అభివృద్ధి వేగం పెంచుతాం | jupalli krishna rao in new year celebrations | Sakshi
Sakshi News home page

అభివృద్ధి వేగం పెంచుతాం

Published Mon, Jan 2 2017 2:05 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

అభివృద్ధి వేగం పెంచుతాం

అభివృద్ధి వేగం పెంచుతాం

కొల్లాపూర్‌ : 2017లో అభివృద్ధి వేగాన్ని పెంచుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి తినిపించారు. అనంతరం వృద్ధాశ్రమంలోనూ కేక్‌ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ ఎక్బాల్, ఎంపీపీ నిరంజన్ రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్లు రఘుపతిరావు, ఖాజామైనొద్దీన్, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు శేఖర్‌రెడ్డి, బోరెల్లి మహేష్, రహీంపాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement