సాక్షి నెట్‌వర్క్ మహబూబ్‌నగర్: జిల్లాలో పోలీసులు, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు బుధవారం ఒకేరోజు 17 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ధన్వాడ మండలం కిష్టాపూర్‌కు చెందిన ఓ బాలికకు చిన్నచింతకుంట మండలం పళ్లమర్రి యువకుడితో ఈనెల 21న వివాహం జరగాల్సి ఉండగా అధికారులు అడ్డుకున్నారు. బాలానగర్‌కు చెందిన ఓ బాలి కను మద్దూరు మండలం వీరారానికి చెందిన యువకుడికి ఇచ్చి ఈనెల 22న లగ్నం చేయాలని నిర్ణయించారు. ఇదే మండలం వీరన్నపల్లికి చెందిన 15 ఏళ్ల బాలికకు కొత్తూరు మండలం చలివేంద్రంపల్లికి చెందిన ఓ యువకుడితో గురువారం పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు.
దౌల్తాబాద్ మండలం బాలంపేటకు చెందిన పదో తరగతి పూర్తయిన ఓ బాలికకు ఈ నెల 21న పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. వనపర్తి మండలం చిట్యాల గ్రామానికి చెందిన బాలికను కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి బుధవారం ఉదయం వివాహం జరిపిం చేందుకు నిశ్చయించారు. ఇంటర్ చదువుతున్న భూత్పూర్ మండలం వెల్కిచర్లకు చెందిన ఓ బాలి కకు ఈ నెల 23న, మరో బాలికకు ఈనెల 29న వివాహం చేయాలని నిర్ణయించారు. అలాగే కొత్తమొల్గరకు చెందిన పదో తరగతి విద్యార్థినికి ఈ నెల 27న పెళ్లి కుదుర్చారు. కరివెన పంచాయతీ ముస్లాయిపల్లి తండాకు చెందిన బాలికకు ఈ నెల 27న లగ్నం నిర్ణయించ తలపెట్టారు. కరివెనకు చెందిన బాలికకు ఈ నెల 22న, తాటికొండలో మరో బాలికకు అదేరోజున పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఇటిక్యాల మండలం కొండేరులో మరో బాలిక పెళ్లిని, జడ్చర్లకు చెందిన బాలిక పెళ్లిని, పెద్దకొత్తపల్లిలో 4 బాల్య వివాహాల్ని కూడా అధికారులు అడ్డుకున్నారు.
పాలమూరులో 17 బాల్య వివాహాలకు బ్రేక్
Published Thu, Apr 21 2016 4:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement