జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ
హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ హెచ్చరించారు. పెద్దఅంబర్‌పేట నగర పంచాయితీ పరిధిలోని పలు వివాదాస్పద భూములను గురువారం ఆయన సందర్శించారు. తట్టిఅన్నారంలోని జంగారెడ్డికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో రోడ్డు నిర్మించారని, పెద్దఅంబర్‌పేటలో సర్వే నం-64లోని వెంకటయ్యకుంట కబ్జాకు గురవుతోందని ఫిర్యాదు రావడంతో స్పందించిన జేసీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి సదరు ప్రాంతాలను సందర్శించారు. ఆయా చెరువులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తట్టిఅన్నారం జంగారెడ్డికుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు.
పెద్దఅంబర్‌పేట వెంకటయ్యకుంటకు పూర్తి హద్దులు ఏర్పాటు చేయాలని, ఎఫ్‌టీఎల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని సూచించారు. అనంతరం హయత్‌నగర్ మండలంలోని కోహెడలో పోలీసుశాఖ సమాచార టవర్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పెద్దఅంబర్‌పేటలోని సర్వే నం-64లోని ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు జేసీని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ యాదగిరిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ బీంప్రసాద్, డీఈ గోపాల్‌రెడ్డి, ఏఈ కనకలక్ష్మి, ఆర్‌ఐలు సుదర్శన్‌రెడ్డి, రవీంద్రసాగర్, సర్వేయర్ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
మీడియాపై చిర్రుబుర్రులు..
జేసీ సందర్శించిన విషయాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై జేసీ మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా అధికారులు అడ్డుచెప్పారు. పర్యటన వివరాలను మీడియాకు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..
జవహర్‌నగర్: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్‌సైనీ హెచ్చరించారు. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములు, అధికారులు నిర్వహిస్తున్న క్రమబద్ధీకరణ సర్వేను గురువారం సాయంత్రం ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, శామీర్‌పేట తహసీల్దార్ దేవుజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న క్రమబద్ధీకరణ జీవో 58,59 సర్వేను పరిశీలించి దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరి ఇళ్లను గుర్తించాలని, సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవినాయక్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు
Published Fri, Mar 13 2015 12:13 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement