నోరూరించే కేక్ కథ
పుట్టిన రోజంటే కేక్ కోయాల్సిందే! ఏదైనా వేడుక జరిగినా కేక్ కోయడం తప్పనిసరి. లోపల బ్రెడ్‌తో, పైన క్రీమ్‌తో నోరూరించే కేక్ అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కేక్ చరిత్రేమిటో తెలుసుకుందామా?
కేక్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ఈజిప్టులో కేక్ తయారు చేసినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ మనం చూసే కేక్‌కు భిన్నంగా తేనె, గోధుమపిండితో దాన్ని తయారు చేసేవారు. అప్పట్లో సంపన్నులు వారింటి వేడుకల్లో అతిథులకు కేక్‌ను ఇచ్చేవారని, కేక్ రుచికరంగా మారేందుకు తేనె, తృణధాన్యాలు వాడేవారని చరిత్రకారులు అంటున్నారు.
రోమ్ సామ్రాజ్యంలో సైతం కేక్ తయారీ ఉందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కేక్‌లు తయారు చేసి పూలు, ఇతర ఆకులతో అలంకరించేవారు. అందువల్లే ఆ కాలంలో అవి ఆలివ్ కేక్, ప్లమ్ కేక్‌గా ప్రసిద్ధి పొందాయి.
మొదట్లో కేక్ తయారీకి తేనె వాడేవారు. చక్కెర అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కేతో తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో చక్కెర ఖరీదైన వస్తువు కావడం వల్ల కేక్‌లు కేవలం సంపన్నవర్గాల వారికే పరిమితమయ్యేవి. పుట్టినరోజులు, పెళ్లిరోజుల సమయంలో కేకు కోసి అందరికీ పంచడం అప్పట్లో ఆనవాయితీగా మారి నేటికీ కొనసాగుతోంది.
1764లో డాక్టర్ జేమ్స్ బేకర్, జాన్ హానోన్ కలిసి కోకో గింజలను పొడి చేసి పేస్ట్‌లా మార్చి తొలిసారి చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న కేక్ రూపానికి వారు అంకురార్పణ చేశారు. దీంతో కేక్‌ను వివిధ పదార్థాలతో తయారు చేయొచ్చన్న ఆలోచన అందరికీ వచ్చింది. ఆ తర్వాత 1828లో డచ్‌కు చెందిన శాస్త్రవేత్త కోయెనెరాడ్ జోహన్నెస్ వాన్ హౌటెన్ కోకో గింజల్లో పలు రకాల పదార్థాలు కలిపి, అందులోని చేదును ΄ోగొట్టి కేక్‌ను మరింత రుచికరంగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు.
ఆ తర్వాత బ్రిటిష్ వంటవాళ్లు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల ఫ్లేవర్లలో కేక్‌లు తయారుచేయడం మొదలుపెట్టారు. అందులో గుడ్డు, చక్కెర, వైన్, బాదం, జీడిపప్పు వంటివి కలిపి సరికొత్త ప్రయోగాలు చేశారు. 1947 తర్వాత మైక్రోవేవ్ అవెన్స్ రావడంతో కేక్‌ను బేక్ చేసే ప్రక్రియ సులభంగా మారింది. ప్రస్తుతం వందలాది ఫ్లేవర్లలో కేక్‌లు దొరుకుతున్నాయి. గుడ్డు తినడం ఇష్టపడని వారికోసం ‘ఎగ్‌లెస్ కేక్’ తయారుచేస్తున్నారు. రోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేక్‌లు తయారై అమ్ముడు΄ోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment