Emergency services authorities Says Russian fuel depot Caught Fire: ఉక్రెయిన్ పై గత రెండు నెలలుగా రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. అదీగాక రష్యా ఉక్రెయిన్ దురాక్రమణ చేసేందుకు దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ ఆయుధగారాలపై దాడులు చేసింది కూడా. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే ఉక్రెయిన్‌కి సరిహద్దు సమీపంలోని రష్యా చమురు డిపోలో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తెల్లవారుఝామున బ్రయాన్స్క్ నగరంలోని చమురు నిల్వలో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.
ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఏప్రిల్ 22న ఉక్రెయిన్‌లో ఖార్కివ్ ప్రాంతంలోని చుగ్వివ్ సమీపంలోని చమురు డిపోను రష్యా బలగాలు ధ్వంసం చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఉక్రేనియన్ హెలికాప్టర్లు రష్యాలోని బెల్గోరోడ్‌లోని రోస్‌నెఫ్ట్ ఇంధన డిపోపై దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
The “Druzhba” oil depot in Bryansk is currently on fire after loud explosions were heard. Ukrainian missile strikes? pic.twitter.com/jQ6yHuOm6z
— Woofers (@NotWoofers) April 24, 2022
(చదవండి: దాడులను సహించం!... పాక్‌కి వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment