ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సిద్ధాంతాలకు ఆకర్షితులై అమెరికా, బ్రిటన్ తదితర దేశాలనుంచి సిరియా వెళ్లినవారిలో చాలామందికి ఇప్పుడు భ్రమలు పటాపంచలయ్యాయి. వీరిలో అత్యధికులు కుర్దిష్ గెరిల్లాల దాడుల్లో పట్టుబడినవారు. కొందరు ఇరాక్‌లో సంకీర్ణ సేనల చేతికి చిక్కారు. ఇలా ఐఎస్ బాట పట్టినవారంతా దాదాపు బడికెళ్లి చదువుకునే పిల్లలు. అందరూ వెట్టిచాకిరీతో, నిరంతర హింసతో మానసికంగా, శారీరకంగా దెబ్బతిన్నారు. అయితే ఆడపిల్లలకు అదనపు సమస్యలున్నాయి. వారు అత్యా చారాలు, ఇతరత్రా శారీరక హింసలు ఎదుర్కొని, గర్భవతులై రోగాల్లో చిక్కుకుని మానసికంగా కుంగి పోయారు.
కొందరు అబార్షన్లబారినపడ్డారు. పుట్టిన వారు పోషకాహారలేమితో కొన్ని నెలలకే కన్నుమూ శారు. వీరందరికీ తాజాగా మరో ముప్పు ముంచుకొ చ్చింది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వీరి పౌర సత్వాన్ని రద్దు చేశాయి. ఈ పిల్లలు ముస్లిం దేశాల నుంచి వలసవెళ్లి స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారు. ఈ గడ్డపై పుట్టినవారికి వేరే అభిప్రాయాలు ఏర్పడినంతమాత్రాన పౌరసత్వం ఎలా రద్దుచేస్తారని కొందరు వాదిస్తుండగా... ఇప్పటికీ పశ్చాత్తాపం లేని వారిని కనికరించరాదని మరికొందరి వాదన. పట్టు బడినవారంతా అప్పట్లో తమ నిర్ణయం సరైందేనని, సిరియా, ఇరాక్ తదితర దేశాల్లో పాశ్చాత్య దేశాలు సాగించిన దమనకాండే తమను ఆ దిశగా ఆలోచిం చేలా చేసిందని ఆ పిల్లలు సమర్థించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment