Houthi rebels
-
అమెరికా యుద్ధనౌకపై హూతీల దాడి: పెంటగాన్
న్యూయార్క్: తమ యుద్ధనౌకపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా వెల్లడించింది. బాబ్ అల్-మందాబ్ జలసంధిని దాటుతున్న సమయంలో రెండు అమెరికా డిస్ట్రాయర్లు లక్ష్యంగా హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారని పెంటగాన్ పేర్కొంది. అయితే.. హైతీ రెబల్స్ ప్రయోగించిన డ్రోనన్లు, క్షిపణులను యుద్ధనౌకలోని సిబ్బంది వెంటనే స్పందించి తిప్పి కొట్టారని అమెరికా వెల్లడించింది. ఇక.. ఈ ఘటనలో యుద్ధనౌకకు ఎటువంటి నష్టం జరగలేదని, సిబ్బందిలో కూడా ఎవరూ గాయపడలేదని వెల్లడించింది.‘‘అమెరికా యుద్ధనౌకలపై ఐదు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులు, మూడు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులతో హౌతీ రెబల్స్ దాడికి పాల్పడ్డారు. అయితే.. వాటిని యుద్ధనౌకలోని సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. యుద్ధనౌకలు దెబ్బతినలేదు. అందులోని సిబ్బంది కూడా ఎవరూ గాయపడలేదు. మరోవైపు.. అమెరికా అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై కూడా దాడి చేశామని హుతీలు చేసిన వాదన సరైనది కాదు. మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా.. హుతీ తిరుగుబాటుదారుల దాడి జరగలేదు’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.నవంబర్ 2023లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్‌లో హుతీ రెబల్స్ పలు నౌకలపై దాడి చేయడం మొదలుపెట్టారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులకు త్యరేకంగా హౌతీ తిరుగుబాటుదాడులు ఇజ్రాయెల్, వాటి మిత్ర దేశాలపై నౌకలపై దాడులకు దిగుతున్న విషయం తెలిసింది. ఇక.. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా.. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్లలో ఇరాన్ మద్దతుగల గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయి. -
ఇజ్రాయెల్‌పై డ్రోన్ దాడులు జరిపాం: హౌతీ రెబల్స్
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సమీపంలో డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించాయి. గురువారం ఉదయం ఆక్రమిక పాలస్తీనాలోని జాఫా (టెల్ అవీవ్) ప్రాంతంలో పలు కీలక లక్ష్యాలను టార్గెట్ చేసి మరీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టినట్లు హౌతీరెబల్స్ తెలిపాయి. తాము ప్రయోగించిన డ్రోన్లను ఇజ్రాయెల్ ఎదుర్కోకపోయింది. దీంతో తాము చేసిన డ్రోన్ దాడుల ఆపరేషన్ విజయవంతమైనట్లు పేర్కొంది.Yemen’s Houthi group says it “achieved its goals” in a drone attack on Tel Aviv, although there was no confirmation from Israeli authorities.“The operation achieved its goals successfully as the drones reached their targets without the enemy being able to confront or shoot them… pic.twitter.com/izNdIn7eAa— GAROWE ONLINE (@GaroweOnline) October 3, 2024 క్రెడిట్స్: GAROWE ONLINEయెమెన్ హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులను ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా గుర్తించకపోవటం గమనార్హం. గత రాత్రి అనుమానాస్పద వైమానిక టార్గెట్లను తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయకంటే ముందే హౌతీలు ఇజ్రాయెల్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు బుధవారం పేర్కొంది.యెమెన్‌లోని చాలా ప్రాంతాలను నియంత్రించే హౌతీ తిరుగుబాటుదారులు.. హమాస్‌పై మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో హౌతీ రెబల్స్ ఓ భాగం. ఇటీవల యెమెన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహిస్తుండగా .. ఇజ్రాయెల్ నగరాలపై హౌతీ రెబల్స్ క్షిపణులు ప్రయోగించి దాడులు చేశాయి.చదవండి: ‘హత్యకు ముందే కాల్పుల విరమణకు నస్రల్లా అంగీకారం’ -
ఇజ్రాయెల్‌పై మిసైల్ దాడి
జెరూసలెం: ఇజ్రాయెల్‌పై హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఆదివారం(సెప్టెంబర్15) ఉదయం మిసైల్‌తో దాడి చేశారు.యెమెన్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.తూర్పు వైపు నుంచి మిసైల్ దూసుకువచ్చింది. అది ఓ బహిరంగ ప్రదేశంలో పడింది. మిసైల్ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలవలేదని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.మిసైల్ దాడి కారణంగా రాజధాని టెల్అవీవ్తో పాటు సెంట్రల్ ఇజజ్రాయెల్లో సైరన్ అలర్ట్ మోగింది. దీంతో పౌరులు సురకక్షిత పప్రాంతాల్లో తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు.క్షిపణి దాడితో భారీ శబ్దాలు వచ్చాయని, ఐరన్‌డోమ్ వ్యవస్థ క్షిపణిపై దాడి చేయడం వల్లే ఈ శబ్దాలు వచ్చాయని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది.కాగా, జులైలో యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ మిలిటెంట్లు రాజధాని టెల్‌అవీవ్‌పై చేసిన డ్రోన్ దాడిలో ఓ పౌరుడు మృతి చెందాడు. ఇరాన్ మద్దతుతోనే హౌతీలు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి..పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి -
చమురు ట్యాంకర్‌కు మంటలు
ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడులకు గురైన ‘సోయూనియన్’ అనే 900 అడుగుల భారీ చమురు ట్యాంకర్ ఇది. ఆగస్ట్ 21వ తేదీన ట్యాంకర్‌కు అంటుకున్న మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇందులోని 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు లీకైతే మునుపెన్నడూ లేనంతగా సముద్ర పర్యావరణానికి హాని కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, సాధ్యమైనంత మేర ట్యాంకర్‌లోని చమురును తరలించే అత్యంత క్లిష్టమైన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. గ్రీస్‌కు చెందిన ఈ నౌక యాజమాన్యం ఈ విషయంలో సౌదీ అరేబియా సాయం కోరింది. అప్పటి వరకు మరిన్ని దాడులు జరగకుండా గ్రీస్, ఫ్రాన్సు నౌకలు ‘సోయూనియన్’కు కాపలాగా ఉన్నాయి. -
అమెరికాకు షాక్.. డ్రోన్‌ను కూల్చేసిన ‘హౌతీ’లు
సనా: అమెరికాకు చెందిన అత్యాధునిక నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్లు యెమెన్ కేంద్రంగా పనిచేసే మిలిటెంట్ గ్రూపు హౌతీ రెబెల్స్ ప్రకటించారు. యెమెన్ గగనతలంలో ఎగురుతున్న ఎమ్క్యూ-9 మానవరహిత విమానాన్ని(యూఏవీ) కూల్చేసినట్లు హౌతీల ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. హౌతీ నియంత్రణలోని యెమెన్ భూభాగంపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు.2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన పలు డ్రోన్లు, నిఘా విమానాలను రెబెల్స్ కూల్చేశారు. ‘మారిబ్ గవర్నరేట్ గగనతలంలో రీపర్ శత్రు కార్యకలాపాలకు పాల్పడుతోంది. అందుకే దానాని కూల్చేశాం. పాలస్తీనా ప్రజలు, యెమెన్ రక్షణ కోసం హౌతీలు దాడులు కొనసాగిస్తూనే ఉంటారు’అని సారీ చెప్పారు.ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్.. ఎన్నో ప్రత్యేకతలు..అమెరికా నిఘా డ్రోన్ ఎమ్క్యూ-9 విమానాన్ని పోలి ఉంటుంది. దీన్ని రిమోట్‌తో ఆపరేట్ చేస్తారు. పైలట్లు ఉండరు. సాధారణ డ్రోన్లతో పోలిస్తే ఈ నిఘా డ్రోన్ చాలా ఎత్తులో ఎగరగలదు. 50 వేల అడుగుల ఎత్తులో 24 గంటలపాటు నిరంతరాయంగా ఎగురుతూ కీలక సమాచారం సేకరించే సామర్థ్యం దీని సొంతం. దీని విలువ సుమారు రూ.250కోట్లకు పైనే.కాగా, ఇజ్రాయెల్- పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్‌కు మధ్య జరుతున్న యుద్ధంలో హౌతీ రెబెల్స్ పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నారు. ఎర్రసముద్రంలోని వాణిజ్య నౌకలు లక్ష్యంగా కొంత కాలం నుంచి హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ఓ వాణిజ్య నౌకపై మిసైల్‌తో దాడి చేశారు. -
హౌతీల మిసైల్ కూల్చివేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్‌లోని అల్ హొదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్స్ (ఐడీఎఫ్) దళాలు మధ్యలోనే దానిని కూల్చివేశాయి.תיעוד: שיגור המיירט בערבה >>@ShaniRami (צילום: אלון וייס, קיבוץ יטבתה) https://t.co/4J3h0Jipsl pic.twitter.com/PnGcJhLIxc— גלצ (@GLZRadio) July 21, 2024 తమ దేశ గగనతలంలోకి ప్రవేశించకముందే క్షిపణిని యారో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్ నగరంలో ఇప్పటికీ క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐరన్‌డోమ్) సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాజధాని టెల్‌అవీవ్‌పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. మరోవైపు ఐడీఎఫ్ దళాలు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి. హెజ్బొల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడులను లెబనాన్ మీడియా ధృవీకరించింది. -
హౌతీలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
సనా: యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అల్హొదైదా పోర్టుతో పాటు పలు చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.పోర్టులోని చమురు నిల్వలకు మంటలంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. శుక్రవారం తమ రాజధాని టెల్ అవీవ్‌పై హౌతీల డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇజ్రాయెల్,హమాస్ యుద్ధం మొదలయ్యాక హౌతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి. యెమెన్‌లో హౌతీలకు చాలా పట్టున్న నగరం అల్హొదైదా. ఇక్కడి ప్రజలకు పోర్టు జీవనాడి లాంటిది. ఇంత కీలకమైన పోర్టు, పవర్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. -
Houthi Rebels: చైనా ఆయిల్ నౌకపై ‘హౌతీ’ల దాడి
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలపై హౌతీలు దాడులు పెంచారు. తాజాగా శనివారం(మార్చ్ 23) యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ హంగ్ పూ పై హౌతీలు బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) ఆదివారం(మార్చ్ 24) ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించింది. పనామా ఫ్లాగ్‌తో నడుస్తున్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తోంది. MARCH 23 RED SEA UPDATE From 2:50 to 4:30 a.m. (Sanaa time) March 23, the Iranian-backed Houthis launched four anti-ship ballistic missiles (ASBM) into the Red Sea in the vicinity of M/V Huang Pu, a Panamanian-flagged, Chinese-owned, Chinese-operated oil tanker. At 4:25 p.m.… pic.twitter.com/n1RwYdW87E — U.S. Central Command (@CENTCOM) March 24, 2024 ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్‌లోని మంగళూరు పోర్టుకు రావాల్సి ఉంది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరూ గాయపడలేదు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ 30 నిమిషాల్లో వాటిని ఆర్పివేశారు. అనంతరం నౌక మళ్లీ ప్రయాణం ప్రారంభించింది. చైనా, భారత్ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీలు తాజా దాడితో మాట తప్పారు. కాగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు మోపెడవుతోంది. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తన్నాయి. ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే ! -
హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్ : హౌతీ గ్రూపు మిలిటెంట్లు తమ ఆయుధాలు దాచుకున్న యెమెన్‌లోని వారి భూగర్భ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్( సెంట్కామ్) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల్లో హౌతీలకు చెందిన నాలుగు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ (యూఏవీ)లను ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. దాడుల సమయంలో హౌతీలు ఎర్ర సముద్రంలోకి నాలుగు యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించినట్లు సెంట్కామ్ వెల్లడించింది. హౌతీల దాడుల్లో నౌకలకు, సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడులను నివారించేందుకే వారి ఆయుధ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు గత కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి యూరప్, అమెరికా వెళ్లే నౌకలు దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అంతర్జాతీయ నౌకాయాన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఇదీ చదవండి.. గాజాలో కాల్పుల విరమణ.. యూఎన్‌లో వీగిన అమెరికా తీర్మానం -
Red Sea: ‘హౌతీ’ల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ ప్రయోగించిన డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా తెలిపింది. హౌతీల డ్రోన్ వల్ల నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. యెమెన్‌లో హౌతీల స్థావరాలపై జరిపిన దాడుల్లో హౌతీలకు చెందిన ఒక అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్(యూఏవీ)ని ధ్వంసం చేసినట్లు తెలిపింది. హౌతీల దగ్గరున్న పరికరాలన్నీ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న హౌతీలు నౌకలపై గత కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్నారు. హౌతీల దాడుల వల్ల ఆసియా నుంచి యూరప్ అమెరికా వెళ్లే దక్షిణాఫ్రికా నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో అమెరికా, బ్రిటన్లు యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇదీ చదవండి.. అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి -
హౌతీ రెబల్స్.. సంక్షోభంలో సముద్ర రవాణా!
భారత్ నుంచి నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలతోపాటు ఉత్తర అమెరికా దేశాలకు సరకు చేయడానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం ప్రధానపాత్ర పోషిస్తాయి. సదరు దేశాల నుంచి సరుకులు, ముడి పదార్థాలు మనదేశానికి రావాలన్నా అదే మార్గం. ఇటీవల కాలంలో ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న అనిశ్చిత పరిస్థితులతో అంతర్జాతీయ వాణిజ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఉంది. దీనికి తోడు సోమాలియా, తదితర దేశాలకు చెందిన సముద్ర దొంగల తాకిడి పెరిగింది. ఇప్పుడు అదనంగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ అంతర్జాతీయ సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దీంతో దేశీయంలో సరుకు, ముడివస్తువులు రవాణా చేస్తున్న కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. ఏ కంపెనీలపై ప్రభావం అంటే.. స్పెషాలిటీ పైపులు, ట్యూబుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ ఆదాయాలు ఈ మూడో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా పెరగలేదు. ఈ సంస్థ ఆదాయాల్లో 85 శాతం వరకూ ఎగుమతులే ఉండటం గమనార్హం. ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ సరకు రవాణా సమస్యాత్మకంగా మారినట్లు, అందువల్ల ఆదాయ అంచనాలను అందుకోలేకపోయినట్లు ఈ సంస్థ యాజమాన్యం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత మదుపరులకు వివరించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని, అయినప్పటికీ తగిన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఖర్చులు కూడా పెరిగినట్లు వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పోకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంది. నౌకల రాకపోకలు నిలిచిపోతున్నాయని, దీనివల్ల ఇతర దేశాలకు సరకు పంపించటం కష్టంగా మారిందని సంస్థ సీఈఓ పరస్ కుమార్ జైన్ త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం కాన్ఫరెన్స్ కాల్లో మదుపరులకు వివరించారు. అంతేగాక అటు వినియోగదార్లకు, ఇటు తమకు ఖర్చులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఐరోపా దేశాల నుంచి ఈ సంస్థ కొన్ని ముడిపదార్థాలు కూడా తెచ్చుకుంటుంది. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో తమపై రవాణా ఛార్జీల భారం అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు, దానికి తగ్గట్లుగా తాము సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! ఎగుమతులు, దిగుమతులు అధికంగా ఉన్న పలు ఇతర కంపెనీలు సైతం ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అవసరమని ఆ వర్గాలు కోరుతున్నాయి. -
Red Sea: ‘హౌతీ’ రెబల్స్‌కు అమెరికా షాక్
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ గ్రూపు మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు షాక్ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్లను శనివారం రాత్రి కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హౌతీలకు చెందిన 28 దాకా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్(యూఏవీ)ను ఎర్ర సముద్రంలో తాజాగా కూల్చివేశాం. హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) వెల్లడించింది. శనివారం ఉదయం అమెరికా డెస్ట్రాయర్ నౌకలు, వాణిజ్య కార్గో నౌకల మీద 37 డడ్రౌన్‌లతో పెద్ద ఎత్తున హౌతీలు దాడికి దిగాయి. దీనికి ప్రతిగా రంగంలోకి దిగిన అమెరికా సంయుక్త దళాలు హౌతీల డ్రోన్లను కూల్చివేశాయి. కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద అమెరికా, ఇజజ్రాయెల్‌లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడులు గత ఏడాది నవంబర్ నుంచి మొదలయ్యాయి. వీటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో ట్రూడో వ్యతిరేక పవనాలు -
ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ఇద్దరి మృతి
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్‌కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది. -
హౌతీల క్షిపణి దాడి.. నౌక మునక
దుబాయ్: హౌతీ మిలిటెంట్ల క్షిపణి దాడిలో దెబ్బతిన్న మొట్టమొదటి వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దాడులకు నిరసనగా యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18వ తేదీన బాబ్ ఎల్ మండెల్ సింధుశాఖ వద్ద రుబీమర్ అనే నౌకపైకి హౌతీలు క్షిపణులను ప్రయోగించారు. దీంతో, ఆ నౌక దెబ్బతినడంతో అందులోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ నౌక నుంచి ఇంధన లీకవుతూ క్రమేపీ మునిగిపోతూ వచి్చంది. శనివారం మధ్యాహా్ననికి రుబీమర్ పూర్తిగా నీట మునిగినట్లు యెమెన్ అధికారులు ధ్రువీకరించారు. -
Houthi Rebels: అమెరికా నౌకపై మిసైళ్లతో దాడి
సనా: యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ మిలిటెంట్లు మళ్లీ రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ టార్మ్ థార్‌పై మిసైళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయిల్ ట్యాంకర్ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదు. నౌకలోని సిబ్బంది ఎవరికీ గాయాలవలేదు. నౌకపై దాడి విషయాన్ని హౌతీ మిలిటెంట్ల ప్రతినిధి సరియా వెల్లడించారు. మరోవైపు ఈ విషయమై అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కూడా ఒక ప్రకటన చేసింది. తమ దేశానికి చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌక లక్ష్యంగా హౌతీలు పేల్చిన యాంటీ షిప్ బాలిస్టిక్ మిసైళ్లను తమ మిసైల్ డెస్ట్రాయర్ యూఎస్ఎస్ మాసన్ కూల్చివేసిందని సెంట్కామ్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ ఎంవీ టార్మ్ థార్, యూఎస్ఎస్ మాసన్కు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. కాగా, గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నయుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు మిసైళ్లు, డ్రోన్లతో గత నవంబర్ నుంచి దాడులు మొదలు పెట్టారు. తొలుత ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీ గ్రూపు తర్వాత అమెరికా, బ్రిటన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన నౌకలపైనా దాడులు చేస్తోంది. ఇదీ చదవండి.. రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు వెలికితీత -
Houthi Rebels: హౌతీ స్థావరాలపై అమెరికా దాడులు
సనా: యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా ఆర్మీ మళ్లీ దాడులు జరిపింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) వెల్లడించింది. హౌతీలకు చెందిన యాంటీ షిప్ క్రూయిజ్ మిసైళ్లు, మానవ రహిత ఉపరితల ఓడ, మానవ రహిత జలాంతర్గామిపై దాడులు జరిపినట్లు తెలిపింది. ‘ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలు, ఇతర దేశాల మధ్య సముద్ర రవాణాకు హౌతీల నుంచి పెను ముప్పు పొంచి ఉంది. హౌతీలు తొలిసారిగా మానవరహిత జలాంతర్గాములను వాడుతున్నారు. ఎర్ర సముద్ర రవాణాను రక్షించేందుకే హౌతీ స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేశాం’అని సెంట్కామ్ అధికారులు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా కేవలం ఇజ్రాయెల్ నౌకలపైనే దాడులు చేస్తామని తొలుత ప్రకటించిన హౌతీలు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే అమెరికా,బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల వాణిజ్య నౌకలపైనా దాడులు చేస్తున్నారు. దీంతో ఆసియా నుంచి అమెరికా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇదీ చదవండి.. చేజారిన తోడే.. బొడ్డు తాడై -
Houthi Attacks: వెనక్కు తగ్గని హౌతీలు
సనా: యెమెన్‌లోని తమ స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులు, గస్తీలకు హౌతీ తిరుగుబాటుదారులు బెదరడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన రెండు నౌకలపై విజయవంతంగా దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. హౌతీ ప్రతినిధి యాహ్య సారె మాట్లాడుతూ ‘అమెరికా నౌక ‘స్టార్ నాసియా’పై తొలి బ్రిటీష్ నౌక ‘మార్నింగ్ టైడ్’పై దాడి చేశాం’ అని వెల్లడించారు. బ్రిటన్ నౌకపై దాడిని ఆ దేశ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ ఆంబ్రే ధ్రృవీకరించింది. యెమెన్‌లో హౌతీ మిలిటెంట్ల ఆధీనంలోని హుడేడా పోర్టు నుంచి జరిపిన క్షిపణి దాడిలో మార్నింగ్ టైడ్ నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. అయితే నౌకలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. బార్బడోస్ జెండాతో వస్తున్న ఈ నౌక బాబ్ ఎల్ మండెప్ జలసంధి దాటగానే స్పీడ్ పెంచినప్పటికీ హౌతీల దాడికి చిక్కిందని బ్రిటన్ తెలిపింది. నౌకపై యాంటీ షిప్ మిసైల్‌తో దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌక బ్రిటన్‌లోని ఫురాడినో కంపెనీకి చెందినదిగా గుర్తించారు. తమ నౌక ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తోందని కంపెనీ పేర్కొంది. కాగా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అమెరికా, బ్రిటన్ ఇటీవల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు తీవ్రం చేసిన విషయం తెలిసిందే. యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సేనలు గత వారం బాంబులతో విరుచుకుపడ్డాయి. మిలిటెంట్లకు చెందిన పలు స్థావరాల్లో నౌకలపై దాడికి సిద్ధంగా ఉన్న క్షిపణులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. ఇదీచదవండి.. పాక్ ఎన్నికల కోసం 54 వేల చెట్ల నరికివేత -
యెమెన్‌లో హౌతీల స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై అమెరికా కూటమి కన్నెర్ర చేసింది. యెమెన్‌లో డజన్ల కొద్ది హౌతీ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు జరిపాయి. దాదాపు 13 ప్రదేశాల్లో 36 స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. హౌతీల ఆయుధ సామాగ్రిని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా కూటమి స్పష్టం చేసింది. జనవరి 28న జోర్డాన్‌లో ముగ్గురు అమెరికా సైనికులను దుండగులు హత్య చేశారు. దీనికి వ్యతిరేకంగా ఇరాక్, సిరియాలో ఇరాన్-సంబంధిత లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులు జరిపిన ఒక రోజు తర్వాత యెమెన్‌లో మళ్లీ ఉమ్మడి వైమానిక దాడులు జరిగాయి. "అంతర్జాతీయ వాణిజ్య షిప్పింగ్‌తో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా యెమెన్‌లోని 13 ప్రదేశాలలో 36 హుతీ స్థావరాలపై దాడి చేశాం" అని యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ సహా ఇతర దేశాల కూటమి స్పష్టం చేసింది. హౌతీల ఆయుధాల నిల్వలపై, క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లతో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై ప్రయోగించడానికి సిద్ధమైన ఆరు హౌతీ యాంటీ షిప్ క్షిపణులపై అమెరికా సంయుక్త దళాలు విడివిడిగా దాడులు చేశాయని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా హౌతీలు ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తున్నారు. మొదట ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన హౌతీలు.. ఇతర దేశాల నౌకలపై కూడా దాడులు ప్రారంభించాయి. దీంతో అమెరికా సహా 12 దేశాలు ఏకమై ఎర్ర సముద్రంలో హౌతీల దాడులకు అడ్డుకట్టవేస్తున్నాయి. ఇదీ చదవండి: ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు -
బ్రిటిష్ నౌకపై హౌతీల దాడి
జెరూసలేం: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచి్చపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్‌తోపాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ కారీ్నపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా, అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికా దళం ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్లింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్ సింధులో చోటుచేసుకుంది. బ్రిటిష్ చమురు నౌక ఎంవీ మర్లిన్ లువాండా లక్ష్యంగా హౌతీలు ప్రయోగించిన క్షిపణితో నౌకలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. విపత్తు సమాచారం అందుకున్న భారత నేవీకి చెందిన డె్రస్టాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం అక్కడికి చేరుకుంది. నౌకలో మంటలను ఆర్పి, సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నౌకలోని సిబ్బందిలో 22 మంది భారతీయులతోపాటు ఒక బంగ్లాదేశీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదని సమాచారం. ఇలా ఉండగా, ఏడెన్ సింధు శాఖలో పయనించే చమురు నౌకలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగిన నేపథ్యంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక యూఎస్ఎస్ కార్నీని మోహరించింది. ఈ నౌకపైకి శుక్రవారం హౌతీలు మొట్టమొదటిసారిగా క్షిపణిని ప్రయోగించారు. దీనిని మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా నేవీ ప్రకటించింది. -
Houthi Rebels: నౌకలపై దాడులు.. హౌతీల కీలక ప్రకటన
సనా : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడుల తీవ్రతను పెంచే ఉద్దేశం లేదని, కేవలం ఇజ్రాయెల్‌తో సంబంధమున్న నౌకలే తమ లక్ష్యమని యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ గ్రూపు ప్రకటించింది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్లు తమపై చేస్తున్న దాడులకు స్పందిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు హౌతీల అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఓ వార్తా సంస్థకు ఈ విషయాలు వెల్లడించాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ని తాము లక్ష్యంగా చేసుకోమని చెప్పారు. ‘మేం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఒక్క చుక్క రక్తం చిందవద్దని, ఎలాంటి ఆస్తి నష్టం జరగకూడదని నిర్ణయించుకున్నాం. ఒక్క ఇజ్రాయెల్‌పైనే మా ఒత్తిడి. మిగిలిన ఏ దేశంపైనా ఒత్తిడి పెట్టడం మా ఉద్దేశం కాదు’అని సలామ్ స్పష్టం చేశాడు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సుముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగారు. తాజాగా అమెరికా, బ్రిటన్లు సంయుక్తంగా యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో హౌతీలు తాము ఎవరిపైనా దాడులు చేయబోమని ప్రకటించడం గమనార్హం. ఇదీచదవండి.. రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు.. కారణమిదే -
హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు
యెమెన్, సనా: ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలపై తిరుగుబాటుకు యెమెన్ పిలుపునిస్తోంది. అయితే.. హౌతీలపై భూతల దాడులు చేయడానికి తమ సైన్యానికి తోడుగా ఇతర దేశాల సైన్యం సహకారం అవసరమని యెమెన్ అధ్యక్ష మండలి డిప్యూటీ నాయకుడు అన్నారు. ఎడెన్ పోర్టు సమీపంలో అమెరికా నౌకపై హౌతీలు దాడి జరిపిన అనంతరం ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఎడెన్ పోర్టు ప్రాంతంలో అమెరికా నౌకపై క్షిపణులతో దాడి చేశామని హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అయితే.. ఈ దాడిలో తమ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎలాంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదని అమెరికా స్పష్టం చేసింది. హౌతీల యాంటీ షిప్ క్షిపణిపై అమెరికా దాడులు జరిపిన మరుసటి రోజే ఎడెన్ పోర్టు ప్రాంతంలో హౌతీలు రెచ్చిపోయారు. 'హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, యూకే వైమానిక దాడులతో పాటు భూతల యుద్ధానికి మాకు విదేశీ సహాయం అవసరం. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నావిగేషన్‌ను సురక్షితంగా ఉంచడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమి అవసరం" అని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ నౌకలపై దాడులు ప్రారంభించారు. ఇజ్రాయెల్‌కు వెళ్లే నౌలపైనే కాకుండా ఇతర దేశాల నౌకలపై కూడా హౌతీల దాడులు విస్తరించాయి. దీంతో అమెరికా సహా మిత్రపక్షాలు ఏకమై ఎర్రసముద్రంలో హౌతీల దాడుల నుంచి నౌకలను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదీ చదవండి: Pakistan Strikes On Iran: ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి -
నౌకలపై దాడులు.. ఇంధన సరఫరాపై ప్రభావం: జై శంకర్
టెహ్రాన్: ఎర్రసముద్రంలో వాణిజ్య రాకపోకలకు పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. భారతదేశానికి సమీపంలో నౌకలపై దాడులు తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు ఎవరికీ ప్రయోజనం కలిగించబోవని చెప్పారు. ఎర్రసముద్రంలో ఓడలపై జరుగుతున్న దాడుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరబ్దొల్లాహియాన్తో చర్చల తర్వాత మీడియాతో మాట్లాడారు. "భారతదేశ సమీపంలోనూ కొన్ని దాడులు జరిగాయి. ఇది అంతర్జాతీయ సమాజానికి చాలా ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి చర్యలు భారతదేశ ఇంధనం, ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ చర్యలతో ఎవరికీ ప్రయోజనం ఉండదు.” అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గాజాలో యుద్ధం ఆందోళన కలిగించే అంశమని జైశంకర్ అన్నారు. పౌరుల ప్రాణనష్టం, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులతో మానవతా సంక్షోభం నెలకొంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గాజాకు భారత్ స్వయంగా సామగ్రిని పంపి సహాయం చేసిందని స్పష్టం చేశారు. పాలస్తీనాలో నెలకొన్న పరిస్థితుల్ని పరిష్కరించేలా భారత్ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
