![Viral Video: Ukrainian Mother And Son Reunited 6 Monts Of Russia Occupation - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/16/soldier.jpg.webp?itok=3MklRkqY)
రష్యా దురాక్రమణ యుద్ధంతో ఉక్రెయిన్ భూభాగంలోని చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సేనలు అలుపెరగని పోరుతో రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటినికి ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయకేతనాన్ని ఎగరువేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లో రెండోవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నగరాన్ని ఉక్రెయిన్ బలగాలు రష్యా నుంచి తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి.
ఈ నేపథ్యంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో నివాసం ఉంటున్న తన తల్లిని ఒక ఉక్రెయిన్ సైనికుడు కలుసుకున్నాడు. ఉక్రెయిన్ బలగాలు ఖార్కివ్ ప్రాంతం నుంచి రష్యా బలగాలను తరిమికొట్టిన తర్వాత ఆరునెలల సుదర్ఘీ పోరు తదనంతరం తన తల్లిన ఆలింగనం చేసుకుని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు ఖార్కివ్ మేయర్ ఈ భావోద్వేగ సన్నివేశాన్ని ఒక వీడియోలో బంధించి.... 'చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మధురమైన క్షణం' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్ తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యాక్సిడెంట్.. ఆస్పత్రికి తరలింపు)
Comments
Please login to add a commentAdd a comment