airstrikes
-
సొమాలియాలో అమెరికా వైమానిక దాడులు
వాషింగ్టన్: సొమాలియాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా మిలటరీ శనివారం వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక సొమాలియాలో జరిగిన మొట్టమొదటి దాడి ఇది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సొమాలియా ప్రభుత్వ సహకారంతో యూఎస్ ఆఫ్రికా కమాండ్ ఈ దాడులు చేపట్టిందని రక్షణ మంత్రి పీట్ హగ్సెత్ తెలిపారు. వైమానిక దాడిలో పలువురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అయితే, పౌరులెవరికీ ఎలాంటి హాని కలగలేదని తెలిపింది. సీనియర్ ఐసిస్ నేతతోపాటు మరికొందరు లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సీనియర్ నేత కోసం అమెరికా చాలా ఏళ్లుగా గాలిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం మాత్రం ఇతడి అడ్డు తొలగించడంలో ఎంతో ఆలస్యం చేసిందని విమర్శించారు. ఆ పని తాము చేశామని ట్రంప్ ప్రకటించుకున్నారు. తాజా దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వారు దాక్కున్న గుహలు నామరూపాల్లేకుండాపోయాయని తెలిపారు. అయితే, ఈ దాడుల్లో సదరు ఐఎస్ నేత ఎవరు? అతడు హతమయ్యాడా లేదా? అనే విషయాలను ఆయన వెల్లడించలేదు. అమెరికన్లపై దాడులకు పాల్పడే ఐసిస్ తదితర గ్రూపులకు నా హెచ్చరిక ‘మీరెక్కడున్నా కనిపెట్టి, మట్టుబెడతాం’అని ఆయన ప్రకటించారు. సొమాలియా ఉత్తర ప్రాంతంలో దాక్కున్న ఐసిస్ నాయకత్వం విదేశీయులను కిడ్నాప్ చేయడం, డ్రోన్ల దృష్టిలో పడకుండా తప్పించుకోవడం, యుద్ధ తంత్రాలపై తమ శ్రేణులకు తర్పీదు నిస్తున్నాయని అమెరికా సైనికాధికారులు అంటున్నారు. -
సరికొత్త సంకటంలోకి సిరియా
ఒక సమస్య నుంచి బయటపడిన సిరియాను బయటి శక్తుల రూపంలో మరో సమస్య వెన్నాడటం అప్పుడే మొదలైపోయింది. అటువంటి శక్తులలో అన్నింటికన్న ప్రధానమైనది ఇజ్రాయెల్. సిరియా అధ్యక్షుడు అసద్ పతనం ఈనెల 8వ తేదీన జరిగింది. కాగా సిరియాకు పొరుగునే ఉన్న ఇజ్రాయెల్ సైన్యం, అంతకన్న ఒకరోజు ముందే సరిహద్దులు దాటి చొచ్చుకు వచ్చింది. అలా ప్రత్యక్ష దురాక్రమణ మొదలు కాగా, ఇప్పటికి దేశమంతటా కొన్నివందల వైమానిక దాడులు జరిపింది. ఈ చర్యలను ఐక్యరాజ్యసమితితో సహా వివిధ దేశాలు ఖండించినా ఇజ్రాయెల్ ఆపటం లేదు. గోలన్ హైట్స్ప్రాంతం తమదేననీ, దానిని వదలుకునే ప్రసక్తే లేదనీ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. అంటే, దాన్ని వారిక ఖాళీ చేయబోరు!సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దులలో గోలన్ హైట్స్ పేరిట పర్వత శ్రేణులున్నాయి. పాల స్తీనా సమస్యను పురస్కరించుకుని అరబ్ దేశాలకూ, ఇజ్రాయెల్‌కూ 1967లో జరిగిన యుద్ధంలో, సిరియాకు చెందిన గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో పూర్తిగా విలీనం చేసుకుంటున్నట్లు 1981లో ప్రకటించింది. ఆ చర్య అంతర్జా తీయ చట్టాలకు విరుద్ధం గనుక గుర్తించబోమని ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా సైతం ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ లెక్క చేయ లేదు. గోలన్ హైట్స్ మొత్తం విస్తీర్ణం సుమారు 18 వేల చ.కి.మీ. కాగా, అందులో 12 వేల చ.కి.మీ.ను ఆక్రమించిన ఇజ్రాయెల్‌కు, సిరియాకు మధ్య నిర్యుద్ధ భూమి ఏర్పడింది. ఆ ప్రాంతం ఐక్య రాజ్యసమితి దళాల పర్యవేక్షణలోకి వెళ్లింది. ఇపుడు అసద్ పతన సమయంలో, ఇజ్రాయెల్ సైన్యం అకస్మాత్తుగా ఆ నిర్యుద్ధ ప్రాంతంలోకి చొచ్చుకుపోయి ఆక్రమించింది.తాత్కాలిక చర్య అనుకోగలమా?ఇజ్రాయెల్ చర్యను ఐక్యరాజ్యసమితితో పాటు సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్, ఖతార్ తదితర దేశాలు ఖండించాయి. ఇజ్రాయెల్ సేనలు వెనుకకు పోవాలన్నాయిగానీ, అందుకు ప్రధాని నెతన్యాహూ ససేమిరా అన్నారు. ఇక్కడ చెప్పుకోవలసిన ఒక విషయమేమంటే, గోలన్ ఆక్రమణను మొదట వ్యతిరేకించిన అమెరికా, తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2017లో ఆమోదించింది. ఇపుడు తిరిగి ట్రంప్ రానున్నందున అమెరికా వైఖరి ఏమి కాగలదో ఊహించవచ్చు. నెతన్యాహూ ధైర్యానికి అది కూడా కారణమై ఉండాలి. అమె రికా మాట అట్లుంచితే, అసలు గోలన్ ప్రాంతం యావత్తూ తమకు చెందినదేననీ, కనుక దానిని వదలుకునే ప్రసక్తే లేదనీ నెతన్యాహూ గతంలోనే ప్రకటించారు. అక్కడి జనాభాలో గల సిరియన్లను వేధించటం, అక్కడినుంచి తరలిపోయేట్లు చేయటం, వేలాదిమంది యూదుల కోసం సెటిల్మెంట్లు సృష్టించటం ఒక విధానంగా అనుసరి స్తున్నారు. ఆ విధంగా అక్కడి సిరియన్లు మైనారిటీగా మారారు. ఇప్పుడు తాజాగా నిర్యుద్ధ లేదా నిస్సైనిక మండలంలోకి వెళ్లి, సమితి సైన్యాన్ని కాదంటూ ఆక్రమించిన దరిమిలా, ఇది తాత్కాలిక చర్య మాత్రమేననీ, ఆ ప్రాంతంలో సిరియన్ తీవ్రవాదులు పుంజుకోకుండా ముందు జాగ్రత్త కోసమనీ నెతన్యాహూ వివరించే యత్నం చేస్తున్నారు.కానీ, ఆయన వివరణను నమ్మేందుకు సమితిగానీ, మరొకరు గానీ సిద్ధంగా లేరు. యథాతథంగా ఇజ్రాయెల్ చర్య సిరియా సార్వ భౌమత్వానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. నిస్సైనిక ప్రాంతం సమితి సేనల అధీనంలో ఉన్నందున ఆ ప్రాంత నిర్వహణను సమితికే వదలి వేయాలి తప్ప ఇజ్రాయెల్ జోక్యం తాత్కాలికం పేరిటనైనా సరే ఆమోదనీయం కాదు. అందుకు సమితి ముందస్తు అనుమతి కూడా లేదు. ఈ విధంగా తాత్కాలిక ఆక్రమణ లేదా పర్యవేక్షణ పేరిట పాల స్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లోని ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించి, ఇప్పటికి అరవై సంవత్సరాలు గడిచినా ఖాళీ చేయటం లేదు. ఇటీవల ఒక కొత్త వాదాన్ని ముందుకు తెచ్చింది. దాని ప్రకారం, అసలు వెస్ట్ బ్యాంక్ అనేది ఇజ్రాయెల్‌లో ఒక భాగమే తప్ప దానికి పాలస్తీనాతో సంబంధం లేదు. అందువల్ల తమ సెటిల్మెంట్లు చట్ట విరుద్ధం కాదు. క్రమంగా ఆ ప్రాంతాన్నంతా ఇజ్రాయెల్‌లో విలీనం చేస్తాం. ఇక్కడ కాకతాళీయమైన ఒక విశేషమేమంటే ఆ విధానాలను, అక్కడి జెరూసలేంకు ఇజ్రాయెల్ రాజధానిని టెల్ అవీవ్ నుంచి బదిలీ చేయటాన్ని ట్రంప్ తన మొదటి పాలనా కాలంలో ఆమోదించారు. ఈ పరిణామాలను ప్రస్తుతం గోలన్ ప్రాంతంలో జరుగుతున్న దానితో పోల్చితే ఏమనిపిస్తుంది? నిస్సైనిక మండలంలోకి ఇజ్రాయెలీ సేనల ప్రవేశం తాత్కాలికమని నమ్మగలమా? పైగా, ఆ పర్వత శ్రేణులన్నీ తమవేనని నెతన్యాహూ గతంలోనే స్పష్టంగా ప్రకటించిన స్థితిలో?గోలన్ హైట్స్ ఇజ్రాయెల్కేనా?విషయం ఇంతటితో ముగియటం లేదు. తమ ఆక్రమణకు బయట ఇంకా సిరియా అధీనంలోనే గల ప్రాంతాన్ని, ఆ పరిసరాలను కూడా ‘స్టెరైల్ జోన్’ (నిర్జీవ మండలం)గా మార్చివేయగలమన్న నెతన్యాహూ అందుకోసం తమ సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ మాటకు ఆయన చెబుతున్న అర్థం ఇక అక్కడ సిరియన్ తీవ్రవాదుల కార్యకలాపాలకు గానీ, స్థావరాలకుగానీ శాశ్వతంగా ఎటువంటి అవకాశాలు లేకుండా చేయటం. వినేందుకు ఇది సహేతు కంగా తోచవచ్చు. కానీ, పైన చెప్పుకొన్న వివరాలలోకి వెళ్లినపుడు ఇజ్రాయెల్ అసలు ఉద్దేశాలు ఏమిటనేది అర్థమవుతుంది. సూటిగా చెప్పాలంటే, గోలన్ ప్రాంతాన్ని వారిక ఖాళీ చేయబోరు. తమ అధీనంలో లేని భాగాన్ని కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆక్రమణ లోకి తెచ్చుకుంటారు.ఇదంతా నిరాటంకంగా సాగేందుకు ఇజ్రాయెల్ సేనలు 8వ తేదీ నుంచే ఆరంభించి మరొక పని చేస్తున్నాయి. అది, సిరియా వ్యాప్తంగా నిరంతరం వందలాది వైమానిక దాడులు. అవన్నీ సిరియా ఆయు ధాగారాలపై, ఉత్పత్తి కేంద్రాలపై, వైమానిక, నౌకా స్థావరాలపై జరుగుతున్నాయి. యుద్ధ విమానాలను, రాకెట్లను, నౌకలను ఇప్పటికే దాదాపు ధ్వంసం చేశారు. వాటిలో అసద్ కాలం నాటి రసాయనిక ఆయుధాలు కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెప్తున్నది. ఇవన్నీ సిరియాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తీవ్రవాదుల చేతికి రాకూడదన్నది తమ లక్ష్యమైనట్లు వాదిస్తున్నది. వాస్తవానికి ఇంతటి స్థాయిలో కాకున్నా ఐసిస్ కేంద్రాలని చెప్పే ఈశాన్య ప్రాంతానికి పరిమితమై అమెరికా కూడా దాడులు సాగిస్తున్నది. సమస్య ఏమంటే, అటు గోలన్ ఆక్రమణలు గానీ, ఇటు ఈ దాడులు గానీ సిరియా సార్వభౌమ త్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, సమితిలో ఎటువంటి ప్రమేయం లేకుండా ఏకపక్షంగా జరుగుతున్నవి.కొత్త ప్రభుత్వపు అడుగులుసిరియా ప్రజలు అయిదు దశాబ్దాల నియంతృత్వం నుంచి,అంతకు మించిన కాలపు వెనుకబాటుతనం నుంచి ఒక కొత్త దశలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా ఒక నియంతను కూల దోయటం ద్వారా ఒక అడుగు వేసి 24 గంటలైనా గడవకముందే, బయటి శక్తులు తమ ప్రయోజనాల కోసం ఈ విధమైన చర్యలకు పాల్పడితే, ఆ ప్రజలు ఏమి కావాలి? సదరు ఆయుధాలన్నీ సిరియా దేశపు రక్షణ సంపద. అక్కడ కొత్తగా అధికారానికి వచ్చేది ఎవరన్నది ఇంకా తెలియదు. దేశంలో వేర్వేరు గ్రూపులు ఉండటం, వాటిలో ఒకటి రెండింటికి ఇస్లామిస్ట్ తీవ్రవాద నేపథ్యం ఉండటం నిజమే. కానీ ఆ సంబంధాలను వారు బహిరంగంగా తెంచివేసుకుని సుమారు ఎనిమిది సంవత్సరాలవుతున్నది. ఇపుడు డమాస్కస్‌లో అధికారానికి వచ్చిన తర్వాత, ప్రధాన గ్రూపు నాయకుడైన మహమ్మద్ జొలానీ, తాము దేశంలోని అన్ని జాతులు, వర్గాల ప్రజలను ఐక్యం చేసి అందరి బాగు కోసం పాలించగలమని ప్రకటించారు. మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశించగలమన్నారు. మహిళలపై ఎటువంటి ఆంక్షలు ఉండవన్నారు. అసద్‌కు పూర్తి మద్దతునిచ్చిన రష్యా, ఇరాన్‌లతోనూ సత్సంబంధాలకు సుముఖత చూపుతున్నారు. అసద్ హయాంలోని మంత్రి వర్గాన్ని తాత్కాలిక ప్రాతిపదికపై కొనసాగిస్తూ, దేశంలో పరిస్థితులు కుదుట పడేట్లు చూస్తున్నారు.ఉద్యమాల దశలో ఎవరికి ఏ నేపథ్యం ఉన్నా, వారి పరివర్తనలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్యం. ఆ విజ్ఞత లేని బయటి శక్తులు కేవలం తమ ప్రయోజనాల కోసం ఏవో సాకులు చెప్తూ ఈ విధంగా వ్యవహరించటం ఆమోదించదగిన విషయం కాబోదు.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
శిథిలాల్లో 30 మృతదేహాలు
బీరుట్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ భవనం నేలమట్టమైంది. బుధవారం సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న కనీసం 30 మృత దేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కిందే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా చేపట్టిన ఈ దాడిపై ఇజ్రాయెల్ ఆర్మీ స్పందించలేదు. తీరప్రాంత సిడాన్ నగరానికి ఉత్తరాన ఉన్న ఈ పట్టణంపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడి చేసిన దాఖలాలు లేవు. ఇలా ఉండగా, లెబనాన్‌లోని హెజ్బొల్లా సాయుధ గ్రూపు బుధవారం ఇజ్రాయెల్‌పైకి కనీసం 10 రాకెట్లను ప్రయోగించింది. దీంతో, టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి. ఒక రాకెట్ శకలం సెంట్రల్ ఇజ్రాయెల్ నగరం రాననలోని పార్కు చేసిన కారుపై పడింది. టెల్ అవీవ్‌లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలోని బహిరంగ ప్రాంతంలో రాకెట్లు పడ్డాయని మీడియా తెలిపింది. విమానాల రాకపోకలు మాత్రం కొనసాగాయని పేర్కొంది. రాకెట్ల దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సహాయక బృందాలు తెలిపాయి. -
హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్‌లో బీభత్సం! తాజాగా..
జెరుసలేం: లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు గురువారం ఇజ్రాయెల్‌పైకి భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మెటులా ప్రాంతంలో ఆలివ్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే నలుగురు విదేశీ కారి్మకులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన కార్మికులు ఏ దేశస్తులో అధికారులు వెల్లడించలేదు. అక్టోబర్ మొదట వారంలో ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌పై భూతల దాడులకు దిగాక హెజ్బొల్లా చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని హైఫా పైకి దూసుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఉండగా, ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే రాకెట్ ఒకటి బుధవారం లెబనాన్‌లోని తమ శాంతి పరిరక్షక దళం బేస్‌పై పడిందని ఐర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఆ రాకెట్ దానంతటదే పడిందా, లేక ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చిందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. గాజాలో 25 మంది మృతి: డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ గురు, శుక్రవారాల్లో జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. వీరిలో ఐదుగురు చిన్నారులున్నట్లు అల్ అక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో పదేళ్ల చిన్నారి, 18 నెలల వయస్సున్న ఆమె సోదరుడు ఉన్నారు. దాడి తర్వాత వీరి తల్లి ఆచూకీ కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారుల తండ్రి నాలుగు నెలల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడని వారు చెప్పారు. ఐరాస కార్యాలయం ధ్వంసం వెస్ట్‌బ్యాంక్‌లోని నూర్షమ్స్ శరణార్ధి శిబిరంలో ఉన్న ఐరాస శరణార్థి విభాగం కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం బుల్దోజర్లతో ధ్వంసం చేసింది. కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని పాలస్తీనా మీడియా తెలిపింది. కార్యాలయం వెలుపలి గోడ ధ్వంసమైంది. తాత్కాలిక హాల్ మొత్తం నేలమట్టమైంది. పైకప్పు దెబ్బతింది. భవనం ప్రాంగణం మట్టి, శిథిలాలతో నిండిపోయిట్లు కనిపిస్తున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. లెబనాన్‌లో 24 మంది మృతి లెబనాన్‌లోని బీరుట్, బాల్బెక్–హెర్మెల్, దహియే ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన దాడుల్లో 24 మంది చనిపోయారు. లెబనాన్–సిరియా సరిహద్దుల్లోని హెజ్బొల్లా ఆయుధ డిపోలు, స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం భీకర దాడులకు పాల్పడింది. తమ యుద్ధ విమానాలు కుసాయిర్ నగరంలోని పలు లక్ష్యాలపై బాంబులు వేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.చదవండి : మీకు రిటర్న్ గిఫ్ట్ పక్కా -
ఇరాన్‌పై నిప్పుల వర్షం
టెల్ అవీవ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఊహించినట్లుగానే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇలామ్, ఖుజిస్తాన్, టెహ్రాన్ ప్రావిన్స్‌ల్లోని సైనిక, ఆయుధ స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. మొత్తం 100 ఫైటర్ జెట్లతో మూడు దశల్లో 20 లక్ష్యాలపై కచి్చతత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, ప్రయోగ కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే, చమురు నిల్వలపై దాడులు జరిగాయా లేదా అనేది తెలియరాలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు సమాచారం. తాజా దాడుల్లో ఇరాన్‌కు ఎంతమేరకు నష్టం వాటిల్లిందన్న సంగతి ఇజ్రాయెల్ బయటపెట్టలేదు. ఇరాన్‌పై దాడుల తర్వాత తమ యుద్ధవిమానాలు క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చాయని వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇరాన్‌పై మరో దేశం నేరుగా దాడికి దిగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ఆపరేషకు ఇజ్రాయెల్ ‘పశ్చాత్తాప దినాల మిషన్’ అని పేరుపెట్టింది. రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ సైన్యం పక్కా ప్రణాళికతో ఇరాన్‌పై దాడికి దిగినట్లు సమాచారం. అత్యాధునిక ఫైటర్ జెట్లను సైన్యం రంగంలోకి దించింది. ఐదో తరం ఎఫ్–35 అడిర్ ఫైటర్ జెట్లు, ఎఫ్–15టీ గ్రౌండ్ అటాక్ జెట్లు, ఎఫ్–16ఐ సూఫా ఎయిర్ డిఫెన్స్ జెట్లు ఇందులో ఉన్నాయి. ఇవి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదింగలవు. ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్ సైనిక, ఆయుధ స్థావరాలపైనే గురిపెట్టింది. జనావాసాల జోలికి వెళ్లలేదు. తొలుత రాడార్, ఎయిర్ డిఫెన్స్ కేంద్రాలపై దాడికి పాల్పడింది. అనంతరం సైనిక స్థావరాలు, మిస్సైల్, డ్రోన్ల కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించింది. మొత్తం మూడు దశల్లో దాడులు జరగ్గా, ఒక్కో దశ దాడిలో దాదాపు 30 చొప్పున యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. మరోవైపు ఇరాన్ నుంచి ప్రతిదాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో ఇజ్రాయెల్, అమెరికా తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఇరాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే.. ఇజ్రాయెల్ దాడుల్లో తమకు పరిమిత నష్టమే వాటిల్లిందని, ఎదురుదాడిలో నలుగురు సైనికులు మృతి చెందారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టిందని చెప్పారు. దాడుల అనంతరం టెహ్రాన్‌లో సాధారణ పరిస్థితులే కనిపించాయి. పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. దుకాణాలు ఎప్పటిలాగే తెరుచుకున్నాయి. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద మాత్రం జనం బారులు తీరి కనిపించారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇజ్రాయెల్ చర్యను పలు దేశాలు ఖండించాయి. సంయమనం పాటించాలని సూచించాయి. అమెరికా వంటి మిత్రదేశాలు మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి. 25 రోజుల తర్వాత ప్రతిదాడి ఇరాన్‌పై దాడుల సందర్భంగా కొన్ని ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో టెల్ అవీవ్ ఉన్న కిర్యా మిలటరీ బేసులోని మిలటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ సైనిక సలహాదారులతో, సైనికాధికారుతో చర్చిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్»ొల్లా, హమాస్ నాయకులు మరణించడం పట్ల ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నెల 1న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ భూభాగంపై దాదాపు 200 క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, తాము తగిన జవాబు ఇవ్వక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అప్పుడే హెచ్చరించారు. ఇరాన్ దాడి చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని అప్పట్లో భావించినప్పటికీ ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది. అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో తమ ఆపరేషన్ వాయిదా వేసుకుంది. పరిస్థితులు సానుకూలంగా మారడంతో 25 రోజుల తర్వాత ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించింది. -
ఉత్తర గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్ఎఫ్ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు. రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తుఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి. సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్ ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది. -
సిరియా: ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు
న్యూయార్క్: సిరియాలోని ఐసిస్ స్థావరాలపై పలు వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా వెల్లడించింది. తమ దాడులతో ఐసిస్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ‘‘శనివారం ఉదయం ఐసిస్ క్యాంప్‌లపై అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు వైమానిక దాలు చేశాం. ఈ దాడులు.. అమెరికా, దాని మిత్రదేశాలు , భాగస్వాములపై దాడులకు ప్లాన్ చేయటం, దాడుల నిర్వహించటం వంటి ఐసిస్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ దాడులుకు సంబంధించి సమాచారం అందిస్తాం’ అని అమెరికా పేర్కొంది. అయితే ఈ దాడుల్లో మృతుల సంఖ్య తదితర వివరాలు అమెరికా వెల్లడించకపోవటం గమనార్హం.U.S. Central Command conducts airstrikes against multiple ISIS camps in Syria. pic.twitter.com/i8Nqn1K97p— U.S. Central Command (@CENTCOM) October 12, 2024ఇటీవల కాలంలో సిరియాపై అమెరికా దాడులు చేయడం ఇది రెండోసారి. సెప్టెంబరు నెల చివరిలో ఐసిస్ స్థావరాలే టార్గెట్‌గా అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ దాడుల్లో 37 మంది హతమైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా అనుబంధ సంస్థలకు చెందినవారేనని పేర్కొంది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ...పరస్పర దాడులు
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి. రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మేం విఫలమైన రోజు ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు. -
లెబనాన్ నిరాశ్రయులు.. పది లక్షలు!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. సిరియాకే ఎందుకు? నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. యూకేకు సంపన్నులులెబనాన్లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు. -
బంకర్ బాంబు దాడిలో... నస్రల్లా మృతి
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం. అతనితో పాటు హెజ్బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్‌బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.హెజ్బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్నుహెజ్బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్‌రెజా పూర్ ఖగాన్ అన్నారు. ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్‌లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.కోలుకోలేని దెబ్బ!మూడు దశాబ్దాలకు పైగా హెజ్బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్బొల్లా హెడ్డాఫీస్‌తో పాటు ఆరు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని, మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి. -
హెజ్బొల్లాపై యుద్ధం ఆగదు
ఐక్యరాజ్యసమితి: ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు వెంట తరచూ తమపై కవి్వంపు దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై తమ వైమానిక దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సాక్షిగా సమరి్థంచుకున్నారు. హెజ్బొల్లా సాయుధ సంస్థపై పోరాటం ఆపబోమని, విజయం సాధించేదాకా పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. న్యూయార్క్ నగరంలో ఐరాస సర్వ సభ్య సమావేశాల సందర్భంగా శుక్రవారం నెతన్యాహూ ప్రసంగించారు. హెజ్బొల్లాపై దాడులు ఆపబోమని చెప్పి అమెరికా జోక్యంతో పుట్టుకొస్తున్న కాల్పులవిరమణ ప్రతిపాదనలకు నెతన్యాహూ పురిట్లోనే సంధికొట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని.. రోజూ రాకెట్ దాడులను సహించం ‘‘పొంచిఉన్న ప్రమాదాన్ని తప్పించాల్సిన కర్తవ్యం ఇజ్రాయెల్‌పై ఉంది. మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న అమెరికా నగరాలు ఎల్ పాసో, శాండిగోలపైకి ఉగ్రవాదులు దాడులు చేస్తే జనం పారిపోయి నగరాలు నిర్మానుష్యంగా మారితే అమెరికా ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుంది?. మేం కూడా అంతే. దాదాపు ఏడాదికాలంగా హెజ్బొల్లా దాడులను భరిస్తున్నాం. మాలో సహనం నశించింది. ఇక చాలు. సొంతిళ్లను వదిలి వెళ్లిన 60,000 మంది సరిహద్దు ప్రాంతాల ఇజ్రాయెలీలను సొంతిళ్లకు చేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది. సరిహద్దు వెంట ఇప్పుడు మేం చేస్తున్నది కూడా అదే. మా లక్ష్యం నెరవేరేదాకా హెజ్బొల్లాపై దాడులను ఆపేది లేదు’’ అని నెతన్యాçహూ అన్నారు. అందుకే వచ్చా ‘‘నిజానికి ఈ ఏడాది ఐరాసలో మాట్లాడేందుకు రావొద్దనుకున్నా. అస్థిత్వం కోసం గాజా్రస్టిప్‌పై సైనిక చర్య మొదలయ్యాక నా దేశం యుద్ధంలో మునిగిపోయింది. అయితే ఐరాస పోడియం నుంచే పలు దేశాధినేతలు వల్లెవేస్తున్న అబద్ధాలు, వదంతులకు చరమగీతం పాడేందుకే ముక్కుసూటిగా మాట్లాడుతున్నా. ఇరాన్ శాంతిని కోరుకుంటా అంటుంది కానీ చేసేది వేరేలా ఉంటుంది. ఒక్కటి స్పష్టంగా చెబుతున్నా. మాపై ఎవరు దాడి చేస్తే వాళ్లపై దాడి చేస్తాం. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలకు ఇరాన్ మూల కారణం’’ అని అన్నారు. 90% హమాస్ రాకెట్లు ధ్వంసంచేశాం‘‘గాజాలో యుద్ధం తుది దశకు వచి్చంది. ఇక హమాస్ లొంగిపోవడమే మిగిలి ఉంది. ఆయుధాలు వీడి బందీలను వదిలేయాలి. లొంగిపోబోమని మొండికేస్తే గెలిచేదాకా యుద్ధంచేస్తాం. సంపూర్ణ విజయమే మా లక్ష్యం. దీనికి మరో ప్రత్యామ్నాయమే లేదు. యుద్ధబాటలో హమాస్ పయనించడం మొదలెట్టాక మాకు కూడా ఇంకో మార్గం లేకుండాపోయింది. 90 % హమాస్ రాకెట్లను ధ్వంసంచేశాం. 40వేల హమాస్ బలగాల్లో సగం మంది చనిపోవడమో లేదంటే మేం వాళ్లను బందీలుగా పట్టుకోవడమో జరిగింది అని అన్నారు.ఓవైపు ఆశీస్సులు... మరోవైపు శాపంఆశీస్సులు, శాపం అనే పేర్లు పెట్టి రెండు భిన్న ప్రాంతాల భౌగోళిక పటాలను నెతన్యాహూ పట్టుకొచ్చి వివరించారు. ‘‘ ఆశీస్సులు కావాలో, శాపం కావాలో ప్రపంచదేశాలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. అరబ్ దేశాలతో మైత్రి బంధం పటిష్టం చేసుకుంటూ ఇజ్రాయెల్.. ఆసి యా, యూరప్‌ల మధ్య భూతల సేతువును నిర్మిస్తూ ఇజ్రాయెల్ ఆశీర్వదిస్తోంది. ఇంకో మ్యాప్ మొత్తం శాపాలతో నిండిపోయింది. హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరాసముద్రం దాకా పరుచుకున్న ఉగ్రనీడ ఇది. ఇది ప్రపంచదేశాలకు శాపం. ఇరాన్లో ఇజ్రాయెల్ చేరుకోలేనంత దూరంలో ఏ భూమీ లేదు’’ అంటూ తప్పనిపరిస్థితుల్లో అవసరమైతే ఇరాన్‌పైనా దాడి చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. నెతన్యాహూ తెచి్చన మ్యాప్‌లో గాజా్రస్టిప్ మొత్తాన్నీ ఇజ్రాయెల్‌లో భాగంగానే చూపారు. హమాస్, హెజ్బొల్లాలపై పోరాడుతున్న తమ సైనికులను పొగుడుతూ నెతన్యాహూ చేస్తున్న ప్రసంగం వినడం ఇష్టంలేని చాలా మంది ప్రపంచ నేతలు ఆయన ప్రసంగం మొదలెట్టగానే హాల్ నుంచి వెళ్లిపోయారు. -
టార్గెట్ నస్రల్లా.. బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి
బీరుట్: హెజ్బొల్లాను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రతిజ్ఞచేసిన కొద్దిసేపటికే.. లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై భారీ బాంబు దాడులు జరిగాయి. బంకర్లను సైతం భూస్థాపితం చేసే భారీ బాంబులతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. బీరుట్ నగరంలోని దహియే పరిధిలోని హరేట్ రీక్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ఆరు ప్రధాన భవనాలు నేలమట్టమయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 76 మంది గాయపడ్డారు.మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఘటనాస్థలి వద్ద పెద్దసంఖ్యలో జనం గుమికూడారు. హెజ్బొల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టే లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ టీవీఛానెళ్లు పేర్కొన్నాయి. ఏకధాటిగా బాంబులు వేయడం, పెద్ద సైజు బాంబులు వాడటం చూస్తుంటే హమాస్ అగ్రనేతను అంతంచేయడానికే ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా పరిస్థితిపై ఎలాంటి స్పష్టత రాలేదు. బీరుట్లో గత ఏడాదికాలంలో ఇంతటి భారీస్థాయిలో బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి. దాడుల ధాటికి ఆరు ప్రధాన భవంతులు నేలమట్టమయ్యాయి. అవి కూలాక బాంబులను వేయడం చూస్తుంటే అక్కడి భూగర్భంలో నిర్మించిన బంకర్లను కూల్చేయడమే అసలు లక్ష్యమని తెలుస్తోంది.‘‘ఈ బంకర్లలో∙నస్రల్లా ఉన్నట్లు భావిస్తున్నాం. ఖచ్చితత్వంతో కూడిన లక్షిత దాడి చేశాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. బాంబు పేలుళ్ల ప్రభావంతో ఏకంగా 30 కి.మీ.ల దూరంలోని ఇళ్ల గాజు కిటికీలు, అద్దాలు సైతం పగిలిపోయాయి. గురువారం చనిపోయిన హెజ్బొల్లా కమాండర్ అంత్యక్రియలు జరిగిన గంటకే బీరుట్‌పై దాడులు జరగడం గమనార్హం. పర్యటనను అర్థంతరంగా ముగించిన నెతన్యాహూ అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూ ఈ దాడుల వార్త తెల్సి వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని స్వదేశం బయల్దేరారు. నస్రల్లా మరణిస్తే తదుపరి కార్యాచరణపై రక్షణ, సైనిక, పాలనా వర్గాలతో చర్చించేందుకు ఆయన తిరిగొస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే నస్రల్లా దాడి ప్రాంతంలో లేడని హెజ్బొల్లా ప్రకటించింది. నస్రల్లా సురక్షితంగా వేరే ప్రాంతంలో ఉన్నారని ఇరాన్ అధికార ‘తస్నీమ్’ వార్తాసంస్థ ప్రకటించింది. దాడులపై అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని ఇజ్రాయెల్ చెబుతుండగా, అలాంటి సమాచారం తమకు అందలేదని అమెరికా స్పష్టంచేసింది. ఇరాన్ ఆరా.. నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి జరగడంతో ఇరాన్ సుప్రీం ఖమేనీ తన నివాసంలో జాతీయ భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరిచారు. బీరుట్‌పై ఐడీఎఫ్(ఇజ్రాయెల్ రక్షణ బలగాలు) దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో కమ్యూనికేషన్ తెగిపోయినట్లు తెలిసింది. అయితే.. ఓ మీడియా సంస్థతో అతడు బతికే ఉన్నాడని హెజ్బొల్లా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. అలాగే.. ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి సైతం మీడియాతో మాట్లాడుతూ.. టెహ్రాన్ వర్గాలు అతడి సమాచారం గురించి ఆరా తీస్తోంది. -
నెతన్యాహుపై హమాస్ సంచలన ఆరోపణలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. -
Israel Hamas War: హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ దీఫ్ హతం
జెరూసలేం: హమాస్ మి లటరీ విభాగం ‘ఖ స్సం బ్రిగేడ్స్’ అధి నేత మొహమ్మద్ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేలి్చచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. నిఘావర్గాల సమాచారం మేరకు తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇరాన్ సవాలు.. ఇజ్రాయెల్ సమాధానం
కేవలం 12 గంటలు. అంత స్వల్ప వ్యవధిలో ఇటు హిజ్బొల్లాను, అటు హమాస్‌ను ఇజ్రాయెల్ చావుదెబ్బ తీసింది. రెండు ఉగ్ర సంస్థల్లోనూ అత్యున్నత స్థాయి నేతలను అత్యంత కచి్చతత్వంతో కూడిన వైమానిక దాడుల ద్వారా అడ్డు తొలగించుకుంది. మంగళవారం రాత్రి హిజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫౌద్ షుక్ర్‌ను లెబనాన్ రాజధాని బీరూట్‌లో అంతమొందించింది. తెల్లవారుజామున తన ఆగర్భ శత్రువైన ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డులో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఆయ న సొంతింట్లోనే హత్య చేసింది. తద్వారా ఎక్కడైనా, ఎవరినైనా, ఎప్పుడైనా లక్ష్యం చేసుకోగల సత్తా తనకుందని మరోసారి నిరూపించుకుంది. గాజా యుద్ధంతో ఇప్పటికే అట్టుడుకుతున్న పశి్చమాసియాలో ఇజ్రాయెల్ తాజా చర్యలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హనియే హత్యకు ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిజ్బొల్లా కూడా షుక్ర్ మృతిని ధ్రువీకరించింది. ‘ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పద’ని పేర్కొంది. గాజాలో కాల్పుల విరమణకు ఇక దారులు మూసుకుపోయినట్టేనని భావిస్తున్నారు...టెహ్రాన్/బీరూట్: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్ గట్టిగా జవాబిచి్చంది. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే ప్రాణాంతక వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు. హెచ్చరించినట్టుగానే... గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.ఇజ్రాయెల్‌కు మరణశాసనమే: ఖమేనీ అల్టిమేటంహనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ ఆధ్యాతి్మక నేత, సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.షుక్ర్‌ను మట్టుపెట్టాం: ఇజ్రాయెల్ హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.శరణార్థి నుంచి హమాస్ చీఫ్ దాకా... ఇస్మాయిల్ హనియే గాజా సమీపంలో శరణార్థి శిబిరంలో 1962లో జని్మంచారు. 1987లో మొదటి పాలస్తీనా యుద్ధ సమయంలో పుట్టుకొచి్చన హమాస్‌లో ఆయన వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు, తొలి చీఫ్ అహ్మద్ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో యాసిన్ మరణించాక హమాస్‌లో కీలకంగా మారారు. ఉర్రూతలూగించే ప్రసంగాలకు పెట్టింది పేరు. 2006లో పాలస్తీనా ప్రధానిగా గాజా పాలన చేపట్టారు. ఏడాదికే పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. నాటినుంచి గాజాలో ఫతా–హమాస్ మధ్య పోరు సాగుతోంది. అబ్బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హనియే గాజా ప్రధానిగా కొనసాగుతున్నారు. 2017లో హమాస్ చీఫ్ అయ్యారు. -
Israel-Hamas war: రఫాపై ఇజ్రాయెల్ దాడులు 22 మంది మృతి
రఫా: గాజా ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లకు పట్టున్న రఫాలోకి తమ సైన్యం త్వరలో ప్రవేశించనుందంటూ హెచ్చరికలు చేస్తున్న ఇజ్రాయెల్ ఆ నగరంపై వైమానిక దాడులకు దిగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు. హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆరు నెలలకు పైగా భీకర దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఉండగా, కాల్పుల విరమణకు ఒప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ నేత కుమారుల మృతి
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘‘ జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కలి్పంచే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని అల్జజీరాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు. -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్: లెబనాన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆదివారం(మార్చ్ 24) తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది. మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ప్రాంతమైన బల్బీక్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు బల్బీక్ మేయర్ తెలిపారు. ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్‌పై డ్రోన్లతో దాడులు జరిపినట్లు హెజ్బొల్లా ప్రకటించిన గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి 50 రాకెట్లు తమవైపు వచ్చినందునే దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ రాకెట్లలో కొన్నింటిని కూల్చివేశామని, మరికొన్ని మనుషులు లేని చోట పడిపోయాయని వెల్లడించింది. కాగా, మార్చ్ 12న బల్బీక్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మంది దాకా గాయపడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగిపోయాయి. ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సైన్యం సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అందరూ మహిళలు, చిన్న పిల్లలే. ఇవి బాధ్యత రహితమైన దాడులని ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఖోస్ట్, పక్టికా ప్రావిన్సుల్లోని పౌరుల నివాసాలపై సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ వైమానిక దాడులు జరిగినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇవి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించే దాడులని పేర్కొన్నారు. కాగా, ఆదివారం ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి పాక్ భూభాగంలోనే పాకిస్తాన్ సైన్యంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనికులు పలువురు చనిపోయారు. వీటికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అధ్యకక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు జరగడం గమనార్హం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే మిలిటెంట్ గ్రూపునకు గట్టి పట్టుంది. ఈ మిలిటెంట్లు పాకిస్తాన్ సైనికులపై దాడి జరిపి లెఫ్టినెంట్ కల్నల్‌తో సహా పలువురు జవాన్లను హతమార్చారు. వీరి అంత్యక్రియల సమయంలోనే ప్రతీకారం తీర్చుకుంటామని జర్దారీ ప్రకటించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదీ చదవండి.. అడుగు దూరంలో వరల్డ్ వార్-3.. హెచ్చరించిన పుతిన్ -
ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది మృతి
రఫా: గాజాలోని దక్షిణ, మధ్య ప్రాంతాలపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రఫాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, సెంట్రల్ గాజాలో 14 మంది చిన్నారులు, 8 మంది మహిళలు సహా మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. రఫా చుట్టుపక్కల జరిగిన వైమానిక దాడుల్లో అల్ ఫరూక్ మసీదు నేలమట్టం అయింది. మరోవైపు, వెస్ట్‌బ్యాంక్ జాతీయరహదారిపై గురువారం ఉదయం రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక ఇజ్రాయెల్ యువకుడు చనిపోగా మరో అయిదుగురు గాయప డ్డారు. ఇజ్రాయెల్ పోలీసుల కాల్పుల్లో ఇద్ద రు దుండగులు చనిపోయారు. మూడో వ్యక్తి పట్టుబడ్డాడు. ఈ కాల్పులకు కారణమని ఎవరూ ప్రకటించుకోనప్పటికీ హమాస్ సాయుధబలగాలు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆగి, స్వతంత్ర పాలస్తీనా అవతరించేదాకా ఇటువంటి మరిన్ని దాడులకు దిగాలని పిలుపునిచ్చారు. -
ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన బీ1– లాంగ్రేంజ్ బాంబర్ విమానాలు ఇరాన్‌లోని సరిహద్దు పట్టణం అల్–క్వయిమ్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ అనుకూల ‘హష్ద్–అల్– షబి’, కతాయిబ్ హెజ్బొల్లా సంస్థల స్థావరాలతోపాటు మొత్తం ఏడు ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. -
Israel-Hamas war: యుద్ధజ్వాలలకు... 100 రోజులు
క్రైస్తవ, ముస్లిం, యూదు మతాల పవిత్ర స్థలాలకు నెలవైన జెరూసలేంలోని అల్–అక్సా మసీదు ప్రాంతంలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాల దాడులతో రాజుకున్న వివాదం చివరకు హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంగా తీవ్రరూపం దాల్చి ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడులు, 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల హతం, 200 మందికిపైగా అపహరణతో మొదలైన ఈ ఘర్షణ ఆ తర్వాత ఇజ్రాయెల్ భూతల, గగనతల భీకర దాడులతో తీవ్ర మానవీయ సంక్షోభంగా తయారైంది. వందల కొద్దీ బాంబు, క్షిపణి దాడుల ధాటికి లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో పారిపోయారు. దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక, కనీసం తాగు నీరు లేక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. ఈ యుద్ధం 23 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. ఐక్యరాజ్యసమితి మానవీయ సాయం డిమాండ్లు, తీర్మానాలతో కాలం వెళ్లదీస్తోంది. మృత్యు నగరాలు ఇజ్రాయెల్ దాడులతో గాజా స్ట్రిప్‌లోని ప్రతి పట్టణం దాదాపు శ్మశానంగా తయారైంది. మొత్తం 23 లక్షల జనాభాలో 85 శాతం మంది వలసపోయారు. ఉత్తర గాజాపై, ఆ తర్వాత దక్షిణ గాజాపై దాడుల ఉధృతి పెరగడంతో జనం ఈజిప్ట్ చిట్టచివరి సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. లెబనాన్‌లోని హెజ్»ొల్లా మిలెంట్లు, యెమెన్‌లోని హౌతీల దాడులతో యుద్దజ్వాలలు పశ్చిమాసియాకు పాకుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించేదాకా బందీలను వదిలిపెట్టబోమని, దాడులను ఆపబోమని హమాస్, దాన్ని హమాస్‌ను కూకటివేళ్లతో పెకలించేదాకా యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ అంటున్నాయి! ఫలించని దౌత్యం ఖతార్, అమెరికా దౌత్యం తొలుత సఫలమైనట్లే కనిపించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా పరస్పరం బందీలను విడుదల చేశాయి. కానీ ఆ వెంటనే మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఈ వంద రోజుల్లో లక్షలాది ఇళ్లు, వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉండటం అత్యంత విషాదకరం. రోగాల పుట్టలుగా శరణార్థి శిబిరాలు గాజాలో శరణార్థి శిబిరాలు కిటకిటలాడుతున్నాయి. జనం రోగాలబారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఆహార, సరకులు, ఔషధ సాయం అందకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుండటంతో అక్కడ ఎటు చూసినా భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి
రఫా: గాజా్రస్టిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో అల్–జజీరా సీనియర్ కరస్పాండెంట్ వాయిల్ దాహ్‌దౌ కుమారుడు హమ్జా దాహ్‌దౌ కూడా ఉన్నాడు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో వాయిల్ దాహ్‌దౌ కుటుంబంలో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు ఇప్పటికే చనిపోగా, ఆదివారం మరో కుమారుడు బలయ్యాడు. దాహ్‌దౌ సైతం గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ తన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాడు. గాజాలో అసలేం జరుగుతోందో ప్రపంచం తెలుసుకోవాలని, అందుకోసం తన ప్రాణాలైనా ధారపోస్తానని వాయిల్ దాహ్‌దౌ చెప్పాడు. తన కుటుంబం మొత్తం బలైపోయినా తన సంకల్పం సడలిపోదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 22,800 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. -
గాజాలో మృత్యుఘోష
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం రక్తపుటేరులు పారిస్తోంది. గురువారం బీట్ లాహియా, ఖాన్ యూనిస్, అల్–మఘాజీ ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఒకేరోజు 50 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైమానిక దాడుల నుంచి తప్పించుకోవడానికి వేలాది మంది సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోవైపు ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని రమల్లాతోపాటు ఇతర నగరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 నుంచి మొదలైన ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 21,320 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 55,603 మంది గాయపడ్డారు. -
Israel-Hamas war: ‘అల్–మగజి’పై అసాధారణ దాడులు
గాజా స్ట్రిప్: భీకర గగనతల, భూతల దాడులతో తలో దిక్కూ పారిపోతూ శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్న పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ క్షిపణులు కనికరం చూపడం లేదు. సోమవారం సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డెయిర్ అల్–బాలాహ్ పట్టణం సమీపంలోని అల్–మగజి శరణార్ధి శిబిరంపై ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఏకంగా 106 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మూడు అంతస్తుల భవంతి పూర్తిగా నేలమట్టమైంది. భవన శిథిలాల నుంచి డజన్ల కొద్దీ మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరణాల సంఖ్య పెరగవచ్చని హమాస్ ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ మొదలయ్యాక జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇదీ ఒకటి. గాజా స్ట్రిప్‌లో మొత్తంగా గత 24 గంటల్లో 250 మంది మరణించారని, 500 మందికిపైగా పాలస్తీనియన్లు గాయపడ్డారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ప్రకటించనుందన్న వార్తలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. త్వరలోనే యుద్ధాన్ని మరింతగా విస్తరిస్తామన్నారు. -
14 మంది ఇజ్రాయెల్ జవాన్లు మృతి
టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై వైమానిక, భూతల దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం, శనివారం హమాస్ మిలిటెంట్ల ఎదురుదాడిలో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు బలైన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 153కు చేరుకుంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ఒకేసారి 14 మంది జవాన్లను కోల్పోవడం ఇజ్రాయెల్ జీరి్ణంచుకోలేకపోతోంది. గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 166 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ చెరలోని బందీలను విడిపించాలంటే యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ అంటోంది. హమాస్‌పై పోరాటం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని, అయినప్పటికీ ముందుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో జనం వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నెతన్యాహు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
Israel-Hamas war: గాజాలో 20,057కి చేరిన మృతుల సంఖ్య
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో సామాన్యులే సమిధలవుతున్నారు. అక్టోబర్ 7న ఇరుపక్షాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులకు దిగుతోంది. సాధారణ జనావాసాలపై బాంబలు వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 20,057 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది మృత్యువాత పడినట్లు స్పష్టమవుతోంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. సరిపడా ఆహారం, నీరు అందక గాజాలో జనం ఆకలిలో అల్లాడిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల మందికి ఆహారం అందడం లేదని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాకు మానవతా సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొంది. యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరగాల్సిన ఓటింగ్ వాయిదా పడింది. రెండు రోజుల్లో 390 మంది బలి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరస్థాయిలో విరుచుకుపడుతోంది. గత రెండు రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ దాడుల్లో ఏకంగా 390 మంది పాలస్తీనియన్లు బలయ్యారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. 734 మంది క్షతగాత్రులుగా మారారని తెలియజేసింది. గాజాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. -
Israel-Hamas war: 24 గంటల్లో 110 మంది దుర్మరణం
జబాలియా(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడి తర్వాత నిరంతరాయంగా కొనసాగిస్తున్న భీకరదాడులను ఇజ్రాయెల్ మరింత పెంచింది. ఉత్తర గాజాలోని జబాలియా పట్టణంలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. డజన్ల మంది గాయాలపాలయ్యారు. ‘‘శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారు. నా బంధువుల పిల్లలు ముగ్గురు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 110 మృతదేహాలను దగ్గర్లోని అల్–ఫలూజా శ్మశానవాటికకు తరలించలేని పరిస్థితి. అక్కడ ఆగకుండా బాంబుల వర్షం కురుస్తోంది. దిక్కులేక దగ్గర్లోని నిరుపయోగంగా ఉన్న పాత శ్మశానవాటికలో పూడ్చిపెట్టాం’ అని గాజా ప్రాంత ఆరోగ్య విభాగ డైరెక్టర్ జనరల్ మునీర్ చెప్పారు. -
దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్
డెయిర్ అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు భీకర రూపం దాలుస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి తెచ్చిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారంతో కాలదన్నిన దరిమిలా ఇజ్రాయెల్ ఆదివారం మరింత రెచ్చిపోయింది. అమెరికా నుంచి తాజాగా మరింతగా ఆయుధ సంపత్తి అందుతుండటంతో ఇజ్రాయెల్ భీకర గగనతల దాడులతో చెలరేగిపోతోంది. 23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఆదివారం ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించకపోవడం గమనార్హం. దాదాపు రూ.834 కోట్ల విలువైన యుద్ధట్యాంక్ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ‘ఐరాస భద్రతా మండలిలో మాకు బాసటగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కొనసాగింపునకు వీలుగా కీలక ఆయుధాలు అందేందుకు సహకరిస్తున్న అమెరికాకు నా కృతజ్ఞతలు’ అని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్ ‘హమాస్‌ను ఈలోపే అంతంచేయాలని అమెరికా మాకు ఎలాంటి గడువు విధించలేదు. హమాస్ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుంది. హమాస్ అంతానికి వారాలు కాదు నెలలు పట్టొచ్చు. బం«దీలందర్నీ విడిపిస్తాం’’ అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు టజాచీ హెనెగ్బీ శనివారం అర్ధరాత్రి తేలి్చచెప్పారు. ‘‘ గాజాలో సరైన సాయం అందక సరిదిద్దుకోలేని స్థాయిలో అక్కడ మానవ విపత్తు తీవ్రతరమవుతోంది. ఇది పశ్చిమాసియా శాంతికి విఘాతకరం’’ అని ఖతార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. షిజాయాహ్, జబాలియా శరణార్థి శిబిరాల వద్ద నిరంతరం దాడుల కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ప్రతి వాహనంపైనా దాడి జరుగుతోంది. శిథిలాలతో నిండిన మా ప్రాంతాలకు అంబులెన్స్‌లు రాలేకపోతున్నాయి’’ అని జబాలియా ప్రాంత స్థానికురాలు ఒకరు ఏడుస్తూ చెప్పారు. ఖాన్ యూనిస్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హమాస్, ఇజ్రాయెల్ సేనల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. గంటలు నిలబడినా పిండి దొరకట్లేదు సెంట్రల్ గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ‘‘ ఇంట్లో ఏడుగురం ఉన్నాం. ఐరాస ఆహార కేంద్రానికి రోజూ వస్తున్నా. ఆరేడు గంటలు నిలబడ్డా రొట్టెల పిండి దొరకట్లేదు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. పిండి కరువై ఉట్టిచేతుల్తో ఇంటికెళ్తున్నా’’ అని అబ్దుల్లాసలాం అల్–మజ్దాలా వాలా చెప్పారు. ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. -
Israel-Hamas war: మరో ఆసుపత్రిపై దాడి
ఖాన్ యూనిస్: గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిని దిగ్బంధించి, రోజుల తరబడి తనిఖీలు చేస్తూ హమాస్ ఆయుధాలు, సొరంగాల ఫొటోలు విడుదల చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో రోగులు, క్షతగాత్రులు, వేలాది మంది సామాన్య పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. సోమవారం క్షిపణులు ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా ఇండోనేసియన్ ఆసుపత్రిపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఆసుపత్రి రెండో అంతస్తు ధ్వంసమైంది. కనీసం 12 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇండోనేíసియన్ హాస్పిటల్‌కు 200 మీటర్ల దూరంలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. సమీపంలోని భవనాలపై ఇజ్రాయెల్ షార్ప్ షూటర్లు మాటు వేశారు. ఆసుపత్రులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో హమాస్ స్థావరాలు, ఆయుధ నిల్వలు ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని ఇజ్రాయెల్ తేలి్చచెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 13,000కు చేరిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈజిప్టుకు 28 మంది శిశువులు అల్–షిఫా నుంచి దక్షిణ గాజాలోని అల్–అహ్లీ ఎమిరేట్స్ హాస్పిటల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తరలించిన 31 మంది శిశువుల్లో 28 మందిని సోమవారం అంబులెన్స్‌ల్లో ఈజిప్టుకు చేర్చారు. వారికి ఈజిప్టు వైద్యులు సాదర స్వాగతం పలికారు. శిశువుల కోసం ఇంక్యుబేటర్లు సిద్ధంగా ఉంచారు. ఈజిప్టులో వారికి మెరుగైన చికిత్స అందించనున్నారు. శిశువుల్లో కొందరిని గాజా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని అల్–అరిష్ ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మరికొందరిని కైరోకు తరలించారు. వీరంతా అల్–షిఫాలోనెలలు నిండక ముందు జని్మంచి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారే. 31 మందిలో 28 మందిని ఈజిప్టుకు తరలించారు. మిగతా ముగ్గురు గాజాలోనే ఉండిపోయారు. అల్–షిఫాలో బందీలను దాచిపెట్టిన హమాస్! అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా పట్టుకొని గాజాకు తరలించారు. వారిలో చాలామందిని అల్–షిఫా ఆసుపత్రి కింది భాగంలోని సొరంగాల్లో మిలిటెంట్లు దాచిపెట్టారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారలను తాజాగా బయటపెట్టింది. అల్–షిఫాలో అక్టోబర్ 7న నిఘా కెమెరా చిత్రీకరించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో ఇద్దరు బందీలను అల్–షిఫాలోకి మిలిటెంట్లు బలవంతంగా లాక్కెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిద్దరూ థాయ్‌లాండ్, నేపాల్ జాతీయులు. ప్రస్తుతం వారు ఎక్కడున్నారన్నది తెలియరాలేదు. ఇదిలా ఉండగా, బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. వారిని విడుదల చేసేలా హమాస్‌ను ఒప్పించేందుకు అమెరికా అభ్యర్థన మేరకు అరబ్ దేశాలు రంగంలోకి దిగాయి. మిలిటెంట్ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. -
Israel-Hamas War: టార్గెట్ దక్షిణ గాజా!
ఖాన్ యూనిస్: గాజాలో సాధారణ పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. హమాస్ మిలిటెంట్లపై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. భూతల, వైమానిక దాడులతో భారీ భవనాలు క్షణాల్లో శిథిలాల దిబ్బలుగా మారిపోతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో జనం కాళ్లు, చేతులు విరిగి క్షతగాత్రులుగా మారుతున్నాయి. యుద్ధం దక్షిణ గాజాకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర గాజాపై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టి పెట్టింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ కరపత్రాలు పంపిణీ చేస్తోంది. పల్లెలు, పట్టణాలను ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లాలని ఇజ్రాయెల్ సేనలు హెచ్చరిస్తుండడంతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఇలాంటి కరపత్రాలను ఉత్తర గాజాలోనూ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఉత్తర గాజా నుంచి ఇప్పటికే లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలస వచ్చారు. ఇక్కడ కూడా దాడులు ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ చెబుతుండడంతో ఇక ఎక్కడికి వెళ్లాలని విలపిస్తున్నారు. ఉత్తర, దక్షిణ గాజా అనే తేడా లేకుండా హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాగి ఉన్న దాడులు తప్పవని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ స్పష్టంచేశారు. గాజా ప్రజలను తమ భూభాగంలోకి అనుమతించే ప్రసక్తే లేదని పొరుగు దేశం ఈజిప్టు మరోసారి తెగేసి చెప్పింది. అల్–షిఫా ఆసుపత్రిలో రెండో రోజూ తనిఖీలు గాజా స్ట్రిప్‌లో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ సైన్యం తనిఖీలు రెండో రోజు గురువారం కూడా కొనసాగాయి. ఈ హాస్పిటల్ ప్రాంగణంలో ఓ భవనంలోని ఎంఆర్ఐ ల్యాబ్‌లో హమాస్ మిలిటెంట్ గ్రూప్ పెద్ద ఎత్తున ఆయుధాలు నిల్వ చేసిందంటూ సంబంధిత వీడియోను సైన్యం విడుదల చేసింది. అసాల్ట్ రైఫిల్స్, గ్రెనేడ్లు, హమాస్ దుస్తులు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే, ఇన్నాళ్లూ చెబుతున్నట్లు అల్–షిఫా ఆసుపత్రి కింద భూగర్భంలో హమాస్ కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇప్పటిదాకా ఎలాంటి సాక్ష్యాన్ని బయటపెట్టలేదు. అల్–షిఫా ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. అల్–షిఫాలో తుపాకీ పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు గురువారం చెప్పారు. ఇజ్రాయెల్ జవాన్లు కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు. ఆసుపత్రుల్లో మృత్యు ఘంటికలు గాజాలో ఆసుపత్రులన్నీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రాణం పోయాల్సిన ఆసుపత్రుల్లో మృత్యు ఘంటికలు వినిపిస్తున్నాయి. గాజాలో మొత్తం 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 26 ఆసుపత్రులు పని చేయడం లేదు. విద్యుత్, ఇంధనం, ఔషధాల కొరత వల్ల ఇక్కడ వైద్య సేవలు నిలిపివేశారు. పని చేస్తున్న కొన్ని ఆసుపత్రుల్లో వసతులు లేక రోగులు, శిశువులు విగత జీవులవుతున్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో ఇప్పటివరకు 12,000 మందికిపైగా మరణించారు. 2,700 మంది అదృశ్యమయ్యారు. వీరంతా శిథిలాల కింద చిక్కుకొని మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. హమాస్ నాయకుల ఇళ్లపై క్షిపణుల వర్షం గాజాలో హమాస్ ముఖ్యనేతల నివాసాలను ఇజ్రాయెల్ సైన్యం టార్గెట్ చేసింది. ఇప్పటికే పలువురు నాయకులను హతమార్చింది. సీనియర్ హమాస్ కమాండర్ ఇస్మాయిల్ హనియేహ్ ఇంటిని నేలమట్టం చేశామని సైన్యం గురువారం ప్రకటించింది. అయితే, ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది తెలియరాలేదు. ‘ఆగ్నేయ ఆసియా’ రక్షణ మంత్రుల వినతి ఇజ్రాయెల్–హమాస్యుద్ధంలోఅమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమని ఆగ్నేయ ఆసియా దేశాల రక్షణ శాఖ మంత్రులు పేర్కొ న్నారు. 1967 నాటి సరిహద్దులతో ఇజ్రాయెల్‌తోపాటు స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసే దిశగా శాంతి చర్చలు ప్రారంభించాలని సూచించారు. ఈ మేరకు ‘అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్టు ఆసియన్ నేషన్స్’ పేరిట గురువారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తీర్మానం ఆమోదం ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ఎట్టకేలకు ఆమోదం పొందింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో సామాన్య పాలస్తీనియన్లు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని మండలి ఆందోళన వ్యక్తం చేశారు. గాజా ప్రజలకు మానవతా సాయం అందించేందుకు గాజా అంతటా ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయాలని, వారికి తగిన రక్షణ కలి్పంచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు సూచిస్తూ మండలిలో తీర్మానాన్ని ఆమోదించారు. బందీలను వెంటనే విడుదల చేయాలని ఈ తీర్మానంలో హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. మండలిలో 15 సభ్యదేశాలుండగా, మాల్టా దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతుగా 12 దేశాలు ఓటువేశాయి. అమెరికా, యూకే, రష్యా గైర్హాజరయ్యాయి. -
Israel-Hamas war: దిగ్బంధంలో ఆస్పత్రులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: దక్షిణ గాజాకు బారులు కట్టిన జనం.. హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీధుల్లో భూతల పోరాటాలు.. ఆసుపత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైనికులు.. గాజా స్ట్రిప్‌లో ప్రస్తుత దృశ్యమిదీ. గాజా సిటీలోని నాలుగు పెద్ద ఆసుపత్రులపై ఇజ్రాయెల్ సైన్యం గురిపెట్టింది. హమాస్ కమాండ్ సెంటర్లు అక్కడే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయక తప్పదని తేల్చిచెప్పింది. శుక్రవారం తెల్లవారుజామునే నాలుగు ఆసుపత్రుల సమీపంలో క్షిపణి దాడులు చేసింది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటల వ్యవధిలో ఐదుసార్లు క్షిపణులు ప్రయోగించింది. కొన్ని వార్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే భద్రత ఉంటుందని ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వేలాది మంది జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగంలా కాలం గడిపారు. అల్–ఫిఫా హాస్పిటల్ వద్ద జరిగిన దాడుల్లో ఒకరు మరణించారని, మరికొందరు గాయపడ్డారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ, తమ సైన్యం దాడుల్లో 19 మంది మిలిటెంట్లు హతమయ్యారని, వీరిలో హమాస్ కీలక కమాండర్, ప్లాటూన్ కమాండర్ సైతం ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది. 20 రాకెట్ లాంచర్లు నిల్వ చేసిన హమాస్ షిప్పింగ్ కంటైనర్‌ను ధ్వంసం చేశామని తెలియజేసింది. గాజాసిటీలోని నాలుగు ఆసుపత్రుల చుట్టూ ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు మోహరించాయి. ఇజ్రాయెల్ సేనలు గాజా నగరంలోకి మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాసిటీలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా, 20 పాలస్తీనియన్లు మరణించారని స్థానిక అధికారులు చెప్పారు. మృతులు 11,078.. క్షతగాత్రులు 27,000 ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 11,078 మంది మరణించారని, వీరిలో 4,506 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. 27,000 మంది గాయపడ్డారని తెలిపింది. మరో 2,650 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా ఇప్పటికే మృతిచెంది ఉండొచ్చని తెలుస్తోంది. వలస వెళ్తున్నవారిపై వైమానిక దాడులు! ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు చేరుకోవడానికి వీలుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రతిరోజూ దాదాపు 4 గంటలపాటు దాడులకు విరామం ఇస్తోంది. ఇకపై నిత్యం విరామం అమల్లో ఉంటుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. గత ఐదు రోజుల్లో 1,20,000 మంది దక్షిణ గాజాకు వెళ్లిపోయారు. వారిపైనా వైమానిక దాడులు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈజిప్టు నుంచి గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందుతోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలతోప్రతిరోజు దాదాపు 100 వాహనాలు గాజాకు చేరుకుంటున్నాయి. మరోవైపు, హమాస్ మిలిటెంట్లపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. గాజాలో హమాస్ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవరకూ అవి కొనసాగుతాయన్నారు. ఉత్తర గాజా.. భూమిపై నరకం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. మిలిటెంట్ల స్థావరాలతోపాటు సాధారణ జనవాసాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభం కాగా, గాజాలో ఇప్పటికే దాదాపు 50 శాతం ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలుగా మారిపోయాయి. ప్రధానంగా ఉత్తర గాజాలో పరిస్థితి భీతావహంగా మారింది. ఈ ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. ఐక్యరాజ్యసమితి హ్యూమానిటేరియన్ ఆఫీసు ఉత్తర గాజాను ‘భూమిపై నరకం’గా అభివరి్ణంచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
Israel-Hamas conflict: గాజా సిటీపై దండయాత్ర
ఖాన్ యూనిస్: హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం మరో మలుపు తిరిగింది. గాజా్రస్టిప్‌లో అతిపెద్ద నగరమైన గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. 100కుపైగా హమాస్ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతోపాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్–షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేలి్చచెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలోనే మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గాజాలోని అల్–ఖుద్స్ హాస్పిటల్‌పైనా సైన్యం దృష్టి పెట్టింది. ఇక్కడ వంద మందికిపైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హమాస్ మిలిటెంట్లు అల్–ఖుద్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మకాం వేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. క్షతగాత్రుల ముసుగులో తప్పించుకుంటున్నారని చెబుతోంది. ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. వెస్ట్‌బ్యాంక్‌పై దాడి.. 11 మంది మృతి గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య గురువారం 10,812కు చేరుకుంది. మరో 2,300 మంది శిథిలాల కిందే ఉండిపోయారు. వారు మరణించి ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింసాకాండ కొనసాగుతోంది. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ ఫొటో జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని చిత్రీకరించిన ఫొటో జర్నలిస్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ గురువారం డిమాండ్ చేసింది. గాజాకు చెందిన ఈ జర్నలిస్టులు అంతర్జాతీయ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్నారు. హమాస్ దాడిని కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. మీడియాకు విడుదల చేశారు. హమాస్ దాడి గురించి వారికి ముందే సమాచారం ఉందని, అందుకే కెమెరాలతో సర్వసన్నద్ధమై ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. మానవత్వంపై జరిగిన నేరంలో వారి పాత్ర ఉందని మండిపడింది. వారి వ్యవహార శైలి పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధమని ఆక్షేపించింది. సదరు ఫొటోజర్నలిస్టులు పనిచేస్తున్న మీడియా సంస్థకు ఇజ్రాయెల్ లేఖలు రాసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు.. ఉత్తర గాజా–దక్షిణ గాజాను కలిపే ప్రధాన రహదారిని ఇజ్రాయెల్ సైన్యం వరుసగా ఐదో రోజు తెరిచి ఉంచింది. నిత్యం వేలాది మంది జనం ఉత్తర గాజా నుంచి వేలాది మంది దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. పిల్లా పాపలతో కాలినడకనే తరలి వెళ్తున్నారు. కొందరు కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారు. ఉత్తర గాజాలో హమాస్ స్థావరాలపై దాడులు ఉధృతం చేస్తామని, సాధారణ ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాలో జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి, మానవతా సాయం అందించడానికి వీలుగా ప్రతిరోజూ 4 గంటలపాటు దాడులకు విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలియజేశారు. -
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. ఇజ్రాయెల్‌కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్‌పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
ఇజ్రాయెల్ గుప్పిట్లో గాజా
గాజా్రస్టిప్: హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాను పూర్తిగా చుట్టుముట్టింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర ప్రాంతాలతో ఉత్తర గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర గాజా మొత్తం దిగ్బంధంలో చిక్కుకుంది. గాజా స్ట్రిప్‌ను రెండు ముక్కలుగా విభజించామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర గాజా ఇప్పుడు తమగుప్పిట్లో ఉందని పేర్కొంది. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని, ఇకపై కీలక దాడులు చేయబోతున్నామని తెలియజేసింది. గాజా సిటీలోకి అడుగుపెట్టడానికి ఇజ్రాయెల్ సేనలు ముందుకు కదులుతున్నాయి. సైన్యం ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్తర గాజాపై నిప్పుల వాన కురిపించింది. వైమానిక దాడులు ఉధృతం చేసింది. 450 లక్ష్యాలను ఛేదించామని, మిలిటెంట్ల స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సీనియర్ మిలిటెంట్ జమాల్ మూసా హతమయ్యాడని వివరించింది. హమాస్ కాంపౌండ్ ఒకటి తమ అ«దీనంలోకి వచ్చిందని పేర్కొంది. మిలిటెంట్లకు సమీపంలోనే ఉన్నామని, అతిత్వరలో వారిపై మూకుమ్మడి దాడి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వెల్లడించారు. హమాస్‌కు గాజా సిటీ ప్రధానమైన స్థావరం. మిలిటెంట్లు ఇక్కడ పటిష్టమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయుధ నిల్వలను సిద్ధం చేసుకున్నారు. గాజా సిటీ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులతో ముఖాముఖి తలపడేందుకు వారు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఒక్క రాత్రి 200 మంది బలి! గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకూ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దాదాపు 200 మంది మరణించారని గాజా సిటీలోని అల్–íÙఫా హాస్పిటల్ డైరెక్టర్ చెప్పారు. పెద్ద సంఖ్యలో మృతదేహాలు తమ ఆసుపత్రికి చేరుకున్నాయని తెలిపారు. చాలామంది క్షతగాత్రులు చికిత్స కోసం చేరారని వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. కాల్పుల విరమణకు ససేమిరా గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని, పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలంటూ మిత్రదేశం అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. కాల్పుల విరమణ పాటించాలంటూ జోర్డాన్, ఈజిప్టు తదితర అరబ్ దేశాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడుదల చేసే వరకూ గాజాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. గాజాలో సంక్షోభం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జోర్డాన్ సైనిక రవాణా విమానం సోమవారం ఉత్తర గాజాల్లో క్షతగాత్రులకు, రోగులుకు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలను జార విడిచింది. మరోవైపు ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు ఆగడం లేదు. ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో నలుగురు పౌరులు మరణించారు. 10,022 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై నెల రోజులవుతోంది. ప్రాణనష్టం నానాటికీ పెరిగిపోతోంది. గాజాలో మృతుల సంఖ్య 10 వేలు దాటింది. ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 10,022 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మృతుల్లో 4,100 మంది చిన్నారులు, 2,600 మంది మహిళలు ఉన్నారని తెలియజేసింది. వైమానిక దాడుల్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ భూభాగం వైపు హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 500కుపైగా రాకెట్లు గాజాలోనే కూలిపోయాయని, వాటివల్ల పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. డేర్ అల్–బాలహ్ పట్టణంలో సోమవారం ఉదయం ఓ ఆసుపత్రి సమీపంలోనే 66 మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. ముగిసిన ఆంటోనీ బ్లింకెన్ పర్యటన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్యప్రాచ్యంలో పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమయ్యారు. ఆయన సోమవారం తుర్కియే రాజధాని అంకారాలో ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్‌తో సమావేశమయ్యారు. అమెరికాకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. గాజాలో సంక్షోభాన్ని నివారించే ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు మరోసారి సూచించారు. ఇజ్రాయెల్–హమాస్ సంఘర్షణకు తెరదించడం, బందీలను విడిపించడంతోపాటు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా చర్యలు తీసుకొనే లక్ష్యంతో మధ్య ప్రాచ్యం చేరుకున్న బ్లింకెన్ పాక్షికంగానే విజయం సాధించారు. మధ్యప్రాచ్యం చేరుకున్న అమెరికా జలాంతర్గామి ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా తన గైడెడ్ మిస్సైల్ జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి పంపించింది. ఓహాయో క్లాస్ సబ్‌మెరైన్ తనకు కేటాయించిన ప్రాంతంలో అడుగుపెట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈజిప్టు రాజధాని కైరోకు ఈశాన్య దిక్కున సూయెజ్ కెనాల్లో జలాంతర్గామి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తమ గైడెడ్ మిస్సైల్ జలాంతర్గాముల ఎక్కడ మకాం వేశాయన్నది అమెరికా సైన్యం ఇలా బహిరంగంగా ప్రకటించడం అత్యంత అరుదు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ జోలికి ఎవరూ రావొద్దన్న హెచ్చరికలు జారీ చేయడానికే అమెరికా తన జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి తరలించినట్లు తెలుస్తోంది. ఖాన్ యూనిస్‌లోని భవన శిథిలాల్లో బాధితుల కోసం అన్వేíÙస్తున్న ఓ పాలస్తీనా వాసి ఉద్వేగం రఫాలో శిథిలాల మధ్య చిన్నారులు -
Israeli-Palestinian Conflict: శరణార్థి శిబిరాలపై భీకర దాడులు
గాజాసిటీ/ఖాన్ యూనిస్/జెరూసలేం: గాజాలోని శరణార్థి శిబిరాలు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లుతున్నాయి. సాధారణ పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లపై ప్రారంభించిన యుద్ధం అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. సెంట్రల్ గాజాలో శనివారం అర్ధరాత్రి నుంచి కనీసం మూడు శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు జరిగాయి. అల్–మఘాజీ రెఫ్యూజీ క్యాంపుపై జరిగిన దాడిలో ఏకంగా 47 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. జబాలియా క్యాంపులో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం బురీజ్ క్యాంప్‌లోని నివాస భవనాలపై జరిగిన వైమానిక దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 73 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మూడు ఘటనల్లో 60 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారు. వారిని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవలే జబాలియా, బురీజ్ క్యాంపులపై జరిగిన దాడుల్లో 200 మందికిపైగా జనం మరణించారు. హమాస్‌తో సంబంధం లేని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తుండడాన్ని అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అల్–ఖుద్స్ ఆసుపత్రి సమీపంలో పేలుడు గాజాలో ఆదివారం ఉదయం అల్–ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. ఆసుపత్రికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని పేర్కొంది. భవనం చాలావరకు ధ్వంసమైందని, చాలామంది మృతి చెందారని తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. హమాస్ మిలిటెంట్లు సామాన్య ప్రజల ముసుగులో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలోని మకాం వేస్తున్నారని వివరించింది. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైన ఘర్షణ దాదాపు నెల రోజులకు చేరింది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,700 మందికిపైగా మరణించారు. వీరిలో 4,800 మందికిపైగా చిన్నపిల్లలు ఉన్నారు. గాజాపై భూతల దాడుల్లో తమ సైనికులు 29 మంది మృతిచెందారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాపై అణుబాంబు ప్రయోగిస్తామన్న మంత్రిపై సస్పెన్షన్ వేటు హమాస్ మిలిటెంట్లను అంతం చేయడానికి గాజాపై అణుబాంబు ప్రయోగించే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయెల్ మంత్రిపై సస్పెన్షన్ వేటు పడింది. జెరూసలేం వ్యవహారాల మంత్రి అమిచాయ్ ఎలియాహూ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో గాజాలో సాధారణ ప్రజలెవరూ లేరని, అందరూ మిలిటెంట్లే ఉన్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు. గాజాపై అణుబాంబు ప్రయోగించే ఐచి్ఛకం కూడా ఉందని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. మంత్రి వ్యవహారంపై ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. మంత్రిని ప్రభుత్వ సమావేశాల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం, సైన్యం అంతర్జాతీయ చట్టాల ప్రమాణాల ప్రకారమే నడుచుకుంటున్నాయని నెతన్యాహూ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై మంత్రి అమిచాయ్ ఎలియాహూ వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అబ్బాస్‌తో ఆంటోనీ బ్లింకెన్ భేటీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, గాజాలో పాలస్తీనియన్ల ఇబ్బందులపై చర్చించారు. అక్టోబర్ 7 తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 150 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. జర్నలిస్టుకు తీరని దుఃఖం అల్–మఘాజీ క్యాంపుపై జరిగిన దాడి జర్నలిస్టు మొహమ్మద్ అలలౌల్కు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆయన నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులను కోల్పోయారు. టర్కీష్ వార్తా సంస్థ అనడోలులో ఆయన ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టుగా పని చేస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అల్–మఘాజీ క్యాంపులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో మొహమ్మద్ కుటుంబం ఉంటున్న ఇళ్లు ధ్వంసమయ్యింది. నలుగురు పిల్లలు, ముగ్గురు తోబుట్టువులు చనిపోయారు. ఆయన భార్య, తల్లి, తండ్రి, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. -
Israel-Hamas war: కొనసాగుతున్న దాడులు
జెరూసలేం: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పదాతి దళాలు మరింత ముందుకు చొచ్చుకెళ్తున్నాయి. మిలిటెంట్ల కోసం వీధుల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లకు గట్టి పట్టున్న గాజా సిటీ దిశగా సైన్యం కదులుతోంది. గాజా భూభాగంలో వైమానిక దాడులు సైతం యథావిధిగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి సెంట్రల్ గాజాలో బురీజ్ శరణార్థి శిబిరంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో 15 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నారు. గాజాలో తమ సైన్యంపై హమాస్ మిలిటెంట్లు యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు, గ్రనేడ్లు ప్రయోగించారని ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయంలో అమెరికాతోపాటు అరబ్ దేశాలు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తోపాటు హమాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. యుద్ధానికి కనీసం విరామం అయినా ఇవ్వాలని ఇరుపక్షాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సాధారణ ప్రజల ప్రాణాలను హరించడం తగదని ఆయన పరోక్షంగా తేలి్చచెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించబోతున్నారు. జోర్డాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌లోని తమ రాయబారిని వెనక్కి రప్పించింది. యుద్ధం ముగిసేదాకా తమ దేశానికి రావొద్దని ఇజ్రాయెల్ రాయబారికి సూచించింది. గాజాలో 9 వేలు దాటిన మృతులు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 9,061 మంది పాలస్తీనియన్లు మరణించారని, 32,000 మందికిపైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అష్రాఫ్ అల్–ఖుద్రా గురువారం వెల్లడించారు. మృతుల్లో 3,760 మంది 18 ఏళ్లలోపు వారేనని చెప్పారు. ఇవన్నీ అధికారిక గణాంకాలే. వాస్తవానికి ఇంకా ఎంతమంది చనిపోయారో అధికారులు చెప్పలేకపోతున్నారు. గాజాలో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా మరణించి ఉండొచ్చని తెలుస్తోంది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడులతోపాటు అంతర్గత ఘర్షణల్లో 130 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా బలయ్యారు. ఈజిప్టుకు మరో 100 మంది.. విదేశీ పాస్‌పోర్టులు కలిగి ఉన్నవారు గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లిపోతున్నారు. బుధవారం 335 మంది వెళ్లగా, గురువారం మరో 100 మంది రఫా సరిహద్దును గుండా ఈజిప్టులో అడుగుపెట్టారు. అంతేకాకుండా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన 76 మంది పాలస్తీనియన్లు వారి సహాయకులతో కలిసి ఈజిప్టు చేరుకున్నారు. వారికి ఈజిప్టులో చికిత్స అందించనున్నారు. గాజాలో ప్రస్తుతం దాదాపు 400 మంది అమెరికన్లు ఉన్నారు. వారందరినీ క్షేమంగా స్వదేశానికి చేర్చడానికి అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. -
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇద్దరు హమాస్ టాప్ కమాండర్ల హతం
ఇజ్రాయెల్ సైతన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య గత మూడు వారాలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్నాయి హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం పోరాడుతోంది. గాజాపై భూతల, వైమానిక దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. మంగళవారం ఇజ్రాయెల్ క్షిపణుల ధాటికి వందలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ఒక్క రోజే ఏకంగా 300 ‘లక్ష్యాలను’ ఛేదించినట్టు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా గాజాలోని అతిపెద్ద శరణార్థుల శబిరంపై జరిపిన వౌమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోపల్పోయారు. ఈ కాల్పుల్లో హమాస్ సీనియర్ కమాండర్ హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది ఇద్దరు హమాస్ కమాండర్లు హతం! అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ భారీ మెరుపుదాడికి పథక రచన చేసిన హమాస్ ఉత్తర డివిజన్ కమాండర్ నసీమ్ అబు అజీనా తమ దాడుల్లో హతమైనట్టు సైన్యం పేర్కొంది. అదే విధంగాహమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీ సైతం హతమార్చినట్లు బుధవారం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతమంతా పూర్తిగా నాశనమైంది.దీంతో అక్కడి నివాసితులందరూ తమ భద్రత కోసం దక్షిణం వైపు వెళ్లాలని ఐడీఎఫ్ పిలుపునిచ్చింది. తొమ్మిది వేలకు చేరిన మరణాలు ఇక ఇప్పటిదాకా పోరుకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 8,525 చేరిందని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 3,542 మది చిన్నారులు, 2,187 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇక్కడ 122 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం, హమాస్ నాయకుడు సలేహ్ అల్-అరూరి ఇంటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింది. యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. -
Israel-Hamas war: గాజాలో మరణ మృదంగం
ఖాన్ యూనిస్/జెరూసలేం: హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులు ఉధృతం చేస్తుండడం గాజాలో సాధారణ పాలస్తీనియన్లకు ప్రాణసంకటంగా మారింది. సోమవారం మరిన్ని దళాలు ఇజ్రాయెల్ భూభాగం నుంచి గాజాలోకి అడుగుపెట్టాయి. ఇజ్రాయెల్ సేనలు గాజాలోకి మరింత ముందుకు చొచ్చుకొస్తున్నాయి. గాజాలో 24 గంటల్లో 600 హమాస్ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మిలిటెంట్ల ఆచూకీ కోసం అణువణువూ గాలిస్తున్నాయి. గాజాలో క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి అయిన ‘టర్కిష్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్’ సమీపంలోనే ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం రాత్రి వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి స్వల్పంగా ధ్వంసమయ్యింది. ఉత్తర, దక్షిణ గాజాను అనుసంధానించే ప్రధాన జాతీయ రహదారిని ఇజ్రాయెల్ యుద్ధట్యాంకులు, బుల్డోజర్లు దిగ్బంధించాయి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. ఇందుకు కారణం ఏమిటన్నది బయటపెట్టడం లేదు. ఉత్తర గాజా నుంచి జనం దక్షిణ గాజాకు వెళ్లలేకపోతున్నారు. ఉత్తర గాజాలకు భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హమాస్ వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 304 మంది మృతిచెందారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటిదాకా 8,306 మంది పాలస్తీనియన్లు మరణించారని, 21,048 మంది గాయపడ్డారు. ఇంకా 1,950 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని వివరించింది. ఇజ్రాయెల్‌లో 1,400మందికిపైగా మృత్యువాత పడ్డారు. అరకొర సాయమే ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న మానవతా సాయం ఇప్పుడిప్పుడే గాజాకు చేరుకుంటోంది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, దుస్తులు, నీటి శుద్ధి యంత్రాలు వంటివి అందుతున్నాయి. 75 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్ తాజాగా ఈజిప్టు నుంచి దక్షిణ గాజాలోకి అడుగుపెట్టింది. ఈ వాహనాలు టన్నుల కొద్దీ ఆహారం, తాగు నీరు, పలు రకాల కీలక ఔషధాలను చేరవేశాయి. గాజాలోని 23 లక్షల జనాభాకు ఈ సాయం ఏమాత్రం చాలదని అక్కడి స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. దక్షిణ గాజాలో రెండు నీటి సరఫరా పైపులైన్లను పునరుద్ధరించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. యూదుల కోసం విమానంలో గాలింపు ఇజ్రాయెల్ నుంచి వచి్చన విమానంలో యూదుల కోసం రష్యాలోని ముస్లింలు గాలించడం సంచలనాత్మకంగా మారింది. ఆదివారం టెల్ అవీవ్ నుంచి విమానం రష్యాలో ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన మాఖాచ్కలాలోని దగెస్తాన్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ విమానంలో యూదులు ఉన్నారన్న అనుమానంతో వందలాది మంది ముస్లింలు ఎయిర్‌పోర్టును దిగ్బంధించారు. పాలస్తీనా జెండాలను చేబూని, ఎయిర్‌పోర్టులోకి లోపలికి ప్రవేశించి అలజడి సృష్టించారు. యూదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చంపేయాలంటూ నినదించారు. కొందరు రన్‌వే పైకి దూసుకెళ్లారు. ఇజ్రాయెల్ విమానాన్ని చుట్టుముట్టారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూదులపై దాడి చేయడానికే ఎయిర్‌పోర్టుకు వచి్చనట్లు తెలుస్తోంది. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపైనా తిరగబడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురు పోలీసులు సహా 20 మంది గాయపడ్డారు. పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అపహరించిన షానీ లౌక్‌ను హత్య చేశారు 23 ఏళ్ల యువతి షానీ లౌక్ ఈ నెల 7న ఇజ్రాయెల్‌లోని కిబుట్జ్‌లో ఓ సంగీత వేడుకలో ఉండగా హమాస్ మిలిటెంట్లు హఠాత్తుగా దాడి చేశారు. కొందరిని కాలి్చచంపారు. షానీ లౌక్తోపాటు మరికొందరిని అపహరించారు. బందీలుగా బలవంతంగా గాజాకు లాక్కెళ్లారు. అయితే, మిలిటెంట్ల చెరలో షానీ లౌక్ క్షేమంగా ఉండొచ్చని ఆమె తల్లి, సోదరి భావించారు. త్వరలోనే ప్రాణాలతో తిరిగివస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే దుర్వార్త తెలిసింది. గాజాలో మిలిటెంట్లు ఓ యువతి మృతదేహాన్ని వాహనంలో ఉంచి, ‘అల్లాహో అక్బర్’ అని అరుస్తూ గాజా వీధుల్లో ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శవంగా మారిన ఆ యువతి షానీ లౌక్ అని తల్లి రికార్డా లౌక్, సోదరి అడీ లౌక్ గుర్తించారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇజ్రాయెలీ–జర్మన్ జాతీయురాలైన షానీ లౌక్‌ను మిలిటెంట్లు హత్య చేయడం దారుణమని, ఈ ఘటన తమను కలచివేసిందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది. -
Israel-Hamas war: హమాస్ స్థావరాలే లక్ష్యం
గాజాస్ట్రిప్/జెరూసలేం/న్యూఢిల్లీ: గాజాలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ స్థావరాలను నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు మరింత ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ పదాతి దళం మన్ముందుకు చొచ్చుకెళ్తోంది. మరోవైపు వైమానిక దళం నిప్పుల వర్షం కురిపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో 450 హమాస్ స్థావరాలపై దాడుల చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. మిలిటెంట్ల కమాండ్ సెంటర్లు, అబ్జర్వేషన్ పోస్టులు, యాంటీ–ట్యాంక్ మిస్సైల్ లాంచింగ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలియజేసింది. గాజాలోకి మరిన్ని పదాతి దళాలు అడుగుపెట్టబోతున్నాయని పేర్కొంది. ఖాన్ యూనిస్ సిటీలో ఓ భవనంపై జరిగిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. వీరిలో 10 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. హమాస్ కమాండ్ పోస్టు ఉందని భావిస్తున్న షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. గాజా సిటీలో ఇదే అతిపెద్ద ఆసుపత్రి. ఇక్కడ వందలాది మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఎంతమంది బలయ్యారన్నది తెలియరాలేదు. హమాస్‌పై రెండో దశ యుద్ధం కొనసాగుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో శత్రువులపై భీకర పోరు తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లు సైతం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్‌పైకి అప్పుడప్పుడు రాకెట్లు ప్రయోగిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో తరచుగా సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. మూడు వారాలు దాటిన ఘర్షణ ఇజ్రాయెల్ దాడుల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ల వ్యవస్థను పునరుద్ధరించారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 8,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 3,300 మంది మైనర్లు, 2,000 మందికిపైగా మహిళలు ఉన్నారని ప్రకటించింది. శిథిలాల కింద మరో 1,700 మంది చిక్కుకుపోయినట్లు అంచనా. వారు ఎంతమంది బతికి ఉన్నారో చెప్పలేని పరిస్థితి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌దాడులు తీవ్రతరం కావడం పాలస్తీనియన్లలో గుబు లు పుట్టిస్తోంది. ఇలాంటి భీకర దాడులను తామెప్పుడూ చూడలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీకి నెతన్యాహూ క్షమాపణ ఇజ్రాయెల్ భద్రతా దళాలకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ క్షమాపణ చెప్పారు. ఈ నెల 7న జరిగిన హమాస్ దాడిని ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైందంటూ ఆయ న తొలుత ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాడికి సంబంధించి భద్రతా దళాల అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని తప్పుపట్టారు. నెతన్యాహు పోస్టుపై ఆయన సహచర మంత్రులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భద్రతా సిబ్బంది ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం ఏమిటని పలువురు మండిపడ్డారు. దీంతో బెంజమిన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. భద్రతా బలగా లకు క్షమాపణ చెప్పారు. వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. పశి్చమాసియాలో శాంతి నెలకొనాలి: మోదీ ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పశి్చమాసియాలో ఉద్రిక్తత పెరిగిపోతుండడం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీతో ఫోన్లో మాట్లాడారు. పశి్చమాసియా పరిణామాలపై చర్చించారు. గాజాలో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండడం, సాధారణ ప్రజలు మరణిస్తుండడం తీవ్ర విచాకరమని మోదీ పేర్కొన్నారు. పశి్చమాసియాలో సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని, ఇందుకు అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు మోదీ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. గాజాకు మానవతా సాయం అందిస్తామన్నారు. గోదాములు లూటీ మూడు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల 23 లక్షల మంది గాజా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. చల్లారని ఆకలి మంటలు వారిని లూటీలకు పురికొల్పుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అందిస్తున్న మానవతా సాయాన్ని గాజాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యూఎన్ఆర్డబ్ల్యూఏ సంస్థ గోదాముల్లో భద్రపరుస్తోంది. ప్రజలకు పంపిణీ చేస్తోంది. అయితే, ఆకలికి తాళలేని జనం గోదాములను లూటీ చేస్తున్నారని, గోధుమ పిండి, ఇతర నిత్యావసరాలు, పరిశుభ్రతకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్నారని వెల్లడించింది. గాజాలో ‘సివిల్ ఆర్డర్’ గతి తప్పుతోందని పేర్కొంది. పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారతోందని, ఆవేశంలో ఉన్న ప్రజలను నియంత్రించలేకపోతున్నామని తెలియజేసింది. రణభూమిగా మారిన గాజాలో ఉండలేక, ఇతర దేశాలకు వలస వెళ్లే మార్గం కనిపించక జనం నిరాశలో మునిగిపోతున్నారని, అంతిమంగా వారిలో హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని స్పష్టం చేసింది. ‘ద్విదేశ’ విధానమే పరిష్కారం: బైడెన్ ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి తెరపడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, అరబ్ దేశాల నాయకత్వం ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని సూచించారు. ద్విదేశ విధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ఒప్పందానికి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, స్వతంత్ర పాలస్తీనా అనే రెండు దేశాలు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు తెలియజేశానని అన్నారు. వెస్ట్‌బ్యాంక్‌లో మరో దారుణం ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆదివారం వెస్ట్‌బ్యాంక్‌లోని నబ్లూస్లో ఓ యూదు సెటిలర్ జరిపిన కాల్పుల్లో బిలాల్ సాలెహ్ అనే పాలస్తీనియన్ రైతు మరణించాడు. ఈ రైతు ఆలివ్ తోటలు సాగుచేస్తుంటాడు. వెస్ట్‌బ్యాంక్‌లో గత 23 రోజుల్లో యూదు సెటిలర్ల దాడుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇక ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఇక్కడ 110 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారు. -
గాజాపై భూతల దాడులు
రఫా/వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఊహించినట్లుగానే ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాపై భూతల దాడులు ప్రారంభించింది. హమాస్ స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ పదాతి దళాలు, యుద్ధ ట్యాంకులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిహద్దు దాటి గాజా భూభాగంలోకి అడుగుపెట్టాయి. ‘లక్ష్యాల’పై స్పల్పస్థాయిలో దాడులు నిర్వహించాయి. గురువారం తెల్లవారుజాము వరకూ ఈ దాడులు కొనసాగాయి. ఉత్తర గాజాపై అతిత్వరలో పూర్తిస్థాయి భూతల యుద్ధం ప్రారంభం అవుతుందని ఇజ్రాయెల్ సైన్యం సంకేతాలిచి్చంది. యుద్ధక్షేత్రాన్ని సిద్ధం చేయడానికే స్వల్పంగా భూతల దాడులు చేశామని గురువారం వెల్లడించింది. చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని, హమాస్ మౌలిక సదుపాయాలను, ఆయుధ వ్యవస్థను ధ్వంసం చేశామని పేర్కొంది. గత 24 గంటల్లో గాజాపై దాదాపు 250 వైమానిక దాడులు చేశామని ప్రకటించింది. గాజాలో సహాయక చర్యలకు ఆటంకాలు సృష్టించవద్దని, భూతల దాడులను విరమించుకోవాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసినా ఇజ్రాయెల్ సైన్యం లెక్కచేయకపోవడం గమనార్హం. ప్రాణనష్టం.. ఊహించలేం పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ 2007 నుంచి గాజాలో అధికారం చెలాయిస్తోంది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా విరుచుకుపడింది. భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా సామాన్య ప్రజలు, సైనికులు మరణించారు. తమ భద్రతకు సవాలు విసురుతున్న హమాస్‌కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. గాజాపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరుపక్షాల మధ్య గత 20 రోజులుగా హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 7,000 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. వీరిలో 2,900 మంది చిన్నపిల్లలు, 1,500 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తిస్థాయిలో భూతల దాడులు మొదలైతే గాజాలో ప్రాణనష్టం ఊహించని స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఖాన్ యూనిస్‌లో 15 మంది బలి ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఉత్తర గాజాపై భూతల దాడులతోపాటు దక్షిణ గాజాలో వైమానిక దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో ఖాన్ యూనిస్ సిటీలో 8 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. సామాన్య ప్రజలకు హాని కలిగించడం లేదని, కేవలం హమాస్ స్థావరాలపైనే దాడుల చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. మరోవైపు మిలిటెంట్లు సైతం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని పెటా తిక్వా నగరంపై రాకెట్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మానవతా సాయం అంతంత మాత్రమే గాజాలో ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక జనం పిట్టల్లా రాలిపోతుండడంతో ఇజ్రాయెల్‌పై ప్రపంచదేశాలు ఒత్తిడి పెంచాయి. ఇజ్రాయెల్ అనుమతితో ఈజిప్టు నుంచి ఇప్పటివరకు 70కి పైగా వాహనాలు గాజాలోకి అడుగుపెట్టాయి. ఈజిప్టు నుంచి అందుతున్న మానవతా సాయం ఏ మూలకూ చాలడం లేదని గాజా అధికారులు చెబుతున్నారు. ఈ సాయం సముద్రంలో నీటి»ొట్టంత అని గాజాలోని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌క్రాస్ ప్రతినిధి విలిమయ్ ష్కోమ్బర్గ్ అన్నారు. ఆకలితో అలమటించిపోతున్న ప్రజల ప్రాణాలు నిలబెట్టాలంటే ఇంకా ఎన్నో రెట్ల సాయం కావాలని కోరారు. అల్–జజీరా జర్నలిస్టు భార్య, పిల్లలు మృతి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో బుధవారం అంతర్జాతీయ మీడియా సంస్థ అల్–జజీరా సీనియర్ జర్నలిస్టు వాయెల్ దాహ్‌దౌ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు ప్రాణాలు కోల్పోయారు. గాజాలోని నుసీరాత్ శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో వారు మరణించారు. మరికొందరు కుటుంబ సభ్యులు కనిపించకుండాపోయారు. గురువారం వాయెల్ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన భార్య, కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలు కలిచివేశాయి. సంతాపం ప్రకటిస్తూ వారు పోస్టులు పెట్టారు. ప్రతీకారం తీర్చుకోవాలంటే మా పిల్లలను బలి తీసుకోవాలా? అని వాయెల్ నిలదీశారు. పాలస్తీనా జాతీయుడైన వాయెల్ చాలా ఏళ్లుగా గాజాలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇక్కడి ప్రజల దీనగాథలను, ఇజ్రాయెల్ సైన్యం దుశ్చర్యలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఆ ఎకనామిక్ కారిడార్ వల్లే హమాస్ దాడి!: బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారత్‌లో జి–20 సదస్సులో ప్రకటించిన ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను హమాస్ మిలిటెంట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ ప్రాజెక్టును విరమించుకొనేలా ఒత్తిడి పెంచడానికే ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడి చేశారన్న వాదన కొంతవరకు తనకు సబబుగానే కనిపిస్తోందని అన్నారు. హమాస్ దాడికి గల కారణంపై తన అంతరాత్మ ఇదే చెబుతోందని వ్యాఖ్యానించారు. అయితే, దీనికి తనవద్ద స్పష్టమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నారు. అమెరికా పర్యటనకు వచి్చన ఆ్రస్టేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బానీస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎకనామిక్ కారిడార్ గురించి బైడెన్ ప్రస్తావించడం గత వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. రైలు, రోడ్డు మార్గాలతో ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్ దేశాలను అనుసంధానించడానికి ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను జి–20 దేశాలు తలపెట్టిన సంగతి తెలిసిందే. -
Israel-Hamas war: గాజాలో కన్నీటి చుక్కలు
రఫా/టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండాపోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరతవల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇటీవల అనుమతి ఇచి్చంది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచి్చన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్‌ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెబుతోంది. చేతులేత్తేయడమే మిగిలింది ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్ లేక, పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడింట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సిరియాలో 8 మంది జవాన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హమాస్‌కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఒక్కతాటిపైకి మిలిటెంట్ సంస్థలు! ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్ నస్రల్లా బుధవారం హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన మీకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్‌ను హెజ్బొల్లా హెచ్చరించింది. హమాస్‌కు ఇరాన్ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఇరాన్‌లోని మిలిటెంట్ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్ భూభాగల నంచి ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బందీల విడుదలకు ఖతార్ యత్నాలు హమాస్ చెర నుంచి బందీలు విడుదలయ్యే విషయంలో మరిన్ని సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహా్మన్ అల్–థానీ చెప్పారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్ల తరలింపు! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే, అక్కడున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు ఇజ్రాయెల్ వదిలి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉన్నారు. యుద్ధం గనుక విస్తరిస్తే వారి భద్రతకు భరోసా ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిస్థితి అదుపు తప్పకముందే వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సౌరే అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఘర్షణను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు రోజుల్లో 750 మంది మృతి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రత పెంచింది. బుధవారం కొన్ని టార్గెట్లపై క్షిపణులు ప్రయోగించింది. హమాస్ స్థావరాలను, సొరంగాలను, ఆయుధాగారాలను, సమాచార వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది క్షతగాత్రులుగా మారారు. 10 మంది యూదులను చంపేశా! ఇజ్రాయెల్‌లో 10 మంది యూదులను చంపేశానంటూ హమాస్ మిలిటెంట్ ఒకరు తన తల్లిదండ్రులతో మొబైల్ ఫోన్లో చెప్పిన ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచి్చంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ దీన్ని విడుదల చేసింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ భూభాగంలోని కిబుట్జ్‌లో తానున్నానని, తాను ఒక్కడినే 10 మంది యూదులను మట్టుబెట్టానని సదరు మిలిటెంట్ గాజాలోని ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి గర్వం తొణికిసలాడే స్వరంతో ఆనందంగా చెప్పాడు. దాంతో వారు అతడిని శభాష్ అంటూ అభినందించారు. మిలిటెంట్ ఉపయోగించిన ఫోన్ అతడి చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుడిదే కావడం గమనార్హం. అయితే, ఈ ఆడియో రికార్డు నిజమైందో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. -
చిన్నారులే సమిధలు.. గాజాలో ప్రతి 15 నిమిషాలకు..
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో పెద్దసంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపువారే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనియన్ స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికిపైగా చనిపోతున్నారని తెలియజేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాలో 3,400 మందికిపైగా జనం మరణించారు. వీరిలో 1,000 మందికిపైగా బాలలు ఉన్నట్లు అంచనా. అంటే ప్రతి ముగ్గురు మృతుల్లో ఒకరు చిన్నపిల్లలే కావడం గమనార్హం. గాజాలో అచ్చంగా నరమేధమే సాగుతోందని డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్–పాలస్తీనా(డీసీఐపీ) అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం తక్కువ. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 1,400 మంది మృతిచెందగా, వీరిలో 14 మంది బాలలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ► గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించింది. ఆహారం, నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు చెబుతున్నా అవి చాలామందికి అందడం లేదు. ► తగినంత ఆహారం, నీరు లేక గాజాలో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. పారిశుధ్య వసతులు లేకపోవడంతో డయేరియా వంటి వ్యాధులు ప్రబులుతున్నాయని పేర్కొంటున్నారు. ► యుద్ధం కారణంగా పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక అధికారులు చెప్పారు. అకారణంగా భయపడడం, రోదించడం వంటివి చేస్తున్నారని తెలియజేశారు. ► రణక్షేత్రంలో దాడులు, ప్రతిదాడులు చూస్తూ పెరిగిన పిల్లల్లో హింసాత్మక ధోరణి పెరుగుతుందని, భవిష్యత్తులో వారు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. ► యుద్ధాల సమయంలో బాలలకు హక్కులుంటాయి. వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇరుపక్షాలకూ ఉంటుంది. ► చిన్నారుల ప్రాణాలను రక్షించాలంటూ 1949లో జెనీవాలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని 1951లో ఇజ్రాయెల్ ఆమోదించింది. -
Israel-Hamas war: హమాస్‌పై ముప్పేట దాడి
రఫా(గాజా్రస్టిప్)/జెరూసలేం/న్యూఢిల్లీ/టెల్ అవీవ్: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య ఘర్షణలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇజ్రాయెల్ భీకర యుద్ధం ప్రారంభించింది. ఇప్పటిదాకా గాజాలో వైమానిక దాడులు నిర్వహించగా, ఇక సిరియా, వెస్ట్‌బ్యాంక్‌లోని హమాస్ స్థావరాలపైనా దృష్టి పెట్టింది. గాజాతోపాటు సిరియాలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్‌లో ఒక మసీదుపై క్షిపణులు ప్రయోగించింది. శనివారం రాత్రి మొదలైన ఈ దాడుల ఆదివారం కూడా కొనసాగాయి. మూడు ప్రాంతాల్లోని టార్గెట్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిప్పుల వర్షం కురిపించాయి. సిరియాలోని ఎయిర్‌పోర్టులు, వెస్ట్‌బ్యాంక్ మసీదును హమాస్ మిలిటెంట్లు అడ్డాగా మార్చుకున్నారని, అక్కడి నుంచే తమపై దాడులకు సన్నాహాలు చేస్తున్నారని, అందుకే ముందుగానే ఎదురుదాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సిరియా ఎయిర్‌పోర్టులపై జరిగిన దాడిలో ఒకరు మరణించారు. రన్వేలు దెబ్బతిన్నాయి. వెస్ట్‌బ్యాంక్‌లో కనీసం ఐదుగురు మరణించారు. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ భూభాగంపై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ దళాలు సైతం ప్రతిదాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సైన్యం సన్నద్ధతపై నెతన్యాహూ సమీక్ష ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఇప్పటివరకు గాజాలో 4,385 మంది జనం మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా మరణించారు. గాజాపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ శనివారం రాత్రి మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఉత్తర గాజాపై భూతల దాడుల విషయంలో సైన్యం సన్నద్ధతపై ఈ భేటీలో సమీక్ష సమాచారం. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో వేలాదిగా ఇజ్రాయెల్ సైనికులు మోహరించారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి ఇప్పటికే 7 లక్షల మంది జనం దక్షిణ గాజాకు వెళ్లిపోయినట్లు అంచనా. అనూహ్య స్థాయిలో ‘తదుపరి దాడి’ గాజాపై జరుగుతున్న వైమానిక దాడులు ‘యుద్ధంలో తదుపరి దశ’కు రంగం సిద్ధం చేయడానికేనని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ చెప్పారు. తదుపరి దాడి అనూహ్య స్థాయిలో ఉంటుందని అన్నారు. తమ పదాతి దళాలు గాజా భూభాగంలోకి అడుగుపెట్టడానికి వీలుగా సానుకూల పరిస్థితులు సృష్టించడానికి వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సానుకూల పరిస్థితులు ఉన్నప్పుడే తదుపరి దశ యుద్ధంలోకి ప్రవేశించాల్సి ఉంటుందని అన్నారు. హమాస్‌ను అంతం చేయడానికి గాజాలో అడుగుపెడతామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జీ హలేవీ చెప్పారు. మిలిటెంట్ల సన్నద్ధతను తక్కువ అంచనా వేయొద్దని తమ సైన్యానికి సూచించారు. ఆయన తాజాగా ఇజ్రాయెల్ సైనికాధికారుతో సమావేశయ్యారు. గాజాలో ప్రవేశించిన తర్వాత ఊహించని పరిణామాలకు సైతం సిద్ధంగా ఉండాలని అన్నారు. కిక్కిరిసిన జనాభాతో గాజా స్ట్రిప్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని తెలిపారు. శత్రువులు మన కోసం అక్కడ ఎన్నో యుద్ధ రీతులను సిద్ధం చేసి పెట్టారని, మన ప్రతిస్పందన అత్యంత చురుగ్గా, వేగంగా ఉండాలని సూచించారు. ఇజ్రాయెల్ తాజా హెచ్చరిక గాజా ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర గాజా నుంచి దక్షిణం గాజాకు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. అలా వెళ్లనివారిని హమాస్ మిలిటెంట్ల సానుభూతిపరులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్) పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే మొబైల్ ఫోన్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు చేరవేశారు. ‘‘ఉత్తర గాజాలో మీకు ముప్పు పొంచి ఉంది. దక్షిణ గాజాకు వెళ్లకుండా ఉత్తర గాజాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నవారిని హమాస్ సానుభూతిపరులుగా పరిగణిస్తాం’’ అని అందులో పేర్కొన్నారు. పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం గాజాలోని పాలస్తీనియన్లకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. 6.5 టన్నుల ఔషధాలు, 32 టన్నుల విపత్తు సహాయక సామగ్రిని పంపించింది. ఔషధాలు, సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానం ఆదివారం భారత్ నుంచి నుంచి బయలుదేరింది. ఇది ఈజిప్టులోని ఎల్–అరిష్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది. మానవతా సాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో గాజాకు చేరవేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అత్యవసర ప్రాణ రక్షక ఔషధాలు, సర్జికల్ సామగ్రి, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్టు, శానిటరీ వస్తువులు, నీటి శుద్ధి మాత్రలు తదితర సామగ్రిని గాజాకు పంపించినట్లు తెలియజేశారు. పాలస్తీనియన్లకు మరింత సాయం పంపిస్తామని వెల్లడించారు. గాజాలో సామన్య ప్రజల మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మొమమ్మద్కు అబ్బాస్‌కు ఫోన్ చేసి, సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు నుంచి గాజాకు రెండో షిప్మెంట్ ఇజ్రాయెల్ సైన్యం దాడులతో అల్లాడిపోతున్న గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం ఇప్పుడిప్పుడే చేరుతోంది. నిత్యావసరాలు, ఇతర సహాయక సామగ్రితో కూడిన 17 వాహనాలు ఆదివారం ఈజిప్టు నుంచి గాజాలో అడుగుపెట్టాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో షిప్మెంట్. శనివారం 20 వాహనాలు ఈజిప్టు నుంచి గాజాకు చేరుకున్నాయి. -
Israel-Hamas war: గాజాలో తీరని వ్యథ
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్/వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య అనూహ్యంగా మొదలైన యుద్ధం సాధారణ పాలస్తీనియన్ల ఉసురు తీస్తోంది. బతికి ఉన్నవారికి కడుపు నిండా అన్నం లేదు, కంటికి నిద్రలేదు. ఆకలి, అగచాట్లే మిగులుతున్నాయి. సేఫ్‌జోన్ అని భావించే దక్షిణ గాజాలో కూడా ఇప్పుడు భద్రత లేకుండాపోయింది. ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలతో ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు వలస వెళ్లిన జనం మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నారు. దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఉధృతంగా కొనసాగుతుండడమే ఇందుకు కారణం. శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై విరుచుకుపడింది. క్షిపణుల వర్షం కురిపించింది. ప్రధానంగా ఖాన్ యూనిస్ నగరంలో నష్టం అధికంగా జరిగింది. హమాస్‌కు చెందిన 100కుపైగా టార్గెట్లపై దాడులు చేశామని, మిలిటెంట్ల సొరంగాలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం శుక్రవారం 14వ రోజుకు చేరింది. ఇరువైపులా ప్రాణ, ఆస్తి నష్టం పెరుగుతోంది. ఈ యుద్ధంలో గాజాలో ఇప్పటివరకు 4,137 మంది మృతిచెందారని, 12,500 మందికిపైగా జనం క్షతగాత్రులుగా మారారని గాజా ఆరోగ్య శాఖ తెలియజేసింది. మరో 1,300 మంది ఇంకా శిథిలాల కిందే ఉన్నారని, వారు బతికి ఉన్నారో లేదో చెప్పలేమని వెల్లడించింది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ల అధీనంలో 203 మంది బందీలు ఉన్నట్లు గుర్తించామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. గాజాలో సేఫ్ జోన్లు లేవు తమ లక్ష్యం కేవలం హమాస్ మిలిటెంట్లు మాత్రమేనని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ చెప్పారు. గాజాలో హమాస్ గ్రూప్‌ను నిర్మూలించిన తర్వాత సాధారణ ప్రజలను తమ నియంత్రణలోకి తీసుకురావాలన్న ఉద్దేశం ఏదీ లేదని అన్నారు. గాజాలో ఇప్పుడు సేఫ్ జోన్లు అంటూ ఏవీ లేవని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిర్ దినార్ చెప్పారు. గాజా అంతటా మిలిటెంట్ల స్థావరాలు, సొరంగాలు ఉన్నాయని, వాటిపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు దక్షిణ గాజాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో అక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయని, జనజీవనం స్తంభించిపోతోందని, ఉత్తర గాజా నుంచి వచి్చనవారు వెనక్కి మళ్లుతున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అధికార ప్రతినిధి రవీనా శామ్దాసానీ చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల కారణంగా క్షతగాత్రుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గాజాలోని ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. పరిమితంగా ఉన్న ఔషధాలు ఏ మూలకూ చాలడం లేదు. హాస్పిటళ్లలో కరెంటు లేకపోవడంతో డాక్టర్లు మొబైల్ ఫోన్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఈజిప్టు నుంచి ఔషధాలు, నిత్యావసరాలు దిగుమతి చేసుకొనేందుకు ప్రయతి్నస్తున్నామని గాజా అధికారులు చెప్పారు. క్షిపణులు, డ్రోన్లను కూలి్చవేసిన అమెరికా సైన్యం మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద సంస్థలు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తున్నాయి. గురువారం ఇజ్రాయెల్ దిశగా దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను ఉత్తర ఎర్ర సముద్రంలోని తమ యుద్ధనౌక యూఎస్ఎస్ కార్నీ కూల్చివేసిందని అమెరికా సైన్యం వెల్లడించింది. యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాద శక్తులు ఈ ఆయుధాలను ప్రయోగించాయని ఆరోపించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా నుంచి జరిగిన తొలి ప్రతిదాడి ఇదే కావడం గమనార్హం. హమాస్ అగ్రనేత హసన్ యూసఫ్ అరెస్టు హమాస్ మిలిటెంట్ సంస్థ అధికార ప్రతినిధి హసన్ యూసఫ్‌ను గురువారం వెస్ట్‌బ్యాంక్‌లో అరెస్టు చేసినట్లు ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌బెట్ ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్‌లో నిర్వహించిన దాడుల్లో హమాస్‌కు చెందిన 60 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేసింది. హమాస్ కోసం హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై హసన్ యూసఫ్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. హసన్ యూసఫ్ పాలస్తీనాలో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం హవ ూస్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. వెస్ట్‌బ్యాంక్ చట్టసభలో సభ్యుడుగా వ్యవహరిస్తున్నాడు. హసన్ యూసఫ్ గతంలో 24 ఏళ్లు జైల్లో ఉన్నాడు. అంతర్జాతీయ మీడియాలో హమాస్ ప్రతినిధిగా ప్రముఖంగా కనిపించేవాడు. ఇజ్రాయెలీలకు వీసా లేకుండా అమెరికా యానం ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం చాలారోజులు కొనసాగే అవకాశం ఉండడంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ ప్రజల కోసం వీసా రద్దు పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఇజ్రాయెలీలు వీసాకు దరఖాస్తు చేసుకోకుండానే అమెరికాకు చేరుకొని, 90 రోజులపాటు ఇక్కడ నివసించవచ్చు. ఈ పథకం గురువారం నుంచే అమల్లోకి వచి్చందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. డ్రగ్స్ మత్తులో ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ల దాడి! హమాస్ మిలిటెంట్లు ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేశారు. వారు ఆ సమయంలో మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నారని ‘ద జెరూసలేం పోస్టు’ పత్రిక వెల్లడించింది. కాప్టాగాన్ అనే డ్రగ్స్ మాత్రలు తీసుకున్నారని, ఒళ్లు తెలియని స్థితిలో రెచి్చపోయారని, సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన ఎదురుదాడిలో పలువురు మిలిటెంట్లు మరణించారు. మృతదేహాలను సోదా చేయగా కాప్టాగాన్ డ్రగ్స్ మాత్రలు లభించాయని ఆ పత్రిక వివరించింది. హమాస్ నాయకత్వమే మిలిటెంట్లకు ఈ మాత్రలు ఇచి్చనట్లు తెలిపింది. కాప్టాగాన్ను పేదల కొకైన్‌గా పిలుస్తుంటారు. అన్నం దొరకని సందర్భాల్లో ఆకలి వేయకుండా, మత్తులో మునిగి ధైర్యం పొందడం కోసం కాప్టాగాన్ తీసుకుంటూ ఉంటారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ విజయం అమెరికాకు రక్ష: బైడెన్ ప్రత్యర్థులతో ప్రస్తుతం సాగిస్తున్న యుద్ధాల్లో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దేశాలు విజయం సాధించాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ల విజయం అమెరికా జాతీయ భద్రతకు చాలా కీలకమని అన్నారు. ఆయన గురువారం రాత్రి శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసు నుంచి అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. సైనిక సాయం కింద ఇజ్రాయెల్, ఉక్రెయిన్తోపాటు తైవాన్‌కు బిలియన్ల డాలర్లు ఇవ్వాలని, అందుకోసం మనం సిద్ధం కావాలని సూచించారు. నిధుల మంజూరు కోసం కాంగ్రెస్‌ను విజ్ఞప్తి చేశానని, రాబోయే ఏడాది వ్యవధిలో 100 బిలియన్ డాలర్లు కావాలని చెప్పారు. ఇదొక తెలివైన పెట్టుబడి అవుతుందని, దీనివల్ల అమెరికాలో భవిష్యత్తు తరాలకు భద్రమైన జీవితం లభిస్తుందని, అదే మనకు లభించే సత్ఫలితమని స్పష్టం చేశారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు కావాలి: సౌదీ యువరాజు 1967 నాటి సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. శుక్రవారం జీసీసీ, ఆసియాన్ ఉమ్మడి శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. గాజాలో హింసాకాండ, అమాయక ప్రజల మరణంపై ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ పౌరులపై దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. -
Israel-Hamas War: గాజా కింద మరో గాజా!
సరిహద్దులు దాటి మెరుపు దాడులతో భయోత్పాతం సృష్టించిన హమాస్ పనిపట్టే లక్ష్యంతో ఇజ్రాయెల్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి గాజాస్ట్రిప్‌పై భారీ వైమానిక దాడులతో వందలాదిగా భవనాలను ఇజ్రాయెల్ ఆర్మీ నేలమట్టం చేస్తూ పోతోంది. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దాని దృష్టంతా ఇప్పుడు హమాస్ శ్రేణులపైనే ఉంది. ఇజ్రాయెల్ ఆర్మీ అత్యాధునిక సాంకేతికత, ఆయుధ బలంతో హమాస్ ఏమాత్రం సరితూగదు. అయితే, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ పని అనుకున్నంత సులువు కాదన్నది నిపుణుల మాట. ఏళ్లపాటు శ్రమించి ఏర్పాటు చేసుకున్న రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్వర్క్ హమాస్‌కు పెట్టని కోటగా మారింది. గత వారం నరమేథం సృష్టించిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దులు దాటేందుకు సముద్ర, భూ, ఆకాశ మార్గాలతోపాటు ఈ సొరంగమార్గాలను కూడా వాడుకున్నారనే అనుమానాలున్నాయి. శత్రుదుర్బేధ్యమైన టన్నెల్ నెట్ వర్క్ ఎలా, ఎక్కడుందన్నది ఇజ్రాయెల్ ఆర్మీకి అంతుచిక్కడం లేదు. ఈ టన్నెళ్లలోనే హమాస్ ఆయుధ సామగ్రి, నెట్వర్క్ అంతా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ బందీలను అండర్‌గ్రౌండ్‌లోనే దాచినట్లు ఆర్మీ అంటోంది. ఇజ్రాయెల్ 2014 నుంచి గాజా స్ట్రిప్‌తో ఉన్న 60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు ఆవలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను సైతం గుర్తించేందుకు ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్‌కు క్షిపణి దాడులను అడ్డుకునే ఐరన్ డోమ్‌ను సమకూర్చాయి. ఐరన్వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, ఇవి సాంకేతికతలను అభివృద్ధి పరిచాయి. అయితే, అవేవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి. ‘గాజా స్ట్రిప్‌లో రెండు లేయర్లున్నాయి. ఒకటి పౌరులది కాగా, రెండోది హమాస్‌ది. హమాస్ నిర్మించుకున్న ఆ రెండో లేయర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి జొనాథన్ కొన్రికస్ చెప్పారు. అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌ను ఛేదించడం అంత సులువు కాదు. గతంలోనూ ఇజ్రాయెల్ అనేక మార్లు ప్రయత్నించి భంగపడింది. 2021లో గాజాపై భారీ చేపట్టిన బాంబు దాడులతో 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, తమకు 500 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ నెట్వర్క్ ఉన్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటించుకోవడం గమనార్హం. భూగర్భ మార్గాలు ప్రమాదకరమా? సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినప్పటికీ భూతల పోరాటంలో ఆధిపత్యం సాధించిన వారిని అక్షరాలా అణగదొక్కేందుకు టన్నెలింగ్ అత్యంత ప్రభావ వంతమైన మార్గంగా మారిపోయిందని స్కాట్ సవిట్జ్ అనే మిలటరీ నిపుణుడు అంటున్నారు. సొరంగాలు ఉన్నా యా, ఉంటే ఎన్ని ఉన్నాయి? అవి ఎక్కడ ఉ న్నాయి? అనేది వాటిని నిర్మించిన వారికే తప్ప ప్రత్యర్థికి తెలిసే అవకా శాలు చాలా తక్కువని ఆయన చెబుతు న్నారు. సైనిక పరమైన నష్టాన్ని తగ్గించేందుకు రోబోట్లను పంపి సంక్లిష్టమైన సొరంగాలను కనిపెట్టొచ్చు. అయితే, లోపల జాగా తక్కువగా ఉండటం, బూబీ ట్రాప్‌లు, ఇతర ఆత్మరక్షణ ఏర్పాట్లను మిలిటెంట్లు ఏర్పాట్లు చేసుకొని ఉండే ఉంటారు. భూగర్భ టన్నెళ్ల వాతావరణం వారికే తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ బలగాలు అందులోకి ప్రవేశించి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవాల్సి రావచ్చు’అని సవిట్జ్ హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటున్న హమాస్ ‘అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో హమాస్ ఎన్నో ఏళ్లుగా టన్నెళ్లను ఉపయోగించుకుంటోంది. ఆయుధాలు, కమాండ్ వ్యవస్థలు, ఫైటర్లను వాటిలోనే దాచిపెడుతోంది. వాటిలోకి వెంటిలేషన్ మార్గాలు, విద్యుత్ తదితర సౌకర్యాలను సైతం సమకూర్చుకుంది. కొన్ని టన్నెళ్లయితే 35 మీటర్ల లోతులో కూడా ఉన్నాయి. రైల్ రోడ్ మార్గాలు, కమ్యూనికేషన్ గదులూ ఉన్నాయి. వాటి ప్రవేశ మార్గాలు ఎక్కువగా నివాస భవనాలు, కార్యాలయాల్లోనే ఉన్నాయి’అని నిపుణులు అంటున్నారు. మొదట్లో ఈ సొరంగాలను ఈజిప్టు నుంచి దొంగచాటుగా ఆయుధాలు, సరుకులను తరలించేందుకు వాడారు. సరిహద్దుల అవతల దాడులు జరిపేందుకు సైతం వీటిని ఉపయోగించుకున్నారు. 2006లో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయెల్ జవానును మిలిటెంట్లు సొరంగం ద్వారా దాడి చేసి, ఎత్తుకుపోయారు. అయిదేళ్ల తర్వాత వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాక అతడిని వదిలిపెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్ సైన్యం
జెరూసలేం: హమాస్ మిలిటెంట్లకు కంచుకోట అయిన గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఉత్తర గాజాను తక్షణమే ఖాళీ చేయాలని, దక్షిణ ప్రాంతానికి తరలివెళ్లాలని శుక్రవారం అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల రక్షణ కోసమే ఈ ఆదేశాలిచ్చామని తెలియజేసింది. ఉత్తర గాజాలో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు జనం దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. గాజా మొత్తం జనాభా 20 లక్షలు. అంటే దాదాపు సగం మంది ఇళ్లు విడిచివెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జనంతో కిక్కిరిసిపోయిన దక్షిణ గాజాపై మరింత ఒత్తిడి పెరగనుంది. గత ఏడు రోజులుగా గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సేనలు భూభాగ దాడులకు సన్నద్ధమవుతున్నాయి. పదాతి దళాలు ఆయుధాలు చేబూని అడుగు ముందుకు వేయబోతున్నాయి. హమాస్‌పై భూతల దాడుల కోసం 3 లక్షలకు పైగా రిజర్వ్ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. గాజా వీధుల్లో మిలిటెంట్ల వేటకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అనధికారికంగా చెబుతున్నారు. అడుగడుగూ జల్లెడ పడుతూ మిలిటెంట్లను సజీవంగా బంధించడమో లేక అంతం చేయడమో జరుగుతుందని అంటున్నారు. ఉత్తర గాజా ఇప్పుడు ‘యుద్ధభూమి’ కాబట్టి, అక్కడ ప్రజలెవరూ ఉండొద్దని సూచించారు. యుద్ధం ముగిశాక తిరిగి రావొచ్చు ఉత్తర గాజాపై హమాస్‌కు గట్టి పట్టుంది. అగ్రనాయకులంతా అక్కడే మకాం వేశారు. అందుకే తొలి టార్గెట్‌గా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలను దక్షిణ గాజాకు పంపించి, ఉత్తర గాజాలో మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. హమాస్ స్థావరాలను, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత వారంతా తిరిగిరావొచ్చని సూచించింది. హమాస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల్లో మకాం వేసి, కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ప్రజలను అక్కడి తరలిస్తే మిలిటెంట్ల ముసుగు తొలగిపోతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఉత్తర గాజాలో లక్షల మంది పాలస్తీనియన్లను నివాసం ఉంటున్నారు. కీలకమైన గాజా సిటీ ఇక్కడే ఉంది. వెంటనే వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించడంతో పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆహారం, నీరు, విద్యుత్ వంటి సదుపాయాల గురించి మర్చిపోయామని, ప్రాణాలు కాపాడుకుంటే చాలని భావిస్తున్నామని పాలస్తీనా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధి నెబాల్ ఫర్సాఖ్ వ్యాఖ్యానించారు. ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ ఇజ్రాయెల్‌కు సూచించారు. మరోవైపు హమాస్ సైతం స్పందించింది. ఉత్తర గాజా నుంచి జనాన్ని తరలించడం వెనుక కుట్రదాగి ఉందని ఆరోపించింది. ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లొద్దని, ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్ సాగిస్తున్న ‘మానసిక యుద్ధాన్ని’ పట్టించుకోవద్దని సూచించింది. వేలాది మంది క్షతగాత్రులు ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నారని, వారిని తరలించడం సాధ్యం కాదని గాజా ఆరోగ్య శాఖ తేలి్చచెప్పింది. ఉత్తర గాజాలో పాఠశాల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. వారిని దక్షిణ గాజాకు తరలించలేమని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో నిరసనలు గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖండిస్తూ మధ్యప్రాచ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జోర్డాన్, యెమెన్‌లో ప్రదర్శనలు జరిగాయి. జెరూసలేం ఓల్డ్ సిటీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. జెరూసలేంలోని అల్–అక్సా మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు 50 ఏళ్ల వయసు దాటినవారిని మాత్రమే ఇజ్రాయెల్ పోలీసులు అనుమతించారు. మసీదు బయట పెద్ద సంఖ్యలో గుమికూడిన పాలస్తీనియన్లపైకి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. లాఠీచార్జి జరిపాయి. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడ్డారు. లెబనాన్ రాజధాని బీరూట్‌లో హెజ్బొల్లా మద్దతుదారులు ర్యాలీ చేపట్టారు. ఇజ్రాయెల్ నశించాలంటూ నినాదాలు చేశారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హమాస్‌తోపాటు దాడులు జరిపారు. మధ్యధరా సముద్ర జలాల్లోని అమెరికా, బ్రిటిష్ యుద్ధ నౌకలపై కన్నేసి ఉంచుతామని హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ నయీమ్ కాశీం హెచ్చరించారు. తాము పూర్తి సన్నద్ధతతో ఉన్నామని, సరైన సమయంలో రంగంలోకి దిగుతామని తెలిపారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్, పాకిస్తాన్లో హమాస్‌కు మద్దతుగా జనం ర్యాలీలు నిర్వహించారు. ఇజ్రాయెల్ దాడుల్లో 13 మంది బందీలు మృతి! ఇజ్రాయెల్–హమాస్ మధ్య శుక్రవారం కూడా పరస్పరం దాడులు జరిగాయి. ఏడు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో మృతుల సంఖ్య చేరుకుంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,300 మందికిపైగా చనిపోయారు. వీరిలో 247 మంది సైనికులు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 1,530 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న 150 మంది పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో బందీల్లో 13 మంది మృతిచెందారని హమాస్ శుక్రవారం ప్రకటించింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని స్పష్టంచేసింది. అయితే, వారు ఏ దేశానికి చెందినవారన్న సంగతి బయటపెట్టలేదు. వైమానిక దాడుల్లో 13 మంది బందీలు చనిపోయారంటూ హమాస్ చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారీ ఖండించారు. తమకు స్పష్టమైన సమాచారం ఉందని, ఎవరూ మృతి చెందలేదని అన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా రక్షణ మంత్రి అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ శుక్రవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పర్యటించిన మరుసటి రోజే లాయిన్ అస్టిన్ సైతం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అస్టిన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్తోనూ భేటీ అయ్యారు. హమాస్‌పై యుద్ధానికి అమెరికా అందించనున్న సైనిక సాయంపై ఆయన చర్చించినట్లు సమాచారం. -
Israel-Gaza War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఉక్కిరిబిక్కిరవుతున్న గాజా (ఫొటోలు)
-
Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం
జెరూసలేం/టెల్ అవివ్/న్యూఢిల్లీ: హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు. తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు. బందీలను ఎక్కడ దాచారో? ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య! హమాస్ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది. గాజాలో ఆకలి కేకలు ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది. మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్ అల్ షేక్ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వెల్లడించింది. హమాస్ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయాప్ ఎర్డోగాన్ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాయబార కార్యాలయం భరోసా ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఇజ్రాయెల్‌దే పైచేయి! హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లాంట్ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్ ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్ రూమ్, టెల్ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. -
శవాల దిబ్బలు..శిథిల దృశ్యాలు
జెరూసలేం/లండన్/వాషింగ్టన్/గాజా సిటీ/న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా సిటీ దద్దరిల్లిపోతోంది. వందలాది భవనాలు ధ్వంసమవుతున్నాయి. శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం నాలుగో రోజుకు చేరింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించాయి. గాజాపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరువైపులా ఇప్పటికే దాదాపు 1,800 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో 1,000 మందికిపైగా, గాజా, వెస్ట్‌బ్యాంకులో 800 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శవాల దిబ్బలు కనిపించాయన్నారు. దాడులు, ప్రతిదాడుల్లో వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు వెల్లువెత్తుతోంది. హమాస్ మిలిటెంట్ల ఘాతుకాలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. శత్రువులపై తమ ఎదురుదాడి కొన్ని తరాలపాటు ప్రతిధ్వనించేలా ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. ఆయన తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించారు. తమ లక్ష్యం కేవలం హమాస్ మాత్రమేనని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గనుక తమపై వైమానిక దాడులు ఇలాగే కొనసాగిస్తే.. ఇప్పటికే తమ అ«దీనంలో ఉన్న బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దాడులు వెంటనే ఆపాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. ఇక భూభాగం నుంచి యుద్ధం! దేశ సరిహద్దులపై పూర్తి పట్టు సాధించామని, తీవ్రవాదులు చొరబడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ దేశంలో వందలాదిగా హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించామని తెలియజేసింది. తమ దాడుల్లో వారు మృతిచెందినట్లు పేర్కొంది. హమాస్‌తోపాటు ఇతర మిలిటెంట్ గ్రూప్‌లు తమ దేశం నుంచి 150కిపైగా జనాన్ని బందీలుగా తీసుకెళ్లాయని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో సైనికులు, సాధారణ పౌరులు ఉన్నారని వివరించింది. హమాస్ అ«దీనంలో ఉన్న తమ వారిని వెంటనే విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బందీలను క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్ చెప్పారు. బందీలకు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హమాస్‌ను హెచ్చరించారు. గాజాపై భూభాగం గుండా దాడి చేయాలని ఇజ్రాయెల్ సైన్యం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం 3 లక్షల రిజర్వ్ సైనికులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి దాడి గాజాపై చివరిసారిగా 2014లో జరిగింది. ఇదిలా ఉండగా, శనివారం కారులో పారిపోతున్న ఇద్దరు హమాస్ తీవ్రవాదుల ను ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులు బైక్‌లపై వెంటాడి కాలి్చచంపిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్‌కు భారతీయుల అండదండలు: మోదీ ఉగ్రవాదాన్ని భారత్ బలంగా, నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిందేనని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. తమ దేశంపై హమాస్ మిలిటెంట్ల దాడులు, తదనంతర పరిస్థితుల గురించి వివరించారు. అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో భారతీయులు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. తమ మద్దతు ఇజ్రాయెల్‌కు ఉంటుందని చెప్పారు. తనకు ఫోన్ చేసి, తాజా పరిస్థితిని వివరించిన నెతన్యాహూకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మద్దతు ప్రకటించిన యూకే ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కచి్చతంగా ఉంటుందని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. హమాస్ రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. యూకేలోని యూదుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిషి సునాక్ మంగళవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడారు. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణపై చర్చించారు. వారితో కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. హమాస్ ఉగ్రవాద చర్యలను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. తనను తాను రక్షించుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, ఆ విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు బంద్ ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇజ్రాయెల్ నుంచి తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రకటించాయి. టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం పలు విమానాలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, కాథీ పసిఫిక్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి సంస్థలు ఇజ్రాయెల్‌కు విమానాలు నడపడం లేదని వెల్లడించాయి. యూరప్, ఆసియాలోని వివిధ విమానయాన సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల సాయం గాజాలో యుద్ధంలో చిక్కుకున్న సామాన్య ప్రజలను ఆదుకోవడానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు మందుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ అష్ట దిగ్బంధనం చేయడంతో గాజాకు నీరు, ఔషధాలు, విద్యుత్ వంటి సౌకర్యాలు ఆగిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈజిప్షియన్ రెడ్ క్రాస్ సంస్థ 2 టన్నులకుపైగా ఔషధాలను గాజాకు పంపించింది. ఆహారం, ఇతర నిత్యావసరాలు కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గాజాలోని ఆసుపత్రుల్లో రోగులకు ఔషధాలు అందిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బాధితుల కోసం నిధులు సేకరిస్తున్నామని పేర్కొంది. పాలస్తీనియన్లు చెల్లాచెదురు హమాస్ మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ జనాభా 20.3 లక్షలు. వీరంతా పాలస్తీనా జాతీయులు. ఇజ్రాయెల్‌పై హమాస్ ముష్కరుల దాడి తర్వాత వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హమాస్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులు కొనసాగిస్తోంది. రాకెట్లు, క్షిపణులు ప్రయోగిస్తోంది. దీంతో పాలస్తీనావాసులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వారంతా చెల్లాచెదురవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1,80,000 మందికిపైగా పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు. అక్కడే తలదాచుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హమాస్ దుశ్చర్య తమకు ప్రాణసంకటంగా మారిందని గాజా స్ట్రిప్ పాలస్తీనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కోసం గాజా సిటీలోని పాఠశాలల్లో పదుల సంఖ్యలో తాత్కాలిక శిబిరాలను ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. మరోవైపు నగరంలో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోవడంతో జనం కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఆహారం దొరకడం లేదు. పిల్లల పరిస్థితి చూసి కన్నీళ్లు ఆగడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఐక్యరాజ్యసమితి శిబిరాలు కూడా ధ్వంసమవుతున్నాయి. ఆదివారం, సోమవారం జరిగిన దాడుల్లో ఆరు శిబిరాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. పొరుగుదేశం ఈజిప్టుకు వలస వెళ్లేందుకు కొందరు బాధితులు ప్రయత్నిస్తున్నారు. ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్నవారికే ఈజిప్టు నుంచి అనుమతి లభిస్తోంది. మరోవైపు తమ లక్ష్యం హమాస్ మిలిటెంట్లు మాత్రమేనని, సామాన్య ప్రజలు కాదని ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఆపరేషన్ కొనసాగిస్తున్నామని అంటోంది. -
Israel Gaza War Photos: ఇజ్రాయెల్‌లో భయానక యుద్ధ వాతావరణం (ఫొటోలు)
-
Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం
జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దక్షిణ గాజాలోని రఫాలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 19 మంది మృతిచెందారు. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. అడపాదడపా రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. గాజాలో వెయ్యికి పైగా టార్గెట్లపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గాజా దిగ్బంధానికి ఆదేశాలు గాజాలో హమాస్ ముష్కరులను, వారి ప్రభుత్వాన్ని తుదముట్టిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. హమాస్‌ను ఇప్పటికే చాలావరకు బలహీనపర్చామని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ తమ సైన్యాన్ని ఆదేశించారు. గాజాకు విద్యుత్, ఆహారం, ఇంధనం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో 24 కాలనీలు ఉండగా, 15 కాలనీలను ఖాళీ చేయించారు. మిగిలినవాటిని 24 గంటల్లోగా ఖాళీ చేయిస్తామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. గాజాపై ఇప్పటిదాకా వైమానిక దాడులకే పరిమితం అయిన ఇజ్రాయెల్ ఇక భూ యుద్ధంపై దృష్టి పెట్టింది. నేరుగా భూమిపైనుంచే క్షిపణులు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. యుద్ధం వల్ల గాజాలో 1,23,000 మంది నిరాశ్రయులయ్యారని, ఇళ్లు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గాజా బయట తమ పోరాటం కొనసాగుతోందని, సోమవారం ఉదయం మరికొంతమంది ఇజ్రాయెల్ పౌరులను బంధించామని హమాస్ ప్రతినిధి అబ్దెల్–లతీఫ్ అల్–ఖనౌవా చెప్పారు. ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడిపించి, స్వేచ్ఛ ప్రసాదించడమే తక్ష లక్ష్యమని ఉద్ఘాటించారు. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడానికి సహకరించాలంటూ ఇజ్రాయెల్ కోరిందని ఈజిప్టు అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం మిత్రదేశం ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. సైనిక సాయం అందిస్తోంది. తూర్పు మధ్యదరా సముద్రానికి యుద్ధ నౌకలను పంపించింది. ఇంకా అదనపు సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 260 మృతదేహాలు లభ్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో శనివారం సూపర్నోవా ఫెస్టివల్లో ఆనందంగా గడుపుతున్న జనంపై హమాస్ ముష్కరులు హఠాత్తుగా దాడి చేశారు. సైనిక దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 260కిపైగా మృతదేహాలను ఇజ్రాయెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం గాజాకు సమీపంలోనే ఉంది. నా భార్యాబిడ్డలను అపహరించారు యువకుడు యెనీ అషెర్ గాజా సరిహద్దుకు సమీపంలో ఇజ్రాయెల్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. హమాస్ మిలిటెంట్లు అతడి భార్య డోరన్, కుమార్తెలు రజ్(5), అవివ్(3)ను శనివారం అపహరించారు. ఎక్కడ దాచారో తెలియడం లేదు. వారి కోసం అషెర్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. వారిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకంటున్నాడు. ఫోన్లో మాట్లాడుతుండగానే చంపేశారు ఇలాన్ ట్రోయెన్ అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె డెబోరా మతియాస్, అల్లుడు స్కోమ్లీ మతియాస్, మనవడు ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. శనివారం ఆమె అమెరికాలో ఉన్న తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతుండగా హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డెబోరా, స్కోమ్లీ దంపతులు బలయ్యారు. వారి 16 ఏళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు ఇజ్రాయెల్ ఆయాగా పనిచేస్తున్న కేరళ మహిళ షీజా ఆనంద్ హమాస్ మిలిటెంట్ల దాడిలో గాయపడ్డారు. కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పయ్యావూర్కు చెందిన షీజా ఆనంద్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని సముద్ర తీర నగరం అషె్కలాన్లో ఆయాలో పని చేస్తున్నారు. శనివారం హమాస్ మిలిటెంట్ల అషె్కలాన్పై రాకెట్లు ప్రయోగించంతో ఆమె గాయాలపాలయ్యారు. భారత్‌లో ఉన్న భర్త ఆనంద్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు షీజా ఆనంద్‌ను ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆదివారం మధ్యాహ్నం షీజా భారత్‌లోని తన తల్లితో మాట్లాడారు. ‘అమ్మా.. ఐయామ్ ఓకే’ అని చెప్పారు. -
సూడాన్‌లో వైమానిక దాడి..
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌పై శనివారం జరిగిన వైమానిక దాడిలో అయిదుగురు చిన్నారులు సహా 17 మంది చనిపోయారు. ఆర్మీకి, శక్తివంతమైన పారా మిలటరీ విభాగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్)కు మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ విమానాలు ఆర్ఎస్ఎఫ్పై దాడులు జరుపుతుండగా, ఆర్ఎస్ఎఫ్ బలగాలు డ్రోన్లతో సైన్యంపై దాడులకు దిగుతోంది. ఖార్టూమ్‌లోని యోర్మౌక్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా దాడికి ఎవరు కారణమనే విషయం స్పష్టం కాలేదు. ఈ దాడిలో మరో 11 మంది వరకు గాయపడినట్లు మానవతా సాయం అందిస్తున్న ఒక సంస్థ అంటోంది. మిలటరీయే అక్కడ దాడి చేసిందని, తాము ఒక మిగ్ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆర్ఎస్ఎఫ్ అంటోంది. ఆర్మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అరబ్ మిలీషియాకు చెందిన జన్జవీద్ సంస్థ ఆర్‌ఎస్‌ఎఫ్‌తో కలిసి పోరాడుతోందని సమాచారం. జన్జవీద్ను విమర్శించినందుకే ఇటీవల పశ్చిమ దర్ఫుర్ గవర్నర్ ఖమిస్ అబ్దల్లా అబ్కర్ను చంపేశారని విమర్శలు వస్తున్నాయి. -
సరిహద్దుకు ఎటువైపైనా దీటైన జవాబివ్వగలం
ససరాం: దేశ సరిహద్దుకు లోపల, వెలుపలా రక్షణ సన్నద్ధత, సామర్థ్యం విషయంలో భారత్‌కు తిరుగులేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. బాలాకోట్‌లో ఉగ్రస్థావరంపై వైమానిక దాడులు, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపై సర్జికల్ దాడులే భారత సత్తాకు సాక్ష్యాలన్నారు. బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినపుడు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని తెల్సి మోదీ వెంటనే రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులతో ఒక్కటే మాట చెప్పారు. అంతే. నాలుగు గంటలపాటు యుద్ధం స్తంభించింది. విద్యార్థులను వెనక్కి తెచ్చేశాం. మోదీ ఘనత చూసి ప్రపంచమే నోరెళ్లబెట్టింది’ అని అన్నారు. -
దక్షిణ లెబనాన్, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు
జెరూసలేం: దక్షిణ లెబనాన్‌తోపాటు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఆయా ప్రాంతాల్లోని హమాస్ ఉగ్రవాద శిబిరాలపై శుక్రవారం తెల్లవారుజామున వైమానిక దాడులు నిర్వహించింది. బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో యూదులు పాస్ఓవర్ అనే వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం దక్షిణ లెబనాన్ భూభాగం నుంచి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 30కిపైగా రాకెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు గాయపడ్డారు. స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లింది. రాకెట్ల ప్రయోగానికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌లో పాతుకుపోయిన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. యుద్ధ విమానాల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణులు లెబనాన్‌లో టైర్ సమీపంలోని రషీదియా పాలస్తీనా కాందిశీకుల క్యాంప్ వద్ద నేలను తాకాయని అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఒకరు వెల్లడించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలీషియాకు ఇరాన్ అండదండలు అందిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై హిజ్బుల్లా మిలీషియా దాడులు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, తాము కేవలం పాలస్తీనా మిలిటెంట్ల శిబిరాలపైనే వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనా వాసి ఒకరు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు. -
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు..ఐదుగురు మృతి
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రాజధానిలోని నివాస భవనసముదాయాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగిందని ప్రభుత్వ వార్తా సంస్థ సనా పేర్కొంది. వందల ఏళ్లనాటి కోట, ఒక కళాశాల ధ్వంసమయ్యాయని వివరించింది. ఇరాన్ అనుకూల హిజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 15 మంది చనిపోయినట్లు యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. -
జో బైడెన్‌తో జెలెన్స్కీ భేటీ.. భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్ క్షిపణులు, ఉక్రెయిన్ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం అమెరికాకు చేరుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత జెలెన్స్కీ మరో దేశంలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. -
నీటి కష్టాల్లో కీవ్.. విద్యుత్ సరఫరా కేంద్రంపై రష్యా వైమానిక సేనల దాడులు
కీవ్: రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం నీటి కష్టాల్లో మునిగిపోయింది. నీటి సరఫరాకు కీలకమైన విద్యుత్ సరఫరా కేంద్రంపై రష్యా వైమానిక సేనలు సోమవారం గగనతల దాడులను హఠాత్తుగా ఉధృతం చేశాయి. దీంతో నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. సోమవారం కీవ్ నగరంలో 80 శాతం వినియోగదారులకు నీటి సదుపాయం లేకుండాపోయిందని నగర మేయర్ విటలీ క్లిట్స్చోకో ఆందోళన వ్యక్తంచేశారు. కీవ్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచే రష్యా దాడులతో పేలుళ్ల శబ్దాలు మార్మోగాయి. ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూ చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా, రక్షణ, విదేశాంగ మంత్రులతో కలిసి కీవ్‌ను సందర్శిస్తున్న వేళ కీవ్‌పై బాంబు దాడులు జరగడం గమనార్హం. కీవ్ ఉత్తరప్రాంతంలో ఉక్రెయిన్, రష్యా సేనలు పరస్పర దాడులు చేసుకున్నాయి. డినిపర్ నది ఎడమవైపు తీరం దాడుల పొగతో నిండిపోయింది. కొన్ని చోట్ల రైళ్లకు విద్యుత్ సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి. క్రిమియా ద్వీపకల్పంలో నల్ల సముద్రంలో తీర స్థావర నౌకలపై ఉక్రెయిన్ బాంబుదాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుండగా, రష్యానే పేలుడుపదార్ధాలను సరిగా ‘నిర్వహించలేక’ పేలుళ్లకు కారణమైందని ఉక్రెయిన్ స్పష్టంచేసింది. నౌకలపై దాడులతో ఆగ్రహించిన రష్యా.. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందాన్ని తాజాగా రద్దుచేసుకుంది. దీంతో పలు దేశాలకు ధాన్యం సరఫరా స్తంభించి మళ్లీ ధరలు పెరిగే ప్రమాదం పొంచిఉంది. -
ఇజ్రాయెల్ దాడులతో గజ‘గాజా’
గాజా సిటీ: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం శనివారం కూడా వైమానిక దాడులు కొనసాగించింది. హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన పలు నివాసాలు నేలమట్టమయ్యాయి. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఓ కారు ధ్వంసమయ్యింది. అందులోని 75 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. మరో ఆరుగురు గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదులు సైతం ఎదురుదాడులకు దిగారు. దక్షిణ ఇజ్రాయెల్‌లపై బాంబుల వర్షం కురిపించారు. ఈ బాంబు దాడుల్లో ఎంతమేరకు నష్టం వాటిల్లందనే సమాచారం తెలియరాలేదు. శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 14 మంది దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. -
Russia Ukraine War: ముట్టడిలో లీసిచాన్స్క్
కీవ్/లండన్: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్లో రష్యా సైన్యంగురువారం క్షిపణుల మోత మోగించింది. లీసిచాన్‌స్క్‌లో భీకర స్థాయిలో వైమానిక దాడులు సాగించింది. అలాగే లుహాన్స్క్లో 95 శాతం, డోంటెస్క్‌లో 50 శాతం భూభాగాన్ని రష్యా సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాద శక్తులు ఇప్పటికే ఆక్రమించాయి. లీసిచాన్స్క్లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నించగా ఉక్రెయిన్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారని లుహాన్స్క్ గవర్నర్ సెర్హియి హైడై చెప్పారు. లీసిచాన్స్క్ చుట్టూ రష్యా సైన్యం మోహరించించి ఉందని వెల్లడించారు. క్రెమెన్‌చుక్‌లోని భారీ షాపింగ్ మాల్లో రష్యా వైమానిక దాడుల్లో చనిపోయిన 18 మంది మృతదేహాలకు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. షాపింగ్ మాల్లో అదృశ్యమైన 20 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా వెనక్కి ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా సేనలు ఖాళీ చేస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాయి. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా దాడులను ఉధృతం చేస్తున్నాయి. సరైన వ్యూహంతోనే స్నేక్ ఐలాండ్ నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించగా, తమ దాడులను తట్టుకోలేకే రష్యా సేనలు పారిపోయాయమని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ నుంచి ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తోందని, ఆ ప్రయత్నాలకు ఆటంకం కలగకుండా ఉండడానికే స్నేక్ ఐలాండ్ నుంచి తమ సేనలను వెనక్కి రప్పించామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ఓడరేవులను రష్యా దిగ్బంధించిందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. డోన్బాస్ విముక్తి పోరాటం: పుతిన్ ఉక్రెయిన్ విషయంలో తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తేల్చిచెప్పారు. ఆయన గురువారం తుర్క్మెనిస్తాన్లో పర్యటించారు. డోన్బాస్ విముక్తి కోసం, అక్కడి ప్రజల రక్షణ కోసం పోరాడుతున్నామని చెప్పారు. రష్యా భద్రతకు హామీనిచ్చే పరిస్థితులను సృష్టించుకోవాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా విఫలమైందంటూ వస్తున్న విమర్శలను పుతిన్ ఖండించారు. ప్రణాళిక ప్రకారమే తమ సైన్యం పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. తుర్క్మెనిస్తాన్లోని అష్గాబాట్‌లో కాస్పియన్ సీ లిటోరల్ స్టేట్స్ శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు అదనపు సైనిక సాయం ఉక్రెయిన్‌కు మరో బిలియన్ పౌండ్ల విలువైన సైనిక సాయం అందజేస్తామని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో గురువారం నాటో నేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సాయం కింద అత్యాధునిక ఆయుధాలు ఇస్తామన్నారు. పౌరుల ప్రాణాలను బలిగొంటున్న రక్కసి పుతిన్ అని దుయ్యబట్టారు. యూరప్ భద్రత, శాంతికి రష్యా పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
Russia Ukraine war: లైమాన్.. రష్యా హస్తగతం!
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోంది. మారియుపోల్ అనంతరం డోన్బాస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పెద్ద నగరమైన లైమాన్‌ను తమ దళాలు, వేర్పాటువాదులు హస్తగతం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ శనివారం ప్రకటించారు. ముఖ్యమైన రైల్వే జంక్షన్‌ను సైతం ఆక్రమించినట్లు తెలిపారు. లైమాన్కు విముక్తి కల్పించామని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24 కంటే ముందు లైమాన్లో 20 వేల జనాభా ఉండేది. యుద్ధం మొదలైన తర్వాత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఉక్రెయిన్ ప్రభుత్వం తరలించింది. ఇక్కడున్న రైల్వే జంక్షన్లో రష్యా దళాలు పాగా వేశాయి. లైమాన్పై పట్టుచిక్కడంతో డోంటెస్క్, లుహాన్స్క్ను స్వాధీనం చేసుకోవడం రష్యాకు మరింత సులభతరం కానుంది. ఈ రెండు ప్రావిన్స్‌లను కలిపి డోన్బాస్‌గా వ్యవహరిస్తారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించలేక విఫలమైన రష్యా డోన్బాస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని నగరాలైన సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌లో రష్యా వైమానిక దాడుల శనివారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగానే ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. అయినప్పటికీ తమ దేశానికి ముప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తుందని అన్నారు. 50 ఏళ్ల దాకా రష్యా సైన్యంలో చేరొచ్చు సైన్యంలో కాంట్రాక్టు సైనికుల నియామకాల కోసం వయోపరిమితిని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం సంతకం చేశారు. ఈ బిల్లు ప్రకారం.. 50 ఏళ్ల వయసు లోపు ఉన్నవారు కాంట్రాక్టు జవాన్లుగా రష్యా సైన్యంలో చేరి సేవలందించవచ్చు. పురుషులైతే 65 ఏళ్లు, మహిళలైతే 60 ఏళ్లు వచ్చేదాకా సైన్యంలో పనిచేయొచ్చు. వార్షిక బోర్డర్ గార్డ్స్ దినోత్సవంలో పుతిన్ పాల్గొన్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను అభినందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. తమ దేశంపై ఆంక్షలు ఎత్తివేస్తే ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వొద్దని మాక్రాన్, షోల్జ్‌కు సూచించారు. ఆయుధాలు సరఫరా చేస్తే ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. పరిమాణాలను ప్రమాదకరంగా మార్చొద్దని చెప్పారు. -
Ukraine-Russia war: రణభూమి తూర్పు ఉక్రెయిన్
కీవ్/మాస్కో: తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ఉధృతమయ్యాయి. కీలక పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్‌పై పట్టుబిగించేందుకు రష్యా దళాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయి. శుక్రవారం సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్‌లో భీకర దాడులకు దిగాయి. సీవిరోడోంటెస్క్‌లో ఇప్పటిదాకా 1,500 మంది మరణించారని, దాదాపు 13,000 మంది క్షతగాత్రులయ్యారని స్థానిక మేయర్ ఒలెగ్జాండర్ స్టిరియుక్ చెప్పారు. గత 24 గంటల్లో నలుగురు బలయ్యారని తెలిపారు. ఈ పట్టణంలో 60 శాతం నివాస గృహాలు రష్యా దాడుల్లో ధ్వంసమయ్యాయి. విదేశీ ఆయుధాలను వెంటనే రంగంలోకి దించకపోతే సీవిరోడోంటెస్క్‌ను రష్యా సైన్యం బారి నుంచి కాపాడడం కష్టమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా హెచ్చరించారు. రష్యా వైమానిక దాడుల్లో లీసిచాన్స్క్ సిటీలో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఖర్కీవ్‌లోని బలాక్లియాలో ఇద్దరు వృద్ధులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌పై రష్యా సైన్యం భీకరస్థాయిలో దాడులకు పాల్పడింది. నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది పౌరులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని లాంచ్ రాకెట్లు సిస్టమ్స్ ఇవ్వండి తూర్పు డోన్బాస్లో రష్యా దాడులను తిప్పికొట్టడానికి తమకు మరిన్ని లాంచ్ రాకెట్ సిస్టమ్స్ సాధ్యమైనంత త్వరగా పంపించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాలను కోరారు. ఆయన తాజాగా ఒక వీడియో సందేశం విడుదల చేశారు. యుద్ధ రీతిని మార్చడానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ భద్రత, స్వేచ్ఛ కోసమే తమ పోరాటం సాగుతోందని అన్నారు. ఆక్రమణదారులను ఉక్రెయిన్ నుంచి తరిమికొట్టడానికి మరింత ఆత్మవిశ్వాసంతో, వేగంగా ముందుకు సాగుతున్నామని ప్రజలకు తెలియజేశారు. మరో ఇద్దరు రష్యా సైనికుల విచారణ యుద్ధ నేరాల కింద ఉక్రెయిన్ కోర్టు ఇప్పటికే ఒక రష్యా సైనికుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. యుద్ధ నేరాల ఆరోపణల కింద మరో ఇద్దరు రష్యా జవాన్లు తాజాగా కోర్టులో విచారణకు హాజరయ్యారు. అలెగ్జాండర్ అలెక్సీవిచ్ ఇవానోవ్, అలెగ్జాండర్ వ్లాదిమిరోవిచ్ బాబీకిన్ను కొటెలెవ్స్కీ జిల్లా కోర్టు విచారించింది. వారికి దాదాపు 12 ఏళ్ల చొప్పున కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. పశ్చిమ దేశాలకు ఇక ఆర్థిక కష్టాలే: పుతిన్ తమ దేశాన్ని ఏకాకిని చేయాలన్న పశ్చిమ దేశాల ఎత్తుగడలు ఫలించబోవని రష్యా అధ్యక్షుడు పుతిన్ తేల్చిచెప్పారు. పశ్చిమ దేశాలకు ఇకపై మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం ఖాయమని అన్నారు. యూరేసియన్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్ మాట్లాడారు. ఆధునిక ప్రపంచంలో రష్యాను ఒంటరి చేయడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. అలాంటి ప్రయత్నాలు చేసే వారికి చేదు అనుభవమే మిగులుతుందన్నారు. పశ్చిమ దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోందని, నిరుద్యోగం తాండవిస్తోందని, సప్లై చైన్ తెగిపోతోందని, ఆహార సంక్షోభం ముదురుతోందని పుతిన్ వెల్లడించారు. -
రష్యా చమురు డిపోలో అగ్ని ప్రమాదం: వీడియో వైరల్
Emergency services authorities Says Russian fuel depot Caught Fire: ఉక్రెయిన్ పై గత రెండు నెలలుగా రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. అదీగాక రష్యా ఉక్రెయిన్ దురాక్రమణ చేసేందుకు దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఆయుధగారాలపై దాడులు చేసింది కూడా. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌కి సరిహద్దు సమీపంలోని రష్యా చమురు డిపోలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తెల్లవారుఝామున బ్రయాన్స్క్ నగరంలోని చమురు నిల్వలో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఏప్రిల్ 22న ఉక్రెయిన్‌లో ఖార్కివ్ ప్రాంతంలోని చుగ్వివ్ సమీపంలోని చమురు డిపోను రష్యా బలగాలు ధ్వంసం చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఉక్రేనియన్ హెలికాప్టర్లు రష్యాలోని బెల్గోరోడ్‌లోని రోస్నెఫ్ట్ ఇంధన డిపోపై దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. The “Druzhba” oil depot in Bryansk is currently on fire after loud explosions were heard. Ukrainian missile strikes? pic.twitter.com/jQ6yHuOm6z — Woofers (@NotWoofers) April 24, 2022 (చదవండి: దాడులను సహించం!... పాక్‌కి వార్నింగ్) -
‘మరోసారి పాక్ దాడులు చేస్తే సహించేది లేదు’
Taliban administration blamed Pakistan for airstrikes: అఫ్గనిస్తాన్ రాజధాని కాబోల్ని కునార్, ఖోస్ట్ ప్రావిన్స్‌లలో వరుస వైమానిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గాన్ ఈ దాడులను పాకిస్తాన్ నిర్వహించిందని సంచలన ఆరోపణలు చేసింది కూడా. పైగా తాము ఈ దాడులను సహించమని తాలిబన్లు హెచ్చరించారు. అయితే పాక్ మాత్రం అఫ్గనిస్తాన్ సరిహద్దులో జరిగిన వైమానిక దాడుల్లో తమ ప్రమేయం లేదని ధృవీకరించకపోవడం గమనార్హం. ఈ మేరకు అఫ్గనిస్తాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్ మాట్లాడుతూ...మేము ప్రపంచం, పోరుగు దేశాల నుంచి చాలా రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇందుకు మా సరిహద్దు భూభాగాల్లో జరిగిన వైమానిక దాడులే ఒక ఉదాహరణ. కానీ పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ రెండు సోదర దేశాలు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మేమే ఈ దాడులన సహించాం. మరోసారి ఈ దాడులు జరిగితే సహించేది లేదు అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ రెండు దేశాలు తీవ్రవాదాన్ని వ్యతిరేకించేవే కానీ గత కొంతకాలంగా తీవ్రవాదానికి సంబంధించిన దేశాలు అనే కళంకంతో బాధపడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఆయా గడ్డలలో ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడంలోనూ ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు సహకరించాలని చెప్పారు. ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాలిబాన్ పరిపాలన విదేశాంగ శాఖ గత వారం పాకిస్తాన్‌న్ రాయబారిని పిలిచింది కూడా. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 36 మంది మరణించారని అఫ్గాన్ స్థానిక అధికారులు తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ 16న ఖోస్ట్, కునార్ ప్రావీన్సులలో జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది పిల్లలు మరణించారని ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్యసమితి పిల్లల ఏజెన్సీ హెడ్ పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు) -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం
బుచా/కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడెసా సమీపంలో ఆదివారం క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్ సైన్యం ఉపయోగిస్తున్న చమురు శుద్ధి కర్మాగారాన్ని, మూడు చమురు డిపోలను ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కోస్తియాన్టినివ్కా, ఖ్రేసిచేలో ఆయుధ డిపోలను సైతం ధ్వంసం చేశామని తెలియజేసింది. మారియుపోల్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖర్కీవ్‌పై 20 వైమానిక దాడులు జరిగాయి. బలాక్లియా పట్టణంలో ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సోమవారం మళ్లీ మొదలవనున్నాయి. బుచాలో దారుణ దృశ్యాలు కొన్ని వారాలుగా రష్యా సైన్యం నియంత్రణలో ఉన్న రాజధాని కీవ్ ఉత్తర ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కీవ్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా పట్టణం ఇప్పటికే ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. అక్కడ శవాలు వీధుల్లో చెల్లాచెదురుగా దర్శనమిచ్చాయని మీడియా ప్రతినిధలు చెప్పారు. వాటికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తూర్పు ప్రాంతంలో రష్యా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఉత్తర ఉక్రెయిన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించింది. ఉక్రెయిన్‌లో మందుపాతర్ల బెడద రష్యా జవాన్లు తమ భూభాగంలో ఎక్కడిక్కడ మందుపాతరలు ఏర్పాటు చేశారని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రోడ్లపై, వీధుల్లో, ఇళ్లలో, అఖరికి శవాల లోపలా మందుపాతరలు పె ట్టారన్నారు. మరిన్ని ఆధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలివ్వాలని పశ్చిమ దేశాలను కోరారు. రంజాన్‌పై యుద్ధ ప్రభావం యుద్ధంతో చమురు, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినందున ఈసారి రంజాన్ జరుపుకోవడం కష్టమేనని లెబనాన్, ఇరాక్, సిరియా, సూడాన్, యెమెన్ తదితర దేశాల్లో జనం వాపోతున్నారు. వాటికి గోధుమలు, బార్లీ గింజలు, నూనె గింజలు రష్యా, ఉక్రెయిన్ నుంచే వెళ్తాయి. లిథువేనియాకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు రావిసియస్ మారియుపోల్‌లో కాల్పుల్లో మృతి చెందారు. రష్యా సైన్యంలో తిరుగుబాటు! సుదీర్ఘ యుద్ధంతో ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు నీరసించిపోతున్నట్లు చెప్తున్నారు. ముందుకెళ్లడానికి వారు ససేమిరా అంటున్నారు. సొంత వాహనాలు, ఆయుధాలనూ ధ్వంసం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను లెక్కచేయడం లేదు. సైనికుల్లో తిరుగుబాటు మొదలైందని, పుతిన్ మొండిపట్టుపై వారు రగిలిపోతున్నారని ఉక్రెయిన్ అంటోంది. ‘‘సహచరుల మరణాలు రష్యా సైనికులను కలచివేస్తున్నాయి. స్థైర్యం సన్నగిల్లి ఆస్త్ర సన్యాసం చేస్తున్నారు’’ అరని నాటో కూటమి అంటోంది. యుద్ధానికి రష్యా సైన్యం విముఖత వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. 1905 జూన్‌లో రూసో–జపనీస్ యుద్ధంలోనూ వారు ఇలాగే సహాయ నిరాకరణ చేశారు. ఉన్నతాధికారులపై తిరగబడ్డారు. వారి ఆదేశాలను ధక్కిరించారు. -
దలాల్ స్ట్రీట్ ఢాం
ముంబై: ఉక్రెయిన్‌లో రష్యా వేసిన బాంబులకు దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. గత రెండేళ్లలో ఎన్నడూ చూడని రీతిలో మార్కెట్లో మహా ఉత్పాతం సంభవించింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాల ఊచకోత జరగడంతో యుద్ధానికి మించిన రక్తపాతం జరిగింది. యుద్ధ భయాలతో చిగురుటాకుల్లా వణికిపోయిన స్టాక్ సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. వెరసి స్టాక్ మార్కెట్లకు ఈ గురువారం ‘‘టెర్రిబుల్ థర్స్డే’’గా నిలిచిపోయింది. సెన్సెక్స్ 2,702 పాయింట్లు నష్టపోయి 54,530 వద్ద ముగిసింది. నిఫ్టీ 815 పాయింట్లు క్షీణించి 16,248 వద్ద నిలిచింది. తొలి దశ కోవిడ్ లాక్డౌన్ విధింపు ప్రకటన(2020 మార్చి 23)తర్వాత జరిగిన సూచీలకిదే అతిపెద్ద పతనం. విస్తృత అమ్మకాలతో బీఎస్ఈ స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా ఆరుశాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లోనూ ఏ ఒక్క షేరు లాభపడలేదు. ఇండెక్సుల్లో దిగ్గజాలైన ఇండస్ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్, బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ షేర్లు ఏడుశాతం క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 6,448 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.7,668 కోట్లను కొన్నారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ ఇలా... ఉదయం సెన్సెక్స్ 1,814 పాయింట్ల భారీ పతనంతో 55,418 వద్ద మొదలైంది. నిఫ్టీ 514 పాయింట్ల క్షీణించి 16,549 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమ్మకాల సునామీ ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. ఒక దశలో సెన్సెక్స్ 2,850 పాయింట్లు క్షీణించి 54,383, నిఫ్టీ 860 పాయింట్లు 16,203 వద్ద కనిష్టాలను తాకాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఇన్వెస్టర్లు భయాలను ప్రతిబింబించే వొలటాలిటి ఇండెక్స్ వీఐఎక్స్ 30.31 శాతం ఎగిసి 31.98 స్థాయికి చేరింది. ► బీఎస్ఈ ఎక్సే్ఛంజీలోని నమోదైన మొత్తం కంపెనీల షేర్లలో 3,160 షేర్లు నష్టాన్ని, 232 షేర్లు స్టాకులు లాభపడ్డాయి. 86 షేర్లులో ఎలాంటి మార్పులేదు. ఇందులో 279 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకాయి. ► ఇదే ఎక్సే్ఛంజీల్లో వివిధ రంగాలకు ప్రాతినిథ్యం వహించే మొత్తం 19 రంగాల ఇండెక్సులన్నీ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు 6% క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీల్లో ఒక్క షేరు లాభపడలేదు. రూ.13.57 లక్షల కోట్లు ఆవిరి రష్యా సైనిక చర్య ప్రభావంతో ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది. సెన్సెక్స్ రెండేళ్లలో అతిపెద్ద నష్టాన్ని చవిచూడటంతో బీఎస్ఈలో రూ.13.57 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.242.20 లక్షల కోట్లకు దిగివచ్చింది. గతేడాది(2021) అక్టోబర్ 18న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.274.69 లక్షల కోట్లకు చేరి జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. నాటితో పోలిస్తే నాలుగు నెలల్లోనే ఇన్వెస్టర్లు రూ.32 లక్షల కోట్లను కోల్పోయారు. బంగారం భగభగ పెట్టుబడులకు ‘పసిడి’ కవచం అంతర్జాతీయ మార్కెట్లో 2,000 డాలర్లకు చేరువ... దేశీయంగా ఒకేరోజు రూ. 2,000 అప్ న్యూఢిల్లీ: యుద్ధ తీవ్రత నేపథ్యంలో ఇన్వెస్టర్లు తక్షణం తమ పెట్టుబడులకు బంగారాన్ని ఆశ్రయించారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో గత ముగింపుతో పోల్చితే 20 డాలర్లు లాభంతో 1930 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా చూసింది. అంతర్జాతీయ మార్కెట్లో 52 వారాల కనిష్టం 1,682 డాలర్లు. కోవిడ్–19 తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో 2020 ఆగస్టులో పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టం 2,152 డాలర్లను తాకింది. వ్యాక్సినేషన్, కరోనా భయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో ధర క్రమంగా దిగివస్తూ, 2021 ఆగస్టునాటికి 1,682 డాలర్లకు దిగివచ్చింది. అయితే ఈ స్థాయి కొనుగోళ్ల మద్దతుతో తిరిగి క్రమంగా 1,800 డాలర్ల స్థాయికి చేరింది. భౌగోళిక ఉద్రిక్తతలు తిరిగి పసిడిని కీలక అవరోధం 1,910 డాలర్ల పైకి చేర్చాయి. దేశీయంగా భారీ జంప్ ఇక అంతర్జాతీయంగా చరిత్రాత్మక ధరకు చేరిన సందర్భంలో దేశీయంగా పసిడి ధర 10 గ్రాములకు ధర మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో (ఎంసీఎక్స్) రూ.56,191కి చేరింది. వార్షికంగా ఇది దాదాపు 45% పెరుగుదల. అటు తర్వాత క్రమంగా రూ.45 వేల దిగువకు దిగివచ్చిన పసిడి ధర, ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో రూ.51,540 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపుతో పోల్చితే ఇది రూ.1,160 పెరుగుదల. ట్రేడింగ్ ఒక దశలో ధర రూ.52,797కు చేరడం గమనార్హం. దేశీయ ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 10 గ్రాముల ధర గురువారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత 2,491 పెరిగి రూ. 52,540 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.2,481 ఎగసి రూ.52,330కి చేరింది. వెండి కేజీ ధర రూ. 3,946 ఎగసి రూ.68,149 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రాతిపదికన పసిడి తదుపరి కదలికలు ఉంటాయని భావిస్తున్నారు. అయ్యో.. రూ‘పాయే’... 99 పైసలు నష్టంతో 75.60 కు డౌన్ భారత్ కరెన్సీ రూపాయిపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం 99 పైసలు బలహీనపడి, 75.60 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, దీనితో మార్కెట్ పతనం, క్రూడ్ ధరల తీవ్రత వంటి అంశాలు రూపాయిని బలహీనపరిచాయి. ట్రేడింగ్‌లో విలువ 75.02 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.75కు పతనమైంది. ఆయిల్ దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ వచ్చింది. ఆసియా దేశాల కరెన్సీల్లో రూపాయి తీవ్రంగా నష్ట పోయింది. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో కూడిన డాలర్ ఇండెక్స్ 1.30 శాతం లాభంతో 97.35 వద్ద పటిష్టంగా ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). నష్టాలకు కారణాలివే... ► యుద్ధ భయాలు అంతర్జాతీయ ఆంక్షల బెదిరింపులను లెక్కచేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై ‘‘వార్’’ ప్రకటించడం మార్కెట్ వర్గాలను కలవరపెట్టింది. రష్యా సేనలు గురువారం ఉదయం తూర్పు ఉక్రెయిన్‌పై దాడికి దిగాయి. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న భయాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. ► క్రూడాయిల్ కష్టాలు ఉక్రెయిన్ – రష్యా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. ప్రపంచ క్రూడ్ ఎగుమతుల్లో పదిశాతం వాటాను కలిగి ఉన్న రష్యాపై ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తే ధరలు మరింత పెరిగే సూచనలు కనిపించడం ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టింది. ► ఎఫ్అండ్ఓ ముగింపు అమ్మకాలు ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు స్కేయర్ ఆఫ్ చేసుకున్నట్లు గణాంకాలు తెలిపాయి. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కూడా గురువారమే కావడంతో ఇన్వెస్టర్లు విక్రయాలకు తెగబడ్డారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయోచ్చనే భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. యుద్ధ భయాలతో పాటు క్రూడాయిల్, కమోడిటీ ధరలు ఆకాశానికి చేరుకోవడంతో పాటు, ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల పతానికి కారణమయ్యాయి. ఆసియాలో సింగపూర్, హాంగ్‌కాంగ్, కొరియా, తైవాన్ సూచీలు మూడు శాతం నుంచి రెండున్నర శాతం వరకు నష్టపోయాయి. జపాన్, చైనా ఇండోనేషియా దేశాలు 2% క్షీణించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ‘‘వార్’’ జరుగుతున్న ఐరోపా ప్రాంతాల్లోనూ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అక్కడి ప్రధాన మార్కెట్లైన బ్రిటన్, ఫాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు నాలుగు నష్టపోయాయి. అమెరికా మార్కెట్ల రెండున్నర శాతం నష్టాలతో మొదలయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలానికి కారణమైన రష్యా ప్రధాన స్టాక్ సూచీ ఆర్టీఎస్ 38 శాతం క్షీణించింది. మరో సూచీ ఎంఓఈఎక్స్ 45 శాతం మేర పతనమైంది. డాలర్ మారకంలో రష్యా దేశ కరెన్సీ రూబుల్ 45% పతనమైంది. -
ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం
Russia-Ukraine War 2022: అంతా భయపడుతున్నట్లే జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు గురువారం దాడులు మొదలుపెట్టాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పట్టించుకోని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధ భేరి మోగించారు. అంతటితో ఆగకుండా ఈ విషయలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే ఎన్నడూ చూడని పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కివ్, ఒడెసా నగరాల్లో భారీ విస్ఫోటనాలు వినిపించాయి. దేశమంతా వైమానిక దాడులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దీంతో పలువురు ఉక్రెయిన్ పౌరులు నగరాలు విడిచి పారిపోయారు. రష్యా దాడుల్లో దాదాపు 40మంది ఉక్రెయిన్ సైనికులు మరణించగా, వందల్లో గాయపడ్డారు. వందలాది మంది పౌరులు కూడా మరణించారంటున్నారు. ఉక్రెయిన్ వైమానిక బలగాలను గంటలోపే తుడిచిపెట్టామని రష్యా ప్రకటించగా, రష్యా విమానాలను కూల్చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ప్రపంచ దేశాల నేతలు రష్యా చర్యను ఖండించారు. రష్యా దీర్ఘకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా, చమురు, బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఆంక్షలతో సరిపెట్టిన దేశాలు రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు ప్రకటించాయే తప్ప ఉక్రెయిన్ రక్షణకు ఏ ఒక్క దేశమూ ముందుకురాలేదు. ఉక్రెయిన్ సరిహద్దుల వెంట బలగాలను పెంచాలని మాత్రమే నాటో నిర్ణయించుకుంది. అనంతరం రష్యాపై మరిన్ని ఆంక్షలు ప్రకటించవచ్చని అంచనా. తూర్పు ఉక్రెయిన్‌లోని పౌరులను కాపాడేందుకు దాడి తప్పదని పుతిన్ చేసిన ప్రకటనను∙యూఎస్, దాని మిత్ర దేశాలు తప్పుబట్టాయి. ఇది ఆక్రమణకు సాకు మాత్రమేనన్నాయి. నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకోవద్దన్న తమ విజ్ఞప్తిని యూఎస్, మిత్రపక్షాలు పట్టించుకోలదని పుతిన్ విమర్శించారు. ఇప్పటికీ ఉక్రెయిన్ను ఆక్రమించే యోచన తమకు లేదని, కేవలం ఆ దేశాన్ని నిస్సైనికం చేసి, నేరాలకు పాల్పడినవారిని శిక్షించడమే తమ లక్ష్యమని చెప్పారు. వాయు దాడులతో మొదలై.. ఉక్రెయిన్‌పై తొలుత వైమానిక దాడులను ఆరంభించిన రష్యా అనంతరం ఆర్మీని కూడా రంగంలోకి దించింది. వేలాది రష్యా సాయుధ వాహనాలు క్రిమియా నుంచి సరిహద్దులు దాటి చొచ్చుకువస్తున్నాయని ఉక్రెయిన్ బోర్డర్ గార్డ్స్ వీడియో ఫుటేజ్ విడుదల చేశారు. రష్యా తమ మిలటరీ మౌలిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. దేశంలో మార్షల్ లా విధించారు. ప్రపంచ దేశాలు పుతిన్‌ను అడ్డుకునేందుకు ముందుకురావాలని కోరారు. తాము స్వాతంత్రం కోసం పోరాడతామన్నారు. పౌరులెవరూ బయటకు రావద్దని, కంగారుపడవద్దని రాజధాని కీవ్ మేయర్ సూచించారు. తమ దేశంలో ఖార్కివ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో రష్యా బలగాలు దాదాపు 5 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చారని జెలెన్స్కీ సలహాదారు చెప్పారు. రష్యా దాడితో ఉక్రెయిన్ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రష్యా అధీనంలోకి చెర్నోబిల్ ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు ప్లాంటును కూడా రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్‌కు ఉత్తరాన 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చారిత్రక ప్లాంటు హోరాహోరీ పోరాటం అనంతరం రష్యా స్వాధీనమైనట్టు ఉక్రెయిన్ పేర్కొంది. 1986లో చెర్నోబిల్ అణు రియాక్టర్ పేలి పెను విధ్వంసం సృష్టించింది. రేడియో ధార్మికత విస్తరించకుండా ప్లాంటును పూర్తిగా మూసేశారు. తాజాగా రష్యా దళాల కాల్పుల్లో రేడియో ధార్మిక వ్యర్థాల ప్లాంటు ధ్వంసమైందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యాపై పోరాడండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యా దాడుల నుంచి దేశాన్ని కాపాడుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చారు. రష్యాపై పోరాడేందుకు సిద్ధపడినవారికి ఆయుధాలు అందిస్తామన్నారు. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని రష్యా ప్రజలను సైతం కోరారు. రష్యా నాయకత్వం వైఖరిని వ్యతిరేకిస్తూ గొంతు విప్పాలని అన్నారు. రష్యా దూకుడు చర్యల నుంచి తమ గగనతలాన్ని రక్షించుకొనేందుకు చేయూతనివ్వాలని, సైనిక సాయం అందజేయాలని ప్రపంచ దేశాల అధినేతలకు విన్నవించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే అధ్యక్షుడు జాన్సన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్, పోలాండ్ అధ్యక్షుడు అండ్రెజ్, లిథ్వేనియా అధ్యక్షుడు గిటానస్తో మాట్లాడానని, పరిస్థితి వివరించానని తెలిపారు. పుతిన్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామన్నారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలను జేలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్ను కాపాడుకోవడం అందరి ధర్మం అని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ వార్నింగ్ ప్రత్యర్థులను కర్కశంగా అణిచివేస్తాడని పేరున్న పుతిన్ మరోమారు తన కర్కశత్వాన్ని చూపారు. ‘మాకు అడ్డుపడాలని ఎవరు ప్రయత్నించినా, మా దేశానికి, మా ప్రజలకు బెదిరింపులు చేసినా, రష్యా ప్రతిస్పందన తక్షణమే ఉంటుంది. మా ప్రతిస్పందన మీరు చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలకు దారి తీస్తుందని తెలుసుకోండి’ అని పుతిన్ ప్రకటన విడుదల చేశారు. అలాగే తమ వద్ద అణ్వాయుధాలున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మా దేశంపై ప్రత్యక్ష దాడి జరిగితే అది దాడి చేసిన వారి వినాశనానికి, భయంకర పరిణామాలకు కారణమవుతుందనే విషయంలో ఎవరకీ సందేహం వద్దు’ అని వార్నింగ్ ఇచ్చారు. తమ దేశం రష్యాకు హానికారకం కాదని, విబేధాలను పక్కనపెట్టి శాంతికి కృషి చేద్దామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించిన కొద్దిసేపటికే పుతిన్ వార్నింగ్ వచ్చింది. దాడుల్లో మృతి చెందిన సైనికుడు -
అఫ్గానిస్తాన్‌లో ఆధిపత్య పోరు.. అమెరికా గగనతల దాడులు
వాషింగ్టన్: తాలిబన్లపై పోరాటం సాగిస్తున్న అఫ్గాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా తాము గగనతల దాడులు నిర్వహించినట్లు అమెరికా రక్షణ శాఖ తాజాగా వెల్లడించింది. అఫ్గానిస్తాన్ నుంచి తమ సేనలు వైదొలిగేందుకు గడువు సమీపిస్తుండటం, ఆ దేశంలోని సగానికి పైగా జిల్లాలు తాలిబన్ల స్వాధీనం అయినట్లు వార్తలు వెలువడుతున్న సమయంలో అగ్రరాజ్యం ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, ఈ దాడుల వివరాలను తెలిపేందుకు నిరాకరించింది. ఆ ప్రాంతంలోని సెంట్రల్ కమాండ్ జనరల్ కెన్నెత్ ఫ్రాంక్ మెకంజీ ఆదేశాల మేరకే ఇవి జరిగాయనీ, అఫ్గాన్ బలగాలకు మద్దతుగా ఇలాంటి మున్ముందు కూడా దాడులు కొనసాగుతాయని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. 20 రోజుల్లో సుమారు 7 డ్రోన్ దాడులు జరిగినట్లు సీఎన్ఎన్ వెల్లడించింది. ప్రభుత్వ బలగాల నుంచి ఎత్తుకుపోయిన సామగ్రిని స్వాధీనం చేసుకు నేందుకు, శత్రువులు, శత్రు బలగాలే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు మీడియా పేర్కొంది. -
Israel: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే
గాజా సిటీ: పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్‌పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ముగింపు పలుకనుంది. ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలో గురువారం జరిగిన భద్రతా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. గాజాలో పాలస్తీనియన్లపై దాడుల్లో చిన్నారులు, మహిళలతో సహా సాధారణ పౌరులు మృతి చెందడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ధోరణిపై విమర్శలు వచ్చాయి. సంయమనం పాటించాలని పలుదేశాలు విజ్ఞప్తి చేశాయి. శాంతిస్థాపన కోసం ఈజిప్టు సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం నెరిపాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారైన అమెరికా ఒత్తిడి పెంచింది. దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి కోరారు. తమ లక్ష్యం నెరవేరేదాకా ఆపబోమని భీష్మించిన ఇజ్రాయెల్ చివరకు అమెరికా నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అధికారిక వార్తా ఛానల్ కాన్ మాత్రం ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై హమాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 230 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ రాకెట్ల దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. -
గాజాలో బాంబుల మోత
గాజా సిటీ/వాషింగ్టన్: పాలస్తీనా హమాస్ మిలటరీ విభాగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు యథాతథంగా కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం గాజా స్ట్రిప్‌పై బాంబు వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను విరమించాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం లెక్కచేయడం లేదు. హమాస్ రాకెట్ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెబుతోంది. శత్రువులను బలహీనపర్చడానికి వైమానిక దాడులను ఉధృతం చేస్తామని పేర్కొంటోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ గాజా టౌన్లో ఒకే కుటుంబానికి చెందిన 40 మంది నివసించే భవనం నేలమట్టమయ్యింది. ఖాన్ యూనిస్, రఫా పట్టణాల్లో 40 సొరంగాలను ధ్వంసం చేయడానికి 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 219 మంది పాలస్తీనియన్లు మరణించారు. 58 వేల మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక హమాస్ రాకెట్ దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. హింసను ఇకనైనా ఆపండి: జో బైడెన్ గత పది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాగుతున్న హింసాకాండకు ఇకనైనా స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు. ఇరువురు నేతలు బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలని బైడెన్ నొక్కిచెప్పారు. ఆ తర్వాత నెతన్యాహు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది. తన లక్ష్యం నెరవేరేదాకా దాడులు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్ చర్యలపై పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. -
వైమానిక దాడులు తీవ్రతరం
గాజా సిటీ: దాడులు నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజాలోని హమాస్ నేతలు, స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది. సోమవారం గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపించింది. 15 కిలోమీటర్ల మేర హమాస్ సొరంగాలను ధ్వంసం చేశామని, 9 మంది హమాస్ కమాండర్లకు చెందిన భవనాలను నేలకూల్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్– హమాస్ మిలటరీ మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు శ్రమిస్తున్నారు. ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో గాజాలోని హమాస్ అగ్రనేత ఒకరు హతమయ్యారు. తమ దేశంపై వేలాది రాకెట్ల దాడికి అతడే సూత్రధారి అని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. గాజాలో మౌలిక వసతులు ధ్వంసం ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 200 మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో 59 మంది చిన్నారులు, 35 మంది మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 8 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో తమ నగరంలోని రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గాజా మేయర్ యహ్యా సర్రాజ్ చెప్పారు. ఇళ్లు ధ్వంసంకావడంతో 2,500 మంది నిరాశ్రయులయ్యారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఉన్న ఒకేఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇంధనం నిండుకుంది. కాల్పుల విరమణకు యత్నాలు అమెరికా దౌత్యవేత్త హడీ అమర్ శాంతి చర్చల్లో భాగంగా సోమవారం పాలస్తీనియన్ అథారిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ను ఒప్పించేందుకు రష్యా, ఈజిప్టు, ఖతార్ తదితర దేశాలు కృషి చేస్తున్నాయి. యుద్ధానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ యధ్య పోరాటం రెండో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికిప్పుడు కాల్పుల విరమణ పాటించాలంటూ ఇరువర్గాలపై తాము ఒత్తిడి తీసుకురాలేమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సోమవారం సంకేతాలిచ్చారు. -
Gaza: ఇజ్రాయెల్ నిప్పుల వాన, మరో 42 మంది మృతి
దుబాయ్: ఇజ్రాయెల్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. గాజా సిటీపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలటరీ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఆదివారం అతిపెద్ద దాడి చేసింది. ఏకంగా 42 ప్రాణాలను బలిగొంది. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 50 మంది గాయపడినట్లు వెల్లడించింది. గాజాలోని హమాస్ అగ్రనేత యాహియే సన్వార్ నివాసాన్ని తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. కాల్పుల విరమణ దిశగా ఇరు వర్గాలను ఒప్పించేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య నాలుగో యుద్ధం తప్పదన్న సంకేతాలను ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇచ్చారు. హమాస్‌పై పూర్తిస్థాయిలో దాడులు కొనసాగుతాయన్నారు. హమాస్ భారీ మూల్యం చెల్లించాలని ఇజ్రాయెల్ కోరుకుంటోందన్నారు. ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం తాజా ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్ దేశాల కూటమి ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యింది. స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండే అర్హత పాలస్తీనియన్లకు ఉందని ఇస్లామిక్ దేశాల కూటమి అభిప్రాయపడింది. జెరూసలేం, గాజాలో తాజా పరిస్థితికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని కొన్ని ఇస్లామిక్ దేశాలు తేల్చిచెబుతున్నాయి. హింసను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్ ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ నడుమ రగులుతున్న హింసాకాండను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు భవిష్యత్తును నిర్మించాలని కోరుకోవడం లేదని, కేవలం నాశనం చేయాలని భావిస్తున్నారని ఆక్షేపించారు. ఇరు వర్గాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సూచించారు. యుద్ధ నేరమే: పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, గాజాలో మానవత్వంపై దాడి చేస్తోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్–మాలికీ ఆరోపించారు. ‘పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దారుణాలను వర్ణించడానికి పదాలు లేవు. కుటుంబాలను తుడిచిపెడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జెరూసలేం నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా వెళ్లగొట్టాలని ఇజ్రాయెల్ చూస్తోందన్నారు. ఇంకెంత మంది చనిపోతే మీరు ఈ దాడులను ఖండిస్తారని ఐరాస భద్రతా మండలిని నిలదీశారు. సంయమనం పాటించాలి: భారత్ మరోవైపు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, దాడులకు పాల్పడవద్దని భారత్ విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తతలు తగ్గడమే తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.త్రిమూర్తి అన్నారు. పాలస్తీనాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. గాజాలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. వెంటనే దాడులు ఆగాలన్నారు. This was nothing but an assault on freedom of speech and freedom of press. #Gaza pic.twitter.com/eqA6YKi5SH — Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) May 16, 2021 #Gaza Street. How it was a few days ago and how it is today.#GazaUnderAttak pic.twitter.com/x07DqglXAB — Yara murtaja🇵🇸🇹🇷 (@murtajayara) May 17, 2021 -
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
గాజా సిటీ: పాలస్తీనా హమాస్ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. హమాస్ కేంద్ర స్థావరమైన గాజా సిటీపై వరుసగా వైమానిక దాడులు సాగిస్తోంది. శనివారం శరణార్థుల క్యాంపుపై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మరో 10 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వీరిలో చాలామంది చిన్నారులే కావడం గమనార్హం. హమాస్ గ్రూపు అగ్రనేతల్లో ఒకరైన ఖలీల్ అల్–హయె నివాసంపై బాంబుదాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నెలకొన్న ఘర్షణలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఆదివారం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏడాది పాటు సంధి చేసుకోవాలని, ఘర్షణ ఆపాలని ఈజిప్టు సూచించగా, హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ నో చెప్పింది. గాజాలో తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసింది మాట్లాడారు. స్వీయరక్షణకు ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలను నెతన్యాహు వివరించారు. గాజా సిటీపై ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 126 మంది పాలస్తీనావాసులు మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడుల్లో శనివారం గాజా సిటీలోని బహుళ అంతస్తుల భవనం ధ్వంసమయ్యింది. 12 అంతస్తులున్న ఈ భవనంలోనే అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ), అల్–జజీరా ఛానల్‌తోపాటు ఇతర మీడియా సంస్థల ఆఫీస్‌లున్నాయి. -
Israel vs Hamas: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
గాజా సిటీ: ఇజ్రాయెల్ సైనిక దళాలు, పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య పోరు ఉధృతరూపం దాలుస్తోంది. ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శాంతి స్థాపనకు కట్టుబడి ఉండాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇజ్రాయెల్, హమాస్ పెడచెవిన పెడుతున్నాయి. గాజా సిటీలో శుక్రవారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకు పడుతుండడంతో పాలస్తీనియన్లు తమ పిల్లలు, వస్తువులను వెంట తీసుకొని శివారు ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనియన్లు బెంబేలెత్తిపోతున్నారు. గాజా సిటీ శివారులో నివసించే పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి నిర్వహించే పాఠశాలల్లో తల దాచుకునేందుకు తరలి వస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు తమపై భూమార్గం ద్వారా దండెత్తే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అందుకే విరుగుడు చర్యగా తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని అంటోంది. పాలస్తీనా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. 9,000 మంది రిజర్విస్ట్ సైనికులను రప్పిస్తోంది. యుద్ధ ట్యాంకులను కూడా రంగంలోకి దించుతోంది. 126 మంది పాలస్తీనియన్ల మృతి పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,800 రాకెట్లు ప్రయోగించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ 600కు పైగా వైమానిక దాడులు సాగించింది. కొన్ని భవనాలను నేలమట్టం చేసింది. టాడ్ పట్టణంలో శుక్రవారం యూదు, అరబ్ అల్లరి మూకలు ఘర్షణకు దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 126 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 31 మంది చిన్నారులు, 19 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. అలాగే 950 మంది గాయపడ్డారని వెల్లడించింది. తమ సభ్యులు 20 మంది మృతి చెందినట్లు హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌లు ప్రకటించాయి. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. శాంతి యత్నాలు విఫలం! ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణను నివారించేందుకు ఈజిప్టు సాగిస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. శాంతి స్థాపనకు ఖతార్, ఐక్యరాజ్యసమితి కూడా చొరవ చూపుతున్నప్పటికీ మార్పు రావడం లేదు. -
ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి
బాగ్దాద్ : ఇరాక్‌పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి దాడులకు పాల్పడింది. రెండు రోజు (శనివారం) సైతం ఉత్తర బాగ్దాద్ నగరంపై అమెరికా రాకెట్లు దూసుకెళ్లాయి. ఈ రాకెట్ల దాడిలో సైన్యానికి చెందిన ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. ఇరాక్ మిలీషియా కమాండర్ లక్ష్యంగా వైమానికి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడికి పాల్పడినట్టు పెంటాగన్ ప్రకటించింది. అమెరికా దౌత్యవేత్తలపై దాడి చేసినందుకే ఇరాక్‌పై దాడికి దిగామని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ప్రయత్నించడంలేదని ట్రంప్ పేర్కొన్నారు. (ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్) మరోవైపు ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇదివరకే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
బాలాకోట్ ఎటాక్ : న్యూ ట్విస్ట్
బీజేపీ సర్కార్ ప్రచారాస్త్రంగా మలుచుకున్న బాలాకోట్ వైమానిక దాడిపై న్యూటిస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడిని ఇటలీకి చెందిన ఓ జర్నలిస్ట్ తాజాగా ధ్రువీకరించారు. ఈ దాడిలో 130-170 మంది వరకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని ఇటలీ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మెరినో ఒక వివరణాత్మక కథనాన్ని వెలువరించి సంచలనం రేపారు. పాకిస్తాన్ ఈ విషయంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోందని ఆమె మండిపడ్డారు. ఖాళీ ప్రదేశంలో దాడి చేసినట్లు పాకిస్తాన్ పేర్కొందనీ, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లలేదంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తన కథనంలో మెరినో ఆరోపించారు. అయితే భారత వైమానిక దళం జేఈఎం శిక్షణా శిబిరాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో జైషే మహ్మద్ సంస్థ శిక్షణా శిబిరంలో జరిగిన వైమానిక దాడిలో 170 మంది చనిపోయారన్నారు. వీరిలో ఉగ్రవాద శిక్షణ ఇచ్చేవారు, బాంబులు తయారు చేసేవారు ఉన్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న 3 నుంచి 4 గంటల సమయంలో భారత వైమానిక దళం దాడి ఘటన వెంటనే షిన్‌కిరి బేస్ క్యాంపు వద్ద పాకిస్థాన్ తమ బలగాలను మొహరించిందన్నారు. పాకిస్తాన్ సైన్యమే క్షతగాత్రులను ఆసుపత్రిలకు తరలించి ఆర్మీలోని వైద్యుల ద్వారా చికిత్స అందించిందని తెలిపారు. ఇప్పటికీ గాయపడ్డ 45 మంది మిలిటరీ క్యాంపులో చికిత్స పొందుతున్నారని, వీరు ప్రస్తుతం సైన్యం నియంత్రణలోనే ఉన్నారని ఆమె వెల్లడించారు. అంతేకాదు దాడిలో చనిపోయిన తీవ్రవాదుల కుటుంబాలను సందర్శించిన జెఈఎం నాయకులు సంఘటన గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బులిచ్చారని తెలిపారు. కాగా సార్వత్రిక ఎన్నికల వేళ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడుల అంశం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటలీకి చెందిన జర్నలిస్టు కథనం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ప్రధానంగా విపక్షాలు బాల్కోట్ ఉదంతంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నతరుణంలో ఈ కథనం వెలువడటం గమనార్హం. -
శవాలు కాల్చి.. నదిలో పడేసి!
న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడిలో తమవైపు పెద్దగా నష్టం జరగలేదని చెప్పుకుంటున్న పాకిస్తాన్‌ది వట్టి బుకాయింపేనని తేటతెల్లమైంది. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి ముష్కరుల మృతదేహాల్ని కాల్చివేసి సమీపంలోని నదిలో పడేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించాడు. భారత వైమానిక దళం దాడి ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాల్ని అతడు పూసగుచ్చాడు. సుమారు 3 నిమిషాల వ్యవధి గల ఆ వీడియోను రిపబ్లిక్ టీవీ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్ ఆర్మీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఫోన్లు లాక్కున్నట్లు తెలిసింది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసినట్లు వీడియోలో ఉంది. బాలాకోట్ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దులోకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షి అందులో చెప్పారు. బాలాకోట్ సమీప నివాసిగా భావిస్తున్న సదరు వ్యక్తి ఈ దాడిలో మొత్తం ఎందరు హతమయ్యారో వెల్లడించకున్నా అందులో కొందరు తనకు తెలుసని, వారి చరిత్రతో సహా పేర్లు చదివి వినిపించాడు. వీడియోలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. అమానవీయంగా వ్యవహరించిన సైన్యం.. భారత వైమానిక దళం మిగిల్చిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. బాలాకోట్‌ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న సైన్యం స్థానికులను భయపెట్టింది. వారి మొబైల్ ఫోన్లను లాక్కుంది. గాయపడిన ఉగ్రవాదుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తూ వారికి చికిత్స అందించడానికి వైద్యులను కూడా అనుమతించలేదు. వైద్యం అందించాలని వారు ఎంతో ప్రాధేయపడినా కనికరించలేదు. కార్ల నుంచి తీసిన పెట్రోల్‌తో చాలామటుకు శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారు. మరి కొన్నింటిని సంచుల్లో చుట్టి సమీపంలోని కున్హర్ నదిలో పడేశారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో చాలా మంది జైషే సభ్యులే. ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే అఫ్గానిస్తాన్–వజీరిస్తాన్ సరిహద్దుకు తరలించారు. ఈ దాడితో ఐఎస్ఐ, జైషే సభ్యులను భయం పట్టుకుంది. ఫొటోలు, వీడియోలు బయటికి రాకుండా నివారించేందుకు అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అయినా కొన్ని చిత్రాలు వెలుగుచూశాయి. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ ఇలాగే దాడికి దిగుతూ ముష్కరులను చంపుతూ ఉంటే, మాకు త్వరలోనే ఉగ్రవాదం బెడద తొలగిపోతుంది. అక్కడ 263 మంది ఉగ్రవాదులు భారత యుద్ధవిమానాలు దాడికి దిగడానికి ఐదు రోజుల క్రితం బాలాకోట్ శిబిరంలో 263 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ముష్కరులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్ కమాండర్లు అక్కడే ఉన్నట్లు టైమ్స్ నౌ మీడియా తెలిపింది. ప్రాథమిక శిక్షణకు 83 మంది, అడ్వాన్స్ శిక్షణకు 91 మంది, ఆత్మాహుతి దాడిలో శిక్షణకు 25 మంది ఆæ శిబిరానికి వచ్చినట్లు వెల్లడించింది. మరో 18–20 మంది దాకా వంటగాళ్లు, క్షురకులు, ఇతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. బాలాకోట్‌లో 263 మంది ఉగ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు ధ్రువీకరించుకున్న తరువాతే వైమానిక దళం దాడికి దిగిందని తెలిపింది. అక్కడ 300 ఫోన్లు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, వైమానిక దాడిలో కనీసం నలుగురు పాకిస్తాన్ సైనికులు కూడా మృత్యువాతపడినట్లు తెలిసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)పోలీసులు, బాలాకోట్ మత గురువులకు ఫోన్‌చేయగా భారత వైమానిక దళం బాంబులు జారవిడిచిన సంగతి నిజమేనని చెప్పినట్లు ఇండియా టుడే టీవీ తెలిపింది. -
కొత్తనీతి.. సరికొత్త రీతి
నోయిడా: బాలాకోట్ ఉగ్రదాడిపై ఆధారాలు చూపాలంటున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రమూకల ఏరివేత విషయంలో యూపీఏ ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయిందని విమర్శించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పుడు ‘కొత్తనీతి–సరికొత్త రీతి’తో ముందుకుపోతోందన్నారు. ‘2008లో జరిగిన ముంబై మారణహోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడులకు భారత్ వెంటనే ప్రతిస్పందించి ఉంటే ప్రపంచం మొత్తం మనకు అండగా నిలిచేది. పాక్‌లో ఉగ్రసంస్థల పాత్రపై మనదగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయింది. ఉగ్రదుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రతాబలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మౌనం వహించింది’ అని అన్నారు. తెల్లవారుజామునే పాకిస్తాన్ ఏడ్చింది.. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 24న దాడిచేశాక తెల్లవారుజామున 5 గంటలకు ‘మోదీ మాపై దాడి చేశాడు’ అని పాక్ ఏడుపు అందుకుంది. దాడులతో ఇబ్బందిపెడుతూనే ఉండొచ్చనీ, ఇండియా ప్రతిస్పందించదని వాళ్లు భావిస్తున్నారు. 2014కు ముందున్న రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కారణంగానే శత్రువులకు ఈ అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఉడీ ఘటన తర్వాత మన బలగాలు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి వాళ్లను హతమార్చాయి. యూపీలోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని ప్రధాని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు. ఐదేళ్లలో మూడు దాడులు: రాజ్‌నాథ్ మంగళూరు: గత ఐదేళ్లలో భారత్ మూడు సార్లు దాడులు చేసిందని హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. 2016లో ఉడి ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన దాడి, ఇటీవల జరిపిన వైమానిక దాడుల గురించి వివరించిన రాజ్‌నాథ్ మూడో దాడి వివరాలు బయటపెట్టలేదు. శనివారం కర్ణాటక బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉడిలో నిద్రపోతున్న సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 17 మందిని చంపివేశారని, దీనికి ప్రతీకారంగా పీవోకే భారత్ తొలి మెరుపుదాడి చేసిందన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత వైమానిక దాడి జరిపి జైషే ఉగ్ర శిబిరాన్ని నాశనం చేసిందన్నారు. ఈ దాడులతో భారత్ బలహీన దేశం కాదని పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చామని వెల్లడించారు. -
80 శాతం బాంబులు లక్ష్యాన్ని తాకాయి: ఐఏఎఫ్
-
‘బాలాకోట్’ సాక్ష్యాలివిగో!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై జరిపిన వైమానిక దాడిలో వాటిల్లిన నష్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఐఏఎఫ్ అందుకు సంబంధించిన ఆధారాల్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 26న తాము జారవిడిచిన బాంబుల్లో 80 శాతం అనుకున్న లక్ష్యాల్ని తాకినట్లు వైమానిక దళం పేర్కొంది. సంబంధించిన ఉపగ్రహ, రాడార్ చిత్రాలను సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాడులకు వైమానిక దళం వార్హెడ్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఈ వివరాల్ని బుధవారం కొన్ని చానెళ్లు ప్రసారం చేశాయి. బాంబులు ఉగ్రవాదుల ఆవాసాల పైకప్పులను చీల్చుకుంటూ వెళ్లి అంతర్గతంగా అపార నష్టం మిగిల్చినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా జరిపిన వైమానిక దాడిలో 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ నష్టం అంత తీవ్రస్థాయిలో లేదని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అటవీ ప్రాంతంలో చెట్లు దెబ్బ తినడం తప్ప పెద్దగా నష్టమేమీ కలగలేదని పాకిస్తాన్ ప్రకటించుకుంది. కాగా, భారత వైమానిక దళం దాడి తరువాత జైషే మహ్మద్ భవనాలకు అనుకున్నంత భారీ నష్టం జరగలేదని ప్లానెట్ ల్యాబ్స్ అనే అమెరికన్ ప్రైవేటు సంస్థ ఓ ఉపగ్రహ చిత్రం విడుదలచేసింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తెచ్చింది. బాలాకోట్ ఆపరేషన్‌పై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎందరు ఉగ్రవాదులు హతయ్యారో అధికారిక సమాచారం వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడితెస్తున్నాయి. వైమానిక దళ చర్యను రాజకీయం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో వైమానిక దాడులతో నెరవేరిన లక్ష్యాలపై ఆధారాలతో వైమానిక దళం ప్రభుత్వానికి నివేదిక అందించడం గమనార్హం. 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు.. బాలాకోట్‌లో జారవిడిచిన బాంబులు లక్ష్యానికి దూరంగా పడ్డాయన్న ఆరోపణల్ని తప్పని నిరూపిస్తూ వైమానిక దళం సమగ్ర వివరాల్ని క్రోడీకరించింది. దాడి తర్వాత జైషే శిబిరానికి వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈ సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. భారత గగనతలంలో ఎగురుతున్న విమానం తీసిన 12 పేజీల విస్పష్ట ఛాయాచిత్రాలు, రాడార్ ఇమేజ్‌లను కేంద్రానికి అందజేసినట్లు విశ్వసనీయవర్గాల తెలిపాయి. దాడిలో మిరాజ్ విమానాలు ఇజ్రాయెల్ స్పైస్ బాంబుల్ని అత్యంత కచ్చితత్వంతో జారవిడవగా, అందులో 80% అనుకున్న లక్ష్యాల్ని తాకాయని తెలిపాయి. మిగిలిన 20% బాంబుల విజయ శాతం కచ్చితంగా ఎంతని అంచనా వేయలేకపోయామని చెప్పాయి.