బ్రౌన్ సుగర్ సిరప్, వేయించిన సోయా పిండి చల్లి వడ్డిస్తున్నారు. జపాన్ లో వాటర్ కేక్ గా గుర్తింపు పొందిన ఈ కేక్ ఇప్పుడు న్యూయార్క్ ప్రజలకు రైన్ డ్రాప్ కేక్ గానూ పరిచయమై ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. -
జంతు ప్రేమికులకు సరికొత్త అవకాశం!
జంతు ప్రేమికులు ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. పెట్స్ ను పెంచుకోవాలని ఇష్టం ఉన్నా తీరిక, సమయం తోపాటు వాటిని పెంచేందుకు సరిపడేంత డబ్బు లేక మనసులోనే ఇష్టాన్ని దాచుకొని బాధపడుతుంటారు. అటువంటి వారికి ఇప్పుడు 'క్యాట్ కేఫ్' లు అందుబాటులోకి వచ్చేశాయి. సరదాగా వాటితో గడపాలన్న కోరిక తీర్చుకునేందుకు కేవలం ఓ రెస్టరెంట్ కో, పార్కుకో వెళ్ళినట్లుగా క్యాట్ కేఫ్ లకు వెళ్ళి కాస్తా రిలాక్స్ అయ్యే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అందుబాటులోకి తెచ్చారు. మంచి కాఫీ, కేక్ తోపాటు రెస్టారెంట్లలో దొరికే ఇతర పదార్థాలను వేడి వేడిగా అందిస్తూనే... పెట్స్ తో కాసేపు సరదాగా గడిపి, ఒత్తిడిని సైతం తగ్గించుకునే మార్గాలను కనిపెట్టారు. క్యాట్ లవర్స్ కు ఇప్పుడు ఆకట్టుకునే వివిధ రకాల పిల్లులను అందుబాటులో ఉంచుతున్నాయి క్యాట్ కేఫ్ లు. ఇళ్ళల్లో పెంచుకునే పెంపుడు పిల్లుల్లానే ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉండే పిల్లులకు సమయానికి తగ్గ అద్డెను చెల్లించి హాయిగా కాసేపు వాటితో గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్వతహాగా ఇంట్లో పిల్లులను పెంచుకునే సామర్థ్యం, అవకాశం లేనివారు ఈ కేఫ్ లను ఆశ్రయించేందుకు వీలుగా వీటిలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను కూడా కేఫ్ యాజమానులు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లులతో ఆడుకునేందుకు వచ్చిన వారికి వేడి వేడి కాఫీ, స్నాక్స్, కేక్స్ కూడా అందిస్తున్నారు. యాజమానుల పర్యవేక్షణలో ఉండే ఆరోగ్యవంతమైన ఆకర్షణీయమైన పిల్లలను జంతు ప్రేమికులకు అందుబాటులో ఉంచడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కేఫ్ యజమానులు మాగజైన్లు, న్యూస్ పేపర్లు, టీవీల్లోనే కాక, ఇంటర్నెట్ లో కూడా విభిన్న ప్రకటనలతో జంతుప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సెలవు రోజుల్లోనూ, సాయంత్ర సమయాల్లోనూ విజిటర్స్ కు ప్రత్యేక ఆఫర్లు కూడ ఇస్తున్నారు. సిద్ధహస్తులు తయారు చేసే కాఫీ పానీయాలతోపాటు... ప్రత్యేక సర్వీసును కూడ అందిస్తామంటూ ఆకట్టుకుంటున్నారు. మా వద్దకు రండి... మీ ఒత్తిడి తగ్గించుకోండి అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతేకాదు పిల్లులను పెంచుకోవాలనుకునేవారికి అందుబాటులో ఎన్నో రకాల మేలిమి జాతి పిల్లులు అందుబాటులో ఉన్నాయంటూ స్వాగతం పలుకుతున్నారు. పిల్లులను దత్తత చేసుకునేవారికి అడాప్షన్ ప్రాసెస్ కేవలం ఇరవై నిమిషాల్లో పూర్తయిపోతుందని, మీకు నచ్చిన పిల్లిని పెంచుకునే అవకాశం ఉందని పిల్లి ప్రేమికులకు వివరిస్తున్నారు. కొందరు తమ ప్రచారం, ప్రకటనల్లో భాగంగా ఆకట్టుకునే పిల్లుల వీడియోలనూ పోస్టు చేస్తున్నారు. జపాన్, సింగపూర్, థైవాన్, థాయిలాండ్ తోపాటు యూరప్, అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఈ క్యాట్ కేఫ్ లు అందుబాటులో ఉన్నాయి. పిల్లి ప్రేమికులు కేఫ్ కు వచ్చినప్పుడు పాటించాల్సిన నిబంధనలను కూడా కేఫ్ యాజమానులు ముందుగానే సూచిస్తున్నారు. పిల్లులను కొట్టడం, వినోదంకోసం విన్యాసాలు చేయించడం, గట్టిగా కౌగలించుకోవడం నిషిద్ధమని చెప్తున్నారు. ముఖ్యంగా పిల్లులను సందర్శించేందుకు వచ్చేవారు కుక్కలను తీసుకొని రావడాన్ని నిషేధిస్తున్నారు. అంతేకాదు ఇష్టం ఉన్నవారు పిల్లలకు డొనేట్ చేయొచ్చునని, అలాగే వారింట్లో పెంచుకునే పిల్లలను కూడా తమ సంస్థలకు దత్తత ఇవ్వొచ్చని చెప్తున్నారు. -
ఇది కేకు కాదను కోక
హెడ్లైన్ తప్పనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది నిజం. పట్టు చీరలా ధగధగలు ఒలకబోస్తోన్న ఆ శారీని చూసి అత్తింటివాళ్లు నోరెళ్లబెడితే.. ఆ చీరలో నుంచి చిన్న ముక్క తీసి అత్త నోట్లో పెట్టి ఆశ్చర్యపరిచిందట కోడలు. బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ట్రెండ్స్ సిటీలో కొంగొత్త పోకడలు పోతున్న ధోరణికి కేక పుట్టించే కోక కేకు ఓ చిరు ఉదాహరణ. - చల్లపల్లి శిరీష బర్త్‌డే, మ్యారేజ్ డే, ఫ్రెషర్స్‌డే, ఫేర్వెల్ డే, న్యూఇయర్.. సెలబ్రేషన్ ఏదైనా తన ప్రాధాన్యతను విస్తరించుకుంటూ నేనే ఫైన్ అంటోంది కేక్. నిజానికి ఇప్పుడు కేక్ రుచి చూడని వేడుకలు అత్యంత స్వల్పమనే చెప్పాలి. నూతన వేడుకలకు నేను సైతం అంటూనే ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఆధునికులను ఆకట్టుకుంటోంది రకరకాల ఫ్లేవర్లతో చవులూరించే కేక్. చాక్లెట్, స్ట్రాబెర్రీ, వెనీలా, బనానా.. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్లలో విభిన్న ఆకృతులతో సందడి చేస్తోంది. అదే క్రమంలో రుచిలో, ఆకృతిలో లేటెస్ట్గా వచ్చింది త్రీడీ కస్టమైజ్డ్ కేక్. ఇంటీరియర్ టు కేక్ డిజైనర్ నేను ఇంటీరియర్ డిజైనర్‌ని. కేక్ తయారీ అంటే చాలా ఇష్టం. హాబీగా కేక్‌లు తయారు చేసేదాన్ని. త్రీడీ కేక్‌లు క్రేజీగా మారాక వాటి తయారీలో చాలా బిజీ అయ్యాను. 1.75 కి .గ్రాల బరువు కలిగిన త్రీడీ చీర కేక్‌ను ఎలాంటి మౌల్డ్‌లు ఉపయోగించకుండా స్వహస్తాలతో తయారు చేశాను. కేక్‌పై డెకరేషన్ కోసం 8 గంటలు కష్టపడ్డాను. దీని తర్వాత ఎంగేజ్మెంట్ల కోసం వెడ్డింగ్ రింగ్ కేక్, జ్యువెల్లరీ సెట్ కేక్, తాంబూలాల కేక్.. అంటూ నెలకు దాదాపు 50 నుంచి 60 రకాల ఆర్డర్లు వ స్తున్నాయి. అనేక థీమ్‌లతో ఆర్డర్లు రావడం.. నా క్రియేటివిటీకి పదును పెడుతున్నాయి. - తన్వీ పల్శికర్ అత్తకు ప్రేమతో... ఇది మాఘ మాసం. శుభకార్యాల సీజన్.ఎంగేజ్మెంట్, పెళ్లి, మెహందీ ఫంక్షన్లు, బ్యాచిలర్ పార్టీలకు కొదవుండదు. ప్రతీ వేడుకలోనూ ‘కేక్’దే హడావిడి. ఈ క్రమంలోనే నగరానికి చెందిన కోడలు అత్తగారి పుట్టినరోజు కోసం కేక్‌ను విచిత్రంగా డిజైన్ చేయించింది. ఆ మహారాష్ట్ర ఫ్యామిలీ కోడలు తన అత్తగారి ఇంటికెళ్లి ఆమె చేతిలో ఆప్యాయంగా పెట్టిన పట్టు చీర ఏంటో తెలుసా..? నిజానికి ఓ త్రీడీ కస్టమైజ్డ్ కేక్. ‘మా అత్తకు ఎంతో ఇష్టమైన పైథాని సిల్క్ చీర, నగలను పోలి ఉండేలా కేక్ తయారు చేయించాలనుకున్నాను. అదే ఆర్డర్ చేశాను. దాదాపు ఒక రోజంతా కష్టపడి చీరలా ఉండే త్రీడీ కేక్‌ను తయారు చేశారు బేకరీ నిర్వాహకులు. చీర కొంగు మీది డిజైన్‌తో పాటు, నేను చూపించిన జ్యూవెల్లరీ అచ్చుగుద్దినట్లు తయారు చేసి ఔరా అనిపించారు. దీన్ని మా అత్తగారికి అందిస్తే ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయ’ని గుర్తు చేసుకుందా కోడలు. ఈ కేక్ సహజంగానే అత్తగారి పుట్టినరోజు వేడుకలో ప్రధాన ఆక ర్షణగా నిలిచింది. అతిథులంతా ఫేస్బుక్, ట్వీటర్లో కేక్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటే కోడలు పిల్ల తెగ సంబరపడిపోయింది. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు... ఒక్క కేక్ తయారీతో ఆర్డర్లతో బిజీ అయిపోయారు దానిని తయారుచేసిన తన్వీ పల్శికర్. -
చిన్నారులను ఆకట్టుకుంటున్న కేక్ షో
-
అనంతలో వైఎస్ జగన్ బర్త్‌డే వేడుకలు
-
మెత్తని కత్తి... మైదా!
తిండి గోల ఆరోగ్యం బాగా లేకపోతే బ్రెడ్ తినిపిస్తాం. పుట్టిన రోజుకు కేక్ కట్ చేసి సంబరం చేసుకుంటాం. పండగ రోజున కాజానో, బొబ్బట్లో, గులాబ్జామూన్తోనో ఆనందాన్ని పంచుకుంటాం. బ్రెడ్, కేక్, గులాబ్‌జామూన్ ... వీటి తయారీలో మైదా అనే ఒక మృదువైన పిండిపదార్థాన్ని వాడతారు. బాగానే ఉంది కానీ, ఈ పిండిని ఎలా తయారుచేస్తారో తెలుసా! గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేసి, రసాయనాలు కలిపి దీనిని తయారుచేస్తారు. రసాయనాల వల్ల పిండి బాగా తెల్లగా, మెత్తగా మారిపోతుంది. దీంతో దీనిని బ్లీచ్డ్, రిఫైండ్ ఫ్లోర్ అని కూడా అంటుంటారు. మైదాలో అలొక్సన్ అనే విషపూరితమైన రసాయనం వాడుతారని, అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుందని, దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయనే విమర్శలు అంతటా అధికంగా ఉన్నాయి. మైదాలో ఉపయోగించే రసాయనాలపై చైనాలో కొన్నేళ్ల క్రితం నుంచే నిషేధం ఉంది. మైదా మధ్య, ఉత్తర ఆసియా వంటకాలలో అధికంగా వాడతారు. మన దగ్గరైతే వాల్‌పోస్టర్లు అతికించడానికీ,. పరోటాలు చేయడానికీ మైదానే ఉపయోగిస్తారు. అలాగే బేకరీ పదార్థాలలోనూ మైదా అధికంగా వాడతారు. గోధుమలను ఎక్కువగా పండించే యూరప్, అమెరికా దేశాలలో ఈ పిండిని అధికంగా ఉపయోగిస్తారు. క్రీ.స్తు పూర్వం 6 వేల ఏళ్ల క్రితమే ఈ దేశాలలో పిండి వాడకం ఉంది. పారిశ్రామిక రంగం ఊపందుకున్న నాటి నుంచి మరీ ముఖ్యంగా 1940 నుంచి 1990ల కాలంలో పిండి నిల్వ ఉండటానికి ఎన్నో పద్ధతులు అవలంబిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మైదా మరింత మెత్తగా మన ఆరోగ్యాన్ని కోస్తూ వస్తోంది. కాబట్టి, మైదాతో తయారయ్యే పదార్థాలను తీసుకోవడం కొంత తగ్గించడమే మేలు. -
కోరుకోని కేకులు!
సమ్‌థింగ్ నాట్ స్పెషల్ పాశ్చాత్య సంస్కృతిలో వివాహ వేడుక సందర్భంగా కేక్ కట్ చేయడం ఆనవాయితీ. అది ఒకప్పటి మాట. ఇప్పుడు నిశ్చితార్థం, వివాహ సందర్భాల్లో కేక్ కట్టింగ్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆచారంగా మారింది. అలాంటి కేక్‌కు వధూవరులిద్దరూ ఎంతో ప్రాముఖ్యం ఇస్తున్నారు. తమకు నచ్చాలే కానీ ఎంత డబ్బునైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తమకు ఇష్టమైన డిజైను సెలెక్ట్ చేసి మరీ ఆర్డర్ ఇస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో డబ్బును భారీగా ఖర్చు చేసినా పెళ్లిరోజు మాత్రం వారికి నిరాశే మిగులుతోంది. వాటికి సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. ఆ సాక్ష్యాలను పొందరుపరచడానికి 2008లో ఫ్లోరిడాకు చెందిన జెన్, జాన్ అనే దంపతులు ఓ బ్లాగ్‌ను ప్రారంభించారు. అదే ‘కేక్వ్రెక్స్ డాట్ కామ్’.. అందులో ఎవరైనా తాము ఆర్డర్ ఇచ్చిన కేక్ డిజైన్‌ను, అలాగే పెళ్లిరోజు తమకు బేకరీ వాళ్లు తీసుకొచ్చి ఇచ్చిన అడ్డదిడ్డమైన డిజైన్‌లో ఉన్న కేక్‌ను ఫొటోలు తీసి పంపొచ్చు. ప్రస్తుతం ఆ బ్లాగ్‌లో ఉన్న కేకుల ఫొటోలు చూస్తే మీరూ అయ్యో.. పాపం అనక తప్పదు. మూడు స్టెప్పులు ఉండాల్సిన కేక్ కేవలం ఒక స్టెప్‌గా తయారు చేసి పంపినవీ, ఎంతో అందంగా ఉన్న డిజైన్ కేక్ చేయమంటే దాన్ని వింతగా తయారు చేయడమే కాకుండా దాని మీద వాడిపోయిన పూలు పెట్టిమరీ డెలివరీ చేసిన కేకులు... ఇలా ఎన్నో రకాల కేకులను ఆ బ్లాగ్‌లో చూడొచ్చు. తమ బ్లాగులో ఇలా కేక్స్‌ను పెట్టడానికి కారణం బేకరీ వాళ్లను అవమానించాలని కాదని జెన్ దంపతులు అంటారు. జీవితంలో వివాహ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆ రోజు అలాంటి కేకును ఇచ్చి వధువరులిద్దరినీ నిరుత్సాహపరచడం భావ్యం కాదని వారి ఉద్దేశం. అయినా ఆర్డర్ ఇచ్చిన డిజైన్‌లో కేక్‌ను తయారు చేసి ఇస్తే కొత్త దంపతులు ఆనందంగా ఉంటారు కదా. -
45 కోట్ల రూపాయల కేక్
లండన్: ఇది కేక్ అంటే కేక్ కాదు! పదిలంగా వజ్రాలు పొదిగిన కేక్. విగ్రహాల్లా బొమ్మలు చెక్కిన కేక్. దీని ధర వింటే మాత్రం తినకముందే కళ్లు తిరిగడం ఖాయం. అక్షరాల 45 కోట్ల రూపాయల కేక్. దీన్ని తయారు చేసిందీ అట్లాంటీ ఇట్లాంటీ మహిళ కాదు. ప్రముఖ బ్రిటీష్ డిజైనర్ డెబ్బీ వింగమ్. దాదాపు 11 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్‌ను డిజైన్చేసి అమ్మిన రికార్డు ఆమె పేరు మీదే ఉంది. ఇప్పుడు ఈ కేక్‌ను కూడా అమ్మేశారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త 45 కోట్ల రూపాయలు చెల్లించి తన కూతురు బర్త్ డే కమ్ ఎంగేజ్మెంట్ పార్టీకి తీసుకెళ్లారట. ఆయన పేరును మాత్రం వెల్లడించలేదు. ఇన్‌కం టాక్స్ బెడద కాబోలు. ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన కేక్ ప్రపంచ రికార్డుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును తాను బద్దలుకొట్టానని బ్రిటీష్ డిజైనర్ డెబ్బీ వింగమ్ తెలిపారు. ఆరడుల పొడవున్న ఈ కేక్ వెయ్యి పౌండ్ల బరువుందని, దీన్ని తయారు చేసేందుకు 1100 గంటలు పట్టిందని ఆమె చెప్పారు. కేక్‌లో మొత్తం నాలుగువేల రంగురంగుల వజ్రాలను పొదిగామని, అందులో 17 వజ్రాల విలువే దాదాపు 30 కోట్ల రూపాయలు ఉంటుందని ఆమె తెలిపారు. కేక్ కేవలం వజ్రాలతో మెరిసిపోవడమే కాదని, అనేక చాక్లెట్ ఫ్లేవర్లు కలిగిన ఈ కేక్‌ను తిన్న వారు ఆ రుచిని కూడా కేక్లాగే మరచిపోరని డెబ్బీ వింగమ్ చెబుతున్నారు. ఆమె మాటల్లో నిజం ఎంతుందో తెలుసుకోవాలంటే దాన్ని కొనుక్కున్న అరబ్ వ్యాపారి ఎవరో, ఆయన కూతురు ఎంగేజ్మెంట్ ఎప్పుడో కనుక్కోవాల్సిందే. -
వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో కేక్‌కట్ చేసిన వైఎస్జగన్
-
బేకింగ్ సోడాతో హోమ్ మేకింగ్
కిచెన్ కిటుకు కేక్‌లు, కుకీస్ వంటివి గుల్లగా రావడం కోసం వాటి తయారీలో బేకింగ్ సోడాని వాడుతుంటాం మనం. కానీ అది వంట చేయడానికే కాదు... చాలా వాటికి పనికొస్తుంది. చాలా పనులు చేసిపెడుతుంది. అవేంటంటే...{ఫిజ్ కనుక దుర్వాసన వస్తుంటే, ఓ చిన్న గిన్నెలో బేకింగ్ సోడా వేసి లోపల ఉంచితే చాలు. ఆ వాసన పోతుంది;ఆభరణాలు కిలుం పట్టినట్టుగా తయారైతే... బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి, దానితో కడిగితే తిరిగి మెరుస్తాయి; మన దంతాలు రంగు మారినప్పుడు బేకింగ్ సోడాలో ఉప్పు కలిపి తోముకుంటే మళ్లీ తెల్లగా అయిపోతాయి;నేలమీద పడిన నూనె జిడ్డు వదలకుండా ఉంటే కాసింత బేకింగ్ సోడా చల్లి కడిగితే జిడ్డు పోతుంది.అలాగే వంటగిన్నెల జిడ్డును కూడా బేకింగ్ సోడాతో కడిగి పోగొట్టవచ్చు;డస్ట్‌బిన్ వాసన వస్తుంటే అందులో కాస్త బేకింగ్‌సోడా చల్లితే సరి; స్నాక్స్ దుర్వాసన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ వాసన వదిలించడానికి నీటిలో బేకింగ్ సోడా వేసి నానబెట్టి ఉతికితే ఫలితముంటుంది;లంచ్ బాక్సులు వాసన వస్తుంటే వాటిని నీటితో నింపి, అందులో కాస్త బేకింగ్ సోడా వేసి నాననిచ్చి, గంట తర్వాత కడిగేస్తే వాసన మాయమౌతుంది;పిల్లలు గోడమీద గీసిన పెన్నుగీతలు పోవాలంటే తడి స్పాంజికి బేకింగ్‌సోడా అద్ది తుడవాలి. -
నీతూ బుద్ధి
పిల్లల కథ ఈ పోటీ మార్కుల చదువుల్లో పిల్లలకు మంచి నడత గురించి చెప్పే టీచర్లు తక్కువ. ముఖ్యంగా తిండి గురించిన పద్ధతులు ఇంట్లో అమ్మానాన్నలు, పెద్దలు చెప్పాలి. నవనీత్‌ని అందరూ ‘నీతూ’ అని పిలుస్తారు. వాడికున్నంత తిండి ‘యావ’, తిండిపోతులా కనిపించే వాడి చేష్టలూ ఆ తరగతిలో ఎవరికీ లేవు. వాడు తెచ్చుకున్న టిఫిన్ ఒకరికి పెట్టడు. ఎప్పుడూ ఎవరిదో తిన చూస్తాడు. ఎవ్వరేం తెచ్చుకున్నారో వాడికి చూపాలి. లేదంటే యుద్ధం ప్రకటిస్తాడు. తనకు నచ్చినది ఏదైనా ఉంటే.... అది పదింతలు తినేస్తానంటాడు. ఇంకొకరి గురించి చూడకుండా ఏది కనబడ్డా ముందు తనే తినడం వాడి అలవాటు. పదిమంది కోసం తెచ్చిన స్వీటు చాటుగా ఒక్కడే మెక్కేయ చూస్తాడు. ‘‘లడ్డూలు యాభై తింటాను, మాజా ఇరవై తాగుతాను, చాక్లెట్లు ముప్పై తింటాను’’ అంటూ ఉంటాడు. వీడి వింత ప్రవర్తన క్లాసు టీచర్‌కి సమస్యగా ఉంది. ఒకసారి ఆదివారం క్లాసు పిల్లలందరినీ జూపార్క్‌కి పిక్నిక్ తీసికెళ్లింది టీచర్. అంతా తిరిగి చూశాక.... పెద్ద చెట్టు నీడన అందరూ కూర్చున్నారు. టీచర్ వాళ్ళతో ‘‘ఈ ఫిక్నిక్ ఇవ్వాళ నీతూ ఆనందం కోసం... నీతూ ఈ దినం తన తిండి గొప్పతనం మనకు చూపిస్తాడు. అందరూ చప్పట్లు కొట్టండి’’ అంది. అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడ దిమ్మెలాంటి సిమెంట్ బెంచీ ఉంది. దాని మీద నీతూని కూర్చోబెట్టారు. నీతూ గొప్పలుపోతున్నాడు. వాడి ముందు క్లాసు పిల్లలంతా ఉన్నారు. టీచర్ అందరికీ రెండేసి ‘‘కేక్ పేస్ట్రీ’’లు పంచింది. తను చెప్పేవరకు ఎవ్వరూ తినకూడదని చెప్పింది. తర్వాత నీతూ దగ్గర నిలబడి ‘‘మీ అందరికన్నా నీతూకి తినడం అంటే ఇష్టం కదా, అందుకే మీరందరూ నీతూ కోసం మీ దగ్గరున్న రెండు ‘పేస్ట్రీ’ల నుండి ఒకటి ఇచ్చేయాలి! వరుసగా రండి, అందరూ ఒక్కొక్కటి ఇచ్చేయండి’’ అని చెప్పింది. నీతూకు భలే అనిపించింది. వాడి ముందు ఒక పేపర్ పరిచారు. అందరూ ఒక్కోపేస్ట్రీ వాడి ముందుపెట్టారు. తిరిగి వెళ్లి కూర్చున్నారు. ‘‘ఇప్పుడు మన అందరికన్నా ఎక్కువగా తింటాడు నీతూ... ఇవాళ ముప్పై ఆరుమంది మీరు, మీకిచ్చిన కేక్‌లలో ఒకటి వీడికి ప్రేమతో ఇచ్చారు. మీ ముందు ఇక అన్నీ తినేస్తాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. తినకపోతే సారీ చెప్పి లెంపలేసుకుంటాడు. ఇవి అన్నీ తినేస్తే నేను వీడు అడిగిన బహుమతి ఇస్తాను’’ అని చెప్పింది టీచర్. పిల్లలందరూ మళ్లీ చప్పట్లు కొట్టారు. కేక్ తినడం మొదలుపెట్టాడు నీతూ. ఒకటి... రెండు... మూడు... నాలుగు... అంతే, ఐదో కేక్ నోటిదగ్గరే ఆగిపోయింది. భయంగా టీచర్ దిక్కు చూస్తున్నాడు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ... ‘‘తినూ.... తినూ.... నీతూ.... తినూ.....’’ అంటున్నారు ‘రిథమిక్’గా. టీచర్ చేయి ఊపగానే అందరూ మౌనంగా కూర్చున్నారు. నీతూ ముందు ‘కేక్’ల కుప్ప.... ‘రాశి’ పోసినట్టుగావుంది. ఒకరు లేచి నిలబడి ‘‘నా టిఫిన్ రోజూ లాక్కొని తింటావ్గా తినూ!’’ అన్నాడు. మరొకరు ‘‘నేను ఏదన్నా ఇవ్వకుంటే తంతావుగా మరి తిను’’ అన్నాడు. ‘‘అన్నీ నీకే కావాలిగా తినవేంరా’’ అని ఇంకొకరు. ఐదో కేక్ బలవంతంగా తిన్నాడు. టీచర్ ‘‘ఊ! కానీ’’ అంది గట్టిగానే. ఇక తట్టుకోలేక ఏడుపు ముంచుకొచ్చింది నీతూకి. ఏడ్చాడు. ఆ తరువాత నీతూ ఎప్పుడూ ‘‘అతిగా వెళ్లక’’ అందరిలాగే ఉండడం నేర్చుకున్నాడు. -
బెజవాడలో కేక్ కట్ చేసిన చంద్రబాబు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి, ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ...చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కాగా అంతకు ముందు చంద్రబాబు లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసిన కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అబిడ్స్ అబిడ్స్ చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్...కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరులకు క్రైస్తవ భవన్ నిర్మిస్తున్నామని, జీసస్ దయతో క్రిస్మస్కు ఒకరోజు ముందే భవనానికి శంకుస్థాపన జరిగిందన్నారు. అందుకోసం రూ.10కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీతో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, కత్తి పద్మారావు, కె. కేశవరావు, ఎంపీ కవితతో పాటు పలువురు హాజరయ్యారు. -
నో అండం... ఓన్లీ బ్రహ్మాండం
కేకు శాకాహారమా మాంసాహారమా? ఏదో ఒక ఆహారం... మాకైతే వద్దు బాబూ... ఎవరక్కడ! మీరేనా కేకు వద్దందీ? క్రిస్మస్ వస్తోంది, న్యూ ఇయర్ వస్తోంది. మధ్యమధ్య బర్త్‌డేలూ వస్తుంటాయి. వితౌట్ కేక్ ఎలా వితౌట్ కేక్ అనడం లేదు, వితౌట్ ఎగ్ అంటున్నాం. అంటే... గుడ్డు కలపని కేక్ దొరికితే కుమ్మేస్తారన్నమాట. అంతేగా..! మీరుగానీ అరేంజ్ చేస్తారేమిటి? ఆల్రెడీ అరేంజ్డ్. కావలసిన పదార్థాలున్నాయి. తయారీ విధానం ఉంది. బేక్ చేస్కోండి. కేక్ చేస్కోండి. కట్ చేస్కోండి. ఆ తర్వాత... ఏం చేస్కోవాలో మీకు చెప్పేటంతటి వాళ్లమా చెప్పండి! వెనిలా కప్ కేక్స్ కావలసినవి: ఉప్పు - 2 కప్పులు ; బటర్ - పావు కప్పు; పంచదార పొడి - పావు కప్పు; వెనిలా ఎసెన్స్ - టీ స్పూను; కండెన్స్‌డ్‌మిల్క్ - అర కప్పు; బేకింగ్ పౌడర్ - టీ స్పూను; మైదా పిండి - కప్పు; సోడా - అర కప్పు (క్లబ్ సోడా); చెర్రీస్ - 20 తయారీ: కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలక్కొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలక్కొట్టాలి ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి సోడా (క్లబ్ సోడా వంటివి) వేసి బాగా కలపాలి కప్ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. (విజిల్ పెట్టకూడదు) సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి చల్లారాక బయటకు తీసి అందించాలి. చాకొలేట్ నట్స్ కేక్ కావలసినవి: మైదా పిండి - కప్పు; కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ పౌడర్ - టీ స్పూను; కోకో పొడి - 2 టేబుల్ స్పూన్లు; బటర్ - పావు కప్పు; పంచదార పొడి - పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ - అర కప్పు; జీడిపప్పు తరుగు - 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; బ్లూ బెర్రీలు (ఎండబెట్టినవి) - 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ - టేబుల్ స్పూను; ఖర్జూరం తరుగు - టేబుల్ స్పూను; ఉప్పు - ఒకటిన్నర కప్పులు తయారీ: ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి బేకింగ్ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలక్కొట్టాక, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. (ఎంత ఎక్కువ సేపు గిలక్కొడితే అంత రుచిగా వస్తుంది) ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి యేడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి. (బటర్ బదులు బటర్ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు) ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లితే బాగుంటుంది. బ్లూ బెర్రీ రసగుల్లా చీజ్ కేక్ కావలసినవి: బిస్కెట్లు - 125 గ్రా.; కరిగించిన బటర్ - 75 మి.లీ.; క్రీమ్ చీజ్ - 200 గ్రా.; పంచదార పొడి - 1/3 కప్పు; క్రీమ్ - 300 మి.లీ. (బాగా గిలక్కొట్టాలి); కండెన్స్డ్ మిల్క్ - 200 మి.లీ.; చైనా గ్రాస్ - 10 గ్రా.; బ్లూ బెర్రీలు - 3 టేబుల్ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు - 3 టేబుల్ స్పూన్లు; చిన్న రసగుల్లాలు - 30 తయారీ: బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్లో నెమ్మదిగా వేస్తూ కలపాలి. (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది) ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి 1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి ఒక పాత్రలో క్రీమ్ వేసి బాగా గిలక్కొట్టాలి మరో పాత్రలో క్రీమ్ చీజ్, పంచదార పొడి వేసి గిలక్కొట్టాలి సన్నని మంట మీద పాన్ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి పాన్‌లో కండెన్స్డ్ మిల్క్ వేసి గోరు వెచ్చన చేసి, ఉడికించిన చైనా గ్రాస్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి ఈ మిశ్రమాన్ని క్రీమ్ చీజ్ మిక్స్‌కి జత చేసి బాగా గిలక్కొట్టాలి బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి. (బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు) గిలక్కొట్టిన క్రీమ్, రసగుల్లాలను వేయాలి కేక్ టిన్‌లో చీజ్ కేక్ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి కేక్‌ను టిన్ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి. ఫ్రెష్ ఫ్రూట్ కేక్ కావలసినవి:...: మైదా పిండి - కప్పు; బటర్ - పావు కప్పు; పంచదార పొడి - పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ - అర కప్పు; తాజా క్రీమ్ - పావు కప్పు; బేకింగ్ పౌడర్ - టీ స్పూను; కస్టర్డ్ పౌడర్ - టీ స్పూను; వెనిలా ఎసెన్స్ - టీ స్పూను; ఉప్పు - 2 కప్పులు; చిలకరించిన క్రీమ్ - 500 గ్రా.; పంచదార పొడి - పావుకప్పు; పంచార సిరప్ - పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు - (కివి, కమలాపండు తొనలు, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు....); స్ట్రాబెర్రీ వేఫర్స్ - తగినన్ని తయారీ: కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ ఉంచి, స్టౌ మీద మీడిమం మంట మీద ఉంచాలి మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలిపాక, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలక్కొట్టాక, పావు కప్పు క్రీమ్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి మైదాపిండి, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్... వీటిని జల్లెడ పట్టి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి ఏడు అంగుళాల అల్యూమినియం కేక్ ట్రే కి బటర్ రాసి, కేక్ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్ చేసి కేక్‌ను బయటకు తీయాలి 500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలక్కొట్టాలి. పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలక్కొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి) కేక్‌ను ఒక ప్లేట్లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్ చేయాలి చాకుతో కేక్ చుట్టూ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార సిరప్ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి. ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అర గంట సేపు ఉంచి తీయాలి చివరగా మళ్లీ కేక్ మీద క్రీమ్ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా మనకు నచ్చిన వాటితో (స్ట్రాబెర్రీ వేఫర్లు బాగుంటాయి) అలంకరించి సుమారు 4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచి అందించాలి. -
అచ్చంగా ఆరొందల అడుగుల కేక్..
వందల కేజీలకొద్దీ బరువైన కేకును మీరు చూసుంటారు. కానీ ఇది వేలకిలోల బరువైన కేకు. బరువు 3,120 కేజీలు. ఈ కేకు పొడవు ఎంతనుకుంటున్నారు? అక్షరాలా ఆరొందల అడుగులు. కేరళ రాష్ట్రంలోని ‘బేకర్స్ అసోసియేషన్’ సంస్థ వారు దీనిని తయారుచేశారు. దేశంలోనే అత్యంత పొడవైనది కాబట్టే ఈ కేకు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో చోటు సంపాదించేసింది. త్రిసూర్‌లో గురువారం ప్రారంభమైన ‘బేక్ ఎక్స్పో 2014’లో దీనిని ప్రదర్శించారు. దేశంలోనే వృద్ధ మహిళగా తాజాగా రికార్డులకెక్కిన కుంజనమ్(112) ఫొటో సహా 700 మంది ప్రముఖుల చిత్రపటాలను ఈ కేకుపై చిత్రించారు. భారత్‌లో కేకును తొలిసారి తయారుచేసి 131 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్పోను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.