ఉక్రెయిన్‌పై భీకర క్షిపణులు, డ్రోన్‌లతో రష్యా విరుచుకుపడుతోంది. కొత్త ఏడాదిలోనూ రష్యా దాడులు ముమ్మరం చేయడంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉక్రెయిన్ సైత్యం మాస్కో చర్యకు ధీటుగా సమాధానమిస్తోంది. రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను క్రమంగా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. నూతనఏడాది సందర్భంగా ఆదివారం డొనెట్స్క్‌లోని మకీవ్వా నగరంలో మాస్కో సైనిక శిబిరంపై ఉక్రెయిన్ రాకెట్ లాంఛర్లతో దాడి జరిపింది. ఈ దాడిలో 89 మంది సైనికులు మరణించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మృతుల్లో తమ రెజిమెంట్ డిప్యూటీ కమాండర్, లెఫ్టినెంట్ కల్నల్ బచూరిన్ ఉన్నట్లు తెలిపింది.
దాదాపు ఈ 11 నెలల యుద్ధ సమయంలో ఉక్రెయిన్ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేలాదిమంది సైనికులు యుద్ధ భూమిలో అమరులయ్యారు. ముఖ్యంగా రష్యా మొండి చర్యకు ఉక్రెయిన్ అమాయక ప్రజలు బలైపోయారు. అనేక కుటుంబాలు విచ్చిన్నమయ్యాయి. కోట్లలో ఆస్తి నష్టంతోపాటు ఏళ్ల చరిత్ర కలిగిన సంపంద నాశనమవ్వడంతో దేశం అందవిహీనంగా తయారైంది. సైనికులు, పౌరులకు సంబంధించి ఎన్నో భావోద్వేగ, హృదయ విదారక దృశ్యాలు బయటకొచ్చాయి.
తాజాగా ఉక్రెయిన్‌లో గుండెను హత్తుకునే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. దేశం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికుడు చాలా కాలం తర్వాత గర్భవతిగా ఉన్న తన భార్యను కలుసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంటోన్ గెరాష్చెంకో అనే ట్విటర్ అకౌంట్‌లో అ వీడియో పోస్టు చేశారు. ఇందులో గర్భిణీగా ఉన్న మహిళ ఉక్రెయిన్ సైనికుడైన తన భర్తకు కలవడానికి ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది.యూనిఫాం ధరించిన భర్తను చూడగానే అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. భర్తను కలిసిన ఆనందంలో మహిళ కన్నీళ్లు పెట్టుకోవడం చూడవచ్చు.
This is what we're fighting for.
— Anton Gerashchenko (@Gerashchenko_en) January 3, 2023
They haven't seen each other for 30 weeks.
📹: yanina_sham/Instagram pic.twitter.com/vVrkdlRAln
‘దీనికోసమే మేయు యుద్ధంతో పోరాడుతున్నాం. ఈ సంతోషమే మాకు కావాల్సింది. వారు 30 వారాలుగా ఒకరినొకరు చూసుకోలేదు. ఎట్టకేలకు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సందర్భం రానేవచ్చింది’ అనే క్యాష్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు.‘విలువైన ప్రేమకు ఈ వీడియో నిదర్శనం. అద్భుతం.. హృదయాన్ని హత్తుకుంటోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..!
Comments
Please login to add a commentAdd a comment