ప్రభుత్వ భూమి కప్పేసి వేసిన రోడ్డు
గంట్యాడ(విజయనగరం జిల్లా): పై ఫొటోలో కనిపిస్తున్న రోడ్డు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత ప్రభుత్వ భూమిని కప్పేసి వేసింది. సిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 108/1లో 22 సెంట్లను టీడీపీ నేత ఆక్రమించి తన ఆరు ఎకరాల మామిడి తోటకు వెళ్లేందుకు రోడ్డు నిర్మించుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయం 2017–18వ సంవత్సరంలో అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని టీడీపీ నేత ఈ రోడ్డు వేశారు. రెవెన్యూ అధికారులు కూడా సదరు నేత మండల స్థాయి నాయకుడు కావడంతో చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీనిపై సిరిపురం గ్రామస్తులు కొంతమంది అప్పట్లో రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. అలాగే అదే నేత ఇదే గ్రామ రెవెనూ పరిధిలోని సర్వే నంబర్ 89/1 లో కూడా తన పొలాలకు వెళ్లేందుకు సాగునీరందించే చెరువులో కూడా రోడ్డు వేసేశాడు.
చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు..
టీడీపీ నేతపై అమిత ప్రేమ
టీడీపీ అధికారం కోల్పోయి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ నేతపై అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే ఆక్రమణకు గురైనప్పటికీ కళ్లుండి కూడా ఏమీ కానరానట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు కీలకపాత్ర టీడీపీ నేత ప్రభుత్వ భూమి ఆక్రమించి వేసిన రోడ్డును తొలగించకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీనేతకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
విచారణ చేసి చర్యలు
గతంలో కూడా ఈ రోడ్డుపై ఫిర్యాదులు వచ్చాయి. ఆఫైల్స్ కూడా బయటకు తీయించి విచారణ చేస్తాం. ప్రభుత్వ భూమిని అక్రమించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
-ప్రసన్న రాఘవ, తహసీల్దార్, గంట్యాడ
Comments
Please login to add a commentAdd a comment