interesting
-
ఫోన్ చేసి అడుగుతారంట.. అసలు ఉంటేనే కదా!: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
నోరూరించే కేక్ వెనుక ఇంత హిస్టరీ ఉందా? ఇంట్రస్టింగ్ స్టోరీ
పుట్టిన రోజంటే కేక్ కోయాల్సిందే! ఏదైనా వేడుక జరిగినా కేక్ కోయడం తప్పనిసరి. లోపల బ్రెడ్‌తో, పైన క్రీమ్‌తో నోరూరించే కేక్ అంటే అందరికీ ఇష్టమే. అయితే ఈ కేక్ చరిత్రేమిటో తెలుసుకుందామా?కేక్ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో ఈజిప్టులో కేక్ తయారు చేసినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ మనం చూసే కేక్‌కు భిన్నంగా తేనె, గోధుమపిండితో దాన్ని తయారు చేసేవారు. అప్పట్లో సంపన్నులు వారింటి వేడుకల్లో అతిథులకు కేక్‌ను ఇచ్చేవారని, కేక్ రుచికరంగా మారేందుకు తేనె, తృణధాన్యాలు వాడేవారని చరిత్రకారులు అంటున్నారు. రోమ్ సామ్రాజ్యంలో సైతం కేక్ తయారీ ఉందని చరిత్ర చెబుతోంది. అప్పట్లో కేక్‌లు తయారు చేసి పూలు, ఇతర ఆకులతో అలంకరించేవారు. అందువల్లే ఆ కాలంలో అవి ఆలివ్ కేక్, ప్లమ్ కేక్‌గా ప్రసిద్ధి పొందాయి. మొదట్లో కేక్ తయారీకి తేనె వాడేవారు. చక్కెర అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కేతో తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో చక్కెర ఖరీదైన వస్తువు కావడం వల్ల కేక్‌లు కేవలం సంపన్నవర్గాల వారికే పరిమితమయ్యేవి. పుట్టినరోజులు, పెళ్లిరోజుల సమయంలో కేకు కోసి అందరికీ పంచడం అప్పట్లో ఆనవాయితీగా మారి నేటికీ కొనసాగుతోంది. 1764లో డాక్టర్ జేమ్స్ బేకర్, జాన్ హానోన్ కలిసి కోకో గింజలను పొడి చేసి పేస్ట్‌లా మార్చి తొలిసారి చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న కేక్ రూపానికి వారు అంకురార్పణ చేశారు. దీంతో కేక్‌ను వివిధ పదార్థాలతో తయారు చేయొచ్చన్న ఆలోచన అందరికీ వచ్చింది. ఆ తర్వాత 1828లో డచ్‌కు చెందిన శాస్త్రవేత్త కోయెనెరాడ్ జోహన్నెస్ వాన్ హౌటెన్ కోకో గింజల్లో పలు రకాల పదార్థాలు కలిపి, అందులోని చేదును ΄ోగొట్టి కేక్‌ను మరింత రుచికరంగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వంటవాళ్లు మరిన్ని ప్రయోగాలు చేసి రకరకాల ఫ్లేవర్లలో కేక్‌లు తయారుచేయడం మొదలుపెట్టారు. అందులో గుడ్డు, చక్కెర, వైన్, బాదం, జీడిపప్పు వంటివి కలిపి సరికొత్త ప్రయోగాలు చేశారు. 1947 తర్వాత మైక్రోవేవ్ అవెన్స్ రావడంతో కేక్‌ను బేక్ చేసే ప్రక్రియ సులభంగా మారింది. ప్రస్తుతం వందలాది ఫ్లేవర్లలో కేక్‌లు దొరుకుతున్నాయి. గుడ్డు తినడం ఇష్టపడని వారికోసం ‘ఎగ్‌లెస్ కేక్’ తయారుచేస్తున్నారు. రోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేక్‌లు తయారై అమ్ముడు΄ోతున్నాయి. -
ఊరికే ఇచ్చే డబ్బు వద్దంటూ.. గంగానదిని ఈదాడు
పిల్లలూ! మీరెప్పుడూ అందరూ మెచ్చుకునే స్థితిలోనే ఉండాలి తప్ప ఎవరూ మీ మీద జాలి పడే స్థితిలో ఉండకూడదు. ఈ విషయం మీకు అర్థమవ్వాలంటే ఈ సంఘటన తెలుసుకోండి.అనగనగా ఓ పిల్లవాడు తన తోటివారితో కలిసి గంగానది అవతలి ఒడ్డున జరిగే జాతర చూసేందుకు వెళ్లాడు. అతనిది పేద కుటుంబం. తండ్రి మరణించడంతో బంధువుల వద్ద ఉంటూ తల్లి అతణ్ని పెంచుతోంది. పడవ ఖర్చుల కోసం ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చింది. దాన్ని అతను జాతరలో ఖర్చుపెట్టాడు. తిరిగి వచ్చేటప్పుడు పడవ ఎక్కేందుకు అతని వద్ద డబ్బు లేదు. మేమిస్తామని స్నేహితులు అతనికి చెప్పారు. కానీ ఆత్మగౌరవం కలిగిన అతను ఆ డబ్బు తీసుకోలేదు. స్నేహితులను పడవలో వెళ్లమని చెప్పి, తనొక్కడే నదిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. చూశారా! ఎవరి వద్దా ఊరికే డబ్బు తీసుకోకూడదని అతనికెంత పట్టుదలో! ఆ పిల్లాడెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి. ‘జై జవాన్.. జై కిసాన్’ అన్న నినాదం ఆయన ఇచ్చిందే. అయితే మీరు ఇలాంటి సాహసాలు చేయొద్దు. బాగా ఈత వచ్చిన వారే ఇలాంటివి చేయాలి. స్ఫూర్తిని గ్రహిస్తే చాలు.ఇదీ చదవండి : మెగా మ్యూజియం గురించి తెలుసా? -
లండన్‌లో రతన్‌టాటాతో బిగ్‌బీకి ఎదురైన అనూహ్య అనుభవం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజంగానే కాదు ప్రముఖ దాతగా, అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితం. 86 సంవత్సరాల వయస్సులో, రతన్ టాటా ఇటీవల (అక్టోబర్ 9, 2024) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఒక శకం ముగిసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తమైంది. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షోలో రతన్ టాటాతో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ ఎపిసోడ్లో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ సమయంలో అమితాబ్ రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో తనను డబ్బులు అడిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆయన గురించి నేనేం చెప్పగలను? సాదాసీదాగా జీవనంతో సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తి. ఒకసారి ఇద్దరం ఒకే విమానంలో లండన్‌కు ప్రయాణిస్తూ, చివరకు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పికప్ చేసుకు నేందుకు వచ్చిన వారు కనిపించ లేదేమో బహుశా. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్ కెళ్లి, బయటకు వచ్చిన టాటా కొద్దిగా మనీ ఉంటే ఇస్తారా అని నన్ను అడిగారు. అంటే ఫోన్ చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా! అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అసామాన్యంగా జీవించిన వ్యక్తి అని బిగ్‌బీ పేర్కొన్నారు. అంతేకాదు మరో విషయాన్ని కూడా బిగ్‌బీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ‘‘ఒకసారి స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలు దేరుతుంటే . టాటా వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నా’’ అన్నారు. అసల రతన్ టాటా తనకంటూ ఒక కారు కూడా ఉంచుకోరు అంటే ఎవరమైనా నమ్మగలమా అంటూ వ్యాఖ్యానించిన అమితాబ్ రతన్ టాటా అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. రతన్జీ జీవితం ఎప్పటికీ గర్వకారణమని, గొప్ప సంకల్పంతో ఆయన జాతికి అందించిన సేవలు, విలువలు మరువలేని వన్నారు బిగ్‌బీ.కాగా రతన్ టాటా అస్తమించిన రోజు ఆయనకు నివాళి అర్పించిన బిగ్‌బీ, మరో విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇకసారి ఇద్దరూ విమానంలో కలుసుకున్నపుడు పరస్పరం గుర్తించకపోవడం, చివరికి తాను అమితాబ్ బచ్చన్‌ను అనిచెప్పగానే, నా పేరు రతన్ టాటా అంటూ ఆయన పరిచయంచేసుకోవడం, దీంతో తాను ఆశ్చర్యపోవడం తనవంతైంది అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పెంపుడు శునకాలు అనారోగ్యంతో ఉన్నాయని..
న్యూఢిల్లీ: రతన్ టాటా ఇప్పుడు మన మధ్య లేరు. అయితే అతని జ్ఞాపకాలు, రచనలు నిత్యం మనతోనే ఉంటాయి. రతన్ టాటా చూపిన దాతృత్వానికి సంబంధించిన అనేక ఉదాహణలు మనకు కనిపిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్త సుహైల్ సేథ్.. రతన్ టాటా చాటిన మానవత్వానికి సంబంధించిన ఒక ఘటనను పంచుకున్నారు.ఫిబ్రవరి 2018లో బ్రిటీష్ రాజకుటుంబం రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకుంటున్నట్లు సుహైల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ స్వయంగా రతన్ టాటాకు ఈ బిరుదును ఇవ్వాలనుకున్నారు. అయితే రతన్ టాటా బ్రిటన్ వచ్చేందుకు నిరాకరించారు. అయితే దీని వెనుకగల కారణాన్ని తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్ రతన్ టాటాను మానవతావాదిగా కొనియాడారు.ఈ ఆసక్తికరమైన కథనాన్ని సుహైల్ సేథ్ వివరించారు. 2018, ఫిబ్రవరి 6న ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్‌లో రతన్ టాటాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలనుకున్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని భావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుహైల్ సేథ్ ఫిబ్రవరి 3న లండన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సమయంలో సుహైల్ సేథ్ తన ఫోన్‌ని చూసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో రతన్ టాటా నుండి 11 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వీటిని చూసిన సుహైల్ సేథ్ వెంటనే రతన్ టాటాకు ఫోన్ చేయగా, రతన్ టాటా తాను ఆ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు. తన పెంపుడు శునకాలు టాంగో, టిటోలు అనారోగ్యంతో ఉన్నాయని వాటిని విడిచిపెట్టి, ఈ అవార్డుల ఫంక్షన్‌కి రాలేనని చెప్పారు. ఈ సమాధానం విన్న సుహైల్ సేథ్ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటాను మానవత్వం కలిగిన మహనీయునిగా జంతు ప్రేమికునిగా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నా స్నేహితుడు, మంచి మనిషి: మోదీపై ట్రంప్ ప్రశంసలు -
యమపురికి దారి : యమధర్మరాజు లాంగ్ జంప్ పోటీ, వీడియో వైరల్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలను చూశాం. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఓ మోస్తరు వర్షానికి కూడా రోడ్లపై నరకం చూడాల్సి వస్తోందని ఇప్పటికే సామాన్య జనం సహా, అనేకమంది అసహనం వ్యక్తం చేశారు. ఇవి రహదారులు కాదు, యమపురికి దారులు, రోడ్లపై రక్షణ అనేదే లేకుండా పోయిందంటూ సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు మండిపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బెంగళూరు రోడ్లపై 5,670 గుంతలు ఉన్నాయని బీబీఎంపీ ఇటీవలి సర్వేలో తేలిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.తాజాగా బెంగళూరు రోడ్ల అధ్వాన్న స్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకుద్దేశించిన నిరసన ఆసక్తికరంగా మారింది. కర్నాటకలోని ఉడిపిలో చనిపోయిన వారి కోసం యమరాజు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నాడు అంటూ కార్తీక్ రెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. ఇది నెటిజనులను ఆకట్టుకుంటోంది. యమధర్మరాజు , చిత్రగుప్తుడు రోడ్డు గుంతలను కొలుస్తున్న వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. గుంతలు, అధ్వాన్నమైన రహదారుల కారణంగా సామాన్యుడు గాయపడినా, చచ్చిపోయినా రాజకీయనాయకులు పట్టించుకోరంటూ నెటిజనులు విమర్శలు గుప్పించారు.Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024 -
ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ లెగ్ దాకా.. (ఫోటోలు)
-
ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
నాగాలాండ్‌లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే..ఒకే ఇంట్లో రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్ బోర్డర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్ హంటింగ్‌కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్‌బిల్ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు. ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్లోని కున్యాక్ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్ సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్ మయన్మార్‌లో ఉంటే బెడ్రూం ఏకంగా భారత్‌లో ఉంది. దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది. (చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..) -
చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలకు సాక్షి 'మే 31'!
మే 31వ తేదీ చారిత్రాత్మకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. ప్రముఖులు పుట్టిన రోజు నుంచి ఐక్యత చిహ్నాలను స్వీకరించిన.. ఎన్నో గొప్ప ఘట్టాలకు నిలువెత్తు సాక్షి ఈ రోజు. సమానత్వాన్ని ప్రోత్సహించే చట్టాన్ని రూపొందించడం నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన మ్యూజిక్ ట్యూన్ రికార్డు సృష్టించింది ఈరోజే. చరిత్రలో ఈ రోజున జరిగిన ఆసక్తికర విషయాలు ఏంటంటే..తొలి పోస్టల్ సర్వీస్(1774)ఈ రోజునే భారతదేశంలో 1774లో తన తొలి పోస్టల్ సర్వీస్ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కీలకమైన క్షణం విశాలమైన ఉపఖండాన్ని అనుసంధానించే వ్యవస్థకు పునాది వేయడమే గాక విభిన్న ప్రాంతాలలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేసింది.మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ప్రారంభోత్సవం న్యూయార్క్ నగరంలోని ఒక ఐకానిక్ వేదిక మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ప్రారంభమయ్యింది ఈ రోజే. ఇది లెక్కలేనన్ని క్రీడలకు, మరుపురాని సంగీత వినోద కార్యక్రమాలను వేదికగా మారింది. భారత జాతీయ కాంగ్రెస్ జెండా స్వీకరణ (1921)భారత జాతీయ కాంగ్రెస్ జెండాను జాతీయ జెండాగా స్వీకరించింది మే 31, 1921న. ఇది స్వేచ్ఛ, ఐక్యత, చిహ్నం. పైగా వలస పాలన నుంచి విముక్తి కలిగేల స్వాతంత్ర్య పొరాటిన్ని ఉత్తేజపరిచింది. గంగమ్ స్టైల్దక్షిణ కొరియా కళాకారుడు రూపొందించిన గంగమ్ స్టైల్ ట్యూన్ యూట్యూబ్ వీడియోలో ఏకంగా రెండు బిలయన్ వ్యూస్ కలిగిన తొలి వీడియోగా మే 31న నిలిచింది. ఈ వైరల్ వీడియో సంచలన రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచానికి అనేకమంది కళాకారులను పరిచయం చేసే వేదికగా సోషల్ మీడియా మారింది. దీని వల్లే దక్షిణ కొరియా పాటలు అంతర్జాతీయ ఖ్యాతీని ఆర్జించాయి కూడా. బొంబాయిలో ఎలక్ట్రిక్ ట్రామ్ ముగింపు (1964)బొంబాయి రవాణా వ్యవస్థలో ప్రధానమైన ఎలక్ట్రిక్ ట్రామ్ చివరిసారిగా మే 31, 1964న నడిచింది. ఇది ఒక శకానికి ముగింపు పలికింది. పట్టణ రవాణా సరికొత్త విధానాలకు నాంది పలికింది.రిజర్వేషన్ చట్టం రూపొందించబడింది (2010)భారతదేశంలో గుర్తింపు పొందిన ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు 25% సీట్లను రిజర్వ్ చేస్తూ మే 31, 2010న ఒక మైలురాయి చట్టం రూపొందించబడింది. ఈ చట్టం విద్యా సమానత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.క్లింట్ ఈస్ట్‌వుడ్ పుట్టినరోజు (1930)హాలివుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ 1930లో ఈ రోజునే(మే31) జన్మించాడు. పాశ్చాత్య చిత్రాలలో దిగ్గజ పాత్రలకు పేరుగాంచిన ఈస్ట్‌వుడ్ కెరీర్ అనేక దశాబ్దాలుగా చలన చిత్ర సీమలో కొనసాగింది. అతనికి అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి.ఇందిరా గాంధీ విజ్ఞప్తి (1970)బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధం శరణార్థుల సంక్షోభానికి దారితీసినందున మే 31, 1970న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అంతర్జాతీయ సహాయాన్ని కోరారు. ఆమె విజ్ఞప్తి భయంకరమైన పరిస్థితికి అవసరమైన ప్రపంచ మద్దతును హైలైట్ చేసింది.(చదవండి: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!) -
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)
-
శ్రీనగర్‌లో నువ్వా? నేనా? అంటున్న ఎన్సీ, పీడీపీ?
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఈ నేపధ్యంలో శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం మే 13న ఆసక్తికర పోటీకి సిద్ధమైంది. మొత్తం 17,43,845 మంది ఓటర్లు.. బరిలో ఉన్న 24 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా రెండు లక్షల మంది ఓటు వేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించి, కేంద్ర పాలిత ప్రాంత హోదాను కల్పించారు. ఈ ప్రకియ తరువాత ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ ఎన్నికల పోరు జరుగుతోంది. కశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీనగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 17,43,845 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 8,73,426 మంది పురుషులు, 8,70,368 మంది మహిళలు కాగా, 51 మంది ట్రాన్స్జెండర్లు.భారత ఎన్నికల కమిషన్ అందించిన డేటా ప్రకారం శ్రీనగర్, గందర్బాల్, బుద్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో మొత్తం 2,135 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుండి అఘా సయ్యద్ రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నుండి వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్‌కు అమీర్ భట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు మంచి పట్టు ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ 2014 మినహా 1977 నుండి 2019 వరకు నిరంతరం ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూక్ అబ్దుల్లా 1,06,596 ఓట్లతో విజయం సాధించారు. అయితే 2014లో పీడీపీ అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 1,57,923 ఓట్లతో గెలుపొందడంతో పరిస్థితి మారిపోయింది. కశ్మీర్‌లోని ఐదు స్థానాల్లో మూడింటిని ఎన్సీ కైవసం చేసుకుంది.జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్, రెండు బీజేపీ చేతిలో ఉన్నాయి. శ్రీనగర్ లోక్‌సభ స్థానం నేషనల్ కాన్ఫరెన్స్‌కు బలమైన కోటగా ఉంది. పార్టీ 1947 నుండి 15 పార్లమెంటరీ ఎన్నికల్లో 12 సార్లు ఈ సీటును దక్కించుకుంది.శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అబ్దుల్లా కుటుంబ ఆధిపత్యం మొదటి నుంచి ఉంది. అయితే ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శ్రీనగర్ లోక్‌సభ స్థానాన్ని సున్నితమైన స్థానంగా పరిగణిస్తారు. గత 35 ఏళ్లలో వేర్పాటువాదం, హింసాయుత ఘటనల కారణంగా ఈ ప్రాంతంలో తక్కువ శాతం ఓటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈసారి ఇక్కడి ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. -
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ప్రకృతికి మించి అద్భుతమైనది మరోకటి లేదు. దానికి మించి మనిషి తాను ఏదో కనిపెట్టాలనుకుంటే విధి చేసే మరింత విచిత్రంగా ఉంటుంది. చివరికి మనిషిని సమస్యలో పెట్టి అతడి వాళ్ల నుంచి సమస్యకు పరిష్కరం దొరికేలా చేస్తుంది విధి. అలాంటి రెండు ఆసక్తికర విషయాలు చూద్దామా..!స్టార్ఫిష్లా ఉండే పూలునక్షత్రాకారంలో ఉండే ఈ పూలను స్టార్ఫిష్ కాక్టస్ ఫ్లవర్స్ అని, స్టార్ ఫ్లవర్స్ అని అంటారు. బ్రహ్మజెముడు జాతికి చెందిన ఒక ఎడారి మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఇవి అరచేతి విస్తీర్ణాన్ని మించి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ఊదా, ముదురు ఎరుపు, లేత ఎరుపు, పసుపు, గోధమ రంగుల్లో ఉంటాయి. ఈ పూలు చూడటానికి అందంగానే ఉన్నా, వీటి నుంచి వెలువడే కుళ్లిన మాంసం వాసనను భరించడమే కష్టం. కనిపెట్టిన మెషిన్ గన్తోనేఅమెరికాలో జన్మించిన బ్రిటిష్ ఆవిష్కర్త హైరమ్ స్టీవన్ మాక్సిమ్ మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ను రూపొందించాడు. ఆ మెషిన్ గన్‌తో టెస్ట్ ఫైరింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దానికి ఆయన బధిరుడిగా మారాడు. ఆ తర్వాత ఆయన కొడుకు హైరమ్ పెర్సీ మాక్సిమ్ సైలెన్సర్‌ను కనిపెట్టాడు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?) -
ఉజ్జయినిలో విచిత్ర పోటీ.. ఇద్దరు అనిల్‌లు, ఇద్దరు మహేష్‌లు!
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల ఆసక్తికర వైనాలు కనిపిస్తున్నాయి. దీనిలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఒకటి. ఇక్కడ మే 13న ఓటింగ్ జరగనుంది. ఉజ్జయిని నుంచి మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో ఇద్దరు అనిల్‌లు, ఇద్దరు మహేష్‌లు ముఖాముఖీ తలపడటం విశేషం.ఉజ్జయిని నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగినవారిలో బీజేపీ అభ్యర్థి అనిల్ ఫిరోజియా, కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ పర్మార్, భీమ్ సేన దళ్‌కు చెందిన డాక్టర్ హేమంత్ పర్మార్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రకాష్ చౌహాన్, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గంగా మాలవ్య, మహేష్ పర్మార్,అనిల్, ఈశ్వర్‌లాల్, సురేష్, ఈశ్వర్‌లాల్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.ఉజ్జయిని పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 11 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నీరజ్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది. దీనిలో తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయి. ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి -
Gayatri Reddy Bhatia Photos: ఇప్పుడు కావ్యా మారన్ ఫేమస్.. కానీ అప్పట్లో ఈమె క్రేజ్ వేరు! గుర్తుపట్టారా?
-
Naila Grewal HD Photos: తమాషా అనుకుంది, కట్ చేస్తే ఓటీటీ స్టార్ అయిపోయింది! (ఫొటోలు)
-
చావుబతుకుల మధ్య పోరాటం.. వారం రోజులుగా ఐసీయూలో హీరోయిన్ (ఫోటోలు)
-
దేశప్రధానికే లేఖ.. ఎన్నో హేళనలు, అవమానాలు.. దేనికీ బెదరని నటి (ఫోటోలు)
-
ఆసక్తికరంగా ఛత్తీస్‌గఢ్ పోరు.. ఎవరి ధీమా వారిదే!
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్‌పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008 అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్‌సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది. ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది. 2013 ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం! 2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్‌గఢ్‌లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది. 2018 సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్‌సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్‌స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది. -
రసవత్తరంగా ఉమ్మడి కరీంనగర్ పోరు
సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో ఆపరేషన్ ఆకర్ష జోరుగా సాగుతోంది. అటు అధికార పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి జంపింగ్ జపాంగ్‌లు అటు ఇటూ గెంతుతున్నారు. చేరికల కారణంగా రాజకీయ వాతావరణం జిల్లాలో రసవత్తరంగా మారుతోంది. అయితే ఈ దూకుళ్ళు..చేరికల వల్ల లాభం ఎవరికి? నష్టం ఎవరికి? లేదంటే లాభనష్టాలు లేని చేరికలా? అసలు కరీంనగర్లో ఏంజరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు స్పీడ్‌కు బ్రేకులు వేసి మంథని నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని ఏదో ఒక మండలం నుంచి నిత్యం కనీసం రెండొందల మంది నుంచి వెయ్యి మంది వరకూ కార్యకర్తలు చేరుతుండటంతో.. కాంగ్రెస్ లో సమరోత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో శ్రీధర్‌బాబు మీద ఒకింత అలకతో వెళ్లిపోయిన నేతలు సైతం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో.. మంథని కాంగ్రెస్ లో సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే, మంథని నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీధర్ బాబు ప్రచారంలో లేకపోయినా.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా బిజీబిజీగా హైదరాబాద్, ఢిల్లీ, ఒక్కోసారి బెంగళూరు వంటి చోట్లకు తిరుగుతున్నా.. మంథనిలోని ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో..ముఖ్యంగా శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబు సమక్షంలో ఈ చేరిక ప్రక్రియ ఓ నిరంతర కార్యక్రమంలా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్న హవా.. ప్రజలందరికీ అనుకూలంగా కనిపిస్తున్న మేనిఫెస్టోతోనే కాంగ్రెస్ లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని నాయకులు చెబుతున్నారు. అయితే, ఇదే పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ప్రచారం ఇప్పటివరకూ జరిగినా.. కాంగ్రెస్ లోకి వెళ్లిన కీలక నేతలుగా ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ బాట పడుతున్నారు. ఇప్పటికే సత్యనారాయణ రెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి వంటివారంతా తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో మంథనికి భిన్నంగా ఇక్కడ బీఆర్ఎస్ లోకి చేరికలు కనిపించడం.. కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలతో కొందరు బీఆర్ఎస్ తో పాటు.. బీజేపీ బాట పడుతుండటం వంటివి తమకు కలిసొచ్చే అంశాలుగా అధికార బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరొకవైపు గులాబీబాస్ ఫోకస్డ్ గా ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటైన హుజూరాబాద్ లోనూ పాడి కౌశిక్ రెడ్డి పగ్గాలు చేపట్టాక... పెద్దఎత్తున బీఆర్ఎస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటి నుంచే ఏ గ్రామంలో, ఏ తాండాలో, ఏ హ్యామ్లెట్ విలేజ్ లో ఎంత మంది ఓటర్స్ ఉన్నారు.. వారికి బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఎలా వివరించాలన్న పక్కా లెక్కలతో కౌశిక్ రెడ్డి ఉదయం నుంచీ రాత్రి వరకూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో పనిచేస్తుండటంతో.. హుజూరాబాద్ లో బీఆర్ఎస్ లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తోంది. గత ఉపఎన్నికల్లో వర్కౌటైన సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితులుంటాయా అన్న చర్చ నేపథ్యంలో.. ఇప్పుడు కౌశిక్ దూకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈటలతో పాటు.. కొత్తగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోతున్న ఒడితెల ప్రణవ్ బాబుకు కూడా ఓ సవాల్ వంటిదే. ఇక కరీంనగర్ లోనూ గంగుల కమలాకర్ తిరుగులేని నేతగా ఎదిగిన క్రమంలో.. నిత్యం చేరికల పర్వం కనిపిస్తోంది. కరీంనగర్ కార్పోరేషన్ లో ఐదుగురు కార్పోరేటర్లు బీజేపీకీ గుడ్ బై చెప్పి.. గంగుల నేతృత్వంలో కారెక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈనేపథ్యంలో కరీంనగర్ లో కొత్తగా వచ్చి చేరేవారితో కారు ఫుల్లైపోతోంది. అయితే దీంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తుండగా.. వెళ్లిపోతున్నవారిని ఎలా అడ్డుకోవాలో తెలియక బీజేపీ సతమతమవుతోంది. ఇంకా అభ్యర్థినే ప్రకటించని నేపథ్యంలో.. ఇక కాంగ్రెస్ గురించి పెద్దగా ఇప్పటికైతే చెప్పుకోవాల్సిన పనే లేకుండా పోయింది. ఇక ఇదే పరిస్థితి చొప్పదండిలోనూ మనకు కళ్లకు కడుతోంది. బీఆర్ఎస్ పథకాలు.. నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఖర్చు ఎంత పెట్టామో చెబుతూ స్థానికంగా తయారుచేసిన మేనిఫెస్టోలో 18 వందల కోట్ల రూపాయల నిధుల వెచ్చింపుపై జనం ఆకర్షితులవుతున్నారు. గతంలో కనివినీ ఎరుగని రీతిలో చొప్పదండి నియోజకవర్గంలో మోతె వాగు ద్వారా 30 వేల ఎకరాలకు నీరందుతుండటం.. అభివృద్ధి కళ్లకు కడుతుండటంతో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ నుంచి కార్యకర్తల వలసలు పెరిగి బీఆర్ఎస్ కేడర్‌లో నూతనోత్సాహం వెల్లి విరుస్తోంది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు సెగ్మెంట్లలో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలే.. ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను ఆయా పార్టీల్లోకి తీసుకువస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అయితే, ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలా అన్న యోచనలో నష్టపోతున్న పార్టీలు పట్టించుకోకపోవడం, లైట్ గా తీస్కుంటుండటంతో.. ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదనే చర్చ ఆయా పార్టీల్లోనే అంతర్గతంగా జరుగుతోంది. -
I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
సాధారణంగా మనం కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) అని వస్తూ ఉంటుంది. దీనితో చాలా మంది విసుగెత్తిపోతారు. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది? హిస్టరీ ఏమైనా గూగుల్ తెలుసుకుంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్‌లో చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి, ఇందులో కొన్నింటిని ఓపెన్ చేయాలనంటే ‘నేను రోబో కాదు’ (I am not a robot) అని నిర్దారించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో స్క్రీన్ మీద చిన్న బాక్స్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నిజానికి స్క్రీన్ మీద ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) కనిపించగానే ఎవరైనా వెంటనే క్లిక్ చేస్తే, అప్పుడు గూగుల్ నేను రోబో కాదు అని భావిస్తుందనుకుంటారు. కానీ ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే బ్రౌసింగ్ హిస్టరీ మొత్తం గూగుల్‌కి తెలిసిపోతుంది. ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్ గతంలో ఒకసారి బీబీసీ క్విజ్ షోలో ఇలాంటిదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో 'ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే ఏమి జరుగుతుందనేది వెల్లడిస్తారు. అంటే అప్పటి వరకు పనిచేసింది మనిషేనా లేదా రోబోనా అని నిర్దారించుకోవడానికి ఇలా వస్తుందని తెలుస్తోంది. ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం (అప్పటివరకు మీరు ఏమి సర్చ్ చేశారో) గూగుల్‌కి అందించడానికి అంగీకరించినట్లే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ బాక్స్ మీద క్లిక్ చేసిన తరువాత కొన్ని పజిల్స్లాగా వస్తాయి. అప్పుడు వాటిని క్లియర్ చేసిన తరువాత కావలసిన సైట్ ఓపెన్ అవుతుంది. -
డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!
సాధారణంగా కారు కొనాలనుకున్న వారు సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ, ధర లాంటి వివరాలను పరిశీలించి తమకిష్టమైనకారును సొంతం చేసుకుంటారు. కానీ డోర్లు, టైర్లు లేని కారును ఎక్కడైనా చూశారా? ప్రపంచంలోనే అతి చిన్నకారుగా పిలుస్తున్న ఈ కారుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, దానుకనుగుణంగా కొత్త ఫీచర్లు, డిజైన్లతో స్టైలిష్ కార్లతోపాటు, బడ్జెట్ కార్లపై కార్మేకర్లు దృష్టిపెడుతున్న క్రమంలో ఈ బుల్లి కారు సోషల్ మీడియా యూజర్లను భలే ఆకట్టుకుంటోంది. 37 మిలియన్ల వ్యూస్‌తో, లైక్స్, రీట్వీట్స్తో దూసుకుపోతోంది. బహుశా ఇది మిస్టర్ బీన్ కోసం మిస్టర్ బీన్ కనిపెట్టాడేమో అంటూ ఒకరు కమెంట్ చేశారు. అలాగే నమ్మశక్యం కాని డిజైన్ వెనుక ఉన్న సృజనాత్మకతను అభినందిస్తున్నారు. "మాస్సిమో" ట్విటర్ ఖాతాలో గత నెల 26న ఈ వీడియోను షేర్ చేసింది. వైరల్ వీడియోలో, సియాన్ కలర్కారును చూస్తే, టైర్లు లేదా తలుపులు లేవు. దీంతో నిజంగా ఇదే కారేనా అన్న అనుమానం కూడా కలుగకమానదు.వాస్తవానికి, ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ కారమాఘెడన్ పోస్ట్ చేసింది. The lowest car in the world [📹 carmagheddon (IT): https://t.co/9z0IrZySua]pic.twitter.com/AvExqIFJnA — Massimo (@Rainmaker1973) June 25, 2023 -
డుప్లెసిస్ రిబ్స్ పై టాటూ దానికి అర్ధం ఇదా..
-
వాట్సాప్ అప్డేట్: ఫొటోలు, వీడియోలకు సంబంధించిన సరికొత్త ఫీచర్!
ఆసక్తికరమైన మరో కొత్త అప్డేట్పై వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలకు వివరణను జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్ ప్లే ద్వారా బీటా వర్షన్ అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్ను ఇన్స్టాల్ చేసిన కొంతమంది టెస్టర్లకు ఇప్పటికే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు వివరణలను జోడించేందుకు వీలు కల్పిస్తోంది. (Isha Ambani: లగ్జరీ ఇంట్లో పార్టీ ఇచ్చిన ఇషా అంబానీ.. వీడియో, ఫొటోలు వైరల్!) అయితే స్టేటస్ అప్డేట్లను వీక్షించడం, వీడియోలను డౌన్లోడ్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తదుపరి అప్డేట్తో ఈ సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు మరింత సమాచారాన్ని జోడించాలనుకునే యూజర్లకు కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. (నిలిచిపోయిన నెట్‌ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్) వాట్సాప్ తాజా అప్డేట్ ద్వారా ఫార్వార్డ్ చేసిన ఫొటోలకు ఇదివరకే ఉన్న క్యాప్షన్‌ను తొలగించి సొంత క్యాప్షన్ జోడించవచ్చే అవకాశం ఉంది. ఇలా సొంత వివరణతో ఫార్వార్డ్ చేసినప్పుడు అది అసలైనది కాదని మాత్రం గ్రహీతలకు తెలిసిపోతుంది. ఈ ఫీచర్ మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చినప్పుడు దాని ప్రయోజనం గురించి మరింత బాగా తెలుస్తుంది. ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు సందర్భం, ఇతర వివరాలను జోడించడం ద్వారా గ్రహీతలు వాటి గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) -
హెచ్‌పీసీఎల్ లాభం క్షీణత
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా క్షీణించి రూ. 172 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 869 కోట్లు ఆర్జించింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకపోవడంతో వరుసగా రెండు త్రైమాసికాలలో నష్టాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. చమురు ధరలు క్షీణించడంతో తిరిగి మూడో క్వార్టర్లో నష్టాలను పూడ్చుకునేందుకు వీలు చిక్కినట్లు తెలియజేసింది. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ. 1.03 లక్షల కోట్ల నుంచి రూ. 1.15 లక్షల కోట్లకు ఎగసింది. ఈ కాలంలో ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.83 మిలియన్ టన్నుల(ఎంటీ) ముడిచమురును ప్రాసెస్ చేసింది. గత క్యూ3లో ఇది 4.24 ఎంటీగా నమోదైంది. అమ్మకాల పరిమాణం 7 శాతం పుంజుకుని 11.25 ఎంటీకి చేరింది. ఒక్కో బ్యారల్ చమురుపై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 11.4 డాలర్లకు ఎగశాయి. గత క్యూ3లో ఇవి 4.5 డాలర్లు మాత్రమే. విశాఖ రిఫైనరీ నవీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో భాగంగా 8.3 ఎంటీ రిఫైనింగ్ సామర్థ్యాన్ని 15 ఎంటీకి విస్తరిస్తున్న విషయం విదితమే. 5 ఎంటీ ఎల్ఎన్జీ టెర్మినల్ సైతం పూర్తికావస్తున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌పీసీఎల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 232 వద్ద ముగిసింది.