occupation
-
చెరువులు చోరీ!
సాక్షి, హైదరాబాద్: చినుకు పడితే చిత్తడి.. రోడ్డెక్కాలంటే రోత.. కాస్త గట్టి వానొస్తే కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా నీళ్లే.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవడంతో వచ్చిన దుస్థితి ఇది. రియల్టర్ల ధనదాహానికి, అధికారుల అవినీతి తోడై.. చెరువులు, కుంటలన్నీ కాలనీలుగా, భారీ భవనాలుగా మారిపోతున్నాయి. దీనిపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా)’ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్ఆర్ఎస్సీ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని 56 ప్రధాన చెరువుల పరిస్థితిని పరిశీలించింది. 1979లో 10,416.8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జలవనరులు.. గత ఏడాది చివరి నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయని తేల్చి0ది. అంటే 61 శాతం మాయమై 39 శాతమే మిగిలినట్టు లెక్కగట్టింది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ధనదాహం, అవినీతి కలగలిసి.. ‘గ్రేటర్’హైదరాబాద్‌తోపాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని జలవనరులు కబ్జా కావడం వెనుక రియల్టర్లు, బిల్డర్ల ధనదాహం, అధికారుల అవినీతి, సామాన్యుల అవగాహన రాహిత్యం కారణమని హైడ్రా చెబుతోంది. చెరువులు, కుంటలు సహా జల వనరులన్నీ సాగునీటి శాఖ అదీనంలో ఉంటాయి. కొన్నిచోట్ల చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ల పరిధిలో పట్టా భూములున్నా.. వాటిని పంటల సాగుకు వినియోగించాలే తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ క్రమంలోనే భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, వెంచర్లు వేసే రియల్టర్లు సాగునీటిశాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)’తీసుకోవాలనే రూల్ ఉంది. అయితే ఈ ఎన్ఓసీ లేకపోయినా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ నుంచీ అక్రమంగా ఎన్ఓసీలు జారీ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ముందే జారీ.. ఏదైనా భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు.. ఆ నిర్మాణాన్ని ఆద్యంతం పరిశీలించి, నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నివాస యోగ్యమంటూ ‘ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ (ఓసీ)’జారీ చేయాలి. కానీ గ్రేటర్ నగరంలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో వెలుస్తున్న చాలా భవనాలకు నిర్మాణ పనులు కూడా పూర్తి కాకుండానే ‘ఆక్యుపెన్సీ’జారీ అయిపోతోంది. కొందరు అధికారుల కాసుల కక్కుర్తే దీనికి కారణం. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు.. లోతుగా విచారణ చేపట్టారు. ఇక చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చినట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. వాటిని రద్దు చేయాలంటూ హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టనున్నారు. జాడ కూడా లేని తుమ్మలకుంట హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 56 జల వనరులను ‘ఎన్ఆర్ఎస్సీ’అధ్యయనం చేసింది. కీసర మండలం అహ్మద్‌గూడలో 101 ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మలకుంట పూర్తిగా మాయమైనట్టు తేలింది. ఆ చెరువు మొత్తం ఇప్పుడు ఓ కాలనీగా మారింది. అన్నింటికంటే తక్కువగా ఆక్రమణలకు గురైనది హుస్సేన్‌సాగర్.. 1,475.2 ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్‌సాగర్ 21 శాతం ఆక్రమణలకు గురై 1,163.8 ఎకరాల మేర మిగిలింది. సాధారణ ప్రాంతాల్లో ఉన్న జల వనరుల కంటే రక్షణశాఖ పరిధిలో ఏరియాల్లో ఉన్నవి సురక్షితంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. హకీంపేటలో రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న 18 ఎకరాల చెరువు ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. ఆయా చోట్ల నిఘా, ఆంక్షలు ఎక్కువగా ఉండమే దీనికి కారణమని అంటున్నారు. సికింద్రాబాద్‌లోని చంద్రపురికాలనీలో ఉన్న చెన్నపురం చెరువు.. విస్తీర్ణం పెరిగినట్టు తేలడం ఆసక్తికరంగా మా రింది. 1979లో 16 ఎకరాలుగా రికార్డుల్లో ఉన్న ఈ చెరువు.. 2023లో 18.2 ఎకరాలు ఉన్నట్టు తేలింది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా.. అదెలా జరిగిందో తేల్చాలని నిర్ణయించింది.గ్రేటర్ హైదరాబాద్, శివార్లలోని ప్రధాన చెరువులు 5644 ఏళ్ల కిందట ఈ చెరువుల విస్తీర్ణం10,416.8 ఎకరాలుఇప్పుడు వాటి విస్తీర్ణం 3,974.1 ఎకరాలు కబ్జా అయిన శాతం 61%సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్లోనూ కబ్జా అయినది 21% -
శివ.. శివా.. ఆ ఎమ్మెల్యే నల్లతాచు
‘నల్లబాలు.. నల్లతాచు లెక్క’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాకు చెందిన ‘దేశం’ ఎమ్మెల్యే నిజంగా ‘నల్ల’తాచు లెక్క.. ఆయన దురాగతాలకు అంతేలేదు. నాసిరకం బయో మందులు విక్రయిస్తూ రైతులను వంచిస్తారు. ఎన్ఆర్ఐలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి వసూలు చేసిన ‘నల్లధనం’తో ఎన్నికల బరిలోకి దిగుతారు. ఓట్లు కొంటారు, దొంగ ఓట్లు వేయిస్తారు. ఎలాగైనా గెలిచి మళ్లీ ప్రజలను పీడించుకుతినడమే ఆయన నైజం. పేరుకే ఆయన ‘శివుడు’.కానీ పనులన్నీ భస్మాసురుడిని తలపిస్తాయి. ఆ ఎమ్మెల్యే నల్లతాచు సాక్షి టాస్క్‌ఫోర్స్: బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే అక్రమంగా వసూలు చేసిన నల్లధనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడటంతో అక్రమాల తుట్టె కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో నీరు – చెట్టు పనుల్లో రూ. కోట్లు కొల్లగొట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు – చెట్టు ద్వారా చెరువులు తవ్వాలని అప్పట్లో ఆయన పట్టుబట్టడంతో దళితులు వ్యతిరేకించారు. దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడడంతో చివరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నాసిరకం బయో మందులపై సర్కారు చర్యలు తీసుకుంది. అయినా నకిలీ మందులు విక్రయించడం మాత్రం ఆపలేదు. అగ్రిటెక్ మాటున నకిలీ మందులు గుంటూరులోని ఎమ్మెల్యేకి చెందిన తన అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్డీఆర్ఐ) జరిపిన తనిఖీల్లో ఆయన ఎన్నికల అక్రమాలు వెలుగుచూశాయి. ఎన్ఆర్ఐల నుంచి నిధులు పోగేసి తొలుత ఆ నిధులను తన కంపెనీకి తరలించి అక్కడి నుంచి ఎన్నికలకు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో దొరికిన డైరీలో ‘నల్లధనం’ లెక్కలు వెలుగుచూశాయి. ఆ నిధులతోనే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు,దొంగ ఓట్లు చేర్చడం, ఎన్నికల్లో ఇతరత్రా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత ఆయన టీడీపీ మాజీ ఎంపీ దగ్గర పనిచేశారు. ప్రస్తుతం ఆ మాజీ ఎంపీ తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకు ఏపీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నప్పుడే అగ్రిటెక్ కంపెనీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఆ కంపెనీ తయారు చేసిన నకిలీ బయో ఎరువులు, పురుగు మందులను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించారు. మాజీ ఎంపీకి బినామీగా ఉన్న సమయంలో ఆయన అండతోనే ఎదిగారన్న ప్రచారమూ ఉంది. మైనింగ్,విజిలెన్స్ అధికారులపైనా దాడులు ఆ నియోజకవర్గంలో తన సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గంలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గత రెండు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు సమకూర్చారు. అదంతా నల్లధనమేనన్న ఆరోపణలు ఉన్నాయి. మార్టూరు మండలంలో 250కిపైగా గ్రానైట్ పరిశ్రమలు సామాజికవర్గం చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే తరలిపోతోంది. దీనికి సహకరిస్తున్న నేతలకు పరిశ్రమల యజమానులు నిధులు కుమ్మరిస్తారు. వీరి నుంచి అధికమొత్తంలో నిధులు వెళ్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో 15 వేలకు పైగా దొంగ ఓట్లు చేరి్పంచడంతో ఇటీవల అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. తన అగ్రిటెక్ కార్యాలయంలో లభించిన డైరీలో ఎమ్మెల్యే అక్రమాలు బయటపడటంతో ఎమ్మెల్యేతోపాటు కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యేను ఏ–1గా చూపారు. మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి అక్రమంగా సరుకు తరలిపోతుందన్న ఫిర్యాదుతో జనవరి 30న తనిఖీలకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులను తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అడ్డుకొని దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పరారైన ఎమ్మెల్యేకు తర్వాత 41 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు. కేసులు ‘అనంత’ం ► మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులను అడ్డగించిన సందర్భాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై 31/2024, 31/01/2024న ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ► 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం వంటివి ఆధారాలతో బట్టబయలు కావడంతో ఎమ్మెల్యేపై ఏ1గా కేసు నమోదు చేశారు. ► బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ), రెడ్ విత్ 120(బి), సీఆరీ్పసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేసారు. ► 220/2023, 19/09/2023వ తేదీన ఎమ్మెల్యేపై మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
చెరువుల ఆక్రమణలను తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల శిఖం, ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, చుట్టూ కంచె ఏర్పాటు.. తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్జీ) గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డిని అడ్వొకేట్ కమిషనర్లుగా హైకోర్టు నియామించింది. రెండు జిల్లాల పరిధిలోని 16 చెరువులను పరిశీలించి మూడు వారాల్లో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. అంతరించిపోతున్న చెరువులను కాపాడేందుకు వీరిని నియమించినట్లు చెప్పింది. దీనికంతటికీ అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. ‘భవిష్యత్ తరాలు బాగుండాలన్నదే మా అభిమతం. ఒకప్పుడు హైదరాబాద్‌ను సరస్సుల నగరంగా పిలిచేవారు. ఇప్పుడు చాలా చెరువులు, సరస్సులు ఆక్రమణలతో అంతరించిపోయాయి. హైకోర్టు పక్కనే ప్రవహించే నది(మూసి) దుస్థితినే మనం చూడవచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. లేదంటే భవిష్యత్ తరాలు క్షమించవు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానించారు. 13 నీటి వనరులపై నివేదిక.. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, పిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్, చిన రాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ తదితర చెరువులు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని పేర్నొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్‌గా విచారణ స్వీకరించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చినదామర, చినరాయుని, గ్నాగారం పెద్ద చెరువు, మేడికుంట, నల్లచెరువు, బోయిన్ చెరువు, మద్దెలకుంట, నల్లగండ్ల చెరువు, అంబీర్ చెరువు, గోసాయి కుంట.. 13 నీటి వనరులకు సంబంధించి ఆక్రమణలు, ఎఫ్టీఎల్, కంచె ఏర్పాటుపై నివేదికను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు అందజేశారు. పరస్పర విరుద్ధ స్టేట్మెంట్లతో అడ్వొకేట్ కమిషనర్ల నియామకం అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. దుర్గం చెరువు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసినందున కంచె వేయడం సాధ్యం కాదని చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ అందజేసిన నివేదికలో మాత్రం కంచె ఏర్పాటు చేసినట్లు ఉండటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పరస్పర విరుద్ధంగా స్టేట్మెంట్లు ఉండటంతో అడ్వొకేట్ కమిషనర్ల నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరు చెరువులను పరిశీలించి నివేదిక అందజేస్తారని చెప్పింది. ఇద్దరికీ రూ.25 వేల చొప్పున రెమ్యునరేషన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు జీహెచ్ఎంసీ తరఫున జయకృష్ణ, కేంద్రం తరఫున డీఎస్జీ గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ తరఫున శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. దుర్గం చెరువు చుట్టూ కంచె ఏర్పాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని ఏఏజీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11కు వాయిదా వేసింది. -
సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. దాదాపు బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కూర్చునేందుకు సీట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుండటంతో పలుచోట్లా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే ఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఇద్దరు మహిళలు తిట్టుకోవడం తో పాటు జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు. ఫ్రీ బస్ ఎఫెక్ట్!! జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు. pic.twitter.com/ah7wceH6vl — Telugu Scribe (@TeluguScribe) January 1, 2024 దీంతో బస్సులోని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కి చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు బస్టాండ్‌కు వచ్చింది. ఇప్పటికే ఎక్కువగా రష్ ఉంటుండటం, సీట్ల కోసం పోటీ ఏర్పడుతుండటంతో ఓ మహిళ బస్సు ఆగగానే కిటికీలో నుంచి కర్చీఫ్ వేసింది. బస్సు ఆగిన అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు బస్సులోకి ఎక్కారు. బస్సులోనే కొట్లాట ఇద్దరు తిట్టుకుంటూనే జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. బస్సులో ఉన్న మిగతా మహిళలు, పురుషులు సర్ది చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరూ సీటు కోసం కొట్లాడుకుంటుండటంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సర్దిచెప్పినా వినకుండా గొడవ పడుతుండటంతో గందరగోళానికి గురయ్యారు. చివరకు బస్సులో ఉన్న ప్రయాణికులు ఇద్దరి మధ్య కలగజేసుకుని సర్ది చెప్పడంతో గొడవకు ఫుల్ స్టాప్ పడింది. -
భూమి ఆక్రమిస్తున్నారని..
నర్మెట: తమ పట్టాభూమి ఆక్రమణకు గురవుతోందని మనస్తాపం చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దంపతులు పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసు కోవడం కలకలం రేపింది. జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండతండాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాలో ఇరువర్గాల మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. 257, 258, 259, 263 సర్వే నంబర్లలో అసైన్డ్ భూమి తో పాటు పట్టాభూమి ఉంది. ఇందులో భూక్య ఈర్యా, మేగ్యా, కిష్ట, మోహిలా సోదరులకు 258 సర్వే నంబర్లో 12.18 గుంటల పట్టాభూమి ఉంది. వీరికి 12 మంది వారసులు ఉన్నారు. మరోవర్గంలో భూక్యా పాపా వారసులు చంద్రు, లక్ష్మా, సకృ, రాములు, జయరాంలకు 257 సర్వేనంబర్ లో పట్టా భూమితో పాటు అసైన్డ్ భూమి ఉంది. కాగా, భూక్య జయరాం.. ఇటీవల హిటాచీతో భూమి చదును చేపట్టడంతో మరో వర్గానికి చెందిన మేగ్యా కుమారుడు భూక్య గురు, జయరాంల మధ్య తగాదా ఏర్పడింది. దీంతో వీరు పోలీసులను ఆశ్రయించగా భూమి సర్వేకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న సర్వే నిర్వహించిన అధికారులు 257, 258 సర్వేనంబర్లకు హద్దులు గుర్తించి, 14న పత్రాలు అందిస్తామని చెప్పి వెళ్లినట్లు సమాచారం. అనంతరం ఈ భూమిని పరిశీలించిన పోలీసులు సర్వే రిపో ర్టులు వచ్చేవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని చెప్పినా, జయరాం 258 సర్వేనంబర్‌లో హిటాచీతో భూమి చదును చేయించాడు. దీంతో తమకు న్యాయం జరగదని ఆందోళనకు గురైన భూక్య గురు, సునీత దంపతులు పురుగు మందుతాగడంతో అది గమనించిన తండావాసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వీరికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ దేవేందర్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
ప్రభుత్వ భూముల్లో..పేదలపై పెత్తనం
ప్రభుత్వ భూముల్లో పెత్తందారులు పెత్తనం చెలాయిస్తున్నారు. అసైన్డ్ పట్టాలిచ్చారంటూ స్థానికులు, అధికారులను నమ్మించి దర్జాగా అనుభవిస్తున్నారు. పక్కనే ఉన్న మిగులు భూముల్లో దళితులు ఆటస్థలం కోసం చదును చేసుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియో జకవర్గం, బాలాయపల్లి మండల పరిధిలోని రామాపురంలో వెలుగుచూసిన టీడీపీ నేతల ఆక్రమణ పర్వంపై ‘సాక్షి’ ఫోకస్.. సాక్షి, తిరుపతి: రామాపురం పరిధిలో సర్వే నంబర్ 177లో 348.98 ఎకరాల మేతపోరంబోకు భూమి ఉంది. అదేవిధంగా సర్వే నంబర్ 189లో 37.7 ఎకరాల చెరువు పోరంబోకు, సర్వే నంబర్ 178/1, 179, 180లో ప్రభుత్వ, చెరువు పోరంబోకు భూమి ఉంది. కోట్ల రూపాయల విలువచేసే ఈ భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. రామాపురం మారుమూల గ్రామం కావడంతో అప్పట్లో అధికారుల రాకపోకలు పెద్దగా ఉండేవి కావు. ఇదేఅదునుగా టీడీపీ నేతలు కొద్దికొద్దిగా ఆక్రమించుకోవడం ప్రారంభించారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు అదే గ్రామ పరిధిలోని దళిత, గిరిజనులు ఆ భూములవైపు వెళ్లకుండా అడ్డుకుంటూ వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ పథకం కింద స్థానిక దిళత, గిరిజనులను జాబితాలో చేర్చినట్లు సమాచారం. అయితే పెత్తందారులు వారి పేర్లను తొలగించినట్లు స్థానికులు ఆరోపించారు. పెత్తందార్లను ఎదిరిస్తే సాంఘిక బహిష్కరణే! పెత్తందారులంతా ఏకమై రామాపురం పరిధిలో ఉన్న ప్రభుత్వ, చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరెవరు ఎంతెంత ఆక్రమించుకోవాలో మాట్లాడుకున్నారు. పేరు, పలుకుబడి ఉన్న వారు ఆరు ఎకరాల చొప్పున ఆక్రమించుకుంటే.. వారితో ఉన్న మరికొందరు 1, 2, 3 ఎకరాల చొప్పున ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూమిలో నిమ్మచెట్లు సాగుచేశారు. పదేళ్ల క్రితం పెట్టిన చెట్లు కావడంతో ప్రస్తుతం పెద్దవయ్యాయి. అక్రమణదారులకు స్థానిక అధికారులు పూర్తిసహాయ సహకారాలు అందిస్తున్నట్టు దళిత, గిరిజనులు ఆరోపిస్తున్నారు. వారిని కాదని ఎదురు తిరిగితే సాంఘిక బహిష్కరణకు గురికాక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆట స్థలం ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యం స్థానిక యువకులు కొందరు బీడుగా ఉన్న ప్రభుత్వ భూమి రెండెకరాల్లో క్రికెట్ ఆడుకునేందుకు ఆటస్థలంగా తీర్చుకున్నారు. జీరి్ణంచుకోలేని పెత్తందారులు స్థానిక రెవెన్యూ అధికారులను రెచ్చగొట్టి యువకులపైకి పంపారు. ఆటస్థలాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా దళిత, గిరిజనులు కొందరు బీడుగా ఉన్న భూమిలో నిమ్మచెట్లు పెట్టడంతో.. పెత్తందారులు అధికారుల సహకారంతో ఆ చెట్లను పీకించేశారు. సర్వే నంబర్ 177లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొందరు ఏకమై ఇటీవల తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
‘గీతం’ ఆక్రమణలోని ప్రభుత్వ భూమి స్వాధీనం
కొమ్మాది (విశాఖ జిల్లా) : గీతం వైద్య కళాశాల ఆవరణలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకుని కంచె వేశారు. అందులో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడ సర్వే నంబర్–17లో మొత్తం 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో గుర్తించారు. అయితే, ఇందులో కళాశాలకు, ప్రభుత్వ స్థలానికి మధ్యనున్న 5.72 ఎకరాల స్థలంలో ఈ కంచెను ఏర్పాటుచేసినట్లు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి సర్వే నంబర్ 15, 20, 37, 38లో 40 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనప్పటికీ అది ప్రస్తుతం కోర్టులో ఉందని తెలిపారు. గతంలోనే మార్క్ చేశాం ఇక కళాశాలకు ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. అయితే, ఈ స్థలంలో గ్రీనరీ పెంచుతూ, ప్లే గ్రౌండ్‌గా తయారుచేశారని భాస్కర్‌రెడ్డి వివరించారు. అంతేకాక.. ప్రస్తుతం 14 ఎకరాలను గీతం యాజమాన్యం యథేచ్ఛగా ఉపయోగించుకుంటోందని, కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు ఇందులో 5.72 ఎకరాల స్థలానికి కంచె వేసినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములు సరిహద్దుగా ఉండటంతో ఎలాంటి కంచెలు ఏర్పాటుచేయలేదని ఆయన చెప్పారు. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాల్లేవని.. కానీ, త్వరితగతిన కంచె ఏర్పాటు పనులు పూర్తికావాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున పనులు చేపట్టామని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మొత్తం పదిచోట్ల ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశామని ఆయన వివరించారు. కోర్టులో ఉన్నందున నిర్మాణాల జోలికి వెళ్లలేదని ఆర్డీవో స్పష్టంచేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. -
ఉక్రెయిన్‌లో వెల్లివిరిస్తున్న ఆనందం... తల్లిని కలుసుకున్న సైనికుడు: వీడియో వైరల్
రష్యా దురాక్రమణ యుద్ధంతో ఉక్రెయిన్ భూభాగంలోని చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సేనలు అలుపెరగని పోరుతో రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటినికి ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయకేతనాన్ని ఎగరువేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లో రెండోవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నగరాన్ని ఉక్రెయిన్ బలగాలు రష్యా నుంచి తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో నివాసం ఉంటున్న తన తల్లిని ఒక ఉక్రెయిన్ సైనికుడు కలుసుకున్నాడు. ఉక్రెయిన్ బలగాలు ఖార్కివ్ ప్రాంతం నుంచి రష్యా బలగాలను తరిమికొట్టిన తర్వాత ఆరునెలల సుదర్ఘీ పోరు తదనంతరం తన తల్లిన ఆలింగనం చేసుకుని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు ఖార్కివ్ మేయర్ ఈ భావోద్వేగ సన్నివేశాన్ని ఒక వీడియోలో బంధించి.... 'చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మధురమైన క్షణం' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యాక్సిడెంట్.. ఆస్పత్రికి తరలింపు) -
ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో బరితెగింపు
కొమ్మాది: ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాడు ఓ నాయకుడు. గతంలో రెవెన్యూ అధికారులు హెచ్చరించినా ఆక్రమణ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. జీవీఎంసీ 4వ వార్డు కాపులుప్పాడ ఎస్సీ కాలనీలో స్థానిక నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వెనుకాడటం లేదు. అక్టోబర్ 23న ఇక్కడి ప్రభుత్వ స్థలంలోని తాటిచెట్లను పొక్లెయిన్‌తో తొలగించాడు. ఈ విషయం అధికారులకు తెలియడంతో అతన్ని మొక్కుబడిగా మందలించి వదిలేశారు. ఇప్పుడు ఈ స్థలాన్ని చదును చేసేందుకు అడ్డుగా ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీలను ధ్వంసం చేశాడు. మౌనం వహిస్తున్న అధికారులు ఈ ప్రభుత్వ స్థలంలో కొంత భాగాన్ని కల్యాణ మండపానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ మండపం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సదరు వ్యక్తి దర్జాగా పొక్లెయిన్ పెట్టి పనులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయం వెనుకాలే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతున్నప్పటికీ వారు స్పందించక పోవడం విశేషం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలో భాగంగా ఎస్సీ కాలనీకి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు కొంత మేర ధ్వంసమైంది. డ్రైనేజీలను కూడా మూసివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేదని అంటున్నారు. ఇంత జరుగుతున్నా సచివాలయం నుంచి గానీ, రెవెన్యూ నుంచి గానీ ఒక్క అధికారి కూడా రాలేదని.. దీనిపై సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని స్థానికులు తెలిపారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం ఇక్కడ కొంత మేర ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడం వాస్తవమే. గతంలో హెచ్చరించాం. అయితే మరల ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఆక్రమణకు గురైన స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం. – బడే శ్రీనివాస్, వీఆర్వో, కాపులుప్పాడ చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
టీడీపీ నేత నిర్వాకం.. ప్రభుత్వ భూమిని కప్పేసి..
గంట్యాడ(విజయనగరం జిల్లా): పై ఫొటోలో కనిపిస్తున్న రోడ్డు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత ప్రభుత్వ భూమిని కప్పేసి వేసింది. సిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 108/1లో 22 సెంట్లను టీడీపీ నేత ఆక్రమించి తన ఆరు ఎకరాల మామిడి తోటకు వెళ్లేందుకు రోడ్డు నిర్మించుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయం 2017–18వ సంవత్సరంలో అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని టీడీపీ నేత ఈ రోడ్డు వేశారు. రెవెన్యూ అధికారులు కూడా సదరు నేత మండల స్థాయి నాయకుడు కావడంతో చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీనిపై సిరిపురం గ్రామస్తులు కొంతమంది అప్పట్లో రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. అలాగే అదే నేత ఇదే గ్రామ రెవెనూ పరిధిలోని సర్వే నంబర్ 89/1 లో కూడా తన పొలాలకు వెళ్లేందుకు సాగునీరందించే చెరువులో కూడా రోడ్డు వేసేశాడు. చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు.. టీడీపీ నేతపై అమిత ప్రేమ టీడీపీ అధికారం కోల్పోయి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ నేతపై అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే ఆక్రమణకు గురైనప్పటికీ కళ్లుండి కూడా ఏమీ కానరానట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు కీలకపాత్ర టీడీపీ నేత ప్రభుత్వ భూమి ఆక్రమించి వేసిన రోడ్డును తొలగించకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీనేతకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ చేసి చర్యలు గతంలో కూడా ఈ రోడ్డుపై ఫిర్యాదులు వచ్చాయి. ఆఫైల్స్ కూడా బయటకు తీయించి విచారణ చేస్తాం. ప్రభుత్వ భూమిని అక్రమించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. -ప్రసన్న రాఘవ, తహసీల్దార్, గంట్యాడ -
ఆక్రమణలపై కొరడా
-
అధికారం.. దుర్వినియోగం.!
