నాగాలాండ్‌లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే..ఒకే ఇంట్లో రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్ బోర్డర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్ హంటింగ్‌కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్‌బిల్ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు.
ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్‌లోని కున్యాక్ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్ సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్ మయన్మార్‌లో ఉంటే బెడ్‌రూం ఏకంగా భారత్‌లో ఉంది.
దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది.
(చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..)
Comments
Please login to add a commentAdd a comment