ఎర్రసముద్రంలో యుద్ధమేఘాలు.. హౌతీ క్షిపణిని కూల్చివేసిన అమెరికా
వాషింగ్టన్: ఎర్రసముద్రంలో అలజడి నానాటికీ పెరిగిపోతోంది. హౌతీ తిరుగుబాటుదారులు, అమెరికా మిత్రపక్షాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. హౌతీల దాడులకు అమెరికా మిత్రపక్షాలు అడ్డుకట్ట వేసే క్రమంలో ఇరువైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా సాయుధ నౌకపై హౌతీలు ప్రయోగించిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణిని అమెరికా ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేసింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎవరూ గాయపడలేదని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొంది. యెమెన్‌లోని హుడైదా సమీపంలో క్షిపణిని కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. యెమెన్ గగనతలం, తీరప్రాంతానికి సమీపంగా అమెరికా విమానాలు ఎగురుతున్నట్లు హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్సలామ్ ఫిర్యాదు చేశారు. అమెరికా చర్య యెమెన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు పశ్చిమాసియాలో ఆందోళనలను పెంచుతోంది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపైనే దాడులు చేస్తున్నామని తెలుపుతున్నప్పటికీ.. యూరప్ సహా అనేక దేశాల ఓడలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని ఖండించిన అమెరికా మిత్రపక్షాలు హౌతీల దాడులకు అడ్డుకట్ట వేయడానికి నడుం బిగించాయి. ఎర్ర సముద్రంలో హౌతీలపై దాడులు పెంచుతున్నాయి. ఇదీ చదవండి: Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు -
America Britain Strikes : హౌతీల కీలక వ్యాఖ్యలు
సనా: యెమెన్ రాజధాని సనాలోని తమ స్థావరాలపై అమెరికా,బ్రిటన్లు సంయుక్తంగా చేస్తున్న దాడులను హౌతీ మిలిటెంట్లు తేలిగ్గా కొట్టి పారేశారు. దాడుల ప్రభావం తమపై పెద్దగా లేదని, దాడుల్లో ఎవరూ గాయపడలేదని హౌతీ గ్రూపు సీనియర్ కమాండర్ మహ్మద్ అబ్దుల్ సలాం చెప్పాడు. అయితే దాడులకు మాత్రం తాము గట్టిగా బదులిస్తామని స్పష్టం చేశాడు. ఎర్ర సముద్రంలో నుంచి వెళ్లే ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న అన్ని వాణిజ్య నౌకలపై తమ దాడులు కొనసాగుతాయని తెలిపాడు. బ్రిటన్‌తో కలిసి హౌతీలపై చేస్తున్న వైమానిక దాడులపై అమెరికా వివరాలు వెల్లడించింది. తాము ఇప్పటివరకు జరిపిన దాడుల కారణంగా హౌతీలు మళ్లీ డ్రోన్లు, మిసైళ్లతో ఇప్పట్లో నౌకలపై దాడి చేయకపోచ్చని తెలిపింది. యెమెన్‌లో హౌతీలు డ్రోన్లు, మిసైళ్లు నిల్వ ఉంచిన స్థావరం తమ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా వెల్లడించింది. కాగా, హౌతీ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ అలీ అల్ హౌతీ మాట్లాడుతూ యెమెన్‌పై అమెరికా దాడులను ఉగ్రవాదంతో పోల్చాడు. అమెరికా ఒక పెద్ద దయ్యమని మండిపడ్డాడు. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై శుక్రవారం ప్రారంభమైన అమెరికా, బ్రిటన్ల వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదీచదవండి.. హౌతీలపై బ్రిటన్, అమెరికా దాడులు -
America Britain Attacks : టర్కీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అంకారా: యెమెన్‌లోని హౌతీ గ్రూపు స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలు హౌతీలపై అవసరమైన దానికంటే ఎక్కువ దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. హౌతీలపై దాడులకు దిగడం ద్వారా ఎర్ర సముద్రాన్ని రక్త సముద్రంగా మార్చేందుకు అమెరికా, బ్రిటన్ ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వివిధ మార్గాల ద్వారా తమకు అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా, బ్రిటన్ల దాడుల నుంచి హౌతీలు తమను తాము రక్షించుకుంటూ సరైన రీతిలో స్పందిస్తున్నారని ఎర్డోగాన్ తెలిపారు. తాము కూడా అమెరికా, బ్రిటన్ల దాడులపై అవసరమైన రీతిలో స్పందిస్తామని చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూపు మిలిటెంట్లు ఎర్ర సముద్రం నుంచి వెళ్లే వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగుతున్నారు. ఈ దాడులు ఎక్కువవడంతో అమెరికా, బ్రిటన్లకు చెందిన వైమానిక బలగాలు తాజాగా యెమెన్‌లోని హౌతీ గ్రూపు స్థావరాలు లక్ష్యంగా దాడులు జరిపి పలు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇదీచదవండి.. చైనా బొగ్గు గనిలో భారీ పేలుడు.. 10 మంది మృతి