Child marriages
-
చిన్నారి పెళ్లికూతుళ్లు
విరిసీ విరియని.. తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు ‘మాంగల్యం తంతునానేనా..’ అంటున్నారు.. యుక్త వయస్సు రాకుండానే తాళి»ొట్టు మెడలో వేయించేస్తున్నారు.. కొద్ది నెలలకే తల్లులవుతున్న ఆ అమ్మాయిలు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.. అవగాహనా రాహిత్యమో.. గుండెల మీద కుంపటి దింపేసుకోవాలనే అమాయకత్వమో తెలీదు కానీ.. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా జరుగుతున్న బాల్య వివాహాలు కలవరపెడుతున్నాయి.రాజానగరం: యుక్త వయస్సు రాకుండా బాల్య దశలోనే వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరం, అయినప్పటికీ వీటిని నిరోధించడంలో తరచూ అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు, తీసుకుంటున్న చర్యలు ప్రకటనలకే పరిమితమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజానగరం మండలంలోని పలు గ్రామాల్లో తరచుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాలే దీనికి సాక్షిగా నిలుస్తున్నాయి. మండలంలోని భూపాలపట్నం, పుణ్యక్షేత్రం, కొత్తతుంగపాడు, పాతతుంగపాడు తదితర గ్రామాల్లో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అవగాహన లేకనో.. ఓ పనైపోతుందనే ఉద్దేశమో కానీ.. యుక్త వయస్సు రాకుండానే కొంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు వివాహాలు చేసి, అత్తారిళ్లకు పంపించేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా.. కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు దొడ్డ మణికంఠ, 16 సంవత్సరాల బాలిక పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. వరుడు రోజువారీ పనులు చేస్తూండగా.. వధువును ఆమె తల్లిదండ్రులు 9వ తరగతి వరకూ చదివించి, మాన్పించేశారు. ఇంటి వద్దనే ఉంటున్న ఆ బాలికతో ఆ యువకుడికి ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి వరకూ వెళ్లింది. వారి వివాహానికి బాలిక తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదు. అయితే, అతడు లేకపోతే తాను బతకలేనంటూ ఆ బాలిక తరచూ అతడి ఇంటికి వెళ్లి వస్తూండేది. ఈ నేపథ్యంలో ఇరువైపుల పెద్దలు అయిష్టంగానే వారిద్దరికీ గుట్టు చప్పుడు కాకుండా బుధవారం రాత్రి ముక్కినాడ గ్రామంలోని దేవాలయంలో సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఆపై వారిద్దరినీ తిరుపతి పంపించేశారు. అధికారులకు తెలియకుండా ఇరు వర్గాల పెద్దలు ఈ వివాహం జరిపించినా.. సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బాల్య వివాహం గుట్టు రట్టయింది. గతంలోనూ.. » మండలంలోని పలు గ్రామాల్లో గతంలో కూడా ఇదేవిధంగా బాల్య వివాహాలు జరిగాయి. » పుణ్యక్షేత్రం గ్రామంలో గత ఏడాది అధికారులను బురిడీ కొట్టించి మరీ ఇరు వర్గాల పెద్దలకు బాల్య వివాహం జరిపించేందుకు ప్రయత్నించారు. దీనిపై స్థానిక అంగన్వాడీ కార్యకర్తల నుంచి సమాచారం అందుకున్న ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెంటనే పోలీసులతో కలిసి ఆ గ్రామానికి చేరుకుని, బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. యుక్త వయస్సు రాకుండా పిల్లలకు వివాహం చేయబోమంటూ పెద్దల నుంచి రాతపూర్వకంగా హామీ కూడా తీసుకున్నారు. అంతటితో తమ డ్యూటీ అయిపోయిందని సంబరపడుతూ వెనుదిరిగిన అధికారులు ఆ మర్నాడు అందుకున్న మరో సమాచారంతో షాకయ్యారు. రాతపూర్వక హామీ ఇచ్చిన పెద్దలే.. తమ పిల్లలను వేరొక ప్రాంతానికి తీసుకువెళ్లి, వివాహం చేశారని తెలిసి నిర్ఘాంతపోయారు. » గడచిన నాలుగేళ్లలో భూపాలపట్నంలో 4, పుణ్యక్షేత్రంలో 6, కొత్తతుంగపాడులో 9, పాతతుంగపాడులో 6 బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం. చట్టం ఏం చెబుతోందంటే.. బాల్య వివాహాలను అరికట్టేందుకు స్వాతంత్య్రం రాక ముందు నుంచే చట్టాలున్నాయి. మొదటిసారిగా 1929లో చైల్డ్ మ్యారేజ్ రి్రస్టిక్ట్ యాక్ట్‌ను బ్రిటిష్ వారు తీసుకువచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్–2006 రూపొందించారు. దీని ప్రకారం 18 సంవత్సరాలలోపు అమ్మాయిలు, 21 సంవత్సరాలోపు అబ్బాయిలను బాలల కిందే పరిగణిస్తారు. ఈ యాక్ట్ ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారి తల్లిదండ్రులతో పాటు ఆ సమయంలో అక్కడున్న వారు, వివాహ తంతు జరిపించే వారు (ప్రోత్సహించినట్టుగా భావిస్తారు) కూడా శిక్షార్హులే అవుతారు. వీరికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. దీనిలో నేరస్తులైతే బెయిల్ కూడా లభించదు. అధికారుల నిర్లక్ష్యమే కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొత్తతుంగపాడులో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలకు, గ్రామ కమిటీకి విషయం ముందుగా తెలిసినా కానీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. బాల్య వివాహం జరుగుతున్న సమాచారాన్ని పై అధికారులకు సకాలంలో ఇవ్వడం లేదు. బుధవారం రాత్రి జరిగిన బాల్య వివాహం గురించి, తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేశాను. – యాళ్ల మాచరయ్య, కొత్తతుంగపాడు ఫలితమివ్వని గ్రామ కమిటీలు బాల్య వివాహాలను నిరోధించండి.. అమ్మాయిల జీవితాలను కాపాడండి.. అంటూ ఎంతగా ప్రచారం చేస్తున్నాగానీ, ప్రజల్లో సరైన స్పందన రావడం లేదు. వీటిని ఏవిధంగానైనా అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామ మహిళా కార్యదర్శి (పోలీసు), ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, అంగన్వాడీ కార్యకర్తలతో గ్రామ కమిటీలు కూడా వేశాం. అయినప్పటికీ బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం ముందుగా అందడం లేదు. స్థానికంగా ఉండే మొహమాటాలతో తమ ప్రాంతంలో బాల్య వివాహం జరుగుతోందని తెలిసి కూడా చూసీ చూడనట్లు వదిలేసి, తెలిసీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. – టి.నాగమణి, సీడీపీఓ, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం, రాజానగరం -
బాల్యానికి పెళ్లి బంధనం
నిమిషానికి ముగ్గురు బాలికలు బలవంతంగా పెళ్లి బంధంలో చిక్కుకుంటున్నారు. బాల్య వివాహాలను 1929లోనే నిషేధించింది ప్రభుత్వం. మరింత కట్టుదిట్టం చేస్తూ కఠినమైన శిక్షలతో ప్రోహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ – 2006’ను తెచ్చింది. అయినప్పటికీ ఏడాదికి 16 లక్షల బాల్య వివాహాలు జరుగుతున్నాయని అంచనా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నిర్వహించిన సర్వే చెబుతున్నదిదీ. తాజా అధ్యయనాలు చెబుతున్న మరో వాస్తవం ఏమిటంటే... 20– 24 ఏళ్ల వివాహిత మహిళలను పెళ్లి నాటికి వాళ్ల వయసు ఎంతని అడిగితే వారిలో 23.3 శాతం మంది పద్దెనిమిదేళ్లలోపే పెళ్లయినట్లుచెప్పారు.⇒కోవిడ్‌కు ముందు 27 శాతంగా ఉన్న బాల్యవివాహాలు కోవిడ్ సమయంలో 33 శాతానికి పెరిగాయి. ఇది దేశ సరాసరి లెక్క. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేదు.⇒ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ‘బాల్య వివాహ రహిత జిల్లా’గా మార్చిన కలెక్టర్లకు అవార్డులు ప్రకటించారు. అప్పుడు వరంగల్ జిల్లా కలెక్టర్ జిల్లాలో బాల్యవివాహం జరగకుండా నివారించి అవార్డు అందుకున్నారు. ⇒ఒకప్పుడు తమిళనాడులో బాల్యవివాహాలు ఎక్కువగా ఉండేవి. జయలలిత ముఖ్యమంత్రిగా బాల్యవివాహాలను నివారణ కోసం ఆడపిల్లలకు డిగ్రీ వరకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌ల వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం దేశ సరాసరి కంటే చాలా మెరుగ్గా ఉంది.⇒కర్నాటక రాష్ట్రం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేస్తూ ప్రచారం నిర్వహించి సమాజంలో మార్పు తెచ్చుకుంది.⇒అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఆడపిల్లలకు పదేళ్లలోపే పెళ్లి చేసే ఆచారం ఉండేది. అస్సాం ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా వేగంగా మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.⇒బాల్య వివాహాలను అరికట్టాలంటే... ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హెల్త్, ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ... ఈ ఐదు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలి.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధితొలి లెక్క పాఠశాల నుంచే!కోవిడ్ సమయంలో 1098 హెల్ప్‌లైన్‌కి 5,500 కాల్స్ వచ్చాయి. బాల్యవివాహం బారిన పడుతున్న అమ్మాయిలు, వారి స్నేహితుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ అవి. ఫోన్ కాల్స్ కూడా రాకుండా జరిగి΄ోయిన పెళ్లిళ్లు ఎన్నో. కోవిడ్ తర్వాత స్కూళ్లు తెరుచుకున్నప్పుడు తిరిగి స్కూల్‌కి వచ్చిన అమ్మాయిల లెక్క ఏ శాఖ దగ్గరా లేదు. పంచాయితీ సెక్రటరీ గ్రామస్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రోహిబిషన్ ఆఫీసర్. ΄ాఠశాల రిజిస్టర్ నుంచి మొదలు పెడితే కచ్చితమైన లెక్కలు రాబట్టవచ్చు.ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూల్‌కి కొనసాగే వాళ్లు 63 శాతం మాత్రమే. టెన్త్ పాసయిన అమ్మాయిల్లో కాలేజ్కెళ్లేవాళ్లు పాతిక శాతం మాత్రమే. మండలాల్లో కూడా కాలేజ్‌లు పెడితే ఆడపిల్లలందరూ చదువుకోగలుగుతారు. చదువుకుంటే బాల్య వివాహాలు వాటంతట అవే ఆగిపోతాయి. సామాజిక కార్యకర్తగా ఇరవై వేల బాల్య వివాహాలను ఆపగలిగాను. కొందరు మాత్రం మేము రాత్రంతా కాపు కాసి తెల్లవారు జామున అలా పక్కకు వెళ్లగానే తాళి కట్టించేసే వాళ్లు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నేను స్వయంగా 78 కేసులు వేశాను. ఒక్క కేసులోనూ దోషులకు శిక్ష పడలేదు. -
15 ఏళ్ల వధువు.. 33 ఏళ్ల వరుడు!
ఆదిలాబాద్‌టౌన్: తొమ్మిదో తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలికకు కుటుంబీకులు, మధ్యవర్తులు కలిసి 33 ఏళ్ల వ్యక్తితో బాల్య వివాహం జరిపించారు. విషయం ఏడాది తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను భర్త వేధింపులకు గురిచేయడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. విషయం ఆనోటా.. ఈనోటా బయట పడడంతో పాఠశాలలో జగిత్యాల జిల్లా బాలల కమిషన్ విద్యార్థి వివరాలు సేకరించింది. జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో జిల్లా అధికారులు బేలలోని ఆమె అత్తారింటికి వెళ్లి బాధితురాలిని తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌లో ఉంచారు. బేల పోలీసుస్టేషన్లో బాల్య వివాహం కేసు నమోదైంది. ఏడాది క్రితం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 15 ఏళ్ల బాలికకు గత మార్చిలో తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తులు బాల్య వివాహం జరిపించారు. 9వ తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన వెంటనే ఈ పెళ్లి జరిగింది. అయితే మధ్యవర్తులు బేలకు చెందిన పెళ్లి కొడుకు (33 ఏళ్ల వ్యక్తి) కుటుంబీకుల నుంచి డబ్బులు తీసుకొని పెళ్లి జరిపించినట్లు పలువురు చెబుతున్నారు. బాలిక తల్లి పాచిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తండ్రి దివ్యాంగుడు. ముంబాయ్‌లో ఉంటున్నాడు. పెళ్లయిన తర్వాత నుంచి ఒకట్రెండు సార్లు మాత్రమే బాలిక పుట్టింటికి వచ్చింది. కాగా పెళ్లి కొడుకు కుటుంబీకుల నుంచి మధ్యవర్తులు డబ్బులు తీసుకొని వాటిలో నుంచి ఆ బాలికకు సెల్‌ఫోన్ కొనిచ్చారు. కొంత డబ్బులు ఆమె కుటుంబీకులకు ఇచ్చినట్లు సమాచారం. బాలిక భర్త గొడవలు, వేధింపులకు పాల్పడేవారని ఆమె తల్లి పేర్కొంది. 15 రోజులుగా బాలసదన్‌లో.. బాల్య వివాహం జరిగిందనే సమాచారం అందడంతో బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు బేలకు చేరుకొని బాధిత బాలికను జిల్లా కేంద్రంలోని బాలసదన్‌కు 15 రోజుల క్రితం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమెకు ఛాతినొప్పితో పాటు పచ్చకామెర్లు వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. అయితే పలుసార్లు బాలసదన్ సిబ్బంది ఆమెను రిమ్స్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె అక్కడ ఉండనంటూ పుట్టింటికి వెళ్తానంటూ కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషయమై ఐసీపీఎస్ అధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పక్షం రోజుల క్రితం విషయం తెలియడంతో బాలికను బాలసదన్‌ను తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కుటుంబీకులపై బేల పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. బేల ఎస్సైని వివరణ కోరగా, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని, పోక్సో యాక్ట్‌కు సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని తెలిపారు. ఇరు కుటుంబీకులతో పాటు పెళ్లికి హాజరైన వారిపై సైతం కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
Andhra Pradesh: బాల్య వివాహాలకు బై బై!
సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో పని చేస్తే ఏదైనా సాధ్యమేనని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరూపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడం. బాల్య వివాహాలను అరికట్టి, బాలలను మంచి చదువులు చదివించాలన్న సీఎం వైఎస్ జగన్ సంకల్పానికి తగ్గట్టుగా పలు చర్యలు చేపట్టారు. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని తల్లిదండ్రుల్లో ప్రభుత్వం ఒక పక్క అవగాహన కల్సిస్తూనే, మరో పక్క బాల్య వివాహాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 160 బాల్య వివాహాలపై వివిధ మార్గాలు, 1098 హెల్ప్ లైన్‌కు ఫిర్యాదులు రాగా ఇందులో 159 వివాహాలను ప్రభుత్వం నివారించింది. కేవలం కృష్ణా జిల్లాలో ఒక్క వివాహం మాత్రమే జరిగింది. ఈ బాల్య వివాహంపై ప్రభుత్వ యంత్రాంగం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. బాల్య వివాహాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా పలు చర్యలు చేపట్టింది. సచివాలయాల స్థాయిలో సర్పంచ్ లేదా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన బాల్య వివాహాల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో గ్రామ, వార్డు కార్యదర్శులు, రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, మహిళా పోలీస్, స్వయం సహాయక సంఘం సభ్యురాలిని సభ్యులుగా నియమించింది. ఈ కమిటీలు బాల్య వివాహాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాయి. ఏ గ్రామంలోనైనా బాల్య వివాహం జరిగితే సంబంధిత గ్రామ, వార్డు కార్యదర్శులను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ తరచూ సమావేశమై బాల్య వివాహాల నియంత్రణ చట్టం అమలు, అందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని ప్రభు త్వం ఆదేశించింది. వివాహ రిజి్రస్టేషన్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో పాటు బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాత 21 ఏళ్ల అబ్బాయితో పెళ్లి చేస్తేనే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద లబ్ధి చేకూరుతుందని వివరిస్తున్నారు. ఈ పథకాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనను ప్ర భుత్వం విధించింది. మధ్యలో బడి మానేసిన 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలను ప్రభుత్వం తిరిగి పాఠశాలలు, కళాశాలల్లో చేరి్పస్తోంది. అలాగే ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలను సందర్శించినప్పుడు బాల్య వివాహాలు చేయకుండా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తున్నారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న దిశ పోలీసులు
నల్లజర్ల: బాల్యవివాహాలను అరికట్టడంలో దిశ యాప్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు 40కిపైగా బాల్య వివాహాలను జరగకుండా నిలుపుదల చేశారు. తాజా గా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లలపాడు గ్రామంలో బాలిక వివాహం జరగకుండా దిశ పోలీసులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినికి ఈ నెల 6న వివాహం చేస్తున్నట్టు గ్రామ మహిళా సంరక్షణాధికారి ఇందిరా ప్రియదర్శినికి సమాచారం అందింది. ఈ విషయం రాజమహేంద్రవరంలోని దిశ పోలీసులకు ఆమె సమాచారం అందించారు. దిశ పోలీసులు తమతో పాటు ఐసీడీఎస్ అధికారులను తమ వెంట తీసుకొని ఆ బాలిక ఇంటికి వెళ్లారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను ఆ బాలిక తల్లిదండ్రులకు, పెద్దలకు వివరించారు. బాలిక వివాహాన్ని నిలుపుదల చేయాలని సూచించారు. అందుకు వారు సమ్మతించారు. ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా దిశ, ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. ఆ బాలిక చదువు కొనసాగించాలని అధికారులు సూచించారు. తమకు సమాచారం అందించిన మహిళా సంరక్షణ అధికారి ఇందిర ప్రియదర్శినిని అధికారులు అభినందించారు. ఎక్కడ బాల్యవివాహాలు జరిగినా దిశ యాప్‌కు సమాచారం అందించాలని పోలీసులు పేర్కొన్నారు. -
ఐదేళ్లలో 5,178 బాల్య వివాహాల నివారణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా ఇంకా 18 ఏళ్లు నిండని బాలికలు గర్భం దాల్చుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నివారణకు మరింత సమర్థంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 5,178 బాల్య వివాహాలను నివారించినప్పటికీ ఇంకా 8,496 మంది యుక్తవయసు బాలికలు గర్భం దాల్చినట్టు గర్భిణుల రిజి్రస్టేషన్లలో తేలిందన్నారు. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాక, 21 ఏళ్లు నిండిన అబ్బాయిలతో పెళ్లిళ్లు చేస్తేనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎస్ సూచించారు. ఏ గ్రామంలోనైనా బాల్య వివాహం జరిగితే సంబంధిత గ్రామ, వార్డు కార్యదర్శులను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ప్రకృతి సేద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా చర్యలు రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రకృతి సేద్యం విస్తరణ, నిధుల సమీకరణ, ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రత్యేకంగా విశ్వ విద్యాలయం ఏర్పాటు అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. రైతులు ప్రకృతి సేద్యం విధానాన్ని పాటిస్తూ ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తే ప్రధాన మంత్రి ప్రాణం పథకం కింద పెద్ద ఎత్తున సబ్సిడీ పొందొచ్చన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి సంబంధించి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. కాగా, కాకినాడ–శ్రీకాకుళం మధ్య ఏర్పాటు చేస్తున్న నాచురల్ గ్యాస్ పైపులైను పనులు వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. సచివాలయంలో ఈ అంశంపై ఆయన అధికారులతో సమీక్షించారు. -
బాల్య వివాహాల కట్టడికి విస్తృత ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాల్య వివాహాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. బాల్య వివాహాలు జరిపినా, జరిపేందుకు ప్రయత్నించినా ఆ కుటుంబాలకు ప్రభు త్వ పథకాలు వర్తించవనే విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ జవహర్‌రెడ్డి.. బాల్య వివాహాల నియంత్రణకు ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ రూల్స్–2012, 2023ను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమం, సెర్ప్, విద్య, వైద్య, ఆరోగ్య, దేవదాయ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వివిధ స్థాయిల్లో చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ అధికారులను ని యమించి వారికి తగిన అధికారాలిస్తామని చెప్పారు. వారు నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ బాల్య వివాహాలను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో విఫలమైతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో సర్పంచ్ లేదా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి.. వార్డు సెక్రటరీ, విలేజ్, వార్డు రెవెన్యూ అధికారి, ఏఎన్ఎం, మహిళా పోలీస్, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు లేదా ప్రధానోపాధ్యాయుడు, స్థానిక ఎన్జీఓలను సభ్యులుగా నియమించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు తరచూ సమావేశమై బాల్య వివాహాల నియంత్రణ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని ఆదేశించారు. బాల్య వివాహాలు చేయకుండా ఖాజీలు, పాస్ట ర్లు, పురోహితులకు ఆదేశాలివ్వాలని సూచించారు. వివాహ రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి ఆరు నెలలకు పెంచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు జి.జయలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్, ఇంతియాజ్, పాల్ రాజు, జానకి, సురేశ్‌కుమార్, ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అరెస్టులతో జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నారు: గువాహతి హైకోర్టు
గువాహతి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపే క్రమంలో పోక్సో యాక్ట్‌ను ప్రధాన ఆయుధంగా ప్రయోగిస్తూ.. టీనేజ్ భర్తలను కటకటాల వెనక్కి నెడుతోంది అసోం ప్రభుత్వం. ఒకవేళ నేరం గనుక రుజువైతే వాళ్లంతా జీవిత ఖైదు ఎదుర్కోవాల్సి ఉంటుంది!. అయితే.. మైనర్లను లైంగిక నేరాల నుంచి రక్షించే ఉద్దేశంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతోంది. ఈ తరుణంలో.. అసోం ప్రభుత్వ చర్యపై అక్కడి హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అసోంలో అమలు అవుతున్న చట్టం ప్రకారం.. బాల్య వివాహాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్లైనా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. అభియోగాలు నమోదు అయిన తొమ్మిది మంది ముందస్తు బెయిల్ కోసం గువాహతి (గౌహతి) హైకోర్టును ఆశ్రయించారు. వాళ్లకు ఊరట ఇస్తూ బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే ఈ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా బెంచ్ స్పందిస్తూ.. ‘‘బాల్య వివాహం అనేది ముమ్మాటికీ చెడు ఆలోచనే. అలాగని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. అరెస్టుల పర్వంతో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లో అలజడి రేగుతోంది. వాళ్లపై ఆధారపడి పిల్లలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు బతుకుతున్నారు . ఈ అంశంపై మా అభిప్రాయాలను తెలియజేస్తాము. కానీ, ప్రస్తుతానికి వాళ్లందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టాలా అనేదే సమస్య!. అని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. పోక్సో చట్టంలో మీరు ఏదైనా జత చేయొచ్చు. కానీ, ఇక్కడ పోక్సో అటే ఏమిటసలు?. న్యాయమూర్తులు అక్కడ ఏముందో చూడలేరు అనుకుంటున్నారా?. పోక్సో యాక్ట్‌ను ఎలా వర్తింపజేస్తారు?. అలాగని మేము ఇక్కడ ఎవరినీ నిర్దోషులుగా ప్రకటించడం లేదు. మిమ్మల్ని(అసోం పోలీసులను ఉద్దేశిస్తూ..) విచారించుకోవడానికి కూడా అడ్డుకోవట్లేదు.ఎవరైనా దోషి అని తేలితే.. ఛార్జ్‌షీట్ ఫైల్ చేయండి. అంతేగానీ కస్టోడియల్ విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముంది? అని జస్టిస్ సుమన్ శ్యామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అసోం వ్యాప్తంగా.. 3 వేల మందిని బాల్య వివాహాల కట్టడి చట్టం పేరుతో అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. దీంతో వాళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. కుటుంబాలను పోషించే మగతోడును బంధించడంపై వాళ్ల భార్యలూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాత్రం బాల్య వివాహం అనేది సంఘానికి పట్టిన చెడు అని, దీని నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల మద్దతు అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు. అసోంలో ప్రజారోగ్య జీవనవిధాన గణాంకాలు దారుణంగా ఉన్నాయి. ఈ తరుణంలోనే పరిస్థితికి మూలకారణమైన బాల్య వివాహాలను నిర్మూలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాల్య వివాహాల నిర్మూలన డ్రైవ్‌ను చేపట్టగా.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేల మందిపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ డ్రైవ్‌ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.పోలీస్ చర్యలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విరుచుకుపడుతున్నాయి. -
‘సంపూర్ణ యుద్ధం’ వికటిస్తుందా?
ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా బడి ఈడు పిల్లలను పెళ్లి పీటలెక్కించే సామాజిక దురాచారం దేశంలో పెద్దగా తగ్గలేదని తరచు వెలుగులోకొస్తున్న ఉదంతాలు చెబుతున్నాయి. బాల్యవివాహాలపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా వారం క్రితం ప్రకటించిన ‘సంపూర్ణ యుద్ధం’ ఈ సమస్యను మరోసారి ఎజెండాలోకి తెచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై ప్రకటన చేసిందే తడవుగా ఆ రాష్ట్రంలో పోలీసులు విరుచుకుపడటం మొదలెట్టారు. ఇంతవరకూ దాదాపు మూడువేలమందిని అరెస్టు చేశారంటున్నారు. వీరిలో పెళ్లిళ్లు జరిపించిన పురోహితులు, కాజీలు కూడా ఉన్నారు. అరెస్టయినవారిలో అత్యధికులపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) కింద వేర్వేరు సెక్షన్లు నమోదు చేయటంతోపాటు పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని కూడా ప్రయోగించారు. వాస్తవానికి దాదాపు పదివేలమందిపై ఎఫ్ఐఆర్లు నమోదైనా వారిలో చాలామంది పరారయ్యారు. ఈ పోలీసు చర్యకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు గమనించదగ్గవి. 2019–20 మధ్య జరిపిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అస్సాంలో 20–24 ఏళ్ల మధ్య ఉన్న వివాహితల్లో 31.8 శాతంమంది చట్టవిరుద్ధంగా 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు చేసు కున్నవారే. జాతీయ స్థాయి సగటు 23.3 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువే. హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్లో అస్సాంలోని ఏయే జిల్లాల్లో ఈ బాల్యవివాహాల దురాచారం ఎక్కువుందో, దానివల్ల ఆ ప్రాంతాల్లో చిన్న వయసులోనే గర్భిణులవుతున్నవారి శాతం ఎంతో వివరించారు. టీనేజ్ తల్లుల, గర్భిణుల జాతీయ స్థాయి సగటు 6.8 శాతం ఉంటే, అస్సాంలో అది 11.7 శాతం. ఇది కూడా ఆందోళనకరమైనదే. ఎడాపెడా సాగుతున్న ఈ అరెస్టుల వల్ల తాత్కాలికంగా అలాంటి పెళ్లిళ్లకు బ్రేక్ పడొచ్చు. కానీ వీటికి దారితీస్తున్న మూలకారణాలను పరిష్కరించనంతవరకూ అవి పూర్తిగా సమసిపోవటం సాధ్యం కాదని పాలకులు గుర్తించటం అవసరం. విద్యాగంధం అంటని మారుమూల పల్లెలు అస్సాంలో కోకొల్లలు. నామమాత్రంగానైనా పాఠశాలలున్నచోట చదువుకునే బాలికల శాతం తక్కువ. ఆడపిల్లలకు చిన్నవయసులో పెళ్లి చేస్తే అది వారికి రక్షణగా ఉంటుందని భావించే కుటుంబాలకు కొదవలేదు. దశాబ్దాల నిర్లక్ష్యం పుణ్యమా అని మన దేశంలో గ్రామీణ మహిళల్లో చదువు కున్నవారి సంఖ్య స్వల్పం. గ్రామీణ అస్సాంలో 74 శాతంమంది మహిళలు పట్టుమని పదేళ్లు కూడా బడి చదువులకు పోలేదంటే ఏమనుకోవాలి? ఆడపిల్లకు చదువు చెప్పిస్తే ఆమెకు ఉజ్వల భవిష్యత్తుంటుందన్న అవగాహన కలుగుతుందా? నిరక్షరాస్యతతోపాటు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, బాలి కల రక్షణ, భద్రతలపై ఉండే దిగులు, ఇతర సామాజిక దురాచారాలు బాల్యవివాహాలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యల్లో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కేవలం పోలీసుల సాయంతో బాల్య వివాహాలను అరికట్టాలనుకోవటం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బాలికల విద్యకు ప్రోత్సాహాలనందిస్తే బడికొచ్చే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది. అలాగే పాఠశాలల్లో మరుగుదొడ్లు మొదలుకొని ఉపాధ్యాయుల నియామకం వరకూ శ్రద్ధ తీసుకుంటే నాణ్యమైన విద్య అందటంతోపాటు ఆడపిల్లలు సురక్షితంగా చదువుకోవటం వీలవుతుందన్న భరోసా కుటుంబాలకు కలుగు తుంది. కానీ నీతి ఆయోగ్ ‘హేతుబద్ధీకరణ’ సూచనతో నిరుడు సెప్టెంబర్‌లో అస్సాంలో 1,700 స్కూళ్లు మూసివేయటమో, సమీప పాఠశాలలతో విలీనం చేయ టమో చేశారు. ఈ స్థితిలో ఆడపిల్లలను ఎక్కడో దూరంలో ఉన్న బడికి పంపటానికి తల్లిదండ్రులు సిద్ధపడతారా? ఇక ఉన్నత పాఠశాలల విషయానికొస్తే అస్సాంలో మారుమూల ప్రాంతాల్లో అవి చాలా తక్కువ. ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్తే తప్ప చదువుకోవటం సాధ్యంకాదు. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లకు ప్రమాదం ఎదురుకావొచ్చన్న భయంతో సహజంగానే కుటుంబాలు ఇక వారి చదువుకు స్వస్తిచెబుతాయి. ఇలా బడి మానేసిన పిల్లలకు ఇక పెళ్లే ప్రత్యామ్నాయంగా మారుతోంది. చిన్న వయసులో పెళ్లిళ్లయి గర్భందాల్చిన కారణంగా ఆడపిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. గర్భస్రావాలు తప్పడం లేదు. గర్భం నిలబడినా తక్కువ బరువుతో జన్మించటం, మృత శిశు జన నాలు, పుట్టిన శిశువులు కొన్ని వారాలలోపే మరణించటం వంటివి అధికంగా ఉంటున్నాయి. ఇరవై య్యేళ్ల వయసు తర్వాత పెళ్లయ్యే బాలికలకు జన్మించే శిశువులకంటే, అంతకన్నా తక్కువ వయసు వారికి పుట్టిన శిశువుల్లో మరణాలు 50 శాతం ఎక్కువని యునిసెఫ్ నివేదిక చెబుతోంది. బాల్యవివాహాలను తక్షణం అరికట్టవలసిన సామాజిక సమస్యగా గుర్తించటం బాగున్నా,అందుకోసం అస్సాం ప్రభుత్వం ఎంచుకున్న మార్గం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇందువల్ల ఆ సమస్య మరింత జటిలమవుతుందే తప్ప తగ్గదు. ఇప్పుడు వేలాదిమంది అరెస్టయిన పర్యవసానంగా మగదిక్కులేక, రోజు గడవటం ఎలాగో, తిండితిప్పలకు ఏంచేయాలో తెలియక మహిళలు అవస్థలు పడుతున్నారు. బాల్యవివాహాలను అరికట్టడానికి ఆల్ అస్సాం మైనారిటీ స్టూడెంట్స్ యూనియన్ వంటివి చాన్నాళ్లుగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో దాడులు జరుగుతున్నా వెనక్కి తగ్గటంలేదు. అలాంటి సంస్థలకు చేయూతనందించటం... పేదిరిక నిర్మూలనకూ, విద్యారంగం పటిష్టతకూ అవసరమైన పథకాలు అమలు చేయటం ముఖ్యమని అస్సాం ప్రభుత్వం గుర్తించాలి. ఒక సామాజిక సమస్యను నేరపూరితం చేయటం వల్ల జైళ్లు నిండుతాయి తప్ప ఫలితం శూన్యం. -
Child Marriages: ఏకంగా 18 వందల మంది అరెస్టు!
బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపింది అస్సాం ప్రభుత్వం. ఈ బాల్యవివాహాలను పూర్తిగా అణిచివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోలీసులు ఓపికతో వ్యవహరించొద్దని చెప్పారు. జీరో టోలరెన్సే లక్ష్యంగా ఈ బాల్యవివాహాలకు చెక్‌పెట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ఈ విషయమై అస్సాం వ్యాప్తంగా సుమారు 1800 మందిని అరెస్లు చేసినట్లు తెలిపారు., ఈ మేరకు ముఖ్యమంత్రి బిస్వా ట్విట్టర్లో.."బాల్య వివాహాలను అంతం చేయాలనే సంకల్పంలో అస్సాం ప్రభుత్వం చాలా దృఢంగా ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందుకు అందరూ సహకిరించాల్సిందిగా కోరుతున్నా. ఈ పక్షం రోజుల్లోనే అస్సాంలో దాదాపు 4 వేల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 3 నుంచి ఆ కేసులపై చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు. ఈ బాల్య వివాహాల విషయంలో నిందితుల పట్ల దయాదాక్షిణ్యాలు చూపించవద్దని నొక్కి చెప్పారు. దీనిపై యుద్ధం సెక్యులర్‌గా ఉంటుందని, ఏ ఒక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకోబోమని వెల్లడించారు. అంతేగాదు ఈ విషయాలను ప్రోత్సహించే మత పెద్దలు, పురోహితులపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదీగాక అస్సాం మత్రి వర్గం 14 ఏళ్ల లోపు పిలల్లను పెళ్లి చేసుకున్న వ్యక్తులపై పోస్కో చట్టం, బాల్యవివాహాల చట్టం కింద అబియోగాలు మోపి అరెస్టు చేయాలని అస్సాం మంత్రి వర్గం గట్టిగా నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంతి ఈ చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వాస్తవానికి అస్సాంలో మాతా, శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంది. దీనికి బాల్యవివాహాలు ప్రధాన కారణం. అదీగాక రాష్ట్రంలో సగటున 31 శాతం మందికి చిన్న వయసులోనే వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం. (చదవండి: రన్నింగ్ ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్‌లో మంటలు.. అలర్ట్ అయిన పైలట్) -
మాతృత్వానికి తగిన వయస్సు ఉండాల్సిందే!: అసోం సీఎం
గువాహతి: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాల్య వివాహాల కట్టడికి తమ రాష్ట్రంలో కఠిన చట్టం తేబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనని, లేకుంటే సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. అసోంలో ప్రతీ వందలో 31 పెళ్లిళ్లు.. నిషేధించిన వయసు వాళ్ల వివాహాలే కావడం గమనార్హం. ఈ తరుణంలో.. శనివారం ప్రభుత్వం తరపున నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, చిన్నవయసులోనే మాతృత్వంలాంటి అంశాల కట్టడికి కఠిన చట్టాలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైందని ప్రకటించారాయన. మాతృత్వానికి తగిన వయసు ఉండాల్సిందేనన్న ఆయన.. లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవని మహిళలకు సూచించారు. ‘‘మహిళలు మాతృత్వం కోసం మరీ ఎక్కువ కాలం ఎదురు చూడడం సరికాదు. దానివల్ల సమస్యలు వస్తాయి. మాతృత్వానికి తగిన వయసు 22 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపే’’ అని తెలిపారాయన. ఇంకా పెళ్లికాని వారుంటే ఇది తప్పక పాటించండి అని చిరునవ్వుతో సూచించారు. ఇక బాల్యవివాహాల కట్టడికి తీసుకోబోయే చర్యల గురించి స్పందిస్తూ.. ‘‘రాబోయే ఐదారు నెలల్లో.. వేల మంది పురుషులు కటకటాల పాలు కాకతప్పదు. ఎందుకంటే పద్నాలుగేళ్లలోపు బాలికలతో శారీరకంగా కలవడం నేరం కాబట్టి. వాళ్లు తాము భర్తలమని నిరూపించుకున్నా సరే!. చట్ట ప్రకారం.. వివాహ వయసు 18 ఏళ్లు. కాదని అంతకన్నా తక్కువ వయసులో ఉన్నవాళ్లను వివాహాలు చేసుకుంటే జీవిత ఖైదు తప్పదు అని అసోం సీఎం హెచ్చరించారు. చిన్నవయసులో మాతృత్వం కట్టడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ, అదే సమయంలో మహిళలు తల్లి కావడానికి ఎక్కువ ఏండ్లు తీసుకోవద్దు. ఎందుకంటే.. దేవుడు మన శరీరాలను తగిన వయసులో తగిన పనుల కోసమే సృష్టించాడు కాబట్టి అని సీఎం బిస్వా శర్మ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పద్నాలుగేళ్లలోపు బాలికలను వివాహం చేసుకుంటే గనుక.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని అసోం కేబినెట్ సోమవారం ఓ నిర్ణయం తీసుకుంది. అలాగే.. 14 నుంచి 18 ఏళ్లలోపు వాళ్లను వివాహం గనుక చేసుకుంటే బాల్యవివాహ నిర్మూలన చట్టం 2006 ప్రకారం కేసు నమోదు చేస్తారు. -
బాల్య వివాహాల కట్టడికి కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాల కట్టడికి ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. గతంతో పోలి్చతే రాష్ట్రంలో బాల్య వివాహాల రేటు తగ్గినప్పటికీ ప్రజలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాటిని మరింతగా కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య, బాల్య వివాహ నిరోధక చట్టం–2006, ఏపీ నియమాలు–2012ను అనుసరించి బాల్య వివాహాల నివారణ కోసం వరుడు, వధువు, వారి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మెమోలో పేర్కొన్న అంశాలు ఇవి.. ►బాల్య వివాహాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. బాల్య వివాహ నిరోధక, పోక్సో చట్టాల ప్రకారం విధించే శిక్షలపై ప్రజలకు తెలియజేయాలి. ►మైనర్ బాలికను వివాహం చేసుకుని, ఆమెతో సంసారం చేస్తే బాల్య వివాహ చట్టం–2006, పోక్సో చట్టం–2012 (సవరణ చట్టం–2019) ప్రకారం శిక్ష తప్పదు. ►మైనర్ బాలికను వివాహం చేసుకున్న వరుడికి బాల్య వివాహ నిషేధ చట్టం–2006లోని సెక్షన్ 9 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, లేదా రెండూ కలిపి విధించవచ్చు. ►బాల్య వివాహంతో 18 ఏళ్లలోపు బాలికతో సంసారం చేస్తే అత్యాచారం కేసుగా నమోదు చేసి పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్ 4(జీ) ప్రకారం పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ►16 ఏళ్ల లోపు బాలికను వివాహం చేసుకుని సంసారం చేస్తే అత్యాచారం కేసులో పోక్సో సవరణ చట్టం–2019 సెక్షన్ 4(జీజీ) ప్రకారం ఇరవై సంవత్సరాలకంటే తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా, జీవిత ఖైదు విధిస్తారు. ► బాల్య వివాహాలు నిర్వహించిన వరుడు, వధువు తల్లిదండ్రులకు, వారి బంధువులకు శిక్ష తప్పుదు. వారికి రెండేళ్లు జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వీరికి పోక్సో చట్టం–2012 సెక్షన్ 17 ప్రకారం కూడా శిక్ష పడుతుంది. -
రేణు ది గ్రేట్
భయంతో కూడిన మౌనం కంటే నిర్భయమైన నిరసన ఆయుధం అవుతుంది. రేణు పాసవాన్ విషయంలో ఇదే జరిగింది. చిన్న వయసులోనే తనకు పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. ‘నేను చదువుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకొని తండ్రి ఆగ్రహానికి గురైంది. బిడ్డ మనసును అర్థం చేసుకున్న ఆ తండ్రి ‘సరే నీ ఇష్టం’ అనక తప్పలేదు. ఆరోజు భయపడి బాల్యవివాహానికి సిద్ధమై ఉంటే రేణు పాసవాన్ స్పీకర్, లైఫ్‌కోచ్, రైటర్, ఇన్ఫ్లూయెన్సర్గా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేది కాదు. తాజాగా ఫాక్స్ స్టోరి ఇండియా ‘ఇండియాస్ 50 ఇన్స్పైరింగ్ వుమెన్ –2022’ జాబితాకు ఎంపికైంది రేణు... బిహార్‌లోని ముజాఫర్పూర్ జిల్లాలోని మిథాన్పుర అనే చిన్న గ్రామంలో పుట్టింది రేణు. ఆ ప్రాంతంలో బాల్యవివాహాలు సహజం. తనకు కూడా పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తే ఇంటి నుంచి పారిపోయింది. ఎక్కడో ఉన్న రేణును ఇంటికి తీసుకువచ్చిన తండ్రి ‘పెళ్లి అంటూ నిన్ను బాధ పెట్టను’ అన్నాడు. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండేది రేణు. బయెటెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. పుణెలో ఎంబీఏ చేసింది. బెంగళూరులో బయోటెక్నాలజీ చదువుకునే రోజుల్లో హస్టల్లో అమ్మాయిలు రేణుకు దూరంగా ఉండేవారు. నిరక్ష్యం చేసేవారు. దీనికి కారణం తాను బిహారి కావడం! ఇక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు బిహారీల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు అమానుషంగా ఉండేది. ఇవన్నీ చూసిన తరువాత తనకు బాధగా అనిపించేది. ‘ఇన్పోసిస్’లో కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేసింది రేణు. తాను నడిచొచ్చిన దారిపై ఒకసారి పుణె క్యాంపస్‌లో ప్రసంగించింది. ఇది ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘మీ జీవితానుభవాలకు ఎందుకు అక్షర రూపం ఇవ్వకూడదు! చాలా మందికి స్ఫూర్తి ఇస్తాయి’ అని చెప్పడంతో ‘లివ్ టూ ఇన్స్పైర్’ పేరుతో తొలి పుస్తకం రాసింది రేణు. బిహార్‌లోని మారుమూల గ్రామం నుంచి బెంగళూరులో ఉద్యోగం వరకు తన ప్రయాణానికి అక్షరరూపం ఇచ్చింది. ఈ పుస్తకం బాగా పాపులర్ అయింది. ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముడుతుండగా ‘నేను చేయాల్సింది ఇంకా ఏదో ఉంది’ అనుకుంది రేణు. ‘లివ్ టూ ఇన్స్పైర్’ అనే సంస్థను స్థాపించి గ్రామాలలోని మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడానికి అవసరమైన సహకారం అందిస్తోంది. కళాకృతుల తయారీలో మహిళలకు శిక్షణ ఇప్పిస్తోంది. దీంతో పాటు మహిళల హక్కుల కోసం పనిచేయడం మొదలుపెట్టింది. అలా ‘జి–100’ గ్రూప్‌లో చేరింది. బిహార్ నుంచి ఈ గ్రూప్‌లో చేరిన తొలి మహిళ రేణు. జి–100 అనేది ప్రపంచ వ్యాప్తంగా మహిళల హక్కుల కోసం గొంతు విప్పుతున్న మహిళా ఉద్యమకారుల పోరాట వేదిక. జి–100 గ్రూప్ ఛైర్మన్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రేణు పాసవాన్ లివ్ టూ ఇన్స్పైర్ తరువాత ది న్యూ, సస్టేనబుల్ డెవలప్మెంట్ అనే రెండు పుస్తకాలు రాసింది. ఇవి తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాయి. ఐక్యరాజ్యసమితి ‘జెండర్ ఈక్వాలిటీ’కి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే రేణు ‘షి ది చేంజ్’ టైటిల్‌కు ఎంపికైంది. ‘ఆ ఇంట్లో వ్యక్తులు కాదు సమస్యలు ఉంటాయి’ అని ఊరివాళ్లు అనుకునేవారు. ఎందుకంటే రేణు సోదరులు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవాళ్లు. తల్లికి మానసిక సమస్యలు. వంట వండడం నుంచి బట్టలు ఉతకడం వరకు అన్నీ తన బాధ్యతలే అయ్యేవి. ఇలాంటి ఇంట్లో నుంచి వచ్చిన రేణు పాసవాన్ మోటివేషనల్ స్పీకర్‌గా, స్త్రీ హక్కుల ఉద్యమకార్యకర్తగా ప్రపంచవ్యాప్తగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం పైకి ఎదిగినా పరాయికరణకు లోను కాకపోవడం. తన మూలాలు ఏమిటో మరవకపోవడం. -
గేమ్‌ఛేంజర్.. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి గురించి తెలుసుకోవాలి’
‘ఒక్క బాల్‌తో జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నాను’ అంటాడు ఒక ప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాడు. ‘ఫుట్‌బాల్ అనేది జీవితాన్ని కూడా అర్థం చేయిస్తుందా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని జవాబు చెప్పడానికి రాజస్థాన్‌లోని ఎన్నో గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు దాటి బయటికి రాని అమ్మాయిలు, ఫుట్‌బాల్ వల్ల గ్రౌండ్లోకి రాగలిగారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎదగడమే కాదు అనేక కోణాల్లో జీవితాన్ని అర్థం చేసుకున్నారు. బాల్య వివాహాలను బహిష్కరించే చైతన్యం పొందారు... రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలో చబియావాస్, హిసియావాస్లాంటి ఎన్నో గ్రామాలలో బాల్యవివాహాలు అనేవి సర్వసాధారణం. హిసియావాస్ గ్రామానికి చెందిన నిషా గుజ్జార్, కిరణ్‌లకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. అప్పుడు నిషా వయసు పది సంవత్సరాలు. కిరణ్ వయసు పన్నెండు సంవత్సరాలు. కొంతకాలం తరువాత... నిషా ఊళ్లోని ఫుట్‌బాల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పేరు నమోదు చేసుకుంది. రోజూ రెండు గంటల పాటు ఆట నేర్చుకునేది. చబియావాస్ గ్రామానికి చెందిన పదమూడు సంవత్సరాల మమతకు గత సంవత్సరం నిశ్చితార్థం అయింది. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అలా అని అని ఇంట్లో ఎదురు చెప్పే ధైర్యమూ లేదు. మరో గ్రామానికి చెందిన నీరజకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. అత్తారింటికి వెళితే పనే లోకం అవుతుంది. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నిషాలాగే మమతా, నీరజ ఇంకా ఎంతోమంది అమ్మాయిలు శిక్షణా కేంద్రంలో పేరు నమోదు చేసుకొని ఫుట్‌బాల్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు... ‘పద్దెనిమిది సంవత్సరాలు దాటితేగానీ పెళ్లి చేసుకోను’ అని పెద్దలకు ధైర్యంగా చెప్పేసింది నిషా. వాళ్లు ఒప్పుకున్నారు. ‘ఇప్పుడే పెళ్లి వద్దు, అబ్బాయి కుటుంబ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలి. నా చదువు పూర్తి కావాలి’ అని ధైర్యంగా చెప్పింది మమత. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. ‘పెళ్లి ఇప్పుడే వద్దు. నాకు చదువుకోవాలని ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలనేది నా కల’ అని ఇంట్లో వాళ్లకు చెప్పింది నీరజ. ఇంత మార్పు ఎలా వచ్చింది? నీరజ మాటల్లో చెప్పాలంటే... ‘ఫుట్‌బాల్ ఆడడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసం, నా మనసులోని మాటను బయటికి చెప్పే శక్తి వచ్చింది’ ఫుట్‌బాల్ ఆడడంతోపాటు అమ్మాయిలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారు. అందులో ఎక్కువమంది చిన్న వయసులోనే పెళ్లి, నిశ్చితార్థం అయిన వారు ఉన్నారు. మాటల్లో చిన్న వయసులోనే పెళ్లి ప్రస్తావన వచ్చేది. ‘ఎవరో కాదు మనమే అడ్డుకుందాం. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం’ అనే చైతన్యం వారిలోకి వచ్చి చేరింది. ‘ఒకప్పుడు సంప్రదాయ దుస్తులు తప్ప వేరే దుస్తులు ధరించే అవకాశం లేదు. స్కూలుకు పంపడమే గొప్ప అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు స్పోర్ట్స్‌వేర్‌లో నన్ను నేను చూసుకుంటే గర్వంగా ఉంది. ఒకప్పుడు ఆటలు అంటే మగపిల్లలకు మాత్రమే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు మాత్రం పెద్దల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది’ అంటుంది స్వప్న. ‘మహిళా జన్ అధికార్’ అనే స్వచ్ఛందసంస్థ రాజస్థాన్‌లో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఆడపిల్లలకు ఫుట్‌బాల్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అయితే ఈ ఫుట్‌బాల్ శిక్షణా కేంద్రాలు కాస్తా చైతన్య కేంద్రాలుగా మారాయి. ‘వ్యూహాత్మకంగానే గ్రామాల్లో ఫుట్‌బాల్ శిక్షణాకేంద్రాలు ప్రారంభించాం. దీనివల్ల అమ్మాయిలు ఈ ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో ఆడడం ఒక కోణం అయితే, సామాజిక చైతన్యం అనేది మరో కోణం. ఆట గురించి మాత్రమే కాకుండా మహిళల భద్రత, మహిళల హక్కులు, లింగ సమానత్వం... మొదలైన ఎన్నో అంశాల గురించి బోధిస్తున్నాం’ అంటోంది ‘మహిళా జన్ అధికార్’ బాధ్యురాలు ఇందిరా పంచోలి. -
బాల్య వివాహాల్లో జార్ఖండ్ టాప్
రాంచీ: చిన్నతనంలోనే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లవుతున్నాయి. ఈ విషయంలో దేశవ్యాప్త సరాసరి 1.9% కాగా, కేరళలో 0.0% గా ఉంది. కేంద్ర హోం శాఖ నిర్వహించిన శాంపిల్ సర్వే–2020లో ఈ విషయం వెల్లడైంది. సర్వే వివరాలను రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ వెల్లడించారు. జార్ఖండ్‌లో బాల్య వివాహాలు పల్లెల్లో 7.3%, పట్టణ ప్రాంతాల్లో 3% జరుగుతున్నాయి. 21 ఏళ్లు రాకుండానే బాలికలకు వివాహాలవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 21 ఏళ్లు రాకుండా 54.0% మంది యువతులకు మూడుముళ్లు పడుతుండగా, జార్ఖండ్‌లో ఇది 54.6% గా ఉంది. ఈ విషయంలో జాతీయ స్థాయి సగటు 29.5% మాత్రమే. జార్ఖండ్ మరో అపప్రథ కూడా మూటగట్టుకుంది. మంత్రాల నెపంతో ఇక్కడ 2015లో 32 హత్యలు చోటుచేసుకోగా 2018లో 18 మంది, 2019, 2020ల్లో 15 మంది చొప్పున హత్యకు గురయినట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపింది. -
మూడుముళ్ల బందీ!
కళ్యాణదుర్గం: సాంకేతికత రోజురోజుకూ పెరుగుతున్నా...ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా...జిల్లాలో బాల్య వివాహాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడపిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీటలెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా...పెడచెవిన పెడుతున్నారు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంతో బందీ చేస్తున్నారు. ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్లలోపే వివాహాలు జరిపిస్తున్న వారు కొందరైతే... పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబ పరువు పోతుందనే భయంతో మరికొందరు ఇలా చేస్తున్నారు. అడ్డుకట్టకు మార్గాలు... గ్రామస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సూపర్వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్య వివాహాలను అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా చైల్డ్‌లైన్(112)కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేయకూడదని, ఒక వేళ బాల్య వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి ఇప్పటికే ఐసీడీఎస్ ప్రాజెక్టు స్థాయి సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి బాల్య వివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ‘వివాహ రిజిస్ట్రేషన్ చట్టం – 2002’ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. గ్రామ, వార్డు స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వధువు, వరుడు ఇద్దరూ సంతకం చేసిన దరఖాస్తును నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, వివాహ వధువు, వరుడు ఇద్దరూ సంతకం చేసిన దరఖాస్తును నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, వివాహ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆహ్వాన పత్రికలతో కలిసి సమర్పించాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో ఇటీవల ఓ బాల్య వివాహం జరగబోతోందన్న సమాచారం అందుకున్న ఐసీడీఎస్, పోలీసు అధికారులు గ్రామానికి వెళ్లారు. వధూవరుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పటికి ఆ వివాహం అడ్డుకున్నారు. అయితే మరుసటి రోజే అధికారుల కళ్లుగప్పి ఇరు కుటుంబాల వారు మరో ప్రాంతానికి వెళ్లి పెళ్లి తంతు ముగించారు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి పంచాయతీలో రెండు నెలల క్రితం బాల్య వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకుని ఐసీడీఎస్, పోలీసు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని నిలుపుదల చేశారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. దీంతో బాల్య వివాహాలు జిల్లాలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అధికారులకు ముందస్తు సమాచారం అందితే వెంటనే అక్కడికి వెళ్లి బాల్య వివాహాలు అడ్డుకుని.. బాలల బంగారు భవిష్యత్తు బుగ్గిపాలు కాకుండా చూస్తున్నారు. శిక్షలతోనే బాల్య వివాహాలకు చెక్ బాల్య వివాహాలు చేస్తున్న వారిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి.. శిక్ష పడేలా చేస్తే బాల్య వివాహాలకు చెక్ పడుతుంది. గ్రామాల్లో అన్ని రకాలుగా ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రాలేదు. అమ్మాయిలను చదివిస్తే కొంతవరకు వీటిని తగ్గించవచ్చు. గ్రామాలలో చట్టంపై అవగాహన కలి్పస్తే తగ్గుముఖం పడుతాయి. – శ్రీదేవి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్ మా ఊర్లో బాల్య వివాహాలకు తావులేదు నా పేరు వన్నూరమ్మ. నేను ఆర్డీటీ సంస్థలో లీడరుగా పనిచేస్తున్నాను. ఊర్లో బాల్య వివాహాలు అడ్డుకోవడం, మహిళలపై దాడులు ఇలాంటి వాటిని అరికట్టడానికి పనిచేస్తున్నాను. పదేళ్లుగా మా ఊర్లో బాల్య వివాహాలు జరగలేదు. అలా ఎవ్వరైనా చేయాలని చూసినా వెంటనే అక్కడికి చేరుకుని ఐసీడీఎస్ అధికారులతో పాటు పోలీసుల (డయల్ 100)కు, చైల్డ్‌లైన్ (112)కు సమాచారం అందిస్తున్నాం. – వన్నూరమ్మ, మోరేపల్లి బాలికల విద్యను ప్రోత్సహించాలి బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక డ్రాపౌట్స్ పూర్తిగా తగ్గిపోయింది. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు బాలికలకు వరంగా మారాయి. చదువు ఉంటే బాల్య వివాహాలు అనే ఆలోచన రాదు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. – ఉషశ్రీచరణ్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి (చదవండి: శుద్ధ అబద్ధం: మినరల్ కాదు జనరల్ వాటర్) -
వివాహ వయసు పెంపుపై చర్చ
సాక్షి, అమరావతి: పేదింటి బాలికలు సైతం ఉన్నత విద్యనభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని.. దీనికి అదనంగా యువతుల కనీస వివాహ వయసు పెంపు వంటి చర్యలు మహిళలు తమ లక్ష్యాలను సులువుగా సాధించేందుకు దోహదపడతాయని కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహాల నిషేధ చట్టం (సవరణ)–బిల్లు 2021’పై అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్లైన్ సదస్సు జరిగింది. మన రాష్ట్రం నుంచి కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తో పాటు వినుకొండ ఎంపీపీ, పలువురు మహిళా సర్పంచ్‌లు విజయవాడ ఏపీఎస్ఐఆర్డీ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. మహిళల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచడం వల్ల కలిగే మంచి, చెడులపై ఎవరేమన్నారంటే.. వివాహ వయసు పెంపును స్వాగతిస్తున్నా.. 21 ఏళ్లు వచ్చిన తర్వాత వివాహాలు జరగడం వల్ల మహిళలకు బిడ్డను కనడానికి అనువుగా శారీరక పరిపుష్టత ఉంటుంది. బాలికల వివాహ వయసు పెంచడం ద్వారా బాలికలు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వృద్ధిలోకి వస్తారు. – ఉప్పాల హారిక, జెడ్పీ చైర్పర్సన్, కృష్ణా జిల్లా విద్య, వృత్తి నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి 18 ఏళ్ల లోపే వివాహం చేయడాన్ని గ్రామాల్లోను, బలహీన వర్గాల్లోను నిషేధించడం కష్టంగా ఉంది. కాబట్టి మనం వివాహ వయసుపై కాకుండా బాలికా విద్య, వృత్తి నైపుణ్యాల పై దృష్టిసారించాలి. – జయశ్రీ, ఎంపీపీ, వినుకొండ. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారానికి ప్రాధాన్యత వివాహ వయసు పెంపుదల గ్రామ స్థాయిలో పెద్దగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మనం విద్య, ఆరోగ్యం, కౌమార బాలికలకు పౌష్టికాహారం, సాంకేతిక, వృత్తి విద్యపై పని చేయాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ జగబంధు, సర్పంచ్, శ్రీకాకుళం జిల్లా -
ప్రధానితో చర్చకు తలతంపర సర్పంచ్‌కు పిలుపు
కంచిలి: జాతీయ బాల్య వివాహాల చట్టంలో వయస్సును సవరించడం కోసం ప్రవేశపెట్టనున్న బిల్లుపై భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న చర్చకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 8 మందిని ఎంపిక చేశారు. అందులో కంచిలి మండలం తలతంపర పంచాయతీ సర్పంచ్ డాక్టర్ దొళాయి జగబంధును కూడా ఎంపిక చేస్తూ అమరావతి నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, ఐదుగురును సర్పంచ్‌లతో పీఎం మోదీ ఆన్లైన్లో ఈ విషయమై చర్చిస్తారని, ఎంపిక చేసిన 8 మంది ప్రజాప్రతినిధులకు సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం అందించినట్లు తలతంపర సర్పంచ్ డాక్టర్ జగబంధు శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ విధమైన కమిటీలను నియమించి, అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ నెల 31వ తేదీన అమరావతిలో ఈ కార్యక్రమం ఉంటుందని, తప్పనిసరిగా హాజరు కావాలని సమాచారం వచ్చినట్లు తెలిపారు. (చదవండి: దొంగ సొత్తు చెరువులో ఉందా..?) -
బాల్య వివాహాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాలను ప్రభుత్వం అరికడుతోందని, ఒక్క అనంతపురం జిల్లాలోనే గత మూడేళ్లలో 1,508 బాల్య వివాçహాలను అడ్డుకుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శాసన మండలిలో చెప్పారు. అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఎన్జీవోల సహాయంతో అనంతపురం జిల్లాలో 2019 ప్రారంభంలో 396, 2019 చివరలో 337, 2020లో 357, 2021లో 418 బాల్య వివాçహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. బాల్య వివాహల నియంత్రణకు వైఎస్సార్ కిశోరి వికాసం కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాలోని అన్ని పాఠశాలలు, జానియర్ కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహించినట్టు తెలిపారు. సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శు (మహిళా పోలీసు)ల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నట్టు తెలిపారు. కొత్తగా 17 స్టేడియాలు రాష్ట్రంలో కొత్తగా 17 స్టేడియాల అభివృద్ధికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలిపారు. కొన్ని పూర్తిగా ప్రభుత్వ నిధులతో, మరికొన్ని పీపీపీ విధానంలో, ఇంకొన్ని ఖేల్ ఇండియా పథకంలో చేపడుతున్నట్టు వివరించారు. 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యం స్వాధీనం ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేసి 2019 నుంచి ఇప్పటి వరకు 1.53 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి కొడాలి నాని శాసన మండలిలో చెప్పారు. -
ముందులా కాదు.. ట్రెండ్ మారింది, ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది
సాక్షి,రాజాం(శ్రీకాకుళం): ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది. ఐదేళ్ల కిందటకు ఇప్పటికి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఐదేళ్ల కిందటి వరకు అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపేద్దామనే ఆత్రుత జిల్లా ప్రజల్లో కనిపించేది. అధికారులు ఎంతగా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా గ్రామాల్లో గుట్టుగా బాల్య వివాహాలు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ విధి విధానాలు, బాలల సంరక్షణ విభాగం పటిష్ట చర్యలు, గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టి, బాలికల విద్యావకాశాలు మెరుగుపడడంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. బాలల సంరక్షణ విభాగం చొరవ జిల్లాలో బాలల సంరక్షణ విభాగం చురుగ్గా పనిచేస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ విభాగం సేవలు, నిత్య పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వేగంగా వెళ్లాయి. ప్రధానంగా భారతీయ వివాహ చట్టాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులకు చేరవేయగలిగారు. మరో వైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్లైన్లు ఎక్కడికక్కడే అవగాహన కార్యక్రమాలు చేయడం, ఎప్పటికప్పుడు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ద్వా రా చదువు మానేస్తున్న బాలికలను గుర్తించి వారి కి ఉన్నత విద్యను అందించే ఏర్పాట్లు చేయడం, బాలికల సంరక్షణ వసతిగృహాల్లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. గత పదేళ్లలో.. గత పదేళ్లుగా చూసుకుంటే బాల్య వివాహాలు 2011 కంటే ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. 2011–12లో ఏడాదికి సగటున బాల్య వివాహాల నమోదు 395గా ఉండేది. 2018–20 మధ్య కాలంలో ఏడాదికి 163 నుంచి 128కి తగ్గుముఖం పట్టాయి. 2021–22 ఏడాదిలో ఈ వివాహాలు 54కి నమోదు కాగా, ఈ ఏడాదిలో ఈ మొత్తం బాల్య వివాహాలను బాలల సంరక్షణ విభాగం అడ్డుకోగలిగింది. (చదవండి: Scolded Drinking Habit: తమ్ముడి నిర్వాకం...సొంత అక్కపైనే అఘాయిత్యం ) పెరిగిన విద్యావకాశాలు.. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు గ్రామాల్లో విద్యావకాశాలు బాగా పెరిగాయి. వైఎస్సార్ సీపీ వచ్చాక పాఠశాలలు, కాలేజీలు అభివృద్ధి చెందాయి. గతంలో పదో తరగతి వరకూ మాత్రమే ఆడపిల్లల చదువులు ఉండేవి. ఇప్పుడు ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో, బీ ఫార్మసీ వంటి కోర్సుల వైపు బాలికలు దృష్టి సారిస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ ఉద్యోగ వ్యవస్థలో ఒక విప్లవం తీసుకురాగా, ఆయా ఉద్యోగాలు పొందిన బాలికలు మిగిలినవారికి మార్గదర్శులుగా మారారు. చట్టం ఏం చెబుతోంది..? భారతీయ వివాహ చట్టం 1955 ప్రకారం ఆడపిల్లకు 18 ఏళ్లు దాటిన తర్వాత, అబ్బాయికి 21 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలి. పురుషులతో సమానంగా మహిళలకు కూడా వివాహ వయస్సు ఉండాలని 2006లో భారతీయ వివాహ చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ మార్పుచేసింది. ఫలితంగా ఇప్పుడు అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా కాదని బాల్య వివాహాలు నిర్వహిస్తే రెండు కుటుంబాలపైన చట్టపరమైన చర్యలు తప్పవు. గత పదేళ్లలో జిల్లాలో 1120 బాల్య వివాహాల ఫిర్యాదులు నమోదు కాగా, ఇందులో 1112 పెళ్లిళ్లను అధికారులు నిలుపుదల చేసి, ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొండికేసి బలవంతంగా పెళ్లి జరిపిన 8 కుటుంబాలపై కఠిన చర్యలు చేపట్టారు. అవగాహన పెరిగింది బాల్య వివాహాలు చేయకూడదనే విషయం ప్రజలకు తెలిసింది. ప్రతి రోజు మేం చేస్తున్న కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రధానంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయే పరిస్థితి కూడా ఉంది. వీటిపై ప్రజల్లో అవగాహన రావడంతో బాల్య వివాహాలు తగ్గాయి. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, విద్యావకాశాలు మెరుగుపర్చడం వంటి వాటి ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. – కేవీ రమణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి, శ్రీకాకుళం -
వధువు @ 21.. వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల
భారతదేశంలో మహిళలకు చట్టబద్ధమైన పెళ్లి వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ నిర్ణయం చట్టం రూపం దాల్చుతుంది. బాల్య వివాహాలను నిరోధించడానికి, చిన్న వయసులో గర్భాలను నిరోధించడానికి, యువతుల శారీరక మానసిక ఆరోగ్యాల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కొందరు భిన్న రంగాల మహిళా ఆలోచనాపరుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ 15, బుధవారం కేంద్ర కేబినెట్ స్త్రీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. వివాహానికి అవసరమైన వయసు 21 సంవత్సరాలుగా ప్రతిపాదించింది. గతంలో ఈ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21గా ఉండేది. ఇప్పుడు స్త్రీ, పురుషులకు ఒకే వయసు నిర్ణయించినట్టు అయ్యింది. దీని వల్ల జెండర్ తటస్థత పాటించినట్టు భావిస్తోంది. హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఆడపిల్ల వయసు వివాహానికి 18 ఏళ్లు ఉండాలి. ఇస్లాంలో అమ్మాయి ఈడేరిన తర్వాత వివాహానికి యోగ్యురాలిగా భావిస్తారు. స్పెషల్ మేరేజ్ యాక్ట్, 1954 ప్రకారం అబ్బాయి వయసు 21, అమ్మాయి వయసు 18గా ఉంది. తాజా ప్రతిపాదన చట్టం దాలిస్తే 21 ఏళ్లు ఉమ్మడి వయసు అవుతుంది. బాల్య వివాహాలను నిరోధించేందుకు, యువతుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండటం కోసం, బాలింత–శిశు మరణాల నివారణకు, పోషకాహార సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెబుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015–16లో బాల్య వివాహాలు 27 శాతం ఉంటే 2019–20లలో వీటి శాతం 23కు చేరింది. ఈ శాతాన్ని ఇంకా తగ్గించడంలో వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల ఉపయోగపడుతోందని భావిస్తోంది. 2020 కమిటీ స్త్రీల శారీరక పోషక విలువల స్థాయికి, పెళ్లి వయసుకూ మధ్య సమన్వయం, సంబంధం గురించి అంచనాకు రావడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జయా జైట్లీ అధ్యక్షతన 2020లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 16 యూనివర్సిటీల విద్యార్థినీ విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంది. అలాగే 15 ఎన్జిఓల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కమిటీ యువతుల వివాహ వయసును 21కి పెంచమని రికమండ్ చేసింది. అంతేకాదు అమ్మాయిల చదువు అవకాశాలను పెంచమని, వారి రాకపోకల సౌకర్యాలను పెంచమని, అలాగే ఉపాధికి అవసరమైన ట్రైనింగులను పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన నిపుణుల, ఆలోచనాపరుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఆడపిల్లలకు డబ్బు ముఖ్యం అని చెప్పాలి ఒకప్పుడు డబ్బుకు పెద్ద విలువ ఇవ్వొద్దని తల్లిదండ్రులు చెప్పేవారు. ఇప్పుడు డబ్బుకు విలువ ఇవ్వండని చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లకు ఆర్థికంగా తన మీద తాను ఆధారపడే వీలు కల్పించాలి. ఇందుకు బాగా చదివించాలి. వివాహ వయసు 21 సంవత్సరాలకు పెంచడం మంచిది. దాని వల్ల చదువుకుంటారు. ఉద్యోగాలు చేయాలనుకుంటారు. డబ్బు గురించి ఆలోచిస్తారు. కొన్ని వర్గాలలో తల్లిదండ్రులు పనికి వెళ్లాల్సి రావడం వల్ల ఇంట్లో ఆడపిల్లను ఉంచడం ఎందుకు అని పెళ్లి చేస్తున్నారు. పది ఫెయిల్ అయిన ఆడపిల్లకు పెళ్లి తప్పనిసరి అవుతోంది. పెళ్లి చేసి పంపాక అక్కడ అమ్మాయి ఇమడలేకపోతే పుట్టింటి సపోర్ట్ ఉండటం లేదు. అమ్మాయికి తన కాళ్ల మీద తాను నిలబడే ఆర్థిక శక్తి, స్కిల్స్ ఉండటం లేదు. దీని వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కాకుండా వీళ్లను ఉపాధి పొందే ట్రయినింగుల్లోకి మళ్లించాలి. ఆ మేరకు తల్లిదండ్రులకు చైతన్యం కలిగించాలి. చట్టం తేవడం ఒక విషయం అయితే దానిని గట్టిగా అమలయ్యేలా చూడటం ఒక విషయం. ఆ విషయంపై శ్రద్ధ పెట్టాలి. – పి.సత్యవతి, రచయిత పంచాయతీలు జాగ్రత్త తీసుకోవాలి అమ్మాయి పెళ్లి వయసు 21 పెంచుతూ తీసుకున్న నిర్ణయం మంచిది. దీనిని తల్లిదండ్రులకు, యువతులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలి. ఎలా చేస్తే చట్టబద్ధమో ఎలా చేస్తే చట్టవిరుద్ధమో విడమర్చి చెప్పాలి. ముఖ్యంగా పల్లెటూళ్లలో పంచాయతీలు అక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను గమనించి ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలి. అప్పుడు దాదాపుగా ఈ నిర్ణయం వల్ల ఉపయోగం కలుగుతుంది. గ్రామాల్లో పెళ్లి చేసుకోమనే తల్లిదండ్రులను ఆడపిల్లలు ఎదిరించడం కష్టసాధ్యమైన పని. అలాంటి వారికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. వారు సర్పంచ్ చేతో మరెవరి చేతో ఈ విషయాన్ని చెప్పించి చదువు, ఉపాధిలో రాణించవచ్చు. పెళ్లి వయసు 21 చేయడం అంటే అమ్మాయిలు పరిణితితో నిర్ణయం తీసుకునే వీలు కల్పించడం. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు ఈ వయసు నియమం వల్ల తగ్గితే అదీ మంచిదే. – ఓల్గా, రచయిత టీనేజ్‌లో పెళ్లి అయితే హైరిస్క్ పదకొండు నుంచి పదమూడేళ్ల వయసు అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభం అవుతుంది. టీనేజ్ దశలో వాళ్ల శరీరం గురించి వారికి సరైన అవగాహన ఉండదు. పెద్దవాళ్లు చెప్పరు. పద్దెనిమిది ఏళ్లు నిండగానే పెళ్ళి చేస్తే అవగాహన లేమి కారణంగా త్వరగా గర్భం దాల్చుతుంటారు. టీనేజ్‌లో రక్త హీనత సమస్య ఎక్కువ. ఈ వయసు గర్భవతుల్లో హైబీపీ రిస్క్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. దీని వల్ల వీరికి ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకని అమ్మాయిలకు తమ శరీరం గురించి, సెక్స్ఎడ్యుకేషన్ అవగాహన కల్పించాలి. అప్పుడే లైంగికపరంగా వచ్చే జబ్బుల గురించి కూడా అవగాహన ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగున్నవారు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం గురించి కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. 21 ఏళ్లకు పెళ్లి అయితే పిల్లలు కోసం ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లి సరైన జాగ్రత్తలు తీసుకునే అవగాహన ఉంటే, రాబోవు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్ లక్ష్యానికి రూపం రావాలంటే 21 ఏళ్లు నిండాలి మా ఊరు మొయినాబాద్ మండలంలోని యత్బార్పల్లి. మా ఊళ్లో పద్దెనిమిదేళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. దానికి ఒక రూపం రావాలంటే డిగ్రీ వరకు చదువుకోవాలి. మా ఇంట్లో కూడా నీకు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేస్తాం అన్నారు. కేంద్రప్రభుత్వం అమ్మాయిలకు పెళ్లివయసు 21 ఏళ్లు చట్టం తీసుకువస్తుందని వినగానే చాలా సంతోషం వేసింది. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఈ విషయం తెలియాలి. మా కాళ్ల మీద మేం నిలబడాలి. నేనిప్పుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. డిగ్రీ చేసి, జాబ్ తెచ్చుకోవాలి. మా అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలి. నాకో తమ్ముడు ఉన్నాడు. కానీ, అమ్మనాన్నల బాధ్యత నాది కూడా. జాబ్ చేయాలి అలాగే వ్యవసాయం కూడా చేయాలి. మా నాన్న రైతు. నేనూ పొలం పనులు చేస్తుంటాను. రైతుల కష్టాలు చూస్తూ పెరిగాను కాబట్టి, రైతుల అభివృద్ధికి కృషి చేయాలన్నది నా లక్ష్యం. – బి.భవానీ, విద్యార్థిని చట్టం సరే... చైతన్యం ఇంకా మంచిది ఉత్తరాది రాష్ట్రాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి దక్షిణాదితో పోలిస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కింది వర్గాలలో కూడా బి.టెక్, ఎంటెక్‌లు చేస్తున్నారు. 18 ఏళ్లు అంటే చదువు విషయంలో అటూ ఇటూ కాని వయసు. 21కి పెళ్లి వయసు పెంచడం వల్ల చదువు కొనసాగించి ఉద్యోగాల్లోకి వెళ్లే వీలుంటుంది. ఆ మేరకు ఈ నిర్ణయం మంచిది. అయితే ఈ విషయాన్ని చట్టం తెచ్చి చెప్పడం కన్నా చైతన్యం చేయడం ద్వారా చెప్తే బాగుంటుంది. ఒక రకంగా ఇప్పుడు పెళ్లిళ్లు అయ్యే సరికి అమ్మాయికి కొన్ని వర్గాల్లో 24 వస్తోంది. 20 ఏళ్లకు పెళ్లి చేయాలన్నా అబ్బాయిలు సెటిల్ కాకపోవడం వల్ల పెళ్లికొడుకు దొరకని పరిస్థితి ఉంది. 20 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లకే ఇప్పటి విద్య, ఉపాధి, సామాజిక పరిస్థితులు దారి తీస్తున్నాయి. మిగిలిన వర్గాల్లో ఎర్లీ మేరేజస్ తగ్గించాలంటే చైతన్యస్థాయిని పెంచడం ఇంకా మంచి మార్గం అని నా అభిప్రాయం. – ముదిగంటి సుజాతా రెడ్డి, రచయిత డిగ్రీ చదువు పూర్తవ్వాలి నా మనవరాలికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చాక పెళ్లి అయ్యింది, ఇప్పుడు పిల్లలు. ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దుకుంటోంది. ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలదు. నా రోజుల్లో స్కూల్ చదువు పూర్తికాగానే పెళ్లి చేసేశారు. దీంతో కాలేజీ చదువులు చదువుకోలేకపోయాను. పెళ్లయ్యాక బాధ్యతల్లోనే జీవితమంతా గడిచిపోయింది. మా అమ్మాయికీ పెద్దవాళ్ల జోక్యంతో చిన్న వయసులోనే పెళ్లి చేశాను. తన సమర్థత వల్ల పెళ్లి తర్వాత కూడా చదువుకుంది, బ్యూటీషియన్‌గా ఎదిగింది. అందరికీ ఆ అవకాశం ఉండదు. సాధారణంగా అమ్మాయిల బాధ్యత త్వరగా తీర్చుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, అమ్మాయి అత్తింటికి వెళ్లాక అక్కడ పరిస్థితులకు ఇమడలేకపోయినా, జీవితాన్ని చక్కదిద్దుకునే సామర్థ్యం లేకపోయినా కుటుంబానికి, తనకూ అన్యాయమే జరుగుతుంది. ఆడ–మగ ఇద్దరికీ ఉన్నది ఒకటే జీవితం. ఆనందంగా బతకాలంటే అవగాహన కూడా రావాలి. అందుకని, డిగ్రీ చదువు పూర్తయ్యాక అమ్మాయికి పెళ్లి అయితే అన్ని విధాల బాగుంటుంది. – తుమ్మ సత్యవతి, గృహిణి కలలు నెరవేరాకే పెళ్లి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లలకు జీవితంలో సాధించాల్సిన కలలు ఎన్నో ఉంటాయి. కానీ, పెళ్లి కారణంగా పెద్దవాళ్లు ఆ కలలను చంపేస్తున్నారు. బయట అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తల్లిదండ్రుల భయాలకు కారణం అవుతున్నాయి. దీని వల్లే అమ్మాయిలకు పద్దెనిమిది నిండకుండానే పెళ్లి చేసి భారం దించుకున్నాం అనుకుంటున్నారు. చిన్నవయసులో పిల్లలు పుట్టినా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. అలాగే, ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మాది రంగారెడ్డి జిల్లాలోని తోల్కట్ట అనే ఊరు. పేదింటి అమ్మాయిని. నాన్న ఊరూరు తిరుగుతూ పాతబట్టలు తీసుకొని, కొత్త ప్లాస్టిక్ టబ్బులు అమ్ముతుంటారు. వాటిని సేకరించుకుని వస్తే మేం అవన్నీ ఇంటి వద్ద సపరేట్ చేసి, మరొకరికి ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. మా అమ్మనాన్నలకు నేను అన్నయ్య, తమ్ముడు సంతానం. నాకూ పెళ్లి చేస్తామన్నారు. కానీ, నేను బతిమాలుకున్నందుకు నన్ను కాలేజీకి పంపిస్తున్నారు. ఇంకో ఏడాదిలో పెళ్లి చేస్తామన్నారు. నాకు పోలీస్ అవ్వాలన్నది కల. ఇప్పుడు ఈ చట్టం వస్తే నా కల నెరవేరుతుంది. – నిఖిత, విద్యార్థిని -
20 రోజుల పసికందుకి పెళ్లి. అఫ్గాన్‌లో ఇలాంటి పూర్ణమ్మలు ఇంటికొకరు
పొత్తిళ్లలో పసిపాప... ఓ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ. అవును 20 రోజుల ఈ పసికందుకు పెళ్లి చేసేశారు. అఫ్గాన్‌లో ఇలాంటి పూర్ణమ్మలు ఇంటికొకరు. తాలిబన్ల వశమయ్యాక అఫ్గాన్ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. చేయడానికి పనిలేదు. తినడానికి తిండి లేదు. పసిపిల్లల కడుపు నింపలేని పరిస్థితి. ఆకలి పేగుబంధాన్ని సైతం జయించేసింది. చేసేదేం లేక చిన్నారులను, పసికందులను తల్లిదండ్రులు పెళ్లి పేరుతో విక్రయిస్తున్నారు. తమ దగ్గర ఉండి ఆకలితో చచ్చేకంటే... ఏదో ఒకచోట వాళ్లు బతికుంటే చాలంటున్నారు. ఈ బాలిక ఏడేళ్ల జోహ్రా. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే ఉంటోంది. కానీ తనను కొనుక్కున్న వ్యక్తి వచ్చి ఎప్పుడు పట్టుకెళ్తాడోనన్న భయంతో బతుకుతోంది. తండ్రి రోజూవారి కూలీ. అంతకుముందు తినడానికి తిండైనా ఉండేది. కానీ అఫ్గాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. ఒక్క జోహ్రానే కాదు.. ఐదేళ్ల మరో కూతురినీ అమ్మేశాడు తండ్రి ఖాదిర్. చదవండఙ: మరో సంక్షోభం దిశగా అఫ్గన్! ఐరాస హెచ్చరిక ఈమె పేరు నోరా. 8 ఏళ్లు. తండ్రి పేరు హలీమ్. మరో నెల రోజుల్లో నోరాను అమ్మేస్తానని హలీమ్ తన చుట్టుపక్కల వాళ్లతో చెప్పి ఉంచాడు. ఓ రూ. 80 వేలైనా వస్తాయని, కొన్ని రోజులకు తిండికి సరిపోతాయని చెబుతున్నాడు. ఆకలితో అల్లాడి చనిపోయేలా ఉన్నామని, ఇంకో దారి కనిపించట్లేదని బోరుమంటున్నాడు. అల్లాడుతున్న అఫ్గాన్.. అఫ్గనిస్తాన్‌లో ఇది ప్రతి పేదింటి కథ. ఆగస్టులో తాలిబాన్లు చేజిక్కించుకున్నాక అక్కడి పరిస్థితులు మారిపోయాయి. విదేశాల్లో ఉన్న అఫ్గాన్ సర్కారు ఆస్తులు, డబ్బులను ఆ దేశాలు ఫ్రీజ్ చేశాయి. ఆ దేశానికి అందే సాయమూ ఆగిపోయింది. కొన్ని నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పనులు లేకుండా పోయాయి. చాలా మందికి ఉద్యోగాలూ పోయాయి. ఎంతో మందికి జీతాలు కూడా ఆగిపోయాయి. పేదరికం పెరిగిపోయింది. తిండి దొరకడమూ కష్టమైంది. దీనికితోడు ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పని కోసం, తిండి కోసం పేద ప్రజలు అల్లాడుతున్నారు. చదవండి: టైటానిక్ ఓడను చూడలనుకుంటున్నారా.. టికెట్ రూ.కోటి 87 లక్షలే చిన్నారి పెళ్లికూతుళ్లు.. పేదరికం పెరగడం, పనుల్లేకపోవడంతో ఆకలికి అల్లాడుతున్న తమ కుటుంబాలను చూడలేక చాలా మంది అఫ్గానీలు తమ చిన్నారి కూతుళ్లను అమ్ముతున్నారు. 20 రోజుల పిల్లల నుంచి 18 ఏళ్ల అమ్మాయిల వరకు ఎదురుకట్నం తీసుకొని పెళ్లి చేసుకునేందుకు ఇచ్చేస్తున్నారు. కొందరు ముందస్తుగానే చిన్నారులను ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. మరికొందరు అప్పు కింద పిల్లల్ని అప్పజెప్పేస్తున్నారు. అద్దె కట్టలేదని ఓ వ్యక్తి 9 ఏళ్ల కూతురును ఇంటి యజమాని తీసుకెళ్లాడని మానవ హక్కుల కార్యకర్తలు చెప్పారు. వాయవ్య అఫ్గాన్‌లో ఓ వ్యక్తి తన ఐదుగురు పిల్లలకు తిండి పెట్టలేక మసీదు దగ్గర వదిలేశాడని తెలిపారు. మున్ముందు 97% మంది పేదరికంలోకి.. తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోకముందు అఫ్గాన్‌లో అధికారికంగా పెళ్లి వయసు 16 ఏళ్లు. తాలిబన్లు రాకముందు కూడా దేశంలో బాల్య వివాహాలున్నాయి. కానీ గత కొన్ని నెలలుగా ఇవి పెరిగిపోయాయి. మున్ముందు ఇవి రెండింతలయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. 20 రోజుల పిల్లలను కూడా మున్ముందు పెళ్లి చేసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిసిందని యునిసెఫ్ వెల్లడించింది. ప్రపంచంలో అతిదారుణమైన మానవ సంక్షోభాన్ని అఫ్గాన్ ఎదుర్కుంటోందని యునిసెఫ్ తెలిపింది. 2022 మధ్య కల్లా దేశంలోని 97 శాతం కుటుంబాలు పేదరికంలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మేమున్నామంటున్న యునిసెఫ్.. స్వేచ్ఛగా ఎదగాల్సిన బాల్యం పంజరంలో బందీ అయిపోతోంది. పెళ్లి చేసుకున్న ఆ చిన్నారి బాలికలను పని వాళ్లుగా, బానిసలుగా చూస్తారు. ఆ పిల్లల, మహిళల కన్నీటి బాధలు చూసిన యునిసెఫ్ సాయానికి ముందుకొచ్చింది. అక్కడి ప్రజల కోసం ఇప్పటికే నగదు సాయం కార్యక్రమం మొదలు పెట్టామని వెల్లడించింది. ఇతర దేశాలూ సాయం చేయాలని కోరుతోంది. చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయొద్దని మత పెద్దలకు చెబుతోంది. -సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మూడుముళ్లకు బాల్యం బందీ
సాక్షి, బెంగళూరు: ఆడుతూ పాడుతూ సాగిపోవాల్సిన బాల్యం మూడుముళ్లకు బందీ అవుతోంది. దేశంలో కర్ణాటకలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 2020లో 185 బాల్య వివాహాలు రాష్ట్రంలో నమోదయ్యాయి. 2019లో 111 వివాహాలతో తో పోల్చితే ఇది 66 శాతం అధికం. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా సమాచారం ప్రకారం ఇందులో కర్ణాటక బాల్య వివాహాల్లో టాప్‌లో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో అస్సాం –138 వివాహాలు, పశ్చిమ బెంగాల్– 98, తమిళనాడు –77 ఉన్నాయి. 2 వేల పెళ్లిళ్ల అడ్డగింత కర్ణాటక రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం 2020, ఫిబ్రవరి–నవంబర్ల మధ్య కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో 2,074 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. బళ్లారి జిల్లాలో ఎక్కు వగా 218 వివాహాలను నిలువరించారు. ఆ తర్వాత మైసూరు 177, బెళగావి 131, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గల్లో చెరో 107, ఇక బెంగళూరులో 20కి పైగా పెళ్లిళ్లను నిలిపారు. రాష్ట్రంలో 108 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. -
బాల్య వివాహాలపై నిఘా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బాల్య వివాహాలకు చెల్లుచీటి రాసేలా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే పక్కా కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా స్థాయి పిల్లల సంరక్షణ అధికారుల సమన్వయంతో ఇప్పటికే రంగంలోకి దిగింది. బాల్య వివాహాలపై అంగన్వాడీ కార్యకర్తల నుంచి సమాచారం సేకరించి జిల్లా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు వేస్తోంది. బాల్య వివాహాలకు ఎవరైనా ప్రయత్నిస్తే ఆ సమాచారాన్ని స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు అందించేలా ప్రజల్లో అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా పిల్లల సంరక్షణ టోల్ ఫ్రీ నంబర్ 1098, మహిళా సంరక్షణ టోల్ ఫ్రీ నంబర్ 181తోపాటు స్థానిక పోలీసులు, జిల్లా కేంద్రాల్లోని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. బాల్య వివాహాలతో దుష్పరిణామాలెన్నో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బాల్య వివాహాల్లో 40 శాతం మన దేశంలోనే జరుగుతున్నట్టు గుర్తించారు. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మత, కులపరమైన కట్టుబాట్ల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో వివాహం చేయటం వల్ల వారిలో మానసిక పరిపక్వత లోపించటం, ఆరోగ్యపరమైన సమస్యలకు దారి తీస్తోంది. దేశంలో 15 నుంచి 19 ఏళ్లలోపు బాలికలు ఏటా దాదాపు 70 వేల మంది ప్రసవ సమయంలో మరణిస్తున్నట్టు అంచనా. మైనర్ బాలికలకు తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో పిల్లలు పుడుతున్నారు. వారికి పుట్టే శిశువులు మరణిస్తున్న ఘటనలూ నమోదవుతున్నాయి. ఏడాదిలో 1,235 బాల్య వివాహాలకు అడ్డుకట్ట రాష్ట్రంలో గడచిన ఏడాది కాలంలో 1,235 బాల్య వివాహాలను అధికారులు నిరోధించారు. బాల్య వివాహాలపై జిల్లాల వారీగా వచ్చిన సమాచారం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన అధికారులు వాటిని అడ్డుకుని తల్లిదండ్రులు, పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు బాల్య వివాహాలు చేసే వారిపైన, వాటిని ప్రోత్సహించే వారిపైన బాల్య వివాహా నిషేధ చట్టం–2006 ప్రకారం చర్యలు తప్పవు. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. గతేడాది కోవిడ్ లాక్డౌన్ సమయంలోనే 165 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. ఇకపై బాల్య వివాహాలు చేస్తున్నట్టు సమాచారం వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తాం. అప్పటికీ మాట వినకపోతే కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, తల్లిదండ్రులతో విభేదించే బాలికలను పునరావాస కేంద్రాల్లో ఉంచి చదువు, ఉపాధి కల్పన ఏర్పాట్లు చేస్తాం. – కృతికా శుక్లా, డైరెక్టర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ -
ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 29.3 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు (బాల్య వివాహాలు) అయిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండకముందే 32.9 శాతం మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు అవుతుండగా, పట్టణ ప్రాంతాల్లోనూ 21.7 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు అవుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గతంలో కంటే ఈ తరహా పెళ్లిళ్ల శాతం కొంత మేర తగ్గినట్లు సర్వే పేర్కొంది. గతంలో 18 ఏళ్లలోపు అమ్మాయిల పెళ్లిళ్లు 33 శాతం ఉండగా, ఇప్పుడు 29.3 శాతంగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సమయంలో రాష్ట్రంలో 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సుగల పెళ్లి చేసుకున్న మహిళలు అప్పటికే తల్లి కావడం కానీ, గర్భంతో ఉండటం గానీ గుర్తించారు. వీరి శాతం పట్టణాల్లో 9.3 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 14.1గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 18 ఏళ్లకన్నా ముందుగానే 37.3 శాతం మంది అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సర్వే తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 22.1 శాతం ఈ తరహా పెళ్లిళ్లు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 41.6 శాతం, బీహార్‌లో 40.8 శాతం 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు అయినట్లు సర్వే పేర్కొంది. -
పుత్తడి బొమ్మలకు పుస్తెల బంధం..
బడికెళ్లాల్సిన బాలికలు పెళ్లి పీటలెక్కుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన అమ్మాయిలు పుస్తెలతాడుతో అత్తారింటి బాట పడుతున్నారు. పట్టుమని 15 ఏళ్లు నిండకుండానే భార్యగా, తల్లిగా బాధ్యతలను మోస్తున్నారు. సంసార మధురిమలు తెలియకుండానే జీవితాన్ని మోస్తున్నారు. పేదరికం ఒక వైపు, ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసార సాగరంలోకి నెట్టేస్తున్నారు. ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. సాక్షి, నెల్లూరు: సాంకేతికత రోజు రోజుకూ పెరుగుతున్నా, ఆధునిక సమాజం వైపు అడుగులు వేస్తున్నా జిల్లాలో మాత్రం బాల్య వివాహాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో బాలికలను అత్తారింటికి పంపి, వారి బంగారు భవిష్యత్‌కు తల్లిదండ్రులే సంకెళ్లు వేస్తున్నారు. మరికొందరు ఆడ పిల్లలను బరువుగా భావించి వదిలించుకునే ఆలోచనతో పెళ్లిపీట లెక్కిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో మానసికంగా, శారీరకంగా బాలికలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా.. బాల్య వివాహాలు ఆగడం లేదు. ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంలో బందీ చేస్తున్నారు. ఎక్కువగా గిరిజన, మత్స్యకార కుటుంబాల్లో ఆడ పిల్లలను ఇంటి వద్ద ఉంచలేక 18 ఏళ్ల లోపే వివాహాలు జరిపిస్తున్నారు. పిల్లలు చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో మరి కొందరు ఇలా చేస్తున్నారు. అడ్డుకట్టకు మార్గాలు గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో సూపర్వైజర్, సీడీపీఓ, మండల స్థాయిలో తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్యవివాహాలు అడ్డుకునే అధికారం ఉంది. ఎవరైనా 1098 ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు. ఇప్పటికే సమగ్ర బాలల పరిరక్షణ పథకం కింద ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశాల్లో అంగన్వాడీ కార్యకర్తల మండల మహిళా సమాఖ్య, సంరక్షణ అధికారుల సమన్వయంతో 18 ఏళ్లు నిండుకుండానే పెళ్లిళ్లు చేయకూడదనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ తప్పని సరి బాల్యవివాహాల నిరోధానికి అధికారులు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. జిల్లాలోని అన్ని, రెవెన్యూ డివిజనల్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సీడీపీఓలు వివాహ రిజిస్ట్రేషన్ చట్టం -2002 అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని జీఓ జారీ చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో మహిళ సంరక్షణ కార్యదర్శి ద్వారా తప్పక వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్ని ఆదేశాలిచ్చారు. పెళ్లికి ముందే వరుడు, వధువు, ఇద్దరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, నివాస ధ్రువీకరణ పత్రాలు, వయస్సు నిర్ధారణకు ఆధార్ , రెండు పాస్‌ఫొటో సైజు ఫొటోలు, వివాహ పత్రికలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. ఇకపై జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించేందుకు కఠినంగా చర్యలు చేపడుతాం. – రోజ్‌మాండ్, ఐసీడీఎస్ పీడీ -
కరోనా వేళ జోరుగా బాల్య వివాహాలు
సరదాగా సాగిపోవాల్సిన బాల్యం మూడు ముళ్లతో బంధీ అవుతోంది.ఆటపాటలతో స్నేహితుల మధ్య కేరింతలు కొట్టాల్సిన చిన్నారులు పెళ్లి పీటలెక్కుతున్నారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పలు రకాల పథకాలను ప్రవేశపెట్టడంతో గణనీయంగా తగ్గిన బాల్యవివాహాలు మళ్లీ ఊపందుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం బాల్య వివాహాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది. వీటిని ఎప్పటికప్పుడూ ఐసీడీఎస్, చైల్డ్ ప్రొటక్షన్ అధికారులు అడ్డుకొని తల్లిదండ్రులకు, పిల్లలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. సాక్షి,మెదక్: జిల్లాలో 2020లో అధికారిక లెక్కల ప్రకారం 42 బాల్యవివాహాలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రొటక్షన్ ద్వారా అధికారులు అడ్డుకోగా, రెండు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. 2021లో కేవలం మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ 1098 చైల్డ్ లైన్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి తదితర ప్రాంతాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా.. కరోనా ప్రభావంతో పాఠశాలలు, కళాశాలలను మూసివేయడంతో బాలికలు ఇంటివద్దనే ఉంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆడపిల్లలను భారంగా భావిస్తూ బాల్య వివాహాలు జరిపిస్తున్నాయి. ఆర్థిక స్థోమత, మంచి సంబంధం, ఆడపిల్లల సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలు, ప్రేమ వ్యవహారం వల్ల పరువు పోతుందనే తదితర కారణాలతో మైనర్లకు తల్లిదండ్రులు గట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. బాల్య వివాహాలతో అనర్థాలు.. ► చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను మోయడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవాల్సి వస్తుంది. ►పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో భార్యాభర్తల మధ్య చిన్నపాటి విషయాలకే మనస్పర్థలు వస్తాయి. దీంతో కుటుంబ కలహాలు ఏర్పడి విడిపోయేందుకు దారి తీస్తాయి. ►చిన్నతనంలో గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో సమస్యలు ఎదురవడంతో పాటు తల్లీబిడ్డలకు ప్రాణహాని ఉంటుంది. అధికారులకు ఫిర్యాదు చేయాలి ►ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, సర్పంచ్, మండల స్థాయిలో తహసీల్దార్, ఐసీడీఎస్ సూపర్వైజర్, ఎంపీడీఓ, సీడీపీఓ, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులతో పాటు పోలీసులు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వొచ్చు. అలాగే 1098, 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. బాల్య వివాహాలు నేరం.. ►బాల్య వివాహాలు చేయడం చట్టప్రకారం నేరం. అమ్మాయిల వయస్సు 18, అబ్బాయిల వయస్సు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం బాల్యవివాహాలు జరిపిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వివాహం జరిపిన పెళ్లి పెద్ద నుంచి పురోహితుడు, పెళ్లికి హాజరైన వారిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. -
Child Marriages: 43 పెళ్లిళ్లకు అడ్డుకట్ట
సాక్షి, యాదాద్రి: చట్టవిరుద్ధమని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లలకు పసిప్రాయంలోనే పెళ్లి చేస్తున్నారు. మంచి సంబంధం వచ్చిందని, కట్నకానుకలు లేకుండా దొరికడాని, మేనరికం ఓ కారణమైతే నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లంటే అభద్రతాభావం, సెల్‌ఫోన్ చాటింగ్‌లు, టీనేజ్‌లో ప్రేమ మరో కారణంగా తెలుస్తోంది. అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా నిత్యం ఏదో ఒక మూలన బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో గడిచిన నాలుగేళ్లలో అధికారులు 100 బాల్యవివాహాలను అడ్డుకోగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 43 ఉన్నాయి. కరోనా వేళ కొన్నిచోట్ల గుట్టచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరిగిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇలా.. జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్ (ఎం), భువనగిరి, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. హైసూ్కల్ స్థాయిలోనే బాలికలకు పెళ్లి చేస్తున్నారు. లో కం తెలియని వయసులో పెళ్లి చేయడం ద్వారా భార్యభర్త మధ్య వివాదాలు తలెత్తి విడాకులకు దారి తీస్తు న్నాయి. దీంతో మైనార్టీ వయస్సులోనే పెళ్లి పెటా కులవుతున్నాయి. బాల్య వివాహాలను అరికట్టేందుకు పోలీ స్, రెవెన్యూ, ఐసీడీఎస్, విద్యాశాఖ, బాలల పరిరక్షణ విభాగం, టీషీం అధికారులు విశేష కృషి చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాల్సి ఉంది. బాల్య వివాహాలకు కారణం బాల్య వివాహాలు జరుగడం వెనక పలుకారణాలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో కోవిడ్ మరణాల భయం, మంచి సంబంధాల నెపం, మేనరికం, లైంగికదాడులు, ప్రేమ వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత కారణంగా చిన్నతనంలోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. గతంలో గిరిజన తండాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరగగా ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. అధికారుల అనుమతితో! కోవిడ్ సమయంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వద్ద తీసుకుంటున్న అనుమతితోనే వివాహం చేస్తున్నారు. ఎవరైనా బాల్య వివాహం ఎలా చేస్తున్నారంటే అనుమతిపత్రం చూపుతున్నారు. శుభలేఖ ఆధా రంగా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అయితే ఆధార్‌కార్డు, పాఠశాల బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆధారం చూపితే చాల వివాహాలను అడ్డుకోవచ్చు. అయితే అన్ని అనుమతులతోనే వివాహాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బాల్య వివాహాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన చైల్డ్ మారేజ్ ప్రొటక్షన్ కమిటీలు నామమాత్రంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో జరగుతున్న బాల్య వివాహాల గురించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆయాలకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచారం చెబితే ఎక్కడ గొడవలు జరుగుతాయోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. అందుబాటులో హెల్ప్‌లైన్ నంబర్లు బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులో ఉంచింది. ఎలాంటి బిల్లు లేకుండా ఫోన్ చేస్తే అధికారులు వచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకొని కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తారు. చైల్డ్‌లైన్ నంబర్ 1098, పోలీస్ 100, సఖి సెంటర్ 181కు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు స్పందిస్తారు. వివాహం జరిపిన కుటుంబ పెద్దలు, పెళ్లి పెద్ద, పురోహితుడు, వివాహానికి హాజరైన బంధువులు, స్నేహితులు, వివాహానికి సహకరిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేస్తారు. బాల్య వివాహాలు నేరం 10 తరగతి పూర్తికా గానే వివాహం చేస్తున్న ఘట నలు వెలుగు చూస్తున్నాయి. బాల్యవివాహాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే అక్కడికి వెళ్లి అడ్డుకుంటున్నాం. సఖి కేంద్రానికి రప్పించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. బాల్య వివాహాలు, అక్రమ దత్తతపై సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచాం. బాల్య వివాహాలు చేస్తే చర్యరీత్యా నేరం. - బండారు జయశ్రీ, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సమాచారం ఇవ్వాలి ఎక్కడైనా బాల్యవివాహా లు చేస్తున్నా, అందుకు ప్రయత్నం జరుగుతున్నా వెంటనే సమాచారం ఇవ్వాలి. షీటీం, బాలల పరిరక్షణ విభాగం వెంటనే అక్కడికి చేరుకుంటుంది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం చిన్నతనంలో పెళ్లి చేయడం నేరం. కోవిడ్ సమయంలో బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులను జూమ్ మీటింగ్ ద్వారా కోరాం. జిల్లాలో బాల్య వివాహాలపై నిరంతర నిఘా కొనసాగుతోంది. - పి.సైదులు, డీసీపీఓ -
సంసార సాగరంలో మైనర్లు!
సాక్షి, అమరావతి: దేశం పారిశ్రామికంగా, సాంకేతికంగా పురోగమిస్తున్నా వివాహానికి సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆడపిల్లకు 18 ఏళ్ల వయసుకు ముందే తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తున్నారు. మన రాష్ట్రంలో 29.3 శాతం మంది అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరుగుతున్నాయి. వీరిలో 12.6 శాతం మంది అమ్మాయిలు 15 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపే తల్లులు అవుతుండటం గమనార్హం. అలాగే అబ్బాయిలకు 21 ఏళ్లు నిండాకే వివాహం చేయాల్సి ఉండగా ఆ వయసు నిండక ముందే 14.5 శాతం మందికి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ మేరకు తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-5)-2019-20 పలు రాష్ట్రాల సూచీలను వెల్లడించింది. చిన్నారుల జననాల నమోదు, నవజాత శిశువుల మరణాల నియంత్రణ వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించినట్టు సర్వే పేర్కొంది. అలాగే సొంతంగా బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు కలిగిన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. ఊబకాయంతో ఉన్న మహిళల శాతం 36.3 శాతం.. ఏపీలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 934 మంది అమ్మాయిలు ఉన్నారు. గత సర్వేలో ఇది 914గా ఉంది. ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు 96.5 శాతానికి చేరాయి. గతంలో ఇది 91.5గా ఉంది. సిజేరియన్ ప్రసవాల సంఖ్య గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. ప్రతి వంద సిజేరియన్ ప్రసవాల్లో 63 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో, 26.6 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. 36.3 శాతం మంది మహిళలు, 31.1 శాతం మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసు కంటే తక్కువ బరువుతో 29.6 శాతం మంది ఉన్నారు. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్లలోపు మహిళల్లో 58.8 శాతం మంది, పురుషుల్లో 16.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర నిల్వలు (షుగర్ 160 కంటే) ఎక్కువగా ఉన్న మహిళలు 10.4 శాతం, పురుషులు 11.4 శాతం మంది ఉన్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతూ మందులు వాడుతున్నవారిలో 25.3 శాతం మంది మహిళలు, 29 శాతం మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రంలో సొంతంగా బ్యాంకు ఖాతాలు కలిగి, తమ లావాదేవీలను తామే నిర్వహించుకుంటున్న మహిళలు 81.8 శాతం మంది ఉన్నారు. గతంలో ఇది 66.3 శాతం మాత్రమే. గతంలో మొబైల్ వాడుతున్న మహిళలు 36.2 శాతం కాగా, ఇప్పుడా సంఖ్య 48.9 శాతానికి పెరిగింది. 21 శాతం మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారు. వివిధ కేటగిరీల్లో ఇలా.. కేటగిరీ 2019-20 సర్వే ప్రకారం 2014-15 ప్రకారం.. నవజాత శిశువుల మృతి 19.9 23.6 ఏడాదిలోపు శిశువుల మృతి 30.3 34.9 తొలి గంటలో తల్లిపాలు ఇస్తున్నవారు 52.0 40.0 ప్రసవానికి ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నవారు 50.4 38.3 హెపటైటిస్-బి వ్యాక్సిన్ వేయించుకుంటున్నవారు 85.3 68.8 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌కు వస్తున్నవారు 94.2 91.6 ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నవారు 4.3 8.4 చిన్నారుల జననాల నమోదు 92.2 82.7 -
పెళ్లంటే పిల్లలాట కాదు
అవును. పెళ్లంటే ఆట కాదు. అల్లరి కాదు. చదువు కాదు. స్వేచ్ఛ కాదు, స్వతంత్రం కాదు. మోయవలసిన బాధ్యత. ఇంటిని, పిల్లల్ని, ఇంట్లో పెద్దల్ని మోయడానికి భుజ బలం కావాలి. మనోబలం ఉండాలి. చిన్నప్పుడే పెళ్లి చేయడం అంటే.. కాళ్లకు తాళ్లేసి కట్టేయడమే! పెళ్లంటే పిల్లలాట కాదని.. యశోద చెబుతోంది ఇందుకే. ఆమె ఓ గ్రామీణ యువతి. ఇప్పుడామె.. ఐక్యరాజ్య సమితి వాలంటీర్! ఇల్లిల్లూ కాదు, ఊరూరూ తిరిగి చెబుతోంది యశోద.. చిన్నప్పుడే పిల్లకు పెళ్లిళ్లు చేసేయొద్దని. చెప్పడం ఎవరైనా చెబుతారు. ప్రధాని చెప్పడం లేదా? రాష్ట్రపతి చెప్పడం లేదా. కానీ యశోద.. చెప్పడంతో పాటు ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతుంటే వెళ్లి ఆ పెళ్లిని ఆపేస్తోంది! పీలగా, ఎముకల్లో బలం లేనట్లుగా ఉంటుంది ఈ 21 ఏళ్ల అమ్మాయి. ఈమె వెళ్లి ‘ఆపండి’ అని గర్జిస్తే ఎవరు వింటారు? ‘పో పోవమ్మా..’ అంటారు. ‘భజంత్రీలూ మీరు కానివ్వండయ్యా’ అంటారు. అసలు సొంత ఇంట్లోని వాళ్లే యశోదకు సపోర్టుగా రాలేదు. ‘నిన్న మొన్న పుట్టినదానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’ అని చెప్పేశారు. ఇది జరిగింది ఆమెకు 18 ఏళ్ల వయసప్పుడు. యశోద వాళ్ల ఊరు దుమెర్పానీ. ఊరూ అదే, గ్రామ పంచాయితీ అదే. ఒడిశాలోని నౌపడ జిల్లాలో ఉంటుంది. దుమెర్పానీకి దగ్గరలో హల్దీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎవరో చిన్న పిల్లకు, చిన్న పిల్లాడికీ పెళ్లి చేస్తున్నారని తెలిసి రయ్యిన అక్కడికి వెళ్లింది. ఒక్కటే వెళ్లలేదు. అప్పటికే తను రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది. ‘సేవ్ ద చిల్డ్రన్’ అనేదొకటి. ‘ఆశా’అనే సంస్థ మరొకటి. వాళ్లు వెనకుంటే, యశోద ముందుకు వెళ్లి.. ‘పిల్లలకు పెళ్లి చేయకండి’ అంది! కోపంగా చూశారు పెళ్లి చేస్తున్నవారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా గ్రామస్థులను చైతన్యపరుస్తున్న యశోద వింతగా చూశారు పెళ్లికొచ్చినవాళ్లు. ‘ఈ అమ్మాయి ఎవరో కనుక్కోండి’ అని పెద్దవాళ్లు అన్నారు. ‘తెలిసినమ్మాయే. పక్క గ్రామం’ అన్నారు.. యశోద ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుండటం తెలిసినవాళ్లు. అప్పటికి పెళ్లి ఆగిపోయింది. అంతా వెళ్లిపోయాక చుట్టుపక్కల ఊళ్లలో నిరసన మొదలైంది. ‘‘ఊరి పిల్ల అయుండీ, ఊరి ఆచారాలు తెలియవా! ఎవర్నో వెంటేసుకుని వచ్చి మరీ పెళ్లిని ఆపేయిస్తుందా?’’ అని ఊళ్లో అరుగుల మీద ‘చుట్ట ముక్క’ చర్చలు మొదలయ్యాయి. ఊళ్లో చెరువుల దగ్గర నీళ్ల బిందెలు బుగ్గలు నొక్కుకున్నాయి. విషయం యశోద ఇంట్లో తెలిసింది. ‘నిన్న మొన్న పుట్టిన దానివి, ఊళ్లో ఆచారాలను మార్చేస్తానని బయల్దేరుతున్నావా? కాళ్లిరగ్గొడతాం. ఇంట్లో కూర్చో’’ అని అప్పుడే వాళ్లు అన్నది. ∙∙ కూర్చోలేదు యశోద. సామాజిక కార్యకర్తలతో కలిసి తిరిగింది. ఈ మూడేళ్లలో చుట్టుపక్కల ఊళ్లల్లో జరగబోయిన బాల్యవివాహాలను ఓ ఎనభై వరకు ఆపగలిగింది! ఊరికే లీడర్ అయింది. యువలీడర్. ఆడపిల్లలకు యశోదక్కను చూస్తే యమా క్రేజ్. ఇంట్లో వాళ్లు తమను బడి మాన్పించబోతున్నా, పెళ్లి సంబంధాలు వెతుకుతున్నా, తమను బయటికి వెళ్లి ఆడుకోనివ్వకపోయినా.. ‘యశోదక్కకు చెబుతాం’ అని పైపైకి లేస్తున్నారు. వాళ్లను చెయ్యిపట్టి ఆపడం తల్లిదండ్రుల పనౌతోంది. యశోదక్కకు చెబితే యశోదక్క టీమ్ ఏమీ కర్రలు పట్టుకుని వచ్చేయదు. కూడలి లో గ్రామస్తులకు ఒక మీటింగ్ పెట్టి, చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఆడపిల్లల జీవితం ఎలా అయిపోతోందో కళ్లకు కట్టేలా చెప్పి వెళ్తుంది. యశోద మీటింగ్‌లలో ఆడవాళ్లే కాదు, మగవాళ్లూ కూర్చొని ఆమె చెప్పేది ఆసక్తిగా వింటున్నారిప్పుడు. ఆ మాటలు వారిలో ఆలోచన కలిగించేలా ఉంటాయి. ఆ ఊళ్లన్నీ దుర్భిక్ష ప్రాంతాలు. అందుకే ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసి, మెట్టినూళ్లలో వారికి మంచి పరిస్థితుల్ని కల్పించాలని తల్లిదండ్రులు త్వరపడుతుంటారు. పని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వాళ్లే వారిలో ఎక్కువమంది. దక్షణాది రాష్ట్రాలకొచ్చి ఇటుక బట్టీల్లో, ఫ్యాక్టరీలలో కూలీలుగా చేరి పిల్ల పెళ్లి కోసం నాలుగు రాళ్లు కూడబెట్టుకుని తిరిగి ఊరు చేరుతుంటారు. ఏడాదికి మూడు సీజన్ల వలసలు వాళ్లవి. యశోదకు ఇదంతా తెలియంది కాదు. పిల్ల పెళ్లి కోసం కష్టపడుతున్నవాళ్లు, పిల్లకు తగిన వయసు రాకుండానే పెళ్లి అనే కష్టాన్ని తెచ్చి పెట్టడం ఎందుకు అని ఊళ్లోవాళ్లకు నచ్చ చెబుతుంది. ‘సేవ్ ది చిల్డ్రన్’, ‘ఆశా’ సంస్థలు కలిసి ‘మ్యారేజ్: నో చైల్డ్స్ ప్లే’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశాయి. అందులో వాలంటీర్ యశోద. బాల్య వివాహాలను నివారించడంతో పాటు యశోద ఇప్పుడు బాలబాలికల సమానత్వం, రుతుక్రమ పరిశుభ్రత, గృహ హింస, బాలికల విద్య, నచ్చిన రంగాన్ని ఎంచుకునే విధంగా బాలికల్ని, యువతుల్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులను ఒప్పించడం వంటి బాధ్యతలను స్వచ్ఛందంగా స్వీకరించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ వాలంటీర్‌ను ప్రత్యేకంగా అభినందించడంతో ఇప్పుడు యశోద ఎంత చెబితే అంత అయింది. ఏమైనా మంచే కదా తను చెబుతోంది అనే దగ్గరికి ఊరూ వాడా వచ్చేశారు. ఐక్యరాజ్య సమితి ఏటా ‘వి–అవార్డు’ ఇస్తుంటుంది. ఈ అవార్డును ఈ ఏడాది యశోదకు ఇస్తున్నట్లుగా శనివారం ప్రకటించింది. వి అంటే వాలంటీర్. ది బెస్ట్ వాలంటీర్‌గా యశోద ఐరాస గుర్తింపు పొందింది. ∙∙ 2017లో మొదటి బాల్యవివాహాన్ని ఆపేశాక, యశోద ఆ చుట్టుపక్కల గ్రామాలలో నెలకు రెండుసార్లు కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహించింది. ఆ పని మొదట తన ఊరితో ప్రారంభించింది. రెండో ఏడాదికల్లా మిగతా ఊళ్లలోనూ అవేర్నెస్ కార్యక్రమాల్ని మొదలుపెట్టింది. ఆమె లక్ష్యం 10–19 ఏళ్ల వయసులోని పిల్లలు. వాళ్లను సమీకరించి మంచి చెడులు వివరించేది. సొంత ఊరు దుమెర్పానీలోనే 15 బాల్య వివాహాలను నివారించగలిగింది యశోద. అప్పటికే ఆ అమ్మాయి పేరు జిల్లా మొత్తం వ్యాపించింది. నౌపడలోని నేషనల్ కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది యశోద. నౌపడలో ఇప్పుడున్న చైల్డ్ హెల్ప్‌లైన్ సదుపాయం ఆమె తీసుకున్న చొరవ ఫలితమే. ‘ఆడపిల్లల్తో నేనొక సామాజిక చైతన్య సైన్యాన్ని తయారు చేస్తాను’ అంటోంది యశోద ఇప్పుడు. చేస్తోంది కూడా తను. అంత పట్టుదల గల అమ్మాయి. ఐక్యరాజ్యసమితి ‘వి–అవార్డు’ విజేత యశోదా పాండే -
చిన్నారి పెళ్లికూతురు
సాక్షి, హైదరాబాద్ : పుత్తడిబొమ్మకు పుట్టెడు కష్టాలు. చిన్నారి మెడలో పుస్తెలతాడు. బడి, కాలేజీ బాట పట్టాల్సిన ఆమె పెళ్లికూతురై పెళ్లిపందిరికి వెళ్తోంది. మేడ్చల్ సమీపంలోని కండ్లకోయకు చెందిన ఆ అమ్మాయి పేరు దివ్య (పేరు మార్చాం). నిండా పదిహేనేళ్లు కూడా లేవు. చదువంటే ఆమెకు ప్రాణం. అయితే, కోవిడ్ ఆమె పాలిట శాపంగా మారింది. 6 నెలలుగా స్కూల్స్ లేక ఇంటిపట్టునే ఉంటున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ‘భారంగా’ కనిపించింది. కోవిడ్ నేపథ్యంలో ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని ఆందోళన కొద్దీ బంధువుల అబ్బాయితో పెళ్లికి ఏర్పాట్లు పూర్తిచేశారు. అధికారులు, షీటీమ్స్ చొరవతో ఆ చిన్నారి పెళ్లి కూతురుకు విముక్తి లభించింది. అయితే ఈ బాల్యవివాహాలు ఒక్క కండ్లకోయలో మాత్రమే కాదు, నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ ఎంతోమంది చిన్నారి పెళ్లికూతుళ్లుగా మారుతున్నారు. పోలీసులు, అధికారులకు సమాచారం తెలిసిన చోట మాత్రమే బాల్యవివాహాలు ఆగిపోతున్నాయి. చాలాచోట్ల గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతూనే ఉన్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఐదు బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి ఒకరు తెలిపారు. ‘కట్టుదిట్టమైన లాక్డౌన్, కోవిడ్ ఉధృతంగా కొనసాగుతున్న ఏప్రిల్‌లోనే హైదరాబాద్ చుట్టుపక్కల 67 పెళ్లిళ్లను అడ్డుకోగలిగాం’ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పద్మావతి పేర్కొన్నారు. కరోనా సోకితే తమ కుటుంబం ఏమైపోతుందనే బాధ చాలామందిని వెంటాడుతోంది. బతికుండగానే బాధ్యతలను తీర్చుకోవాలని తమ కూతుళ్ల పెళ్లిళ్లు చేస్తున్నామని కొందరు వివరించారు. కోవిడ్ సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రత్యేకించి శివార్లలో సుమారు 250కి పైగా పెళ్లిళ్లను అధికారులు నిలిపేశారు. -
బాల వికాసానికి 'మూలస్థానం'
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి చెంత బాల వికాసం పరవళ్లు తొక్కుతోంది. అధికారుల అంకితభావం అక్కడి బాలకార్మిక వ్యవస్థకు అడ్డుకట్ట వేసింది. బాల్య వివాహాలను తరిమికొట్టింది. అంగన్వాడీల లాలన చిన్నారుల్లో రక్తహీనతను రూపుమాపి బాలల ఆరోగ్యానికి బాటలు వేసింది. శిశు మరణాలను దూరం చేసింది. గ్రామస్తుల సహకారం సమస్యాత్మక పల్లెకు సరికొత్త రూపు తెచ్చింది. అదే ఆ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. బాలల సంరక్షణ విషయంలో సమర్థవంతమైన పనితీరు కనబర్చినందుకు గాను 2020 సంవత్సరానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘బాలమిత్ర (చైల్డ్ ఫ్రెండ్లీ) పంచాయతీ’ పురస్కారాన్ని దక్కించుకుంది. గౌతమీ గోదావరి చెంతన చెన్నై–కలకత్తా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆ గ్రామమే తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని మూలస్థానం పంచాయతీ. సమస్యల చీకట్లను జయించి.. ► నిత్యం తగాదాలతో మూలస్థానం తల్లడిల్లేది. మరోవైపు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహారం లోపం తదితర సమస్యలు గ్రామాన్ని పీడిస్తుండేవి. ► గ్రామంలోని అంగనవాడీ కేంద్రాల పరిధిలో ఆరేళ్లలోపు చిన్నారులు 434 మంది, గర్భిణులు 51 మంది, బాలింతలు 44 మంది ఉన్నారు. ► గ్రామస్తులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి రుగ్మతలను రూపుమాపేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతోపాటు మండలస్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా పనిచేశారు. ► అధికారులు, గ్రామంలోని ఉద్యోగుల కృషికి గ్రామస్తుల సహకారం తోడవటంతో ఏడాదిలోనే మంచి ఫలితాలను సాధించారు. ఆరోగ్య లోపాలను అధిగమించి.. ► మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచీ ప్రసవమయ్యే వరకూ అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలుఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శిశు మరణాలకు అడ్డుకట్ట వేయగలిగారు. ► చిన్నారులకు సకాలంలో టీకాలు వేయడం, వయసుకు అనుగుణంగా వారి ఎత్తు, బరువును నమోదు చేసి లోపాలున్న వారికి పౌష్టికాహారం అందించారు ► తీవ్ర పోషకాహార లోపం, అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైద్య సిబ్బందితో కలిసి రక్తహీనత గల చిన్నారులను గుర్తించి రెట్టింపు పోషకాహారాన్ని అందించారు. ► ఏడాది క్రితం వరకు గ్రామంలో శిశు మరణాలు 3 శాతం వరకు ఉండగా.. అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ వహించి గత ఏడాదిలో ఒక్క శిశు, బాలింత మరణం కూడా సంభవించకుండా చర్యలు చేపట్టారు. ► గతంలో గ్రామంలోని 10 శాతం మంది చిన్నారులు రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బాల్య వివాహాలకు.. బాల కార్మిక వ్యవస్థకు చెక్ ► దగ్గరి బంధువులనో.. మంచి సంబంధమనో 10వ తరగతిలోపు బాలికలకు పెళ్లిళ్లు చేసేవారు. ► వీటిని అరికట్టే దిశగా అంగన్వాడీ కార్యకర్తలు 2015లో చర్యలు చేపట్టారు. వారికి పంచాయతీ, మండల అధికారుల సహకారం తోడవటంతో బెదిరింపులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించారు. ► గ్రామంలోని 80 వరకు ఇటుకల బట్టీలు, కూరగాయల సాగు విస్తరించి ఉన్నాయి. 2018 నాటికి 52 బాల కార్మికులు ఉండగా వారిని గుర్తించి బడిబాట పట్టించారు. అవార్డు రావడం గర్వంగా ఉంది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ‘చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ’ అవార్డు మా గ్రామానికి దక్కడం చాలా గర్వంగా ఉంది. యు.రేణుక, పంచాయతీ కార్యదర్శి నిరంతర పర్యవేక్షణ పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల వరకు వారికి నిర్ణీత సమయంలో వైద్య సేవలందించి శిశు మరణాలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించాం. ఎం.సుమలత, పీహెచ్సీ అధికారి, చొప్పెల్ల పౌష్టికాహార లోపం లేకుండా పర్యవేక్షణ చిన్నారుల్లో పౌష్టికాహార లోపం లేకుండా చర్యలు తీసుకున్నాం. నిరంతరం ఆటపాటలు నేర్పించి చురుకుదనం పెరిగేందుకు కృషి చేశాం. ఎల్.విజయ కుమారి, అంగన్వాడీ కార్యకర్త -
‘ఏదో ఓ రోజు అత్తారింటికి పంపించాల్సిందే కదా’
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ బాలికల పాలిట శాపంగా మారింది. స్కూళ్లు, కాలేజీలు లేకపోవడంతో ఇళ్లల్లోనే ఉంటున్న పిల్లలు తల్లిదండ్రుల కళ్లకు గుదిబండలుగా కనిపించారు. దీంతో ఆ భారాన్ని దించుకొనేందుకు కొందరు తల్లిదండ్రులు వారికి పెళ్లిళ్లు చేశారు. నిండా 15 ఏళ్లు కూడా నిండని ఎందరో చిన్నారులు లాక్డౌన్ సమయంలో పెళ్లి కూతుళ్లయ్యారు. వారం రోజుల క్రితం నగర శివార్లలోని జవహర్‌నగర్‌లో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికకు 30 ఏళ్ల యువకుడితో వివాహం జరిపిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. లాక్డౌన్ కొనసాగిన ఏప్రిల్, మే నెలల్లోనే బాలల సంక్షేమ కమిటీ అధికారులు సుమారు 86 బాల్య వివాహాలను అడ్డుకోవడం విశేషం. అయితే ఆయా నెలల్లో అధికారుల దృష్టికి వెళ్లకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కనీసం 240 కి పైగా బాల్యవివాహాలు జరిగినట్లు అంచనా. (నలుమూలల్లో మూడు కొత్త వ్యాక్సిన్లు) కొన్ని చోట్ల పెళ్లిళ్లయిన అనంతరం అందుకు బాధ్యులైన అమ్మాయి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. ఈ పెళ్లిళ్లలో ఎక్కువ శాతం దగ్గరి బంధువులు, బాగా తెలిసిన వాళ్లు, మేనరికపు సంబంధాల్లోనే బాల్యవివాహాలు జరగడం గమనార్హం. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా తక్కువ మంది బంధువుల మధ్య పెళ్లిళ్లు జరిపించినట్లు రంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పద్మావతి ‘సాక్షి’ తో చెప్పారు. ‘కొన్ని చోట్ల కాలక్షేపం కోసం చెప్పుకొనే కబుర్లలో కూడా అమ్మాయిల పెళ్లిళ్ల ప్రస్తావనే ప్రధానాంశమైంది. అలాంటి కబుర్లలోంచే పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యాయి.’ అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు.‘హాయిగా చదువుకోవలసిన ఎంతోమంది పిల్లలు ఈ లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లతో బంధీలయ్యారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. (మాస్క్ ఉన్నా 4 నిమిషాల్లోపైతేనే..) ఎంతకాలం ఈ అనిశ్చితి..... కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ పిల్లల జీవితాల్లో పెద్ద సంక్షోభాన్ని తెచ్చి పెట్టింది. ఉదయాన్నే రెడీ అయిపోయి ఠంచన్‌గా స్కూల్ లేదా కాలేజీకి వెళ్లాల్సిన వారు 24 గంటలు ఇంటికే పరిమితం కావడంతో కుంగుబాటుకు లోనయ్యారు. స్కూల్ వాతావరణంలో సహజంగా జరగాల్సి మానసిక వికాసానికి భిన్నంగా ఇంటి వాతావరణం గృహ నిర్బంధంగా మారింది. ఒకవైపు పిల్లల్లో ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే పేద, మధ్యతరగతి కుటుంబాల్లో కాస్తా ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు ప్రశ్నార్ధకంగా మారారు. స్కూళ్లు, కాలేజీలు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితి కూడా ఇందుకు దోహదం చేసింది. మరోవైపు లాక్డౌన్ కాలంలో ‘టైంపాస్’ కోసం బంధువులు, స్నేహితులతో చెప్పుకొనే పిచ్చాపాటి కబుర్లలోంచే పెళ్లి సంబంధాలు ఖరారు కావడంతో ‘10 చదివినా, 12 చదివినా ఏదో ఒక రోజు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదా.పైగా సంబంధం కలిసి వచ్చినప్పుడు కాదనుకోవడం దేనికి..’ అనే భావనతో చాలామంది తల్లిదండ్రులు తమ మైనర్ కూతుళ్లకు వివాహాలు జరిపించారు. మరోవైపు నగర శివార్లలోని కాలనీలు, గ్రామాల్లో ఎక్కువ శాతం ఇలాంటి పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. (ప్రతి ఏటా 4.6 లక్షల మరణాలు) భద్రత లేకపోవడం కూడా కారణమే... పిల్లలకు భద్రత లేకపోవడం వల్ల కూడా తల్లిద్రండులు వీలైనంత తొందరగా వారికి పెళ్లిళ్లు చేయాలని భావిస్తున్నారు. ‘‘ఇటీవల కాలంలో అమ్మాయిలపైన కొనసాగుతున్న అకృత్యాలు, వేధింపులతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బాల్య వివాహాలకు ఇది మరో ప్రధాన కారణం’’ అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య తెలిపారు. నిరక్షరాస్యత, పేదరికం కూడా బాల్య వివాహాలకు కారణమేనన్నారు. లాక్డౌన్ కాలంలో ఎక్కువ శాతం పెళ్లిళ్లు తక్కువ మంది బంధువుల మధ్య గుట్టుచప్పుడు కాకుండా జరిగాయి. ఇలాంటి అనేక పెళ్లిళ్లలో పిల్లల భద్రత తల్లిదండ్రులకు ఒక సవాల్‌గా మారడం కూడా ప్రధాన కారణమని మానసిక నిపుణులు, బాలల హక్కుల సంఘాలు విశ్లేషిస్తున్నాయి. -
ఎందుకో అంత తొందర?
సాక్షి, విజయనగరం: కొద్ది రోజుల క్రితం గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహం చేయడానికి ఇరువురి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఓ ఆజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ ట్రోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సంస్థ సభ్యులు, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు. తాజాగా బొండపల్లి మండలంలోని ఓ గ్రామాని కి చెందిన 17 ఏళ్ల బాలికకు నెల్లిమర్ల మండలానికి చెందిన వ్యక్తితో ఈ నెల 13వ తేదీన వివాహం చేయాలని ఇరువురి తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఓ ఆజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్‌కు సోమవారం తెలియజేయడంతో చైల్డ్‌లైన్, డీసీపీయూ, ఐసీడీఎస్, సచివాలయ సిబ్బంది గ్రామానికి వెళ్లి వివాహాన్ని నిలుపుదల చేశారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా... లాక్డౌన్ అమల్లో ఉన్నా... బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. లాక్‌డౌన్‌ను కొందరు అవకాశంగా మలచుకుని గుట్టుగా పెళ్లిళ్లు చేసేయాలని కొందరు తలస్తున్నారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఓ వైపు తెలియజేస్తున్నా... చాలామంది పట్టించుకోవడం లేదు. అక్కడక్కడ కొందరు సమాచారం అందిస్తే అధికారులు వాటిని అడ్డుకోగలుగుతున్నారు. ఇంకా సమాచారం అందని పెళ్ళిళ్లు ఎన్ని జరిగిపోతున్నాయో తెలియడంలేదు. ఆడపిల్లలు కాస్త ఏపుగా పెరిగితే చాలు వెంటనే పెళ్లి చేసేయాలన్న ఆలోచనకు తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే... మంచి సంబంధం మళ్లీ అలాంటిది దొరుకుతుందో లేదోనని కొందరు... ఓ బాధ్యత తీరిపోతుంది కదా అని మరికొందరు... ఇలా తలోరకంగా సమాధానాలు చెబుతున్నారు. కానీ జరగబోయే నష్టా న్ని మాత్రం వారు అంచనా వేయడం లేదు. ఇలాంటివాటిని అడ్డుకునేందుకే ప్రభుత్వం ఛైల్డ్లైన్టోల్ఫ్రీ నంబర్ 1098ని ప్రవేశపెట్టింది. ఈ నంబర్‌కు ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వారిని చట్టానికి దొరకకుండా చేస్తారు. బాల్య వివాహం చేస్తే శిక్ష బాల్య వివాహానికి ప్రోత్సహించేవారు... చేసేవారు శిక్షార్హులే. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. బాల్యవివాహం చేసిన తర్వాత ఆ మైనర్‌ను ఆక్రమ రవాణా చేయడం, దాచేయడానిక ప్రయత్నించడం చట్టరీత్యానేరం. బాల్య వివాహాలను నిషేధిస్తూన్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఆ ఉత్తర్వులు ఉల్లంఘించి వివాహం హిందూ సంప్రదాయంగా జరిపినా ఆ వివాహం చెల్లదు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాలను అపొచ్చు. ఈ చట్టం కింద నేరస్తులకు బెయిల్‌లేని శిక్ష విధిస్తారు. సమాచారం వస్తే అడ్డుకుంటాం బాల్యవివాహాలు జరుగుతున్న సమాచా రం వచ్చిన వెంటనే నిలుపుదల చేయాలని సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశాం. అంగన్వాడీ కార్యకర్తలకు బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పాం. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం వచ్చి న వెంటనే సిబ్బంది వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. – ఎం.రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్ -
ఎగ ‘తాళి’
సాక్షి, బెంగళూరు : హైస్కూల్లో చదువుకోవాల్సిన వయసులో పెళ్లిపీటలు ఎక్కడం, పీయూసీకి వెళ్లాల్సిన సమయంలో చంకలో బిడ్డతో చాకిరీ చేయడం.. ఇదీ రాష్ట్రంలో దుస్థితి. బాల్య వివాహాలకు రాష్ట్రం కేరాఫ్‌గా మారింది. చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన ఎంతోమంది బాలలు సంసార చక్రబంధంలో నలిగిపోతుండడం విషాదం. ఆడుతూ పాడుతూ అందంగా సాగిపోవాల్సిన బాల్యం వివాహ భారంతో తల్లడిల్లుతోంది. వివాహాలు బాల్యానికి గుదిబండగా మారుతున్నాయి. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా బాల్య వివాహాలు రాష్ట్రంలో ఎక్కడా తగ్గడం లేదు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమల్లోకి వచ్చినప్పటికీ ఫలితం ఉండడం లేదు. మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, పేదరికం తదితరాల కారణంగా రాష్ట్రంలో ఆ జాఢ్యం నాటుకుపోయింది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో మొత్తం 453 బాల్య వివాహాలు జరిగాయి. నిర్వాహకులపై 276 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. కాగా, 5,860 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. అయితే వెలుగులోకి రాకుండా జరిగిపోతున్న బాల్య వివాహాలు వేలల్లో ఉంటాయని అంచనా. కల్యాణ కర్ణాటకలోనే అధికం.. కల్యాణ (ఉత్తర) కర్ణాటక ప్రాంతంలోని కొప్పళ జిల్లాలో 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో 259 బాల్య వివాహాలను మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు, చైల్డ్‌లైన్, వివిధ ఎన్జీవోలు అడ్డుకున్నాయి. ఇక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశికళా జొల్లే సొంత జిల్లా బెళగావిలో ఐదేళ్లలో 26 బాల్య వివాహాలు జరగ్గా, 576 వివాహాలను అడ్డుకోగలిగారు. మిగిలిన జిల్లాల కంటే ఈ బెళగావి జిల్లాలోనే అత్యధిక బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. ఇక కల్యాణ కర్ణాటక ప్రాంతంలో బాల్య వివాహాల్లో కొప్పళ, కలబురిగి తదుపరి స్థానాల్లో ఉన్నాయి. అగ్రస్థానంలో మండ్య ►2015 నుంచి 2019 డిసెంబర్ వరకు మొత్తం 5,860 బాల్య వివాహాలను వివిధ సంస్థలు, పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. ►ఇందులో 1,799 బాల్య వివాహాలు ఉత్తర కర్ణాటకలోనివి కావడం విశేషం. ►ఐదేళ్లలో మండ్య జిల్లా ఒక్కదాంట్లోనే ఏకంగా 74 వివాహాలు జరిగి మొదటి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా ఉడుపిలో నాలుగు, దక్షిణ కన్నడ జిల్లా 3 చొప్పున జరిగాయి. ►కొప్పళ జిల్లాలో 2012–13లో జరిగిన బాల్య వివాహం కేసులో వరునికి రెండేళ్లు జైలు, రూ. 30 వేలు జరిమానా విధించారు. ఒక వధువు తల్లి, పిన్నమ్మకి రెండేళ్ల జైలు, చెరో రూ. 10 వేల జరిమానా విధించారు. చిక్కబళ్లాపుర జిల్లాలో 2015లో జరిగిన బాల్య వివాహం కేసులో తల్లిందండ్రులకు రూ. 45 వేలు జరిమానా విధించారు. అయితే శిక్షలు పడుతున్న కేసులు ఒకటీ అరా మాత్రమే. కమిటీలతో నిలిచిపోతాయా? మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ వివిధ రీతుల్లో అవగాహన కల్పిస్తున్నా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాల్య వివాహాలను నివారించేందుకు గ్రామ, తాలూకా, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలను ప్రభుత్వం వేసింది. గ్రామ పంచాయతీల్లో రెండు నెలలకొకసారి, తాలూకా, జిల్లాస్థాయిలో మూడునెలల కొకసారి, రాష్ట్రస్థాయిలో ప్రతి ఆరు నెలలకొకసారి సదరు కమిటీ సమావేశాలు నిర్వహించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. -
దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు
సాక్షి, విజయవాడ: దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు రానున్నాయని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీ మహిళా కమిషన్, మహితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని హెల్ప్‌లైన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. బాల్య వివాహాలు జరగడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు.. కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా తీసుకువచ్చిన దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు వస్తాయని, దానికి దిశ చట్టమే సంకేతమంటూ హర్షం వ్యక్తం చేశారు. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దిశ ఘటనలో.. నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని అందరూ స్వాగతించారన్నారు. రాష్ట్రంలో మహిళలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుని కొత్త చట్టాన్ని తీసుకురావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. మహిళల రక్షణ, భద్రతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన దిశ చట్టం.. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులను అరికట్టి, మంచి పరిణామాలు తీసుకు రావడానికి కొంతమేర కారణం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు మహిళలకు రక్షణ కల్పించడంలోవిఫలమవుతున్నాయని, చట్టాలను సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. దిశ చట్టాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తామని.. దిశ చట్టం ద్వారా హత్య, లైంగిక దాడి, గృహ హింస వంటి హేయమైన నేరాలు కొద్దిమేర తగ్గుతాయన్నారు. ఈ చట్టం ద్వారా నేరాలకు పాల్పడే వారికి భయం కలిగి.. నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. చిత్తూరు జిల్లా వర్షిత కేసులో సైతం ఛార్జ్ షీట్ వేసి కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని.. వారిని కించపరిచేలా పోస్టులు పెట్టి సైబర్ నేరాలకు పాల్పడే వారికి అడ్డుకునేందుకు దిశ చట్టం దోహదపడుతుందని ఆకాంక్షించారు. ప్రముఖులను సామాజిక మాధ్యమాల్లో లక్ష్యంగా చేసుకుని మానసిక వేదనకు గురిచేసే సైబర్ నిందితులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని తొలగించి, ఐపీ అడ్రస్ కనుక్కునే వరకూ తీవ్ర కాలయాపన జరిగేదని.. త్వరలో అలాంటి నేరాలకు తెరపడనుందని అన్నారు. దిశ చట్టంతో ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడంతో మహిళా సంబంధింత కేసులు పెండింగ్‌లో ఉండవని ఆనందం వ్యక్తం చేశారు. 'సీఎం జగన్ మహిళలకు అండగా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి' అని మగవారు అనుకునే పరిస్థితి రాకపోదని అన్నారు. -
తగ్గిన బాల్య వివాహాలు
ఐక్యరాజ్యసమితి: పాతిక సంవత్సరాలుగా భారత్‌లో బాల్య వివాహాల సంఖ్య తగ్గిందని ఐక్య రాజ్యసమితి పేర్కొంది. భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో బాల్య వివాహాల సంఖ్య తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా బాల్యవివాహాల శాతం భారీగా తగ్గిందని తెలిపింది. ఈ మేరకు ఐరాస చిన్నారుల వేదిక ‘యూనిసెఫ్’ ఒక అధ్యయనాన్ని ప్రకటించింది. గత 3 దశాబ్దాలుగా చిన్నారుల జీవితాలు ఎంతో మెరుగైనా పేద చిన్నారులకు ఆ ప్రయోజనాలు అందేందుకు కృషి చేయాల్సి ఉందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టడానికి ఆర్థికాభివృద్ధి, మహిళల సాధికారత ప్రధాన కారణాలన్నారు. భారత్‌ను ఉదహరిస్తూ.. చట్టపర సంస్కరణలు, బాలికా సాధికారతా పథకాలు బాల్య వివాహాలు తగ్గడానికి కారణమవుతాయన్నారు. భారత్‌లో చట్టపరమైన వయస్సు వచ్చే వరకు బాలికలకు వివాహం చేయకుంటే ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేలా పథకాలున్నాయని అధ్యయనం గుర్తు చేసింది. గత పాతికేళ్లలో దక్షిణ ఆసియాలో బాల్య వివాహాలు 59 నుంచి 30 శాతానికి తగ్గినట్టు వెల్లడించింది. -
పసిప్రాయం ఎగ‘తాళి’!
వారిలో ఆలోచన శక్తి, సమస్యలను అధిగమించే పరిస్థితి ఉండదు. దీంతో గృహహింస, లైంగిక వేధింపులు, సామాజికంగా విడిపోవడం వంటి పరిస్థితులకు గురవుతారు. త్వరగా వృద్ధాప్యం వచ్చి వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది. రక్తహీనత ఏర్పడుతుంది. కారణాలు పేదరికం, అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువగా ఉండడం. వారికి తక్కువ హోదా కల్పించడం, ఆర్థిక భారంగా భావించడం.. సాంఘికాచారాలు, సంప్రదాయాలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. దుష్పరిణామాలు బాల్య వివాహాలవల్ల చిన్న వయస్సులోనే బాలికలు గర్భం దాలిస్తే కాన్పు కష్టం కావటం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అధికంగా ఉంటాయి. సాక్షి, అమరావతి : వివాహ భారంతో పసిప్రాయం నలిగిపోతోంది. మూడుముళ్ల బంధం పేరుతో బాలికల మెడలో పడుతున్న తాళి వారి జీవితానికి గుదిబండగా మారుతోంది. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా మైనర్ వివాహాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలులోకి వచ్చినప్పటికీ పెళ్లీడు రాక ముందే జరుగుతున్న వివాహాలకు అడ్డుకట్ట పడట్లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఇటీవల చేసిన సర్వేలు సైతం దేశంలోను, రాష్ట్రంలోను జరుగుతున్న బాల్య వివాహాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనెసెఫ్) లెక్కల ప్రకారం.. 40 శాతం కంటే ఎక్కువ బాల్య వివాహాలతో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అలాగే, దేశంలో పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో 73 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 71, రాజస్థాన్‌లో 68, బీహార్‌లో 67, ఉత్తరప్రదేశ్‌లో 64 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రానికి వస్తే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో బాలికలే ఎక్కువ.. బాల్య వివాహాల్లో ఎక్కువగా బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–2016 లెక్కల ప్రకారం దేశంలోని బాల్య వివాహాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న 45 శాతం పెళ్లిళ్లలో 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు జరగడం గమనార్హం. ఇది గ్రామాల్లో 35.5 శాతం, పట్టణాల్లో 26.3 శాతంగా ఉంది. పురుషుల విషయానికొస్తే.. 21 ఏళ్లు నిండని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 13.2 శాతం, పట్టణాల్లో 8.8 శాతం మందికి వివాహాలు జరుగుతున్నాయి. అలాగే, ఏపీకి సంబంధించి చైల్డ్‌లైన్–1098కు 2017–18 కాలంలో వచ్చిన ఫిర్యాదుల్లో 1,700.. 2018–19లో 1,900 బాల్య వివాహాలు జరిగాయి. అయితే, ఇలా వెలుగు చూడనివి మరెన్నో ఉన్నాయి. బాల్య వివాహాలకు బీజం ఇలా.. ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, బ్రిటీషు వాళ్లు భారతదేశాన్ని పాలించే కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బల వంతంగా వివాహమాడటం, బలాత్కరించడం జరిగేది. వివాహితుల జోలికి రారనే ఉద్దేశ్యంతో తమ ఆడబిడ్డలను కాపాడుకునేందుకు భారతీ యులు తమ పిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్లు చేసే వారనే ప్రచారం ఉంది. రానురాను కుటుంబాల మధ్య సంబంధాలను పటిష్ఠ పరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో ఫలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాల వారు నిర్ణయించుకుని మొదట బొమ్మల పెళ్లిచేసి పెద్దయ్యాక వివాహం చేసేవారు. తాము చనిపోయే లోపు తమ వారసుల పెళ్లిళ్లు చూడాలనే వృద్ధుల కోరికను తీర్చడానికి కూడా పురుషుడి వయస్సు ఎక్కువైనా జరిపించే వారు. అనం తరం కాలంలో.. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. నిరోధించే చట్టాలు బ్రిటిష్ పాలకులు 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ తెచ్చారు. అనంతరం.. భారత ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్) 2007 జనవరి 10న ఆమోదం పొంది, 2007 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 21 ఏళ్ల లోపు మగపిల్లలు బాలల కిందకే వస్తారు. ఈ వయస్సులోపు వారికి పెళ్లి చేస్తే జిల్లా కలెక్టర్, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, మెట్రోపాలి టన్ మేజిస్ట్రేట్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, వీఆర్ఓ, వీఆర్ఏలకు ఫిర్యాదు చేయవచ్చు. వివాహ నమోదు చట్టంతో కూడా వీటికి చెక్ పెట్టవచ్చు. అలాగే, బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. పెళ్లికి హాజరవ డమూ నేరమే. వీరికి రెండేళ్ల వరకు కఠిన కారా గార శిక్ష.. రూ.లక్ష వరకు జరిమానా విధించ వచ్చు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదు. బాల్య వివాహం సామాజిక దురాచారం తగిన వయసు రాకుండానే పెళ్లి చేయడంవల్ల బాలికలు సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను కుంగదీసే ఈ వివాహాలు సమర్థనీయం కాదు. సామాజిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. – మణెమ్మ, సామాజిక కార్యకర్త నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలి బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలి. దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో గతం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బాల్య వివాహాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిని నిలుపుదల చేయిస్తున్నారు. కానీ, కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. – ఎన్. రామ్మోహన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి -
ఊరు దాటి బయటకు వెళ్లగలనా అనుకున్నా
సాక్షి, విశాఖపట్నం : ‘నాకు చిన్నతనంలో మాట్లాడడమే భయంగా ఉండేది. ఈ రోజు గొప్ప వ్యక్తుల మధ్య కూర్చున్నా. నా చిన్నప్పుడు మా ఊరు దాటి వెళ్లగలనా అనుకునేదాన్ని. కానీ దృఢ సంకల్పంతో అడుగులు వేశా. అనుకున్నది సాధించా. నేడు విమానాలపై ప్రయాణించే స్థాయికి ఎదిగా. చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన మలావత్ పూర్ణ. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలసి శనివారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా వుడా చిల్డ్రన్ థియేటర్లో శ్రీప్రకాష్ విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఆమెకు ఘన సత్కారం జరిగింది. మధ్యాహ్నం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన నాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. నాకు ఎంతో మంది సలహాలు, శిక్షణ ఇచ్చారు అని తన గతాన్ని పిల్లలకు వివరించారు. కష్టపడి పనిచేస్తే లక్ష్యం చేరుకోగలమని, విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాన్ని ఏర్పచుకోవాలని సూచించారు. విద్యార్థినులు బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని చెప్పారు. చిటపట చినుకులు పడుతున్నా గాని విద్యార్థులంతా పూర్ణ సందేశాన్ని శ్రద్ధగా విన్నారు. చంద్రపాలెం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ పోలీసు అధికారి టీఎస్ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నవోదయ విద్యాలయాల జాయింట్ కమిషనర్ ఏఎన్ రామచంద్ర, శ్రీ ప్రకాశ్ విద్యా సంస్థల చైర్మన్ చిట్టూరి వాసు ప్రకాష్, ప్రిజమ్ బుక్స్ పబ్లిషర్స్ రవీంద్ర, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రామయ్య, హెచ్ఎంలు ఎం.రాజబాబు, జయప్రద ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వుడా చిల్ట్రన్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్ డైరెక్టర్ వాసు ప్రకాష్ మాట్లాడుతూ 13 ఏళ్ల వయసులో పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకోవడం..సాధించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. పిల్లలంతా మలావత్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగాలని చెప్పారు. అవరోధాలు దాటితేనే విజయం : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెతుక్కుంటూ వెళ్లి వాటిని అందిపుచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. చంద్రంపాలెం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఈ పాఠశాల కార్పొరేట్ బడులకంటే కంటే బాగుందని..అన్ని సదుపాయాలతో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు అదృష్టవంతులని పేర్కొన్నారు. పిల్లలంతా మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదవాలని చెప్పారు. -
బాల్య వివాహాలు ఆగట్లేవ్..!
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాల్యవివాహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అధికారులు ఎంత ప్రచారం చేసినా బాల్య వివాహాలు మాత్రం తగ్గట్లేదు. 15 ఏళ్లు నిండకుండానే చిన్నారులు వివాహ బంధంతో మెట్టినింట కాలుపెట్టి కుటుంబ భారాన్ని భుజాన వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటివరకు రాష్ట్ర్ర వ్యాప్తంగా 3,342 బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. బాల్య వివాహాలకు ఆర్థిక అసమానతలే కారణమని భావించినా.. చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ స్కూల్లో చదివే 14 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులకు 42 ఏళ్ల వ్యక్తి డబ్బు ఆశ చూపించి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించిన అమ్మాయికి 30 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించడంతో సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. తెలంగాణలో పెరిగాయి.. గతేడాది జాతీయ నేర సమగ్ర సర్వే (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం తెలంగాణలో 18 శాతం బాల్య వివాహాలు పెరిగాయి. రాష్ట్రంలో 19 ఏళ్లలోపు తల్లులైన వారు 38 శాతం ఉన్నారు. ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకి కూడా 21 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న గ్రామాల్లోనూ బాల్య వివాహాలు జరుగుతుండ టం బాధాకరం. దేశవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల్లో 85 శాతం పేదరికం వల్లే జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. శారీరక సమస్యలు.. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల అమ్మాయిలకు ప్రసవం సమయంలోఇబ్బందులు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తుండటంతో భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. ప్రజల్లో బాల్య వివాహాలపై అవగాహన పెంచాల్సిన ఐసీడీఎస్ అధికారులకే దీనిపై అవగాహన లేకపోవడం కూడా మైనర్ వివాహాలకు కారణం అవుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు బలోపేతం చేసి మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడితే పరిస్థితులు కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. బాల్యవివాహాలు అరికట్టేందుకు 2012లో ప్రభుత్వం 1098 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ చేయగానే చైల్డ్ కనెక్టింగ్ సెంటర్ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. సీసీసీ నుంచి జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కు కాల్ ఫార్వర్డ్ అవడంతో అధికారులు రంగంలోకి దిగి సమస్య పరిష్కరిస్తారు. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు పేదరికాన్ని ఆసరా చేసుకుని, అందంగా ఉందని, పిల్లల కోసం, ఇతరత్రా కారణాలతో మైనర్ బాలికలను రెండో పెళ్లి చేసుకుంటున్న ఘటనలు తరచుగా కన్పిస్తున్నాయి. బాల్యవివాహాల నిరోధక చట్టం అమలు సరిగా జరగకపోవడం, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. ృ అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు -
మేధా వారధి
సాధారణంగా పైచదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు, చదువు మీదే దృష్టి పెడతారు. కాని మేధ మాత్రం చదువుతో పాటు సామాజిక సేవా చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి హెల్త్ సైకాలజీలో ఇంటిగ్రేటెడ్ ఎం.ఎస్సి. చేసిన మేధ, స్కాలర్షిప్ మీద పిట్స్బర్గ్ యూనివర్సిటీలో చేరి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ రెండో సంవత్సరం చదువుతున్నారు. అక్కడ చేరిన మూడు నెలలకే ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థలో శిక్షణ పొందారు. ఒక పక్కన చదువులో రాణిస్తూనే మరో పక్క సంఘ సేవపై శ్రద్ధ పెట్టారు. మేధ సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన మొదటి సంవత్సరమే వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ తరఫున పనిచేయడానికి కాంపస్ నుండి ఎన్నికయ్యారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం సాంఘిక సేవ. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన సమస్యల గురించి అవగాహన కల్పించి, వాటిని ఎదుర్కొనేలా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించడం. అంతే కాదు.. అట్టడుగు వర్గాలకు చెందిన టీనేజర్స్‌కి ఆర్థిక, సాంఘిక సమానత్వం సాధించుకునేలా ‘వాయిస్’ వలంటీర్లు అవగాహన కల్పిస్తారు. జీవనోపాధికి ఉపయోగపడే మార్గాలను ఎంచుకునేలా తీర్చిదిద్దుతారు. గ్రామాలలో, చిన్న చిన్న పట్టణాలలో ఉండే బాలికల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి, వారికి జీవన నైపుణ్యాలు నేర్పుతారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఋతు సమయంలో పాటించవలసిన పరిశుభ్రత, న్యాప్కిన్స్ వాడటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియచేస్తారు. ‘‘మొదట్లో వారికి నా మాటలు నచ్చలేదు. వారం రోజులు గడిచేసరికి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ తరవాత ఆచరించడం ప్రారంభించారు’’ అన్నారు మేధ.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఇంగ్లీషు అక్షరాలు రాయడం, చిన్న పదాలు చదవడం వచ్చు. ఎవరైనా ఇంగ్లీషు మాట్లాడితే అర్థం చేసుకోగలరు, కాని మాట్లాడాలంటే సిగ్గు పడతారు. అటువంటివారికి నెల రోజుల పాటు స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు నిర్వహించి, ధైర్యంగా మాట్లాడేలా తయారుచేశారు. వారి మీద జరిగే లైంగిక అత్యాచారాల గురించి అవగాహన కలిగించారు. వారికి ఉండే మౌలిక హక్కులను వారికి తెలియపరిచారు. స్వచ్ఛంద సంస్థల వారధివిద్య పరంగా వెనుకబడిన చోట బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతాయి. అటువంటి వివాహాలు జరగకుండా జాగ్రత్త పడాలని వారికి అర్థమయ్యేలా వివరించడం తన బాధ్యతగా భావించారు మేధ. అలాగేజీవితం లో ఎదుర య్యే ఆటంకాలను అధిగమించేలా పాఠ్య ప్రణాళికను రూపొందించి, ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే బాలికలకు బోధించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో శిబిరాలు నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలకు, స్వచ్ఛంద సంస్థలకు వారధిగా, ఇతర కౌన్సెలర్లకు మార్గదర్శిగా కూడా వ్యవహరించారు మేధ. ఎమ్.ఎస్సీ హెల్త్ సైకాలజీలో భాగంగా హైదరాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో ఎనిమిది నెలలు ఇంటర్న్‌షిప్ చేసిన సమయంలో రోగుల మానసికస్థితిని పూర్తిగా గమనించారు. – వైజయంతి పురాణపండ బాపూ అభిమాని అమెరికా పిట్స్బర్గ్ యూనివర్సిటీలో నేర్చుకున్న విషయాలను, భారత దేశంలోని గ్రామాల అభివృద్ధి, బాలల హక్కుల పరిరక్షణ, బాలికల అభ్యున్నతి, సంక్షేమం కోసం వినియోగించాలనేది మేధ ఆశయం. సితార్ వాదనం, శాస్త్రీయసంగీతం, శాస్త్రీయ నృత్యంలో కూడా మేధకు ప్రవేశం ఉన్నది. నాట్యం అంటే మక్కువ. కవిత్వం, సామాజిక అంశాల మీద వ్యాసాలు రాస్తారు. చక్కటి చిత్రకారిణి కూడా. ఆమె అభిమాన చిత్రకారులు జామిని రాయ్, బాపు, వాంగో. అంతర్జాతీయ పురస్కారం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో ఎమ్.ఎస్ సోషల్ వర్క్‌లో స్కాలర్ షిప్‌తో సీటు వచ్చిన మూడు నెలలకే యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం నుండి అంతర్జాతీయ ప్రతినిధిగా ఎంపికయ్యారు. తర్వాత ఆరు నెలలకు ఐరిస్ మేరియాన్ యంగ్ అనే ప్రముఖ రాజకీయశాస్త్రవేత్త, అంతర్జాతీయ సమస్యల అధ్యయనకర్త పేర నెలకొల్పిన ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. పట్టభద్రులలో ఒకరికి, ఇంకా పట్టభద్రులు కాని గ్రాడ్యుయేట్ విద్యార్థులలో ఒకరికి, అధ్యాపకులలో ఒకరికి ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. బాలల హక్కుల సంస్థలో విద్యాబోధనకై తను ప్రవేశపెట్టిన సృజనాత్మక బోధన పరికరాలకు, నేతృత్వ స్ఫూర్తికి మేధ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. -
మూడు'ముళ్ల' బాల్యం
సాక్షి, మెదక్: ప్రభుత్వం, బాలల పరిరక్షణ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏమి తెలియని పసి ప్రాయంలోనే మూడుముళ్ల బంధం వారిని ఛిన్నాభిన్నం చేస్తోంది. ఏటేటా బాల్యవివాహాల సంఖ్య తగ్గుతున్నా.. పూర్తిస్థాయిలో అరికట్టలేకపోవడం గమనార్హం. చైతన్యం కొరవడడంతోపాటు ఆర్థిక స్థోమత లేకపోవడం, బాలికలు భారం అనే భావనతో గతంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం వీటితోపాటు ఇటీవల పుట్టకొచ్చిన కొత్త ‘ట్రెండ్’ తల్లిదండ్రులను బాల్యవివాహాలకు పురిగొల్పుతోంది. తెలిసీ తెలియని వయసులో ప్రేమ, అఫైర్లతో కటుంబం పరువు వీధిన పడుతుందనే కారణంతో ఇష్టం లేకున్నా బాల్య వివాహానికి సిద్ధపడినట్లు ఇటీవల వెలుగు చూసింది. అంతేకాదు.. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో చేసేది లేక పసి ప్రాయంలోనే మూడు ‘ముళ్లు’ వేయించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 20శాతం మేర బాల్య వివాహాలు.. పిల్లల్ని ఎక్కువగా చదివించే ఆర్థిక స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడం, పేదరికం, చిన్నారులపై లైంగిక వేధింపులు, అభద్రతా భావం, వివాహంం చేసేస్తే తమ బాధ్యత అయిపోతుందని తల్లిదండ్రులు భావిస్తుండడంతో తండాల్లో అధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, 2006 బాల్య వివాహ నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కొంత తగ్గు ముఖం పట్టాయి. సుమారు 20 శాతం మేర మార్పురాలేదు. జిల్లాల వారీగా ఇలా.. మెదక్ : జిల్లాలో అధికంగా నర్సాపూర్ డివిజన్లోని నర్సాపూర్, కౌడిపల్లి, చిలిప్‌చెడ్, శివ్వంపేటతోపాటు రామాయంపేట మండల పరిధిలో బాల్యవివాహ ఘటనలు అధికంగా ఉన్నాయి, నాలుగేళ్ల పరిధిలో సుమారు పది నుంచి 12 వరకు బాల్యవివాహాలు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. సంగారెడ్డి: బాలల పరిరక్షణ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా పరిధిలో కంది, పుల్కల్, పటాన్చెరు, నారాయణఖేడ్, నాగిల్గిద్ద మండలాల్లో బాల్యవివాహాలు అధికమని రికార్డులు చెబుతున్నాయి. సిద్దిపేట: జిలాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా మద్దూరు, హుస్నాబాద్ మండల పరిధిలో జరుగుతున్నట్లు బాలల పరిరక్షణ అధికారులు చెబుతున్నారు. పరువు కోసం.. నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట తండా.. 17 సంవత్సరాలు ఉన్న ఓ అమ్మాయి 22 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో మునిగింది. వారిద్దరి మధ్య అఫైర్ ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. పరువు పోతుందనే కారణంతో ఇష్టం లేకున్నా వారి తల్లిదండ్రులు పెళ్లికి సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న బాలల పరిరక్షణ అధికారులు, సిబ్బంది పెళ్లి రోజునే వివాహం నిలిపివేసి.. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువు మధ్యలో ఆపించి.. మెదక్ జిల్లా రామాయంపేట.. ఓ తండాలో 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. చుట్టాలింటికి వెళ్లినప్పుడు ఆ బాలికకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతడికి 22 ఏళ్లు ఉంటాయి. డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసిన అతడు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమించిన వ్యక్తితో ఇప్పుడే పెళ్లి చేయాల్సిందేనని అమ్మాయి పట్టుబట్టడంతో చేసేది లేక తల్లిదండ్రులు పెళ్లికి సిద్ధం చేశారు. అరగంటలో మూడు ముళ్ల ముహూర్తం ఉందనగా ఐసీపీఎస్ అధికారులు రంగంలోకి దిగి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పదిహేనేళ్లకే.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిప్‌చెడ్ మండలంలోని తోపయతండా.. 15 ఏళ్ల బాలికకు, 22 ఏళ్ల అబ్బాయితో వివాహం కుదిరింది. బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఆలస్యంగా అందింది. వారు వెళ్లేసరికి వివాహం కాగా.. ఆ అమ్మాయి, అబ్బాయికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దీనికి సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కృషి చేస్తున్నాం.. బాల్యవివాహాల నివారణకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఎక్కడైతే బాల్యవివాహం జరిగిందో.. అక్కడే కౌన్సెలింగ్ ఇస్తున్నాం. పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేస్తున్నారు. సదరు బాలిక చదువుకుంటున్న పక్షంలో కేజీబీవీలు, ఇతరత్రా గు రు కుల పాఠశాలల్లో ఆశ్రయం కల్పిస్తున్నాం.– కరుణశీల, మెదక్ జిల్లాబాలల పరిరక్షణ అధికారిణి ఈ తండా.. పిల్లల పెళ్లిళ్లకు అడ్డా చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ మండలం (మెదక్ జిల్లా)లోని టోప్యా తండా బాల్య వివాహాలకు అడ్డాగా మారింది. ఈ నెలలోనే ఓ బాలికకు తల్లితండ్రులు వివాహం చేయగా ఐసీడీఎస్ అధికారులు.. ఆ బాలికను ఐసీడీఎస్ కేంద్రానికి తరలించారు. మరో బాలికకు ఈ నెల 11 వివాహం తలపెట్టగా, అధికారులు అడ్డుకుని మైనార్టీ తీరేవరకు పెళ్లి చేయబోమని వారి తల్లితండ్రులతో హామీ పత్రం రాయించుకున్నారు. గతంలోనూ ఈ తండాలో పలు బాల్య వివాహాలు జరిగిన ఉదంతాలున్నాయి. మా తండాలో ఇది మామూలు విషయం కౌడిపల్లి మండలంలోని రాజిపేట జాజితండా పంచాయతీ జగ్యతండాకు చెందిన వ్యక్తికి ఆరుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడా పిల్లలు, ముగ్గురు మగపిల్లలు. రెండో కూతురు (16)మైనర్ బాలిక. గతేడాది పదవ తరగి చదివి ఇంటివద్ద ఉంటుంది. దీంతో బాలిక పెళ్లి చేయాలనుకున్నాడు. అనంతరం ధర్మాసాగర్గేట్తండాకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో పెళ్లి వాయిదా వేశారు. చిన్నప్పుడుచేస్తే మంచిగుండదని తెలియదు.. బాలికకు చిన్నతనంలో పెళ్ళిచేయవద్దని అంటే తనుకు తెలియదని చెప్పాడు. ఆరుగురు సంతానం కాగా అందులో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఎలాగు పెళ్లిల్లు చేయాల్సిందే కాబట్టి చేయాలన్న ఉద్ధేశంతో చిన్న పిల్లలైన చేస్తున్నాం. తండాలలో ఇలా చేయడంమాములు విషయమే అన్నాడు. తనది సాధారణ వ్యవసాయ కుంటుంబం. పెళ్లిల్లు చేస్తే బాధ్యత తీరుతుందని చేయాలనుకున్నా. 18 ఏళ్లు నిండితే బాగుంటుందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి డబ్బులు ఇస్తుందని చెప్పారు. కాబట్టి పెళ్లి ఆపివేశానని చెప్పాడు. -
పట్టని వివాహ చట్టం
గ్రామ పంచాయతీల్లో వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అటకెక్కింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాకే వివాహం చేయాలనే నిబంధన ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. చట్టంతో పాటు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా స్పందించడం లేదు. దీంతో ఇప్పటికీ గ్రామాల్లో బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. తనకల్లు: బాల్య వివాహాలను నిర్మూలించాలనే లక్ష్యంతో 2012వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. అన్ని మతాల వారికి చట్టం వర్తించేలా రూపొందించారు. అయితే నియోజకవర్గంలోని 82 పంచాయతీల్లో ఏ పంచాయితీలోనూ వివా హాల రిజిస్ట్రేషన్ అమలు కావడం లేదు. పట్టించుకోని అధికారులు వివాహాలు చేసుకొనే ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు గురించి సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటి వరకు కదిరి నియోజకవర్గంలో 30 నుంచి 40 శాతం వరకు బాల్య వివాహాలే జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్యేకించి గిరిజన తండాలు, పల్లెల్లో తల్లిదండ్రుల అవగాహన లోపం, ఆర్థిక సమస్యల కారణంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాల్యవివాహాలకు ఏదీ అడ్డుకట్ట? బాల్య వివాహాలు చేయరాదని, ఆడ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తరువాతే వివాహాలు చేయాలంటూ గ్రామాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. వివాహ నమోదు చట్టం, బాల్య వివాహాల గురించి స్త్రీ సంక్షేమ శాఖ, విద్యా శాఖ, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి తల్లిదండ్రులకు, విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అయితే ఈ సదస్సులు ఇప్పటి వరకు మండలంలోని ఏ పంచాయతీ లోనూ నిర్వహించిన దాఖలాలు లేవు. అవగాహన కల్పిస్తాం వివాహాల నమోదు కా ర్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేసేందుకు చర్యలు తీ సుకుంటాం. బాల్య వి వాహాల వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. కార్యదర్శులతో కలిసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తాం. – ఆదినారాయణ, ఈఓఆర్డీ, తనకల్లు అవగాహన కల్పించాలి వివాహాల నమోదు గురించి చాలా మందికి తెలియదు. ఈ ప్రక్రియ గురించి అధికారులు గ్రామాల్లో తల్లిదండ్రులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అవగాహన లేక కొందరు ప్రభుత్వ పథకాలను కూడా కోల్పోతున్నారు. – చిదానందరెడ్డి, గణాధివారిపల్లి అనర్థాలను గ్రామీణులకు వివరించాలి గిరిజనుల నిరక్షరాస్యతకు తోడు, ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దీంతో తండాలలో అత్యధికంగా జరిగేవి బాల్య వివాహాలే. అయినా అధికారులు బాల్య వివాహాం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం లేదు. అధికారులు తండాలలో వివాహ రిజిస్ట్రేషన్‌పై చైతన్యం తీసుకురావాలి. – రవీంద్రానాయక్, గిరిజన సంఘం నాయకుడు, జీఎన్ తండా -
నిర్భయ భారత్
సమాజం.. మహిళను తన బతుకు తనను బతకనివ్వదా?ముఖ్యంగా మగ సమాజం కళ్లు ఆడవాళ్ల మీదనే ఉంటాయా?ఆడవాళ్లు.. కాకపోతే...ఆ డేగ కళ్లు పసిపిల్లల మీద!!‘అమ్మాయిని భద్రంగా పెంచుకోవాలి... అబ్బాయిని బాధ్యతగా పెంచాలి’.అమ్మానాన్నలు. ఈ నినాదాన్ని ఒంటపట్టించుని ఉంటే...‘అత్యాచార రహిత భారత్’ అనే నినాదం పుట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. మరేమిటి పరిష్కారం? ఉద్యమించక తప్పదా?!అవును.. ఉద్యమించకపోతే... మహిళకు జీవితం ఉండని సమాజంలో..ఉద్యమించకపోతే...పిల్లలకు భవిష్యత్తు మిగలని సమాజంలో..ఊపిరిపోసుకున్న మరో ఉద్యమమే‘రేప్ ఫ్రీ ఇండియా’. అత్యాచార రహిత భారతదేశం, అత్యాచార ముక్త్ భారత్... భాష ఏదైనా నినాదం ఏదైనా భావం ఒక్కటే. అత్యాచారాలు లేని భారతదేశ నిర్మాణం జరగాలి. అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన చెందడం కాదు మేధావులు చేయాల్సింది. అత్యాచార బాధితులు న్యాయం కోసం పోరాటం చేయడానికి వెసులుబాటు కల్పించడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ఇంకా విస్తృతంగా చర్చించాలి, ఇంకొంత తీక్షణంగా చర్యలు తీసుకోవాలి. మెదడుకు పట్టిన మకిలిని వదిలించే స్వచ్ఛ భారత్ చేపట్టాలి. సత్యార్థి ఫౌండేషన్ చేపట్టిన స్వచ్ఛభారత ఉద్యమమే అత్యాచార రహిత భారత్. ఈ లక్ష్యాన్ని సాధించడానికి దేశంలోని ప్రతిరాష్ట్రం నుంచి భావసారూప్యం కలిగిన సామాజిక కార్యకర్తలు కలిసి ఉద్యమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గొంతు కలుపుతున్న వారిలో మమతా రఘువీర్ ఉన్నారు. ఆమె ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి బాల్య వివాహాలను అరికడుతున్నారు. ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన సత్యార్థి ఫౌండేషన్‌తో కలిసి అత్యాచార రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. పిల్లలు దేశ సంపద ‘‘పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాల్యం పువ్వులాంటిది. రెక్కలు రాలిపోకుండా అందంగా విచ్చుకుంటేనే వికాసం. అది పువ్వైనా, బాల్యమైనా. పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం తల్లిదండ్రులకు, ఆ పిల్లల భవిష్యత్తుకు మాత్రమే కాదు. అసలైన నష్టం దేశానిది. బాల్యాన్ని చిదిమేస్తే ఆ పీడన వాళ్లను వెంటాడుతూనే ఉంటుంది. పెద్దయిన తర్వాత కూడా వాళ్ల వ్యక్తిత్వం ఆరోగ్యకరంగా విచ్చుకోదు. వ్యక్తిత్వలోపం ఉన్న సమాజంతో దేశం అభివృద్ధి చెందదు. అందుకే పిల్లల్ని కాపాడుకోవడం అమ్మానాన్నల బాధ్యత మాత్రమే కాదు దేశం బాధ్యత కూడా’’ అన్నారు మమతా రఘువీర్. మనిషి మారాలి ‘‘మేము డీల్ చేసిన కేసులు కొన్ని హృదయవిదారకంగా ఉన్నాయి. ఓ కుటుంబం తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తోంది. అందరూ తిరుపతిలో రైలెక్కారు. ఎనిమిదేళ్ల పాప బాత్రూమ్కి వెళ్లాలని అడిగింది. పెద్దవాళ్లెవరూ తోడు వెళ్లకుండా పాపను పంపించారు. బాత్రూమ్లో పాప మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుండగుడు. పాప అరుపు ఎవరికీ వినిపించలేదు. ఎంతటి దారుణం అంటే.. పాప పేగులు బయటికొచ్చేశాయి. ఆ తర్వాత రెండేళ్ల వరకు కూడా ఆ పాపకు ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు ఇళ్ల మధ్యలోనే అబ్యూజ్‌కు గురయ్యాడు. అతడు తండ్రితోపాటు ఉదయాన్నే పాల ప్యాకెట్లు వేస్తుంటాడు. అపార్ట్మెంట్లో తండ్రి ఒక వరుసలో పాలు వేస్తూ కొడుకుని మరో వరుసలో వేయమని పంపించాడు. ఓ మధ్యవయస్కుడు ఆ కుర్రాడిని ఇంట్లోకి లాగి తలుపేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ కుర్రాడు ఏడాదిపాటు సెకండరీ ఇన్ఫెక్షన్తో బాధపడ్డాడు. ఇదంతా ఒక ఎత్తయితే అఘాయిత్యానికి గురైన బాధితులకు ఐడెంటిఫికేషన్ పెరేడ్ మరో నరకం. ఒక పాపకయితే మతి చలించినంత పనైంది. ‘ఆ అంకులే అలా చేసింది’ అనే ఒక్క మాట తప్ప మరో మాట మాట్లాడేది కాదు. ఆ బిడ్డను మామూలు స్థితికి తీసుకురావడం ఎలాగో తెలియక ఆ తల్లిదండ్రులు పడిన వేదనను వర్ణించడానికి మాటలుండవు. మరీ చిన్న పిల్లల్లో ఇలా ఉంటే.. టీనేజ్‌లో ఉన్న ఓ అమ్మాయి అబ్యూజ్‌కు గురైన తర్వాత తన దేహాన్ని తాను అసహ్యించుకుంటూ ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటివి తెలిసినప్పుడు సమాజం మారాలి... అని చాలా సింపుల్‌గా అనేస్తుంటారు. కానీ నిజానికి మారాల్సింది మనిషి. విచక్షణగల దేశాలు లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి పిల్లల్ని పావులుగా వాడుకోవాలనే ఆలోచన రావడమే పెద్ద మానసిక లోపం. యూరోపియన్ దేశాల్లో ఈ విషయంలో చాలా పరిణతి కనిపిస్తుంది. తమలో అలాంటి ఆలోచనలు కలుగుతుంటే అది మానసిక లోపమని గుర్తిస్తారు. వెంటనే కౌన్సెలింగ్‌కు వెళ్తారు. తమలో ఇటువంటి మానసికలోపం ఉన్నట్లు గుర్తించిన వాళ్లను స్వచ్ఛందంగా పేరు నమోదు చేసుకోవలసిందిగా పిలుపునిచ్చినప్పుడు ఏడాదికి 250 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప తమ ఆలోచనలను దాచిపెట్టుకుని పెద్దమనిషి ముసుగు వేసుకుని సమాజంలో గౌరవంగా చెలామణి అవుతూ, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండి, నిస్సహాయులు దొరకగానే రాక్షసత్వానికి పాల్పడడం వంటి అవాంఛిత ధోరణులు పాశ్చాత్య దేశాల్లో దాదాపుగా కనిపించవు. మహిళలు, పిల్లలు వస్తువులు కాదు, వాళ్లూ మనుషులే అనే సత్యాన్ని గ్రహించగలిగితే మనిషి తనంతట తానే సంస్కరణ చెందుతాడు. ఆ రకంగా సమాజాన్ని సెన్సిటైజ్ చేయడం కోసమే ‘రేప్ ఫ్రీ ఇండియా’ ఉద్యమం. ఈ ఉద్యమం గత నెలలో మొదలైంది. ఐదో తరగతిలో భార్య.. ఏడో తరగతిలో భర్త..! నేను సోషల్ యాక్టివిస్టుగా మారడానికి వేదిక వరంగల్‌లో నివసించడమే. రఘువీర్‌కి హన్మకొండ పోస్టింగ్ వచ్చింది. మేము అక్కడ ఉన్నప్పుడు మహిళా సమతా సొసైటీతో పనిచేశాను. నేను పెరిగిన వాతావరణానికి అక్కడి సామాజిక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవి. స్కూలు పిల్లల్లో భార్యాభర్తలు కనిపించేవారు. హెల్త్ అవేర్నెస్ పట్ల ఆడపిల్లలను చైతన్యవంతం చేయడానికి ఓ స్కూలుకి వెళ్లినప్పుడు ఐదో తరగతిలో ఉన్న అమ్మాయి మెడలో పుస్తెలు, కాళ్లకు మట్టెలు చూసి ఆశ్చర్యపోయాను. అదేమని అడిగితే తనకు పెళ్లయిందని భర్త అదే స్కూల్లో ఏడో తరగతిలో ఉన్నాడని చెప్పింది. మరికొందరమ్మాయిల విషయంలో అమ్మాయికి పదేళ్లుంటే భర్తకు పాతికేళ్లుంటాయి. అతడు ఎక్కడో ఉద్యోగమో, వ్యవసాయమో చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిని స్కూలుకి పంపించేది కూడా మెచ్యూర్ అయ్యే వరకే. ఆ తర్వాత అత్తగారింటికి పంపేస్తారు. ఒక అమ్మాయికైతే పెళ్లి పీటల మీద కూర్చోక పోతే, ఐస్‌క్రీమ్ ఇచ్చి కూర్చోబెట్టి పెళ్లి చేశారు. 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది. మనదేశంలోని సామాజిక పరిస్థితులను గమనించిన బ్రిటిష్ పాలకులు ఈ రుగ్మతను నివారించడానికి చట్టాన్ని తెచ్చారు. కానీ అలాంటి చట్టం ఒకటుందనే ఆలోచనే లేదక్కడ. టీచర్లను అడిగితే ‘ఇక్కడిది మామూలే’ అనేశారు. మనం చేయగలిగిందేమీ లేదనే నిస్పృహ వాళ్ల మాటల్లో! దేహారోగ్యం గురించి చైతన్యవంతం చేయడం కాదు మానసిక ఆరోగ్యం కోసం పని చేయాల్సింది చాలా ఉందనిపించింది. ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ స్థాపించి బాల్య వివాహాలను నివారించడానికి పని చేశాను. మూడు నెలలు ప్రచారం వరంగల్ జిల్లా అంతటా పర్యటించి సర్వే చేశాం. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న 82 గ్రామాలను గుర్తించి కళాజాతలతో ప్రచారం చేశాం. బాల్య వివాహాల నివారణ గురించి ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చి వాళ్ల చేతనే గ్రామసభల్లో మాట్లాడించాం. ఆ జిల్లాలో అప్పుడు నలభై పెళ్లిళ్లు ఆపగలిగాం. అయితే తదనంతర పరిణామాలు కొన్ని చూసిన తరవాత పీటల మీద పెళ్లిళ్లు ఆపడం వల్ల ఉపయోగం ఉండదని తెలిసింది. అప్పటికే డబ్బు ఖర్చయి ఉంటుంది. పెళ్లి కోసం అప్పు తెచ్చి ఉంటారు. పైగా పీటల మీద పెళ్లి ఆగిపోతే మళ్లీ పెళ్లయ్యేదెలా అనే ఆందోళన ఒకటి. దాంతో పెళ్లిని ఆ క్షణానికి ఆపేసి మేమటు వెళ్లగానే ఏ గుళ్లోనో రహస్యంగా మూడుముళ్లు వేయించేసే వాళ్లు. ఆ తర్వాత ఓ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుగా సమాచారం అందుకుని వెళ్లి, పెళ్లి కుదురుతున్న దశలోనే కౌన్సెలింగ్ ఇచ్చే వాళ్లం. ఖాతరు చేయకుండా పెళ్లి చేస్తే కేసవుతుందని కూడా హెచ్చరించేవాళ్లం. అలా ఓ అరవై పెళ్లిళ్ల వరకు ఆపేసి ఆ అమ్మాయిలను మళ్లీ చదువులకు పంపించగలిగాం. అయినప్పటికీ కొంతమంది పెళ్లి చేసేవాళ్లు. అలా జరిగిన పెళ్లిళ్ల విషయంలో 56 కేసులు వేశాం. ఒక్కో కేసులో ఆ పెళ్లి జరిపించిన పురోహితుడి నుంచి గ్రామ ప్రతినిధి వరకు దాదాపుగా పదిహేను మంది మీద కేసులు పెట్టాం. అయితే ఆ కేసుల్లో ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. కానీ బాల్య వివాహాలు చట్టవిరుద్ధం అని, కేసులు పడతాయనే భయం మొదలైంది. 2000 నుంచి ఇప్పటి వరకు మొత్తం పీటల మీద పెళ్లిళ్లు రెండు వేలు, మాటల దశలో ఉండగా ఆపినవి పదిహేను వేలు ఉంటాయి. పెళ్లి కుదుర్చుకుంటున్న ఇళ్లలో ముసలి వాళ్లలో చైతన్యం తీసుకురావడం మంచి ఫలితాలనిచ్చింది. వెయ్యి అబద్ధాలాడి అయినా ఒక పెళ్లి చేయాలంటారు, కానీ నేను ఇన్ని వేల పెళ్లిళ్లు ఆపానని చెప్పుకోవడం వినేవాళ్లకు నవ్వులాటగా అనిపిస్తుందేమో కానీ నాకు గర్వంగానే ఉంది. ఇప్పుడు మేము చేపట్టిన రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమనే నమ్మకం కూడా ఉంది’’ అన్నారు మమత.దూరదర్శన్ నుంచి ‘సప్తగిరి సబల’, వరంగల్ జిల్లా కలెక్టర్ నుంచి ‘ఉత్తమ కార్యకర్త’, యూఎస్ కాన్సులేట్ జనరల్ నుంచి ‘ఉమన్ ఆఫ్ ది హిస్టరీ మంత్’ పురస్కారాలను అందుకున్నారు మమతా రఘువీర్. యూరప్ దేశాల్లో సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసిన మమత ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ‘భరోసా’ కమిటీలో సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలో సభ్యురాలిగా కూడా సేవలందిస్తున్నారు. వాకా మంజులారెడ్డి ఫొటోలు : జి.అమర్ చట్టం కోసం ఎంపీల సంతకాలు మనదేశంలో జరుగుతున్న అత్యాచారాలు తక్కువేమీ కాదని, మరే దేశంలోనూ ఆ స్థాయిలో జరగడం లేదని గణాంకాలు చెప్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలు చూస్తే ఏడాదికి అటూఇటూగా పాతికవేల అఘాయిత్యాలు కనిపిస్తాయి. ఇవి నమోదైన కేసులు మాత్రమే. కేసులు పెట్టకుండా నోరు నొక్కిన సంఘటలను మరెన్నో ఉంటాయి. ఇలాంటి తరుణంలో ‘అత్యాచార ముక్త్ భారత్’ ఉద్యమం అవసరం ఎంతో ఉంది. అక్రమ రవాణా నిరోధక బిల్లు పార్లమెంట్లో పెండింగ్‌లో ఉంది. ఈ బిల్లు చట్టసభల ఆమోదం పొంది చట్టంగా రూపొందాలి. ఇండియన్ పీనల్ కోడ్, 1860, ద ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్ (ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ రీహాబిలిటేషన్) బిల్, 2018 ప్రకారం అక్రమ రవాణా నేరానికి పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఒక వ్యక్తిని అక్రమంగా రవాణా చేసిన నేరానికి ఏడు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. ఇద్దరు అంతకంటే ఎక్కువ మందిని రవాణా చేస్తే పదేళ్లు జైలు, జరిమానా. ఒక మైనర్ బాలికను అక్రమంగా తరలించినప్పుడు పదేళ్ల నుంచి జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మైనర్లను అక్రమంగా రవాణా చేసినప్పుడు జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తి ప్రజా ప్రతినిధి లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. ఇంతటి కీలకమైన బిల్లు చట్టంగా రూపొందితే మహిళలు, బాలికల పట్ల అఘాయిత్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఆ బిల్లు పాస్ కావలసి ఉంది. ఈ ఉద్యమ కార్యకర్తలు ‘రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమంలో మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం’ అని పార్లమెంటు సభ్యులందరి చేత సంతకాలు చేయిస్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల బరిలో దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థుల సంతకాల సేకరణ కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. న్యాయం కోసం ‘నీలా’ నేను పుట్టింది నల్గొండ, పెరిగింది హైదరాబాద్‌లో. నాన్న డిస్ట్రిక్ట్ జడ్జి, అమ్మ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో ప్రొఫెసర్. ఎమ్మెస్సీలో ఉన్నప్పుడు రఘువీర్‌తో పెళ్లయింది. ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. సివిల్స్ రాయాలనే నా కోరికకు పెళ్లి కారణంగా ఫుల్స్టాప్ పడలేదు. ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. కానీ పిల్లల కారణంగా పరీక్షలు రాయలేకపోయాను. పెళ్లి తర్వాత న్యాయశాస్త్రం, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లమో, ఎంబీఏ చేశాను. పిల్లలు పెద్దయిన తర్వాత నాకిష్టమైన సోషల్ వర్క్ మీద దృష్టి పెట్టాను. స్వచ్ఛంద సంస్థలలో పని చేశాను. తరుణి సంస్థను స్థాపించి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై లైంగిక వేధింపులు రూపు మాపడానికి పని చేస్తున్నాను. ‘నీలా’ (నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ యాక్టివిస్ట్) ద్వారా న్యాయసహాయం అందిస్తున్నాను. ఇప్పుడు సత్యార్థి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందనతో కలిసి రేప్ ఫ్రీ ఇండియా ఉద్యమాన్ని చేపట్టాను. -
కమలమ్మ అంటే హడల్..
సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చిందంటే చాలు. పిల్లలకు ఎంతో ఆటవిడుపు.. ఆహ్లాదం. స్కూల్ కోసం పరుగులు ఉండవు. పరీక్షల ఒత్తిళ్లు ఉండవు. ఇంటిల్లిపాదీ కలిసి టూర్లకు వెళ్లొచ్చు. రోజంతా సరదాగా ఆటా పాటలతో గడిపేయవచ్చు. ఇలా వేసవికాలం పిల్లలకు ఎన్నో మరిపోలేని జ్ఞాపకాలను కానుకలుగా ఇస్తూంటుంది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. కొంతమంది బాలికలకు వేసవి శాపంగా మారుతోంది. వారి భావి జీవితంపై చండ్రనిప్పులు కురిపిస్తోంది. బాల్య వివాహం రూపంలో బంధిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచో తొమ్మిదో తరగతికో, తొమ్మిది నుంచి పదికి వెళ్లే పిల్లల కలలను కల్లలు చేస్తోంది. పదోతరగతి పాసై, ఇంటర్, డిగ్రీలు పూర్తి చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకొనే ఎంతోమంది అమ్మాయిలకు వేసవి నిజంగా ఒక శాపంగానే మారుతోంది. ఈ వేసవిలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 11 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు.పిల్లల సంక్షేమ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, వివిధ సంస్థల అంచనాల మేరకు తమ దృష్టికి వచ్చిన వాటిలో ఏటా 250 నుంచి 300 వరకు బాల్య వివాహాలను నిలిపివేసి తిరిగి ఆ పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల దృష్టికి రాకుండా అంతకంటే రెట్టింపు సంఖ్యలోనే చిన్నారి పెళ్లి కూతుళ్లు బాల్యవివాహాల్లో బందీలవుతున్నారు. వేసవి మంటలు.. గత నెల మార్చి నెలలో నాచారానికి చెందిన ఓ విద్యార్థిని ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తోంది. కానీ ప్రమాదం ఏ క్షణంలో, ఎటు వైపు నుంచి పొంచి ఉందోననే భయం, ఆందోళన ఆమెను కొద్ది రోజులుగా వెంటాడుతూనే ఉంది. ఊహించినట్లుగానే కుటుంబసభ్యులు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. అప్పటికింకా పరీక్షలు పూర్తి కాలేదు. ముహూర్తం కూడా ఖరారైంది. ఒకే ఒక్క పరీక్ష మిగిలింది. ఆ రోజే ఆ అమ్మాయిని పెళ్లి పీటలపైకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. సరిగ్గా అదే సమయంలో సమాచారం అందుకున్న అధికారులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు బాల్య వివాహానికి బ్రేకులు వేశారు. అమ్మాయికి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశ్యంతో చాలామంది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అమ్మాయిలను బలిపీఠంపైకి ఎక్కిస్తున్నారు. ‘ఎనిమిదో తరగతి చదివే అమ్మాయికి పెళ్లి చేస్తారు. పైగా పెళ్లి కూతురుకు, పెళ్లి కొడుక్కు మధ్య కనీసం పదేళ్ల తేడా ఉంటుంది. అలాంటి అమ్మాయిలు చిన్న వయస్సులోనే పిల్లల్ని కంటూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నార’ని ఆందోళన వ్యక్తం చేసింది శంషాబాద్‌కు చెందిన కమలమ్మ. స్థానికంగా మహిళా సంఘాలు, పోలీసులతో కలిసి ఆమె ఇప్పటి వరకు 150 పెళ్లిళ్లను అడ్డుకోగలిగారు. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు, రాజేంద్రనగర్, ఆరాంఘర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ఎన్నో బాల్యవివాహాలను అడ్డుకున్నటట్లు ఆమె చెప్పారు. ఇటీవల రామంతాపూర్‌లో ఇలాంటి వివాహాన్నే అధికారులు అడ్డుకున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని తన అక్కకు పిల్లలు పుట్టడం లేదనే నెపంతో బావకు ఇచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నించారు. జిల్లెలగూడలోనూ తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి పెళ్లిని అధికారులు ఆపగలిగారు. చాలా చోట్ల కుటుంబాల్లో తమకు జరిగే అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం లేక అమ్మాయిలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాలల హక్కుల సంఘం వంటి సంస్థలను, పోలీసులను ఆశ్రయిస్తున్నారు. క్లాస్మేట్స్ సహాయంతో సమాచారాన్ని చేరవేస్తున్నారు. అలాంటి అవకాశం లేని పిల్లలు మాత్రం బాల్యవివాహంతో బందీలవుతున్నారు. కమలమ్మ అంటే హడల్.. శంషాబాద్‌కు చెందిన అరవై ఏళ్ల కమలమ్మ ఇప్పుడు ఇలాంటి బాల్యవివాహాలపైన కొరడా ఝళిపిస్తున్నారు. ఆమె పెద్దగా చదువుకోకపోయినా బాల్య వివాహాల వల్ల ఏ విధమైన అనర్థాలు జరుగుతాయో తెలిసిన ఆమె ఎక్కడైనా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే వెళ్లిపోతారు. వివరాలు తెలుసుకొంటారు. అక్కడిక్కడే అధికారులకు సమాచారం చేరవేస్తారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో ఒత్తిళ్లను సైతం ఎదుర్కొంటున్నారు. ‘ఆ పిల్లల తల్లిదండ్రులు నన్ను తిట్టుకోవచ్చు. కానీ చిన్న వయస్సులో పెళ్లి జరిగితే ఎలాంటి బాధలు ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించాను. ఎంతోమందిని చూశాను. చాలా మంది గర్భాశయ సంబంధమైన జబ్బులకు గురవుతున్నారు. చిన్నవయసులోనే కుటుంబ భారం మోయలేక ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు. రక్తహీనత కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా చిన్న వయస్సులో జరిగే పెళ్లి తర్వాత ఆ పిల్లల జీవితంలో మిగిలేది చీకటే కానీ వెలుగు మాత్రం కాద’ని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బాల్య వివాహాలను అడ్డుకోవడమే కాకుండా పిల్లలపై జరిగే అనేక రకాల నేరాల నియంత్రణ కోసం కమలమ్మ ఉద్యమిస్తున్నారు. -
బాల్యం పెరుగుతోంది
గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నవలలో బుచ్చమ్మకి బాల్య వివాహం చేస్తాడు తండ్రి అగ్నిహోత్రావధాని. బాల్యంలోనే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి చేరుతుంది బుచ్చమ్మ. కాళ్లకూరి నారాయణరావు ‘వరవిక్రయం’లో కాళింది నూతిలో దూకి మరణిస్తుంది. ముక్కు పచ్చలారని పసిపిల్లలను ఆరు పదులు నిండిన వృద్ధులకిచ్చి వివాహం చేయడం అప్పట్లో ఓ దురాచారం. జీవితం అంటే ఏంటో తెలిసే లోపుగానే వారి జీవితం ముగిసిపోయేది. సుమారు యాభై ఏళ్ల క్రితం వరకు కూడా బాల్య వివాహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఎంతోమంది సంస్కర్తలు ఈ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడి, రూపుమాపేందుకు కృషి చేశారు. ప్రభుత్వాలు కూడా చట్టాలు తెచ్చాయి. ఫలితంగా బాల్యవివాహాలు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య మరింత తగ్గిందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అక్షరాస్యత, జీవన ప్రమాణాల స్థాయి వంటివి పెరగడం కూడా ఇందుకు కారణం. బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 15–19 మధ్య వయస్సు ఉన్న ఆడపిల్లల వివాహాలు 6.4 శాతానికి తగ్గిపోయాయి. పశ్చిమ బెంగాల్లో ఈ శాతం మరింత తక్కువగా ఉంది. బాల్యంలోనే వివాహాలు కావడం వల్ల టీనేజ్‌లోకి వచ్చేసరికి గర్భం ధరించి, మాతృత్వం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే తల్లులైపోతున్నారు. ఈ కారణంగా ఆడపిల్లలు చదువుకోలేకపోతున్నారు, ఉన్నత పదవులు అలంకరించలేకపోతున్నారు. ఆడపిల్లలు ఉన్నతవిద్యలు అభ్యసించాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలగాలి. వారికి జరుగుతున్న అన్యాయం ఏంటో అర్థం చేసుకోవాలి. సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. అవన్నీ జరగాలంటే.. బాల్య వివాహాల నుంచి వారిని కాపాడే చట్టాలు మాత్రమే కాదు, మనుషులూ ఎప్పుడూ నిఘావేసి ఉంచాలి. – రోహిణి -
బాల్యవివాహాలను ఆపేదెవరు?
మంచిర్యాల క్రైం: ఆర్థిక అసమానతలు... నిరక్షరాస్యత... బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం... ¿¶భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ.. జిల్లాలో బాల్య వివాçహాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా ఆ వివాహాలు ఆగడంలేదు. అధికారుల దృష్టికి 10 శాతం మాత్రమే వస్తుండగా.. 90శాతం వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోతున్నాయి. జిల్లా శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(ఐసీపీఎస్) అధికారులు ఆపిన వివాహాలు అతి తక్కువగానే ఉన్నాయి. 2014 నుంచి 2018 డిసెంబర్ 15వరకు జిల్లాలో 48 బాల్యవివాహాలను నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి లెక్కలోకి రాని వివాహాలు అనేకం ఉంటున్నాయి. బాల్యవివాహాలు నిరోధించే చట్టం బ్రిటిష్ కాలంలో 1929 నుంచి అమలులో ఉంది. ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహాల నిరోధక చట్టం 2006ను రూపొందించింది. ఈచట్టంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే బాల్యవివాహాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21ఏళ్లుగా ఈ చట్టంలో నిర్ధారించారు. మరి ఈ చట్టం ఏంచెబుతుంతో తెలుసుకుందాం.. నేరస్తుల విచారణలో ... 21 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ ఉన్న వ్యక్తి, 18 సంవత్సరాల కన్నా తక్కువ కలిగిన బాలికను వివాహం చేసుకుంటే ఆవ్యక్తి శిక్షార్హుడని చట్టం పేర్కొంటుంది. బాల్యవివాహాలు నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్న వారిలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇతర వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే ఈ చట్టంలో శిక్షార్హులుగా నిర్ధేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడిన వారిలో మహిళలుంటే మాత్రం వారికి జైలుశిక్ష విధించాలని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. బాల్య వివాహం నేరం – శిక్ష - బాల్య వివాహాలను ప్రోత్సహించేవారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ వి«ధించవచ్చు. - బాల్య వివాహం తర్వాత ఆ మైనరు అక్రమ రవాణా చేయడానికి, ఆమెను దాచేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. - బాల్య వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. - చట్టాన్ని, మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్యవివాహాన్ని ఏ మత సాంప్రదాయాలతో జరిపినా ఆ వివాహం చెల్లదు. - ఈ చట్టం కింద నమోదయ్యే కేసులో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాన్ని ఆపవచ్చు. - ఈ చట్టం కింద నేరస్తులకు శిక్షతో కూడిన లేదా బెయిలుకు వీలులేని శిక్ష విధిస్తారు. ఈ చట్టం కింద శిక్షార్హులయ్యే వ్యక్తులు - ఇరుపక్షాల తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు - ఇరుపక్షాల ఇరుగు పొరుగు వారు - ఈ వివాహానికి హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా.... జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్, ఉన్నాతాధికారులు (ఫోన్ నంబర్100)మహిళా శిశు సంక్షేమ శాఖ పథకం సంచాలకులు, ఐసీపీఎస్, చైల్డ్ లైన్ (ఫోన్ నంబర్1098) తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో అయితే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తెలియజేయవచ్చు. అవసరమైతే సామాజిక సేవ కార్యకర్తలకు కూడా సమాచారం అందించవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి. బాల్య వివాహంతో వచ్చే సమస్యలు.... - అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21ఏళ్లు నిండకముందే వివాహం చేయడం వారి ఆరోగ్యానికి అంత క్షేమకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. - ప్రధానంగా స్త్రీలు త్వరగా రక్తహీనతకు గురికావడం, అనారోగ్య శిశువులు జన్మించడం, అవయవ ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు ఎక్కువగా జరగడం. - త్వరగా గర్భం దాల్చడంవల్ల వారు త్వరగా బలహీనంగా మారుతారు. పుట్టేబిడ్డ జన్యుపరమైన సమస్యలతో పాటు, పోషకలోపాలతో జన్మించడం. - అధిక సంఖ్యలో గర్భస్రావాలు, మాతాశిశుమరణాలు జరుగుతున్నట్టు వివిధ సర్వేలు చెపుతున్నాయి. - దంపతుల మధ్య అవగాహనలోపంతో కుటుంబంలో కలహాలు వచ్చి త్వరగా విడిపోయే అవకాశం ఉంది. - మానసిక పరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం. - కుటుంబహింసకు, లైంగిక హింసకు, ఇంకా పలు సమస్యల బారినపడే అవకాశం. అవగాహన కల్పిస్తున్నాం బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతీఒక్కరు సహకారించాలి. బాల్య విహాలు చేసుకోవడం నేరం. వివాహాలు చేసిన, చేసేందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. మంచిర్యాల జిల్లాలో 2014 నుంచి 2018 డిసెంబర్ 15 వరకు 48బాల్య వివాహాలను అడ్డుకున్నాం. బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాÆం. – రాహూఫ్ఖాన్, శిశు సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల -
బాల్య వివాహాలపై చైతన్యం కలిగించాలి
ఒంగోలు టౌన్: ఆడపిల్లలను చదివించకుండా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు తమ భారం తొలగించుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను యువత ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులను చేయాలని ఉద్బోధించారు. రాష్ట్ర మహిళా కమిషన్, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కళాశాల సహకారంతో కళాశాల ఆవరణలో బుధవారం సాయంత్రం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబం లోని ఆర్థిక పరిస్థితులు, ఆడపిల్లనే అభద్రతా భావం, మూఢ నమ్మకాలు వంటి అనేక కారణాల వల్ల అభం శుభం తెలియని బాలికలకు చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. దీనిని రూపుమాపేందుకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల గర్భం దాల్చిన సమయంలో తల్లితో పాటు బిడ్డ ప్రాణానికి కూడా అపాయం కలుగుతుందన్నారు. బాలికలు, మహిళల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. లింగ వివక్షత వెంటాడుతోంది సాంకేతికంగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో బాలికల పట్ల లింగ వివక్షత ఇంకా వెంటాడుతూనే ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టీ రాజావెంకటాద్రి పేర్కొన్నారు. బాల్య వివాహక నిరోధక చట్టం–2006 ప్రకారం ఆడపిల్లకు 18, మగపిల్లాడికి 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాల్య వివాహం చేస్తే మత పెద్దలకు, వివాహానికి హాజరైనవారికి రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ డైరెక్టర్ సూయజ్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు సామాజిక అంశాలపై ప్రజలకు మేలు కలిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. మహిళా నాయకురాలు టీ అరుణ మాట్లాడుతూ అధిక శాతం యువత టీవీలు, సెల్ఫోన్ల ప్రభావంతో చిన్న వయస్సులోనే ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. యువత మంచి మార్గంలో నడిచి వారి కుటుంబాలకు, సమాజానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కొమరోలు బాలికకు అభినందనలు కొమరోలులో గత ఏడాది ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు వారి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో విషయం తెలుసుకొని పోలీసు స్టేషన్‌కు వెళ్లి వివాహాన్ని ఆపించిన బాలికను సమావేశానికి ప్రత్యేకంగా పిలిపించి అభినందించారు. ఆ బాలిక తన స్నేహితుల సహాయంతో ధైర్యంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాల్య వివాహ ప్రయత్నాన్ని తిప్పికొట్టడంపై చైర్‌పర్సన్‌తో పాటు మిగిలిన అధికారులు ఆ బాలికను ప్రశంసించారు.రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు టీ రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ సీహెచ్ భారతి, మహిళా శిశు సంక్షేమశాఖ ఏపీడీ జీ విశాలాక్షి, హెల్ప్ పారాలీగల్ వలంటీర్ బీవీ సాగర్, డీసీపీఓ జ్యోతిసుప్రియ, రైజ్ కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యానికి శాపం వివాహం
పశ్చిమగోదావరి, నిడదవోలు : తెలిసీ తెలియని వయసులో లోకం పోకడే తెలియని లేలేత వయసులో మూడు ముళ్ల బంధంలో చిక్కుకుంటున్న అభాగ్యాలు ఎందరో. బాలికా వధువులు, చిన్నారి పెళ్లి కూతుళ్లకు వివాహాలు చేసి బాలికల గొంతు కోస్తున్నారు. 12 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తున్న సంఘటనలు గ్రామాల్లో ఏదో మూలన జరుగుతూనే ఉన్నాయి. కట్టుబాట్లకు, కరెన్సీ నోట్లకు బలిపశువులుగా చిన్నారులు మారుతున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపం, ఇంట్లో ఆడపిల్లలను వదిలించుకోవాలనే పేద వర్గాల దృక్పథం, సమాజంలో ఆమ్మాయిల సంఖ్య మగవారికంటే తక్కువగా ఉండటంతో ఇటీవల బాల్య వివాహాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వివాహాలు వెలుగులోకి వచ్చేవి కొన్నైయితే.. వెలుగులోకి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నవి ఎన్నో ఉన్నాయి. బాల్య వివాహల నిరోధక చట్ట ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేస్తే ఇరువురి కుటుంబాల పెద్దలకు కఠిక శిక్షలు అమలు కావడంతో పాటు భారీగా జరిమానాలు విధించవచ్చునని చట్టాలు చెబుతున్నాయి. అనాధి నుంచి వస్తున్న దురాచారం విదేశీయులు ఇండియాను పాలించే కాలంలో కొందరు విదేశీ అధికారులు కన్యలను బలవంతంగా వివాహమాడేవారు. మరి కొందరిని చెరిచేవారు. ఇలాంటి దారుణ సంఘటన నేపధ్యంలో భారతీయులు తమ పిల్లలను బాల్యంలేనే వివాహాలు చేసేవారు. దీంతో అప్పటి నుండి బాల్య వివాహాల పరంపర కొపసాగుతూ వస్తుంది. పూర్వం కుటుంబాల మధ్యపరస్పర సంబంధాలను కొనసాగించుటకు మరింతగా పటిష్ట పరుచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలు నిర్ణయించుకుని పిల్లలు కొంచెం పెద్దవ్వగానే వివాహాలు చేసేవారు. అలాగే మరణశయ్యపై ఉన్న వృద్ధుల చివరి కోరిక తీర్చేందుకు కూడా ఇలా ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహ బంధీఖానాలోకి నెట్టేసేవారు. చిన్నవయసులోనే వివాహం కారణంగా భర్త చనిపోతే బాల వితంతువులుగా మారేవారు. కందుకూరి వంటి సంఘ సంస్కర్తల కృషితో బాల్యవివాహాలను నిషేధించారు. అయినా ఇప్పటికే అక్కడక్కడా మారుమూల గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. చట్ట ప్రకారం.. 1922లోనే బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే 2006 నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ చట్ట ప్రకారం ఆడ పిల్లలకు 18, మగవారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు జరిపించాలి. ఈ వయసు నాటికే వారిలో శారీరక, మానసిక పరిపక్వత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుంటే కలెక్టర్, మెజిస్ట్రేట్, రెవెన్యూ, పోలీసు, అంగన్వాడీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, బాల్య వివాహానికి అనుమతించిన పెద్దలు, సహకరించినవారందరూ నేరస్తులుగానే పరిగణిస్తారు. బాల్య వివాహం చేసినట్టు రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారంతో పాటు రూ.లక్ష జరిమానా విధించవచ్చును. దీని ప్రకారం బాల్య వివాహాలను నిలిపివేస్తూ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేయవచ్చును. ఈ నేరాలకు బెయిల్ కూడా ఇవ్వరు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్ట ప్రకారం జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో ఐసీడీఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహిస్తారు. బాల్య వివాహాలను రూపుమాపేందుకు వివాహ నమోదు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వధూవరుల వయసుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందిస్తేనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏడాదిలో 150వివాహాలు నిలిపివేత ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 150 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. చాలా మందికి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కౌన్సెలింగ్ ఇచ్చినా లెక్క చేయని వారిపై చర్యలు చేపట్టారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం ఇంత వరకు ఐదుకేసులు నమోదయ్యాయి. నిడదవోలు మండలం సమిశ్రగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిడదవోలు, చాగల్లు మండలాల్లో రెండు నెలల వ్యవధిలో 15 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. కందుకూరి కృషితో.. చిన్న వయసులోనే వివాహం వలన చదువుకునే అవకాశం బాలికలు కోల్పోతున్నారు. శారీరక నిర్మాణం బలపడకుండానే గర్భవతులు అయితే తల్లితో పాటు పుట్టిన బిడ్డలు కూడా బలహీనంగా ఉంటారు. పూర్వం బాల్య వివాహాలు అంటే ఆరేడేళ్ల వయసు అమ్మాయిలతో 40, 50 ఏళ్ల వ్యక్తులతో జరిగేవి. దీంతో భర్త ముందుగా చనిపోవడంతో బాల వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కొన్ని కుటుంబాల్లో తలనీలాలు తీసేసి వీధిలోకి రాకుండా ఇంట్లోనే ఉంచేవారు. అభ్యుదయ వాది కందుకూరి కృషితో పునర్వివాహం చేసేందుకు ఉద్యమించారు. ఎన్నో ఉద్యమాల తర్వాత ప్రభుత్వం బాల్య వివాహాల నిషేద చట్టం చేశారు.– కొండ నిర్మల, సీనియర్ సిటిజన్ రాష్ట్ర మహిళాఅధ్యక్షురాలు, నిడదవోలు -
ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది. వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి.. మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది. ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మతం ముసుగులో.. మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది. విభేదించడం రాజద్రోహం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్‌ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ని పదేళ్ళ క్రితమే బ్రిటన్‌లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది. -
స్త్రీలోక సంచారం
అమానుషమైన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నవారిని మినహాయించి, శిక్షా కాలంలో సగం సమయాన్ని పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను మూడు విడతలుగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా గాంధీ జయంతికి ఈ ఏడాది అక్టోబర్ 2న కొందరిని, తిరిగి ఏప్రిల్ 10న చారిత్రక చంపారన్ ఘటన రోజున కొందరిని, అనంతరం వచ్చే ఏడాది గాంధీ జయంతికి మరికొందరు మహిళల్ని.. వారితో పాటు సీనియర్ సిటిజన్, ట్రాన్స్‌జెండర్, వికలాంగులు, అనారోగ్యం పాలైన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ::: 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలు, యువతులు, మహిళలు కేరళ, శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోవడంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రార్థనాలయాలను దర్శించుకునే రాజ్యాంగ హక్కు మహిళలకు ఉందని స్పష్టం చేస్తూ, మహిళల ఆలయ ప్రవేశంపై ‘ట్రాంకోవర్ దేవస్వమ్ బోర్డు’ విధించిన ఏళ్లనాటి నిషేధం సమర్థనీయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది ::: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది అసీమ్ సాహ్నీకి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పదోన్నతి కల్పించడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 31 మంది న్యాయవాదులకు అడిషనల్, డిప్యూటీ అడ్వొకేట్ జనరళ్లుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం జమ్మూకశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ప్రస్తుతం హైకోర్టులో డిప్యూటీ అడ్వొకేట్ జనరల్‌గా పని చేస్తున్న అసీమ్ సాహ్నీ పేరు కూడా ఉంది! 2009 జూలైలో వివాహమైన ఒక ముస్లిం మహిళ.. పిల్లలు కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం తన భర్త తలాక్ చెప్పినప్పటి నుంచీ మామగారిని, మరిదులను పెళ్లి చేసుకోవాలని ఆ కుటుంబ సభ్యులంతా తనపై ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని, మామగారు పలుమార్లు తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చెయ్యడంతో యు.పి.పోలీసులు కేసు నమోదు చేశారు. 489 ఎ (వరకట్నం), 323 వేధింపులు, 328 (విష ప్రయోగం), 511 (శిక్షార్హమైన నేరాలు) సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చేసి ఆ మహిళ భర్తను, అతడి తల్లిదండ్రులను, అతడి చెల్లెల్ని, అతడి ముగ్గురు తమ్ముళ్లను అరెస్టు చేసినట్లు క్విలా పోలీస్ స్టేషన్ అధికారి కె.కె.వర్మ తెలిపారు ::: బాల్య వివాహాల నిషేధ చట్టంలోని సెక్షన్ 3ని సవరించి బాల్యవివాహాలు చెల్లుబాటు కాని విధంగా చట్టంలో మార్పులు తేవాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ.. కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదనలు పంపింది. ఈ సవరణ జరిగి, చట్టం అమల్లోకి వస్తే ఆ తర్వాత జరిగే బాల్యవివాహాలకు చట్టబద్ధత ఉండదు ::: గత ఏడాది విడుదలైన తన ఆల్బమ్ ‘విట్నెస్’.. అనుకున్నంతగా ఆదరణ పొందకపోవడంతో తను అనేకసార్లు డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు ప్రముఖ అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నటి, టెలివిజన్ పర్సనాలిటీ కేటీ పెర్రీ వెల్లడించారు. ప్రాణం పెట్టి మరీ తను రూపొందించిన ‘విట్నెస్’ను మ్యూజిక్ లవర్స్ అంతే ప్రాణప్రదంగా స్వీకరించకపోవడం తన మనసును నొప్పించిందని ఆమె మనసు విప్పారు. రష్యాలో వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ పోటీలలో ఫ్రాన్స్ విజయం సాధించినప్పుడు స్టేడియం లోపల, బయట, వీధులలో మహిళలపై జరిగిన మూకుమ్మడి వేధింపులపై రష్యా ఆరా తీస్తోంది. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తక్షణం ఆ ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపించేందుకు రష్యా ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది ::: ట్రంప్ ఇటీవల బ్రిటన్ వెళ్లినప్పుడు క్వీన్ ఎలిజబెత్ 2 తో కలిసి సైనిక వదనం స్వీకరిస్తున్న సమయంలో కొన్ని మర్యాదలను విస్మరించారని విమర్శలు వస్తుండగా, ట్రంప్ తిరిగొచ్చాక, అమెరికా ప్రభుత్వ యంత్రాంగం వైట్ హౌస్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘రాణిగారు 70 ఏళ్ల తర్వాత తొలిసారి ట్రంప్ వచ్చిన సందర్భంగానే సైనిక వందనంలో పాల్గొన్నారు’ అని పేర్కొనడం ఆయన్ని అపహాస్యంపాలు చేసింది ::: -
రెండు బాల్యవివాహాలు నిలిపివేత
కారంపూడి: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మండలంలోని నరమాలపాడు గ్రామంలో ఇద్దరు గిరిజన బాలికలకు త్వరలో జరగనున్న రెండు బాల్య వివాహాలను ఆపడానికి అధికారులు సోమవారం చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామ శివార్లలోని ఎస్సీ కాలనీలో, వైకుంఠపురంలో ఇద్దరు బాలికలకు వివాహాలు చేయడానికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారని కలెక్టర్‌కు సమాచారం అందింది. దీంతో కలెక్టర్ కారంపూడి తహసీల్దార్, గురజాల ఐసీడీఎస్, పోలీసు అధికారులను ఈ విషయమై చర్యలు తీసుకోవాలని తగిన ఆదేశాలిచ్చారు. సీడీపీవో బి. స్వరూపారాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ బి. నాగేంద్రం వీఆర్వో అక్కుల శివారెడ్డి గ్రామానికి వెళ్లి పెళ్లికుమార్తెలు కానున్న బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పెళ్లిళ్లు నిలిపి వేస్తామని వారి నుంచి హామీ పత్రాలు తీసుకున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలిక యాదల నాగలక్ష్మీకి జమ్మలమడుగు చెందిన వర్రె రాజేష్‌తో బుధవారం 9వ తేదీ వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వైకుంఠపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక చలంచర్ల పవిత్రకు స్వగ్రామానికే చెందిన మానికల దుర్గా ప్రసాద్‌తో ఈ నెల 11వ తేదీ వివాహం నిశ్చయమైంది. అధికారులు నాగలక్ష్మీ తల్లిదండ్రులు సైదులు, దీనమ్మ, పవిత్ర తల్లిదండ్రులు లక్ష్మయ్య, పద్మల నుంచి బాల్య వివాహాలు చేయబోమని వారికి పెళ్లీడు వచ్చాకే వారికి పెళ్లి చేస్తామని వారి నుంచి అలాగే బాలికల నుంచి అధికారులు స్టేట్మెంట్స్ తీసుకున్నారు. పవిత్ర 7వ తరగతితో చదువుకు స్వస్తి పలికింది. అలాగే నాగలక్ష్మీ చదువు కూడా నాలుగో తరగతితో ఆపేశారు. బాలికల రెండు కుటుంబాలు వారు పేద వ్యవసాయకూలీలే. బాలికలు కూడా తల్లిదండ్రులకు ఆసరాగా కూలీ పనులకు వెళుతున్నారు. పైగా పెళ్లి కుమారులు కూడా 20 ఏళ్ల లోపువారే. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను గుర్తించి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించాలని, యుక్త వయస్సు వచ్చాకే పెళ్లిళ్లు చేయాలని ఎవరైనా అలా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తహసీల్దార్ సాయిప్రసాద్ హెచ్చరించారు. -
బాల్య వివాహాలొద్దు..చదువే ముద్దు
ఒంగోలు సెంట్రల్: బాల్య వివాహాలు వద్దు..ఆడ పిల్లలకు చదువే ముద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్శన్ ఎంజీ ప్రియదర్శిని అన్నారు. బుధవారం స్థానిక జిల్లా జడ్జి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చైల్డ్‌లైన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థలు దాదాపు 200 బాల్య వివాహాలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. వీరిలో పదో తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, ప్రజల్లో అవగాహన కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్ర కనిగిరిలో ప్రారంభమై వెలిగండ్ల వరకూ సాగిందని జిల్లా జడ్జి ప్రియదర్శిని వివరించారు. పారాలీగల్ వలంటీర్ బీవీ సాగర్ పాల్గొన్నారు. -
బాల్యవివాహాలకు అడ్డుకట్ట!
లక్ష్మీపురం(గుంటూరు): తల్లీదండ్రుల ముద్దు మురిపాలు తీరకుండానే ముక్కుపచ్చలారని ఆడపిల్లలను పెళ్లిపీటలు ఎక్కిస్తున్నారు. చదువు ప్రాధాన్యతను పక్కనబెట్టి జీవిత పాఠాలు నేర్పకుండానే వివాహ బంధంలోకి నెట్టేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఎన్నిచట్టాలు చేసినా, అవగాహన కార్యక్రమాలు చేపట్టినా బాల్యవివాహాలను అరికట్టలేకపోతున్నారు. సహకరించని ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు ముఖ్యంగా పిల్లలను బాల్యవివాహాల వైపు దారి తీస్తున్నాయి. బాల్య వివాహాల వల్ల ప్రధానంగా చిన్నతనంలోనే గర్భిణులు కావడంతో గర్భంలో ఉన్న బిడ్డ బరువు సరిపోక, పోషకాహారం సరిగా లేక తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. బాల్య వివాహలకు ప్రోత్సహించే వారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరఫున కౌన్సిలింగ్‌లు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ఇలా.. ది ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజస్ రూల్స్ 2012 రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తుంది, భారతదేశ పౌరులందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాత్కాలికంగా నివసిస్తున్న, విదేశీయులందరికీ, వారి కుటుంబాలకు, అమలు జరిపే సంస్థలకు ప్రభుత్వానికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రధానంగా జిల్లా కలెక్టర్ జిల్లా మొత్తానికి సీఎంపీవో (చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారిగా) వ్యవహరిస్తారు. డివిజనల్ స్థాయిలో ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ సీఎంపీవోగా వ్యవహరిస్తారు. ప్రాజెక్ట్ స్థాయిలో 3 నుంచి 5 మండలాల్లో బాలల అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారులుగా ఉన్నవారు సీఎంపీవోగా పని చేస్తారు. మండల స్థాయిలో తమ కింద ఉన్న గ్రామాల్లో తహసీల్దార్లు సీఎంపీవోలుగా పని చేస్తారు. గ్రామాలలో ఐసీడీఎస్ పర్యవేక్షణ అ«ధికారులు సీఎంపీవోలుగా పని చేస్తారు. గ్రామ స్థాయిలో పంచాయితీ రాజ్ శాఖలో పని చేసే పంచాయితీ సెక్రటరీలు, రెవెన్యూ శాఖలో పని చేసే గ్రామపాలన అధికారులు సీఎంపీవోలుగా పనిచేస్తారు. విస్తృత అధికారాలు.. ఈ చట్టం కింద బాల్య వివాహాల నిరోధక అధికారులు ఒక పోలీసు అధికారికున్న అధికారాలతో పాటు, దర్యాప్తు చేసే అధికారం కలిగి ఉంటారు. కేసుల్లో ఇద్దరి కుటుంబాలను పిలిపించే అధికారం సాక్షులను పిలిపించి వారి నివేదికలను రికార్డు చేసే అధికారం, నేరం చేసిన వారిపై కేసులు పెట్టే అధికారం ఉంటుంది. ఆ నివేదికలపై ఆధారపడే వాటిని సాక్షాధారాలుగా పరిగణించి తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు. ఈ చట్టానికి లోబడి బాల్య వివాహా నిరోధక అధికారులు, తాము చేసే పనుల్లో పోలీసులు సహాయ, సహకారాలతో తమ విధులను నిర్వర్తించాలి. అందుకు పోలీసులు తమ సహకారాన్ని తప్పక అందించాలి. ప్రతి ఒక్క బాల్య వివాహ నిషేధ అధికారి తన పరిధిలో జరుగుతున్న, జరగబోతున్న బాల్య వివాహం ఆపడానికి వెంటనే పోలీసులకు, ఉన్నతా«ధికారులకు తెలియజేయాలి. ఈ విషయంపై చర్య తీసుకొని అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రతి గ్రామంలో ఓ కమిటీ.. ప్రతి గ్రామంలోనూ ఈ చట్టాన్ని దాని నియమ నిబంధనలను అమలు చేయడానికి పర్యవేక్షణ చేయడానికి సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో అధ్యక్షుడిగా గ్రామ సర్పంచి, సభ్యులుగా గ్రామ కార్యదర్శి, రెవెన్యూ శాఖ గ్రామపాలనాధికారి, స్థానిక స్కూల్ టీచర్, గ్రామ సమాఖ్య, స్వయం సహాయక సంఘం సభ్యులు, ఎన్నికైన మహిళా పంచాయతీ సభ్యురాలు, ఏఎన్ఎం, స్థానికంగా పని చేస్తున్న స్వచ్ఛంధ సంస్థ, యువ సమాఖ్య సభ్యుడు, స్త్రీ సభ్యురాలు, గ్రామాధికారులు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, కన్వీనర్‌గా ఉంటారు. బాల్య వివాహం జరిగితే తీసుకునే చర్యలు.. వివాహానికి హజరైన వారు, సహాయపడిన వారు, ప్రోత్సాహించిన వారు, వివాహాన్ని జరిపించిన వారు, నిర్వహించిన వారు, మద్దతు ఇచ్చిన వారు, వివాహం ఏర్పాట్లకు బాధ్యత వహించిన వారందరితో పాటు వివాహం జరిపించే ఆ సామాజిక వర్గ పండితులను అందరి పేర్లతో ఒక నివేదికను సిద్ధం చేసి అరెస్ట్ చేస్తారు. ఒకవేళ సంక్షేమ సంఘం అందుబాటులో లేనట్లయితే ఆమె, అతని భద్రత, సంరక్షణ గురించి సరైన నిర్ణయం తీసుకోవడం కోసం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందుహజరుపరచాలి. తప్పుడు ఆధారాలతో బాల్య వివాహాలుచేస్తే చర్యలు తప్పవు.. బాల్యవివాహాలు చేసే వారు ప్రధానంగా ఆధార్‌కార్డుపై ఉండే వయస్సు ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఆధార్ నమోదు కార్డుపై తేదీలను వయస్సును మారుస్తున్నారు. అందుకే కచ్చితంగా పదోతరగతి ఉత్తీర్ణత అయిన సర్టిఫికెట్‌పై ఉండే వయస్సు ప్రకారం మైనర్, మేజర్ అనేది చూడవచ్చని అధికారులు చెబుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకుంటాం గుంటూరు జిల్లాలో ఏప్రిల్ నెలలోను సుమారు 15 బాల్య వివాహాలను అడ్డుకుని కౌన్సెలింగ్ ఇచ్చాం. గ్రామాల్లో పెద్దలు, పంచాయతీ కార్యదర్శి, అధికారులు అందరు కలిసి బాల్య వివాహలను ప్రోత్సహించకూడదు. చిన్న వయస్సులో వివాహం జరిగి గర్భశ్రావం అయితే రక్తహీనతతో మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చదువుతో పాటువారి భవితవ్యంపై గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.-శ్యామసుందరి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖా ప్రాజెక్ట్ డైరెక్టర్ -
పది తర్వాత పెళ్లంటే 100కు ఫోన్ చేయండి
సత్తెనపల్లి: బాల్య వివాహాల నివారణపై సోమవారం పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాలని, అలా కాకుండా పెళ్లంటే 100కు ఫోన్ చేయాలన్నారు. తహసీల్దార్ జి.సుజాత మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు. పది తర్వాత పెళ్లి కాదని, ఇంటర్లో చేరాలని యువతకు సూచించారు. ఎంఈవో ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని, దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ స్వర్ణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాల్యానికి మూడు ముళ్లు
నిర్మల్అర్బన్ : బాల్య వివాహాలు అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాపకింద నీరులా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నా పూర్తిస్థాయిలో వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఓ వైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌లు ఇస్తున్నా.. బాల్య వివాహాలు మాత్రం ఆగటం లేదు. మైనర్లు అయినప్పటికీ చాటుమాటుగా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. అభద్రత భావం, పేదరికం, నిరక్షరాస్యత, మేనరికం, డ్రాపవుట్, అజ్ఞానం, సామాజిక తదితర కారణాల వల్ల బాల్య వివాహాలను జరిపిస్తున్నారు. రక్షణ లేని సమాజంలో అమ్మాయికి పెళ్లి చేస్తే రక్షణలోకి వెళుతుందన్న భావన అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఉంటే, పెళ్లి చేయకపోతే బాధ్యత లేకుండా చేతికందకుండా పోతాడేమోనన్న అనుమానం అబ్బాయిల తల్లిదండ్రుల్లో ఉండటం, పెళ్లి చేస్తే దారితప్పిపోకుండా ఉంటారన్న ఆలోచనతో మరికొంత మంది వివాహాలు జరిపించేస్తున్నారు. బాల్య వివాహాల గురించి సమగ్ర సమాచారం అందితేనే అధికారులు స్పందిస్తున్నారు. పూర్తి సాక్షాలు లేకుంటే తమకెందుకులే అని వదిలేస్తున్నారు. ఎక్కువ మందయితే బాల్య వివాహాలను గుట్టు చప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఫోక్సో లాంటి చట్టాలు అనేకం ఉన్నా బాల్య వివాహాలు మాత్రం అడ్డుకోలేకపోవడం విచారకరం. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బాల్య వివాహాన్ని పోలీసు, ఐసీడీఎస్ అధికారులు నిలిపివేశారు. చాపకింద నీరులా... జిల్లాలో బాల్య వివాహాలు చాపకింద నీరులా జరుగుతున్నాయి. మంచి సంబంధమైతే దొరికితే చాలు.. ఇక ఆలస్యం ఎందుకు అని తొందరగానే వివాహాలు చేస్తున్నారు. ఇలాంటి వారు అబ్బాయి, అమ్మాయిల వయస్సులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం సూచించిన విధంగా అయితే అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ కొందరు అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు పడగానే పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇంకొందరు అంతకు లోపున్నా పెళ్లి తంతు జరిపిస్తున్నారు. మంచి సంబంధం మళ్లీ దొరకదనో.. ఆలస్యమైతే మనసులు మారతాయనో.. ఓ బాధ్యత తీరుతుందనో ఇలా రకరకాల కారణాలతో పెళ్లి ముచ్చట కానిచ్చేస్తున్నారు. అధికారుల దృష్టికి వస్తే ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని గోప్యత పాటిస్తున్నారు. పెళ్లిళ్లు ఇష్టం లేకనో, ఇంకా ఇతరత్రా కారణాల వల్ల సమాచారం బయటకు వస్తే తప్ప అధికారులకు విషయం తెలియడం లేదు. పక్కంటి వారికో, బంధువులకు, స్నేహితులకో తెలిసినా పెళ్లి ఆపడం ఎందుకులే అని.. పెళ్లివారు ఇబ్బంది పడతారని విషయాన్ని బయటకు రానివ్వడం లేదు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో చాలానే జరిగాయి. అధికారుల దాకా వచ్చి నిలిచిపోయినవి కొన్ని మాత్రమే ఉంటాయనడంలో సందేహం లేదు. తొమ్మిదింటికి అడ్డుకట్ట.. జిల్లాలో రెండేళ్లుగా అధికారులు తొమ్మిది బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయగలిగారు. 1098కు సమాచారం రావడం, అధికారులకు ఫిర్యాదులు అందటంతో జిల్లాలో తొమ్మిది చోట్ల వివాహాలు నిలిపివేశారు. సోన్ మండలం పాక్పట్ల, సారంగాపూర్ మండలం తాండ్ర, మామడ, మామడ మండలం అనంతపేట్, సోంపేట్, ముథోల్, తానూర్, భైంసాలలో బాల్య వివాహాలపై సమాచారం అందటంతో అధికారులు అడ్డుకున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయిడి వాడకు చెందిన బాలుడికి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన బాలికలకు ఆదివారం (ఈనెల 22) వివాహాం జరగాల్సి ఉంది. ఇద్దరు మైనర్లు కావడంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ చేసి పెళ్లిని నిలిపివేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యానేరం.. సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇది చట్టరీత్యానేరం. బాల్య వివాహాల నిరోధక చట్టం– 2006 ప్రకారం 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగుపెట్టిన అమ్మాయి, 21 పూర్తయి 22 ఏళ్లకు చేరిన అబ్బాయి పెళ్లికి అర్హులు. అలాగే 2012 వచ్చిన పోక్సోచట్టం(పీవోసీఎస్‌వో) ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సీస్ లైంగిక దాడి నుంచి పిల్లల రక్షణ ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయికి గానీ, 21 ఏళ్లలోపు అబ్బాయికి వివాహం జరిగితే ఈ చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదు చేయబడుతుంది. అలాగే ప్రతీ ఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు.. వివాహ వయసు రాకముందే చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం ఏమాత్రం సరికాదు. ఇలా చేయడం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మానసికంగానూ వారు దెబ్బతింటారు. కనీసం 18ఏళ్లు నిండిన తర్వాతే అమ్మాయికి, 21ఏళ్లు నిండిన తర్వాతే అబ్బాయికి పెళ్లి చేయాలి. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా బాల్యవివాహాలను చేయడం మానుకోవాలి. డాక్టర్ శోభాసుభాష్రావు, గైనకాలజిస్ట్ -
బాల్య వివాహాలకు బ్రేక్
ఇచ్ఛాపురం రూరల్ : పదో తరగతి విద్యార్థినికి పెళ్లి చేస్తున్నారన్న సమాచారం మేరకు గెస్ట్ చైల్డ్‌లైన్ బృందం బాల్యవివాహానికి బ్రేక్ వేసింది. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు ఈ నెల 28న వివాహం చేస్తున్నట్లు 1098 చైల్డ్ లైన్‌కు వచ్చిన సమాచారం మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయానికి చైల్డ్‌లైన్ సిబ్బంది వెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులను తీసుకొ చ్చి తహసీల్దార్ ఎం.సురేష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నిర్ణీత వయసు వచ్చే వరకు బాలికకు వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెస్ట్ చైల్డ్‌లైన్ కోఆర్డినేట ర్ జాస్మీన్ కుమారీ, అంగన్వాడీ సూపర్వైజర్ జయలక్ష్మి, ఆర్ఐ కృష్ణప్రసాద్ రౌళో, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, అంగన్వాడీ కార్యకర్త కృష్ణవేణి పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ : మండలంలోని పెదపాడు పరిధిలోని గాంధీనగర్‌లో శుక్రవారం జరగాల్సిన ఓ వివాహానికి ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు గురువారం అడ్డుకట్ట వేశారు. గాంధీనగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలికను పెదపాడుకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు ఇరువర్గాలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే మే 9న పెదపాడులో జరగాల్సిన మరో బాల్య వివాహాన్ని కూడా అడ్డుకుని ఇరువర్గాల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. -
‘బాల్యవివాహం చేస్తే పూజారిపై కేసు’
సాక్షి, నారాయణపేట రూరల్: అవగాహన రాహిత్యంతో నారాయణపేట డివిజన్లో ఎక్కువగా బాల్యవివాహాలు చేçయడానికి సిద్ధమవుతున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తే రహస్యంగా తిరిగి పెళ్లిళ్లు చేసినట్లు సమాచారం వస్తుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. గురువారం పేటలో పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన బాల్యవివాహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసులు నమోదు చేస్తేనే మార్పు కనిపిస్తుందని ముందు పెళ్లి చేసిన పూజారిపై కేసు నమోదు చేయాలన్నారు. ఇటీవల దామరగిద్ద మండలం కంసాన్‌పల్లికి చెందిన అమ్మాయిని మద్దూరు మండలంలోని ఓ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారని, కౌన్సిలింగ్ ఇచ్చినా తిరిగి పెళ్లి చేయడంపై సీరియస్ అయ్యారు. వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైన అందరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బాల్యవివాహాలపై మాట్లాడారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు కోడేరు (కొల్లాపూర్): మండలంలోని రాజాపూర్‌లో జరుగుతున్న బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన శివతో పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో ఈ నెల 25న వివాహం జరిపారు. చిన్నతనంలో పెళ్లి చేశారని సీడబ్ల్యూఎస్ దశరథం ఐసీడీఎస్ సీడీపీఓ జ్యోతి, ఏఎస్ఐ ఇస్మాయిల్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి స్టేట్‌హోంకు తరలించారు. మండలంలో ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ తెలిపారు. -
పీటలపై పుత్తడి బొమ్మలు
పాలబుగ్గల పసిపిల్లలు పుత్తడి బొమ్మలుగా మారుతున్నారు. పేదరికం...నిరక్షరాస్యత..కుల కట్టుబాట్లు... గతించిన సంప్రదాయలు.... అభంశుభం తెలియని ఆడపిల్లల జీవితాలను బలి చేస్తున్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులను పెళ్లి పీటలు ఎక్కించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వందలాది బాల్య వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. వారు పసి మొగ్గలు. స్నేహితుల ఆటపాటలతో సంతోషాల సాగరంలో ఓలలాడే ఉల్లాసజీవులు. అక్షర వర్ణమాల వ్యాకరణాలతో కుస్తీ పట్టే చిరు దివ్వెలు. ప్రతి ఇంటా సిరులు కురిపించే సౌభ్యాగ్య ప్రదాయినిలు. అటువంటి అభం శుభం తెలియని ఆ చిట్టి చేతులను ఓ అయ్య చేతిలో పెట్టి పెళ్లిళ్లు చేసేస్తూ వారిని నరకప్రాయంలోకి నడిపిస్తున్నారు. సాక్షి, మచిలీపట్నం : నిరుపేద కుటుంబంలో పాప పుట్టడం చేసిన పాపమో.. సాకలేక ఓ అయ్య చేతిలో పెట్టడం అమ్మానాన్నల నేరమో.. సంప్రదాయం మాటున అజ్ఞానమో.. కారణాలు ఏవైనా కావచ్చు జరుగుతున్నవి మాత్రం ఘోరాలే.. ఇందుకు జిల్లాలో గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమవుతుంది. జిల్లాలో ఏటా అనధికారికంగా 100 నుంచి 150 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో వెలుగులోకి వచ్చినవి మాత్రం 80 నుంచి 100కు లోపే ఉంటున్నాయి. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తంతు. 2009వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే 457 వివాహాలను ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళల్లో పెళ్లి చేసే వయస్సును అంతర్జాతీయ సంస్థలు ఒక అధ్యయనం ప్రకారం 18 ఏళ్లుగా నిర్ణయించారు. అంతకు తక్కువ వయస్సులో వివాహం జరిపిస్తే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేక బహుళ నష్టాలు కలుగుతాయని అంతర్జాతీయ ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. బాలికల్లో ఆరోగ్య క్షీణత, పుట్టుకతోనే పిల్లల్లో లోపాలు వస్తాయి. ఇది తర్వాతి తరాలైనా ప్రభావం చూపుతాయని తెలిసినా పెళ్లిళ్లు జరగడం విస్మయం కలిగిస్తోంది. ఏయే ప్రాంతాల్లో ఎక్కువంటే.. జిల్లా వ్యాప్తంగా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, మైలవరం, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల పరిధిలో మత్స్యకార కుటుంబాలు, గిరిజన తండాలు, మరికొన్ని బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో ఇప్పటికీ బాల్య వివాహాల ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. కారణాలు అనేకం..! పేదరికం, ఆడ పిల్లలను భారంగా భావించడం, పెద్దల నిరక్షరాస్యత కారణంగా పిల్లలను చదివించాలనే తలంపు లేకపోవడం, అనర్థాలపై అవగాహన లేకపోవడంతో జిల్లాలో బాల్య వివాహాలు అధికంగా జరగడానికి కారమణమవుతున్నాయి. దీనికి గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలు పావులుగా మారుతున్నారు. వారి తల్లి దండ్రులు పిల్లలను పోషించే స్థోమత లేకపోవడంతో ఏదో పెళ్లి చేసేయాలనే ఆలోచన చేస్తున్నారు. నాగాయలంక, కోడూరు, బందరు, కైకలూరు, లంక ప్రాంతాల్లో నివశించే వారిలో ఈ తరహా అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిరక్షరాస్యత, కులవృత్తిపై ఆధారపడే కుటుంబాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కైకలూరు మండలం కొల్లేరుకు చెందిన 16 ఏళ్ల బాలికను గూడూరు మండలం రాయవరం గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న వ్యక్తికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. బందరు మండలం చిన్నాపురం గ్రామంలోని బాలిక నానమ్మ ఇంటి వద్ద పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం కాస్త ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న సీడీపీవో దీప్తి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం ఎస్ఐ శ్రీనివాస్, సర్పంచ్, అంగన్వాడీ సూపర్ వైజర్ జాహేదాలు వివాహాన్ని అడ్డుకుని.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటన కేవలం ఇదొక్కటే కాదు.. జిల్లా వ్యాప్తంగా నిత్యకృత్యంగా మారాయి. విధిగా సమాచారమివ్వాలి బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే మనకెందుకు అని ఊరుకోకుండా విధిగా పోలీసులు, బాలిక సంరక్షణ అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వివాహం జరిగిపోయిన తర్వాత కూడా బాలిక సంరక్షణ అధి కారులకు సమాచారం అందిస్తే.. ఆ వివాహాన్ని రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంది. జిల్లా మెజిస్ట్రేట్ నిలిపివేత ఉత్తర్వులు ద్వారా వివాహాన్ని రద్దు చేయవచ్చు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సెక్షన్ 151/సీఆర్పీసీ ప్రకారం దర్యాప్తు ఆరంభించాలి. బలవంతంగా వివాహం చేస్తున్నట్లు తేలితే కఠిన చట్టాలు అమల్లోకి వస్తాయి. బాల్యవివాహాల నిర్మూలనకు 2006లో వచ్చిన చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం పెద్దలు, సంరక్షకులు, పెళ్లికి అంగీకరించిన వరుడు, సాక్షులు అందరూ శిక్షార్హులే. కఠిన చట్టాలు అమల్లో ఉన్నా బాల్యవివాహాల నిర్మూలనపై ప్రచారం జరగడం లేదు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేసి వివాహాలను అడ్డుకుంటున్నాం. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. –కృష్ణకుమారి, ఐసీడీఎస్ పీడీ -
బాల్యానికి మూడుముళ్లు
బాల్యవివాహాలను అరికట్టేందుకు అధికారులు చర్యలెన్ని చేపడుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నా.. తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా చాటుమాటుగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో 50 రోజుల వ్యవధిలో ఆరు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మరికొన్ని చాటుమాటుగా జరిగినట్లు తెలుస్తోంది. అభద్రత, నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. సాక్షి, యాదాద్రి : ప్రజల అజ్ఞానం, నిరక్షరాస్యత, బాలికలపై అభద్రతాభావంతో బాల్య వివాహాలు జిల్లాలో జరుగుతున్నాయి. 13, 14 ఏళ్ల వయసులోనే బాలికల వివాహం చేసి అత్తింటికి పంపిస్తున్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల కుటుంబాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చోటు చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తోంది. అధికారులకు అందిన సమాచారం మేరకు కొంత మేరకు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించలేక పోతున్నారు. జిల్లాలోని 16మండలాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. హైదరాబాద్ శివారులో గల అభివృద్ధి చెందుతున్న భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం, తుర్కపలి లాంటి మండలాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల కాలంలో పలు ఘటనలు బీబీనగర్ మండలంలోని రెండేళ్ల కాలంలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు నిలిపివేయించారు. 2016లో జియాపల్లి తండా, 2017లో రుద్రవెళ్లి, కొండమడుగు, యాపగానితండాలో, మోత్కూరు మండలంలో తొమ్మది బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మోత్కూరు మండలం కొండగడప, దాచారంలో ఒక్కటి, అడ్డగూడూర్ మండలం కంచనపల్లిలో మూడు, అడ్డగూడూర్, హజీంపేట, మంగమ్మగూడెం, గట్టుసింగారం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున అడ్డుకుని వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే రాజాపేట మండలం నెమిలో ఒకటి, సంస్థాన్ నారాయణపురం మండలంలో మూడు జరిగాయి. వీటిలో బాల్యవివాహాలలో రెండు ఘటనలు తండాల్లో జరిగినవి కాగా, ఒకటి ఉన్నత వర్గానికి చెందినది. వీటిని రెవెన్యూ, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు, చైల్డ్‌కేర్ ప్రతినిధులు బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడడం లేదు. గడిచిన 45 రోజుల్లో జిల్లాలో ఆరు బాల్య వివాహాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. కల్యాణలక్ష్మికి దూరం ఆడ పిల్ల పెళ్లి కోసం పభుత్వం కల్యాణ లక్ష్మి పథ కం కింద ఆర్థిక సాయం అందజేస్తోంది. బాల్య వి వాహాలు చేస్తే ఈ పథకానికి అర్హులు కారు. అయి తే కొందరు అధికారులు కల్యాణలక్ష్మి పథకాన్ని బాల్య వివాహం చేసుకున్న వారికి కూడా వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు(ఎం) మండలంలో బాల్య వివాహం జరిగిన బాలిక కుటుంబానికి కళ్యాణలక్ష్మి చెక్కు అందజేశారు. ఈవిషయంలో అధికారులు విచారణ కూడా చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, 21 ఏళ్లు నిండిన యువకుడితో వివాహం జరిగితే కల్యాణ లక్ష్మి పథకంలో అర్హత సాధిస్తారని అధికారులు చెబుతున్నారు. నిరక్ష్యరాస్యత, పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరిగేందుకు నిరక్షరాస్యత, పేదరికం, ఆర్థిక భారం, ఆడపిల్లంటే అభద్రతాభావం ప్రధాన కారణాలని తెలుస్తోంది. కొందరు తల్లిదండ్రులు తమ కుమార్తెకు వివాహం చేయడానికి ఆర్థిక స్థోమత ఎక్కడ అడ్డువస్తుందోన ని చిన్న వయస్సులోనే పెళ్లి చేస్తున్నారు.ఆడపిల్ల ఏ దో ఒక రోజు బయటకు వెళ్లాల్సిందేనని, అదేదో వచ్చిన మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవా లని అని కూడా బాల్య వివాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి 19 వరకు వెలుగుచూసినవి.. ఫిబ్రవరి 1న : తుర్కపల్లి మండలం ముల్కలపల్లి పంచాయతీ కిమ్యాతండా ఫిబ్రవరి 27న : తుర్కపల్లి మండలం గొల్లగూడెం పంచాయతీ పరిధిలో రామోజీనాయక్ తండాలో మార్చి 2న : వలిగొండ మండలం పహిల్వానర్పురంలో మార్చి 10న : సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో మార్చి 12 : తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో మార్చి 19 : భువనగిరి మండలం పచ్చబొర్లతండాలో 18వివాహాలు అడ్డుకున్నాం జిల్లాలో 18 బాల్య వివాహాలను అడ్డుకున్నాం. జిల్లా ఆవిర్భావం తర్వాత ఆలేరు, మోత్కూర్, భువనగిరి, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జరిగిన బాల్య వివాహాలపై స్పందించాం. వెంటనే అక్కడికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాలను అడ్డుకున్నాం. బాల్య వివాహాలు చేస్తే ప్రభుత్వ పథకాలు అందవు. చట్టపరంగా శిక్షలు ఉంటాయి. –జిల్లా మహిళా సంక్షేమాధికారి శారద -
పద్నాలుగేళ్ల బాలికకు వివాహం
తిరుమలగిరి (తుంగతుర్తి) : పద్నాలుగేళ్ల బాలికకు వివాహం చేసిన తల్లిదండ్రిపై తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐసీడీఎస్ సూపర్వైజర్ షమీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ఇట్యబోయిన లింగయ్య, పద్మ కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆ బాలికకు జనగామ జిల్లా పాకాలకు చెందిన యువకుడితో నాలుగురోజుల క్రితం వివాహం జరిపించారు. అయితే గతంలో బాలికకు వివాహం నిశ్చయం కాగా, తల్లిదండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చి హామీ పత్రం కూడా తీసుకున్నామని తెలిపారు. అయినా వారు వివాహం చేయడంతో సమాచారం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాలికలకు వివాహం జరిపితే బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇక ‘కల్యాణలక్ష్మి’కి రూ.1,00,116
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లికి అందజేస్తున్న సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.75,116గా ఉన్న మొత్తాన్ని రూ.1,00,116కు పెంచుతున్నట్టు ప్రకటించింది. సోమవారం ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట అందజేస్తున్న సాయాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వారి ఆశీర్వాదమే కొండంత అండ ‘అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించి మరో శుభవార్తను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని రూ.లక్షా నూట పదహార్లకు పెంచుతున్నట్టు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నా. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచే కాకుండా.. సమాజహితం కోరే వారందరి నుంచి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నా. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నా’అని సీఎం పేర్కొన్నారు. ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లని.. గుండెల మీద కుంపటిగా భావించే మానసిక స్థితికి నిరుపేదలు మారుతున్నారని, కడుపులో ఉండగానే భ్రూణహత్యలకు పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని సభ దృష్టికి తెచ్చారు. ‘కొన్ని ఇళ్లల్లో ఆడపిల్లలు పెళ్లి లేకుండానే ఉండిపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కల్యాణలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రారంభించాం. ఆడపిల్లల కన్నీరు తుడుస్తున్న ఈ పథకం వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది’అని వివరించారు. ఇప్పటిదాకా 3.60 లక్షల మందికి లబ్ధి ‘తొలుత కల్యాణలక్ష్మి పేరుతో ఎస్సీ, ఎస్టీలకు, షాదీముబారక్ పేరుతో మైనారిటీ వర్గాలకు రూ.51 వేలు అందించటం ప్రారంభించాం. ప్రజల అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపజేశాం. గతేడాది ఈ మొత్తాన్ని రూ.75,116 పెంచాం. ఇప్పటి వరకు 3.60 లక్షల మందికి లబ్ధి చేకూరింది’అని సీఎం తెలిపారు. ఈ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను కూడా సాధించిందని, లబ్ధి పొందేవారి అర్హత వయసు 18 ఏళ్లుగా నిర్ణయించినందున ఈ ప్రయోజనం పొందేందుకు ఆడపిల్లకు ఆ వయసు వచ్చే వరకు పెళ్లిచేయకుండా ఆపుతున్నారని కేసీఆర్ తెలిపారు. ఫలితంగా బాల్య వివాహాల నిరోధానికి దోహదపడుతోందని వెల్లడించారు. ఈ పథకం కింద జరిగే వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తోందని, ఇది పథకం సాధించిన మరో ప్రయోజనమన్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయగానే సభలోని అధికార పక్ష సభ్యులు పెద్దపెట్టున బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. -
వివాహ వయస్సులో వెనకడుగు
సందర్భం శాసనాలు చేసేవారు బాలికలపట్ల వివక్షతో కూడిన భావజాలంతో ఉంటే బాలికలకు అనుకూలమైన చట్టాలు వచ్చేది ఎప్పుడు? బాలికలను చిన్న వయస్సులో వివాహ బలిపీఠం బారినుండి కాపాడటం అత్యంత ఆవశ్యం. మా సంస్థ లక్ష అమ్మా యిల సంతకాలు సేకరిం చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర గవర్నర్ గారికి ఆ సంతకాలు సమర్పించడా నికి సహకరించాల్సిందిగా నాకు అత్యంత సన్నిహితు డైన ఓ ఎంపీ గారిని కోరగా, అమ్మాయిల వివాహ వయస్సు 21కి మార్చాలా, పురు షులపై అమ్మాయిలు చేస్తున్న అకృత్యాలు చాలవా అంటూ హేళనగా మాట్లాడారు. సరే పురుషుల అభి ప్రాయం దాదాపు ఇలానే ఉంటుందనుకుని, ఒక రాజ్యాంగ సంస్థకు అధినేతగా ఉన్న ఓ మహిళా నాయ కురాలిని అడిగాను ‘తల్లీ, అమ్మాయిల కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలకు మార్చాలని లక్ష సంత కాలు సేకరించాం తీసుకుంటారా’ అనగానే వెంటనే వచ్చిన సమాధానం ‘నాకు వల్లమాలిన పనులు న్నాయి కానీ మరి పురుషుల కనీస వివాహ వయస్సు 30 ఏళ్లకు చేయాలంటారా’ అని ప్రశ్నించారు. ఈపై రెండు ఉదాహరణలు ఎందుకిచ్చానంటే ఒకరు పార్లమెంటులో చట్టం చేయగలిగిన వ్యక్తి, మరొకరు స్త్రీల సమస్యలను ఎత్తిచూపి పరిష్కారం చూపగలిగిన వ్యక్తి, వీరి భావజాలమే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఏంటి? పురుషుల కన్నా స్త్రీల వయస్సు పెళ్లి విషయంలో కచ్చితంగా తక్కువకే ఉండాలా? ఇది ఏ శాస్త్ర ప్రకారం? ఇది పురుషాధిక్య సమాజంలో కరడుగట్టిన భావజాలం తప్ప ఎలాంటి శాస్త్రీయత లేదు, పైగా వివాహ వయస్సులో స్త్రీ, పురుషులకు తేడా ఉండాలన్నది అశాస్త్రీయమైన పురు షాధిక్య భావజాలం తప్ప మరోటి కాదు. 1929లో బ్రిటిష్ ఇండియా పార్లమెంట్లో రావ్ సాహెబ్ హరవిలాస్ శారద.. కనీస వివాహ వయస్సు అమ్మాయిలకు 14 సంవత్సరాలు, అబ్బాయిలకు 16 సంవత్సరాలు ప్రవేశ పెట్టకముందు, అసలు కనీస వివాహ వయస్సు అనేదే లేకుండా అష్ట వర్షాత్, భావేత్ కన్య అంటే 8 సంవత్సరాల అమ్మాయిని కన్యగా భావించి పెళ్లిళ్లు చేయాలన్నది నాటి ఆచా రంగా ఉండేది. అలాగే 8 ఏళ్లను గర్భాష్టకాలుగా అంటే తల్లి కడుపులో బిడ్డ పడ్డప్పటినుండి లెక్కించి అంటే 7 సంవత్సరాల వయస్సును 8 ఏళ్లుగా పరి గణించవచ్చని సెలవిచ్చారు. ఇది సైన్స్ శాస్త్ర సాంకేతిక విద్యారంగాల్లో ఎలాంటి అభివృద్ధిలేని రోజులనాటి మాట, అలాగే స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేని సమా జంలో భావన, కానీ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి అంటున్నారు, స్త్రీ పురుషులకు లింగభేదం లేదు అంటున్నారు. స్త్రీ జనోద్ధరణ, స్త్రీ విద్యను ప్రోత్సహి ద్దామని, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం లింగ భేదాలు లేవు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు తున్నారు. కానీ అసలు విషయానికి వచ్చేసరికి లింగ వివక్షతో పెళ్లిళ్ల కనీస వయసును అమ్మాయిలకు 18 సంవత్సరాలుగా, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా నిర్ణయించుకున్నాం. కానీ దీనికేమైనా శాస్త్రీయత ఉందా, 18 సంవత్సరాలకు పెళ్లైతే కనీసం గ్రాడ్యు యేషన్ విద్య అయినా బాలికలు పూర్తి చేసుకోగలుగు తున్నారా? గ్రాడ్యుయేషన్ వరకైనా చదవంది తమ జీవితంలో వచ్చే విపత్కర పరిస్థితుల్లో, సొంత కాళ్లపై ఆర్థికంగా నిలబడగలరా? ఇక వ్యక్తిగత సమస్యలకు వస్తే 18 ఏళ్ల వయస్సులో లైంగిక సంపర్కానికి మానసికంగా సంసిద్ధులై ఉండరని మానసిక నిపు ణులు చెబుతుంటే, ఈ వయసులో పెళ్లైతే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్లు అధికమని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు. 18 ఏళ్లకు పెళ్లైతే వెంటనే పిల్లలు పుట్టిన పిల్లల్లో 47 శాతం మంది పురిటిలోనే చని పోతున్నారని, 69 శాతం మంది తల్లులు ప్రసవ సమ యంలో చనిపోతున్నారని.. ఇది అన్ని అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లో జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తీ నోరూ బాదుకుంటున్నది. అలాగే చిన్న వయసులో పెళ్లై కాపురానికి వెళ్లిన బాలి కలపై లైంగిక దాడులు అధికంగా ఉన్నట్లు మన దేశ నేరాల నమోదు సంస్థ తేటతెల్లం చేసింది. అలాగే 21 ఏళ్ల లోపు జరిగిన పెళ్లిళ్లలో విడాకులు అధిక శాతంగా ఉన్నాయని కేంద్ర మహిళా కమిషన్ స్పష్టం చేసింది. ఇన్ని అనర్థాలకు కారణమవుతూ, బాలికల జీవి తంలో అడ్డంకులు కల్పించే కనీస వివాహ వయ స్సును 18 నుంచి 21 ఏళ్లకు ఎందుకు మార్చ కూడదు? బాలికలకు 18, బాలురకు 21 అని లింగ వివక్షను ఇంకా ఎంతకాలం కొనసాగిద్దాం? నేటి సమాజంలో సహితం కొనసాగుతున్న వందేళ్ల కింది నాటి ‘అష్ట వర్షాత్ భావేత్ కన్య’లాంటి భావనలు మన మనస్సులోనుంచి ఎప్పుడు తొలగిపోతాయి? శాసనాలు చేసేవారు బాలికలపట్ల వివక్షతకు కూడిన భావజాలంతో ఉంటే బాలికలకు అనుకూల మైన చట్టాలు వచ్చేది ఎప్పుడు? అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహ వయస్సులో తేడా ఉండాలన్న అశాస్త్రీయ, పురుషాధిక్య భావజాల వైఖరిని పక్కన పెట్టి బాలికల మేలు కోరి వారు ఇటు ఆర్థిక స్వావలం బన ఆరోగ్య ఆలోచన పరిపుష్టి కలిగాకే వివాహాలు జరిగేలా అమ్మాయిల కనీస వయస్సు 18 ఏళ్ల నుండి 21 ఏళ్లకు మార్చాలన్న బాలల హక్కుల సంఘం వాదనను బలపరచి బాలికలను చిన్న వయస్సులో వివాహ బలిపీఠం బారినుండి కాపాడండి. వ్యాసకర్త అచ్యుతరావు గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్: 93910 24242 -
ప్రతి పెళ్లీ నమోదు కావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లిని చట్ట ప్రకారం నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. అన్ని గ్రామాల్లో కచ్చితంగా వివాహాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి అనుగుణంగా పంచాయతీలకు డీపీవోలు సర్క్యులర్ పంపారు. వివాహాల నమోదుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ‘పంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. మహిళా, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసి అందుబాటులో ఉంచాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. మీ–సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలి’అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా.. బాల్య వివాహాలను అరికట్టడం, వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ప్రతి పెళ్లిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. కానీ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వివాహాల నమోదులో ఆశించిన పురోగతి లేదు. ఇప్పటివరకు వివాహాల రిజిస్ట్రేషన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనో.. తహసీల్దార్ కార్యాలయాల్లోనో నమోదయ్యేవి. తాజాగా పంచాయతీ స్థాయిలో ధ్రువీకరిస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధనలు సడలించింది. అయినా పెద్దగా పురోగతి లేకపోవడంతో వివాహాల రిజిస్ట్రేషన్‌తో అనేక రకాల ఉపయోగాలున్నాయని ప్రచారం చేస్తూ గ్రామాల్లో నమోదు పెంచాలని పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. -
సాక్ష్యం చెబుతున్న భావన రాకూడదు
సాక్షి, హైదరాబాద్: కోర్టుల్లో బాలల సాక్ష్యాలు నమోదు చేసేప్పుడు స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, కోర్టుల్లో సాక్ష్యం చెబుతున్నారనే భావన బాలల్లో లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. బాలల న్యాయం చట్టం (జువెనైల్ జస్టిస్ యాక్ట్) నిబంధనల మేరకు జిల్లాల్లో బాలల స్నేహపూర్వక కోర్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. బాల్య వివాహాలు, లైంగిక వేధింపు నేరాల నుంచి బాలల్ని రక్షించేందుకు ఈ చర్యలు అవసరమని కోర్టు పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లోని బాలల హక్కుల కమిషన్‌ల్లో ఖాళీల భర్తీకి కేంద్ర, రాష్ట్రాలన్నీ ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారణ జరిపింది. కోర్టు రాష్ట్రాలు బాలల హక్కుల పరిరక్షణకు వివిధ చర్యలు తీసుకోవాలని గత నెల 9న ఆదేశించింది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ రాసిన లేఖను విచారించిన ఉమ్మడి హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. బాలబాలికలతో స్నేహపూర్వక విచారణలు జరిపేందుకు తీసుకునే చర్యల గురించి తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ.. ప్రతివాదులైన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం/శిశు సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు, జైళ్ల శాఖల డైరెక్టర్ జనరళ్లు, న్యాయ సేవాధికార సంస్థల రాష్ట్ర సభ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. -
పాపం..బాలికలు
సాక్షి ప్రతినిధి ఖమ్మం: ఆధునిక ప్రపంచలోనూ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆ.. ఆడపిల్లే కదా అని తల్లిదండ్రులు కూడా చిన్నచూపు చూస్తున్నారు. ఏ నాటికైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిందేగా.. పెద్ద చదువులెందుకులే అని చాలామంది భావిస్తున్నారు. కొందరైతే అమ్మాయిలను సర్కారు బడులకు, అబ్బాయిలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించే ఆనవాయితీ పాటిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వ బడుల్లో విద్యార్థినుల సంఖ్య అత్యధికంగా ఉంటే, బాలుర సంఖ్య తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 292 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా వాటిలో 82,445 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 46,981మంది బాలురు కాగా 35,464 మంది బాలికలు ఉన్నారు. అయితే బాలికల కంటే బాలురు అత్యధికంగా 11,517 మంది ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 13వ స్థానం సాధించారు. జిల్లా వ్యాప్తంగా 19,127మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, 16,749మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా సరాసరి ఉత్తీర్ణత 87.57గా నమోదైంది. వీరిలో 9,614మంది బాలురకు గాను 8,380మంది, 9,513మంది బాలికలకు గాను 8,369మంది ఉత్తీర్ణత సాధించారు. పై చదువులు కష్టం.. జిల్లాలో బాలికలు పైచదువులకు దూరం అవుతున్నారు. 10 వతరగతి వరకు గ్రామస్థాయిలో, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉంటూ చదువులు సాగిస్తున్నారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత కొందరు ఆర్థిక స్థోమత లేదని, మరి కొందరు ఆడపిల్లను బయటకు పంపడం కుదరదని చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. చదువుల్లో ఆణిముత్యాల్లా రాణిస్తున్నా వనరులు, సమాజంలో పరిస్థితుల ప్రభావం నేపథ్యలో బాలికా విద్య అర్ధంతరంగా ముగించాల్సి వస్తోంది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో చదివి, పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థిని ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు చేరడం లేదు. కేజీబీవీల్లో చదివిన విద్యార్థినుల్లో కొందరికి తల్లి, మరికొందరికి తండ్రి లేరు. దయనీయ పరిస్థితుల్లో పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. పాఠశాలల్లో ప్రతిభ చాటుకున్నప్పటికీ..ఆ తర్వాత ఇళ్లకు పరిమితం కావాల్సి వస్తోంది. ఇంటర్‌తోనే పెళ్లి.. నేటికీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు తండాలు, కుగ్రామాల్లో బాలికలకు పదో తరగతి తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పైచదువులు చదవాలని ఉన్నా హాస్టల్ సౌకర్యం, సీట్లు దొరక్క చదువులు మధ్యలో మానేసి ఇళ్ల వద్ద ఉంటున్నారు. అటోఇటో ఇంటర్మీడియట్ చదివించి..అక్కడితో ఆపుజేయిస్తున్నారు. పెళ్లి తతంగం పూర్తి చేయించి, అత్తారింటికి సాగ నంపుతున్నారు. -
రూ.250 కోట్లతో సర్కారీ బడుల్లో వసతులు
బషీరాబాద్(తాండూరు) : తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 500 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని రూ.2.50 కోట్లతో వసతులు కల్పించనుందని సాధన స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర డైరెక్టర్ మురళీ మోహన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని 30 స్కూళ్లలో రూ.12 లక్షలతో లైబ్రరీలు, రూ.3 లక్షలతో సైన్స్ ఎడ్యుకేషన్ కిట్స్ అందజేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలో పది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.1.20 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్‌లు, మరుగుదొడ్లు నిర్మించామని స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి మండలంలో 25 మంది విద్యావలంటీర్లను నియమించి నెలనెలా వేతనం ఇస్తున్నామని వెల్లడించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ.15 లక్షలతో బాలికల విద్య, బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లాన్ ఇండియా ద్వారా ప్రముఖ ఐటీ కంపెనీలు ఒరాకిల్, క్యాబ్ జెమినిల ఆర్థిక వనరులతో మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాల్లోని స్కూళ్లకు క్రీడా సామగ్రి అందించడం, మైదానాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం, గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వంటిæ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, విద్యాహక్కు చట్టంపై ఆయా గ్రామాల్లో కళాజాత బృందాలతో ప్రజలను చైతన్యం చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవర్చేందుకు అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒరాకిల్ ఐటీ కంపనీల మేనేజర్ శాంతి, బెంగళూరు స్నైడర్ కం పనీ ప్రతినిధి సుగంధ, ప్లాన్ ఇండి యా అధికారులు చందన్, అభిలాష్, స్థానిక విద్యాధికారి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
ఆ...డపిల్లనట!
ఆడ పిల్ల పుట్టింది. మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది. అవును మా అమ్మ పుట్టింది..కాదండీ అంతా మా నాన్న పోలిక. ఉప్పొంగిన తల్లిదండ్రుల ఆప్యాయత ఇది. క్రమేణా వీరి అమృతమంటి ప్రేమతోపాటు పసిబిడ్డా ఎదిగింది ఆడపిల్లగా.. ఇదిగో భయం.. అమ్మ అనురాగం ఆందోళన పడింది.. మమకారం నిండిన నాన్న గుండె బరువెక్కింది. ‘మంచి సంబంధం వచ్చింది. ఎన్ని రోజులు ఉంచినా ఆడ పిల్ల మనపిల్ల కాదే’.. ‘అవునండీ. ఆ...డపిల్లే.. పిల్ల చదువు మరి’.‘.ఆడ పిల్లకు చదువెందుకే’ .. రేనండీ’.. అదిగో బాల్యం మెడలో పడిన తాళి ఆలిని చేసింది. మెట్టినింట బానిసగా మార్చేసిన అజ్ఞానకేళి వెర్రిగా నవ్వింది. గుంటూరు(ఎస్వీఎన్కాలనీ): జిల్లాలో బాల్య వివాహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి పేదరికం, అజ్ఞానం, ప్రేమ పెళ్లిళ్లు, మూఢ నమ్మకాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్ద నమోదైన ఫిర్యాదుల్లో 7 నుంచి 11వ తరగతిలోపు, 12 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సామాజిక పరిరక్షణ పేరుతో బాల్య వివాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది. శాఖల మధ్యసమన్వయలోపం పసితనానికి మాంగల్య బంధం పడటానికి ప్రధాన కారణం శాఖల మధ్య సమన్వయలోపమే. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ముందుగా సమాచారం ఉండేది గ్రామ పంచాయతీలకే. వీరు కనీసం తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిం చడం లేదు. పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల మధ్య సమన్వయలోపమే ఇందుకు కారణ. సర్పంచ్‌లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలతోపాటు ఉన్నతాధికారులు సైతం బాల్య వివాహాలను అడ్డుకోవడం లేదు. తాంబూలాలు మార్చుకుని తీరా వివాహానికి సిద్ధమైన రోజు గ్రామంలో ఎవరో ఒకరు స్వచ్ఛంద సంస్థలకు, ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారమిస్తున్నారు. ఆ సమయంలో అధికారులు స్పందించి బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా డబ్బులు పోగు చేసుకుని పెళ్లికి సిద్ధమైన తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయంటే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం బాలికలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. వీరిలో 58 శాతం 19 ఏళ్లు కూడా నిండకుండానే తల్లులవుతున్నారు. యంగ్ లైవ్స్ ఇండియా, చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫౌండేషన్, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ సంయుక్త అ«ధ్యయనంలో వెల్లడైన చేదు నిజా లివి. 15 ఏళ్ల తరువాత కూడా చదువును కొనసాగించిన అమ్మాయిలతో పోల్చితే ఈలోపు చదువు ఆపేవారే ఎక్కువగా బాల్య వివాహాలకు లోనవుతున్నారు. బాల్య వివాహాల్లో పురుషుల కేవలం 2 శాతం మాత్రమే. బాల్య వివాహానికి హాజరయ్యే వారూ శిక్షార్హులే బాల్య వివాహానికి హాజరయ్యే వారందరూ శిక్షకు అర్హులేనని చట్టం చెబుతోంది. తమిళనాడులో ఓ బాల్య వివాహంలో పెళ్లి వీడియో ద్వారా దాదాపు 300 మందిపై కేసులు నమోదు చేశారు. బాల్య వివాహ నిషేధ చట్టం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు వివాహ వయసు నిర్ణయించింది. అతిక్రమిస్తే నేరానికిగాను రెండేళ్లు కారాగార శిక్ష, లక్ష జరిమానా విధిస్తుంది. పెళ్లి చేసిన, పెళ్లి చేసుకున్న, పౌరహిత్యం జరిపిన, వేదిక ఇచ్చిన, ప్రోత్సహించిన సంస్థలకూ శిక్ష వర్తిస్తుంది. చట్టంలో వధువుకు, వధువు తల్లికి, తండ్రికి శిక్ష వర్తింపు మినహాయింపు ఉంటుంది. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి బాల్య వివాహాలు ఆపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, పురోహితులు ఇందుకు ముఖ్యపాత్ర పోషించాలి. పెళ్లి రోజు వరకు రాకుండా ముందస్తుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. లేదంటే అధికారులకు సమాచారమివ్వాలి. మా వంతుగా అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.– శ్యామసుందరి, పీడీ ఐసీడీఎస్ -
బాల్య వివాహాలపై నిఘా
చిత్తూరు కలెక్టరేట్: శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో బాల్య వివా హాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉం చాలని కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. ఆయన శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాళహస్తి ఆలయ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా 13, 14వ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారని, బాల్య వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఆ రెండు రోజులు ఆలయ పరి«ధిలో నిఘాను మరింత పెంచాలని సూచించారు. ఇందుకోసం పోలీసులతోపాటు, అంగన్వాడీ కార్యకర్తులు, వెలుగు సిబ్బందిని వినియోగించుకోవా లని పేర్కొన్నారు. బాల్య వివాహాలను ముందుగానే గుర్తించి సంబందీకులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించాలని, రాత్రుల్లో విద్యుత్ దీపకాంతులతో ఆలయం శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. తాగునీరు, ఆహారం, స్నానపు ఘట్టాలు, మరుగుదొడ్లు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య కేంద్రాలను ఏర్పాటుచేసి, భక్తులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి పట్టణం పరిధిలోని రోడ్లను శుభ్రంగా ఉంచి, రాత్రింబవళ్లు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులకు సూచించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అక్కడక్కడా సూచిక బోర్డులు, ప్రధాన కూడళ్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు బస్సులు నడపండి ముక్కంటీశుని బ్రహ్మోత్సవాలకు జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని, అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు బస్సు సర్వీసులను కూడా నడపాలన్నారు. ఎక్కువగా వచ్చే ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. స్వామివారి దర్శన క్యూలలో భక్తులకు అసౌకర్యం కలుగకుం డా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో శ్రీకాళహస్తి ఆలయ ఈఓ భ్రమరాంబ, పోలీసు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
మా సంక్షేమం కోసం ఏమీ చేయడం లేదు
సాక్షి, హైదరాబాద్: బాల్య వివాహాల బాధితులుగా మారుతున్న బాలికలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దీనిపై చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు బాల్య వివాహాల బాధిత యువతులు హైకోర్టుకు లేఖ రాశారు. బి.మహాలత, 10 మంది బాధిత యువతులు ఈ లేఖ రాశారు. హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. బాల్య వివాహాల వల్ల బాలికలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆ యువతులు లేఖలో పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో, బలహీనంగా పుడుతున్నారని, చాలా సందర్భాల్లో పిల్లల మరణాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు వివరించారు. బాధిత యువతులకు విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. బాల్య వివాహాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
బాల్యవివాహాల నిరోధక చట్టం ఇలా..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ఆర్థిక అసమానతలు.. నిరక్షరాస్యత.. బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ.. జిల్లాలో బాల్య వివాహాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా ఈ వివాహాలు ఆగడంలేదు. అధికారుల దృష్టికి 10 శాతం మాత్రమే వస్తుండగా.. 90 శాతం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. జిల్లా శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) అధికారులు ఆపిన వివాహాలు అతి తక్కువగానే ఉన్నాయి. గత మూడేళ్లుగా జిల్లాలో 227 బాల్య వివాహాలు మాత్రమే అపినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరి లెక్కలోకి రాని వివాహాలు అనేకం ఉంటున్నాయి. ఈ బాల్య వివాహాలను నిరోధించే చట్టం బ్రిటీష్ కాలం 1929 నుంచి అమలులో ఉంది. ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహల నిరోధక చట్టం–2006ను రూపొందించింది. వివాహానికి వయసును బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లుగా ఈ చట్టంలో నిర్ధారించారు. మరి ఈ చట్టం ఏమి చెబుతుందో తెలుసుకుందాం. నేరస్తుల విచారణలో.. 18 ఏళ్ళ వయస్సు పైబడిన వ్యక్తి బాలికను వివాహం చేసుకున్నట్టయితే అటువంటి వ్యక్తి శిక్షార్హుడని చట్టం పేర్కొంటోంది. బాల్య వివాహం నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్న వారిలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇతర వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే ఈ చట్టంలో శిక్షార్హులుగా నిర్దేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడినవారిలో మహిళలుంటే మాత్రం వారికి జైలుశిక్ష విధించరాదని, జరిమానా రూపంలో శిక్ష విధించాలని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. బాల్య వివాహం–నేరం–శిక్ష ♦ బాల్య వివాహాన్ని ప్రోత్సహించేవారు, చేసే వారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ♦ బాల్య వివాహం జరిపి తర్వాత ఆ మైనరు బాలికను అక్రమ రవాణా చేయడానికి/ఆమెను దాచేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ♦ బాల్య వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ♦ చట్టాన్ని ఉల్లంఘించి, మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్య వివాహాన్ని ఏ మత సంప్రదాయాలలో జరిపినా ఆ వివాహం చెల్లదు. ♦ ఈ చట్టం కింద నమోదయ్యే కేసులో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాన్ని ఆపవచ్చు. ♦ ఈ చట్టం కింద నేరస్తులకు శిక్షతో కూడిన లేదా బెయిలుకు వీలులేని శిక్ష విధిస్తారు. ఈ చట్టం కింద శిక్షార్హులయ్యే వ్యక్తులు ♦ ఇరు పక్షాల తల్లిదండ్రులు / సంరక్షకులు ♦ పురోహితులు ♦ ఇరుపక్షాల ఇరుగు పొరుగువారు ♦ అటువంటి వివాహాలు కుదర్చడానికి బాధ్యత వహించే పెళ్లి సంఘాలు/వ్యక్తులు ♦ ఈ వివాహానికి హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు ♦ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న పెళ్లికొడుకు ♦ సమాచారం అందించేవారి వివరాలు గోప్యంగా.. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు(ఫోన్ నంబర్ 100), మహిళా శిశుసంక్షేమ శాఖ పథకం సంచాలకులు, ఐసీపీఎస్, చైల్డ్‌లైన్(ఫోన్ నంబర్ 1098), తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో అయితే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తెలియజేయవచ్చు. అవసరమైతే సామాజిక సేవా కార్యకర్తలకు కూడా సమాచారం ఇవ్వవచ్చు. సమాచారం అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. బాల్య వివాహం వల్ల వచ్చే సమస్యలు ♦ అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకముందే, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండకముందే వివాహం చేయడం వారి ఆరోగ్యానికి అంత క్షేమకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ♦ ప్రధానంగా స్త్రీలు త్వరగా రక్తహీనతకు గురికావడం, అనారోగ్య శిశువులు జన్మించడం, అవయవ ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు ఎక్కువగా జరగడం ♦ త్వరగా గర్భం దాల్చడంవల్ల వారు త్వరగా బలహీనంగా మారతారు. ఆమెకు పుట్టే బిడ్డకు జన్యుపరమైన సమస్యలతోపాటు, పోషకలోపాలతో జన్మించడం. ♦ అధిక సంఖ్యలో గర్భస్రావాలు, మాతృ శిశు మరణాలు జరుగుతున్నట్టు వివిధ సర్వేలు చెపుతున్నాయి. ♦ దంపతుల మధ్య అవగాహన లోపంతో కుటుంబంలో కలహాలు రావడం, త్వరగా విడిపోయే అవకాశం. ♦ మానసిక సరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం. ♦ కుటుంబ హింసకు, లైంగిక హింసకు ఇంకా పలు సమస్యలు బారిన పడే అవకాశం ఉంది. -
మూడు ముళ్ల... 'గండం'
సరస్వతీ పుత్రికలు క్రమశిక్షణలో సుశిక్షిత సైనికులు ఏ పరీక్షల ఫలితాలు వచ్చినా బాలికలే టాప్ కిశోరమణులంటూ ప్రశంసలెలా ఉన్నా... మరోవైపు జీవిత విషమ పరీక్షలు ఎదుర్కొంటున్నారు... పదో తరగతి పరీక్షలు వస్తున్నాయంటే పుస్తకాలతో కుస్తీ పట్టాలి... కానీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మూడైదుల వయసు దాటకుండానే మూడు ముళ్ల బంధంలో బందీలైపోతున్నారు... రాయవరం (మండపేట): విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థినులు వార్షిక పరీక్షల కంటే కూడా తమ తల్లిదండ్రులు ఎక్కడ బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతారోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన బాల్య వివాహాలను పరిశీలిస్తే ఎక్కువగా 9,10, ఇంటర్ విద్యార్థినులే బాల్య వివాహాలకు బందీలవుతున్న విషయాన్ని చైల్డ్‌లైన్ అధికారులు అంగీకరిస్తున్నారు. గత నాలుగేళ్లలో 189 బాల్య వివాహాలు నమోదయ్యాయి. ఏటా అధికారికంగా 90కి పైగా బాల్య వివాహాలు.. జిల్లాలో చాలా మంది తల్లిదండ్రులు 10వ తరగతి పూర్తికాగానే బాలికలకు పెళ్లిళ్లు చేయడానికే మొగ్గుచూపుతున్నారు. ఆడపిల్లలు చదివితే వారి చదువుకు తగ్గ వరుడు లభించరనేది ఒకటైతే, దీనికితోడు అమ్మాయిలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవాలంటే రక్షణ ఉండదన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది. దీనికితోడు ఆర్థిక, సామాజిక పరిస్థితులు, నమ్మకాలు బాలికలకు శాపంగా మారుతున్నాయి. జిల్లాలో 8,9 తరగతులు చదివే విద్యార్థినులకు కూడా పెళ్లిళ్లు చేసిన సందర్భాలు గతంలో వెలుగు చూశాయి. కారణమేదైనా ఏటా పదుల సంఖ్యలో బాల్య వివాహాలు జరిగి పోతున్నాయి. జిల్లాలో ఏటా 50కి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. 2012 నుంచి 2017 వరకు 400కి పైగా బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2017లో 64 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. పది, ఇంటర్ విద్యార్థినుల్లో ఆందోళన.. పది, ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ కొందరు విద్యార్థినుల్లో భయం ప్రారంభమవుతోంది. పరీక్షలు ముగియగానే పెళ్లి చేసేస్తారేమోనన్న భయంతో పరీక్షల కసరత్తు వైపు దృష్టి సారించడం లేదు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో తొమ్మిదో తరగతి 34,032, పదో తరగతి 31,493, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 49,955 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఏటా సుమారు 50కి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తిస్తుండగా అధికారులకు తెలియకుండా అదనంగా వందల సంఖ్యలో చాపకింద నీరులా వివాహాలు సాగిపోతున్నాయి. బాల్య వివాహాల్లో ఎక్కువగా 10, ఇంటర్ ఉత్తీర్ణత చెందిన వారే ఉండడం విచారకరం. కిశోర బాలికలతో అవగాహన.. శిక్షణ పొందిన కిశోర బాలికలతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థినులకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మైదాన ప్రాంతంలో ఉన్న 59 హాస్టళ్లలోని 574 మంది శిక్షణ పొందిన కిశోర బాలికలు 14,980 మంది బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించే ప్ర యత్నం చేస్తున్నారు. బాల్య వివాహాలకు తల్లిదండ్రులు బలవంతంగా ప్రయత్నిస్తే ఎవరి సహాయం తీసుకోవా లనే విషయాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 30న ఏజెన్సీలో అవగాహన కల్పించేందుకు 155 మంది కిశోర బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆరోగ్య సమస్యలు అధికం.. వయస్సు రాకముందే బాలికలకు వివాహం చేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పుట్టబోయే బిడ్డలపై కూడా ఈ ప్రభావం పడనుంది. తల్లిదండ్రులు బాలికలను బాగా చదివించి 18 సంవత్సరాలు నిండిన తరవాతే పెళ్లి చేయాలి. – డాక్టర్ డి.సంధ్యాదేవి, పీహెచ్సీ, మాచవరం, రాయవరం మండలం. అన్ని రకాల సమస్యలకూ మూలం.. బాల్య వివాహాలు చేయడం అన్ని రకాల సమస్యలకూ మూలం. కుటుంబం, సంసారంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నిత్యం కలహాలు, సమస్యలకు దారితీస్తుంది. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే స్పందించి అడ్డుకుంటున్నాం. – వై.సుశీల కుమారి, పీవో, ఐసీడీఎస్, రాజానగరం తల్లిదండ్రుల్లో మార్పు అవసరం.. బాలికలకు చదువు పూర్తయిన అనంతరం తల్లిదండ్రులు వివాహాలు జరిపించాలి. కిశోరి పథకం కింద బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన 729 మంది యువతులకు 15 అంశాలపై శిక్షణ ఇచ్చాం. వీరు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహాలు జరిగితే 1098కు ఫోన్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. – సీహెచ్ వెంకట్రావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి, కాకినాడ. -
అమ్మా.. అప్పుడే పెళ్లొద్దమ్మా..!
వెలిగండ్ల: జిల్లాలో బాల్య వివాహాలు ఏదోఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఐసీడీఎస్, పోలీసు అధికారులు కొన్ని బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా.. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. కొన్నిచోట్ల రాత్రికి రాత్రే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో బాల్య వివాహాలు నమోదు విషయంలో జిల్లా చెప్పుకోదగ్గ స్థానంలోనే ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. బాల్య వివాహాల గణాంకాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. పేదరికం, నిరక్ష్యరాస్యత, చైతన్యం లేకపోవడం ప్రధాన కారణం. బాల్య వివాహాలను నిరోధించేందుకు నిరంతర ప్రచారం అవసరం. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి. మతాల పెద్దలు, తల్లిదండ్రులకు బాల్య వివాహాలతో కలిగే నష్టాలు, వాటి చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గణాంకాలు ఇలా.. జిల్లాలో 2014 నుంచి 2017 డిసెంబర్ వరకు 804 బాల్య వివాహాలను అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అడ్డుకున్నారు. 2014లో 237, 2015లో 274, 2016లో 249, 2017లో నేటి వరకు 44 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది వెలిగండ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల్లో బాల్య వివాహాలను ఐసీడీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. వెలిగండ్ల మండలం కంకణంపాడులో అక్టోబర్‌లో బాల్యవివాహం జరుగుతోందని సమాచారం తెలియడంతో సీడీపీఓ బి.లక్ష్మీప్రసన్న, ఎస్ఐ పి.చౌడయ్యలు రాత్రి వేళ ఆ గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ నెల 19వ తేదీన మండలంలోని కొట్టాలపల్లిలో బాల్య వివాహం చేస్తున్నారని స్వయంగా ఓ మైనర్ 100 నంబర్‌కు కాల్ చేసి వివాహాన్ని ఆపాలని కోరడం విశేషం. స్పందించిన సీడీపీఓ బి. లక్ష్మీప్రసన్న, ఎస్ఐ పి.చౌడయ్యలు జరగబోయే బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ మైనర్‌ను ఒంగోలు బాలసదన్‌కు తరలించారు. ఈ ఏడాది సీఎస్‌పురం మండలం కె.అగ్రహారంలో ఒకే రోజు రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. హనుమంతునిపాడు హాజీపురంలో జరగబోయే బాల్య వివాహాన్ని నిలువరించగలిగారు. ఇవిగో..అనర్థాలు ♦ బాల్య వివాహాలు చేస్తే ముఖ్యంగా బాలికల విషయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ♦ చిన్న వయసులోనే గర్భిణులు కావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦ నెలలు నిండకముందే ప్రసవించే ప్రమాదం ఉంటుంది. ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.. ♦వైకల్యంతో కూడిన శిశు జననాలు, మరణాలు జరగవచ్చు. ♦మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ♦శారీరక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. ♦భయంతో, సిగ్గుతో చదువు మధ్యలో నిలిపేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిరక్ష్యరాస్యతే కారణం బాల్య వివాహాలు జరిగేందుకు ముఖ్యకారణం నిరక్ష్యరాస్యత. కుటుంబ పరిస్థితులను ఆధారం చేసుకొని బాల్యవివాహాలు చేయడం పరిపాటైంది. తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని పోగొట్టాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి బాల్యవివాహాలను నిరోధించేందుకు తగు చర్యలు చేపడుతున్నాం. – బి.లక్ష్మీప్రసన్న, సీడీపీఓ, వెలిగండ్ల -
మూడు ముళ్ల బాల్యం
రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది బాల్య వివాహ బాధితుల దుస్థితి ఇదీ. ఆడపిల్లను బాధ్యత, బరువుగా భావిస్తున్న తల్లిదండ్రులు.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా పాఠశాల చదువుకూడా పూర్తికాకుండానే అమ్మాయిలకు పెళ్లి చేసేస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు, బంధువులు ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నారు. పెళ్లి, సంసారం, జీవితమంటే ఏమిటో పూర్తిగా తెలియని వయసులోనే బంధాల బాధ్యతల్లో బందీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో 1.5 కోట్ల మందికి బాల్య వివాహాలు జరగగా.. అందులో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉన్నట్లు ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో గత మూడేళ్లలో 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో 19.4 శాతం మందికి, అబ్బాయిల్లో 4.7 శాతం మందికి బాల్య వివాహం జరిగినట్లు తేలింది. ఎంవీ ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు, పాఠశాలలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, పలు ప్రభుత్వ విభాగాల నుంచి సమాచారం సేకరించింది. బాల్య వివాహాలు చేసుకున్నవారిలో 46 మందిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి.. వారి ప్రస్తుత పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. నిర్బంధ పరిస్థితులు బాల్య వివాహం జరిగిన అమ్మాయిల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. వారు సంసారం, కుటుంబం, పిల్లల బరువు బాధ్యతలతో ఓ వైపు.. ఆరోగ్య సమస్యలతో మరోవైపు కొట్టుమిట్టాడుతున్నారు. తమ ఆరోగ్య సమస్యల గురించి భర్తకు చెప్పుకోలేని నిర్బంధ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కూలీ పనో, ఏదైనా ఉద్యోగమో చేసి సంపాదించడానికి తోడు కుటుంబంలోని అందరికీ పనులు చేసి పెట్టడం, చాకిరీ చేయడం తప్పడం లేదు. దేనికి నిరాకరించినా భర్త, అత్తమామల దాడులకు గురికావాల్సి వస్తోంది. కొందరైతే కుటుంబ సభ్యుల నుంచే లైంగిక దాడులకూ గురవుతున్నారు. ఈ బాధలన్నీ పడలేక చాలా మంది ఆత్యహత్యాప్రయత్నాలు కూడా చేసినట్లు సర్వేలో వెల్లడైంది. పాలమూరు టాప్.. కరీంనగర్ లాస్ట్ బాల్య వివాహాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల బాల్య వివాహాలు జరిగితే.. మహబూబ్‌నగర్‌లోనే 26.2 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో నల్లగొండ (21.5 శాతం), రంగారెడ్డి (21.1 శాతం), ఖమ్మం, మెదక్ (21 శాతం), వరంగల్ (18 శాతం), ఆదిలాబాద్ (17.8 శాతం), నిజామాబాద్(16.3 శాతం), కరీంనగర్ (14.2 శాతం) జిల్లాలు ఉన్నట్టు ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడైంది. ఆమె పేరు రమ్య.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ బస్తీలో ఉండే ఆమెకు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. సంసారం అంటే ఏమిటో పూర్తిగా తెలియని స్థితి. పెళ్లయిన తొలిరాత్రే తీవ్ర నరకాన్ని అనుభవించింది. భర్త రోజు కూలీ. రోజూ మద్యం తాగి రావడం, వంట సరిగ్గా చేయలేదనో, డబ్బులు అడుగుతోందనో కొట్టడం, వేధించడం.. పెళ్లయిన ఈ రెండేళ్లలోనే రెండు కాన్పులు. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో తొలికాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం సరిగా లేక చనిపోయింది. రెండో కాన్పులో పుట్టిన పాప ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు. భర్త, అత్తమామలు పట్టించుకోరు. ఏం చేయాలో తెలియని ఆవేదనలో కొట్టుమిట్టాడుతోంది.. ఆమె పేరు పరమేశ్వరి.. వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు. 14 ఏళ్లకే మేనబావతో పెళ్లి చేసేశారు. కొద్దిరోజులకే గర్భం దాల్చింది. చిన్న వయసు, సరైన పోషకాహారం లేక శిశువు సరిగా ఎదగలేదు. పుట్టగానే చనిపోయింది. మరోసారి కూడా ఇలాగే జరిగింది. కొద్దినెలలకే మూడోసారి గర్భం దాల్చింది. ఈ సారి కడుపులో బిడ్డ సరిగా పెరగడం లేదని, ఇన్ఫెక్షన్ సోకిందని గర్భసంచి తీసేశారు. ఇక పిల్లలు పుట్టరనే ఆగ్రహంతో పరమేశ్వరిని భర్త, అత్తమామలు హింసించడం మొదలుపెట్టారు. రెండేళ్ల నుంచి నరకయాతన పడుతోంది.. – సాక్షి, హైదరాబాద్ బాల్య వివాహంతో ఎంతో యాతన - బాల్య వివాహం జరిగిన బాలికల్లో 67 శాతం మంది తమ సమస్యలను భర్తకు చెప్పుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. - 90% మంది బాధితులకు అనారోగ్య సమయంలో ఎలాంటి సహాయం అందడం లేదు. - 73% మంది భర్తలు నిత్యం మద్యం తాగడం, దాడికి పాల్పడడం చేస్తున్నారు. మిగతావారిలోనూ చాలా మంది తరచూ మద్యం తాగుతున్నారు. - 91% మంది భర్తలు రాత్రి 12 గంటల తర్వాత ఇంటికి వస్తున్నట్లు సర్వేలో తెలిసింది. - 85% బాధిత మైనర్లు పుట్టింటికి వెళ్లడానికి కూడా సరిగా అవకాశం ఉండడం లేదని సర్వేలో వెల్లడించారు. - 89% మంది బాధితులు కూలి పని చేయాల్సి వస్తోంది. భర్త చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. - 71% మంది అత్తమామల ద్వారా వేధింపులకు గురవుతున్నారు. - 78% మంది బాధిత అమ్మాయిలు గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. - 15% మంది మానసికంగా కుంగిపోయారు. 37% మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. - అసలు ఏ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడవలేదు. - బాల్య వివాహ బాధితుల్లో 59% మంది పెళ్లికి ముందు దినసరి కూలీలుగా పనిచేసినవారేనని.. పెళ్లి తర్వాత కూడా 41% మంది కూలిపనికి వెళుతున్నారని సర్వేలో తేలింది. అంతా 8, 10 తరగతి లోపే.. బాల్య వివాహాలు జరిగినవారిలో చాలా మంది 13 నుంచి 15 ఏళ్లలోపు వారే. 8వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న సమయంలోనే బలవంతంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత చదువుకునే అవకాశం కేవలం 3% మందికే లభించింది. బాల్య వివాహాలు జరిగినవారిలో 83% మంది భర్తతో కలసి ఉండగా.. 11% మంది వేరుగా ఉంటున్నారు. 4% మంది విడాకులు తీసుకున్నారు. 2 శాతం మంది వితంతువులున్నారు. ఆడపిల్లను కంటే వేధింపులు జరిగిందే బాల్య వివాహం. ఆపై ఆడపిల్ల పుట్టిందంటే ఇక వేధింపులే. బాల్య వివాహాలు జరిగిన అమ్మాయిల్లో 62 శాతం మంది తొలికాన్పులో ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇలాంటి అమ్మాయిల్లో 74 శాతం మంది అత్తమామల అసంతృప్తి, వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే విధంగా 50 శాతం మంది భర్తలు వేధింపులకు దిగుతున్నారు. ప్రసవించి నాలుగైదు నెలలు కాకుండానే కూలి పనులకు పంపిస్తున్నారు. సంపాదించిన డబ్బును కూడా భర్త, అత్తమామలే తీసుకుంటున్నారు. డబ్బులు అడిగితే దాడులు సైతం ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉంది. అధికశాతం బీసీలే.. బాల్య వివాహాలు జరిగిన వారిలో అత్యధికం వెనుకబడిన తరగతుల వారే. బాల్య వివాహాల్లో 43 శాతం బీసీ కులాలకు చెందినవారుకాగా.. 36 శాతం షెడ్యూల్ కులాలు, 15 శాతం గిరిజన తెగలకు చెందిన వారున్నట్టు సర్వేలో వెల్లడైంది. చట్టాలున్నా చట్టుబండలే..! బాల్య వివాహాల నియంత్రణకు 2006లో కఠిన చట్టం తీసుకువచ్చారు. దానికితోడు జువైనల్ జస్టిస్ చట్టం, బాలల లైంగిక వేధింపుల నియంత్రణ చట్టం, విద్యాహక్కు చట్టం.. ఇలా అనేక చట్టాలున్నా బాల్య వివాహాలు మాత్రం పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. రోజురోజుకూ ఆధునికత, టెక్నాలజీ, విద్యాభివృద్ధి పెరుగుతున్నా ఇప్పటికీ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. పేదరికం, నిరక్షరాస్యతే కారణం కడు పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లోనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కుటుంబాల్లో 79 శాతం కుటుంబాల ఏడాది సంపాదన రూ.50 వేలలోపే ఉంటోంది. 16 శాతం కుటుంబాల్లో రూ.51 వేల నుంచి రూ.75 వేల ఆదాయం ఉంటోంది. కేవలం 5 శాతం కుటుంబాలు మాత్రమే రూ.లక్షకుపైగా వార్షికాదాయం ఉన్నవారు. ఇక తల్లిదండ్రుల్లో పెద్దగా చదువుకున్న వాళ్లు లేకపోవడం సైతం బాల్య వివాహాలకు కారణమవుతోంది. ఇలాంటి వివాహాలు జరుగుతున్న కుటుంబాల్లో 91 శాతం మంది తల్లిదండ్రులు నిరక్షరాస్యులే. ఆరు శాతం మంది 5వ తరగతి వరకు, మూడు శాతం మంది ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. -
నియంత్రణకు సమష్టి కృషి కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలు సమష్టిగా కృషి చేస్తే, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తే బాల్య వివాహాల నియంత్రణ పెద్ద సమస్యే కాదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, ఆర్థిక భారం కారణంగా 15–18 ఏళ్ల వయసులోనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి భారం దించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న బాల్య వివాహాలు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్లాజా హోటల్లో శనివారం సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలతో వరకట్న వేధింపులు, బాధిత మహిళలకు గృహహింస ఇబ్బందులు పెరుగుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలు, సమస్యలపై తల్లిదండ్రుల్లో మరింత అవగాహన తీసుకొస్తే నియంత్రణ సులువవుతుందని పేర్కొన్నారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఒక పెళ్లి.. అనేక సమస్యలు... చిన్నతనంలోనే పిల్లలకు పెళ్లి చేయడం వల్ల జీవితాం తం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని జస్టిస్ రమా సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఒక పెళ్లి అనేక సమస్యలు సృష్టిస్తోందని, బాల్య వివాహాల వల్ల దేశంలో 78 శాతం బాధిత అమ్మాయిలు హింసను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితం జరిగిన బాల్య వివాహాల్లో 40 శాతం మంది బాధిత మహిళలు విడాకులు తీసుకున్నారని, వితంతువులయ్యారని చెప్పారు. ఇలాంటి పర్యవసా నాలు తగ్గించేందుకు న్యాయ, పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలు, జిల్లా న్యాయ సేవా సంస్థ కలసి పని చేయాలని సూచించారు. పోలీస్ శాఖ తరపున బాల్య వివాçహాల నియంత్రణకు కృషి చేస్తున్నామని, హైదరాబాద్ సౌత్జోన్లో జరుగుతున్న కాంట్రాక్టు పెళ్లిళ్లపై చర్యలు చేపట్టామని సీఐడీ ఐజీ షికాగోయల్ తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణ, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అమలు, పేర్ల నమోదుకు వెబ్సైట్ రూపొందిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ చెప్పారు. బాల్య వివాహ నియంత్రణకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తరుణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మమతా రఘువీర్ అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖ నిర్లక్ష్యం..: మహిళా కమిషన్ చైర్పర్సన్ బాల్య వివాహాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లలో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోకుండా పోలీస్‌శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, ఓ కానిస్టేబుల్‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తూర్పారబట్టారు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయా ల్సిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ విభాగాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపించారు. పెళ్లి చేసుకున్న జంట మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలని అడిగితే.. ఏ అధికారి వద్ద కూడా సరైన సమాధానం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. -
మరోసారి మూడుముళ్లు పడిన ఆ రాత్రి..
బాల్య వివాహాలను నిరసిస్తూ ... వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ మహాకవి గురజాడ తన కన్యాశుల్కం నాటకం ద్వారా జాతిని జాగృతం చేశారు. సాహిత్యపరంగా గురజాడ యుద్ధం ప్రకటించగా కందుకూరి వీరేశలింగం ఈ దుష్ట సంప్రదాయంపై పిడికిలి బిగించారు. ప్రతిఘటనలు ఎదురైనా తన సతీమణి రాజ్యలక్ష్మి సహకారంతో రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో జరిపించారు. ఆ బృహత్తర ఘట్టానికి ... చరిత్ర మలుపు తిప్పిన ఆ చారిత్రక శుభ ఘడియకు రాజమహేంద్రవరం వేదికగా నిలవడం జిల్లావాసులు గర్వించదగ్గ విషయం. ఈ వివాహానికి బాలిక తల్లే సూత్రధారిగా మారి ముందడుగు వేయడం ఓ విప్లవం. 136 సంవత్సరాల కిందట జరిగిన ఈ పరిణామం జాతి మలుపునకు దారితీసింది. రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ఇప్పుడు యీ వెధవ ఇంగిలీషు చదువు నుంచి ఆ ఫకీరు వెధవ దాన్ని లేవదీసుకుపోయాడుగాని.. వైధవ్యం అనుభవించిన వాళ్లంతా పూర్వకాలంలో యెంత ప్రతిష్ఠగా బతికారు కాదు..’ ‘ప్రారబ్ధం చాలకపోతే (వైధవ్యం) ప్రతివాళ్లకీ వస్తుంది. చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా రాసినరాత యెవడైనా తప్పించగలడా?’ ‘వెధవముండలకి పెళ్లి చెయ్యడపు పోయీకాలం పట్టుకుందేవి పెద్దపెద్ద వాళ్ళకి కూడాను?’ ‘అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల ఎంతలాభం కలిగింది? భూవులకు దావా తెచ్చామా లేదా?’....... మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’లో అగ్నిహోత్రావధానులు నోట పలికించిన ఈ మాటలు చాలు, నాటి సమాజంలోని దురాచారాలను చూపడానికి. అగ్నిహోత్రావధానులు పాత్ర ఆకాశం నుంచి ఊడిపడలేదు. నాటి సమాజంలోని దుర్నీతిని కళ్ళారాచూసిన గురజాడ కలం ద్వారా ఈ బ్రహ్మాస్త్రాలు సంధిస్తే, కందుకూరి సంస్కరణోద్యమం ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశాడు. ముక్కుపచ్చలారని బాలికను, డబ్బుకోసం కాటికి కాళ్లుచాపుకున్న వాడికి అంటగట్టడం, ఆ బాలిక వివాహం అంటే అర్థం తెలుసుకునేలోపునే వితంతువు అయితే, ఆడదాని తల రాత అంతేనని సమాధానం చెప్పడంనాడు పరిపాటి. తీవ్ర ప్రతిఘటనల మధ్య.. యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం చేపట్టిన వితంతు వివాహాలకు అసాధారణమైన ప్రతిఘటనలు ఎదురయ్యాయి. వంటవాళ్లు, మంత్రాలు చెప్పేవారిని సైతం అడ్డుకున్నారు. కందుకూరి సతీమణి రాజ్యలక్ష్మిద్వారా భర్తమీద ఈ ప్రయత్నాలు వదులుకోమని ఒత్తిడి తెచ్చారు.. అయినా, ఆమె కందుకూరికి బాసటగా నిలబడ్డారు. నాటి విద్యార్థిలోకం కందుకూరికి అండగా నిలబడింది. రాష్ట్రంలోనే తొలి వితంతు వివాహం 1881 డిసెంబర్ 11వ తేదీ రాత్రి జరిగింది. కందుకూరి ప్రాణాలు తీయడానికి కూడా నాటి కుహనా పండితులు కొందరు వెనుకాడలేదు. సుమారు 136 సంవత్సరాలకు ముందు జరిగిన ఈ పునర్వివాహానికి మంత్రాలు చదివే యాజకునికి వంద రూపాయలు ఇవ్వవలసి వచ్చిందని కందుకూరి స్వీయచరిత్రలో వివరించారు. ఆ రోజుల్లో వందరూపాయలంటే, నేటి విలువ ఎంతో ఆర్థిక నిపుణులు అంచనా వేయవచ్చును. తొలి వితంతు వివాహానికి నాటి విద్యార్థిలోకం అండగా నిలిచింది. రక్షకభటశాఖ పూర్తి సహకారం అందించింది అన్నిటికీ మించి అర్ధాంగి పూర్తి సహకారం తోడైంది. కందుకూరి స్వీయచరిత్రలో వితంతు వివాహం ‘కృష్ణామండలం, తిరువూరు డిప్యూటీ తహసీల్దారు దర్భా బ్రహ్మానందము గారు తమ తాలూకాలోని గ్రామములో పండ్రెండేళ్ల యీడుగల ఒక వితంతువు (గౌరమ్మ) యున్నదని, తగు మనుష్యులను పంపగలిగినయెడల తల్లిని సమ్మతిపరచి యా చిన్నదానిని వారివెంట బంపునట్లు ప్రయత్నము చేసెదననియు, నాకొక లేఖను వ్రాసిరి. ఈ విషయమయి కొంత యుత్తరప్రత్యుత్తరములు జరిగిన తరువాత నా మిత్రుడు తిరువూరు నుండి 1881వ సంవత్సరం నవంబరు నెల అయిదవ తేదీన నాకిట్లు వ్రాసెను. ‘ఇక్కడకు మీ మనుష్యులను పంపుతోడనే తన కొమరితను మీ వద్దకు బంపెదనని యామె వాగ్దానము చేసినది. ఈ చిన్నదానిని వెంట బెట్టుకుని పోవుటకు నమ్మదగినవారును, ఋజువర్తనులను, దృఢచిత్తులునయిన మనుష్యులనుబంపుడు. వివాహము నిజముగా జరుగువరకు వారెందు నిమిత్తము వచ్చిరో యాపని యక్కడ నెవ్వరికి తెలియకుండవలెను. ఈ పని నిమిత్తము యిద్దరికంటె నెక్కువ మనుష్యులను పంపవలదని సీతమ్మ (బాలవితంతువుతల్లి) మిమ్ములను కోరుచున్నది. విశాఖపట్టణములో రక్షకశాఖయందిరువది రెండు సంవత్సరముల ప్రాయముగల యొక చిన్నవాని భార్య యాకస్మికముగా మరణమునొందుట తటస్తించినది. అతడు చిరకాలము నా శిక్షణలో నుంచి పెరిగినవాడగుటచే వితంతు వివాహములు మొదలయిన కొత్తమార్పులందు ఆసక్తియు నుత్సాహము కలవాడు. వరుడు గోగులపాటి శ్రీరాములుగారని తెలిసిన తోడనే మా పట్టణమున యాతని బంధువులు మొదలయినవారు వచ్చి, వివాహము చేసుకోవలదని హితోపదేశము చేసి, కార్యము గానక మరలిపోవుచు వచ్చిరి. ‘మహాసంక్షోభమున’ 1881వ సంవత్సరము డిసెంబర్ 11వ తేదీ రాత్రి రాజమహేంద్రవరములో మొదటి స్త్రీపు పునర్వివాహము జరిగినది. పలువురు మార్గాంతరము లేక, ప్రాయశ్చిత్తములు చేయించుకొనిరి’ 11న వార్షికోత్సవం కందుకూరి జన్మగృహంలో ఈ చరిత్రాత్మక సంఘటనకు ఆనవాలుగా తొలి వితంతు వివాహానికి గుర్తుగా కొన్నిశిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం కందుకూరి జన్మగృహంలో జరిగే తొలి వితంతు వివాహ వార్షికోత్సవంలో డాక్టర్ అరిపిరాల నారాయణరావు, వై.యస్.నరసింహారావు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ( కందుకూరి జన్మగృహంలో తొలి వితంతు వివాహానికి ఆనవాలుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ) -
చిన్నారి పెళ్లి కూతుళ్లు
ఆదిలాబాద్: నిరక్షరాస్యత.. మూఢనమ్మకాలు.. పేదరికం కారణంగా ముక్కుపచ్చలారని బాలికలకు మూడు ‘ముళ్ల’ బంధం పడుతోంది. బంగారు భవిష్యత్‌ను బందీ చేస్తోంది. వివాహా మనే పసుపుతాడుతో వారి బాల్యం స్వేచ్ఛకు ఉరితాడు బిగుస్తోంది. ఆడపిల్లలు భారమనో.. పేదరికం కారణంగానో.. భారం దించుకోవా లనో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మైదాన, గిరిజన ప్రాంతాల్లో బాలికలకు తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు. బాల్య వివాహా ల కారణంగా ఆరోగ్య, సామాజిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించలేకపోతున్నారు. శుక్రవారం తాంసి మండలంలో బాలిక నిశ్చితార్థాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఏడాది బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. గత ఐదేళ్లలో 134 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ఇది అధికారికంగా మాత్రమే. అనధికారికంగా జరుగుతున్న ప్రతి ఏడాది 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఒక్కో నెలలో మూడు నుంచి నాలుగు బాల్య వివాహాలు అడ్డుకున్న సంఘటనలూ ఉన్నాయి. 2016 ఫిబ్రవరిలో వారం రోజుల వ్యవధిలో నాలుగు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. 2017 జూన్‌లో వారం రోజుల వ్యవధిలో మూడింటిని అడ్డుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంకా ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి. మేనరికం పేరుతో చిన్నారులకు బలవంతుపు పెళ్లిళ్లు చేస్తుండగా, మరికొన్ని ఆర్థికంగా కుటుంబ పోషణ భారమై తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. కొన్ని వివాహాల్లో అబ్బాయిలకు సైతం తక్కువ వయసు ఉన్నవారు ఉంటుండగా.., వృద్ధులకు సైతం బాలికలతో పెళ్లి చేస్తున్నారు. చట్ట ప్రకారం అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు దాటిన తర్వాతనే పెళ్లి చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోనే అధికం.. ఏజెన్సీ ప్రాంతాలైన ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, కుంటాల, సిర్పూర్, కాగాజ్నగర్, ఖానాపూర్, ఉట్నూర్, ముథోల్, నిర్మల్, తదితర గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు గుట్టుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. సమాజంలో ఆడపిల్లలకు ఉన్న అభద్రత భావాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు బాల్య వివాహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కొంత చదువుకోవాలని అనుకుంటున్న బాలికలకు బాల్య వివాహం చేస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి చేయడం ద్వారా కట్నకానుకలు కూడా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం రాదనే ఉద్దేశంతో ఈ పనిచేస్తున్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే తమ బాధ్యత తీరుతుందనే భావనలో ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత వచ్చే సమస్యలపై ఏమాత్రం ఆలోచించడం లేదు. చట్టరీత్యా నేరం.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. బాలికను చేసుకునే అబ్బాయికి, బాల్య వివాహం చేసే తల్లిదండ్రులు, ప్రోత్సహించిన వారిపై, హాజరైన కుల పెద్దలు, మత పెద్దలు, పూజారులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంది. 1929 నాటి బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం 2006లో పటిష్టం చేసింది. 2007 నుంచి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. బాల్య వివాహాలకు సంబంధించి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. బాల్య వివాహాం జరిగిన రెండేళ్ల వరకు కూడా కేసు నమోదు చేసే అధికారం ఉంటుంది. కలెక్టర్, ఎస్పీతోపాటు ఆర్డీవో, ఎంపీడీవో, సీడీపీవో, తహసీల్దార్, వీఆర్వోలు, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ అధికారులు బాల్య వివాహాల నిరోధక అధికారులుగా ఉంటారు. గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా గుర్తిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. హెల్ప్‌లైన్ సెంటర్ ఎత్తివేత..! ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 1098 హెల్ప్‌లైన్ సెంటర్ గత నెల రోజులుగా మూతపడింది. బాల్య వివాహాలు, బాలికల రక్షణ కోసం హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో ఉన్న ఈ కేంద్రంలో ఎన్జీవో పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రావడం లేదని ఉద్యోగం మానేయడంతో హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఎత్తివేశారు. ఈ సెంటర్లో ఏడుగురు సిబ్బంది పనిచేస్తుండేవారు. కోఆర్డినేటర్, ఇద్దరు కౌన్సెలర్లు, నలుగురు ఫీల్డ్ వర్కర్స్ ఉంటారు. ఈ నెంబర్‌కు వచ్చిన ఫోన్ సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడంతోపాటు వీరు ప్రత్యేకంగా వచ్చిన ఫోన్ కాల్ సమాచారంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. 1098 నంబర్‌కు ఫోన్ చేస్తే నేరుగా చెన్నయ్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి జిల్లాలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కు కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతం సెంటర్ లేకపోవడంతో ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. సెంటర్‌కు ప్రత్యేక సిబ్బంది ఉంటే సదరు కేసుపై పూర్తి సమాచారం ఉంటుంది. కానీ ఐసీపీఎస్ అధికారులకు సమాచారం అందించడం వల్ల కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. త్వరలో దీన్ని ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించినట్లు సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. డయల్ 100, 181 నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంటున్నారు. బాలిక నిశ్చితార్థం అడ్డగింత తలమడుగు(బోథ్): తాంసి మండలం పొన్నారి గ్రామంలో శుక్రవారం బాలిక నిశ్చితార్థాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో ఎనిమిది నెలలుగా ఉంటున్న ఓ యువకుడితో జైనథ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన పదో తరగతి బాలికకు పెళ్లి సంబంధం కుదిరింది. శుక్రవారం పొన్నారి గ్రామంలో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ నసీమున్నీసా గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మైనర్‌కు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేస్తామని బాలిక తల్లిదండ్రులు హామీనిచ్చారు. గ్రామపెద్దలు, ఎంపీటీసీ లక్ష్మి, రమణ, అంగన్వాడీ కార్యకర్తలు దేవమ్మ, గంగమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది జరిగిన కొన్ని ఘటనలు జూన్ 17న నెన్నెల మండలం గుండ్లసోమారంలో రెవెన్యూ, ఐసీపీఎస్ అధికారులు 17 ఏళ్ల బాలికకు వివాహం చేస్తుండగా అడ్డుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి, బాలిక తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రం తీసుకున్నారు. జూన్ 18న నస్పూర్ మండలం శ్రీరాంపూర్‌లోని ప్రగతి మైదానంలో బాల్య వివాహాన్ని శిశు సంక్షేమ శాఖ అధికారులు అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. జూన్ 23న హజీపూర్ మండలం సబ్బెపల్లిలో ఓ బాలికకు వివాహం చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఐసీపీఎస్, ఐసీడీఎస్, పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను పాఠశాలలో చేర్పించారు. -
తాళి..ఆలి..బాల్యం బలి
ఒంగోలు టౌన్: బాల్యానికి మూడుముళ్లు పడుతున్నాయి. అభం శుభం తెలియని వయసులోనే ఆడపిల్లల మెడకు అర్ధాంగి అనే తాడును తగిలిస్తున్నారు. ఆడుతూపాడుతూ.. చదువుకుంటూ గడపాల్సిన వయసులో బలవంతంగా అత్తారింటికి పంపిస్తున్నారు. ఒకటీరెండేళ్లు తిరిగేసరికి చంటిబిడ్డను చంకనేసుకుని ఆడపిల్లలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం. తన గురించే సరైన అవగాహన లేని వయసులో ఒక బిడ్డకు జన్మనిచ్చి, కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని కుమిలిపోతున్నారు. బాల్య వివాహాలను ఆపేందుకు అనేక చట్టాలను రూపొందించినప్పటికీ సక్రమంగా అమలుకాకపోవడంతో చిన్నారి పెళ్లికూతుర్ల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2012 నుండి 2017 వరకు జిల్లాలో అధికారికంగా 881 బాల్య వివాహాలను నిలిపివేశారు. అధికారికంగా ఏటా వందల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నప్పటికీ.. అనధికారికంగా ఇంకెన్ని జరుగుతున్నాయనేది ప్రభుత్వ యంత్రాంగానికి అంతుచిక్కడంలేదు. బాల్య వివాహానికి బలమైన కారణాలు ♦ కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను పటిష్టపరుచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానా వ్యక్తికి భార్య పుట్టిందని ఇరువర్గాలవారు నిర్ణయించుకుని పిల్లలు కొంచెం పెద్ద కాగానే వివాహం చేసేస్తున్నారు. ♦ మేనరికం సంబంధం ఉన్నవారిలో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. తమ కూతుర్ని ఎలాంటి ఇంటికి పంపాల్సి వస్తుందోనన్న ఆందోళనలో.. మేనరికం కోసం ఆడపిల్ల పెద్దమనిషి కాగానే పెళ్లి చేసేస్తున్నారు. ♦ తాము చనిపోయేలోగా తమ వారసుల పెళ్లిళ్లు చూడాలన్న వృద్ధుల కోరిక తీర్చడానికి కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేస్తున్నారు. ♦ ప్రస్తుత ఆధునిక ప్రభావం కూడా బాల్య వివాహాలు చేసేందుకు పురిగొల్పుతోంది. పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తరువాత ఎక్కడ దారితప్పుతారోనన్న ఆందోళనతో కొంతమంది తల్లిదండ్రులు మైనార్టీ తీరకముందే బలవంతంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ♦ వివాహానికి అయ్యే ఖర్చు పెరిగిపోతోంది. పెద్ద కుమార్తెకు వివాహం చేసే సమయంలో చిన్న కుమార్తె మైనార్టీ తీరకపోయినా బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ♦ అధిక సంతానం, పేదరికం కూడా బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. ఒక ఇంటిలో ముగ్గురికి మించి కుమార్తెలు ఉంటే వారిని త్వరగా అత్తారింటికి పంపించాలన్న ఉద్దేశంతో బాల్య వివాహాలు చేస్తున్నారు. ♦ బాలిక విద్యార్హత, వయసు కూడా పరోక్షంగా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయి. బాలిక వయసు విద్యార్హతతోపాటు కట్నం కూడా పెరుగుతోంది. దీంతో హైస్కూల్, ఇంటర్ స్థాయిలోనే వివాహాలు జరిపించేస్తున్నారు. నేరము–శిక్ష బాల్య వివాహాల నిరోధానికి ప్రత్యేక చట్టం తీసుకువచ్చారు. బాల్య వివాహాల నిషేధ చట్టం–2006 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేస్తే వారి తల్లిదండ్రులతోపాటు ఆ బాల్య వివాహానికి సహకరించిన వారికి జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. బాల్య వివాహాలు జరగకుండా ఉత్తర్వులు జారీచేసే అధికారం న్యాయస్థానాలకు ఉంది. అవసరమైతే అలా జరిగిన వివాహాన్ని చెల్లదని కూడా చెప్పే అధికారం ఉంది. సెక్షన్లు ఏం చెబుతున్నాయంటే.. ♦ బాల్య వివాహ నిరోధానికి రాజ్యాంగంలో ప్రత్యేక సెక్షన్లు రూపొందించారు. ♦ ఐపీసీ సెక్షన్ 9 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు పెళ్లి చేస్తే వారి కుటుంబీలకు రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ♦ ఐపీసీ సెక్షన్ 10 ప్రకారం బాల్య వివాహాలు నిర్వహించినవారికి, సహకరించినవారికి, ప్రోత్సహించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ♦ ఐపీసీ సెక్షన్ 12 ప్రకారం బాల్య వివాహానికి ఎవరైనా హాజరైతే వారికి కూడా దాదాపు రెండేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. ఎవరికి ఫిర్యాదు చేయాలి బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే గ్రామ స్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలకు ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా పోలీసులకు(100), చైల్డ్‌లైన్(1098) టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్లు చేసి సమాచారం అందించవచ్చు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా కార్యకర్తలకు కూడా సమాచారాన్ని చేరవేయవచ్చు. బాల్య వివాహాల గురించి సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఎదురు తిరిగిన ఘటనలు అరుదు తల్లిదండ్రులు తమకు ఇష్టం లేకుండా చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేస్తుంటే ఎదురు తిరిగి వివాహ సంకెళ్లను అడ్డుకున్న ఘటనలు జిల్లాలో అరుదుగానే ఉన్నాయి. కొమరోలులో చదువుకుంటున్న ఒక బాలిక తన తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నించగా, తన స్నేహితులతో చెప్పుకుని ఎదురు తిరిగిన ఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. అయితే అలాంటి బాలికలు అరుదుగానే ఉంటున్నారు. ఎక్కువ మంది బాలికలు తల్లిదండ్రుల మాటకు లోబడి తలొంచి తాళి కట్టించుకుంటూనే ఉన్నారు. ఆదర్శంగా నిలిచిన సింగరాయకొండ పంచాయతీ బాల్య వివాహాల నిరోధానికి సింగరాయకొండ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం సంచలనానికి దారితీసింది. తమ గ్రామ పంచాయతీలో బాల్య వివాహం చేయకూడదంటూ పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీ జరిగిన పంచాయతీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. ఇదే మాదిరిగా మిగిలిన పంచాయతీలు కూడా తీర్మానాలు చేస్తే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. -
వివాహ బంధనం
పేరు అంజనమ్మ(19). రాయచోటిì ప్రాంతం. ఆమెకు ఐదేళ్ల క్రితంవివాహమైంది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులదికర్ణాటకలోని బళ్లారి. భర్త పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడు. ఆమెకు సరైనఆహారం అందక కాన్పు కూడా కష్టమైంది.అతికష్టం మీద బతికి బయట పడింది.చిన్న వయసులో వివాహం చేయడంతోపాపను ఎలా చూసుకోవాలో తెలిసేది కాదు. దగ్గరలోని అంగన్వాడీ కేంద్రానికివెళ్లడం వల్ల ఇప్పుడిప్పుడే విషయాలు తెలుసుకుంటోంది.నా బిడ్డను బాగా చదివించి వివాహ వయసు వచ్చిన తర్వాతేవివాహం చేస్తానని చెబుతోంది. వివాహం.. జీవితాంతం మిగిలే తీపి గుర్తు.. పెళ్లితో వ్యక్తిగత సంబంధం బాధ్యతల బంధం.. .అనుబంధాల హరివిల్లుగా పెనవేసుకుంటాయి.. ఇది మరిచిపోలేని అనుభవం. ఇది నాణేనికి ఒకవైపు చిత్రం. మరో వైపు పరికిస్తే.. బాల్య వివాహం జీవితానికో శాపం. అనారోగ్యానికి హేతువు. వ్యక్తిగత స్వాతంత్య్రానికి విఘాతం. చదువుకునే వయసులో సంసార బాధ్యతల చట్రంలో పిల్లలు చిక్కుకుంటారు. కాలంతోపాటు ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా బాల్య వివాహాల జాడ్యం సమాజాన్ని వదల్లేదు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, సంప్రదాయం, మూఢ నమ్మకాలే ఇందుకు పునాదులవుతున్నాయి. జిల్లాలో రాయచోటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. పురుషునికి 21 ఏళ్లు, స్త్రీకి 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయరాదని చట్టం చెబుతోంది. కానీ పాఠశాల వయస్సులోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఇది మారుమూల గ్రామాల్లో అధికంగా చోటుచేసుకుంటోంది. బాల్య వివాహాల విషయంలో ప్రచార లోపమే బాలికలకు శాపంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత.. పూర్తిగా అవగాహన లేకపోవడం, చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడమే బాల్య వివాహాలు జరగడానికి ప్రధాన కారణం. సర్వోన్నత న్యాయస్థానం బాల్య వివాహాల విషయంలో చాలా కఠినంగా తీర్పులు ఇచ్చినా యంత్రాంగంలో కదలిక లేకపోవడం శోచనీయం. బాల్య వివాహాలపై సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషియల్ స్ట్రాటజీ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. సంస్థ నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇవే అనర్థాలు బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. చిన్నతనంలో గర్భం దాల్చడం వల్ల ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రాణహాని ఎక్కువగా ఉంటుందని, బిడ్డ వైకల్యంతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురై తీవ్ర ఇబ్బందులు పడతారని అంటున్నారు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకోవాల్సి రావడంతో ఎక్కువ శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతారన్నారు. మెదడు, ఇతర శరీర అవయవాలు సరిగా పరివర్తన చెందకముందే వివాహం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ చక్కగా చదువుకోవాల్సిన సమయంలో వివాహం జరగడం వల్ల దూషణ, హింస, అవమానాలకు గురి కావాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. బాల్య వివాహాలకు కారణాలు తల్లిదండ్రులు బాలికకు ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత త్వరగా తమ బాధ్యత తీరిపోతుందని భావిస్తారు. చిన్నప్పుడే వివాహం చేస్తే తమకు నచ్చిన వాడికి ఇవ్వవచ్చని, తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందన్న భావన తల్లిదండ్రుల్లో నెలకొంది. పెద్దయ్యాక వివాహం చేస్తే వ్యక్తిగత అభిప్రాయాలు, అధిక కట్నాలు ఇవ్వాల్సి వస్తుందన్న భయం ఉంది. వయస్సుకు వచ్చిన యువతి ఇంటిలో ఉంటే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా యువతి భవిష్యత్తుకు వివాహం ఒక ప్రధాన మార్గమన్నది తల్లిదండ్రుల నమ్మకం. ఇంటిలో పెద్దలు, వృద్ధులు మనవరాళ్ల వివాహాలను కళ్లారా చూడాలని తొందర పెట్టడం, మేనరిక సమస్యలు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, బాల్య వివాహ నిషేధ చట్టం అమలు కాకపోవడం, కుటుంబాల్లో సరైన నిబద్ధత కనిపించకపోవడం తదితర కారణాలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. చట్టం ఏం చెబుతుందంటే... ♦ 2006లో బాల్య వివాహాల నిషేధ చట్టంలోని జీఓ నెంబర్. 13 ప్రకారం 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహాలు చేస్తే కఠినంగా శిక్షించవచ్చు. ♦ వివాహం చేసే పురోహితుడు, పాస్టర్, ఖాజీను వెంటనే అరెస్టు చేసే అధికారం ఈ చట్టం ద్వారా వచ్చింది. వీరికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమాన విధించవచ్చు. ♦ బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిని కూడా కఠినంగా శిక్షించవచ్చని చట్టం చెబుతోంది. ♦ 1923 బాల్య వివాహాల చట్టం కన్నా 2006లో చేసిన చట్టం కూడా కఠినమైంది. బాల్య వివాహాల నిర్మూలన విషయంలో యంత్రాంగానికి సర్వహక్కులు కల్పించారు. కానీ అధికారుల అలసత్వంతో చిన్నారుల నిండు జీవితం నాశనమై పోతోంది. ఐసీడీఎస్దే కీలకపాత్ర బాల్య వివాహాలను అడ్డుకోవడంలో స్త్రీ శిశు సంక్షేమశాఖదే కీలకపాత్ర. అంగన్వాడీ కార్యకర్తలు బాల్య వివాహాలను గుర్తిస్తే ఉన్నతాధికారులతోపాటు పోలీసులకూ సమాచారం ఇవ్వాలి. బాల్య వివాహంపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసే అధికారం అంగన్వాడీ కార్యకర్తలకు ఉంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఉంది. బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం ఉంటే నేరుగా ఛైల్డ్‌లైన్ 1098 నంబరుకు లేదా పోలీసు డయల్ యువర్ 100కు ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. నాకు 13 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు కానీ, నా భర్తకు కానీ బతకడానికి ఏ ఆధారం లేదు. దీనికి తోడు వివాహం అయిన ఏడాదిలోనే గర్భం దాల్చాను. ప్రసవ సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాను. అధికంగా రక్తస్రావం అయింది. తల్లీబిడ్డ ఇద్దరికీ కష్టమేనని చెప్పడంతో భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా దిగులు చెందారు. ఎలాగోలా దేవుడి దయతో బతికి బయటపడ్డాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 4 ఏళ్లుగా ఏదో రకంగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాను. – రాయచోటి శివారు కాలనీకి చెందిన వివాహిత మా తల్లిదండ్రులు కేరళలో కూలిపనులకు వెళ్లాలన్న కారణంతో నాకు 14 ఏళ్లకే పెళ్లి చేశారు. పెళ్లి అయిన ఏడాదికే గర్భం దాల్చాను. ప్రసవ సమయంలో భర్త , అత్తమామలు ఐసీయూలో వైద్యం ఇప్పించి తల్లీబిడ్డలను కాపాడుకున్నారు. చదువుకోకపోవడం వల్లనే మా అమ్మానాన్నలు చెప్పిన విధంగా , వారు చేసినప్పుడే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం నెలలో సగం రోజులు అనారోగ్యంతో బాధపడుతూ, మరో సగం రోజులు భర్తతో కలిసి పనులు చేస్తూ పాపను పోషించుకుంటున్నాను. –సుండుపల్లె మండలానికి చెందిన వివాహిత మా కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో నన్ను 15 ఏళ్లకే లారీ డ్రైవర్‌కు ఇచ్చి వివాహం చేశారు. మా ఇద్దరి వయస్సులో కూడా చాలా (8సంవత్సరాలు) తేడా ఉండేది. అయితే వివాహం అయిన 3 సంవత్సరాలకే రోడ్డుప్రమాదంలో నా భర్త చనిపోయారు. అప్పటి నుంచి నా జీవితం అంధకారంలో ఉండిపోయింది . అత్తమామల ఇల్లు వదిలి, అమ్మానాన్నల దగ్గరే ఉంటున్నాను. చదువుకోవాలన్న ఆలోచన రావడంతో దూరవిద్య కేంద్రం ద్వారా డిగ్రీ చదువుకుంటున్నాను. గతంలోనే నన్ను మా వాళ్లు బాగా చదివించి ఉంటే కుటుంబానికి అండగా ఉండేదాన్ని. వివాహ వయస్సు వచ్చిన తరువాత పెళ్లి చేసుకునేదాన్ని.–చిన్నమండెం మండలానికి చెందిన వివాహిత బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు – వసంతాభాయ్, సీడీపీఓ , రాయచోటి బాల్య వివాహాలను ప్రోత్సహించే కుటుంబ సభ్యులు, పెద్దలపై కఠిన చర్యలు తీసుకుంటాం. అడపిల్లలను బాగా చదివించాలి. వివాహ వయస్సు 18సంవత్సరాలు దాటిన తరువాతనే వారికి పెళ్లి చేయాలి. ఈ విషయంపైన అంగన్వాడీ కేంద్రాల్లో, అవగాహన సదస్సుల్లో తెలియజేస్తున్నాము. బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికలు శారీరకంగా అనేక ఇబ్బందులకు గురవుతారు. బాల్య వివాహాల విషయాన్ని 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పండి, చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము. -
మైనర్ భార్యతో లైంగిక చర్య అత్యాచారమే!