సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాల్య వివాహాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. బాల్య వివాహాలు జరిపినా, జరిపేందుకు ప్రయత్నించినా ఆ కుటుంబాలకు ప్రభు త్వ పథకాలు వర్తించవనే విషయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ జవహర్‌రెడ్డి.. బాల్య వివాహాల నియంత్రణకు ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ రూల్స్–2012, 2023ను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
మహిళా, శిశు సంక్షేమం, సెర్ప్, విద్య, వైద్య, ఆరోగ్య, దేవదాయ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వివిధ స్థాయిల్లో చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ అధికారులను ని యమించి వారికి తగిన అధికారాలిస్తామని చెప్పారు. వారు నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ బాల్య వివాహాలను నియంత్రించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో విఫలమైతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో సర్పంచ్ లేదా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి.. వార్డు సెక్రటరీ, విలేజ్, వార్డు రెవెన్యూ అధికారి, ఏఎన్‌ఎం, మహిళా పోలీస్, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు లేదా ప్రధానోపాధ్యాయుడు, స్థానిక ఎన్జీఓలను సభ్యులుగా నియమించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు తరచూ సమావేశమై బాల్య వివాహాల నియంత్రణ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని ఆదేశించారు. బాల్య వివాహాలు చేయకుండా ఖాజీలు, పాస్ట ర్లు, పురోహితులకు ఆదేశాలివ్వాలని సూచించారు. వివాహ రిజిస్ట్రేషన్ గడువును 60 రోజుల నుంచి ఆరు నెలలకు పెంచేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు జి.జయలక్ష్మి, ప్రవీణ్ ప్రకాశ్, ఇంతియాజ్, పాల్ రాజు, జానకి, సురేశ్‌కుమార్, ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment