revenue officials
-
రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడి
సాక్షి, అన్నమయ్య జిల్లా: కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులకు కూడా రక్షణ కొరవడింది. మదనపల్లి పట్టణం దేవతా నగర్లో ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. కొడవలితో నరికేందుకు యత్నించారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావుపై కొడవలితో దాడి చేసేందుకు యత్నించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు మొబైల్ ఫోన్,విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్ మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో డ్రైవర్ గణేష్ గాయపడ్డారు. ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని అధికారులు కోరారు. ఈ ఘటన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రి రావు, వీఆర్వో ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. -
బాబు సర్కార్ 'బరితెగింపు'
కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదువిజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడి గ్రామంలోని శ్రీముకికృష్ణంరాజు చెరువు ఆయకట్టు సంఘం ఎన్నికను శనివారం నిర్వహించారు. కూటమి మితృత్వంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరు డైరెక్టర్లలో ఒకటి బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయకట్టుకు చెందిన గొలజాం బీజేపీ నాయకుడు కోన మోహన్‌రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆయనను నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో పట్టించుకోలేదు. మిగిలిన ఐదు డైరెక్టర్లకు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వెను వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతలు మాత్రమే విజయం సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం బరితెగించింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ దౌర్జన్యకాండకు దిగింది. రెవిన్యూ అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాష్ట్రంలో సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను చేజిక్కించుకోవడానికి అరాచకాలకు తెరలేపింది. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇతర పార్టీల మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా రెండు మూడు రోజులుగా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దుర్నీతికి నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. దీంతో అధికార కూటమి నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది. జి.పెదపూడిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి సాగునీటి సంఘం ఎన్నికలో పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించిన అభ్యర్థిని రైతులు వ్యతిరేకించి.. సూర్య వెంకట కృష్ణారావును గెలిపించుకున్నారు.ఎటు చూసినా అరాచకమే..⇒ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని మాపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్‌కు తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ⇒ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా.. ‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు. పార్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసుగా ప్రవర్తిస్తున్న సీసీఎస్ సీఐ ఇబ్రహీం ఇది చేతకాని దద్దమ్మ రాజకీయంనిప్పులు చెరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కడప (కార్పొరేషన్)/పులివెందుల రూరల్: వైఎస్సార్ జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి అప్రజాస్వామ్యంగా జరిగాయని, ప్రభుత్వం చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన మాటలు పిట్టలదొరను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజులుగా ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. రైతులెవరైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. నీటి బకాయిలు లేనట్టు వీఆర్వో నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అని, ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన వీఆర్వోలందరినీ మండల కార్యాలయాలకు తరలించి జైల్లో ఖైదీల్లా బంధించారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు బీటెక్ రవికి చొక్కా, ప్యాంటు విప్పి నిలబెట్టేవారని హెచ్చరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపే ధైర్యం, తెగువ వారికి ఉన్నాయా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదనే ‘నో డ్యూ సర్టిఫికెట్లు’ ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టే చేతగాని దద్దమ్మలు ఎవరో అందరికీ తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికల కవరేజీకి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ‘1978 నుంచి ఉన్న మా ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాడట. ఓసారి మొహం అద్దంలో చూసుకో. జమ్మలమడుగులో వీఆర్వోలందరినీ వాహనంలో ఎక్కించి దేవగుడిలో బంధించారు. ఓడిపోతామనే భయం వల్లే కదా? వీటికి ఎన్నికలని పేరుపెట్టి గెలుపు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి’ అని రవిపై ధ్వజమెత్తారు. కాగా, ఎంపీ అవినాశ్‌రెడ్డిని శనివారం (రెండో రోజు) కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
మహబూబ్ నగర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
-
మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
సాక్షి, హైదరాబాద్: ‘ఒక జిల్లాలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి. కానీ, గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి... లేదంటే నేనే సస్పెండ్ చేస్తా’అని శనివారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల వైఖరిలో మార్పు రావాలని, 10 రోజుల్లో సరైన పద్ధతిలో ధరణి దరఖాస్తులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అదేవిధంగా దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెట్టవద్దని, వీలున్నంత మేర ఆన్లైన్లోనే దరఖాస్తులు డిస్పోజ్ చేయాలని, మాన్యువల్ రికార్డు లేదంటూ ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లతో రెండు విడతల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ఎన్ఆర్ఐ పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, డేటా కరెక్షన్లు, నిషేధిత జాబితాలోని భూములు, కొత్త పాసు పుస్తకాల జారీ, నాలా, ఖాతాల విలీనం తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై మిత్తల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గత 15 రోజుల్లో... ధరణి దరఖాస్తుల పురోగతిపై ఈనెల 14న నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నాటికి గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దరఖాస్తులు పరిష్కారయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,779 దరఖాస్తులు, నల్లగొండలో 2,120, సిద్ధిపేటలో 1,880, నాగర్‌కర్నూల్‌లో 1,800 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 100 దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదు. భూపాలపల్లిలో 65, సిరిసిల్లలో 97, కొత్తగూడెం జిల్లాలో 144 దరఖాస్తులు మాత్రమే గత 15 రోజుల వ్యవధిలో పరిష్కారమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.50 లక్షలు తహశీల్దార్ల వద్దనే.. 15 రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కార పురోగతి ప్రక్రియను పరిశీలిస్తే మొత్తం 2,59,404 దరఖాస్తులకుగాను 24,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2.34 లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ దరఖాస్తులు తహశీల్దార్ల వద్దనే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60 శాతం అంటే 1.48 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ఆర్డీవోల వద్ద మరో 20 శాతం అంటే 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోనే మిత్తల్ కలెక్టర్ల సమావేశంలో తహశీల్దార్లు, ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంమీద అదనపు కలెక్టర్ల వద్ద 20వేల పైచిలుకు, కలెక్టర్ల స్థాయిలో 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 21,693 ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 1,410, భూపాలపల్లిలో 1,826 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. పెండింగ్ దరఖాస్తులు ఏ స్థాయిలో ఎన్ని? తహశీల్దార్ల వద్ద: 1,48,182 ఆర్డీవోల వద్ద: 53,478 అదనపు కలెక్టర్ల వద్ద: 20,461 కలెక్టర్ల వద్ద: 12,505 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 2,34,626 -
కృష్ణానది ఏటిపాయలో ప్రమాదం
పెనమలూరు: మిత్రులంతా కలసి సరదాగా మద్యం సేవించి ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం ఘాట్ కృష్ణానదిలో చోటుచేసుకుంది. పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్‌నగర్‌లోని జారా రెస్టారెంట్ యజమాని అబ్దుల్‌రహీంబాషా (34) గురువారం రాత్రి తాను కొత్తగా కొన్న ఏపీ 39 ఆర్క్యూ 0786 కారులో విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన మిత్రులు ఈవెంట్స్ నిర్వహించే షేక్ ఖలీషా అలియాస్ పండు (30), కస్తూరిబాయిపేటకు చెందిన తాళ్లూరి కిరణ్ (37)తో కలిసి గురువారం రాత్రి చోడవరం ఘాట్ వద్దకు వచ్చారు. వీరు ఘాట్ సమీపంలో కృష్ణానది పాయ వద్ద మద్యం సేవించారు. ఆ తరువాత ముగ్గురు కృష్ణానదిలో ఈతకు దిగారు. ఈతకు దిగిన ముగ్గురు నదిలో గల్లంతయ్యారు. ఉదయం వెలుగు చూసిన ఘటన.. కాగా శుక్రవారం ఉదయం నదిలో చేపలు పట్టడానికి వచ్చిన వ్యక్తులకు నది పాయవద్ద ఖరీదైన కారు, మద్యం సీసాలు, దుస్తులు కనబడ్డాయి. వారికి అనుమానం వచ్చి నదిలో చూడగా అప్పటికే ఖలీషా మృతదేహం నదిలో తేలుతూ కనబడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి కారు వివరాలు మహిళా సంరక్షణ కార్యదర్శుల వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. గ్రూపుల్లో ఈ సమాచారం వ్యాపించడంతో కారు యజమాని అబ్దుల్‌రహీంబాషా వివరాలు తెలిశాయి. దీంతో కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకున్నారు. నది ఒడ్డున ఉన్న దుస్తులు, చెప్పులు చూసి తమ వారేనని ధ్రువీకరించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. నీటిలో తేలుతున్న ఖలీషాను ఆ తరువాత వీరి గాలింపులో కారు యజమాని రహీంబాషా మృతదేహాన్ని బయటకు తీశారు. గల్లంతైన కిరణ్ ఆచూకీ తెలియలేదు. గల్లంతైన కిరణ్ కోసం శనివారం నదిలో గాలిస్తామని అధికారులు తెలిపారు. -
సారా మరణం కాదు.. అనారోగ్యంతో చనిపోయాడు
ఉండి: పశ్చిమ గోదావరి జిల్లాలో సహజ మరణాలను నాటు సారా మరణాలంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మరోసారి రూఢి అయింది. మొన్న జంగారెడ్డిగూడెంలో పైడేటి సత్యనారాయణ మరణాన్ని సారా మరణంగా చిత్రీకరించి టీడీపీ నానా హంగామా చేసింది. అయితే, తమ తండ్రికి అసలు మద్యం అలవాటే లేదంటూ సత్యనారాయణ కుమారుడు, కుమార్తె స్పష్టంగా చెప్పడంతో పచ్చ బ్యాచ్ ఖంగుతింది. ఇప్పుడు ఉండి మండలం ఉణుదుర్రుకు చెందిన బొంతు అప్పారావు మరణాన్ని కూడా టీడీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అప్పారావు నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కొన్ని పత్రికల్లో వచ్చిన ఈ కథనాలపై రెవెన్యూ అధికారులు అప్పారావు కుటుంబీకులను విచారించగా, అదంతా ఉత్తి అబద్ధమేనని తేలింది. అప్పారావు అనారోగ్యంతో చనిపోయాడని తేటతెల్లమైంది. గురువారం ఉణుదుర్రుకు వెళ్లి అప్పారావు భార్య పర్లమ్మ, కుమారుడు అప్పన్నతో మాట్లాడినట్లు డిప్యూటీ తహసీల్దార్ వీరాస్వామినాయుడు చెప్పారు. ఈ నెల 2న అప్పారావు, మరికొందరు మినప కోతలకు గుడివాడ వద్దనున్న పతిపర్రు వెళ్లారన్నారు. 11న అప్పారావు కడుపునొప్పితో గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, అయినా తగ్గకపోవడంతో 12వ తేదీ ఉదయానికి ఉణుదుర్రుకు వచ్చాడని తెలిపారు. అదేరోజు అప్పారావును తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 12వ తేదీ రాత్రి 8 గంటలకు ఏలూరుకు తరలించారన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించినా అప్పటికే అప్పారావు ఆరోగ్యం విషమించడంతో రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారని డిప్యూటీ తహసీల్దార్ చెప్పారు. కుటుంబీకుల వద్ద తీసుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. నా తండ్రి అనారోగ్యంతో మరణించాడు బొంతు అప్పారావు అనారోగ్యంతోనే చనిపోయాడని ఆయన కుమారుడు అప్పన్న చెప్పారు. తన తండ్రి నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడం చాలా బాధాకరమని అన్నారు. ‘నా తండ్రి మినప కోతలకు వెళ్ళి అనారోగ్యం పాలయ్యాడే తప్ప నాటుసారా తాగి కాదు. ఆయన, గ్రామానికి చెందిన మరికొందరు ఈ నెల 2న గుడివాడ వద్ద గల పతిపర్రుకు మినప కోతలకు వెళ్ళారు. ఈ నెల 11న నాన్నకు యూరిన్ బ్లాడర్ సమస్యతో కడుపునొప్పి వచ్చిందని అక్కడ వైద్యం చేయించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మా గ్రామస్తుని సహకారంతో 11వ తేదీ రాత్రి బయల్దేరి 12వ తేదీ ఉదయానికి ఇంటికి వచ్చారు. ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. యూరిన్ పూర్తిగా బంద్ కావడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకువెళ్లాం. అయితే చికిత్స పొందుతూ వెళ్లిన కొద్దిసేపటికే మా నాన్న చనిపోయారు. ఆయన మరణాన్ని ఇలా రాజకీయం చేసి మమ్మల్ని అల్లరిపాలు చేయడం చాలా బాధగా ఉంది’ అని అప్పన్న చెప్పారు. – బొంతు అప్పారావు కుమారుడు అప్పన్న -
తిరుపతిలో టీడీపీ నేత చదలవాడ రౌడీయిజం
-
రూ.500 కోట్ల స్థలం కబ్జా.. అధికారులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులు
తిరుపతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ.. దౌర్జన్యకాండకు దిగాడు. కబ్జా స్థలం పరిశీలనకు వెళ్లిన రెవిన్యూ అధికారులను బెదిరించారు. స్థలంలో అడుగుపెడితే కొడతామంటూ హెచ్చరించాడు. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశాడు. తన వెనుక పదివేల మంది జనం ఉన్నారంటూ చదలవాడ బెదిరింపులకు దిగాడు. రేణిగుంట రోడ్డులో చదలవాడ కృష్ణమూర్తి 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఆ స్థలం విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. -
మాజీ సైనికుడికి గౌరవం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికుడికి నిబంధనల మేరకు భూమి కేటాయించినా రెవెన్యూ అధికారులు అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు యుద్ధాల్లో పాల్గొన్న సైనికుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా భూమి కేటాయించి సైట్ ప్లాన్‌తోపాటు అప్పగించాలని గత జూన్ 15న ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడింది. రెండు వారాల్లో భూమి అప్పగించకపోతే రూ.25 వేలు జరిమానాగా పిటిషనర్‌కు చెల్లించాల్సి వస్తుందని తమ ఆదేశాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో, రూ.25 వేలు పిటిషనర్‌కు చెల్లించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. మరో రెండు వారాల్లో కూడా భూమి అప్పగించకపోతే రూ.50 వేలు పిటిషనర్‌కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమకు 4 ఎకరాల భూమిని రెండు వారాల్లో అప్పగించాలన్న ధర్మాసనం ఆదేశాలను అమలు చేయలేదంటూ వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణరెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపు ప్రక్రియ తుది దశలో ఉందని, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ నివేదించారు. మరో రెండు వారాల సమయం ఇస్తే భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతోపాటు భూమిని అప్పగిస్తామని పేర్కొన్నారు. విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. -
మల్లన్నసాగర్ ముంపు ఇళ్ల కూల్చివేతలో విషాదం
కొండపాక(గజ్వేల్): మల్లన్నసాగర్ ముంపు గ్రామ మైన ఎర్రవల్లిలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టిన క్రమంలో విద్యుత్ స్తంభం కూలి మీద పడటంతో ఓ యువకుడు మృతి చెందారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక, తొగుట మండలాల సరిహద్దులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి ఆదివారం తెల్లవారుజామున గోదావరి నీటి తరలింపునకు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడుకాకుండా ఇళ్లు కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముట్రాజ్‌పల్లి శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్లల్లో ఉంటున్న బాధితులు విషయం తెలుసుకొని శనివారంరాత్రి ఎర్రవల్లికి వచ్చి తమ ఇళ్లల్లోని సామాన్లను సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆరె కనకరాజు(28) తన ఇంట్లోంచి సామాన్లను బయటకు తీస్తుండగా ఆ పక్కనే ఇంటిని కూల్చివేస్తున్న జేసీబీ సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా తగిలింది. దీంతో కరెంట్ తీగలు తెగిపోయి కనకరాజుపై స్తంభం పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే కనకరాజును అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యు లు ధ్రువీకరించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చి వేత పనులెలా చేపడతారంటూ ఉస్మా నియా ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కనకరాజు కుటుంబానికి రూ.20 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అధికారులు హామీనిచ్చే వరకు పోస్టుమార్టం చేయనివ్వబోమంటూ పట్టుబట్టారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధితకుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ హామీనివ్వడంతో శాంతించారు. మృతుడికి రెండు న్నరేళ్ల కూతురు ఉంది. భార్య శ్యామల 4నెలల గర్భవతి. ఎర్రవల్లిలో నేలమట్టమైన ఇళ్లు ఎర్రవల్లిలో విషాదం ఎర్రవల్లికి చెందిన ఆరె నర్సయ్య– లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నర్సయ్య చిన్న కుమారుడే కనకరాజు. వారికున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలే పండటంతో కనకరాజు బతుకుదెరువు కోసం హైదరబాద్‌కు వెళ్లాడు. ఊరు ముం పునకు గురవుతుందని తెలుసుకున్న ఇటీవల తిరిగి ఎర్రవల్లికి చేరుకొని కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. -
టీడీపీ కబ్జాపై కొరడా!
అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు. ప్రహరీలు కట్టేసుకున్నారు. కబ్జాదారుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే కావటంతో అప్పటి ప్రభుత్వం అవేమీ చూడనట్లే నటించింది. దీంతో వారు చెలరేగిపోయారు. కానీ ప్రభుత్వం మారింది. సర్కారు భూముల్ని తిరిగి స్వా«దీనం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఏడాదిగా కొరడా ఝుళిపిస్తోంది. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదంటూ... దాదాపు రూ.4,300 కోట్ల విలువైన భూముల్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. దీంతో ఉత్తరాంధ్ర టీడీపీ త్రయం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు విషప్రచారానికీ వెనకాడటం లేదు. దీనికి తోడు ఎల్లో మాఫియా... రోజుకో రకం అసత్య ప్రచారాలకు దిగుతోంది. సాక్షి, విశాఖపట్నం: ఇవి ప్రభుత్వ భూములు. ఎందుకంటే రికార్డులు అబద్ధాలు చెప్పవు!. అందుకే వాటిని ప్రభుత్వం తిరిగి తన అదీనంలోకి తీసుకుంటోంది. మరి ఇప్పటిదాకా ఇవి ఎవరి అదీనంలో ఉన్నాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలిస్తే... టీడీపీ నేతలు ఎంతటి ఘనులో అర్థమయిపోతుంది. తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఎంతటి అర్థం లేనివో, ఎందుకింత కడుపుమంటతో రగిలిపోతున్నారో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే గాజువాక నియోజకవర్గంలో మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువుల కబ్జాలో ఉన్న రూ.669.26 కోట్లు విలువైన 38.45 ఎకరాల్ని రెవెన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూముల్ని పల్లా సోదరుడు శంకరరావు, ఇతర బంధువులు ఆక్రమించుకోవటమే కాక... వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చేసి కోట్లు సంపాదిస్తున్నారు. దీంతో వీటిని తిరిగి స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ఉన్న నిర్మాణాలను తొలగించారు. పల్లా భూకబ్జాలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గాజువాక మండలం తుంగ్లాం రెవెన్యూ పరిధిలోని ఆటోనగర్ ఎఫ్ బ్లాక్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు నెలన్నరపాటు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ అనంతరం పల్లా సోదరుడు శంకరరావు గాజువాక మండలం తుంగ్లాం, జగ్గరాజుపేట, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో 38.45 ఎకరాలను కబ్జాచేసినట్లు గుర్తించారు. 15 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూములను ఆధీనంలో ఉంచుకుని వీటిని హెచ్‌పీసీఎల్, ఎల్అండ్టీ, మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు లీజులకిచ్చి భారీగా ఆర్జించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు నివేదిక అందటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీవో పి.కిశోర్, గాజువాక తహసీల్దార్ లోకేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు ఆదివారం ఆక్రమిత భూముల స్వా«దీన ప్రక్రియను చేపట్టారు. శంకరరావుకు నోటీసులిచ్చిన అనంతరం నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. పల్లా అనుచరులు అక్కడికి వచ్చి కొంత హడావుడి చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపు చేశారు. గతంలో ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ సిబ్బంది(ఫైల్) 430.81 ఎకరాలు.. రూ.4,291.41 కోట్లు విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల సంరక్షణపై జిల్లా రెవిన్యూ అధికారులు ఏడాదికాలంగా చర్యలు చేపట్టారు. కబ్జాదారులు ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ విధానం మేరకు.. ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేసి రికార్డుల పరంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా రూ.4,291.41 కోట్లు విలువ చేసే 430.81 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క విశాఖ రూరల్ మండలంలోనే అత్యధికంగా రూ.1,691 కోట్ల విలువైన భూముల్ని స్వా«దీనం చేసుకున్నారంటే కబ్జాదారులు ఏ స్థాయిలో చెలరేగిపోయారో అర్థంచేసుకోవచ్చు. అక్కడితో ఆగకుండా పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేశారు. స్వా«దీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల చేతుల్లో ఉన్నవే. తమ భూబాగోతం బయటపడటంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగారు. అచ్చెన్న, అయ్యన్న, బండారు ఏకంగా ఆక్రమణలు తొలగిస్తున్న అధికారుల్ని కూడా తిడుతూ శాపనార్థాలు పెట్టారు. ఐఎఎస్‌లు, రెవిన్యూ, పట్టణ ప్రణాళిక అధికారులు, పోలీసులపై నోటిదురుసుతనం ప్రదర్శించారు. టీడీపీ నేతల కబ్జా చెర నుంచి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న కొన్ని భూముల వివరాలు చూస్తే... – టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి గీతం విద్యాసంస్థల పేరుతో రుషికొండ, ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లో ఉన్న 18.53 ఎకరాల్ని ఆక్రమించి దాని చుట్టూ ప్రహరీ నిర్మించేశారు. అదేవిధంగా రుషికొండలో సర్వే నం. 34, 35, 37, 38లో 20 ఎకరా>ల్లో గార్డెనింగ్, గ్రావెల్ బండ్‌తో పాటు వివిధ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని గుర్తించిన అధికారులు 2020 అక్టోబర్ 24న అక్రమ నిర్మాణాల్ని తొలగించి.. స్వా«దీనం చేసుకున్నారు. – ఆనందపురం–శొంఠ్యాం సమీపంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా బంధువు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు సహా పలువురు టీడీపీ నేతలు టైటిల్ డీడ్ నం.1180లో ఆక్రమించుకున్న రూ.256 కోట్లు విలువ చేసే 64 ఎకరాల భూముల్ని గతేడాది నవంబర్‌లో స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో సుమారు 60 ఎకరాల భూమిని ఆక్రమించేసుకోగా.. గతేడాది డిసెంబర్లో రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ. 300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. – టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించిన రుషికొండ బీచ్‌రోడ్డులో సర్వే నం.21లో సుమారు రూ.3 కోట్లు విలువ చేసే 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. – టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన బంధువర్గం పేరుతో గాజువాక నియోజకవర్గంలో మూడు రెవిన్యూ గ్రామాల పరిధిలోని సుమారు రూ.669.26 కోట్లు విలువ చేసే 38.45 ఎకరాల్ని ఆదివారం రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. – టీడీపీ హయాంలో ప్రభుత్వ భూమిని ప్లే గ్రౌండ్‌గా మార్చి.. దర్జాగా కబ్జా చేసిన విశ్వనాధ విద్యాసంస్థల నుంచి ఆనందపురంలో సర్వే నంబర్ 122, 123లోని రూ.15 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమిని గతేడాది నవంబర్‌లో రెవిన్యూ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. -
ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను
ఇచ్ఛాపురం రూరల్: ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్నుపడింది. దానిని చదును చేసి.. ప్లాట్లుగా విభజించి విక్రయించాలన్న దురాలోచనతో పొక్లెయిన్‌తో రంగంగలోకి దిగాడు. అడ్డొచ్చిన వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ పరిధిలోని ఇన్నేశుపేట పొలిమేరలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో పాతికేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శీర పురుషోత్తం చెట్లు నాటి గ్రామస్తుల సహకారంతో ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేశాడు. ఆయనను స్థానికులు పూజారిగా పిలుచుకుంటారు. దీనికి పక్కనే ప్రభుత్వం విశ్రాంతి భవనం నిర్మించింది. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణంలో ఉంది. ఆ స్థలం పక్కనే బలరాంపురం గ్రామానికి చెందిన లండ సూర్యనారాయణ (బగ్గేడు)కు స్థలం ఉంది. దీన్ని టీడీపీ నేత దుక్క వెంకటేష్ ఇటీవల ప్లాట్లుగా విభజించి విక్రయించే నిమిత్తం కొనుగోలు చేశాడు. రోడ్డు పక్కనే విలువైన ఆధ్యాత్మిక స్థలం ఉండటంతో దాన్ని ఆక్రమించేందుకు ఇటీవల పొక్లెయిన్‌తో చెట్లు పడగొట్టాడు. అడ్డుకోవడానికి వెళ్లిన పురుషోత్తంపై దౌర్జన్యం చేసి కొట్టాడు. దీంతో గ్రామపెద్దలు, మహిళలు టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది కూడా దుక్క వెంకటేష్‌కు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేశా గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అభివృద్ధి చేశాను. కార్తీక మాసంలో మహిళలు ఇక్కడ వన భోజనాలు చేస్తుంటారు. రోడ్డు పక్కన ఉండటంతో ఈ స్థలాన్ని వెంకటేష్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. చెట్లను ధ్వంసం చేశారు. అడ్డుకుంటే నాపై దాడి చేశారు. – శీర పురుషోత్తం, ఇన్నేశుపేట -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు
సాక్షి, అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు బి.వెంకటరమణకు ఈ–పట్టాటారు పాస్‌బుక్ ఇవ్వడానికి వీఆర్వో డి.రాజశేఖర్ రూ.8,500 లంచం అడిగాడు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ అధికారులు రాజశేఖర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామ రైతు రాజేష్ పండకు ఈ–పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇవ్వడానికి బోదరసింగి వీఆర్వో బి.రేణుకారాణి రూ.3వేలు లంచం అడిగారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా రేణుకారాణిని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్‌ను స్వాధీనం చేసుకున్న వీఎంఆర్డీఏ అధికారులు
-
విశాఖలో ఆక్రమణలపై ఉక్కుపాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయిన ప్రభుత్వ భూముల్ని అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణల్ని గుర్తించిన జిల్లా రెవిన్యూ యంత్రాంగం.. ఆ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల్ని తొలగించింది. ఏకంగా 66.5 ఎకరాల ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంది. మరోవైపు లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసిన వారిపైనా అధికారులు చర్యలు చేపట్టారు. గంటా బంధువు చెరలోని భూమి స్వాధీనం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తోడల్లుడు.. ప్రత్యూష అసోసియేట్స్ ప్రతినిధి, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు ఆక్రమణలో ఉన్న భూముల్ని ఆర్డీవో పెంచల్ కిషోర్ నేతృత్వంలో అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రూరల్ మండలం అడవివరం – శొంఠ్యాం రోడ్డులో ఉన్న విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్ డీడ్ నం.1180లో మొత్తం 124 ఎకరాల భూమి ఉంది. ఇందులో 64 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4.86 ఎకరాలు పరుచూరి భాస్కర్‌రావుకు చెందినవని తేలింది. ఈ భూమి సహా ఇతర ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న మొత్తం 64 ఎకరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత భూముల్లో ఉన్న రక్షణ గోడలు, షెడ్లు, గేట్లు కూల్చి వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూముల మొత్తం విలువ సుమారు రూ.256 కోట్లు పైమాటేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ని సీజ్ చేస్తున్న వీఎంఆర్డీఏ అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధీనంలో... ఆనందపురం మండలంలోని వేములవలస, ఆనందపురం గ్రామాల సరిహద్దులో ప్రభుత్వ భూముల్లోని కొంత జిరాయితీ భూమిని విశ్వనాథ ఎడ్యుకేషనల్ సంస్థ 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ని ఏర్పాటు చేసింది. ఆ స్కూల్‌ని ఆనుకొని ఉన్న ఆనందపురం సర్వే నంబరు 283–3 లోని 1.68 ఎకరాల గయాళు భూమిని, వేములవలస సర్వే నంబరు 123 లో 34 సెంట్లు, 122–1, 122–2, 122–3లలో 76 సెంట్లు వాగు పోరంబోకుని సంబంధిత యాజమాన్యం కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా క్రీడా ప్రాంగణంతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టింది.. శనివారం ఈ నిర్మాణాల ప్రహరీ గోడలు కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని, హద్దులు నిర్ణయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్‌లీజ్‌కు.. లీజు గడువు ముగిసినా ఖాళీ చెయ్యకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న సిరిపురంలోని ఫ్యూజన్ çఫుడ్స్ అండ్ రెస్టారెంట్‌ను విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్ధ (వీఎంఆర్డిఏ) ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన టి.హర్షవర్ధన్ ప్రసాద్.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ పద్ధతిలో వీఎంఆర్డీఏ కి చెందిన 10,842 చదరపు అడుగుల స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. 2015లో ఏటా రూ.33 వేల చొప్పున చెల్లించేలా ఫ్యూజన్ ఫుడ్స్ పేరుతో తొమ్మిదేళ్ల లీజుకు తీసుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జీవో నం.56 ప్రకారం మూడేళ్లు మాత్రమే లీజుకి ఇవ్వాల్సి ఉండగా.. అప్పటి వుడా అధికారులు టీడీపీ ప్రభుత్వ ఒత్తిడితో ఏకంగా తొమ్మిదేళ్లకు రాసిచ్చేశారు. ఇదిలావుండగా ఈ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా శ్రీ కన్య కంఫర్ట్స్ అనే సంస్థకు సబ్ లీజుకు ఇచ్చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన లీజు కారణంగా వీఎంఆర్డీఏకి ప్రతి నెలా లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని భావించిన కమిషనర్ పి.కోటేశ్వరరావు చర్యలకు ఆదేశించారు. ఆదివారం ఉదయం వీఎంఆర్డీఏ కార్యదర్శి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. ఆక్రమణలపై చర్యలు కొనసాగిస్తాం ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గుర్తిస్తున్నాం. సర్వే నంబర్లు, పాత రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితిని పరిశీలిస్తున్నాం. ఎక్కడ ఆక్రమణలుంటే అక్కడ భూములు స్వాధీనం చేసుకునేందుకు, ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు దీనిని ప్రత్యేక డ్రైవ్‌లా ఇకముందు కూడా కొనసాగిస్తాం. –– ఆర్డీవో పెంచల్ కిశోర్ -
బుద్ధుందా.. గాడిద కొడుకుల్లారా..
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది (భీమిలి): మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం అందుకున్నారు. పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టిన అడ్డగోలు నిర్మాణాల్ని తొలగించిన నేపథ్యంలో గీతం కళాశాలలో టీడీపీ నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్డీవో, ఆ నా..... సస్పెండ్ చేయాలి’ అంటూ నోటికొచి్చనట్టు మాట్లాడారు. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కోర్టు పరిధిలో ఉన్న గీతం కాలేజీ నిర్మాణాలను తొలగించిన ఆర్డీవో, తహసీల్దార్.. ఆ నా..... సస్పెండ్ చెయ్యాలి’ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ భూముల్ని అందరూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తమకిస్తే అభివృద్ధి చేసుకుంటామంటూ అప్పటి ముఖ్యమంత్రిని దివంగత ఎంవీఎస్ మూర్తి కోరితే కేటాయించారని అయ్యన్న చెప్పడం గమనార్హం. గీతం యూనివర్సిటీ నిర్మాణాలను తొలగించడం ముమ్మాటికి కక్షపూరిత చర్య అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గీతం కళాశాలపై ప్రభుత్వ కక్ష సాధింపును అంతా ఖండించాలన్నారు. దమ్ముంటే విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. ‘అయ్యన్నా.. నోరు అదుపులో పెట్టుకో’ విధి నిర్వహణలో ఉన్న ఆర్డీవో, తహశీల్దార్లను నోటికొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. గీతం విద్యాసంస్థల ఆక్రమణలపై చర్యలు తీసుకున్న రెవెన్యూ అధికారులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని అసోసియేషన్ సహాధ్యక్షుడు పీవీ రత్నం, ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ అయ్యన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఇలా ఉద్యోగుల్ని బెదిరించడం చట్టరీత్యా నేరమన్న విషయం ఓ మాజీ మంత్రికి తెలియకపోవడం గర్హనీయమని అన్నారు. బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదనీ, ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే వారికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
కోస్తాను ముంచెత్తిన వాన
సాక్షి, అమరావతి: రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరాల్లోని అనేక అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృత రూపం దాల్చింది. కృష్ణా కరకట్టపై ఉన్న ఇళ్లలోకి నీరు వస్తోందని, ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురికి హెచ్చరికలు జారీ చేశారు. వాగుల్లా మారిన రహదారులు – భారీ వర్షాలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం వాగులను తలపిస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. – విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరంలోని ఉప్పులేరు పొంగడంతో పడవలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని గోస్తని, శారదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. – భారీ వర్షాలు, గాలులతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. కోత, పొట్టదశలో ఉన్న వరి నీట మునిగింది. భారీ గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు, చెరువు గట్లకు గండ్లు పడ్డాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి. సురక్షిత ప్రాంతాలకు తరలింపు – వరద ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మందులు, నిత్యావసర వస్తువులను అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కన్నబాబు తెలిపారు. – రహదారులు, కాలువలు, వంతెనలకు గండ్లు పడి రవాణాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు. – ఎక్కడకు కావాలంటే అక్కడికి సహాయ కార్యక్రమాల కోసం తరలించడానికి వీలుగా విశాఖపట్నం జిల్లాలో మూడు జాతీయ విపత్తు సహాయక దళాలను (ఎన్డీఆర్ఎఫ్) సిద్ధంగా ఉంచారు. కాకినాడలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. – సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 129 మండలాల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్లలో 24 గంటలూ కంట్రోల్ రూమ్‌లు – వరద ప్రభావిత జిల్లాల్లోని కలెక్టరేట్లలో రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్‌లు పని చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించారు. – నిత్యం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా పంపాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో జలవనరులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 327 బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఆ శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం – నర్సాపూర్ మధ్య కాకినాడకు 30 కి.మీ దూరంలోని నేమం ప్రాంతంలో తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలివేగం ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.. వాయుగుండం ప్రభావం సముద్రంపై ఇంకా కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం కోస్తా తీరంలో సముద్రం అలలు 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ప్రమాదం ఉండటంతో పర్యాటకులు, మత్స్యకారులు తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు. -
పేదల భూమిపై పెద్దల కన్ను
ప్రభుత్వం 17 ఏళ్ల క్రితం సుమారు 83 దళిత కుటుంబాలకు పట్టాలిచ్చిన డీకేటీ భూములపై స్థానిక పెద్దల కన్ను పడింది. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సుమారు 20 ఎకరాలను ఆక్రమించేశారు. అదును చూసి జేసీబీలతో చదును చేశారు. రాత్రికి రాత్రే బోరు డ్రిల్ చేశారు. విషయం తెలుసుకున్న బాధిత దళితులు పట్టాదారు పాసుపుస్తకాలతో శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన కేవీబీపురం మండలం పెరిందేశంలో కలకలం రేపింది. కేవీబీపురం: మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన సర్వే నం.254 (బ్లాకు)లో అదే గ్రామానికి చెందిన 83 దళిత కుటుంబాలకు 2003లో అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరా చొప్పున పట్టాలిచ్చింది. అధికారులు సర్వేచేసి భూములను లబ్ధిదారులకు చూపించలేదు. అదే భూమిపై స్థానిక పెద్దల కన్ను పడింది. శ్రీకాళహస్త్రికి చెందిన ఓ వ్యాపారికి సదరు భూమి తమ స్వాధీనంలో ఉన్నట్టు నమ్మబలికారు. అందులో 20ఎకరాలు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. సదరు వ్యాపారి, స్థానిక పెద్దలు కొందరు మూడు రోజులుగా రాత్రి పూట జేసీబీలతో చదును చేయడం ప్రారంభించారు. ఎవరికీ తెలియకుండా బోరు కూడా డ్రిల్ చేయడంతో బాధిత దళితులు ఉలిక్కిపడ్డారు. సంబంధిత భూమిలో పట్టాలు చేతబట్టి ఆందోళనకు దిగారు. ఆ భూమి దళితులదే ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సదరు భూమి దళితులదేనని తేల్చారు. త్వరలో అధికారిక సర్వేలు జరిపి ఎవరి భూములను వారికి చూపిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దళిత, ప్రభుత్వ భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇదిలావుండగా అదే గ్రామానికి చెందిన తాజా మాజీ టీడీపీ సర్పంచ్ భర్త గతంలో ఆ భూములకు పాసు పుస్తకాలు చేయిస్తానని నమ్మబలికినట్టు తెలుస్తోంది. ప్రతి పట్టాదారు నుంచి రూ.500 వసూలు చేసి మొండిచేయి చూపించినట్టు బాధితులు తహసీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. ఇదే భూమిలో ఆయనకున్న ఎకరా భూమిని అడ్డుపెట్టుకుని సుమారు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయం చేస్తాం పెరిందేశం గ్రామ పరిధిలోని బ్లాకు నం.254లో ప్రభు త్వం ఇచ్చిన పట్టాల ప్రకారం అర్హులకు కచ్చితంగా న్యాయం చేస్తాం. దళితులు, ప్రభుత్వ భూములు ఎవరి చెరలో ఉన్నా స్వాధీనం చేసుకుంటాం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –జీ.మోహన్, తహసీల్దార్ కేవీబీపురం -
తహసీల్ సిబ్బందిపై పెట్రో దాడి
చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం పెట్రోల్ దాడి ఘటన కలకలం సృష్టించింది. పట్టా పాసు పుస్తకంలో తన పూర్తి భూమి నమోదు కాలేదని ఆగ్రహించిన ఓ రైతు సిబ్బందిపై పెట్రోల్‌తో దాడి చేశాడు. అగ్గి పుల్ల అంటించేలోపే సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని లంబాడిపల్లికి చెందిన జీల కనుకయ్యకు ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 1142, 1145, 1146లో 4.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 0.19 గుంటలు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకంలో నమోదైంది. మిగతా 4.0 ఎకరాల కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పాసు పుస్తకం లేనిదే వరి ధాన్యాన్ని తూకం వేయడం లేదని రెండ్రోజుల క్రితం వీఆర్ఓ శంకర్‌ను సంప్రదించగా.. 4.19 ఎకరాలకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చాడు. సింగిల్ విండో అధికారికి చూపించగా.. ఇది చెల్లదని చెప్పడంతో రైతు కనుకయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం తహసీల్దార్‌ను రెండుసార్లు కలిసేందుకు ప్రయత్నించగా.. గేటు వద్ద వీఆర్ఏ అడ్డుకున్నాడు. దీంతో బయటకు వెళ్లిన ఆయన రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి సీని యర్ అసిస్టెంట్ రాంచందర్‌రావు, వీఆర్ఏలు నర్స య్య, అనిత, అటెండర్ దివ్యలపై పోశాడు. అగ్గి పెట్టె తీసేలోపే సిబ్బంది కనుకయ్యను బయటకు లాక్కెళ్లారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, రూరల్ ఏసీపీ పార్థసారథి, ఎల్ఎండీ సీఐ మహేశ్‌గౌడ్ కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఏనాడూ కలవలేదు : తహసీల్దార్ ఫారూక్ తాను వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా తనకు పట్టాదారు పాసు పుస్తకం రావడం లేదని రైతు కనుకయ్య కలవలేదు. సదరు వీఆర్ఓ కూడా తనకు ఏనాడూ ఈ విషయంపై చెప్పలేదు. సర్వే చేసినోళ్ల మీద పోసేందుకే..: కనుకయ్య రైతుబాట కార్యక్రమంలో ఇంటింటా సర్వే చేసిన రెవెన్యూ అధికారుల మీద పెట్రోల్ పోసేందుకు తెచ్చాను. కానీ కోపం ఆపుకోలేక వీరిపై పోశాను. అగ్గి పుల్ల అంటించలేదు. కాగా, రికార్డుల ప్రకారం ఒక ఎకరానికి మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చే వీలుందని ఆర్డీవో తెలిపారు. బాధిత రైతు జీల కనుకయ్య -
మహాత్మా.. మన్నించు!
సాక్షి, గుర్రంకొండ, చిత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు చేయరాదు. అంతేకాకుండా మద్యం సేవించడం చేయకూడదు. అయితే, గుర్రంకొండలో ఈ నియమాలకు రెవెన్యూ అధికారులు తిలోదకాలు వదిలారు. ఎంచక్కా మందు పుచ్చుకుని తమదైన సంబరాల్లో తూలారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలు సీజ్ చేసినా నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగించారు. వివరాలు..స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు తమ కార్యాలయం ఎదుట సహోద్యోగులతో కలిసి జాతీయ జెండాను ఎగుర వేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే మధ్యాహ్నం వేళకు సీను మారిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం సేవించరాదనే విషయం తెలుసో, తెలియదోగానీ గ్రామానికి చెందిన ఓ మద్యం దళారిని పిలిపించుకుని వారికి కావాల్సినంత మద్యం బాటిళ్లను గుర్రంకొండలో తెప్పించుకున్నారు. గ్రామానికి వెలుపల ఓ బహిరంగ ప్రదేశంలో ద్విచక్రవాహనాన్ని అడ్డుగా ఉంచుకుని మద్యం సీసాలను కాసేపటికే ఖాళీ చేశారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది స్థానికలు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చిందో ఎక్సైజ్ అధికారులకే తెలియాలి. గుర్రంకొండలో పట్టపగలే అధికారులు మద్యం సేవించడం చర్చనీయాంశమైంది. -
రెవెన్యూ అధికారులు చుక్కలు చూపుతున్నారు
తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరిగాయంటూ సామాన్యులు సంతృప్తి చెందే పరిస్థితి కల్పించాలి.. అవినీతి రహిత పారదర్శక పాలన ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ అధికారులను ఆదేశిస్తున్నారు. గత పాలనలో అలవాటు పడిన తమ పాత ధోరణిని అధికారులు ఇంకా వదులుకోలేకపోతున్నారు. ఇంకా పైసలు ఇవ్వందే ఫైళ్లు ముట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చుక్కల భూముల సమస్యే ఇందుకు నిదర్శనం. క్లెయిమ్స్ పరిష్కారంలో మన జిల్లా రాష్ట్రంలో అట్టడుగున ఉండడం బాధాకరం. సాక్షి, కడప: నాటి బ్రిటీషు ప్రభుత్వం రీ సర్వే అండ్ రీ సెటిల్మెంట్ చేపట్టినపుడు భూములు సాగు చేసుకుంటున్న కొందరు రైతులు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆర్‌ఎస్‌ఆర్‌లో ఆ సర్వే నెంబర్ల వద్ద కాలమ్–16లో చుక్కలు పెట్టారు. పట్టాదారు పేర్లు లేవు గనుక అలాంటి చుక్కల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపి వేసింది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఆ భూములు విక్రయించుకోవాలన్నా రైతులకు అవకాశం లేకుండా పోయింది. వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం అలాంటి భూములను సేకరించినా పరిహారం అందక రైతులు ఎన్నో అవస్థలు పడ్డారు. చివరకు గత ప్రభుత్వం ఇలాంటి భూములపై 12 సంవత్సరాలుగా అనుభవించుకుంటున్న రైతుల పేరిట క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించింది. 2017 జులై 17న జీఓ ఎంఎస్ నెంబరు 298 జారీ చేసింది. అదేనెల 28వ తేది సీసీఎల్ఏ సర్క్యులర్ కూడా విడుదల చేశారు. మామూళ్లు ముట్టజెప్పందే.... చుక్కల భూముల సమస్య రెవెన్యూ అధికారులకు కల్పతరువుగా మారింది. భూముల విలువను బట్టి రేట్లు నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రమైన కడపకు ఆనుకుని ఉన్న సీకే దిన్నె పరిధిలోని మామిళ్లపల్లె, పాపాసాహెబ్‌పేట, కొప్పర్తి వంటి చోట్ల ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. చెన్నూరు, వల్లూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతోం ది. గతంలో ఒంటిమిట్ట, కొండాపురం తహసీల్దార్లపై ఈ విషయంలో ఆరోపణలు గుప్పుమన్నాయి. తాజాగా ఖాజీపేట మండలంలో రెవెన్యూ అధికారుల లంచగొండి వ్యవహారాలు వెలుగు చూశాయి. చుక్కల భూముల విషయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాడన్న అభియోగంపై వీఆర్వో శ్రీనివాసులురెడ్డి ఇటీవల సస్పెండ్ అయ్యారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం చిత్తూరుజిల్లా కలకడలో ఉన్న పార్వతి కొందరు వీఆర్వోల ద్వారా రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చుక్కల భూమిని క్రమబద్దీకరించుకునేందుకు పుల్లూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని బోసిరెడ్డిపల్లెలో ఓ మహిళా రైతు తాను రూ.75 వేలు సమర్పించినట్లు చెబుతున్నారు. కేఆర్ఆర్సీ డెప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌రావు ఇటీవల ఈ ఆరోపణలపై విచారణ నిర్వహించారు. తుడుములదిన్నె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు తాను రూ.10 వేలు వీఆర్వోకు, రూ.28 వేల తహసీల్దార్ పార్వతికి సమర్పించాల్సి వచ్చిం దని విచారణ అధికారి దృష్టికి తెచ్చారు. ఇలా 26 మంది రైతులు రాత పూర్వకంగా తహసీల్దార్‌పై ఫిర్యాదు చేశారు. సన్నపల్లె గాంధీనగర్, త్రిపురవరం, తుడుములదిన్నె తదితర గ్రామాల్లోని రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చుక్కల భూములు అధికంగా ఉన్న చాపాడు, దువ్వూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, సీకే దిన్నె మండలాల్లో రెవెన్యూ అధికారులు మామూళ్ల కోసం రైతులను పీడిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పరిష్కారంలో జాప్యం చుక్కల భూములకు పట్టాలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు అంటున్నారు. ఆర్ఎస్ఆర్లోని 16వ కాలమ్‌లో చుక్కలు ఉన్నప్పటికీ 17వ కాలమ్‌లో కొండపొరంబోకు, గయాళు, వంక పొరంబోకు అనే రిమార్క్స్ ఉన్నాయని కొన్ని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అడంగల్, ఈసీ, రిజిష్టర్ ఆఫ్ ఫోల్డింగ్స్ తదితర డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ ఏదో ఒక నెపం చూపుతూ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 1801 దరఖాస్తులు తిరస్కరించారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకు జిల్లాలో 9708 దరఖాస్తులు రాగా 90 మాత్రమే జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. పులివెందుల నియోజకవర్గంలో 1003 దరఖాస్తులు రాగా 30 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. జిల్లాలో ఇంకా 7817 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో చుక్కల భూములు లేవు. మిగిలిన ఏడు జిల్లాలలో క్లెయిమ్‌ల పరిష్కారంలో గుంటూరు జిల్లా ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా, వైఎస్సార్ కడప మాత్రం చివరిస్థానంలో ఉంది. -
రెవ్వెన్యూ అధికారులు అవకతవకలు చేశారని ఆవేదనతో..
-
ఎందుకో ఈ మౌనం.. ఏమిటో ఆ అంతరార్థం
పేదలు గూడు కోసం ఓ చిన్నపాక వేసుకుంటే హడలెత్తిస్తారు రెవెన్యూ అధికారులు. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు శోత్రియ భూముల్లో 200కు పైగా గుడిసెలు అక్రమంగా వేసుకున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. పైగా అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్న వారందరూ ఈ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం గమనార్హం. షికారీల పేరిట గుడిసెలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద నాటకీయ పరిణామాలే జరుగుతున్నాయి. దీనికి నాయకత్వం వహిస్తున్న మాఫియా లీడర్లు గుడిసెకో రేటు విధించి వసూలు చేస్తున్నారు. పైగా ఇంటి స్థలం మొదలు సాగుభూమి వరకు తీసిస్తామని భరోసా ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మౌనముద్రలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరదయ్యపాళెం: జిల్లాలో చిన్న పాండూరు పేరు వింటూనే నూతనంగా నిర్మించే అపోలో టైర్ల పరిశ్రమ, హీరో ద్విచక్ర వాహనాల పరిశ్రమలు గుర్తుకొస్తాయి. దీంతో ప్రస్తుతం రియల్టర్ల చూపంతా ఈ ప్రాంతం వైపే ఉండడంతో భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది. దీన్ని అదునుగా భావించిన అక్రమార్కులు ఎంచక్కా ఇంటి స్థలాల పేరిట వందలాది ఎకరాల ఆక్రమణకు పన్నాగం పన్నుతున్నారు. షికారీలను రంగంలోకి దించి చిన్న పాండూరు శోత్రియ భూముల్లో ఏడాదిన్నర కాలంలో 200కుపైగా గుడిసెలు ఏర్పాటు చేశారు. భూముల నేపథ్యమిలా.. చిన్న పాండూరు పంచాయతీ పాదిరికుప్పం రెవెన్యూలో సర్వే నెంబర్లు 1 నుంచి 84లలో 1,060 ఎకరాలు శోత్రియ భూములు ఉన్నాయి. చిన్న పాండూరు, వడ్డిపాళెం, పాదిరికుప్పం, రామలక్ష్మ మ్మకండ్రిగ గ్రామాలకు చెందిన స్థానికులు సంబంధిత భూములను అనధికారికంగా సాగుచేసుకుంటూ అనుభవదారులుగా కొనసాగుతున్నారు. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు మధ్య కోర్టులో వివాదం జరుగుతోంది. గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా జాయింట్ కలెక్టర్ సెటిల్మెంట్ కోర్టులో తీర్పు వెలువడడంతో సంబంధిత భూములు ప్రభుత్వానికి చెందినవిగా బోర్డులు కూడా రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. ప్రైవేటు వ్యక్తులు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కేసు కొనసాగుతోంది. మౌనముద్రలో రెవెన్యూ శాఖ.. శోత్రియ భూముల్లో అక్రమార్కులు గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నా రెవెన్యూ శాఖ తమకేమీ పట్టనట్లు ఉండడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఆక్రమించిన వారు ఏకంగా ఆ ప్రాంతా నికి నక్కలమిట్టగా నామకరణం చేయడం, ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రతివారమూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనలకు దిగడం షరా మామూలుగా మారింది. ఏడాది క్రితం ఆక్రమణల తొలగింపు.. శోత్రియ భూముల్లో వెలసిన గుడిసెల తొలగింపుకు జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్ 13న సుమారు 100మంది పోలీసు బలగాలతో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో మండల రెవెన్యూ యంత్రాంగం అక్రమ గుడిసెలను బలవంతంగా తొలగించింది. అయితే ఆక్రమణకు పాల్పడిన వారు మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లకుండా అక్కడే ఉన్నారు. పది రోజుల పాటు ఆ భూములలో ప్రవేశించకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా కాపలా ఉంది. ఆపై పర్యవేక్షణ గాలికొదిలేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరో మారు అక్రమ గుడిసెలు ఏర్పాటు కొనసాగుతోంది. అక్రమ గుడిసెల ఏర్పాటు తగదు.. సంవత్సరాల తరబడి తమ అనుభవంలో ఉన్న భూములలో గుడిసెలు ఏర్పాటు చేయడం తగదని చిన్న పాండూరు ప్రాంత అనుభవదారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలం బించడం వల్లే గుడిసెలు పుట్టుకొస్తున్నాయంటున్నారు. అడవిగా ఉన్న భూములను సొంత ఖర్చులతో చదును చేసి, సాగులోకి తెచ్చుకున్నామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పూర్వీకులు ఇక్కడ ఉండేవారు.. 40 సంవత్సరాల క్రితం చిన్నపాండూరు సమీపంలోని శోత్రియ భూముల్లో ఒకచోట తమ పూర్వీకులు పది కుటుంబాల వారు ఉండేవారని ప్రస్తుతం గుడిసెలు ఏర్పాటు చేసుకున్న కొందరు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని నక్కలమిట్ట అని కూడా అనేవారని పేర్కొంటున్నారు. వివిధ కారణాలతో క్రమేణా వేరే ప్రాంతాలకు తమ పూర్వీకులు వలస వెళ్లారని, వారి కుటుంబ సభ్యులుగా తమకు ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
నేనొచ్చాక.. తీరిగ్గా మీరొస్తారా
టేక్మాల్(మెదక్) : రెవెన్యూ అధికారులపై మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సీరియస్ అయ్యారు. పనితీరు బాగాలేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 10:15 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా వచ్చారు. ఆ సమయంలో కంప్యూటర్ ఆపరేటర్, అంటెడర్లు తప్ప ఏ ఒక్క అధికారి కార్యాలయానికి రాలేదు. కలెక్టర్ వచ్చిన విషయాన్ని ఫోన్లలో సమచారం అందుకున్న వీఆర్ఓలు, తహశీల్దార్ ఒక్కొక్కరుగా 11 గంటల తర్వాత హాజరుకావడంతో సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనొచ్చాక.. తీరిగ్గా మీరు వస్తారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రైతుబంధు కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన భూ సవరణ వివరాలు ఆన్లైన్ ఎంత మేరకు చేశారని వీఆర్ఓలను ప్రశ్నించగా ఏ ఒక్కరూ సరైన సమాధానం ఇవ్వలేదు. చేసిన వారిలో కూడా తప్పుల సవరణ సరిగ్గా చేయలేదని మండిపడ్డారు. రికార్డులను పరిశీలించిన అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన 39 వేల భూ సమస్యలను పరిష్కరించామని పంపగా 28వేల సమస్యల్లో ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఒక్క అధికారి కూడా ఫీల్డ్ లెవల్ పనులు చేయడం లేదన్నారు. వీఆర్ఓ సస్పెన్షన్ విధుల్లో నిర్లక్ష్యం వహించి రైతుల నుంచి వచ్చిన భూ సమస్యల సవరణ పూర్తి చేయని ఎల్లుపేట, వెల్పుగొండ వీఆర్ఓ సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. పనుల్లో అలసత్వం వహిస్తున్న తహసీల్దార్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. భూ సమస్యలను పరిష్కరించడంలో టేక్మాల్ మండలం అట్టడుగున ఉందన్నారు. ఇంకా 11వేల దరఖాస్తులకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని బొడ్మట్‌పల్లి గ్రామాన్ని సందర్శించి భూ రికార్డులను పరిశీలించారు. రికార్డు సవరణలు ఫీల్డ్‌కు రాకుండా చేశారని వీఆర్ఓ ఖదీర్‌పై మండిపడ్డారు. ప్రజల నుంచి ఎటువంటి భూ సమస్యలు తమ దృష్టికి రాకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి పథకం పనులపై ఆగ్రహం మెదక్ అర్బన్ : పట్టణానికి తాగునీరు అందించే పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో మెదక్ పట్టణానికి తాగునీరు అందించే పథకంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి పథకం పనుల్లో గత పదిహేను రోజులుగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్నారు. ప్రతినిత్యం 300 నల్లాలు బిగించాల్సి ఉండగా ఇప్పటి వరకు మొత్తం 275 నల్లాలు మాత్రమే బిగిస్తే ఎన్నిరోజులు సమయం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ వీరప్ప, డిప్యూటీ ఇంజినీర్ గోపాల్, మెదక్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పశువుల్లంక రెవెన్యూ అధికారులపై తిరగబడ్డ గ్రామస్తులు
-
భూ ఆక్రమణ కేసులో టీడీపీ నేతల అరెస్టు
మదనపల్లె టౌన్: మాజీ సైనికుడి పేరుతో నకిలీ పట్టా సృష్టించి డీకేటీ భూమిని విక్రయించి సొమ్ము చేసుకున్న 9 మంది టీడీపీ నేతలను మదనపల్లె రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనీ ఎస్పీ సతీష్‌కుమార్, డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ రమేశ్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన కామిశెట్టి వెంకటరమణకు ప్రభుత్వం 1990లో సర్వే నంబర్ 691–2లో 1.90 సెంట్ల డీకేటీ భూమి ఇచ్చింది. దీనిపై టీడీపీ నేతలు కన్నేశారు. అప్పటి వీఆర్వో రెడ్డి శేఖర్ సహకారంతో ఈ డీకేటీ పట్టాను మాజీ సైనికుడి పేరిట మార్పు చేసి నకిలీ పట్టా సృష్టించారు. భూమిని విక్రయించుకునేందుకు రెవెన్యూ అధికారులు ఇచ్చినట్లు నకిలీ ఎన్ఓసీని సైతం తయారుచేశారు. 2016 పిబ్రవరి 18న ఆ భూమిని పుంగనూరుకు చెందిన రాచమడుగు రాయల్‌కుమార్‌కు రూ.55 లక్షలకు విక్రయించారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో 2016 అక్టోబర్ 15న అప్పటి సబ్ కలెక్టర్ కృతికాబాత్రా విచారణకు ఆదేశించారు. నకిలీ పట్టా సృష్టించి భూమిని విక్రయించినది వాస్తవమేనని విచారణలో తేలింది. ఈ క్రమంలో టీడీపీ సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ గంగారపు నాగ వెంకటస్వామినాయుడు అలియాస్ సిమెంటు బాబురెడ్డి (58), జీవి.రంగారెడ్డి(56), పఠాన్ ఖాశీఖాన్(60), కామిశెట్టి సుభద్రమ్మ (67), జి.లీలావతి (45), శరణ్‌కుమార్ (50), జి.వెంకరమణ (50), బాగేపల్లె నాగరాజు (50), బాగేపల్లె శకుంతల(48)ను అరెస్టు చేశారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
పంచని పుస్తకాల్లో తప్పులెన్నో!
సాక్షి, హైదరాబాద్: కొత్త పాస్ పుస్తకాల పంపిణీ తప్పుల తడకని తేలిపోయింది. ముద్రణ సమయంలోనే 3 లక్షల పాస్ పుస్తకాల్లో తప్పులున్నాయని గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వాటిని పంపిణీ చేయకుండా నిలిపివేయడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. పేరు తప్పుల నుంచి ఆధార్ నంబర్ల వరకు, విస్తీర్ణంతోపాటు ఫొటోలు కూడా తప్పులు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పుస్తకాలను పంపిణీ చేయలేదు. ఇది ఒక ఎత్తయితే పంపిణీ చేసిన పుస్తకాల్లో కూడా అదే స్థాయిలో తప్పులు వస్తుండటం మరింత గందరగోళానికి దారితీస్తోంది. అయితే పాస్ పుస్తకాల్లో తప్పులకు క్షేత్రస్థాయిలో జరిగిన నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. అడ్డగోలుగా రికార్డులు సరిచేయడం, ఎలాంటి పరిశీలన లేకుండా ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాల వివరాలను ముద్రణకు పంపడమే ఇంతటి గందరగోళానికి కారణమైందని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆ పుస్తకాలన్నింటినీ మళ్లీ ముద్రించేందుకు సిద్ధమయ్యారు. 14 రకాల తప్పులు పంపిణీ చేయకుండా నిలిపివేసిన పుస్తకాల్లో మొత్తం 14 రకాల తప్పులున్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో రైతుకు అత్యంత కీలకమైన భూమి విస్తీర్ణం నమోదులోనే ఎక్కువ పుస్తకాల్లో తప్పులు వచ్చాయి. మొత్తం 93 వేల పుస్తకాల్లో రైతుకు ఉన్న భూమి కన్నా ఎక్కువో, తక్కువో నమోదయ్యాయి. వీటికితోడు పట్టాదారుకు బదులు వేరొకరి ఫొటో ఉన్న 37 వేలకు పైగా పుస్తకాలను అధికారులు గుర్తించారు. వాటిని నిలిపివేశారు. చనిపోయిన వారి పేర్ల మీద, పాత పట్టాదారుల పేర్లతో, ఆధార్ తప్పులతో, పట్టాదారు పేరు, తండ్రి పేర్లలో తప్పులతో వేల సంఖ్యలో పుస్తకాలను ముద్రించారు. నాలా భూములకు, ప్రభుత్వ భూములకు కూడా పాస్ పుస్తకాలను సిద్ధం చేశారు. ఒక్కో రైతుకు ఒక ఖాతా ఉండాల్సి ఉండగా, ఒకే ఖాతా నంబర్‌ను ఇద్దరు, ముగ్గురు రైతులకు వచ్చేలా దాదాపు 34 వేల పుస్తకాలు ముద్రించారంటే రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్వే నంబర్లలో తప్పులు, అసైన్డ్ భూములకు, అటవీ శాఖతో వివాదాలున్న భూములకు కూడా పాస్ పుస్తకాలు ముద్రించడం గమనార్హం. పంపిణీ చేసిన వాటిలోనూ.. పంపిణీ చేసిన 39 లక్షల పుస్తకాల్లోనూ అదే స్థాయిలో తప్పులు రావడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. భూ విస్తీర్ణం, పట్టాదారు పేర్లు, ఫొటోలు, ఆధార్ నంబర్లలో వచ్చిన తప్పులును రైతులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమకున్న భూమి మొత్తం పుస్తకాల్లో రాకపోవడంతో ఉన్న భూమి ఎటుపోతుందోననే భయం వారిలో వ్యక్తమవుతోంది. చాలా పుస్తకాల్లో కొనుగోలు చేసిన భూములు కూడా ఆనువంశికంగా వచ్చినట్లు నమోదైంది. ఇవి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయోననే సందేహాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ తప్పులను సరిచేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ‘తప్పులను రికార్డు చేసి వెళ్లిపోండి.. మేం కొత్త పుస్తకాలకు పంపిస్తాం. కానీ అవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం’అంటూ క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్న మాటలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు కూడా పాస్‌పుస్తకాల పంపిణీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చొరవ తీసుకుని నిశిత దృష్టితో ఈ అంశాన్ని పరిష్కరించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. విషయం సీఎం దృష్టికి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలో అసలు ఎన్ని కొత్త పాస్‌పుస్తకాలను ముద్రించారు? అందులో పంపిణీ చేసినవి ఎన్ని? పంపిణీ చేయకుండా నిలిపివేసినవి ఎన్ని? పంపిణీ ఎందుకు చేయలేదనే వివరాలను జిల్లాల వారీ గణాంకాలతో రెవెన్యూ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 49.94 లక్షల కొత్త పాస్ పుస్తకాలను ముద్రించామని, అందులో 39.47 లక్షల పుస్తకాలను ఈనెల 23 నాటికి పంపిణీ చేశామని, 3.07 లక్షల పుస్తకాల్లో తప్పులున్నందున వాటిని నిలిపివేశామని తెలిపారు. పంపిణీ చేసిన పాస్ పుస్తకాల్లోనూ పెద్ద సంఖ్యలో తప్పులు వచ్చాయన్న సమాచారంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరిచేయాలని ఆదేశించారు. -
70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సాక్షి, సిద్దిపేట : లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తోన్న వారి ఆట కట్టించారు పోలీసులు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు 70 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగదేవ్‌పూర్ మీదుగా ఓ లారీలో తరలిస్తున్న 140 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలించేందుకు వినియోగించిన లారీని సీజ్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒకేచోట 67 బోరు బావులు
హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్లో రెవిన్యూ అధికారులు హడావుడి చేశారు. ఒకే ప్రాంతంలో పదుల సంఖ్యలో బావులను గుర్తించారు. దీంతో వాటిని పూడ్చివేసే చర్యలకు దిగారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఒకే చోట పెద్ద సంఖ్యలో బోరు బావులు ఉన్నట్లు సాక్షిలో కథనం ప్రసారం కావడంతో అప్రమత్తమైన అధికారులు అక్కడికి వెళ్లి మొత్తం 67 బోరు బావులు గుర్తించారు. దీంతో వాటిని తీయించిన వారిని గట్టిగా మందిలిస్తూ వాటిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. బోరు వేసి వదిలేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఎమ్మార్వో విజయ చెప్పారు. -
రెవెన్యూ లీలలు
► వీఆర్ఏకు రూ.కోట్ల విలువైన భూమి ధారాదత్తం ► అసైన్‌మెంట్‌లో పొందిన భూమిలో రియల్ వ్యాపారం ► చోద్యం చూస్తున్న అధికారులు రాయచోటి రూరల్: అసైన్మెంట్ భూపంపిణీలో రెవెన్యూ లీలలు కొనసాగుతున్నాయి. రాయచోటి పట్టణ పరిసర ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన భూమిని ఇష్టారాజ్యంగా రెవెన్యూ అధికారులు తమ శాఖ సిబ్బందికే ధారాదత్తం చేయడం గమనార్హం. రెవెన్యూశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగుల చేతివాటంతో ప్రభుత్వ , డీకేటీ భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి. రూ.లక్షలు అధికారుల జేబుల్లోకి పోతున్నాయి. వివరాల్లోకి వెళితే..రాయచోటి మండలం పెమ్మాడపల్లెకి చెందిన డీకేటీ భూమి 2005 నుంచి సుమారు 19 ఎకరాలు అక్రమంగా అనర్హులకు రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేసినట్లుÐð వెల్లడైంది. పెమ్మాడపల్లె రెవెన్యూ గ్రామంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కదిరప్ప కుమారుడు శివమల్లయ్య పేరుతో రింగ్‌రోడ్డు పక్కనే రూ.కోట్ల విలువైన డీకేటీ భూమి 6 ఎకరాలు ఉన్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. శివమల్లయ్య పేరుతో పాసుపుస్తకం ఖాతా నంబర్ 456లో సర్వేనంబర్ 364/12బిలో 1.17ఎకరాలు, 364/14లో 0.48ఎకరాలు, 364/1ఇలో 0.63ఎకరాలు, 364/4లో 0.99ఎకరాలు, 364/7లో 0.28ఎకరాలు, 374/5లో 0.14సెంట్లు, 385లో 0.17ఎకరాలు, 397/1లో 0.40 ఎకరాలు, 406లో 1.03 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా పంపిణీ అనంతపురం జిల్లా ఎన్పీకుంట(పలువురు చెప్పిన అడ్రస్ ప్రకారం)కు చెందిన మేళ్ల చెరువు రామకృష్ణనాయుడు అనే వ్యక్తికి రాయచోటి మండలం పెమ్మాడపల్లెలో ఖాతా నంబర్ 558లో సర్వే నంబర్ 364/11లో 1.20ఎకరాలు, 364/12లో 1.16 ఎకరాలు డీకేటీ భూమి ఉన్నట్లు రికార్డులున్నాయి. దీంతో పాటు అదే రామకృష్ణనాయుడు పేరుతో మరో 9 సర్వే నంబర్లలో సుమారు 6ఎకరాలకు పైగా ఉండటం గమనార్హం. ఈ భూపంపిణీలో కూడా అప్పటి రెవెన్యూ అధికారులు చేతివాటం చూపినట్లు తెలుస్తోంది. అదే గ్రామంలో 362/4 సర్వే నంబర్లో ఒక వ్యక్తికి 2 ఎకరాలు డీకేటీ భూపంపిణీలో భాగంగా ఇవ్వగా, 2 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలను కబ్జా చేసుకుని చుట్టూ కంచె వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా రాయచోటి రింగ్‌రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా రూ.కోట్లు విలువ చేసే సుమారు 19 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పొందిన వ్యక్తులు, మరో 10 ఎకరాల ప్రభుత్వ భూమిపైనా కన్నేశారు. వారి భూమికి పక్కనే ఖాళీగా ఉన్న డీకేటీ భూమిని కబ్జా చేయడం విశేషం. అసైన్మెంట్ భూముల్లో రియల్ వ్యాపారం 2005 తర్వాత పలు దఫాలుగా అక్రమంగా అర్హతలేని వ్యక్తులు పెమ్మాడపల్లెలో రాయచోటి రింగ్‌రోడ్డుకు ఇరువైపులా భూములను పొందారు. దీంతో పాటు చేతికందినంత ఆక్రమించుకుని ప్రస్తుతం ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాల కోసం అవసరమైన వ్యక్తులు వారి చేతుల్లో పడి మోసపోతున్నారు. నిబంధనలకు విరుద్ధం గా డీకేటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం విశేషం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు –గుణభూషణరెడ్డి, తహసీల్దార్ ,రాయచోటి ప్రభుత్వభూములను ఆక్రమించినా, నిబంధనలకు విరుద్ధంగా అసైన్మెంట్ భూముల్లో వ్యాపార లావాదేవీలు చేసినా చర్యలు తప్పవు. డీకేటీ భూములను ఇళ్ల నిర్మాణం కోసం కొంటే ప్రజలే మోసపోతారు. వాటిని ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ స్వాధీనం చేసుకుంటాం. ఒకవేళ అసైన్‌మెంట్‌లో భూమి పొందిన అన్ని అర్హతలు ఉన్నవారు కూడా ప్రభుత్వం నుంచి ఎన్ఓసీతో పాటు పట్టా పొందాల్సి ఉంటుంది. -
‘ఉపాధి’ నిధులతో ‘వైకుంఠధామాలు’
తొలి విడతలో 500 గ్రామాల్లో ఏర్పాటుకు తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వైకుంఠధామాల(శ్మశానవాటిక)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకుగాను ఉపాధిహామీ పథకం నిధులు వెచ్చించాలని నిర్ణయిచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి విడతలో 500 గ్రామాల్లో వైకుంఠ థామాల ఏర్పాటుకు గ్రామీణాబివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తంగా తొలివిడతలో మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో వైకుంఠధామాల ఏర్పాటు నిమిత్తం మార్గదర్శకాలను సూచిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఉపాధిహామీ చట్టంలో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన కింద ఈ పనులను చేపట్టేందుకు వెసులుబాటు ఉందని ఆమె పేర్కొన్నారు.వైకుంఠధామాలకు ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. అయితే, ఆయా గ్రామాల్లో జనాభాను బట్టి అంచనాల్లో కొంత మేరకు హెచ్చుతగ్గులు ఉండే వచ్చు. ఏదేని గ్రామంలో దాతలు ముందుకు వచ్చినట్లయితే, వైకుంఠ ధామం ఏర్పాటుకు రూ.5 లక్షలు లేదా వ్యయంలో 25 శాతం (ఏది ఎక్కువైతే అది) ఇచ్చినవారి పెద్దల లేదా తల్లిదండ్రుల స్మారకంగా పేరును పెట్టనున్నారు. వైకుంఠ ధామం ఎలాగంటే.. ఒక్కో వైకుంఠధామంలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్‌రూమ్, సందర్శకులకు షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్‌హెడ్ ట్యాంక్, సోలార్‌లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపట్టనున్నారు. నీటి సరఫరా, ప్రహరీ, ఇతర పనులను గ్రామ పంచాయతీ లేదా ఇతర నిధులతో పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. స్థలం ఎంపిక నిమిత్తం రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని, గ్రామసభ ఆమోదం లభించాక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలను సిద్ధం చేయించాలని ఉపాధిహామీ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. -
జగడం
మేయర్ x డీసీఆర్ - లెక్కలేనితనంపై మేయర్ గుర్రు - పాలనాపరమైన విషయాలు చెప్పనవసరం లేదంటున్న డీసీఆర్ బకాయిలు చెల్లించేందుకు నెలాఖరు వరకు గడువు ఉంది. వెబ్సైట్లో మొండి బకాయిదారుల జాబితా పెట్టేప్పుడు కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఇది మంచిపద్ధతి కాదు. ఆంధ్ర రత్నభవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాల యం) ఏళ్ల తరబడి పన్ను చెల్లించడం లేదు. జాబితాలో పేరు ఎందుకు చేర్చలేదు. ఏమైనా అంటే సారీ అంటున్నారు. డీసీఆర్ వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదు. కమిషనర్‌తోనే తేల్చుకుంటా. – కోనేరు శ్రీధర్,మేయర్, విజయవాడ. డిఫాల్టర్స్ లిస్ట్‌లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. అందుకే సరిచేస్తున్నాం. సర్కిళ్ల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగానే జాబితాను వెబ్సైట్లో ఉంచాం. అప్డేట్ చేయకపోవడం పొరపాటే. అయినంత మాత్రాన ఎవరిపై చర్యలు తీసుకోలేం. పరిపాలనాపరమైన అంశాలకు సంబంధించి మేయర్‌తో చర్చించాల్సినఅవసరం లేదు. అందుకే ఆయనకు చెప్పలేదు. – సుబ్బారావు,డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) విజయవాడ సెంట్రల్ : నగర పాలక సంస్థలో హద్దుమీరిన రెవెన్యూ అధికారుల అత్యుత్సాహం వివాదాస్పదమైంది. నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ డిఫాల్టర్స్ లిస్ట్‌ను వెబ్సైట్లో పెట్టడం, అందులో టీడీపీ ప్రజాప్రతినిధుల పేర్లు ప్రముఖంగా ఉండటంతో కథ అడ్డం తిరిగింది. మంత్రి దేవినేని ఉమా డీసీఆర్ సుబ్బారావుకు ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అడ్డగోలుగా అధికారులు పనిచేస్తుంటే ఏం చేస్తున్నావంటూ మేయర్‌కూ క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మేయర్, డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ)ను టార్గెట్ చేశారని భోగట్టా. మొండి బకాయిదారుల జాబితాను బహిర్గతం చేసేటప్పుడు కనీసం తన దృష్టికి తేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. మేయర్ అంటే లెక్కలేదా అంటూ మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి తరుచూ వివాదాస్పదం కావడంపై ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీసీఆర్ వ్యవహార శైలిపై కమిషనర్‌తో చర్చించాలన్న నిర్ణయానికి వచ్చారు. తప్పుల తడక ...: డిఫాల్టర్స్ లిస్ట్‌ను తప్పుల తడకగా రూపొందించిన రెవెన్యూ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. మూడు సర్కిళ్ల అసిస్టెంట్ కమిషనర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రూపొందించిన జాబితాను పరిశీలించి డీసీఆర్‌కు అందజేస్తారు. కమిషనర్ అనుమతితో వెబ్సైట్లో ఉంచాలి. ఈ ప్రక్రియలో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాబితాను అప్డేట్ చేయలేదని తెలుస్తోంది. గతంలో ఆరు నెలలకోసారి ఆస్తిపన్నును చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ చేసేవారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏడాదికి ఒకసారే డిమాండ్ నోటీసు ఇచ్చేశారు. దీన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్టర్స్ లిస్ట్‌లో కొన్ని పేర్లను చేర్చడం వివాదాస్పదమైంది. డిఫాల్టర్స్ లిస్ట్ వెబ్సైట్లో పెట్టి మొండి బకాయిదారుల్ని అల్లరి చేయాలన్న ఎత్తుగడ బెడిసికొట్టింది. కమిషనర్ ఆదేశాలతోనే జాబితాను వెబ్సైట్లో పెట్టాం కాబట్టి తమకేం ఇబ్బంది ఉండదనే ధోరణిని రెవెన్యూ అధికారులు ప్రదర్శిస్తున్నారు. మొత్తం మీద మొండిబకాయిలు మేయర్, డీసీఆర్ మధ్య జగడం సృష్టించాయి. -
బజారు పాల్జేసిన బ్యాంకు అప్పు
⇒ అప్పు చెల్లిస్తామన్న ఇంటిని వేలం వేసిన అధికారులు ⇒ ఇల్లు ఖాళీ చేయాలంటూ గేటుకు తాళం ⇒ రాత్రంతా ఆరుబయటే జమ్మికుంట: ఇంటి పేరిట బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లింపులో జాప్యం ఆ కుటుం బాన్ని రోడ్డున పడేసింది. సదరు కుటుంబానికి తెలపకుండానే బ్యాంకు అధికారులు ఇంటిని వేలం వేశారు. మార్కెట్ విలువ కంటే తక్కు వకు విక్రయించడం.. రుణం చెల్లిస్తామన్నా వినిపించుకోకుండా ఇంటికి తాళం వేయడం తో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. బాధిత కుటుంబానికి స్థానికులు అండగా నిల వడంతో ఇల్లు ఖాళీ చేయించేందుకు వచ్చిన బ్యాంక్ అధికారులు, పోలీసులు వెనకడుగు వేశారు. ఈ ఘటన మంగళవారం జమ్మికుంట లో చోటుచేసుకుంది. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన నాంపెల్లి కిషన్ ఇస్త్రీ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే కాలనీలో ఇల్లు నిర్మించుకున్నాడు. 2013లో ఇంటిని బ్యాంకు లో తనఖా పెట్టి రూ.3 లక్షలు రుణం తీసుకు న్నాడు. దాదాపు రూ.2.10 లక్షల వరకు తిరిగి చెల్లించాడు. బ్యాంకు వడ్డీ, అసలు ఇప్పటి వరకు ఇంకా రూ.2.70 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే, డబ్బులు సమ కూరక పోవ డంతో కొద్ది నెలలుగా రుణం చెల్లించడంలేదు. అప్పు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇంటిని వేలం వేస్తామంటూ గత డిసెంబర్లో నోటీసు లిచ్చారు. ఈ విషయం తమకు తెలియదని బాధితులు పేర్కొంటున్నారు. గత జనవరిలో వేలం పాట కోసం ప్రకటన జారీ చేశారు. వేలం పాటలో ఇల్లును ఓ వ్యక్తి రూ.11.77 లక్షలకు దక్కించుకున్నట్లు బ్యాంకు ఉద్యో గులు వెల్లడించారు. దాదాపు రూ.20 లక్షల కుపైగా విలువ చేసే ఇల్లును తక్కువ ధరకు దక్కించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. తన ఇల్లు తనకు కావాలని, బ్యాంకు అధికా రులు వేలం వేయొద్దని వేడుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తే పట్టించుకోలేదని పేర్కొ న్నారు. చివరికి ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి బ్యాంక్ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతో పోలీసు భద్రత మధ్య ఖాళీ చేయించాలని నాలుగు రోజుల కిందట ఆదేశాలు వచ్చాయి. దీంతో సోమవారం కిషన్ కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. వేరే గ్రామానికి వెళ్లి తిరిగొచ్చిన కిషన్ కుటుంబం చేసేదేమీ లేక రాత్రంతా ఆరుబయటనే ఉండాల్సి వచ్చింది. కిషన్ కుటుంబసభ్యులు ఆత్మహత్యకు యత్నించేందుకు సిద్ధపడగా వారి వద్ద నుంచి క్రిమిసంహారక మందును స్థానిక మహిళలు లాక్కున్నారు. తాము అండగా ఉంటామని, న్యాయం కోసం పోరాడ తామని హామీనిచ్చారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు కిషన్ ఇంటికి వచ్చి ఖాళీ చేయించేందుకు యత్నించగా బాధితులు అడ్డుకున్నారు. వారికి మద్దతుగా కాలనీ వాసులు నిలిచారు. తమకు న్యాయం చేయా లని, ఇల్లు ఇప్పించకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని కిషన్ భార్య విజయ హెచ్చరించారు. దీంతో బ్యాంకు అధికారులు వెనుకడుగు వేశారు. కొనుగోలు చేసిన వ్యక్తితో చర్చలు జరిపి బ్యాంకు అప్పు కట్టిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకం
⇒ సర్కారు తీరుపై రైతుల మండిపాటు ⇒ అంగీకారం లేకుండా భూములు స్వాధీనం చేసుకుంటున్నారని ఆందోళన ⇒ నష్టపరిహారం ఇవ్వకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం తప్పదని హెచ్చరిక మచిలీపట్నం : పోర్టు నిర్మాణం పేరిట అధికారులు, రైతుల అంగీకారంతో నిమిత్తం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని చినకరగ్రహారం సర్పంచ్ నడకుదుటి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. చినకరగ్రహారం రైతులు ఆది వారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరగ్రహారం, మంగినపూడి, తపసిపూడి, పోతేపల్లి గ్రామాల ఆయకట్టులోని అసైన్డ్, ప్రభుత్వ భూములు 3,014 ఎకరాలను కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగిస్తూ రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకోవటం రైతులను మోసం చేయటమేనన్నారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములను మత్స్యకారుల అనుమతి లేకుండా, అంగీకారం లేకుండా స్వాధీనం చేసుకోవటం సమంజసం కాదన్నారు. రైతుల మధ్య రెవెన్యూ అధికారులు విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా సమీకరిస్తే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
జాడలేని డంపింగ్ యార్డులు
► ఏర్పాటుకు చర్యలే తీసుకోని అధికారులు ► గ్రామాలలో తీవ్రమవుతున్న ‘చెత్త’ సమస్య ► రోడ్ల పక్కనే తగులబెడుతున్న వైనం ► రోగాలపాలవుతున్న స్థానికులు శంషాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో చెత్త సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది..ఓ వైపు ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుండగా.. మరో వైపు సేకరించిన చెత్తను వేయడానికి స్థలం లేక ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పక్కన పడవేసి కాల్చేస్తున్నారు. దీంతో అందులోని ప్లాస్టిక్ కారణంగా వాయు కాలుష్యం ఏర్పడి గ్రామీణులు రోగాల పాలవుతున్నారు. పెద్దషాపూర్, తొండుపల్లి, కాచారం, కవ్వగూడ, నర్కూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, ఊట్పల్లి, పాల్మాకుల, మదన్ పల్లి, శంకరాపురం, హమీదుల్లానగర్, మల్కారం, నానాజీపూర్, రామంజాపూర్, ముచ్చింతల్, ఘాంసిమియాగూడ, గొల్లపల్లి, జూకల్, సుల్తాన్ పల్లి, పెద్దతూప్ర పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో చెత్త సమస్య తీవ్రంగా మారింది. ఆయా గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణకు చర్యలు లేకపోవడంతో, ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా కాకుండా ఒకే రకంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, రోడ్ల పక్కన పార బోస్తున్నారు. నర్కూడలోని చెత్తను సమీపంలోని చెరువులో వేస్తున్నారు. ఇక పెద్దషాపూర్లో చెత్తను జూకల్ వెళ్లే దారిలోని స్మశానవాటిక స్థలం లోనే వేసి కాల్చేస్తున్నారు. కాచారంలోని చెత్తను షాబాద్ రోడ్డు పక్కన ఉన్న వరద కాలు వలో వేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇలా గే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో అవస్థలు తప్పడం లేదు. చెత్తను కాల్చివేసే సమయంలో అందులోని ప్లాస్టిక్ నుంచి వెదజల్లే కాలుష్యంతో శ్వాస సంబంధిత రోగాల బారిన పడుతున్నా మని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగితాల మీదనే ప్రతిపాదనలు.. అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం అనువైన స్థలాలను ఎంపిక చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కానీ, చాలా చోట్ల స్థలాభావంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తొండుపల్లి పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్ యార్డు కోసం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలం కేటాయించారు. చెత్త వేయడానికి అనువుగా గోతులు కూడా తీశారు. సేకరించిన చెత్తను ఇక్కడకు తరలించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇక్కడ చెత్త వేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి కాలనీ వాసులు అభ్యంతరం చెబు తున్నారు. స్థలాలు లేక కొన్ని చోట్ల..ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొనడంతో సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. -
కేసీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై రగడ
అనుమతి లేదంటూ తొలగించిన రెవెన్యూ అధికారులు రేణిగుంట: తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) మంగళవారం తిరుమల దర్శనార్థం రానున్న నేపథ్యంలో సోమవారం రేణిగుంట ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్ల తొలగింపు వివాదాస్పదమైంది. మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్న కేసీఆర్‌ను స్తుతిస్తూ తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎయిర్‌పోర్టు మార్గంలో ఫ్లెక్సీలను, రోడ్డు పక్కన వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తన అసంతృప్తి వెలిబుచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్ర సీఎంకు మనమిచ్చే అతిథి మర్యాద ఇదా అని ఆయన ప్రశ్నించారు. నేడే తిరుమలకు సీఎం రెండు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం సాక్షి, హైదరాబాద్: శ్రీవేంకటేశ్వరస్వామికి తెలంగాణ మొక్కులు తీర్చేందుకు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తిరుమలకు బయల్దేరనున్నారు. ముఖ్య మంత్రి వెంట ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సల హాదారులు, అధికారులు వెళ్తున్నారు. సీఎం పర్యటనకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్తున్నాయి. పలువురు రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి మంగళ వారం సాయంత్రం తిరుపతి చేరుకుం టారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. బుధవారం ఉద యాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.5 కోట్ల విలువైన కానుకలను శ్రీవారికి ముఖ్యమంత్రి సమర్పిస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులను తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోనే రూ.5 కోట్ల విలువైన ఆభరణాల ను తయారు చేయించింది. శ్రీ మూల వర్ణ కమలం నమూనాలో 14.2 కిలోల సాలగ్రా మ హారం, 4.65 కిలోల బంగారంతో ఐదు పేటల కంఠ ఆభరణాన్ని చేయించారు. తిరుపతిలో అమ్మవారికి బంగారు ముక్కుపు డకను కానుకగా సమర్పించనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా.. 2010లో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా దీవించాలని వేడుకున్నారు. ఆ మొక్కులను తీర్చేందుకు ఏడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి తిరుమల వెళ్తున్నారు! పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఏపీ డీజీపీకి, టీటీడీ అధికారులకు తెలంగాణ ఇంటెలి జెన్స్ ఐజీ ఇప్పటికే సమాచారం అందించా రు. సీఎం బుధవారం ఉదయమే తిరుమ లలో శ్రీవారిని, తిరుచానూరులో అమ్మవారి ని దర్శించుకుంటారు. తిరుమల పుష్పగిరి మఠంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహానికి ముఖ్య మంత్రి హాజరవుతారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
► జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలిగేడు: భూసమస్యలతోపాటు వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే రైతులు, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మండలంలోని బుర్హాన్ మియాపేటకు చెందిన రైతులు గత రెండేళ్లుగా తమ ప ట్టా భూములను ఆన్ లైన్ లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ జేసీకి ఫిర్యాదుచేయగా గురువా రం జేసీ ఎలిగేడు తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి తనిఖీ చేశారు. రైతుల సమస్యల ను 15రోజుల్లోగా పరిష్కరించాలని వీఆర్వో తిరుపతిపై తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, సాదాబైనామాల సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిం చడం సరికాదన్నారు. కార్యాలయ పనితీరుపై తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలతో సుదీర్ఘంగా చర్చించారు. జేసీ వెంట తహసీల్దార్ నాగరాజమ్మ, ఆర్ఐ అమ్జద్, వీఆర్వోలు, బుర్హాన్మియాపేట రైతులు పాల్గొన్నారు. -
కుంటుపడిన ‘కుటుంబ ప్రయోజన’o
రూ.13 కోట్లున్నా.. 3 వేలకు మించని ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులు బాధితులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సెర్ప్ సీఈవో లేఖ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన(ఎన్ఎఫ్బీఎస్) పథకానికి పెద్దగా స్పందన ఉండడం లేదు. పేద కుటుంబ యజమాని(పెద్ద) మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే.. ఈ పథకం పట్ల బాధిత కుటుంబాలకు పెద్దగా అవగాహన లేకపోవడం, ఆయా కుటుంబాలను గుర్తించాల్సిన రెవెన్యూ అధికారులు పట్టిం చుకోకపోవడమే దరఖాస్తులు తగ్గడానికి కారణాలుగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2016–17)లో ఎన్‌ఎఫ్‌బీఎస్‌కి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.13 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 వేల బాధిత కుటుంబాలకు సాయాన్ని అందించేందుకు వీలుంది. అయితే గత 10 నెలల్లో ఎన్ఎఫ్బీఎస్ కోసం ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు 3 వేలకు మించలేదు. 750 దరఖాస్తులు ఆయా జిల్లాల డీఆర్వోల వద్ద, మరికొన్ని డివిజన్ల స్థాయిలో ఆర్డీవోల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్ఎఫ్బీఎస్ కింద బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచాలని ఇప్పటికే సెర్ప్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి కేంద్రం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి రూ.20 వేల చొప్పున మం జూరు చేస్తున్నప్పటికీ, ఎక్కువ మంది బాధితులకు సాయమందించే ఉద్ధేశంతో ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రూ.10 వేలకు తగ్గించింది. బాధిత కుటుంబానికి కేంద్రం ఇచ్చిన మేరకు మొత్తం రూ.20 వేల చొప్పున లబ్ధిదారులకు మంజూరు ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎటువంటి ఆర్థిక సాయానికి నోచుకోని బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, ఎన్ఎఫ్బీఎస్ పథకం పట్ల ఆయా కుటుంబాల సభ్యులకు అవగాహన కల్పించి, వెంటనే దరఖాస్తు చేసుకునే చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా లేఖలు రాశారు. -
చక్కెర విక్రయాల్లో చేదు లేదట..!
• 400 బస్తాల లోడ్‌తో ‘పేట’కు చేరుకున్న చక్కెర లారీ • నామమాత్రంగా పరిశీలించిన వదిలేసిన అధికారులు నారాయణపేట : స్థానిక పాతగంజ్‌కు గురువారం 400 బస్తాల చక్కెర లోడ్‌తో లారీ చేరుకుంది. ఇందులో 200 క్వింటాళ్ల విలువ చేసే 400 చక్కెర బస్తాలున్నాయి. సంక్రాంతి పండుగ రావడంతో భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయనే వ్యాపార ఏజెన్సీ నిర్వాహకులు పుండలీక చక్కెరను కర్ణాటకలోని బిజాపూర్ నుంచి తెప్పించుకున్నారు. అక్రమంగా పెద్దఎత్తున చక్కెర క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు కాళప్ప, జనార్దన్ అక్కడికి చేరుకుని.. లారీలో ఉన్న చక్కరను పరిశీలించి వాటికి సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. అయితే అందులోని వివరాలు వారికి అర్థం కాకపోవడంతో విషయాన్ని ఇన్చార్జ్ తహసీల్దార్ ప్రమీలకు అందజేశారు. అంతలోపే ఆ విషయం సబ్‌కలెక్టర్‌కు అందినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులు ఆ బిల్లులను తీసుకెళ్లి సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్యాకు చూపించడంతో పూర్తిస్థాయిలో పరిశీలించి వ్యాపారులతో విచారణ చేపట్టాలని వారికి సూ చించారు. బిల్లులను పరిశీలించిన తర్వాత అందులో వే బిల్లులు తప్పా అన్నీ సక్రమంగానే ఉన్నాయని రెవెన్యూ అధికారులు ధృవీకరించి లారీని వదిలిపెట్టారు. అసలు చక్కెర ఇంత పెద్దమొత్తంలో నారాయణపేటలో క్రయవిక్రయాలు జరుగుతుంటే అమ్మక పన్ను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక నుంచి చక్కెరను దిగుమతి చేసుకున్న తెలంగాణకు కట్టాల్సిన పన్నులు కట్టారో లేదోనని అధికారులు పరిశీలించలేకపోయారు. వారిS అవగాహన లోపంతో ఉన్న బిల్లులను చూసి అవే కరెక్టు అని వ్యాపారులు చెప్పడంతో తల ఊపి పట్టుకున్న లారీని వదిలేశారు. ఆ వ్యాపారి మాత్రం వచ్చిన చక్కెర బస్తాలను గంటల వ్యవధిలోనే విక్రయించడం కొసమెరుపు. -
పొలాల్లో దోశ, సాంబార్ సాగు అట..
• ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు • అందకుండా పోయిన ఇన్పుట్ సబ్సిడీ • ఆందోళనలో రైతులు మద్నూర్: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు.. ‘రైతులు తమ పంట పొలాల్లో దోశ, సాంబార్, హోటల్ పువ్వులు పండించారు. మంచి దిగుబడులు సాధించి లాభాల్లో ఉన్నారు’ అంటూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కారణంగా రైతులకు కరువు సాయం అందకుండా పోయిన వైనమిది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గా, సుల్తాన్‌పేట్ గ్రామాలకు చెందిన రైతులు గతేడాది ఖరీఫ్‌లో సోయాబీన్, పెసర తదితర పంటలు పండించారు. కరువు పరిస్థితులతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాన్ని అంచనా వేసిన అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అందులో ఎక్కడా లేని విధంగా రైతులు సాంబార్, దోశ, హోటల్ పువ్వులు వంటి పంటలు పండించారని, మంచి లాభాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దీంతో వారికి ఇన్పుట్ సబ్సిడీ అందకుండా పోయింది. మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గాకు చెందిన రైతు హన్మంత్‌రావ్, పీరాబాయి, రుక్మిణీబాయి, దేవిదాస్, నాగ్నాథ్, అర్జున్ పటేల్, అహ్మద్‌ఖాన్‌లు దోçశ, సాంబార్, హోటల్ పువ్వులు వేశారని నమోదు చేశారు. సుల్తాన్‌పేట్‌కు చెందిన ధన్రాజ్గౌడ్ నాలుగు ఎకరాలలో సోయా వేయగా.. చిక్కుడుకాయ పండించారని, మౌలానా రెండు ఎకరాలలో హోటల్ పువ్వులు పండించారని పేర్కొన్నారు. అధికారుల నివేదిక మేరకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కాని రైతులు మంగళవారం తహ సీల్ కార్యాలయానికి వచ్చి అధికారులను నిలదీశారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. కొందరు రైతులు సాంబార్, దోశ పండించినట్లు జాబితాలో వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియదని, దీనిపై విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. -
తీరంలో ఫిషింగ్ హార్బర్?
కె.మత్స్యలేశంలో పోర్టు భూముల పరిశీలన కె.మత్స్యలేశం (గార) : జిల్లాలోని సముద్ర తీరాన ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ శుక్రవారం పరిశీలించారు. ఈ తీరాన ఎప్పటి నుంచో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్న ప్రతిపాదన ప్రభుత్వంలో ఉండటం, జిల్లాలోనే అత్యధికంగా వేట సాగే ప్రాంతం కావడంతో స్థల పరిశీలనకు ప్రాధాన్యత వచ్చింది. కె.మత్స్యలేశం(పోర్టు కళింగపట్నం) తీరంలో పీపీపీ ప్రాజెక్టు పద్ధతిలో నిర్మించనున్న టెక్‌మహింద్రా రిసార్టు పక్కనే పోర్టు భూములతో పాటు బందరువానిపేట వద్ద భూమిని పరిశీలించారు. సర్వే నంబరు 221లో పోర్టు భూమి 116 ఎకరాల్లో నిర్మించే పరిస్థితి ఉంది. స్థానిక సర్పంచ్ మైలపల్లి లక్ష్మిజనార్ధనరావు రిసార్టుకు ఇబ్బంది లేకుండా చూడాలని, కె.మత్స్యలేశం, బందరువానిపేట మధ్యలోని బ్రిడ్జి వద్ద నుంచి హార్బర్ నిర్మాణం జరిగితే బాగుంటుందని కమిషనర్‌ను కోరడంతో సానుకూలంగా స్పందించారు. భూముల వివరాలను రెవెన్యూ అధికారుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు రోడ్డు కనెక్టవిటీ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం బందరువానిపేట మత్స్యకారులతో వేట పరిస్థితులు, ఇటీవల అందించిన బోట్లను ఆయన పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీలు మాదిరిగా 75 శాతం రారుుతీ ఇవ్వాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. పర్యటనలో జిల్లా మత్స్యశాఖ డీడీ డాక్టర్ వీవీ కృష్ణమూర్తి, ఇన్చార్జి తహసీల్దార్ ఎం.చక్రవర్తి, ఎఫ్‌డీవో దివాకరరావు, ఏడీఏ నిర్మలకుమారి, ఆర్ఐ డి. రామకృష్ణ, ఇన్స్పెక్టర్ గంగాధరరావు పాల్గొన్నారు. -
సారూ న్యాయం చేయండి..!
► గిరిపుత్రుల రోదన ►దబ్బగుంట జీవగెడ్డ భూమి, శ్మశాన వాటిక ఆక్రమణ ► జీవగెడ్డ ప్రవాహం దారిమళ్లింపు ►ఇకపై చెరువులు, భూములకు అందని జీవగెడ్డ ►కలెక్టర్ పరిశీలించాలని విన్నపం శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర పంచాయతీ శివారు దబ్బగుంట గ్రామం పక్కనుంచి ప్రవహిస్తున్న జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని ఆక్రమించడంతో పాటు దబ్బగుంట, జిల్లేల్లోవ గ్రామాల గిరిజనులు తాత ముత్తాతల కాలం నుంచి వాడుకుంటున్న శ్మశాన వాటిక భూమిని సైతం భారీ యంత్రాలతో చదును చేసేస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజనులు కె.జమరాజు, యు.రాము, ఎస్.సన్నిబాబు, గెమ్మల సోములు, జె.గౌరీష్, దేముడు, చిన్నారావు, జి.గంగరాజు, భీమన్న తదితరులు బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భారీ యంత్రాలతో జీవగెడ్డ ప్రవాహాన్ని దారిమళ్లించి ఆ భూమిని యంత్రాలతో చదును చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నంబర్లు 75, 76, 77, 78, 79 మీదుగా జీవగెడ్డ ప్రవహిస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు తెచ్చిన రికార్డులు, మ్యాపులో స్పష్టంగా ఉన్నాయన్నారు. అలాగే జీవగెడ్డ ప్రవాహం వెళ్తున్న పలు ప్రాంతాల్లో కల్వర్టులు కూడా నేటికీ ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. అరుుతే గిరిజనుల డిమాండ్ మేరకు విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరుతెన్నులు మారుస్తున్న వైనంపై గానీ, పురాతన కాలం నుంచి గిరిజనులు వాడుతున్న మరుభూమి (శ్మశాన వాటిక) ఆక్రమణపై నోరుమెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవగెడ్డ, దబ్బగుంట, జిల్లేల్లోవ గిరిజన గ్రామాల ప్రజలు వాడుతున్న శ్మశాన వాటిక భూమి ఆక్రమణ వెనుక ఉన్న పెత్తందార్లకు భయపడి రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని గిరిజనులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్, ఆర్డీఓ వంటి ఉన్నతాధికారులు జీవగెడ్డ ప్రవాహ తీరును మళ్లించిన వైనంతో పాటు శ్మశాన వాటిక స్థల ఆక్రమణపై నిజానిజాలు పరిశీలించి న్యాయం చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు. -
రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
డివిజన్ల నుంచి రికార్డుల పంపించామంటారు.. కలెక్టరేట్లో అందలేదంటారు ఎప్పుడూ ఇదే సమాధానమా? కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): కోర్టు కేసులు, భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల నుంచి కలెక్టరేట్‌కు రికార్డులు పంపించామంటారు, కలెక్టరేట్ ఉద్యోగులు రాలేదంటారు ఎప్పుడూ ఇదే సమాధానమా అంటు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లోకాయుక్తకు సంబంధించిన సమాచారం చివరి నిమిషంలో చెబుతున్నారన్నారు. లోకాయుక్తకు సంబంధించిన కేసుల విషయం ముందుగా తెలియజేయాలని ఆదేశించారు. ఎల్ఈసీ (లోన్ ఎల్జిబులిటీ కార్డ్స్) ఉన్నవారికి రూ.50 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చేయించామని తెలిపారు. సీజేఎఫ్ఎస్ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ ఎల్ఈసీ కార్డులు మంజూరు చేయాలన్నారు. జాతీయ రహదారికి భూసేకరణలో జాప్యం జరుగుతోందన్నారు. ధరలు నిర్ణయించే విషయంలో కావలి ప్రాంతంలో ఎకరా భూమి విలువ రూ.60 లక్షలుగా నిర్ణయించారన్నారు. దీంతో బాధిత రైతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ఇబ్బందులు పడకుండా చూడాలి రూ.500, రూ.1000 నోట్ల రద్దు వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూకు రావాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి రూ.500, రూ.1000 నోట్లు ఇచ్చినా తీసుకోవాలని సూచించారు. జేఈ ఇంతియాజ్ మాట్లాడుతు ఎల్ఈసీ కార్డుల మంజూరులో నాలుగు మండలాలు మాత్రమే 60 శాతం లక్ష్యాలను పూర్తి చేశారన్నారు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ టి. ధర్మారెడ్డి, సర్వే ఏడీ శ్రీనివాసులురెడ్డి, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
నగరంలో నయా కబ్జా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్ : ఒంగోలు నగరంలో రూ.5 కోట్లకుపైగా విలువ చేసే 20 సెంట్ల (120 గదులు) స్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమయ్యారు. పచ్చనేతలకు ఆ స్థలాన్ని అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాలు పుచ్చుకోవడమే తరువాయి. నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత వెనుక ఉండి ఈ కథ నడిపిస్తుండగా, ఆయన అనుచరగణం ముందుండి దూసుకుపోతోంది. నగరంలోని గుంటూరు రోడ్డు బిలాల్‌నగర్‌లో సర్వే నంబర్ 116/1ఏ1ఏ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని కమ్యూనిటీ హాలుకుగానీ, మదర్సాలకుగానీ ఇవ్వాలని ఆ ప్రాంతానికి చెందిన ముస్లిం నేతలు, ప్రజలు చాలాకాలంగా కోరుతున్నారు. అరుునా పట్టించుకోని అధికారులు ఆ స్థలాన్ని పచ్చనేతలకు అప్పగించి వారివద్ద మెప్పు పొందేందుకు అత్యుత్సాహం చూపించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వేలాది మంది పేదలు గూడు లేక ఇంటి పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించని అధికారులు.. నగరంలోని విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు తావిస్తోంది. నగరం నడిబొడ్డున విలువైన స్థలం కబ్జాకు గురవుతుంటే.. కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్ ఏమాత్రం పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే నగరంలోని పలు స్థలాలను అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. మనికొన్నింటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదీ.. బిలాల్‌నగర్ స్థలం నేపథ్యం... నగరంలోని గుంటూరు రోడ్డులో గల బిలాల్నగర్ను ఆనుకుని సర్వే నంబర్ 116/1ఏ1ఏలో మొత్తం 13.10 ఎకరాల వాగు పోరంబోకు భూమి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాగు పోరంబోకు, కొండ పోరంబోకు, చెరువు పోరంబోకు భూములను నివాసాలకు ఇవ్వకూడదు. గతంలో పేదలు పోతురాజుకాలువ పరిసరాలలో 30 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండటంతో వాటికి పట్టాలు మంజూరు చేశారు. బిలాల్‌నగర్‌లోని 20 సెంట్ల భూమిని ఒక సొసైటీకి ఇస్తూ తొలుత పట్టా మంజూరు చేశారు. ఆ స్థలాన్ని వినియోగించకపోవడంతో రెవెన్యూ శాఖ వెనక్కు తీసుకుంది. 2004లో అప్పటి కలెక్టర్ ఆ స్థలంలో రెండు సెంట్ల భూమిని టంగుటూరి ప్రకాశం పంతులు మనవడికి కేటారుుస్తూ పట్టా మంజూరు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా నివాసాలు ఏర్పాటు కావడంతో అక్కడి స్థలాలకు ప్రస్తుతం విలువ పెరిగింది. దీంతో నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు కన్ను ఈ ప్రభుత్వ భూమిపై పడింది. ఆ స్థలాన్ని రెవెన్యూ వారు ఎవరికీ ఇవ్వడానికి వీలులేకుండా సదరు నేత నకిలీ పట్టాలు తయారుచేసి స్థలం తనదంటూ కోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాలని తేలడంతో ఆ స్థలాన్ని రెవెన్యూ వారు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరిగి ముఖ్యనేత అనుచరుడు ఈ స్థలంపై కన్నేశాడు. ఆ స్థలంలో గత కలెక్టర్ విజయ్‌కుమార్ ఇద్దరు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యుల పేరుమీద ఒకటిన్నర సెంట్ల చొప్పున కేటారుుస్తూ పట్టాలు మంజూరు చేశారు. అయితే, అధికార పార్టీ కబ్జాదారులు వారిని ఆ స్థలంలోకి రాకుండా అడ్డుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ఈ వివాదం నడిచింది. చివరికి తాజాగా ఆ స్థలాన్ని వారిద్దరూ స్వాధీనం చేసుకున్నారు. పచ్చ నేతల కోసం రూ.5 కోట్ల స్థలం... మిగిలిన 15 సెంట్ల (90 గదులు)ను అధికార పార్టీ నేతలు కబ్జా చేసేందుకు ప్రస్తుతం రంగం సిద్ధం చేసుకున్నారు. అధికారులు నేడో.. రేపో... వారికి ఆ స్థలాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవంగా ఒకటిన్నర సెంట్ల చొప్పున ఈ స్థలాన్ని 10 మంది అర్హులైన పేదలకు కేటాయించవచ్చు. కానీ, అధికార పార్టీ ముఖ్యనేత ఒత్తిడితో రెవెన్యూ అధికారులు ఆ ముఖ్యనేత పీఏతో పాటు ఆయన అనుచరులు ముగ్గురికి రూ.5 కోట్ల విలువైన మొత్తం స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ముస్లింల ఆందోళన... బిలాల్‌నగర్‌లో పేదలకు ఇచ్చిన స్థలాలుపోను మిగతా భూమిని ముస్లిం కమ్యూనిటీ హాలు, మదర్సాలకు ఇవ్వాలని బిలాల్‌నగర్ మదర్సా పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానికులు మూడు రోజులుగా ఆందోళనలు చేపట్టారు. ఈ స్థలం కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. కలెక్టర్ స్పందించాలని కోరారు. రికార్డుల్లో గోల్మాల్... ఏ స్థలానికైనా రెవెన్యూ కార్యాలయంలో ఒక రికార్డు మాత్రమే ఉంటుంది. బిలాల్‌నగర్‌లో మాత్రం సర్వే నంబర్ 116/1ఏ1ఏ స్థలానికి మాత్రం రెండు అడంగళ్లు ఉన్నాయి. ఒక అడంగల్‌లో ఇది వాగు పోరంబోకు భూమిగా ఉండగా, మరో అడంగల్‌లో ఇళ్ల స్థలాలని పేర్కొన్నారు. ఒక సర్వే నంబర్లో రెండు రకాల అడంగళ్లను సృష్టించారంటే అధికార పార్టీ ఒత్తిళ్లు రెవెన్యూ అధికారులపై ఏ స్థారుులో ఉన్నాయన్న దానిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జాయింట్ కలెక్టర్ల విషయంలోనే సందిగ్ధత
- జూనియర్ ఐఏఎస్ అధికారులకూ కొరత - రెవెన్యూ అధికారులు-గ్రూప్ 1 అధికారుల మధ్య పోటీ - ఆర్డీఓలకూ తప్పని ఇన్చార్జుల విధానం సాక్షి, హైదరాబాద్: జిల్లా పాలనలో కలెక్టర్ కార్యాలయానిదే ప్రధాన భూమిక. జిల్లా పాలనాధికారిగా కలెక్టర్ జిల్లా పాలనను స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయన తర్వాతి స్థానం జాయింట్ కలెక్టర్‌దే. మరో రెండు రోజుల్లో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాల్సిన తరుణంలో ఈ రెండు పోస్టుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. శాఖలవారీగా కొత్త జిల్లాల వ్యవస్థను ఏర్పాటు చేసుకునే పనులు మొదలైనప్పటికీ ప్రధానమైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల విషయంలో అయోమయం కొనసాగుతోంది. ప్రధాన పోస్టులకే పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారులను నియమించలేనంతగా ఐఏఎస్ అధికారులకు కొరత ఉన్న తరుణంలో, కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల నియామకం ప్రభుత్వానికి ఇబ్బందిగానే పరిణమించింది. జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమించటం ద్వారా ఎలాగోలా కలెక్టర్ స్థానాలను భర్తీ చేసినా.. జాయింట్ కలెక్టర్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆ పోస్టులను భర్తీ చేసే సంఖ్యలో జూనియర్ ఐఏఎస్ అధికారులు కూడా లేనందున, సాధారణ సీనియర్ అధికారుల(నాన్ కేడర్)ను నియమించకతప్పని పరిస్థితి ఉత్పన్నమైంది. జేసీ కోసం పోటాపోటీ.. ముందు నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పోస్టులు రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉన్నందున.. ఇప్పుడు రెవెన్యూ శాఖలోని సీనియర్ అధికారులతోనే జాయింట్ కలెక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఆ శాఖ అధికారుల సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. కాదని వేరే వారిని నియమిస్తే ఆందోళనలకూ వెనకాడబోమని తేల్చి చెబుతున్నాయి. మరోవైపు.. స్థాయి పరంగా తమ హోదానే పెద్దదని, ఎక్కడా రెవెన్యూ అధికారుల కింద తాము పనిచేసిన దాఖలాలు లేనందున ఆ పోస్టుల్లో తమనే నియమించాలని గ్రూప్ 1 అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి విన తులు అందజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత వెలువడలేదు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లవైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మిగతా వ్యవస్థ యథాతథంగా ఉండనుంది. డీఆర్ఓల విషయంలోనూ సీనియర్ అధికారులను నియమిస్తారు. ఆర్డీఓలకు కొరత వస్తే పక్క డివిజన్ అధికారికి ఇన్చార్జి బాధ్యత అప్పగించి నెట్టుకొస్తారు. తహసీల్దార్లు లేని చోట డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యత అప్పగిస్తారు. కలెక్టరేట్లలో సెక్షన్ల కుదింపు.. కలెక్టరేట్లలో ఇప్పటి వరకు ఎనిమిదిగా ఉన్న సెక్షన్ల సంఖ్యను ఆరుకు కుదిస్తారు. పరిపాలన సౌలభ్యం కోసం గతంలో ఏర్పాటు చేసిన అదనపు జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేశారు. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్/కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ వ్యవస్థలను రద్దు చేశారు. మినిస్టీరియల్ సిబ్బంది సంఖ్యనూ కుదిస్తారు. 12గా ఉన్న సీనియర్ అసిస్టెంట్ల సంఖ్యను పదికి, 35గా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్/టైపిస్టు సంఖ్యను 11కు, రికార్డు అసిస్టెంట్స్ సంఖ్యను నాలుగు నుంచి రెండుకు, ఆఫీస్ సబార్డినేట్ల సంఖ్యను 28 నుంచి 9కి కుదిస్తారు. ప్రతి మండలానికి ఓ సర్వేయర్ పోస్టు ఉంటుంది. -
విమానాశ్రయ భూముల జాబితా విడుదల
దగదర్తి: దామవరంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయం కోసం సేకరిస్తున్న దామవరం, కోత్తపల్లి కౌరుగుంట లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారులు విడుదల చేశారు. కోత్తపల్లి కౌరుగుంట పరిధిలోని సర్వే నెంబర్ 334,335లో గత నెలలో కోంత మేర చెల్లింపులు జరిగాయి. మిగిలిన 119 మందికి చెందిన లబ్ధిదారుల జాబితాను శనివారం రెవెన్యూ అధికారలు విడుదల చేశారు. విమానాశ్రయం కోసం సేకరిస్తున్న ఎలాంటి అభ్యంతరాలు లేని డీకేటీ భూములకు సంబంధించిన 11.54 ఎకరాలకు రెండు, మూడు రోజుల్లో పరిహారం అందచేయనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆందోళన సాక్ష్యాత్తు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేనెంబరు 335లోని అనుభవదారులకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాము 25 ఏళ్లకు పైగా భూములను సాగుచేసుకుంటున్నామని, ప్రస్తుతం ఈ భూములను విమానాశ్రయం కోసం సేకరిస్తున్నారని పరిహారం అందుకోవడానికి తాము అనర్హులమని రెవెన్యూ అధికారులు చెప్పడంతో కోత్తపల్లికౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా అధికారులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులు సెప్టెబరు 7వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిష¯ŒS పేరుతో ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు 17.9.2016 తేదీన కోత్తపల్లి కౌరుగుంటకు చెందిన 38 మంది రైతులను భూముల్లో నుంచి తొలగించరాదని, వారికి పరిహారం అందిచే విషయంలో ఏమి చర్యలు తీసుకోంటున్నారో తెలపాలని ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాహసీల్దార్ మధుసూదనరావును వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరిగిందని, హైకోర్టు ఆదేశాలు తమ కార్యాలయానికి అందలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామన్నారు. -
పంచకూటాలయానికి కొత్త స్థలం
- మంత్రి చందూలాల్ ఆదేశంతో ఆగమేఘాలమీద గుర్తింపు - గుట్టపై భూమిని సేకరించిన రెవెన్యూ అధికారులు సాక్షి, హైదరాబాద్: అరుదైన పంచకూటాలయం పునర్నిర్మాణానికి మరో కొత్త స్థలాన్ని సేకరించారు. ఇప్పటికే ఓ స్థలాన్ని గుర్తించి దాదాపు రూ.10 ల క్షలు వ్యయంతో చదునుచేసి నిర్మాణానికి సిద్ధం చేయగా, అది మరో పార్టీ నేతలు ఇచ్చిన భూమి కావటంతో అందులో ఆలయ పునర్నిర్మాణం వద్దంటూ అధికార టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దాంతో పురావస్తుశాఖ పనులు చేయకుండా చేతులెత్తేసింది. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం రామానుజాపురంలో జరిగిన ఈ వ్యవహారాన్ని 4 రోజుల క్రితం ‘పంచకూటాలయంపై పంచాయితీ’ శీర్షికన సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో అదేరోజు పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి చందూలాల్ ఇటు పురావస్తుశాఖ, అటు రెవెన్యూ అధికారులను పిలిపించి దీనిపై చర్చించారు. పంచకూటాలయం పునరుద్ధరణ ఇలా రాజకీయకారణాలతో వివాదాస్పదం కావడంతో వెంటనే పనులు మొదలుపెట్టక తప్పదని మంత్రి ఆదేశించారు. అయితే ఆ స్థలంలో కాకుండా మరోచోట నిర్మాణం చేపట్టాలని ఆదేశించటం విశేషం. ఆలయ పునర్నిర్మాణానికి సిద్ధం చేసిన స్థలానికి బదులు మరో చోట ప్రభుత్వ భూమిని సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో వెంకటాపురం తహసీల్దార్ రంగంలోకి దిగి రామానుజాపురానికి 5 కి.మీ. దూరంలో 30 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించారు. దాన్ని పురావస్తుశాఖ డిప్యూటీ డెరైక్టర్ రహీంషా అలీ, ఆ శాఖ వరంగల్ ఏడీ ప్రేమ్‌సాగర్‌లు పరిశీలించారు. అందులోనే ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు పురావస్తుశాఖకు స్వాధీనం చేయనున్నట్టు సమాచారం. మళ్లీ కొత్త ఖర్చు.. గతంలో గ్రామంలో ఆలయపునర్నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసి చదును చేశారు. ఆలయం నుంచి విప్పతీసిన శిల్పాలు, రాళ్లను ఇక్కడికి తరలించారు. కాగా, ఇప్పుడు కొత్తగా గుర్తించిన స్థలం గుట్టప్రాంతం కావటంతో దాన్ని మళ్లీ చదును చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి మళ్లీ భారీగా వ్యయం చేయాల్సి ఉంటుంది. -
గ్రూప్-1 అధికారులను జేసీలుగా నియమించాలి
ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్: నూతనంగా ఏర్పడుతున్న జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా గ్రూప్-1 ద్వారా ఎంపికైన అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గ్రూప్-1 సర్వీస్‌లో ఎనిమిదేళ్లు పూర్తిచేసిన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేసి ఆ అధికారులనే జాయింట్ కలెక్టర్, శాఖాధిపతులుగా నియమిస్తే పరిపాలనలో సమతుల్యత ఏర్పడుతుందని వారు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్లుగా రెవెన్యూ అధికారులను నియమిస్తే అది యాయవిరుద్ధమే కాకుండా వివిధ శాఖల్లో ప్రతిభావంతులైన అధికారులకు అన్యాయం చేసినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్, అధికారులు శశికిరణాచారి, అలోక్‌కుమార్, సర్వేశ్వర్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, పద్మజ, అనితాగ్రేస్, రఘుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు మా భూమిని లాక్కున్నారు
అర్ధరాత్రి దొంగల్లా ఆస్తిని కబ్జా చేశారు: ఎంపీ కొత్తపల్లి గీత సాక్షి, హైదరాబాద్: ఒక ఎంపీ భూమికే రక్షణ లేకపోతే ఎలా అని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో తమ సంస్థకు చెందిన విలువైన భూమిని అధికారులు లాక్కున్నారని ఆరోపించారు. రాయదుర్గంలోని సర్వే నం.83/2లో 53 ఎకరాల భూమిని ఎనిమిదేళ్ల కిందట చట్ట ప్రకారం కొనుగోలు చేశామన్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు దొంగల్లా తమ స్థలంలోకి ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బంది దాడిచేసి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ రంజిత్ కుమార్ ఉద్ధేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పు పట్టించారన్నారు. ఇందులో టీఎస్ఐసీ చైర్మన్ నరసింహారెడ్డి హస్తం కూడా ఉందని చెప్పారు. పర్సంటేజీలకు ఆశించే జేసీ ఇదంతా చేశారన్నారు. ఈ ఆస్తే తమ జీవితాధారమని.. అది లేని నాడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుందని చెప్పారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరతానని ఏంపీ గీత తెలిపారు. -
మా భూముల్లో సర్వే ఆపండి
* హైకోర్టులో మహబూబ్‌నగర్ జిల్లా శాతాపూర్ రైతుల పిటిషన్ * కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా, అంజనాగిరి రిజర్వాయర్ నుంచి వీరాంజనేయ రిజర్వాయర్ వరకు సొరంగం తవ్వేందుకు రెవెన్యూ అధికారులు ఓ ప్రైవేటు కంపెనీతో కలిసి తమ భూముల్లో సర్వే నిర్వహించడాన్ని సవాలు చేస్తూ శాతాపూర్ గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చట్ట ప్రకారం పాటించాల్సిన విధి విధానాలను పట్టించుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ యు.రాముడు, మరో 18 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది అర్జున్ వాదనలు వినిపిస్తూ, సర్వే వల్ల రైతుల పంటలు దెబ్బతింటున్నాయని, ప్రశ్నిస్తే ఎకరాకు రూ.8 వేల పరిహారం ఇస్తామని మౌఖికంగా చెబుతున్నారని వివరించారు. సర్వే విషయంలో ప్రశ్నిస్తే విధులకు ఆటంకం కలిగిస్తున్నందుకు కేసులు నమోదు చేస్తామంటూ రైతులను అధికారులు బెదిరిస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ప్రభు త్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ జోక్యంచేసుకుని, ఎవ్వరినీ బెదిరించడం లేదన్నారు. ఓ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించే అధికారం ప్రభుత్వానికి భూ సేకరణ చట్టం ప్రకారం ఉందన్నారు. అర్జున్ కలుగజేసుకుంటూ, జీవో 123 కింద భూములు ఇవ్వాలంటూ అధికారులు బెదిరిస్తున్నారన్నారు. దీనికి శరత్ అభ్యంతరం చెప్పారు. బెదిరిస్తున్నారంటూ పదే పదే చెప్పడం అందరికీ అలవాటైపోయిందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ, రైతులపై ఒత్తిళ్లు లేకుంటే వాళ్లు ఇన్ని వ్యయప్రయాసలకోర్చి ఇక్కడి వరకు వస్తారా? అంటూ వ్యాఖ్యానించారు. ఎల్లూరు రైతుల పిటిషన్ కొట్టివేత.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీ డిజైనింగ్ పేరుతో నవయుగ కంపెనీ తమ భూముల్లో చేస్తున్న సర్వేను అడ్డుకోవాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా, కొల్లాపూర్ మండలం, ఎల్లూరు గ్రామానికి చెందిన టి.నాగజ్యోతి, మరో 40 మంది రైతులు ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఉత్తర్వులు జారీ చేశారు. -
మంజీరలో ‘మహా’ అక్రమాలు
బోధన్: మంజీర నదిలో మహారాష్ట్ర మళ్లీ అతిక్రమణలకు పాల్పడుతోంది. మన సరిహద్దులోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేపడుతోంది. హద్దు రాళ్లను తొలగించి మరీ కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. తాజాగా మన భూభాగంలో ఇసుక తవ్వుతుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొక్లెయిన్, టిప్పర్ సీజ్ చేశారు. బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివారులోని అంతరాష్ట్ర చెక్‌పోస్టుకు సమీపంలో మంజీర నది తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తోంది. నదిలో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఏటా ఇది వివాదాస్పదమవుతూనే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి పేరుతో కాంట్రాక్టర్లు హద్దు దాటి మన భూబాగంలోని మంజీర నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరకు అవతలి వైపు నాందేడ్ జిల్లా బిలోలి, దెగ్లూర్, ధర్మాబాద్ తాలూకా పరిధిలో భూభాగం ఉంది. బిలోలి తాలూకా పరిధిలోని ఎస్గీ, గంజ్గం, బోలేగాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. బోలేగాం క్వారీ కాంట్రాక్టర్లు బోధన్ మండలంలోని మందర్న శివారులోని మన రాష్ట్ర సరిహద్దు రాళ్లను తొలగించి, మన భూభాగంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. సమాచారమందుకున్న బోధన్ రెవెన్యూ అధికారులు సోమవారం మందర్న శివారులో పర్యటించారు. ఇసుక తవ్వకాలను అడ్డుకొని, ప్రొక్లెయిన్, టిప్పరు స్వాధీనం చేసుకున్నారు. ‘మహా’ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతి ఇస్తున్న నేపథ్యంలో బోధన్ తహసీల్దార్ వినోద్‌కుమార్, సిబ్బంది మంజీర నది తీరంలో పర్యటించి మన రాష్ట్ర సరిహద్దులను గుర్తించి హద్దు రాళ్లను అమర్చారు. హద్దు దాటి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అక్కడి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కానీ బరితెగించిన కాంట్రాక్టర్లు హద్దు రాళ్లను తొలగించి మన భూభాగంలో ఇసుక తవ్వుతున్నారు. నదిలో సరిహద్దు వివాదాన్ని ఆసరా చేసుకుని మితిమీరుతున్నారు. వారికి ‘మహా’ సర్కారు అండగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. సరిహద్దులో ఇసుక జాతర.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోధన్ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలో ఇసుక లారీలు బారులు తీరుతున్నాయి. వందల సంఖ్యలో లారీల రాకపోకలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు 200 పైగా ఇసుక లారీలు, టిప్పర్ల ద్వారా ఇసు రవాణా సాగుతోంది. సాలూర చెక్‌పోస్టు నుంచి బోధన్ వరకు రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మహారాష్ట్ర ఇసుక క్వారీలతో అక్కడి ప్రభుత్వం, కాంట్రాక్టర్లు రూ.కోట్ల ఆదాయం దండుకుంటున్నారు. నకిలీ వేబిల్లుతో ఇసుక తరలిపోతోందని ఆరోపణలు వచ్చినా తనిఖీలు మాత్రం ‘మామూలు’గా కొనసాగుతున్నాయి. క్రిమినల్ కేసులు పెడతాం.. మహారాష్ట్రలోని బోలేగాం ఇసుక క్వారీ నిర్వాహకులు మన భూభాగంలో చొచ్చుకు వచ్చి హద్దు రాళ్లను తొలగించి ఇసుక తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలను అడ్డుకొని ప్రొక్లెయిన్, టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ సమాచారాన్ని కలెక్టర్‌కు అందించాం. మంజీర నదిలో హద్దులు దాటి ఇసుక తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – వినోద్‌కుమార్, తహసీల్దార్ -
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేసినిరోడ్డు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది గుర్తించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. రేసిని రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులతోపాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ముమ్మరంగా సోదాలు
నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు భారీగా నగదు, భూ పత్రాలు, ఆయుధాలు లభ్యం! హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురం, కుంట్లూర్తోపాటు నయీమ్ నివాసమున్న అల్కాపూర్ టౌన్షిప్లో మళ్లీ తనిఖీలు చేశారు. హస్తినాపురం ద్వారకానగర్‌లో నయీమ్ బంధువుల ఇంటి పై బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల క్రితం నయీమ్ ద్వారకానగర్‌లో బండ జైపాల్‌రెడ్డి ఇంటిని కొనుగోలు చేసి అందులో నజియాబేగంను ఉంచాడు. ఆ తర్వాత నయీమ్ అనుచరులు సుధాకర్‌చారి, నవీన్‌లు ఈ ఇంటిని సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారు. పోలీసులు ఈ ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉండటంతో పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. నగదు, పత్రాలు, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదరుడి ఇంటిపై దాడులు నయీమ్ పెద్దమ్మ కొడుకు సలీం గత ఆర్నె ల్లుగా పెద్దఅంబర్‌పేట పరిధిలోని కుంట్లూరు తెలంగాణనగర్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి సలీంతోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంటి నుంచి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అల్కాపురిలోని నయీమ్ ఇంటి ని నార్సింగి పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి తనిఖీ చేశారు. ఒక బెడ్రూమ్ను తనిఖీ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.30కి రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగ్ సీఐ రామ్‌చందర్‌రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరోసారి నయీమ్ ఇంట్లో సోదాలు జరిపారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ బుక్‌లు లభించినట్లు తెలిసింది. నయీమ్ కేసుల వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ ఇన్చార్జి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం అల్కా పురిలోని నయీమ్ ఇంటికి వచ్చి పోలీసుల నుంచి సోదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పోలీసుల ఇంటి నుంచి స్వాధీ నం చేసుకున్న నగదు, బంగారు అభరణాలు, పత్రాలను పోలీసులు గురువారం ఉప్పర్‌పల్లి కోర్టుకు అందజేసి, అనంతరం బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నారు. పోలీస్ కస్టడీలో ఫర్హానా, ఆసియాలు నార్సింగి పోలీసులు ఫర్హానా, ఆసియాలను బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వీరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి నయీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వీరి నుంచి రాబడుతున్నట్టు సమాచారం. -
వెబ్ కాదు.. డబ్బు ల్యాండ్!
≈ లోపాల పుట్టగా ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ ≈ సర్కారు అనాలోచిత నిర్ణయం.. భూ యాజమానులకు శాపం ≈ ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు ≈ ప్రభుత్వ ఖాతాలో ప్రైవేట్ భూములు ≈ సవరణల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు ≈ ముడుపులిస్తేనే తప్పులను సవరిస్తున్న అధికారులు ≈ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు ≈ పట్టాదారు పాసు పుస్తకాలను కొనసాగించాలని రైతుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇటీవల ఒకరికి చెందిన భూమిని మరొకరు విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిని ప్లాట్లుగా చేసేందుకు కూలీలను తీసుకెళ్లగా అసలైన యజమాని వచ్చి అడ్డుకున్నాడు. ఇది తన భూమి అని చెప్పడంతో వెబ్‌ల్యాండ్ చూసి మోసపోయానని లబోదిబోమనడం కొనుగోలుదారుడి వంతయ్యింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన ఒక రైతు వెబ్‌ల్యాండ్‌లో తన భూమి నమోదు కోసం వెళ్లగా రెవెన్యూ అధికారులు ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేశారు. బేరమాడి రూ.80 వేలు ముట్టజెప్పిన తర్వాతే ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో చేరింది. అత్యంత ప్రామాణికంగా, పకడ్బందీగా రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘మీ భూమి వెబ్‌ల్యాండ్’ అక్రమాల పుట్టగా తయారైంది. ప్రభుత్వం ముందుచూపు లేకుండా, అనాలోచితంగా తీసుకొచ్చిన రెవెన్యూ వెబ్‌ల్యాండ్ భూ యజమానుల పాలిట శాపంగా మారింది. ఇదంతా ‘డబ్బు ల్యాండ్’గా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ (వెబ్‌ల్యాండ్‌లో నమోదు)లో లొసుగులు, అవినీతి అక్రమాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ మాన్యువల్ రికార్డుల్లో ఒకరి పేరుతో ఉన్న ఆస్తులు ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరుతో దర్శనమిస్తున్నాయి. వందో రెండొందలో కాదు, ఇలాంటివి లక్షల్లోనే ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లలోని భూములు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. ఆన్లైన్లో నమోదైన చాలా ఆస్తులను తహసీల్దార్లు ధ్రువీకరించ లేదు. రైతులకు వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణానికి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాలకు పొంతన కనిపించడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే వారి భూములు వెబ్‌ల్యాండ్‌లో లేవంటూ బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. తమ భూములను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతున్న రైతులను రెవెన్యూ సిబ్బంది/దళారులు పీడిస్తున్నారు. డబ్బు ముట్టచెబితేనే వారి భూములను నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో సవరణల కోసం నిత్యం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయి. కొనుగోలుదారులకు తీవ్ర నష్టం వెబ్‌ల్యాండ్‌లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఒకరికి చెందిన భూమి వెబ్‌ల్యాండ్‌లో మరొకరి పేరిట ఉండడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోవడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల ఆన్లైన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా, లోపరహితంగా, పకడ్బందీగా పూర్తి చేసి, అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎలక్ట్రానిక్ ఆధారిత లావాదేవీలకు ఆమోదం తెలిపితే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. సర్వం లోపాలమయం దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు వెబ్‌ల్యాండ్‌లో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుండడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాలూ సర్కారు భూముల ఖాతాలో కనిపిస్తున్నాయి. భూ పంపిణీ కింద ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వేరే వారి పేర్లతో ఉండటంతో వాస్తవ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కిందిస్థాయి రెవెన్యూ అధికారులు/ దళారులు కుమ్మక్కై నకిలీల పేర్లను భూ యజమాని కింద వెబ్‌ల్యాండ్‌లో చేర్చి, విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు బయట పడుతున్నాయి. దీంతో అసలైన యజమానులే కాకుండా కొనుగోలుదారులు కూడా మోసపోతున్నారు. అధికారులు భారీగా సొమ్ము తీసుకుని ప్రభుత్వ భూములను, ప్రైవేట్ వ్యక్తుల పొలాలను ఇతరుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. భూమి విలువను బట్టి రేట్లు ఆన్లైన్లో భూముల నమోదుకు వాటి విలువ, యజమానుల ఆర్థిక పరిస్థితి, వారి అవసరాల ఆధారంగా రెవెన్యూ అధికారులు/ దళారులు రేట్లు ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదుకు భూమి విలువ, ఇతర అంశాల ఆధారంగా రూ.10 వేల నుంచి 60 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. కొంపముంచిన తొందరపాటు నిర్ణయం వెబ్‌ల్యాండ్‌లోని పొరపాట్లను పరిశీలించకుండానే ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసింది. వెబ్‌ల్యాండ్ ఆధారంగానే భూముల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేయాలని, పంట రుణాలు ఇవ్వాలంటూ ఏకంగా జీవో ఇచ్చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. వెబ్‌ల్యాండ్‌లో తప్పులను సవరించే వరకూ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే లావాదేవీలకు అనుమతించాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం పేరు మాయం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో సర్వే నంబరు 831లో నాకు 2.60 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. రెండు నెలల క్రితం వెబ్‌ల్యాండ్‌లో ఈ భూమి యజమానిగా నా పేరు బదులు మరో వ్యక్తి పేరు ప్రత్యక్షమైంది. నిజమైన రైతు పేరును వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడానికి డాక్యుమెంట్లు అడుగుతున్న అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండానే నా భూమి యజమానిగా వేరే వ్యక్తి పేరును ఎలా నమోదు చేశారో అర్థం కావడం లేదు. - చింతకాయల రామాంజనమ్మ ఐదెకరాలుంటే రెండెకరాలుగా నమోదు శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన గుంటబోయిన వెంకటరమణకు ఐదెకరాలకు పైగా సాగు భూమి ఉంది. వెబ్ అడంగల్‌లో మాత్రం కేవలం రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. దీంతో ఈయన మ్యుటేషన్ కోసం మార్చి నెల లో మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశారు. ఇంతవరకూ వెబ్ అడంగల్‌లో మార్పు చేయలేదు. శ్రీకాకుళం జిల్లా గోళ్లవలస గ్రామంలో 400 మంది రైతులకు చెందిన 2 వేల ఎకరాల భూములు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. దీంతో పంట రుణాలకు నోచుకోకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మోసాలు బయటపడటంతో... వెబ్‌ల్యాండ్‌లోని తప్పులను ఆసరాగా చేసుకుని ఒకరి భూమిని మరొకరు విక్రయిస్తున్నారని, కొందరు రెవెన్యూ అధికారులు ఇలాంటి మోసాలకు సహకరిస్తున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వెబ్‌ల్యాండ్ ఆధారిత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటికే ఎన్నో మోసాలు బయటపడ్డాయి. దీనివల్లే తాత్కాలిక (నోషనల్) ఖాతాలకు సంబంధించిన భూములను విక్రయ రిజిస్ట్రేషన్లు చేయరాదని, శాశ్వత ఖాతాలేని వారికి పంట రుణాలు ఇవ్వరాదంటూ తాజాగా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని పొరపాట్లు జరిగిన విషయం వాస్తవమేనని, వీటిని సవరించే ప్రక్రియ త్వరలో చేపడతామని రెవెన్యూ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
ముందడుగు..
♦ పరిష్కారం దిశగా ఏళ్లనాటి సమస్యలు ♦ ఆ వైపుగా రెవెన్యూ అధికారుల అడుగులు ♦ ఇప్పటికే దాచారం, అన్నారం గ్రామాలసమస్యల పరిష్కారం ♦ తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై దృష్టి జిన్నారం : దీర్ఘకాలికంగా ఉన్న భూసమస్యల పరిష్కారానికి మండల రెవెన్యూ అధికారులు చొరవ చూపుతున్నారు. అరవై ఏ ళ్లుగా నానుతున్న దాచారం ఇళ్లస్థలాలు, అన్నారంలో 30 ఏళ్లుగా వేధిస్తున్న రైతుల భూసమస్యను ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరించారు. తాజాగా 59జీఓ కింద రిజిస్ట్రేషన్లపై దృష్టిసారించారు. జిన్నారం మండలం దాచారం, దార్గుల గ్రామాలను 60 ఏళ్ల క్రితమే డీఆర్డీఓ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ తమకు వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఈ గ్రామాలను వదిలే ప్రసక్తే లేదని దాచారం, దార్గుల వాసులు తేల్చిచెప్పారు. అలా చాలా ఏళ్లుగా ఈ సమస్య నానుతూ వస్తోంది. రెండేళ్ల క్రితం దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కి ష్టాయిపల్లిలోని 166 సర్వే నంబర్ గల భూమిలో 36 ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. రెండు నెలల క్రితం దాచారం గ్రామాన్ని డీఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో దాచారం గ్రామాల ప్రజలు రోడ్డున పడ్డారు. వారికి త్వరగా ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. దాచారం, దార్గుల గ్రామాల ప్రజలకు కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన 360 మందిని గుర్తించి ఇళ్ల స్థలాల పట్టాతోపాటు పొజిషన్‌ను కూడా చూపించారు. అన్నారం సమస్య 30 ఏళ్లది... అన్నారంలోని 261 సర్వే నంబర్లో 30 ఏళ్ల క్రితం 108 మంది రైతులకు ఎకరం చొప్పున సాగు చేసుకునేందుకు భూమి ని అందిస్తూ సర్టిఫికెట్లు అందించారు. ఇదే సర్వే నంబర్లో ఎక్స్సర్వీస్మెన్లకు కూడా స్థలాలు కేటాయించారు. అప్పటినుంచి రైతులకు, ఎక్స్సర్వీస్మెన్లకు పొజిషన్ చూపడంలో అధికారులు విఫలమయ్యారు. సర్వే నంబర్ ఒకటే కావటంతో ఎవరికి ఎక్కడ స్థలాన్ని కేటాయించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలుపడుతూ వచ్చా రు. తహసీల్దార్ శివకుమార్ ఎమ్మెల్యే చొరవతో గ్రామంలో రైతులతో, ఎక్స్సర్వీస్మెన్లతో స్వయ ంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ముందుగా స్థలాన్ని కేటాయించి, ఆ తర్వాత ఎక్స్సర్వీస్మెన్లకు కేటాయిస్తామని చెప్పా రు. దీంతో రైతులకు ఎకరం చొప్పున లాట రీ ద్వారా స్థలాన్ని ఎంపిక చేసి అం దజేశారు.దీంతో ఈ సమస్యకు పరిష్కారమైంది. 59జీవో కింద ఆయా గ్రామాల ప్రజలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేం దుకు దరఖాస్తులు చేసుకున్నారు. రెండేళ్లుగా ఈ సమస్య అలాగే ఉంది. ప్రస్తుతం మండల వ్యాప్తంగా 59జీఓలో భాగంగా రిజిస్ట్రేషన్ పనులు వేగంగా జ రుగుతున్నాయి. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుం టున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, రెవెన్యూ అధికారులను ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు. శాశ్వతపరిష్కారం దిశగా ముందుకు.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సహకారంతో మండలంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నాం. 59జీఓ కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాం. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దాచారం, దార్గుల గ్రామాల ప్రజల సమస్య పరిష్కారం కావటం సంతోషంగా ఉంది. - శివకుమార్, తహసీల్దార్ జిన్నారం -
‘రాత్రికి రాత్రి పంటచేలు పాడుచేశారు..’
జేసీ ఆమ్రపాలికి ఫిర్యాదు చేసిన బాధిత రైతులు పరిగి : రాత్రికి రాత్రే రెవెన్యూ అధికారులు తమ పంట పొ లాలను దున్ని పాడు చేశారని మండలంలోని రూప్‌ఖాన్ పేట్‌కు చెందిన రైతులు తెలిపారు. వారు బుధవారం పరిగికి వచ్చిన జారుుంట్ కటెక్టర్ ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు. మండలంలోని తుంకలగడ్డ శివారులో 70 సంవత్సరాల క్రితం తమకు ప్రభుత్వం భూమిని పంపిణీ చేసిందన్నారు. ఆ భూమిలో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నామని తెలిపారు. తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా గత సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌తో మొక్కజొన్న పంటను దున్నేశారని బాధిత రైతులు వివరించారు. ఆ పొలం ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తే మరో చోటనైనా తమకు భూములు ఇవ్వాలని ఆమెను కోరారు. పరిశీలిస్తామని ఆమె తెలిపారు. -
'లంచం అడుగుతున్నారు మహాప్రభో'
హైదరాబాద్: రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారని.. ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వోలు తనను రూ. 60 వేలు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో బాధితుడు ఆరోపించాడు. లంచం డిమాండ్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. -
భూకబ్జాకు భారీ స్కెచ్!
► నడింపాలెంలో ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను ► 2.40 ఎకరాలకు నకిలీ వ్యవసాయ అప్పగింత పట్టాలు ► రాజముద్ర (సీల్), స్టాంపులు అన్నీ నకిలీవేనని నిర్ధారణ ► తహశీల్దార్ సంతకం సైతం ఫోర్జరీ.. డీకే రిజిస్టరు మాయం ► సర్పంచ్ చొరవతో వెలుగులోకి వచ్చిన వైనం... ► పూర్తి విచారణకు రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు నడింపాలెంలో నకిలీ పట్టాల కుంభకోణం వెలుగుచూసింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు అక్రమార్కులు నకిలీ పట్టాలను సృష్టించారు. ఏకంగా తహశీల్దార్ సంతకాలనే ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలతో ప్రభుత్వ భూమిని కాజేసే పన్నాగం పన్నారు. ప్రత్తిపాడు : ప్రత్తిపాడు మండలం నడింపాలెం 16వ నంబరు జాతీయ రహదారిపై 184 సర్వే నంబరులో 29.65 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై కన్నేసిన కబ్జాదారులు ఆ భూమిని కాజేసేందుకు భారీ స్కెచ్ వేశారు. రికార్డుల్లో లేని సర్వే నంబర్లు సృష్టించి 2.40 ఎకరాల భూ దోపిడీకి పాల్పడ్డారు. 184-3-ఏ1ఏ సర్వే నంబరుతో నకిలీ సబ్‌డివిజను సృష్టించి 2015 ఫిబ్రవరి 16న ఒక్కొక్కరికీ 30 సెంట్లు చొప్పున వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎనిమిది మంది పేర్లతో 2.40 ఎకరాలకు నకిలీ పట్టాలను (వ్యవసాయ అప్పగింత పట్టాలు) పుట్టించారు. సంతకాలు, స్టాంపులు, సీల్స్.. అన్నీ నకిలీవే.. నడింపాలెంలో వెలుగులోకి వచ్చిన నకిలీ పట్టాలను చూసిన రెవెన్యూ అధికారులు సైతం అవాక్కవుతున్నారు. పట్టాలపై ఉన్న రాజముద్ర (సీల్), తహశీల్దార్ పేరుతో ఉన్న స్టాంపులు అన్నీ నకిలీవేనని తేల్చారు. వీటితో పాటు ఏకంగా తహశీల్దార్ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీకే రిజిస్టర్ మాయం.. ఇదిలా ఉంటే గ్రామంలో ఎవరికైనా నివేశన స్థలాలు లేదా వ్యవసాయ భూముల పట్టాలు అప్పగించిన సమయంలో లబ్ధిదారుల పూర్తి వివరాలను డీకే రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది. నడింపాలెం గ్రామానికి సంబంధించిన డీకే రిజిస్టర్ మాయమైంది. నాలుగు రోజులుగా పట్టాల పంపిణీకి సంబంధించిన రిజిస్టర్ల కోసం వీఆర్వోలు వెతుకుతున్నప్పటికీ ఫలితం లేకుండా ఉంది. దీంతో కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు? అసలు ఈ దొంగ పట్టాలు ఎంత మందికి ఇచ్చారు? ఇచ్చిన వారు ఎవరు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు కార్యాలయంలోనే అస్మదీయులు ఉన్నారా? అన్న అనుమానాలూ లేకపోలేదు. సర్పంచ్ చొరవతో వెలుగులోకి.. ఈ నకిలీ కుంభకోణం గ్రామ సర్పంచ్ నేలపాటి శౌరీలు చొరవతో వెలుగులోకి వచ్చింది. ఇటీవల సదరు ప్రభుత్వభూమిలో కొందరు పొక్లెయినర్లు, ట్రాక్టర్లుతో భూమిని చదును చేయించడంతో గ్రామంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో సర్పంచ్ శౌరీలు రంగంలోకి దిగారు. ప్రత్తిపాడు తహశీల్దార్ పద్మావతిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా అప్పటి తహశీల్దార్ ఏసుబాబు (ప్రస్తుత దుర్గి తహశీల్దార్)ను కలిసి తనకు లభించిన నకిలీ పట్టాలను చూపించారు. దీంతో నిజం నిగ్గుతేలిపోయింది. పట్టాలను, పట్టాలపై ఉన్న సంతకాలు పరిశీలించిన దుర్గి తహశీల్దార్ ఏసుబాబు అవి తన సంతకాలు కావని, అసలు తన హయాంలో ఎవరికీ ఇళ్ల పట్టాలు గానీ, డీకే పట్టాలు గానీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ప్రత్తిపాడు తహశీల్దార్‌కు ఓ లేఖ రాశారు. తన సంతకాలను ఎవరో ఫోర్జరీ చేశారని, నిజాలను నిగ్గు తేల్చి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఆ పట్టాలు నకిలీవే.. నడింపాలెంలో వెలుగు చూసిన వ్యవసాయ భూమి అప్పగింత పట్టాలు నకిలీవే. పట్టాలు పరిశీలించాను. అనుమానం వచ్చి అప్పటి తహశీల్దార్ ఏసుబాబుని అడిగాను. తన హయాంలో ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని ఆయన చెప్పారు. దానికితోడు అందుకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులు కూడా కార్యాలయంలో ఏమీలేవు. అందుచేత కచ్చితంగా అవి నకిలీ పట్టాలే. పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాను. - పద్మావతి, తహశీల్దార్, ప్రత్తిపాడు మండలం. డీకే రిజిస్టర్ లేదు మా రికార్డుల్లో 184-3-ఏ1ఏ సర్వే నంబరు లేనేలేదు. ఇది నకిలీ సర్వే నంబరు. అయినా అసలు 2015లో పట్టాలు ఇచ్చినట్లుగా కార్యాలయంలో రికార్డులేమీ లేవు. నాలుగు రోజులుగా డీకే రిజిస్టర్ కోసం వెతుకుతున్నాం. కనిపించలేదు. అందుచేత ఇవి నకిలీవిగానే భావిస్తున్నాం. 184 సర్వే నంబరులో ఉన్న భూమి మాత్రం ప్రభుత్వ భూమే. - కె జీవనజ్యోతి, ఇన్చార్జి వీఆర్వో, నడింపాలెం గ్రామం. -
డబ్బులివ్వందే పని చేయరట!
రెవెన్యూ అధికారుల తీరుపై బాధితురాలి ఆవేదన సైదాపూర్: తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులివ్వందే పనిచేయడం లేదని బాధితురాలు దొనికెన లలిత మంగళవారం తన గోడు వెళ్లబోసుకున్నారు. మూడేళ్ల క్రితం ఎలబోతారం శివారులో మూడెకరాల భూమిని కొన్నామని, జమాబందీ పాస్‌బుక్‌లో ఖాతా నెంబర్ 791 నమోదు కాగా, కంప్యూటర్ ఆన్లైన్లో 1019 అని తప్పుగా నమోదు చేశారని తెలిపారు. దీని సవరణ కోసం మూడు సంవత్సరాలుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, డబ్బులివ్వందే పని కాదంటూ కంప్యూటర్ ఆపరేటర్ తేల్చిచెప్పాడని ఆరోపించారు. తప్పు చేసింది తహసీల్ కార్యాలయ సిబ్బందేనని, తిరిగి సవరణ చేయమంటే ఇంత గోసపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఎకరంన్నర భూమికొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, జమాబందీ అమలుకు గతేడాది నవంబర్ 21న దరఖాస్తు చేస్తే, అదెక్కడో పోయిందంటే తిరిగి 23న మరోసారి దరఖాస్తు చేశానని పేర్కొన్నారు. ఇప్పటివరకు పనిచేయలేదని, ఈ విషయమై అధికారులను అడుగుతే చివరకు ఫైలే లేదు, అసలు దరఖాస్తు పెట్టుకోలేదని అంటున్నారని తెలిపారు. -
బది‘లీలలు’!
కలెక్టరేట్లో పాతుకుపోయిన 15 మంది అధికారులు వీరిని పక్కమండలాలకూ పంపలేని వైనం ముడుపులే బదిలీలను ఆపిస్తున్నాయా? అవకాశం కోసం ఎదురుచూస్తున్న రెవెన్యూ అధికారులు కలెక్టరేట్లో ఓ పరిపాలనా అధికారి సుమారు పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. పైసా ముట్టందే ఫైలు కూడా తాకరు. అడిగినంత ఇవ్వకుంటే ఇచ్చినంత పుచ్చుకుని ఫైలు దాచేస్తాడు. కాంట్రాక్టు ఉద్యోగులనూ వేధించే ఈ అధికారి ఉన్నతాధికారులకు ముడుపులందిస్తూ... కలెక్టరేట్లో తన దందా కొనసాగిస్తున్నాడు. ఈ బదిలీల్లో అయినా కలెక్టరేట్‌కు ఈయన నుంచి విముక్తి లభిస్తుందని రెవెన్యూ సిబ్బంది భావించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. ఒక డెప్యూటీ తహశీల్దార్ 2001లో కలె క్టరేట్‌లో విధుల్లో చేరారు. ఒక్క ఆర్ఐ పీరియడ్‌లో తప్ప తన సర్వీస్ మొత్తం కలెక్టరేట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు ముడుపులు చెల్లిస్తుండటంతోనే బదిలీ చేయడంలేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికీ బదిలీ తప్పదని కలెక్టర్ చెప్పడంతో.. ఆ అధికారి కచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ పైరవీ ఫలించింది. ఆ అధికారి మళ్లీ ఇక్కడే నిలిచారు. చిత్తూరు: రెవెన్యూ ఉద్యోగుల బది‘లీలల’పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్లో పీఠాధిపతులుగా పాతుకుపోయిన ఆ 15 మందిని ఈ సాధారణ బదిలీల్లో కూడా కదపకపోవడంపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బదిలీ అని తెలిసిన ప్రతిసారీ వీరు డిప్యూటేషన్‌పై ల్యాండ్‌అక్విజేషన్, ఆర్డీవో, డీఎస్వో ఆఫీసులకు వెళ్లడం.. అక్కడ కొన్నేళ్లు పనిచేసి మళ్లీ కలెక్టరేట్‌కే రావడం రివాజుగా మారుతోంది. వీరిని కనీసం చిత్తూరు చుట్టుపక్కల మండలాలకు కూడా బదిలీచేయకపోవడం గమనార్హం. పారదర్శకత ఏదీ? మూడేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రతి ఉద్యోగినీ బదిలీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఐదేళ్లకు మించి ఉంటే ఉద్యోగి ఇష్టంతో సంబంధం లేకుండా జిల్లాలో ఏ మూలకైనా బదిలీ చేయొచ్చు. మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిబంధనలను అధికారులు కచ్చితంగా వర్తింపజేస్తున్నారు. అయితే కలెక్టరేట్‌కు వచ్చేసరికి మంచి పనితీరు అనే నెపంతో నిబంధనలు పక్కన పెడుతున్నారు. మండలాల్లో పనిచేసే ఉద్యోగులు బలైపోవాల్సి వస్తోంది. ముడుపులే కారణమా? బదిలీ నిలుపుదల చేసుకునేందుకు కలెక్టరేట్లో పనిచేస్తున్న ఆ 15 మంది ఉన్నతాధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందజేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా పనితీరు బాగుందని కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తూ వారిని ఇక్కడే ఉంచుతున్నారు. సంవత్సరాల తరబడి వీరు ఒకే చోట పనిచేస్తుండడంతో ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఆశ..నిరాశే చిత్తూరు నుంచి 20 కి.మీ పరిధిలోని పూతలపట్టు, జీడీనెల్లూరు, గుడిపాల, యాదమర్రి, తవనంపల్లి, ఐరాల, పెనుమూరు మండలాల రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్లో పనిచేయాలని తమ కోరికను పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి విన్నపాన్ని బుట్టదాఖలుచేస్తున్నారు. దీంతో వారిలో తీవ్ర అసంతృప్తి రేకెత్తుతోంది. అవకాశం ఇస్తే ఇప్పుడున్నవారికంటే బాగా పనిచేస్తామని చెబుతున్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లోనూ.. సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లోనూ పీఠాధిపతుల జాబితా పెద్దదే. తిరుపతి, మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయాల్లో కొందరు ఏళ్లతరబడి పాతుకుపోయారు. వీరు సీనియర్ అనే నెపంతో జూనియర్ ఉద్యోగులను వేధిస్తున్నారు. రాచరిక తీరును ప్రదర్శిస్తూ కిందిస్థాయి ఉద్యోగులను అవమానాలకు గురిచేస్తున్నారు. మోక్షం కలిగేనా? జిల్లాలో నలుగురు తహశీల్దార్లను బలవంతపు సెలవులో పంపారు. నాలుగు నెలల నుంచి వారు సెలవులో ఉన్నారు. వీరు గత శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్ కూగా హాజరయ్యారు. అయితే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్చార్జ్ ఎమ్మార్వోలు ఉన్న మండలాల్లో చాలా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీరు పాలనపై సరిగా దృష్టిపెట్టకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరుకు ఏం అరుణ్‌కుమార్ ఇంచార్జ్ ఎమ్మార్వోగా పనిచేస్తున్నారు. ఈయ న ఎక్కువ సమయం ఆర్డీవో కార్యాలయంలో గడుపుతుండటంతో తహశీల్దార్ ఆఫీసులో పాలన పడకేసింది. నామమాత్రంగా బదిలీ కలెక్టరేట్లో దాదాపు 55 మంది రెవెన్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న డెప్యూటీ తహశీల్దారు స్థాయి సిబ్బందిలో ఐదుగురిని మాత్రమే బదిలీ చేశారు. మిగిలిన వారు అక్కడే పాతుకుపోయారు. -
సర్వేపై సందేహాలు
► పేరుకు గ్రామ కంఠాలు.. కానీ రోడ్ల ► సర్వే అని అనుమానం ► ఇళ్లు తొలగిస్తారేమోనని ఆందోళన ► మానసిక వేదన పడుతున్న ప్రజలు ఉండవల్లి/పెనుమాక (తాడేపల్లి రూరల్) : ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో గ్రామ కంఠాలు నిర్ణయిస్తున్నామంటూ రెవెన్యూ అధికారులు రిటైర్డ్ సర్వేయర్లతో సర్వే కార్యక్రమం చేపట్టింది. గురువారం ఉండవల్లి గ్రామంలో సర్వే చేస్తుండగా, ప్రజలు అభ్యంతరం తెలియజేసి, మీరెందుకు సర్వే చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాలను నిర్ణయించేందుకు పని చేస్తున్నామని వారు తెలిపారు. వాస్తవానికి గ్రామ కంఠాల సర్వే చేస్తే గ్రామాల నలుమూలల నిర్వహించాల్సి ఉంది. అలాంటిది ఉండవల్లిలో పాత ఆర్అండ్బీ రోడ్డులో మాత్రమే ఈ సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం ఆర్డీవో శ్రీనివాసరావు ఉండవల్లిలో రోడ్ల విస్తరణ కోసం ఇళ్లు తొలగించాలని సూచించారు. దీంతో స్థానికులు అందరూ ఆయన ప్రతిపాదనను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అయితే రోడ్ల కోసం సర్వే అని చెబితే ప్రజల్లో తిరుగుబాటు ఎక్కడ వస్తుందోనని అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో ఎత్తుగడను మార్చి గ్రామ కంఠాల సర్వే చేస్తున్నామని చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్లు నిర్మించే ప్రాంతాల్లో గప్‌చుప్‌గా సర్వే క్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పెనుమాక గ్రామస్తులు అయితే టీడీపీ ఆధ్వర్యంలో ఆర్డీవోను కలిసి, తాము పొలాలు కోల్పోయామని, రోడ్ల కోసం మా ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితి ఏమిటో చెప్పాలని అధికారులను నిలదీశా రు. దీంతో ప్రభుత్వం 1932లో లెక్కల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సర్వేలు చేయిస్తున్నారు. అయితే ఈ నివాసాలు అన్నీ కూడా 1952 తరువాత నిర్మాణం చేపట్టినవి. 1952 నుంచి ఇప్పటి వరకు అధిక సంఖ్యలో గృహ నిర్మాణాలు జరగడంతో పాటు స్థలాలు, ఇళ్లు కొనుగోలు, అమ్మకాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో స్థల యజమానులు ఏళ్ల తరబడి స్థానిక పంచాయతీలకు పన్నులను చెల్లిస్తూనే ఉన్నారు. ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న రికార్డును ప్రస్తుతం బలవంతంగా అమలు పరచాలని ప్రభుత్వ ఉద్దేశమని పెనుమాక, ఉండవల్లి గ్రామాల ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. -
నమ్మించి ముంచారు
► జీరో ల్యాండ్ పేరుతో పాగా వేయించారు ► రూ.లక్షలు పెట్టి ఇళ్లు కట్టించుకున్నాం ► తర్వాత దౌర్జన్యంగా ఖాళీ చేయించారు ► ‘చినబాబు కాలనీ’ బాధితుల ఆవేదన జీరో ల్యాండ్’ పేరిట నమ్మించారు. గుడిసెలు వేసుకుంటే త్వరగానే పట్టాలిప్పిస్తామన్నారు. తమకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. వారి మాటలను పేదలు నమ్మారు. స్థలం వస్తుందన్న ఆశతో కట్టెలు, ఇతరత్రా సామగ్రి సమకూర్చుకుని గుడిసెలు వేసుకున్నారు. మరికొందరు అప్పోసప్పో చేసి.. లక్ష, లక్షన్నర రూపాయల ఖర్చుతో పక్కా నిర్మాణాలు కూడా చేపట్టారు. కొద్దిరోజుల్లోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. నమ్మబలికిన ‘పచ్చ నేతలే’ నట్టేట ముంచారు. స్థలం వదిలి వెళ్లిపోవాలని బెదిరించారు. వారు వదలకుంటే బలవంతంగా లాక్కొని తమ వారికి కట్టబెట్టారు. ఇదీ ‘చినబాబు కాలనీ’ కథ. జేఎన్టీయూ : అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 3.80 ఎకరాల స్థలంలో ‘తమ్ముళ్లు’ సృష్టించిన చినబాబు కాలనీ కారణంగా అనేకమంది పేదలు బలయ్యారు. కాయాకష్టం చేసి సంపాదించుకున్న డబ్బంతా అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి పోగొట్టుకున్నారు. స్థలం వస్తుందని ఆశపడితే .. చివరకు అప్పుల పాలు కావాల్సి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారు. దౌర్జన్యంగా కట్టుబట్టలతో బయటకు గెంటేశారని, తమ స్థలాలు/ నిర్మాణాలు నాయకుల అనుయాయులకు కట్టబెట్టారని వాపోతున్నారు. ఈ స్థలం జీరోల్యాండ్ అని చెప్పడంతో పేదలు గుడిసెలు వేసుకోవడానికి ముందుకొచ్చారు. స్థలం ఆక్రమణలో ఉంటే రెవెన్యూ అధికారులు ఏదో ఒకరోజు పట్టాలివ్వకపోతారా అని ఆశించారు. కొందరు ధైర్యం చేసి నిర్మాణలు కూడా చేపట్టారు. ప్రస్తుతం కాలనీలో 128 ఇళ్లు వెలిశాయి. ఇందులో ప్రస్తుతం టీడీపీ నాయకులు 67 కుటుంబాలను వెళ్లగొట్టారు. వాటిలో కొన్ని తమ అనుయాయులకు ఇవ్వడంతో పాటు బేరం పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఇద్దరు టీడీపీ నేతల పాత్ర ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలతో చెలగాటమాడుతున్నా.. ప్రభుత్వస్థలాన్ని బహిరంగంగా అమ్ముతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమార్కుల చెర నుంచి ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని పాలిటెక్నిక్ విద్యార్థులు కోరుతున్నారు. రూ.22.80 కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతమైతే చూస్తూ ఊరుకోవడం తగదని అంటున్నారు. గుగ్గిళ్లు అమ్మి.. డబ్బు కట్టా జేఎన్టీయూ ఓల్డ్ క్యాంపస్, పంచాయతీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రతి రోజూ గుగ్గిళ్లు అమ్మి జీవనం సాగిస్తున్నా. తద్వారా కూడబెట్టిన రూ.40 వేలతో రేకుల కొట్టం వేసుకున్నా. అలాగే ప్రతి నెలా చందాల పేరుతో నాయకులు వసూలు చేశారు. ఆ డబ్బుతో జల్సాలు చేశారు. నన్ను దౌర్జన్యంగా బయటకు గెంటేసి.. కొట్టమున్న స్థలాన్ని రూ. రెండు లక్షలకు అమ్మేశారు. నేను ఇంటికి పెట్టిన సొమ్ము కోసం ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. -రామలక్ష్మి, బాధితురాలు -
మదనపల్లెలో మాజీ సైనికుని నిరాహార దీక్ష
అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు వద్ద మాజీ సైనికులు సోమవారం ఆందోళనకు దిగారు. మదనపల్లె ప్రాంతంలోని 150 మంది మాజీ సైనికులకు స్థలాలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సంఘం నాయకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఎన్ని విజ్ఞాపనలు అందజేసినా, ఎన్నిసార్లు ఆందోళనలకు దిగినా స్పందించలేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సమస్య పరిష్కారమయ్యేదాకా దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. -
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం.. ఆరు ఇళ్లు దగ్ధం
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పేరకలపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌లీకై ఓ ఇంట్లో చెలరేగిన మంటలకు మొత్తం ఆరు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టం గురించి వివరాలు సేకరించారు. -
పారదర్శకంగా సేవలందించాలి
► భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ ► జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ... ఎదులాపురం : రెవెన్యూ అధికారులు ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని భూ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి రేమండ్ పీటర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా జీవో నం.58, 59లకు అనుగుణంగా భూ క్రమబద్ధీకరణ చేసిన వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు డివిజన్లలో 2635 మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, 2255 మంది దరఖాస్తులను పరిశీలించి 914 మందికి రెగ్యులర్ చేశామని తెలిపారు. 297 అభ్యర్థుల ద్వారా రూ.18 ,91,60,000లు ప్రభుత్వానికి జమ చేయడం జరిగిందని, వీరికి పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో మీ సేవ కేంద్రాల పని తీరుపై ప్రధాన కార్యద ర్శి వివరణ కోరగా జిల్లాలో కొంత మంది మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, విచారణ జరిపి సంబంధిత మీ సేవ యజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయాల ద్వారా అన్ని మీ సేవా కేంద్రాల్లో ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ సుందర్‌అబ్నార్, డీఆర్వో సంజీవ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో అరవింద్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కేకే ఓసీపీకి భూసేకరణ ప్రారంభం
జీవో 123కు కొంత మంది రైతుల అంగీకారం కాసిపేట : మండలంలో ఏర్పాటు కానున్న కేకే ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం భూసేకరణ ప్రారంభించారు. అధికారుల సూచన మేరకు కొంత మంది రైతులు 123 జీవోకు అంగీకరించి రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు. గతం నుంచి అధికారులు, రైతుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అవుతుండటం.. ఎకరాకు లక్ష అంటు అధికారులు, రూ.12లక్షలు ఉద్యోగం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇటీవల సమావేశమైన జాయింట్ కలెక్టర్ రైతులకు డ్రై లాండ్ ఎకరాకు రూ.5.50లక్షలు, తరికి రూ.6లక్షలు చెల్లిస్తామని తేల్చి చెప్పారు. రైతులు అంగీకరిస్తే 123 జీవో ప్రకారం సెటిల్మెంటు చేస్తామని, లేదంటే సాధరణ భూసేకరణ చట్టం ద్వారా నోటీసులు అందించి ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్వేలు పూర్తికావడంతో పూర్తి వివరాలు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అప్రోచ్ రోడ్డుకు సంబంధించి 45ఎకరాలకు నోటిఫికేషన్ సైతం వెలువడడంతో అధికారులు రైతులకు ఎటో తేల్చుకోవాలని సూచించారు. ఆమోదం తెలిపిన రైతులకు 123 జీవో ప్రకారం అందించి మిగత వారి పేర్లు సాధారణ భూసేకరణ చట్టం కింద పంపుతామని నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో శుక్రవారం సుమారు 35మంది రైతులు 180ఎకరాల వరకు ఆమోదం తెలుపుతూ రెవెన్యూ అధికారుల వద్ద సంతకాలు చేశారు. ఇష్టం ఉన్న రైతుల పేర్లు పంపిస్తామని, ఇతర రైతులకు మరోమారు అవకాశం ఇచ్చి భూసేకరణ చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇప్పటికే సర్వే నంబరు 62, 67, 71, 107, 108, 112, 113, 114, 116,117, 130, 146,147, 198లో భూసేకరణ పూర్తి చేశారు. కార్యాలయం వద్ద అంగీకరించిన రైతులు సంతకాలు చేసేందుకు రావడంతో సందడి నెలకొంది. -
రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలో ఇద్దరు రెవెన్యూ అధికారులపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు రెండు నెలల క్రితమే నమోదు కాగా, తాజాగా సదరు అధికారులకు నోటీసులు జారీ చేయడంతో వ్యవహారం బయటకు పొక్కింది. పౌర సరఫరాల శాఖ బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగాయని, సరుకుల పంపిణీ రిజిస్టర్లో ఫోర్జరీ సంతకం చేశారనే ఆరోపణలతో సంగారెడ్డి తహసీల్దారు గోవర్దన్, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ సురేశ్‌తోపాటు రేషన్ డీలర్ శంకర్‌పై మార్చి 17న సంగారెడ్డి పట్టణ పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని రెవెన్యూ శాఖ బాధ్యులకు కానీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు తెలియకుండానే దాదాపు రెండు నెలలపాటు అత్యంత గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత రికార్డులు ఇవ్వాలని స్థానిక ఎస్ఐ గణేశ్ సోమవారం సంగారెడ్డి తహసీల్దారు గోవర్దన్‌కు నోటీసులు జారీ చేయడంతో వ్యవహారం బయటకు పొక్కింది. అసలు కారణం... సంగారెడ్డి పట్టణంలోని మంజీర నగర్ 16వ నంబర్ చౌకధర దుకాణంలో తిరుపతిరెడ్డికి రేషన్‌కార్డు ఉంది. తనకు కొంతకాలంగా బియ్యం ఇవ్వడం లేదని ఆయన రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో గత మార్చి నెలలో ఎస్పీ సుమతిని కలసి ఫిర్యాదు చేశారు. దీంతో బాధ్యులపై కేసు నమోదు చేయాలని పట్టణ సీఐ ఆంజనేయులును ఎస్పీ ఆదేశించారు. అవినీతి ఎలా జరిగింది..? తిరుపతిరెడ్డి పేరుతో ప్రతి నెలా బియ్యం తీసుకుంటున్నట్టు సరుకుల పంపిణీ నివేదికలో పొందుపరిచారు. బియ్యం తీసుకుంటున్నట్టు తిరుపతిరెడ్డి పేరుతో సంతకం కూడా ఉంది. తాను బియ్యం తీసుకోలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బాధితుడు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సంతకం ఫోర్జరీ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మార్చి 17న స్థానిక డీలర్ శంకర్, తహసీల్దార్ గోవర్దన్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌ను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా విషయం వెలుగు చూడడంతో పోలీసులు సదరు అధికారులను అరెస్టు చేస్తారా? లేక మధ్యే మార్గంలో రాజీ కుదిరించుకుంటారో వేచి చూడాల్సిందే. అయితే ఎస్పీ సుమతి రెవెన్యూ శాఖలో తలదూర్చి పలువురిపై కేసులు నమోదు చేసినప్పటికీ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ మౌనం వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అవినీతికి పాల్పడలేదు: డీలర్ తిరుపతిరెడ్డికి ప్రతినెలా 12 కిలోల బియ్యం కోటా వస్తుందని డీలర్ శంకర్ చెబుతున్నారు. ప్రతి నెలా ఆయన ఎవరినో ఒకరిని పంపుతారని, ఆయన పంపిన వ్యక్తికే బియ్యం పంపిణీ చేశామని పేర్కొన్నారు. -
ఇటుక బట్టీలకు పూడిక మట్టి
► రెవెన్యూ అధికారుల అండతో మాఫియా దందా ► నిర్మాణ పనులకు ఇదే మట్టి శనివారం 120 లారీలతో ► మట్టి తరలింపు పరిశీలన అంటూ ► రెవెన్యూ అధికారుల హడావుడి ► ప్రజాప్రతినిధి నుంచి బెదిరింపులతో వెనుదిరిగిన వైనం సాక్షి, హన్మకొండ : పొలాల్లోకి చేరాల్సిన చెరువు పూడిక మట్టి ఇటుక బట్టీలకు చేరుతోంది. పంట పొలాలకు సారాన్ని అందించేందుకు ఉపయోగపడే ఈ మట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతోంది. మామూనూరు కేంద్రంగా సాగుతున్న మట్టి, మొరం మాఫియా మిషన్ కాకతీయ చెరువులపై కన్నేసింది. రైతుల పొలాలకు చేరాల్సిన మట్టితో నిత్యం వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతోం ది. రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెం ట్ అధికారుల అండతో ఈ దందా కొనసాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. మితిమీరిన ఈ దందాపై శనివారం ప్రభుత్వాధికారులు కర్రపెత్తనం చేయబోతే వారిపై ఓ ప్రజాప్రతినిధి కన్నె ర చే శాడు. దీంతో పూడిక మట్టి వ్యాపారం ఆరు లారీలు మూడు బట్టీలు అన్నట్లు సాగుతోంది. సారవంతమైన మట్టి మిషన్ కాకతీయ రెండో దశలో భాగంగా గీసుగొండ మండలం ఊకల్లు చెరువు, వంచనగిరి శాయంపేట చెరువు, చెన్నారం చెరువుల్లో పూడి క నిరంతరంగా తీస్తున్నారు. ఈ చెరువుల్లో పూ డికగా పేరుకుపోయిన నల్లరేగడి ఎంతో సారవంతమైందని వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మేరకు నల్లరేగడి మట్టిని రైతుల పొలాల్లోకి ఉచితంగా చేర్చాల్సి ఉండ గా.. మొరం, మట్టి మాఫియా ఇందుకు అడ్డం పడుతోంది. అడ్డదారిలో మామునూరు, నక్కల పల్లి, బొల్లికుంట, తిమ్మాపురం శివారు వద్ద ఉ న్న ఇటుక బట్టీలకు ఈ మట్టిని చేరవేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా బట్టీల యజమానుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. అటు అధికారులు, ఇటు మాఫియా సహకారం ఉండడంతో ఇటుక బట్టీ వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పు చేసి మరీ మట్టి కొనుగోలు చేస్తున్నారు. బట్టీల వద్ద టన్నుల కొద్ది మిషన్ కాకతీయ పూ డిక మట్టి నిల్వ చేస్తున్నారు. ఊకల్లు వద్ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూ డు గోదాముల నిర్మాణం జరుగుతోంది. ఈ గో దాముల బేస్మెంట్లలో నింపేందుకు కూడా పెద్దపెద్ద గుట్టలుగా మిషన్ కాకతీయ మట్టి ని ల్వ చేశారు. ఈ మట్టి విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. రెవె న్యూ, మైనింగ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల అండతో మిషన్ కాకతీయ మట్టి వ్యాపా రం కొంత కాలంగా జోరుగా సాగుతోంది. టిప్పర్ల జాతర మిషన్ కాకతీయ మట్టి అక్రమంగా తరలిస్తున్న పట్టించుకునే వారు కరువైపోవడంతో శనివారం అక్రమ మట్టి వ్యాపారులు మరింతగా రెచ్చిపోయారు. పట్టపగలు 120 లారీలు, టిప్పర్లను ఏ ర్పాటుచేసి మిషన్ కాకతీయ మట్టిని మామునూరు, నక్కలపెల్లి, తిమ్మాపురం పరిధిలోని ఇటుక బట్టీల వద్దకు తరలించిండం ప్రారంభిం చారు. జాతర తరహాలో మిషన్ కాకతీయ మట్టి ని బట్టీల వద్దకు లారీల్లో తరలి వెళ్తుండడంతో శనివారం ఈ విషయం చర్చనీయాంశంగా మా రింది. దీంతో అధికారుల్లో గుబులు మొదలైం ది. వెంటనే హన్మకొండ తహసీల్ధార్ రాజ్‌కుమా ర్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సదానందం, వీఆర్వో దీపక్‌తో కలిసి నక్కలపల్లికి వచ్చారు. మిషన్ కాకతీయ మట్టిని తీసుకెళ్తున్న టిప్పర్లు, లారీల ను రోడ్డుపై నిలపగా స్థానికులంతా గుమిగూడారు. నేత నుంచి ఫోన్ వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై నాయు డు పెట్రోల్ బంక్ సమీపంలో మొరం వ్యాపా రం చేసే ఓ వ్యాపారి ఈ మట్టి మాఫియాకు నేతృత్వం వహిస్తున్నాడు. అధికారులు తమ లారీలను ఆపి అనుమతి పత్రాలను పరిశీలిస్తు న్న విషయం తెలిసిన సదరు మట్టి వ్యాపారి అక్కడకు చేరుకున్నాడు. తనకు అండగా నిలిచి న ఓ ప్రజాప్రతినిధికి ఫోన్లో సమాచారం ఇవ్వ గా... ఆయన నుంచి కాసేపట్లో అధికారులకు మరో ఫోన్ వచ్చింది. దీంతో అనుమతి పత్రాలను పరిశీలించకుండా అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ తతంగం చూస్తూ విస్తుపోవడం స్థానికుల వంతైంది. మిషన్ మట్టి బట్టీలకు పోతోంది మిషన్ కాకతీయ మట్టి తరలింపుకు సంబంధించి లారీలను పరిశీలిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సదానందం వివరణ కోరగా.... ‘ఊకల్లు చెరువు, శాయింపేట చెరువుల నుంచి మిషన్ కాకతీయ ద్వారా తీసిన పూడిక మట్టిని పంట పొలాలకు తరలించాల్సి ఉండగా బట్టీలకు తరలిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందచేస్తాం. మట్టి తరలిస్తున లారీలకు మైనింగ్ పర్మిషన్ ఉండడం వల్ల వెనుతిరిగి వెళ్తున్నాం’ అంటూ సమాధానం ఇచ్చారు. -
టీడీపీ నేతలకు తొత్తులుగా అధికారులు
► వారి ప్రోద్బలంతోనే ఫిర్యాదు ► 15 మంది ‘దేశం’ నాయకుల ఆక్రమణల్లో ప్రభుత్వ స్థలాలు ► సీఐకి వివరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు పాయకరావుపేట: అధికారపార్టీ నేతలకు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ, వారు చెప్పిన దానికల్లా తందాన తాన పాడుతున్నారని మండలంలోని కుమారపురం గ్రామస్తులు, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో తుపాను రక్షిత భవనానికి వెళ్లే దారిలో ఉన్న ఇంటి పునాదిని తొలగించే విషయంమై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావు విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీకి చెందిన గ్రామ ఉప సర్పంచ్ నీలాపు బాలకృష్ణా రెడ్డి , మండల యూత్ అధ్యక్షుడు నీలాపు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన కాలపురెడ్డి వరహాలు రెడ్డి 50 ఏళ్లక్రితం స్థలాన్ని కొనుగోలు చేసి, పునాదినిర్మించుకున్నారన్నారని చెప్పారు. అయితే తుపాను రక్షిత భవనం దారి కోసం బలవంతంగా పునాదిని తొలగించేందుకు అధికారపార్టీకి చెందిన కొందరు ప్రయత్నం చేస్తునారన్నారు. ఈ ప్రాంతంలో అధికారపార్టీకి చెందిన 15 మంది నేతల అక్రమణల్లో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకోకుండా... వీఆర్వోచేత తప్పుడు ఫిర్యాదు ఇప్పించి, తహసీల్దార్‌తో పోలీసులకు ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. గ్రామానికి చెందిన నీలాపు వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఆంజనేయస్వామి ఆల యానికి, తుపాను రక్షిత భవనానికి, గ్రామ అభివృద్ధికి ఉచితంగా తన సొంత స్థలం ఇచ్చానని చెప్పారు. తాము స్వచ్ఛందంగా స్థలం ఇస్తే రెవెన్యూ అధికారులు గమనించకుండా అధికారు పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ తుపాను రక్షిత భవనానికి వెళ్లేందుకు ఏర్పాటు చేయాల్సిన రోడ్డుకు సంబంధించి ఎంత స్థలం సరిపోతుందో పంచాయతీరాజ్ ఇంజినీర్‌తో పరిశీలన చేయించి, చర్యలు చేపడటామన్నారు. ఎస్ఐవి.సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు. -
పట్టాల పంపిణీలో తమ్ముళ్ల చేతివాటం
► సుందరయ్యనగర్, ఫెర్రీ నిర్వాసితుల నుంచి డబ్బుల వసూలు ► కాచవరం కొండల్లో స్థలాల కేటాయింపు ► కనీస సౌకర్యాలు లేవని బాధితుల ఆందోళన ఇబ్రహీంపట్నం : పుష్కర నిర్వాసితులకు పట్టాల కేటాయింపులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండలంలోని సుందరయ్య నగర్, ఫెర్రీ రహదారిలోని ఈ నిర్వాసితులకు కాచవరం గ్రామంలో కేటాయించిన స్థలం కొండలు, గుట్టల మధ్యన ఉండటంతో కనీస సౌకర్యాలు కూడా లేనిచోట నివసించేది ఎలా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నిర్విరామ కృషి చేశారు. పేదలకు స్థలాలు ఇచ్చేలా అధికారులపై వైఎస్సార్ సీపీ పోరాడింది. ఈ క్రమంలో నిర్వాసితులు సుమారు 450 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి ఇంటింటికి తిరిగి తగిన ఆధారాలతో నివేశన స్థలం పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుందరయ్యనగర్‌లో 233 మందికిగాను 92 మందికి, ఫెర్రీ రహదారిలో 213 మందికిగాను కేవలం 65 మందికి మాత్రమే పట్టాలు అందజేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి ఆధారాలు చూపిన అనంతరం పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వసూళ్లకు తెరతీసిన తమ్ముళ్లు పట్టాల కేటాయింపులో అధికారులు ఇంటి పన్నును ప్రామాణికంగా తీసుకోవటంతో టీడీపీ వార్డు సభ్యురాలి భర్త డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. పన్ను ఆధారాలు లేనివారికి ఇంటి పన్ను, పట్టా, ప్లాటు కేటాయింపు వరకు మేమే చూసుకుంటామని ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారని అధికార పార్టీ వార్డు సభ్యులే ఆరోపణలు చేయటం గమనార్హం. కొండలు, గుట్టల్లో స్థలాలు కాచవరంలోని సర్వే నంబర్ 8లోని 9.30 ఎకరాల కొండ పోరంబోకు స్థలంలో పుష్కర నిర్వాసితులకు 465 ప్లాట్లు ఏర్పాటు చేశారు. పట్టాలున్న వారికి స్థలాలు కేటాయించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కొండలు, రాళ్లగుట్టల మధ్య స్థలాలు కేటాయిస్తే నివాసాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. నివాసయోగ్యంగా లేదు ఫెర్రీ రహదారిలో నా ఇం టిని కూల్చేశారు. రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. ఇక్కడకు వస్తే ఇవన్నీ కొండలు, గుట్టల మధ్య స్థలం ఉంది. సౌకర్యాలు లేకపోవడంతో ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదు. - గుమ్మడిదల హనుమంతరావు, నిర్వాసితుడు ఎడారిని తలపిస్తోంది పుష్కర బాధితులకు కేటాయించిన స్థలం ఎడారిని తలపిస్తోంది. రాళ్లగుట్టల మధ్య ప్లాట్లు ఏర్పాటు చేశారు. రహదారి సౌకర్యం కూడా సరిగా లేదు. ఇక్కడ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలియటం లేదు. సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. - చాగంటి దుర్గారావు, నిర్వాసితుడు -
కొత్త జిల్లాలపై అధ్యయన కమిటీలు
ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ * మూడు నమూనాలు సిద్ధం చేసిన సీసీఎల్ఏ * ‘ట్రాక్’ సహాయంతో కొత్త హద్దులతో మ్యాపులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరుసగా సమీక్షలు నిర్వహించడంతో... రెవెన్యూ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు శాటిలైట్ మ్యాపులు, గూగుల్ మ్యాపులను ఆధారంగా చేసుకుని కొత్త జిల్లాల హద్దులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. జిల్లాల ఏర్పాటుపై ముందు నుంచి కసరత్తు చేస్తున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 3 నమూనాల్ని సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిలో ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి.. కొత్త జిల్లాల తుది స్వరూపాన్ని ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఇచ్చిన మూడు నమూనాలకు సీసీఎల్ఏ వేర్వేరు ప్రాతిపదికలను అనుసరించింది. పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఉండేలా ఒక నమూనా, జనాభా ప్రాతిపదికన మరో నమూనా, అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాతిపదికగా మరో నమూనాను రూపొందించినట్లు సమాచారం. అదనంగా 14 జిల్లాల వరకు పెంచేందుకు వీలుగా ఈ నమూనాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) సహాయంతో సీసీఎల్ఏ ఈ మ్యాప్‌లను తయారు చేయించారు. ఇదే తీరుగా సరిహద్దు నమూనాలతో మరిన్ని మ్యాప్‌లు తయారు చేయాలని సంబంధిత నిపుణులకు ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పరిధిలో జిల్లా కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకు దూరం 60 కిలోమీటర్లకు మించకుండా ఉండేలా చూడాలన్న సీఎం సూచనకు అనుగుణంగా శాస్త్రీయంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అభిప్రాయ సేకరణకు కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ తాజాగా బాధ్యతలు అప్ప గించారు. ఒక్కో జిల్లాకు ఇద్దరు నేతలతో కూడిన 9 కమిటీలను నియమించారు. గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో పునర్విభజన స్వరూపం ఎలా ఉండా లి, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలి, అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ 9 కమిటీల సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతా ఆయనకే అప్పగించారు. మెదక్ జిల్లాలో హరీశ్ సూచనల మేరకు కమిటీ పని చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం. పునర్విభజన కమిటీల సభ్యులు ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు రంగారెడ్డి: మహేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి నల్లగొండ: జగదీశ్‌రెడ్డి, గ్యాదరి కిషోర్ మహబూబ్‌నగర్: నిరంజన్‌రెడ్డి, గువ్వల బాలరాజు నిజామాబాద్: ప్రశాంత్‌రెడ్డి, గంప గోవర్ధన్ కరీంనగర్: వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్ ఆదిలాబాద్: లోకా భూమారెడ్డి, వేణుగోపాలాచారి మెదక్: శేరి సుభాష్‌రెడ్డి, మానిక్‌రెడ్డి వరంగల్: పెద్ది సుదర్శన్‌రెడ్డి, మధుసూదనాచారి -
సీబీఐ విచారణతో రెవెన్యూ వర్గాల్లో కలకలం
► తప్పుడు పత్రాలతో రూ.31.83 కోట్ల ► రుణం పొందిన ఘనులు ► బెంగళూరు నుంచి వచ్చి ► దర్యాప్తుచేసిన సీబీఐ డీఎస్పీ పడన రూరల్ : సీబీఐ దాడులతో పెడన రెవెన్యూ వర్గాల్లో కలకలం రేగింది. తప్పుడు ధ్రువపత్రాలతో గుడివాడ ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.31.83 కోట్ల రుణాలు పొందిన వ్యక్తి పెడన మండలంలో చేపల చెరువులు ఉన్నట్లు చూపించిన వైనంపై కేసు నమోదైంది. విజయవాడకు చెందిన వీనస్ ఆక్వా ఫుడ్స్ ైప్రైవేటు లిమిటెడ్ యజమాని నిమ్మగడ్డ రామకృష్ణ, పెడన , బంటుమిల్లి, గుడివాడ, అవనిగడ్డకు చెందిన నలుగురు వ్యక్తులు గుడివాడ ఆంధ్రాబ్యాంకులో రూ.31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి 2010లో రూ.31.83 కోట్లు రుణం పొందారు. హామీగా పెడన మండలం నందమూరు గ్రామం లజ్జబండ కాలువకు అనుకుని ఉన్న (నందమూరు నుంచి మడక మీదుగా బల్లిపర్రు వెళ్లే మార్గం) 31.97 ఎకరాల చేపల చెరువులను చూపించారు. హామీ దారుల్లో ఒకరైన పామర్రు మండలానికి చెందిన ఆరేపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు ఆరేపల్లి వెంకటనాగరమేష్, మరి కొందరి పేరుతో నందమూరులో 31.97 ఎకరాల చేపల చెరువులు ఉన్నట్లు అప్పటి వీఆర్వో కూనపురెడ్డి వీరమోహనరావు ధ్రువీకరించిన పత్రాలను బ్యాంకులో సమర్పించారు. ఈ పత్రాలు అసలైనవా? కావా? తేల్చాలంటూ బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు ఏప్రిల్ ఆఖరి వారంలో పెడన తహసీల్దార్‌కు లేఖ పంపించారు. ఏప్రిల్ 29న బెంగళూరులోని తమ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ డి.వి.ఎస్.ఎల్లారావు ఆ రోజున డెప్యూటీ తహసీల్దార్ కుమార్‌ను బెంగళూరు పంపించారు. కుమార్ అందించిన వివరాలను తీసుకుని సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర గురువారం సాయంత్రం పెడన వచ్చి, చేపల చెరువులున్న ప్రాంతంలో విచారణ చేశారు. అయితే ఆ చెరువుల సర్వే నంబర్లు వేరొకరి పేరుతో ఉండడంతో సీబీఐ డీఎస్పీ అవాక్కయ్యారు. మరి కొన్ని సర్వే నంబర్లు నందమూరులో లేవని స్థానిక వీఆర్వో రాజును విచారించిన సీబీఐ డీఎస్పీ బి.రవీంద్ర తెలుసుకున్నారు. ఆరేపల్లి వెంకట నాగరమేష్ తమ్ముడు, అన్నయ్య పేరుతో నందమూరులో చేపల చెరువులున్నట్లు గుర్తించారు. సీబీఐ విచారణ రెవెన్యూ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
రోడ్డున పడ్డ బతుకులు
► అక్రమణలపేరుతో పేదల ఇళ్లు నేలమట్టం ► అధికారులపై బాధితుల మండిపాటు చిత్తూరు(రూరల్)ః నగరంలోని గంగినేరు చెరువు ఆక్రమణకు గురైందంటూ బుధవారం రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను నేలమట్టం చేశారు. బాధితులు అధికారుల కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పట్టించుకోలేదు. చావనైన చస్తామని మా ఇళ్లను కూల్చడానికి మేం అంగీకరించమని జేసీబీలను అడ్డుకున్నా, అధికారుల్లో కాస్త కనికరం కూడా కనబడలేదు. స్థలాన్ని ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని గుండెలు బాదుకున్నా, అధికారులు వినలేదు. గంగినేరు చెరువు ఆనుకోని 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ స్థలం ఆక్రమణకు గురైందని బుధవారం రెవెన్యూ అధికారులు జేసీబీలతో తొలగించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యామ్నాయ నివాసాలు చూపకుండానే ఇళ్లను కూల్చడంపై బాధితులు విరుచుకుపడ్డారు. 60 ఏళ్లుగా ఇక్కడ కాపురముంటున్నామని, ఉన్నట్టుండి ఇళ్లను తొలగిస్తే ఎక్కడి వెళ్లాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలు ఎక్కడ తలదాచుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. ఖాళీ చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని అధికారులను బతిమిలాడిన కనికరించలేదని వారు మండిపడ్డారు. ఈ సంఘటనపై చిత్తూరు ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించగా అందుబాటులో లేరని, ఓట్లు దండుకున్నప్పుడు ఉన్నంత శ్రద్ధ ఇప్పుడ లేదని ఆయనపై మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైతే మాజీ ఎమ్మెల్యే సీ.కే బాబు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాల మేరకే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇలా చేశారని బాధితులు ఆరోపించారు. ఇళ్లను తొలగించడంపై అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. -
రెవెన్యూ అధికారులకు నోటీసులు
తెర్లాం రూరల్ : సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం సకాలంలో సక్రమంగా ఇవ్వనందున తెర్లాం తహశీల్దార్ యు.రాజకుమారికి, పార్వతీపురం ఆర్డీఓ ఆర్.గోవిందరావుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి నోటీసులు అందాయని ఫిర్యాదుదారుడు కె.ధనప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పెరుమాళి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 29లో గల యర్ర చెరువులోని అక్రమణదారుల వివరాలు కావాలని కోరగా, సరైన వివరాలు అందివ్వలేదన్నారు. దీంతో తాను సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో ఆయన ఈ నెల 29న జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టననున్న విచారణకు హాజరుకావాలని తనతో పాటు తహశీల్దార్, ఆర్డీఓలకు నోటీసులు పంపించారని చెప్పారు. -
పాలమూరులో 17 బాల్య వివాహాలకు బ్రేక్
సాక్షి నెట్వర్క్ మహబూబ్‌నగర్: జిల్లాలో పోలీసులు, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు బుధవారం ఒకేరోజు 17 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ధన్వాడ మండలం కిష్టాపూర్‌కు చెందిన ఓ బాలికకు చిన్నచింతకుంట మండలం పళ్లమర్రి యువకుడితో ఈనెల 21న వివాహం జరగాల్సి ఉండగా అధికారులు అడ్డుకున్నారు. బాలానగర్‌కు చెందిన ఓ బాలి కను మద్దూరు మండలం వీరారానికి చెందిన యువకుడికి ఇచ్చి ఈనెల 22న లగ్నం చేయాలని నిర్ణయించారు. ఇదే మండలం వీరన్నపల్లికి చెందిన 15 ఏళ్ల బాలికకు కొత్తూరు మండలం చలివేంద్రంపల్లికి చెందిన ఓ యువకుడితో గురువారం పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. దౌల్తాబాద్ మండలం బాలంపేటకు చెందిన పదో తరగతి పూర్తయిన ఓ బాలికకు ఈ నెల 21న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బాలికను కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి బుధవారం ఉదయం వివాహం జరిపిం చేందుకు నిశ్చయించారు. ఇంటర్ చదువుతున్న భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన ఓ బాలి కకు ఈ నెల 23న, మరో బాలికకు ఈనెల 29న వివాహం చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్తమొల్గరకు చెందిన పదో తరగతి విద్యార్థినికి ఈ నెల 27న పెళ్లి కుదుర్చారు. కరివెన పంచాయతీ ముస్లాయిపల్లి తండాకు చెందిన బాలికకు ఈ నెల 27న లగ్నం నిర్ణయించ తలపెట్టారు. కరివెనకు చెందిన బాలికకు ఈ నెల 22న, తాటికొండలో మరో బాలికకు అదేరోజున పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఇటిక్యాల మండలం కొండేరులో మరో బాలిక పెళ్లిని, జడ్చర్లకు చెందిన బాలిక పెళ్లిని, పెద్దకొత్తపల్లిలో 4 బాల్య వివాహాల్ని కూడా అధికారులు అడ్డుకున్నారు. -
మృత్యు శతకం
► రోజురోజుకూ పెరుగుతున్న వడదెబ్బ బాధితులు ► ఇప్పటిదాకా దాదాపు వంద మంది మృతి ► 14 మందేనంటున్న అధికారులు ► ఎక్స్‌గ్రేషియాపై కొరవడిన స్పష్టత అనంతపురం అర్బన్ : ఎండలు మండిపోతున్నాయి. ‘అనంత’ అగ్నిగోళంగా మారింది. వడదెబ్బకు జనం మృత్యువాత పడుతున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు వంద మంది చనిపోయారు. అధికారులు మాత్రం ‘అంత’ లేదంటున్నారు. 14 మంది మాత్రమే చనిపోయారని బుకాయిస్తున్నారు. వారు చెబుతున్న సంఖ్య వాస్తవ విరుద్ధంగా ఉందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన మార్చి నుంచి ప్రతి రోజు సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతూనే ఉన్నారు. ఈ నెల 17, 19 తేదీల్లోనే 10 మంది మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వడదెబ్బకు మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కూలి పనులు చేసుకునే వారు, పేదలే కావడం గమనార్హం. అన్నీ కాదంటున్న అధికారులు వైద్యులు, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరణాలన్నీ వడదెబ్బ కారణంగా సంభవించినవి కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వారి దృష్టికి 40 వరకు కేసులొస్తే అందులో 14 మాత్రమే వడదెబ్బతో చనిపోయినవిగా నిర్ధారించారు. మిగతా వారు అనారోగ్యంతో చనిపోయినట్లుగా తేల్చారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారుల వాదన ఇలా ఉంది. ‘గుండె జబ్బులు, బీపీ, ఇతర వ్యాధులు ఉన్నవారు ఎందుకు ఎండలో తిరగాలి? ఉపాధి పనులు కూడా ఉదయం 6 నుంచి 10లోపు ముగించాలని చెబుతున్నాం కాదా! ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయించాం. ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎండలోకి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతే అది వడదెబ్బ మృతి ఎలా అవుతుంది?’అని లాజిక్‌లు మాట్లాడుతున్నారు. ఎక్స్‌గ్రేషియా ఎంతిస్తారో... వడదెబ్బ మృతులకు ఎక్స్‌గ్రేషియా ఎంత ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని, అయితే అది ఎంత మొత్తం నిర్ధారణ కాలేదని అంటున్నారు. జీవో విడుదల చేస్తేకానీ చెప్పలేమంటున్నారు. ప్రజాశ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు - వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు. అందుకే వడదెబ్బ మరణాలను తక్కువ చేసి చూపిస్తోంది. చనిపోయిన వారంతా పేదలే. పౌష్టికాహారం లేక రోగనిరోధక శక్తి తగ్గి.. ఎండవేడిమి తట్టుకోలేక చనిపోతున్నారంటే వడదెబ్బ మృతి కిందకే వస్తుంది. వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. -
చెరువు శిఖం.. మాయం
ఇప్పటికే 40 ఎకరాలు కబ్జా పోటీపడి వాలుతున్న అక్రమార్కులు తాజాగా మూడెకరాల ఆక్రమణకు యత్నం అంతుచిక్కని రెవెన్యూ అధికారులు మౌనం పరకాల : పరకాల పట్టణ నడిబొడ్డున ఉన్న విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. దామెర చెరువు శిఖం భూమిపై రెక్కలు కట్టుకుని వాలుతున్నారు. అసలు శిఖం భూమా.. లేక పట్టా భూమా అనే విషయం రెవెన్యూ అధికారులు వెల్లడించకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నారుు. శిఖం భూమిని రక్షించాలని పలువురు నేరుగా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం చూస్తే వీరి పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నారుు. గతంలో కబ్జాకు గురైన భూమిని వెలికి తీయడంలో వెనుకంజ వేసిన అధికారులు ఇప్పుడు మరో ఆక్రమణ జరుగుతుంటే కూడా నోరు మెదపడం లేదు. కాకతీయుల కాలంనాటి దామెర చెరువు శిఖం భూమి రోజురోజుకూ తగ్గిపోతోంది. రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 604లో దామెర చెరువు శిఖం భూమి 103 ఎకరాల 20గుంటలు ఉంది. కానీ, ఇప్పుడు సుమారు 40 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అక్రమార్కులు దర్జాగా కబ్జా చేయడంతో 2012లో అప్పటి జారుుంట్ కలెక్టర్‌కు పట్టణ ప్రజలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో స్వయంగా జేసీ దామెర చెరువు వద్దకు వచ్చి విచారణ జరిపారు. 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించి నోటీసులను సైతం అందించారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ నోటీసుల విషయం అటకెక్కింది. ట్యాంక్‌బండ్ పనులతో తెరపైకి.. పట్టణం క్రమంగా విస్తరిస్తుండడంతో దామెర చెరువు ఆయకట్టు కింద నివాస ప్రాంతాలు వెలిశాయి. పారకం లేక చెరువులోనే నీళ్లు నిల్వ ఉంటున్నారుు. సమ్మర్ స్టోరేజీగా ఉపయోగించాలని చాలా రోజుల నుంచి ప్రజలు కోరుతూ వస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో దామెరు చెరువు అభివృద్ధికి తొలి అడుగు పడింది. మినీ ట్యాంకుబండ్‌గా తీర్చిదిద్దడం కోసం రూ.3.80కోట్లు మంజూరయ్యాయి. రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి ఇరిగేషన్ అధికారులకు అప్పగిస్తే పనులు చేయాలి. కానీ తూతూమంత్రంగా సర్వేను చేసి అప్పగించడంతో తరుచూ వివాదం తలెత్తుతోంది. చెరువు శిఖంలో తమ భూమి ఉన్నదని కొందరు అంటున్నారు. గజం భూమికి వేలల్లో ధర పలుకుతుండడంతో అక్రమార్కులు ఏదో సాకుతో శిఖంపై వాలుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దామెర చెరువు భూమిలో తమకు మూడు ఎకరాల భూమి ఉందని బుధవారం పూడిక మట్టితో నింపడం ప్రారంభించడంతో స్థానికులు అడ్డుకున్నారు. చెరువు మధ్యలోకి పోయి మరీ మట్టిని పోసి చదును చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయూన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్‌కు సమాచారం అందించడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు మట్టి పోయవద్దని నిలిపివేశారు. ఇప్పటికైనా చెరువు భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
తహసీల్దార్లపై బదిలీ వేటు
అవినీతి ఆరోపణలే కారణమా..? సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో నలుగురు తహసీల్దార్లపై బదిలీ వేటు పడింది. ప్రధాన మండలాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు జైనథ్ మండల తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఎం.జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురు తహసీల్దార్లను లూప్‌లైన్ పోస్టులకు బదిలీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ తహసీల్దార్‌గా పనిచేసిన సుభాష్‌చందర్, జైనథ్ తహసీల్దార్ సంజయ్‌కుమార్‌ను కలెక్టరేట్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల తహసీల్దార్‌గా ఉన్న కాసబోయిన సురేష్‌కు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల విభాగం ఆసిఫాబాద్‌కు బదిలీ అయింది. అలాగే నిర్మల్ తహసీల్దార్ నారాయణను ఖాళీగా ఉన్న లక్ష్మణచాంద తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో ఆదిలాబాద్ తహసీల్దార్‌గా ఇక్కడి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న వర్ణను నియమించారు. అలాగే నిర్మల్ తహసీల్దార్‌గా అక్కడి ఆర్డీవో కార్యాలయంలోని ఏవో శ్రీహరికి పోస్టింగ్ ఇచ్చారు. చెన్నూరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న దిలీప్‌కుమార్‌ను మంచిర్యాల తహసీల్దార్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాంసి తహసీల్దార్ రాంరెడ్డికి జైనథ్ తహసీల్దార్‌గా ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. సిర్పూర్-యు తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ సెలవుపై వెళ్లడంతో ఉట్నూర్ తహసీల్దార్ రాథోడ్ రమేష్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరందరికీ ఎఫ్ఏసీగా బాధ్యతలు ఇచ్చారు. ఆరోపణలే కారణమా? ఈ బదిలీల వెనుక పలు ఆరోపణలే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తవుతోంది. కానీ.. రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం పరిపాలన సౌలభ్యం కోసమే బదిలీ చేశామని చెప్పుకొస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరల్లోకి వెళ్లిపోతున్నాయి. అధికారుల కళ్లముందే అన్యాక్రాంతమవుతున్నా.. కళ్లు మూసుకుని పరోక్షంగా కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలు కొందరు తహశీల్దార్లు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాల్లో రూ.కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలాచోట్ల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవడమే ఇందుకు నిదర్శనం.. ఈ నేపథ్యంలో తహసీల్దార్ల ఆకస్మిక బదిలీలు రెవెన్యూ వర్గాలతో పాటు, సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
చావనైనా చస్తాం.. సెంటు భూమి ఇవ్వం
పరిశ్రమల పేరుతో దోచుకుంటారా? ప్రభుత్వంపై నమ్మకం పోయింది రెవెన్యూ అధికారులపై ఆగ్రహించిన అన్నదాతలు తొట్టంబేడు: ‘తహశీల్దార్గారు చావనైనా చస్తాంగానీ సెంటు భూమి ఇవ్వం. ఒకవేళ లాక్కున్నా ఊరుకోం’ అంటూ అన్నదాతలు మండిపడ్డారు. పరిశ్రమల కోసం భూములు సేకరించడానిక వెళ్లిన రెవెన్యూ అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పరిశ్రమలతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పిన అధికారులకు రైతులు తిరగబడటంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. ఈ సంఘటన ఆదివారం తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. తహశీల్దార్ చంద్రమోహన్‌తో పాటు పలువురు ఆర్ఐలు, వీఆర్వోలు రైతుల వద్ద ఉన్న డీకేటీ భూవుులు సేకరిం చడం కోసం తొట్టంబేడు వుండలంలోని చొడవరం, చేవుూరు, చియ్యువరం, కాసరం, సిద్దిగుంట గ్రావూల్లో పర్యటించారు. తహశీల్దార్ మాట్లాడుతూ పరిశ్రవుల కోసం రైతుల వద్ద ఉన్న డీకేటీ భూవుులను ఇవ్వాలన్నారు. భూవుులిచ్చిన రైతులకు అంతో ఇంతో నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. దీంతో ఆగ్రహం చెందిన చేవుూరు గ్రావుస్తులు ‘పరిశ్రవుల పేరుతో రైతులను దోచుకోవాలని చూస్తున్నారా? ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్కహామీనైనా నిలబెట్టుకుందా? చావనైనా చస్తాంగానీ మా భూవుుల జోలికి వస్తే ఊరుకోవుని హెచ్చరించారు. దాంతో ఖంగుతిన్న రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. తర్వాత చోడవరం గ్రావూనికి వెళ్లారు. అక్కడ కూడా అధికారులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ‘సార్ ప్రభుత్వం ఎలాగూ మమ్మల్ని పట్టించుకోదు, మేవుు వూ కష్టంతో ప్రశాంతంగా జీవిస్తున్నాం, ఇలా కూడా బతకనీయురా’ అంటూ రైతులు వుండిపడ్డారు. చియ్యువరం, కాసరం గ్రామాల్లోనూ రైతులు తిరగబడటంతో అధికారులు చేసేదేమి లేక వెనుదిరిగారు. సోవువారం నుంచి వుండలంలో రోజుకు ఐదు గ్రావూల్లో భూసేకరణ చేపట్టాలని ప్రణాళిక వేసుకున్న అధికారులు ప్రస్తుతం వాటికి జోలికి పోతే కొట్టేలా రైతులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు తాత్కాలికంగా భూసేకరణ కార్యక్రవూన్ని విరమించుకోవాలని రెవెన్యూ అధికారులు అనుకున్నట్లు సమాచారం. -
బాల్య వివాహానికి బ్రేక్
కన్నీటి పర్యంతమైన బాలిక కుటుంబీకులు అధికారులపై ఆగ్రహం పెద్దేముల్: మరో అరగంటలో వివాహం జరగాల్సి ఉండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని అడ్కిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయిని నీలమ్మ, లక్ష్మప్ప దంపతుల రెండో కూతురు (16)ను బషీరాబాద్ కాశీంపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పెళ్లి ముహూర్తం. దీంతో కుటుంబీకులు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువుల కోసం వంటలు కూడా చేశారు. మరో 30 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెద్దేముల్ తహసీల్దార్ గంగాధర్, ఎస్ఐ కృష్ణ, చైల్డ్‌లైన్ అధికారులు అక్కడికి చేరుకొని పెళ్లిని నిలిపివేశారు. వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. మైనారిటీ తీరిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలని స్పష్టం చేశారు. లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అధికారులు పెళ్లిని అడ్డగించడంతో బంధువులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. బోనఫైడ్లు చూడాలి.. గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని, పురోహితులు అమ్మాయిల బోనఫైడ్ సర్టిఫికెట్లు చూసి పెళ్లిళ్లు చేయాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీటల మీద ఆగిన పెళ్లి.. షాబాద్: పీటల మీద పెళ్లి ఆగిపోయింది. బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మద్దూరులో బుధవారం చోటుచేసుకుంది. ఆర్ఐ రాజు, ఏఎస్ఐ శంకరయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగుల పెంటయ్య కూతురు(15)ను అదే గ్రామానికి చెందిన కప్పెర యాదయ్య కుమారుడు ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు బుధవారం ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మరో 20 నిమిషాల్లో పెళ్లి జరగాల్సి ఉండగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. బాలికను నగరంలోని శిశువిహార్‌కు తరలించారు. అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
మృత్యువును వెతుక్కుంటూ వెళ్లారు!
మరికొన్ని గంటల్లో తెల్లారుతుంది. అప్పటిదాకా బోరు తవ్వకాన్ని ఆసక్తిగా గమనించిన వారు పచ్చటి పంట పొలంలో నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపట్లోనే గాఢనిద్రలోకి జారుకున్నారు. అదే ‘శాశ్వత నిద్ర’ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. బోర్వెల్ లారీ రూపంలో మృత్యువు వారిని కబళించుకుపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. శెట్టూరు మండలం పర్లచేడులో శనివారం తెల్లవారుజామున బోర్వెల్ లారీ దూసుకెళ్లి నలుగురు దుర్మరణం చెందారు. వారంతా రెక్కల కష్టంపై ఆధారపడ్డ కూలీలు.. ఉగాది పండుగ కావడంతో ఇంటి పట్టునే ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలసి హాయిగా పండుగ చేసుకున్నారు. రాత్రైంది. అంతా కలసి భోజనాలు చేశారు. ఎంతకూ నిద్ర రాకపోవడంతో గ్రామ సమీపంలో బోరు వేస్తున్నారని అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రయ్యేసరికి అలసటకు తోడు చల్లని గాలి వీచడంతో వారంతా పొలంలోనే నిద్రించారు. అంతే.. బోరుబండి వారి జీవితాలను బుగ్గి చేసింది. తెల్లారేసరికి ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో ఊరంతా ఉలిక్కిపడింది. చనిపోయిన నలుగురి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కళ్యాణదుర్గం : ప్రమాదవశాత్తు బోర్వెల్ లారీని రివర్స్‌లో నడపగా వెనుక భాగంలో నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో శెట్టూరు మండలం పర్లచేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో బోయ సంజీవ (38), బోయ తిమ్మప్ప (35), బోయ మాంతేష్ (30), నరసింహమూర్తి (28) మృతి చెందారు. ఒకేరోజు నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దలు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆయా కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. మృతులంతా కూలీ పని చేసుకుని కుటుంబాల్ని పోషించుకునేవారు. అలాంటి వారు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబ సభ్యుల పోషణ చూసే వారు కరువయ్యారు. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయి. మృతుల కుటుంబ స భ్యులు, భార్యలు, పిల్లల రోధనలు చూపరులను కలిసివేశాయి. ‘మాకు ఇక దిక్కెవరంటూ.. గుండెలు బాదుకుని రోధించారు.’ మృతులంతా కూలీలే... ప్రమాదంలో మృతి చెందిన బోయ సంజీవ, బోయ తిమ్మప్ప, బోయ మాంతేష్, నరసింహమూర్తి కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సంజీవ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య నాగలక్ష్మి, కుమార్తె బుజ్జెమ్మ, కొడుకు తిప్పేస్వామి ఉన్నారు. బోయ తిమ్మప్ప స్వగ్రామం బొచ్చుపల్లి కాగా పదేళ్ల క్రితం పర్లచేడులో బయలమ్మను పెళ్ళి చేసుకుని అదే గ్రామంలో స్థిరపడ్డాడు. బోయ మాంతేష్ కూడా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మిదేవి, 18 నెలల కూతురు అక్షిత ఉన్నారు. నరసింహమూర్తి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వికలాంగురాలైన తల్లి హనుమక్క ఆలనాపాలన కోసం టైలర్ పనిచేస్తూ కాలం గడిపేవాడు. మృతుల్లో ఇద్దరు బావ, బామర్దులు, మరో ఇద్దరు స్నేహితులు.. మృతుడు సంజీవ పిన తల్లి సుశీలమ్మ కూతురు బయలమ్మను మృతుడు తిమ్మప్ప పెళ్ళిచేసుకోగా వీరిద్దరూ బావ, బామర్దులు. అదేవిధంగా మృతుడు సంజీవ, నరసింహమూర్తి ప్రాణస్నేహితులు. ఎక్కడికెళ్లాలన్నా కలిసిమెలిసి వెళ్లేవారు. చివరికి మరణంలో కూడా వారి బంధం వీడలేదు. కాగా... రెవెన్యూ అధికారులు వాల్టా చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని, దీంతో అమాయకులైన పేదలు నలుగురు బలి కావాల్సి వచ్చిందని శెట్టూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మృతదేహాలతో శెట్టూరులో బైఠాయించి ఆందోళన చేపట్టారు. -
భూముల వేలాన్ని వెంటనే చేపట్టండి
అధికారులకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రెండో విడత ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ భూములను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. భూముల అమ్మకం ద్వారా ఈ ఏడాది రూ. 13,500 కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ఇటీవలే బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. తొలి విడత భూముల వేలంలో రూ.1,500 కోట్లకు మించి ఆదాయం రాలేదు. దీంతో ఈసారి భూముల వేలంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. భూముల వేలంతో పాటు అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) విభాగానికి సంబంధించి ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. క్రమంగా యూఎల్సీ విభాగాన్ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న స్పెషల్ ఆఫీసర్ల అధికారాలను వెంటనే కలెక్టర్లకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ విభాగంలో అనేక సంవత్సరాలుగా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలని సూచించారు. -
గడువు పెంచినా స్పందన కరువు
♦ చెల్లింపు కేటగిరీ క్రమబద్ధీకరణలో ♦ మొదలు కాని రిజిస్ట్రేషన్లు సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు మే 31 దాకా ప్రభుత్వం గడువు పెంచినా పెద్దగా స్పందన కని పించడంలేదు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులుగా ఎంపికైనవారికి నిర్దేశిత సొమ్ము చెల్లించాల్సిందిగా రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చినా లబ్ధిదారులెవరూ ముందుకు రాని పరిస్థితి. పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించిన వారికి కూడా ఆయా స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించే వారూ వెనుకంజ వేస్తున్నారు. క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం వివిధ కారణాలు చూపుతూ అధికారులు పక్కన బెట్టడం కూడా మరో కారణం. వాస్తవానికి చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,915 దరఖాస్తులు అందగా, అం దులో 17,891 దరఖాస్తులనే అధికారులు క్లియర్ చేశారు. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ చేసే విషయమై ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినప్పటికీ క్షేత్రస్థాయి లో తహసీల్దార్లు, ఆర్డీవోలు రకరకాల సాకులు చూపుతూ ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. బేసిక్ వాల్యూ తగ్గించాలని డిమాండ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధర కన్నా సబ్రిజిస్ట్రార్లు చెబుతున్న బేసిక్వాల్యూ ఎక్కువగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో బతుకుదెరువు కోసం టీ స్టాల్, చిన్న దుకాణం పెట్టుకున్నా కమర్షియల్ కేటగిరీగా పరిగణిస్తున్నారంటున్నారు. దీనిపై లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సీసీఎల్ఏ కార్యాలయాల్లో అప్పీల్ చేసుకుంటున్నారు. -
భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి
కమ్మవారిపాళెం గ్రామస్తుల ధర్నా దుత్తలూరు: పశువులు, జీవాలకు వినియోగించే కంచె, మేత పోరంబోకు భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దుత్తలూరు రెవెన్యూ పరిధిలోని కమ్మవారిపాళెం గ్రామస్తులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కమ్మవారిపాళెం సమీపంలో గల సర్వే నంబర్లు 820, 821, 830-1, 830-2, 831 నుంచి 838 వరకు, 840 నుంచి 845 వరకు, 849-4, 851-2, 867-1, 867-2, 869, 870-3, 872-1, 872-2, 873, 874-1, 877, 878, 881-1, 882-2, 893, 894లో సుమారు 250 ఎకరాల భూములకు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించి సాగు చేసుకుంటున్నారన్నారు. దీంతో పశువులు, జీవాలు మేతకోసం అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. గతంలో కొంతమంది రెవెన్యూ అధికారుల సహకారంతో కొంతమంది పట్టాలు సృష్టించుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొందన్నారు. నాలుగేళ్ల క్రితం కమ్మవారిపాళెం, కట్టకిందపల్లి, కట్టకిందపల్లి హరిజనవాడ తదితర గ్రామాలకు చెందిన పశువులు మేతకోసం ఆయా పొలాలకు వెళ్లేవన్నారు. ప్రస్తుతం ఆక్రమణదారులు ఆ భూమలను ఆక్రమించుకుని కనీ సం పశువులు వెళ్లేందుకు దారి కూడా లేకుండా చేశారన్నారు. అరటి, జామాయిల్, పొగాకు తదితర పంటలు సాగు చేస్తూ ప్రతి ఏటా రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారన్నా రు. ఆక్రమించి సాగు చేసుకోవడంతో పాటు అడంగల్‌లో సైతం పే ర్లు నమోదు చేసుకుం టున్నారన్నారు. గతం లో కొంతమంది అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు నకిలీ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయానికి అడ్డంగా కూర్చొని రెవెన్యూ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ హనుమంతునాయుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రంగయ్యనాయు డు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. -
మృగాడి కిరాతకం
► ప్రవర్తన నచ్చక భర్తను వదలివెళ్లిన మొదటి భార్య ► మైనర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్న నీచుడు ► ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా రెండో భార్య గొంతునులిమి చంపిన దుర్మార్గుడు ► పరారీలో నిందితుడు, ఆచూకీ కోసం పోలీసుల గాలింపు నూరేళ్ల పంట.. అర్థం చేసుకుంటే ఆనందాలే ఆ ఇంట.. అంటూ వైవాహిక బంధం ఎలా ఉండాలో తెలుపుతూ ‘ పెళ్లి పుస్తకం’ సినిమాలో మనసు కవి ఆత్రేయ రాసిన పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. రెండు మనసులు, ఇద్దరి జీవితాల కలయికను ఆయన స్పష్టంగా చెప్పారు. పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమలో జీవితం ముడిపడి ఉందని మానసిక నిపుణులు సైతం సెలవిచ్చారు. అయితే ఇవేవీ ఆ మృగాడిలో మార్పు తీసుకురాలేకపోయాయి. పెళ్లి తరువాత కూడా తాళిని ఎగతాళి చేస్తూ.. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు. దీన్ని భరించలేకపోయిన మొదటి భార్య అతన్ని కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తరువాత పదహారేళ్ల అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకున్నా ఆ దుర్మార్గుడి ఆలోచన, ప్రవర్తనలో మార్పు రాలేదు. రెండో భార్య కడుపులో పెరుగుతున్న తన ప్రతిరూపాన్ని అపురూపంగా చూసుకోవాల్సిన సమయంలోనే గొంతునులిపి ఒకేసారి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడా రాక్షసుడు. - గార్లదిన్నె గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన ఇప్పేటి వీరాంజనేయులు(32) తన రెండో భార్య రామాంజినమ్మ(17)ను చంపేశాడు. భార్య ఏడు నెలల గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా రాత్రికి రాత్రే గొంతునులిమి హతమార్చాడు. ఆ విధంగా భార్య సహా ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు ఊపిరి తీశాడు. ఈ దారుణం శుక్రవారం తెల్లవారుజామున గ్రామస్తులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిత్ర హింసలు భరించలేక.. తాడిపత్రి రూరల్ మండలం నరసాపురానికి చెందిన యువతిని వీరాంజనేయులు మొదట పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన నచ్చక పెళ్లైన కొత్తలోనే ఆమె భర్తను కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఒంటరి జీవితం అనుభవించలేకపోయాడు. పువ్వుల్లో పెట్టి సాక్కుంటానంటూ... తల్లీడండ్రి లేని రామాంజినమ్మ బి.యాలేరులోని తన మేనమామ వెంకటేశ్ సంరక్షణలో పెరిగింది. పదహారేళ్లు రాగానే ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ వీరాంజనేయులు పెద్దమనుషులతో రాయబారం నడిపాడు. ప్రవర్తన, అలవాట్లు, అతనిలోని మృగాడ్ని వారు గుర్తించలేకపోయారు. అమాయకంగా కనిపించడంతో వెంకటేశ్ తమ మేనకోడలిని వీరాంజనేయులకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ముందుకువచ్చారు. పెళ్లై ఏడాది కావస్తోంది. ఒకవైపు ఆమె కమ్మలు సహా పట్టుచీరను తన చెడు అలవాట్ల కోసం వీరాంజనేయులు కుదువపెట్టాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి కావడంతో మేనమామ ఇంటికి వెళ్లి రావాలనుకుంది. కమ్మలు, పట్టుచీర విడిపించుకురావాలని భర్తను కోరింది. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. గురువారం రాత్రంతా భార్యతో గొడవపడ్డాడు. ఆ రాత్రి ఏం జరిగిందో... అర్ధరాత్రి దాటాక వీరాంజనేయులు అదే గ్రామంలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి పరుగున వెళ్లాడు. తన భార్యకు కడుపునొప్పి వచ్చిందని నిద్రలేపాడు. ఆమె గర్భిణి కావడంతో ఏదైనా అనారోగ్యకర సమస్య వచ్చిందేమోనని బంధువులందరూ కలసి గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్‌ను సంప్రదించారు. అతని సలహా మేరకు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి చూసే సరికే రామాంజినమ్మ ప్రాణంతో లేదు. అప్పటికే భర్త వీరాంజనేయులు మాయమయ్యాడు. ఉదయానికల్లా మృతురాలి బంధువులు యాలేరు నుంచి ఇక్కడికి చేరుకున్నారు. మృతదేహన్ని పరిశీలించగా శరీరంపై కొట్టిన గాయాలతో పాటు గొంతునులిమిన ఆనవాళ్లు గుర్తించారు. భర్తే కొట్టిచంపాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు, రెవెన్యూ అధికారులు శుక్రవారం ఉదయం సీఐ శివనారాయణస్వామి, తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, ఎస్ఐ రాజు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. రామాంజినమ్మ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఘటనపై ఆరా తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. రామాంజినమ్మను గొంతునులిపి చంపిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సీఐ విలేకరులకు తెలిపారు. వాడిని ప్రజాతీర్పుకు వదలండి ఏడు నెలల గర్భిణి అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా గొంతునులిపి భార్య సహా కడుపులోని బిడ్డను చంపిన వీరాంజనేయులును పట్టుకుని ప్రజాతీర్పుకు వదలిపెట్టాలని మృతురాలి బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
ఇసుక తరలిస్తున్న 30 లారీలు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
హుడా అనుమతించిన ప్లాట్లకే ఎల్ఆర్ఎస్
సాహెబ్‌నగర్‌లోని కప్పల చెరువు సర్వేనంబర్ 202లో హుడా అనుమతించిన ప్లాట్లకే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) వర్తిస్తుందని హెచ్ఎండీఏ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. ఇటీవల కప్పల చెరువు కట్టను కొంత మంది కబ్జా చేసుకుని ప్లాట్లు చేసిన విషయం వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించారు. వారం రోజుల్లో కట్టకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించి వెళ్లారు. ఇప్పటికీ హద్దులు నిర్ణయించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన హెచ్ఎండీఏ అధికారి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ కట్ట కబ్జాకు గురైందన్న విషయం తేల్చాల్సింది రెవెన్యూ అధికారులేనని తెలిపారు. అప్పట్లో కప్పల చెరువును ఎఫ్టీఎల్ నిర్ణయించిన తర్వాతనే 627ప్లాట్లకు హుడా అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఆ ప్లాట్లలోనే ఇళ్లు నిర్మించుకునేందుకు ఎల్ఆర్ఎస్ స్కీం వస్తుందని, మిగతా ప్లాట్లకు వర్తించదని చెప్పారు. ఆ ప్లాట్ల వారు ఒకవేళ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేస్తే వాటిని తిరష్కరిస్తామని తెలిపారు. -
భూ ఆక్రమణలు పట్టవా?
రెవెన్యూ అధికారుల తీరుపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే నారాయణస్వామి పెనుమూరు: ప్రభుత్వ భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నెల కొన్న రెవెన్యూ సమస్యలపై ఆయన జీరో అవర్‌లో మాట్లాడారు. పెనుమూ రు, వెదురుకుప్పం, గంగాధరనెల్లూరు, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని చెప్పారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే జేసీ, ఆర్డీవోలకు లిఖిత రూపంలో వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదన్నారు. వెదురుకుప్పంలో 153/1 సర్వే నంబర్లో 3.75 ఎకరాలు, 148/8 లో 1.25 ఎకరాలు, 210/1లో 0.75 సెంట్ల భూమి పూర్తిగా ఆక్రమణకు గురైందన్నారు. జీడీనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లెలో 310/1,2,3,4 సర్వే నంబర్లలో 5.73 ఎకరాల భూమి ఒకే వ్యక్తి ఆక్రమించుకున్నాడని చెప్పారు. ఈ ప్రభుత్వ భూమి ని పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని ఆర్టీవో, జాయింట్ కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పెనుమూరులో 430 సర్వే నంబర్లో 2.93 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి రెవెన్యూ అధికారుల అండతో సర్వే నంబర్ మార్చి ఆక్రమించుకున్నాడని చెప్పారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ భూమిని ‘నీరు- చెట్టు’ పథకం కింద అభివృద్ధి చేసి దర్జాగా ప్లాట్లు వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెదురుకుప్పం మండలం తిరుమలయ్య పల్లె పంచాయతీ మాకమాంబాపురంలో 42 మంది రైతులకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా మరో వ్యక్తిపై ఆన్లైన్లో భూమి ఎక్కిందన్నారు. ఈ విషయం జేసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీనికి రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ సర్వే నంబర్లుతో సహా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల వివరాలు లిఖిత రూపంగా తమకు సమర్పిస్తే ఆక్రమణ అడ్డుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఇసుక లారీలను ఏం చేయాలి?
ఆమదాలవలస రూరల్: ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా.. విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలను విడిచి పెట్టాలా? ఫైన్ వేయాలా? అన్న మీమాంసలో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలంలోని ముద్దాడపేట నాగావళి నదీతీరం అనధికార ఇసుక ర్యాంపుపై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి ఏడు లారీలు, ఒక పొక్లెయిన్‌ను పట్టుకున్న సంగతి తెలిసిందే. వాటిని సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయానికి అప్పగించడంతో వారు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు. ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రవాణాపై విధివిధానాలపై ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయకపోవడంతో అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక ర్యాంపుల వద్దనే ఉచిత ఇసుక తీసుకుపోవాలని, యంత్రాల ద్వారా ఇసుక లోడింగ్ చేయరాదని ఈ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. కానీ వాహనాలను సీజ్ చేస్తే వాటికి ఎవరూ అపరాధ రుసుం విధించాలో ఆదేశాల్లో పేర్కొనకపోవడంతో రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టుకున్న లారీలను విడిచి పెట్టాలా.. లేక ఫైన్ వేయాలా అన్న సందేహంతో జిల్లా అధికారులతో సంప్రదింపులు కూడా చేస్తున్నారు. మరోవైపు లారీలను విడుదల చేయాలని అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఒత్తిళ్లు కూడా త్రీవతరమవుతున్నాయి. లారీలకు ఫైన్ వేస్తే ఏ శాఖ తరఫున చలానా తీయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. ఉచిత ఇసుక విధానం సామాన్యులకు కొంత ఊరట కల్పించినా ప్రస్తుతానికి అధికారులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. -
కన్ను పడితే కబ్జాయే..!
చెరువులు, అటవీ భూములపై తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగారు. పొక్లెయిన్లతో పనులు చేపట్టి చెరువు సరిహద్దులను చెరిపేస్తున్నారు. చెరువు గర్భాలను పొలాలుగా మార్చేస్తున్నారు. దీనిని చూసిన రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గోడు వినిపించారు. చర్యలు తీసుకోకపోవడంతో చెరువులు, అటవీ భూములు ఆక్రమణదారుల గుప్పిట్లో చేరిపోతున్నాయి. * తెలుగు తమ్ముళ్ల భూ దందా * సాగునీటి చెరువు ఆక్రమణ * అటవీ భూములనూ విడిచిపెట్టని వైనం * 20 రోజులుగా యంత్రాలతో పనులు * పట్టించుకోని రెవెన్యూ అధికారులు ఎల్.ఎన్.పేట: మండలంలోని కొత్తపేట రెవెన్యూలో సర్వే నంబర్ 48/1లో 2.29 ఎకరాల విస్తీర్ణంలో సొండికర్ర చెరువు ఉంది. 48/2ఎ లో 51.48 ఎకరాల అటవీ (రెవెన్యూ) ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ రెండు సర్వే నంబర్లకు సంబంధించిన భూములు పక్కపక్కనే ఉండటంతో వీటిపై పూశాం గ్రామానికి చెందిన తెలుగు తమ్ముళ్ల కన్ను పడింది. టీడీపీ అధికారంలోకి రావడంతో వీరి కళ నెరవేరింది. భూదందాకు పథకం రచించారు. చెరువు, అటవీ భూమితో కలిపి 53.77 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు రంగంలోకి దిగారు. అధికారులను ప్రలోభ పెట్టారు. తమ వెనుక తిరిగే అనుచరులకు భూములు ఇస్తామని నమ్మించారు. దీనికోసం కాస్త ఖర్చవుతుందన్నారు. ఒక్కో రైతు నుంచి ఎకరాకు రూ.30 వేలు చొప్పున వసూలు చేశారు. ఇందులో కొంత మొత్తాన్ని రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పి దర్జాగా భూ ఆక్రమణలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి... ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీలు సాగుచేసే భూములను వారికే పట్టాలు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం పూశాం గ్రామానికి చెందిన బీసీ కుటుంబాల వారు 8.75 ఎకరాల భూమికి దొడ్డిదారిలో పట్టాలు తీసుకున్నారు. బెవర రమాదేవికి 2.50 ఎకరాలు, శివ్వాల తారకేశ్వరికి 2.50 ఎకరాలు, శివ్వాల విశ్వనాథంకు 1.50 ఎకరాలు, శివ్వాల దాసునాయుడు 0.75 సెంట్లు, శివ్వాల సత్యనారాయణకు 0.75 సెంట్లు, శివ్వాల గంగాధర్‌కు 0.75 సెంట్లుకు పట్టాలిచ్చినట్టు రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ‘మామ్మూళ్ల’మత్తులో రెవెన్యూ అధికారులు బీసీలకు పట్టాలిచ్చారని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మొత్తం ఆక్రమణలే... రెవెన్యూ అధికారులు పట్టాలిచ్చింది ఆరుగురు రైతులకు 8.75 ఎకరాలకు మాత్రమే. దీనిని అడ్డుపెట్టుకుని 48/1లో ఉన్న సొండికర్ర చెరువు, 48/2ఎలో ఉన్న అటవీ (రెవెన్యూ) ప్రభుత్వ భూమి 51.48 ఎకరాలనూ ఆక్రమించేస్తున్నారు. గత 20 రోజులుగా పొక్లెయిన్లతో చదును చేసి అటవీభూములు, చెరువును పొలాలుగా మలుస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు నమోదు చేస్తాం రైతులకు ఇచ్చిన భూమి కంటే ఎక్కువ ఆక్రమించుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. నిబంధనలు ప్రకారం పట్టాలిచ్చాం. అవసరమైతే వాటిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పనులు తక్షణమే ఆపించాలని వీఆర్వో, ఆర్ఐలను పంపించాం. ఎవరినీ వదిలేదు లేదు. - రమణమూర్తి, తహశీల్దారు, ఎల్.ఎన్.పేట -
దేవుడి ఆస్తుల్నీ వదలా
రంగనాయకుల స్వామి దేవస్థానం స్థలం ఆక్రమణకు యత్నం రూ.కోటి విలువ చేసేస్థలం స్వాహాకు రంగం సిద్ధం పట్టించుకోని అధికారులు ఉదయగిరి: ఉదయగిరిలో ఆక్రమణదారుల చేష్టలు పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ దర్జాగా కబ్జా చేస్తున్నారు. కాలువలు, వాగులు, వంకలు, శ్మశానాలే కాకుండా వేటినైనా స్వాహా చేస్తున్నారు. చివరకు దేవుని స్థలాలు కూడా వదల్లేదు. ఉదయగిరిలోని రంగనాయకుల స్వామికి చెందిన రూ.1 కోటి విలువచేసే సుమారు ఎకరా స్థలాన్ని స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ స్థలాన్ని చదునుచేసి ఇళ్ల స్థలాలకు అమ్మేందుకు కొంతమేర ప్లాట్లుగా విభజించారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు తమకు ఏమీ తెలియదన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎండోమెంట్ అధికారులు తమ స్థలాలను రక్షించుకునే ప్రయత్నానికి ఉపక్రమించకపోవడంపై పట్టణవాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొలువై ఉన్న రంగనాయకుల స్వామి దేవాలయం వెనుకభాగాన సు మారు ఎకరా స్థలం ఉంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం అంకణం రూ.25 వేలు నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో విలువైన ఈ స్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి మొత్తాన్ని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ స్థలంలో ఉన్న కంపచెట్లు తొలగించి చదును చేశారు. అంతటితో ఆగకుండా ఈ స్థలంలో కొంతమేర ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టారు. కొంతమంది స్థానికులు ఈ విషయమై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అలావచ్చి ఇలా వెళ్లిపోయారే తప్ప ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టలేదు. విలువైన స్థలానికి ముప్పు ప్రస్తుతం చదును చేసిన స్థలం 400 అంకణాల వరకు ఉంటుందని అంచనా. అంకణం రూ.25 వేలు చొప్పున విక్రయించినా రూ.1 కోటి పలుకుతుంది. ఇంత విలువైన స్థలాన్ని ఆక్రమించాలంటే దీని వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఖచ్చితంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. పేదలు నిలువ నీడలేక అంకణం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే కేసులు బనాయించే రెవెన్యూ అధికారులు ఇంత విలువైన స్థలం స్వాహా అవుతున్నా కిమ్మనకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ స్థలంలో కొంతమేర అమ్మకం జరిగినట్లుగా సమాచారం. కొన్న కొంతమంది వ్యక్తులు ఈ స్థలం దేవుడిదని తెలియడంతో అక్కడ కట్టడాలు నిర్మిస్తే ఇబ్బంది వస్తుందన్న భయంతో మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు స్పందించి ఆక్రమణకు గురవుతున్నా విలువైన ఈ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మరికొన్నిచోట్ల ఆక్రమణలు ఉదయగిరి పట్టణంలో టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత ఆక్రమణల పర్వం రోజురోజుకూ మితిమీరుతోంది. కొంతమంది రెవెన్యూ అధికారులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఉదయగిరి-నెల్లూరు రోడ్డు మార్గంలోని పర్యాటక భవనం ప్రాంతంలోని స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు అర కోటి విలువ గల ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలో ఇప్పటికే లక్షల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కొంతమంది ఆక్రమించి బేసిమట్టాలు వేసి అమ్మేస్తున్నారు. ఉదయగిరి-నెల్లూరు మార్గంలోని బీసీ కాలనీ సమీపంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొనివున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని గూడు లేని పేదలకు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. -
నెలలోగా వెబ్‌ల్యాండ్ రికార్డులు అప్డేట్
రెవెన్యూ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ రేమండ్ పీటర్ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థకు రికార్డులే పునాదులని, అవి బాగుంటేనే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అన్నారు. ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన మాభూమి పోర్టల్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, అయితే.. ఆన్లైన్లో ఉంచిన రికార్డుల్లో దొర్లిన తప్పులపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయన్నారు. పోర్టల్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ రికార్డులన్నింటినీ నెలరోజుల్లో అప్డేట్ చేయాలని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్వో)లకు ట్యాబ్లెట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)లకు ల్యాప్‌ట్యాప్‌లను త్వరలోనే అందజేయనున్నట్లు పీటర్ తెలిపారు. మాభూమి పోర్టల్‌లోని గ్రామ పహాణీలను డౌన్లోడ్ చేసి తనిఖీ నిమిత్తం సంబంధిత వీఆర్వోలకు అందజేయాలని, రెండువారాల్లోగా వాటిని అప్డేట్ చేసేవిధంగా చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ డివిజన్‌స్థాయిలో ఆర్డీవోలు, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు రికార్డుల అప్డేషన్పై ప్రతివారం సమీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాకు 200 వీఆర్వో కార్యాలయాలు రెవెన్యూ వ ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 200 చొప్పున 9 జిల్లాల్లో మొత్తం 1,800 గ్రామ రెవెన్యూ, అవసరమైనచోట మండల రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలను సమకూర్చనున్నట్లు సీసీఎల్ఏ రేమండ్ పీటర్ తె లిపారు. రెవెన్యూ వ ్యవస్థను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయనున్నామని, వీఆర్వోలు, ఆర్ఐలకు జిల్లా కేంద్రాల్లోనే క ంప్యూటర్ శిక్షణ ఇప్పించనున్నామని చెప్పారు. నెలాఖరు కల్లా అర్హులైన డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు కల్పిస్తున్నామని, ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ విధానాలపై దశలవారీగా డీటీలకు, తహసీల్దార్లకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. అపోహను పోగొడదాం... భూములకు సంబంధించి రికార్డుల్లో సరైన సమాచారం లేకపోవడం, మ్యుటేషన్లలో నెలకొన్న గందరగోళంతో ప్రజల్లో రెవెన్యూ వ్యవస్థపట్ల అపోహ ఉందని సీసీఎల్ఏ అన్నారు. రికార్డుల్లో తాము రాసిచ్చిన దానికి ఆన్లైన్లో డేటాఎంట్రీకి వ్యత్యాసం ఉంటోందని వీఆర్వోల సంఘాలు చెబుతున్నాయన్నారు. మాభూమి పోర్టల్‌లో లభ్యమౌతున్న సదుపాయాలను ప్రజలకు వివరించి నేరుగా పోర్టల్‌ను సందర్శించి వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీసీఎల్ఏ కార్యదర్శి రవీంద్రబాబు, డిప్యూటీ కలెక్టర్ సత్యశారద, ఎన్ఐసీ ప్రతినిధి మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్లాట్లుగా కొండ పోరంబోకు
సెంటు రూ.3 లక్షల చొప్పున విక్రయం సీఆర్డీఏ అధికారుల అండపై అనుమానం ఓ తెలుగుదేశం పార్టీ నేత నిర్వాకం పట్టించుకోని ప్రభుత్వ శాఖలు ►ప్లాట్లుగా కొండ పోరంబోకు మంగళగిరి : మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఒకరు పెనుమాక-ఎర్రబాలెం మధ్యలో కొండను ఆనుకుని మూడు ఎకరాల్లో అనధికార లేఅవుట్ వేసి విక్రయించారు. నాలుగు నుంచి ఐదు సెంట్లను ప్లాట్లుగా విభజించి ఒక్కో సెంటు రూ.3 నుంచి 3.50 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఆ ప్లాట్లు గ్రామకంఠంలోకి రావని తెలిసి స్థానికులు ఎవరూ కొనుగోలు చేయకపోయినా తనకున్న పరిచయాలతో హైదరాబాద్‌కు చెందిన వారిని మధ్యవర్తులుగా నియమించి భారీగా కమీషన్లు అందజేసి విక్రయించారు. ఈ వ్యవహారంలో సీఆర్డీఏకు చెందిన కొందరు అధికారులు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలొచ్చాయి. వారి అండదండలతోనే అక్రమార్కులు కొండపోరంబోకు భూమిని ఆక్రమించి యథేచ్ఛగా ప్లాట్లు వేశారని పలువురు అంటున్నారు. తమ అనుమతి లేనిదే అంగుళం స్థలం కూడా అమ్మటానికి లేదని చెప్పిన సీఆర్డీఏ అధికారులు... ఏకంగా కొండ పోరంబోకు భూమినే విక్రయిస్తే కళ్లు మూసుకొని చూస్తున్నారా...అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి అండతోనే.... రాష్ట్ర మంత్రి, సీఆర్డీఏ వైస్‌చైర్మన్ తనకు అత్యంత సన్నిహితులని ప్లాట్లు అన్నింటినీ గ్రామ కంఠంలో చేర్చి మినహాయిస్తామని హామీ ఇవ్వడంతోనే కొందరు స్థలాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అనధికార లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నా సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎర్రబాలెం కొండకు అటవీశాఖ ఏర్పాటు చేసిన రక్షణగోడను ఆనుకుని ప్లాట్లు వేశారు. రక్షణ గోడ నుంచి అటవీశాఖ వదిలిన 50 అడుగుల భూమిని కలుపుకుని లేఅవుట్‌కు రోడ్‌గా ఏర్పాటు చేసినా అటు అటవీశాఖ గానీ ఇటు సీఆర్డీఏ, మరో వైపు రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఆర్డీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలతో పాటు ఒక్క అంగుళం భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న అధికారులకు అధికారపార్టీ నేతలు వేసిన అనధికారలేఅవట్ కనిపించడకపోవడం విశేషం. అనధికార లేఅవుట్, అటవీభూముల ఆక్రమణలపై సీఆర్డీఏ అధికారులతో పాటు రెవెన్యూ, అటవీశాఖ అధికారులను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 500 ఎకరాలు
రెవెన్యూ అధికారుల సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 500 ఎకరాల ప్రభుత్వస్థలాల్ని వెంటనే గుర్తించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ అధికారులను కోరారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే గుర్తించిన 20 ప్రాంతాల్లో రెండు ప్రాంతాలు మాత్రమే జీహెచ్ఎంసీకి అప్పగించారని, ఎలాంటి వివాదాలు లేని మరో 11 ప్రాంతాలను వెంటనే జీహెచ్ఎంసీకి బదలాయించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. ఇళ్లనిర్మాణానికి అవసరమైన భూసేకరణపై శనివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఆర్డీఓలు, తహశీల్దార్లతో జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భూముల్ని త్వరితగతిన సేకరించి జీహెచ్ఎంసీకీ అప్పగించాలని కోరారు. నగరంలో 1466 నోటిఫైడ్ స్లమ్స్ ఉండగా, దాదాపు రెండు లక్షల మందికి ఇళ్లులేవని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలి పారు. జీహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. నగరంలో నైట్‌షెల్టర్లు, పార్కులు, చెత్త రవాణా కేంద్రాలు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి కూడా భూముల్ని గుర్తించాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్డీఓ కార్యాలయాల వారీ గా తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. సోమవారం రాజేంద్రనగర్, మంగళవారం సరూర్‌నగర్, శుక్రవారం మల్కాజిగిరి ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహిం చే ఈసమావేశాలకు జీహెచ్ఎంసీ అధికారులు హాజరు కావాలని కోరారు. సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం, హైదరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు సురేంద్రమోహన్, శివకుమార్‌నాయుడు, భాస్కరాచారి, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్.. కమీషన్
ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘రెవెన్యూ’ దందా షాపుల నుంచి నెలవారీ వసూళ్లు మొగుళ్లపల్లి మండలంలో ఎక్కువగా.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచన పేదలకు సరుకులు ఎగవేస్తున్న డీలర్లు వరంగల్ : పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందించే ప్రజాపంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు.. దాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. రేషన్ షాపుల నుంచి నెలవారీగా మామూళ్లు తీసుకుంటూ ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పేదలకు సరుకుల పంపిణీ విషయాన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నించి గతంలో ఒక తహశీల్దార్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు. ఈ ఘటనతోనైనా రెవెన్యూ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. తాజాగా పౌర సరఫరాల శాఖలో వచ్చిన మార్పుల నేపథ్యంలో రెవెన్యూ శాఖ వారి అక్రమాల వ్యవహారం ఇంకా పెరుగుతోంది. ఆహార భద్రత పథకంతో రేషన్ డీలర్లకు నెలవారీ సరుకుల కోటా కొంత మేరకు పెరిగింది. ఈ అంశాన్ని సాకుగా చూపుతూ రేషన్ షాపుల నుంచి తమకు వచ్చే నెలవారీ మామూళ్ల మొత్తాన్ని పెంచాలని కొందరు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. వారే స్వయంగా ఇంత మొత్తం అని నిర్ణయించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా జరుగుతున్న ఈ దందా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఇబ్బందికరంగా మారింది. మొగుళ్లపల్లిలో బరితెగింపు మొగుళ్లపల్లి మండలంలో రేషన్ షాపుల నెలవారీ మామూళ్ల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ మండలంలో దాదాపు 32 రేషన్ షాపులు ఉన్నాయి. మిగిలిన మండలాల తరహాలోనే ఇక్కడ ఒక్కో షాప్ నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం తక్కువగా అనిపించడంతో అక్కడి అధికారులు తాజాగా ఈ నిబంధనను మార్చారు. ఒక్కో షాప్ నుంచి వెయ్యి రూపాయల చొప్పున రావాలని, దీని కోసం ప్రయత్నించాలని రెవెన్యూ సిబ్బందికి అధికారుల నుంచి అనధికార ఆదేశాలు వచ్చాయి. తాజా నిబంధన ప్రకారం మొత్తాన్ని పెంచాలని సిబ్బంది డీలర్లుకు ఈ సమాచారం ఇచ్చారు. దీనికితోడు అవసమైనప్పుడల్లా రేషన్ షాపులనే లక్ష్యంగా చేసుకుంటుండడంతో అక్కడి వారు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పేదలకు డీలర్ల టోకరా... ప్రస్తుతం రేషన్ షాపులలో బియ్యం, కిలో కందిపప్పు, కిలో గోధుమలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. చాలా చోట్ల డీలర్లు పూర్తి సరుకుల కోసం డీడీలు తీయడంలేదు. తమ దగ్గర పప్పులు, గోధుమలు ఎవరూ కొనడంలేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులతో పేదలకు సబ్సిడీ సరుకులు చేరేందుకు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, డీలర్లతో ఉన్న సంబంధాలతో ఏమీ చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ మంది పేదలకు ఈ సరుకులు అందడం లేదు. నగర ప్రాంతాల్లోని కొందరు డీలర్లు పప్పులు, గోధుమలకు డీడీలు చెల్లించి వచ్చిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం పంపిణీ విషయంలోనే అధికారులు లెక్కలు పరిశీలిస్తున్నారు. మిగిలిన సరుకుల పంపిణీ తీరును పట్టించుకోకపోవడంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటేనే రెవెన్యూ అధికారుల దందాకు ముగింపు పడుతుంది. రేషన్ డీలర్ల అక్రమ వ్యవహారాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది ఒక్కో షాపునకు రూ.500 రేషన్ షాపుల నుంచి ప్రతీ నెల ఎంత ముట్టజెప్పలనేది రెవెన్యూ శాఖకు వారే నిర్ణయిస్తున్నారు. ఇది.. మండలానికో తీరుగా ఉంటోంది. సగటున మాత్రం ఒక్కో రేషన్ షాపు నుంచి ప్రతీ నెల రూ.500 వసూలు చేస్తున్నారు. ఆయా మండలాల్లోని రేషన్ డీలర్ల సంఘం నేతలు...మిగతా డీలర్ల దగ్గర వసూలు చేసి రెనెన్యూ అధికారులకు సమర్పిస్తున్నారు. మండలాల్లో ఉండే పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఉన్నతాధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారని... ఇలాంటి చోట్ల ప్రతి షాపునకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. నెలవారీ మామూళ్ల విషయంలో ఆలస్యం జరిగినా, జరగకపోయినా... అధికారులు రకరకాల నోటీసులు, దాడులతో దారికి వచ్చేలా చేస్తున్నారని చెబుతున్నారు. సాధారణం గా జరుగుతున్న వ్యవహారమే అయినా.. ఎవరూ బయటపడకపోతుండడంతో ఉన్నతాధికారులు పట్టించుకోనట్లుగానే ఉంటున్నారు. -
200 టిప్పర్ల ఇసుక సీజ్
కరీంనగర్ జిల్లా వేములవాడ రెవెన్యూ అధికారులు 200 టిప్పర్ల ఇసుకను మంగళవారం సీజ్ చేశారు. కొడుముంజ వాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను అగ్రహారం గుట్టల్లో నిల్వ చేశారు. ఈ ఇసుకను రాత్రివేళ్లలో ఇతర ప్రాంతాలకు రవానా చేస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మంగళవారం అగ్రహారం గుట్లల్లో నిల్వ చేసిన సుమారు 200 టిప్పర్ల ఇసుకను సీజ్ చేశారు. దానిని ప్రభుత్వ పనులను నిర్వహించే కాంట్రాక్టర్లకు అప్పగించారు. -
హైదరాబాద్‌లో రూ.77 లక్షలు పట్టివేత
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో అత్తాపూర్ వద్ద మంగళవారం రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ. 77 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకుని... పోలీసులకు అప్పగించారు. అనంతరం కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారి సంగీత ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు మమ్మురం చేశారు. అదికాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు బరిలో దిగారు. వారిని బుజ్జగించి... నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు రంగంలోకి దిగారు. అందులోభాగంగా రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. -
రెవెన్యూ అధికారులకు చంద్రబాబు వార్నింగ్
కృష్ణా: రెవెన్యూ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు జన్మభూమి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలో పట్టాదారు పాస్ పుస్తకాలపై అక్కడి రైతులు నిరసనకు దిగారు. దాంతో రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో, వీఆర్వోలపై చంద్రబాబు మండిపడ్డారు. ఆన్లైన్లో భూముల వివరాలు నమోదు చేయాలని వారిని ఆదేశించారు. అంతేకాక పనితీరు మార్చుకోవాలంటూ రెవెన్యూ అధికారులను చంద్రబాబు హెచ్చరించారు. -
నవంబర్‌లోగా ఈ- పహాణీల్లో వివరాల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పహాణీల్లో డేటా ఎంట్రీని నవంబర్‌లోగా పూర్తి చేయాలని భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్(సీసీఎల్ఏ) అధర్‌సిన్హా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రెవెన్యూ అంశాలకు సంబంధించి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహ సీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ-పహాణీలోని 15 నుంచి 31 అంశాల్లో ఈ ఏడాది పంట వివరాలను వెంటనే నమోదు చేయాలని అధర్‌సిన్హా అధికారులను ఆదేశించారు. ఆపై 1 నుంచి 14 అంశాల్లో భూమి వివరాలను పొందుపరచాలని సూచించారు. జిల్లాలవారీగా రైతుల ఆధార్ సీడింగ్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని, ఉద్యోగుల వివరాలను కూడా కంప్యూటరీకరించాలన్నారు. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 409 మంది దరఖాస్తుదారులు ఏకమొత్తంలో సొమ్ము చెల్లించారని, వీరిలో ఆర్హులైనవారికి తక్షణం ఆయా భూములను రిజిస్ట్రర్ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన మార్గదర్శకాలు, కన్వీనియన్స్ డీడ్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సర్కారు ఆమోదం తెలిపిన వెంటనే వాటిని ఆన్లైన్లో అందుబాటులోకి తె స్తామని చెప్పారు. -
కోర్టులతోనే దాగుడు మూతలా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చౌక దుకాణాల ఆథరైజేషన్‌ను ఇష్టారాజ్యంగా రద్దు చేస్తున్న రెవెన్యూ అధికారులు తప్పుడు వివరణలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదని హైకోర్టు ఆక్షేపించింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తప్పించుకొనేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తూ న్యాయస్థానాలతోనే దాగుడు మూతలు ఆడుతున్నారంటూ మండిపడింది. ఇలాంటి అధికారులను ఏమాత్రం ఉపేక్షించరాదని, న్యాయపాలన పరిరక్షణకు వీరు శిక్షార్హులని తేల్చి చెప్పింది. గుంటూరు జిల్లా బొల్లంపల్లి మండలం పేరూరుపాడులోని చౌక దుకాణం ఆథరైజేషన్‌ను రద్దు చేసిన వ్యవహారంలో బహిరంగంగా తప్పు ఒప్పుకొని, ఆ తరువాత మళ్లీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన గుంటూరు జిల్లా నర్సరావుపేట ఆర్డీఓ ఎం.శ్రీనివాసరావు, బొల్లంపల్లి తహసీల్దార్ వి.రఘురాంకు కోర్టు ధిక్కారం కింద నెల రోజుల జైలు శిక్ష విధించింది. వీరిద్దరికీ రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి బుధవారం తీర్పు వెలువరించారు. దీనిపై అప్పీల్‌కు వెళతామని, తీర్పు అమలును నిలిపివేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. న్యాయమూర్తి అంగీకరిస్తూ నాలుగు వారాలపాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రోడ్డు పక్కన రేషన్ కందిపప్పు ప్యాకెట్ల గుట్ట
నిరుపేదలకు అందించాల్సిన సబ్సిడీ కందిపప్పును రేషన్ డీలర్లు అక్రమంగా షాపులకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్డు గాడుదల వాగు వద్ద రోడ్డు పక్కన సోమవారం ఉదయం రేషన్ కందిపప్పు ఖాళీ ప్యాకెట్లు గుట్టగాలుగా పడి ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఈ ప్యాకెట్లపై తయారీ ముద్రలు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు ఆర్ఐ హుస్సేన్, వీఆర్వోలు కె.శ్రీధర్, వెంకటేశ్వర్లు హడావుడిగా ఆ ఖాళీ ప్యాకెట్లను బస్తాలలో కుక్కి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. మండలంలో మూడు నెలల నుంచి సరిగా సబ్సిడీ కందిపప్పు పంపిణీ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.140వరకు ఉండటంతో అదే అదనుగా భావించిన కొందరు రేషన్ డీలర్లు నిరుపేదల పొట్టగొట్టి షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఐదు రేషన్ దుకాణాల్లో విచారణ నిర్వహిస్తామని సివిల్ సప్లై డీటీ కరుణాకర్ తెలిపారు. అవసరమైతే పక్క మండలాల చౌక ధరల దుకాణలపైన కూడా విచారణ చేస్తామని అన్నారు. -
రూ. 1.6 లక్షల విలువైన ఇసుక స్వాధీనం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 303 క్యూబిక్ మీటర్ల ఇసుకను శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇసుక విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ ఇసుక డంప్‌ను ఎవరు ఏర్పాటు చేశారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
ఇంత బరితెగింపా?!
- గెడ్డలు, పంట కాలువలు ఏదీ వదలని రియల్టర్లు - వెంకన్నపాలెంలో రూ.2 కోట్ల విలువైన స్వామిగెడ్డ ఆక్రమణ - గెడ్డను కుదించి, లేఔట్‌కు రోడ్డు, కల్వర్లు వేస్తున్న వైనం - పట్టించుకోని అధికారులు.. ఆందోళనలో రైతులు చోడవరం: రియల్టర్ల దందాకు అడ్డూఆపూలేకుండా పోతోంది. వందల ఎకరాలకు సాగునీరందించే పంట కాలువలను, కొండగెడ్డలను సైతం ఆక్రమించుకొని లేఔట్లు, రోడ్లు వేసేస్తున్నారు. సాగునీటి వనరులను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో తేలడంతో రియలస్టేట్ వ్యాపారుల ఆక్రమణలకు రైతులు బలైపోతున్నారు. వెంకన్నపాలెంలో నాలిచెరువుకు నీరందించే స్వామి కొండగెడ్డ పూర్తిగా ఆక్రమణకు గురైంది. సర్వేనెంబరు 432లో 40 అడుగులు వెడల్పు ఉండాల్సిన స్వామి గెడ్డ ఇప్పుడు 5నుంచి 10 అడుగులు మాత్రమే ఉంది. ఈ చెరువు కింద సుమారు 200 ఎకరాల సాగుభూమి ఉంది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నా ఎగువన ఉన్న స్వామి గెడ్డ నుంచి చెరువులోకి నీరు పూర్తిగా రావడం లేదు. దీనితో ఈ ఖరీఫ్, వచ్చే రబీకి చెరువు ఆకయట్టు భూములను సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. రూ.2 కోట్ల విలువైన కొండగెడ్డ ఆక్రమణ ఈ గెడ్డకు ఆనుకొని పక్కనే వేసిన లేఔట్లో రియల్ వ్యాపారులు ఈ గెడ్డ భూమిని ఆక్రమించుకున్నారు. సుమారు రూ.2 కోట్లు విలువచేసే 2 ఎకరాలకు పైబడి గెడ్డను ఆగ్రమించుకొని లే ఔట్‌కు వేళ్లేందుకు 20 అడుగుల రోడ్డు వేస్తున్నారు. గెడ్డలో నీరు పోయేందుకు కేవలం 4 అడుగుల వెడల్పులో కాాలువను వదిలి అటూఇటూ పెద్ద కల్వర్టును కట్టేశారు. దీనిపై రోడ్డు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా మెయిన్‌రోడ్డు పక్కనే జరుగుతున్నా ఏ అధికారి పట్టించుకోకవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డుపై వృథాగా గెడ్డ నీరు : సోమ, మంగళవారాల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఎగువ కొండపై నుంచి గెడ్డలోకి భారీగా నీరు ప్రవహించింది. అయితే గెడ్డ ఆక్రమణకు గురికావడంతో ఎగువనీరు అనకాపల్లి-చోడవరం మెయిన్ రోడ్డును ముంచెత్తి ప్రవహించింది. కొండనీరంతా రోడ్డుపై వృధాగా పోవడంతో చెరువులో నీటి మట్టం పెరగలేదు. నాట్లకు కూడా ఇబ్బంది నాలి చెరువుకు నీరందక మా పొలాలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. కొండగెడ్డ ఆక్రమణకు గురవడంతో కొండనీరు చెరువులోకి రావడం లేదు. చెరువు కింద నాకు 80 సెంట్లు భూమి ఉంది. నీరులేక ఈ ఏడాది నాట్లుకు కూడా ఇబ్బంది పడ్డాం. -మొల్లి సత్తిబాబు, ఆయుకట్టు రైతు, వెంకన్నపాలెం. గతంలో ఈ పరిస్థితి లేదు నా సొంత భూమితో పాటు ఎకరాన్నర కౌలుకు చేస్తున్నాను. వరి, చెరకు వేశాను. నాలి చెరువులో గతంలో ఎప్పుడూ నీరుండేది. ఇప్పుడు స్వామి గెడ్డ ఆక్రమణకు గురవ్వడం, రియల్ఎస్టేట్ వారు రోడ్డు వేయడంతో గెడ్డ కుదించుకుపోయింది. ఎగువ నీరు చెరువులోకి రావడం లేదు. -పిల్లల దేముళ్లు, రైతు, వెంకన్నపాలెం. గెడ్డనీరు చెరువులోకి రాలేదు లేఔటుదారులు గెడ్డను ఆక్రమించి రోడ్డు వేస్తున్నారు, గెడ్డ మధ్యలో తూము కూడా క ట్టేశారు. గెడ్డ నీరు పూర్తిగా చెరువులోకి రాకుండా పొంగిపోయి రోడ్డుపై వృధాగా పోతోంది. గెడ్డ ఆక్రమణలు తొలగించి పూడికలు తీయాలి. -మురుకుటి పైడిరాజు, ఆయకట్టు రైతు, వెంకన్నపాలెం -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
జవహర్‌నగర్‌లో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లోని సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో వెలసిన అక్రమ నిర్మాణాలను, అక్రమ లేఅవుట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన లేఅవుట్లను, నిర్మాణాలను సోమవారం సాయంత్రం శామీర్‌పేట్ తహసీల్దార్ దేవుజా ఆధ్వర్యంలో జేసీబీతో కూల్చివేశారు. ఈ సందర్భంగా దేవుజా మాట్లాడుతూ.. జవహర్‌నగర్‌లో చాలా మంది తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, గ్రామంలోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో సర్వే నం.917, 918, 919, 920, 921, 922లలో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రత్నిస్తున్నారన్నారు. 30 ఏళ్ల క్రితం పట్టాలు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ లేఅవుట్ తయారు చేస్తున్నారన్నారు. త్వరలోనే వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో చాలా మంది నకిలీ డాక్యుమెంట్లతో పేదప్రజలను మోసం చేస్తున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్ఐ రాజు తదితరులు ఉన్నారు. -
విద్యుత్ ఉద్యోగికి ఏసీబీ షాక్
రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కె.కోటపాడు లైన్ ఇన్స్పెక్టర్ కె.కోటపాడు: మండ లంలో అవినీతి అధికారుల వేట కొనసాగుతోంది. 10 నెలల్లో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోగా తాజాగా విద్యుత్ శాఖకు చెందిన లైన్ ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుపడ్డాడు. కె.కోటపాడు లైన్ఇన్స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. మండలంలో దాలివలస గ్రామానికి చెందిన రైతు బండారు శ్రీనివాసరావుకు చెందిన పొలంలో ఇటీవల తుఫాన్‌కు విద్యుత్ స్తంభం ఒరిగిపోయి వైర్లు కిందికి వాలిపోయి తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనితో ఆయన పలుమార్లు ఈ స్తంభాన్ని మార్చాలంటూ కె.కోటపాడు ఏఈని, లైన్ఇన్స్పెక్టర్ కె.అప్పాజీబాబును కోరారు. స్తంభం మార్చడానికి రూ. 10 వేలు లంచం ఇవ్వాలని లైన్ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు. చివరికి రూ.8 వేలకు ఒప్పందం కుదురింది. లైన్ఇన్స్పెక్టర్ అవినీతికి అడ్డుకట్టవేయాలని భావించిన రైతు ఈనెల 4న ఏసీబీని ఆశ్రయించినట్టు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం రూ.500 నోట్లు 16 (8 వేలు) ఇచ్చి ఏసీబీ అధికారులు పంపారు. తన పొలంలోకి వస్తే ఒప్పందం మేరకు డబ్బు ఇస్తానని రైతు లైన్‌ఇన్‌స్పెక్టర్‌కు చెప్పడంలో సోమవారం మధ్యాహ్నం వచ్చాడు. పొలంలో డబ్బులు తీసుకుంటుండగా అప్పాజీబాబును పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. -
పట్టాలు సరే.. స్థలాలు ఎక్కడ?
- రెవెన్యూ అధికారులకు లబ్ధిదారుల ప్రశ్న - కలకలం రేపిన వికలాంగుడిఆత్మహత్యాయత్నం - జిల్లావ్యాప్తంగా 10వేలకుపైగా బాధితులున్నట్లు అంచనా కర్నూలు(అగ్రికల్చర్): తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకుచావండి అన్నట్టుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు. రాజకీయ నాయకుల నుండి వచ్చే సిఫార్సులు, ఇతరత్రా వచ్చే ఒత్తిళ్లకు లొంగి పేదలకు హడావుడిగా ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇస్తున్నారు.. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ పట్టాలకు సంబంధించిన స్థలాలు మాత్రం చూపడంలేదు. ఈ విషయంలో ఒక్కరు, ఇద్ద రు కాదు... వేలాదిగా లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నా అధికారుల తీరులో మార్పులేకపోవడం గమనార్హం. కల్లూరు మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన వికలాంగుడు రాముడికి పట్టా ఇచ్చినప్పటికీ స్థలం చూపడంలో కల్లూరు తహశీల్దార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గత సోమవారం కలెక్టరేట్లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందిం చిన కలెక్టర్ వెంటనే అతనికి ఇంటి స్థలం చూపించాలని కర్నూలు ఆర్డీఓ, కల్లూరు తహశీల్దార్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆగమేఘాల మీద ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రాముకు ఇంటిస్థలం చూపారు. అయితే ఈ సమస్య రాము ఒక్కడిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా 10వేల మంది ఉంటారని అంచనా. నగరంలోనే దాదాపు 5వేల మంది ఉన్నట్లు సమాచారం. 2009 వరదల కారణంగా.. 2009లో కర్నూలుకు వరదలు రావడంతో పునరావాసం కింద నగరవాసులకు కల్లూరు మండలం తడకనపల్లి, కర్నూలు మండలం రుద్రవరంలో ఇంటి స్థలాలు కేటాయించారు. సుమారు 50వేల మందికి 2011లో అప్పటి చిన్ననీటి పారుదలమంత్రి టీజీ వెంకటేష్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీదు ఈ పని చేశారు. నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లబ్ధిదారులు మాత్రం పట్టాలు చేతపట్టుకుని స్థలాలు చూపాలంటూ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా తడకనపల్లి, రుద్రవరంలో కర్నూలు, కల్లూరు వాసులకు పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపాలని ఏడాది నుంచి కోరుతున్నారు. కానీ అధికార యంత్రాంగం చెవికెక్కించుకోలేదు. - కల్లూరు మండలం తడకనల్లిలో 2011లో సర్వే నెం. 337, 338లో కర్నూలుకు చెందిన వేలాది మందికి పట్టాలు ఇచ్చారు. - కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెం దిన 1000మంది సర్వేనెంబరు 277లో, 2013లో ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇచ్చారు. - కర్నూలు మండలం రుద్రవరంలో నగరానికి చెందిన 2వేల మందికి 2012లో పట్టాలిచ్చారు. -
కబ్జా చెరలో చెరువులు
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు లక్షలాది ఎకరాలకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు ఉన్న చెరువులను సైతం రికార్డుల్లో చూపని వైనం చోడవరం: భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. చెరువులు.. గెడ్డలు.. వేటినీ వదలడం లేదు. సాగునీటి వనరులు కుదించుకుపోయి రై తులు అల్లాడుతున్నారు. వీటిని పరిరక్షిం చాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో సాగునీటి వెతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల బడా రైతులు చెరువులను ఆక్రమించి తమ సాగులోకి తెచ్చుకుంటుండగా, మరికొన్ని చోట్ల కబ్జాచేసిన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా వేసి దర్జాగా అమ్మేసుకుంటున్నారు. మేజర్ చెరువులు ఆక్రమించుకొని తోటలు కేపీఅగ్రహారంలో 4 చెరువులున్నాయి. సుమారు 800 ఎకరాల ఆయక ట్టు ఉంది. చెరువులు ఆక్రమించుకొని సరుగుడు, చెరకు తోటలు వేసుకొని అనుభవిస్తున్నారు. నీలం చెరువు కింద నాకు 2ఎకరాలు భూమి ఉంది. పూర్తిస్థాయిలో నీరందడంలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -యన్నంశెట్టి గోపి, రైతు, కేపీఅగ్రహారం ఇరిగేషన్లో ఉన్న చెరువుల కంటే మైనర్ ఇరిగేషన్లో ఉన్న సాగునీటి చెరువులు ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉన్న చెరువుల ఆక్రమణ మరీ ఎక్కువగా ఉంది. మైదాన జిల్లాలో సుమారు 1500 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చోడవరం నియోజకవర్గంలోనే సుమారు 246 చెరువులు ఉండగా వీటిలో 180 చెరువుల వరకు కబ్జాలో ఉన్నాయి. ఆక్రమణల వల్ల చెరువులు కుదించుకుపోయి సాగునీరు నిల్వ ఉండే విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో ఎక్కువ రోజులు పంటకు నీరందక రైతులు నష్టపోతున్నారు. కొన్ని చెరువుల్లో ఆక్రమణలకు ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలే ఇచ్చేశారంటే ఆయా శాఖల పర్యవేక్షణ ఏమేరకు ఉందో అర్థమౌతుంది. చోడవరం మండలంలో అడ్డూరు చెరువు ఆక్రమణకు అడ్డులేకుండాపోయింది. ఖండిపల్లిలో చెరువును కొందరు రైతులు ఆక్రమించుకోవడంతో అక్కడ చెరువు గర్భమే కనిపించడంలేదు. వెంకన్నపాలెం చెరువును ఎకరా వరకు రియల్టర్లు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేస్తుండగా లక్కవరం, బెన్నవోలు, గంధవరం, దుడ్డుపాలెం, గవరవరం, లక్ష్మీపురం, నర్సయ్యపేట, గాంధీగ్రామం చెరువులు కొందరి ఆధీనంలో ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది, ఎర్రవాయు ప్రాంతంలో ఉన్న చెరువులు, రావికమతం, రోలుగుంట మండలాల్లో పెద్దచెరువులు కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నాయి. మండలాల వారీగా ఎన్ని చెరువులు ఉన్నాయన్న వివరాలు ఇరిగేషన్ శాఖ వద్దే లేకపోవడం ఆ శాఖ అసలత్వాన్ని ఎత్తిచూపుతోంది. వీరి నిర్లక్ష్యం రియల్టర్లు, కబ్జాదారులకు వరంగా మరింది. చోడవరం మండలంలో మైచర్లపాలెంలో-3, జీజేపురంలో-2 చెరువులతోపాటు మరో 11 చెరువులు ఇరిగేషన్ జాబితాలో లేకపోవడం అందర్నీ అవాక్కుచేసింది. ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోకుండా ఉపాధి పనుల్లో గట్లు వేయడం కబ్జాదారులకు మరింత లాభదాయకంగా మారింది. జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాల సాగుభూమికి పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది. నీలకంఠపురంలో 3 చెరువులున్నాయి. ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. వర్షాధారంపైనే ఆధారపడి సాగుచేస్తున్నాం. ఆక్రమణలు వల్ల చెరువు గర్భం కుదించుకుపోయింది. పెదకట్టు చెరువు కింద నాకు 2ఎకరాల భూమి ఉంది. నీరులేక ఇబ్బంది పడుతున్నారు. చెరువల ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలి. -జి.సత్యనారాయణ, రైతు, నీలకంఠపురం. -
అక్రమంగా సాగు చేశారని..
సిరికొండ(నిజామాబాద్ జిల్లా): గిరిజనులు అక్రమంగా అటవీ భూముల్లో సాగు చేశారని అటవీ అధికారులు, పోలీసుల సహాయంతో పంటలను తొలగించారు. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని 50-60 ఎకరాల భూమిని గతంలో రెవిన్యూ అధికారులు గిరిజనుల పేరున పట్టా చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలను కూడా ఇచ్చారు. అయితే, ఈ భూమి అటవీ భూమి అని, మీరు ఏ అధికారంతో గిరిజనుల పేరున పట్టా చేస్తారని అటవీ అధికారులు.. రెవిన్యూ అధికారులను నిలదీశారు. దీంతో కళ్లు తెరిచిన రెవిన్యూ అధికారులు భూమిని వెనక్కి లాక్కున్నారు. అయితే, ఎన్నో ఏళ్లుగా ఆ భూమిని సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది కూడా సాగు చేశారు. దీంతో అటవీ అధికారులు పోలీసుల సహాయంతో పంటను నాశనం చేశారు. కళ్ల ముందే సాగు చేసిన పంటను నాశనం చేస్తుండటంతో గిరిజనులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆర్మీ, రెవెన్యూ ‘ఫైరింగ్’ రేంజ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కిచ్చేందుకు మొండికేసింది. గడువు ముగియడంతో స్థల స్వాధీనానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై తిరగబడింది. శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో సర్వే నంబర్ 502-937 వరకు గల 617 ఎకరాలను ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అవసరాల కోసం 1968లో రాష్ట్ర సర్కారు కేటాయించింది. క్షిపణుల ప్రయోగం, ఆయుధాల పరీక్షలకు ఈ భూమిని రక్షణ శాఖ వాడుకుంటోంది. రెండేళ్ల క్రితం కాలపరిమితి ముగియడంతో స్థలాన్ని ఖాళీ చేయాలని జిల్లా యంత్రాంగం కోరింది. అయితే, నిర్దేశిత ఫైరింగ్ రేంజ్ పరిసరాల్లో ఇబ్బడిముబ్బడిగా జనావాసాలు రావడం, నగరీకరణ నేపథ్యంలో లీజు పొడగింపునకు అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనికితోడు ఫైరింగ్ రేంజ్ సమీపాన ఔటర్ రింగ్‌రోడ్డు కూడా ఉండడంతో ప్రమాదకరమని భావించిన హెచ్ఎండీఏ కూడా లీజు పొడిగించకూడదని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ అంశాలను పరిగణనలో తీసుకున్న కలెక్టర్ రఘునందన్‌రావు మార్చిలో లీజును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన స్థానిక తహసీల్దార్ దేవుజాకు ఆర్మీ అధికారుల నుంచి చుక్కెదురైంది. ‘సర్కారు స్థలం’గా పేర్కొంటూ బోర్డులు పాతేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు అడ్డుకున్నారు. ఈ భూమిపై రెవెన్యూశాఖకు ఎలాంటి హక్కులు లేవ ని.. ఇది పూర్తిగా తమకే చెందుతుందని వాదనకు దిగారు. అంతేగాకుండా బోర్డులు ఏర్పాటు చేస్తే.. చర్యలు తీసుకుంటామని తమదైన శైలిలో హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు. భూమిని స్వాధీనం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడితే ఖాళీ చేస్తాం తప్ప.. వాదనలు అనవసరమని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక రెవెన్యూ గణం వెనుదిరిగింది. ఇదిలావుండగా, సర్కారు భూమిలో పాగా వేయడమేగాకుండా.. ఖాళీ చేయించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను ఆర్మీ జవాన్లు అడ్డుకున్న సంఘటనను జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. దీంతో జరిగిన పరిణామాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై రక్షణశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
కొండలు తొలిచేస్తున్నారు..
కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్న అటవీ శాఖ విశాఖపట్నం: అధికార పార్టీ అండదండలుంటే చాలు..అడ్డుకునే వారెవ్వరూ అన్నట్టుగా ఉంది కొంతమంది పారిశ్రామికవేత్తల తీరు. ప్రైవేటు ల్యాండ్స్ ముసుగులో అటవీ, రెవెన్యూ భూములను కూడా దర్జాగా కబ్జా చేస్తున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పాయకరావుపేట మండలం పీఎల్‌పురం రెవెన్యూ పరిధిలో అటవీ శాఖ బ్లాకు ఉంది. దీనిని ఆనుకుని రెవెన్యూ శాఖ అధీనంలో భారీ కొండలు ఉన్నాయి. వీటి మధ్యలో సర్వే నంబరు 171లో 560 ఎకరాలు భూమి సిద్దా రామదాసు పేరున ఉండేది. ఈ భూముల్లో ఉన్న కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలున్నాయి. గతంలో 260 ఎకరాలు సినీ దర్శకుడు వి.వి. వినాయక్, మద్దిపాటి సుబ్బరావు కొనుగోలు చేశారని, వీరి నుంచి విశాఖ సమీపంలోని దివీస్ లేబరేటరీస్ కంపెనీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఈ భూములను చదును చేసే పనుల్లో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన కొండలపై ఉన్న భారీ వృక్షాలను సైతం నేలమట్టం చేస్తున్నారు. కొండలు పైభాగంలో వరకూ పొక్లెనర్లతో చెట్లు తొలగించి చదును చేస్తున్నారు. ప్రైవేటు భూములు చదును చేసే పేరుతో కొండలను కూడా తొలిచేస్తున్నారు. ఈ కబ్జా వ్యవహారంపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎ.శ్రీనివాసరావు శుక్రవారం తమ సిబ్బందితో వచ్చి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. కంపెనీ వాళ్లవద్ద ఉన్న డాక్యుమెంట్లు పరిశీలించారు. దివీస్ కంపెనీకి చెందినదని చెబుతున్న భూములకు ఆనుకొని ఉన్న కొండప్రాంతమంతా అటవీశాఖకు చెందినదని ఎఫ్ఎస్వో పేర్కొన్నారు. అటవీశాఖకు చెందిన కొండపై భాగంలో చాలా వరకూ చెట్లు తొలగించి చదును చేసిన విషయం వాస్తవమేనన్నారు. అటవీశాఖకు చెందిన భూమి ఎంతవరకూ ఉందన్న విషయం పరిశీలన చేయాల్సి ఉందని చెప్పారు. చదును చేసిన భూమి వివరాలు ఫొటోలతో సహా అటవీశాఖ వెబ్సైట్లో పెట్టి పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన కొండ ప్రాంతభూములను సైతం ఆక్రమించుకునేందుకు యత్నించడాన్ని గుర్తించామని, వీటిని ఆ శాఖ అధికారులు కూడా పరిశీలన చేయాల్సి ఉందన్నారు. రెండు శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తే తప్ప ఇక్కడ అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన భూముల సరిహద్దులేమిటి? మధ్యలో ప్రైవేటు భూములు ఎంత ఉన్నాయనేది నిర్ధారణ కావడం కష్టమన్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఇక్కడ ఈ కబ్జా తతంతం జరుగుతోందని, అందుకే రెవెన్యూ శాఖ మిన్నకుండి పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జి తహశీల్దార్ కె.ప్రసన్న కుమార్‌ను వివరణ కోరగా రెవెన్యూ కొండలు తవ్వేస్తున్న విషయం తమ దృషికి రాలేదన్నారు. జిల్లా అటవీ శాఖాధికారి రామ్మోహనరావును వివరణ కోరగా పీఎల్ పురం బ్లాకులో అటవీ, రెవెన్యూ భూము లున్నాయని, వీటి మధ్య ప్రైవేటు భూములుండే అవకాశంలేదన్నారు. అయినప్పటికీ సర్వే చేయించి వాస్తవాలను తెలుసుకుంటామని చెప్పారు. -
నిర్లక్ష్యం వద్దు.. పనితీరు మార్చుకోండి
- రెవెన్యూ అధికారులపై కలెక్టర్ నిర్మల ఆగ్రహం సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, పనితీరు మెరుగుపడకపోతే ఉపేక్షించేది లేదని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులను కలెక్టర్ నిర్మల హెచ్చరించారు. ఇకపై రెండు నెలలకోసారి జిల్లా రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించటంతోపాటు పనితీరు, ప్రగతి నివేదికను బట్టి గ్రేడులిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాల అమలులో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పదిహేను ప్రాధాన్యతాంశాలను కలెక్టర్ నిర్మల సమీక్షించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లతో విడివిడిగా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారిగా తహశీల్దార్లతో పెండింగ్ సమస్యలపై ముఖాముఖి చర్చించారు. భూ వివాదాలకు సంబంధించి కోర్టు కేసులు, కంటెమ్డ్ కేసులపై అవగాహన లేకపోవటం, సీఎంఓ నుంచి వచ్చిన పిటీషన్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, సికింద్రాబాద్ మండలాలతోపాటు మరికొందరు తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో 58, 59 కింద పట్టాల పంపిణీ, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, ఎన్ఓసీ, సీఎంఓ పిటీషన్లు, ధృవీకరణ పత్రాల జారీ, ఆపద్బంధు, సీఎం సహాయ నిధి, జాతీయ కుటుంబ ప్రయోజన పథకంతోపాటు రెవెన్యూశాఖ నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలపై సమావేశంలో మండలాల వారిగా కలెక్టర్ సమీక్షించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, బయోమెట్రిక్ విధానాన్ని అందరూ పాటించాల్సిందేనని తెలిపారు. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన భూములను ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలన్నారు. జీవో 58 నుంచి 59కి మార్పిడి చేసిన దరఖాస్తుదారులు మొదటి వాయిదా డబ్బులు ఆగస్టు 10 లోగా, రెండవ వాయిదా డబ్బులు ఆగస్టు 31లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నవారు రెండ వాయిదా సొమ్మును ఆగస్టు 31 వరకు చెల్లించాలన్నారు. ఆసరా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు.. ఆసరా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు త్వరితగతిన సేకరించాలని తహశీల్దార్లను కలెక్టర్ నిర్మల ఆదేశించారు. ఎనిమిది మండలాలల్లో బ్యాంకు ఖాతాల సేకరణ వెనుకబడి ఉండటంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని కోరారు. భూ సమస్యపై.. షేక్‌పేట మండలంలోని ప్రభుత్వ భూములపై అత్యధికంగా కోర్టు కేసులు ఉన్నాయని, వీటిన్నంటినిపై ఆర్డీఓ, లా ఆఫీసర్, తహశీల్దార్ కలిసి కౌంటర్లు తయారు చేయాలన్నారు. ప్రభుత్వ భూములను తహశీల్దార్లు ప్రతినెల తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. భూముల పరిరక్షణకు కలెక్టర్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలుంటే వెంటనే తగిన ప్రతిపాదనలు చేయాలన్నారు. సమావేశంలో జేసీ కె.సురేంద్రమోహన్, ఏజేసీ కె.రాజేందర్, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురాంశర్మ, అధికారులు గోపాల్‌రావు, సంగీత, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు. -
ఆర్టీఏ అంటే అంతచులకనా?
రెవెన్యూ అధికారులపై ఆర్టీఏ కమిషనర్ ఆగ్రహం తిరుపతి మంగళం: సమాచార హక్కు చట్టం(రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్) అంటే రెవెన్యూ అధికారులకు అంత చులకనా?, ఆర్టీఏ అంటే ఏమిటో చూపి స్తా అంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి హెచ్చరించారు. తిరుపతి ఆర్డీవో కార్యాల యంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు, ఫిర్యాదుదారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూలో ఏ చిన్న సమాచారం అడిగినా చెప్పడం లేదని, చివరకు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పడం లేదని అర్జీదారులు ఆర్టీఏ కమిషనర్ తాంతియ కుమారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆర్టీఏ కమిషనర్ తాంతి యాకుమారి మాట్లాడుతూ రెవె న్యూ అధికారులకు సమాచార హక్కు చట్టం గురించి ఇంకా పూర్తిగా తెలిసినట్లు లేదన్నారు. సామాన్య ప్రజలు సైతం ఆర్టీఏ కింద రెవెన్యూలో ఎలాంటి సమాచారాన్ని అడిగినా ఇవ్వాలన్నారు. ఏర్పేడు తహశీల్దార్ ఎవరు ఎలాంటి సమాచారం అడిగినా ఇవ్వడంలేదని అనేక ఫిర్యాదులు అందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుసార్లు మందలించినా ప్రయోజనం కని పించడంలేదని, ఆర్టీఏ సత్తా ఏమిటో స వి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంటి పట్టా ఉన్నప్పటికీ అందులో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, తమకు ఇంటి స్థలం చూపాలని అర్జీ పెట్టుకున్న సుభాషిణి అనే వికలాంగురాలికి న్యాయం చేయాలని పలుసార్లు అర్బన్ తహశీల్దార్‌ను ఆదేశించినా ఎందుకు పట్టించుకోవడం లేదని, ఆర్టీఏ కమిషనర్ అంటే లెక్కలేదా?, అంత నిర్లక్ష్యమా అని మండిపడ్డారు. తాను ఇక్కడికి తహశీల్దార్‌గా వచ్చి ఆరు నెలలు మాత్రమే అవుతోందని, వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదో ఒక అదనపు బాధ్యతలను మోస్తున్నామని తెలిపారు. ఎన్ని బాధ్యతలు ఉన్నా ముందుగా సుభాషిణికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఆ అధికారం తమ చేతుల్లో లేదని, కలెక్టర్ ఆదేశిస్తే వెంటనే అమలు చేస్తానని ఆమెకు వివరణ ఇచ్చారు. దీనిపై ఇదివరకు అర్బన్ తహశీల్దార్లుగా పనిచేసిన ముగ్గురు తహశీల్దార్లకు నోటీసులు జారీ చేయాలని ఆర్టీఏ కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య, చిత్తూరు ఆర్డీవో పెంచల కిషోర్, తాహశీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
‘పెన్నా’ కబ్జా
విడవలూరు : మండల పరిధిలోని పెన్నాతీరం ఆక్రమణలకు గురవుతోంది. వందలాది ఎకరాలు ఆక్రమించి ఆక్వా సాగుకు గుంతలు సిద్ధం చేసున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని ఊటుకూరు పల్లెపాళెం వద్ద పెన్నానది నీటి ప్రవాహం కలుస్తుంది. ఈ ప్రాంతం ఆక్వా సాగుకు అనుకూలంగా ఉండటంతో కబ్జాదారుల కన్ను పెన్నా తీరంపై పడింది. యథేచ్ఛగా పెన్నానది, పెన్నాపోర్లుకట్టలను దర్జాగా దున్నేసి ఆక్వా సాగుకు గుంతలను మార్చేసుకుంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలను కబ్జా చేసేశారు. దీంతో పెన్నానది పూర్తిగా కుంచించుకుపోయి రూపురేఖలు మారిపోయింది. ఈ పరిస్థితితో భారీ వర్షాలు పడే సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు సముద్రంలోకి కాకుండా సమీపంలోని కాలనీని ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో ఆక్వా గుంతల్లోని వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులు కొందరు దర్జాగా యంత్రాలను వినియోగించి కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నిద్రలో రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖలు : పెన్నానదిలో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఏం మాత్రం పట్టించుకోవడంలేదు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వందల ఎకరాలను కబ్జాలు చేసి అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేయడం పట్ల సంబంధిత శాఖ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మా దృష్టికి రాలేదు : పెన్నా తీరం వెంబడి కబ్జా జరిగిన విషయం మా దృష్టికి రాలేదు. పెన్నా తీరాన్ని కబ్జా చేసి ఆక్వాసాగు చేస్తోంటే పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. - బషీర్, తహశీల్దార్ అనుమతులు లేవు: పెన్నానది సమీపంలో సాగు చేస్తున్న ఆక్వా గుంతలకు తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతుల లేవు. ఇలా అనుమతులు లేకుండా వందల ఎకరాల్లో సాగు చేస్తున్న ఆక్వా గుంతలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా త్వరలోనే నోటీస్‌లను జారీ చేస్తాం. -చాన్‌బాషా, మత్స్యశాఖ అధికారి -
ఖిల్లాపై ఏం జరుగుతోంది?
మెదక్‌టౌన్ : మంగళ, బుధవారాలు వచ్చాయంటే చాలు...! అధికార పార్టీ కీలకనేత ఒకరు అధికారులను, కాంట్రాక్టర్లను మెదక్ ఖిల్లాపైకి పిలిపించుకొని రహస్య మంతనాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లతో ఆ నేత రహస్య మంతనాలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఎవరైనా సరే ఆయనకు రావాల్సిన కమీషన్ ఇవ్వాల్సిందే. ఆయన లేనిదే ఆ కాంట్రాక్టు పని ముందుకు సాగదు. ఓ దశలో ఆ నేత ఓ మంత్రి అండదండలు చూసుకొని అధికారులు, కాంట్రాక్టర్లపై కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ప్రభుత్వం చేపడుతున్న ఏ పనికైనా ఆయనకు కమీషన్ ఇవ్వనిదే అధికారులు బిల్లులు చేయరనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల ‘గుట్టమీద ఏం దుకాణం పెట్టావంటూ’ సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆ కీలకనేతను మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం హెచ్చరికతో కొంతకాలం మంతనాలు తగ్గినా తిరిగి ఇటీవల మొదలైనట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార పార్టీ నేతలను సైతం అటువైపు కన్నెత్తి చూడనీయకపోవడం గమనార్హం. ఈ విషయమై అధికార పార్టీ నేతలు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కాంట్రాక్ట్‌కు డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని, అధికారులతోపాటు అనామకులకు కూడా డబ్బులిస్తూ పోతే తామెట్ల పనులు చేయాలని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ నేత అండతో ఓ మహిళా ప్రజాప్రతినిధి ఇసుక మాఫియా అధికార పార్టీ కీలకనేత తమకు అండగా ఉండగా మాకే ం భయమంటూ మెదక్ మండలానికి చెందిన ఓ మహిళా నేత ఇసుక మాఫియాకు తెరలేపారు. మండలంలోని బొల్లారం మత్తడితోపాటు ఇతర ప్రాంతాలనుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు కొన్నిసార్లు అడ్డుపడగా అధికారి పార్టీ కీలక నేత వారిని మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన అండ చూసుకొని పాపన్నపేటకు చెందిన మరో ముఖ్య నాయకుడు సైతం మంజీరానదిలోంచి ప్రతిరోజు వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ జోరుగా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. రామాయంపేట మండలంలోని అధికార పార్టీ నేత ముఖ్య అనుచరులు ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలిసింది. మండలంలోని రాంపూర్ వాగునుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. అధికార పార్టీ కీలకనేత కావడంతో చేసేది లేక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు. విలేకరులకు బెదిరింపులు! మిషన్ కాకతీయ పనులపై ఇటీవల న్యూస్ కవరేజీకి వెళ్లిన ఓ చానల్ విలేకరిని ఆ రాష్ట్ర నాయకుడి అండచూసుకొని మెదక్ మండలానికి పార్టీ సీనియర్ నాయకుడు ఇటీవల ఫోన్లో బెదిరించాడు. సదరు విలేకరి అతని బెదిరింపులను ఫోన్లో రికార్డుచేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆ నేతపై మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఇంతగా దౌర్జన్యానికి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకుల తీరుపై సర్వత్రా ప్రజల నుంచి బహిరంగంగానే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
అధికారులు చేసిన తప్పులను సరి చేయించండి
శ్రీకాకుళం: వంశధార, రెవెన్యూ అధికారులు గతంలో నిర్వాసితులకు నష్టం కలిగేలా సర్వేలు చేశారని అటువంటి వాటిని సరి చేయాలని పలువురు నిర్వాసితులు డిమాండ్ చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో వంశధార నిర్వాసిత గ్రామప్రజలతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడలి, తలగాం, దుగ్గుపురం గ్రామాలకు చెందిన పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి అధికారులను వివరాలు కోరినప్పుడు నిర్వాసితులు చెప్పిన దానికి అధికారులు ఇచ్చిన వివరాలకు పొంతన లేకుండా పోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రీసర్వే నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీనిచ్చారు. పాడలి గ్రామానికి సంబంధించి 471 మందికి పునరావాసం కల్పించాల్సి ఉందని తెలుసుకున్న మంత్రి తక్షణం వారికి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. చిన సంకిలి గ్రామంలో సర్వే నిర్వహించి గతంలో జరిగిన లోపాలను సవరించి అందరికీ ఒకే మాదిరిగా పరిహారం అందేలా 20 శాతం వరకు అదనంగా కలిపి చెల్లిస్తామన్నారు. పశువులశాలలు తదితర కట్టడాలకు నష్టపరిహారం ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. చినసంకిలి గ్రామంలో 20 శాతం గృహాలకు అన్యాయం జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు ఉండరాదని చెప్పారు. ప్రాజెక్టు పనులకు నోటిఫ్ చేసిన తేదీ తరువాత ప్యాకేజీ ఇవ్వడం కష్టతరమని, కానీ ముఖ్యమంత్రితో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నజొన్నవలస కాలనీకి రహదారిని నిర్మించాలని ఆయన ఆదేశించారు. వంశధారకు, విజయనగరం జిల్లాలో నాగావళిపైనున్న తోటపల్లి ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ సర్వే చేసిన ప్రతీ గృహానికి ఒక స్టిక్కర్‌ను అతికించాలన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజినీరు బి.రాంబాబు మాట్లాడుతూ హిరమండలం రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయిందని చెప్పారు. వంశధార భూ సేకరణ అధికారి సీతారామారావు మాట్లాడుతూ ప్రాజెక్టుకు 11,422 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉండగా, 11,271 ఎకరాలు సేకరించామన్నారు. 24 కేంద్రాల్లో పునరావాస కాలనీలకు ప్రతిపాదించామన్నారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జేసీ వివేక్ యాదవ్, నీటిపారుదల శాఖ సీఈ శివప్రసాద్, ఆర్డీవోలు దయానిధి, కె.సాల్మన్‌రాజు పాల్గొన్నారు. -
పైకమిస్తేనే పాస్ పుస్తకం
‘రెవెన్యూ’ చేతివాటం - రూ.25 వేల నుంచి లక్ష వరకు వసూలు - ఇప్పటికే పెండింగ్‌లో టైటిల్‌డీడ్స్, పాస్‌పుస్తకాలు - అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు విజయవాడ : స్థిరాస్తి లావాదేవీలకు కీలకమైన పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్స్ మంజూరులో రెవెన్యూ అధికారుల చేతివాటం పెచ్చుమీరింది. లంచాలు ఇస్తేనే పాస్ పుస్తకాలు మంజూరవుతున్నాయి. తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వేలాది రూపాయలు గుంజుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న రియల్టర్లు, బిల్డర్లు భూములు, క్రయ విక్రయాలు చేసి చేతులు మార్చుకోవటానికి దండిగా పైకం ఇచ్చి పాస్ పుస్తకాలు పొందటాన్ని అలవాటు చేశారు. ఆస్తుల క్రయ, విక్రయాలు, బ్యాంకు రుణాలు, తనఖాలకు విధిగా పట్టాదారు పాస్‌పుస్తకం అవసరం కావడంతో వాటి కోసం ప్రజలు రెవెన్యూ సిబ్బందికి లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోంది. గత నాలుగేళ్లుగా పాస్ పుస్తకం కావాలంటే కనీసం రూ.25 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 50 మండల రెవెన్యూ కార్యాలయాల్లో కనీసం 30 కార్యాలయాల్లో కుప్పలుతెప్పలుగా పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు రెవెన్యూ డివిజన్ల్లో 10 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పాస్ పుస్తకం కోసం మీసేవలో దరఖాస్తు చేసి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శలు వస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చిన వారికి రోజుల్లో పాస్‌పుస్తకం మంజూరవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాస్ పుస్తకం జారీ ఇలా.. పాస్ పుస్తకం పొందాలంటే ముందుగా మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయాలి. దాన్ని వీఆర్ఓ పరిశీలించి నివేదిక రాయాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారించి తహశీల్దార్‌కు నివేదిక ఇస్తారు. ఇదంతా జరగడానికి కనీసం నెల రోజుల వ్యవధి పడుతోంది. టైటిల్ డీడ్స్‌ను రెవెన్యూ డివిజనల్ అధికారి మంజూరు చేస్తారు. తహశీల్దార్‌కు పంపినా ఆర్డీవో కార్యాలయాల్లో అవి కదలటం లేదు. లంచాలు ఇచ్చిన వారికి మాత్రం టైటిల్ డీడ్స్ ఇచ్చేస్తున్నారు. బ్రోకర్ల హవా కాగా పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ మం జూరులో రెవెన్యూ కార్యాలయాల వద్ద బ్రోకర్లు హల్చల్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కొందరు బ్రోకర్లు రెవెన్యూ సిబ్బందితో మిలాఖత్ అయి పాస్‌పుస్తకాలకు రేటు కుదిర్చి మంజూరు చేయిస్తున్నారు. బ్రోకర్లు ద్వారా వెళ్లిన వారికి పాస్‌పుస్తకాలు వెంటనే మంజూరు అవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పాస్ పుస్తకాలు రద్దు చేసే యోచన కాగా పాస్ పుస్తకాలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవినీతిని అరికట్టలేక పట్టాదారు పాస్ పుస్తకాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఆస్తి ధృవీకరణ సర్టిఫికెట్ జారీ చేసే విషయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
భారీగా ఇసుక డంపులు సీజ్
తాండూరు: యాలాల మండలంలో భారీ ఇసుక డంపును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కాగ్నానది నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను మండలంలో పరిధిలో పలుచోట్ల అక్రమార్కులు ఇసుక డంపులను నిల్వ చేశారు. మంగళవారం తాండూరు తహసీల్దార్ గోవింద్రావుతోపాటు యాలాల,తాండూరు రెవెన్యూ అధికారులు ఆయా చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 21 ట్రాక్టర్ల ఇసుక డంపులు బయటపడగా వాటిని సీజ్ చేశారు. యాలాల మండల పరిధిలోని ప్రతిభా స్కూల్ సమీపంలో ఆరు ట్రాక్టర్ల ఇసుక, లక్ష్మీనారాయణపూర్ నుంచి బషీరాబాద్ మార్గంలో కాటన్ ఇండస్ట్రీస్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మరో 15 ట్రాక్టర్ల ఇసుక డంపులు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి.దాంతో ఇసుక డంపులను సీజ్ చేసినట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. సీజ్ చేసిన ఇసుక డంపులు మాయంకాకుండా చూడాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ చాంద్‌పాషాను తహసీల్దార్ ఆదేశించారు. పాతతాండూరుతోపాటు యాలాల మండలంలోని కాగ్నా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అంతకుముందు తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ సాజిద్ అలీ తహసీల్దార్ గోవింద్‌రావుతో వాదించారు. చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బంది కొరత వల్ల రాత్రి తనిఖీలు చేయడం వీలుకావడం లేదని తహసీల్దార్ వైస్ చైర్మన్‌తో స్పష్టం చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఎంఐఎం ఫ్లోర్లీడర్అసిఫ్ పేర్కొన్నారు. -
సర్కారు స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించం
- జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి పరిగి: ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తేల్చిచెప్పారు. గురువారం ఆమె పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆహారభద్రత కార్డులు, రుణమాఫీ పత్రాలు, ఆధార్‌సీడింగ్ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో చర్చించారు. పరిగిలో వ్యవసాయశాఖకు సంబంధించి ఒకటి, సివిల్సప్లైకి సంబంధించి మరొక గోదాంను ప్రభుత్వం నిర్మించాలనుకుంటోందని, వీటికోసం ప్రభుత్వ భూమిని పరిశీలించాలని తహసీల్దార్‌కు సూచించారు. వాటర్ గ్రిడ్ కోసం.. జాపర్‌పల్లి సమీపంలోని సర్వేనంబర్ 8లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ కోసం 25 ఎకరాల భూమి అవసరమున్నందున ఆ భూమి కేటాయింపు సాధ్యాసాధ్యాలపై రెవెన్యూ అధికారులతో ఆమె చర్చించారు. అనంతరం జేసీ పరిగి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి వెనకాల పెండింగులో ఉన్న ప్రహరీ నిర్మాణం, మార్చురీ గది అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కొండాపూర్ శివారులోని సోలార్ పవర్‌ప్రాజెక్టులో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని కలుపుకొన్నారనే ఆరోపణపై ఆమె నివేదిక కోరారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పై రెండు అంశాలకు సంబంధించి సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ మహేష్, వీఆర్ఓలు జహంగీర్, నారాయణ, పాపయ్య తదితరులున్నారు. -
చెరువులో క్లబ్‌కు భూమిపూజ
- శ్రీకాళహస్తిలోతెలుగుతమ్ముళ్ల అరాచకం - అధికారులూ చూసి వెళ్లిపోయారు శ్రీకాళహస్తి: తెలుగు తమ్ముళ్లా ... మజాకానా ... చెరువులో క్లబ్ భవనాలకు దగ్గరుండి అక్రమంగా భూమిపూజ చేయించారు. అభ్యంతరం చెప్పిన రెవెన్యూ అధికారులను సైతం నిలదీసి మరీ ఆ కార్యం పూర్తికానిచ్చారు. మనోళ్లే ఎందుకు అడ్డుకుంటారని నిలదీయగానే అక్కడి నుంచి అధికారులు కూడా పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి పట్టణంలో సోమవారం ఈ అరాచకం చోటుచేసుకుంది. ఓ క్లబ్ కమిటీ సభ్యులు పట్టణంలోని అయ్యలనాడు చెరువులో భవనాలు నిర్మించడం కోసం భూమిపూజ చేయడానికి ఉపక్రమించారు. ఈ సమాచారం తహశీల్దార్ చంద్రమోహన్‌కు అందింది. సిబ్బందిలో వెళ్లి చెరువులో భవనాలు నిర్మించడానికి అనుమతి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే క్లబ్ సభ్యులు తమకు గతంలో భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించారని తెలిపారు. చెరువుల్లో స్థలాలు కేటాయించరని, ఆధారాలు ఉంటే చూపాలని తహశీల్దార్ ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో చెరువులో భవనాల కోసం భూమిపూజ చేయడానికి వీలులేదని...అడ్డుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అదే సమయానికి పట్టణానికి చెందిన ముఖ్యమైన టీడీపీ నాయకులు, మునిసిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి అక్కడికి చేరుకున్నారు. మనోళ్లే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు అంటూ తహశీల్దార్‌ను టీడీపీ నాయకులు ప్రశ్నించారు. దీంతో చేష్టలుడిగిన రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్లబ్ సభ్యులు కొందరు టీడీపీ నాయకుల సమక్షంలో ఎంచక్కా యథావిధిగా భూమిపూజ నిర్వహించారు. మంత్రిది ఓ దారి-ఆయన అనుచరులది మరో దారి.... ఇదేమి విడ్డూరమో ఓ వైపు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెరువుల్లో సెంటు భూమి ఆక్రమించినా రాళ్లతో తరిమికొట్టాలని పదేపదే చెబుతుంటారు. కానీ ఆయన ప్రథమ అనుచరులు దగ్గరుండి చెరువులో భవనాల నిర్మాణం కోసం భూమిపూజ చేయించడం విడ్డూరంగా ఉంది. పేదోడు చెరువులో గుడిసె వేస్తే వెంటనే వాటిని తొలగించడంతో పాటు.... కోర్టు జారీచేసిన ఆదేశాలను చూపే రెవెన్యూ అధికారులు తమ్ముళ్ల చేతిలో మాత్రం కీలుబొమ్మలవుతున్నారు. కళ్లముందే భూమిపూజ నిర్వహిస్తున్నా రెవెన్యూ అధికారులు మాయమైపోవడమే అందుకు నిదర్శనం. అబ్బే భూమిపూజ జరగలేదు..... అబ్బే చెరువులో భూమిపూజ జరగలేదు. చెరువులో క్లబ్ సభ్యులు భవనాలు నిర్మించడానికి వారికి అక్కడ సెంటుభూమి కూడా లేదు. మా సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నాం.దీంతో వారు వెళ్లిపోయారు.భూమిపూజ చేయలేదు. -చంద్రమోహన్,తహశీల్దార్. -
‘రెవెన్యూ’ భూ మాయ
న్యూశాయంపేటలో రూ.కోట్ల భూమి ధారాదత్తం స్ట్రైకింగ్ ఫోర్స్, ఏడీ నివేదికలిచ్చినా పట్టని వైనం భూములను పరిశీలించిన జేసీ ప్రశాంత్ పాటిల్ ఆర్ఐ, వీఆర్వో సస్పెన్షన్‌కు ఆదేశం సెలవులో ఉన్న తహసీల్దార్‌కు చార్జ్ మెమో! హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ‘రియల్’ వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు కలెక్టర్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నా క్షేత్రస్థాయిలో వీఆర్వో, ఆర్ఐలకు ప ట్టడం లేదు. ఈ విషయం గమనించిన జేసీ ప్రశాంత్ పాటిల్ అక్రమార్కుల భరతం పట్టేందకు రంగంలో కి దిగారు. శనివారం న్యూ శాయంపేటలోని ప్రభు త్వ భూములు సర్వే లాండ్ రికార్డ్స్ ఏడీ, వరంగల్ ఆర్డీవోతో కలిసి సందర్శించారు. సరిగ్గా జేసీ వచ్చిన సమయంలో ప్రభుత్వ భూమి నుంచి కొందరు ప్రైవే టు వ్యక్తులు రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. దీంతో త హసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలపై మండి పడ్డారు. అప్పటి తహసీల్దార్‌కు చార్జ్ మెమో ఇవ్వడంతోపా టు ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేయాలని వరంగల్ ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం జీవో నంబర్ 58 కింద దరఖాస్తు చేసుకున్న స్థలాల ను జేసీ పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ ఉన్నతాధికారి హన్మకొం డ మండలం న్యూ శాయంపేటలో జరుగుతున్న ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారం, రెవెన్యూ అధికారుల పాత్రను జేసీకి తెలియజేశారు. వెంటనే జేసీ న్యూశాయంపేటకు వచ్చారు. అక్కడి ప్రభుత్వ భూమి సర్వే నంబర్లు 215, 260, 276లను పరిశీలించారు. ఈ భూముల్లో రికార్డుల ప్రకారం వరుసగా 1.33 ఎకరాలు, 6 గుంటలు, 9 గుంటలు.. మొత్తం 2.08 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూము ల పక్కనే ఓ ప్రముఖ సంస్థ ప్రైవేటు స్థలంలో ఇళ్ల్ల స్థలాల కోసం వెంచర్ చేసింది. ప్రైవేటు భూమిలో చేసిన వెంచర్ నుంచి ప్రధాన రోడ్డుకు వచ్చేందుకు అవకాశం లేదు. రోడ్డుకు, వెంచర్ ప్రాంతానికి మధ్యలో ఈ సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడి నుంచి కథ మొద లైంది. అధికారుల సర్వే అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలియడంతో తొలుత సర్వే లాండ్ రికార్డ్స్ అధికారులు భూ సర్వే చేశారు. అక్కడ వెంచర్ స్థలానికి, రోడ్డుకు మధ్యలో ఉన్నది ప్రభుత్వ భూమే అని లెక్కలు తేల్చారు. ఈ వివరాలు స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఇక తర్వాత ఆ భూములు రక్షణ బాధ్యత రెవెన్యూ వారిది. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శనాత్మకంగా తయారైంది. సర్వే నివేదిక ఇచ్చాక కూ డా ప్రభుత్వ స్థలంలో ప్రవేటు వ్యక్తులు రోడ్డు ని ర్మాణం చేస్తున్నా వీఆర్వో, ఆర్ఐ పట్టించుకోలేదు. తహసీల్దార్ పర్యవేక్షణ లోపం కూడా ఉందని జేసీ నిర్ధారణకు వచ్చారు. ఇదే భూమి విషయంలో ఇటీవల కలెక్టర్ వేసిన టాస్క్‌ఫోర్స్ బృందం కూడా రెవె న్యూ అధికారులకు వివరాలతో సమాచారం ఇచ్చిం ది. అయినా కబ్జాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జేసీ పరిశీలనలో తేలింది. ఎన్ఓసీ ఎలా వచ్చింది అక్కడి వ్యక్తులు భూములకు సంబంధించి ఎన్ఓసీ ఎవరు జారీ చేశారన్న విషయంపైనా జేసీ ఆరా తీశారు. ప్రైవేటు స్థలం చుట్టు పక్కల ప్రభుత్వ స్థలాలు ఉన్నా.. ఎన్వోసీ ఇచ్చే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జేసీ పరిశీలనలో తేలింది. దీంతో అప్పటి ఆర్డీవో, తహసీల్దార్లు ఎలా వ్యవహరించారనే విషయంపైనా జేసీ ఆరా తీశారు. అప్పటి ఫైల్ పూర్తి స్థాయిలో పరిశీలించాలని విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులపై చర్యలకు ఆదే శం రూ. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహా రంలో పాత్ర ఉన్నట్లు అనుమానించి స్థానిక ఆర్ఐ అశోక్‌రెడ్డి, వీఆర్వో మాధవరెడ్డిలను సస్పెండ్ చేయాలని వరంగల్ ఆర్డీఓకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హన్మకొండ తహసీల్దార్‌గా పనిచేసి సెలవులో ఉన్న చెన్నయ్యకు చార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక అందజేయాలన్నారు. విచారణ చేపడితే ఏం జరుగుతుం దోనని రెవెన్యూ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. -
పారిశ్రామికవాడ ఏర్పాటులో జాప్యం!
- స్పందించని ప్రజాప్రతినిధులు - చొరవచూపాలని ప్రజల వినతి తాండూరు: నాపరాతి వ్యర్థాలతో తలెత్తుతున్న కాలుష్యం నుంచి తాండూరు ప్రజలకు విముక్తి కలగటం లేదు. పారిశ్రామికవాడ(ఇండస్ట్రీయల్ ఎస్టేట్) ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రజాప్రతినిధుల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. సుమారు ఐదేళ్లుగా ఊరిస్తున్న పారిశ్రామికవాడ ఏర్పాటుపై అధికారులు ఊదాసీనతను ప్రదర్శిస్తున్నారు. మైక్రో స్మాల్అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎంఎస్ఎంఈ) కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నా స్థల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో ఏళ్లుగా పారిశ్రామిక వాడ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. తాండూరు మండలం జినుగుర్తిలో సర్వే నంబర్ 206లో 300 ఎకరాల అసైన్డ్‌భూమిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించాలని గతంలో రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇంత వరకు ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సంబంధించి స్థలం కేటాయింపుపై తాజాగా ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ తాండూరు రెవెన్యూ అధికారులకు వారం రోజుల క్రితం లేఖ రాసింది. రెండు,మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపించనున్నట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా తాండూరు పట్టణం చుట్టూ దాదాపు 500 వరకు నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా నాపరాతి ముక్కలు, ఇతర డస్టును పట్టణంలో రోడ్ల పక్కన డంపింగ్ చేస్తున్నారు. తద్వారా కాలుష్య సమస్యతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పాశ్రామిక వాడ ఏర్పాటు చేసి, పట్టణం చుట్టూ ఉన్న పాలిషింగ్ యూనిట్లను అక్కడికి తరలించాలనే డిమాండ్ ఉంది. ఇందుకు నాపరాతి పరిశ్రమ వర్గాలు కూడా అంగీకరించా యి. స్థలం కేటాయింపులో జరుగుతున్న జాప్యంతో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు బ్రేక్ పడింది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. -
రెవెన్యూ లీలలు..
మంచాల: మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరు కంచే చేను మేసిన చందంగా మారింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు దళారులకు, ఆక్రమణదారులకు ఆసరాగా నిలుస్తున్నారు. దీంతో విలువైన భూముల అక్రమ విక్రయాలు కొనసాగుతున్నాయి. వివరాలు.. ఖానాపూర్ గ్రామంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. నాగార్జున సాగర్ -హైదరాబాద్ దారి సమీపంలో ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ధర పలుకుతోంది. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో దళారులు, రెవెన్యూ అధికారులతో మిలాఖత్ అవుతున్నారు. రికార్డులను తారుమారు చేస్తున్నారు. తిరిగి ఆ భూములను అక్రమంగా విక్రయిస్తున్నారు. ఖానాపూర్ గ్రామంలో అక్రమ విక్రయాల తంతు జోరుగా కొనసాగుతోంది. అందుకు 67 సర్వే నంబర్లోని భూమి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఈ సర్వే నంబర్లో 310 ఎకరాలు భూమి ఉంది. కానీ అధికారులు గుర్తించింది మాత్రం 280 ఎకరాలు మాత్రమే. ఇంకా అధికారికంగా 30 ఎకరాల వరకు ఉంది. ఈ 30 ఎకరాల భూముల్లో అక్కడక్కడా కొంత మంది కబ్జాలో ఉన్నారు. కాని వాస్తవంగా వారికి పట్టా లేదు. రికార్డుల్లో కూడా లేరు. ఇది గమనించిన దళారులు రియల్ వ్యాపారులతో చేతులు కలిపి పట్టా భూమితో పాటు మిగులు 30 ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. 30 ఎకరాల భూమిలో అనర్హులు సైతం తమ పేర్ల మీద పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. 67 సర్వే నంబర్‌ను 67/1 నుంచి 67/26 వరకు నంబర్లను పొడిగించారు. అందులో ఈ భూమికి సంబంధంలేని వ్యక్తులు, స్థానికేతరులు కూడా పట్టా పాసు పుస్తకాలు తయారు చేసుకున్నారు. వారు యథేచ్ఛగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ తతంగమంతా బడా రియల్ వ్యాపారుల కనుసైగలో నడుస్తోంది. విలువైన 30 ఎకరాలను ఆక్రమణలో భాగంగానే అక్రమ పట్టా పాసు పుస్తకాలు, తప్పుడు రికార్డులు తయారు చేస్తున్నారు. అటు రియల్ వ్యాపారులు, ఇటు దళారులు కలిసి ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఒకే కుటుంబంలో ముగ్గురు పేర్లపై అక్రమ పట్టాలు పొందారు. ఒక్కరే మూడు పేర్లతో మూడు అక్రమ పట్టా పాసు పుస్తకాలు పొందడం గమనార్హం. ఇలా విలువైన 30 ఎకరాల భూమిని దళారులు తప్పుడు రికార్డులు తయారుచేసి రియల్ వ్యాపారులకు కట్టబెడుతున్నారు. ఈ అక్రమాలపై స్థానికులు ఇటీవలే జిల్లా కలెక్టర్‌ను కలిసి వివవించారు. అక్రమ పట్టాల విషయంలో విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ టి.శ్యాంప్రకాష్ వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
- అడ్డుకున్న భవానీనగర్ కాలనీవాసులు కీసర: దమ్మాయిగూడ గ్రామ పరిధిలోని భవానీనగర్‌లోగల అసైన్డ్ భూమిలో (సర్వేనెంబర్ 538 )లోని అక్రమ కట్టడాలను శ నివారం రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చేయడం చిన్నపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లో వెళితే.. గ్రామంలోని సర్వేనెం 538 లోగల సుమారు 20 ఎకరాల అసైన్ట్ స్థలంలో కొందరు రియల్ వ్యాపారులు భవానీనగర్‌పేరట లేఔట్‌ను రూపొందించి నిరుపేదలకు పాట్లు విక్రయించడంతో ఇక్కడ పెద్దఎత్తున కాలనీ వెలిసింది. ఈ భవానీనగర్‌లో కాలనీల్లో 80 శాతం ఇండ్లు నిర్మించుకోగా మిగతా 20 శాతం మంది బేస్మెంట్లు, గుడిసెలు వేసుకున్నారు. ఇండ్లు నిర్మించుకున్న వారు, ఇంటినెంబర్లు, విద్యుత్ బిల్లులు ఉండటంతో ఇటివల ప్రభుత్వం కల్పించిన జీఓ 58 క్రింద పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇటీవల ఖాళీ స్థలాల్లో కొందరు బెస్‌మెంట్ల నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ అధికారులు వాటిని కూల్చేయాలని నిర్ణయించారు. కాగా ఇటీవల మండలంలో క్రమబద్ధీకరణ కోసం 58 జీఓ క్రింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్ల పరిశీలన తీరును పరిశీలించేందుకు భవానీనగర్‌ను సందర్శించిన జేసీ అక్రమంగా నిర్మిస్తు న్న బెస్మెంట్లను తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం ఉదయం స్థానిక వీఆర్ఓ నాయక్, ఆర్ఐ కార్తీక్‌రెడ్డి తమ సిబ్బందితో భవానీనగర్‌కాలనీలో అక్రమంగా నిర్మించిన బెస్‌మెంట్ల ను జేసీబీ సహాయంతో తొలగించే పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు స్థానికులతోపాటు కూల్చివేతలను అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నేత (సర్పంచ్ భర్త) కాలనీవాసులు జేసీబీకి అడ్డం గా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న జవహర్‌నగర్ పోలీసులు కాలనీవాసులను, ప్రజాప్రతినిధులను సముదాయించారు. -
‘పన్ను’ ఇరకాటం
నెల్లూరు, సిటీ: కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం.. అన్నట్టు తయారైంది కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు పరిస్థితి. పన్ను బకాయిల వసూళ్లకు రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకుల మధ్య నలిగిపోతున్నారు. పన్నుల వసూళ్లు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అధికారపార్టీ నాయకులు మాత్రం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో తమకు సహకరించిన వారి జోలికి వెళ్లద్దంటూ హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని కార్పొరేషన్ సిబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో పనిచేసే బిల్కలెక్టర్లు సైతం పన్ను బకాయి వసూళ్లలో రెవెన్యూ అధికారులకు, ఇన్స్పెక్టర్లకు సహకరించట్లేదని తోటి సిబ్బంది వద్ద రెవెన్యూ అధికారులు తాము పడుతున్న ఇబ్బందులను చెప్పుకొస్తున్నారు. రెవెన్యూ విభాగంలో ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు , తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు, 32 మంది బిల్కలెక్టర్లు ఉన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఫీల్డ్ మీదకు వచ్చినప్పటికీ ఆయా డివిజన్ల బిల్కలెక్టర్లు సమయానికి రాకపోవడం, అధికారుల చెప్పిన మాటను లెక్కచేయకపోవడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రూ.30 కోట్లకు పైగా బకాయిలు నగర పాలక సంస్థకు దాదాపు రూ.30 కోట్లకుపైగా వివిధ రూపాన పన్నులు రావాల్సి ఉంది. ఈక్రమంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచే రూ.9 కోట్లు పన్నులు రావాల్సి ఉండగా, వివిధ ప్రైవేటు సంస్థలు, ఇళ్ల పన్నుల రూపాన రూ. 20 కోట్లకు పైగా బకాయిలు ఉన్నారు. ఈ క్రమంలో కమిషనర్ చక్రధర్‌బాబు వారానికి రెండుసార్లు రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు రెవెన్యూ పనితీరుపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ అప్పుల్లో పూర్తిగా మునిగిపోయిందని, రావాల్సిన పన్నుల బకాయిలను తప్పనిసరిగా ఈ నెలాకరుకల్లా పూర్తిస్థాయిలో వసూళ్లు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో 60 శాతం పన్నులు వసూలు చేస్తుండగా ఈ ఏడాది 40 శాతం మాత్రమే పన్నులు వసూలు చేయడం గమనార్హం. రోజుకు రూ.50 లక్షలు నుంచి రూ.60 లక్షలు వరకు పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ సిబ్బందికి కమిషనర్ ఇటీవల ఆదేశాలిచ్చారు. పన్నుల వసూళ్ళు సరిగా లేకపోయినట్లయితే కఠినచర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఈ క్రమంలో విధుల మీదకు వెళ్లిన రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లకు రాజకీయ నాయకులు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. తమ సొంత మనుషుల జోలికి రావద్దంటూ అధికార పార్టీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. దీంతో నేతల ఒత్తిడులకు భరించలేక, అధికారులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయలేక రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో కమిషనర్ దృష్టిసారిస్తేనే కార్పొరేషన్‌కు రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. -
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు
జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ హెచ్చరించారు. పెద్దఅంబర్‌పేట నగర పంచాయితీ పరిధిలోని పలు వివాదాస్పద భూములను గురువారం ఆయన సందర్శించారు. తట్టిఅన్నారంలోని జంగారెడ్డికుంట ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్డు నిర్మించారని, పెద్దఅంబర్‌పేటలో సర్వే నం-64లోని వెంకటయ్యకుంట కబ్జాకు గురవుతోందని ఫిర్యాదు రావడంతో స్పందించిన జేసీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి సదరు ప్రాంతాలను సందర్శించారు. ఆయా చెరువులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తట్టిఅన్నారం జంగారెడ్డికుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. పెద్దఅంబర్‌పేట వెంకటయ్యకుంటకు పూర్తి హద్దులు ఏర్పాటు చేయాలని, ఎఫ్టీఎల్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని సూచించారు. అనంతరం హయత్‌నగర్ మండలంలోని కోహెడలో పోలీసుశాఖ సమాచార టవర్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పెద్దఅంబర్‌పేటలోని సర్వే నం-64లోని ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు జేసీని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ యాదగిరిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ బీంప్రసాద్, డీఈ గోపాల్‌రెడ్డి, ఏఈ కనకలక్ష్మి, ఆర్ఐలు సుదర్శన్‌రెడ్డి, రవీంద్రసాగర్, సర్వేయర్ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియాపై చిర్రుబుర్రులు.. జేసీ సందర్శించిన విషయాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై జేసీ మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా అధికారులు అడ్డుచెప్పారు. పర్యటన వివరాలను మీడియాకు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. దీంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. జవహర్‌నగర్: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్‌సైనీ హెచ్చరించారు. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములు, అధికారులు నిర్వహిస్తున్న క్రమబద్ధీకరణ సర్వేను గురువారం సాయంత్రం ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డి, శామీర్‌పేట తహసీల్దార్ దేవుజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న క్రమబద్ధీకరణ జీవో 58,59 సర్వేను పరిశీలించి దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరి ఇళ్లను గుర్తించాలని, సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవినాయక్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అటవీ భూమి ఆక్రమణ
హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో సుమారు 80 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆర్ఎస్ నంబర్ 11లోని ఈ భూమిని ఆక్రమించిన బడాబాబులు రాత్రి సమయాల్లో పొక్లెయిన్‌తో భూమిని చదును చేయించారు. నాలుగు అడుగుల వరలతో మూడు అడుగుల నీటితొట్టెలు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. మామిడి మొక్కలు కూడా నాటారు. ఒకవైపు ఫెన్సింగ్ కూడా పూర్తిచేశారు. మిగిలిన మూడువైపుల గుంతలు తీసి ఫెన్సింగ్ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. పక్షం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. ఆర్ఎస్ నంబరు 11లో 1,460 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో వంద ఎకరాలు గతంలో ఉద్యానశాఖ వన నర్సరీకి కేటాయించగా, మిగిలిన భూమి ఆక్రమణలకు గురైంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలో నిరుపేదలకు కొంత భూమి కేటాయించి బడాబాబుల ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. నిరుపేదల ఆక్రమణలకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆక్రమణలు జరిగిన, మొక్కలు నాటని భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లుగా ప్రకటించారు. అలా ఉన్న భూమి నిరుపేదల ఆధీనంలో ఉండడంతో ఇటీవల ఇద్దరు ఆక్రమణదారులు కొంత సొమ్ము ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇవ్వనివారిని కూడా బెదిరించి మరికొంత భూమి స్వాధీనం చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల బృందం ఈ అటవీ భూములను పరిశీలించగా ఇక్కడ జరుగుతున్న బాగోతం బట్టబయలైంది. గ్రామ వీఆర్వో ఏసుపాదంను ‘సాక్షి’ వివరణ కోరగా నైజాం ప్రభుత్వం నుంచి ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆక్రమణదారులు చెబుతున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారుల హడావుడి ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆక్రమిత స్థలం వద్దకు చేరుకొని ట్రాక్టర్‌తో ఫెన్సింగ్, నీటి తొట్టెలను ధ్వంసం చేశారు. ఆక్రమణలపై మండల తహశీల్దారు కె.గోపాలకృష్ణ వివరణ ఇస్తూ.. మల్లవల్లి గ్రామంలో అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలిసిందన్నారు. గొల్లపల్లికి చెందిన పొట్లూరి గోపాలకృష్ణ, పంతం కామరాజు సుమారు 80 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు గ్రామ రెవెన్యూ అధికారి చెప్పారని వివరించారు. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
ఇండియన్ డిజైన్ గార్మెంట్స్‌లో విస్తృత తనిఖీలు
పరిగి : పరిగిలోని ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు సమీపంలోని జయమంగళి నది నుంచి ఫ్యాక్టరీలో భవనాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలింపులపై మండల రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఫ్యాక్టరీలో ఇసుక అక్రమ నిల్వలపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. స్పందించిన తహశీల్దార్ గోపాలకృష్ణ రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఫ్యాక్టరీలోకి మంగళవారం వెళ్లి భారీ ఇసుక నిల్వలను గుర్తించారు. సుమారు70-80 ట్రాక్టర్ల పరిమాణంలో ఇసుక నిల్వలను గుర్తించిన తహశీల్దార్ ఫ్యాక్టరీ సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఇన్చార్జి సందీప్‌తో మాట్లాడిన తహశీల్దార్ ఎవరి అనుమతితో ఈ ఇసుకను తరలించారని ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేందుకు మీకెంత ధైర్యమని నిలదీశారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేస్తున్నామని, ఈ ఇసుకను కట్టడాలకు వాడితే అదనంగా మరో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఫ్యా క్టరీ నుంచి జయమంగళి నదిలోని ఫ్యాక్టరీ వారు ఏర్పాటు చేసుకున్న అడ్డదారిని తహశీల్దార్ పరిశీలించారు. అనంతరం జయమంగళి నదిలోకి వెళ్లి ఎంత పరిమాణంలో ఇసుక తరలించారనే విషయాలను గుర్తించారు. అ నంతరం ఫ్యాక్టరీలో ఇసుక డంపులను గుర్తించిన విషయాన్ని తహశీల్దార్ గోపాలకృష్ణ ఆర్డీవో రామ్మూర్తికి తెలిపారు. తహశీల్దార్ వెంట ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వో రఘు, సిబ్బంది ఉన్నారు. అక్రమ ఇసుక తరలింపుపై ‘సాక్షి’ కథనం వెలువడిన వెంటనే ఫ్యాక్టరీలోని భారీ ఇసుక నిల్వలను వేరే ప్రదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించడం గమనార్హం. -
పవర్.. సవాల్
సాక్షి, మంచిర్యాల : ఈ నెల 3న జైపూర్ పవర్ ప్లాంటులో మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ప్రజాప్రతినిధులు, సింగరేణి, జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. రెండు నెలల వ్యవధిలో జైపూర్ ప్లాంటుకు రెండుసార్లు రావడం, పనుల ప్రగతిపై సమీక్షించి అధికారులను హెచ్చరించడం, మంత్రులకూ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడాన్ని పరిశీలిస్తే ప్లాంటు పనుల పూర్తిపై ముఖ్యమంత్రి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అర్థమవుతోంది. తాజా సమీక్షలో.. ప్లాంటు నిర్వహణకు ఒక టీఎంసీ నీరందించే విషయంలో భూసేకరణ జరగకపోవడంతో ఆరు నెలల నుంచి పైప్‌లైన్ నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలుసుకున్న ముఖ్యమంత్రి రెండ్రొజుల్లోగా భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్, ఆర్డీవోలను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం రెవెన్యూ అధికారులకు సవాల్‌గా మారింది. పైపులైన్ నిర్మాణంలో భాగంగా సేకరిస్తున్న భూమికి జీవో ప్రకారం ఎకరానికి రూ.4.25లక్షలు, ఒక పంట కింద మరో రూ.1.25లక్షలు నష్టపరిహారంగా ఇస్తామని అధికారులు భూ నిర్వాసితులకు సూచిస్తున్నారు.కానీ నిర్వాసితులు ఎకరానికి రూ.10లక్షలు, సింగరేణి ఉద్యోగం డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారం పెంపు విషయంలో రెవెన్యూ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో ఐదు నెలలుగా పైపులైన్ నిర్మాణ పనులు నిలిచిపోయూయి. నష్ట పరిహారం విషయంలో రెవెన్యూ అధికారులు నిర్వాసితులను ఒప్పించడంలో విఫలం కావడంతో పైపులైన్ పనులు ముందుకు సాగడం లేదు. పవర్‌ప్లాంటుకు షెట్పల్లి గోదావరి నది నుంచి పైపులైన్ ద్వారా నీరందించాల్సి ఉంది. ఇందుకోసం 5 కిలోమీటర్ల మేరకు పైపులైన్ వేయూల్సి ఉంది. ఇప్పటివరకు 2కిలోమీటర్ల వరకు పైపులైన్ వేశారు. తమ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే భూమి ఇస్తామని గంగిపెల్లి నిర్వాసితులు 11మంది స్పష్టం చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బుధవారం గంగిపెల్లికి వెళ్లిన ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం నిర్వాసితులను నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు. సమస్య పరిష్కారమైతేనే పనుల పురోగతి ఉంటుందని సింగరేణి అధికారి ఒకరు తెలిపారు. సర్వే దశలోనే రైల్వేట్రాక్ పనులు.. పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గు ఉత్పత్తికి శ్రీరాంపూర్ నుంచి జైపూర్(11కిలోమీటర్లు) వరకు రైల్వేట్రాక్ నిర్మించాలని సింగరేణి నిర్ణయించింది. వంతెన నిర్మాణానికి 70 ఎకరాలు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించి సర్వే చేసి.. సింగరేణికి భూమి అప్పగించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. కానీ రె వెన్యూ అధికారులు ఇప్పటికీ భూ సర్వేలోనే ఉన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి.. సింగరేణికి భూమి అప్పగించే వరకు ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. మరోవైపు.. పవర్ ప్లాంటు నిర్మాణంలో ప్రజాప్రతినిధుల సహకారం కొరవడి నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్వాసితులను ఒప్పించి భూసేకరణ విషయంలో రెవెన్యూ అధికారులకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతోనే భూసేకరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయని రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. గుంటకు రూ.70వేలు ఇవ్వాలి - పాలమాకుల దేవేందర్‌రెడ్డి, గంగిపెల్లి గంగిపెల్లి గ్రామంలో 303/4 సర్వే నెంబర్లో మా భూమి ఉంది. పైప్‌లైన్ నిర్మాణంలో 30 గుంటల భూమి పోతుంది. రెవెన్యూ అధికారులు ఎకరానికి రూ.4.25లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారు. నా భూమి ఎకరం కూడా లేదు. గుంటకు రూ.70వేల చొప్పున ఇవ్వాలి. ఇలా అయితే.. ఎకరానికి రూ.20 లక్షలవుతుంది. -
ఆధార్ దోపిడీ
మీసేవ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా మారారుు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆధార్‌కార్డులో మార్పులు చేర్పులపై ప్రజల్లో ఉన్న ఆందోళనను ఆసరాగా చేసుకుని కార్డు జారీకి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ సామాన్యులను కష్టాలకు గురిచేస్తోంది. సులభతరంగా అందాల్సిన కార్డు లు, మార్పులు-చేర్పుల వంటి సేవలు కష్టసాధ్యంగా మారాయి. వీటిని జయించాలంటే ఆధార్ సెంటర్లో చేస్తున్న సిబ్బంది చేయి తడపాల్సి వస్తోం ది. కాదంటే రోజుల తరబడి ఆధార్ కేంద్రాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆ ధార్ సెంటర్‌కు వెళ్లింది మొదలు.. కార్డు దరఖాస్తు ఫారం ఇవ్వడానికి ఓ రేటు, దాన్ని నింపడానికి మరో ధర, క్యూలైన్లో త్వరగా వెళ్లడానికి ఓ రేటు లేదా టోకెన్ పద్ధతిలో సరిగ్గా సమయానికి వచ్చి ఐరిస్ మిషన్ ఎ దుట ఫొటో దిగడానికి ఓ రేటు నిర్ణయిం చారు. దాదాపుగా ప్రతీ ఆధార్సెం టర్లో, పని జరగడానికి రూ.100 చె ల్లించడం ఆనవాయితీగా మారింది. ఉచిత సేవలకు.. పైసలు.. ఇటీవల కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు అమలు చేసే పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారుు. కార్డులు జారీ చేసేందుకు మండలానికి ఒకటి చొప్పున ప్రత్యేకంగా ఆధార్‌సెంటర్లు మంజూరు చేశారు. ఆధార్సెంటర్లో కార్డులు జారీ, మార్పులు చేర్పులు తదితర పనులకు ఒక్కోకార్డుకు రూ.25 నుంచి రూ.30 వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. కానీ ప్రజల అమాయకత్వం, అవగాహనలేమిని ఆసరాగా చేసుకుని సిబ్బంది వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి ప్రతీకార్డుకు సొమ్ము తీసుకుంటూనే మరోవైపు ప్రజల నుంచి అంతకు ఐదింతలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ ఆధార్ కేంద్రాల పనితీరును జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్లు చూడాలి. ఆధార్ పంపిణీ సక్రమంగా జరుగుతుందా? లేదా అనే అంశాలపై వీరు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కేంద్రాలపై ఆరోపణలు వచ్చినప్పుడే తప్పా మిగతా సమయంలో అధికారులు ఇటువైపు కన్నెతి చూడటం లేదు. ఫలితంగా ఆధార్ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇటీవల కొన్ని ఆధార్ కేంద్రాల నిర్వాహకులు తప్పుడు పద్ధతిలో ఆసరా పథకానికి అనుగుణంగా వయస్సు పెంచి ఆధార్‌కార్డులు జారీ చేసిన తీరు ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇదే అంశంపై హన్మకొండ, ఆర్ట్స్‌కాలేజీ ఎదుట ఉన్న ఓ మీసేవా కేంద్రాన్ని ఇటీవల సీజ్ చేశారు. ఆధార్ సెంటర్ల పనితీరులో మార్పు వచ్చే వరకు జిల్లా, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శివ.. శివా.. జిల్లా మారుమూల ప్రాంతాలతో పోల్చితే నగరంలో మీ సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. శివనగర్ మీసేవా కేంద్రంలో ఆధార్‌సెంటర్ కేంద్రంలో నిర్వాహకులు సామాన్యుల నుంచి డబ్బుల వసూలు చేస్తున్నారంటూ రెండు నెలల క్రితం అక్కడి ప్రజలు ఆందోళన చేశారు. అ యినా అధికారులు చర్యలు తీసుకోలేదు. సోమవారం ఇదే కేంద్రంలో ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియను పరిశీలించగా మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో ఈ కేంద్రంలో 30 మంది ఆధార్‌కార్డు కోసం వేచి ఉన్నారు. వీరిలో పదిమందితో మాటలు కలపగా.. ఏడుగురు ఆధార్‌కార్డు కోసం రూ.100 చెల్లించినట్లుగా తెలిపారు. అంతకుముందు చార్‌బౌళిలో ఉన్న ఆ దార్సెంటర్కు వెళ్లగా అక్కడ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలా రూ.100 యూజర్‌ఛార్జీల్లో భాగం అనుకుంటున్నట్లుగా తెలిపారు. రెవెన్యూ అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల్లో దందా మరింత జోరుగా సాగుతోంది. అడ్రస్ మార్పు కోసం.. ఇంటి చిరునామా మార్చుకునేందుకు శివనగర్‌లో ఉన్న ఆధార్ కేంద్రానికి వచ్చాను. ఈ పని అయ్యేందుకు రూ.100 చెల్లించాలని ఇక్కడి సిబ్బంది తెలిపారు. దీనితో డబ్బులు చెల్లించి క్యూ లైన్లో నిల్చున్నాను. - పుష్ప, కరీమాబాద్ కొత్తగా పేరు చేర్చాలి.. గతంలో మా కుటుంబానికి ఆధార్‌కార్డు ఉంది. మా చిన్నబాబు పేరును ఆధార్‌కార్డులో చేర్చేందుకు వచ్చా ను. ఫారం నింపేప్పుడు రూ 100 ఇవ్వమంటే ఇచ్చా ను. రెండు, మూడు రోజుల్లో అవుతుందని చెప్పారు. - దేవులపల్లి లత, ఎస్‌ఆర్‌ఆర్‌తోట -
బాబోయ్.. పేలుళ్లు
బాంబు పేలుళ్లు.. గుండెలదిరేలా, చెవులు చిల్లులు పడేలా శబ్దాలు... చిన్నాపెద్ద అంతా ఉలిక్కిపడి లేచేలా అర్ధరాత్రి వేళ బ్లాస్టింగ్లు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. పేలుళ్లకు ఇళ్లు, ఒళ్లు గుల్లవ్వడమే కాదు శబ్ద, వాయు కాలుష్యాలతో గ్రామాలకు గ్రామాలే వణికిపోతున్నాయి. అనుమతులు లేకుండా కంకర క్రషర్ల యజమానులు ఈ బ్లాస్టింగ్స్ జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ⇒ అనుమతులు లేకుండానే క్రషర్లు? ⇒ కంకర పేలుళ్లతో జనం బెంబేలు ⇒ చంటి పిల్లలకు వినికిడి సమస్యలు ⇒ బీటలు వారుతున్న ఇళ్లు ⇒ నేతల అండతోనే పేలుళ్ల దందా! జిన్నారం: మండలంలోని ఖాజీపల్లి, బొల్లారం, రాళ్లకత్వ గ్రామాల పరిధిలో దాదాపు 10 కంకర క్రషర్లు ఉన్నాయి. ఖాజీపల్లి, బొల్లారం గ్రా మాల పరిధిలోని క్రషర్లకు అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. సోలక్పల్లి పంచాయతీ పరిధిలోని రాళ్లకత్వ శివారులోని క్రషర్ గ్రామానికి సమీపంలో ఉంది. ఇక్కడ బ్లాస్టింగ్లు జరి పితే చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో భూ కంపం సంభవించినట్టుగా భారీ శబ్దాలు వెలువడి, ఇళ్ల పునాదుల్లో కదలికలు వస్తున్నాయి. గోడలు బీటలు వారుతున్నాయి. ఈ క్రషర్లతో రాళ్లకత్వ, సోలక్పల్లి, దాదిగూడ, ఊట్ల తదితర గ్రామాల ప్రజలు కొంత కాలంగా అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ బ్లాస్టింగ్ లు జరుపుతుండడంతో ఇళ్లల్లో నిద్రించే వారం తా ఉలిక్కిపడుతున్నారు. శబ్దాల తీవ్రత అధికం గా ఉండడం వల్ల చిన్నారులకు చెవుడు సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. పెంకుటిళ్లలో పైనుంచి మట్టి, పెంకులు కింద పడుతున్నా యి. భవనాలకు పగుళ్లు రాగా, పెంకుటిళ్లు, పశువుల కొట్టాలు కూలిపోతున్నాయి. పెంకుటిళ్లు కూలిపోతే ఇదేమని ప్రశ్నించిన వారికి కొంత డబ్బు ముట్టజెప్పడం క్రషర్ యజమానులకు అలవాటైపోయింది. పేలుళ్లు జరిపినప్పు డు భారీగా పొగలు కమ్ముకుంటున్నాయి. ఆ పొగలు గ్రామాలను పూర్తిగా కమ్మేస్తున్నాయి. వాయు కాలుష్యంతో కూడా ఇక్కడి ప్రజలు పలు రోగాలపాలవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో కంకర క్రషర్ల యజ మానులు నిబంధనలను సైతం పక్కన పెడుతున్నారు. పంచాయతీ అనుమతు లు లేకుండానే భారీ ఎత్తున క్రషర్లను నడిపిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అనుమతులు కూడా లేవని స్థానికులు చెబుతున్నారు. అక్రమంగా నడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. పొగతో రోగాల పాలు.. పేలుళ్లు జరిపినప్పుడు పొగ గ్రామాన్ని చుట్టేస్తుంది. అరగంట సేపు ఏమి కనిపించదు. ఈ పొగను పీల్చుకోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు సైతం రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించండి. - లక్ష్మి, రాళ్లకత్వ గోడలకు బీటలు.. ఇల్లు నిర్మించి ఏడాది కూడా పూర్తికాలేదు. అప్పుడే గోడలకు పగుళ్లు వచ్చాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఒక్క కంకర క్రషర్ కోసం ఇన్ని గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. ఎమ్మెల్యే, ఇతర నాయకులు, అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి. - శ్రీనివాస్, రాళ్లకత్వ దెబ్బతిన్న దర్వాజాలు, చౌకోట్లు.. భారీ శబ్దాలకు ఇంటి దర్వాజాలు, చౌకోట్లు దెబ్బతిన్నాయి. నిరుపేదలమైన మేము మళ్లీ దర్వాజాలను ఏర్పాటు చేసుకోవడం కష్టంగా మారింది. ఇంటిపైకి వెళ్లే మెట్లు కూడా దెబ్బతిన్నాయి. గ్రామంలో బతకటం కష్టంగా మారింది. - యాదగిరి, రాళ్లకత్వ పంచాయతీ అనుమతులు లేవు.. రాళ్లకత్వ గ్రామంలోని కంకర క్రషర్కు పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. క్రషర్‌ను అక్రమంగా నడుపుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కంకర క్రషర్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - రాములు యాదవ్,సర్పంచ్ సోలక్పల్లి -
కలకలం!
కబ్జాదారులకు నోటీసులపై ప్రభుత్వం సీరియస్ క్రమబద్ధీకరణపై ఉన్నతస్థాయి సమీక్ష అధికారుల తీరుపై అసంతృప్తి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి చిక్కొచ్చిపడింది. నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోకపోతే, స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కొందరు రెవెన్యూ అధికారులు జారీచేసిన నోటీసులు కొత్త వివాదానికి దారితీశాయి. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లోని నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి వీలు క ల్పిస్తూ జారీచేసిన 58, 59 జీఓలపై ఇప్పటికే హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కబ్జాదారులకు తాజాగా తహసీల్దార్లు పంపిణీ చేసిన తాఖీదులపై కూడా కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకున్నా అత్యుత్సాహం ప్రదర్శించిన తహసీల్దార్ల వ్యవహారశైలిపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీ.ఆర్.మీనా, కలెక్టర్ రఘునందన్‌రావు సమక్షంలో జరిగిన సమావేశంలో సరూర్‌నగర్ ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఈ వ్యవహారంపై ఆరా తీసింది. తాఖీదులెందుకు ఇవ్వాల్సివచ్చిందని.. నోటీసులతో న్యాయపరమైన తలనొప్పులు వస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం కల్పించిన క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోవాలనే సదుద్దేశంతోనే నోటీసులిచ్చాం తప్ప.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా, జీఓ 59 చెల్లింపు కేటగిరీ కింద ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడంలేదని, ఈ అంశంపై ఏం చేస్తే బాగుంటుందో సూచించాలని పేర్కొన్నట్లు సమాచారం. -
బీడీ కార్మికుల ఎంపికలో అయోమయం
తాజా మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం మోర్తాడ్/నిజామాబాద్: బీడీ కార్మికులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల భృతిని చెల్లించేందుకు ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం రెవెన్యూ అధికారులు సోమవారం నుంచి గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నారు. మొదట్లో జారీ చేసిన మార్గదర్శకాలకు, తాజా ఉత్తర్వులకు తేడా చాలా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక వారికి తలకు మించిన భారంగా మారింది. అయితే, తాజా మార్గదర్శకాల బీడీ కార్మికుల ప్రభుత్వం ఇవ్వదల్చుకున్న జీవన భృతి పథకాన్ని ఆసరా పథకం కిందనే అమలు చేయాలని భావిస్తోంది. బీడీ కార్మిక కుటుం బాల్లో ఇప్పటికే కొందరికి వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం ‘ఆసరా’ కింద ఇప్పటికే పింఛన్ పొందుతున్నందున వీరికి ‘భృతి’ లభించదు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా అర్హత ఉన్న కార్మికులకు సైతం భృతి లభించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవీ నిబంధనలు.. గతంలో బీడీలు చుట్టి మానివేసినవారు కేంద్రం అందిస్తున్న పీఎఫ్‌ను పొందుతూ ఉంటే, వారి కుటుం బంలోని ఇతర బీడీ కార్మికులకు జీవనభృతి వర్తిం చదు. ‘ఆసరా’ కింద లబ్ధి పొందుతున్నవారు ఉన్న కుటుంబంలోని కార్మికులకు వర్తించదు. ‘ఆసరా’ కింద ఫించన్ పొందేవారి కుటుంబంలో ఒకరికి మాత్రమే బీడీ భృతిని అందిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఎవరికీ బీడీ భృతిని వర్తింప చేయమని తాజా మార్గదర్శకాలలో ఉంది. అంతేకాక బీడీలు చుట్టి మానివేసి బీడీ పింఛన్‌ను పొందుతున్నవారు ఎవరైనా ఉంటే ఆ కుటుంబంలోని ఇతర సభ్యులకు బీడీ భృతి వర్తించదు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే నెల ఒకటి నుంచి బీడీ కార్మికులకు భృతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఇదీ పరిస్థితి... ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రిజిస్టర్డ్ బీడీ కార్మికులు దాదాపు 6.50 లక్షల మంది ఉన్నారు. పేరున్న బీడీ కంపెనీలే తమ కార్మికులను పీఎఫ్‌లో చేర్చు తున్నారుు. మిగతావారికి భృతి అందుతుందా లేదా అనేది తెలియడం లేదు. భృతి పొందాలంటే సమగ్ర కుటుంబ సర్వేలో కచ్చితంగా బీడీ కార్మికురాలుగా నమోదై ఉండాలి.వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలనే నిబంధనలు చేర్చారు. ఈ లెక్కన చూస్తే వేలాది మంది అనర్హులుగా మారే అవకాశముంది. -
న్యాయం చేస్తారా.. చావమంటారా!
జగదేవ్‌పూర్ : తన పేరుతో ఉన్న భూమిని మరో రైతు భార్య పేరుతో పట్టా చేసిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఓ రైతు రెవెన్యూ అధికారులను నిలదీశాడు. అయినా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు పాపమొల్ల లింగయ్యకు 707బైఅ2 సర్వే నంబర్లో 37 గుంటల భూమి ఉంది. అలాగే 707బైఇ4బై4 సర్వే నంబర్లో ఆరున్నర గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమిలో కొన్నేళ్లుగా కుమారుడు రామచంద్రంతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే పై పేర్కొన్న భూమి 2010 వరకు లింగయ్య పేరు మీద ఉన్నా.. 2012వ సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ఐలపురం ఐలయ్య భార్య నర్సమ్మ పేరుపై రెవెన్యూ అధికారులు పట్టా చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రైతు లింగయ్య.. రెవెన్యూ అధికారులను సంప్రదించి తనకు న్యాయం చేయాలని కోరాడు. అయినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోయింది. కాగా ఇటీవల నర్సమ్మ మృతి చెందింది. దీంతో గతంలో తన పేరుతో ఉన్న పట్టా భూమిని తిరిగి తనపేరుతో మార్చాలని లింగయ్య ఐదారు నెలలుగా గ్రామ వీఆర్ఓ, ఆర్ఐ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో అధికారులు లింగయ్యను పట్టించుకోకుండా.. నర్సమ్మ కుమారుడు రాంబాబు పేరుతో మార్చారు. దీంతో చేసేది లేక శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లింగాయ్య, ఆయన కుమారుడు రాంచంద్రంలు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ శ్రీనివాసులుకు తమ గోడును విన్నవించుకుంటేనే.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రాంచంద్రం ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశాడు. దీంతో తహశీల్దార్, సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం వీఆర్ఓ, ఆర్ఐలకు తన వద్దకు పిలుచుకుని పూర్తి వివరాలను తెలుసుకున్నారు. తనకు తెల్వకుండా ఎలా పట్టా చేశారంటూ వారి తీరుపై మండి పడ్డారు. విచారణ చేసి రైతుకు న్యాయం చేస్తాం.. రైతు రాంచంద్రంకు జరిగిన పట్టా మార్పిడిపై పూర్తి వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తా. ఈ విషయంలో వీఆర్ఓ, ఆర్ఐ నుంచి వివరాలను సేకరిస్తున్నా. - శ్రీనివాసులు, తహశీల్దార్ -
అక్రమ నిర్మాణంపై హరీష్ సీరియస్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ నాయకుని భూ దందాకు తెరపడింది. భవన నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 993లో నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన 20 గుంటల స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సదరు నేత భూ ఆక్రమణపై ‘టీడీపీ నేత భూ దందా’ అనే శీర్షికతో శనివారం ‘సాక్షి’ కథనం ప్రచురితం కాగా, నీటిపారుదల శాఖ మంత్రి హారీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో ‘సాక్షి’ చూపిన చొరవ అభినందనీయమన్నారు. మిగతా పత్రికలు కూడా ‘సాక్షి’ ఆదర్శంగా తీసుకుని సర్కార్ స్థలాలను కాపాడాలని రామలింగారెడ్డి సూచించారు. ఇక ఈ భూ ఆక్రమణపై సీరియస్‌గా స్పందించిన మంత్రి హరీష్‌రావు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఆదేశించారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం అఘమేఘాల మీద అమీన్పూర్లో టీడీపీ నాయకుడు కడుతున్న అధునాతన ఫంక్షన్ హాల్‌ను సందర్శించి, భవన నిర్మాణ పనులను నిలిపివేశారు. పటాన్చెరు తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ సహాయక ఇంజనీర్ రాఖశేఖర్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. గ్యాస్ గోదాం నిర్మాణం కోసం స్థలాన్ని పొందిన సదరు నేత ప్రభుత్వాన్ని మోసం చేసి ఫంక్షన్ హాలు కడుతున్నట్లు తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి నిర్ధారించారు. ఇదే కారణాన్ని చూపుతూ ‘ఇచ్చిన భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో’ వివరణ ఇవ్వాలని సదరు టీడీపీ నాయకునికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు అమీన్పూర్ గ్రామ పంచాయతీ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాము అనుమతించిన భవన నిర్మాణ ప్లాన్ కు విరుద్ధంగా భవన నిర్మాణం చేపడుతున్నందున అనుమతిని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కాగా ఇండియన్ గ్యాస్ గోదాం నిర్మాణం కోసం భూమిని పొందిన టీడీపీ నేత గ్రామ పంచాయతీకి మాత్రం ‘కన్వెన్షన్ సెంటర్’ నిర్మాణం కోసం అనుమతించాలని దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. -
పోరంబోకుల దందా 1200 కాదు... 1350 ఎకరాలు
* తేల్చిన రెవెన్యూ అధికారులు * పోరంబోకుల దందా కథనానికి స్పందన * కదిలిన రెవెన్యూ యంత్రాంగం * ఆక్రమణదారులపై కేసులు పెడతాం: తహశీల్దార్ తర్లుపాడు : పోరంబోకు భూమి ఆక్రమణ 1200 కాదు 1350 ఎకరాలంటూ రెవెన్యూ అధికారులే సర్వే చేసి లెక్క తేల్చారు. మండలంలోని గానుగపెంట గ్రామంలో పశువుల మేత పోరంబోకు భూములను ఆక్రమించుకున్న వైనాన్ని ‘సాక్షి’ ఒంగోలు జిల్లా ఎడిషన్ మొదటి పేజీలో ‘పోరంబోకుల దందా’ శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గురువారం గ్రామాల్లో ఆక్రమిత ప్రాంతాలను ఆర్.ఐ. బి.శ్రీనివాస్, వీఆర్వో నాగేశ్వరరావులు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. సుమారు 1350 ఎకరాలకుపైగా కబ్జాకు గురైనట్లు గుర్తించారు. కబ్జాదారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తహశీల్దార్ కేవీఆర్వీ ప్రసాదరావు తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప తామేమీ చేయలేమని తహశీల్దార్ ముందు వీఆర్వో చేతులెత్తేశారు. పోలీసు రక్షణతో వెళ్తే తప్ప ఆక్రమణలను తొలగించలేమని స్థానిక అధికారులు చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక తప్పదనే నిర్ణయానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఆక్రమించిన భూముల ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రసాదరావు తెలిపారు. -
క్రమబద్ధీకరణ గడువు పెంపు!
పెద్ద స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన లేకపోవడమే కారణం రిజిస్ట్రేషన్ ధరలు అధికంగా ఉన్నాయంటున్న రెవెన్యూ వర్గాలు ఈ నెల 30 వరకు పొడిగించాలని యోచన సీఎంతో మరోసారి చర్చించి ప్రకటిస్తామన్న అధికారులు హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువును పొడిగించాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 19వ తేదీ వరకు ఉన్న గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలని రెవెన్యూ ఉన్నతాధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే గడువు పెంపు విషయమై మరోమారు సీఎంతో చర్చించిన తర్వాతే ప్రకటన చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటి క్రమబద్ధీకరణకు గత నెల 31న ఉత్తర్వులను జారీచేసింది. జీవో 58 ప్రకారం 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని, జీవో 59 ప్రకారం 125 గజాలను మించిన స్థలాలను వివిధ కేటగిరీల కింద సొమ్ము వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఉచిత క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల దర ఖాస్తులు రాగా, సొమ్ము చెల్లించే కేటగిరీ కింద వచ్చిన దరఖాస్తుల సంఖ్య రెండంకెలు దాటలేదు. ఇలాంటి స్థలాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో స్పందనే లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలక న్నా ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. రాష్ర్ట్ర విభజన అనంతరం రాజధానితోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ధరలు తగ్గాయని రెవెన్యూ అధికారులే అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం చివరిసారి నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరలనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఆక్రమణదారులు భూముల క్రమబద్ధీకరణకు ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. అలాగే సంక్రాంతి పండుగతో వరుస సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు సమర్పణకు గడువు పెంచాలని, భూముల క్రమబద్ధీకరణకు 2013 ఏప్రిల్ కంటే ముందున్న రిజిస్ట్రేషన్ ధరలను వర్తింప జేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. జీవో 59 ప్రకారం ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణతో వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో గడువు పెంచి చూడాలని నిర్ణయానికి వచ్చారు. -
భూ సమీకరణకు సిబ్బంది కేటాయింపు
సాక్షి, గుంటూరు: భూ సమీకరణను వేగవంతం చేయడంలో భాగంగా 27 యూనిట్లకు పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఇతర జిల్లాల నుంచి కేటాయించిన రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది గుంటూరు జిల్లాలో రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో వీరిని 27 యూనిట్ల పరిధిలో నియమిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలోని 16 గ్రామాల్లో భూ సమీకరణ కు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మండలంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బందిని నియమించగా, మిగిలిన సిబ్బందిని మంగళగిరి, తాడేపల్లి మండలాలకు కేటాయిస్తున్నారు. ఇప్పటికి ఇతర జిల్లాల నుంచి 11 మంది, గుంటూరు నుంచి ఆరుగురు మొత్తం 17 మంది డిప్యూటీ కలెక్టర్లు, 29 మంది తహశీల్దార్లు, 47 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 40 మంది సర్వేయర్లు వచ్చారు. 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు.తాత్కాలికంగా జిల్లాలో ఉన్న సీనియర్ అధికారులను భూ సమీకరణకు వాడుకుంటున్నారు.ఇంకా సీనియర్, జూని యర్ అసిస్టెంట్లను కేటాయించాల్సి వుంది. ఇప్పటికే జిల్లాలో పలువురు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లను భూ సమీకరణకు వినియోగిస్తున్నారు. మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు, తిప్పాయిపాలెంలో భూ సమీకరణ కోసం డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల పరిధిలో నోటిఫికేషన్లు విడుదల చేశారు. రైతులు 9.3 దరఖాస్తులు తీసుకెళ్లారు. బుధవారం నాటికి 725 మంది రైతులు 2,058.56 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు సమ్మతించినట్టు గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు తెలిపారు. తుళ్లూరు మండలంలోని ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు అంగీకార పత్రాలు ఇవ్వలేదు. -
రాజీనామా చేయకుంటే కేసులు పెడతారా?
* డీలర్లు కూడా మనుషులేనని గుర్తించండి * మా మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు * ఇలాగే ఉంటే కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా * మార్కాపురం రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే జంకె హెచ్చరిక మార్కాపురం : ‘వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్న రేషన్ డీలర్లు రాజీనామా చేయకుంటే అక్రమ కేసులు బనాయిస్తారా..? మార్కాపురం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మీనారాయణ, ఆర్ఐలు డీలర్ల ఇళ్లకు వెళ్లి రికార్డులు ఇవ్వమని వారిని వేధిస్తున్నారు. ఇదీ మంచి పద్ధతి కాదు. డీలర్లు కూడా మనుషులేనని గుర్తించండి. మా మంచితనాన్ని చేతగాని తనంగా భావించొద్దు’ అని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి ఎంపీపీ మాలకొండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డితో కలిసి వచ్చిన ఆయన.. తహశీల్దార్‌తో సుదీర్ఘంగా మాట్లాడారు. రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల రేషన్ డీలర్ విషయంలో అధికార పార్టీ నాయకులకు తలొగ్గి రెవెన్యూ అధికారులు వారు చెప్పినట్టు చేశారని, తామేమీ చూస్తూ ఊరుకోమని, అవసరమైతే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. విజిలెన్స్ డీటీ, ఆర్ఐల ఏకపక్ష నిర్ణయాలు, వారు ప్రజాప్రతినిధులపై చేస్తున్న విమర్శలపై కలెక్టర్, మంత్రితో పాటు హైదరాబాద్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఏ తప్పూ చేయకున్నా చింతగుంట్ల డీలర్‌పై కేసులు అక్రమంగా బనాయించారని ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం తనిఖీలకు వెళ్లిన అధికారులు రికార్డులను అక్కడే పరిశీలించాలని, తమ ఇంటికి తీసుకెళ్లడం ఎక్కడా లేదన్నారు. అలా చేయడం వల్ల రికార్డులు తారుమారు కావన్న గ్యారంటీ ఏమిటన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే రెవెన్యూ అధికారుల తీరు వివాదాస్పదంగా మారిందని, ఒక్కసారి పునరాలోచించుకుని మనస్సాక్షిగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే జంకె హితవు పలికారు. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదన్నారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం ఉద్యోగాలు చేయవద్దని, పేద ప్రజల సంక్షేమం కోసం విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి మాట్లాడుతూ దరిమడుగులో షాపు నంబర్ 19కు కేటాయిస్తున్న నిత్యావసరాలను అనధికార వ్యక్తి విక్రయిస్తున్నాడని, ఈ విషయాన్ని గతంలో చెప్పినా ఎందుకు విచారణ చేపట్టలేదని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. తహశీల్దార్ నాగభూషణం మాట్లాడుతూ తాము ఎవరి ప్రలోభాలకూ లొంగలేదని, దరిమడుగు డీలర్‌పై తానే స్వయంగా విచారణ చేస్తానని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. -
ఎరువుల దుకాణాలపై దాడులు
6 ఏ కేసు నమోదు ఆత్మకూరురూరల్: పట్టణంలోని మూడు ఎరువుల దుకాణాలపై రెవెన్యూ అధికారులు శనివారం మెరుపుదాడులు చేశారు. ఆర్డీవో వెంకటరమణ ఆధ్వర్యంలో తహశీల్దార్ బీకే వెంకటేశులు, వ్యవసాయశాఖ ఏడీ గోపినాయక్ తదితరులు మూడు బృందాలుగా ఏర్పడి షాపులు తనిఖీ చేశారు. కొన్ని దుకాణాల్లో రికార్డులు కంటే అధికంగా ఎరువులు ఉండగా, మరికొన్ని చోట్ల బిల్లులు లేకుండా విక్రయించడాన్ని గుర్తించారు. దాడులు అనంతరం ఆర్డీవో వెంకటరమణ విలేకర్లతో మాట్లాడుతూ వ్యాపారులు ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్లోని పలు దుకాణాలపై దాడులు చేశామన్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని పలువురు రైతులు ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. మూడు దుకాణాల్లో ఎక్కువ ఉన్న 396 బస్తాల ఎరువులను సీజ్ చేసి 6 ఏ కేసు నమోదు చేశారు. 577 బస్తాలను విక్రయించినా వాటికి సంబంధించిన బిల్లులు లేవని తేల్చారు. ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా బిల్లులు పొందాలని ఆర్డీవో సూచించారు. ఆత్మకూరు, అనంతసాగరం ఏవోలు ఎ.వాసు, కిశోర్‌బాబు, ఆర్ఐలు భాగ్యలక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరిలో దాడులు ఉదయగిరి : పట్టణంలోని బాలాజీ ఫెర్టిలైజర్స్ ఎరువుల దుకాణాన్ని శనివారం కావలి ఆర్డీవో ఎన్. వెంకటరమణ తనిఖీ చేశారు. రికార్డుల ఆధారంగా గోదాము, దుకాణంలోని ఎరువులు, పురుగుమందుల నిల్వలు లెక్కించి స్వల్ప తేడాలున్నట్లు గుర్తించారు. తహశీల్దారు కుర్రా వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి ఐ.సుబ్రహ్మణ్యం రెండుసార్లు గోదాములో ఉన్న ఎరువుల బస్తాలను పరిశీలించారు. యూరియా 11 బస్తాలు, 20:20:0:13 11 కట్టలు తేడా ఉన్నందున 6 ఏ కేసు నమోదు చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో అనేక ఎరువుల దుకాణాలు ఉన్నప్పటికీ కేవలం ఒక్క దాన్లోనే తనిఖీలు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. -
వితంతువులకు అగచాట్లు
మోర్తాడ్ :వితంతువులను ఎలాంటి ఇబ్బందికి గురి చే యకుండా వారికి పింఛన్ అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వితంతువు భర్త మరణించిన విషయాన్ని రెవెన్యూ అధికారులే ధ్రువీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. డెత్ సర్టిఫికెట్ల కో సం వితంతువులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు బహిరంగంగా సభల్లో చెబుతున్న మాటలు. పింఛన్ కోసం వితంతువులు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కాదు. అధికార పార్టీ నాయకుల మాటలకు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు పూర్తి భిన్నంగా ఉంది. కొత్త విధానంతో ఇబ్బందులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పింఛన్ విధానంలో వితంతువులకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా వితంతు పింఛన్‌ను మంజూరు చేశారు. కాగా ఇప్పటి ప్రభుత్వం ఆసరా పథకం కింద వితంతు పింఛన్ ఇవ్వడానికి మరణించిన భర్త డెత్ సర్టిఫికెట్‌ను అందచేయాలని ఆదేశించడంతో వితంతువులు అగచాట్లు పడుతున్నారు. ఏడాది వ్యవధిలో మరణించిన వ్యక్తికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేసే అధికారం తహశీల్దార్‌కు ఉంది. ఏడాది పైబడిన కాలంకు సంబంధించిన సర్టిఫికెట్‌ను జారీ చేయాలంటే రె వెన్యూ డివిజనల్ అధికారికి మాత్రమే అధికారం ఉంది. కాగా రెవెన్యూ రికార్డులలో మరణాల రిజిస్ట్రేషన్ పది సంవత్సరాల నుంచి సక్రమంగా సాగుతుంది. చాలా సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తికి సంబంధించిన మరణం వివరాలు రికార్డులకు ఎక్కలేదు. దీంతో ఎంతో మంది వితంతువులకు తమ భర్త మరణించినట్లు సర్టిఫికెట్ పొందడం కష్టసాధ్యం అవుతుంది. జిల్లాలో గతంలో 74,967 మంది వితంతువులకు పింఛన్లు అందేవి. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 83,924 మంది వితంతువులకు పింఛన్లు మంజూరు అ య్యాయి. ఇందులో ఎక్కువ మంది తమ భర్తలను 20, 30 ఏళ్ల కిందనే కోల్పోయారు. మరి కొందరు చిన్నతనంలోనే వైధవ్యం పొందారు. రెవెన్యూ రికార్డు ల్లో మరణాల రిజిస్ట్రేషన్ కొద్ది సంవత్సరాల నుంచి ఉంది. చాలా సంవత్సరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లేదు. దీంతో అనేక మంది వితంతువులకు తమ భర్త మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు పొందే అవకా శం లేదు. గతంలోని వితంతువు పింఛన్ జాబితా ఆ ధారంగా ఇప్పుడు వితంతువులకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వితంతువు పింఛన్ పొందుతున్న వారు వచ్చే జనవరి 31లోగా భర్త మరణించినట్లు డెత్ సర్టిఫికెట్‌ను అధికారులకు అందచేయాల్సి ఉంది. డెత్ సర్టిఫికెట్ అందించని వారికి పింఛన్లను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల వితంతువు పింఛన్ పొందడానికి అర్హత సాధించిన ఎంతో మంది పింఛన్‌ను అందుకునే అవకాశం లేదు. నోటరీ, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడం డెత్ సర్టిఫికెట్ల కోసం వితంతువులు రూ. 500 వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా డెత్ సర్టిఫికెట్లు లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. డెత్ సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో మెదలాలని పలువురు కోరుతున్నారు. వితంతువులను డెత్ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులను పలువురు కోరుతున్నారు. -
తప్పుచేస్తే వేటు తప్పదు
ఖమ్మం జెడ్పీసెంటర్ :‘పేదలు సంతోషంగా ఉండాలి, అప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుంది.. గ్రామ స్థాయి ఉద్యోగుల నుంచి జిల్లా అధికార యంత్రాంగం వరకు పట్టుదలతో కష్టపడి పని చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి’ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. వచ్చే నాలుగున్నర ఏళ్లలో చేపట్టే అభివృద్ధి పనులు, జిల్లా స్థాయి అధికారులతో వివిధ శాఖల పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదేళ్లుగా పాలన స్తంభించిందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన భాధ్యత అధికారులదేనని చెప్పారు. ఇప్పటివరకు సాగిన పాలన వేరని, నెల రోజుల్లో పాలన గాడిలో పడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన పట్టాలకు ఇంతవరకు భూమి పంపిణీ చేయలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉద్యోగులపై పర్యవేక్షణ సక్రమంగా లేదన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సరిగా పని చేయకపోవడం వల్లే అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇకనుంచి పాలన పటిష్టంగా ఉండాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు మాత్రమే అందించాలని, అనర్హులకు ఇవ్వడం నేరమని చెప్పారు. కొందరు అధికారులు చేసిన తప్పులతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తే ఉండదని, అధికారులు కీలకంగా వ్యవహరించి రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను నెంబర్ వన్‌గా మార్చాలని కోరారు. మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. చెరువుల అభివృద్ధిలో ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని, అవసరమైతే చెరువు కట్టలపైనే పడుకోవాలని చెప్పారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, ఈలోగా పాలన గాడిలో పడాలని అన్నారు. గుండాల రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసినా, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని అన్నారు. జిల్లా అభివృద్ధికి గుండాల ఆదర్శంగా ఉండేలా అధికారులు పని చేయాలన్నారు. 30 ఏళ్లుగా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నా ఒక్కటి కూడా చెట్టుగా ఎదగలేదని, అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుం డా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఉన్నాయని, అయితే వైద్యులు మాత్రం అందుబాటులో ఉండడం లేదని, ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలంబరితి, జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, జేసీ సురేంద్రమోహన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు బాణోతు మదన్‌లాల్, కోరం కనకయ్య, అటవీ సంరక్షణ అధికారి ఆనందమోహన్, ఆర్అండ్బీ ఎస్ఈ పింగళి సతీష్‌కుమార్, నీటిపారుల శాఖ అధికారి సుధాకర్, డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసనాయక్, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, డీఎంసీఎస్ సాంబశివరావు, డీఆర్వో శివశ్రీనివాస్, డీఎంఅండ్‌హెచ్‌ఓ భానుప్రకాష్, డీఎఫ్ఓలు ప్రసాద్, సతీష్ పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి విమానాశ్రయం!
దగదర్తి: మండలపరిధిలోని దామవరం, సున్నపుబట్టి, దగదర్తి, వెలుపోడు గ్రామాల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూములను మంగళవారం జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయం అవసరమని, అందుకోసమే సంబంధిత భూములను పరిశీలించామన్నారు. ఇప్పటికే జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, భారీగా పరిశ్రమలు ఉన్నాయన్నారు. విదేశాల నుంచి అనేకమంది పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నందున వారికి అవసరమైన భూములను కూడా పరిశీలిస్తున్నామన్నారు. త్వరలో విజయవాడ నుంచి అధికారులు విమానాశ్రయ భూములు పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత కలెక్టర్ దగదర్తి నుంచి వెలుపోడు, సున్నపుబట్టి, దామవరంలలో పర్యటించి మ్యాప్ ఆధారంగా సంబంధిత భూములను పరిశీలించారు. పట్టాభూమి 362.99 ఎకరాలు, ఢిఫారం భూమి 414.71, అటవీభూమి 446.09, ప్రభుత్వ భూమి 534.55, సీజెఎఫ్ఎస్ 479.37, చెరువు 24.26, కొండలు 224.87 ఎకరాలను ఎయిర్‌పోర్టు కోసం ప్రతిపాదించినట్లు కలెక్టర్ దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయమై మ్యాప్‌లో సూచించిన 2,486.84 ఎకరాలకు సంబంధించిన మ్యాప్‌ను మరొకమారు సరిచేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. చిగురిస్తున్న ఆశలు : అయితే గతంలో ఎన్నోసార్లు ఏయిర్పోర్టు అథారిటీ అధికారులు, జిల్లా అధికారులు సంబంధిత భూములను పరిశీలించి ఏయిర్ఫోర్ట్ నిర్మాణానికి భూములు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినా ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగడం లేదు. అయితే మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత భూములను పరిశీలించడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురించాయి. పరిశీలనలో కలెక్టర్‌తో పాటుగా కావలి ఆర్డీఓ నరసిం హం, తహశీల్దార్ కె లీల, సర్వేయర్ రాము, ఎస్సై వెంకటరావులు ఉన్నారు. -
మునేరు నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా
వత్సవాయి : మునేరు నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మండలంలోని ఆళ్లూరుపాడు క్వారీ నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండి పై సంపాదన లేక ఆవురావురుమంటున్న తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం వచ్చిన అవకాశాన్ని శాయశక్తులా వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అళ్లూరుపాడు క్వారీ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోప ణలున్నాయి. క్వారీ ప్రారంభమైనప్పటినుంచి పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. లారీల్లో పక్క రాష్ట్రానికి తరలింపు నియోజకవర్గంలోని ఏదో ఒక గ్రామం పేరుతో మీసేవలో నగదు చెల్లించి రశీదును క్వారీలో ఉన్న డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అందజేస్తున్నారు. అక్కడ నుండి లారీల్లో ఇసుకను నింపుకుని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ లోని హైదరాబాద్, కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, ైవైరా, మధిర వంటి ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించేవారు ఒకసారి బిల్లు తీసుకుని అనేక దఫాలుగా ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు రో జువారీ మామూళ్లు అందుతున్నాయని ప్రజ లు వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను లారీల్లో పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నా వాటి వేబిల్లులను రెవెన్యూ, పోలీ స్ అధికారులు తనిఖీ చేయడంలేదు. దీంతో అక్రమార్కుల ఇష్టారాజ్యంగా మారింది. ఓవర్ లోడింగ్ మీసేవలో ట్రాక్టర్ మూడు క్యూబిక్ మీటర్లు చొప్పున నగదు చెల్లిస్తున్నారు. మూడు క్యూబిక్ మీటర్లంటే నాలుగు టన్నులన్నర ట్రాక్టర్ ట్రక్కుకు బాడీ వరకు సరిపోతుండగా సుమారు మరో టన్నున్నర అదనంగా రవాణా చేస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌కు ఆరు టన్నుల ఇసుకను రవాణా చేస్తున్నారు. అదనంగా ఇసుకను పోసినందుకు ఒక్కొక్క ట్రాక్టర్‌కు కొంత మొత్తంలో నగదును క్వారీలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారు. లారీల విషయానికి వస్తే జేసీబీతో సుమారు 35 నుంచి 40 టన్నుల వరకు లోడింగ్ చేస్తున్నారు. సమయపాలన లేకుండా రవాణా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు క్వారీ నుండి ఇసుకను తరలించుకునే అనుమతి ఉంది. అయితే రాత్రి తొమ్మిది గంటల వరకు క్వారీ నుండి ఇసుకను రవాణా కొనసాగుతోంది. ఇదంతా పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. సమయపాలన ఎందుకు పాటించడంలేదని వెలుగు పథకం ఏపీఎం జె.నాగరాజును వివరణ కోరగా.. తమకు కేటాయించిన సమయం వరకే చూసుకుంటామని, తరువాత పోలీస్, రెవెన్యూ వారు చూసుకోవాలని సమాధానమిచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో ఇద్దరు రెవెన్యూ అధికారులు
రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ గండేడ్‌లో ఘటన గండేడ్: ఏసీబీ వలకు ఇద్దరు రెవెన్యూ అధికారులు చిక్కారు. వ్యవసాయ భూమి రికార్డుల మార్పు, పట్టా చేసేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ గండేడ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలు గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గండేడ్ మండ లం గాధిర్యాల్ గ్రామానికి చెం దిన దాయాదులు హుస్నాబాద్ హన్మంత్‌రెడ్డి, రాంరెడ్డిలకు కొంతకాలంగా సర్వేనంబర్లు 188,189, 253లోని 12 ఎకరాల భూమి విషయమై గొడవలు ఉన్నాయి. మొత్తం భూమి హన్మంత్‌రెడ్డి పేరుమీద ఉండడంతో తనకు వాటా ఇవ్వాలని రాంరెడ్డి కోర్టులో కేసు వేయడంతో 1996లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వంశపారంపర్యంగా రాంరెడ్డికి దక్కాల్సిన రెండుభాగాలైన 8 ఎకరాలు ఇస్తానని హన్మంత్‌రెడ్డి అంగీకరించి అఫిడవిట్ రాసిచ్చాడు. దీంతో రాంరెడ్డి కుమారుడు వెంకట్రాంరెడ్డి సదరు పొలాన్ని తన తండ్రి పేరుమీదుగా మార్చి పట్టా చేయాలని 3 నెలల క్రితం తహసీల్దార్ వెంకటేశ్వర్లును ఆశ్రయించాడు. అప్పటి నుంచి తహసీల్దార్ కాలయాపన చేస్తూ వచ్చాడు. చివరకు తహసీల్దార్ రూ.40 వేలు డిమాండ్ చేయడంతో రూ. 20 వేలు ఇస్తానని వెంకట్రాంరెడ్డి అంగీకరించాడు. అయినా కూడా తహసీల్దార్ పనిచేసి పెట్టలేదు. దీంతో విసుగెత్తిన వెంకట్రాంరెడ్డి ఈనెల 10న నగరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన రూ. 20 వేలు తీసుకొని గురువారం మధ్యాహ్నం గండేడ్ తహసీల్దార్ వద్దకు వచ్చాడు. ఈరోజే రికార్డుల్లో నమోదు చేయించి పట్టా పత్రం ఇస్తానని తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఆయనకు తెలిపాడు. డబ్బులు సీనియర్ అసిస్టెంట్ శీనప్పకు ఇవ్వాలని చెప్పడంతో.. ఏసీబీ అధికారుల సూచన మేరకు వెంకట్రాంరెడ్డి వాయిస్ రికార్డు చేశాడు. అనంతరం వెంకట్రాంరెడ్డి శీనప్పకు రూ. 20 వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు వెళ్లి శీనప్పను రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శీనప్పలను అదుపులోకి తీసుకొని విచారించారు. స్వాధీనం చేసుకున్న నోట్ల మీదున్న వేలిముద్రలను సేకరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కాగా తహసీల్దార్ ప్రతి కేసుకు లంచం మాట్లాడుకొని శీనప్ప ద్వారా డబ్బులు తీసుకునేవాడని స్థానికులు ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు శ్రీనివాస్, రాజేష్, కాశయ్య ఉన్నారు. -
భూమి పట్టా చేయడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం
స్టేషన్‌ఘన్‌పూర్: తన భూమికి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొండాపూర్‌కు చెందిన రైతు వనమాల రాజు తన తాత వనమాల భద్ర య్య పేరిట (సర్వే నంబర్ 229/ఏ) ఉన్న వ్యవసాయ భూమిని తన పేరిట పట్టా చేయాలని కోరుతూ ఏడాదిగా రెవెన్యూ అధికారుల చుట్టూరా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొండాపూర్ వీఆర్ఓ రూ.20 వేలు లంచం అడగగా భార్య పుస్తెలతాడు అమ్మి డబ్బులు ఇచ్చాడు. అయినా తిప్పించుకుంటుండంతోతహసీల్దార్ రామ్మూర్తిని సంప్రదించా డు. తహసీల్దార్ సైతం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రాజు బుధవారం సాయంత్రం తండ్రి సోమయ్యతో కలిసి తహసీల్ కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దార్‌ను, వీఆర్ఓను కలిశారు. అక్కడ వీఆర్ఓ రామకృష్ణను కలవగా, రోజూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.. అసలు మీ పేరిట పట్టా కాదని మండిపడ్డాడు. దీంతో మనోవేదనకు గురైన రాజు పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు బానోతు సునీల్‌నాయక్‌తోపాటు స్థానికులు అతడి నుంచి మందు డబ్బా లాగి పారేశారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. -
బరితెగిస్తున్న టీడీపీ నేతలు
రెవెన్యూ అధికారులపై దాడులు తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం పేరూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంచుమోహన్‌యాదవ్ తన అనుచరులతో కలసి ఆక్రమణలను అడ్డుకోవడానికి వచ్చిన ఆర్ఐ శంకరయ్య, వీఆర్వోలు భాస్కర్, నాగరాజు, వెంకటరమణ, ఈశ్వరయ్య, నూతన్కుమార్రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. బూతులు తిడుతూ ఆర్ఐపై భౌతిక దాడులకు యత్నించారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా భౌతిక దాడులకు యత్నించిన టీడీపీ నాయకుడు చెంచుమోహన్‌యాదవ్, అతని అనుచరులపై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఐ శంకరయ్య తహశీల్దార్ యుగంధర్‌ను కోరారు. దీనిపై మూడు రోజులుగా తహశీల్దార్ స్పందించలేదు. ఈ వ్యవహారంలో తహశీల్దార్‌పై కాసుల ప్రభావంతో పాటు మాజీ మంత్రి ఒత్తిడి ఉందని రెవెన్యూ వర్గాలు ఆరోపించాయి. ఆర్ఐ శంకరయ్యను ఫ్యాక్టరీకి పిలిపించి ‘ఏం నీకు పోస్టింగ్ ఇచ్చింది కేసులు పెట్టడానికా!’ అంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు అండగా నిలవాల్సిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ఒకరు ఆర్ఐని తీసుకుని వెళ్లి మరీ తిట్టించినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తుండంతో ఎట్టకేలకు టీడీపీ నేతలపై పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. -
‘బియ్యం సరఫరా లేదు.. భోజనం పెట్టలేం’
ఇస్కాన్ మందిర నగర అధ్యక్షుడు సత్య గోపీనాథ్ రాజమండ్రి సిటీ : ఇస్కాన్ ఫుడ్ రిలీప్ ఫండ్‌కు ఇవ్వాల్సిన బియ్యం సరఫరాను రెవెన్యూ అధికారులు నిలిపివేయడంతో శనివారం నుంచి ఇస్కాన్ మందిరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ఇస్కాన్ మందిరం రాజమండ్రి శాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ శుక్రవారం వెల్లడించారు. ఇస్కాన్ మందిరంలో ఆయన మాట్లాడుతూ తమకు అందాల్సిన 200 క్వింటాళ్ల బియ్యం నిలిచిపోయాయని, అందువల్ల భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 2012 సంవత్సరానికి సంబంధించి ప్రతి పాఠశాలకు నెలకు రూ.వెయ్యి చొప్పున పనివారికి ఇచ్చేందుకు నెలకు రూ.58 వేల చొప్పున రిలీజ్ అయ్యాయని, వాటినిజిల్లా విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు స్వాహా చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఇస్కాన్‌కు మధ్యాహ్న భోజన పథక పునరుద్ధరణ విషయమై నగర కమిషనర్ రవీంద్రబాబును వివరణ కోరగా విద్యాశాఖ నుంచి వినతులు అందలేదన్నారు. -
మీ సేవలో.. మాఫియా!
సాక్షి, కర్నూలు : ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటేనేం.. ఇసుక మాఫియా ఎప్పటికప్పుడు సరికొత్త అక్రమ మార్గాలను అన్వేషిస్తోంది. దర్జాగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులను బుట్టలో వేసుకోవడం.. బోగస్ పత్రాలను తయారు చేసి వనరులను కొల్లగొట్టడం చేసిన మాఫియా ఈసారి ఏకంగా సర్కారుకే టోకరా వేసేలా వ్యూహాలు రూపొందించింది. మీ సేవా కేంద్రాల్లో ఇతర నిర్మాణాల పేరిట భారీ మొత్తంలో ఇసుక సరఫరాకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించి అక్రమంగా హైదరాబాద్‌తోపాటు, కర్నూలు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తోంది. ఇందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులు లోపాయికారీగా సహకారం అందిస్తుంటే వ్యాపారులేమో లారీ ఇసుకను రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. స్వయం సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక రీచ్‌లకు అనధికారిక ఇసుక మాఫియా గ్రహణంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధికారిక రీచ్‌ల వద్ద క్యూబిక్ మీటరుకు రూ. 500 మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఒక ట్రాక్టరు ద్వారా 3 క్యూబిక్ మీటర్లు తరలించేందుకు రూ. 1,500తోపాటు రవాణా ఖర్చులు అదనంగా చెల్లించాల్సి ఉంది. అయితే అధికారులు చెబుతున్నట్లుగా ఆయా ఇసుక రీచ్‌ల్లో ఇసుక నిల్వలు లేకపోవడంతో.. ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించిన సామాన్యులు ఇసుక కోసం చక్కర్లు కొడుతున్నారు. నిడ్జూరు రీచ్‌లో ఉన్న ఇసుక నిల్వలను గత రెండు రోజులుగా బడాబాబులకు టిప్పర్లలో సరఫరా చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పరిశీలించేందుకు ‘సాక్షి బృందం’ ట్రాక్టర్ ఇసుక కావాలంటూ గురువారం నిడ్జూరు రీచ్‌కు వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఇసుక కూడా కనిపించలేదు. మేము ఆన్లైన్లో 3 క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ. 1,500 చెల్లించామని, ఇసుక సరఫరా చేసేదెవరని అక్కడ కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ను ప్రశ్నించిగా.. ఈ రోజు ఇసుక సరఫరాను బంద్ చేసినట్లు అతను చెప్పారు. స్థానికంగా నది నుంచి ఇసుకను డంపింగ్ యార్డుకు తరలించే కొందరు ట్రాక్టర్ల డ్రైవర్లు మాట్లాడుతూ.. ‘మాకు 15 రోజులుగా ఇసుక తరలింపు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదు. మా బ్యాంకు అకౌంట్లను కూడా తీసుకున్నారు. అయినా ఇంత వరకు సొమ్ములు చెల్లించలేదు’ అని వాపోయారు. మరీ మీరు ఇప్పటి వరకు ఇక్కడకు తరలించిన ఇసుక ఏదీ అని ప్రశ్నించగా.. ఆ ఇసుకను రెండ్రోజులుగా టిప్పర్లలో తరలించారని సమాధానం చెప్పారు. మరి మాకు ఇసుక ఎలా దొరికేదీ అంటే.. మీ సేవలో కట్టిన రసీదు మాకు ఇవ్వు.. రేపటిలోగా మీ అడ్రస్సుకు ఇసుకను దించుతామని ఓ ట్రాక్టర్ డ్రైవర్ ధీమాగా చెప్పడం కనిపించింది. ఇతరుల పేరుతో అనుమతులు! జిల్లాలో నంద్యాల, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు తదితర పట్టణాల్లోని నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఇసుక కొరతను తీర్చడానికి ఆన్లైన్లో చెల్లింపులు చేసిన వారికి ఇసుక సరఫరాకు అనుమతులు ఇస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన నూతన ధరల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు రూ. 500 తీసుకుని రీచ్‌లలో ఇసుక ఇవ్వాల్సి ఉంది. అయితే అధికారులు ఎడ్యుకేషన్ సొసైటీలు, ఇతర నిర్మాణ సంస్థల పేరిట మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో చెల్లింపులు చేసి ఆ రసీదులను ఇసుక మాఫియా సభ్యులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన రాయల్టీలతో ఇసుక మాఫియా ఒకే రాయల్టీపై పోలీసుల నిఘా లేని సమయంలో రెండుసార్లు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ అక్రమాలు కొనసాగిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. 6 క్యూబిక్ మీటర్ల ఇసుక ధర రూ. 15 వేలు ఇసుక ధరల నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ఇసుక వ్యాపారులు అందినకాడికి దండుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇతర నిర్మాణ కార్యకలాపాల కోసమంటూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మాఫియా మూడు రెట్లు అధికంగా విక్రయిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు చక్రాల లారీకి 6 క్యూబిక్ మీటర్ల(2.5 టన్నులు) ఇసుకను మాత్రమే తరలించాలి. దీనికి రూ. 3,000 కొనుగోలుదారులు చెల్లించాలి. ఇదే జరిగితే నంద్యాల, ఆళ్లగడ్డ, వంటి పట్టణాలకు చేరే లారీ కిరాయి మరో రూ. 2,500 వేలు అదనంగా ఖర్చవుతుంది. అంటే ఒక లారీ ఇసుకకు కర్నూలు సమీప పట్టణాల్లో అత్యధికంగా రూ. 5,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం లారీకి రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు అమ్ముతున్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లను అధికారికంగా గుర్తించగా ఇందులో కేవలం ఒక్క రీచ్‌లో మాత్రం ప్రస్తుతం విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడా ఇసుక నిల్వలు అంతంత మాత్రంగా ఉండడంతో ఇసుక వ్యాపారులు ధర పెంచి మరీ సొమ్ము చేసుకుంటుండడంతో వినియోగదారుడిపై తీవ్ర భారం పడుతోంది. అయితే బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, మహిళా సంఘాల ద్వారా నిబంధనల మేరకు క్వారీయింగ్ చేయిస్తామని, సామాన్యులతోపాటు నిర్మాణాదారులకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ఇస్తున్న భరోసా.. ఆచరణలో అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. -
అమ్మకానికి ఉదయగిరి
⇒ సూత్రధారులు రెవెన్యూ అధికారులు ⇒ పాత్రధారులు తెలుగు తమ్ముళ్లు ⇒ యథేచ్ఛగా ఇళ్ల స్థలాల ఆక్రమణ ఉదయగిరి: ఉదయగిరిలో యథేచ్ఛగా భూఆక్రమణలు, దందాలు సాగుతున్నాయి. దీనికి కొందరు రెవెన్యూ అధికారులు సూత్రధారులు కాగా తెలుగుతమ్ముళ్లు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు రెవెన్యూ అధికారుల సహకారంతో అక్కడ కొందరు తెలుగుతమ్ముళ్లు పాగా వేసి ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. దీంతో పేదలకు జానెడు స్థలం దొరకని దుస్థితి నెలకుంది. ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ పేదలు తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదు. సీఎంగా కిరణ్ ఉన్నప్పుడు సాగిస్తున్న ఈ దందా చంద్రబాబు వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. తమకు అండగా నిలుస్తున్న అధికారులకు అక్రమార్కులు భారీగా ముడుపులు ముట్టచెబుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకమునుపు ఉదయగిరిలో ప్రభుత్వ భూములకు పెద్దగా విలువ లేదు. కనీసం ఇల్లు కట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపేవారు కాదు. ఉదయగిరి దుర్గాన్ని రాజులు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు. కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా వరకు ప్రభుత్వ స్థలాలు అట్లే ఉండిపోయాయి. గత ఆరేడేళ్ల నుంచి ఉదయగిరి పట్టణం క్రమంగా అభివృద్ధి పథంలో పయనించడంతో చుట్టుపక్కల గ్రామీణులు ఇక్కడే ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. దీంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రాజకీయ అండదండలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ప్లాట్లగా విభజించి అమ్మడం ప్రారంభించారు. గతంలో తహశీల్దారుగా పనిచేసిన నారాయణమ్మ ఆక్రమిత స్థలాలను గుర్తించి ప్రభుత్వ స్వాధీనం చేసింది. రెండేళ్లుగా ఇక్కడికి వచ్చిన కొంతమంది తహశీల్దార్లు ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని రికార్డులు తారు మారు చేస్తూ ఆక్రమణదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయగిరిలోని బీసీ కాలనీ సమీపంలో సర్వే నం.37లో అధికార పార్టీకి చెందిన ఓ నేత బంధువు వారం కొంత స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా చదును చేశాడు. దీనికి గిరాకీ అధికంగా ఉండటంతో కొంతమంది తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. తహశీల్దారు నామమాత్రంగా స్థల పరిశీలన చేసి మిన్నకుండిపోయారు. అలాగే షబ్బీర్ కాలనీ ప్రాంతంలో ఇటీవల లేఔట్లు వేసిన కొంతమంది నేతలు పక్కనే ఉన్న శ్మశానాన్ని ఆక్రమించి ప్లాట్లు వేసుకునేందుకు కొంత చదును చేశారు. స్థానికులు అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఇళ్ల స్థలాలను కొంతమంది నేతలు ఆక్రమించి అమ్మేశారు. మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. టూరిజం బంగ్లా సమీపంలో గతంలో ఇచ్చిన ప్లాట్లను జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దుచేసి దానిని టూరిజం కోసం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొంతమంది అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎక్కువ ఖరీదు చేసే ఈ స్థలాలు కూడా అమ్మకాలు జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ దర్జాగా ఇళ్లు వెలిశాయి. ఇక్కడే ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాలను అధికార నేతలకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు అవగాహనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు పెద్దమొత్తంలో చేతులు మారినట్టు విమర్శలున్నాయి. అలాగే మోడల్‌కాలనీ పేరుతో గతంలో ఉదయగిరికి చెందిన కొంతమంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా, ఇళ్లు కట్టుకోలేదన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు వాటిని రద్దుచేశారు. ఈ స్థలంలో కొంతమేర కొందరు ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఈ విధంగా ఉదయగిరి పట్టణంలోని ఇళ్ల మధ్య ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికావడంపై పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణ స్థలాలపై సమగ్ర విచారణ జరిపితే కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల నుంచి విముక్తి అవుతాయని పట్టణవాసులు ఆశిస్తున్నారు. -
భూ సమీకరణకు 6 రెవెన్యూ టీమ్‌లు
► మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ► రాజధాని కోసం వారంలోగా నోటిఫికేషన్ జారీ ► రాజధాని ప్రాంతంలో 30 గ్రామాలు.. అన్ని భూములూ సమీకరిస్తాం ► తొలుత భూములిచ్చేందుకు సిద్ధమైన వారిని గుర్తించి సమీకరిస్తాం ► ఉపసంఘం భేటీ అనంతరం విలేకరులకు వెల్లడించిన యనమల ► అసెంబ్లీ జరిగితే సభలో భూసమీకరణ బిల్లు.. లేదంటే ఆర్డినెన్స్ ► ఉపసంఘం నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు నారాయణ, రావెల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూముల సమీకరణకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమీకరణలో ఎన్ని గ్రామాలు ఉండబోతున్నాయో.. ఎన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుందనే అంశాలకు సంబంధించి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భూ సమీకరణకు విధివిధానాలు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)ఏర్పాటుకు మార్గదర్శకాలను రెండు రోజుల్లో రూపొందించనున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత.. యనమల తనను కలిసిన విలేకరులకు సమావేశం వివరాలను తెలిపారు. భేటీల తీసుకున్న నిర్ణయాల గురించి కమిటీ సభ్యులైన మంత్రులు పి.నారాయణ, రావెల కిషోర్‌బాబులు మీడియాకు వివరించారు. రాజధానికి భూములు ఇస్తామని ముందుకు వచ్చిన రైతులను గుర్తించి వారి నుంచి భూమిని స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులతో ఆరు బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యనమల చెప్పారు. ఈ రెవెన్యూ బృందాలను త్వరగా ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. సీఆర్డీఏ పరధిలో 30 గ్రామాలు ఉంటాయని, వీటి పరిధిలో గల మొత్తం భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరిస్తామని చెప్పారు. అయితే ఆయా గ్రామాలను ఎక్కడికీ తరలించబోమని, గ్రామాల ఇళ్లు, చెరువులు అక్కడే ఉంటాయని.. కానీ వాటిని ఆధునీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే బాండ్లకు కూడా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) బిల్లులోని సెక్షన్ 39 కింద చట్టబద్ధత కల్పించినట్లు ఆయన తెలిపారు. సీఆర్డీఏ బిల్లుకు మంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలు వెంటనే లేనందున ఆర్డినెన్స్ జారీ చేయడంలో తప్పులేదని యనమల పేర్కొన్నారు. ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు... అసెంబ్లీ సమావేశాలు త్వరితగతిన జరిగితే.. భూ సమీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు ముసాయిదా బిల్లును శాసనసభలో పెడతామని, లేకుంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకువస్తామని మంత్రులు నారాయణ, రావెల మీడియాతో పేర్కొన్నారు. భూ సమీకరణకు ప్రభుత్వపరంగా ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ లాయర్ల నియామకం, రెవెన్యూ శాఖలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, సర్వేయర్లు అవసరమైనందున ఇందుకు గాను ఆయా పోస్టుల మంజూరుకు ఆర్ధికశాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని పేర్కొన్నారు. సత్వరమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్... రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపేందుకు, వారికున్న నైపుణ్యాల్ని అభివృద్ధి చేసేందుకు ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు చెప్పారు. ఈ ప్రాంతాల్లోని భూముల రికార్డుల్ని అప్డేట్ చేస్తున్నామని, ఈ-పాస్ బుక్‌ల జారీకి ఇబ్బందులున్న దృష్ట్యా మాన్యువల్‌గా పాస్‌పుస్తకాల జారీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఇసుక రీచ్‌లు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమవుతుంది, నిల్వలు ఎంత ఉన్నాయి తదితర అంశాలపై కెలెక్టరు పర్యవేక్షణలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తారన్నారు. మూడు కేటగిరీలుగా భూములు... రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల్ని.. పాత జాతీయ రహదారి పక్కన, మూడు పంటలు పండే భూములు, ఇతర భూములు అనే మూడు కేటగిరీలుగా విభజించామని మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్, జపాన్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. గ్రామాలను తాకకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించామని, ఒకవేళ గ్రామాలకు తాకితే నయా రాయపూర్ విధానం అమలు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం మూడు రింగ్‌ల పరిధిల్లో చేపడుతున్నామని, 75 కి.మీ., 125 కి.మీ., 225 కి.మీ. పరిధిలో రాజధాని ఉండబోతుందన్నారు. 75 కి.మీ. పరిధిలో పూర్తిగా రాజధానికి సంబంధించిన నిర్మాణాలు, 125 కి.మీ. పరిధిలో కాలుష్య రహిత పరిశ్రమలు, 225 కి.మీ. పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు ఉంటాయని వివరించారు. రాజధాని నిర్మాణం తమ ప్రాంతంలో జరుగుతున్నందుకు ఆ ప్రాంత వాసిగా తనకు చెప్పలేని ఆనందం కలుగుతోందని.. తమ ప్రాంత ప్రజలు సీఎం చంద్రబాబు ఫోటో పెట్టుకోవాలని మంత్రి రావెల వ్యాఖ్యానించారు. శీతాకాల అసెంబ్లీ హైదరాబాద్‌లోనే: యనమల శాసనసభ శీతాకాల సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని, విజయవాడలో నిర్వహించడం కష్టమవుతుందని యనమల పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించాలంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వేర్వేరుగా రెండు సమావేశ మందిరాలు కావాలని, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి వెంట ఉండే సెక్యురిటీకి, అధికార యంత్రాంగానికి వసతి కల్పించాలంటే కష్టం అవుతుందని ఆయన చెప్పారు. ‘రాజధాని-రైతు’ అంశంపై నేడు చర్చ వేదిక: గుంటూరులోని వైన్ డీలర్స్ కల్యాణమండపం సమయం: మధ్యాహ్నం 3 గంటలకు సాక్షి టీవీలో ప్రత్యక్ష ప్రసారం