photo credti: AFP
టెహ్రాన్: తమపై దాడులు చేసిన అమెరికా, బ్రిటన్‌లకు యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడ్డ అమెరికా, యూరప్‌లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హౌతీల డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ అల్ ఎజ్జీ మాట్లాడుతూ ‘యెమెన్‌పై హౌతీలు లక్ష్యంగా అమెరికా,బ్రిటన్‌లు భారీ దాడులు చేశాయి. ఇందుకు వారు తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అన్నారు.
హౌతీ గ్రూపు మరో సీనియర్ మెంబర్ మాట్లాడుతూ ఎర్ర సముద్రంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లకు చెందిన వార్ షిప్పులపై ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు తెలిపాడు. మరోవైపు హౌతీ గ్రూపు లక్ష్యంగా అమెరికా, బ్రిటన్‌లు జరిపిన దాడులు క్రూరమైనవని ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా యెమన్‌కు చెందిన హౌతీ గ్రూపు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై డ్రోన్‌లు, మిసైళ్లతో గత కొంత కాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం అమెరికా, బ్రిటన్‌లకు చెందిన బలగాలు సంయుక్తంగా హౌతీలు లక్ష్యంగా యెమెన్‌లోని పలు చోట్ల వైమానిక దాడులు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment