Mini Stadium
-
రికార్డులకెక్కిన ‘షర్మస్’ క్రికెట్ స్టేడియం
సాక్షి, అనంతపురం: తక్కువ ఖర్చుతో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించవచ్చని నిరూపించాడు కణేకల్లు కుర్రాడు. తన ప్రతిభకు పదను పెట్టి ‘ఎస్’ ఆకారంలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మించి ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. కణేకల్లులోని శ్రీ విద్యానికేతన్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మనేగర్ షర్మస్.. గతేడాది లాక్డౌన్ సమయంలో ఇంట్లో సమయాన్ని వృథా చేయకుండా మినీ క్రికెట్ స్టేడియం ఎలా నిర్మించాలో ఆలోచించాడు. ప్రస్తుతమున్న స్టేడియాలకు భిన్నంగా ‘ఎస్’ ఆకారంలో నాలుగు ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తూ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేలా ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నమూనా రూపొందించాడు. దీని కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశాడు. అనంతరం తన డెమో గురించి వివరిస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వారికి మెయిల్ పంపగా.. వారు ఇటీవల దాన్ని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు షర్మస్కు మెడల్, సర్టిఫికెట్ పంపారు. ఈ డెమాతో షర్మస్ పలు రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా స్టేడియం నిర్మాణ పేటెంట్ హక్కును కూడా పొందాడు. మంVýæళవారం కణేకల్లులో జరిగిన కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్పర్సన్ ఉషారాణి, శ్రీవిద్యానికేతన్ స్కూల్ కమ్ కాలేజీ కరస్పాండెంట్ రవికుమార్ అభినందించారు. స్టేడియం ప్రత్యేకతలు ఇలా.. ► క్రికెట్ రెండు వైపుల మాత్రమే(టూఎండ్స్) ఆడాలి. ► షర్మస్ స్టేడియంను 360 డిగ్రీలో నిర్మించడం వల్ల నాలుగు వైపులా ఆడొచ్చు. ► వర్షం వస్తే మ్యాచ్ ఆగినా.. వెంటనే ప్రారంభంమయ్యేలా చర్యలు. ► వర్షపు నీరు వెళ్లేందుకు కింద గ్రాస్‌కు రంధ్రాలు ఏర్పాటు చేసి డ్రైనేజీ సిస్టమ్. ► హీటింగ్ ప్యాడ్స్ ఉంచడంతో అరగంటలో గ్రౌండ్ అంతా డ్రై అయిపోతుంది. దీంతో వెంటనే ఆటనుప్రారంభించవచ్చు. ► స్టేడియంలో ఎక్కువ మంది కూర్చునేలాæ ఆడియన్స్, వీఐపీ, ఫ్లేయర్స్ కోసం కంపార్ట్మెంట్స్ ఏర్పాటు. ► లోయర్ కంపార్ట్మెంట్, మిడిల్ కంపార్ట్మెంట్, అప్పర్ కంపార్ట్మెంట్ల ఏర్పాటు. ► మిడిల్ కంపార్ట్మెంట్ ఫైబర్ గ్లాస్‌తో ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీల కోసం ఈ గ్యాలరీ రూపొందించి ఏసీ ఏర్పాటు చేసేలా ప్లాన్. ► పైభాగంలో ప్రొటెక్టివ్ వాల్ నిర్మించడం వల్ల సూర్య కిరణాలు స్టేడియంలో పడవు. దీంతో ఆటకు ఎలాంటి ఇబ్బందులుండవు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పంపిన మెడల్, సర్టిఫికెట్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు నేను రూపొందించిన స్టేడియం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. తొలుత నాకు ఎస్ ఆకారంలో మినీ స్టేడియం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. గూగుల్‌లో సెర్చ్ చేశాక ఇలాంటి స్టేడియం ఎక్కడా లేదని తెలిసింది. ఆ తర్వాతే నా మేథస్సుకు పదును పెట్టి ‘స్మాలెస్ట్ మోడల్ ఆఫ్ క్రికెట్ స్టేడియం’ నిర్మించాను. నా ప్రాజెక్ట్ వర్క్, స్టేడియం నమూనాను ఢిల్లీలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ ద్వారా పంపాను. వాస్తవానికి వారు వచ్చి విజిట్ చేయాల్సి ఉంది. కానీ లాక్డౌన్ కారణంగా వారు రాలేదు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు నేను రోటరీ చేయించి ప్రాజెక్ట్ తీరును వివరిస్తూ పంపాను. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు అంగీకరించారు. నాకు మెడల్, సర్టిఫికెట్‌ను కూడా పంపారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారి మెయిల్లో కూడా అప్లోడ్ చేశారు. – మనేగర్ షర్మస్ -
అభివృద్ధి వేగం పెంచుతాం
కొల్లాపూర్ : 2017లో అభివృద్ధి వేగాన్ని పెంచుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియంలో పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో కేక్ కట్ చేసి తినిపించారు. అనంతరం వృద్ధాశ్రమంలోనూ కేక్ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్‌చైర్మన్ ఎక్బాల్, ఎంపీపీ నిరంజన్ రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్లు రఘుపతిరావు, ఖాజామైనొద్దీన్, టీఆర్ఎస్ మండల నాయకులు శేఖర్‌రెడ్డి, బోరెల్లి మహేష్, రహీంపాషా పాల్గొన్నారు. -
వచ్చే సంక్రాంతి కల్లా మినీస్టేడియం పూర్తి
► రెండు రోజుల్లో ఇండోర్ పనులు ప్రారంభం ► నిధులు చాలకుంటే ప్రత్యామ్నాయంపై దృష్టి ► ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు : వచ్చే సంక్రాంతినాటికి ఒంగోలులో మినీస్టేడియం నిర్మాణం పూర్తవుతుందని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు పేర్కొన్నారు. మినీస్టేడియం నిర్మాణాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన పరిశీలించారు. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి, హ్యాబ్టెక్ ఇంజినీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్డీవో ఆర్కే యతిరాజ్ మాట్లాడుతూ దాత ఆనంద్ ఇచ్చిన విరాళం రూ.60 లక్షలు ఉందని, దాంతో ఇండోర్‌లో షటిల్ వుడెన్ కోర్టులు, డార్మిటరీలు, ఇండోర్పైన షీట్ వంటివి ఏర్పాటు చేయాలని వివరించారు. ఇక అవుట్‌డోర్‌కు సంబంధించి ప్రస్తుతం క్రికెట్ ప్రాక్టీస్ కోసం వేసిన నెట్లు ఉన్న ప్రాంతంలో బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మించాలన్నారు. దాంతో పాటు ఇండోర్, అవుట్‌డోర్‌లో టాయిలెట్లు నిర్మించాలన్నారు. స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరైతే స్టేడియం నిర్వహణకు ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. స్విమ్మింగ్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మీడియాతో మాట్లాడుతూ గతంలో పర్వతరెడ్డి ఆనంద్ కోటి రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. అందులో ఇంకా రూ.60 లక్షలు మిగిలి ఉన్నాయన్నారు. వీటితో రెండు రోజుల్లో ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభిస్తామన్నారు. అవుట్డోర్ నిర్మాణానికి రూ.2.20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో గ్రౌండ్‌ను లెవల్ చేసి ఆటలకు అనుకూలంగా తయారుచేస్తామన్నారు. చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచి క్రీడాకారులకు డార్మిటరీ సౌకర్యం, బాస్కెట్‌బాల్, కబడ్డీ, క్రికెట్, ఫుట్‌బాల్ తదితర కోర్టులు నిర్మిస్తామని వివరించారు. ఎమ్మెల్యే వెంట డీఎస్డీవో ఆర్కే యతిరాజ్, హ్యాబ్టెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బసవయ్య, అసిస్టెంట్ ఇంజినీర్ పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేటలో మినీస్టేడియం
సిద్దిపేటజోన్, న్యూస్‌లైన్: సిద్దిపేటలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న స్విమ్మింగ్‌పూల్, మినీ స్టేడియాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దనున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేటలో మినీస్టేడియం అభివృద్ధికి ప్రభుత్వం రూ.8కోట్లను మంజూరు చేసిందన్నారు. జీఓ నం. 124 ప్రకారం సిద్దిపేటలో మినీస్టేడియం, రూ.5కోట్లతో అధునాతన స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో ఫిల్టర్ రూములు, మెకానికల్ సెక్షన్, డ్రెస్సింగ్ రూములు, ప్రహరీ, సీసీ రోడ్లను చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.కోటితో చేపట్టనున్న మినీ స్టేడియంలో పెవీలియన్, ఫెన్సింగ్ పనులు, వాలీబాల్ కోర్టును నిర్మిస్తామన్నారు. అదే విధంగా రూ.2.10కోట్లతో ఇండోర్ స్టేడియం, షటిల్, ఫుట్‌బాల్, టెన్నిస్ కోర్టులను నిర్మిస్తామన్నారు. సిద్దిపేట పట్టణంలోని మురికివాడల అభివృద్ధికి రాజీవ్ అవాస్ యోజన పథకం కింద ప్రతిపాదనలు అందజేశామన్నారు. విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకోసం ప్రతిపాదించిన రూ.110కోట్లు త్వరలో మంజూరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణాధ్యక్షులు మర్పల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నెట్‌బాల్ విజేత హైదరాబాద్
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలుర జట్టు సత్తా చాటింది. శామీర్‌పేట్‌లోని మినీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో నగరానికి చెందిన బాలుర జట్టు విజేతగా నిలిచింది. ఖమ్మం జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వరంగల్, కృష్ణా జిల్లా జట్లు సంయుక్తంగా మూడోస్థానం పొందాయి. బాలికల విభాగంలో ఖమ్మం చాంపియన్‌షిప్ సాధించగా, రంగారెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెదక్, కృష్ణా జిల్లా జట్లు ఉమ్మడిగా తృతీయ స్థానం పొందాయి. ఈ టోర్నమెంట్లో 17 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు తీగల కృపాకర్ రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, స్థానిక సర్పంచ్ కిశోర్ యాదవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మనోరంజిత, టోర్నమెంట్ కన్వీనర్ వి.దానయ్య తదితరులు పాల్గొన్నారు.