► దౌర్జన్యంగా స్థలం స్వాధీనానికి యత్నం ► కోర్డు పరిధిలో ఉండగానే బరితెగింపు ► సీఎం సురేష్‌నాయుడు కుమారుడి నిర్వాకం ప్రొద్దుటూరు(ఎర్రగుంట్ల): అధికారపార్టీ అండతో టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్‌నాయుడు కుమారుడు చరణ్‌తేజ్‌నాయుడు వివాదాస్పదంగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశారు. సర్వే చేయించి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా బాధితులు అడ్డుకున్న సంఘటన శుక్రవారం ఎర్రగుంట్లలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 24 సెంట్ల విలువైన స్థలంపై కన్ను.. ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలికి కూతవేటు దూరంలో సర్వే నంబరు 560లో 24 సెంట్ల విలువైన స్థలం ఉంది. పలుకూరి మిద్దెల పెద్ద ఓబుళరెడ్డికి చెందిన ఈ స్థలానికి సంబంధించి 1943లోనే చెక్బందీ అయినట్లు వివరాలున్నాయి. 1972లో స్థల యజమాని చనిపోగా ఇదే స్థలంలో సమాధి నిర్మించారు. తర్వాత ఆయన కుమారులిద్దరూ భాగాలు పంచుకోగా ఈ స్థలం మిద్దెల ఓబుళరెడ్డికి వచ్చింది. పూర్వం నుంచి స్థలానికి వీరే పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పట్టాదారు పుస్తకాలు కూడా ఉన్నాయి. 2004లో మరో పాసుపుస్తకం.. పోట్లదుర్తి నాయుళ్ల కుటుంబానికి బంధువైన వల్లపు శేషమనాయుడుకు 2004 అప్పటి తహసీల్దార్ నాగమల్లన్న ఈ స్థలానికి సంబంధించిన పాస్‌పుస్తకం మంజూరు చేశారు. ఇందులో ఆర్ఐ, వీఆర్వోల సంతకాలు కూడా లేవు. ముందుగా మిద్దెల ఓబుళరెడ్డితో వారి పుస్తకం తీసుకురమ్మని చెప్పి.. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత శేషమనాయుడుకు తహసీల్దార్ పాస్‌పుస్తకం మంజూరు చేశారు. దీనిపై బాధితుడు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ లోపుగానే అధికారపార్టీ నేతలు తాము అనుకున్న పనిని గప్‌చుప్‌గా పూర్తి చేశారు. సురేష్‌నాయుడు కుమారుడు కొనుగోలు పక్కావ్యూహం ప్రకారం స్థలాన్ని సీఎం సురేష్ నాయుడు కుమారుడు చింతకుంట చరణ్‌తేజ్‌నాయుడు పేరుతో ఈ నెల 27 రిజిస్ట్రేషన్ చేయించారు. కమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో 24 సెంట్ల స్థలాన్ని రూ.27.88 లక్షలకు కొన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 13 తేదీ అధికార పార్టీ అండతో ఈస్థలంలోని సమాధిని కూడా జేసీబీతో తొలగించారు. ఈ విషయంపై భాధితుడు జిల్లా ఎస్పీకి మొరపెట్టుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఈ స్థలాన్ని సర్వేచేయించి స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ నేతలు అధికారులను పావుగా వాడుకున్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి పెద్ద ఎత్తున శుక్రవారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రగుంట్ల తహసీల్దార్, సర్వేయర్లు సర్వే చేస్తుండగా.. సమస్య పై కోర్టులో ఉండగా ఎందుకు సర్వే చేస్తున్నారని బాధితులు ప్రశ్నించారు. స్థలాన్ని కేవలం సర్వే చేస్తున్నామని కోర్టు ఎవరికి ఇస్తే వారికే స్థలం వస్తుందని అధికారులు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. -
ఆ మాటే.. విజయానికి బాట
పేతురు వృత్తి రీత్యా జాలరి. ఆ వృత్తిలో ప్రతిభావంతుడు కూడా! ఇశ్రాయేలు దేశంలో ఉత్తరంలోని గలిలయ ప్రాంతపు గెన్నెసరెతు సరస్సు ఆ దేశమంతటికీ నీళ్లిచ్చే జీవనాడి. ఆ తీరంలోని కపెర్నహూము... పేతురు స్వస్థలం. పేతురుకు చేపలు పట్టడంలో ఉన్న నైపుణ్యం కారణంగా అతని మాట మేరకు ఒక రాత్రి పేతురు, మరికొంతమంది యువకులు చేపల వేటకు పూనుకున్నారు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. ఆ భారంతో సూర్యోదయవేళ సరస్సు తీరంలో వలలు కడుక్కొంటూ ఉండగా పేతురును యేసుక్రీస్తు కలిశాడు. ఆయన వెంట వందల మంది జనం ఉన్నారు. యేసు పేతురును అడిగి, అతని పడవలో కూర్చొని ప్రజలకు దేవుని మాటలు వివరిస్తూ ప్రవచనం చేశాడు. అది ముగిసిన తర్వాత పడవను సరస్సు లోపలికి అంటే లోతుల్లోకి నడిపించమని యేసుప్రభువు పేతురుతో అన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా పట్టలేకపోయిన తన ఘోర వైఫల్యాన్ని ప్రభువుకు చెప్పుకున్నాడు పేతురు. కానీ ప్రభువు ఆజ్ఞ మేరకు లోతుల్లోకి పడవను నడిపించాడు. ‘‘నిన్న రాత్రి నా జ్ఞానం, మాట చొప్పున వలలు వేశాను. కానీ, ఇప్పుడు నీ మాట చొప్పున వలలు వేస్తా’’ అంటూ ప్రభువు మాట చొప్పున పేతురు వలలు వేశాడు. అంతే... వలలు పిగిలిపోతాయా అన్నంతగా విస్తారంగా చేపలు పడ్డాయి. ఆ చేపలతో పేతురుదే కాదు అతని పాలివారైన యాకోబు, యోహానుల దోనె కూడా నిండింది. అది చూసి పేతురు ఆశ్చర్యచకితుడయ్యాడు. యేసు ప్రభువుకు మొక్కాడు. అప్పుడు పేతురుతో యేసు ‘‘ఇక నుండి దేవుని కోసం మనుషులను పట్టే జాలరివి’’ అంటూ ఆశీర్వదించాడు (లూకా 5:1-11). అదే జరిగింది కూడా! నిన్న రాత్రి వైఫల్యంతో కూడిన అవమానం, ఉదయం కల్లా అత్యుద్భుతమైన విజయానందం, అదే సాయంత్రం కల్లా మనుషుల్ని దేవుని మార్గానికి మళ్లించే మహా సువార్తికుడుగా పదౌన్నత్యం! ఇదీ పేతురు జీవితం. పేతురుకే కాదు ప్రభువును ఆశ్రయించే వారందరికీ ప్రభువిచ్చే మహాభాగ్యం ఇది. జీవితంలో విఫలమైన వాళ్లకు లోకం సున్నా మార్కులు వేసి, ఎందుకూ పనికిరానివారన్న ‘లేబుల్’ తగిలించి అవమానిస్తుంది. దేవుడు మాత్రం వారితో నేనున్నానంటాడు. లోకానికి పనికిరానివారే నాకు కావాలంటాడు. పరలోకరాజ్య నిర్మాణ మహాకార్యంలో వాళ్లే నా సహకార్మికులంటాడు. జీవితంలోని వైఫల్యాలనే రహదారులుగా మార్చి ఆ మార్గంలోని దేవుడు వారికి మహా ఆశీర్వాదాలనే గమ్యానికి నడిపిస్తాడు. - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
కబ్జా కోరల్లో ఖాళీ స్థలాలు
– బాలసముద్రం లే ఔట్లో రిజిస్ట్రేషన్‌పై అనుమానాలు – సుబేదారి పోలీసుస్టేçÙన్లో ఐదుగురిపై బల్దియా ఫిర్యాదు – ఇంకా వెలుగులోకి రాని రూ.వందల కోట్ల విలువైన స్థలాలు వరంగల్ అర్బన్l: వరంగల్ మహా నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాదారులు పాగా వేస్తున్నారు. అయితే, ఇందులో ప్రైవేట్ స్థలాలు ఉంటే వాటి యజమానులు కేసులు పెట్టి న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. మరి ప్రభుత్వ భూములైతే కాపాడుకోవాల్సిన బల్దియా అధికారులకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. ట్రై సిటీలో లే ఔట్ ఖాళీ స్థలాలు అనాదిగా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా బాలసముద్రంలోని లే ఔట్ స్థలం ఆక్రమణపై బల్దియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణలపై ఎప్పటికప్పుడు మేల్కొనపోతే మరికొన్ని స్థలాలు కబ్జాకోరల్లో చిక్కుకోవడం ఖాయమనే వాదనలు వినవస్తున్నాయి. డీజీఐఎస్ ద్వారా గుర్తింపు బల్దియాకు సంబంధించి లే ఔట్ స్థలాలను డిజిటల్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(డీజీఐఎస్) సిస్టమ్ ద్వారా గుర్తించాలని ఏడాది క్రితం కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను అదేశించారు. అంతేకాకుండా 1947 నుంచి 2014 చివరి నాటికి ట్రైసిటీ పరిధిలోని లే ఔట్ స్థలాల మ్యాపులు, వివరాలను హైదరాబాద్‌లోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ నుంచి తెప్పించారు. మ్యాపులను స్కాన్ చేసి, డీజీఐఎస్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తున్నారు. దీంతో మొత్తం 657 లే ఔట్ ఖాళీ స్థలాలు ఉన్నట్లు లెక్క తేలింది. అయితే, బల్దియా రికార్డుల్లో కేవలం 163 లే ఐట్ ఖాలీ స్థలాల వివరాలే ఉండడం గమనార్హం. ఈ మేరకు మిగిలిన 493 స్థలాలను గుర్తించి నివేదిక రూపంలో సమర్పించాలని కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ అదేశించారు. అలాగే, విలీన గ్రామాల్లోని లే ఔట్ స్థలాలు, భవనాలు, ఖాళీ స్థలాలు, కార్యాలయాల వివరాలను సేకరించాలని ఆదేశించడంతో రెండు నెలల ఆస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. వివాదాల్లో విలువైన స్థలాలు బల్దియా పరిధిలోని పలు కాలనీల్లో ఉన్న స్థలాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. బల్దియా పరిధిలోని ట్రైసిటీలో 40 నుంచి 60 స్థలాలపై కబ్జాదారులు కన్నేసినట్లు సమాచారం. బాలసముద్రంలోని 15 స్థలాలు ఉండగా, అందులో చాలా మేరకు కబ్జాకు గురయ్యాయి. ఎక్సైజ్ కాలనీలో 10 లే ఔట్ ఖాళీ స్థలాలు ఉండగా.. ఇందులో ఆరు నుంచి ఏడు స్థలాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. బల్దియా, ‘కుడా’ అధికారుల సమన్వయ లోపంగా కారణంగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి బల్దియా స్థలాలు చేరాయి. అదే విధంగా సుబేదారి జేసీ క్యాంపు కార్యాలయం వెనుకాల రూ.కోట్ల విలువైన లే ఔట్ స్థలంపై ప్రైవేట్ వ్యక్తులు కన్నేశారు. కొందరు అధికారులు అండదండలతో ఆ స్థలంలో కొంతభాగం కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. ఫారెస్టు ఆఫీస్ సమీపంలోని 500 గజాల స్థలానికి సంబంధించి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రియల్ వ్యాపారుల చేతిలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక వరంగల్ ఉర్సు సుభాష్ నగర్, రంగశాయిపేటల్లో పార్కు స్థలాన్ని కొంత మంది అక్రమించుకోగా, కరీంనగర్ ప్రధాన రహదారి సమీపంలోని ఒక నాయకుడు.. బల్దియా లే ఔట్‌కు సంబంధించి ఆరు ఖాళీ స్థలాలను విక్రయించారని తెలుస్తోంది. 1066 సర్వేనంబర్‌లో రిజిస్ట్రేషన్లు హన్మకొండ బాలసముద్రంలో ఐదు దశాబ్దాల క్రితం లే ఔట్ చేశారు. దీనికి సంబంధించి 1066 సర్వే నంబర్లో 15 ఖాళీ స్థలాలు ఉన్నాయి. 2010–11 సంవత్సరంలో బల్దియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా కరుణాకర్ ఉన్న సమయంలో 200 గజాల చొప్పున నలుగురి పేరిట 800 గజాల స్థలం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బల్దియాలో కనిపించడం లేదు. తాజాగా ఈ విషయం బయట పడడంతో మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలతో బల్దియా టౌన్ ప్లానింగ్ ఇన్చార్జ్ సీపీ కోదండరాంరెడ్డి, ఏసీపీ శైలజలు సుబేదారి పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. కొనుగోలుదారులుగా భావిస్తున్న నలుగురితో పాటు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గతంలో ఏకశిలా పార్కు సమీపంలోని 500, నుంచి 600 గజాల ఖాళీ స్థలాన్ని బల్దియా అధికారులు విక్రయించారు. ఇది వివాదస్పదంగా మారింది. రెండేళ్ల కిందట బదిలీ అయిన కమిషనర్ అధ్వర్యంలో అప్పటి సిటీ ప్లానర్ నేతృత్వంలో రూ.10కోట్ల విలువైన భూములు అప్పన్నంగా అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక స్థలాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతుండగా.. మరికొన్ని స్థలాలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ మేరకు బల్దియా పాలకవర్గం, అధికారులు స్పందించి బల్దియా ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించకపోతే రూ.కోట్ల విలువైన స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఖాయమనే చెప్పాలి. -
కన్నేస్తే కాజేస్తారు
భీమవరం టౌన్ : మునిసిపల్ రిజర్వ్డ్ స్థలాలపై భూబకాసురుల కన్ను పడింది. ఒకటా రెండా వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఉండటంతో వీటిని ఆక్రమించేందుకు నెమ్మనెమ్మదిగా ముందుకు వస్తున్నారు. జాగా ఉంటే పాగా వేసేద్దాం అంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. భీమవరంలో 72 స్థలాలు భీమవరం మునిసిపాలిటీకి 72 రిజర్వ్డ్ స్థలాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 34 ఎకరాలు ఉండగా విలువ రూ.340 కోట్లకుపైనే ఉంది. పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కూడా ఈ స్థలాలు ఉన్నాయి. అయితే మునిసిపాలిటీ వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారుల కన్ను పడింది. ఖాళీ స్థలంలో ముందుగా రెండు గెడలు పాతడం, చిన్న బడ్డీ పెట్టడం అలాగే పాతుకుపోవడం జరుగుతుంది. తర్వాత మోటార్ సైకిళ్లు పార్కింగ్, మొక్కలు పెంపకం అంటూ ప్రారంభించి షెడ్లు వేయడం ద్వారా ఆక్రమించుకుంటున్నారు. వీటిని ఎవరైనా మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసే వరకూ విషయం బయటకు రావడం లేదు. చర్యలు శూన్యం తాజాగా ఈ నెల 12న హౌసింగ్ బోర్డు 9వ వార్డులో సుమారు రూ.3 కోట్ల విలువైన 17 సెంట్ల స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టారు. కౌన్సిలర్ వేండ్ర విజయదుర్గ, ఆమె సోదరుడు సూర్యప్రకాశ్‌రావు సమాచారం అందించడంతో మునిసిపల్ అధికారులు స్థలాన్ని కాపాడుకోగలిగారు. ఇప్పటికే కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పట్టణంలో మునిసిపాలిటీ రిజర్వ్డ్ స్థలాలు, వాటికి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై గళం విప్పినా పాలకుల్లో స్పందన లేదు. మునిసిపల్ స్థలాల చుట్టూ ఫెన్సింగ్‌లు వేసి, అక్కడ బోర్డులు ఏర్పాటుచేయాలని డీఎంఏ ఆదేశాలు జారీ చేసినా ఫలితం శూన్యం. ఇంతేకాకుండా స్థలాల పరిరక్షణ కోసం ఏటా బడ్జెట్లో లక్షలాది రూపాయలు కేటాయిస్తున్నా ఒక్క పనీ జరగడం లేదు. దీంతో స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రహరీలకు ప్రతిపాదనలు మునిసిపల్ ఆస్తులను ఆక్రమించేందుకు ఎవరూ ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఒక్క సెంటు కూడా ఆక్రమణకు గురికానివ్వం. 14 ఆర్థిక సంఘం నిధులతో మునిసిపల్ రిజర్వ్డ్ స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నాం. - కొటికలపూడి గోవిందరావు , మునిసిపల్ ఛైర్మన్ , భీమవరం -
కబ్జాకు కంచె..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ శివారులోని చెలిమకుంట చెరువు ఆక్రమణపై అధికారులు స్పందించా రు. ‘సాయినగర్ ప్లాట్లకు చెలిమకుంటే దారి’ శీర్షిక న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో చెరువు శిఖం భూమిని రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే చేశారు. హద్దులు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 1565తో గల ఈ కుంట విస్తీర్ణం 5 ఎకరాల 3 గుంటలు... పట్టణానికి అత్యంత చేరువలో ఉం డటంతో ఈ కుంట పక్కన ఉన్న బాలాజీ ఖండసారి షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 7 ఎకరాల భూమిని కామారెడ్డికి చెందిన కొందరు రియల్టర్లు కొనుగోలు చేశారు. 2014 జనవరిలో ఈ భూమిని చదును చేసి సాయినగర్ పేరిటప్లాటింగ్ చేశారు. అప్పట్లోనే చెలిమకుంట కబ్జాను గుర్తించిన రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవడంతో రెవెన్యూ అధికారులు బదిలీపై వెళ్లగా ఈ విషయం మరుగున పడింది. తమకు దొరికిన ఈ సమయాన్ని రియల్టర్లు ఉపయోగించుకున్నారు. శిఖం భూమి గుండా తమ వెంచర్‌కు 150 మీటర్ల పొడవు 30 ఫీట్ల వెడల్పుతో రోడ్డు వేసుకున్నారు. సాక్షి కథనంతో కదలిన రెవెన్యూ అధికారులు చెరువు శిఖంలో వేసిన రోడ్డును స్వాధీనంలోకి తీసుకునేందుకు సమాయత్తమయ్యారు. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. శిఖం భూములు ఆక్రమణకు గురవకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రెవెన్యూ సూపరింటెండెంట్ బాల్‌రెడ్డి,ఆర్ఐ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది చెరువు శిఖం సర్వేలో పాల్గొన్నారు. -
డిల్లీలో ముదురుతున్న ఆక్రమణల తొలగింపు వ్యవహరం
-
అమ్మా.. తలుపు తీయమ్మా..!
ఐదేళ్ల కుమారుడిని షాపునకు పంపి తల్లి ఆత్మహత్య గచ్చిబౌలి: చిన్నా.. పాలప్యాకెట్ తీసుకురా అని ఆ తల్లి ఐదేళ్ల కుమారుడిని షాపునకు పంపింది.. పాలప్యాకెట్ తెచ్చిన ఆ చిన్నారి.. తలుపు వేసి ఉండటంతో అమ్మా.. అని పిలిచాడు. స్పందన లేదు. మళ్లీ పిలిచాడు.. అయినా ప్రయోజనం లేదు.. ఎన్నిసార్లు పిలిచినా అమ్మ పిలుపు వినపడలేదు.. దీంతో ఏడవడం మొదలుపెట్టాడు.. బాలుడి ఏడుపు గమనించిన స్థానికులు కూడా పిలిచారు..లోపలినుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి షాక్‌కు గురయ్యారు.. ఫ్యాన్‌కు ఉరివేసుకొని నిర్జీవంగా వేలాడుతోంది ఆ చిన్నారి తల్లి.. ఈ హృదయవిదారక సంఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్‌లో జరిగింది. ఎస్ఐ భూపతి తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు( చందుగొండ) చెందిన దంపతులు పి.కృష్ణవేణి(27), నాగరాజు కొండాపూర్ శ్రీరాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ప్రణయ్ (3), అఖిల్(5)కుమారులు. కృష్ణవేణి ఇళ్లలో చిన్న పిల్లలకు కేర్‌టేకర్‌గా పని చేస్తుండగా, నాగరాజు గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. చిన్న కుమారుడిని అక్కడే వదిలి బుధవారం భర్త, పెద్ద కొడుకు అఖిల్ తో కలిసి శ్రీరాంనగర్‌కు వచ్చింది. గురువారం ఉదయం 7.30 గంటలకే వంట చేసి భర్తను ఆఫీస్‌కు పంపించింది. అదే సమయంలో మరిది సతీష్ కోచింగ్ కోసం వెళ్లాడు. 8 గంటల సమయంలో కొడుకు అఖిల్‌ను షాపుకు వెళ్లి పాలు తీసుకురమ్మని పంపించింది. బాలుడు షాపు నుంచి తిరిగి వచ్చి పిలిచినా తలుపులు తెరవకపోవడంతో ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అఖిల్ ఏడుస్తూ ఉండిపోయాడు. పక్కనే ఉండే వెంకటయ్య, రాజవర్థన్‌రెడ్డి గమనించి తలుపులు విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే వారు పోలీసులకు, భర్తకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండేళ్లుగా మానసిక పరిస్థితి బాగాలేదని, హిస్టీరియాతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. -
పెద్దల గుప్పెట్లో సొసైటీ స్థలాలు
ఆక్రమార్కునికి అండ {పతిగా రూ.2 కోట్ల స్థలాల ఫలహారం అధికార పార్టీ కీలక నేత బంధువు యవ్వారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొసైటీ అక్రమాల బాగోతం విశాఖపట్నం: కేంద్ర ప్రభు త్వ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ భూము ల్లో అధికార పార్టీ పెద్దలు పాగా వేస్తున్నారు. సొసైటీలో బయటపడిన అక్రమాలను అవకాశంగా తీసుకుని విలువైన స్థలాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కార్యదర్శి డబ్బీరు గౌరీ శంకర్రావు భూ ఆక్రమణల కేసులో అరెస్టయినా ఆక్రమణలకు అడ్డుకట్ట పడలేదు. జీవీ ఎంసీ పరిధిలోని ఓ కీలక నేత సమీప బంధువు ఈవ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని మధురవాడలోని సొసైటీ స్థలాలను కబ్జా చేసేస్తున్నారు. దాదాపు రూ.5 కోట్ల విలువైన దాదాపు ఎకరా విస్తీర్ణంలోని సొసైటీకి చెందిన పలు స్థలాలను వ్యూ హాత్మకంగా ఆక్రమించుకుంటున్నారు. నాడు... కుటుంబ సభ్యులపేరిట కబ్జా సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ ఎంప్లాయీస్ హౌసింగ్ ఓనర్స్ వేల్ఫేర్ అసోషియేషన్‌కు మధురవాడలో ఉన్న స్థలాల్లో ఆక్రమణలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ స్థలాలను కబ్జా చేసిన కేసులో కార్యదర్శి డబ్బీరు గౌరీ శంకర్రావును కొన్నిరోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతను కబ్జా చేసిన సొసైటీ స్థలాల గుట్టును పూర్తిగా ఛేదించకపోవడం గమనార్హం. అతని ఆక్రమణలో ఉన్నప్పటికీ విచారణ పరిధిలోకి రాని స్థలాలు ఎన్నో ఉన్నాయి. సొసైటీ స్థలాలను డబ్బీరు గౌరీశంకర్రావు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. సర్వే నంబర్లు 359లో నాలుగు ప్లాట్లు, 360లో రెండు ప్లాట్లను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సమీపంలోనే గెడ్డ పోరంబోకు స్థలాన్ని కూడా ఆక్రమించేసి కలిపేసుకున్నారు. అందులో నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అదే విధంగా ఇదే సొసైటీకి చెందిన సర్వే నెంబరు. 2, 2పి లలో ఉన్న అన్నంరాజు లే అవుట్, అయోధ్యనగర్, నగరంపాలెంలలో దాదాపు 6 స్థలాలను కొంతకాలం క్రితమే తమవారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇలా ఆక్రమించి ఇంకా విచారణ పరిధిలోకి రాని స్థలాల మార్కెట్ విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉంటుంది. నేడు కీలక నేత బంధువు గుప్పెట్లో..? డబ్బీరు గౌరీ శంకర్రావు అక్రమాలను అధికార పార్టీ నేత తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలోని కీలక అధికార పార్టీ నేతకు ఆయన సమీప బంధువు కూడా కావడం గమనార్హం. విచారణ పరిధిలోకి రాని ఆక్రమాలను కప్పిపుచ్చుతామని చెబుతూ ఆ స్థలాలను ఆక్రమించేందుకు వ్యూహం పన్నారు. అందుకు ఓ ఉన్నతాధికారి కూడా సహకరిస్తున్నారు. తద్వారా డబ్బీరు గౌరీ శంకర్రావుకు కేసు విచారణ విషయంలో సహకరించేందుకు... ప్రతిగా దాదాపు రూ.2 కోట్ల విలువైన స్థలాలను తనపరం చేసుకోవాలన్నది ఆ కీలక నేత పన్నాగం. దాంతో ఈ కేసులో లోతుగా విచారించకుండా తూతూమంత్రంగా ముగించే దిశగా పావుల కదుపుతున్నారు. అధికార పార్టీ నేతలు తలచుకుంటే కానిదేముంటుంది. -
అధికారుల అత్యుత్సాహం
విమర్శలకు గురవుతున్న ఆక్రమణల తొలగింపు వసూళ్ల కోసమేనని ఆరోపణలు మంగళగిరి :ఆక్రమణల తొలగింపులో అధికారుల అత్యుత్సాహం విమర్శలకు గురవుతోంది. కొందరికి అనుకూలంగా మరి కొందరికి వ్యతిరేకంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. బేరసారాలకు వ్యూహంతో... అయితే కొంతకాలంగా మున్సిపల్ అధికారులు పాలకులు అక్రమకట్టడాలు, అక్రమణలు తొలగింపులో వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విధంగా ఉన్నాయి. రోడ్ల ఆక్రమణలను తొలగించలేని మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేని అపార్ట్మెంట్లలోని సెల్లార్లో దుకాణాలను తొలగించేందుకు పూనుకోవడం అవి పట్టణంలో ఎంపిక చేసిన అపార్ట్మెంట్ల దుకాణాలను మాత్రమే తొలగించాలని ప్రయత్నిండం పలు అనుమానాలకు తావిస్తోంది. ముందుగా అపార్ట్మెంట్లోని ప్లాట్ల యజమానులను ఒకరిద్దరిని తమకు అనుకూలంగా ఉన్న వారితో సెల్లార్‌లోని దుకాణాల ద్వారా తమకు ఇబ్బందులు వున్నాయని వాటిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయించడం, అనంతరం పట్టణప్రణాళిక అధికారులను పంపి తొలగించేంచాలని ఆదేశాలు జారీచేస్తున్నట్లు సమాచారం. తొలగింపునకు వచ్చిన అధికారులు యాజమాన్యానికి కొంత సమయం ఇవ్వడం ఆసమయంలో యాజమాన్యంతో అధికారులు పాలకులు బేరాలు కుదుర్చుకుని మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుర్తించిన అక్రమ కట్టడాలపై... పట్టణంలో 42 కుపైగా అక్రమకట్టడాలను గుర్తించిన అధికారులు వాటిని పట్టించుకోని అధికారులు నూతనంగా కొన్ని చోట్ల నిర్మిస్తున్న భవనాల వద్ద చేస్తున్న హడావుడి ఆశ్చ్యరం కలిగిస్తోంది. అధికారపార్టీ కౌన్సిలర్లు కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగు, ఐదు అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకోని అధికారులు సామాన్యుడు రేకుల షెడ్డు నిర్మాణానికి పునాది తీసినా అనుమతులు లేకుండా పునాది ఎలాతీస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు నిలుపుదల చేయిస్తున్నారు. పాలకుల ప్రసన్నం ఉంటే... ఇక పాలకులకు ఆమ్యామ్యా ముడితే ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేస్తున్నా అటు వైపు చూడని పట్టణప్రణాళికా విభాగం అధికారులు పాలకులు తమ వ్యతిరేకులు అనుకున్న వారి భవనాల పనులు ఆపటానికి మాత్రం ఆగమేఘాలపై వెల్తుండడం విశేషం. కొద్ది రోజులుగా ఇందిరానగర్‌తో పాటు పార్కురోడ్లో నిర్మిస్తున్న రెండు భవనాలు యజమానులు తమను కలవలేదని వెంటనే భవననిర్మాణాలను నిలపాలని ఆదేశించడంతో అధికారులు జేసీబీలతో వెళ్లి నిర్మాణాలను కూల్చేందుకు పూనుకున్నారు. దీంతో స్థానికులు అడ్డం తిరగడం వాగ్వాదానికి దిగడం షరామామూలైంది. సమన్యాయం పాటించాలి పట్టణంలో అక్రమకట్టడాలన్నింటిని తొలగించాలని లేదంటే వారితో పాటు తమకు అనుమతి ఇవ్వాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో అధికారులు వెనుతిరగకతప్పట్లేదు. పట్టణంలో ప్రణాళిక ప్రకారం భవననిర్మాణాలు అధికారులు చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. కాని పాలకుల అవినీతితో పాటు వారి కక్ష కట్టినధోరణిలో కొన్ని భవనాలను ఎంపిక చేసుకుని వారిని ఇబ్బంది పెట్టడం మాని, నిభందనల ప్రకారం నడుచుకుని మున్సిపల్ ఆదాయాన్ని పెంచి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు. -
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు
జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ హెచ్చరించారు. పెద్దఅంబర్‌పేట నగర పంచాయితీ పరిధిలోని పలు వివాదాస్పద భూములను గురువారం ఆయన సందర్శించారు. తట్టిఅన్నారంలోని జంగారెడ్డికుంట ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్డు నిర్మించారని, పెద్దఅంబర్‌పేటలో సర్వే నం-64లోని వెంకటయ్యకుంట కబ్జాకు గురవుతోందని ఫిర్యాదు రావడంతో స్పందించిన జేసీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి సదరు ప్రాంతాలను సందర్శించారు. ఆయా చెరువులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తట్టిఅన్నారం జంగారెడ్డికుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. పెద్దఅంబర్‌పేట వెంకటయ్యకుంటకు పూర్తి హద్దులు ఏర్పాటు చేయాలని, ఎఫ్టీఎల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని సూచించారు. అనంతరం హయత్‌నగర్ మండలంలోని కోహెడలో పోలీసుశాఖ సమాచార టవర్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పెద్దఅంబర్‌పేటలోని సర్వే నం-64లోని ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు జేసీని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ యాదగిరిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ బీంప్రసాద్, డీఈ గోపాల్‌రెడ్డి, ఏఈ కనకలక్ష్మి, ఆర్ఐలు సుదర్శన్‌రెడ్డి, రవీంద్రసాగర్, సర్వేయర్ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియాపై చిర్రుబుర్రులు.. జేసీ సందర్శించిన విషయాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై జేసీ మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా అధికారులు అడ్డుచెప్పారు. పర్యటన వివరాలను మీడియాకు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. జవహర్‌నగర్: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్‌సైనీ హెచ్చరించారు. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములు, అధికారులు నిర్వహిస్తున్న క్రమబద్ధీకరణ సర్వేను గురువారం సాయంత్రం ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, శామీర్‌పేట తహసీల్దార్ దేవుజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న క్రమబద్ధీకరణ జీవో 58,59 సర్వేను పరిశీలించి దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరి ఇళ్లను గుర్తించాలని, సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవినాయక్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అడవీ నాదే..! అక్రమం నాదే..!!
అడవిని సంరక్షించాల్సిన అధికారులే ఎంచక్కా అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు. అటవీచట్టాలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. హరితహారం పథకాన్ని అక్రమహారంగా మలుచుకుంటున్నారు. కలప అక్రమార్కులకు అండగా ఉంటూ ‘అడవీ నాదే..అక్రమం నాదే..’ అనే రీతిలో దర్జాగా దండుకుంటున్నారు. - ఖమ్మం హవేలి ఖమ్మం హవేలి: అటవీ చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన ఆ శాఖ అధికారులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలను పక్కదారి పట్టిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కలప అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఖమ్మం డీఎఫ్‌వో పరిధిలోని సత్తుపల్లి రేంజ్లో లంకపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి అనేక అక్రమాలు, అవినీతికి పాత్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. కలప అక్రమార్కులకు అండగా నిలుస్తూ.. ఇష్టారాజ్యంగా రవాణాకు సంబంధించిన పత్రాలను జారీ చేస్తున్నారని తెలుస్తోంది. ఖాళీ అనుమతి పత్రాలపై సంతకం చేసి, సీల్ వేసి జారీ చేయడం అక్రమార్కులకు ఊతం ఇస్తోంది. దీన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఇచ్చిన బిల్లులతో కలప అక్రమార్కులు సుబాబుల్, జామాయిల్‌తో పాటు ఇతర కలపను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా అన్ని రేంజ్‌ల పరిధిలోని ప్రతి ఒక్క నర్సరీలో 2 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ. 16 లక్షలు కేటారుుంచారు. ఈ రెండు లక్షల మొక్కల కోసం ఎర్రమట్టిని ప్రైవేటు వారి నుంచి సేకరించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.2 లక్షలు కేటాయించింది. అటవీ నిబంధనల ప్రకారం అటవీశాఖ కూడా అడవిలోని మట్టిని తీయాలంటే అనుమతులు ఉండాల్సిందే. లేనిపక్షంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టడానికి వీలులేదు. ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అటవీ సంపదను కొల్లగొడుతుండటం గమనార్హం. ఈ విషయంలో లంకపల్లి డీఆర్వో ‘ నా అడవి.. నాఇష్టం’ అనే రీతిలో వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. సమీప గ్రామాల ప్రజలు సొంత అవసరాల కోసం ఇసుక, మట్టి తీసుకువెళ్తుంటే కేసులు బనాయించడంతో పాటు బెదిరించి వసూళ్లు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న లంకపల్లి డీఆర్వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే సంబంధిత డీఆర్వోకు మెమో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. తక్షణం చర్యలు తీసుకుంటాం: ప్రసాద్, ఖమ్మం డీఎఫ్‌వో లంకపల్లి డీఆర్వోపై ఆరోపణల విషయంలో విచారణ నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఆరోపణలు నిజమైతే మెమో జారీ చేస్తాం. అటవీ నిబంధనల ప్రకారం అటవీశాఖ అవసరం కోసం కూడా అటవిలోని మట్టిని గానీ, ఇతరత్ర సంపదను కాని వాడుకోవడానికి వీల్లేదు. -
టీడీపీ నేత.. భూ మేత
సర్కారు భూమి కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. గ్రామ కఠం, దేవుని మాన్యం. పోరంబోకు, పశువుల మేత స్థలం, శ్మశానమైనా సరే కాదేదీ ఆక్రమణలకు అనర్హమంటూ పాగా వేసేస్తున్నారు. అధికార దాహంతో ఊగిపోతున్న కబ్జాదారులతో మనకెందుకనుకుంటూ అడ్డుకోవల్సిన అధికారులే ప్రేక్షకపాత్ర వహించడంతో పరిసరాలన్నీ తమవేననే అహంకారంతో రంకెలేస్తున్నారు. వందల ఎకరాలను పొక్లైన్లతో చదును చేసి ఏకంగా పంట భూములుగా మార్చేసి సాగు చేసుకుంటున్నా అడ్డుకునే నాధుడే కానరావడం లేదు. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ విజయకుమార్ ఇచ్చిన ఆదేశమూ నత్తనడకన నడుస్తోంది. పీసీపల్లి: అధికారం మనదే ... ప్రభుత్వం భూములూ మనవే అన్న చందంగా మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. కబ్జా చేసి కౌలుకు ఇచ్చేసి సాగు చేసేస్తున్నా సంబంధితాధికారులు చేష్టలుడిగి చూస్తుండడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత పది రోజులుగా మండలంలోని చినవరిమడుగులో దాదాపుగా 145 ఎకరాలను టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జేసీబీలు పెట్టి వాగు పోరంబోకు, పశువుల పోరంబోకును ఆక్రమించేస్తున్నాడు. దేవుడి మాన్యమైనా మాదే... ఒక్క పంచాయతీలోనే దాదాపు 200 ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి ఆక్రమణపాలైందంటే మండ లం మొత్తం ఎన్ని వందల ఎకరాలు కబ్జాకు గురైందో సమగ్ర దర్యాప్తు చేస్తే వెలుగు చూసే అవకాశం ఉంది. మండలంలోని మురుగమ్మి, గుంటుపల్లి, శంకరాపురం, పీసీపల్లి, పెదయిర్లపాడు, విఠలాపురం, లక్ష్మక్కపల్లి, అలవలపాడు తదితర గ్రామాల్లో ప్రభుత్వ బంజర, దేవుడు మాన్యం, అటవీ పోరంబోకు భూములపై కూడా కన్నేశారు. ప్రధాన నేతే మేత మేస్తున్నప్పుడు ఇక మేమెందుకు వెనుకడుగు వేయాలనుకున్నారేమో చోటా,మోటా నాయకులు కూడా కబ్జాకు సమాయత్తమవుతున్నారు. ఇంత జరగుతున్నా తమది కాదన్నట్లు రెవెన్యూ శాఖ వ్యవహరించడపట్ల గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కలెక్టర్ ఆదేశంతో పరిశీలించిన సబ్‌కలెక్టర్ పర్యటన రద్దు కావడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమోనని పలువురు భావిస్తున్నారు. పిచ్చుకులపై బ్రహ్మాస్త్రాలు... బతుకు తెరువు కోసం ప్రభుత్వ భూములు ఆక్రమించిన పేదలపై కొరడా ఝళిపిస్తున్న రెవెన్యూ యంత్రాంగం బడా బాబులు జోలికి ఎందుకు పోవడం లేదంటూ పరిసర ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రంగా స్పందించి ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి సెంటు భూమి లేని నిరుపేదలకు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 145 ఎకరాలు పైమాటే... చినవరిమడుగు, జంగాలపల్లి, మురుగమ్మిలోని సర్వే నెం 14, 15,16,17 ,70,75,77, 90,148,161,151,153,154,171, 172, 173,174,175లో ఉన్న 145 ఎకరాలను తన సొంత భూమిలా ఐదు జేసీబీలు పెట్టి పది రోజుల నుంచి చదును చేసే కార్యక్రమానికి దిగాడు. 70 ఎకరాల్లోనూ... పెదవరిమడుగు, పశువులపోరంబోకు, డొంక పోరంబోకును కూడా వదలడం లేదు. సర్వే నెం-199,200,201,202, 203,189, 190, 185,182,158,153,93ల్లో ఉన్న దాదాపు 70 ఎకరాలు కూడా మూడు నెలలుగా ఆక్రమించి సాగు చేసి కంది పొగాకులను వేశారు. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అదే గ్రామానికి చెందిన కొంతమంది గత నెల 17వ తేదీన ఒంగోలులో జరిగిన గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ విజయకుమార్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్, సబ్‌కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. -
పక్కా ప్లాన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మొన్న ఇస్కాన్‌సిటీ పరిధిలో రూ.10 కోట్లు విలువజేసే కార్పొరేషన్ స్థలాన్ని కొందరు అమ్మి సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతో కబ్జా బాగోతం బయటపడింది. తాజాగా నెల్లూరు శివారు ప్రాంతమైన జనార్దన్‌రెడ్డి కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కార్పొరేషన్‌లోని ఓ బడా టీడీపీ నేత, అతని అనుచరులు పథకం వేశారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో కబ్జా బాగోతం కాస్త బయటకు పొక్కింది. వివరాల్లో కెళితే... నగరంలోని 54వ డివిజన్ పరిధిలో సర్వే నంబర్ 2062/3లో సుమారు 2.50 ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా కాలనీ పరిధిలోనే మరో 2.50 ఎకరాలను సైతం ఆక్రమించుకునేందుకు పథకం పన్నినట్లు సమాచారం. అందులో భాగంగా ఇటీవల ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లు వేసి విక్రయించారు. అందులో ఒక ప్లాటులో రేకుల షెడ్డు కూడా నిర్మించారు. ఒక్కొక్కరుగా స్థలాలను ఆక్రమించుకుంటుండడంతో స్థానికులు అధికారులను కలిశారు. తాము ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాలు లేకుండా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని, తమకు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని పంచిపెట్టాలని పలుమార్లు కోరారు. అయితే అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రూ.5 కోట్లకు టెండర్ పెన్నా తీరం శ్మశాన వాటిక సమీపంలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ముచేసుకునేందుకు టీడీపీకి చెందిన ముఖ్యనేత ఒకరు తెరవెనుక నుంచి మంత్రాంగం నడిపినట్లు విశ్వసనీయ సమాచారం. రెవెన్యూలోని ఓ అధికారి ద్వారా ఈ తంతంగాన్ని పూర్తి చేసి సొమ్ము చేసుకునేందుకు అనుచరులను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఒక్కొక్క ప్లాటును విక్రయించుకుంటూ సొమ్ముచేసుకునేందుకు పథకం వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం పచ్చ జెండాలు పాతినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ స్థలం అంతా హద్దులు ఏర్పాటు చేస్తుండడంతో విషయం తెలుసుకున్న స్థానికులు వారిని అడ్డుకున్నారు. తాము ఏళ్ల తరబడి ఉంటున్నామని, ప్రభుత్వ స్థలాన్ని మీకెవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కసారిగా స్థానికులంతా గుమికూడా నిలదీయడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డును కూలదోయాలని, అదేవిధంగా హద్దులు చెరిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న హిజ్రాలు కొందరు రెవెన్యూ అధికారులను కలిసి ప్రభుత్వ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చిన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో గౌరవంగా బతకాలంటే ప్రభుత్వ పథకాలు తమకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మేళ్లకుంటలో రియల్టర్ల మేత!
కరీంనగర్ రూరల్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ కుంట శిఖం ఆక్రమణకు గురైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రూ,కోట్ల విలువైన శిఖం స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుని రహదారులను నిర్మించారు. దాదాపు రూ.8కోట్ల విలువైన రెండెకరాల భూమిని బై నెంబర్లతో రియల్టర్లు పలువురికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వ భూముల పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లోని సర్వే నెంబరు-71లోని మేళ్లకుంట ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతుంది. నగర విస్తరణతో కుంట చుట్టూ ఉన్న స్థలానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం గుంట ధర రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఉంది. 13 ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో ఉన్న కుంటశిఖంలో గత కొన్ని నెలల నుంచి అక్రమ కట్టడాల నిర్మాణం జోరుగా సాగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. రియల్టర్లతో స్థానిక ప్రజాప్రతినిధి కుమ్మక్కు రూ.కోట్ల విలువైన కుంటశిఖం స్థలంపై కొందరు రియల్టర్లు కన్నేశారు. గ్రామానికి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధిని వాటా పేరుతో మచ్చిక చేసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి కుంట శిఖం స్థలంలో దాదాపు ఇరవై అడుగుల వెడల్పుతో స్థానిక ప్రజాప్రతినిధి సాయంతో ఎల్ ఆకారంలో రహదారి నిర్మించారు. దీంతో సమీపంలోని నివాసగృహాలు, పట్టాదారులకు రోడ్డు సౌకర్యం ఏర్పడింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు సైతం ఈ వ్యవహారంలో చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. బై నెంబర్లతో రిజిస్ట్రేషన్లు కుంట శిఖం స్థలాన్ని రియల్టర్లు బై నెంబర్లతో మాయ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని అధికారులతో కుమ్మక్కైన రియల్టర్లు దర్జాగా రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నారు. మేళ్లకుంట సర్వేనెంబరు-71 కాగా రియల్టర్లు సర్వేనెంబరు-71/1,2,3, పేరిట దాదాపు ఇరవై మందికిపైగా ఒక్కొక్కరికి రెండు గుంటలు, మూడు గుంటల చొప్పున ఎకరంన్నర స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా పహణీలో సర్వేనెంబరు-71కి బై నెంబర్లు లేకపోయినప్పటికీ అధికారులకు మామూళ్లు అందుతుండటంతో కళ్లు మూసుకుని రిజిస్ట్రేషన్ తతంగాన్ని ముగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు కరువు కుంట శిఖం స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు గృహనిర్మాణాలు చేపట్టినప్పటికీ రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుంట స్థలానికి ఆనుకుని ఉన్న సర్వేనెంబర్లు-51,52, 66లోని భూములకు సంబంధించిన పట్టాదారులు కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. గ్రామ పంచాయతీ నుంచి పట్టాభూమిలో గృహనిర్మాణం కోసం అనుమతి తీసుకుని శిఖం స్థలంలో కడుతున్నప్పటికీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఒక వ్యక్తి కుంట శిఖంలో గృహ నిర్మాణం చేపట్టాడని రెవెన్యూ అధికారులు అడ్డుకోగా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వ్యవహారం ముగియక ముందే సదరు వ్యక్తి గృహనిర్మాణం పూర్తికావడంతోపాటు మరికొందరు వ్యక్తులు ప్రహరీ, గృహ నిర్మాణం చేపట్టడం గమనార్హం. -
ఉన్నత విద్యా! నీ ఉన్నతి ఎలా?
విద్యా ప్రమాణాలు దిగజారి, డిగ్రీలు అసంబద్ధమై, పట్టాలు ఉపాధికి పనికి రానివై, పట్టా పొందిన విద్యార్థులకు ఉద్యోగార్హతల్లేక... ఉన్నత విద్యకే పెనుసవాలుగా మారుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంస్కరణ దిశలో తక్షణ చర్యలు చేపట్టకుంటే ఉన్నత విద్య ఇప్పట్లో బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులై, విద్య ఫక్తు వ్యాపారమై, ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా, విద్యార్థుల్ని వినియోగదారులుగా పరిగణిస్తున్నంత కాలం ఉన్నత విద్యకు మోక్షం లేదనే భావన బలపడుతోంది. ఉన్నత విద్యను ఇప్పటికే పీడిస్తున్న అనేకానేక సమస్యలకు తోడు రాజకీయ దివాలాకోరుతనం మరింత దిగజారుస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్య, దాని ప్రమాణాలు అత్యంత వేగంగా పడిపోతున్నాయి. గడచిన ఒకటి, రెండు దశాబ్దాలుగా ముప్పిరిగొంటున్న సమస్యలకు తోడైన తాజా పరిణామాలతో ఉన్నత విద్య, ప్రధానంగా వైద్య, సాంకేతిక ఇతర వృత్తి విద్యారంగం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఇంటర్ పరీక్షలు, ఎమ్సెట్, ఇతర ప్రవేశ పరీక్షల నిర్వహణ విషయమై రెండు కొత్త రాష్ట్రాల నడుమ సాగుతున్న జగడం మచ్చుకు ఓ ఉదాహరణ (టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్) మాత్రమే! విద్యార్థుల్లో అయోమయాన్ని, తల్లిదండ్రుల్లో ఆందోళ నను రేపుతున్న ఈ వివాదం ఏ రకంగా చూసినా అవాంఛనీయం. కానీ, ఎవరు చెప్పినా వినే పరిస్థితి రెండు ప్రభుత్వాలకూ లేదు. ప్రభుత్వ పెద్దలు పనికిమాలిన ప్రతిష్టకు పోయి విద్యార్థుల్ని, ఒక విద్యా సంవత్సరాన్నే అగమ్య గోచర స్థితిలోకి నెడుతున్నారు. ఇంకో వైపు విద్యా ప్రమాణాలు దిగజారి, డిగ్రీలు అసంబద్ధమై, చేతికొచ్చే పట్టాలు ఉపాధికి పనికిరానివై, పట్టాపొందిన విద్యార్థుల్లో ఉద్యోగార్హతల్లేక... ఉన్నత విద్యకే పెనుసవాలుగా నిలుస్తున్నా యి. ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సంస్కరణ దిశలో తక్షణ చర్యలు చేపట్టకుంటే అది ఇప్పట్లో బాగుపడే లక్షణాలు ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారులై, విద్య ఫక్తు వ్యాపారమై, ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా, విద్యార్థుల్ని వినియోగదారులుగా పరిగణిస్తు న్నంత కాలం ఉన్నత విద్యకు మోక్షం లేదనే భావన బలపడుతోంది. ఇంతకన్నా దయనీయం ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఈసారి దాదాపు 80 ఇంజనీరింగ్ కళాశాలలు విధి లేని స్థితిలో, స్వచ్ఛందంగా మూసేసుకునే పరిస్థితి. 40 కళాశాలల్లో కనీసం ఒక విద్యార్థి కూడా చేరలేదు. సుమారు అంతే సంఖ్యలో కళాశాలలు, మేం పిల్లల్ని చేర్చుకోవడం లేదు, ఇక తనిఖీలకు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోకండి అని స్వయంగా అధికారులకు తెలియజెప్పడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 700 కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలుండి, దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల్ని చేర్చుకొని, ఏటా ఒకటిన్నర లక్షల ఇంజనీర్లను పట్టాలిచ్చి బయటకు పంపినప్పుడు గొప్ప రాష్ట్రంగా మురిశాం. గ్లోబలీ కరణలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఐటీ రంగ అవకాశాలు, మార్కెట్ చోదక ఆర్థిక వ్యవస్థ, బయటి సేవల వినియోగం... వీటి పుణ్యమా అని మన కుర్ర ఇంజనీర్లందరికీ సువర్ణావకాశాలని సంబరపడ్డాం. కానీ, అరకొర మౌలిక సదుపాయాలు, ఉండీలేని బోధనా సిబ్బంది, ఉన్న టీచర్లకూ కనీస విద్యా ర్హతలు లేని దుస్థితిలో పిల్లలేం నేర్చారని గమనించలేకపోయాం. విద్యను వ్యాపారం చేసి, డబ్బు గడించడమే ధ్యేయమనుకున్న నిర్వాహకులు మొండి గోడల్ని కొంచెం అటుఇటుగా మార్చి కోళ్లఫారాలలో కూడా కాలేజీలు నడిపిన దౌర్భాగ్యం. ఇంజనీరింగ్ పిల్లలకు బోధించడానికి ఎమ్‌టెక్ తదితరపీజీ డిగ్రీ కనీసార్హత అయిన చోట, బీటెక్ కాదు కదా పాలిటెక్నిక్ చదివిన వారితోనూ పాఠాలు చెప్పించిన ఉదంతాలున్నాయి. ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగా ర్హత ఎంత అనే విషయమై, ప్రభుత్వం పనుపున ‘ఆస్పైరింగ్ మైండ్స్’అన్న ఏజెన్సీ జరిపిన అధ్యయనంలో వెలుగు చూసిన నిజాలు ఎవరికైనా ముచ్చె మటలు పుట్టిస్తాయి. ప్రతి వంద మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగార్హత కలిగిన వారి సంఖ్య రాష్ట్రంలో 17 కంటే తక్కువ! ఇది బీహార్, జార్ఖండ్ (100 నుంచి 75 శాతాల మధ్య), మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ (75 -50 శాతాల మధ్య), ఒరిస్సా, రాజస్థాన్ (50-25 శాతాల మధ్య) రాష్ట్రాల కన్నా అధ్వాన్నమైన స్థితి. ఎందుకీ దుస్థితి దాపురించిందంటే, డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిన వారి అత్యాశ వల్ల. మెజారిటీ కాలేజీలు ఏ నిబందనలు అనుసరించకుండా, ఏ ప్రమాణాలూ పాటించకుండా నడిచినవే! ఇతర కాలేజీ సిబ్బందిని తమ సిబ్బందిగా చూప డం, లేని విద్యార్థుల్ని ఉన్నట్టుగా చూపి ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉపకార వేతనాలు కొల్లగొట్టడం వంటి నేరాలూ-ఘోరాలూ జరిగాయి. అవన్నీ తనిఖీ చేసి, ప్రాథమికంగా నిర్ధారించుకొని, నిన్నటికి నిన్న 11 ఇంజనీరింగ్ కాలేజీలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వృత్తి కళాశాలల్లో ప్రమాణాలపై అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ టాస్క్ఫోర్సు నివేదికలోనే నివ్వెరపరిచే నిజాలున్నాయి. 2012 ఆగస్టు 11న అప్పటి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సు (జివో ఎమ్మెస్ నం: 54) మొత్తం 654 కాలే జీల్లో పరిశీలన జరిపింది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం చూస్తే, 319 కాలేజీల్లో అవసరమైన భవన సదుపా యాలు లేవు. 394 కాలేజీల్లో కంప్యూటర్ టర్మినల్స్ ప్రమాణాల ప్రకారం లేవని, 449 కాలేజీల్లో ల్యాబరేటరీ సదుపాయాలు లేవని, 622 కాలేజీల్లో బోధనా సిబ్బంది ప్రమాణాలకనుగుణంగా లేరని తేల్చిచెప్పింది. టీచర్- విద్యార్థి నిష్పత్తి 1:15 ఉండాలన్నది ప్రామాణికమైతే, సదరు నిర్వహణ ఎక్కడా దరిదాపుల్లో కూడా లేదని తేటతెల్లమైంది. అందులోనూ, విద్యార్హతలతో నిమిత్తం లేకుండా చూసినా టీచర్-విద్యార్థి నిష్పత్తి సగటున 1:28 గా ఉండింది. 171 కాలేజీల్లో ఆ నిష్పత్తి 1:51 గా ఉందంటే దుస్థితిని తేలిగ్గానే అంచనా వేయొచ్చు! వేతన సంఘం సిఫారసుల ప్రకారం టీచర్లకు వేతనాలిచ్చారా? అనేది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేని సదుపాయాలు ఉన్నట్టు 58 కాలేజీలు సుప్రీంకోర్టుకు, 11 కాలేజీలు హైకోర్టుకు నిర్లజ్జగా తప్పుడు అఫిడవిట్లు ఇవ్వడం వారి విచ్చలవిడితనాన్ని స్పష్టం చేసింది. మధ్య, అల్పాదాయ బడుగు జీవుల పిల్లలకూ ఉన్నత విద్య లభించాలనే ఉదాత్త ఆశయంతో తలపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొట్టడానికే పుబ్బలో పుట్టి మఖలో మూతపడ్డ కాలేజీలూ ఉన్నాయి. అఖిల భారత స్థితేమీ గొప్పగా లేదు! ప్రపంచం నాగరికత కోసం అలమటిస్తున్నపుడు, పదిహేను వందల సంవత్స రాల కిందటే నలంద, తక్షశిల, విక్రమశిల వంటి పేరెన్నిక గన్న విశ్వవిద్యాల యాలు నెలకొల్పి, విశ్వవిద్యకు బీజం వేసిన నేల ఇది. ఇటీవలి కాలం వరకూ భారతదేశానికి చెందిన ఐఐటి వంటి విద్యా సంస్థలు ప్రపంచంలోని పది మేటి విద్యాసంస్థల్లో ఉండేవి. కానీ, ఇటీవల వెలువరించిన ఓ తాజా అధ్యయన నివేదిక ప్రకారం ప్రపంచంలోని తొలి 200 విశ్వవిద్యాలయా ల్లోనూ భారత్‌కు చోటు దక్కలేదు. 2014-15కుగాను ప్రపంచ విశ్వవిద్యాల యాలు, తత్సమాన విద్యా సంస్థలకు ర్యాంకులిస్తూ ‘టైమ్స్’ ఉన్నత విద్య విభాగం ఈ నివేదికను వెల్లడించింది. దేశానికి చెందిన 2 సంస్థలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలకు మాత్రం 276 నుంచి 300 స్థానాల్లో చోటు దక్కింది. ఐఐటీ-ముంబాయి, ఐఐటీ-రూర్కీలకు 351 నుంచి 400 ర్యాంకుల్లో స్థానం దక్కింది. మొదటి 10 స్థానాల్లో 7 (మొదటి 200లలో 74 స్థానాలు) దక్కించుకొని అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి పదిలో మిగతా 3 స్థానాలు బ్రిటన్ విశ్వవిద్యాలయాలకు దక్కాయి. ఇక ‘బ్రిక్స్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో 2014-15 కోసం విడిగా మరో అధ్యయనం జరిగింది. ఇందులో కూడా భారత్‌కు ఆశించదగ్గ ఫలితాలు కనిపించకపోవడం హెచ్చరిక లాంటిదే! తొలి రెండు స్థానాలు చైనా విశ్వవిద్యాలయాలకు, మూడో స్థానం టర్కీ విద్యాసంస్థకు దక్కింది. వంద ర్యాంకుల్లో 25వ స్థానం మాత్రం మన బెంగళూరు ఐఐటీకి దక్కింది. ఆ పైన మరో పది సంస్థలు, ప్రధానంగా ఐఐటీలూ ఈ వందలో చోటు దక్కించుకున్నాయి. కేవలం ఈ ర్యాంకింగులే అన్నింటికీ ప్రామాణికం కాకపోవచ్చు. కానీ, మన దేశంలో ఉన్నత విద్యా రంగంలో దిగజారుతున్న ప్రమాణాలకు ఖచ్చితంగా ఇది స్పష్టమైన సంకేతమే! ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి! ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశంగా పరిశీలించినపుడు, మన ఉన్నత విద్యారంగం ఆందోళన కలిగించేలా ఉందనడం అతిశయోక్తి ఏం కాదు. 24 సంవత్సరాల లోపు వయస్కుల జనాభా, 2011 నాటికే దేశంలో 50 శాతాన్ని మించింది. ఈ ఒరవడి ఇంకా ఉధృతితో కొనసాగుతోంది. 2020 నాటికి పనిచేసే వయస్కులు (15-64 ఏళ్లు), మొత్తం జనాభాలో మూడింట రెండొంతులుగా ఉంటారని అంచనా. మారుతున్న ప్రపంచ మార్కెట్ స్థితి, ఐ.టి అవకాశాలు, విజ్ఞాన ప్రపంచ ఆవిష్కరణల నేపథ్యంలో పరిస్థితుల్ని భారత్ తనకు అనుకూలంగా మలచుకోవడానికి ఉన్నత విద్యా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఉన్నత విద్య స్థాయిలో, ముఖ్యంగా వృత్తి విద్య 70 శాతం వరకు ప్రయివేటు, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోనే ఉంది. లాభాపేక్షతో విద్యా సంస్థల్ని వ్యాపార దృక్పథంతో నడపడం వల్ల ప్రమాణాలుండటం లేదు. ఆర్థిక అసమానతల వల్ల అన్ని వర్గాల వారికి సమానావకాశాలుండటం లేదు. అర్హులైన బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్నత విద్యకు ప్రభుత్వం స్థూల వార్షికాదాయం (జీడీపీ)లో 0.37 శాతం నిధుల్ని మాత్రమే వెచ్చిస్తోంది. ఏ అభివృద్ధి చెందిన దేశంతో పోల్చి చూసినా ఇది చాలా నామమాత్రమే! ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అదే స్థాయిలో మూడో అతి పెద్ద ఉన్నత విద్యావ్యవస్థ కలిగిన దేశంగా గ్లోబలీకరణ సవాళ్లకు ఎదురొడ్డి, అవకాశాల్ని సానుకూలంగా మలచుకోవడానికి భారత్ సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా- 1. అవకాశం-విస్తరణ. 2. సమదృష్టి-కలుపుకొనిపోవడం. 3. నాణ్యత-ప్రపంచ ప్రమాణాలు- అన్న మూడంశాలకు ప్రాధాన్యత ఇచ్చి సత్వర సంస్కరణలు చేపడితేనే ఈ దేశంలో ఉన్నత విద్య బాగుపడుతుంది. ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
గోవిందా.. గోవిందా..
ఆక్రమణల చెరలో తిరుమలేశుని స్థలం రూ.3.5 కోట్ల విలువైన 15 సెంట్లలో పెట్రోల్ బంక్ నిర్వహణ కోర్టు ఆదేశించినా ఖాళీ చేయని వైనం స్వాధీనానికి టీటీడీ అధికారుల వెనుకంజ దేవుడే కదా మనం ఏమి చేసినా పట్టించుకోడులే... ఆయన వచ్చి అడగడు కదా... అయినా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న దేవదేవునికి రూ.5కోట్ల విలువైన స్థలం ఓ లెక్కా.. అని అనుకున్నారో ఏమో.. తిరుమలేశుని స్థలంలో తిష్టవేశారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినా వారి చెవికెక్కలేదు. వెంకన్నకు చెందిన స్థలంలో యథేచ్ఛగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. స్థలం స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టడంలేదు. విజయవాడ : అందరిని రక్షించే దేవదేవుడి ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిపై భక్తితో నగరానికి చెందిన దాతలు ఇచ్చిన భూములను కొందరు అక్రమంగా అనుభవిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. విద్యాధరపురంలో టీటీడీకి చెందిన స్థలంలో పెట్రోల్ బంక్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. నగరానికి చెందిన సామా రంగయ్య అనే వ్యక్తి తిరుమలేశునిపై భక్తితో 1940వ దశకంలో తన ఆస్తిలో కొంతభాగాన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చారు. దానధర్మాలు చేయడంలో సామా రంగయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన పేరుతోనే వన్‌టౌన్‌లో సామారంగ్ చౌక్ ఉంది. ఆయన టీటీడీకి ఇచ్చిన విరాళంలో విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం సెంటర్లో జాతీయ రహదారి పక్కన 2.30 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని ఆయన అప్పట్లోనే సర్వహక్కులతో టీటీడీకి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, అప్పటికే ఈ భూమిలో 15 సెంట్లను హెచ్‌పీ పెట్రోల్ బంకు నిర్వహణ కోసం 50 ఏళ్లపాటు సామా రంగయ్య లీజుకు ఇచ్చారు. లీజుకాలం ముగిసిన వెంటనే ఈ స్థలంపై కూడా సర్వహక్కులూ టీటీడీకి ఉంటాయని రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో ఆయన నమోదు చేశారు. సామా రంగయ్య కుమారులు సుబ్బారావు, సీతారామయ్య, రంగారావు, గోపి కూడా ఈ మేరకు టీటీడీకి సహకరించి తమ తండ్రి రాసిన విధంగా భూమిని అప్పగించారు. లీజు గడువు ముగిసినా... నిర్వాహకులు మారినా.. సామా రంగయ్య ఇచ్చిన లీజు గడువు ముగిసి 20 ఏళ్లు అవుతోంది. అయినా పెట్రోల్ బంకు నిర్వాహకులు మాత్రం ఈ స్థలాన్ని ఖాళీ చేయలేదు. నిరాటంకంగా పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బంక్ నిర్వాహకులు కూడా ఆరుగురు మారారు. తొలుత సామా రంగయ్య నుంచి రాజకుమారి థియేటర్ నిర్వాహకుడు ఖుద్దూస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆయన కొన్నేళ్లు పెట్రోల్ బంకు నిర్వహించారు. ఆ తర్వాత నగరానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఖుద్దూస్ నుంచి సబ్ లీజుకు తీసుకుని కొంతకాలం బంక్ నడిపారు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రవి అనే వ్యక్తి కొన్నేళ్లు ఈ బంక్‌ను నిర్వహించారు. ఆ తర్వాత హెచ్‌పీ కంపెనీ నిర్వహించింది. అప్పటికే లీజు గడువు ముగియడంతో టీటీడీ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, హెచ్‌పీ కంపెనీ కోర్టుకు వెళ్లింది. ఈక్రమంలో జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు టీటీడీకి అనుకూలంగా తీర్పు చెప్పాయి. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించాయి. అయితే జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత హెచ్‌పీ కంపెనీ పెట్రోల్ బంక్ లీజును గొల్లపూడికి చెందిన మరో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు అప్పగించింది. వారి నుంచి నెల రోజుల క్రితం శంకరరావు అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. కింది కోర్టులో టీటీడీకి తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ బంక్‌ను నిర్వహిస్తూనే ఎగువ కోర్టులకు వెళ్లి కాలం గడిపారు. చివరకు సుప్రీంకోర్టు కూడా గత నెలలో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి ఉత్తర్వులు జారీచేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టీటీడీ అధికారుల అలసత్వం... సామా రంగయ్య ఇచ్చిన 2.30 ఎకరాల భూమిలో ఈ 15 సెంట్లు మినహా మిగిలిన దానికి టీటీడీ అధికారులు గతంలోనే ప్రహరీ నిర్మించారు. పెట్రోల్ బంక్ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నెలరోజులు అయినా రకరకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ గజం రూ.50వేల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న స్థలం ధర రూ.3.5కోట్ల వరకు ఉంటుంది. ఈ స్థలంలో రూ.10 కోట్లతో వేంకటేశ్వరస్వామి దేవాలయం, అర్చకులకు క్వార్టర్సులను నిర్మించాలని టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు కూడా సిద్ధంచేసింది. అయితే, స్థలం స్వాధీనం కాకపోవడంతో ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి స్థలం స్వాధీనం చేసుకుని స్వామి సేవకు వినియోగించాల్సిన అవసరం ఉంది. -
సబ్ ప్లాన్ రాకుంటే ఆకలి చావులే!
ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీకరణ జరిగి, లాభసాటి కాగానే దానిని సంపన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి. అనాదిగా సంపద సృష్టికి, సమాజ మనుగ డకు కారణభూతులైన చేతివృత్తులు, కులవృ త్తుల వారి మనుగడ ఈ రోజు ప్రశ్నార్థకమైం ది. 1992 నాటి సరళీకృత ఆర్థిక విధానాల తరువాత, ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పరి శ్రమలు రావడంతో దాదాపు 42 కులవృ త్తులు పూర్తిగా కుదేలయి వాటిని నమ్ముకున్న కులాలు విలవిలలాడుతున్నాయి. ప్రపంచం శరవేగంతో ముందుకు పోతు న్నది. ఈ సందర్భంలో కులవృత్తులు, చేతి వృత్తుల స్థానంలో యాంత్రీకరణ, కంప్యూటీ కరణ, కార్పొరేటీకరణ జరగడాన్ని వ్యతిరేకిం చనవసరం లేదు. పాత వ్యవస్థ కొనసాగాలని కోరడం సబబు కాదు. కాని ఇంతవరకు ఈ వృత్తులనే నమ్ముకుని, సమాజ మనుగడకు కారణభూతులైన కోట్లాది మందికి ప్రత్యా మ్నాయ ఉపాధి చూపవలసిన బాధ్యత ప్రజా స్వామ్య ప్రభుత్వంపై ఉంది. వృత్తి యాంత్రీక రణ జరిగి, లాభసాటి కాగానే దానిని సం పన్న పారిశ్రామిక వర్గాల చేతిలో పెట్టడం ధర్మమా? దీనికి ఒక విధానం ఉండాలి. ప్రపంచ దేశాలు ఆధునికీకరణ చెందే క్రమంలో ఆయా ప్రభుత్వాలు అన్ని వర్గాలను ఆ మార్పులకు భాగస్వాములను చేస్తున్నా యి. అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు అం దిస్తున్నాయి. దాదాపు 40 దేశాలలో వచ్చిన పురోగతి అన్ని వర్గాలకు సమంగా చేరింది. మన దేశంలో ఆ సమతుల్యత కానరాదు. బట్ట ల మిల్లులు, ఫ్యాక్టరీలు న్యాయబద్ధంగా చేనే త కార్మికులకు; డిస్టిలరీలు, బ్రేవరీస్, వైన్‌షా పులు గీత కార్మికులకు చెందాలి. అలా జరగ డంలేదు. చేపల చెరువులు, రొయ్యల చెరు వులు మత్స్యకారులకు కేటాయించడంలేదు. ఇవన్నీ పారిశ్రామిక వర్గాల వశమై, వృత్తులు కోల్పోయిన వారు ఆకలి చావులు చస్తున్నారు. 54 శాతం ఉన్న చేతివృత్తులు, కులవృత్తుల వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవ డం ఉచిత సహాయమని ప్రభుత్వం భావించరాదు. మానవ వనరులను సద్వినియోగం చేస్తున్నా మనే కోణంలో చూడాలి. ఈ అంశంలో ప్రభుత్వ విధానాలు మొక్కుబడిగా ఉంటే మంచిది కాదు. ఫెడరే షన్ల ద్వారా లబ్ధిదారులకు ప్రస్తుతం ఒక్కొ క్కరికి కేవలం 5 వేల రూపాయలు మంజూరు చేస్తున్నారు. దీనితోనే అభివృద్ధి చెందగలరా? కార్పొరేటీకరణ నేపథ్యంలో రజకులకు ఒక్కొ క్కరికి 5 వేలు మంజూరు చేస్తే ‘డ్రైక్లీన్ షాప్’ ఎలా పెడతారు? కాబట్టి 17 ఫెడరేషన్ల వారికి ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తే తప్ప, వృత్తిలో యాంత్రికీకరణ సాధించలేరు. 20 వేల కోట్ల బడ్జెట్‌తో సబ్‌ప్లాన్ ప్రకటించాలని బీసీ సంక్షే మ సంఘం ముఖ్యమంత్రితో నాలుగు దఫా లు చర్చించింది. కుల, చేతివృత్తులకు ప్రత్యా మ్నాయ ఉపాధి, రోడ్లపాలైన 124 కులాల వారికి బీసీ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లిం కు లేకుండా రుణాలు మంజూరు చేయడం. కులవృత్తులను ఆధునీకరించి, కార్పొరేట్ స్థాయిలో పోటీ పడి నడిపించడానికి వృత్తిని బట్టి ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేయడం, ఫీజుల రియింబర్స్‌మెంట్ పథకానికి పెట్టిన షరతు లను తొలగించడం, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ తదితర కోర్సుల వారికి పూర్తి ఫీజులు మంజూరు, రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 244 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీసీ రెసిడెన్షి యల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు మం జూరు చేయడం. పాఠశాల స్థాయి విద్యా ర్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ స్కీమును పునరుద్ధరించి ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున స్కాలర్షిప్ 10 నెలలపాటు ఇవ్వ డం వంటి డిమాండ్లను బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వం ముందు ఉంచింది. అన్ని రంగా లలో శాఖల వారీగా బీసీ జనాభా ప్రకారం సబ్ ప్లాన్‌కు 50 శాతం బడ్జెట్ కేటాయించా లని కూడా సంఘం కోరుతోంది. ఈ డిమాం డ్లతోనే కలెక్టరేట్లు ముట్టడి జరిగింది. దీనితో నలుగురు మంత్రుల ఉపసంఘం వేశారు. కానీ ఇంకా ఏమీ తేలలేదు. ఇందిరమ్మ ఇళ్లు, సబ్సిడీ బియ్యం, ఆహార భద్రత, అభయ హస్తం, బంగారు తల్లి లాంటి పధకాలతో వారి బతుకులు బాగుపడవు. ఎప్పుడూ చేత లు చాచేవిగానే మిగిలిపోతాయి. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలకే ఉపయోగపడతాయి. 66 ఏళ్ల స్వాతంత్య్రంలో ఈ కులాలను ప్రభు త్వాలు ఇలాగే మోసగిస్తున్నాయి. బీసీ కులాల సమగ్రాభివృద్ధికి సత్వరం స్పందించవలసిన సమయమిది. - ఆర్.కృష్ణయ్య అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం -
కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: కళ్లెదుటే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కబ్జాదారుల నుంచి కాసులు తీసుకుని చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములును కాపాడాల్సిన రెవెన్యూ అధికారులే అండగా నిలుస్తుండడంతో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళుతున్నాయి. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించే వరకూ విశ్రమించని అధికారులు.. బడాబాబులు, రాజకీయ నేతల అనుచరులు కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఖమ్మం నగరానికి కార్పొరేషన్ హోదాతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. తమ పలుకుబడి, డబ్బు వెదజల్లి అక్రమార్కులు అందినంత దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి, పరిరక్షించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ బృందం వద్ద సరైన ఆధారాలు లేకపోవడంతో పలు ప్రాంతాలలో రెవెన్యూ భూములను గుర్తించలేకపోతున్నారని తెలుస్తోంది. భూ ఆక్రమణలకు సంబంధించి కొన్ని వివరాలిలా ఉన్నాయి... ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం రెవెన్యూ పరిధిలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రానైట్‌కు లీజుకు తీసుకున్నారు. అయితే పక్కనే ఉన్న మరో 20 ఎకరాలపైనా అక్రమార్కుల కన్ను పడింది. దీంతో రెవెన్యూ యంత్రాంగానికి కాసుల ఎరచూపించి ఆ భూమిలోనూ గ్రానైట్ రాళ్ల తవ్వకం ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ నిర్మాణ సమయంలో ఎన్నెస్పీ క్వార్టర్లు ఏర్పాటు చేసిన స్థలంతో పాటు కాలువ పక్కన ఉన్న భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఎన్నెస్పీ పరిధిలో ఉన్న స్థలాల్లో చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. కబ్జాదారులు ఆ భూమిని ఆక్రమించి ప్లాట్లు చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో కాలువ పక్కన పట్టణానికి సమీపంలో ఆ భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని మరీ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా మిన్నకుండా ఉండటంతో ఈ ఆక్రమణలకు అంతులేకుండా పోతోంది. ఖమ్మం రూరల్ మండలం కైకొండాయిగూడెం రెవెన్యూ పరిధిలోని 223 సర్వే నంబర్లో గల 3 ఎకరాల 2 కుంటల ప్రభుత్వ భూమిని మరో సర్వే నంబర్ పేరుతో విక్రయించేందుకు రియల్ వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం రెవెన్యూ పరిధిలోని కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూమిని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించారని పలుమార్లు ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు మాత్రం ఆ భూమిని సర్వేచేసి ఆక్రమణలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెపుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి సర్వే చేసిన దాఖలాలు లేవు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్‌లో సుమారు 300 గజాల భూమిని ఆక్రమించి నిర్మాణం చేపట్టినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగానే వ్యవహరించారు. ఖమ్మంలో కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురువుతున్నాయి. ఈ భూములను కొందరు అధికార పార్టీకి చెందిన నేతలే కబ్జా చేశారు. ఇది తెలిసినా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పాటు కాసుకులకు కక్కుర్తి పడే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికార, ప్రతిపక్ష నేతలు ఆక్రమించుకున్నారంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించినా.. నేతలకు తలొగ్గి వెనుదిరిగారనే విమర్శలున్నాయి. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలో కేంద్రియ విద్యాలయం వద్ద 137 సర్వే నంబర్లో సుమారు 200 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గొల్లగూడెం పంచాయతీ పరిధిలో కోట్ల రూపాయల విలువ గల చెరువును సైతం ఆక్రమించి ప్లాట్లుగా మార్చారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు, తెల్దారుపల్లి గ్రామాల సరిహద్దులో ఉన్న సుమారు మూడెకరాల ప్రభుత్వ భూమిని కొందరు రియల్ వ్యాపారులు చదును చేశారు. దీనికి ఎన్ఓసి తెచ్చేందుకు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.