Citizenship
-
జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీం కోర్టుకు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) సవాల్ చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేట్టాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలుయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశాయి మసాచుసెట్స్, మేరీలాండ్, వాషింగ్టన్ కోర్టులు. అయితే కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా.. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను నిలుపుదల చేయడం సరికాదని ట్రంప్ సర్కార్ తరఫున తాత్కాలిక సాలిసిటర్ జనరల్ సారా హారిస్ వాదనలు వినిపించారు. కాబట్టి అది అమలు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం విచారణ వాయిదా పడింది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు (Birthright citizenship)ను ట్రంప్ రద్దు చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. పౌరసత్వ రద్దుకు సంబంధించి 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు మూకుమ్మడిగా కోర్టుల్లో పలు దావాలు వేశాయి. కోర్టు జోక్యంతో ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు నిలిచిపోయాయి.14వ సవరణ ఎందుకు వచ్చిందంటే..అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. ఈ యుద్ధంలో దాదాపు 6,20,000 మంది మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. -
మెగాస్టార్‌కు ఆ దేశ పౌరసత్వం.. ఆయన టీమ్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ మువీకి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో చిరు సందడి చేశారు. అయితే తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు యూకే గౌరవ పౌరసత్వం అందించనుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టీమ్ స్పందించింది. ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి తాను లండన్ వెళ్తన్నట్లు చెప్పడంతో ఈ ఈ వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి యూకే గౌరవ పౌరసత్వం ఇస్తుందన్న వార్తలు అవాస్తవమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రాసేముందు ముందుగా ధృవీకరించుకోవాలని తెలిపింది. విశ్వక్ సేన్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ లండన్ వెళ్లనున్నట్లు తెలిపారు. లండన్‌లో ఓ ఈవెంట్లో తనకు సన్మానం జరగనుందని మెగాస్టార్ తెలిపారు. దీంతో కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సిటిజెన్షిప్ గురించే లండన్ వెళ్తున్నారంటూ వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి టీమ్ క్లారిటీ ఇచ్చింది. కాగా.. చిరంజీవి చివరిసారిగా భోలా శంకర్‌లో కనిపించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర్ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశముంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో చిరు జతకట్టనున్నారు. -
మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. ఈ మధ్య ఇండియా-పాక్ మ్యాచ్ చూసి వచ్చారు. అంతకు తప్పితే పెద్దగా వార్తల్లో లేరు. అలాంటి ఈయనపై ఇప్పుడు ఓ రూమర్ వైరల్ అవుతోంది. గౌరవాన్ని వద్దనుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'సంక్రాంతి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ అందులోనే)ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఇప్పటికే పద్మ పురస్కారాల్ని కూడా అందుకుంది. అలాంటి ఈయనకు యూకే ప్రభుత్వం.. ఆ దేశ పౌరసత్వాన్ని గౌరవారర్ధంగా ఇచ్చిందని మాట వినిపించింది. అయితే ఇవన్నీ నిజం కాదని ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది.ఇదంతా పక్కనబెడితే యూకేలో చిరుని సన్మానించేందుకు మాత్రం ఓ కార్యక్రమం ప్లాన్ చేశారట. బహుశా అందువల్లే ఈ రూమర్స్ వచ్చినట్లున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం 'విశ్వంభర' పూర్తి చేసే బిజీలా ఉన్న చిరు.. తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ అనిల్ రావిపూడితో కలిసి పనిచేస్తారు.(ఇదీ చదవండి: నా భార్యకు వీడియోలు పంపుతున్నారు.. అవి డిలీట్ చేయండి: అనిల్ రావిపూడి) -
భారత గ్రాడ్యుయేట్ల కోసం...గోల్డ్ కార్డు కొనండి
వాషింగ్టన్: హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో చదివే ప్రతిభావంతులైన భారత పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చేందుకు గోల్డ్ కార్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అమెరికా కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. 50 లక్షల డాలర్లు (రూ.43.67 కోట్లు) చెల్లించి గోల్డ్ కార్డు కొనుగోలు చేస్తే అమెరికా పౌరసత్వమిస్తామని ఆయన తాజాగా ప్రకటించడం తెలిసిందే. ‘‘అమెరికాలోని అత్యున్నత వర్సిటీల్లో చదివే భారత్, చైనా, జపాన్ విద్యార్థులకు ఇక్కడి కంపెనీలు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్లు ఇచ్చి నిలుపుకునే అవకాశం ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో లేదు. దాంతో వారు స్వదేశాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభించి బిలియనీర్లుగా ఎదుగుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వారి కోసం అమెరికా కంపెనీలే ఇకపై గోల్డ్ కార్డు కొనుగోలు చేయొచ్చు. తద్వారా వారికి ఉపాధి కల్పించి అట్టిపెట్టుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. గోల్డ్ కార్డు పథకం రెండు వారాల్లో అమల్లోకి రానుంది. -
పౌరసత్వంపై ట్రంప్ సంచలన ప్రకటన.. వారందరికీ ‘గోల్డ్‌కార్డు’ వీసా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ కొత్త ప్లాన్ రూపొందించారు. పెట్టుబడిదారుల పౌరసత్వానికి ‘గోల్డ్ కార్డ్’ వీసాను తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్ల(భారత కరెన్సీ ప్రకారం దాదాపు 44కోట్లు) పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామని ట్రంప్ తెలిపారు.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామన్నారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్లను వెచ్చించి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందన్నారు. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోకి వస్తారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను మరో రెండు వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సమక్షంలో ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు.కాగా.. ఈ తరహా ‘గోల్డెన్ వీసా’లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. BREAKING:Trump announces USA will start selling gold cards in 2 weeks.“We're gonna put a price on that card of about $5 million and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship and wealthy people will come to our country” pic.twitter.com/OJnhFLeWAL— Visegrád 24 (@visegrad24) February 25, 2025ఈబీ-5 వీసా అంటే? యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని.. ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 800,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు.జన్మతః పౌరసత్వం రద్దు..అంతకుముందు.. రెండోసారి అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది. -
Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్‌ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్‌మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.కాగా బర్త్‌రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.Birthright Citizenship అంటే ఏంటి?అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్‌లు పడినట్టే.ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికేH-1B (వర్క్ వీసాలు)H-4 (డిపెండెంట్ వీసాలు)L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)F (స్టూడెంట్ వీసాలు) ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ -
గ్రీన్ కార్డ్ కి సిటిజెన్ షిప్ కి తేడా ఏంటి..?
-
అమెరికాతో వారికి సంబంధమే లేదు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో జన్మతః పౌరసత్వం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని ట్రంప్ కామెంట్స్ చేశారు. అంతేగానీ.. ప్రపంచ జనభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చి చేరేందుకు కాదంటూ విరుచుకుపడ్డారు. అర్హత లేని వ్యక్తులందరూ అమెరికాలోనే ఉన్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో జన్మతః పౌరసత్వంపై స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘ఇప్పుడు మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు. అంతేగానీ.. ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాకు వచ్చేందుకు, ఇక్కడ స్థిరపడేందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలా మంది మన అమెరికాకు వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీంతో అర్హత లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తోంది. ఈ చట్టం అందుకోసం కాదు. చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకు వచ్చింది అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం.. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.President TRUMP: "Birthright citizenship...was meant for the children of slaves. This was not meant for the whole world to come in and pile into the United States." pic.twitter.com/zSqXPtfETZ— Sir Cabonena Alfred (@Lebona_cabonena) January 31, 2025మరోవైపు.. అమెరికాలో జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును విపక్ష డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి వారం గడిచింది. ఈ వారంలో ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. చైనా నుండి యూరప్ వరకు, ఉక్రెయిన్ నుండి ఇరాన్ వరకు, ట్రంప్ నిర్ణయాలను విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో అమెరికన్లు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్షునిగా అధికార బాధ్యతలు చేపట్టారు. వెంటనే పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. గడచిన వారంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.చైనాతో దోస్తీ?ముందుగా చైనా విషయానికొస్తే ట్రంప్ తొలి పదవీకాలంలో, చైనా- అమెరికా మధ్య సత్సంబంధాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 శాతం వరకు భారీగా సుంకం విధిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రంప్ వారం గడిచినా ఈ విషయమై నోరు మెదపడం లేదు. పైగా ఒక ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో ఏదైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోగలరా అని అడిగినప్పుడు ట్రంప్ అందుకు సిద్దమేనన్నట్లు సమాధానం చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంపై మారిన వైఖరిట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ యుద్ధంపై గతంలో చేసిన వాగ్దానం అమలులో వైఖరిని మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా.. రష్యాను వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ను పావుగా వాడుకుంది. మాజీ అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం మేరకు ఇది జరిగింది. నిజానికి ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధం నుండి అమెరికాను దూరంగా ఉంచవచ్చు. కానీ ఇది అమెరికా భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ మద్దతు ఉంది. ఒకవేళ అమెరికా వెనక్కి తగ్గితే, భవిష్యత్‌లో రష్యాతో చేతులు కలిపే సందర్భం వస్తే ఎటువంటి హాని ఏర్పడదని ట్రంప్ భావిస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు.జన్మతః పౌరసత్వ చట్టండొనాల్డ్ ట్రంప్ రెండవమారు అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ట్రంప్ ఉత్తర్వులు ఫిబ్రవరి 20 నుండి అమెరికాలో అమల్లోకి వస్తాయి. ఇది విదేశాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారు తమ పిల్లలు అమెరికన్ పౌరసత్వం పొందాలని కలలు కంటుంటారు. అయితే ట్రంప్ నిర్ణయం వారి కలలను కల్లలు చేసింది.ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహంట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారిలో ఆయన సన్నిహితుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ట్రంప్ ఇటీవల స్టార్గేట్ పేరుతో భారీ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నారు. స్టార్గేట్లో పాల్గొన్న మూడు కంపెనీలకు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదని మస్క్ సోషల్ మీడియాలో రాశారు.గాజా శరణార్థుల పునరావాసంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గాజా శరణార్థుల పునరావాసానికి సంబంధించి ఓ ప్రతిపాదన చేశారు. గాజాలో ఉండలేకపోతున్న పాలస్తీనా వాసులు అక్కడికి పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో తాత్కాలిక పునరావాసం పొందాలని ట్రంప్ సూచించారు. గాజా ప్రాంతం నాశనమైందని, అక్కడి ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సహకరించాలని ఆయన కోరారు.ఆర్థిక సాయం నిలిపివేతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివిధ దేశాలకు ఇస్తున్న ఆర్ధిక సహాయాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యుద్ధంలో చిక్కుకున్న ఉక్రేయిన్ కూడా ఆర్ధిక సాయం నిలిపివేశారు. అయితే ఇజ్రాయెల్, ఈజిప్ట్లకు సైనిక బలగాల పెంపు కోసం అందించే నిధులకు మినహాయింపులు ఇవ్వడం విశేషం.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
Birthright citizenship : ట్రంప్ ఆర్డర్‌ను తోసిపుచ్చిన కోర్టు, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు తొలి షాక్ తగిలింది. ఆయన జారీ చేసిన తొలి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు విషయంలో చుక్కెదురైంది. జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాదు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించింది. దీంతో జన్మతః పౌరసత్వం చట్ట రద్దుతో బెంబేలెత్తుతున్న భారతీయులకు (NRI) భారీ ఊరట లభించింది. జన్మహక్కు పౌరసత్వాన్ని (birthright citizenship) రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును గురువారం యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నిలిపివేశారు. "ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు" అని న్యాయమూర్తి జాన్ కఫ్నౌర్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ దీనిపై "అప్పీల్" చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ట్రంప్ ఉత్తర్వు ఎవరికి వర్తిస్తుంది?ఫిబ్రవరి 19 తర్వాత ఆ ఉత్తర్వు తేదీ నుండి 30 రోజుల తర్వాత యుఎస్‌లో జన్మించిన వ్యక్తులకు మాత్రమే 14వ సవరణ యొక్క ఈ కొత్త వివరణ వర్తిస్తుంది.ట్రంప్ ఆదేశంఅమలులోకి వస్తే ఏటా 1.5 లక్షలకు పైగా నవజాత శిశువులకు పౌరసత్వం నిరాకరించబడుతుందని డెమొక్రాటిక్ నేతృత్వంలోని రాష్ట్రాలు నివేదించాయని రాయిటర్స్ తెలిపింది.ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది?అమెరికా పౌరసత్వం పొందడానికి మార్గంగా ఉపయోగించే బర్త్‌రైట్ సిటిజెన్షిప్ రద్దు భారతీయ కుటుంబాలపై చాలా ప్రభావం పడుతుంది. ట్రంప్ ఆదేశం అమల్లోకి వస్తే, ఎన్ఆర్ఐ పిల్లలు అమెరికాలో ఉండేందుకు వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది. దాదాపు 5.2 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్లు రెండో అతిపెద్ద వలసదారుల గ్రూప్‌గా ఉన్నారు. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గత సంవత్సరం ప్రచురించిన మరో నివేదిక ప్రకారం 2022 నాటికి అమెరికాలో 2.2 లక్షల మంది అనధికార భారతీయ వలసదారులు నివసిస్తున్నారని అంచనా వేసింది. ఇది 2018లో 4.8 లక్షలలో సగం కంటే తక్కువ.జనవరి 20న, 47వ యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరిక ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇమ్మిగ్రేషన్ విధానాల్లో విప్లవాత్మక మార్పులతీసుకొస్తానన్న వాగ్దానం చేసిన ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వు ప్రకారం, పత్రాలు లేని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్ పౌరసత్వానికి అర్హులు కారు.కాగా 1868 నుంచేఅమెరికాలో ఈ చట్టం అమల్లో ఉంది.దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్ధుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. -
పుట్టుకతో వచ్చే పౌరసత్వం: భారత్ సహా ఏ దేశాల్లో ఎలా ఉందంటే..
విదేశీయులకు పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికాలో సహజంగా దక్కుతున్న పౌరసత్వ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. కానీ, న్యాయస్థానం తాజాగా ఆ ఆదేశాలకు మోకాలడ్డేసింది. దీంతో అప్పీల్‌కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే.. జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో మిగతా దేశాలు ఏం విధానాలు పాటిస్తున్నాయో తెలుసా?.అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అక్కడి రాజ్యాంగం హక్కు కల్పించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ హక్కు దక్కాలి కూడా. అయితే ఆ హక్కును తనకున్న విశిష్ట అధికారంతో మార్చేయాలని ట్రంప్ భావించారు.ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికా నేలపై విదేశీయులకు పుట్టే పిల్లలను అమెరికా పౌరులుగా పరిగణించకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం.👉పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్. తల్లిదండ్రుల జాతీయత.. అంటే వాళ్లది ఏ దేశం, ఇమ్మిగ్రేషన్ స్టేటస్.. అంటే ఏ రకంగా వలసలు వచ్చారు ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వ గుర్తింపు ఇస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తంగా ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్‌షిప్‌ను వర్తింపజేస్తున్నారు. అయితే.. ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్’’ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి . జస్ సాన్‌గ్యుఇనిస్ అంటే.. వారసత్వంగా(రక్తసంబంధంతో) పౌరసత్వ హక్కు పొందడం. జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కు లభించడం. 👉ఇప్పటిదాకా అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగుదేశాలైన కెనడా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా తరహాలోనే ఈ దేశం కూడా తమ గడ్డపై పుట్టే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తింపజేస్తోంది. అయితే అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.👉అమెరికా రెండు ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలాదేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. 👉యూరప్, ఆసియా, ఆఫ్రికా.. చాలా దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి ఉదాహరణకు.. జర్మనీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లపాటు(ప్రస్తుతం 8 సంవత్సరాలుగా ఉంది) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.👉భారత్‌లో జన్మతఃపౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జస్ సాన్గ్యుఇని అనుసరిస్తోంది మన దేశం. అంటే.. వారసత్వంగా రక్తసంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుందన్నమాట. అయితే.. 1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్ సోలిని భారత్‌లోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. అంటే.. భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపజేయాడన్నమాట. జస్ సాన్గ్యుఇని ‘జాతి భావన’ మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ ఉన్నారు.1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, కాలక్రమేణా భారత్‌లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది.👉జపాన్‌లోనూ కఠిన నిబంధనలే అమలు అన్నాయి. అయితే ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.👉ఇటలీలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పరిమితులున్నాయి. పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు.👉యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది. 👉జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ఉంటాయి. అయితే.. అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమ వలసదారుల్నిప్రొత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత-వలసవిధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది ‘‘బర్త్ టూరిజం’’గా మారే ప్రమాదం లేకపోలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. దాదాపు 6,20,000 మంది ఈ యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. ఈ 157 ఏళ్ల చరిత్రను రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా.. తన సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావించడం విశేషం. -
ట్రంప్‌కు ఝలక్.. పౌరసత్వం ఉత్తర్వుకు కోర్టులో చుక్కెదురు
సియాటెల్: అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత ఆర్భాటంగా ట్రంప్ ఇచ్చిన ‘జన్మతః పౌరసత్వం రద్దు’ కార్యనిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టులో అవరోధాన్ని ఎదుర్కొంది. ఉత్తర్వు అమల్లోకి రాకుండా ఆపాలంటూ 4 రాష్ట్రాలు చేసిన అభ్యర్థనను అమెరికా డిస్ట్రిక్ జడ్జి జాన్ సి. కఫెనర్ నిలిపివేశారు.ఈ సందర్బంగా.. ‘ట్రంప్ ఉత్తర్వులు అమల్లోకిరాకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలిస్తున్నా. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం’ అని కేసు విచారణ సందర్భంగా జడ్జి కఫెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయీస్, ఒరేగాన్ రాష్ట్రాలు సంయుక్తంగా వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన జడ్జి ఆ తర్వాత ఈ ఉత్తర్వులిచ్చారు. ఉత్తర్వును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీ పాలిత 22 రాష్ట్రాలు విడిగా వేసిన ఐదు పిటిషన్లలో ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి వేసిన సియాటెల్ కోర్టులో వేసిన ఈ పిటిషన్ కూడా ఉంది. మరోవైపు.. ఈ కేసులో ప్రాథమిక విజయం సాధించాం అని వాషింగ్టన్ అటార్నీ జనరల్ నికొలస్ బ్రౌన్ వ్యాఖ్యానించారు. అనంతరం, దీనిపై ట్రంప్ స్పందించారు. తాము అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం ఓవల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయమూర్తి ఉత్తర్వులపై మా కార్యవర్గం అప్పీల్ చేస్తుందని తెలిపారు. ఇక, అంతకుముందు.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావం చూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ట్రంప్ దెబ్బకు డెలి‘వర్రీ’
ముందే వచ్చిన పురిటినొప్పులు.. నెలలు నిండకుండానే అగ్రరాజ్యంలో కాన్పులు.. ఆస్పత్రులకు పరుగులు.. ఇప్పుడిదే అక్కడ ట్రెండ్!. రేపటి పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు. భారతీయులకు ఎంత ఖర్మ... ఎంత దురవస్థ... ఎన్ని అగచాట్లు... ఎంతటి దుర్గతి!. ‘అమెరికా విధాత’ ట్రంప్ గీసిన కలం గీతకు ఒక్క రోజులోనే మారిపోయింది మనోళ్ల తలరాత. పగవాడికి కూడా రాకూడదు ఈ దీనావస్థ... సీన్ ఇప్పుడే ఇలా ఉంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్... మరుక్షణమే తమ దేశంలో జన్మతః పౌరసత్వ హక్కు(Birth Right Citizenship)ను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు వెలువరించాడు. అమెరికాలో శాశ్వత నివాసితులు కాని వారికి జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం సంక్రమించదంటూ ట్రంప్ ఈ నెల 20న ఆదేశం జారీ చేశాడు. ఉత్తర్వు జారీ అయిన నెల రోజుల తర్వాత ఆ ఆదేశం అమల్లోకొస్తుంది. అంటే గడువు ఫిబ్రవరి 20. ఈ తేదీ ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ దంపతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(Executive Order) నేపథ్యంలో ఫిబ్రవరి 20లోపే.. గర్భిణులకు నెలలు నిండక మునుపే... సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలి‘వర్రీ’తో ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ఓ రాష్ట్రంలో ప్రసూతి ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ ఎస్.డి.రామాకు గత రెండు రోజులుగా భారతీయ దంపతుల నుంచి ‘ముందస్తు డెలివరీ’(Pre Delivery) అభ్యర్థనలు ఎక్కువయ్యాట. ముఖ్యంగా 8వ నెల, 9వ నెల గర్భిణులు ‘సి-సెక్షన్’ (సిజేరియన్ శస్త్రచికిత్స) కోసం హడావుడి పడుతున్నారట. ఏడో నెల గర్భిణి అయిన ఓ భారతీయ మహిళ ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటూ భర్తతో కలసి తనను సంప్రదించినట్టు డాక్టర్ రామా చెబుతున్నారు. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. ‘డెడ్ లైన్’ ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది ఈ పరిణామంతోనే అర్థమవుతోంది. అయితే.. ఇలా నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లికి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.జి.ముక్కాలా (టెక్సాస్) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలు నిండకుండా పుట్టే శిశువులో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో రూపొందవని, శిశువు తక్కువ బరువుతో ఉంటుందని, పోషణతోపాటు నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతాయని ఆయన తెలిపారు. ఈ అంశాలన్నిటినీ ఆయన తన వద్దకు వస్తున్న భారతీయ జంటలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన గత రెండు రోజుల్లో సుమారు 15-20 భారతీయ జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారతీయ దంపతులు వరుణ్, ప్రియనే (పేర్లు మార్చాం) తీసుకుంటే... ప్రియ వచ్చే మార్చి నెలలో ప్రసవించాల్సివుంది. వరుణ్ H-1 B వీసాపై భార్యతో కలసి ఎనిమిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. గ్రీన్ కార్డుల కోసం ఆ జంట ఆరేళ్లుగా నిరీక్షిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా పౌరసత్వ విధానం మారిపోయింది. ప్రస్తుతం తాము నిశ్చింతగా ఉండాలంటే ప్రియ ముందస్తు డెలివరీకి వెళ్లడం ఒక్కటే మార్గమని వరుణ్ భావిస్తున్నాడు. “మేం ఇక్కడికి రావడానికి ఎంతో త్యాగం చేశాం. కానీ మా ఎదుటే తలుపు మూసుకుపోతోంది అనిపిస్తోంది’ అని బాధపడ్డాడు ఓ 28 ఏళ్ల ఇండియన్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. అతడి భార్య ప్రస్తుతం గర్భవతి. తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల పరిస్థితి వర్ణనాతీతం. కాలిఫోర్నియాలో ఎనిమిదేళ్లుగా అక్రమంగా నివసిస్తున్న విజయ్ (పేరు మార్చాం) తాజా ఫిబ్రవరి 20 ‘డెడ్ లైన్’తో నెత్తిన పిడుగుపడ్డట్టు బెంబేలెత్తుతున్నాడు. ::జమ్ముల శ్రీకాంత్(Courtesy: The Economic Times) -
అమెరికా జన్మతః పౌరసత్వంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు
వాషింగ్టన్: వలసవచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును ట్రంప్ ఒక్క ఉత్తర్వుతో తొలగించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ విషయంపై 22 రాష్ట్రాలు మంగళవారం కోర్టును ఆశ్రయించాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫెడరల్ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా రెండు దావాలు వేశాయి. 22 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ నగరాలు కలిపి మసాచుసెట్స్‌లోని ఫెడరల్ డిస్టిక్ట్ర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్‌గా అమలవుతుందని వాదించాయి. అధ్యక్షుడిగానీ పార్లమెంట్‌లోని ప్రజా ప్రతినిధులసభ(దిగువ సభ) లేదంటే సెనేట్(ఎగువ సభ)కు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వాదించాయి. మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్‌లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. మీకు ఉన్న ‘తాత్కాలిక నిలుపుదల’, ‘ముందస్తు ఆదేశం’అధికారాలను ఉపయోగించి అధ్యక్షుడి ఉత్తర్వు అమలుకాకుండా అడ్డుకోండి’’అని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ష్ట్రాలు అభ్యర్థించారు. ‘‘పుట్టగానే పౌరసత్వం రాదు అని ప్రకటించడమంటే మీరంతా అమెరికన్లు కాబోరు అని వివక్షచూపడమే’’అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు. ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావంచూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుపై వలసదారుల హక్కుల సంఘాల కూటమి కోర్టులో దావావేసింది. -
జన్మతః పౌరసత్వంపై ట్రంప్ వేటు.. ఆర్డర్ జారీ
-
పౌరసత్వ రద్దు యోచన దారుణం: బైడెన్
వాషింగ్టన్: అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా తప్పుబట్టారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ హోదాతో నిమిత్తం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికా పౌరసత్వం కల్పిస్తోంది. ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజే ఈ మేరకు కార్యనిర్వాహక చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. రాజ్యాంగబద్దమైన జన్మహక్కును మార్చాలనే ఆలోచనే దారుణమని బైడెన్ అన్నారు. అమెరికా జని్మంచినవాళ్లు దేశ పౌరులు కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దు నిబంధనల అమలును బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని చట్టసభ సభ్యులను ట్రంప్ కోరడం హాస్యాస్పదమన్నారు. ట్రంప్‌కు అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతోందని బైడెన్ అన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం బైడెన్‌కు పగ్గాలు అప్పగించేందుకు ట్రంప్ ససేమిరా అనడం, అధికార మార్పిడి ప్రక్రియను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న కాపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ఉసిగొల్పడం తెలిసిందే. దాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బైడెన్ అభివర్ణించారు. శ్వేతజాతి ఆధిపత్య భావన అమెరికాకు పొంచి ఉన్న పెను ముప్పుల్లో ఒకటన్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక దేశం మనది. అదే మన బలం కూడా. కాపిటల్ హిల్‌పై దాడిని మన ప్రజాస్వామ్యం తట్టుకున్నందుకు గర్వపడాలి’’అంటూ బైడెన్ ట్వీట్ చేశారు. 2021 తరహా హింసకు తావు లేకుండా ఈసారి అధికార మార్పిడి ప్రక్రియ శాంతియుతంగా సాగుతుందన్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని కూడా బైడెన్ చెప్పారు. ‘‘2021లో నా ప్రమాణ స్వీకారానికి ట్రంప్ గైర్హాజరయ్యారు. అయినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇటీవల ఆయన్ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించా’’అని గుర్తు చేశారు. -
ద్వంద్వ పౌరసత్వం ఇవ్వకూడదా?
భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది ఒక వాదన. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. ఒక వ్యక్తి బ్రిటిష్ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? నూతన సంవత్సరంలోనైనా ఈ సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి.2025 వచ్చేసింది. కొత్త సంవత్సరం అనగానే విధిగా కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నేను ఇది మానేస్తాను, అలా ఉంటాను అంటూ ప్రతిజ్ఞలు చేస్తాం. వాటితో పాటు... ఒక విష్ లిస్ట్ కూడా పెట్టుకుంటాం. నాకు అది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాం. నేనూ ఈ విషయంలో తక్కువేం కాదు. చాలా తీర్మానాలు తయారు చేసుకుంటా! కొద్ది రోజుల తర్వాత షరా మామూలు. ఒట్లన్నీ గట్టున పెట్టేస్తానేమో! అందుకే నా విష్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం.నాది చాలా సింపుల్ కోరికే. కానీ అది నెరవేరితే లబ్ధి పొందేది నేనొక్కడినే కాదు, కొన్ని లక్షల మంది ఉంటారు! భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? మరో దేశపు జాతీయత కూడా పొందే అవకాశం ఎందుకు కల్పించకూడదు? ప్రభుత్వం ఈ డ్యూయల్ నేషనాలిటీ హక్కును మన్నించాలి. తల్లి దండ్రుల మాతృదేశం పరంగా కావచ్చు, నివాసం రీత్యా అవ్వచ్చు... ఒక వ్యక్తి ఇలాంటి హక్కు పొందగలిగినప్పుడు దాన్నెందుకు నిరాకరించాలి? పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తల్లిదండ్రులు బ్రిటిష్, ఇండియా దేశాల వారు అనుకోండి. వారి పిల్లలకు ఏకకాలంలో అటు బ్రిటిషర్లు, ఇటు ఇండియన్లు అయ్యే హక్కు ఉంటుంది. అలా కాకుండా, ఇండియా పౌరసత్వం కావాలంటే బ్రిటిష్ పౌరసత్వం వదులుకోవాలని పట్టుపట్టడం న్యాయం కాదు. అదేమాదిరిగా విదేశాల్లో నివాసం ఉండేవారికి... స్వదేశంలో హక్కు కోల్పోకుండా నివాస దేశంలో పౌరసత్వం తీసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు భారతీయ చట్టాల ప్రకారం, ఈ రెండూ నిషిద్ధం.ఉన్నత ప్రజాస్వామ్య దేశాలుగా మన్నన పొందిన చోట్లా ఈ ద్వంద్వ పౌరసత్వ హక్కు లేదు కదా అంటారు. నిజమే. ఆస్ట్రియా, జపాన్, నెదర్లాండ్స్, నార్వేలు ఈ కోవలోకి వస్తాయి. ద్వంద్వ పౌర సత్వ నిరాకరణను వారు అప్రజాస్వామిక విధానంగా పరిగణించరు. కాకపోతే అనుమతించే దేశాల గురించి చెబుతాను. ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్ , ఫ్రాన్స్, ఐర్లాండ్, స్వీడన్, యుకే, యూఎస్ఏ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అత్యంత గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశాలే! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియా వీటి సరసన చేరాలని ఎందుకు అనుకోదు? వాస్తవానికి, మన పొరుగున ఉన్న అనేక దేశాలు ద్వంద్వ జాతీయతను అనుమతిస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు సమ్మతమే. శ్రీలంకదీ అదే బాట. ఆఖరుకు పాకిస్తాన్ కూడా అనుమతిస్తోంది. ఎటొచ్చీ చైనా, బర్మా, నేపాల్ ససేమిరా అంటాయి. అయితే, ఈ దేశాలా మనకు ఆదర్శం?ద్వంద్వ పౌరసత్వం అనుమతించక పోవడానికి అడ్డు పడే కారణాలు ఏంటో చూద్దాం. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది వీటిలో ఒకటి. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. పాకిస్తాన్ పదహారు దేశాలను గుర్తించి వాటికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వ విధానం అమలు చేస్తోంది. ఇండియా ఈ జాబితాలో లేదు. ఇలాంటి వ్యతిరేక దేశాల జాబితా రూపొందించుకోవాలి. వాటిని పక్కన పెట్టాలి.ద్వంద్వ పౌరసత్వ నిషేధాన్ని సమర్థించుకునేందుకు చెప్పే మరో ప్రధాన కారణం ఏమిటంటే, అలా అనుమతిస్తే భారతీయ పౌరసత్వ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇది అర్థం లేనిది. వేరేది తీసుకోగలిగిన వారు ఇండియా పౌరసత్వం అక్కర్లేదు అనుకుంటే, ఎప్పుడు కావా లంటే అప్పుడు వదిలేస్తారు. ఇతర దేశాల్లో పౌరసత్వం ఉండి కూడా భారత జాతీయతను కొనసాగించాలి అనుకునేవారూ ఉంటారు. వారికి ఈ ద్వంద్వ పౌరసత్వం ముఖ్యమైన అంశం అవుతుంది. ఒక వ్యక్తి బ్రిటిష్ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? అలా అని చెప్పి ఈ హక్కు నిరాకరించడం ఎలా సబబు?ఇలా కోరుకునేవారు అతి కొద్ది మందే ఉంటారు, కేవలం వారి కోసం ప్రత్యేక చట్టం ఉండాలా అన్నది కొందరి వాదన. ఎందుకు ఉండకూడదన్నది నా సమాధానం. ప్రవాస భారతీయులను అన్ని ప్రభుత్వాలూ ఏదో విధంగా దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించాయి. వారికి ‘పర్సన్స్ ఆఫ్ ఇండి యన్ ఆరిజిన్’, ‘ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా’ కార్డులు ఇచ్చాయి. వ్యవసాయ భూమిపై యాజమాన్య హక్కు, ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు మినహా ఇతరత్రా అన్నిటికీ వారు అర్హులు. అలాంటప్పుడు, ద్వంద్వ పౌరసత్వంతో అదనంగా లభించేది ఏమిటి?సింపుల్‌గా చెప్పాలంటే, విదేశీ ప్రయాణం అత్యంత సులభం అవుతుంది. ఉదాహరణకు, బ్రిటిష్ లేదా అమెరికా పౌరసత్వం ఉన్న పాకిస్తానీయులు యూరప్ అంతటా వీసాల్లేకుండా పర్యటించవచ్చు. ఇండియా పాస్‌పోర్ట్ దారుడికి ఈ సౌలభ్యం లేదు. భారత పౌరులు పర్యటన వీసాలు సంపాదించడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. చాలామందికి ఇది ప్రధానమైన అంశమే. కాబట్టి, 2025 నూతన సంవత్సరంలోనైనా నరేంద్ర మోదీ గానీ రాహుల్ గాంధీ గానీ ఈ ద్వంద్వ పౌరసత్వం విషయంలో తమ పార్టీల సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి. అవకాశం ఉన్న భారత పౌరులు రెండో పౌరసత్వం పొందేందుకు అంగీకరించాలి. ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా వారికి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇది న్యాయం. అర్థవంతం. ఇదే నా న్యూ ఇయర్ విష్!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి బిగ్ షాక్.. హైకోర్టు ఝలక్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆయనకు 30 లక్షలు జరిమానా విధించింది.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో రమేష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పదిన్నర సంవత్సరాల పాటు ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. రమేష్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని కోర్టు తెలిపింది. దీంతో, చెన్నమనేనికి రూ.30 లక్షలు జరిమానా విధించింది. జరిమానాలో రూ.25 లక్షలు కాంగ్రెస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని తెలిపింది. మిగిలిన రూ.5లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేనికి సూచించింది. -
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కోర్టులో పిటిషన్
లక్నో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విఘ్నేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును డిసెంబ్ 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ పౌరసత్వంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే హోం మంత్రిత్వ శాఖ సూచించారు. ఈ సందర్బంగా పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రెండు యూకే, భారత్‌లో పౌరసత్వం ఉందనే ఆధారాలు లభించాయి. వాటన్నింటిని కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. -
భారతీయులకు దెబ్బ మీద దెబ్బ ట్రంప్ సంచలనం
-
TG: చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు కాసేపట్లో
సాక్షి,హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(అక్టోబర్ 23) మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారని ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఆరేళ్లుగా సాగింది. తుది వాదనలు విన్న హైకోర్టు మంగళవారం ఈ కేసులో తీర్పు రిజర్వు చేసింది. రమేష్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ జర్మనీ పౌరుడైనందున ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తీర్పు ఇవ్వాల్సిందిగా పిటిషన్లో ఆది శ్రీనివాస్ కోరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదిశ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. -
చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ ఉందని తెలిపిన న్యాయవాది.. పాస్ పోర్ట్ ప్రామాణికం కాదని విన్నవించారు. వెంటనే ఇండియన్ పాస్ పోర్ట్ ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. లేదని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం, అన్ని వాదనలు పరిగణలోకి తీసుకుంటామంటూ తీర్పును ఈ రోజు వాయిదా వేసింది. తుది తీర్పు త్వరలోనే వెలువరిస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. -
కెనడా, భారత్ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?
Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించి వివాదానికి తెరలేపారు. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడా చేర్చడంతో వివాదం మరింత ముదిరింది. కెనడా చర్యలకు నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుంచి తమ రాయబారి, దౌత్యాధికారులను కూడా వెనక్కి రప్పించింది భారత్. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కెనడాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కెనడా ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న సిక్కులు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కెనడాలోని భారతీయులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. కాగా, తాజా పరిస్థితులు తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగాల కోసం కెనడా వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు.మనోళ్లే ముందు2021 అధికారిక లెక్కల ప్రకారం.. కెనడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. వీరిలో భారత సంతతికి(పీఐఓ) చెందిన వారు 18 లక్షలు, ఎన్నారైలు 10 లక్షల మంది ఉన్నారు. కెనడా పౌరుల్లో 7.3 లక్షల మంది హిందువులు, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా (45 శాతం) ఉన్నారు. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. తాత్కాలిక ఉపాధి పొందుతున్న విదేశీ కార్మికుల్లోనూ మనోళ్లే (22 శాతం) ముందున్నారు. శాశ్వత నివాసం ప్రకటించిన పీఆర్ పథకం కింద అత్యధికంగా 27 శాతం మంది భారతీయులు లబ్ది పొందారు. గత 20 ఏళ్లలో కెనడాలోని భారతీయుల సంఖ్య రెండింతలు పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఆ నగరాల్లోనే ఎక్కువకెనడా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017లో 44.3 శాతం మంది, 2018లో 49.2, 2019లో 55.8, 2020లో 58.4, 2021లో 61.1 శాతం మంది ఇండియన్స్ కెనడా పౌరసత్వం దక్కించుకున్నారు. వాంకోవర్, టొరంటో, ఒట్టావా, వినీపెగ్, కాల్గారి, మాంట్రియల్ నగరాల్లో భారతీయులు అధికంగా నివసిస్తున్నారు. కెనడాలో ఉన్న భారతీయుల్లో 50 శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో మేనేజ్మెంట్ స్థాయి జాబుల్లో ఉన్నవారు కేవలం 19 శాతం మాత్రమే. కెనడాలోని వలస భారతీయుల్లో పన్నులు చెల్లిస్తున్నవారు 42 వేల మంది వరకు ఉన్నారు.చదవండి: ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు.. భారత ఇంజనీర్ ఘనతవాణిజ్యంపై ప్రభావంభారత్, కెనడా దేశాల మధ్య 2023-24 మధ్య కాలంలో 8.9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా భారత్ ఎగుమతులు 4.4 బిలియన్ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కెనడా నుంచి భారత్‌కు ఎక్కువగా పప్పులు ఎగుమతి అవుతుంటాయి. తాజాగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో బయ్యర్లు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు పెంచారు. భారత్ నుంచి ఆభరణాలు, విలువైన రాళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతుంటాయి. కాఫీ చెయిన్ టిమ్ హార్టన్, ఫ్రోజోన్ ఫుడ్ కంపెనీ మెక్కెయిన్ సహా ఇండియాలో 600 పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. -
అక్రమ వలస దారులకు పౌరసత్వం
-
భారత పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ...
-
సెక్షన్ 6ఏ రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: భారత పౌరసత్వ చట్టం–1955లోని ‘సెక్షన్ 6ఏ’ రాజ్యాంగబద్ధతను అత్యున్నత న్యాయస్థానం సమరి్థంచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనో మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 6ఏ రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ 4:1 మెజారీ్టతో గురువారం తీర్పు వెలువరించింది. జస్టిస్ పార్దివాలా మాత్రమే ఈ తీర్పుతో విభేదించారు. సెక్షన్ 6ఏ రాజ్యాంగవిరుద్ధమని ఆయన చెప్పారు. చట్టవిరుద్ధమైన వలసలకు అస్సాం అకార్డ్(ఒప్పందం) ఒక రాజకీయ పరిష్కారంగా తోడ్పడిందని ధర్మాసనం వెల్లడించింది. అసోంలోకి వలసలకు, వలసదార్లకు పౌరసత్వం ఇవ్వడానికి 1971 మార్చి 25ను కటాఫ్ తేదీగా నిర్ణయించడం సరైందేనని పేర్కొంది. సెక్షన్ 6ఏ చట్టబద్ధమేనని సీజేఐ తన తీర్పులో వివరించారు. చట్టంలో ఈ సెక్షన్‌ను చేర్చడానికి పార్లమెంట్‌కు చట్టబద్ధమైన అధికారం ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అసోంలోకి వలసలు అధికం కాబట్టి అక్కడికి ఎంతమంది అక్రమంగా వచ్చారన్నది కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపింది. అసోంలో భిన్నమైన గిరిజన తెగలు, సమూహాలు, వర్గాలు ఉన్నాయని, ఆయా వర్గాల ప్రజలకు తమ సంస్కృతిని కాపాడుకొనే హక్కును ఆర్టికల్ 29(1) కింద రాజ్యాంగం కల్పించిందని, సెక్షన్ 6ఏ ఈ హక్కును ఉల్లంఘిస్తోందంటూ పిటిషనర్లు చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆరి్టకల్ 29(1)ను ఉల్లంఘిస్తున్నారని చెప్పడానికి ఒక రాష్ట్రంలో లేదా ఒక ప్రాంతంలో వేర్వేరు తెగల ప్రజలు ఉన్నారని చెప్పడం ఒక్కటే సరిపోదని స్పష్టంచేసింది. Supreme Court’s five-judge Constitution bench upholds the constitutional validity of Section 6A of the Citizenship Act inserted by way of an amendment in 1985 in furtherance of the Assam Accord. pic.twitter.com/I2waFAKhbl— ANI (@ANI) October 17, 2024ఏమిటీ సెక్షన్ 6ఏ? 1985 నాటి అస్సాం అకార్డ్ తర్వాత అప్పటి ప్రభుత్వం సెక్షన్ 6ఏను ప్రత్యేక ప్రొవిజన్‌గా పౌరసత్వ చట్టంలో చేర్చింది. అక్రమ వలసలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ప్రపుల్ల కుమార్ మహంత నేతృత్వంలోని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్‌తో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే అస్సాం అకార్డ్. ఈ అకార్డ్ కింద ఎవరెవరికి భారత పౌరసత్వం కలి్పంచాలన్నది సెక్షన్ 6ఏ నిర్దేశిస్తోంది. ఈ సెక్షన్ ప్రకారం.. 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 దాకా బంగ్లాదేశ్‌తోపాటు నిర్దేశించిన ఇతర ప్రాంతాల నుంచి అసోంలోకి వలసవచ్చిన వారికి భారత పౌరసత్వం ఇవ్వొచ్చు. అలాంటివారు పౌరసత్వం కోసం సెక్షన్ 18 కింద రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, అక్రమ వలసదార్లుగా గుర్తించిన తేదీ నుంచి పది సంవత్సరాల దాకా భారత పౌరసత్వం కోసం రిజిస్టర్ చేసుకోవడానికి వీల్లేదు. పదేళ్లు పూర్తయిన తర్వాతే అవకాశం ఉంటుంది. అలాగే 1971 మార్చి 25 తర్వాత వలస వచి్చనవారిని సెక్షన్ 6ఏ ప్రకారం వెనక్కి పంపించాలి. ఈ సెక్షన్‌ను అసోం సని్మలితా మహాసంఘతోపాటు మరొకొన్ని గ్రూప్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అసోంలోకి సామూహిక వలసలను ప్రోత్సహించేలా ఉందని ఆరోపించాయి. చదవండి: పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర -
అమ్మకానికి అందమైన ఐలాండ్ పాస్‌పోర్ట్‌లు
అందమైన కరేబియన్ ద్వీప దేశం డొమినికా తమ దేశ పాస్‌పోర్ట్‌లను అమ్మకానికి పెట్టింది. ఏడేళ్ల క్రితం మారియా హరికేన్ విధ్వంసంతో దెబ్బతిన్న ఈ ఐలాండ్ పునర్నిర్మాణానికి విభిన్న రీతిలో నిధుల సమీకరణ చేపడుతోందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది.ప్రపంచంలోనే వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచిన అత్యంత దృఢమైన ద్వీపంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కరేబియన్ దేశం.. ఇందుకోసం భారీ అప్పులు చేయకుండా, సంపన్న దేశాల సహాయం కోసం ఎదురుచూడకుండా నిధులు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని సంపన్నులకు పాస్‌పోర్ట్‌ల ద్వారా తమ దేశ పౌరసత్వాన్ని విక్రయిస్తోంది.ఆ దేశ పౌరసత్వ ప్రదాన కార్యక్రమం 90ల నాటి నుంచే ఉన్నప్పటికీ హరికేన్ తర్వాత వేగంగా విస్తరించింది. ఇదే దేశ ఆదాయానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నిధులను కొత్త మెడికల్ క్లినిక్‌లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిన్ బారన్ ఈ చొరవను ఆపద్బాంధవిగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమం తమకు "స్వయం-స్వతంత్ర ఫైనాన్సింగ్"గా ఉపయోగపడుతోందని ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెక్ఇన్టైర్ చెబుతున్నారు.ఈ పౌరసత్వ కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, పారదర్శకత, భద్రతా సమస్యలపై ఆందోళనలను పెంచింది. ఈ దేశ పౌరసత్వ కనీస ధర ఇటీవలే 2 లక్షల డాలర్లకు (రూ. 1.68 కోట్లు) పెరిగింది. అయినప్పటికీ ఇదే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ఎంపికలలో ఒకటిగా ఉంది. 71,000 జనాభా కలిగిన ఒక చిన్న ద్వీపంలో పౌరసత్వాన్ని పొందినవారిలో కొంతమంది ఇక్కడ నివసిస్తున్నారు. -
సోనియా నివాసానికి రఘునందన్.. కారణం ఇదే..
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వం విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనియా గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేరుకుని బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్లిట్జ్ పత్రిక ఇచ్చిన కథనాలను సోనియా ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీకి చూపించి లోపలికి వెళ్లారు. అనంతరం.. సోనియా, రాహుల్ బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. -
భారత్‌తో బంధానికి బైబై
» 2018 నుంచి 2023 వరకు 114 దేశాల్లో భారతీయులు పౌరసత్వాన్ని స్వీకరించారు. » వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీల్లో స్థిరపడ్డారు. » గత ఆరేళ్లలో 70 మంది పాకిస్థాన్, 130 మంది నేపాల్, 1,500 మంది కెన్యా పౌరసత్వాన్ని కూడా స్వీకరించారు. » విదేశాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అత్యధికం.» 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. విదేశాల్లో మెరుగైన విద్య, ఉద్యోగావకాశాలు, అత్యుత్తమ వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పన్ను ప్రయోజనాలు వంటి కారణాలతో భారత పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలోనే ఏకంగా 8.34 లక్షల మంది భారతీయలు దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరులుగా మారారు. పౌరసత్వం వదులుకుంటున్నవారి సంఖ్య కోవిడ్‌కు ముందు (2011–2019) సగటున 1.32 లక్షలుగా ఉంటే.. ఆ తర్వాత 2020–2023 మధ్య 20 శాతం పెరగడం గమనార్హం. ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. మెరుగైన ఆర్థిక అవకాశాలు, ప్రశాంత జీవితం, నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం అక్కడే స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు. పైగా భారత పాస్పోర్టుతో చాలా దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆ్రస్టేలియా, సింగపూర్ వంటి దేశాల పాస్‌పోర్టులతో ప్రపంచంలో చాలా దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయొచ్చనే భావన కూడా భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి పురిగొల్పుతోంది. – సాక్షి, అమరావతిఓసీఐతో వీసా లేకుండానే భారత్‌కు వచ్చే వీలు.. ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లో మాదిరిగా ద్వంద్వ పౌరసత్వం అనేది మన రాజ్యాంగంలో లేదు. భారత పౌరసత్వం వదులుకున్న వ్యక్తులు ఇక్కడికి తిరిగి రావాలంటే కచ్చితంగా వీసా ఉండాల్సిందే. బంధువులు, కుటుంబం కోసం తరచూ భారత్‌కు వచ్చివెళ్లే వారి కోసం 2003లో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐవో) కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి0ది. ఇది పాస్‌పోర్టులా పదేళ్లపాటు పనిచేస్తుంది. అయితే దీన్ని 2015 నుంచి నిలిపేశారు. 2006 నుంచి ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును జీవితకాల పరిమితితో జారీ చేస్తున్నారు. ఇది ఉంటే వీసా లేకుండానే భారత్‌కు వచ్చే వీలు ఉంటుంది. భారత్‌లో ఉంటూనే ప్రైవేటు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ద్వంద్వ పౌరసత్వాన్ని అమల్లోకి తెస్తే భారత పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య తగ్గుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
PM Narendra Modi: లౌకిక పౌరస్మృతి!
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మతపరమైన పౌరస్మృతి అమల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దాన్ని 75 ఏళ్లుగా భరిస్తున్నాం. ఆ స్మృతికి చరమగీతం పాడి దాని స్థానంలో దేశ ప్రజలందరికీ సమానంగా వర్తించే ‘లౌకిక’ పౌరస్మృతిని రూపొందించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తి కూడా అదే. దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ఉండాలని ఆదేశిక సూత్రాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ఆవశ్యకతను సుప్రీంకోర్టు కూడా పలుమార్లు నొక్కిచెప్పింది. ఆ మేరకు తీర్పులు వెలువరించింది’’ అని గుర్తు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి కావడం విశేషం. బీజేపీ ఎజెండా అంశాల్లో, ప్రధాన ఎన్నికల ప్రచార నినాదాల్లో ఒకటైన యూసీసీని వీలైనంత త్వరగా అమల్లోకి తెస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ‘‘ప్రస్తుత పౌరస్మృతి ఒకవిధంగా మతపరమైనదన్న అభిప్రాయం సమాజంలోని మెజారిటీ వర్గంలో ఉంది. అందులో వాస్తవముంది. ఎందుకంటే అది మతవివక్షతో కూడినది. అందుకే దాన్నుంచి లౌకిక స్మృతివైపు సాగాల్సి ఉంది. తద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అది తక్షణావసరం కూడా’’ అని పేర్కొన్నారు. ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ కూడా దేశానికి చాలా అవసరమని మోదీ అన్నారు. ‘‘2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసుకుందాం. అందుకు 140 కోట్ల పై చిలుకు భారతీయులంతా భుజం భుజం కలిపి కలసికట్టుగా సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు. కొత్తగా 75,000 వైద్య సీట్లు ‘‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ‘‘ఉన్నత విద్య కోసం యువత భారీగా విదేశాలకు వెళ్తోంది. దీన్ని సమూలంగా మార్చేస్తాం. విదేశాల నుంచే విద్యార్థులు మన దగ్గరికొచ్చే స్థాయిలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తాం. అలనాటి నలంద విశ్వవిద్యాలయ స్ఫూర్తితో 21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం. నూతన విద్యా విధానానిది ఇందులో కీలక పాత్ర కానుంది.కిరాతకులకు వణుకు పుట్టాలి మహిళలపై హింసకు తక్షణం అడ్డుకట్ట వేయాల్సిందేనని మోదీ అన్నారు. ‘‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కలి్పంచడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’’ అన్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై దారుణ హత్యాచారం దేశమంతటినీ కుదిపేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘మహిళల భద్రత బాధ్యత కేంద్రంపై, రాష్ట్రాలపై, ప్రజలందరిపై ఉంది. కోల్‌కతా ఘోరంపై దేశమంతా తీవ్రంగా ఆక్రోశిస్తున్న తీరును అర్థం చేసుకోగలను. నాదీ అదే మనఃస్థితి. నేనెంత బాధ పడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఆ కేసు విచారణను సత్వరం ముగించి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నీచకృత్యాలు పదేపదే జరుగుతుండటం బాధాకరం’’ అన్నారు. బంగ్లాలో పరిస్థితులు ఆందోళనకరం కల్లోల బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని మోదీ అన్నారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. అందుకు భారత్ అన్నివిధాలా సహకారం అందిస్తుందని చెప్పారు.లక్ష మంది యువత రాజకీయాల్లోకిరాజకీయ రంగంలో కుల, కుటుంబవాదాలకు అడ్డుకట్ట వేయాలని మోదీ అన్నారు. అందుకోసం ఏ రాజకీయ నేపథ్యమూ లేని లక్ష మంది యువతీ యువకులు ప్రజా జీవితంలోకి రావాలని పిలుపునిచ్చారు. ‘‘వారికి నచి్చన పారీ్టలో చేరి అన్ని స్థాయిల్లోనూ ప్రజాప్రతినిధులుగా మారాలి. కొత్త ఆలోచనలతో కూడిన ఆ కొత్త రక్తం మన ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయగలదు’’ అన్నారు.ప్రతికూల శక్తులతో జాగ్రత్త దేశ ప్రగతిని కొందరు ఓర్వలేకపోతున్నారని విపక్షాలనుద్దేశించి మోదీ విమర్శించారు. ‘‘ప్రతిదాన్నీ ధ్వంసం చేయాలని వాళ్లు కలలుగంటున్నారు. అవినీతిని ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రతికూల శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి’’ అన్నారు. అంతర్గతంగా, బయటి నుంచి భారత్ లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు.రాజస్తానీ రంగుల తలపాగా ఎప్పట్లాగే ఈ పంద్రాగస్టు సందర్భంగా కూడా మోదీ ప్రత్యేక తలపాగాతో మెరిసిపోయారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్తానీ సంప్రదాయ లెహరియా తలపాగాతో ఆకట్టుకున్నారు. తెల్ల కుర్తా, చుడీదార్, నీలిరంగు బంద్గలా ధరించారు. -
వలసదారులకు భారీ ఆఫర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అమెరికా పౌరులను ఆకట్టుకునేందుకు బైడెన్ సర్కార్ అక్కడి చట్టబద్దతలేని వలసదారులకు భారీ ఉపశమనం కలి్పంచనుంది. అమెరికా పౌరులను పెళ్లాడిన వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు బైడెన్ మంగళవారం ప్రకటించారు. అయితే ఈ వలసదారు ఇప్పటికే అమెరికాలోనే కనీసం పదేళ్లుగా నివసిస్తూ ఉండాలనే షరతు విధించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న దాదాపు ఐదు లక్షల మంది వలసదారులకు ఈ నిర్ణయంతో లబ్దిచేకూరనుంది.అమెరికా పౌరుల భాగస్వాములు చట్టబద్ధత కోసం త్వరలో దరఖాస్తుచేసుకోవచ్చని తర్వాతి దశలో వాళ్లకు పౌరసత్వం ఇస్తామని బైడెన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 17నాటికి అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని పదేళ్లు పూర్తయితే లీగల్ స్టేటస్(చట్టబద్ధత) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తు ఆమోదం పొందితే మూడేళ్ల తర్వాత గ్రీన్‌కార్డ్ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి తాత్కాలిక వర్క్ పరి్మట్ ఇస్తారు.ఈ వర్క్ పరి్మట్ సాధిస్తే వారు దేశ బహిష్కరణ వేటు నుంచి తప్పించుకుని అమెరికాలోనే ఉద్యోగాలు/పనులు చేసుకోవచ్చు. ‘‘ పౌరసత్వంలేని భాగస్వామి, చిన్నారులతో కలసి అమెరికా పౌరులు కుటుంబసమేతంగా సంతోషంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నాం. కుటుంబాల ఐక్యత దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది’ అని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. పిల్లలూ దరఖాస్తు చేసుకోవచ్చు అమెరికా పౌరులను పెళ్లాడిన అక్రమ వలసదారుల పిల్లలూ చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి పిల్లలు దేశవ్యాప్తంగా 50,000 మంది ఉంటారని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితభాగస్వామి చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అమెరికా పౌరులను పెళ్లాడి పదేళ్లు పూర్తికావాల్సిన పనిలేదు. అంటే పెళ్లికి ముందే అమెరికాలో పదేళ్లుగా ఉంటూ జూన్ 17వ తేదీలోపు పెళ్లాడినా సరే వాళ్లు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులే.17వ తేదీ(సోమవారం) తర్వాత పదేళ్లు పూర్తయితే వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అమెరికాలో సమ్మర్ సీజన్దాకా ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలను ఇంకా నిర్ణయించలేదు. అమెరికా పౌరులను పెళ్లాడిన దాదాపు 11 లక్షల మంది వలసదారుల్లో చాలా మంది ఈ తాజా నిర్ణయంతో లబి్ధపొందనున్నారు. డ్రీమర్లకూ తాయిలాలు! అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల(డ్రీమర్లు)కు బైడెన్ సర్కార్ అదనపు సౌకర్యాలు కలి్పంచనుంది. ‘‘ అమెరికా ఉన్నత విద్యా సంస్థలో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ఆఫర్ పొందిన డ్రీమర్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు’ అని బైడెన్ అన్నారు. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు గతంలో ఒబామా సర్కార్ ‘డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్’ పేరిట రక్షణ కలి్పంచిన విషయం తెల్సిందే. -
ఈ గ్రామం చాలా స్పెషల్!..కిచెన్ ఒక దేశంలో ఉంటే..బెడ్రూం ఏకంగా..
నాగాలాండ్‌లోని లాంగ్వా చాలా ప్రత్యేకతలు కలిగిన గ్రామం. ఈ గ్రామం స్పెషలిటీ వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇలాంటి గ్రామం మరొకటి ఉండే అవకాశం కూడా లేదన్నంత స్పెషాలిటీగా ఉంటుంది. ఎంత స్పెషల్ అంటే..ఒకే ఇంట్లో రెండు దేశాల సరిహాద్దును చూడొచ్చు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? అదెలా సాధ్యం అంటే..నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో ఒకటి లాంగ్వా. ఇక్కడ 'కోన్యాక్ నాగా' అనే గిరిజన తెగ ఉంటుంది. ఈ గ్రామం మధ్యలోంచి ఇండియా, మయన్మార్ బోర్డర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బోర్డర్ గ్రామాన్ని విడదీయకపోవడం విశేషం. ఈ గ్రామ ప్రజలు హెడ్ హంటింగ్‌కు ప్రసిద్ధి. ఈ కోన్యాక్ తెగ ప్రజలు తమ శత్రువులపై యుద్ధం జరిపి.. విజయం సాధించిన గుర్తుగా శత్రువు తలని తీసి తమ గ్రామానికి అలంకరణగా ఉంచుతారు. ఇక్కడ ప్రజలు తమ ఇళ్లను ఏనుగు దంతాలు, హార్న్‌బిల్ ముక్కులు, మానవ పుర్రెలతో అలంకరించుకుంటారు. ఈ పుర్రెలు ఇలా గ్రామంలో ప్రతి ఇంటిపై ఉండటం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందనేది వారి నమ్మకం. ఈ గ్రామం నల్లమందు ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ లాంగ్వ్లోని కున్యాక్ నాగా తెగ పెద్దని అంఘ్ అని పిలుస్తారు. అతడిని అక్కడ ప్రజలు మహారాజుగా భావిస్తారు. అతని ఇల్లు ఇండో-మయన్మార్ సరిహద్దు గుండా వెళ్తుంది. చెప్పాలంటే అతడి ఇల్లుని రెండు భాగాలుగా విభజిస్తుంది. దీంతో అతడి కిచెన్ మయన్మార్‌లో ఉంటే బెడ్రూం ఏకంగా భారత్‌లో ఉంది. దాదాపు అక్కడ ఉండే ప్రజల ఇళ్లన్ని ఇలానే ఉంటాయి. ఆ గ్రామ పెద్దకి ఏకంగా 60 మంది భార్యలు. అతడి కృషి వల్ల లాంగ్వా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది. అంతేగాదు ఇక్కడ ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం లభిస్తుంది. ఒకప్పుడూ ఆ గ్రామంలో రహదారి సరిగా ఉండేది కాదు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సిబ్బంది కొండలా ఎత్తుగా ఉండే ఆ రహదారిని చక్కగా చదును చేసి బాగు చేయడంతో చక్కటి రవాణా కనెక్టివిటీ ఏర్పడింది. ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి మార్చి నెల సమయం. ఆ సమయంలో లాంగ్వా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఆహ్లాదంగా ఉంటుంది. (చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..) -
సీఏఏ దరఖాస్తుదారుల కోసం హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ(సవరణ) చట్టం(సీఏఏ)–2019 కింద భారత పౌరసత్వం పొందాలనుకునే శరణార్ధులకు సాయపడేందుకు త్వరలో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆన్లైన్ వేదికగా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుందని హోం శాఖ బుధవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టింది. దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే ఓ పోర్టల్‌ను సిద్ధం చేసినట్లు గుర్తుచేసింది. ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న వలసదారులైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ దరఖాస్తు సంబంధ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. -
కెనడాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
2024 ఆగస్ట్ నెల సమయానికి కెనడా ఆర్ధిక మాంద్యంలోకి జారిపోనుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత కుంటుపడనుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, డాలర్ విలువ మరింత పడిపోవడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో దేశ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు భారీ ఊరట కలగనుంది. ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించేందుకు కెనడా నడుం బిగించింది. నిబంధనలు పాటిస్తున్నా.. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే.. ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడేలా వారందరికి పౌరసత్వం ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. ఆర్ధిక వ్యవస్థకు ఊతంగా 2025 నాటికి 5 లక్షల మందికి వలసదారులకు తమ దేశానికి ఆహ్వానిస్తామని అన్నారు. జనాబా పెరిగే కొద్ది దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 నుంచి 5 లక్షల మంది వలస దారులకు పలు నివేదికల ప్రకారం.. కెనడాలో సరైన పత్రాలు లేకుండా 3 లక్షల నుంచి 6 లక్షల మంది జీవిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఆ డాక్యుమెంట్లు నిర్ణీత సమయానికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వారు సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి మాత్రం ఇబ్బందే అయితే కెనడా త్వరలో అమలు చేయనున్న వీసా నిబంధనలతో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారులకు, తాత్కాలికంగా నివసిస్తూ వీసా గడువు ముగియనున్న వర్కర్లకు, విద్యార్ధులకు మరింత లబ్ధి చేకూరనుంది. కానీ, ఇటీవల దేశంలోకి ప్రవేశించిన వారికి ఈ కార్యక్రమం అందుబాటులో ఉండదని మంత్రి మిల్లర్ స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు లేని వలసదారులు సిటిజన్ షిప్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందేలా రాబోయే క్యాబినెట్ సమావేశాల్లో బిల్లుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. వలసదారులకు ఆహ్వానం హౌసింగ్ సవాళ్లు, పెరిగిన ద్రవ్యోల్బణ రేట్ల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ ఆర్థిక ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుత వలస లక్ష్యాలను రాబోయే రెండు సంవత్సరాలకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023 లో 465,000 కొత్త నివాసితులు, 2024 లో 485,000 కొత్త నివాసితులు, 2025 లో 500,000 మందిని ఆహ్వానించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. -
‘సీఏఏ అమలు ఖాయం’
కోల్‌కతా: దేశంలో పౌరసత్వ (సవరణ) చట్టం–సీఏఏ అమలును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. బుధవారం ఆయన కోల్‌కతాలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ ర్యాలీలో మాట్లాడారు. సీఏఏను పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. బెంగాల్లోకి విదేశీయుల చొరబాట్లకు మమత దన్నుగా ఉండటమే అందుకు కారణమని షా ఆరోపించారు. రాష్ట్రాన్ని తృణమూల్ సర్కారు సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం నిండా అవినీతిలో మునిగిపోయింది. మమత హయాంలో రాష్ట్రంలో రాజకీయ హింస, ముస్లిం సంతుïÙ్టకరణ చర్యలు పరాకాష్టకు చేరాయి’’ అని ఆరోపించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమత సర్కారును సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టి మమత సర్కారు పతనానికి రంగం సిద్ధం చేయండి. మోదీ కూడా బెంగాల్ ప్రజల వల్లే నేను మూడోసారి ప్రధాని అయ్యాను అని చెప్పుకునే స్థాయిలో రాష్ట్రంలో బీజేపీని ఘనంగా గెలిపించండి’’ అని కోరారు. -
స్టార్ హీరో.. ఇన్నాళ్లకు భారతీయుడు అయ్యాడు!
స్టార్ హీరో అక్షయ్ కుమార్... 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ పౌరసత్వం అందుకున్నాడు. అదేంటి... గత 30 ఏళ్లకు పైగా మన సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. మన దేశస్తుడు కాకపోవడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ అదే నిజం. ఇంతకీ అక్షయ్ పౌరసత్వం సంగతేంటి? అతడు ఇన్నాళ్లు ఏ దేశ పౌరుడు అనేది ఇప్పుడు కాస్తంత వివరంగా చెప్పుకొందాం. నటుడు కాకముందు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా పనిచేసిన అక్షయ్ కుమా.. 1987లో 'ఆజ్' అనే సినిమాలో సహాయ పాత్రలో నటించి కెరీర్ ప్రారంభించాడు. 1991లో 'సౌగంధ్' మూవీతో హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోల్లో అక్షయ్ ఒకడని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) ఇన్నాళ్లుగా హిందీ సినిమాలు చేస్తున్నప్పటికీ అక్షయ్‌కి కెనడా పౌరసత్వం ఉండేది. దీంతో చాలామంది ఈ విషయమై ఇతడిని విమర్శించేవారు. గతంలో ఓసారి ప్రధాని మోదీని, అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా పౌరసత్వం విషయమై ట్రోల్ చేశారు. దీంతో 2019లో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. కొవిడ్ వల్ల అది ఇన్నాళ్లు పాటు ఆలస్యమైంది. తాజాగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను భారతదేశ పౌరసత్వ అందుకున్నట్లు ఓ ఫొటో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య 'ఓ మై గాడ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్.. త్వరలో 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' చిత్రంతో రాబోతున్నాడు. వీటితో పాటు మరో నాలుగు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. Dil aur citizenship, dono Hindustani. Happy Independence Day! Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk — Akshay Kumar (@akshaykumar) August 15, 2023 (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా) -
‘భారత్’తో బంధాన్ని తెంపేసుకుంటున్నారు. ఎందుకు వెళ్తున్నారు..?
ఆదాయార్జన, మెరుగైన సేవలు,మరిన్ని సౌకర్యాలు, వాతావరణానికి,పరిస్థితులకు అలవాటు పడిపోవడం..కారణం ఏదైనా కావొచ్చు..వీటన్నిటినీ సానుకూల అంశాలుగానే భావించడం వల్ల అయ్యిండొచ్చు. ఏటా వేలు, లక్షల సంఖ్యలో భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. ఆయా దేశాల పౌరులుగా మారిపోతున్నారు. అక్కడి పౌరసత్వం కోసం భారతీయ పౌరసత్వం వదులుకుంటున్నారు. పుట్టి, పెరిగిన దేశంతో ఉన్న ‘బంధాన్ని’తెంపేసుకుంటున్నారు. దేశ పౌరుడిగా ఉన్న గుర్తింపునకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇలా విదేశాల్లో పౌరసత్వం తీసుకుంటున్న వారిలో విద్యావంతులు, ధనికులు, విశేషాధికారాలను పొందుతున్న వారే ఎక్కువగా ఉండగా, ఇలా విదేశీ పౌరసత్వం తీసుకుంటున్నవారి సంఖ్య ఏటా పెరుగుతుండటం గమనార్హం. -సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ విదేశీ పౌరసత్వానికే ఓటు గడిచిన పుష్కర కాలంలో ఏకంగా సుమారు 18 లక్షల మంది మన దేశ పౌరుని హోదాను వదులుకున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఉన్న విధంగా భారత్‌లో ఉమ్మడి పౌరసత్వానికి ఆమోదం లేకపోవడంతో భారతదేశ పౌరసత్వాన్ని (సిటిజెన్షిప్) కాదనుకుని విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 135 దేశాల్లో అక్కడి సిటిజెన్ షిప్ తీసుకున్న భారతీయులు ఉన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా్నయి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లేవారు ఉద్యోగం సంపాదించి ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతున్నారు. వీరితో పాటు వర్క్ వీసాలపై వెళ్లేవారిలో ఎక్కువమంది భారత పౌరసత్వాన్ని వదులుకుని అక్కడి సిటిజెన్లుగా మారేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక దేశంలో అధిక ఆదాయం కలిగిన వారు, ఇతరులు కూడా విదేశాల్లో స్థిరపడే ఉద్దేశంతో భారత్ వదిలిపోతున్నారు. భారతదేశంలో అధిక ఆదాయం కలిగిన ఎనిమిది వేల మంది ఈ ఏడాది దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశీ పౌరసత్వం తీసుకోనున్నట్లు.. ‘గ్లోబల్ సిటిజెన్ షిప్ అండ్ రెసిడెన్స్ అడ్వాన్సెస్’పై అధ్యయనం చేసే లండన్‌లోని ‘హెన్లీ అండ్ పార్టనర్స్’అనే సంస్థ ఇటీవల వెల్లడించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు 87 వేల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లారు. 12 ఏళ్లలో 18.5లక్షల మందివెళ్లిపోయారు.. ప్రతి ఏడాదీ లక్షకు పైగా భారతీయులు విదేశీ పౌరసత్వాన్ని పొందుతున్నారు. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. వీరిలో దాదాపు 60 శాతానికి పైగా ప్రజలు ఏడు దేశాల్లోనే పౌరసత్వం తీసుకుంటున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆ్రస్టేలియా, జర్మనీ, ఇటలీ వీటిల్లో ఉన్నాయి. ఇటీవలి కాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు సింగపూర్‌లోనూ పౌరసత్వం తీసుకోవడానికి భారతీయులు మొగ్గు చూపుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లకు వెళ్లే వారిలో గోవా, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, కేరళకు చెందినవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడి పౌరసత్వం వదులుకునే క్రమంలో ఇచ్చే దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను బట్టి ఇది వెల్లడైంది. ఎందుకు వెళ్తున్నారు..? విదేశీ పౌరసత్వం తీసుకుంటున్న వారిని ఏయే అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయనేది పరిశీలిస్తే.. ప్రధానంగా భారత్‌లో కంటే మెరుగైన జీవన ప్రమాణాలు, సంపద, ఎక్కువ అవకాశాలు, తక్కువ కాలుష్యం, పిల్లలకు మంచి భవిష్యత్తు వంటివి కారణాలుగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆయారంగాల్లో విజయం సాధించిన వారు సైతం విదేశీ పౌరసత్వాన్ని కోరుకుంటున్నట్లు వెల్లడవుతోంది. వర్క్ వీసాలపై వెళ్లేవారు కూడా భారత్‌కు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అక్కడే పౌరసత్వం కోసం ప్రయతి్నస్తున్నారు. భారత్‌లో పన్నుల విధానం నచ్చని వారు.. తక్కువ ఆదాయ పన్ను వసూలు చేసే దేశాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఆయా దేశాల్లో ఎక్కువ నైపుణ్యం ఉన్న వారి కొరత.. భారతీయులకు అక్కడ శాశ్వత పౌరసత్వం కలి్పంచడానికి ఓ కారణంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇక అధిక నెట్‌వర్త్ ఉన్న వ్యాపారవేత్తలు ఎక్కువగా దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఫ్రాన్స్, మాల్టా వంటి దేశాలను ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఐరోపా దేశాల్లో డాక్టర్లు, నర్సులు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫీ షియల్ ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన ఐటీ ప్రొఫెషనల్స్‌తో పాటు వెల్డర్స్, ప్లంబర్స్, ఎల్రక్టీషియన్స్, కార్పెంటర్లకు డిమాండ్ బాగా ఉంది. వీరు కూడా అక్కడ పనిచేయడానికి వెళ్లి అక్కడి పౌరసత్వం పొందుతున్నారని చెబుతున్నారు. అమెరికా లేదా సింగపూర్ పౌరులైతే.. అమెరికా, సింగపూర్, జపాన్ దేశాల పౌరులైతే.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లడానికి వీసా ఇబ్బందులు పెద్దగా లేకపోవడం కూడా ఆయా దేశాల సిటిజన్లుగా మొగ్గుచూపడానికి ఓ కారణంగా చెబుతున్నారు. మన దేశం నుంచి అమెరికాకు పర్యాటక (టూరిస్ట్) వీసా మీద వెళ్లాలంటే.. ఆ వీసా స్లాట్ కోసమే దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మళ్లీ భారత పౌరసత్వం కష్టమే..! భారత పౌరసత్వాన్ని వదులుకోవడం ఒకింత సులభమే అయినా, మళ్లీ భారత పౌరసత్వం పొందాలంటే మాత్రం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తుల కొనుగోలు, ఇతర అంశాల విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. దేశంలో సంపాదించి వెళ్లిపోయేవారు ప్రమాదం భారత్ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారందరిలో.. దేశంలోని అన్నిరకాల వనరులు ఉపయోగించుకుని బాగా సంపాదించాక ఆ డబ్బుతో యూఎస్, ఆ్రస్టేలియా, ఐరోపా దేశాల్లో పౌరసత్వం తీసుకుంటున్న వారిని అత్యంత ప్రమాదకారులుగా చూడాల్సి ఉంటుంది. ఉద్యోగం, విద్య, తదితర కారణాలతో విదేశాలకు వెళ్లిన వారు కొన్నేళ్లు పోయాక అక్కడే స్థిరపడడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వీరంతా వేరే కేటగిరీ కిందకు వస్తారు. ఇక్కడ సంపాదించిన దానికి ఆదాయపు పన్నులు కట్టకుండా ఎగ్గొట్టి ఇతర దేశాల్లో కంపెనీలు పెట్టడం, ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టి స్థిరనివాసం ఏర్పరుచుకోవడం వంటివి చేస్తున్నారు. యూఎస్, యూకే తదితర దేశాలు.. ఇమ్మిగ్రేషన్ పాలసీలో భాగంగా పరిశ్రమలు పెట్టినా, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినా పౌరసత్వం ఇస్తున్నాయి. గుజరాత్, పంజాబ్‌లకు చెందిన కొన్ని ప్రాంతాలవారు యూఎస్, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లాలన్న లక్ష్యంతోనే ఉండడం గమనార్హం. యూఎస్‌లో గుజరాతీలు హోటల్ వ్యాపారంపై పట్టు సాధించగా, కెనడాలో పంజాబీలు వ్యవసాయంలో, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. – ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి,ప్రముఖ ఆర్థిక వేత్త, హెచ్‌సీయూ మాజీ డీన్ -
దేశ పౌరసత్వాన్ని వదులుకున్న అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనకు భారత్‌తో పాటు కెనడా పౌరసత్వం ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా అక్షయ్ కుమార్ స్పందించారు. తాను భారతీయుడినన్న అక్షయ్.. తన సర్వస్వం భారతదేశమేనని స్పష్టం చేశాడు. కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘ఆజ్ తక్’లో ప్రసారమవుతున్న ‘సీదీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''1990లలో నాకు వరుసగా 15 ప్లాఫులు వచ్చాయి. ఇక ఇండస్ట్రీలో కంటిన్యూ అవడం అసాధ్యం అని భావించాను. ఆ సమయంలోనే కెనడాలో ఉండే నా ఫ్రెండ్.. అక్కడికి వచ్చి ఏదైనా పని చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. దీంతో కెనడా పాస్పోర్టుతో పాటు అక్కడి పౌరసత్వం కోసం కూడా ధరఖాస్తు చేసుకున్నా. అదే సమయంలో నేను నటించిన రెండు సినిమాలు అదృష్టం కొద్దీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతొ నా ఫ్రెండ్.. వెళ్లి నీ పని చూసుకో అని చెప్పడంతో తిరిగి ఇండియాకు వచ్చాను. ఇది తెలుసుకోకుండా ప్రజలు నాపై విమర్శలు చేస్తుంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికే కెనడా పాస్‌పోర్ట్ మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా'' అంటూ అక్షయ్ చెప్పుకొచ్చారు. -
Canada Labour Shortage: కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు
అట్టావా: కెనడాలో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయని ఆ దేశ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10 లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్ వయస్సుకు దగ్గర పడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది కెనడాలో అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యం 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులకు సానుకూలంగా మారింది. వృత్తి నిపుణులు, సైంటిఫిక్– టెక్నికల్ సేవలు అందించేవారు, రవాణా, వేర్ హౌసింగ్, ఫైనాన్స్, బీమా, వినోదం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో సుమారు 90 వేల ఉద్యోగావకాశాలున్నాయి. విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10% మేర పెరిగాయి. రానున్న పదేళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్మెంట్కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకుంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగానే తీసుకునేవే ఉంటాయి. -
ఉక్రెయిన్ పౌరులందరికీ రష్యా పౌరసత్వం.... వేగవంతం చేయాలన్న పుతిన్!
Russian Citizenship Forall citizens of Ukraine: తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులకు దిగుతున్న రష్యా దాదాపు చాలా ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకుంది. ఆ మేరకు రష్యా అనుకూల వేర్పాటు వాదుల ప్రాబల్యమున్న డోన్బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్సుపై పట్టు సాధించాయి రష్యా బలగాలు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పౌరులందరికి రష్యన్ ఫెడరేషన్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే హక్కు ఇచ్చేలా డిక్రీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లో రెండు ప్రాంతాల నివాసితులకు పౌరసత్వాన్ని వేగవంతం చేశారు. అంతేకాదు దాదాపు రష్యన్ దళాల నియంత్రణలో ఉన్న ఖేర్సన్, జపోరిజ్జియా వంటి ఆగ్నేయా ప్రాంతాల్లో ఈ విధానాన్ని వేగవంతం చేశారు. ఇలానే 2019లో తూర్పు ఉక్రెయిన్ నుంచి విడిపోయిన మాస్కో అనుకూల వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుగాన్క్స్ వంటి ప్రాంతాల్లోని నివాసితులకు ఇలాంటి డిక్రీని ఆదేశించి తనలోకి కలిపేసుకుంది. వాస్తవానికి ఈ డిక్రీ ద్వారా సరళీకృత విధానంలో రష్యా పౌరసత్వాన్ని పోందేలా దరఖాస్తు చేసుకునే హక్కుని ఉక్రెయిన్ పౌరులకు అందిస్తోంది రష్యా. దీంతో మాస్కో నియంత్రణలో ఉన్న ప్రాంతాలలోని నివాసితులు, అధికారులు రష్యాలో భాగమవుతారు. (చదవండి: రక్త ఆభరణాలు! ఔను! మానవుని రక్తంతో చేసినవి...) -
Ukraine War: ఊహించని చర్యలకు దిగిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై జరుపుతున్న మిలిటరీ చర్యలో ఊహించని చర్యలకు దిగాడు. ఇప్పటికే పశ్చిమ ప్రాంతం ఖేర్సన్, ఆగ్నేయ ప్రాతం జాపోరిజ్జియా(జేఫోరిషియ)లను రష్యా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని పౌరులకు రష్యా పౌరసత్వం కట్టబెట్టేలా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఉక్రెయిన్ యుద్ధం ద్వారా పూర్తి స్వాధీనంలో ఉన్న ఖేర్సన్, కొంతభాగం మాత్రమే రష్యా బలగాల ఆధీనంలో ఉన్న జాపోరిజ్జియాలో ఉక్రెయిన్ పౌరులకు.. రష్యా పౌరసత్వం ఇచ్చేలా ఆదేశాలపై బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకాలు చేశాడు. ఇందుకోసం రష్యా సిటిజన్‌షిప్, పాస్‌పోర్ట్ చట్టాల సవరణలకు పచ్చజెండా ఊపాడు. తద్వారా మూడు నెలల లోపే దరఖాస్తుదారులకు రష్యా పౌరసత్వం, పాస్‌పోర్టులు దక్కనున్నాయి. మరోవైపు ఆదేశాలు వెలువడ్డ కాసేపటికే.. అక్కడి ఉక్రెయిన్ పౌరులకు పౌరసత్వం ఇచ్చే చర్యలు ఆఘమేఘాల మీద మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. మాస్కో, మాస్కో అనుకూల అధికారులు ఇప్పటికే ఈ రెండు ప్రాంతాలు రష్యా పరిధిలోకి వస్తాయని ప్రకటించడం గమనార్హం. అయితే కీవ్ వర్గాలు మాత్రం పుతిన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇది ఉక్రెయిన్ సరిహద్దు సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే అంశమని వాదిస్తున్నాయి. అక్రమంగా రష్యా పౌరసత్వాన్ని, పాస్‌పోర్టులు కట్టబెట్టడాన్ని ఖండిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవత్వ చట్టాలను ఉల్లంఘించడమేనని, పాశ్చాత్య దేశాలు ఈ చర్యను ఖండించాలని పిలుపు ఇచ్చింది. ఒకవైపు ఇందులో బలవంతం ఏం లేదని ఖేర్సన్ రీజియన్ అధికారులు(రష్యా) చెప్తున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. సోమవారం ఖేర్సన్,జాపోరిజ్జియా అధికారులు.. ఉక్రెయిన్ హ్రివ్నియాతో పాటు రూబుల్‌ను(రష్యా కరెన్సీ) కూడా అధికారిక కరెన్సీపై ప్రకటించారు. ఇంతకుముందు రష్యా నుంచి స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించబడ్డ ఉక్రెయిన్ డోనేత్సక్, లుగాన్స్క్ ప్రాంతాల్లోని అనేక లక్షల మంది నివాసితులు ఇప్పటికే రష్యన్ పాస్‌పోర్ట్‌లను అందుకున్నారు. చదవండి: ఉక్రెయిన్ యుద్ధానికి మూణ్నెల్లు -
అమెరికన్ల వలస బాట
అమెరికా. ఓ కలల ప్రపంచం. ప్రపంచవ్యాపంగా ఎందరికో స్వర్గధామం. ఎలాగైనా అక్కడ స్థిరపడాలని కలలు కనేవారు, ఎలాగోలా అక్కడికి వలస పోయేవారు కోకొల్లలు. కానీ కొన్నేళ్లుగా అమెరికన్లే భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు! ఎక్కడైతే ఆనందంగా జీవించవచ్చా అని జల్లెడ పట్టి మరీ నచ్చిన దేశానికి వలస పోతున్నారు!! ఈ కొత్త పోకడకు కారణాలేమిటి...? అమెరికన్లు, ముఖ్యంగా సంపన్నులు కొన్నే ళ్లుగా దేశం వీడుతున్నారు. ఇలా విదేశాల బాట పట్టే పోకడ 2019 నుంచి అమెరికాలో బాగా ఊపందుకుంది. ఎలాగోలా ఏదో ఒక దేశ పౌరసత్వం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్ల సంఖ్య గత మూడేళ్లలో ఏకంగా 337 శాతం పెరిగిందని పలు దేశాల పౌరసత్వానికి సంబంధించి సలహాలు, సదుపాయాలు కల్పించే హెన్లే–పార్ట్నర్స్ సంస్థ వెల్లడించింది. ఇందుకు వీరంతా ప్రధానంగా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ (సీబీఐ) పథకాన్ని దగ్గరి దారిగా ఎంచుకుంటు న్నారు. సీబీఐ ద్వారా తమ దగ్గర భారీగా పెట్టుబ డులు పెట్టేవారికి పౌరసత్వానికి, స్థిర నివాసానికి పలు దేశాలు అవకాశం కల్పిస్తున్నాయి. కారణాలు నాలుగు అమెరికన్లలో ఈ పోకడకు నాలుగు ‘సి’లు ప్రధాన కారణాలని హెన్లే–పార్ట్నర్స్కు చెందిన డొమినిక్ హొలెక్ చెబుతున్నారు. అవి కోవిడ్, క్లైమేట్ చేంజ్, క్రిప్టో కరెన్సీ–పన్నులు, కన్ఫ్టిక్ట్ (కల్లోల పరిస్థితులు). కోవిడ్ లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు అమెరికన్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. యూరప్‌లోని చాలా దేశాలకు అమెరికా పాస్పోర్టుతో నేరుగా వెళ్లడం వీలు పడదు. దాంతో చాలామంది అమెరికన్లు యూరప్ దేశాల పౌరసత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక విచ్చలవిడిగా పెరుగుతున్న భూతాపంలో ప్రధాన వాటా అమెరికా పారిశ్రామిక రంగానిదే. దాంతో అక్కడ చోటుచేసుకుంటున్న వాతావరణ విపరిణామాలు అమెరికన్లను ఆందోళన పరుస్తున్నాయి. మూడేళ్ల క్రితం చెక్ రిపబ్లిక్కు వలస వెళ్లిన ది సావీ రిటైరీ అనే అమెరికా పత్రిక ఎడిటర్ జెఫ్ డి ఒప్డైకి అదే చెబుతున్నారు. ‘‘అమెరికాలో వాతావరణం నానాటికీ బాగా కలుషితమవుతోంది. ప్రశాంతంగా గడపాలనుకునే నేను అక్కడ ఎంతమాత్రమూ ఇమడలేనని తేలిపోయింది’’ అంటారాయన. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన వారు, పెరిగిపోతున్న పన్నుల, ధరల భారాన్ని తప్పించుకోవాలనుకునే అమెరికన్లు కూడా మరో ఆలోచన లేకుండా వలస బాట పడుతున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కల్లోల స్థితి, ట్రంప్ హయాం నుంచి పెచ్చరిల్లిన జాతి విద్వేషాలు కూడా అమెరికన్లను బాగా భయపెడుతున్నాయి. మనోళ్లు కూడా... గోల్డెన్ వీసాల కోసం ప్రయత్నిస్తున్న ధనిక భారతీయుల సంఖ్యా తక్కువేమీ కాదు. 2014 నుంచి 23 వేల మంది ఇలా రెండో పాస్‌పోర్ట్ పొందినట్టు మోర్గాన్ స్టాన్లీ నివేదిక చెబుతోంది. 2020లోనే ఐదు వేల మంది భారతీయులు మరో దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు తేల్చింది. మనోళ్లు ఎక్కువగా కరేబియన్ దేశం సెయింట్ కిట్స్‌పై ఆసక్తి చూపుతున్నారని సీఎస్ గ్లోబల్ పార్ట్నర్స్ డైరెక్టర్ పాల్‌సింగ్ తెలిపారు. 4 కోట్ల వలసలు! గత మూడున్నరేళ్లలో కనీసం 4 కోట్ల మంది అమెరికన్లు వలస బాట పట్టి ఉంటారని అంచనా. గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ షిమిట్ వంటివారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన 2020లో యూరప్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా రు. వలసల కోసం చాలామంది గోల్డెన్ పాస్‌పోర్ట్, గోల్డెన్ వీసాగా పిలిచే సీబీఐనే నమ్ముకుంటు న్నారు. దీన్ని పొందడానికి లక్ష నుంచి 95 లక్షల డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. గోల్డెన్ పాస్‌పోర్టుకు ప్రయత్నిస్తున్న అమెరికన్లలో చాలామంది పోర్చుగల్ వైపు చూస్తున్నారు. ఆ దేశ పౌరసత్వముంటే 26 యూరప్ దేశాల్లో వీసా లేకుండా ప్రవేశించవచ్చు. రెండు లక్షల డాలర్ల పెట్టబడులు పెడితే ఐదేళ్లు నివాసముండవచ్చు. తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. న్యూజిలాండ్, మాల్టా, ఆస్ట్రియా, సెయింట్ కిట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వాలకూ అమెరికన్లలో బాగా డిమాండ్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia-Ukraine war: ట్యాంకుతో సహా లొంగిపోయాడు
ఉక్రెయిన్‌లో రష్యా సైనికుడొకరు ఆ దేశానికి లొంగిపోయాడు. తన అధీనంలోని అత్యాధునిక టి–72బి3 యుద్ధ ట్యాంకును కూడా ఉక్రెయిన్పరం చేశాడు. బదులుగా 7,500 పౌండ్ల రివార్డుతో పాటు ఉక్రెయిన్ పౌరసత్వం పొందనున్నాడు. తాము చేస్తున్నది అర్థం లేని యుద్ధమని మిషా అనే ఆ సైనికుడు అన్నట్టు ఉక్రెయిన్ మంత్రి విక్టర్ ఆండ్రుసివ్ చెప్పారు. రష్యా సైనికులు వాడుతున్న ఫోన్లను గుర్తించిన ఉక్రెయిన్, ఎలా లొంగిపోవాలో వివరిస్తూ కొంతకాలంగా వాటికి ఎస్ఎంఎస్లు పంపుతూ వస్తోంది. అది ఈ విధంగా వర్కౌటవుతోంది. ‘‘మిషా కొద్ది రోజులుగా ఉక్రెయిన్ పోలీసులను ఫోన్లో సంప్రదించి లొంగిపోయాడు. రష్యా సైనికులకు తినడానికి తిండి కూడా లేదని అతను చెప్పుకొచ్చాడు. సేనలు నైతికంగా చాలా దెబ్బ తిని ఉన్నాయన్నాడు. ప్రస్తుతానికి మిషాను యుద్ధ ఖైదీగానే చూసినా సకల సౌకర్యాలూ కల్పిస్తాం’’ అని విక్టర్ చెప్పుకొచ్చారు. రష్యా యుద్ధ విమానాన్ని స్వాధీనం చేసుకునే వారికి 10 లక్షల డాలర్లు, హెలికాప్టర్‌కు 5 లక్షల డాలర్లు ఇస్తామని కూడా ఉక్రెయిన్ ప్రకటించింది! ఈ ఆఫర్ రష్యా పైలట్లకు కూడా వర్తిస్తుందని చెప్పింది!! -
భారత పౌరసత్వం కావాలంటున్న పాకిస్తానీయులు !
భారత్ పాక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. క్రికెట్ మ్యా్చ్ మొదలు కశ్మీర్ వరకు విమర్శలు ప్రతివిమర్శలు ఇరు పక్షాల నుంచి అధికంగా జరుగుతుంటాయి. అయితే ఇందుకు విరుద్ధంగా భారత పౌరసత్వం కావాలంటూ కోరుతున్న విదేశీయుల్లో పాకిస్తానీయులే అధికంగా ఉన్నారు. ఫస్ట్ పాకిస్తాన్ సిజిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం 2016 నుంచి విదేశీయులకు జారీ చేసిన పౌరసత్వ వివరాలను మంత్రి నిత్యనంద్రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. దీని ప్రకారం 2016 నుంచి 2021 మధ్య మొత్తం 4,800ల మంది విదేశీయులకు ఇండియన్ సిటిజన్‌షిప్ జారీ చేశారు. ఇందులో అధికంగా పాకిస్తానీయులు ఉన్నారు. మంత్రి చెప్పిన వివరాల ప్రకారం పాకిస్తానీయులు (2,405), ఆఫ్గన్స్ (431), బంగ్లాదేశీయులు (132), శ్రీలంకన్స్ (92), అమెరికన్స్ (80)లుగా టాప్ 5లో ఉన్నారు. పెండింగ్‌లో అదే ట్రెండ్ భారత పౌరసత్వం కావాలంటూ కేంద్రం వద్ద ప్రస్తుతం 10,635 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అధికంగా 7,306 మంది పాకిస్తానీయులే కావడం గమనార్హం. పాక్ తర్వాత 1,152 మందితో అఫ్గన్స్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇతిమిద్దంగా ఏ దేశం పేరు చెప్పకుండా ఇండియన్ సిటిజన్‌షిప్ అడుగుతున్న పౌరుల సంఖ్య 428 మంది వరకు ఉంది. 2021లో అధికం ఇటీవల కాలంలో విదేశీయులకు పెద్ద సంఖ్యలో భారత పౌరసత్వం లభిస్తుంది. ఇయర్ల వారీగా చూస్తే 2021లో 1,773 ఉండగా ఆ తర్వాత వరుసగా 2020లో 639, 2019 ఏడాదిలో 987, 2018 ఏడాదిలో 628, 2017 ఏడాదిలో 817 మందికి భారత పౌరసత్వం జారీ అయ్యింది. అమెరికాకే ప్రాధాన్యం ఇక గడిచిన ఐదేళ్ల కాలంలో ఫారిన్ సిటిజన్‌షిప్ కోసం దాదాపు 8 లక్షల మంది తమ భారతీయ పౌరసత్వం వదులుకున్నారు. ఇందులో దాదాపు 42 శాతం మంది అమెరికా సిటిజన్‌షిప్ పొందగా... ఆ తర్వాత స్థానాల్లో కెనడా (91 వేల మంది), ఆస్ట్రేలియా (86,933), యూకే (66,193), ఇటలీ (23,490)లు ఉన్నాయి. ఇక 83,191 మంది ప్రపంచంలో ఉన్న 86 దేశాల్లో వేర్వేరుగా పౌరసత్వం తీసుకున్నారు. చదవండి: పాత పాస్‌పోర్ట్‌లకు కాలం చెల్లు -
రెండు నెలల్లో.. 40వేల కోట్లు పొగొట్టుకుందామె!
సొంత దేశం కోసం తప్ప.. వ్యక్తిగతంగా బాగుపడకూడదంటూ బిలియనీర్లపై పగబట్టింది చైనా ప్రభుత్వం. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా అపర కుబేరులపై ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రియలిటీ కింగ్‌గా ఉన్న ‘ఎవర్‌గ్రాండ్’ సైతం దివాళా దిశగా వెళ్లడం, అలీబాబా జాక్ మా లాంటి వాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం లాంటివి గమనిస్తే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో.. చైనా దెబ్బకి హాంకాంగ్‌కు చెందిన ఓ బిలియనీర్.. తన సంపదలో దాదాపు 40 వేల కోట్లకు పైగా కోల్పోయింది. హువాబావో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్.. హాంకాంగ్ ట్రేడింగ్‌లో షేర్ల ధరలు ఏకంగా 67 శాతం పతనమయ్యాయి. ఈ కంపెనీ చైర్ఉమెన్ చూ లమ్ వైయియూ(52) ను క్రమశిక్షణ ఉల్లంఘనల కింద చైనా ప్రభుత్వం విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు దారుణాతిదారుణంగా పతనం అవుతున్నాయి. చైనా దర్యాప్తు మొదలైందన్న విషయం తెలిశాక.. ఇన్వెస్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయని, అందుకే ఈ ఎఫెక్ట్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. చైనా హునాన్ ప్రావిన్స్‌లోని లెయియాంగ్ సిటీకి చెందిన సూపర్వైజరీ కమిటీ ఒకటి.. చూ ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. చూ లమ్ వైయియూ.. హువాబావో కంపెనీ చైర్ఉమెన్ మాత్రమే కాదు.. 71 శాతం వాటాతో సీఈవోగా కూడా కొనసాగుతున్నారు. నవంబర్‌లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న సంపద.. ఇవాళ్టి(ఫిబ్రవరి 3)నాటికి 2.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే స్టాక్ ధరలు మరింత దిగజారుతాయనే భయంతో దర్యాప్తు దేని మీద సాగుతుందన్న వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యత పాటిస్తోంది కంపెనీ. tobacco fragrance queenగా చూ కి మరో పేరుంది. అయితే హువాబావో కంపెనీ తరపున ఈ-సిగరెట్లను మైనర్లకు విక్రయించడం మీద అభ్యంతరాల నడుమే చైనా ప్రభుత్వం ఆమెపై దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. కానీ, చైనా పౌరసత్వం వదులుకుని మరీ ఆమె బిలియనీర్‌గా ఎదగడం ఓర్వ లేకే చైనా.. ఇలాంటి చర్యలకు ఉపక్రమించిందన్నది హాంకాంగ్ వర్గాల కథనం. చూ కెరీర్ చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో పుట్టిన చూ.. ఆపై హాంకాంగ్ పౌరసత్వం తీసుకుంది. కాలేజీ రోజుల్లోనే హువాబావో పేరిట చూ లాం వైయియూ.. అత్తరు వ్యాపారాన్ని కొనసాగించింది. 1966లో కంపెనీని మొదలుపెట్టిన ఆమె.. పదేళ్ల తర్వాత కంపెనీని ఐపీవోకి తీసుకెళ్లింది. ఐదవ సీపీపీ సీసీసీ (Chinese People's Political Consultative Conference Committee)లో ఆమె సభ్యురాలిగా కూడా పని చేసింది. వారసుడిని వ్యాపారంలోకి దింపాలనే ప్రయత్నాల్లో ఉండగానే.. ఆమెకు ఈ ఎదురు దెబ్బ తగడం విశేషం. -
గత 5 ఏళ్లలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య ఎంతంటే..!
గత ఐదేళ్లలో ఆరు లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం....విదేశాల్లో సుమారు 1.33కోట్లకుపైగా (1,33,83,718) భారతీయులు నివసిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో తెలిపారు. చదవండి: ఎన్నారైలకు సీబీఎస్ఈ శుభవార్త! స్కూల్ అడ్మిషన్లపై కీలక ప్రకటన 2017లో 133049 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకోగా..2018లో 134561, 2019లో 1,44,017, 2020లో 85,248 మంది, 2021 సెప్టెంబర్ నాటికి 1,11,287 మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. సత్తా చాటుతున్న భారతీయులు..! విదేశాల్లో భారత సంతతి వారు పలు రంగాల్లో సత్తా చాటుతున్నారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో భారీ సంఖ్యలో ఇండియన్స్ పనిచేస్తున్నారు. ట్విటర్‌తో పాటుగా..గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎమ్ లాంటి దిగ్గజ కంపెనీలకు భారతీయులు సీఈవోలుగా పనిచేస్తున్నారు. చదవండి: అమెరికా ఎన్నారైల్లో తెలుగు వారే టాప్.. పోటీగా గుజరాత్ -
కేంద్రం తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణలో హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అయితే, అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమో దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ కేంద్ర హోమ్ శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు? అని హైకోర్టు ప్రశ్నించింది. పాత మెమోనే సమర్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జర్మనీ ఎంబీసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. -
వలసదారులందరికీ పౌరసత్వం
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తాను నెగ్గితే అమెరికాలో ఉంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకి అమెరికా పౌరసత్వం ఇస్తానని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభంపై పోరాటం, ఆర్థిక వ్యవస్థ పునఃనిర్మాణం, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వం పునరుద్ధరణతో పాటుగా వలసదారుల సమస్యలు తన ఎజెండాలో అగ్రభాగాన ఉంటాయని చెప్పారు. వాషింగ్టన్లో బుధవారం నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ‘వలస సంక్షోభాన్ని మేము ఎదుర్కోవాల్సి ఉంది. నేను అధికారంలోకి వస్తే ఇమిగ్రేషన్ బిల్లుని ప్రతినిధుల సభ, సెనేట్‌కి పంపిస్తాను. దాని ద్వారా 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది’అని బైడెన్ చెప్పారు. అక్రమ మార్గాల్లో వచ్చిన వారందరూ అమెరికాలో తిష్ట వేశారని, వారిని దేశం నుంచి వెంటనే తరిమేయాలని అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉంటే వలస విధానంలో దానికి విరుద్ధమైన వైఖరిలో బైడెన్ మాట్లాడారు. ట్రంప్ గత నాలుగేళ్లలో తన విధానాల ద్వారా అమెరికాలో వివిధ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని, తనకు అమెరికా ప్రజలు అధికారాన్ని ఇస్తే అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాల్సి ఉంటుందని అన్నారు. -
అమెరికాలో పెంచిన పౌరసత్వ ఫీజులకు కోర్ట్ బ్రేక్
శాన్‌డియాగో: భారీగా పెంచిన పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ ఫీజులను నిలిపివేస్తూ అమెరికా ఫెడరల్ జడ్జి ఆదేశాలు జారీచేశారు. అక్టోబర్ 2 నుంచి అమలులోకి రావాల్సిన ఈ భారీ ఫీజులను యుఎస్ జిల్లా జడ్జి జఫ్రీ వైట్ తక్షణం నిలిపివేశారు. ఆ ఇద్దరూ సీనియర్ హోంసెక్యూరిటీ డిపార్ట్మెంట్ అధికారులు మెక్ అలీనన్, చాద్‌వూల్ఫ్‌లను చట్టవిరుద్ధంగా నియమించారని జడ్జి అభిప్రాయపడ్డారు. ఫెడరల్ నియమం ప్రకారం ఈ ఫీజులను ఎందుకు పెంచారో వివరించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఫీజుల పెంపును అడ్డుకున్నానని జడ్జి తెలిపారు. 8 స్వచ్ఛంద సంస్థలు, ఇమ్మిగ్రెంట్ లీగల్ రీసోర్స్ సెంటర్లు ఉమ్మడిగా పెంచిన ఫీజులను వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించారు. పెంచిన ఫీజులను, చట్ట విరుద్ధంగా నియమితులైన అధికారులు నిర్ణయించారు కనుక వీటిని తక్షణం నిలిపివేయాలని ఈ సంస్థలు కోర్టుని కోరడంతో, ఫెడరల్ జడ్జి ఈ తీర్పునిచ్చారు. జార్జ్ డబ్లు్య బుష్ అధ్యక్షునిగా ఉన్న కాలంలో వైట్‌ను కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ జడ్జిగా నియమించారు. ఈ నిర్ణయంపై హోంలాండ్ సెక్యూరిటీ, జస్టిస్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించలేదు. చాద్‌వూల్ఫ్‌ని పాలసీ విభాగంలో ఉన్నతాధికారిగా ట్రంప్ నియమించినప్పటికీ, ఈ నియామకాన్ని సెనేట్ అంగీకరించలేదు. గ్రీన్‌కార్డులకు, పౌరసత్వ హక్కులకు తాత్కాలిక వర్క్ పర్మిట్లకు ఫీజులను 20 శాతం మేర పెంచారు. హెచ్1 బి వీసా ఫీజు ప్రస్తుతం ఉన్న 460 డాలర్ల నుంచి 555 డాలర్లకు పెంచారు. ఎల్ 1 వీసాల ఫీజులను 75 శాతం పెంచి, 805 డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పటికే పనిచేస్తోన్న హెచ్1బి కార్మికుల భాగస్వాములకు ఫీజుని 34 శాతం పెంచి, 550 డాలర్లు వర్క్ పర్మిట్ ఫీజుగా నిర్ణయించారు. పౌరసత్వ ఫీజుని 83 శాతం పెంచి, 640 డాలర్ల నుంచి 1170 డాలర్లుగా నిర్ణయించారు. ఫీజులు చెల్లించలేమని చెప్పిన వారికి, మినహాయింపులు ఇచ్చే పద్ధతికి కూడా స్వస్తి పలికేలా నిర్ణయం తీసుకున్నారు. -
అస్సలు ఊహించలేదు: సుధా సుందరి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ బుధవారం ఓ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచిన సంగతి తెలిసిందే. భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణ్‌తో పాటు బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన మరో నలుగురికి పౌరసత్వం ఇచ్చే కార్యక్రమం వైట్‌హౌస్‌లోనే జరిగింది. ఈ కార్యక్రమం గురించి సుధా సుందరి నారాయణ్ మాట్లాడుతూ, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమం టీవీలో ప్రసారమవుతుందని తనకు తెలియదని పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదని ఒక మీడియా సంస్థకు తెలిపారు. తన స్నేహితురాలు తనకు ఫోన్ చేసి చెబితే ఆ విషయం తనకు తెలిసిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాను ఒక సాధారణ మహిళనని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో అట్టహాసంగా జరిగిన ఈ పౌరసత్వ ప్రదాన కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చాలా ఆదరణ చూపారని, మంచి మనిషి అని అన్నారు. ఆయనను కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమెరికా ఎప్పుడైనా దేశం, రంగు, మతం అనే బేధాలు చూడదనడానికి ఈ పౌరసత్వం ప్రదానం చేయడమే నిదర్శనమని ట్రంప్ అన్నారు. అమెరికా ఒక అద్భుత దేశమని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: సుధా సుందరి నారాయణన్‌కు యూఎస్ పౌరసత్వం -
సుధా సుందరి నారాయణన్‌కు యూఎస్ పౌరసత్వం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మంగళవారం ఓ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. మరో రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోనున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశీ ఓటర్ల మద్దతుపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ఐదు దేశాలకు చెందిన వారికి అమెరికా పౌరసత్వాన్ని అందించే కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరిగిన రెండో రోజు రాత్రే ఈ వేడుక జరగడం విశేషం. ఈ కార్యక్రమంలో ఇండియా, బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన ఐదుగురు యూఎస్ పౌరసత్వాన్ని స్వీకరించారు. వీరిలో ఇండియాకు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ కూడా ఉన్నారు. కుడిచేతిని పైకి లేపి చూపుతూ, మరో చేత్తో అమెరికా జెండాను పట్టుకున్న వీరు, అమెరికా పౌరులమని సంప్రదాయ ప్రమాణాన్ని చేశారు. ట్రంప్ పక్కనే నిలబడి చూస్తుండగా, హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాడ్ వోల్ఫ్ వారితో ప్రమాణం చేయించారు. (చదవండి: మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి) వర్ణ, మత వివక్షలేని అద్భుతమైన దేశానికి స్వాగతం అంటూ ట్రంప్ వీరందరిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదుగురు అసాధారణ వ్యక్తులను అమెరికా తన కుటుంబంలోకి నేడు సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఇక మీరంతా ఓ గొప్ప దేశ సభ్యులుగా ఉండబోతున్నారు. నేటి నుంచి మీరు మా తోటి పౌరులు. మీకు ఇవే నా శుభాకాంక్షలు. అమెరికా రంగును, మతాన్ని చూడబోదని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదు. యూఎస్ఏ బిల్ ఆఫ్ రైట్స్ ఇప్పుడు మీకు మద్దతు ఇస్తుంది, రక్షిస్తుంది. పౌరులుగా, మీరు ఇప్పుడు ఈ అద్భుతమైన దేశానికి సేవకులుగా ఉన్నారు’ అని తెలిపారు ట్రంప్. అమెరికా ఓ అద్భుత దేశమని కొనియాడారు. (చదవండి: ఇదో ‘ఫ్రెంచి’ బంధం) పౌరసత్వం పొందిన వారందరి పేర్లను చదువుతూ వివరాలు వెల్లడించిన ట్రంప్, ఇండియాలో జన్మించి, 13 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చిన సుధ, ఇప్పటికే తన కెరీర్లో అద్భుతమైన విజయాలను సాధించారని కొనియాడారు. ఆమెకు ఎంతో టాలెంట్ ఉందని, సుధా దంపతులు అమెరికాకు ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గులాబీ రంగు చీర కట్టుకుని వచ్చిన సుధా సుందరి, ట్రంప్ చేతుల మీదుగా పౌర పట్టాను అందుకున్నారు. -
ఇదో ‘ఫ్రెంచి’ బంధం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాటి మాట. యానాంలో 137 ఏళ్ల పాలనను ఫ్రెంచి పాలకులు విడిచి వెళుతున్న రోజులవి. అప్పుడు యానాంలో సుమారు ఏడెనిమిది వేల మంది ఉంటారు. ఫ్రెంచి పాలకులు యానాంలో ఉన్న పౌరులను ‘ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటారా, భారతీయ పౌరులుగా కొనసాగుతారా?’ అని అడిగారు. ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటే భారత్‌తో విడిపోయాక ఆ దేశానికి పంపేస్తారనే భయంతో 90 శాతం మంది ఫ్రెంచి పౌరసత్వానికి వెనుకాడారు. ధైర్యం చేసిన 15 కుటుంబాలు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నాయి. ఆ 15 కుటుంబాలే ఇప్పుడు యానాంలో 50 కుటుంబాలయ్యాయి. వీరి ద్వారా మరో 200 కుటుంబాలు ఫ్రాన్స్‌లో స్థిరపడ్డాయి. ఆరు దశాబ్ధాలుగా (1954 నుంచి) యానాం, ఫ్రెంచి కుటుంబాల మధ్య ఆత్మీయత, అనుబంధాలు నేటికీ చెక్కు చెదరలేదు. యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరులను, ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానాం ఫ్రెంచి పౌరులను ‘సాక్షి’ పలకరించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఫ్రెంచి పౌరసత్వం ఉంటే చాలు నాడు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్న కుటుంబాల భవిష్యత్తు బంగారమైంది. 65 ఏళ్లు దాటితే ఫ్రెంచి పౌరుడికి ‘సెక్యూర్’ పథకం ద్వారా 900 యూరోలు (సుమారు రూ.75 వేలు) పెన్షన్ వస్తుంది. వృద్ధులను సాకే అటెండెంట్‌కు 550 యూరోలు (రూ.50 వేలు), ఇంటి అద్దెలో 50 శాతం, 25 సంవత్సరాలు దాటితే నిరుద్యోగ భృతి 550 యూరోలు (సుమారు రూ.50 వేలు) ఇస్తారు. ఫ్రెంచి పౌరసత్వం కలిగి, ఆ దేశంలో కనీసం ఆరు నెలలైనా ఉంటేనే వీటన్నింటికీ అర్హులు. ఫ్రెంచి పౌరసత్వం ఉన్న వారు ప్రపంచంలోని 129 దేశాలతో పాటు 24 యూరోపియన్ యూనియన్ దేశాలను వీసా లేకుండా చుట్టిరావచ్చు. ఆత్మీయత, అనుబంధాలకు ప్రతిరూపం స్థానికులతో యానాంలోని ఫ్రెంచి పౌరులు ఆరు దశాబ్దాలుగా విడదీయరాని అనుబంధాన్నే కొనసాగిస్తున్నారు. జూలై 14న ఫ్రెంచి జాతీయ దినోత్సవం. నవంబరు 11 ఫ్రెంచి పాలకులు యానాం విడిచిపెట్టి వెళ్లిపోయిన రోజును, మన పండగలను యానాం ప్రజలు, యానాంలోని ఫ్రెంచి పౌరులు కలిసే జరుపుకోవడం విశేషం. రోమన్ కేథలిక్ చర్చికి ప్రతి ఆదివారం హిందువులూ వెళుతుంటారు. యానాంకు చెందిన దవులూరి చంద్రశేఖ ర్, ఫ్రెంచి యువతి షావలోత్ భారతీయ సంప్రదాయంలో 2018 లో పెళ్లిపీటలు ఎక్కారు. యానాంలోనూ ఈఫిల్ టవర్ నిర్మించి ఇరు ప్రాంతాల మధ్య విడదీయరాని బంధాన్ని చాటిచెప్పారు. యానాంలో ఫ్రెంచి పాలన 1750లో హైదరాబాద్ నిజాం నవాబు ముజఫర్ జంగ్ ఫ్రెంచి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. మూడుసార్లు బ్రిటిషు వారి చేతిలోకి వెళ్లిన యానాం.. 1817లో చివరిగా ఫ్రెంచి వారి ఆధీనంలోనికి వెళ్లింది. యానాం సుమారు 137 ఏళ్లు ఫ్రెంచి పాలనలో ఉంది. 1954లో ఫ్రెంచి పాలన నుంచి బయటపడి, స్వాతం త్య్రం పొంది పుదుచ్చేరిలో భాగమైంది. ఫ్రెంచి పౌరసత్వంతో ఇక్కడున్న వారం దరూ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని చెన్నైలోని ఫ్రా న్స్ కాన్సులేట్ జనరల్ కా ర్యాలయంలో ఓటు వేస్తారు. భారతీయతను ప్రేమిస్తారు ఫ్రాన్స్ ఆర్మీలో పని చేసి 2015లో రిటైరయ్యా. ఎక్కువ కాలం ఫ్రాన్స్‌లో ఉండటంతో అక్కడి వారితో విడదీయరాని అనుబంధమేర్పడింది. భారతీయతను వారు ప్రేమిస్తారు. –దవులూరి మృచ్ఛి, మాజీ సైనికుడు, ఫ్రెంచి జాతీయుడు,యానాం ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు తెలుసుకుంటారు ఫ్రెంచి కాన్సులేట్ జనరల్ నేరుగా మాట్లాడి, యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. వారాంతపు నివేదికలు కాన్సులేట్ నుంచి తీసుకుంటారు. రిటైరై, ఇక్కడ ఉన్న వారి బాగోగులను నిశితంగా పరిశీలిస్తుంటారు. – సాధనాల బాబు, ఫ్రెంచి పౌరుల ప్రతినిధి, యానాం ఆరు నెలలు అక్కడ.. ఆరు నెలలు ఇక్కడ ఫ్రాన్స్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్నా ఇక్కడి ఆచార సంప్రదాయాలను వీడలేదు. నాకు సెక్యూర్ స్కీమ్ ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ ఇస్తుంది. నా మనుమరాలు, మనువడుల చదువుకయ్యే ప్రతి పైసా ఫ్రెంచి ప్రభుత్వమే భరిస్తోంది. – సాధనాల అనసూయ, ఫ్రెంచి పౌరురాలు, యానాం -
డీఏసీఏ రద్దు ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని తీసుకురావడానికి కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులకు తుదిరూపం తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా డిఫర్డ్ యాక్షన్స్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవడానికి సంకల్పించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకు ముందు ట్రంప్ ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ఎవరూ అమెరికాలో నివసించకుండా అత్యంత పటిష్టమైన బిల్లును తీసుకువస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ స్థానికుల మెప్పు పొందడానికి గత కొన్నాళ్లుగా వలస విధానాలను సంస్కరించడంపైనే దృష్టి సారించారు. గత ప్రభుత్వం వలస విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. డీఏసీఏను కూడా ఉపసంహరించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అయితే దీనిపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల ఆ ప్రణాళికలకు అడ్డుకట్ట వేసింది. దీంతో ట్రంప్ ఈ కార్యక్రమాన్ని వలస విధానంలో చేర్చి పూర్తిగా దానిని రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డీఏసీఏకు చట్టబద్ధమైన పరిష్కారం, సరిహద్దుల్లో భద్రత, ప్రతిభ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన సంస్కరణలపై కాంగ్రెస్‌లో చర్చించడానికి సిద్ధమేనని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. డీఏసీఏ అంటే? 2012లో ఒబామా సర్కార్ మానవతా దృక్పథంతో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం చిన్నప్పుడే తల్లిదండ్రులతో అమెరికాకి వచ్చి ఉంటున్న వారికి ఇది చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. అమెరికా పౌరసత్వం, లేదంటే చట్టపరంగా నివాస హక్కులు లేనివారికి డీఏసీఏ ఒక వరంలాంటిది. దాదాపుగా 7 లక్షల మంది యువత డీఏసీఏతో లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ వర్క్ పర్మిట్లు, హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఈ కార్యక్రమం కింద లభిస్తాయి. ప్రతీ రెండేళ్లకి ఒకసారి దీనిని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే అమెరికా పౌరసత్వం మాత్రం లభించదు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి దీనిని వెనక్కి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు డెమోక్రాట్లు అడ్డం పడుతూనే ఉన్నారు. ఇది చాలా సమగ్రమైన బిల్లు. ఎంతో మంచి బిల్లు. ప్రతిభ ఆధారంగా వలస విధానం ఉంటుంది. ఇందులో డీఏసీఏని కూడా చేరుస్తున్నాం. డీఏసీఏ ద్వారా లబ్ధి పొందుతున్న వారికి అమెరికా పౌర సత్వం లభించేలా కొత్త విధానం బాటలు వేస్తుం ది. దీనిపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు’ డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు -
చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రమేష్ కుమార్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. మరోవైపు మరోవైపు కేంద్ర హోంశాఖ పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెన్నమనేని రమేష్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 16న మరోసారి పూర్తి వాదనలు వింటామని తెలుపుతూ.. తదుపరి విచారణను జూన్ 16 కు వాయిదా వేసింది. లాక్డౌన్ కారణంగా ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టింది. కాగా వేములవాడ శాసన సభ్యుడైన చెన్నమనేని రమేష్‌కు జర్మని దేశంలో పౌరసత్వం ఉందంటూ ఆయన సమీప అభ్యర్థి ఆది శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ దేశమూ అందరినీ ఆహ్వానించదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్‌లో సీఏఏ వ్యతిరేక వాదనలపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘ఏ దేశానికీ చెందని వారిని పౌరులుగా గుర్తించేందుకు ఈ చట్టం చేశాం. దేశం ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పౌరసత్వంపై దేశానికో నిర్వచనం, విధానం ఉంటాయి. ప్రపంచంలో అందరినీ స్వాగతించే దేశమేదైనా ఉంటే చూపండి. అలా ఎవరూ చూపలేరు. అమెరికాను చూడండి. యూరోపియన్లను చూడండి. యూరప్‌లో అయితే ఒక్కో దేశానికీ ఒక్కో విధానం ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో భారత్ ప్రపంచాన్ని ఒప్పించలేకపోయిందా అన్న ప్రశ్నకు ఆయన.. బ్రస్సెల్స్‌లో 27 దేశాల మంత్రులతో జరిగిన సమావేశంలో సీఏఏపై వాస్తవాలను వివరించానన్నారు. ఈ విషయంలో భారత్ తన స్నేహితులను కోల్పోతుందా అన్న ప్రశ్నపై.. వాస్తవ మిత్రులెవరో కూడా ఇప్పుడే తెలిసే అవకాశం ఉంది కదా? అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం భారత్. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. గతంలో మాదిరిగా నేడు రక్షణాత్మకంగా వ్యవహరించ లేదు. ప్రతి ఒక్కరితోనూ సంబంధాలు కలిగి ఉండాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం కనుగొనాల్సిందే. భారత్‌లో జరుగుతున్న పరిణామాలను కొందరు అంగీకరించవచ్చు. మరికొందరు అంగీకరించక పోవచ్చు. ఈ రెంటినీ ఒకే గాటన కట్టలేం. ఇందుకు తగినట్లుగా ఆయా దేశాలతో మనం వ్యవహారం సాగించాల్సి ఉంది’అని తెలిపారు. కశ్మీర్లో పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యూఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఆయన స్పందిస్తూ.. గతంలోనూ యూఎన్హెచ్ఆర్సీ ఇటువంటి తప్పుడు అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. కశ్మీర్లో పొరుగుదేశం ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై యూఎన్హెచ్ఆర్సీ ఏమీ చేయలేకపోయింది’ అని పేర్కొన్నారు. -
పౌరసత్వం ఇచ్చి తీరుతాం..
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దేశంలోని శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి తీరుతుందని.. అప్పటివరకు వెనకడుగు వేసేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సీఏఏ శరణార్థులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించింది మాత్రమేనని.. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి తన పౌరసత్వాన్ని కోల్పోడని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సీఏఏపై అసత్య ప్రచారాన్ని చేస్తూ.. మైనారిటీలు, శరణార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పౌరసత్వం కోసం శరణార్థులు పత్రాలు చూపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి.. మమత అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని దళితులు, వెనుకబడిన మతువా కులాలకు పౌరసత్వం రాకుండా మమత అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పౌరసత్వ చట్ట అమలును ఆపాలని మమతకు సవాల్ విసిరారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటే మమత సహా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. 2021లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆర్ నోయ్ అన్యాయ్ (ఇక అన్యాయాన్ని సహించం)’అనే ప్రచారాన్ని అమిత్‌షా ప్రారంభించారు. ర్యాలీలో ‘గోలీమారో’నినాదాలు.. షహీద్ మినార్ గ్రౌండ్లో జరిగిన అమిత్‌షా ర్యాలీలో కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీమారో’అని నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులను వివరణ కోరగా.. స్పందించేందుకు నిరాకరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. భారత్‌లో మెరుగైన రక్షణ విధానం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మెరుగైన రక్షణ విధానాన్ని రూపొందించిందని అమిత్‌షా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. 10 వేల ఏళ్ల చరిత్రలో భారత్ ఎలాంటి దాడులూ జరపలేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. ఎవరైనా తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినా.. జవాన్లు, ప్రజల మీద దాడులకు యత్నించినా.. భారత్ గట్టిగా బదులిస్తుందని పేర్కొన్నారు. రాజర్హాట్లో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) 29వ స్పెషల్ కంపోసిట్ గ్రూప్ (ఎస్సీజీ) కాంప్లెక్స్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. ఎన్ఎస్జీ అంటే ఉగ్ర వ్యతిరేక దళంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని అన్నారు. -
అంగట్లో పౌరసత్వం!
సాక్షి, హైదరాబాద్ : మీకు భారత పౌరసత్వం కావాలా? మీరు ఏ దేశస్తులైనా ఫర్వాలేదు. అంగట్లో ఆధార్, ముంగిట్లో పౌరసత్వం ఇవ్వడానికి మేం రెడీ..! ఇది ప్రస్తుతం మన భాగ్యనగరంలో చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితి. దేశ భద్రతను పణంగా పెట్టి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఆఖరికి పాస్‌పోర్టు కూడా రూ.10 మొదలుకుని రూ.2 వేలకు అమ్ముతున్న దారుణ స్థితి దాపురించింది. ఇప్పటికే పాతబస్తీలో దాదాపు 400 మంది వరకు అక్రమమార్గంలో ఆధార్‌కార్డులు సంపాదిం చారంటూ డీజీపీ కార్యాలయం కేంద్ర హోం శాఖకు ఇప్పటికే నివేదించింది. అయినా.. ఇలాంటి కేసులు పాతబస్తీలో ప్రతినెలా బయటపడుతూనే ఉండటం గమనార్హం. నిఘా లోపం వల్లే..! హైదరాబాద్‌పై ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెడతారు. గతంలో దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా.. దానికి హైదరాబాద్‌తో ఏదో సంబంధం ఉండటం పరిపాటిగా ఉండేది. ఇటీవల భారత ఆర్మీ లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ (ఐఎస్ఐ) ప్రయోగించిన హనీట్రాప్.. పాతబస్తీ కేంద్రంగా సాగుతోందని ఢిల్లీలో పోలీసులు గుర్తించి భగ్నం చేసిన విషయం తెలిసిందే. సహజంగానే పాతబస్తీకి విదేశీయుల తాకిడి అధికం. యాత్రికులతో పాటు ఆఫ్రికన్ విద్యార్థులు, మధ్యప్రాచ్య వ్యాపారులు, బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన శరణార్థులు వేలాదిమంది ఇక్కడ తలదాచుకుంటారు. వీరిలో శరణార్థులుగా వచ్చినవారిపై సరైన పోలీసు నిఘా కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 16 వేల మంది శరణార్థులు ఉంటారని అంచనా. అసలు వీరు ఎంత మంది ఉన్నారన్న విషయంపై స్పష్టమైన గణంకాలు కూడా పోలీసుల వద్ద లేవన్న విమర్శలు వినిపించాయి. దీంతో యథేచ్ఛగా గుర్తింపు కార్డులు అడ్డదారిలో సంపాదిస్తున్నారు. అక్రమంగా పాస్‌పోర్టులు.. విదేశీయుల వద్ద పాస్‌పోర్టు లాంటి అత్యున్నత గుర్తింపు కార్డులు ఉండటం పలు అనుమానాలకు బీజం వేస్తోంది. శరణార్థుల డేటా పోలీసుల వద్ద లేకపోవడం వల్లే వారికి సులువుగా పాస్‌పోర్టులు దక్కుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో పోలీసులు కొందరి వేలిముద్రలు, రక్తనమూనాలు తీసుకున్నారు. తర్వాత ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే వారికి కలిసి వస్తోంది. వాస్తవానికి బంగ్లాదేశీయులు, మయన్మార్ దేశస్తులు చూడటానికి భారతీయుల్లాగానే ఉంటారు. వీరు బిహార్, ఒడిశా, బెంగాల్ నుంచి వచ్చామని చెబుతూ ఈ కార్డులు పొందుతున్నారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డులను సులువుగా నెట్ సెంటర్ల ద్వారా సులువుగా సంపాదిస్తున్నారు. (కొందరు నెట్‌సెంటర్ల నిర్వాహకులు ఓటరు కార్డును రూ.10కే దరఖాస్తు చేస్తున్నారు). తర్వాత పాస్‌పోర్టుకు దరఖాస్తు చేస్తున్నారు. కానీ, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన కొందరు ఆఫ్రికా జాతీయుల్లా.. చూడగానే వారు విదేశీయులు అని ఇట్టే చెప్పేలా ఉంటారు. అలాంటి వారికి పాస్‌పోర్టులు రావడం చూసి అవాక్కవుతున్నారు. పాతబస్తీలో మయన్మార్, బంగ్లాదేశ్, యెమెన్ దేశాలకు చెందిన శరణార్థుల్లో చాలామంది అక్రమమార్గంలో పాస్‌పోర్టులు సంపాదించారు. వీరిలో కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా పట్టుబడని వారు చాలామందే ఉన్నారని సమాచారం. విదేశీయుల డేటా నిరంతరం నిర్వహించకపోవడం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోందని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాస్‌పోర్టు జారీ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
అందుకే ఆ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం..
సాక్షి, అనంతపురం: సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. శనివారం జిల్లాలోని ఉరవకొండలో జరిగిన మైనార్టీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మత ప్రాతిపదికన విభజిస్తున్నారని.. తమ పౌరసత్వానికే ముప్పు ఉందని ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని అందుకే కేంద్రం తెచ్చిన బిల్లులను వ్యతిరేకిస్తున్నామని’ ఆయన తెలిపారు. ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించింది కేవలం తాత్కాలిక రాజధాని మాత్రమే అని.. ఏపీ లోని అన్ని జిల్లాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని వివరించారు. సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని అంజాద్ బాషా పేర్కొన్నారు. -
‘బర్త్ టూరిజం’పై ఆంక్షలు
వాషింగ్టన్: ‘బర్త్ టూరిజం’ను నిరోధించే దిశగా అమెరికా గురువారం సరికొత్త వీసా నిబంధనలను తీసుకువచ్చింది. అమెరికాలో జన్మిస్తే తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికాకు వచ్చే గర్భిణులు లక్ష్యంగా ఈ నిబంధనలను రూపొందించారు. పౌరసత్వం కోసమే అమెరికాలో జన్మనిచ్చేందుకు వస్తున్నారని వీసా అధికారులు నిర్ధారిస్తే.. వారి వీసా దరఖాస్తులను తిరస్కరించేలా ఈ నిబంధనలను రూపొందించారు. అయితే, అమెరికాకు వైద్య చికిత్సకు వస్తున్నారా? లేక పౌరసత్వం కోసమే అమెరికాలో పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నారా? అనేది నిర్ధారించడం కీలకంగా మారింది. (‘హెచ్1’ దెబ్బ అమెరికాకే..!) వైద్య చికిత్స కోసం వచ్చేవారైతే.. వారిని అమెరికాలో లభించే ఆధునిక చికిత్స కోసం వచ్చే సాధారణ విదేశీయులుగానే పరిగణిస్తామని తాజా నిబంధనల్లో పొందుపర్చారు. వైద్యం కోసం వస్తున్నామని, అందుకు అవసరమైన డబ్బు తమ వద్ద ఉందని దరఖాస్తుదారులు నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. యూఎస్‌లో పిల్లలకు జన్మనిచ్చేందుకు రావడం చట్టప్రకారం న్యాయమే. అయితే, వీసా మోసాలు, పన్ను ఎగవేతలకు సంబంధించి కొందరు బర్త్ టూరిజం ఏజెంట్లను గతంలో అరెస్ట్ చేసిన దృష్టాంతాలున్నాయి. (‘హెచ్–1బీ’కి ఇక ఇ–రిజిస్ట్రేషన్) వలస నిబంధనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. అందులో అమెరికాలో జన్మించినవారికి పౌరసత్వం కల్పించే నిబంధన కూడా ఒకటి. దీనిని తొలగిస్తామని ఆయన గతంలోనూ హెచ్చరించారు. అయితే, అది అంత సులభం కాదని అధికారులు హెచ్చరించడంతో ఆగిపోయారు. గర్భిణులకు టూరిస్ట్ వీసా ఇచ్చే సమయంలోనే.. వారిని అడ్డుకోవాలనే ప్రతిపాదన వచ్చినా.. అది ఆచరణ సాధ్యం కాదని అప్పట్లో భావించారు. అమెరికా సహా పలు విదేశాల్లో ‘బర్త్ టూరిజం’ లాభదాయక బిజినెస్. ఇందుకు కొన్ని కంపెనీలు ప్రచారం సైతం నిర్వహిస్తుంటాయి. అమెరికాకు రావడం నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియకు 80 వేల డాలర్ల వరకు చార్జ్ చేస్తుంటారు. ఇందుకోసం అమెరికాకు చైనా, రష్యాల నుంచి ఎక్కువగా వస్తుంటారు. 2012లో దాదాపు 36 వేల మంది విదేశీ గర్భిణులు అమెరికాకు వచ్చి, డెలివరీ తర్వాత సొంత దేశానికి వెళ్లారని సమాచారం. (హెచ్1బీ వీసాదారులకు శుభవార్త) -
పౌరసత్వం హక్కులకే కాదు.. బాధ్యతలకు కూడా..
నాగ్‌పూర్: పౌరసత్వం అనేది కేవలం హక్కుల కోసం మాత్రమే నిర్దేశించినది కాదని.. సమాజం పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సైతం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ బాబ్డే పేర్కొన్నారు. రాష్ట్రసంత్ టుకడోజీ మహరాజ్ నాగ్‌పూర్ యూనివర్సిటీలో (ఆర్టీఎమ్ఎన్యూ) శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలోని కొన్ని విద్యా సంస్థలు వ్యాపార దృక్పథంతోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. వ్యక్తిగత అనుభవంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో మేధాశక్తిని అభివృద్ధి చేయడం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే విద్య ప్రాథమిక లక్ష్యమని అన్నారు. క్రమశిక్షణ విద్యలో భాగమని పేర్కొన్నారు. మనకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఇతరులను కలుపుకుపోవడం, అన్యోన్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. సమాజం మన నుంచి ఏం కోరుకుంటుందో అలాంటి లక్షణాలు యువతలో పెంపొందేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. ఏ వ్యక్తి అయినా కృషితోనే ఓ స్థాయికి చేరుకుంటారని.. ఆ స్థితికి చేరడానికి దోహదపడిన అంశాలను ఇతరులు సృష్టించారనేది గుర్తించాలని చెప్పారు. -
పాకిస్తానీయులందరికీ ఇస్తారా?
భోగ్నాదిహ్ (జార్ఖండ్): పాకిస్తానీయులందరికీ భారతీయ పౌరసత్వం కల్పిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించి, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసే ధైర్య సాహసాలు ఆ పార్టీకి ఉన్నాయా అని సవాల్ విసిరారు. జార్ఖండ్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మంగళవారం మోదీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టంతో భారత్‌లో పౌరులకు ఎలాంటి హాని జరగదని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా చర్చిద్దాం జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసు చర్యల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్ర వలలో విద్యార్థులు చిక్కుకోవద్దని హితవు పలికారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్బన్ నక్సల్స్, ఇతర రాజకీయ పార్టీలు విద్యార్థుల భుజం మీద తుపాకీ ఉంచి కాల్చడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏ అంశంలోనైనా ప్రభుత్వంతో ప్రజాస్వామ్యయుతంగా చర్చలు జరపవచ్చునని విద్యార్థులకు పిలుపునిచ్చారు. -
విదేశీ పర్యాటకులపై క్యాబ్ ఎఫెక్ట్
-
పౌరసత్వ బిల్లు ఆమోదంపై స్పందించిన ఆరెస్సెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు బుధవారం పార్లమెంట్లో ఆమోదం పొందడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) జనరల్ సెక్రటరీ భయ్యాజీ జోషి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభినందించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ.. బీజేపీ సారథ్యంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మతపరమైన వేధింపులు, హింసను ఎదుర్కొని భారత్‌కు వచ్చే హిందువులను చొరబాటుదారులుగా కాకుండా శరణార్థిగా గుర్తించాలని ఆరెస్సెస్ ఎప్పుడూ ఆకాంక్షించేదని అన్నారు. దేశ విభజన జరిగినప్పుడు.. మతపరమైన ప్రాతిపదికన విభజన జరగాలనే డిమాండ్ ఉందని, అయితే భారతదేశానికి 'మతతత్వ దేశంగా' ఏర్పాటు చేసే ఆలోచన అప్పట్లో లేదన్నారు. కానీ, చివరకు దేశం ఈ సమస్యపైనే విభజించబడిందని పేర్కొన్నారు. మన నాయకులు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని అన్నారు. మతపరమైన కారణాల వల్ల విభజన జరగకపోతే, ఆ తరువాత చాలా ఉదంతాలు చోటుచేసుకొనేవి కాదని ఈ సందర్భంగా ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి జోషి తెలిపారు. नागरिकता संशोधन कानून का प्रस्ताव लोकसभा और राज्यसभा में रखा गया और वह बहुमत से पारित हुआ। इस पहल के लिए, इस साहसिक कदम के लिए, हम केंद्र सरकार का और विशेषतः प्रधानमंत्री और गृहमंत्री जी का हृदय से अभिनंदन करते हैं, उनको धन्यवाद देते हैं। - सरकार्यवाहhttps://t.co/UfcVpZLDID pic.twitter.com/dUgs9Kvu12 — RSS (@RSSorg) December 12, 2019 ‘మైనార్టీలకు ఎటువంటి అన్యాయం చేయబోమని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన జనాభా లెక్కలను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. అక్కడ తగ్గుతున్న మైనార్టీ జనాభాను అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎక్కడికి వలస వెళ్లారనే సందేహం తలెత్తుతుంది. అక్కడి మైనారిటీలో చాలామంది భారతదేశానికి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే భారత్‌లో వారికి సంపూర్ణ భద్రతతో పాటు రక్షణ’ లభించడమని అని భయ్యాజీ అన్నారు. అయితే చట్టంలోని లొసుగుల కారణంగా వారు ఏళ్ల తరబడి భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. వేధింపులకు గురై వచ్చిన వారిని 'చొరబాటుదారులు' కాక శరణార్థులు అని పిలిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల నుంచి వస్తున్న మైనారిటీలకు పౌరసత్వ సవరణ బిల్లుతో భారత పౌరులుగా మారి.. దేశంలో ఆత్మ గౌరవంతో పాటు పౌర హక్కుల ప్రయోజనాలను పొందుతారని ఆనంద పడుతున్నాను. ఇక వారి శరణార్థి జీవితం ముగింపు పలకనుంది అన్నారు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదని, ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమిత్ షా స్పష్టం చేశారని అన్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ బిల్లుపై వస్తున్న వదంతుల కారణంగా అట్టుడుకుతున్నాయని.. అక్కడి ప్రజల సందేహాలను తీర్చడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందని జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో శరణార్థులు ప్రశాంతంగా జీవిస్తారని హర్షం వ్యక్తం చేశారు. త్వరలో పౌరసత్వ చట్టంపై అవగాహన కార్యక్రమాలు న్యూఢిల్లీ: వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు చట్టాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పౌరసత్వ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ విషయంపై వివరణ ఇస్తూ.. పౌరసత్వ సవరణ బిల్లుతో సుమారు 2 కోట్ల మంది శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే.. శనివారం నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మత ఘర్షనలు, హింస కారణంగా డిసెంబరు 31, 2014కు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులను అక్రమ చొరబాటుదారులుగా ఉన్నవారిని ఈ మేరకు భారతీయపౌరులుగా గుర్తించబడతారు. -
అమిత్ షాపై ఆంక్షలు పరిశీలించండి: యూఎస్
వాషింగ్టన్: ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిషష్టాత్మకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లుపై యూఎస్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషన్ రిలీజియన్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) స్పందించింది. ఈ బిల్లును పౌరుల ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లును తప్పుడు దిశగా వెళ్తున్న ప్రమాదకరమైన మలుపుగా వర్ణించింది. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కీలక నేతలపై ఆంక్షలను పరిశీలించాలని సూచించింది. లౌకిక దేశంగా ఘనమైన చరిత్ర కలిగిన భారతదేశంలో.. మత ప్రతిపాదికన విభజన జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఇటీవల అస్సాంలో అమలుచేసిన ఎన్ఆర్సీపై కూడా యూఎస్సీఐఆర్ఎఫ్ స్పందించిన విషయం తెలిసిందే. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్ఆర్సీని రూపొందించారని అభిప్రాయపడింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో, మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్తైంది. ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని షా తెలిపారు. ఈ బిల్లు పరిధిలో లేని ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ ప్రాంతంలోకి మణిపూర్‌ను కూడా చేరుస్తున్నామన్నారు. మూడు పొరుగుదేశాల్లో మత వేధింపులను ఎదుర్కొన్న ముస్లిమేతరులకు రేషన్ కార్డ్ సహా ఎలాంటి పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పిస్తామన్నారు. ముస్లింలకు ఈ బిల్లు ఏ మాత్రం వ్యతిరేకం కాదని షా స్పష్టం చేశారు. -
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. వాడి, వేడి చర్చ అనంతరం, విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓటేశారు. దాంతో, మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్తైంది. అంతకుముందు, పలువురు ఎంపీల సవరణ ప్రతిపాదనలను సభ మూజువాణి ఓటుతో తోసిపుచ్చింది. ఈ బిల్లుపై సభలో దాదాపు 7 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం, చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు’ అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రోహింగ్యాలకు నో.. ఎన్నార్సీకి ఎస్ రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించే ప్రసక్తే లేదని అమిత్ షా మరోసారి తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చి, బాధాకర జీవనం గడుపుతున్నవారికి ఊరట కల్పించేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. 1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి ఉండకపోతే.. ఇప్పుడు ఈ బిల్లు అవసరమే ఉండేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మత వివక్ష ఎదుర్కొంటూ 2014, డిసెంబర్ 31 లోపు భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులను అక్రమ శరణార్ధులుగా భావించం. వారికి భారత పౌరసత్వం కల్పిస్తాం’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శతాబ్దాల సంప్రదాయమైన ఆత్మీయీకరణ, మానవీయతలో భాగంగానే ఈ బిల్లు రూపొందిందన్నారు. డివిజన్ ఓట్‌తో.. అంతకుముందు, విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లును అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, మతహింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే ఈ ప్రతిపాదనకు 130 కోట్ల భారతీయుల ఆమోదం ఉందని ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. డివిజన్ ఓట్ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ వోట్లో అనుకూలంగా 293 ఓట్లు, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలకు వ్యతిరేకమని విపక్ష సభ్యులు ఆధిర్ రంజన్ చౌధురి(కాంగ్రెస్), సౌగత రాయ్(టీఎంసీ), ఎన్కే ప్రేమ్‌చంద్రన్(ఆర్ఎస్పీ), గౌరవ్ గొగొయి(కాంగ్రెస్), శశిథరూర్(కాంగ్రెస్), అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) తదితరులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ప్రవేశపెడ్తూ.. కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. ‘శరణార్ధులు, చొరబాటుదారుల మధ్య తేడాను మనమంతా గుర్తించాల్సి ఉంది. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు.ఎవరి హక్కులనూ లాక్కోదు’ అని అన్నారు. ‘ఇన్నర్ లైట్ పర్మిట్’లోకి మణిపూర్ ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ఆందోళనలపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని షా తెలిపారు. ఈ బిల్లు పరిధిలో లేని ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ ప్రాంతంలోకి మణిపూర్‌ను కూడా చేరుస్తున్నామన్నారు. మూడు పొరుగుదేశాల్లో మత వేధింపులను ఎదుర్కొన్న ముస్లిమేతరులకు రేషన్ కార్డ్ సహా ఎలాంటి పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పిస్తామన్నారు. గతంలోనూ ఇలాంటి హక్కులు కల్పించారని, ఆ కారణంగానే ప్రస్తుత పాకిస్తాన్ నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని, ఎల్కే అడ్వాణీ ఉప ప్రధాని కాగలిగారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సభలో వాడివేడి చర్చ చోటు చేసుకుంది. ఈ బిల్లు లౌకికత అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ విమర్శించారు. ‘సమానులను సమానం కాని వారుగా గుర్తించకూడదు. భారత్‌కు ఎవరు వచ్చినా వారు శరణార్ధులే. మతం ప్రాతిపదికన వారిని వేరువేరుగా చూడకూడదు’ అన్నారు. బిల్లుకు ఎన్డీయే మిత్ర పక్షాలైన జేడీయూ, ఎల్జేపీలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లులో ముస్లింలను కూడా చేర్చాలని, బిల్లుకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ సూచించాయి. ఈ బిల్లును వ్యతిరేకించే వారంతా హిందూ వ్యతిరేకులు అనే ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి విమర్శించారు. ‘ఈ బిల్లు వివక్షాపూరితం. రాజ్యాంగ పునాదులనే ఇది దెబ్బతీస్తుంది. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇది తొలి అడుగు’ అని మండిపడ్డారు. మా రాష్ట్రంలో ఒప్పుకోం: మమత... ఈ బిల్లును కానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని కానీ తమ రాష్ట్రంలో అనుమతించబోమని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడ్తున్న నేపథ్యంలో.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై ఆందోళనలు ఊపందుకున్నాయి. బిల్లు ప్రతిని చించేసిన ఒవైసీ పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. తన ప్రసంగం చివరలో ఈ బిల్లు ప్రతిని చించేశారు. ‘ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. మేమూ మనుషులమే. ఈ వివక్షకు కారణమేంటి? అస్సాం ఎన్ఆర్సీలో 19 లక్షల మంది పేర్లు లేవు. ముస్లింలకు స్వదేశమంటూ లేకుండా చేయడం వీరి ఉద్దేశం. రెండోసారి విభజన జరగాలని మీరు కోరుకుంటున్నారా? ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది’ అంటూ ప్రతిని చించేసి తన ప్రసంగాన్ని ముగించారు. -
మరో అయోధ్య కానున్న ‘పౌరసత్వం’
ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభం కాగా, విభజన తర్వాత హిందువుల వలస దానికి తోడైంది. 1947కి ముందే వచ్చిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే. ఈ చిక్కుముడిని విప్పడం కష్టమే కాబట్టి పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రజ లను విభజించే ఎత్తుగడతో తీసుకొస్తోంది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా బీజేపీ వారిపై ఆరోపణలకు దిగుతుంది. అంటే వచ్చే మూడు దశాబ్దాల్లో పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్ 370గా మారిపోతుంది. దీని వెనుక ఉన్న విభజన రాజకీయాలివే. గత కొన్ని రోజులుగా పౌరసత్వ చట్టం, 1955 లేక పౌరసత్వ సవరణ బిల్లు, 2019 (సీఏబీ)కు తాజా సవరణలపై అనేకమంది మద్దతిస్తూ దేశవిభజనను తిరిగి సమీక్షించాలని కోరుతున్నారు. పూర్తికాని వ్యవహారాన్ని మళ్లీ సమీక్షించాలి అనే మాట చెప్పనప్పటికీ, పూర్తి న్యాయం, ముగింపు, ముస్లిమేతర మైనారిటీలకు న్యాయం చేయడం అని చెప్పడంలో వీరు వెనుకాడటం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని మైనారిటీలకు చేసిన వాగ్దానాన్ని పౌరసత్వ సవరణ బిల్లు నెరవేరుస్తుందని వీరు నొక్కి చెబుతున్నారు. ఆ వాగ్దానం చర్చనీయాంశమే. ఉపఖండంలోని ముస్లింలకు మాతృభూమి కావాలనే ఊహను ప్రతిపాదించి, దాని కోసం పోరాడి, చివరకు పాకిస్తాన్‌ని సాధించడంలో విజయం పొందారనడంలో సందేహమే లేదు. విభజనకాలంలో మతపరంగా ప్రజలను అటూ ఇటూ మార్పిడి చేసుకున్నారన్నదీ వాస్తవమే. అయితే ప్రజల మార్పిడి ప్రక్రియ రక్తపాతంతో, మారణ కాండతో, అత్యాచారాలతో సాగింది. కొన్నేళ్లలోపే ఉపఖండం పశ్చిమప్రాంతంలో ఈ ప్రజల మార్పిడి ప్రక్రియ పూర్తయింది, దాదాపు ముగిసిపోయింది. భారత్ భూభాగంలోని పంజాబ్‌లో, ముస్లింలు, పాకిస్తాన్ భూభాగంలో హిందువులు, సిక్కులు చాలా తక్కువమంది మాత్రమే ఉండిపోయారు. 1960ల మధ్య వరకు విభజనకు సంబంధించి కొన్ని వింత ఘటనలు కొనసాగాయి. పాకిస్తాన్ కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ అసిఫ్ ఇక్బాల్ 1961లో మాత్రమే పాకిస్తాన్‌కు వలస వెళ్లాడు. అప్పటివరకు అతడు హైదరాబాద్ జట్టు తరపున ఆడేవాడు. 1965 యుద్ధ కాలంలో చిన్న అలజడి చెలరేగింది కానీ త్వరలోనే అది ముగిసిపోయింది. కానీ తూర్పు భారత్‌లో విభిన్న చిత్రం చోటు చేసుకుంది. అనేక సంక్లిష్ట కారణాల రీత్యా తూర్పు పాకిస్తాన్, భారత్‌కి చెందిన పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురల మధ్య జనాభా మార్పిడి పూర్తి కాలేదు. బెంగాల్‌లోని అనేక వర్గాలకు చెందిన ముస్లింలు.. అలాగే తూర్పు బెంగాల్(పాకిస్తాన్)లోని హిందువులు భారత్‌లోనే ఉండిపోయారు. కానీ ఎత్తుకు పైఎత్తులు చోటు చేసుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. అందుకే ఇలాంటి ఘటనలను నిలిపివేయడానికి 1950లోనే జవహర్లాల్ నెహ్రూ, నాటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ ఆలి ఖాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే చారిత్రాత్మకమైన నెహ్రూ–లియాఖత్ ఒప్పందం. ఈ ఒప్పందంలో అయిదు ప్రధాన అంశాలున్నాయి 1. ఇరుదేశాలూ తమ భూభాగంలోని మైనారిటీలను పరిరక్షిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాలు, సాయుధ బలగాల్లో చేర్చుకోవడంతోపాటు అన్ని హక్కులు, స్వేచ్ఛలను వారికి కల్పిం చాలి. 2. దాడుల కారణంగా తాత్కాలికంగా గూడు కోల్పోయి, వలసపోయినప్పటికీ, తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని భావిస్తున్నవారికి ఇరుదేశాలూ ఆశ్రయం కల్పించి, పరిరక్షించాలి. 3. అలా వెనక్కు తిరిగి రాని వారిని రెండు దేశాలూ తమతమ పౌరులుగానే భావిం చాలి. 4. ఈలోగా, ఇరు దేశాల్లో ఉండిపోయిన వారు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు, ఇప్పటికీ తామున్న దేశం నుంచి మరొక దేశంలోకి వలస వెళ్లాలని కోరుకుంటున్నవారికి ఇరుదేశాలూ రక్షణ కల్పించి సహకరించాలి. 5. ఇరుదేశాలు శాంతిభద్రతలను కాపాడటానికి నిజాయితీగా ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే ప్రజలు తాము కోరుకున్న భూభాగాలపై సురక్షితంగా ఉన్నట్లు భావించగలరు. ఈ ఒప్పంద సూత్రాలను బట్టే, భారత్ తన జనాభా గణనను చేపట్టి, 1951లో ప్రథమ జాతీయ పౌర పట్టికను (ఎన్ఆర్సీ) రూపొం దించింది. భారత్‌లో ముస్లిం జనాభా శాతం.. హిందువులు, సిక్కుల జనాభా కంటే కాస్త అధికంగానే పెరుగుతూవచ్చిందని, అదే సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉంటున్న హిందువుల జనాభా వేగంగా తగ్గుతూ వచ్చిందని ఇరుదేశాల జనగణన డేటా సూచిస్తోంది. అంటే హిందూ మైనారిటీలు పాక్‌ను, బంగ్లాదేశ్‌ను వదిలిపెట్టి భారత్‌లో స్థిరపడ్డారని చెప్పవచ్చు. దేశవిభజన సమయంలో పూర్తి చేయని కర్తవ్యానికి సమాధానంగా పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడానికి కారణం ఇదేనని బీజేపీ చెబుతుండవచ్చు. పాకిస్తాన్ నెహ్రూ–లియాఖత్ ఒడంబడికలోని సూత్రాలను పాటించి గౌరవించడంలో విఫలమైందని, దీంతో భారత్ మైనారిటీల సహజ నిలయంగా మారిందని పాక్‌లో మైనారిటీలను నేటికీ పీడిస్తున్నారని బీజేపీ వాదన. ఇక్కడే మనం సంక్లిష్టతల్లోకి కూరుకుపోవడం ప్రారంభిస్తాం. మొదట, భారత్ నిర్మాతలు తమ లౌకిక రిపబ్లిక్ ఇలా ఉండాలని కోరుకున్న చట్రంలో జిన్నా రెండు దేశాల థియరీ ఇమడలేదు. రెండు, ఏ దశవద్ద పాత చరిత్ర ముగిసి కొత్త చరిత్ర ప్రారంభం కావాలి? ఇక మూడోది, దేశీయతతో కూడిన జాతీయ సమానార్థకమైనది ఏది? మతం జాతి, భాషతో సమానమైనదా? తూర్పు భారత్‌లో ప్రత్యేకించి అస్సాంలో వలసల స్వభావం, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్లడం అవసరం. అస్సాం సాపేక్షికంగా తక్కువ జనసాంద్రత కలి గిన విశాలమైన సారవంతమైన భూములతో, సమృద్ధిగా జలవనరులతో కూడిన ప్రాంతం. అందుకే ఈ రాష్ట్రంలోకి 20వ శతాబ్దిలో తూర్పు బెంగాల్ నుంచి తొలి దశ వలసలకు దారితీసింది. వీరిలో చాలామంది ఆర్థిక కారణాలతో వచ్చినవారే. భూములకోసం, మంచి జీవితం కోసం వీరొచ్చారు. ఇలా మన దేశంపైకి వలసరూపంలో చేసిన ఆక్రమణ గురించి ప్రస్తావించిన తొలి వ్యక్తి బ్రిటిష్ సూపరెంటెండెంట్ సీఎస్ ముల్లన్. 1931లో అస్సాంలో జనగణన కార్యకలాపాలను ఈయనే పర్యవేక్షించారు. తన మాటల్లోనే చెప్పాలంటే.. ‘బహుశా, గత 25 ఏళ్లలో అస్సాం ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘటన, అస్సామీయుల సంస్కృతి, నాగరికతలను పూర్తిగా ధ్వంసం చేసి అస్సాం భవిష్యత్తునే శాశ్వతంగా మార్చివేయగలిగిన ఘటన ఏమిటంటే, తూర్పు బెంగాల్ జిల్లాల నుంచి ప్రత్యేకించి మైమెన్సింగ్ జిల్లా నుంచి భూదాహంతో వలసవచ్చిన ముస్లింల భూ ఆక్రమణే’ అని సీఎస్ ముల్లాన్ పేర్కొన్నారు. ‘ఎక్కడ శవాలు ఉంటే అక్కడికి రాబందులు వచ్చి కూడతాయి. ఎక్కడ బీడు భూములుంటే అక్కడికల్లా మైమెన్సింగ్ జిల్లా నుంచి వలస వచ్చినవారు గుమికూడతార’ని ఆయన ముగించారు. మరి అస్సాం ప్రజల జాతి, భాషా పరమైన ఆందోళనలు దీన్ని చూస్తే ఏమౌతాయో మరి. ఆర్థిక కారణాలతో అస్సాంలోకి ముస్లింల వలస ప్రారంభంలోనే సమస్య కాగా, విభజన తర్వాత హిందువుల వలన దానికి మరింత తోడైంది. కాగా 1947కి ముందే వచ్చిన మైమెన్సింగ్ జిల్లాకు చెందిన ముస్లింలు చాలావరకు అస్సాంలోనే ఉండిపోగా, తర్వాత హిందువులు కూడా గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. దీంతో మొత్తం భూభాగంలోని జాతుల సమతూకం మారిపోయింది. ఇదే సమస్యకు ప్రధాన కారణం. అస్సాం ఆందోళనలకు సమాధానం ఇవ్వడంలో పౌరసత్వ సవరణ చట్టం విఫలమవుతుండటానికి ఇదే ప్రధాన కారణం. మతంపై కాకుండా, జాతి, సంస్కృతి, భాష, రాజకీయ అధికారం వంటి అంశాల్లోనే అక్కడ అధిక ఆందోళనలు చోటుచేసుకుం టున్నాయి. గత మూడు దశాబ్దాలుగా దీన్ని మార్చడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తూ వచ్చాయి. పైగా ముస్లిం వలసప్రజలు దేశ విభజనకు ముందే వచ్చారు వీరికి పౌరసత్వాన్ని నిరాకరించలేరు. బెంగాలీ హిందువులు ఇటీవలి కాలంలో వచ్చినవారు. అందుకే జాతీయ పౌర పట్టిక ప్రకారం అనర్హులుగా తేలిన 19 లక్షలమందిలో 60 శాతం వరకు ముస్లిమేతరులే ఉండటం ఈ నిజాన్ని సూచిస్తోంది. ఇక్కడే బీజేపీ ఇరుక్కుపోతోంది. పౌరసత్వ చట్టాన్ని అమలు చేసినట్లయితే, ముస్లింల కంటే హిందువులనే ఎక్కువగా దేశం నుంచి పంపించేయాల్సి ఉంటుంది. తాజా పౌరసత్వ సవరణ చట్టంతో దీన్ని పరిష్కరించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ దీనికి అస్సామీయులు అంగీకరించడం లేదు. తాజాగా తీసుకొస్తున్న జాతీయవ్యాప్త పౌరసత్వ సవరణ పట్టికతో పౌరసత్వ చట్టాన్ని కలిపినట్లయితే ప్రారంభంలోనే అది చచ్చి ఊరుకుంటుందని బీజేపీకి తెలుసు. అందుకే దీన్ని ప్రజలను విడదీసే సాధనంగా బీజేపీ ఎక్కుపెట్టింది. ప్రత్యర్థులు వెంటనే ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. ముస్లింలను బుజ్జగిస్తున్నవారిగా వారిపై బీజేపీ ఆరోపణలకు దిగుతుంది. అప్పుడేం జరుగుతుంది? వచ్చే మూడు దశాబ్దాల్లో జాతీయ పౌరసత్వ సవరణ అంశం మరొక రామ మందిరం, లేక ఆర్టికల్ 370గా మారిపోతుంది. ఈ అంశం వెనుక దాగిన విభజన రాజకీయాలు ఇవే మరి. వ్యాసకర్త, శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, twitter@shekargupta -
సభలోనే బిల్లు పేపర్లు చించేసిన అసదుద్దీన్
-
లోక్‌సభలో కంటతడి పెట్టిన ఒవైసీ
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పౌరసత్వ (సవరణ) బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందితే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పేరును నియంత హిట్లర్, డేవిడ్ బెన్ గురియన్ పక్కన కనిపిస్తోందని కొత్త వివాదానికి తెర తీశారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. 'పౌరసత్వ (సవరణ) బిల్లు నుంచి దేశాన్ని రక్షించండంతో పాటు హోంమంత్రిని కూడా రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే జర్మనీలో జాతి ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన నురెమ్‌బర్గ్ చట్టాలు, ఇజ్రాయెల్ పౌరసత్వ చట్టాలు చేసిన హిట్లర్, డేవిడ్ బెన్ మాదిరిగా హోంమంత్రి అమిత్‌షా పేరు వారి జాబితాలో చేరుతుంది' అని ఒవైసీ లోక్‌సభలో పేర్కొన్నారు. అంతేకాక సర్బానంద సోనోవాల్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును పౌరసత్వ(సవరణ) బిల్లు ఉల్లంఘిస్తుందని అసదుద్దీన్ అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని, ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రాథమికంగా బలపరిచిన లౌకికవాదాన్ని కాకుండా కేంద్రం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుందని అందుకే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అయితే అసదుద్దీన్ వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా తప్పుపట్టారు. సభలో అమర్యాదగా మాట్లాడరాదని అసదుద్దీన్‌కు సూచించారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిసున్నట్టు పేర్కొన్నారు. ఇక మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ (సవరణ) బిల్లును అమిత్‌షా సోమవారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కంటతడి పెట్టిన ఒవైసీ.. అలాగే లోక్‌సభలో పౌరసత్వ బిల్లు సందర్భంగా మాట్లాడిన ఒవైసీ.. ఈ బిల్లు ద్వారా దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం సభలోనే బిల్లు పేపర్లు చించేశారు. అలాగే ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. -
ఎవరికీ నష్టం లేదు : సమానత్వాన్ని కాలరాస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా తన వాదనను వినిపించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు 130 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని, 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించిన అమిత్ షా.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికీ అన్యాయం జరగబోదని, ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయాలు, అజెండా లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా నిజానికి మైనారిటీలు హక్కులు పొందుతారని, విదేశాల నుంచి దేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనారిటీలు హక్కులు పొందుతారని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పౌరసత్వ సవరణ బిల్లుపై ధ్వజమెత్తారు. ఈ బిల్లు అతి పెద్ద తప్పిదమని, ఈ అసమగ్ర బిల్లు కొన్ని వర్గాలపై వివక్ష చూపేలా ఉందన్నారు. ఆర్టికల్ 14, 15, 21, 25, 26లకు వ్యతిరేకంగా బిల్లు ఉందని, రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఈ బిల్లు కాలరాస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
పౌరసత్వ బిల్లు: విప్ జారీచేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ (సవరణ) బిల్లును నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్ షా దిగువ సభలో ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. అయితే ఈ కీలక బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఎంపీలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులకు విప్ జారీచేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా ఈ రోజు, రేపు (సోమ, మంగళవారం) పార్లమెంట్‌కు తప్పకుండా హాజరుకావాలని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు సూచించారు. కాగా వివాదస్పద పౌరసత్వ బిల్లును కాంగ్రెస్, వామపక్షలు, టీఆర్ఎస్తో పాటు ఎన్డీయేతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే లోక్‌సభలో అధికార బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఓటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండకపోచ్చని తెలుస్తోంది. ఎగువ సభలో మిత్రపక్షాల మద్దతును బీజేపీ కూడగొట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు విప్ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది. -
నేడు లోక్‌సభకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుతోపాటు చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా పొడిగింపునకు ఉద్దేశించిన బిల్లును సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్ షా దిగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం నేడు సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోటా 2020 జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు విప్ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది. పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ నేత శశిథరూర్ విరుచుకుపడ్డారు. గాంధీజీ ఆలోచనా విధానం పై జిన్నా వాదానికి గెలుపు వంటిదే పౌరసత్వ బిల్లు అని విమర్శించారు. ఈ బిల్లును నిరసిస్తూ 10వ తేదీన బంద్ పాటించాలని ఈశాన్య విద్యార్థుల సమాఖ్య పిలుపునిచ్చింది. -
రేపు లోక్‌సభ ముందుకు ప్రతిష్టాత్మక బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నపౌరసత్వ సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు రానుంది. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్‌లో పౌరసత్వ సవరణ బిల్లును లిస్ట్ చేసింది మోదీసర్కార్. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వలసొచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ సవరణ బిల్లు తెచ్చింది కేంద్రం. 1955 పౌరసత్వ బిల్లుకు సవరణలు చేసింది. ముస్లిం దేశాల నుంచి మతఘర్షణల కారణంగా వలసొచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ బిల్లు ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే మతప్రాతిపదిక పౌరసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకిస్తున్నాయి. -
గుల్జార్‌ది ఓ విచిత్రమైన ప్రేమ కథ..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇండియా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గడివేముల వాసి షేక్ గుల్జార్ ఖాన్.. పాక్‌కు ఫోన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్‌పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా పాక్‌కు ఫోన్ చేస్తుండటంతో ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ నెల ఒకటిన ఆయన గడివేములను ఖాళీ చేసి.. కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లాడు. దీంతో రెండో తేదీన గుల్జార్‌తో పాటు అతని భార్య, పిల్లలను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు గుల్జార్‌ది ఓ విచిత్రమైన ప్రేమ కథ అని తేలింది.. రాంగ్ నంబర్.. రియల్ లవ్! గుల్జార్‌ది పాకిస్థాన్‌లోని సియాల్కోట్. పేద కుటుంబం.. ఉపాధి కోసం 12 ఏళ్ల కిందట సౌదీ అరేబియా వెళ్లాడు. ఏడాది పాటు అక్కడే పనిచేశాడు. ఓ సారి పొరపాటున రాంగ్ నంబర్ డయల్ చేయడంతో గడివేములలోని దౌలత్‌బీ పరిచయమైంది. ఆమెకు అప్పటికే భర్త చనిపోయాడు. ఓ కుమారుడున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడుకున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో గుల్జార్ సౌదీ నుంచి పాక్ వెళ్లకుండా ఇండియా వచ్చారు. పాకిస్థాన్ పాసుపోర్టుతో అయితే వీసా తీసుకోవాలి. వీసా గడువు ముగియగానే తిరిగి పాక్ వెళ్లిపోవాలి. కానీ గుల్జార్ ఇండియాలోనే స్థిరపడాలనే యోచనతో వచ్చాడు. ఇందుకోసం తాను ఇండియన్ అని, పాస్‌పోర్టు పోయిందని సౌదీ పోలీసులకు ఫిర్యాదు చేసి.. వారిని నమ్మించి ఈసీ (ఎమర్జెన్సీ సర్టిఫికెట్) ద్వారా ఇండియా వచ్చినట్టు తెలుస్తోంది. నేరుగా గడివేములకు వెళ్లి దౌలత్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పదేళ్ల సంసారంలో నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 4–5 నెలలుగా తిరిగి పాక్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడటం మొదలెట్టాడు. వివాహం, పిల్లల విషయాలు చెప్పేశాడు. దీంతో వారు తిరిగి పాక్‌కు రావాలంటూ విలపించారు. దీంతో నెల కిందట గుల్జార్, దౌలత్‌తో పాటు పిల్లలకూ పాస్‌పోర్టులు తీసుకుని.. పాక్‌లోని కుటుంబ సభ్యులతో మరింతగా మాట్లాడటం మొదలెట్టాడు. నేరస్తుడు కాదు.. ప్రేమికుడు! పోలీసుల విచారణలో అతడు నేరస్తుడు కాదని.. కేవలం ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకుని స్థిరపడాలనే వచ్చినట్టు తేలింది. అతనిని రిమాండ్‌కు పంపినట్టు తెలుస్తోంది. దౌలత్‌ఖాన్, వారి పిల్లలను కర్నూలుకు పంపారు. ఇప్పుడు గుల్జార్‌ను పాక్‌కు పంపితే.. దౌలత్, ఆమె పిల్లలు నిరాశ్రయులవుతారు. దౌలత్‌ను కూడా పాకిస్థాన్‌కు పంపితే.. అక్కడ ఆమెకు పౌరసత్వ సమస్య ఉత్పన్నమవుతుంది. గుల్జార్ పాక్ వాసి అని తేలిపోయింది కాబట్టి ఇప్పుడు ఇండియాలో నివాసముండాలంటే ఇక్కడ పౌరసత్వ సమస్య ఏర్పడినట్టే. ఈ క్రమంలో పోలీసులు, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
పౌరసత్వ రద్దును సవాల్ చేసిన చెన్నమనేని
సాక్షి, హైదరాబాద్: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేశారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలోనే తాజా ఉత్తర్వులు ఉన్నాయని, పూర్తిగా సాంకేతికంగానే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని అదే తరహాలో తిరిగి జారీ చేసిన పౌరసత్వ రద్దు ఉత్తర్వులను కూడా కొట్టేయాలని కోరారు. గతంలో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకుండానే సాంకేతికంగా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు. పౌరసత్వం రద్దుపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని, తమ వాదనలు కూడా వినాలని కోరుతూ.. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. -
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ/ కరీంనగర్:పౌరసత్వం వివాదంలో వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని పొందేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. తప్పుడు సమాచారం ఇచ్చారు.. ‘‘భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేశ్ 31.03.2008న దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఏడాది పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విషయంలో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు. 21.11.2008న గత 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను సమర్పించాలని హోంశాఖ ఆయన్ను కోరగా.. తాను విదేశాలకు వెళ్లలేదని 27.11.2008న రమేశ్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 04.02.2009న ఆయనకు కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై ఆది శ్రీనివాస్ 15.06.2009న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం రమేశ్ 01.03.2007 నుంచి 26.11.2007 వరకు, 20.12.2007 నుంచి 28.02.2008 వరకు విదేశాల్లో ఉన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ ద్వారా 01.09.2009న ధ్రువీకరించింది. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(5) పరిధిలో ఒక విచారణ కమిటీని నియమించగా.. ఆ కమిటీ 10.03.2017న తన నివేదిక సమర్పించింది. జర్మనీకి వెళ్లిన విషయాన్ని రమేశ్ నిజాయతీగా వెల్లడించలేదని, 27.11.2008న తప్పుడు సమాచారం ఇచ్చారని కమిటీ నిర్ణయానికి వచ్చింది. రమేశ్ భారత ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా పౌరసత్వాన్ని పొందారని తేలింది’’అని హోంశాఖ పేర్కొంది. రమేశ్ తప్పుడు అభ్యర్థన చేశారని, వాస్తవాలను మరుగున పెట్టారని, పౌరసత్వ దరఖాస్తుకు ముందు చేసిన విదేశీ పర్యటనలను దాచి ఉంచినట్టు వెల్లడైందని వివరించింది. వాస్తవాలను మరుగుపరచడం, తప్పుడు సమాచారం ద్వారా పౌరసత్వం పొందితే సెక్షన్ 10(2) వర్తిస్తుందని, అంటే ఆయన పౌరసత్వం తొలగించాల్సి వస్తుందని తెలిపింది. ఉదాహరణగా ఉండాల్సిన వారు ఇలా చేస్తే? ‘‘తాను ప్రజాసేవలో ఉన్నందున సెక్షన్ 10(3)ను పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని అభ్యర్థించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేనని, ఎలాంటి నేరచరిత్ర లేదని, క్రిమినల్ కేసు లేదని, తీవ్రవాదం వంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. దరఖాస్తు నాటికి ఏడాది ముందు కాలం పాటు పూర్తిగా భారతదేశంలో నివసించలేదని సమాచారం ఇచ్చి ఉంటే అధీకృత యంత్రాంగం ఆయనకు పౌరసత్వం ఇచ్చి ఉండేది కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇచ్చే సమాచారం సరైనదిగా ఉండాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు ఆయన ప్రవర్తన ఉదాహరణగా ఉండాలి. ఒక వ్యక్తి దేశ పౌరసత్వం పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటే, సమాజానికి సదరు వ్యక్తి చేసే మంచిని ఊహించగలం. నేరారోపణలు లేనంత మాత్రాన తప్పుడు సమాచారం ఇవ్వడం మంచి చేయడానికే అని అర్థం కాదు. ప్రజాప్రతినిధిగా ఉండి అసత్య సమాచారం ఇవ్వడం ప్రజాశ్రేయస్సుకు మంచిది కాదు. ఆయన ఎలాంటి నేరాలకు పాల్పడలేదని భావించి పౌరసత్వాన్ని కొనసాగిస్తే ఇదొక ఉదాహరణగా మారి మరికొందరు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పౌరసత్వాన్ని పొందుతారు. వీటన్నింటి దృష్ట్యా ఆయన భారత దేశపౌరుడిగా కొనసాగడం ప్రజాశ్రేయస్సుకు దోహదం చేయదని నిర్ణయించి, రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’’అని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పదేళ్ల న్యాయ పోరాటం చివరికి ఇలా... రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ విచారణ జరిపి, రమేశ్ కేవలం 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నారని నివేదిక సమర్పించారు. 2010 ఉప ఎన్నికల అనంతరం రమేశ్‌బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటరు జాబితాలో పేరు తొలగించాలని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ఈ వ్యవహారం కేంద్ర హోంశాఖకు మారింది. రమేశ్‌బాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని తేల్చి చెప్పింది. దీంతో 2017 ఆగస్టు 31న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే, తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తన పౌరసత్వం కొనసాగించాలని మరోసారి ఆయన హోంశాఖను కోరారు. అనంతరం 2018 జనవరి 5న మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వగా.. దానిని ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 2019 జూలై 10న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ మూడు మాసాల్లో తేల్చాలని ఆదేశించింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని తన పౌరసత్వ పరిరక్షణకు మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తెలిపారు. ఈ ఏడాది జూలై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత హైకోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ ఏడాది జూలై 15న నా పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, వాటి నియమ నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా హేతుబద్దంగా, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలి తప్ప, సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని తన 25 పేజీల తీర్పులో హైకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవేళ సెక్షన్ 10.3ని పరిగణించకుండా.. ఏ నిర్ణయం వచ్చినా న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 31న మరోమారు ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ వద్ద వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తీర్పులో పేర్కొన్న ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని చెన్నమనేని పేర్కొన్నారు. న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్ రమేశ్‌బాబు భారతదేశ పౌరుడు కాదని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, ఇన్నాళ్లకు న్యాయం గెలిచిందని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మచ్చలేని నాయకుడనని చెప్పుకుంటున్న రమేశ్‌బాబు ఈ దేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నేను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ న్యాయస్థానంలో ఉంది. గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఆ పదవిలోకి వస్తే సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని భావిస్తున్నా’అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వేటా.. చెల్లుబాటా? రమేశ్ భారత పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేప థ్యంలో, ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై ఉత్కంఠ నెలకొంది. హోం శాఖ నిర్ణ యం నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారా, సమీప ప్రత్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరోమారు హైకో ర్టును ఆశ్రయిస్తానని రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేగా ఆయన భవితవ్యంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2010 ఉప ఎన్నికతో పాటు 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. భారతీయుడైన రమేశ్ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించగా, 2008 మార్చి 31న తిరిగి భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
పౌరసత్వ బిల్లులో కీలక మార్పులు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత లోక్‌సభ రద్దైన నేపథ్యంలో ఆ బిల్లుకు కూడా కాలం చెల్లిన విషయం తెలిసిందే. దాంతో, కొత్తగా కొన్ని కీలక మార్పులతో ఆ బిల్లును మళ్లీ సభ ముందుకు తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ‘అక్రమ వలసదారులు’ అనే పదానికి నిర్వచనాన్ని కూడా బిల్లులో చేర్చనున్నారని సోమవారం అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులకు తట్టుకోలేక భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీలకు.. వారివద్ద సరైన పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పించే దిశగా పౌరసత్వ చట్టం, 1955లో సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లు అది. ఇది బీజేపీ ప్రచారాస్త్రాల్లో ఒకటి. -
‘పుట్టగానే పౌరసత్వం’ రద్దు!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా భూభాగంపై చిన్నారులు పుట్టగానే పౌరసత్వం లభించేలా ఉన్న నిబంధనల్ని తొలగించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే అక్రమ వలసల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. దీంతో డెమొక్రాట్లు ట్రంప్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వైట్‌హౌస్ దగ్గర బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి ప్రస్తుతం వెంటనే మన పౌరసత్వం లభిస్తోంది. ఈ నిబంధనల్ని తొలగించే విషయాన్ని మేం తీవ్రంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతమున్న ఈ వ్యవస్థ హాస్యాస్పదంగా తయారైంది’ అని వ్యాఖ్యానించారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ.. ‘విదేశీయులు సరిగ్గా ప్రసవానికి ముందు సరిహద్దు దాటేసి అమెరికాలోకి వచ్చేస్తున్నారు. ఆ చిన్నారులు మన భూభాగంపై పుట్టగానే వారికి అమెరికా పౌరసత్వం లభిస్తోంది. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత సంతతి డెమొక్రటిక్ నేత కమలా హ్యారిస్.. ట్రంప్ ముందుగా అమెరికా రాజ్యాంగాన్ని సీరియస్‌గా చదవాలని చురకలు అంటించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ శిశివులకు ‘పుట్టగానే పౌరసత్వం’ హక్కును కల్పిస్తోంది. వలసదారుల నిరవధిక నిర్బంధం అమెరికాలోకి ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ప్రవేశించే వలసదారుల విషయంలో ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులు, వారి పిల్లలను నిరవధికంగా నిర్బంధించేలా కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రస్తుత చట్టాల ప్రకారం వలసదారుల పిల్లలను గరిష్టంగా 20 రోజుల పాటు మాత్రమే అదుపులో తీసుకునేందుకు వీలుండేది. తాజాగా ఈ నిబంధనల్ని సవరిస్తూ ట్రంప్ యంత్రాంగం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇది మరో 60 రోజుల్లో అమల్లోకి రానుంది. ఈ విషయమై హోంల్యాండ్ విభాగం కార్యదర్శి కెవిన్ మెకలీనన్ మాట్లాడుతూ.. ‘మధ్య అమెరికా దేశాలకు చెందిన అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. అయితే ప్రస్తుత చట్టంలోని లోపాల కారణంగా 20 రోజుల తర్వాత వీరిని దేశంలోకి విడిచిపెట్టాల్సి వస్తోంది. ఈ కేసులు కోర్టుల్లో తేలడానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. దీన్ని మనుషుల అక్రమ రవాణా గ్రూపులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి’ అని తెలిపారు. కాగా, అమెరికాలోని చిన్నారులను కాపాడేందుకు, అక్రమ వలసల్ని నియంత్రించేందుకు ఇలాంటి లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. -
తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోసారి సమీక్ష చేయాలని చేయాలని జూలై 10న హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ మరోసారి కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని హోశాఖలో అప్పీల్ చేశారు. (చదవండి : చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు ఊరట) -
చెన్నమనేని పౌరసత్వాన్ని 3 నెలల్లో తేల్చండి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్‌కు సూచింది. -
విదేశీ ‘ముద్ర’!
అస్సాం జనాభాలో ‘విదేశీయులను’ ఆరా తీసే ప్రక్రియ ఎన్ని వింత పోకడలు పోయిందో చెప్పడానికి సైన్యం నుంచి రిటైరై అస్సాం సరిహద్దు పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న మహమ్మద్ సనావుల్లా పడుతున్న కష్టాలే ఉదాహరణ. ఆయన్ను గత నెల 24న విదేశీయుల నిర్ధారణ ట్రిబ్యునల్ బంగ్లాదేశ్ పౌరుడిగా ముద్రేసింది. ఈ దేశంలోకి అక్రమంగా ప్రవే శించాడని తేల్చింది. మరో నాలుగురోజులకు ఆయన్ను అరెస్టుచేసి నిర్బంధ శిబిరానికి తరలిం చారు. గువాహటి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన 10 రోజుల తర్వాత శుక్రవారం విడుదలయ్యారు. గత ఆగస్టులో జాతీయ పౌర గుర్తింపు(ఎన్ఆర్సీ) తుది ముసాయిదా విడుదలైన ప్పుడు అస్సాం జనాభాలో 40.07 లక్షలమంది విదేశీయులని నిర్ధారించారు. ఇలాంటివారందరినీ అరెస్టు చేసి రాష్ట్రంలో వేర్వేరుచోట్ల ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరాలకు తరలించారు. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవని, అందులో ఉన్నవారు దుర్భరమైన పరిస్థితుల్లో రోజులు వెళ్లదీస్తున్నా రని కథనాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి అస్సాంలో ‘విదేశీయుల’ ఏరివేత చర్యలు, నిర్బంధ శిబిరాలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఎవరైనా స్థానికులు కారన్న ఫిర్యాదు అందితే వారివద్ద ఉన్న ఆధా రాలు తనిఖీ చేయడం, అవి చూపలేనివారిని అరెస్టు చేయడం అక్కడ రివాజు. ఆ శిబిరాల్లో అమాన వీయమైన పరిస్థితులున్నాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మొన్న ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు కల్పించింది. రూ. లక్ష చొప్పున ఇద్దరు పౌరులు పూచీకత్తులిస్తే నిర్బంధితులను విడుదల చేయొచ్చునని చెప్పింది. కానీ ఎంతమందికి ఈ స్తోమత ఉంటుంది? అస్సాం జాతుల సమస్య అత్యంత సంక్లిష్టమైనది. అక్కడ పదుల సంఖ్యలో తెగలున్నాయి. అనేకానేక భాషలు మాట్లాడేవారున్నారు. భిన్న ఆచారసంప్రదాయాలు పాటించేవారున్నారు. తరచుగా తోవమార్చుకునే బ్రహ్మపుత్ర నదివల్ల దానికి ఉత్తర తీరంలోని కోక్రాఝర్, చిరాంగ్, సోని త్పూర్, బక్సా, ఉదల్గురివంటి పలు జిల్లాల్లో వివిధ తెగలవారు కొత్త ప్రాంతాలను వెదుక్కుని స్థిర నివాసం ఏర్పర్చుకోక తప్పని స్థితిగతులున్నాయి. వీరుగాక బంగ్లాదేశ్ నుంచి పనుల కోసం వలస వచ్చేవారుంటారు. ఇలా స్థానిక తెగలకూ, కొత్తగా వచ్చి స్థిరపడాలనుకుంటున్నవారికి, బంగ్లా నుంచి వలసవచ్చినవారికి మధ్య నిరంతరం ఘర్షణలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల మందిని ‘రాజ్యరహిత పౌరులు’గా నిర్ధారించి గెంటేయడం అంత సులభమేమీ కాదు. ఈ దేశ పౌరులు కారని నిర్ధారించినవారంతా బంగ్లాదేశీయులేనని మన ప్రభుత్వం మున్ముందు ప్రకటిం చినా ఆ దేశం వారినందరినీ స్వీకరిస్తుందన్న నమ్మకం లేదు. తమ పౌరులెవరూ భారత్‌లో లేరని ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రకటించింది. ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలున్న ప్రస్తుత తరుణంలో దీన్ని పరిష్కరించడం అంత సులభం కాదు. సనావుల్లా మూడు దశాబ్దాలు సైన్యంలో సేవలందిం చారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ప్రశంస పొందారు. కమిషన్డ్ ఆఫీసరుగా పని చేశారు. సైన్యంలో చేరినప్పుడూ, ఆ తర్వాత భిన్న సందర్భాల్లో ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి నిఘా సంస్థలు ఆరా తీసే ఉంటాయి. అందుకు సంబంధించిన రికార్డులు కూడా భద్రంగా ఉంటాయి. కానీ ఆయన స్వస్థలమైన కాలాహిషా గ్రామస్తులు ఇచ్చిన సాక్ష్యంతో సనావుల్లాను ట్రిబ్యునల్ విదేశీయుడిగా పరిగణించింది. ఆ ఇద్దరిలో అమ్జాద్ అలీ అనే పేరుగల వ్యక్తి ఎవరూ తమ గ్రామంలో లేరని అక్కడివారు చెబుతున్నారు. ట్రిబ్యునల్ దగ్గర కూడా అతని చిరునామా వగైరాలు లేవు. మరో వ్యక్తి అయితే తాను ఎలాంటి సాక్ష్యమూ చెప్పలేదంటున్నాడు. ట్రిబ్యునల్ తన ముందున్న సాక్ష్యాధారాల విశ్వసనీయతను నిర్ధారించుకోలేకపోవడమే కాదు...సనావుల్లా సమ ర్పించిన ఆధారాలను బేఖాతరు చేసింది. అస్సాంలో ఎవరినైనా విదేశీయుడిగా ముద్రేసి కష్టాల పాలు చేయడం ఎంత సులభమో సనావుల్లా ఉదంతం చెబుతోంది. ఇప్పుడు విదేశీయులుగా ముద్రపడిన 40 లక్షలకుపైగా జనాభాలో సనావుల్లా వంటి మాజీ సైనికులు, ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నవారు 500మంది వరకూ ఉన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నప్పుడూ, వాటిమధ్య ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడూ విదేశీయుల నిర్ధారణ వంటి అంశాలు ఎన్ని సమస్యలను తెచ్చిపెడతాయో, ఏ స్థాయిలో విద్వేషాలు రగులుస్తాయో వర్తమాన అస్సాం చూపుతోంది. అక్రమ వలసలను నివారించవలసిందే. స్థానికుల ప్రయోజనాలకు చేటు కలిగేలా భారీయెత్తున వేరే దేశ పౌరులు చొరబడటం కూడా ఆందోళన కరమైనదే. కానీ వీటిని పరిష్కరించడానికి అనుసరించే విధానాల్లో లోపాలు, లొసుగులు ఉంటే స్వప్రయోజనపరులకు అవి అవకాశంగా మారతాయి. పొంచి ఉన్న ఇలాంటి ప్రమాదాల గురించి 48మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల బృందం నాలుగు నెలలక్రితం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ పౌర గుర్తింపు ముసాయిదాలో చోటు దొరకనివారికి ఏదోరకమైన చట్టప్రతిపత్తి కల్పించి, తగిన వ్యవధినిచ్చి, వారు అభ్యంతరాలు తెలియజేయడానికి, తమ దగ్గరున్న ఆధారాలు అందజేసేందుకు వీలు కల్పించాలని... సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వాటిని పరిశీలించి పరిష్క రించాలని సూచించింది. నిర్బంధ శిబిరాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరింది. సనావుల్లా దగ్గర తన పౌరసత్వం నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలున్నాయి. సైన్యంలో పనిచేశాడు గనుక తగిన రికార్డులున్నాయి. ఆయనకు సైన్యంలో పనిచేస్తున్నవారు అండగా నిలి చారు. కనుక సనావుల్లా పది రోజుల తర్వాతైనా బెయిల్‌పై విడుదల కాగలిగాడు. కానీ ఎవరి ఆసరా లేని నిరుపేదల పరిస్థితేమిటి? విదేశీయులుగా ముద్రపడినవారిలో అలాంటివారి సంఖ్యే అధికం. సుప్రీంకోర్టు విధించిన గడువు జూలై 31 సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రక్రియలోని లోటుపాట్లను సరిదిద్ది, అసహాయులు, అమాయకులు బలికాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలపై ఉంది. -
దేశం మీద ప్రేమను నిరూపించుకోవాలా?
కొంతకాలంగా నటుడు అక్షయ్‌కుమార్ పౌరసత్వం గురించి బీటౌన్‌లో వివాదం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడన్నది ఆ వివాదాల సారాంశం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడం విమర్శకు దారి తీసింది. అతని భార్య, నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా ఓటు హక్కును వినియోగించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అక్షయ్ ఎందుకు లేడనే విషయంపై సోషల్ మీడియాలో భిన్నరకాలుగా చర్చలు సాగాయి. ఆ చర్చ అక్షయ్ కెనడా పౌరసత్వమే ప్రధానాంశంగా సాగింది. ఈ విషయంపై అక్షయ్ కుమార్ ట్వీటర్లో వివరణ ఇచ్చారు. ‘‘నా పౌరసత్వం గురించి ఎందుకింత చర్చ, వ్యతిరేక భావనలు వినిపిస్తున్నాయో అర్థం కావడం లేదు. కెనడా పాస్‌పోర్ట్ లేదని నేనెప్పుడూ చెప్పలేదు, దాచలేదన్నది ఎంత నిజమో.. గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదన్నది అంతే నిజం. నేను ఇండియాలో పని చేస్తున్నాను. ఇండియాలోనే పన్నులు కడుతున్నాను. ఇన్నేళ్లుగా దేశం పట్ల నాకు ఉన్న ప్రేమను ఇప్పుడు ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు అనవసరంగా నా పౌరసత్వం గురించి వివాదాలు సృష్టించడం సరైంది కాదు. ఏదీ ఏమైనా ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి నా వంతు ప్రయత్నాన్ని మానుకోను’’ అన్నారు అక్షయ్ కుమార్. -
పుట్టిందిక్కడే.. నేనే సాక్ష్యం
కొచ్చి (కేరళ): కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వ హోదాను ఎవరూ ప్రశ్నించలేరని రిటైర్డ్ నర్సు రాజమ్మ వవాతిల్ స్పష్టం చేశారు. రాహుల్ 1970 జూన్ 19న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో పుట్టారని, అప్పుడు విధుల్లో ఉన్న నర్సుల్లో తానూ ఒకరినని ఆమె తెలిపారు. తాను ఆ సమయంలో ట్రైనీ నర్సుగా ఉన్నట్లు చెప్పారు. రాహుల్‌ను మొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న కొద్దిమందిలో తానూ ఉన్నట్లు రాహుల్ పోటీ చేసిన వయనాడ్ నియోజకవర్గ ఓటరు కూడా అయిన 72 ఏళ్ల నర్సు రాజమ్మ చెప్పారు. అలా ఎత్తుకోవడం ఎంతో అదృష్టంగా భావించానన్నారు. ‘బాబెంతో ముద్దుగా ఉన్నాడు. ప్రధాని ఇందిరా గాంధీ మనవడిని చూడటం నాకు, ఆ మాటకొస్తే మా అందరికీ ఎంతో ఉత్సుకత కలిగించింది. ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. సోనియాగాంధీ డెలివరీ సమయంలో ఆస్పత్రి లేబర్ రూమ్ బయట రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీ, బాబాయ్ సంజయ్‌గాంధీ వేచి ఉండటం గురించి నేను తరచూ నా కుటుంబానికి చెబుతూ ఉంటాను..’అని ఆమె ఫోన్లో పీటీఐకి తెలిపారు. రాహుల్ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు చేయడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. భారతీయ పౌరుడిగా రాహుల్ గుర్తింపును ఎవరూ ప్రశ్నించలేరన్నారు. స్వామి ఆరోపణ ఆధార రహితమని చెప్పారు. రాహుల్ పుట్టుకకు సంబంధించిన రికార్డులన్నీ ఆస్పత్రిలో ఉంటాయన్నారు. హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వవాతిల్ మిలటరీ ఆస్పత్రిలో నర్సుగా చేరారు. వీఆర్ఎస్ తీసుకుని 1987లో కేరళ తిరిగివచ్చిన ఆమె కల్లూరులో స్థిరపడ్డారు. రాహుల్ ఈసారి వయనాడ్ వచ్చినప్పుడు కలుస్తాననే ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. -
రాహుల్ పోటీని అడ్డుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం విషయం తేలే వరకు ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించేలా కేంద్రం, ఎన్నికల సంఘం(ఈసీ)కు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. సీపీ త్యాగి, జై భగవాన్ గోయల్ అనే ఇద్దరు ఈ పిటిషన్ వేశారు. రాహుల్ తనను తాను బ్రిటిష్ పౌరుడిగా చెప్పుకున్నారంటూ బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి 2015లో హోం శాఖకు లేఖ రాయడం, అనంతరం దీనిపై పక్షం రోజుల్లో స్పందన తెలపాల్సిందిగా హోం శాఖ రాహుల్‌ను కోరడం తెల్సిందే. ప్రస్తుత ఎన్నికల్లో రాహుల్ కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో ఇప్పటికే పోలింగ్ పూర్తవ్వగా, అమేథీలో 6న పోలింగ్ జరగనుంది. బ్రిటిష్ పౌరసత్వం అంశం తేలే వరకు గాంధీ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాల్సిందిగా ఈసీని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. రాహుల్‌కు గుజరాత్ కోర్టు సమన్లు.. సూరత్: దొంగలందరి ఇంటిపేరు మోదీనే అని అన్నందుకు సూరత్ కోర్టు రాహుల్‌కు నోటీసులిచ్చింది. ఏప్రిల్ 13న రాహుల్ కర్ణాటకలోని కోలారులో ప్రసంగిస్తూ ‘నీవర్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. ఇలా దొంగలందరి ఇంటిపేరు మోదీ అనే ఉంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్ 16న గుజరాత్ బీజేపీ శాసనసభ్యుడు పూర్ణేశ్ మోదీ రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. దీంతో సూరత్‌లోని చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ బీహెచ్ కపాడియా ఈ కేసులో రాహుల్‌కు నోటీసులు జారీ చేస్తూ, జూన్ 7న తన ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కాగా, అమిత్ షాను ‘హత్య కేసు నిందితుడు’ అని అన్నందుకు అహ్మదాబాద్ కోర్టు రాహుల్‌కు నోటీసులు పంపింది. రాహుల్‌కు ఈసీ క్లీన్చిట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి ఈసీ క్లీన్చిట్ ఇచ్చింది. బీజేపీ చీఫ్ అమిత్‌షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్‌లో అన్నట్లు ఈసీకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు రాహుల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. -
రాహుల్ అఫిడవిట్‌పై అనుమానాలు
అమేథీ/సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ పేర్కొంది. వీటిపై ఆయన వెంటనే స్పందించాలని డిమాండ్ చేసింది. బ్రిటన్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్. చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్.చేసినట్లు చెప్పడంపై అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామంపై బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు, ధ్రువ్‌లాల్ లాయర్‌తో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనే బ్రిటిష్ పత్రాలను లాయర్ మీడియాకు చూపారు. రాహుల్ గాంధీ 1994లో డిగ్రీ చేసి, 1995లో ఎం.ఫిల్. చేసినట్టు అఫిడవిట్లలో పేర్కొన్నారని, డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా ఎం.ఫిల్ ఎలా సాధ్యమన్నారు. ఆయనకే తెలియాలని విమర్శించారు. పైగా డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి, డెవలప్మెంట్ స్టడీస్‌లో ఎం.ఫిల్ చేసినట్టు ఓసారి పేర్కొన్నారని విమర్శించారు. ఈ అనుమానాలపై వివరణ ఇచ్చేందుకు రాహుల్ లాయర్ సోమవారం వరకు గడువు కోరారని అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ తెలిపారు. -
గుర్తుపట్టకుండా ప్లాస్టిక్ సర్జరీ!
లండన్/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు దాదాపు రూ.13,500కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్‌లో కేసుల దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు తేలింది. ఇందులోభాగంగా తొలుత ఆస్ట్రేలియాకు 1,750 కిలోమీటర్ల తూర్పున ఉన్న వనౌతు ద్వీప దేశపు పౌరసత్వం కోసం నీరవ్ దరఖాస్తు చేసుకున్నారు. సింగపూర్‌లో శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మూడో దేశంలో ఆశ్రయం పొందేందుకు వీలుగా బ్రిటన్‌లోని ప్రముఖ న్యాయసంస్థలను నీరవ్ సంప్రదించారు. అంతేకాకుండా భారత అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావించారట. అయితే మెట్రో బ్యాంకు క్లర్క్ నీరవ్‌ను గుర్తుపట్టడంతో ఆయన ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి. మరోవైపు హోలీ పర్వదినం రోజున నీరవ్ మోదీ లండన్ శివార్లలోని వాండ్స్‌వర్త్‌లో ఉన్న ‘హర్ మెజెస్టీ జైలు’లో గడిపారు. మార్చి 28 వరకూ నీరవ్ ఇదే జైలులో ఉండనున్నారు. ఈ జైలులో అత్యవసర సమయంలో రోగులకు చికిత్స అందించే పరికరాలు లేవనీ, మౌలిక సదుపాయాలు కూడా అధ్వానంగా ఉన్నాయని గతంలో బ్రిటన్ జైళ్ల శాఖ విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేశాయి. నీరవ్ కదలికలపై దృష్టి.. నీరవ్ మోదీ 2018, జనవరిలో భారత్‌ను విడిచిపెట్టి పారిపోయాక ఆయన ప్రతీ కదలికపై భారత విచారణ సంస్థలు దృష్టిసారించాయి. యూరప్, యూఏఈకి నీరవ్ సాగించిన రాకపోకలు, ఆయన ఆర్థిక వ్యవహారాలు, సమావేశాలను పరిశీలించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘నీరవ్ మోదీ తన మామయ్య మెహుల్ చోక్సీ అంత తెలివైనవాడు కాదు. ఎందుకంటే వీరిద్దరి పరారీ అనంతరం సీబీఐ, ఈడీలు రెడ్‌కార్నర్ నోటీసులు ఇవ్వాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. దీంతో వెంటనే చోక్సీ స్పందిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని తన ప్రతిస్పందనను దాఖలుచేశారు. కానీ భారత అధికారులు దేశం బయట తనను పట్టుకోలేరన్న ధైర్యంతో నీరవ్ ఈ విషయమై స్పందించలేదు’ అని వ్యాఖ్యానించారు. మాల్యా కేసుతో అవగాహన.. నీరవ్ మోదీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు అంతర్జాతీయంగా ఏ న్యాయస్థానాల్లో అయినా చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘అంటిగ్వాలో తలదాచుకుంటున్న నీరవ్ మోదీ మామయ్య చోక్సీని ఆ దేశం భారత్‌కు అప్పగిస్తుందని భావిస్తున్నాం. నీరవ్‌ను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలన్న పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇది త్వరలోనే ఆమోదం పొందుతుందని అనుకుంటున్నాం. నీరవ్ మోదీని త్వరలోనే బ్రిటన్ భారత్‌కు అప్పగిస్తుంది. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను అందించాం. కింగ్ ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా కేసులో ఎదురైన అనుభవాలతో బ్రిటన్ అప్పగింత చట్టాలపై భారత విచారణ సంస్థలకు ఓ అవగాహన వచ్చింది. అందుకు అనుగుణంగానే భారత అధికారులు నీరవ్ కేసు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించారు’ అని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొనాలని భారత సంస్థలకు బ్రిటన్ నుంచి ఇంకా ఆహ్వానం రాలేదన్నారు. ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న నీరవ్ సోదరుడు నిషాల్, సోదరి పూర్వీలకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘పౌరసత్వం’ పీడ
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సిద్ధాంతాలకు ఆకర్షితులై అమెరికా, బ్రిటన్ తదితర దేశాలనుంచి సిరియా వెళ్లినవారిలో చాలామందికి ఇప్పుడు భ్రమలు పటాపంచలయ్యాయి. వీరిలో అత్యధికులు కుర్దిష్ గెరిల్లాల దాడుల్లో పట్టుబడినవారు. కొందరు ఇరాక్‌లో సంకీర్ణ సేనల చేతికి చిక్కారు. ఇలా ఐఎస్ బాట పట్టినవారంతా దాదాపు బడికెళ్లి చదువుకునే పిల్లలు. అందరూ వెట్టిచాకిరీతో, నిరంతర హింసతో మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నారు. అయితే ఆడపిల్లలకు అదనపు సమస్యలున్నాయి. వారు అత్యా చారాలు, ఇతరత్రా శారీరక హింసలు ఎదుర్కొని, గర్భవతులై రోగాల్లో చిక్కుకుని మానసికంగా కుంగి పోయారు. కొందరు అబార్షన్లబారినపడ్డారు. పుట్టిన వారు పోషకాహారలేమితో కొన్ని నెలలకే కన్నుమూ శారు. వీరందరికీ తాజాగా మరో ముప్పు ముంచుకొ చ్చింది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వీరి పౌర సత్వాన్ని రద్దు చేశాయి. ఈ పిల్లలు ముస్లిం దేశాల నుంచి వలసవెళ్లి స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారు. ఈ గడ్డపై పుట్టినవారికి వేరే అభిప్రాయాలు ఏర్పడినంతమాత్రాన పౌరసత్వం ఎలా రద్దుచేస్తారని కొందరు వాదిస్తుండగా... ఇప్పటికీ పశ్చాత్తాపం లేని వారిని కనికరించరాదని మరికొందరి వాదన. పట్టు బడినవారంతా అప్పట్లో తమ నిర్ణయం సరైందేనని, సిరియా, ఇరాక్ తదితర దేశాల్లో పాశ్చాత్య దేశాలు సాగించిన దమనకాండే తమను ఆ దిశగా ఆలోచిం చేలా చేసిందని ఆ పిల్లలు సమర్థించుకున్నారు. -
సబ్సిడీ కిరోసిన్ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని పేదలకు చేరాల్సిన రాయితీ కిరోసిన్ పక్కదారి పడుతోంది. రేషన్ డీలర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం వెరసి కిరోసిన్ యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతోంది. కిరోసిన్ దందాపై నిఘా కొరవడటంతో వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఏటా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నట్లు ఇటీవలి పౌరసరఫరాల శాఖ విశ్లేషణలో తేలింది. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కిరోసిన్ సరఫరానే పూర్తిగా నిలిపివేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఎత్తివేతకు కేంద్రం మొగ్గు.. అయితే రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ –పాస్) విధానాన్ని కిరోసిన్ పంపిణీకి కూడా అనుసంధానం చేశారు. ఇటీవలే ఈ విధానం అమల్లోకి రావడంతో డీలర్లు కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలించే వీలు లేకుండా అడ్డుకట్ట పడుతోంది. ఈ నెలలోనే ప్రస్తుత లెక్కల మేరకే 33 శాతం మేర కిరోసిన్ మిగులు సాధించినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇ–పాస్ విధానం అన్ని రాష్ట్రాల్లో అమల్లో లేదు. దీంతో దేశవ్యాప్తంగా కిరోసిన్ అక్రమాలకు చెక్‌పడటం లేదు. దేశవ్యాప్తంగా 41శాతం ఏటా అక్రమమా ర్గం పడుతోందని కేంద్రం తన సర్వేలో గుర్తించింది. ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ నూటికి 95 శాతం మంది దీపం, వంట పొయ్యి లు వాడడం లేదు. దాదాపు ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాయితీ సరఫరాను పూర్తిగా నిలిపివేయా లని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక సలహాదారు సైతం ప్రభుత్వానికి తమ సిఫారసులు పంపినట్లుగా తెలిసింది. రాయితీ కిరోసిన్ అంతా పెట్రోల్ బంక్‌లకే.. రాష్ట్రంలో ప్రస్తుతం 87లక్షల రేషన్ కార్డులుండగా, 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో కార్డుపై నెలకు లీటర్ కిరోసిన్‌ని రూ.29కి సరఫరా చేస్తున్నారు. నిజానికి లీటర్ కిరోసిన్ ధర రూ.40మేర ఉండగా, రూ.11 మేర కేంద్ర ప్రభుత్వం రాయితీని భరిస్తోంది. రాష్ట్రంలో ప్రతి నెలా సరాసరిన 7.60 లక్షల లీటర్ల కిరోసిన్‌ను కేంద్రం సరఫరా చేస్తోంది. అయితే ఈ కిరోసిన్‌ని రేషన్ డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా హోల్‌సేల్ డీలర్లు, రేషన్ డీలర్లకు సరఫరా చేయాల్సి ఉండగా, ఒక నెల సరఫరా చేసి మరో నెల తప్పిస్తున్నారు. దీనిపై లబ్ధిదారులకు సరైన సమాచారం లేకపోవడంతో డీలర్ల వద్దే కిరోసిన్ మిగిలిపోతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని డీలర్లు కిరోసిన్‌ను పెట్రోల్ బంక్‌లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగబాకడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. రూ.29కే అందుతున్న కిరోసిన్‌ని ఏకంగా డీలర్లు రూ.40 నుంచి రూ.50కి పెట్రోల్ బంక్ యజమానులకు విక్రయిస్తున్నారు. ఇటీవలే రాయితీ కిరోసిన్‌తో చేస్తున్న కొత్తదందాను తెలంగాణ విజిలెన్స్ గుర్తించింది. ‘ఇంటెరాక్స్ ఎస్టీ 50’అనే కెమికల్‌తో పాటు ముల్తానా మట్టిని వినియోగించి కిరోసిన్‌ను డీజిల్‌గా మార్చేస్తున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ ఇంధనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, వివిధ పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఏటా రూ.100 కోట్ల మేర సాగుతున్న ఈ అక్రమ వ్యవహారం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల చొరవతో గత నెలలో బహిర్గతమైంది. ప్రతి ఏటా ఈ విధంగా ఏకంగా రాష్ట్రంలో 33 శాతం మేర కిరోసిన్ బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. -
హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉంది
-
పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నా : ప్రముఖ దర్శకుడు
ఇంపాల్: మణిపూర్ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరొందిన అభిరాం శ్యామ్ శర్మ తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఈశాన్య భారతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని 83 ఏళ్ల శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో 500కు పైగా ఎంపీలు ఉంటే తమ రాష్ట్రం నుంచి కేవలం ఒక్కరిద్దరే ఉన్నారని.. తమ ఆవేదనను ఎలా వ్యక్తపరుస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలను కూడా గౌరవించాలనీ.. తమపై ఈవిధంగా వివక్ష చూపడం సబబు కాదని శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం బలవంతగా బిల్లును అమలుచేయడం సరికాదన్నారు. ఇషనౌ, ఇమాగి నింగతెమ్ వంటి సినిమాలు శర్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన చిత్ర పరిశ్రమకు సేవలను గుర్తిస్తూ.. ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. -
నేటి నుంచి పార్లమెంటు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. గురు వారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పౌరసత్వ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు, ప్రజా ప్రాతినిథ్య చట్టం–2017 బిల్లు, కంపెనీల చట్టం బల్లు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. అయితే ఈ బిల్లులపై జేడీయూ సహా పలు మిత్రపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. అయోధ్య చుట్టూ వివాదాస్పదం కాని స్థలాన్ని యజమానులకు తిరిగి ఇచ్చేస్తామని కేంద్రం చెప్పడంపైనా చర్చ సాగే అవకాశముంది. కాగా, తాత్కాలిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సమావేశాల నేపథ్యంలో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఈ లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. -
పౌరసత్వం దిశగా హెచ్1బీ
వాషింగ్టన్: విధాన ప్రక్రియలో సరళత్వం, స్థిర నివాసానికి సంబంధించి కచ్చితమైన హామీతో పాటు పౌరసత్వానికి వీలు కల్పించేలా హెచ్1బీ వీసా విధానంలో త్వరలో సమూల సంస్కరణలు తీసుకురాబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సమర్ధత కలిగిన, అత్యంత నైపుణ్యవంతులు అమెరికాలో ఉద్యోగాలు చేయడాన్ని ప్రోత్సహించేలా కొత్త నిబంధనలు ఉంటాయన్నారు. ‘హెచ్–1బీ వీసాదారులు నిశ్చింతగా ఉండొచ్చు. పౌరసత్వం, స్థిర నివాసం సహా మీకు ప్రయోజనం కల్పించే పలు మార్పులు త్వరలోనే రాబోతున్నాయి. ప్రతిభావంతులను మేం ప్రోత్సహించాలనుకుంటున్నాం’ అని శుక్రవారం ట్వీట్ చేశారు. హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారిలో అధికులు భారతీయ ఐటీ నిపుణులే కావడం గమనార్హం. ట్రంప్ ప్రకటన అమెరికా గ్రీన్‌కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వేలాది భారతీయులకు శుభవార్తేనని భావిస్తున్నారు. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి రెండేళ్ల పాటు హెచ్–1బీ నిబంధనలను కఠినతరం చేయాలని పట్టుబట్టడం తెలిసిందే. అయితే ఇటీవలి కొద్ది కాలంగా ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తాము ప్రోత్సహిస్తామనీ, మిగతా వలసలను బాగా తగ్గిస్తామని ట్రంప్ చెబుతున్నారు. హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్న వాళ్లలో అత్యుత్తములనే ఎంపిక చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని గత నెలలో హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగ మంత్రి కిర్‌స్టెన్ నీల్సెన్ చట్టసభ్యులకు తెలిపారు. ఉద్యోగ ఆధారిత వీసా మోసాలను గుర్తించి నిరోధించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసిందనీ, అమెరికన్ ఉద్యోగుల హక్కులను కాపాడాలంటే వలసయేతర వీసాల్లో సంస్కరణలు అవసరమన్నారు. భారతీయ వీసాదారుల హర్షం ట్రంప్ ప్రకటనపై పలువురు భారతీయ హెచ్–1బీ వీసాదారులు హర్షం వ్యక్తం చేశారు. ‘మాకు ఆశ కనిపిస్తోంది ప్రెసిడెంట్ సర్. కొండలా పేరుకుపోయిన గ్రీన్‌కార్డు దరఖాస్తులను మీరు త్వరగా పరిష్కరిస్తే అదే మాకు సంతోషం. అప్పుడు మీరే పది లక్షల మంది భవిష్యత్ పౌరులకు నిర్వివాదంగా నాయకులవుతారు’ అని అమెరికాలో పనిచేస్తున్న జ్యోత్స్న శర్మ అనే ఓ భారతీయ ఉద్యోగిని ట్వీట్ చేశారు. చట్టబద్ధ వలసదారులమైన తాము అమెరికా ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఎంతో సహకరిస్తున్నామని మనోజ్ అనే మరో టెకీ ట్వీట్ చేశారు. ట్రంప్ మాటలు నిజమైతే మంచిదేగానీ ఇప్పటి నుంచే ఆశలు పెట్టుకోవద్దని ఒబామా కాలంలో హెచ్–1బీ అధికారిగా పనిచేసిన ఒకరు హెచ్చరించారు. -
పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ఆ 3 దేశాల్లో వేధింపులు, హింసకు గురై భారత్‌కు వలసొచ్చే హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం ఇవ్వాలని ఇందులో ప్రతిపాదించారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అసోంలో నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సభ్యుల ఆందోళనల మధ్యే హోం మంత్రి రాజ్‌నాథ్..పౌరసత్వ(సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆయా దేశాల్లోని ముస్లిమేతర పౌరులకు భారత్‌లో తప్ప మరోచోట స్థానం దొరకడంలేదని తెలిపారు. వలసొచ్చే పౌరుల భారాన్ని అసోంపైనే మోపమని, దేశమంతా పంచుకుంటుందని పేర్కొన్నారు. ఈ విషయం లో అసోంకు అన్ని విధాలా కేంద్రం సహకరిస్తుందని అన్నారు. నిశితంగా పరిశీలించిన తరువాత జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తేనే వారికి పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ వాకౌట్ చేసింది. తాజా బిల్లు ఓటుబ్యాంకు రాజకీయాల వికృత రూపమని తృణమూల్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. పౌరసత్వం పొందేందుకు భారత్‌లో కనీస నివాస కాలాన్ని 12 ఏళ్ల నుంచి ఆరేళ్లకు కుదిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. లబ్ధిదారులు దేశం లోని ఏ రాష్ట్రంలోనైనా నివాసం ఏర్పర్చుకోవచ్చు. బిల్లుకు నిరసనగా ఎన్డీయే కూటమి నుంచి అసోం గణపరిషత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. సీబీఐ పరిణామాలపై చర్చించాలని విపక్షం పట్టుపట్టడంతో రాజ్యసభ కార్యకలాపాలు మంగళవారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రాజ్యసభ కార్యకలాపాల్ని ఒకరోజు పొడిగించారు. దీంతో మంగళవారం ముగియాల్సిన సెషన్ బుధవారం కొనసాగుతుంది. -
దిమ్మతిరిగిపోయే హైకోర్టు తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : ‘హిందువులంతా సహజంగానే భారత పౌరులు’ అనే ఆరెస్సెస్ నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఆర్ సేన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగిపోయే తీర్పును వెలువరించారు. ‘2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, పార్శీలు, క్రైస్తవులు, ఖాసీలు, జెంటియాలు, గారోలులకు భారత పౌరసత్వం మంజూరు చేయండి’ అంటూ తీర్పు చెప్పారు. ఇప్పటికే భారత్‌లో శాశ్వత నివాసం ఉంటున్న వీరికే కాకుండా భవిష్యత్తులో భారత్‌కు వచ్చే ఈ జాతులకు చెందిన వారందరికి భారత పౌరసత్వం మంజూరు చేయాల్సిందేనన్నారు. వీరంతా కూడా హిందువుల కిందకే వస్తారని పరోక్షంగా చెప్పారు. బహూశ హిందూ ఓ మతం కాదని, అది ఓ జీవన విధానమన్న బీజేపీ విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేసినట్లున్నారు. ఆ మాటకొస్తే ఆరెస్సెస్ చెప్పే చరిత్ర ప్రకారం ‘అఖండ్ భారత్’ అంటే అఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు కూడా వస్తాయని అన్నారు. ఆ మాటకొస్తే ఆ దేశాల పౌరులకు కూడా పౌరసత్వం మంజూరు చేయాల్సి ఉంటుందన్న హెచ్చరిక కాబోలు! అంతేకాకుండా తానిచ్చిన ఈ తీర్పు ప్రతిని ప్రధాన మంత్రి, కేంద్ర న్యాయ, హోం మంత్రులకు కూడా పంపించాలని సూచించారు. తాము పుట్టిన నేల, తాము పూర్వికులు నమ్ముకున్న నేల భారత్ అయినప్పుడు అందరికి పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ చెప్పారు. ఈ దేశం నుంచి పాకిస్థాన్ మతం ప్రాతిపదికన విడిపోయి ఇస్లామిక్ రాజ్యాంగ ప్రకటించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ అప్పుడే భారత్ కూడా తమది ‘హిందూ’ రాజ్యమని ప్రకటించుకొని ఉండాల్సిందని, లౌకిక రాజ్యం కనుక భారత్‌లోని అన్ని మతాల వారికి పౌరసత్వ హక్కు ఉంటుందన్నారు. భారత గడ్డపై స్థిర నివాసం ఏర్పరుచుకొని, భారతీయ చట్టాలను గౌరవిస్తున్న ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనన్నారు. 2016లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలోని ముస్లిం మతస్థుల ప్రస్తావన కూడా లేని విషయాన్ని ఆయన దష్టిలో పెట్టుకున్నట్లుంది. భారతీయ పౌరులెవరో తేల్చడానికి అస్సాంలో సవరించిన పౌరసత్వ జాబితాలో గల్లంతయిన 40 లక్షల మందికి కూడా పౌరసత్వం ఇవ్వాల్సిందేనని జస్టిస్ సేన్ పరోక్షంగా సూచించారు. బంగ్లా ముస్లింలుగా భావిస్తున్న వారంతా బెంగాల్ నుంచి వచ్చినవాల్లేనని, బెంగాల్ పలు సార్లు హింసాకాండతో విడిపోయిందని, ఫలితంగా శరణార్థులు భారత్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన చరిత్ర పుటల్లోని పలు అంశాలను ప్రస్తావించారు. అస్సాం దురాక్రమణ గురించి, బెంగాల్ విభజన, బంగ్లాదేశ్ యుద్ధం తదితర అనేక అంశాలను ఆయన గుర్తు చేశారు. చరిత్రకు సంబంధించి కోర్టు నియమించిన కమిటీలు సమర్పించిన వివిధ నివేదికల్లోని అంశాలను ప్రస్తావించారు. పాకిస్థాన్ విడిపోయినప్పుడు భారత్ తనది ‘హిందూ’ దేశంగా ప్రకటించుకొని ఉండాల్సిందన్న సేన్ వ్యాఖ్యలపై సీపీఎం నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ జడ్జీని తొలగించాల్సిందిగా డిమాండ్ చేసింది. దీనిపై కూడా జస్టిస్ సేన్ స్పందిస్తూ ‘నేను లౌకిక వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాను. మత పరమైన వేధింపులకు, దాడులకు గురైన వారికి న్యాయం జరగాలన్నదే నా అభిమతం’ అని చెప్పారు. -
ట్రంప్ ప్రమాదకర పోకడలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వింత పోకడలకు పోతున్నారు. తన పాలన బ్రహ్మాండంగా ఉందనుకుంటే చేసిన ఆ మంచి పనులేమిటో చెప్పి ఓట్లడగాలి. ఎన్ని రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించామో లెక్కలు చూపాలి. చిత్తశుద్ధిగల పాల కులు చేసే పని అది. కానీ ట్రంప్ ఇందుకు విరుద్ధంగా వేరే దేశాలనుంచి వచ్చినవారిని, రాబోయే వారిని బూచిగా చూపుతున్నారు. వారి నుంచి దేశాన్ని కాపాడటమే తన కర్తవ్యమన్నట్టు మాట్లాడు తున్నారు. అమెరికా గడ్డపై పుట్టినవారికి సహజంగా లభించే పౌరసత్వాన్ని ఇకపై రద్దు చేస్తానని, అందుకోసం డిక్రీ జారీచేయడానికి సిద్ధమని రెండురోజులక్రితం ఆయన ప్రకటించి వలసవచ్చిన వారిలో గుబులు పుట్టించారు. 150 ఏళ్లనాటి ఆ చట్టాన్ని అధ్యక్ష డిక్రీ ద్వారా మార్చడం అసాధ్య మని, అందుకు రాజ్యాంగ సవరణే మార్గమని నిపుణులు చెబుతున్నారు. అలాగే మధ్య అమెరికా దేశాలైన ఎల్‌సాల్వెడార్, హోండూరస్, గ్వాటెమాలా తదితర ప్రాంతాలనుంచి అమెరికాలో ఆశ్ర యం పొందడానికి బయల్దేరినవారిపై ట్రంప్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. వారంతా కలిసి 4,000మందికి మించరు. వారేమీ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే ఉద్దేశంతో రావడం లేదు. అమెరికా చట్టాల్లో, అంతర్జాతీయ చట్టాల్లో ఉన్న నిబంధనల పరిధిలో తగిన కారణాలు చూపితేనే వారికి దేశంలో ప్రవేశం లభిస్తుంది. కానీ వారంతా దేశంపై దండయాత్రకొస్తున్నారన్నంత స్థాయిలో భయాందోళనలు సృష్టించి, వారిని ఆపడం కోసం అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి హుటాహుటీన 15,000మంది సైన్యాన్ని పంపుతున్నట్టు వాణిజ్య ప్రకటన విడుదల చేశారు. ఇందులోని పదజాలం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అమెరికాను తొలిసారిగా ట్రంపే రక్షించడానికి పూనుకు న్నాడని జనం అనుకోవడమే ఆయన లక్ష్యం. ఇంతా చేస్తే మధ్య అమెరికా దేశాలనుంచి వచ్చేవారు ఇంకా వేల కిలోమీటర్ల ఆవల ఉన్నారు. వారంతా రావడానికి పక్షం రోజులపైనే పడుతుంది. పైగా ఇలా వచ్చేవారిని నియంత్రించడం కోసం సరిహద్దులకు దళాలను తరలించడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి భారీ సంఖ్యలో పంపుతున్నారు. సెనికులు ఎంత మంది ఉన్నా వారు చేసేదల్లా కస్టమ్స్ సిబ్బందికి, సరిహద్దుల్లో పహారాకాసే సిబ్బందికి తోడ్పాటునందించడమే. ఆశ్రయం ముసు గులో మనుషుల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల చేరవేత వంటివి ఏమైనా ఉన్నాయా అని చూడటం, అటువంటివారు దొరికితే ఆయా దేశాలకు సమాచారం ఇచ్చి వారికి అప్పగిస్తారు. తమ న్యాయబద్ధమైన హక్కును హరిస్తున్నారని భావించిన వలసదారులెవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. దీనికి ముందు ట్రంప్ మరో బాంబు పేల్చారు. దేశంలోకి అక్రమంగా వచ్చినవారుగాని, తాత్కాలిక అవసరాల కోసం, ఉద్యోగాల కోసం వచ్చినవారుగాని ఇక్కడ పిల్లల్ని కంటే ఆ పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వ హక్కును ఇకపై రద్దు చేయాలని అనుకుంటున్నట్టు ఆయన ప్రక టించారు. ఇది ప్రపంచంలో మరెక్కడా లేదని, అమెరికాలో మాత్రం ఎందుకుండాలని ఆయన ప్రశ్నించారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణ ఈ హక్కు కల్పిస్తోంది. దాన్ని తొలగించా లంటే ఆ అధికరణను సవరించడమే మార్గం తప్ప పాలనాపరమైన డిక్రీ ద్వారా అది సాధ్యపడదు. పైగా ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ తరహా హక్కు లేదని చెప్పడం జనాన్ని పక్కదోవపట్టించ డమే. బ్రెజిల్, అర్జెంటినా, మెక్సికో దేశాలతోపాటు దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాలన్ని టిలో, కెనడాలో–మొత్తం 33 దేశాల్లో ఇలాంటి చట్టాలున్నాయి. కాకపోతే వీటిలో అమెరికా, కెనడా మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలు. ఈ చట్టాలకింద అమెరికాలో ఏటా దాదాపు పది లక్షలమంది పౌరసత్వాన్ని పొందుతుంటే, కెనడాలో రెండున్నర లక్షలమందికి వీటి ద్వారా పౌరసత్వం లభి స్తుంది. నిజానికి ట్రంప్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఈ పౌరసత్వ హక్కు చట్టాన్ని గురించి ప్రస్తావించారు. తాను అధ్యక్షుణ్ణయితే రద్దు చేస్తానని చెప్పారు. అయితే మధ్యంతర ఎన్ని కల సమయంలో వాడుకోవడం కోసం దాన్ని దాచిపెట్టినట్టున్నారు. నిజానికి ఈ రెండేళ్లలోనూ ట్రంప్ కొద్దో గొప్పో సాధించారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. భారీ మొత్తంలో పన్ను కోతనూ అమలు చేశారు. నిరుద్యోగిత తగ్గింది. కానీ ఈ నిర్ణయాలు అనుకున్న స్థాయిలో ప్రజల్లో ఆయనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించలేకపోయాయి. అందుకు కారణముంది. స్వల్పా దాయ వర్గాలకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించే ‘ఒబామా కేర్’ను నీరుగారుస్తున్న తీరు జనంలో ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. పోనీ రంగంలో బలమైన ప్రత్యర్థి ఉంటే వారిపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేయొచ్చు. ఇవి అధ్యక్ష ఎన్నికలు కాదు గనుక ఆ అవకాశం లేదు. అందుకే ఏం చేయాలో తోచక ఆయన వలసదారులపై పడ్డారు. అయితే ట్రంప్ వ్యూహం అత్యంత ప్రమాదకరమైనది. ఈ చర్య శ్వేత జాతి అమెరికన్లలో ఇత రులపై అకారణ ద్వేషాన్ని రగిల్చి అవాంఛనీయ ఘటనలకు పురికొల్పుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన వర్గాలను పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఆయన ఈ ఎత్తుగడవేశారు. ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు, సెనేట్‌లోని 35 స్థానాలకు ఈ నెల 6న జరగబోయే మధ్యం తర ఎన్నికల్లో ఇప్పటికైతే డెమొక్రాట్లు రిపబ్లికన్లకంటే 8 శాతం ఆధిక్యతతో ఉన్నట్టు సర్వేలు చెబు తున్నాయి. ప్రతి సర్వేకూ డెమొక్రాట్ల బలం అంతకంతకు పెరుగుతున్నదని గణాంకాలు చెబు తున్నాయి. అయితే వీటితోపాటు జరిగే స్థానిక ఎన్నికల ప్రభావం వల్ల రిపబ్లికన్లు ఉభయసభ ల్లోనూ ఎంతో కొంత మెరుగ్గా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. ఏదేమైనా గెలుపుకోసం సమాజంలో అనవసర విద్వేషాలను రగల్చడం, అబద్ధాలను ప్రచారం చేయడం ట్రంప్‌కు తగని పని. ఇలాంటి నాయకుడిపై అమెరికా ప్రజలు ఈ మధ్యంతర ఎన్నికల్లో అంతిమంగా ఏ తీర్పు ఇస్తారో చూడాలి. -
పుట్టుకతో పౌరసత్వం ప్రశ్నార్థకం!
పై చదువుల కోసమో, బతుకుదెరువు కోసమో, లేదా జీవన ప్రమాణాల్లో మెరుగుకోరుకునో.. పలు వీసాల ద్వారా ప్రతియేటా ఆశల రెక్కలు తొడుక్కొని అమెరికాలో అడుగుపెడుతోన్న వేలాది మంది భారతీయుల కడుపున బిడ్డలుపుడితే.. ఆ బిడ్డల పౌరసత్వ హక్కుకు విఘాతం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన ప్రతిబిడ్డకీ వర్తించే పౌరసత్వ హక్కు రాజ్యాంగబద్దమైనది కాదనీ, పుట్టుకద్వారా సంక్రమించే హక్కుని ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తేలేదని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ఇప్పుడు భారతీయుల్లో ఆందోళన నెలకొంది. అమెరికా సహా కెనడా, మెక్సికోలాంటి మొత్తం 35 దేశాల్లో అమలులో ఉన్న పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కుని రద్దు చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు భారతీయులంతా అమెరికా రాజ్యాంగంలోని 14 సవరణపై దృష్టిసారించారు. 14వ సవరణ ఏం చెబుతోంది? 1968లో అమెరికా రాజ్యాంగానికి 14వ సవరణ చేపట్టారు. ఇతర దేశాల దౌత్యాధికారులు మినహా మిగతా వారికి అమెరికా గడ్డపై పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుందని 14వ సవరణ చెబుతోంది. తల్లిదండ్రుల పౌరసత్వ స్థితి, జాతీయతతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకీ (తల్లిదండ్రులు దౌత్యాధికారులు కానంతవరకు) ఇది వర్తిస్తుంది. ఈ వెసులుబాటు వల్లనే భారతీయ సంతతికి చెందిన వేలాది మంది గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా అమెరికా పౌరసత్వాన్ని హక్కుగా పొందగలిగారు. అమెరికాలో పుట్టిన వాళ్ళంతా అమెరికన్లే. ‘‘ఇండియన్ అమెరికన్’’లో ‘‘ఇండియన్’’ అనేది కేవలం గుర్తింపుకోసమే వాడుతున్నారు. వృత్తిరీత్యా అమెరికాకి వెళ్ళిన భారతీయులు, తదనంతర కాలంలో అమెరికా గర్వించదగ్గ వ్యక్తులుగా గౌరవాన్ని అందుకున్నారు. వారి సేవలకిప్పుడు గుర్తింపేలేదా? అన్న ప్రశ్న భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరులను తొలచేస్తోంది. ట్రంప్ అనుమానిస్తున్నట్టుగా ఏ ఒక్కరూ కూడా కేవలం అమెరికా పౌరసత్వం కోసం అమెరికాలో బిడ్డని కనరనీ, ప్రకృతి సహజసిద్ధమైన చర్యకు అమెరికా రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటుని ఇకపై లేకుండా చేయడం అమానవీయమనీ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోకి పెరిగిపోతోన్న వలసలను అరికట్టే ఉద్దేశ్యంతోనే పుట్టుకద్వారా సంక్రమించే పౌరసత్వ హక్కుని ట్రంప్ ఆక్షేపిస్తున్నట్టు ఆయన విధానాలను సమర్థిస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు. అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వలసవచ్చిన వారి పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వహక్కును మాత్రమే ఇది తిరస్కరిస్తుందన్న వాదనకూడా ఉంది. అయితే అమెరికాలో పుట్టిన వాళ్ళందరికీ వర్తించే ఈ హక్కుని పూర్తిగా తొలగించాలన్న భావం చాలా మందిలో ఉండడం గమనార్హం. ఏ దేశాల్లో ఎలా ఉంది బిడ్డ ఏ దేశంలో పుడితే ఆ దేశ పౌరుడిగా గుర్తించే సంప్రదాయం అమెరికా, కెనడా సహా మొత్తం 35 దేశాల్లో అమలులో వుంది. దీనినే జస్ సోలీ అని పిలుస్తారు. ఇక మిగిలిన దేశాల్లో పిల్లలు పుట్టిన దేశం ఆధారంగా కాకుండా వారి తల్లిదండ్రుల పౌరసత్వం ఆధారంగా పిల్లలు ఏ దేశ పౌరులో నిర్ణయిస్తారు. దీనిని జస్ సాంగ్వినీస్ అని పిలుస్తారు. భారత్, పాకిస్తాన్‌తోపాటు ఆస్ట్రేలియా, పోలాండ్‌లు సహా అత్యధిక దేశాల్లో జస్ సాంగ్వినీస్ విధానాన్నే అవలంబిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు చాలు వాషింగ్టన్: కీలక మధ్యంతర ఎన్నిక ల వేళ వలస విధానంపై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. దేశంలో అమెరికాయేతర దంపతులకు పుట్టే బిడ్డలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వాన్నిచ్చే హక్కును రద్దుచేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తాజాగా చెప్పారు. రద్దుకు రాజ్యాంగ సవరణ అక్కర్లేదని, ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు సరిపోతుందన్నారు. ‘జన్మతః పౌరసత్వ హక్కు రద్దుకు సుదీర్ఘ ప్రక్రియ అనవసరం. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. పార్లమెంట్లో సాధారణ ఓటింగ్ సరిపోతుంది. అయితే ఈ వ్యవహారాన్ని అంతిమంగా సుప్రీంకోర్టు తేల్చుతుంది’ అని ట్రంప్ అన్నారు. -
జన్మతః ఇచ్చే పౌరసత్వం రద్దు!
వాషింగ్టన్: వరుస వలస సంస్కరణ నిర్ణయాలతో గుబులు పుట్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో తీవ్ర నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. అమెరికా పౌరులు కానివారు, అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతః ఇచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలని యోచిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే ఆయన ఈ హామీనిచ్చినా, అమెరికాలో త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను ఆయన మళ్లీ తెరపైకి తెచ్చారు. అమెరికా పౌరులకు కాకుండా ఇతర దేశస్తులకు అమెరికాలో జన్మించే పిల్లలకు పౌరసత్వాన్ని ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితి, పౌరసత్వంతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికా పౌరులే అవుతారు. ఈ నిబంధనను మార్చి, అమెరికా పౌరసత్వం ఉన్న వారికి పుట్టే బిడ్డలను మాత్రమే అమెరికా పౌరులుగా గుర్తించేలా ఆదేశాలిచ్చేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. ‘అమెరికాలో పుట్టే ఇతర దేశాలవారి పిల్లలందరికీ అమెరికా పౌరసత్వం ఇచ్చే నిబంధనను రద్దు చేయాలనుకుంటున్నాను’ అని ట్రంప్ వెల్లడించారు. రాజ్యాంగం నుంచి ఆ నిబంధనను తొలగించడం సులభం కాదనీ, ట్రంప్ ఆదేశాలను అమెరికా కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుందనీ, కోర్టు కూడా ఇందుకు ఒప్పుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
కేసుల ఎఫెక్ట్.. పౌరసత్వాన్ని కొనేశాడు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి కరీబియన్ ఐలాండ్ ఆంటిగ్వా పౌరసత్వం లభించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఇక్కడి నుంచి అక్కడికి పారిపోయిన చోక్సీ ముందుగా ఆంటిగ్వా శరణుకోరారు. ఆ తర్వాత పౌరసత్వాన్నే కొనుక్కున్నారు. ఇక్కడ పౌరసత్వం కొనుక్కోవడం అంటే ఆ దేశంలో వ్యాపారం పేరిట కొంత నిర్ణీత సొమ్మును పెట్టుబడిగా పెట్టడం. ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పౌరసత్వాన్ని పెట్టుబడుల రూపంలో కొనుక్కునే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల పౌరసత్వం కావాలంటే కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. కరీబియన్ ఐలాండ్‌లో చాలా సులభంగా పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు. ఆంటిగ్వా, బార్బుడా లాంటి కరీబియన్ దేశాల్లో 25 వేల అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టి, ఐదేళ్ల కాలంలో ఐదు రోజులుంటే తక్షణమే పౌరసత్వం, పాస్‌పోర్టు అభిస్తుంది. అదే ఆస్ట్రేలియాలో పౌరసత్వం రావాలంటే 50 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి ఏడాదికి 40 రోజులు నివాసం ఉంటే ఐదేళ్లకాలానికి పౌరసత్వం, పాస్‌పోర్టు లభిస్తుంది. అదే కెనెడా దేశంలో ఐదు లక్షల కెనడా డాలర్లను పెట్టుబడులుగా పెడితే ఐదేళ్ల కాలానికి 730 రోజులు నివాసం ఉంటే మూడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది. ఇక అమెరికాలో ఐదు లక్షల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి ఏడాదికి 180 రోజులు నివాసం ఉంటే ఏడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది. -
ఇండియానే క్లీన్ చిట్ ఇచ్చింది
న్యూఢిల్లీ: తాము విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీకి భారత్ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఆ తరువాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని ఆంటిగ్వా ప్రభుత్వం వెల్లడించింది. చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ వాంటెడ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2017 మేలో పౌరసత్వం కోసం చోక్సీ దరఖాస్తు చేసుకోగా, భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్లీన్ చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొంది. తర్వాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో మోదీ ప్రభుత్వ తీరు తేటతెల్లమవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. అసలేం జరిగింది... ఆంటిగ్వా అండ్ బార్బుడా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ యూనిట్ (సీఐయూ) చోక్సీకి సంబంధించి స్థానిక మీడియాకు విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో పలు వివరాలు వెల్లడించింది. ‘2018 జనవరి మొదటి వారంలో చోక్సీ భారత్‌ను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 2017 మేలో చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పలు విచారణలు చేసి అన్నింటిలో క్లీన్ చిట్ వచ్చాకే కిందటేడాది నవంబర్‌లో దాన్ని ఓకే చేశాము. ఇందుకోసం ఆయన ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద రూ.1.3 కోట్లు చెల్లించారు. అంతేకాదు ఈ ఏడాది జనవరి 15న ఆయన ఆంటిగ్వా పౌరుడిగా విధేయతా ప్రమాణం చేశారు. ఇది జరిగిన 15 రోజుల తరువాత అంటే జనవరి 29న కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ) నీరవ్ మోదీ, చోక్సీపై కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది. చోక్సీ ప్రస్తుతం మా దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేం’ అని వివరించింది. ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయడంలో పొరపాటు జరగలేదని పేర్కొంది. ఆయనకు మంజూరు చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని, ఆయన ప్రస్తుతం ఆంటిగ్వా చట్టాల రక్షణలో ఉన్నారని తెలిపింది. ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనే మాట్లాడుతూ తన చేతులు కట్టేసి ఉన్నాయన్నారు. చోక్సీకి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? చోక్సీపై పలు ఫిర్యాదులుండగా విదేశీ వ్యవహారాల శాఖ క్లీన్ చిట్ ఎలా ఇచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ ఉదంతం దోపిడీదారుల పట్ల మోదీ ప్రభుత్వ తీరును తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏప్రిల్‌లో ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనేని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అప్పట్లో కేసుల్లేవు కాబట్టే పీసీసీ ఇచ్చాం ఆంటిగ్వా ప్రభుత్వం విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీపై కేసులేం లేవని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముంబై పాస్‌పోర్టు కార్యాలయం అప్పటి పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు (పీవీఆర్)ను అనుసరించి 2016 మార్చి 16న చోక్సీకి క్లీన్ చిట్ ఇచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అప్పటికి అతనిపై కేసులేం లేనందున అతనికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇచ్చారని తెలిపారు. చోక్సీకి సంబంధించి తామేం క్లీన్ చిట్ ఇవ్వలేదని, అసలు ఆంటిగ్వా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని, తాము వారికి ఏ సమాచారం ఇవ్వలేదని సెబీ తెలిపింది. -
మాజీ రాష్ట్రపతి బంధువులకు లభించని పౌరసత్వం
గువాహటి : అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు(ఎన్నార్సీ) తుది ముసాయిదాను కేంద్రం సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 40 లక్షల మందికి ఆ జాబితాలో చోటు లభించలేదు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు, సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్సీ ముసాయిదా నుంచి 40 లక్షల మందిని తప్పించడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘సొంతగడ్డపై భారతీయులే శరణార్థులయ్యారు’ అని పేర్కొన్నారు. బీజేపీ విభజించు పాలించు సిద్దాంతాన్ని పాటిస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఇలా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాజీ రాష్ట్రపతి బంధువులకు దక్కని చోటు.. సోమవారం విడుదల చేసిన పౌరసత్వ జాబితాలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువులకు చోటు లభించలేదు. ఆయన సోదరుడు ఇక్రాముద్దీన్ అలీ కుమారుడు జియాద్దీన్ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో లేవు. అస్సాంలోని కామ్రూప్ జిల్లాలోని రాంగియాకు చెందిన జియాద్దీన్ కుటుంబానికి పౌరసత్వ జాబితాలో చోటు లభించకపోవడంపై వారిలో ఆందోళన నెలకొంది. జియాద్దీన్ మాట్లాడుతూ.. ‘నేను ఫక్రుద్దీన్ అలీ బంధువును.. మా కుటుంబ సభ్యుల పేరు ఎన్నార్సీ ప్రకటించిన జాబితాలో లేకపోవడంతో ఆశ్చర్యపోయాం. మాకు చిన్నపాటి ఆందోళన ఉంద’ని తెలిపారు. కాగా, భారత ఐదవ రాష్ట్రపతిగా సేవలందించిన ఫక్రుద్దీన్ పదవిలో ఉన్నప్పుడే మరణించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేశ్ మాత్రం జబితాలో పేరు లేని వారు తమ అభ్యర్థనను లేఖ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగిందన్నారు. ఇది తుది జాబితా కాదని పేర్కొన్నారు. బాధితుల్లో చాలా మంది తమ దగ్గర అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ పౌరసత్వం కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి బంధువులకు కూడా ఈ జాబితాలో చోటు లభించకపోవడం ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
నేషనల్ అ‘టెన్షన్’..‘అస్సాం రిజిస్టర్’
గువాహటి/న్యూఢిల్లీ: అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. గువాహటిలో సోమవారం భారత రిజిస్ట్రార్ జనరల్ శైలేశ్.. ఎన్నార్సీ ముసాయిదా వివరాలను వెల్లడించారు. ‘భారత్, అస్సాం చరిత్రలో ఇదో చరిత్రాత్మకమైన రోజు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఓ అద్భుతమైన న్యాయ ప్రక్రియ’ అని ఈయన పేర్కొన్నారు. అయితే ఇది తుది ముసాయిదా మాత్రమేనని మిగిలిన వారికీ తమ అభ్యంతరాలను వెల్లడించే అవకాశం ఇస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఇది ఓటుబ్యాంకు కోసం కేంద్రం చేసిన ప్రయత్నమని విపక్షాలు మండిపడుతున్నాయి. బహిరంగపరచలేం! 40 లక్షల మంది పేర్లను జాబితాలో ప్రచురించకపోవడంపై ఎన్నార్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్ హజేలా మాట్లాడుతూ.. ‘మేం ఎంచుకున్న ప్రక్రియను బహిరంగంగా చెప్పలేం. ఎన్నార్సీ సేవా కేంద్రాలను సందర్శించి తమ దరఖాస్తుల తిరస్కరణకు కారణాలు తెలుసుకోవచ్చు’ అని పేర్కొన్నారు. నాలుగు కేటగిరీల (అనుమానాస్పద ఓటర్లు, వారి వంశస్థులు, విదేశీయుల ట్రిబ్యునల్స్‌లో రిఫరెన్సులు పెండింగ్‌లో ఉన్నవారు, వీరి వంశస్థులు)కు సంబంధించిన ప్రజల అర్హతను సుప్రీంకోర్టు పక్కనపెట్టడంతో తుది ముసాయిదాలో వీరెవరికీ చోటు దక్కలేదన్నారు. ‘దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించేందుకు చాలినంత సమయముంది’ అని పేర్కొన్నారు. ‘తుది జాబితాలో లేని వారిని మేం భారతీయులుగానో, భారతీయేతరులుగానో పిలవడం లేదు. వీరిపై వెంటనే ఓ నిర్ణయానికి రాలేం’ అని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ఇది ప్రజావిజయం: సోనోవాల్ ఎన్నార్సీ విడుదల సందర్భంగా అస్సాం ప్రజలకు ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చరిత్రాత్మక రోజు ఎప్పటికీ రాష్ట్ర ప్రజల స్మృతిపథంలో మిగిలిపోతుందని ప్రశంసించారు. జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని వారికున్న అన్ని అవకాశాలను సమీక్షిస్తామని ముసాయిదా విడుదల అనంతరం సోనోవాల్ వెల్లడించారు. ఎన్నార్సీ పారదర్శకం: రాజ్‌నాథ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగానే ఎన్నార్సీని రూపొందించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. జాబితాలో పేర్లు లేనివారు భారత జాతీయతను నిరూపించుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ‘ఎవరిపైనా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోం. మీరెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇది కేవలం తుది ముసాయిదానే. తుది జాబితా కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. జాబితాలో పేర్లు లేనివారు విదేశీయుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. డిసెంబర్ 31వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పార్లమెంటులో నిరసన ఎన్నార్సీ ముసాయిదా విడుదలపై పార్లమెంటులో విపక్షాలను నిరసన తెలిపాయి. కాంగ్రెస్, తృణమూల్, ఎస్పీ సహా పలువురు విపక్ష సభ్యులు రాజ్యసభలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం సభలో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ వివరణ ఇస్తూ.. ‘ఈ ప్రక్రియలో కేంద్రం ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ముసాయిదా’ అని పేర్కొన్నారు. ఎన్నార్సీ విడుదల విషయంలో కేంద్రం చాలా ఆలస్యంగా స్పందించిందని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కనీసం సమస్య పరిష్కారంలోనైనా వేగంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా మంది భారతీయులకు ఈ జాబితాలో చోటు దక్కలేదని రాహుల్ విమర్శించారు. ఎన్సార్సీ ముసాయిదా నుంచి 40 లక్షల మందిని తప్పించడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘సొంతగడ్డపై భారతీయులే శరణార్థులయ్యారు’ అని పేర్కొన్నారు. 40 లక్షల మంది భవితవ్యమేంటి? అస్సాం జాతీయ పౌర గుర్తింపు తుది ముసాయిదాలో 40 లక్షల మందికి చోటు దక్కకపోవడంతో అస్సాంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వం లభించని వాళ్లంతా ఓటు హక్కుని కోల్పోతారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందవు. సొంతంగా ఆస్తుల్ని కొనుక్కొనే వీలుండదు. ఇప్పటికే సొంత ఆస్తులు ఉన్నవారిపై దాడులు జరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలను వెనక్కి పంపేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలు ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. ఇప్పటికే అస్సామీ భాష మాట్లాడే బ్రహ్మపుత్ర లోయ, బెంగాలీ మాట్లాడే బారక్ వ్యాలీ మధ్య విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే ముసాయిదాలో చోటు లభించని వాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్రం అంటోంది. ఎన్నార్సీ కేంద్రాల్లో ఫిర్యాదు చేయొచ్చనీ.. అదీ కాకపోతే విదేశీ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసుకోవచ్చని సూచిస్తోంది. అయితే ట్రిబ్యునల్ తీర్పులు ఎన్నాళ్లకొస్తాయో చెప్పలేని పరిస్థితి. వీరిని ఎక్కడుంచాలి? ఇప్పటికే అస్సాంలో నివసిస్తున్న దాదాపు వెయ్యిమందిని ఈ ప్రత్యేక కోర్టులు విదేశీయులుగా ప్రకటించాయి. వారిలో బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. వారందరినీ ఇప్పటికే అరడజనకు పైగా శరణార్థి శిబిరాల్లో ఉంచారు. ట్రిబ్యునల్స్ కూడా వీరిని విదేశీయులుగా గుర్తిస్తే వారిని బంగ్లాదేశ్‌కు పంపాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అనేకసార్లు భారత ప్రభుత్వం ఇలాంటి విదేశీయుల్ని తిప్పిపంపించడానికి ప్రయత్నించగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించలేదు. బంగ్లాదేశ్‌తో మనకు శరణార్థుల అప్పగింతకు సం బంధించిన ఒప్పందాలేమీ లేవు. కొత్త శరణార్థులకు చోటు కల్పించలేమని బంగ్లాదేశ్ చేతులెత్తేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ 40 లక్షల మంది శరణార్థుల్ని ఎక్కడ ఉంచాలన్నది కేంద్రం ముందున్న సవాల్. 3డీ ఫార్ములా ఈ ఒప్పందం ప్రకారం ‘3డీ’ ఫార్ములా (డిటెక్షన్ (గుర్తింపు), డిలీషన్ (తొలగింపు), డిపోర్టేషన్(బంగ్లాకు పంపించేయడం)) అమలుచేయాలని నిర్ణయించారు. 1951–61 మ«ధ్య దేశంలోకి వచ్చినవారికి ఓటు హక్కుతో కూడిన పౌరసత్వం ఇస్తారు. 1961–71 మధ్య వచ్చిన వారికి భారత పౌరసత్వం ఉంటుంది. కానీ ఓటు హక్కుండదు. 1971 మార్చి 24 తర్వాత సరైన పత్రాల్లేకుండా ప్రవేశించిన వారిని వెనక్కి పంపించేయాలి. అయితే ఎన్నో సవాళ్ల మధ్య ఎన్నార్సీ రూపకల్పన ఆలస్యమవుతూ వచ్చింది. అసోంలో నిరసనకారులు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ అసోం గణ పరిషత్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఈ ప్రక్రియను చేపట్టడంలో విఫలమైంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సగం సగమే ఈ పని చేసింది. పౌరసత్వ గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పిల్ వేయడంతో సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. ఎన్నార్సీ వెనక ప్రతీక్ హజేలా ఎన్ఆర్సీ ముసాయిదా జాబితా రూపొందించడంలో అసోం హోం శాఖ ప్రధాన కార్యదర్శి ప్రతీక్ హజేలా పాత్ర కీలకం. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ చేసి, ఐఏఎస్ అయిన ప్రతీక్ ఎన్నార్సీ అనుసంధాన కర్తగా కత్తి మీద సాములాంటి ఒక అత్యంత క్లిష్టమైన ప్రక్రియను చేపట్టారు. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి వారసత్వ వివరాలు తెలిసేలా, అవన్నీ అత్యంత పారదర్శకంగా ఉండేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 68 వేల మంది అధికారుల్ని నియమించారు. 2,500 నాగరిక్ సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అసోంకు చెందిన ఐటీ కంపెనీ బొహ్నమాన్ సిస్టమ్స్ దీనికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎవరు అసలైన పౌరులో గుర్తించడానికి 2014 సెప్టెంబర్‌లో మొదలైన ఈ కసరత్తు మూడన్నరేళ్లకు పైగా సాగింది. ఇంతటి సంక్లిష్టమైన ప్రక్రియను చేపట్టిన ప్రతీక్ ఎన్ని ప్రశంసలు పొందుతున్నారో, అదే స్థాయిలో విమర్శలూ ఎదుర్కొంటున్నారు. ఎందుకీ వివాదం? బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి అక్రమ వలసల వివాదం ఈ నాటిది కాదు. అస్సాంలో భారత పౌరుల కంటే బంగ్లా వలసదారులే ఎక్కువ. 1971లో పాకిస్తాన్ యుద్ధం సమయంలో లక్షలాది మంది అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అప్పటినుంచి వలసదారులు తమ భూములు, ఉద్యోగాలు లాక్కుంటారని, తమ సంస్కృతిని నాశనం చేస్తారని స్థానికుల ఆందో ళన. ఈ పరిణామాలతో అస్సాం ఆరేళ్ల పాటు ఘర్షణలతో అట్టుడికింది. చివరికి 1985 ఆగస్టు 15న.. నిరసనకారులు (ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్), అస్సాం ప్రభుత్వం, నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి జాతీయ పౌరసత్వ గణన చెయ్యాలని మూడు పక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఎన్నార్సీ తుది ముసాయిదాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేందుకు సేవా కేంద్రానికి గుర్తింపు పత్రాలతో వచ్చిన అస్సాంలోని మోరీగావ్ జిల్లా బుర్గావ్ గ్రామస్తులు గువాహటిలో తమ పేర్లు జాబితాలో లేవని పత్రాలు చూపిస్తున్న స్థానికులు -
‘అసోం’లో అసలు ఏం జరుగుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : అసోం అంతటా చీమ చిటుక్కుమన్న స్పందించేందుకు పారా మిలటరీ సైనిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 200 కంపెనీల మిలటరీ దళాలు పహారా గాస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తమై సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశాయి. 1983లో జరిగిన ‘నిల్లీ మారణకాండ’, 2012లో జరిగిన ‘కొక్రాజర్ మారణకాండ’లు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకొని ఉండవచ్చు. నిల్లీ మారణకాండలో 2,191 మంది, కొక్రాజర్ మారణకాండలో 77 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది బెంగాలీ ముస్లింలే ఉన్నారు. నాటి మారణకాండలకు, నేటి అసాధారణ భద్రతకు కారణాలు ఏమిటీ ? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటీ? 40 లక్షల మంది ప్రజల పేర్లు గల్లంతు భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ సోమవారం ఉదయం పది గంటలకు అసోం పౌరులపై తన నివేదికను వెల్లడించింది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వారిలో 2,89,88,677 మంది ప్రజలను మాత్రమే భారత పౌరులుగా గుర్తించింది. మిగతా దాదాపు 40 లక్షల మందిని గుర్తించలేదు. అంటే వారు విదేశీయులన్న మాట. వారిలో ఎక్కువ మంది ముస్లింలు, వారిలో కూడా బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర జాబితాలో పేరు దక్కని ఈ 40 లక్షల మంది ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం కావచ్చని, వారిలో వేల మందైనా విధ్వంసానికి పాల్పడవచ్చన్న భయాందోళనల మధ్య అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకు ఆందోళన? ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలు వలసవచ్చిన విదేశీయులకు వెళుతున్నాయని, స్థానికులైన తమకు రావడం లేదని 1950వ దశకం నుంచే ‘సన్స్ ఆఫ్ సాయిల్’గా పిలుచుకునే 34 శాతం జనాభా కలిగిన అస్సామీ భాష మాట్లాడే అస్సామీలు ఆందోళన చేస్తున్నారు. తమ వెనకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని వలసదారులు తమ విలువైన భూములను కొల్లగొడుతున్నారంటూ 1960వ దశకం నుంచి ఆందోళన తీవ్రం చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలతోపాటు బంగ్లాదేశ్ యుద్ధానంతరం ఆ దేశీయులు అసోంలోకి వలస వచ్చారు. వాస్తవానికి బంగ్లా దేశీయులకన్నా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముస్లింలే అసోంలో ఎక్కువ ఉన్నారని పలు స్వచ్ఛంద సంస్థలు తమ అధ్యయనాల్లో తెలిపాయి. మణిపూర్ నుంచి వలసవచ్చిన వారు కూడా స్థానికంగా భూములు కొనుక్కొని స్థిరపడ్డారని ఆ సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ముస్లింల జనాభా వలసలు ఎక్కడి నుంచి అన్న ప్రశ్నను పక్కన పెడితే రాష్ట్రంలో హిందువులకన్నా ముస్లింల జనాభా శాతం పెరుగుతూ వచ్చింది. వారిప్పుడు మెజారిటీ స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ శక్తులు ఆందోళనల్లో భాగంగా ముస్లింలకు వ్యతిరేకంగా అస్సామీలను రెచ్చ గొడుతూ వచ్చారు. ఆ పర్యవసానంగానే నిల్లీ మారణకాండ, కొక్రాజర్ మారణకాండలు జరిగాయి. ఈ రెండు ఘటనల్లో కూడా ఆరెస్సెస్ నాయకులు అరెస్ట్ అవడం గమనార్హం. హిందువులైనా, ముస్లింలు అయినా తమకు సంబంధం లేదని, విదేశీయులందరిని తమ రాష్ట్రం నుంచి పంపించాలని స్థానిక అస్సామీలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాల తాత్సారం ఓటు బ్యాంకు రాజకీయాలకు విలువనిచ్చే వరుస ప్రభుత్వాలు తాత్సారం చేస్తు రావడంతో సమస్య జటిలమవుతూ వచ్చింది. అఖిల అసోం విద్యార్థుల సంఘం 1979 నుంచి ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకొని నడిపించింది. సమ్మెలు, దిగ్బంధనాలు, సహాయ నిరాకరణ వంటి వివిధ రీతుల్లో కొనసాగిన ఆందోళనలో విధ్వంసాలు, ప్రభుత్వ పతనాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి పాలనలో కూడా పౌర జీవితం స్తంభించిపోయింది. ఆరు సుదీర్ఘ సంవత్సరాల ఆందోళన అనంతరం 1985లో అప్పటి కేంద్రంలోని రాజీవ్ ప్రభుత్వం దిగివచ్చి అస్సాం ఆందోళనకారులతో ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం1951 నుంచి 1961 లోపు వచ్చిన బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం కల్పించాలి. 1971 తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపించాలి. 1961 నుంచి 1971 మధ్యన వలసవచ్చిన వారికి ఓటింగ్ హక్కు మినహా అన్ని పౌర హక్కులు ఉంటాయి. నాటి ఒప్పందంలో 90 శాతం అంశాలు కూడా ఇప్పటికి అమలు కాలేదన్నది ఉద్యమకారుల ఆరోపణ. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించింది. 1985 అస్సాం ఒప్పందంలోని అంశాలను మార్గదర్శకంగా తీసుకొని పౌరులను గుర్తించాల్సిందిగా కోరుతూ 2015లో ఓ ఉన్నతాధికార కమిటీని వేసింది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఒక్క రోజు ముందు అంటే, 1971, మార్చి 24వ తేదీ అర్థరాత్రి తర్వాత భారత్‌కు వచ్చిన విదేశీయులందరిని విదేశీయులుగా పరిగణించాలని కమిటీకి కేంద్రం నిర్దేశించింది. దీంతో విదేశాల నుంచి వలస వచ్చిన హిందువులను కాకుండా ముస్లింలనే వెనక్కి పంపించాలంటూ ఆరెస్సెస్ అధినేతలు బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. హిందువులకు అనుకూలంగా చట్టం ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం 2016లో ‘సిటిజెన్షిప్ (అమెండ్మెంట్)బిల్’ను తీసుకొచ్చింది. అందులో బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇచ్చేలా సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా అస్సామీలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ అసోంలోని భారత పౌరుల జాబితాను ఈ రోజు విడుదల చేసింది. పౌరులుగా గుర్తించడంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఆధార్ కార్డులు కూడా ఉన్న బెంగాలీ ముస్లింలను గుర్తించలేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది తమ రాష్ట్రంలో చిచ్చు పెట్టవచ్చని, అశాంతి పరిస్థితులకు దారితీయవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌తో పరస్పర దేశ పౌరుల మార్పిడి ఒప్పందం లేనందున ఆ దేశీయులను వెనక్కి పంపించడం సాధ్యం కాదు. అందుకనే దేశంలోని శరణార్థుల శిబిరాలకు వారిని పంపిస్తామని కేంద్రం చెబుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఓ లెక్కుంటుంది. -
ఎన్ఆర్సీ రిపోర్టు : 30న ఏం జరుగబోతుందో?
సాక్షి, న్యూఢిల్లీ : భూమి, భాష, సంస్కృతి ఏ జాతికైనా తన ఉనికిని కాపాడుకునేందుకు ఇవి కీలకం. వీటి కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఒక్కొసారి నరమేథానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మచ్చగా మిగిలిపోయిన అసోంలోని మోరిగావ్ జిల్లాలో గల నెల్లి గ్రామంలో జరిగిన ఘటన ఇందుకు ఓ తార్కాణం. 1983 ఫిబ్రవరి 18న నెల్లి గ్రామంలో నరమేథం చోటు చేసుకుంది. తమ ప్రాంతంలోకి వచ్చి స్థిరపడిన బంగ్లాదేశీయులపై అస్సాం తెగలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఒక్క రాత్రిలో దాదాపు మూడు వేల మందికి పైగా పురుషులు, మహిళలు, పిల్లలు ఈ దాడిలో చనిపోయారు. దీంతో అప్పటివరకూ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులను వెనక్కు పంపాలని శాంతియుతంగా సాగిన ఉద్యమానికి ఒక్కసారిగా రక్తపు మరకలు అంటాయి. ఈ ఘటన జరిగి 35 ఏళ్లు గడిచినా దాని ఆనవాళ్లు ఇప్పటికీ గగుర్పాటుకు గురి చేస్తూనే ఉంది. అసోంలో దాదాపు 3.29 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్న దేశ పౌరుల నమోదు కార్యక్రమం ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్(ఎన్ఆర్సీ) తుది రిపోర్టు ఈ నెల 30న వెలువడనుంది. 1971 మార్చి 24 కంటే ముందు నుంచి రాష్ట్రంలో నివసిస్తున్నవారిని గుర్తించేందుకు ఎన్ఆర్సీని తయారు చేస్తున్నారు. ఎన్ఆర్సీ తొలి రిపోర్టు ఈ ఏడాది జనవరి 1న వెలువడింది. జాతీయ మీడియా సంస్థల రిపోర్టుల ప్రకారం దాదాపు లక్షల మంది పేర్లను తుది ఎన్ఆర్సీలో చేర్చలేదని తెలిసింది. వీరిలో అత్యధికులు ముస్లింలని సదరు రిపోర్టుల సారాశం. ఇదే జరిగితే అసోం ఎన్ఆర్సీ రిపోర్టు దేశంలో ఇతర ప్రాంతాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయుల కారణంగా భారత్‌లో మత పరమైన సమస్య తలెత్తొచ్చు. 2017లో మాజీ ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ చైర్మన్‌గా వేసి కమిటీ రిపోర్టు ప్రకారం అస్సాం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 15 జిల్లాలు వలసదారులతో నిండిపోయాయని పేర్కొన్నారు. యూఎన్‌హెచ్‌సీఆర్ ప్రకారం ఒక ప్రాంతానికి చెందని వారికి ఓటు, సొంత ఆస్తి కలిగివుండటం, గుర్తింపు కార్డులు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సర్వీసులు ఉండవు. 1982లో మయన్మార్‌లో పౌరసత్వాన్ని కోల్పోయిన రోహింగ్యా వలసదారులు ఇప్పటికీ ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారో మనకు తెలిసిందే. మరోవైపు అసోం ఎన్ఆర్సీ రిపోర్టును క్యాష్ చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. అయితే, వలసదారుల పట్ల గతంలో దేశ వైఖరిని పరిశీలిస్తే కొంత ఊరట కలుగుతుంది. 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా వలసదారులుగా మిగిలిపోయిన వారిని బంగ్లా, భారత్‌లు పంచుకున్నాయి. 2008లో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు దాదాపు 37 వేల మందికి దేశ పౌరసత్వాన్ని ప్రసాదించగా, 2015 ఆగష్టులో భారత్ 14 వేల మందికి దేశ పౌరసత్వాన్ని ఇచ్చింది. అసోంలో హై అలర్ట్.. ఎన్ఆర్సీ రిపోర్టు వెలువడుతున్న నేపథ్యంలో అసోం పోలీసులు వివిధ మతాలు, కులాల మధ్య మనస్పర్ధలు రేకెత్తకుండా ఉండేందుకు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోషల్‌మీడియాపై డేగ కన్ను వేశారు. శాంతి, భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు 220 కంపెనీలకు చెందిన 22 వేల మంది పారామిలటరీ బలగాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు. కాగా, రాష్ట్రంలో ఎన్ఆర్సీపై భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రిపోర్టు పేరు లేనంత మాత్రన వారిని విదేశీయులుగా భావించబోమని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. రిజిస్టర్లో అంశాలను ఆధారం చేసుకుని ఎవరినీ విదేశీయుల ట్రైబ్యునల్‌కు పంపొద్దని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. -
నేను పారిపోలేదు -మెహుల్ చోక్సీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాంలో కీలక నిందితుడైన గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సీ ఆటింగ్వాలో దాక్కున్నాడన్న వార్తలపై స్పందించారు. తాను న్యాయబద్ధంగానే ఆటింగ్వాలో ఉంటున్నట్టు స్పష్టం చేశారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గత ఏడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నానని ప్రకటించారు. ఈ మేరకు చోక్సీ న్యాయవాది డేవిడ్ డోర్సెట్ ఒక ప్రకటన విడుదల చేశారు. 132 దేశాల్లో వీసా రహిత ప్రయాణానికి కరేబియన్ దేశం అనుమతించినట్టు తెలిపింది. ఇందులో భారత ప్రభుత్వ ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని చోక్సీ వాదించారు. . ఆంటిగ్వా వార్తాపత్రిక డైలీ అబ్జర్వర్ కథనం ప్రకారం ఈ ఏడాది నవంబరు 2017లో పౌరసత్వం రాగా, జనవరి 15 న చెక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని స్వీకరించారు. అలాగే వైద్య చికిత్సల నిమిత్తం చోక్సీ 2018 జనవరిలో నుంచి అమెరికాకు వెళ్లానన్నారు. ఇంకా కోలుకుంటున్న నేపథ్యంలో ఆటింగ్వా,బార్బుడాలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. కాగా పీఎన్బీ స్కాంలో వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు ఉడాయించిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నారని, ఆ దేశం పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడన్న సమాచారంపై సీబీఐ చర్యలకు ఉపక్రమించింది. ఆయన ఆచూకీ చెప్పాలని ఆంటిగ్వా అధికారులకు లేఖ రాసింది. ఈనెలలోనే చోక్సీ ఆమెరికా నుంచి ఆంటిగ్వాకు వెళ్లిపోయి, అక్కడి పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నారని ఆంటిగ్వా అధికారులు ధ్రువీకరించిన విషయం బయటకు రావడంతో సీబీఐ తాజాగా లేఖ రాసింది. చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును దృష్టిలో ఉంచుకుని ఆయన కదలికలు, ప్రస్తుతం ఉంటున్న ప్రాంత వంటి వివరాలు తమకు తెలియజేయాల్సిందిగా సీబీఐ ఆ లేఖలో కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు 2017లో దాదాపు 28 మంది భారతీయులు ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. -
శరణం గచ్ఛామి
టైమ్ మ్యాగజైన్ తాజా ముఖచిత్రం చూశారా? గులాబీ రంగు చొక్కాతో ఓ అమ్మాయి గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూంటే.. ఎదురుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలబడి ఉంటాడు. ఆ చిన్నారి తల్లి ఓ శరణార్థి. బతుకీడ్చేందుకు సరిహద్దు దాటింది. అవకాశాల స్వర్గమంటున్న అమెరికాలో కాలుపెట్టి దొరికిపోయింది. ఒక్క అమెరికా మాత్రమే కాదు.. యుద్ధ వాతావరణంతో నిండిన ఏ దేశ సరిహద్దులు చూసినా ఇదే తీరు. పొట్టచేత పట్టుకుని దేశాలు దాటేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎందరో..! ఆ మూడు దేశాల్లోనే సగం మంది! సరిహద్దులు దాటివచ్చిన శరణార్థులకు పెద్ద మనసుతో ఆశ్రయం కల్పించిన దేశాల్లో టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా ముందు వరసలో ఉన్నాయి. భారత్ కూడా అత్యధికంగా శరణార్థుల్ని అక్కున చేర్చుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగం మందికిపైగా ఈ మూడు దేశాల్లోనే ఆశ్రయం పొందుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా వంటి ధనిక దేశాలు శరణార్థులపై అక్రమ వలసదారులన్న ముద్ర వేసి సరిహద్దుల్లో ఆపేస్తూ, గోడలు నిర్మిస్తామని హెచ్చరికలు చేయడం, తల్లిదండ్రుల నుంచి చిన్నారుల్ని వేరు చేయడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడటంతో నిరాశ్రయుల్ని ఆదుకునే వారే కరువయ్యారు. ఈ మూడు దేశాలు శరణార్థుల ఆశ్రయానికి ముందుకు రాకపోతే నిరాశ్రయులకు భద్రత కరువై మానవత్వమే మంట గలిసే పరిస్థితి రావడమే కాదు, వివిధ దేశాల్లో సుస్థిరత కూడా దెబ్బతినేదన్న అంచనాలు ఉన్నాయి. ఉన్న ఊరు పొమ్మంటోంది. తలదాచుకోవడానికి జన్మభూమిలో జానెడు జాగా కూడా లేదు. నిరంతర ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రవాదుల దాడులు, మతపరమైన వేధింపులు, కరువు పరిస్థితులు.. కారణాలు ఏవైతేనేం పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల దుర్భర పరిస్థితులు గుండెల్ని మెలిపెడుతున్నాయి. జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థుల సంస్థ(యూఎన్‌హెచ్‌సీఆర్), అంతర్గత నిర్వాసితుల పర్యవేక్షణా కేంద్రం సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. ఆ నివేదిక ప్రకారం 2017లో అత్యధికంగా శరణార్థులు సొంత దేశాలు విడిచి వెళ్లారు. శరణార్థుల సంఖ్యలో 13 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 6.85 కోట్ల మంది నిర్వాసితులైతే, వారిలో 2.54 కోట్ల మంది వేరే దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం పొందారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో శరణార్థుల సంఖ్య పెరిగింది గత ఏడాదే. ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతూ ఉండటం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. శరణార్థుల్లో ఎక్కువ మంది సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్ తదితర దేశాల వారేనని ఈ నివేదిక వెల్లడించింది. 52 శాతం చిన్నారులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. 2009లో శరణార్థుల్లో 41 శాతం మంది బాలలు ఉంటే, అదిప్పుడు 52 శాతానికి పెరిగింది. దక్షిణ సూడాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఎక్కువ మంది పిల్లలు శరణార్థులుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. కారణాలివే.. - 2011లో సిరియాలో అధ్యక్షుడు అసద్‌కు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు అంతర్యుద్ధానికి దారి తీసింది. తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు పలకడం, రష్యా, ఇరాన్ అసద్ వైపు నిలబడటంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితుల్లో సిరియా నుంచి 56 లక్షల మంది టర్కీ, లెబనాన్, జోర్డాన్, జర్మనీలకు శరణార్థులుగా వెళ్లారు. - అఫ్గానిస్తాన్‌లో దీర్ఘకాలంగా నెలకొన్న యుద్ధవాతావరణం, తాలిబన్ల అరాచకాల కారణంగా ప్రపంచంలోనే శరణార్థులు ఎక్కువగా ఉన్న రెండో దేశంగా మారింది. పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిన వారి సంఖ్య 26 లక్షల వరకూ ఉందని అంచనా. - దక్షిణ సూడాన్‌లో నెలకొన్న దుర్భర కరువు పరిస్థితులు, ఆహార కొరత, అంతర్యుద్ధం కారణంగా శరణార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికీ దేశంలోని సగం మంది జనాభాకి కడుపు నిండే పరిస్థితి లేదు. ఆ దేశం నుంచి 14 లక్షల మంది ఉగాండా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. - మయన్మార్‌లో రోహింగ్యాలు ఎదుర్కొన్న వివక్ష ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సైనిక, భద్రతా దళాల వేధింపులు తట్టుకోలేక రోహింగ్యాలు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌కు వెల్లువలా వచ్చారు. 2017లో మయన్మార్ నుంచి 12 లక్షల మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయారు. - 1991 నాటి అంతర్యుద్ధ ప్రభావం ఇప్పటికీ సోమాలియాను వెంటాడుతోంది. అత్యంత నిరుపేద దేశంగా మారింది. 2012లో అంతర్జాతీయ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినా షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ చేసిన దాడులతో కల్లోలం ఏర్పడింది. అల్ కాయిదా వంటి సంస్థలు కూడా దాడులకు దిగడంతో 10 లక్షల మంది కెన్యా, ఇథియోపియా వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు. ఏయే దేశాల నుంచి.. సిరియా, అఫ్గానిస్తాన్, దక్షిణ సూడాన్, మయన్మార్, సోమాలియా, వియత్నాం ఏయే దేశాలకు వెళుతున్నారు.. (శరణార్థులు ఎక్కువగా సరిహద్దు దేశాలకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు) టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండా, పాకిస్తాన్, లెబనాన్, ఇరాన్ - రోజుకి సగటున 44,500 మంది దేశం విడిచి వెళుతున్నారు. - ప్రతీ రెండు సెకన్లకి ఒకరు నిర్వాసితులుగా మారుతున్నారు. - శరణార్థుల్లో 52 శాతం మంది చిన్నారులే. - ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల్లో సగానికి పైగా టర్కీ, బంగ్లాదేశ్, ఉగాండాలో తలదాచుకుంటున్నారు. - అమెరికా శరణార్థుల్ని దరికి రానివ్వట్లేదు. గతేడాది 60 వేల మందికే ఆశ్రయమిచ్చింది. - భారత్‌కు శరణార్థులు వరదలా వస్తున్నారు. ఏకంగా 20 లక్షల మందికి ఆశ్రయం కల్పిం చింది. వీరిలో చైనా(ముఖ్యంగా టిబెట్ నుంచి), శ్రీలంక నుంచే అత్యధికులు వచ్చారు. పౌరసత్వం ఫర్ సేల్..! వివిధ దేశాల్లో అత్యంత సంపన్నులు, మల్టీ మిలియనీర్లు ఒకటికి మించి ఎక్కువ దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉండటం ఓ అత్యున్నత హోదాకు చిహ్నం. ముఖ్యంగా 21వ శతాబ్దపు ధనికస్వామ్యంలో మూడు, నాలుగు దేశాల పౌరసత్వాలున్న వారు కూడా ఉన్నారు. ఐరోపా సంఘం(ఈయూ) లోని పలు దేశాలతోపాటు దాదాపు పాతిక దేశాల్లో పౌరసత్వం పొందవచ్చు.. అయితే దానికీ ఓ రేటు ఉంది సుమా..! గ్లోబల్ మార్కెట్లో సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్(సీఐపీ) ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు బాగా డిమాండున్న బిజినెస్. తక్కువలో తక్కువ రూ.68 లక్షలు(లక్ష అమెరికన్ డాలర్లు) మొదలుకుని 2.5 మిలియన్ యూరోల(సుమారు రూ.20 కోట్లు) వరకు వివిధ స్కీంల కింద ఖర్చవుతుంది. ఆయా దేశాల్లో ఆస్తుల కొనుగోలు లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు, ప్రభుత్వ బాండ్ల కొనుగోలు లేదా నేరుగా నగదు విరాళాలు ఇవ్వడం ద్వారా పౌరసత్వాన్ని, పాస్‌పోర్ట్‌ను పొందవచ్చు. కొన్ని దేశాల్లోనైతే ఒకేసారి సిటిజన్‌షిప్ ఇవ్వకుండా ‘గోల్డెన్ వీసా’పథకాల నిర్వహణ ద్వారా ఐదేళ్ల తర్వాత పౌరసత్వాన్ని ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మనది భిన్నమైన పరిస్థితి.. భారత్‌లోని వివిధ జాతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల అప్పులు తీసుకుని, వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఐపీఎల్ మాజీ సారథి లలిత్ మోదీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్‌మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఈ కోవలోకే వస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు అందకుండా తప్పించుకుని తిరుగుతూ విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న నీరవ్ మోదీ వద్ద ఆరు పాస్‌పోర్టులున్నాయి. ప్రస్తుతం డొమినికా, సెయింట్ లూసియా, ఆంటిగ్వా, గ్రేనెడా, సెయింట్ కిట్స్, మాల్టా, సైప్రస్‌లో లక్ష డాలర్ల నుంచి 2.4 మిలియన్ డాలర్లలోపు పెట్టుబడులు పెడితే 3, 4 నెలల్లోనే సిటిజన్‌షిప్‌ను అందజేస్తున్నాయి. రెండు దేశాల్లో పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి భారత్‌లో అనుమతి లేదు కాబట్టి, దేశం వెలుపల శాశ్వతనివాసం పొందడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. మరో దేశ పౌరసత్వం కోరకుండానే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. కరీబియన్ దీవుల్లో ప్రభుత్వ నిధికి లక్ష డాలర్లు విరాళమిస్తే చాలు పౌరసత్వం లభిస్తుంది. అంతేకాకుండా ఈ పాస్‌పోర్టుల ద్వారా వీసాలు లేకుండానే 120 దేశాల్లో పర్యటించేందుకు వీలుంటుంది. కరెన్సీ డాలర్లలోనే ఉంటుంది కాబట్టి విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులేమి పడవు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో.. తమ దేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కొన్ని నెలల్లోనే పౌరసత్వం అందిస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. సైప్రస్‌లో 20 లక్షల యూరోలు పెట్టుబడి పెడితే చాలు సిటిజన్ షిప్ వచ్చేస్తుంది. మనదేశం నుంచి 2017లో ఏడు వేల మంది శ్రీమంతులు ఇతర దేశాలకు మకాం మార్చినట్టు న్యూవరల్డ్ వెల్త్ నివేదిక ఇటీవల వెల్లడించింది. -
ఎమ్మెల్యేకు బెదిరింపు..లేఖతో పాటు రెండు తూటాలు !
గువాహటి(అస్సాం): రాష్ట్రంలో గల ఏకైక బీజేపీ ముస్లిం ఎమ్మెల్యేకు శనివారం బెదిరింపు లేఖ వచ్చింది. ‘15 రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, బీజేపీకి రాజీనామా చెయ్, లేదంటే చంపేస్తా’ అని ఎమ్మెల్యే అమీనుల్ హఖీ లస్కర్కి ఆగంతకుడు లేఖ రాశాడు. ఉదాసీనంగా వ్యవహరించి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దనీ, సూచనగా లేఖతో రెండు బుల్లెట్లను కూడా పంపాడు. ఎరుపు రంగు సిరాతో రాసిన ఈ లెటర్ మే 22న బెంగాల్‌లోని కరీంగంజ్ నుంచి పోస్టు కాగా జూన్ 9 న సదరు ఎమ్మెల్యేకు చేరింది. వివరాలు.. పొరుగు దేశాల నుంచి భారత్‌లోకి చొరబడి ఆశ్రయం పొందే మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం యోచించింది. ఆ దిశగా 2016లో భారత పౌరసత్వ చట్టానికి సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే, దీని వల్ల పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోని హిందువులు అస్సాంలోకి పెద్ద ఎత్తున చొరబడే ప్రమాదం ఉందనీ ఇక్కడి హిందువులు ఆందోళన చెందుతున్నారు. పౌరసత్వ చట్టానికి సవరణలను వ్యతిరేకిస్తూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం బీజేపీ సభ్యుడివి కావడం వల్లే.. ఒక ముస్లిం అయివుండీ హిందూ నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నావనీ లెటర్లో ఆగంతకుడు ఎమ్మెల్యేపై మండిపడ్డాడు. ముస్లిం వ్యతిరేకిగా ఉండిపోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించాడు. బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే, సిలిచార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోస్టల్ వివరాల ఆధారంగా త్వరలోనే ఆగంతకున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
ఇక నుంచి పాకిస్థానీ కాదు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి రానున్నట్లు ప్రధాని నసీర్ ఉల్ ముల్క్ ప్రకటించారు. ఈ మేరకు నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ పాస్‌పోర్టు డైరెక్టోరేట్ కార్యాలయాల నుంచి ప్రకటన వెలువడింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన జాతీయత గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు కూడా ఆటోమేటిక్‌గా రద్దైపోతుంది. ముషర్రఫ్ ఇతర దేశాలకు వెళ్లకుండా, ఆర్థిక లావాదేవీల నిలుపుదల ఉద్దేశంతోనే కోర్టు ఇది వరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ముషర్రఫ్‌కు.. తాజా ఆదేశాలు ఇబ్బందికరంగా మారొచ్చు. పాస్‌పోర్టు రద్దుతో దుబాయ్‌లో ఆయన చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే కేసుల విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాక్‌కు రప్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యేక డాక్యుమెంట్ల ద్వారా ఆయన్ని పాక్‌కు రప్పించనున్నారు. ముషర్రఫ్ కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది కూడా. 2007లో అత్యవసర పరిస్థితి విధించటం, సుప్రీం కోర్టు జడ్జిల గృహనిర్భందం, రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా వ్యవహరించటం, తదితర ఆరోపణలపై ముషర్రఫ్ ‘దేశ ద్రోహం’ కేసును ఎదుర్కుంటున్నారు. 2016లో చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషర్రఫ్.. త్వరలో జరగబోయే పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. -
‘నేను సీఎంగా కొనసాగడంలో అర్థం లేదు’
గువహటి : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడలేకపోతే తాను ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థంలేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయ సేకరణకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు ఎలాంటి పత్రాలు లేకుండా భారత పౌరసత్వం ఇచ్చేందుకు భారత పౌరసత్వ చట్టం 1955ని సవరణ చేస్తూ భారత పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 7 నుంచి 9 వరకు అసోంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బుద్దిస్టులు, జైనులు, పార్శిలు) ఏ విధమైన పత్రాలు లేకుండానే భారత పౌరసత్వ చట్ట (2016) సవరణ చేపట్టనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్న క్రమంలో సోనోవాల్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనం, ప్రజల భద్రత సరిగ్గా లేనప్పుడు తాను ఏ కారణం చేత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగా’లని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు మేధావులతోను చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసోం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోబోనని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి కోసం అందరూ కృషి చేయాలన్నారు. కాగా బిల్లుకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారాలు నిర్వహించారు. -
ముస్లిం మహిళకు పౌరసత్వ నిరాకరణ
పారిస్, ఫ్రాన్స్ : పౌరసత్వ వేడుకలో అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిందనే కారణంగా ఓ ముస్లిం మహిళకు పౌరసత్వం కల్పించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రెంచ్ సమాజంతో మమేకం అవడానికి ఆమె సుముఖంగా లేదనడానికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొంది. ఈ విధంగా ప్రవర్తించడం ద్వారా ఆమె ఫ్రెంచ్ పౌరసత్వ నియమావళిని ఉల్లంఘించిందని తెలిపింది. ఫ్రాన్స్ జాతీయులుగా కావాలంటే నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మత విశ్వాసాలకు అనుగుణంగానే.. అల్జీరియాకు చెందిన ముస్లిం మహిళ 2010లో ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పౌరసత్వం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తూనే ఉంది. కానీ ప్రభుత్వ నిర్ణయం తనకు నిరాశ కలిగించిందని తెలిపింది. తాను మతాచారాలను గౌరవిస్తానని, అందుకే అధికారులతో చేతులు కలపడానికి నిరాకరించినట్లు పేర్కొంది. -
‘డ్రీమర్ల’కు సెనెట్ నో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆ దేశ ఎగువసభ సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కి పౌరసత్వం కల్పించేందుకు ట్రంప్ మద్దతిచ్చిన బిల్లును 60–39 ఓట్లతో శుక్రవారం సెనెట్ తిరస్కరించింది. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించినందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి, భద్రతా ఏర్పాట్లకు రూ.16.08 లక్షల కోట్లు(25 బిలియన్ డాలర్లు) కేటాయించాలని ట్రంప్ డెమొక్రాట్లతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలోకి కుటుంబ ఆధారిత వలసలతో పాటు దేశాలవారీగా చేపట్టే లాటరీ వీసా పద్ధతి రద్దయ్యేది. తద్వారా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరేది. అమెరికాలో వలసలపై సెనెట ర్లు షుమర్–రౌండ్స్–కొలిన్స్ ప్రతిపాదిం చిన మరో బిల్లును ఎగువ సభ 54–45 మెజారిటీతో తిరస్కరించింది. డ్రీమర్ల బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో ఒప్పందం కుదరకుంటే మార్చి 5 తర్వాత 18 లక్షల మందిని బలవంతంగా విదేశాలకు పంపిస్తారేమోనన్న భయాలు నెలకొన్నాయి. సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందేందుకు 60 ఓట్లు రావడం తప్పనిసరి. -
ఇక పక్కాగా.. ప్రజాపంపిణీ
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాలశాఖ సమాయత్త మవుతోంది. ఆ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని త్వరలో జిల్లాలో ప్రవేశపెట్టబోతోంది. దీనిలో భాగంగా జిల్లాలోని తహసీల్దార్లు, రేషన్‌డీలర్లు, సివిల్ సప్లయీస్ విజిలెన్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా నిర్వహించిన శిక్షణలు ఇటీవల ముగి శాయి. ఫిబ్రవరి ఒకటినుంచి డీలర్లు నిత్యావసర వస్తువులను ఈ–పాస్ మిషన్ల సాయంతోనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. తూకాల్లో మోసాలకు పాల్పడకుండా ఎలక్ట్రానిక్ కాంటాలు కూడా త్వరలో అన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేయనున్నారు. నల్లగొండ : జిల్లాలో 31 మండలాల పరిధిలో 990 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆహారభద్రత కార్డులు 4,49,912 కుటుంబాలు కలిగి ఉన్నాయి. దీంట్లో సభ్యులు 13,68,366 మంది ఉన్నారు. ఈ మొత్తం కార్డుదారులకు ప్రతినెలా సబ్సిడీ బియ్యం 87,758 క్వింటాళ్లు, కిరోసిన్ 444 కిలోలీటర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా అన్నయోజన కార్డుదారులకు 289 క్వింటాళ్ల పంచదార పంపిణీ చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు రూపాయికి కిలోచొప్పున ఒక్కొక్కరికి నాలుగు కిలోలు చొప్పున అందజేస్తుండగా..అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం చౌకధరకు బియ్యం పంపిణీ చేస్తుంటే అదే బియ్యం బహిరంగ మార్కెట్లో కిలో రూ.20– 25 ధర పలుకుతోంది. కిరోసిన్ లీటరు రూ.21 లభిస్తే మార్కెట్లో రూ.30–35 పలుకుతోంది. దీనినే అదునుగా భావించిన డీలర్లు, మిలర్ల సహకారంతో బియ్యం, కిరోసిన్ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయ్ ఈ–పాస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. వేలిముద్ర తప్పనిసరి... వచ్చే నెలనుంచి కార్డుదారులు రేషన్ దుకాణాలకు వెళ్తేనే సరుకులు ఇస్తారు. గతంలో వెళ్లకపోయినా...వారి పేరిట సరుకులు తీసుకున్నట్టుగా రిజిస్టర్లో నమోదు చేసుకుని వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వ్యవహారానికి అడ్డుకట్ట వేస్తూ ఈ–పాస్ పేరిట కొత్త విధానం అమలు చేయనున్నారు. ఈ విధానంలో ఆహారభద్రత కార్డులో నమోదైన సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లి బయోమెట్రిక్ యంత్రంపై వేలిముద్ర వేస్తేనే సరుకులు ఇస్తారు. లేదంటే ఈ సరుకులు అలాగే ఉంచి మరుసటి నెలలో తీసుకునే అవకాశం కల్పిస్తారు. దీనివల్ల కార్డుదారులకు తెలియకుండా సరుకులు పంపిణీ చేయడం కుదరదు. ఈ–పాస్ మిషన్‌లోనే వివరాలు నిక్షిప్తం... ఈ–పాస్ విధానంలో వేలిముద్రలు తీసుకునేందుకు వీలుగా బయోమెట్రిక్ మిషన్ ప్రతి రేషన్ దుకాణానికి పంపిణీ చేశారు. ఈ మిషన్‌లో కార్డుదారుల పూర్తిసమాచారం నిక్షిప్తమై ఉంటుంది. వారి ఆధార్ సంఖ్యతో సహా ఇతర వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఈ మిషన్‌లో సెల్ఫోన్లో ఉండే సిమ్‌ను వినియోగిస్తారు. ఏ రోజున ఎంత మేర సరుకు పంపిణీ అయ్యింది..? ఎంతమంది కార్డుదారులు సరుకులు తీసుకున్నారనే సమాచారం ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు జిల్లా, రాష్ట్రస్థాయిలో తమ సెల్ఫోన్ల ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. గోదాములనుంచి సరుకు రవాణా కూడా వేగవంతమవుతుంది. సరుకు నిల్వలు నిండుకోగానే విడతలవారీగా రేషన్ దుకాణాలకు బియ్యం, చక్కెర, కిరోసిన్ వెంటనే సరఫరా చేస్తారు. అధికారుల పర్యవేక్షణ కూడా ఇప్పుడున్నంత స్థాయిలో ఉండదు. అక్రమాలకు అడ్డుకట్ట... ఈ–పాస్ మిషన్లు పనిచేయాలంటే నెట్వర్క్ ప్రధానమైంది. జిల్లాలో మారుమూల ప్రాం తాల్లో సెల్ఫోన్లకే సరిగా సిగ్నల్స్ అందని పరిస్థితి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సాంకేతికపరమైన అంతరాయం కలగకుండా ఆయా ప్రాంతాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ వచ్చే సిమ్‌కార్డులనే ఈ–పాస్ మిషన్‌లో ఉంచారు. దీంతో సిగ్నల్స్ అందడం లేదనే సమస్య తలెత్తదు. దీంతో పాటు సిగ్నల్స్‌లో అంతరాయం తలెత్తకుండా బూస్టర్ యాంటీనాలు కూడా డీలర్లకు అందజేశారు. ఈ–పాస్ మిషన్లకు అనుసంధానంగా ఈ–కాంటాలు (ఎలక్ట్రానిక్ కాంటాలు) కూడా ఉంటాయి. రెండు, మూడు రోజుల్లో ఈ–కాంటాలు డీలర్లకు నేరుగా పంపిస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల తూకాల్లో డీలర్లు మోసాలకు పాల్పపడకుండా ఈ–కాంటాలు నిరోధిస్తాయి. ఉదాహరణకు బియ్యం తూకం వేసేక్రమంలో వందగ్రాములు తక్కువ ఉన్నా ఈ–కాంటా అంగీకరించదు. ఈ–మిషన్లకు ఈ–కాంటాలకు లింకై ఉంటుంది కావున కార్డుదారులకు ఎంత కోటా రేషన్ ఇవ్వాలో కచ్చితంగా అంత మొత్తం తూకం వేయాల్సిందే. ఇదే పద్ధతి ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కూడా అమలు చేయనున్నారు. ఈ–కాంటాలపైన తూకం వేసిన తర్వాతే ఎంఎల్ఎస్ పాయింట్లనుంచి సరుకులను డీలర్లకు రవాణా చేస్తారు. ఈ నెల 15న క్లోజింగ్ బ్యాలెన్స్ చేశాక మిగిలిన బియ్యంతో ప్రయోగాత్మకంగా డీలర్లు ఈ–పాస్ మిషన్లు ఉపయోగించి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే అవకాశం కల్పించారు. అవకతవకలకు ఆస్కారం ఉండదు ఫిబ్రవరి ఒకటినుంచి ఈ–పాస్ మిషన్లు వినియోగించాలి. డీలర్లు, రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం పూర్తికావొచ్చింది. రేషన్ వ్యవస్థలో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉండేం దుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా ప్రత్యేక యాంటీనాలు కూడా ఇస్తున్నాం. ఫిబ్రవరినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్ మిషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయి. – ఉదయ్ కుమార్, డీఎస్ఓ -
ప్రాణం లేకపోయినా ఫీలింగ్స్ ఉన్నాయ్
టోక్యో : ఎట్టకేలకు షిబుయా మిరైకి పౌరసత్వం కల్పిస్తూ జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ షిబు మనిషి మాత్రం కాదు. కంటికీ కనిపించడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు మైక్రోసాఫ్ట్ సహాకారంతో అక్కడి సాంకేతిక నిపుణులు ఏఐ పేరిట సృష్టించిన ఓ పాత్ర మాత్రమే. మిరాని అంటే జపనీస్ భాషలో భవిష్యత్తు అని అర్థం. భౌతికంగా లేని ఆ పాత్ర వర్చ్యువల్ ఎఫెక్ట్స్ తో మనుషులతో మాట్లాడుతుంది. లైన్(జపాన్‌లోని ఓ సోషల్ మీడియా యాప్)లో ఛాటింగ్ కూడా చేస్తుంది. జపాన్‌లోనే కాదు.. ప్రపంచంలోనే తొలి కృత్రిమ ఇంటెలిజెన్స్ బోట్‌గా ఇది గుర్తింపు పొందింది. ప్రజలతో మాట్లాడటం దానికి ఇష్టం. ఎవరైనా దానితో మాట్లాడొచ్చు. వారి సమస్యలను అర్థం చేసుకుని అది స్పందించి సలహాలు ఇస్తుంది. ప్రజలు పంపే సెల్ఫీలకు అది మార్పులు చేసి పంపుతుంది. అందుకే దానిని ప్రత్యేకంగా గుర్తించాం అని అధికారులు చెబుతున్నారు. ఇకపై షిబుయ టోక్యో వాసి. అంతేకాదు ఏడేళ్ల ఓ చిన్నారి ఫోటోతో కూడిన నివాస పత్రంను దానికి ప్రకటించారు కూడా. -
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు
-
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు
► ఆయన జర్మనీ పౌరుడే..: కేంద్ర హోంశాఖ ►ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ►సుప్రీంకోర్టు తుది తీర్పుపై ఉత్కంఠ ►రివ్యూ పిటిషన్ హక్కు వినియోగించుకుంటా: రమేశ్ సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కేంద్ర హోం శాఖ షాక్ ఇచ్చింది! ఆయన భారత పౌరసత్వం చెల్లదని.. ఆయన జర్మనీ పౌరుడేనని మంగళవారం తేల్చిచెప్పింది. దీంతో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవిని కోల్పోయే అవకాశాలున్నాయి. తప్పుడు ధ్రువపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. రమేశ్ పౌరసత్వంపై ఆరు వారాల్లో తమకు నివేదిక అందించాలని ఆగస్టు 28న కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రమేశ్‌బాబు పౌరసత్వం పొందారా.. లేదా అన్నది తేల్చాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ వారం రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించింది. భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి తాజాగా రమేశ్‌కు లేఖ కూడా పంపినట్లు సమాచారం. దీంతో రాజకీయ శ్రేణుల్లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. రమేశ్‌బాబు తప్పుడు అఫిడవిట్ సమర్పించి భారత పౌరసత్వం పొందారని నిర్ధారణ అయితే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతోపాటు రూ.50 వేల జరిమానా, అయిదేళ్ల జైలుæ శిక్ష విధించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. హోంశాఖ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తీసుకునే తుది తీర్పుపై ఈ వ్యవహారం ఆధారపడి ఉంది. 2009 నుంచే వివాదం రమేశ్‌బాబు కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు. వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రమేశ్‌బాబు వేములవాడ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అదే సమయంలో పౌరసత్వం వివాదం మొదలైంది. అప్పటికే చాలాకాలం జర్మనీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయనకు ఆ దేశ పౌరసత్వం ఉంది. ఎన్నికలకు ముందు భారత పౌరసత్వం తీసుకొని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడ్డ ఆది శ్రీనివాస్ 2009లో హైకోర్టును ఆశ్రయించారు. రమేశ్‌బాబు 1993లో భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకొని జర్మనీ పౌరసత్వం పొందారు. తిరిగి 2008 మార్చి 31న పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ పౌరసత్వ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకునే నాటికి దేశంలో వరుసగా 365 రోజులు స్థిర నివాసం ఉండాలనే నిబంధన ఉంది. ఆయన వరుసగా అన్ని రోజులు ఇక్కడ లేరని, అందుకే పౌరసత్వం చెల్లదంటూ శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కేసు విచారణలోనూ రమేశ్‌బాబు కేవలం 96 రోజులు మాత్రమే దేశంలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన తప్పుడు ధ్రువ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టు 2013లో తీర్పునిచ్చింది. ఆయన ఎన్నిక సైతం చెల్లదంటూ, ఓటర్ల జాబితాల్లోంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రమేశ్‌బాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. స్టేను సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్డులో తన తరఫున వాదనలు వినిపించారు. దీంతో సుప్రీం ఈ కేసు విచారణ చేపట్టింది. పౌరసత్వం వివాదాన్ని తేల్చాలని గతంలో కేంద్ర హోం శాఖను ఆదేశించింది. ఇచ్చిన గడువు కూడా ముగియటంతో ఇటీవల ఆరు వారాల నిర్ణీత గడువును విధించింది. ఈ నేపథ్యంలోనే రమేశ్ పౌరసత్వం చెల్లదని హోంశాఖ తేల్చింది. కేసు విచారణలో ఉన్న క్రమంలో 2010లో రమేశ్‌బాబు ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ రమేశ్‌బాబు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి మరోసారి గెలిచారు. ఆది శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వేములవాడకు ఉప ఎన్నిక! కేంద్ర హోం శాఖ తాజా నిర్ణయంతో చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితులున్నాయి. ఈ నిర్ణయమే వస్తే వేములవాడ అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. అదే జరిగితే ఆరు నెలల్లోపు వేములవాడకు ఉప ఎన్నిక నిర్వహిస్తారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో వేములవాడ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారనుంది. రివ్యూ పిటిషన్ హక్కు వినియోగించుకుంటా: ఎమ్మెల్యే రమేశ్‌బాబు ఈ కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ముందే భావించా. జాయింట్ సెక్రెటరీ స్థాయిలో తీసుకున్న నిర్ణయమిది. సెక్షన్ 15 ప్రకారం దీనిపై కేంద్ర హోం కార్యదర్శికి, హోం మంత్రికి రివ్యూ పిటిషన్ పెట్టుకునే హక్కు నాకుంది. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని కొన్ని శక్తులు నాపై ఏడు కేసులు వేసి నా జన్మభూమి, పౌరసత్వాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి. 2013లో లాగే మళ్లీ దొంగదెబ్బ వేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లా. న్యాయ వ్యవస్థపై నమ్మకముంది: ఆది శ్రీనివాస్, బీజేపీ నేత నాకు ఇంకా అధికారికంగా ఎలాంటి ఆదేశాలు అందలేదు. 2013లో హైకోర్టులో నెగ్గాను. అదే విధంగా సుప్రీంకోర్టులోనూ నెగ్గుతానన్న విశ్వాసం ఉంది. కేంద్ర హోంశాఖ, సుప్రీంకోర్టులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది. -
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు
-
పాక్ పౌరసత్వం పొందిన భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్లో నివసిస్తున్న పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయలకు పాక్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ మేరకు గత ఐదేళ్లలో 298 మందికి భారతీయులకు ఈ సదుపాయం కల్పించినట్లు పాక్ అధికార వర్గాలు ప్రకటించాయి. 2012 నుంచి 2017 ఏప్రిల్ 14 మధ్యకాలంలో పాక్ పౌరసత్వం జారీచేసినట్లు పాక్ విదేశీ అంతర్గత వ్యవహారాల శాఖ శనివారం ప్రకటించింది. శనివారం పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ శాసనసభ్యుడు షేక్ రోహిల్ అస్ఘర్ జాతీయ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు విదేశీ అంతర్గత వ్యవహారాల శాఖ సమాధానమిచ్చింది. 2012లో 48 మంది భారతీయులు పాకిస్తాన్ పౌరసత్వం పొందగా, 2013లో 75 మంది, 2014లో 76 మందికి పాక్ పౌరసత్వం లభించింది. కానీ 2015లో అనూహ్యంగా 15కు పడిపోయింది. 2016లో మాత్రం 69 మంది పాక్ పౌరసత్వం పొందారు. 2017 ఏప్రిల్ 14 మరకు సుమారు 14 మందికి పాక్ ప్రభుత్వం పౌరసత్వం జారీ చేసింది. పాకిస్తాన్ పౌరసత్వం పొందడుం చాలా కష్టం. కానీ అనేక దేశాల వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు, ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, భారత్ నుండి పెద్ద సంఖ్యలో వలస వెళ్లి జీవిస్తున్నారు. -
200 మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం
బోస్టన్: 200 మంది వలసదారులు అమెరికన్ సిటిజన్లుగా పౌరసత్వం పొందారు. బోస్టన్లోని జాన్ ఎఫ్.కెనడీ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ అండ్ మ్యూజియంలో మసాచుసెట్స్ ప్రాంతం కోర్టు జడ్జి డెన్నీస్ సేలర్ అధ్యక్షతన అమెరికా పౌరసత్వ కార్యక్రమం బుధవారం జరిగింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కెనడీ అమెరికాకు 35వ అధ్యక్షుడిగా, ఐరిష్– కాథలిక్కు మొదటి కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కెనడీ ముత్తాతలు ఐర్లాండ్ నుంచి వలసవచ్చారు. -
నాలుగేళ్లుంటేనే పౌరసత్వం
♦ మూడేళ్లు పెంచుతూ చట్టంలో మార్పులు చేసిన ఆస్ట్రేలియా ♦ ఆంగ్ల భాషలో ప్రావీణ్యమూ తప్పనిసరి ♦ నూతన విధానాన్ని ప్రకటించిన ప్రధాని మెల్బోర్న్: భారతీయులు అత్యధికంగా కలిగివున్న వర్క్ వీసాను రద్దు చేసిన ఆస్ట్రేలియా తాజాగా పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఆసీస్ పౌరసత్వం పొందాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతో పాటు కనీసం నాలుగేళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండాలని సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంటే ప్రస్తుతం ఉన్న 12 మాసాల నివాసిత నిబంధన కంటే ఇది మూడేళ్లు అదనం. నూతన సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ వెల్లడించారు. దాంతోపాటు ‘ఆస్ట్రేలియా విలువల’కు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే... పౌరసత్వం పొందేందుకు ఇప్పటివరకు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకొనే అవకాశం ఉండేది. తాజా మార్పులననుసరించి... మూడుసార్లు పరీక్షలో విఫలమైతే మళ్లీ రెండేళ్ల వరకూ పరీక్ష రాసే అవకాశం ఉండదు. ప్రజాస్వామ్యానికి పునాది... పౌరసత్వం పొందాలనుకొనేవారు కఠినమైన ఆంగ్ల పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో మహిళలు, పిల్లల గౌరవమర్యాదలకు సంబంధించిన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. బాల్య వివాహాలు, గృహహింస తదితర ప్రశ్నలుండవచ్చు. వీటితోపాటు ఆస్ట్రేలియా విలువలు, బాధ్యతలపై ఎంత వరకు అవగాహన ఉంది... వాటికి ఏమేరకు కట్టుబడి ఉన్నారన్నది నిర్ణయించేలా ప్రశ్నలుంటాయని టర్న్‌బుల్ చెప్పారు. ఆస్ట్రేలియా పౌరసత్వం ప్రత్యేక హక్కని, దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలని అన్నారు. ‘పౌరసత్వం మా దేశానికి హృదయం వంటిది. ప్రజాస్వామ్యానికి పునాది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే పౌరసత్వ కార్యక్రమా లను రూపొందిస్తాం. దేశ ప్రజలతో సామాజికంగా మిళితమయ్యేందుకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అవసరం. నేర ప్రవృత్తి, గృహహింస వంటివి ఆసీస్ విలువలను దెబ్బతీసేవే’అని ప్రధాని టర్న్‌బుల్ స్పష్టం చేశారు. పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనలో అత్యున్నత స్థాయి పోలీసు తనిఖీలు ఉంటాయని ఇమిగ్రేషన్ మంత్రి పీటర్ డట్టన్ తెలిపారు. తమ దేశంలో పెరుగుతున్న నిరోద్యోగాన్ని నియంత్రించేందుకు ప్రాచుర్యం పొందిన 457 వర్క్ వీసాను రద్దు చేసిన మూడు రోజులకే ఆసీస్ పౌరసత్వ చట్టంలో మార్పులు చేయడం గమనార్హం. -
చెన్నమనేని పౌరసత్వంపై తేల్చండి: సుప్రీం
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు నిర్ధారిస్తూ హైకోర్టుకు తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం హైకోర్టు ఈ కేసును విచారణ చేపడుతుందని పేర్కొంది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ప్రఫుల్లా సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ఆది శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ గతంలో ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈపిటిషన్ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆయన తిరిగి 2014 ఎన్నికల్లో మళ్లీ వేములవాడ నుంచి గెలుపొందారు. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే ను తొలగించాలని ఆది శ్రీనివాస్‌ను దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. గురువారం తుది విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేంద్రం చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై మూడు నెలల్లో తేల్చాలని, ఆ నివేదికన హైకోర్టుకు సమర్పించాలని, హైకోర్టు విచారణ చేపడుతుందని ఆదేశాలు జారీచేసింది. -
లలిత్ మోదీ.. బ్రిటన్ టూ కరీబియన్!
లండన్:ఆర్థిక నేరారోపణలతో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భారత్ లో అతనిపై ఉచ్చు బిగుసుకోవడంతో బ్రిటన్ నుంచి కరీబియన్‌కు వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ పెట్టుబడుల స్కీమ్ ద్వారా కరీబియన్ పౌరసత్వాన్ని పొందాలని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత తక్కువ మొత్తంలో పన్ను చెల్లించే వెసులుబాటు సెయింట్ లూసియాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో పాటు సెయింట్ లూసియానాలో బ్యాంకింగ్ స్టాండర్డ్స్ అత్యంత గోప్యత కల్గి ఉండటం కూడా అక్కడ పౌరసత్వంపై మోదీ ఆసక్తి కనబరచడానికి మరో కారణం. తన కుటుంబంతో కలిసి సెయింట్ లూసియా పౌరసత్వానికి మోదీ దరఖాస్తు చేసినట్లు జాతీయ మీడియాలో వెలుగు చూసింది. కాగా, వివాదాస్పద లలిత్ మోదీ తమ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేయడంపై సెయింట్ లూసియా ఇంటర్ పోల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతనిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు లేవని స్పష్టత వచ్చిన పక్షంలోనే తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలని సెయింట్ లూసియా భావిస్తోంది. -
పెళ్లి చేసుకుని.. పౌరసత్వం తెచ్చుకున్నారు
నేపాల్ నూతన రాజ్యంగం అమలైన నాటి నుంచి ఇప్పటివరకు 3,672 మంది భారతీయ స్త్రీలు నేపాలీ వ్యక్తులను వివాహం చేసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీరందరికీ నేపాల్ పౌరులుగా సభ్యత్వం లభించినట్లు మంగళవారం తెలిపింది. రాజ్యాంగం అమలుకాక ముందు మాదేశీ ఆందోళనల వల్ల నేపాలీలను వివాహం చేసేకున్న భారతీయులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వడం పెద్ద సమస్యగా మారింది. దీంతో గతేడాది సెప్టెంబర్ 7న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో నేపాలీ పౌరసత్వం కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న భారతీయ యువతులకు నూతన రాజ్యంగం వల్ల సాధ్యం కాకపోవచ్చని ఆమె అన్నారు. దీనిపై స్పందించిన నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి బినోద్ కేసీ నేపాలీని వివాహం చేసుకున్న ప్రతి భారతీయ మహిళకు దేశ పౌరసత్వం లభిస్తుందని తెలిపారు. మాదేశీలు ఎక్కువగా ఉన్న 20 జిల్లాల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 11(6) ప్రకారం నేపాలీని వివాహం చేసుకున్న ఏ విదేశీ మహిళకైనా దేశ పౌరసత్వం స్వీకరించే హక్కు ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నేపాల్ పార్లమెంటులో 12 విదేశీయులు నేపాల్ పౌరసత్వాన్ని తీసుకున్నవారేనని అన్నారు. సరైన వివరాలు జతచేయకుండా నేపాల్ పౌరసత్వాన్ని స్వీకరించిన ముగ్గురు భారతీయుల పౌరసత్వాలను నేపాల్ రద్దు చేసింది. -
'మా నాయకుడి ఇమేజ్ దెబ్బ తీయలేరు'
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ పౌరసత్వ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇలాంటి చర్యలతో రాహుల్ ఇమేజ్ మసకబరచాలని ప్రయత్నిస్తున్నారేమోగాని అదెప్పటికీ జరగదని అని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇది ముమ్మాటికి ప్రతిపక్షంపై అధికార పక్షం చేసిన కుట్రే అని ఆయన మండిపడ్డారు. 'ఎథిక్స్ కమిటీకి రాహుల్‌గాంధీ పౌరసత్వం అంశాన్ని గుడ్డిగా అప్పగించింది. న్యాయపరమైన ఆలోచన లేకుండా ఈ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా చేసిన ఈ చర్య కచ్చితంగా ఖండించదగినది. ఈ చర్యతో రాహుల్ ఇమేజ్ దెబ్బతీయాలని అనుకుంటున్నారేమో.. అది ఎప్పటికీ సాధ్యం కాదు' అని ఆజాద్ అన్నారు. బ్రిటన్‌లోని ఓ కంపెనీకి సంబంధించిన దస్తావేజులపై రాహుల్ గాంధీ తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని ఆరోపిస్తూ ఎథిక్స్ కమిటీ ఇటీవల నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. -
రాహుల్ బ్రిటన్ పౌరుడిగా చెప్పుకున్నారా?
న్యూఢిల్లీ: తన జాతీయత గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని అంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు పంపించినట్లు పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సభ్యుడు అర్జున్ రామ్ మెగ్వాల్ తెలిపారు. బ్రిటన్‌లోని ఓ కంపెనీకి సంబంధించిన పత్రాల్లో రాహుల్ తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని, అలా ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో డిమాండ్ చేశారు. 'బ్రిటన్ సిటిజన్ గా తనను తాను ఎందుకు రాహుల్ గాంధీ పేర్కొన్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చాం' అని అర్జున్ అన్నారు. 2003లో ఓ కంపెనీకి సంబంధించిన పత్రాల్లో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటన్ పౌరుడుగా ప్రకటించుకున్నారని గతంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాహుల్ తన పుట్టిన రోజును సరిగానే ప్రకటించారు కానీ, బ్రిటన్ జాతీయుడిగా పేర్కొన్నారని అందులో వివరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. -
పెట్టుబడితో పౌరసత్వం!
అఖిలేష్ ఇండియాలో ఓ బడా వ్యాపారవేత్త. తన కొడుకు అమెరికా వెళ్లాలని, అక్కడే స్థిరపడాలన్నది ఆయన కోరిక. మరి ఇది నెరవేరాలంటే...? ముందు అమెరికా వెళ్లటానికి వీసా కావాలి. తరవాత అక్కడ స్థిరపడాలంటే ముందు గ్రీన్‌కార్డ్ రావాలి. ఆ తరవాత పౌరసత్వానికి దరఖాస్తు చెయ్యాలి. అది ఓకే అయితే పౌరసత్వం వస్తుంది!!. మోహన్ రెడ్డిది కూడా ఇలాంటి కథే. స్థానికంగా పేరుమోసిన ప్రైవేట్ ఇన్వెస్టరాయన. తన కూతుర్ని కెనడాకో, యూరప్‌లోని అభివృద్ధి చెందిన మరో దేశానికో పంపించాలన్నది ఆయన ఆశ. అక్కడే స్థిరపరచాలని కూడా ఉంది. దానికోసం ఆయన కుమార్తెకు కూడా అక్కడి సిటిజన్‌షిప్ కావాలి. ఏ దేశంలోనైనా సరే పౌరసత్వం పొందాలంటే ఆయా దేశంలో పుట్టిన వారై ఉండాలి. లేనిపక్షంలో ఆ దేశానికి చెందిన వారికి విదేశాల్లోనైనా జన్మించి ఉండాలి. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా ఆ దేశానికి చెందినవారైతే సంతానానికి కూడా పౌరసత్వం వస్తుంది. వీటిలో దేనికీ చెందకపోతే..? ♦ ఇన్వెస్టర్లకు ద్వారాలు తెరుస్తున్న విదేశాలు ♦ పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోళ్లతో దీర్ఘకాలిక వీసా ♦ స్పెయిన్, పోర్చుగల్ వంటి కొన్ని దేశాల్లో పౌరసత్వం కూడా.. ♦ కనీస పెట్టుబడులు 3.5 కోట్ల డాలర్లు.. నికర ఆస్తులూ ఉండాలి ♦ మన దేశంలోనూ 2 బిలియన్ డాలర్లు పెడితే దీర్ఘకాలిక వీసా? ♦ నేటి బడ్జెట్లో ప్రకటించవచ్చంటున్న నిపుణులు శ్రీమంతులకు పలు దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వాన్ని కల్పించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అంటే... ఆ దేశంలో నిర్దిష్టమైన మొత్తాన్ని కనక నిర్దేశించిన రాష్ట్రంలోనో, రంగంలోనో పెట్టుబడిగా పెడితే పౌరసత్వం ఇస్తారన్న మాట. అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలే కాక కరేబియన్, అర్మేనియా తదితర చిన్న దేశాలు కూడా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి శాశ్వత వీసా, పౌరసత్వం ఇస్తున్నాయి. అసలు ఈ పౌరసత్వంతో కలిగే లాభమేంటి? ఏ దేశాలు బిజినెస్ వీసాలను అందిస్తున్నాయి? నిబంధనలేంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... - సాక్షి. ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధి పెట్టుబడులు రెండు రకాలు పెట్టుబడులు పెట్టే విదేశీ వ్యాపారులకు ఏ దేశమైనా ఎర్ర తివాచీ పరుస్తుంది. దీనికి కారణమేంటంటే ఇందుకు కారణం... పెట్టుబడులతో స్థానిక ప్రజలకు ఉద్యోగాలొస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సదరు పెట్టుబడులు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. దీనికోసం దాదాపు అన్ని దేశాలూ పెట్టుబడిదారులకు ఎంటర్ప్రెన్యూర్/బిజినెస్ వీసాలను జారీ చేస్తాయి. వీటినే గోల్డెన్ వీసాలుగా పిలుస్తుంటారు. కొన్నేళ్ల తర్వాత ఈ గోల్డెన్ వీసాలను శాశ్వత వీసా లేదా పౌరసత్వంగా మారుస్తారు. సాధారణంగా విదేశాల్లో పెట్టుబడులను రెండు రకాలుగా పరిగణిస్తారు. 1. ప్రత్యక్ష (యాక్టివ్) 2. పరోక్ష (పాసివ్). ప్రత్యక్ష పెట్టుబడులంటే... ఆయా దేశాల్లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి. లేదా స్థానికంగా ఉండే ఇతర సంస్థలను కొనుగోలు చేయొచ్చు. ఈ రెండూ కాకుంటే ఏదైనా వ్యాపారంలో భాగస్వామిగానైనా కొనసాగొచ్చు. పరోక్ష పెట్టుబడులంటే.. స్థానికంగా ఉన్న ప్రాజెక్ట్‌లలో వాటాలు కొనుగోలు చేయటం. బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా స్థానికంగా స్థిరాస్తులను కొనుగోలు చే యొచ్చు, అద్దెకు కూడా తీసుకోవచ్చు. పెట్టుబడులు, నికర ఆస్తులు కూడా... బిజినెస్ వీసా పొందాలంటే విదేశాల్లో వ్యాపారమే చేయాల్సిన అవసరం లేదు. కరేబియన్, అర్మేనియా వంటి చిన్న దేశాల్లో స్థిరాస్తులను కొనుగోలు చేసినా, అద్దెకు తీసుకున్నా సరిపోతుంది. అయితే చాలావరకూ దేశాల్లో పెట్టుబడుల విలువకు కామన్ నిబంధన ఒకటుంది. అదే 3.5 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, నికర ఆస్తులు కూడా ఉండాలని. అయితే దేశాన్ని బట్టి ఆయా పెట్టుబడులు మారుతుంటాయని దక్షిణాఫ్రికా హై కమిషనర్ ఫ్రాన్స్ కె. మోర్లే ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. దక్షిణాఫ్రికాలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు శాశ్వత వీసా లేదా పౌరసత్వం పొందాలంటే.. వారు పెట్టే కంపెనీల్లో కనీసం 60 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. ‘‘పెపైచ్చు ఈ పెట్టుబడుల్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జోన్ (ఐడీజెడ్), ప్రత్యేక ఆర్థిక మండళ్లలోనే (ఎస్ఈజెడ్) పెట్టాల్సి ఉంటుంది. ఈస్ట్రన్ కేప్ రాష్ట్రంలోని నెల్సన్మండేలా బే, మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొయోగా, రిచర్డ్స్ బే ఐడీజెడ్, ఈస్ట్ లండన్ ఐడీజెడ్, డూబే ట్రేడ్ పోర్ట్, సల్దానా బే ఐడీజెడ్ లలో మాత్రమే పెట్టాలి’’ అని మోర్లే వివరించారు. యూకే విషయానికొస్తే.. అక్కడ ఎంటర్ప్రెన్యూర్ వీసా పొందిన వ్యక్తి స్థానిక ఆర్థిక సంస్థల్లో 2,00,000 యూరోల పెట్టుబడులు పెట్టడంతో పాటు స్థానికంగా 10 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలి. మూడేళ్ల పాటు వార్షిక టర్నోవర్ 5 మిలియన్ యూరోలుండాలి. సంబంధిత వ్యాపారవేత్త నికర ఆస్తుల విలువ కనీసం 2,00,000 యూరోలుండాలనే నిబంధన ఉంది. 35 ఏళ్ల వయస్సు, భాష మీద పట్టు.. విదేశాల్లో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన శాశ్వత వీసా, పౌరసత్వం పొందలేరు. సంబంధిత వ్యాపారవేత్తల వయస్సు, కుటుంబ వివరాలు, భాషా నైపుణ్యం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘35 ఏళ్ల లోపు వయసు, ఆంగ్ల భాష మీద పట్టు, కనీస విద్యార్హతతో పాటు పెట్టదలుచుకున్న వ్యాపారం మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యాపారులకు మంచి అవకాశాలుంటాయి’’ అని ఫ్రాన్స్ కె. మోర్లే చెప్పారు. సాధారణ ఖర్చులు అంటే 12-15 లక్షల బడ్జెట్, వీసా, విమాన టికెట్ల ఖర్చులు, కన్సల్టెంట్ బిల్లు, స్థానికంగా మూడు నెలలు గడిపేందుకు అయ్యే వ్యయం కూడా చేతిలో ఉంచుకోవాలి. కొన్ని దేశాలు భార్యాబిడ్డల విద్యార్హత, భాషా నైపుణ్యాలను కూడా పరిగనణలోకి తీసుకుంటాయి. కేవలం తమ పిల్లలకు శాశ్వత వీసా, పౌరసత్వం కోసమే వ్యాపారం చేద్దామని భావించేవాళ్లక్కూడా కొన్ని దేశాలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే సంబంధిత వ్యాపారవేత్తలు వ్యాపారంతో పాటూ స్థానికంగా ఇతర కార్యక్రమాలూ చేయాల్సి ఉంటుంది. కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ కార్యక్రమాలు చేయాలనే నిబంధన ఉంది. అది కూడా తమ వ్యాపార స్వభావానికి సంబంధించిందై ఉండాలి. ఇన్వెస్టర్లకేం లాభమంటే... విదేశాల్లో వ్యాపారం చేసేవారికేం లాభమంటే... స్థానికంగా వ్యాపార అవకాశాలతో పాటు వారి భార్య, పిల్లల బిజినెస్ వీసాలను కొన్నేళ్ల తర్వాత శాశ్వత రెసిడెన్సీ లేదా పౌరసత్వంగా మార్చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాల పౌరసత్వం ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రపంచ స్థాయి విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్య, కెరీర్‌ను ఎంచుకునే వీలుంటుంది. స్థానికంగా లభించే స్కాలర్షిప్స్ కూడా అందుకోవచ్చు. అందుకే చాలామంది భారత వ్యాపారులు, శ్రీమంతులు (హెచ్ఎన్ఐ) విదేశాల్లో వ్యాపారం చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారని విదేశీ వీసా కన్సల్టెంట్ ఒకరు తెలియజేశారు. దక్షిణాఫ్రికా, యూకే వంటి దేశాల్లో వ్యాపారరీత్యా వలస వచ్చిన వారికి, వారి కుటుంబాలకు వైద్య సదుపాయాలతో పాటు సామాజిక భద్రతనూ అందిస్తున్నారు. అలాగే సంబంధిత వ్యాపారులు స్థానికంగా లేని సమయంలో వారి వ్యక్తిగత స్థిరాస్తులు, అద్దెలను ప్రభుత్వమే సంరక్షిస్తుంది. అయితే అందరు వ్యాపారులు ఇలా వీసాల కోసమే కాకుండా ఆయా దేశాలు అందిస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలతో కూడా పెట్టుబడులు పెడుతున్నారని ఆయన వివరించారు. ఇండియాకైతే పెట్టుబడి రూ.13,200 కోట్లు..! ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం సక్సెస్ కావాలంటే పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు అవసరమని, ఇందుకోసం దేశంలోకి విదేశీ వాణిజ్య వేత్తలు సులభంగా వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. అందుకే దేశంలో రూ.13,200 కోట్లు (2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టే విదేశీయులకు దీర్ఘకాల వీసా లేదా రెసిడెన్సీ అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పాలసీని తేవటమా? లేక ఇప్పటికే ఉన్న విదేశీయులకు సంబంధించిన నిబంధనల్లో సవరణలు తేవాలా.. అనే విషయమై విదేశీ విభాగాల్లోని అధికారులతో ఆర్థిక మంత్రి చర్చిస్తున్నారు. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీనిపై స్పష్టతనిచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవేళ ఈ పాలసీ అమల్లోకి తెస్తే... యూఎస్, కెనడా, సింగపూర్, యూరోపియన్ దేశాల సరసన మనదేశమూ నిలుస్తుంది. ప్రస్తుత నిబంధన ప్రకారం.. వ్యాపార పనులపై వచ్చే విదేశీయులు ఒక విడతలో 180 రోజుల కంటే ఎక్కువ ఇండియాలో ఉండాల్సి వస్తే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నిబంధనల్లో కొన్ని.. * వ్యాపారవేత్త లేదా పెట్టుబడిదారుతో పాటు తన భార్య, పెళ్లికాని పిల్లలను మాత్రమే అనుమతిస్తారు. * పిల్లల వయస్సు 18 లేదా 21 ఏళ్లకు మించకూడదు. అమెరికాలో అయితే పిల్లాడి వయసు 21 ఏళ్లు, కెనడాలో అయితే 19 ఏళ్ల లోపు ఉండాలి. * విదేశాల్లో పెట్టే పెట్టుబడులు (నిధులు) చట్టబద్ధమైన వై ఉండాలి. సంబంధిత పెట్టుబడిదారు నమ్మకస్తుడని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అమెరికాలో అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలతో కాకుండా చేతిలో సొంత పెట్టుబడులు లేనిదే దరఖాస్తు చేసుకోకూడదు. * బిజినెస్ వీసా దరఖాస్తు ప్రక్రియను అనుమతించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు రెండేళ్ల సమయం తీసుకుంటే.. కరేబియన్ వంటి చిన్న దేశాలు ఆరు నెలల సమయాన్ని తీసుకుంటాయి. * స్పెయిన్‌లో వ్యాపారంతో పాటు స్థానికంగా స్థిరాస్తిని లేదా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. * అర్మేనియా వంటి చిన్న దేశాల్లో స్థిరాస్తిని కొన్నా లేదా అద్దెకు తీసుకున్నా బిజినెస్ వీసా పొందొచ్చు. కాకపోతే తమ వార్షికాదాయాన్ని రుజువు చేసుకోవాలి. అది కూడా స్థానిక బ్యాంకులో డిపాజిట్ చేయాలి. -
రాహుల్ పౌరసత్వంపై పిటిషన్
-
'పాక్, బంగ్లా మైనారిటీలకు భారత పౌరసత్వం'
న్యూఢిల్లీ: స్వదేశంలో మైనారిటీలుగా ఉంటూ.. మతపరమైన హింసను ఎదుర్కోలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారందరికీ పౌరసత్వం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించినవారికి లాంగ్‌టర్మ్ వీసా లేదా పౌరసత్వం ఇస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ రిజిజు మంగళవారం లోక్‌సభలో చెప్పారు. స్వదేశంలో అక్కడి ప్రభుత్వ నిర్బంధాన్ని తాళలేక భారత్‌కు వచ్చిన వారిలో బాంగ్లాదేశీలే అధికం. ఆ తరువాతి స్థానంలో పాకిస్థానీలు ఉన్నారు. మతద్వేషం ఎదుర్కోలేక ఇక్కడికి వచ్చిన వారిని ఆదుకోవడం కనీస ధర్మంగా భావిస్తున్నామని, అలాంటి శరణార్థులకు పౌరసత్వం జారీ చేసేందుకు సులువైన విధివిధానాలు రూపొందించామని రిజిజు చెప్పారు. -
పౌరసత్వం 'పిల్'ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు ఇండియా పౌరసత్వం కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత(లోకస్ స్టాండీ) లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విదేశీ పౌరసత్వం కలిగిన ప్రవాస భారతీయులకు ఇండియా సిటిజన్ షిప్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకట్ నారాయణ్ ఈ పిల్ దాఖలు చేశారు. అయితే పౌరసత్వం లేనికారణంగా ఇబ్బందులు పడుతున్న ఎన్నారైలు తమను నేరుగా ఆశ్రయించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన బెంచ్ పేర్కొంది. పిల్ వేయాల్సిన విధానం ఇది కాదంటూ పిటిషనర్ కు చురక అంటించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు స్తోమత లేని పేదలు కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉందని గుర్తు చేసింది. -
చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదు: హైకోర్టు
-
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదు: హైకోర్టు
కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్మే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసలు ఆయన భారత పౌరుడే కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. తాను భారత దేశ పౌరుడినంటూ ఆయన తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, అందువల్ల అసలు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కూడా చెల్లదని కోర్టు తెలిపింది. రమేష్ పౌరసత్వ వివాదంపై ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై విచారించి, తన తీర్పు వెల్లడించింది. దీంతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గతంలో పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కేవలం రమేష్ ఒక్కరిదే సరిగా ఉందంటూ దాన్ని స్పీకర్ మనోహర్ ఆమోదించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన మళ్లీ ఎన్నికయ్యారు. అప్పటి ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వం వివాదంపై కోర్టుకు వెళ్లారు.