సనా: యెమెన్లో వైమానిక దాడులు చోటు చేసుకొని వందమంది ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో అమాయకులైన ప్రజలే ఎక్కువగా ఉన్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు. హౌతి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఉత్తర, దక్షిణ యెమెన్ ప్రాంతాలపై సౌదీ అరెబియాకు చెందిన యుద్ధ విమానాలు ఈ దాడులు నిర్వహించాయి. ఈ దాడులు అమ్రాన్ ప్రావిన్స్లోని మార్కెట్ పై పడటంతో షాపింగ్ కు వచ్చిన పలువురు ప్రాణాలు కోల్పోయారు.